పాకిస్థాన్‌లోని ప్రధాన నగరం కరాచీ ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. కరాచీ యూనివర్సిటీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతో సహా నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. యూనివర్శిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్‌కు సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనంపై పాకిస్థాన్ వేర్పాటువాద గ్రూపుకు చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ దాడి చేసినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ఈ మిషన్‌ను తొలిసారిగా మహిళా మిలిటెంట్ నిర్వహించారని అధికారులు తెలిపారు.
చదవండి: ఛీ ఛీ! 30 ఏళ్లుగా టాయిలెట్‌లో సమోసా, వాష్‌రూమ్‌లో భోజనాల తయారీ
కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా స్థానికులకు చైనా భాషను నేర్పుతుంటారు. దీంతో చైనీయులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. బుర్ఖా ధరించి ఇన్‌స్టిట్యూట్ గేట్ వద్ద నిల్చున్న ఓ మహిళ.. వ్యాన్ దగ్గరకు రాగానే తనను తాను బాంబుతో ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడికి బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. మహిళా ఆత్మాహుతి బాంబర్ షరీ బలోచ్ అలియాస్ బ్రాంష్ ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఆత్మాహుతి దాడికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు పేలుడు ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.
BREAKING 🇵🇰 Pakistan🇵🇰 :
— Zaid Ahmd (@realzaidzayn) April 26, 2022
Warning Graphic Content ‼️
♦️Video footage shows the moment of suicide attack on Chinese national’s vehicle in Karachi university
♦️Footage shows the suicide bomber blew herself when the Van arrived #Karachi #Sindh #China #University #Blast #Explosion pic.twitter.com/7qLSDCS0vh
Comments
Please login to add a commentAdd a comment