bomber
-
మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం
కొచ్చిన్: ఈనెల 24, 25వ తేదీల్లో కేరళలో పర్యటించనున్న ప్రధాని మోదీని సూసైడ్ బాంబర్‌తో చంపేస్తామన్న బెదిరింపులపై పోలీసులు, కేంద్ర నిఘా విభాగాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందుకు సంబంధించిన లేఖ ఒకటి గత వారం రాష్ట్ర బీజేపీ విభాగానికి అందింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ కె.సురేంద్రన్ దానిని పోలీసులకు అందజేశారు. ప్రధాని పర్యటన, బందోబస్తులో ఉండే అధికారుల వివరాలతో అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) తయారు చేసిన నివేదిక శనివారం వైరల్ అవుతోంది. అందులోనే బెదిరింపు లేఖ అంశం ఉంది. మలయాళంలో ఉన్న ఆ లేఖను కొచ్చిన్‌కు చెందిన ఎన్జే జానీ రాసినట్లుగా ఉంది. లేఖలో వాస్తవికత, దాని వెనుక ఉన్న వ్యక్తిపై విచారణ జరుపుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. ఈ పరిణామంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ స్పందించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన ముఖ్య విషయాలను లీక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సీరియస్ వ్యవహారమని, సీఎం విజయన్ స్పందించాలని కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. అనుమానితుడిగా పేర్కొంటున్న ఎన్జే జానీ శనివారం మీడియాతో మాట్లాడారు. సదరు బెదిరింపు లేఖతో తనకు సంబంధం లేదన్నారు. పోలీసులడిగిన అన్ని వివరాలను అందించానన్నారు. చర్చి వ్యవహారానికి సంబంధించి తనతో శత్రుత్వం ఉన్న వారే దీని వెనుక ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
చైనీయులే లక్ష్యంగా మహిళ ఆత్మాహుతి దాడి.. బస్సు దగ్గరకు రాగానే..
పాకిస్థాన్‌లోని ప్రధాన నగరం కరాచీ ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. కరాచీ యూనివర్సిటీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతో సహా నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. యూనివర్శిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్కు సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనంపై పాకిస్థాన్ వేర్పాటువాద గ్రూపుకు చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ దాడి చేసినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ఈ మిషన్‌ను తొలిసారిగా మహిళా మిలిటెంట్ నిర్వహించారని అధికారులు తెలిపారు. చదవండి: ఛీ ఛీ! 30 ఏళ్లుగా టాయిలెట్లో సమోసా, వాష్‌రూమ్‌లో భోజనాల తయారీ కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ ద్వారా స్థానికులకు చైనా భాషను నేర్పుతుంటారు. దీంతో చైనీయులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. బుర్ఖా ధరించి ఇన్స్టిట్యూట్ గేట్ వద్ద నిల్చున్న ఓ మహిళ.. వ్యాన్ దగ్గరకు రాగానే తనను తాను బాంబుతో ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడికి బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. మహిళా ఆత్మాహుతి బాంబర్ షరీ బలోచ్ అలియాస్ బ్రాంష్ ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఆత్మాహుతి దాడికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు పేలుడు ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. BREAKING 🇵🇰 Pakistan🇵🇰 : Warning Graphic Content ‼️ ♦️Video footage shows the moment of suicide attack on Chinese national’s vehicle in Karachi university ♦️Footage shows the suicide bomber blew herself when the Van arrived #Karachi #Sindh #China #University #Blast #Explosion pic.twitter.com/7qLSDCS0vh — Zaid Ahmd (@realzaidzayn) April 26, 2022 -
ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది ఆదిల్ అలియాస్ వకాస్‌కు సంబంధించిన చివరి వీడియోను జైషే మొహమ్మద్ సంస్థ విడుదల చేసింది. వెనుక జైషే జెండాతో పాటు చేతిలో తుపాకీ పట్టుకున్న ఆదిల్ ఆ వీడియోలో మాట్లాడుతూ..‘ఈ వీడియోను మీరు చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను. నేను ఏడాది కాలం పాటు జైషే మొహమ్మద్‌లో పనిచేశాను. కశ్మీర్ ప్రజలకు నేను ఇచ్చే చివరి సందేశం ఇదే. దక్షిణ కశ్మీర్ చాలాకాలంగా భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఉత్తర, సెంట్రల్ కశ్మీర్‌తో పాటు జమ్మూ ప్రజలు ఈ పోరాటంలో చేరాల్సిన సమయం ఆసన్నమైంది. మా కమాండర్లలో కొందరిని చంపేయడం ద్వారా మమ్మల్ని ఎన్నటికీ బలహీనపర్చలేరు’అని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా 2001లో ఐసీఏ18 విమానం హైజాక్, నగ్రోటా, ఉడీ, పఠాన్‌కోట్ ఉగ్రదాడుల్ని ప్రస్తుతించాడు. పుల్వామాలోని కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ పాఠశాల స్థాయిలోనే చదువు మానేశాడు. అనంతరం కొద్దికాలం తాపీమేస్త్రీగా, మరికొంత కాలం మసీదులో పనిచేశాడు. 2016, మార్చి 19న ఇద్దరు యువకులతో కలిసి ఆదిల్ అదృశ్యమయ్యాడు. -
ఆప్ఘనిస్ధాన్‌లో విరుచుకుపడిన తాలిబన్లు
-
‘నేను చేసేది పాపం కాదు.. క్షమాపణ చెప్పను’
ఆస్టిన్ : ‘నేను చేసేది పాపం కాదు.. నేను క్షమాపణలు చెప్పాలి.. కానీ అలా ఎప్పటికీ చెప్పను’అంటూ టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి చెప్పాడు. అతడు దాడికి పాల్పడటానికి ముందే తాను ఎందుకు దాడి చేస్తున్నానో అనే విషయాన్ని అతడి ఫోన్లో 25 నిమిషాలపాటు రికార్డింగ్ చేసి ముందే పెట్టుకున్నాడు. దీంతో అతడు ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతోనే దాడి చేసినట్లు స్పష్టమైంది. మూడు వారాల కిందట ఆస్టిన్‌లో మార్క్ కాండిట్ అనే వ్యక్తి బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా పలువురు గాయపడ్డారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే సమయంలోనే తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో పోలీసులకు అతడి ఫోన్ దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఓ 25 నిమిషాల నిడివితో వీడియో లభించింది. ఆ వీడియోలో ఉన్న ప్రకారం తాను చేసేది తప్పుకాదని అతడు చెప్పాడు. తన చర్యను ఓ సైకోపాథ్గా వర్ణించుకుంటూ క్షమాపణలు చెప్పాల్సి ఉన్నా తాను ఎప్పటికీ చెప్పబోనని తెలిపాడు. బాల్యం నుంచే తన జీవితం చిందరవందరగా ఉందని, ఒక వేళ తనను బందించాలని వస్తే అప్పటికప్పుడే తనను పేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందులో రికార్డు చేసి పెట్టి ఉంచాడు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాము అంతకంటే ఎక్కువ వివరాలు అందించలేమని పోలీసులు తెలిపారు. కాగా, మార్క్ రూమ్మేట్స్ను కొన్నిగంటలపాటు విచారించిన పోలీసులు అనంతరం విడుదల చేశారు. -
మ్యూజియంగా మారనున్న యుద్ధవిమానం
విశాఖపట్టణం: భారత నావికా దళంలో దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించిన యుద్ధవిమానం మ్యూజియంగా రూపుదాల్చనుంది. ఇండియన్ నేవీకి చెందిన లాంగ్ రేంజ్ మారిటైం పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ టీయూ-142 ఎం ను మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. తమిళనాడు నుంచి ఈ యుద్ధవిమానం శనివారం విశాఖపట్టణం చేరుకుంది. సోవియట్ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ ఎయిర్‌క్రాప్ట్ 1988లో నావికా దళంలో చేరింది. 29 ఏళ్ల అనంతరం మార్చి 29వ తేదీన ఈ విమానానికి సేవల నుంచి విరామం ప్రకటించారు. తమిళనాడులోని నేవల్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరి శనివారం ఉదయం స్థానిక ఐఎన్ఎస్ డేగ నౌకపై దిగిన యాంటి సబ్మెరీన్ యుద్ధవిమానానికి ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, నావికా దళ అధికారులు పాల్గొన్నారు. తమ విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ, యుద్ధ విమానాన్ని అందజేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిని మ్యూజియంగా మార్చుతామని చెప్పారు. ఇందుకు అవసరమైన చర్యలను తక్షణమే చేపడతామని సీఎం తెలిపారు. -
ఆ బాంబర్లు.. ఎయిర్‌పోర్టులో క్లీనర్లు!!
బ్రసెల్స్ బాంబర్ సోదరులు విమానాశ్రయంలో క్లీనర్లుగా పనిచేశారా? ఇబ్రహిం, ఖలీద్ ఎల్ బాక్రాయిలకు టెర్మినల్ నిర్మాణంపై పూర్తి అవగాహన ఉందా? వీరిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నారా? ఇలా ఉత్పన్నమౌతున్న ఎన్నో అనుమానాలు ఒక్కొక్కటే నిజమౌతున్నాయి. విమానాశ్రయాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఆ జిహాదీ సోదరులు టెర్మినల్‌లో క్లీనర్లుగా పనికి చేరినట్లు స్వయంగా వారి మేనమామ తెలపడం ఆ అనుమానాలను నిజం నిజం చేస్తోంది. ఇబ్రహీం, ఖలీద్ ఎల్ బక్రాయి బ్రసెల్స్ ఉగ్రదాడులకు ముందే వ్యూహం పన్నినట్లు తాజాగా తెలుస్తోంది. విమానాశ్రయాన్ని నాశనం చేయాలన్న లక్ష్యంతోనే వారిద్దరూ అక్కడ క్లీనర్స్ గా చేరి, సెక్యూరిటీ చెక్ ల నుంచి కూడా ఎలా తప్పించుకోవాలో క్షుణ్ణంగా పరిశీలించారని తెలుస్తోంది. ఆ సోదరులిద్దరూ కనీసం పాఠశాల చదువు కూడా పూర్తి చేయలేదని, ఎయిర్ పోర్ట్, రెస్టారెంట్లో వాళ్ళిద్దరూ క్లీనర్స్ గా చేరారని, వేసవికాలంలో ఎయిర్ పోర్టు శుభ్రం చేసే పనిలో ఉన్నారని వారి మేనమామ తెలిపారు. ఈ సోదరులిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోందని విమానాశ్రయాన్ని పరిశీలించిన బెల్జియన్ ప్రాసిక్యూటర్ ఒకరు తెలిపారు. ఇబ్రహీం గతంలో రెండుసార్లు బహిష్కరణకు గురైనట్లు వెల్లడించినా, అతడు ఐసిస్ మోజులో ఉన్నాడని తెలిపినా తమ హెచ్చరికలను బెల్జియం విస్మరించిందని టర్కిష్ అధికారులు కూడా అంటున్నారు. గత జూలైలో ఓ టర్కిష్ పోలీసును ఇబ్రహీం కాల్చి చంపేశాడని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బెల్జియం హోం, న్యాయశాఖ మంత్రులు రాజీనామా చేశారు. అయితే ప్రధానమంత్రి వారిని వారించారు. విపత్కర పరిస్థితుల్లో రాజీనామా సరైన నిర్ణయం కాదంటూ వారిని అంగీకరించలేదు. 29 ఏళ్ళ ఇబ్రహీం, బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ ఇద్దరూ జావెంటెమ్ ఎయిర్ పోర్టులో సూట్ కేస్ బాంబు పేల్చి బీభత్సం సృష్టించారు. బాంబు పేలే సమయానికి వారు చేతులకు గ్లౌజెస్ పెట్టుకుని తమ ట్రాలీలను తీసుకెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తోందని, వారి పక్కనే టోపీ పెట్టుకుని ఓ తెల్లజాతి వ్యక్తి సీసీటీవీలో కనిపించాడని, అతడికి చెందిన బాంబు పేలకపోవడంతో అక్కడినుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అమెరికా అధికారులు కూడా అతడు అమెరికా వాచ్ లిస్టులో ఉన్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో ఉగ్రదాడి జరిగిన కొద్ది సేపటికే మీల్ బీక్ స్టేషన్లో బాంబు దాడికి పాల్పడిన ఖలీద్ అక్కడినుంచి కూడా తప్పించుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ జిహాదీ సోదరులిద్దరూ పాఠశాల స్థాయి వరకూ బాగానే చదివినా.. ఆ తర్వాత వారిద్దరికీ నేర చరిత్ర తీవ్రంగానే ఉంది. ఇద్దరూ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించారు. అదే నేపథ్యంలో వారు ఎయిర్ పోర్ట్ ను లక్ష్యంగా చేసుకుని ముందుస్తు అంచనాతోనే అక్కడ క్లీనర్స్ గా పనికి చేరి ఉండొచ్చని వారి మేనమామ చెబుతున్నారు. జైలుశిక్ష అనుభవించిన అనంతరం వారిలో తీవ్ర మార్పు కనిపించిందని, హుందాగా కనిపించడం, వస్త్రధారణలో వచ్చిన మార్పులతో పాటు ఇబ్రహీం ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేస్తుండేవాడని ఇదంతా చూస్తే వారు తిరిగి ఇలాంటి చర్యకు పాల్పడతారని ఊహించలేదని వారి మేనమామ విచారణలో వెల్లడించాడు. కాగా ఎయిర్ పోర్ట్ అధికారులు మాత్రం ఆ సోదరులిద్దరూ విమానాశ్రయంలో క్లీనర్స్ గా పనిచేశారా లేదా అన్నది ఇంకా నిర్థారించలేదు. మరోవైపు బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ సోదరుడు మౌరాద్ లాచ్రౌ మాత్రం తమ అన్న మూడేళ్ళ క్రితం సిరియా పారిపోయినప్పటినుంచీ అతడితో తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, సూసైడ్ బాంబర్స్ తీరు ఎంతో సిగ్గుగా, బాధగా అనిపించిందని తెలిపారు.