
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది ఆదిల్ అలియాస్ వకాస్‌కు సంబంధించిన చివరి వీడియోను జైషే మొహమ్మద్ సంస్థ విడుదల చేసింది. వెనుక జైషే జెండాతో పాటు చేతిలో తుపాకీ పట్టుకున్న ఆదిల్ ఆ వీడియోలో మాట్లాడుతూ..‘ఈ వీడియోను మీరు చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను. నేను ఏడాది కాలం పాటు జైషే మొహమ్మద్‌లో పనిచేశాను. కశ్మీర్ ప్రజలకు నేను ఇచ్చే చివరి సందేశం ఇదే. దక్షిణ కశ్మీర్ చాలాకాలంగా భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఉత్తర, సెంట్రల్ కశ్మీర్‌తో పాటు జమ్మూ ప్రజలు ఈ పోరాటంలో చేరాల్సిన సమయం ఆసన్నమైంది. మా కమాండర్లలో కొందరిని చంపేయడం ద్వారా మమ్మల్ని ఎన్నటికీ బలహీనపర్చలేరు’అని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా 2001లో ఐసీఏ18 విమానం హైజాక్, నగ్రోటా, ఉడీ, పఠాన్‌కోట్ ఉగ్రదాడుల్ని ప్రస్తుతించాడు. పుల్వామాలోని కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ పాఠశాల స్థాయిలోనే చదువు మానేశాడు. అనంతరం కొద్దికాలం తాపీమేస్త్రీగా, మరికొంత కాలం మసీదులో పనిచేశాడు. 2016, మార్చి 19న ఇద్దరు యువకులతో కలిసి ఆదిల్ అదృశ్యమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment