న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు వెళ్లడంపై సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు లీకై ఉండొచ్చని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జవాన్లలో చాలామంది సెలవులు ముగించుకుని విధుల్లో చేరేందుకు వస్తున్నవారేనని వెల్లడించారు. శ్రీనగర్‌కు వెళ్లే సమయంలో సీఆర్పీఎఫ్ బలగాలు ప్రామాణిక విధాన ప్రక్రియ(ఎస్‌వోపీ)ను పాటించాయో? లేదో? విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో భద్రతాబలగాల కదలికలు జరిగినప్పుడు ఆ విషయం చాలామందికి తెలుస్తుందని పేర్కొన్నారు. వాళ్లలో కొందరు ఉగ్రవాదులకు బలగాల రాకపై సమాచారం అందించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ రహదారిపై గత రెండ్రోజులుగా రాకపోకలు లేకపోవడంతో కాన్వాయ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు బయలుదేరారనీ, దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment