information leak
-
వాట్సాప్ స్టేటస్తోనూ సమాచార వ్యాప్తి
ముంబై: వాట్సాప్ యాప్ ద్వారా ఇతరులకు సమాచారం అందించాలనుకునే వారు బాధ్యతాయుత వైఖరి కలిగి ఉండాలని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం పేర్కొంది. వాట్సాప్ ద్వారా మతాల మధ్య విద్వేషాలను పెంచుతున్నారంటూ ఓ వ్యక్తిపై నమోదైన కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది. వాట్సాప్ స్టేటస్‌తో యూజర్లు తమ ఉద్దేశాలను ఇతరులకు తెలియజేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ ఈ నెల 12న ఇచి్చన ˘ ఉత్తర్వుల్లో తెలిపింది. -
సీఆర్పీఎఫ్ రాకపై సమాచారం లీక్
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు వెళ్లడంపై సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు లీకై ఉండొచ్చని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జవాన్లలో చాలామంది సెలవులు ముగించుకుని విధుల్లో చేరేందుకు వస్తున్నవారేనని వెల్లడించారు. శ్రీనగర్‌కు వెళ్లే సమయంలో సీఆర్పీఎఫ్ బలగాలు ప్రామాణిక విధాన ప్రక్రియ(ఎస్వోపీ)ను పాటించాయో? లేదో? విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో భద్రతాబలగాల కదలికలు జరిగినప్పుడు ఆ విషయం చాలామందికి తెలుస్తుందని పేర్కొన్నారు. వాళ్లలో కొందరు ఉగ్రవాదులకు బలగాల రాకపై సమాచారం అందించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ రహదారిపై గత రెండ్రోజులుగా రాకపోకలు లేకపోవడంతో కాన్వాయ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు బయలుదేరారనీ, దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. -
అమ్మాయి వలలో పడి కీలక సమాచారం లీక్
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ఫోర్స్‌కు చెందిన ఓ సీనియర్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కీలక రహస్య సమాచారాన్ని తనతో సన్నిహితంగా ఉండే అమ్మాయితో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారని ఆయనను అరెస్టు చేశారు. సమాచారాన్ని పొందిన ఆ మహిళ ఓ గుఢాచారి అని, సదరు అధికారిని ట్రాప్‌లోకి దింపి మంచితనంగా వ్యవహరించి వలపన్ని ఈ పనిచేసినట్లు తెలిపారు. ఆ అధికారి ఢిల్లీ ఉన్నత కార్యాలయాల్లో ర్యాంక్ స్థాయి అధికారి అని సమాచారం. ఓ క్లాసిఫైడ్ సమాచారాన్ని అతడు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఆ మహిళకు పంపించినట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ సెక్యూరిటీ దర్యాప్తు బృందం ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. సాయుధ బలగాల్లో సోషల్ మీడియాను ఉపయోగించే విషయంలో తాము కఠిన నిబంధనలు పాటిస్తామని, అధికారులు తమ ర్యాంకులను, హోదాలను కూడా వాటి ద్వారా పంచుకునేందుకు వీలుండదని సమాచారం. వారు ధరించిన దుస్తులతో ఫొటోలు దిగి కూడా ఆ అధికారులు సోషల్ మీడియా ద్వారా పంచుకోకూడదని ఓ సీనియర్ అధికారి చెప్పారు. -
వీరప్పన్ ను ఇలా చంపారట!
► హత్యకు ప్రముఖ పారిశ్రామికవేత్త సహకారం ► వీరప్పన్ శిబిరంలోకి మారువేషంలో ఎస్ఐ ► కంటి చికిత్సకని తీసుకొచ్చి కాల్పులు ► ఐపీఎస్ పుస్తకంలోని సమాచారం లీక్! సాక్షి ప్రతినిధి, చెన్నై: మూడు (కన్నడ, తమిళ, కేరళ) రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ అంత ఈజీగా పోలీసులకు ఎలా దొరికాడబ్బా అనే సందేహం 13 ఏళ్లుగా మిస్టరీగానే మిగిలిపోయింది. అతడిని మట్టుపెట్టిననాటి తన అనుభవాలపై మాజీ ఐపీఎస్ అధికారి విజయకుమార్ ఒక పుస్తకాన్ని రాస్తున్నారు. ఈ పుస్తకం త్వరలో మార్కెట్లో విడుదల కావాల్సి ఉండగా అందులోని కొంత సమాచారం బహిర్గతమైంది. అతడిని చంపడంలో చెన్నైకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రముఖ పాత్ర పోషించినట్లు వెల్లడైంది. వీరప్పన్ కోసం విజయకుమార్ సాగించిన వేట, పన్నిన వ్యూహం వివరాలివి. పారిశ్రామికవేత్తతో దోస్తీ: చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తకు వీరప్పన్ తో ఎంతోకాలంగా సన్నిహిత పరిచయముంది. దీంతో ఆ పారిశ్రామిక వేత్తపై పోలీసులు నిఘాపెట్టారు. వీరప్పన్ వర్గంలోని రహస్య గూఢచారి ఒకరు పారిశ్రామికవేత్తను కలుసుకునేందుకు ఒక హోటల్‌కు వచ్చాడు. ఆ గూఢచారి వెళ్లిపోగానే కమెండో దళాలు పారిశ్రామికవేత్తను చుట్టుముట్టాయి. తనకు అదనంగా మారణాయుధాలు అవసరమని, చూపు మందగించినందున కంటి ఆపరేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా వీరప్పన్ కోరినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ సమాచారంతో వీరప్పన్ ను పట్టుకునేందుకు పథకం పన్నారు. చెన్నైలో పేరుమోసిన రౌడీ ఆయోధ్యకుప్పం వీరమణిని ఎన్ కౌంటర్ చేసిన ఎస్ఐ వెల్లదురైని.. వీరప్పన్ వద్దకు మారువేషంలో పంపాలని విజయకుమార్ నిర్ణయించారు. పారిశ్రామికవేత్త ఇచ్చిన సమాచారం మేరకు వీరప్పన్ తన గూఢచారిని పంపాడు. ఆ గూఢచారి ధర్మపురికి చేరుకుని ఒక టీ దుకాణంలో పారిశ్రామికవేత్తను కలిశాడు. తాను ఒక మనిషిని పంపుతానని.. అతనితోపాటుగా వస్తే మదురై లేదా తిరుచ్చిలో వీరప్పన్ కు కంటి ఆపరేషన్ చేయిస్తానని గూఢచారికి చెప్పాడు. దీంతో వీరప్పన్ మనిషి ఒక లాటరీ చీటీని కొని దాన్ని సగం చించి ఒక ముక్కను తన వద్ద ఉంచుకుని రెండో ముక్కను పారిశ్రామికవేత్తకు ఇచ్చాడు. రెండో ముక్కను తెచ్చే వ్యక్తితోనే వీరప్పన్ వస్తారన్నాడు లాటరీ ముక్కను నమ్మి..: విజయకుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ వెల్లదురై ఆ రెండో ముక్కను తీసుకుని అడవుల్లో వీరప్పన్ ను కలుసుకున్నాడు. తనవద్దనున్న తొలిసగంతో సరిపోల్చు కున్నాక ఎస్సైని వీరప్పన్ నమ్మకస్తుడిగా భావించాడు. వెల్లదురై చెప్పినట్లుగానే వైద్యం చేయించుకునేందుకు బయలుదేరాడు. పోలీసులు ముందుగానే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లోకి వీరప్పన్ ను అతని సహచరులను ఎస్ఐ వెల్లదురై ఎక్కించాడు. ధర్మపురి వద్ద సిద్ధంగా ఉన్న కమెండో పోలీసులు వీరప్పన్ పై కాల్పులు జరిపి హత మార్చారు. వీరప్పన్ ను హతమార్చేందుకు సహకరించడంతో సదరు పారిశ్రామికవేత్తపై కేసులు పెట్టలేదు. ఆ వ్యాపారి ఎవరనేది కుమార్ బైటపెట్టలేదు. -
సమాచారం లీక్ కాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుకు సంబం ధించిన సమాచారం ముందే బీజేపీ నేతలకు లీకైందంటూ వస్తున్న విమర్శలు పూర్తిగా అసంబద్ధమైనవి, అర్థం లేనివని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందే సామాన్యుల వైపు నిలుస్తారా? లేదా అవినీతిపరుల వైపు ఉంటారా? అని విపక్షాలను ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు అనేది ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కోసం తీసుకున్న చర్య అని మంగళవారమిక్కడ అన్నారు. -
సమాచారం లీక్‌తో మన పరువు పోతోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన హంద్రీనీవా, గాలేరునగరి సుజల స్రవంతి సాగునీటి పథకాల అంచనాల పెంపును ప్రస్తుత, పూర్వపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తిరస్కరించిన అంశం సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అంచనాల పెంపును ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన ఐవైఆర్ కృష్ణారావు తిరస్కరించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ అంచనాల పెంపును తిరస్కరించటాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపైనే మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇద్దరు ప్రధాన కార్యదర్శులు అంచనాల పెంపును వ్యతిరేకించారన్న అంశం పత్రికలకు ఎలా లీక్ అయిందని ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం లీక్ కావటం వల్ల ప్రభుత్వం పరువు పోయిందని వ్యాఖ్యానించారు. ఇకపై ఏ చిన్న సమాచారం ఏ శాఖ నుంచి లీక్ అయినా అందుకు సంబంధిత మంత్రి, కార్యదర్శి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే కలె క్టర్ల సమావేశంలోగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రులు, అధికారులు, జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రలోభాలు చూపి పార్టీలో చేర్చుకుందాం... తెలంగాణ రాష్ర్టంలో వరుస వలసలతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇతర పార్టీల నుంచి కొంతమందిని ప్రలోభపెట్టి రప్పించుకుంటేనే పరువు నిలబడుతుందని తెలుగుదేశం పార్టీ అభిప్రాయానికి వచ్చింది. జిల్లాల్లో ఏ పార్టీ నుంచి ఎవరు టీడీపీలో చేరినా మంత్రులు, జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవ్వరూ అడ్డు చెప్పవద్దని, ఒకవేళ ఎవరు అడ్డు చెప్పినా పట్టించుకోబోమని టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోమవారం మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు, పార్టీ నేతలతో చంద్రబాబు, లోకేష్ సమావేశం అయ్యారు. సమావేశంలో పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, పార్టీ జాతీయ కార్యాలయ సమన్వయకర్త టీడీ జనార్ధనరావు, కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ వీవీవీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ప్రభుత్వం, పార్టీ పరిస్థితి, పార్టీలోకి ఎవరిని ఆకర్షించాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. పలు జిల్లాలో ప్రలోభాలకు లొంగే అవకాశం ఉన్నవారినీ, ఇతరత్రా అవసరాలు ఉన్నవారినీ కొందరిని ఇతర పార్టీల్లో గుర్తించమనీ, తెలంగాణలో తగిలిన గాయాన్ని మాన్పించి కార్యకర్తల నుంచి పై స్థాయి వరకూ అందరిలో నైతిక స్థైర్యం నెలకొల్పేందుకు వలసలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యేంతవరకూ జిల్లాల్లో మంత్రులు, నేతలు ఇదే పనిలో ఉండాలని చెప్పారని సమాచారం. పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతకుముందు విజయవాడలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేస్తారు. కేబినెట్ సమావేశానికి ముందు చంద్రబాబుతో కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత పి. రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని చేర్చుకోవాలని జరుగుతున్న ప్రయత్నాలపై చర్చించారు. ఎవరు వస్తే వారిని పార్టీలో చేర్చుకోక తప్పదని, అందుకు సహకరించాలని చంద్రబాబు సూచించారు.