pulwama district
-
పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియా గురించి తెలుసా?
ఏపీ సెంట్రల్ డెస్క్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ఓఖూ గ్రామం పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా వినుతికెక్కింది. దేశం నుంచి పెన్సిల్ ఉత్పత్తికి కావాల్సిన 90 శాతం ముడి కలప ఇక్కడి నుంచే కంపెనీలకు ఎగుమతవుతోంది. పెన్సిళ్ల తయారీకి అవసరమైన కలపను ఒకప్పుడు చైనా, జర్మనీ నుంచి ఇక్కడివారు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడా అవసరం లేకుండా స్థానికంగా లభించే కలపను సమర్థవంతంగా నియోగించుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. మార్చి 30 జాతీయ పెన్సిల్ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం పాఠకుల కోసం.ప్రధాని ప్రస్థానంతో వెలుగులోకి.. దేశ ప్రధాని నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆవిష్కరించే మన్ కీ బాత్ (mann ki baat) లో పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా ఓఖూను అభివర్ణించారు. దీంతో ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది. పుల్వామా జిల్లాలోని ఈ గ్రామం పెన్సిల్ తయారీకి ప్రధాన కేంద్రంగా గుర్తింపుపొందింది. దేశాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో పుల్వామా కీలక భూమిక పోషిస్తోందని, విద్యార్థులు తమ హోంవర్క్ చేయడం, నోట్స్ రాసుకోవడంలో పెన్సిల్ (Pencil) వినియోగించినప్పుడల్లా పుల్వామా జిల్లా స్ఫురణకు వస్తుందని మన్ కీ బాత్ ప్రసంగంలో కితాబిచ్చారు. దిగుమతుల నుంచి ఎగుమతుల దాకా.. 1960 నుంచి ఇక్కడ పరిశ్రమల ప్రస్థానం ప్రారంభమైంది. మొదట్లో పెన్సిల్ తయారీకి దియోదార్ కలపను వినియోగించేవారు. 1992లో ఇక్కడి ప్రభుత్వం దియోదార్ వినియోగాన్ని నిషేధించడంతో చైనా, జర్మనీ దేశాల నుంచి కలపను దిగుమతి చేసుకునేవారు. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడినది కావడంతో ప్రత్యామ్నాయానికి అన్వేషించారు. అలాంటి సమయంలో ఇక్కడ లోయల్లో లభించే పోప్లర్ కలప వీరికి వరంలా మారింది. ఆ కలపతో పెన్సిల్ పలకలను తయారుచేయడం మొదలెట్టారు. పోప్లర్ కలప పెన్సిల్ నాణ్యతను పెంచడంతో దిగుమతుల దశ నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి చేరింది. యూఏఈ, మెక్సికో, నేపాల్, పోలాండ్, ఫ్రాన్స్, భూటాన్, యూకే, బెల్జియం, మారిషస్, లెబనాన్, మాల్దీవులు, గ్రీక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తోపాటు 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నిరుద్యోగుల కల్పతరువు... ఓఖూ ఓఖూ... పుల్వామా జిల్లాకు చెందిన ఓ మారుమూల గ్రామం. ప్రపంచ స్థాయి మార్కెట్లో ఒకటిగా వెలుగొందుతోంది. గతంలో ముడి కలపను జమ్ము, చండీగఢ్‌లో ముక్కలుగా చేసి తెప్పించేవారు.స్థానిక ప్రభుత్వం వీరికి ఆధునికతను అందుబాటులోకి తీసుకురావడంతో పెన్సిల్ పలకలను ఇక్కడే తయారు చేస్తున్నారు. పెన్సిల్ రూపకల్పనకు అవసరమైన పలకలను ఎండబెడతారు. ఇవి బాగా ఆరాక ఒక్కో పెట్టెలో 800 పలకల లెక్కన ప్యాక్ చేస్తారు. నటరాజ్, అప్సర, హిందూస్థాన్ పెన్సిళ్ల తయారీ కర్మాగారాలకు ఇక్కడి నుంచే కలప వెళ్తోంది. ఏనాటికైనా కశ్మీర్ లోనే పూర్తిస్థాయి పెన్సిల్ ప్లాంట్ అందుబాటులోకి రావాలని, ప్రపంచ స్థాయిలో పెన్సిల్ ఉత్పత్తిలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్నది ఓఖూ గ్రామస్తుల ఆకాంక్ష.చదవండి: వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్ -
కశ్మీర్లో లష్కరే కీలక కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా కీలక కమాండర్ రియాజ్ దార్ అలియాస్ సత్తార్ హతమయ్యాడు. కశ్మీర్ వ్యాలీ ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరించే ఇతడి మృతి దక్షిణ కశ్మీర్లో లష్కరేకు కోలుకోలేని దెబ్బగా భద్రతా దళాలు పేర్కొన్నాయి. సోమవారం కార్డన్ సెర్చ్ సందర్భంగా ఉగ్రవాదులు దాగున్న ఇంటికి నిప్పంటుకుంది. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఒకరిని లష్కరే తోయిబా కశ్మీర్ వ్యాలీ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ దార్ అలియాస్ సత్తార్గా, మరొకరిని రయీస్ దార్గా గుర్తించారు. 2015 నుంచి లష్కరేలో పనిచేస్తున్న సత్తార్‌కు గ్రెనేడ్ దాడులు, లక్షిత హత్యలు వంటి 20కి పైగా ఉగ్ర ఘటనలతో సంబంధముంది. కొన్నేళ్లుగా బలగాల కళ్లుగప్పి తిరుగుతున్న సత్తార్ పై రూ.10 లక్షలు, రయీస్‌పై రూ.5 లక్షల రివార్డున్నట్టు కశ్మీర్ ఐజీపీ వీకే బిర్ధి చెప్పారు. -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. పట్టుబడ్డ ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ముందస్తు సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు పుల్వామాలోని నెహామా ప్రాంతాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఉగ్రవాదులుపైకి ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులో సమయంలో లష్కర్-ఇ-తోయిబా రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు రాయిస్ అహ్మద్, రియాజ్ అహ్మద్‌లు భద్రతా బలగాలకు పట్టుబడ్డారు.#WATCH | Pulwama encounter: The house in Nihama area where terrorists are trapped, caught on fire. Encounter underway. Further details awaited. #JammuAndKashmir pic.twitter.com/qLSpB2UbwD— ANI (@ANI) June 3, 2024 ‘పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’ అని కశ్మీర్ జోన్ పోలీసులు ‘ఎక్స్’ తెలిపారు. అయితే కాల్పులు జరిగిన సమమంలో ఎవరూ మృతి చెందలేదని పోలీసులు తెలిపారు. ఇక.. మే 7న జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
Seher Mir: అమ్మలు మెచ్చిన కూతురు
‘నా కూతురు వయసు కూడా లేదు. ఈ అమ్మాయి నాకు ఏం చెబుతుంది’ అనుకుంది ఒక అమ్మ. అయితే ఆ అమ్మాయి చెప్పిన మంచిమాటలు విన్న తరువాత, ఆ అమ్మ తన దగ్గరకు వచ్చి ‘చల్లగా జీవించు తల్లీ’ అని ఆశీర్వదించింది. నలుగురికి ఉపయోగపడే పనిచేస్తే అపూర్వమైన ఆశీర్వాదబలం దొరుకుతుంది. అది మనల్ని నాలుగు అడుగులు ముందు నడిపిస్తుంది... పుల్వామా (జమ్ము–కశ్మీర్) జిల్లాలోని పంపోర్ ప్రాంతానికి చెందిన పదిహేడు సంవత్సరాల సెహెర్ మీర్ క్లాస్‌రూమ్‌లో పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సమాజాన్ని కూడా చదువుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి తెలుసుకుంది. వాటి గురించి విచారించడం కంటే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. తన ఆలోచనలో భాగంగా మిత్రులతో కలిసి ‘ఝూన్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, శుభ్రమైన న్యాప్కిన్ల వాడకం, రుతుక్రమం, అపోహలు... ఇలా ఎన్నో విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది మీర్. మొదట్లో ‘ఈ చిన్న అమ్మాయి మనకేం చెబుతుందిలే’ అన్నట్లుగా చూశారు చాలామంది. కొందరైతే సమావేశానికి పిలిచినా రాలేదు. ఆతరువాత మాత్రం ఒకరి ద్వారా ఒకరికి మీర్ గురించి తెలిసింది. ‘ఎన్ని మంచి విషయాలు చెబుతుందో’ అని మెచ్చుకున్నారు. నెలసరి విషయాలతో పాటు మానసిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా తన బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది మీర్. కొద్దిమందితో మొదలైన ‘ఝూన్’లో ఇప్పుడు యాభై మందికి పైగా టీనేజర్స్ ఉన్నారు. ‘ఝూన్లో పనిచేయడం ద్వారా నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలను పదిమందికి తెలియజేయడంతో పాటు, రకరకాల గ్రామాలకు వెళ్లడం ద్వారా సామాజిక పరిస్థితులను తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది నుహా మసూద్. ‘తెలిసో తెలియకో రకరకాల కారణాల వల్ల నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్లను కొనకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం, ఇది చాలా రహస్య విషయం, ఎవరికీ తెలియకూడదు అనుకోవడం! ఈ పరిస్థితులలో మెల్లగా మార్పు తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటుంది మీర్. ‘ఝూన్’ ఎన్నో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటిని అందుకోవడానికి చురుగ్గా అడుగులు వేస్తోంది. -
కశ్మీర్లో ఉగ్ర దాడి.. పోలీసు వీరమరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో పోలీసు అధికారి ఒకరు నేలకొరగగా, సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు. ఈ ఘటన పుల్వామా జిల్లా పింగ్లానా ప్రాంతంలో తనిఖీల సమయంలో చోటుచేసుకుంది. వీరమరణం పొందిన పోలీసును స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన జావిద్ అహ్మద్ దార్గా గుర్తించారు. క్షతగాత్రుడైన జవానును ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించి, పారిపోయిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఉగ్రదాడిని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాజకీయ పార్టీలు ఖండించాయి. మరోఘటన.. షోపియాన్ జిల్లా బస్కచాన్ ప్రాంతంలో చేపట్టిన కార్డన్ సెర్చ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన షోపియాన్ జిల్లా నౌపొరా వాసి అహ్మద్ భట్ హతమయ్యాడు. -
పుల్వామాలో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. శనివారం రాత్రి జిల్లాలోని ద్రబ్గామ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని కశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమైన ఎన్కౌంటర్ దాదాపు 12 గంటలపాటు కొనసాగినట్లు తెలిపారు. కాల్పుల్లో మరణించిన వారిని జునైద్ షీర్గోజ్రీ, ఫాజిల్ నజీర్ భట్, ఇర్ఫాన్ మాలిక్‌గా గుర్తించినట్లు కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ముగ్గురు స్థానికులేనని, వీరు లష్కరే తోయిబా గ్రూప్‌కు చెందిన వారని పేర్కొన్నారు. వీరిలో జునైద్ అనే ఉగ్రవాది గత నెల 13న అమరుడైన జవాన్ రియాజ్ అహ్మద్‌ను చంపినవారిలో ఒకడని తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, రెండు ఎకె47రైఫిళ్లు, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.లో తెలిపారు. చదవండి: స్నేహం ముసుగులో మైనర్‌పై అత్యాచారం, లైవ్ స్ట్రీమింగ్ -
పుల్వామా ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని చండ్గామ్ గ్రామంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో.. భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. చదవండి: పంజాబ్ పర్యటన రద్దు.. ప్రధాని మోదీ తీవ్ర అసహనం వీరిలో ఒకరిని పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను బలగాలతోపాటు రెండు M-4 కార్బెన్స్, ఒక ఏకే సీరీస్ రైఫిల్ వంటి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. అక్కడ పర్యటనలు, ర్యాలీలు రద్దు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ -
కశ్మీర్లో జేఎస్‌డబ్ల్యూ ఉక్కు ప్లాంటు
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లస్సీపురాలో కలర్ కోటెడ్ ఉక్కు తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.150 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 లక్షల టన్నులుగా ఉండనుంది. గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ వెల్లడించింది. జమ్మూ, కశ్మీర్‌లోని స్థానిక మార్కెట్లో విక్రయాల కోసం స్టీల్ శాండ్విచ్ ప్యానెల్స్, స్టీల్ డోర్స్ తయారు చేయనున్నట్లు తెలిపింది. స్థల కేటాయింపు పత్రాలను హోం మంత్రి అమిత్ షా సోమవారం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్‌కు అందిం చారు. స్థానిక వ్యాపారాలు, సమాజానికి ఈ ప్లాంటు ప్రయోజనం చేకూర్చగలదని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించగలదని జిందాల్ తెలిపారు. -
జైషేకు ఝలక్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. రోజుకొక ఎన్కౌంటర్ జరుగుతోంది. బుధవారం పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ హతమయ్యాడు. అతనిని షామ్ సోఫిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లా అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకోవడానికి ప్రయత్నించాయి. అయితే మిలిటెంట్లు భద్రతా బలగాలపై హఠాత్తుగా కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచి్చందని పోలీసులు వెల్లడించారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒకరు మరణించారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని చూసి జైషే మహమ్మద్ టాప్ కమాండర్ షామ్ సోఫిగా గుర్తించినట్టు కశీ్మర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతాలో కూడా వెల్లడించారు. -
జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్‌కు చెందిన జైషే మొహమ్మద్ కశ్మీర్ కమాండర్, ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు, 2019 పుల్వామా దాడి సూత్రధారిగా భావిస్తున్న మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూ అలియాస్ అద్నన్ సహా మరొకరు హతమయ్యారు. గురువారం కశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీపీ) విజయ్ కుమార్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఉగ్రమూకల కదలికలున్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు గురువారం నమిబియాన్, మర్సార్, డాచిగాం అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు కార్డన్‌సెర్చ్ చేపట్టాయి. ఈ సమయంలో చిన్నారులు, మహిళలను అడ్డుగా పెట్టుకుని ఉగ్రవాదులు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారు కాల్పులకు దిగగా దీటుగా బలగాలు స్పందించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ‘మృతుల్లో పాకిస్తాన్‌కు చెందిన టాప్ మోస్ట్ ఉగ్రవాది, జైషే మొహమ్మద్‌కు చెందిన లంబూ ఉన్నాడు. ఇతడు జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు. 2019లో జరిగిన పుల్వామా దాడి కుట్రకు సూత్రధారి. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీటులో ఇతడి పేరు ఉంది’ అని ఐజీపీ వెల్లడించారు. ఈ ఘన విజయం సాధించిన పోలీసులు, బలగాలను ఆయన అభినందించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై అదిల్ అద్నాన్ అనే ఆత్మాహుతి దళ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో దాడి చేయగా 40 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అద్నాన్కు శిక్షణ ఇచ్చింది లంబూయేనని భద్రతాధికారులు చెబుతున్నారు. ఎవరీ లంబూ? మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూకు అబూ సైఫుల్లా అనీ ఫౌజీ భాయి అని కూడా పేర్లున్నాయి. ఇతడు జైషే మొహమ్మద్ కశ్మీర్ ప్రధాన కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్‌లోని బహావల్పూర్లోని కోసర్ కాలనీకి చెందిన వాడు. ఐఈడీ తయారీలో ఇతడు దిట్ట. 2017లో కశ్మీర్లోకి అక్రమంగా చొరబడ్డాడు. అవంతిపొరా, పుల్వామా, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఇతడు ఉగ్ర కార్యకలాపాలు సాగించాడు. త్రాల్లోపాటు జాతీయరహదారిపై ఉగ్ర దాడులకు ఇతడు యత్నించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. స్థానిక ఉగ్రవాది సమీర్ అహ్మద్ దార్‌తో కలిసి పుల్వామాలో పనిచేశాడు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల తరఫున కూడా లంబూ పోరాడాడు. భారత బలగాలపై రాళ్లు రువ్వడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా కశ్మీర్ యువతను ప్రేరేపించినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అవంతిపొరా, కాక్‌పొరా, పుల్వామా తదితర ప్రాంతాల నుంచి యువతను ఉగ్రమార్గం పట్టించి, వారిని ఇతర ప్రాంతాలకు పంపించడంలో ఇతడు కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నాయి. ఇతడిపై 14 కేసులు నమోదయ్యాయి. -
పుల్వామా దాడిపై పాక్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి వెనుక దాయాది దేశం పాకిస్తాన్ హస్తం ఉందన్న భారత్ అనుమానం నిజమైంది. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో చోటుచేసుకున్న విధ్వంసం వెనుక తామ దేశ హస్తం ఉందని పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామ ఉగ్రదాడి తమ పనేనని ప్రకటించుకున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. భారత్‌ను సొంతగడ్డపైనే దెబ్బతీశామని, ఇమ్రాన్ ప్రభుత్వాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. గురువారం ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. పుల్వామా ఉగ్రదాడికి భారత్‌కు చెందిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్టు తొలుత ప్రకటించుకుంది. అయితే అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని భారత నిఘా వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. తాజాగా పాక్ మంత్రి ప్రకటనతో.. భారత్ అనుమానం నిజమైంది. ఈ నేపథ్యంలో దాయాది దేశంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ మంత్రి ప్రకటనపై స్పందించిన భారత విదేశాంగ శాఖ పూల్వామా దాడి వెనుక పాక్ ఉందని ప్రపంచానికి తెలుసు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ బహిరంగంగానే సమర్థించుకుంటోంది. పాక్ నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రపంచం తెలుసుకోవాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్‌ను క్షమించొద్దు. -
పుల్వామాలో ఎన్కౌంటర్; ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్‌లోని చేవా ఉల్లార్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ప్రారంభమైన ఈ కాల్పులు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. త్రాల్ సెక్టార్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు నిఘా వర్గాల నుంచి పోలీసులకు, సీఆర్పీఎఫ్ బృందాలకు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైనిక దళాల కదలికలలను గుర్తించిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు.దీంతో ఉగ్రవాదులపై బలగాల ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గరు ఉగ్రవాదులు మరణించారు. (కశ్మీర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి) ఈ కాల్పులపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఎన్కౌంటర్లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టు బెట్టినట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సాయుధ దళాల సిబ్బందికి కూడా గాయాలయ్యాని వెల్లడించారు. కాగా కాల్పుల్లో మరణించిన ముగ్గురు ఉగ్రవారులు స్థానికి ట్రాల్ ప్రాంతానికి చెందిన వారని, ఆయుధాలతో ఉగ్రవాదంలో చేరినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ నెలలో ఇది దక్షిణ కశ్మీర్లో జరిగిన 12వ ఎన్కౌంటర్. ఇప్పటి వరకు 33 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. (భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు) -
ఆ కారు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదిదే
పుల్వామా : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పేలుడు పదార్థాలతో ఉన్న సాంట్రో కారును గురువారం స్థానిక బలగాలు గుర్తించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తాజాగా సమాచారాన్ని అందించారు. సుమారు 20 కిలోల పేలుడు పదార్థాలు కలిగి ఉన్న సాంట్రో కారు ఓనర్‌ను గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఆ కారు హిదాయతుల్లా మాలిక్ అనే వ్యక్తిది అని తేల్చారు. కాగా సోఫియాన్ జిల్లాకు చెందిన హిదాయతుల్లా గత ఏడాది హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ గ్రూఫ్‌లో చేరాడు. కాగా గురువారమే కారులో ఉన్న ఐఈడీని(ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) బాంబ్ స్వ్వాడ్ టీమ్‌తో ఆపరేషన్ నిర్వహించి పేల్చివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా రెండు వారాల కింద పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జమ్మూ కశ్మీర్ పోలీసులపై హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా భద్రతా బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.కాగా, గత సంవత్సరం పుల్వామాలో జరిగిన ఐఈడీ వాహన దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. (జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం) -
ఆర్మీ వాహనంపై ఉగ్ర దాడి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అరిహల్‌లో ఆర్మీ అధికారుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఈ దాడికి ఉగ్రవాదులు శక్తిమంతమైన ఇంప్రొవైస్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని వినియోగించారు. ఫిబ్రవరి 14న ఓ సూసైడ్ బాంబర్ 40 మంది సీఆర్పీఎఫ్ అధికారులను బలితీసుకున్న ప్రాంతానికి ఇది కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం. 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఈ ఆర్మీ వాహనం బుల్లెట్, మైన్ ప్రూఫ్ కావడంతో సైన్యానికి పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అరిహల్ లస్సిపురా రోడ్డు మీద ఈ దాడి జరిగింది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తేవడానికి మరికొంత మంది సిబ్బందిని రప్పించి, గాల్లోకి కాల్పులు జరిపామని అధికారులు తెలిపారు. చిన్నగాయాలు మినహా ఏ నష్టమూ జరగలేదని, ఉగ్రవాదులు చేసిన దాడి విఫలమైందని కల్నల్ రాజేష్ కలియా అన్నారు. బాంబుదాడి అనంతరం కూడా సోదాలు కొనసాగాయని అన్నారు. అయితే పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేయనున్నారని పాకిస్తాన్ ముందే హెచ్చరించడం గమనార్హం. పాక్ చెప్పడానికి కారణాలేంటి? అల్‌కాయిదాకు అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాది జకీర్ మూసాను చంపినందుకు ప్రతీకారంగా భారత్‌లో దాడులు చేయాలని ఉగ్రవాదులు నిర్ణయించుకున్నట్లు తమకు సమాచారం అందిందని పాక్ ఇటీవల భారత ప్రభుత్వానికి తెలిపింది. ఈ దాడులు అమర్నాథ్ యాత్రకు ముందుగానీ, తర్వాతగానీ దాడులు చేసేందుకు ఉగ్రమూకలు సిద్ధంగా ఉన్నారంది. 2016లో కూడా పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ జాంజువా అప్పటి భారత జాతీయ భద్రతా సలహాదారు ధోవల్‌కు గుజరాత్లో 26/11 లాంటి దాడులు నిర్వహించేందుకు ఉగ్రవాదులు పథకం పన్నారని తెలిపారు. పాక్ ఇలాంటి హెచ్చరికలు చేయడంపై పలు అనుమానాలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ సమాజంలో తాము ఉగ్రవాదానికి వ్యతిరేకులమన్న సందేశాన్ని వ్యాప్తి చేయడమే పాక్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. -
పుల్వామాలో ఇద్దరు టెర్రరిస్టులు హతం
కశ్మీర్: జమ్ము- కశ్మీర్లో మారోసారి కాల్పుల మోత మోగింది. పుల్వామా జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ జరిపిన భద్రతా బలగాలు.. ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు దక్షిణ కశ్మీర్‌లోని అవంతీపురా జిల్లాలో భద్రతా బలగాలు కార్డన్‌సర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడటంతో.. ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి వద్ద లభించిన మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే వీరు ఏ సంస్థకు చెందినవారో గుర్తించేందుకు విచారణ చేపట్టామన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అవంతీపురా జిల్లా పరిధిలోని రైలు, ఇంటర్నెట్ సర్వీస్‌లను నిలిపివేసినట్లు వెల్లడించారు. -
కశ్మీర్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్: ఉగ్రసంస్థ అల్‌కాయితో సంబంధాలున్న గజ్వత్ ఉల్ హింద్ గ్రూప్ చీఫ్ జకీర్ ముసాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘చనిపోయిన ఉగ్రవాదిని జకీర్ ముసాగా గుర్తించాం. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నాం’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేశ్ కాలియా వెల్లడించారు. తొలుత దాద్‌సారా గ్రామంలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, అదే సమయంలో అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు వివరించారు. అతడిని పట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా వినలేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. కాగా, షోపియాన్, పుల్వామా, అవంతీపురా, శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో జకీర్‌కు మద్దతుగా ప్రజలు ఆందోళనలు చేపట్టారని, నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో అధికారులు లోయలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. ముసా 2013 నుంచి ఉగ్రకార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్లు తెలిసింది. తొలుత హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఏర్పరచుకున్నాడని, ఆ తర్వాత అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. 2017లో హురియత్ కాన్ఫరెన్స్ నేతలను బెదిరించినట్లు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. -
ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా, సోఫియాన్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఓ ఆర్మీ జవాను, ఓ పౌరుడు కూడా మరణించారు. పుల్వామాలో ముగ్గురు, సోపియాన్‌లోనూ మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా దెలిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఓ ఇంట్లోని వారందరినీ పోలీసులు బయటకు తరలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిపాయి సందీప్ వీరమరణం పొందగా, రయీస్ దార్ అనే పౌరుడు మరణించారు. అనంతరం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిని పుల్వామా జిల్లా కరీమాబాద్‌కు చెందిన నసీర్ పండిత్, సోఫియాన్‌కు చెందిన ఉమర్ మిర్, పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్‌లుగా గుర్తించారు. వీరు ముగ్గురూ తీవ్రమైన నేరచరిత్ర గలవారని, పలు ఘటనల్లో వీరి ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక సోఫియాన్‌లోని హ్యండ్యూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో సిపాయి రోహిత్‌కు గాయాలయ్యాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల వివరాలు తెలియలేదు. -
ఎదురు కాల్పుల్లో ముగ్గరు ఉగ్రవాదులు, జవాను మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో భద్రతా దళాలకు.. ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. పుల్వామాలోని దాలిపొర ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయం గురించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘దాలిపోర ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం వచ్చింది. దాంతో ఆ ప్రాంతంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించాము. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఒక ఆర్మీ అధికారి మరణించారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామ’ని తెలిపారు. కాగా ఎన్కౌంటర్ నేపథ్యంలో దాలిపొర ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. -
నలుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూపునకు చెందిన నలుగురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. సోమవారం కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లతోపాటు ఒక పోలీసు గాయపడ్డారు. పుల్వామా జిల్లాలోని లస్సిపోరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సోమవారం ఆర్మీ గాలింపు చేపట్టింది. జవాన్లను చూడగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. కాగా, కశ్మీర్‌లోని పూంచ్ లో నియంత్రణ రేఖ వెంబడి సోమవారం పాక్ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ అధికారి, మరో ఐదేళ్ల బాలిక మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లుసహా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. షాపుర్ సబ్ సెక్టార్లో ఓ ఇంటి వద్ద బాంబు పేలడంతో సోబియా అనే ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. -
పుల్వామాలో ఎన్కౌంటర్
శ్రీనగర్ : భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సమసిపోయినా ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనతో పాక్ దళాలు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. గంటకు పైగా కాల్పులు జరిగాయని, ఉగ్రవాది తలదాచుకున్న గృహాన్ని భద్రతాదళాలు పేల్చివేశాయని అధికారులు వెల్లడించారు. పుల్వామా జిల్లాలోని త్రాల్లో ఓ ఇంటిలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారని అందిన సమాచారంతో భద్రతా దళాలు మంగళవారం తెల్లవారుజామున ఇంటిని చుట్టుముట్టాయి. భద్రతా దళాల దాడిలో ఓ ఉగ్రవాది మరణించగా మరో టెర్రరిస్ట్ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం కాల్పులు నిలిచిపోయాయని, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు. -
‘పుల్వామా కంటే పెద్ద ఉగ్రదాడి జరగొచ్చు’
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని మరువక ముందే అందుకు బాధ్యత వహించిన... జైషే మహ్మద్ సంస్థ మరిన్ని ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తమకు సమాచారం అందిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రెండు రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా బలగాల వాహనాలపై దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి. చౌకీబాల్ నుంచి తంగ్ధార్ వెళ్లే మార్గాల్లో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇందుకోసం తాంజీమ్ అనే ఇస్లామీ సంస్థ ఐఈడీతో నిండిన ఓ గ్రీన్ స్కార్పియోను సిద్ధం చేసిందని వెల్లడించాయి. కశ్మీరీ యువకులతో నిరసనలు చేయిస్తూ.. వారి సహకారంతో వాస్తవాధీన రేఖ దాటాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే 5 నుంచి 6 మంది ఉగ్రవాదులు కశ్మీర్లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి.(లొంగిపోవడం కంటే కూడా చావడానికి సిద్ధం..) 500 కిలోల బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి.. జైషే మహ్మద్‌కు చెందిన ఓ సోషల్ మీడియా గ్రూపు మెసేజ్‌లను ఇంటెలిజిన్స్ వర్గాలు డీకోడ్ చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.... ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత వారం కేవలం 200 కిలోల ఐఈడీ మాత్రమే ఉపయోగించాం. 500 కిలోల భారీ బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి. కశ్మీరీలపై సైన్యం ఎటువంటి చర్యలకు పాల్పడ్డా.. భద్రతా బలగాలపై మరిన్ని దాడులు జరుగుతాయి. ఇది కేవలం మనకు.. సైన్యానికి జరుగుతున్న యుద్ధం. రండి యుద్ధానికి సిద్ధంగా ఉండండి’ అని జైషే.. భారత ఆర్మీని హెచ్చరించింది. ఇక భద్రతా వైఫల్యం కారణంగానే పుల్వామా దాడి జరిగిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సైనికులు ప్రయాణిస్తున్న సమయంలో పౌరుల వాహనాలను అనుమతించడంతో పుల్వామా దాడి సాధ్యమైందని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరో దాడికి జైషే సిద్ధమవుతోందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.(‘లొంగిపోండి.. లేదంటే అంతం చేస్తాం’) కాగా పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కమాండర్ ఆదిల్... సీఆర్పీఎఫ్ బలగాల వాహన శ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం.. కశ్మీర్లో తిరిగే ప్రతీ ఉగ్రవాదిని అంతం చేస్తామని ఆర్మీ అధికారులు మీడియా ముఖంగా హెచ్చరించారు. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న కశ్మీరీ యువత లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.(పుల్వామా ఉగ్రదాడి; మాస్టర్ మైండ్ హతం!) -
ఉగ్రదాడి: ధర్మశాలలో పాక్ క్రికెటర్ల ఫోటోలు తొలగింపు
ధర్మశాల: పుల్వామా ఉగ్ర దాడికి నిరసనగా పాకిస్తాన్‌కు చెందిన 13 మంది క్రికెటర్ల ఫోటోలను హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) తొలగించింది. ధర్మశాలలోని మైదానంలో ఇమ్రాన్ ఖాన్, వసీం ఆక్రమ్, జావెద్ మియాందాద్‌తో సహా మొత్తం పాక్ ఆటగాళ్ల ఫోటోలను తొలగించాలని మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. 2005లో టీమిండియా పర్యటన నేపథ్యంలో ధర్మశాలలో బోర్డ్ ప్రెసిడెంట్ ఎలవన్‌తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సందర్భంగా షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది ఆటగాళ్ల ఫోటోలను, ఆ మ్యాచ్‌కు సంబంధించి ఫోటోలను కూడా తొలగించినట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి నిరసనగా, అదే విధంగా భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజింగ్ కమిటీ సీనియర్ ఒకరు తెలిపారు. (ఉగ్రదాడి.. పాక్ క్రికెట్‌కు గట్టిషాక్!) ఇక ఇప్పటికే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న పాక్ క్రికెటర్ల ఫోటోలను తీసేసిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిని భారత క్రికెటర్లు ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. ప్రపంచకప్‌లో రెండు పాయింట్లు కోల్పోయినా సరే... పాక్‌తో మ్యాచ్ టీమిండియా ఆడరాదంటూ సీనియర్ ఆటగాడు హర్బజన్ అభిప్రాయపడ్డాడు. ఇక అమరజవాన్ల పిల్లలను తన స్కూల్లో ఉచితంగా చదివిస్తానని వీరేంద్ర సెహ్వాగ్ ముందుకు రాగా.. మరికొంత మంది ఆటగాళ్లు ఆర్థిక సహాయం అందించారు. బీసీసీఐ కూడా భారీ మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించింది. -
‘తనొక క్రికెటర్.. కానీ నేనొక సైనికుడిని’
చండీగఢ్ : ‘సిద్ధు ఒకనాడు క్రికెటర్ అయితే.. నేను ఒకనాటి సైనికుడిని. ఈ ఘటనను మేము చూసే విధానంలో, మా అభిప్రాయాల్లో భేదాలు ఉంటాయి’ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ పంజాబ్ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి జాతి, మతం ఉండదన్న పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.(పుల్వామా ఉగ్రదాడి : సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు) ఈ క్రమంలో సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ..‘ సిద్ధు మాజీ క్రికెటర్. సరిహద్దుల్లో ఉండే ఇబ్బందులు తనకి అర్థం కావు. కానీ నేనో సైనికుడిని అక్కడి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిని వాడిని. అందుకే మా ఇద్దరి అభిప్రాయాల్లో తేడా కచ్చితంగా ఉంటుంది. పుల్వామా దాడికి తక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని దేశం కోరుకుంటోంది. పాకిస్తాన్ అండతో ఉగ్రవాదులు 41 మంది జవాన్లను బలి తీసుకున్నారు. ఇందుకు ప్రతిగా వారి 82 మంది సైనికులను చంపి బదులు తీర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. పాక్‌పై సైనిక, దౌత్య, ఆర్థికపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.(‘చాలు.. ఇక చాలు.. గుణపాఠం చెప్పాల్సిందే’) కాగా పుల్వామా ఉగ్రదాడి గురించి స్పందిస్తూ... భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు జరిగినపుడు మాత్రమే ఇలాంటి ఘటనలు జరగవని, ఉగ్రవాదులు చేసిన దాడి కారణంగా ఒక జాతి మొత్తాన్ని విమర్శించడం తగదంటూ సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో వివాదానికి దారి తీసిన సిద్ధుపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘ఒక్క చెంప దెబ్బ చాలు.. నా వెనుక ఐఎస్ఐ ఉంది’
గత గురువారం నుంచి యావత్ భారతావని ఆగ్రహంతో రగిలిపోతోంది. 43 మంది సైనికుల ప్రాణాలను బలిగొన్న ముష్కరుల భరతం పట్టాలని కోరుకుంటోంది. మన ఆకాంక్షలకు అనుగుణంగానే భద్రతా బలగాలు పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న రషీద్ ఘాజీని మట్టుబెట్టి సగం ప్రతీకారం తీర్చుకున్నాయి. అయితే ఇందుకు మూలకారణమైన జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌ను కూడా అంతం చేస్తేనే అమర జవాన్ల త్యాగానికి ఫలితం దక్కినట్లు అవుతుందని భారతీయులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మసూద్ పట్టుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనే అయినా అసాధ్యం మాత్రం కాదని.. గతంలో అతడిని విచారించిన పోలీసు ఉన్నతాధికారి తన ఆనాటి అనుభవాలను పంచుకున్నారు. పుల్వామా దాడికి తామే బాధ్యులమని జైషే మహ్మద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్కడైతే తన మేనల్లుళ్ల(తాలా రషీద్ (2017), ఉస్మాన్ (2018))ను భారత జవాన్లు హతమార్చారో చేశారో.. అదే జిల్లాలో జవాన్లే లక్ష్యంగా దాడికి సిద్ధం చేయాలంటూ మసూద్ భావించాడని.. అందుకే దాడి చేసేందుకు ‘పుల్వామా’ ను ఎంచుకున్నాడని ఇంటిలెజిన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవిస్తుందని వారు ఊహించి ఉండకపోవచ్చు. నిజానికి భద్రతా వైఫల్యం వల్లే ఇంతటి దారుణం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుల్వామా నాటి దాడిని.. ప్రణాళికను పక్కాగా అమలు చేయడంలో విజయవంతమైన మసూద్.. 1994లోనే నకిలీ పాస్‌పోర్టు కేసులో అరెస్టయ్యాడు. పోర్చుగీసు పాస్పోర్టుతో బంగ్లాదేశ్ గుండా.. భారత్‌లో ప్రవేశించి.. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చేరుకున్నాడు. అయితే మసూద్ పన్నాగాన్ని పసిగట్టిన ఇంటలెజిన్స్ వర్గాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో ఆనాటి ఇంటలిజెన్స్ అధికారి(కశ్మీర్ డెస్క్ హెడ్), సిక్కిం మాజీ డీజీపీ అవినాశ్ మోహననే అతడిని విచారించారు.(పుల్వామా ఉగ్రదాడి; మాస్టర్ మైండ్ హతం!) ఒక్క చెంప దెబ్బ చాలు... ‘అతడి విచారణ మాకు అంతగా కష్టంగా అనిపించలేదు. విచారణలో భాగంగా కోట్ బల్వాల్(జమ్ము కశ్మీర్) జైలులో అతడిని చాలా సార్లు కలిశాను. ఎన్నో గంటల పాటు ప్రశ్నలు సంధించాను. అయితే అతడి నుంచి సమాధానం రాబట్టడం కోసం ఎటువంటి కఠిన పద్ధతులు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఓ ఆర్మీ అధికారి కొట్టిన ఒకే ఒక చెంప దెబ్బ అతడిని నిలువెల్లా వణికించింది. ఆ తర్వాత విచారణలో అఫ్గాన్ ఉగ్రవాదులు కశ్మీర్ లోయలోకి ఎలా వస్తున్నారు.. అదే విధంగా ఉగ్ర సంస్థలు హర్కత్-ఉల్- ముజాహిద్దీన్, హర్కత్ ఉల్ జీహాద్ ఈ ఇస్లామీలు... హర్కత్ ఉల్ అన్సార్ అనే ఒకే సంస్థగా ఆవిర్భవించిన తీరు.. దానికి జనరల్ సెక్రటరీగా తాను ఎదిగిన క్రమాన్ని మసూద్ వివరించాడు. కశ్మీర్‌కు చేరుకునే ముందే సహరన్పూర్ వెళ్లి హర్కత్ ఉల్ అన్సార్ ఏర్పాటైతే కలిగే ప్రయోజనాల గురించి ఇరు సంస్థలకు అర్థమయ్యేలా చెప్పానని తెలిపాడు. కాలినడకన వాస్తవాధీన రేఖను దాటలేకపోయానని. అందుకే ఫోర్జరీ పాస్పోర్టుతో భారత్ వచ్చానని మసూద్ చెప్పినట్లు’ మోహననే ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. నా వెనుక ఐఎస్ఐ ఉంది... మసూద్‌ను విడిపించుకునేందుకు అతడి అనుచరులు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా అప్పటి బీజేపీ(సంకీర్ణ) ప్రభుత్వం మసూద్‌ను విడుదల చేసింది. ఆ తర్వాతే అతడు జైషే మహ్మద్‌ను స్థాపించి తన ఉగ్ర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ విషయం గురించి మోహననే మాట్లాడుతూ... మసూద్ విడుదలయ్యే నాటికి తాను కొత్త పోస్టులోకి మారానని చెప్పారు. అయితే తాను విడుదలవుతానని మసూద్‌కు గట్టి నమ్మకం ఉండేదని పేర్కొన్నారు. ‘ మీరు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు. నిజాలు చెప్పినంత మాత్రాన సరిపోదు కదా. ఐఎస్ఐ(ఇంటర్ సర్వీస్ ఇంటలెజిన్స్) నన్ను పాకిస్తాన్‌కు తిరిగి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిందని మసూద్ విచారణలో అనేవాడు’ అని మోహననే చెప్పుకొచ్చారు. తద్వారా ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని, ఇందులో భాగంగా ఐఎస్ఐ ఇటువంటి ఉగ్రవాదుల ముసుగులో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందనే విషయం స్పష్టంగా అర్థమైందని పేర్కొన్నారు. కాగా 1994, ఫిబ్రవరిలో మసూద్ అరెస్టైన 10 నెలల తర్వాతే అతడిని విడిపించేందుకు.. హర్కత్ ఉగ్రవాదులు.. కొంత మంది విదేశీయులను ఢిల్లీ నుంచి కిడ్నాప్ చేశారు. అనంతరం మసూద్‌ను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. కానీ ఆ సమయంలో ఉగ్రవాది ఒమర్ షేక్ పోలీసుల చేతికి చిక్కడంతో వారి ప్రయత్నం విఫలమైంది. దీంతో 1999లో మరోసారి ప్రయత్నించి... ఖాట్మండు నుంచి ఢిల్లీ వస్తున్న భారత విమానాన్ని హైజాక్ చేయడం ద్వారా మసూద్‌ను విడిపించుకున్నారు. ఇక ఆనాటి నుంచి మసూద్ కశ్మీర్‌లోని భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రదాడులు రచిస్తున్న సంగతి తెలిసిందే.(మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు) చదవండి : ఉగ్రవాది ఆదిల్‌కు శిక్షణ ఇచ్చింది అతడే! ఉగ్ర మారణహోమం రివేంజ్ తీర్చుకునేందుకు టైమ్, ప్లేస్ డిసైడ్ చేయండి.. ‘పాక్.. మాకు అత్యంత ప్రియమైన దేశం’ -
పుల్వామా దాడిలో అన్ని వైఫల్యాలే!
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఓ టెర్రరిస్టు దాడిలో 44 మంది సైనికులు మరణించడం ఎవరు ఎప్పటికీ పూడ్చలేని లోటు. ఎదను తన్నుకుంటూ పెల్లుబికి వచ్చిన కన్నీళ్లను భారత జాతి కొద్ది కాలానికి మరచిపోవచ్చు. కానీ వారి కుటుంబాలు ఎప్పటికీ మరచి పోలేవు. ఇంతటి విషాధాన్ని మిగిల్చిన దారుణ సంఘటనకు ప్రత్యక్షంగా టెర్రరిస్టులు, పాకిస్థాన్ కారణం కావచ్చు. పరోక్షంగా మనం అంటే, మన వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగం, అధికార యంత్రాంగం, విధాన నిర్ణేతలు కారణం కాదా? మన వ్యవస్థలు పటిష్టంగా ఉండి ఉంటే ఇంతటి దారుణాన్ని నిలువరించి ఉండేవాళ్లం కాదా?! మొదటి వైఫల్యం 80 వాహనాలను, 2,500 మంది సైనికులను ఒకేసారి గణతంత్ర దినోత్సవం పరేడ్లాగా ఎక్కడైనా పంపిస్తారా ? అందుకు అనుమతిస్తారా ? సైన్యం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లాలంటే విడతలుగా, జట్టు జట్టుగా వెళ్లాలని సైనిక నిబంధనావళే తెలియజేస్తోంది. ఉగ్రవాదుల అలజడి ఎక్కువగా ఉన్న దక్షణ కశ్మీర్ రోడ్డులో అంత మంది సైనికులు ఒక్కసారి ఎందుకు వెళ్లారు ? వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక జాతీయ రహదారి మూసుకుపోయినందున రెండు రోజుల పాటు జమ్మూలో సైనికులు నిలిచి పోవాల్సి వచ్చిందని సైనిక అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు వాతావరణం అనుకూలించగానే కొంత మందిని విమానాల ద్వారా, మరి కొంద మందిని వాహనాల ద్వారా పంపించ వచ్చుగదా? అలా ఎందుకు చేయలేదు ? విమానాలకు ఖర్చు ఎక్కువవుతుందనా? రెండో వైఫల్యం సైనిక వాహనాలకు మధ్య పౌర వాహనాలను చొచ్చుకొని రావడం వల్ల ఐఈడీ పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రావడాన్ని సకాలంలో గుర్తించలేక పోయామని సైనిక అధికారులు చెబుతున్నారు. పౌర వాహనాలను ఎందుకు అనుమతించారు ? రాజకీయ నాయకుల కాన్వాయ్ పోతుంటే పౌర వాహనాలను నిలిపివేస్తారుగానీ, దేశాన్ని రక్షించే సైన్యం పోతుంటే నిలిపివేయరా ? వారి ప్రాణం పోయాక సాల్యూట్ కొడితే ఏం లాభం? (నా గుండె కూడా మండుతోంది) ఇంటెలిజెన్స్ వైఫల్యం త్వరలో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందంటూ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన సీఆర్పీఎఫ్కు ఇంటెలిజెన్స్ వర్గాలు సాధారణ హెచ్చరిక జారీ చేసిందట. ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎవరు జరుపుతారో? మాత్రం ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పలేక పోయాయి, కనుక్కోలేక పోయాయి. ఆత్మాహుతి దాడి గురించి ఎక్కడ ఉప్పందిందో అక్కడి నుంచి అనువనువు శోధించుకుంటూ వస్తే ఎక్కడో ఓ చోట దాడికి కుట్ర జరగుతోందన్న విషయాన్ని కచ్చితంగా తెలుసుకుని ఉండేవారు. బాంబర్ 350 కిలోల పేలుడు పదార్థాలను అక్రమంగా సేకరిస్తున్నప్పుడు కనుక్కునే అవకాశం ఉండింది. వాహనంతో సైనిక వాహన శ్రేణిని ఢీకొన్న ఆత్మాహుతి బాంబర్‌కు, కుట్ర దారులకు మధ్య చివరి వరకు సమాచార మార్పిడి జరిగి ఉంటుంది. మధ్యలో సమాచారాన్ని ట్రేస్ చేసి పట్టుకోక పోవడమూ వైఫల్యమే. ఆర్వోపీ వైఫల్యం సైన్యం ఓ చోటు నుంచి మరో చోటుకు వెళుతున్నప్పుడు ‘రోడ్ ఓపెనింగ్ పార్టీ’ లేదా ‘ఆర్వోపీ’ క్లియరెన్స్ తప్పనిసరి. ఎక్కడైన మందు పాతరలు ఉన్నాయా, ఎక్కడయినా శత్రువులు పొంచి ఉన్నారా? ఎక్కడైన అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా? అన్న అంశాలను తేల్చుకోవడానికి ఆరోవోపీ సిబ్బంది ముందుగా వెళుతుంది. ఆ సిబ్బందికి బాధ్యత వహిస్తున్న అధికారి అనుమతి ఇస్తేనే సైన్యం కదలాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్వోపీ తనిఖీ చేసిందా ? లేదా ? తనిఖీ చేయకుండానే అనుమతి ఇచ్చిందా? తేల్చాలి. పేలుడు పదార్థాలతోపాటు కాల్పులు కూడా వినిపించాయని సీఆర్పీఎఫ్ ఐజీ తెలిపారు. అదే నిజమయితే ఆర్వోపీ తన విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలం అయినట్లే (ఉగ్ర మారణహోమం) సైన్యానికి పూర్తి స్వేచ్ఛ పుల్వామా మారణ హోమంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇప్పటి నుంచి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం అని ప్రకటించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కశ్మీర్లో మిలిటెన్సీ పెరిగిందని, సైనికులపై దాడులు పెరిగాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆయన అధికారంలోకి రాగానే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉండాల్సింది. కశ్మీర్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం హయాంలోనే ఆ రాష్ట్రం నడుస్తోంది. అలాంటప్పుడు విధానపర లోపం కేంద్రానిదే అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ఉండాలంటే పాకిస్థాన్ పీచమణచడమే కాదు, ఈ వైఫల్యాలన్నింటికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంత కన్నీరు కారిస్తే ఏం లాభం?!? -
కశ్మీర్‌పై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: పుల్వామా దాడిని అఖండ భారతా వని ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగుతోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అమరజవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ సమయంలోనే కశ్మీర్‌పై కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సినీ హీరో, మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘పుల్వామా ఘటన చాలా బాధాకరం. ఇంత విధ్వంసకాండ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లో ప్రజాభిప్రాయం ఎందుకు సేకరించడం లేదు. అక్కడి ప్రజలు కోరుకున్నట్లుగా చేయాలి’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా కశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. కమల్ వ్యాఖ్యలతో ఇంటాబయటా రచ్చ జరగడంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. కమల్ వ్యాఖ్యలను కావాలని కొందరు వక్రీకరించారని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆరోపించింది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని పేర్కొంది. సీఆర్పీఎఫ్ బలగాలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. (కాపీ కొడతారా! సిగ్గు లేదా: కమల్ ఫైర్) -
‘పాక్.. మాకు అత్యంత ప్రియమైన దేశం’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తమకు ఎల్లప్పుడూ ప్రియమైన దేశమేనని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వ్యాఖ్యానించారు. త్వరలోనే పాకిస్తాన్ ఆర్థికంగా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ వంటి నాయకులతో పలు కీలక అంశాల్లో భాగస్వామ్యమయ్యేందుకు తమ దేశం ఎదురుచూస్తోందంటూ పాక్ ప్రధానిని కొనియాడారు. సౌదీ- పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు సల్మాన్ ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రో కెమికల్, క్రీడా రంగాలు, సౌదీ దిగుమతులు, పవర్ జనరేషన్ ప్రాజెక్టులు, సంప్రదాయ వనరుల అభివృద్ధి వంటి సుమారు 20 బిలియన్ డాలర్ల మొత్తానికి సంబంధించిన పలు ఎంఓయూలపై ఇరు దేశాధినేతలు సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కార్యాలయంలో సల్మాన్ మాట్లాడుతూ.. ‘ నేను యువరాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత తూర్పులో ఇదే నా మొదటి పర్యటన. నేను సందర్శించిన మొదటి దేశం పాకిస్తాన్. పాక్ మాకు అత్యంత ముఖ్యమైన దేశం. వారితో భవిష్యత్తులో మేము మరిన్ని ఒప్పందాలు చేసుకుంటాం. ప్రస్తుతం ఓ గొప్ప వ్యక్తి నేతృత్వంలో పాక్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వారితో ఆర్థిక, రాజకీయ సంబంధాలు మేము కోరుకుంటున్నాం. మా ప్రాంతంపై మాకు నమ్మకం ఉంది. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాం అంటూ ఇమ్రాన్ ఖాన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అదే విధంగా తమ దేశంలో ఖైదీలుగా ఉన్న 2107 మంది పాక్ పౌరులను జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. ఇందుకు స్పందనగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘ అత్యవసర సమయంలో మమ్మల్ని ఆదుకుంటున్న స్నేహితుడు సౌదీ అని వ్యాఖ్యానించాడు. తమ దేశ హజ్ యాత్రికుల ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించాలని సల్మాన్‌ను కోరారు. అదే విధంగా రియాద్ నుంచి బీజింగ్ చేరుకునేందుకు చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపెక్)ను ఉపయోగించుకోవాలని విఙ్ఞప్తి చేశారు.(జైషే చీఫ్‌పై మారని చైనా తీరు) కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ పాక్‌ను విమర్శిస్తుండగా సౌదీ యువరాజు ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జైషే మహ్మద్ చీఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు నిరాకరించి చైనా పరోక్షంగా.. పాక్‌కు మద్దతు తెలుపుతుండగా ప్రస్తుతం సౌదీ కూడా అందుకు తోడైనట్లు కన్పిస్తోంది. ఇక భారత్- పాకిస్తాన్ల మధ్య వివాదానికి కారణమైన సీపెక్ గురించి ఇమ్రాన్ మాట్లాడి.. భారత్ పట్ల చైనా, పాకిస్తాన్‌లు వైఖరి ఏంటనే విషయాన్ని చెప్పకనే చెప్పారని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
జవాన్ల కుటుంబాలకు స్టార్ హీరో భారీ విరాళం!
ముంబై : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీరజవాన్ల కుటుంబాలకు సహాయం అందించేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. పుల్వామా ఘటనను ఖండించిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు బాధిత కుటుంబాలకు విరాళాలు ప్రకటిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్... ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున విరాళంగా మొత్తం రూ. 2.5 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కిలాడి అక్షయ్ కుమార్ ముందుకు వచ్చాడు. ఇప్పుడు స్పందించండి.. ‘ పుల్వామా వంటి ఘటనలు మనం మర్చిపోలేము. మన అందరం ప్రస్తుతం కోపంతో ఊగిపోతూ ఉన్నాం. స్పందించాల్సిన సమయం వచ్చింది. స్పందిద్దాం రండి.. అమర జవానుల కుటుంబాలకు సహాయం చేద్దాం. వారి రుణం తీర్చుకునేందుకు ఇంతకన్నా మంచి మార్గం మరొకటి లేదు. అయితే అఫీషియల్ సైట్(భారత్‌కే వీర్) ద్వారా విరాళాలు అందించి మద్దతు తెలపండి. నకిలీ అకౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి’ అంటూ ట్విటర్ ద్వారా అక్షయ్ కుమార్ విఙ్ఞప్తి చేశాడు. అంతేకాకుండా తన వంతు సాయంగా సుమారు 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వనున్నాడని ఓ జాతీయ మీడియా పేర్కొంది. #Pulwama is something we cannot & will not forget.We’re all angry & it’s time to act. So act now,donate to the martyrs of Pulwama on https://t.co/5j0vxsSt7f There’s no better way to pay homage to them & show your support.This is the only official site,pls don’t fall prey to fakes pic.twitter.com/sYruUtzgKY — Akshay Kumar (@akshaykumar) February 16, 2019 -
పుల్వామా దాడి మాస్టర్ మైండ్ హతం
-
‘45 మంది ధైర్యవంతులే.. కర్మకు ఫలితం అనుభవించారు’
గువాహటి : 43 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై యావత్ భారతదేశం ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు కొంతమంది ఆ ఘటనను సమర్థించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జవాన్ల మరణాన్ని ఉటంకిస్తూ రెచ్చగొట్టే విధంగా ఫేస్బుక్ పోస్టు పెట్టిన పాప్రీ బెనర్జీ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పాప్రీ బెనర్జీ గువాహటిలోని ఐకాన్ కామర్స్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పుల్వామా దాడి అనంతరం... ‘నిన్నటి ఘటనలో 45 మంది సాహసవంతులైన యువకులు హత్యకు గురయ్యారు. ఇదేమీ యుద్ధం కాదు. దాడి చేసిన వారిపై ప్రతిదాడి చేసేందుకు వారికి సమయం దొరకలేదు. నిజంగా పిరికి పంద చర్యకు పరాకాష్ట ఈ ఘటన. ఇది ప్రతీ ఒక్క భారతీయుని హృదయాన్ని కకావికలం చేసింది... కానీ... కానీ.. కానీ.. లోయలో భద్రతా బలగాలు చేయని అకృత్యాలు ఉన్నాయా! అక్కడి మహిళలపై మీరు అత్యాచారం చేశారు... వాళ్ల పిల్లల్ని చంపారు... వాళ్ల భర్తలను హతమార్చారు.. మీ మీడియా వారందరినీ తక్కువగా చూపే ప్రయత్నమే చేసింది... అయినంత మాత్రాన ప్రతీకారం ఉండదని భావించారా??? అసలు మీకో విషయం తెలుసా.. ఉగ్రవాదం ఇస్లాంకు చెందినదే కావొచ్చు.. కానీ కర్మ అనేది హిందూ సనాతన ధర్మంలోనిది.. ఇప్పుడు ప్రతిఫలం అనుభవించండి’ అంటూ పిప్రీ ఫేస్బుక్లో రెచ్చగొట్టే కథనాన్ని రాసుకొచ్చారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆదివారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
జవాన్ల కుటుంబాలకు ‘మా’ విరాళం
సాక్షి, హైదరాబాద్: పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ‘మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)’ ముందుకొచ్చింది. తమ వంతు సాయంగా 5 లక్షల రూపాయల విరాళాన్ని ‘మా’ ప్రకటించింది. ఈమేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, జనరల్ సెక్రెటరీ డాక్టర్ వి.కె నరేష్ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జవాన్ల త్యాగం మరువలేనిదని, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమరులైను జవాన్ల కుటుంబాలను ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశారు. అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది కారు బాంబుతో దాడిలో 40 మంది జవాన్లు మృతిచెందారు. అమరులు కుటుంబాలను ఆదుకునేందుక దేశ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. సినీపరిశ్రమ నుంచి కూడా పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. -
‘అప్పటిదాకా కొనసాగుతాయి.. దయచేసి మమ్మల్ని కొట్టకండి’
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడికి కశ్మీరీ ప్రజలు బాధ్యులు కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులపై దాడి జరగడంపై ఆయన స్పందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘దయచేసి మమ్మల్ని కొట్టకండి. ఉగ్రదాడిలో మా ప్రమేయం లేదు. ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదు. మేము గౌరవప్రదమైన జీవితాన్ని కోరుకుంటున్నాం. రెండు పూటలా మా కుటుంబాలకు భోజనం పెట్టడానికి మాత్రమే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసేందుకు సిద్ధపడ్డాము. బంగ్లాలు కట్టడానికి కాదు. భవిష్యత్తు కోసం అక్కడ చదువుకుంటున్నాం. రాజకీయపరంగా కశ్మీర్ అంశం వరకు తేలేవరకు పుల్వామా లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు.(పుల్వామా ఉగ్రదాడి: పైశాచిక ఆనందం) ఓపిక పట్టండి.. పుల్వామా ఉగ్రదాడిలో మన తప్పు లేకున్నా.. మనల్ని నిందిస్తున్న వారి పట్ల సహనం వహించాలని ఫరూక్ కశ్మీరీలకు విఙ్ఞప్తి చేశారు. తమ సొంత ప్రయోజనాల కోసం కొంతమంది అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారి ప్రణాళికలు అమలు కాకుండా ఉండాలంటే ఓపికగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా పుల్వామా ఉగ్రదాడిని సమర్థిస్తూ పోస్టులు పెట్టిన కశ్మీరీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.(వాట్సాప్ పోస్ట్‌తో కశ్మీర్ విద్యార్థినుల అరెస్ట్) -
పుల్వామా ఉగ్రదాడి; మాస్టర్ మైండ్ హతం!
శ్రీనగర్ : పుల్వామాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో భాగంగా పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన జైషే మహ్మద్ టాప్ కమాండర్ రషీద్ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. అతడితో పాటు మరో జైషే ఉగ్రవాదిని కమ్రాన్‌ను కూడా భారత బలగాలు హతమార్చాయి. సోమవారం నాడు తమపై అటాక్ చేసిన ఆ ఇద్దరితో పాటు మరొక ఉగ్రవాదిని సైన్యం కాల్చి చంపినట్లు తెలుస్తోంది. తద్వారా సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే వీరిద్దరిని హతమార్చి దీటైన సమాధానం ఇచ్చింది.(ఉగ్రవాది ఆదిల్‌కు శిక్షణ ఇచ్చింది అతడే!) కాగా 43 మంది జవాన్ల మరణాన్ని మరవక ముందే జైషే ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పుల్వామాలోని పింగ్లన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మేజర్ సహా ముగ్గురు భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ జవాన్లు 55 రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన వారు.(పుల్వామాలో ఎన్కౌంటర్; మేజర్ సహా ముగ్గురు జవాన్ల మృతి) చదవండి : రివేంజ్ తీర్చుకునేందుకు టైమ్, ప్లేస్ డిసైడ్ చేయండి.. ఉగ్ర మారణహోమం పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం -
అందుకే పాక్‌కు చైనా మద్దతు : ‘రా’ మాజీ చీఫ్
సాక్షి, హైదరాబాద్ : పాకిస్తాన్‌తో తమకు ఉన్న క్రిడ్ ప్రోకో ఒప్పందం వల్లే జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చైనా నిరాకరిస్తోందని ‘రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా)’ మాజీ చీఫ్ విక్రమ్‌సూద్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జాతీయ భద్రతకు బాహ్య నిఘా’అనే అంశంపై సెమినార్‌కుఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... పుల్వామా ఉగ్రదాడి ఆదిల్ ఒక్కడి వల్లే సాధ్యం కాలేదని, అతడి వెనుక పెద్ద టీమ్ ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేకే పాకిస్తాన్ ఇలా పరోక్షంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్‌కు.. అంతర్జాతీయ సమాజంలో చైనా ఒక్కటే వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. చైనాలోని జింగ్‌జాంగ్ ప్రావిన్స్‌లో.. పాక్ ఉగ్రవాదులను మోహరించిందని అందుకే చైనా ఆ దేశానికి మద్దతు పలుకుతోందని ఆరోపించారు. ‘ఇదొక క్రిడ్‌ప్రోకో ఒప్పందం. చైనాలో ఉన్న టెర్రరిస్టులు ఆ దేశానికి ఎటువంటి హాని చేయరని పాకిస్తాన్ మాట ఇచ్చింది. కాబట్టి చైనా పాక్‌కు అండగా నిలుస్తోంది’ అని సూద్ వ్యాఖ్యానించారు. ఇక పుల్వామా ఉగ్రదాడిపై భారత్ ఎలా స్పందించబోతోందని భావిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఇదేం బాక్సింగ్ మ్యాచ్ కాదు. పంచ్‌కు బదులు పంచ్ విసరడానికి. ప్రధాని మోదీ చెప్పినట్లుగా అందుకు సరైన సమయం రావాలి’ అని సూద్ పేర్కొన్నారు. కాగా గురువారం నాటి పుల్వామా ఉగ్రదాడిని చైనా ఖండించినప్పటికీ.. ఈ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత వినతిని తోసిపుచ్చింది. జైషే చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని భారత్ దీర్ఘకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. -
పాక్‌పై పంజాకు ఆ మూడు దేశాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌పై ఆసియా దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రమివ్వడంలో మారుపేరుగా మారుతున్న పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించాలని పాక్ సరిహద్దు దేశాలే వ్యూహాలు రచిస్తున్నాయి. పాక్ వల్ల సైనిక, ప్రాణనష్టాలను చవిచూస్తున్న దేశాల్లో ముఖ్యంగా అసియా ఖండంలో భారత్, ఇరాన్, అఫ్ఘానిస్తాన్ దేశాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. సందుదొరకితే చాలు పాక్‌పై బాంబులు వర్షం కురిపించాలన్న డిమాండ్ ఆయా దేశాల ప్రజానికంలో బలంగా వినిపిస్తోంది. ఉగ్రవాదాన్ని అణచివేయాలని భారత్‌తో సహా అనేక దేశాలు అంతర్జాతీయ వేదికలపై అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ఆ విషయాన్ని పాక్ కనీసం పట్టించుకున్న పాపానపోక.. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలకు ఆశ్రయాన్నిస్తూ పొరుగుదేశాల సైనికుల ప్రాణాలను బలిగొంటోంది. పాక్ దురాగతాలకు ఆగ్రహంతో ఉన్న ఈ మూడు దేశాలు( భారత్,ఇరాన్,అఫ్ఘానిస్తాన్) పంజావిప్పితే ఆ దేశం భారీ నష్టాన్ని చవిచూడక తప్పదని ఆయా దేశాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఇటీవల ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్‌కు భవిష్యత్తులో పొరుగు దేశాలతో సమస్యలు తప్పేలా లేవు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్.. యుద్ధం సంభవిస్తే కోలుకోవడం కష్టమేనని నేతలు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మారణకాండకు పుల్వామాలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. 2008లో ముంబయ్‌పైన పాకిస్తాన్ ముష్కరులు దాడి చేసినప్పటి నుంచీ మొన్న పుల్వామా దాడి వరకూ ఇదే వరుస. జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ భవనంపైన 2001లో పేలుడు పదార్థాలు కలిగిన ట్రక్కుతో దాడి జరిపిందీ, పఠాన్‌కోట, నాగ్రోతా, ఉడిలోని సైనిక స్థావరాలపైన దాడులు చేసింది కూడా పాకిస్తానీయులే. పుల్వామా దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. పాక్‌పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతావని డిమాండ్ చేస్తోంది. డ్రాగాన్ అండతో రెచ్చిపోతున్న పాక్‌పై భారత్ మాత్రమే కాక ఇరాన్, అఫ్ఘానిస్తాన్ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. దాయాది దేశ దుశ్చర్యకు రక్తందారపోసిన జావన్ల కుటుంబాలు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్‌కు హెచ్చరికాలు పంపారు. పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పదు.. తమ దేశంలో ఆత్మాహుతి దాడితో 27 మంది భద్రతా సిబ్బంది మృతికి కారణమైన పాకిస్తాన్‌పై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. పాక్–ఇరాన్ సరిహద్దుల్లోని సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఇటీవల సైనికులతో వెళ్తున్న బస్సును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చడంతో అందులోని 27 మంది మృతి చెందారు. ‘ఇప్పటిదాకా ఉపేక్షించాం. ఇకపై ధీటుగా బదులిస్తాం. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పద’ని ఇరాన్ సైనిక దళాల(రివల్యూషనరీ గార్డ్స్) కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫారీ పాక్‌కు భారీ హెచ్చరికలు జారీచేశారు. ఉగ్రవాద పోరులు భారీగా సైనిక నష్టం చవిచూసిన అఫ్ఘానిస్తాన్ కూడా పాక్‌పై గుర్రుగా ఉంది. ఉగ్రవాదుల చర్యల కారణంగా ఆ దేశం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అఫ్ఘానిస్తాన్ సమస్య పరిష్కారానికి గతంలో మాస్కోలో రష్యా, చైనా, పాకిస్తాన్ ప్రతి నిధుల మధ్య చర్చలు కూడా జరిపారు. మన్మోహన్సింగ్, నరేంద్రమోదీ అఫ్ఘానిస్తాన్‌ను సందర్శించి, అఫ్ఘాన్ సైనికులకు ఇండియాలో శిక్షణ ఇచ్చి, ఆర్థిక సహాయం చేసి, కాబూల్‌లో పార్లమెంటు భవన నిర్మాణం చేపట్టి కొంత తొడ్పాటును కూడా అందించారు. అయినా కూడా సమస్య మాత్రం పరిష్కారం లభించలేదు. జైషే మహమ్మద్, లష్కరే తొయిబాలు రెండు అఫ్ఘాన్ సంక్షోభం సృష్టించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే. పాకిస్తాన్‌పై వెంటనే యుద్ధాన్ని ప్రకటించాలి.. పాకిస్తాన్‌తో పోరుకు బలోచిస్తాన్ కూడా మద్దతుగా నిలిచింది. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ ఘటనకు కారకులైన దోషులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని సూచించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌పై వెంటనే యుద్ధాన్ని ప్రకటించాలని బీఎన్సీ అధ్యక్షుడు వహీద్ బలోచ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భారత్ వెంటనే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకోవాలని కోరింది. అమాయకులను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. -
మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
శ్రీనగర్ : ఉగ్రదాడితో ఆందోళనకరంగా మారిన దక్షిణ కశ్మీర్లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. 43 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని పింగ్లన్ ప్రాంతంలో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో వారిని మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో మేజర్ సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. వీరంతా 55 రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన వారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిని ఢీకొట్టి 43 మంది జవాన్ల మృతికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్రవాదులు రోజుకో రకంగా దాడులు కొనసాగిస్తున్నారు. శనివారం రాజౌరీ జిల్లాలో వారు అమర్చిన ల్యాండ్‌మైన్ నిర్వీర్యం చేసే క్రమంలో ఆర్మీ అధికారి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజా ఘటనలో మేజర్ సహా ముగ్గురు జవాన్లు మృతి చెందడంతో యావత్ భారతావని ఆగ్రహంతో రగిలిపోతోంది. Visuals: The 4 Army personnel including a Major, who were killed in action during encounter between terrorists and security forces, in Pinglan area of Pulwama district, belonged to 55 Rashtriya Rifles. #JammuAndKashmir (Visuals deferred by unspecified time) pic.twitter.com/Wa2sxz3bzT — ANI (@ANI) February 18, 2019 -
సైన్యంలో చేరతా అమర జవాన్ భార్య
కుమారుడు దేశసేవలో ఉన్నాడని గర్వించే తల్లిదండ్రులు, భర్త రాక కోసం మధురానుభూతులతో నిరీక్షించే సతీమణి గుండెల్లో ఇప్పుడు అంతులేని విషాదం తాండవిస్తోంది. కొద్దిరోజుల కిందటివరకు తమ మధ్యనే ఉన్న ఆత్మీయుడు మంచుకొండల నడుమ నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగురోజుల నుంచి అన్నపానీయాలు లేక విలపిస్తూ మంచం పట్టారు. మండ్య: ‘నా భర్త స్వప్నాన్ని ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. ఆయన కలను నెరవేర్చడానికి నేను సైన్యంలో చేరడానికి సిద్ధం. దేశ సేవ చేస్తా’ అని అమరవీరుడు గురు సతీమణి కళావతి ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాను గురు (33) స్మృతులను తలుచుకొని తల్లిదండ్రులు, భార్య ఇప్పటికీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన సమయంలో గురు తమతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని పదేపదే ఆవేదన చెందుతున్నారు. 14వ తేదీన మరణవార్త తెలిసిననాటి నుంచి తిండీ నిద్రకు దూరమై గురును స్మరిస్తున్నారు. పాకిస్థాన్‌ను నాశనం చేయాలి: తండ్రి హన్నయ్య గురు తండ్రి హన్నయ్య మాట్లాడుతూ.. గురు తన కుమారుడని చెప్పుకోవడానికి తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. గురుతో పాటు ఎంతోమంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌ను సర్వనాశనం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనవడిని కూడా భారతసైన్యంలో చేర్పిస్తానని తెలిపారు. గురు భార్య కళావతి మాట్లాడుతూ.. తన భర్త మరో పదేళ్లపాటు సైన్యంలో సేవలు అందించాలని కలలు కనేవారన్నారు. అయితే ఉగ్రవాదులు ఆ కలను సర్వనాశనం చేశారని విలపించారు. భర్త కలను తాను నెరవేర్చుతానని, సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఆవేశంగా చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స నాలుగు రోజులుగా దుఃఖిస్తూ అస్వస్థతకు గురైన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురును కోల్పోవడంతో గుడిగెరె గ్రామంలో కూడా మౌనవాతావరణం నెలకొంది. గురుతో గడిపిన క్షణాలు తలుచుకొని గ్రామస్థులు, స్నేహితులు కన్నీటి పర్యతంమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురు కుటుంబ సభ్యులను ఆదివారం సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రదీప్ పరామర్శించి భారత సైన్యం అందించిన వీరమరణ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గురు అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని సందర్శించారు. పలువురు గురు తండ్రిని కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గురు కుటుంబానికి ఆర్థిక సహాయం పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన గురు కుటుంబ సభ్యులను ఆదివారం ప్రముఖులతో పాటు ప్రజలు సాంవత్వన తెలిపి ఆర్థిక సహాయం అందించారు.గురు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి డీసీ తమ్మణ్ణ కోడలు కవిత సంతోష్ రూ.25 వేల నగదు అందజేశారు. శ్రద్ధాంజలి, పరామర్శలు సరిపోవని, దొంగదెబ్బతో సైనికులను హత్య చేసిన ఉగ్రవాదులను అంతమొందించనపుడే సైనికుల ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆమె అన్నారు. బెల్‌బాటం కన్నడ చిత్రం హీరో హీరోయిన్లు రిషభ్ శెట్టి, హరిప్రియ, డైరెక్టర్ సంతోష్‌కుమార్‌లు గురు కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.75వేల ఆర్థిక సహాయం అందించారు. ఆత్మాహుతికి సిద్ధం ఆత్మాహుతి దాడి చేసి భారత సైనికులను హత్య చేసిన ఉగ్రవాదులు,పాకిస్థాన్ సైనికులపై ప్రతీకారం తీర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అందుకు అదే తరహాలో ఆత్మాహుతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చేతన్ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. సైనికులపై జరిగిన దాడిని జీర్ణించుకోలేకపోతున్నానని శత్రువలపై ప్రతీకారం తీర్చుకోవడానికి మనసు పరితపిస్తోందని వీడియోలో పేర్కొన్నాడు. -
పాక్ డీఎన్ఏలో శాంతి అనేది లేదు
హైదరాబాద్: పాకిస్తాన్ డీఎన్ఏలో శాంతి అనే పదం లేదని కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ ‘రా’ మాజీ అధిపతి విక్రమ్‌సూద్ వ్యాఖ్యానించారు. ఆ దేశంతో శాంతి వచనాలు జరపడం వల్ల ప్రయోజనం లేదని తేల్చిచెప్పారు. కశ్మీర్, పాకిస్తాన్ అంశాలపై భారత్ ఒక జాతీయ విధానం రూపొందించుకోవాలని సూచించారు. ఆదివారం సోమాజిగూడలోని ఆస్కీలో సోషల్‌కాజ్ ఆధ్వర్యంలో ‘జాతీయ భద్రతకు బాహ్య నిఘా’అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్రమ్‌సూద్ మాట్లాడుతూ.. పాకిస్తాన్లో ఎన్ని ప్రభుత్వాలు మారినా భారత్‌తో ప్రచ్ఛన్న యుద్ధం సాగించాలని అక్కడి పాలకులు, రాజకీయ పక్షాలు అన్ని ఒకే విధానంతో ఉన్నారని, కానీ భారత్‌లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సంప్రదాయ యుద్ధంలో గెలవలేమనే, ఇలా పరోక్ష యుద్ధానికి కాలుదువ్వుతోందని ఆరోపించారు. దీన్ని ఎదుర్కొనేందుకు భారత నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఒకే అభిప్రాయానికి రావాలని.. పాక్ పట్ల దృఢ వైఖరి అవలంభించాలని సూచించారు. ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య మాట్లాడుతూ.. మన నిఘా వ్యవస్థలు అనేక పరిమితుల మధ్య పనిచేస్తున్నాయని, వాటికి అవసరమైన వనరులు కూడా సరిగా అందుబాటులో లేవని, కేవలం నివేదికలు సమర్పించడానికే పరిమితం అవుతున్నాయని ఆరోపించారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తరహా వ్యవస్థలను తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం విదేశీ నిఘాపై విక్రమ్‌సూద్ రచించిన ‘ది అన్ఎండింగ్ గేమ్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ కె.రామచంద్రారావు, సోషల్‌కాజ్ అధ్యక్షురాలు డాక్టర్ సోమరాజు సుశీల తదితరులు పాల్గొన్నారు. -
గొంతు చించుకొని అరవాలా: సానియా మీర్జా
సాక్షి, హైదరాబాద్ : తనకు దేశభక్తి ఉందని గొంతు చించుకొని అరవాలా? అని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అసహనం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్‌మాలిక్‌ను పెళ్లి చేసుకున్నందుకు ఆమెకు ఇబ్బందులు తప్పడం లేదు. భారత్-పాక్ మధ్య ఏ వివాదం చెలరేగినా భారత నెటిజన్లు సానియా మీర్జాను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కూడా ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఉగ్రదాడిని ఆలస్యంగా ఖండించినందుకు భారత నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోయారు. అంతే కాకుండా సానియా తన ఫొటో షూట్లను పోస్ట్ చేయడం.. వారి కోపానికి మరింత ఆజ్యం పోసింది. దీంతో నొటికొచ్చినట్లు కామెంట్ చేశారు. చివరకు ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్ట్ చేసినా వదల్లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆమె.. తన దేశభక్తి గురించి సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తూ.. ట్రోలర్స్‌పై మండిపడింది. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో పోస్ట్‌లు పెడితేనే సెలబ్రిటీలకు దేశభక్తి ఉందని భావించే వాళ్ల కోసమే ఈ పోస్ట్ పెడుతున్నా. మేం సెలబ్రిటీలం కాబట్టి.. కొందరు వ్యక్తులు మాపై పనిగట్టుకొని విద్వేషాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం వారే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని గొంతు చించుకొని అరవాల్సిన అవసరం మాకు లేదు. ప్రతీ ఒక్కరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తారు. నేను నా దేశం కోసం ఆడుతాను, అందుకోసం నా చమట చిందిస్తాను. అలా నేను నా దేశానికి సేవ చేస్తున్నాను. సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు నేను అండగా నిలబడతాను. వాళ్లు ఈ దేశాన్ని కాపాడే నిజమైన హీరోలు. ఫిబ్రవరీ 14 మన దేశానికి బ్లాక్ డే. ఇలాంటి రోజు మరొకటి చూడొద్దని కోరుకుంటున్నా. ఈ రోజుని, జరిగిన ఘటనని అంత సులువుగా మర్చిపోలేము. కానీ ఇప్పటికీ ద్వేషం కంటే నేను శాంతిని కోరుకుంటున్నా. ఏదైన ఉపయోకరమైన విషయం జరగడం కోసం ఆగ్రహిస్తే.. అది మంచిది. ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలో స్థానం లేదు.. ఉండదు కూడా. మీరు కూడా ఇంట్లో కూర్చొని సెలబ్రిటీలు ఎన్ని పోస్ట్‌లు చేశారు, ఏం పోస్ట్ చేశారో.. అని తీర్మానించడం మానేసి దేశానికి ఉపయోగేపడే పని చేయండి. దేశానికి మీ వొంతు సహాయం అందించండి.. మేం చేస్తున్నాం.. కానీ సోషల్‌మీడియాలో ప్రకటిస్తూ కాదు. అది సరైన పని’ అంటూ తన అసహనాన్ని వెల్లగక్కింది. We stand united 🕯 #PulwamaAttack pic.twitter.com/Cmeij5X1On — Sania Mirza (@MirzaSania) February 17, 2019 పాకిస్థాన్ పందిని చేసుకున్నావ్ ఇప్పుడి నీ దేశీయులు నా దేశం పై దాడి చేశారు.దాని పై స్పందించకుండా నీ ఫోటో షూట్ లు ఏంది — Sainath (@Sainath27209909) February 15, 2019 -
పాక్ జెండా.. బెస్ట్ టాయిలెట్ పేపరంట!
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యుత్తమ టాయిలెట్ పేపర్ పాకిస్తాన్ జాతీయ జెండానేనట. అవును గూగులమ్మ ఇదే చెబుతోంది. ‘‘Best toilet paper in the world’ అని టైప్ చేస్తే.. పాకిస్తాన్ జాతీయ పతాకమే కనిపిస్తోంది. ఇంకేముంది.. పుల్వామా ఉగ్రదాడితో ఉడికిపోతున్న మనోళ్లకు మంచి అవకాశం దొరికింది. వెంటనే వాటి స్క్రీన్ షాట్లు తీసి పక్కదేశంపై కుళ్లు జోకులు పేల్చారు. అంతేకాకుండా వాటిని మీరు చూడండని నెట్టింట పెట్టారు. ‘Best toilet paper in the world’ అని టైప్ చేసి.. ఇమేజ్ ఆప్షన్ నొక్కితే పాకిస్తాన్ జాతీయ జెండా వస్తుందని, చూసి ఎంజాయ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఈ విషయం తెలసుకున్న గూగులమ్మ నిర్వాహకులు తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. కానీ నెటిజన్స్ సేవ్ చేసిన స్క్రీన్ షాట్లు మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. #Besttoiletpaperintheworld trending this is. But, pakistan deserves worst than this!They deserve to be rolled in red Hot chillies, And then Fried In hot Burning, Boiling oil! They deserve to be cut down From their hands, legs and tongue and then thrown on d streets for survival. pic.twitter.com/euWnVUYkAY — Gauri Joshi (@GauriJo43735050) February 17, 2019 #besttoiletpaperintheworld #on #google #PulwamaTerrorAttack #weallarereadytoattack #IndiaUnited #BLACK DAY FOR INDIA 🇮🇳#phulwamaattack #PulwamaRevenge #India #RIPBraveRealHero #WantRevengeOnBloodyPakistan pic.twitter.com/vYIY08wBCg — kundan singh rajput (@IamkundanRajput) February 16, 2019 -
మార్చి 8న పెళ్లి ఇంతలోనే ..
న్యూఢిల్లీ : మరో నెలరోజుల్లో పెళ్లి ఉందనగా.. ఓ ఆర్మీ మేజర్ ప్రమాదవశాత్తు ల్యాండ్‌మైన్ పేలి ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి పనులతో బిజీగా ఉన్న ఆ మేజర్ తండ్రి కుమారుడి మరణ వార్త విని కుప్పకూలిపోయారు. ఉగ్రదాడి జరిగిన రెండు రోజులకే చోటుచేసుకున్న ఈ ఘటన మరింత విషాదాన్ని నింపింది. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ సమీపంలోని రాజౌరీ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. బాంబు నిర్వీర్యం బృందాన్ని లీడ్ చేసే ఆర్మీ మేజర్ చిత్రేష్ సింగ్ బిష్త్.. ల్యాండ్‌మైన్‌ను డిఫ్యూజ్ చేయబోయే ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరఖాండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన 31 ఏళ్ల మేజర్‌కు మార్చి 8న వివాహం జరగాల్సింది. ఈ ఏర్పాట్లలో మునిగిపోయిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన ఆయన తండ్రి.. కొడుకు మరణ వార్త విని కుప్పకూలిపోయారు. నౌషరా సెక్టరాల్‌లో శనివారం మూడు ల్యాండ్స్‌మైన్స్‌ను భద్రతా బలగాలు గుర్తించగా.. వాటిని తొలిగించేందుకు మేజర్ చిత్రేష్ బృందం అక్కడికి వచ్చిందని, ఒకటి విజయవంతంగా తొలిగించిందని, రెండోదాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ప్రమాదావశాత్తు పేలిందని ఓ ఢిఫెన్స్ అధికారి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మేజర్ చిత్రేష్ సింగ్ తీవ్రంగా గాయపడి వీరమరణం పొందారని తెలిపారు. ఇక మేజర్ చిత్రేష్ మరణ వార్త తెలుసుకున్న ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ట్విటర్ వేదికగా నివాళులర్పించారు. -
ఉగ్రదాడి.. పాక్ క్రికెట్‌కు గట్టిషాక్!
న్యూఢిల్లీ : పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డ్ పీసీబీకి భారత ఛానెల్ డీస్పోర్ట్స్ గట్టిషాక్ ఇచ్చింది. సరిగ్గా దాడి జరిగిన (ఫిబ్రవరి 14) రోజే ప్రారంభమైన పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ప్రత్యక్షప్రసారాన్ని నిషేధించింది. (చదవండి: వారు చితక్కొట్టడంతోనే నా కొడుకు ఉగ్రవాదయ్యాడు) ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందగా.. 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల యావత్ భారత్ ఉడికిపోతుంది. ప్రతీకార దాడి జరగాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా.. ఉగ్రదాడిలో అసువులు బాసిన వీరజవాన్లకు భారత ప్రజలు నివాళులర్పిస్తున్నారు. తోచిన విరాళాలు ఇస్తూ వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈ ఉగ్ర దాడితో దేశమంతా విషాదంలో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పాక్ క్రికెట్ మ్యాచ్‌లు భారత్‌లో ప్రసారం కావడం భావ్యం కాదని భావించిన డీస్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారాన్ని పూర్తిగా నిషేధించింది. వాస్తవానికి లీగ్ రెండో రోజే సాంకేతిక లోపంతో ప్రసారం నిలిచిపోయినప్పటికి.. అధికారికంగా మాత్రం లీగ్ 5వ గేమ్ నుంచి నిలిపేసినట్లు ఛానెల్ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: అమర జవాన్లకు సెల్యూట్) మరోవైపు ఈ ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తొలగించింది. బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ‘ఆల్ రౌండర్’ విభాగంలో ఇమ్రాన్ ఖాన్ ఫొటోను, క్రికెట్ జట్టు విభాగంలో పాకిస్తాన్ ఫొటోలను అక్కడ ఉంచారు. ఆ టీమ్‌లో ఇమ్రాన్ కూడా ఉండటంతో ఈ ఫొటోలను అక్కడ నుంచి తీసేశారు. భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మేనేజింగ్ కమిటీ సీనియర్ ఒకరు తెలిపారు. (చదవండి : ఆ జవాన్ల పిల్లలను నేను చదివిస్తా) -
వాట్సాప్ పోస్ట్‌తో కశ్మీర్ విద్యార్థినుల అరెస్ట్
జైపూర్ : పుల్వామా ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నలుగురు జమ్మూ కశ్మీర్ విద్యార్థినులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైపూర్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్న ఈ నలుగురు విద్యార్థినులను వర్సిటీ సైతం సస్పెండ్ చేసింది. వాట్సాప్‌లో దేశ వ్యతిరేక సందేశాన్ని షేర్ చేసినందుకు వారిని సస్పెండ్ చేసిన యూనివర్సిటీ అధికారులు అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. విద్యార్థినుల చర్యను తీవ్రంగా ఖండించిన నిమ్స్ యూనివర్సిటీ ఈ తరహా కార్యకలాపాలను వర్సిటీ సహించదని, వీరిని కాలేజ్‌తో పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేశామని వెల్లడించింది. విద్యార్థినులను తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్ర నజీర్, ఉజ్మా నజీర్‌గా గుర్తించారు. పుల్వామా దాడిపై వారు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతీకారం తీర్చుకున్నామని వాట్సాప్‌లో పేర్కొన్నారు. పుల్వామా దాడి తమ ప్రతీకారానికి దీటైన సమాధానం అంటూ విద్యార్థినుల్లో ఒకరైన తల్వీన్ తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై వర్సిటీలో నిరసనలు వెల్లువెత్తాయి. కాగా, జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
వేర్పాటు నేతలకు భద్రత ఉపసంహరణ
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని ఐదుగురు వేర్పాటువాద నేతలకు భద్రతను ఉపసంహరిస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. వేర్పాటువాద నేతలు మిర్వాజ్ ఉమర్ ఫరూఖ్, అబ్ధుల్ ఘనీ భట్, బిలాల్ లోన్, హషీం ఖురేషీ, షబీర్ షాలకు భద్రతను ఉపసంహరించినట్టు ప్రభుత్వం పేర్కొంది కాగా ఈ జాబితాలో పాక్ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్ అలి షా గిలానీ పేరు లేకపోవడం గమనార్హం. వేర్పాటువాద నేతలకు కల్పించిన అన్ని భద్రతా వాహనాలు, సిబ్బందిని సాయంత్రానికి వెనక్కితీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వీరికి ప్రభుత్వం సమకూర్చిన ఇతర సౌకర్యాలనూ తక్షణం ఉపసంహరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఇతర వేర్పాటువాద నేతలకూ భద్రత ఉపసంహరణపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
జవాన్ అంతిమయాత్రలో ఎంపీ అభ్యంతరకర ప్రవర్తన
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ అజిత్ కుమార్ అంతిమ యాత్ర సందర్భంగా బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఉగ్రవాదుల దాడిలో నేలకొరిగిన అజిత్ కుమార్‌కు కడసారి నివాళులు అర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నావ్‌కు తరలిరాగా జవాన్ భౌతికకాయం ఉంచిన వాహనంపై స్ధానిక ఎంపీ సాక్షి మహరాజ్ వారందరికీ నవ్వుతూ అభివాదం తెలపడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఎండగట్టారు. కాగా, జవాన్ అంతిమయాత్రలో సాక్షి మహరాజ్ అభ్యంతరకర ప్రవర్తనతో కూడిన వీడియో, ఫోటోలను మరికొందరు పోస్ట్ చేశారు. బీజేపీ ఎంపీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎంపీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. సాక్షి మహరాజ్ జవాన్ అంతిమ యాత్రను అభినందన యాత్రగా పీలవుతున్నారని ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్ర సంధించగా, బీజేపీ ఎంపీ చర్య సిగ్గుచేటని మరో యూజర్ మండిపడ్డారు. -
జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ విరాళం
సాక్షి, హైదరాబాద్: పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి అర్పించారు. జవాన్ల మరణం తనను ఎంతో కలచివేసిందని, ప్రజలను కాపాడే కర్తవ్యంలో మరణించిన వారికి తమ రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున నివాళి అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతికి వ్యక్తం చేస్తూ.. తన వ్యక్తిగతంగా రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బంజారాహీల్స్‌లోని సీఆర్పీఎఫ్ సధరన్ హెడ్ క్వార్టర్స్‌లో ఐజీపీ రాజుకు చెక్కును అందచేశారు. తన స్నేహితులు మరో 25 లక్షలు ఇచ్చారని, మొత్తం 50 లక్షల రూపాయలను అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా కేటీఆర్ చెల్లించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా తాను ఇక్కడికి రాలేదని సాధారణ భారత పౌరుడిగా మాత్రమే వచ్చినట్లు తెలిపారు. భద్రతా బలగాల సేవల వల్లనే దేశ ప్రజలంతా క్షేమంగా ఉంటున్నారని, వారి త్యాగాలను ఎన్నటికీ మరువలేవని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో అసువులుబాసిన జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. దాడిలో గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
విధ్వంసకర వీబీఐఈడీ
వెహికల్ బార్న్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (వీబీఐఈడీ) అంటే వాహనాలతో ఐఈడీ దాడు లని అర్థం. ఇది ఇప్పుడు కశ్మీర్లో గస్తీ కాస్తున్న భద్రతాదళాలను అప్రమత్తం చేసింది. ఒక్కొక్కరుగా కశ్మీర్లో పనిచేస్తున్న ఉగ్ర సంస్థల ముఖ్యనాయకులను ఏరిపారేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉగ్రమూకలు సాంకేతిక పద్ధతిలో భారత సైన్యంపై దాడులకు వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగానే వీబీఐఈడీలతో దాడులు ఈ విషయంపై మిలటరీ ఇంటెలిజెన్స్ గతంలో హెచ్చరించింది. ఇలాంటి పేలుడు పదార్థాలతో కూడిన వాహనాలను రూపొందించడం తేలిక కాదు. అందుకే అలాంటి నిపుణులు దొరికినప్పుడే ఉగ్రవాదులు నాలుగైదు వాహనాలను సిద్ధం చేసుకుని ఉంచుతున్నారు. సమస్యాత్మక ప్రాం తాల్లో, యుద్ధ జోన్లలో భారీ విధ్వంసం సృష్టించడానికి టెర్రరిస్టులు ఇలా కారు బాంబుల్ని వినియోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు.‘ఇలాంటి దాడుల్లో పేలుడు పదార్థాల ద్వారా జరిగే విధ్వంసంతో పాటు.. ఆ వాహన భాగాలు తునాతునకలవడం వల్ల కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇక కారులో ఉండే పెట్రోల్, డీజిల్ వంటివి ఇంధనాలు పేలుడు తీవ్రతను మరిన్ని రెట్లు పెంచుతాయి’అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపద నుంచి బయటపడలేమా? అందుకే పోలీసులు ఆర్డీఎక్స్, ప్రాణహాని తలపెట్టే రసాయనాలు అధిక మొత్తంలో ఎక్కడైనా అమ్ముడవుతున్నట్లు తెలిస్తే అప్రమతమై నిఘా పెంచి ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు వీలుంటుంది. సున్నితమైన ప్రాంతాల్లో బాంబు డిస్పో జింగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించడం.. అనుమానిత ప్రాంతాల్లో వాహనాల కదలికలను జాగ్రత్తగా గమనించడం ద్వారా వీబీఐఈడీలను గుర్తించేందుకు వీలుంటుంది. వీబీఐఈడీ దాడులు జరపడానికి ఒక్కసారి ఆ వాహనం కదిలిందంటే చాలు.. దానిని నియంత్రించడం చాలా కష్టసా«ధ్యమైన విషయం. భద్రతా దళాలు వాటిని ఆపడానికి ప్రయత్నించినా అవి పేలిపోయే ప్రమాదం ఉంది. ఒక పరిమితికి మించి కారు స్పీడు పెంచినా, తగ్గించినా అవి పేలిపోతాయి. అంతేకాదు డ్రైవర్ డోర్ ఓపెన్ చేసినా, ఇగ్నిషన్ కీ ఆన్/ఆఫ్ చేసినా వాహనం పేలిపోతుంది. అందుకే సెక్యూరిటీ పికెట్స్ వద్ద వాహనాల చెకింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరాక్, అఫ్గానిస్తాన్ వంటి దేశాల్లో కారు బాంబు దాడులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు కశ్మీర్లో కూడా అలాంటి దాడులు మొదలవడం దడ పుట్టిస్తోంది. ‘కపిల్ శర్మ షో’ నుంచి సిద్దూ ఔట్! ముంబై: సోనీ టీవీలో ప్రజాదరణ పొందిన ‘కపిల్ శర్మ షో’నుంచి మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్దూ ఉద్వాసనకు గురయ్యారు. 40 మంది సీఆర్పీఎఫ్ ప్రాణాలు బలి గొన్న పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ పాత్ర లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగడంతో ‘సోనీ’ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. కమెడియన్ కపిల్ శర్మ షోలో కొన్నేళ్లుగా సిద్దూ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. పుల్వామా దాడి ఘటనపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు వ్యక్తులు చేసిన పనికి మొత్తం ఆ దేశానికే ఆపాదిస్తారా? ఉగ్ర వాదుల పిరికి చర్యలపై దేశాలను బాధ్యులుగా చేయడం తగదు’ అంటూ వ్యాఖ్యానించారు. పుల్వామా దాడిలో పాక్ హస్తం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతుండగా ఆయన ఆ దేశాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో ఆయన్ను కపిల్‌శర్మ షో నుంచి తప్పిస్తున్నట్లు సోనీ టీవీ తెలిపింది. వీబీఐఈడీ ఎలా పేలుతుంది? ► డ్రైవింగ్ సీటులో కూర్చున్న ఆత్మాహుతి బాంబర్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుని సైడ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే పేలిపోతుంది. ► యాక్సిలరేటర్ రైజ్ చేయడం లేదంటే స్లోచేయడం ద్వారా కూడా ఈ బాంబులను పేల్చవచ్చు. ► ఇగ్నీషన్ కీ ఆన్, ఆఫ్‌ల ద్వారా కూడా పేలుడు జరిగేలా చేయొచ్చు. ► ఇక ఏదైనా ప్రాంతంలో పార్క్ చేసి ఉంచిన కారుని టైమర్ ద్వారా పేల్చేందుకు వీలుంటుంది. ► పేలుడు పదార్థాలను కార్లో ఎక్కడ పెడతారు? ► తక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలైతే ముందు సీటులో అమరుస్తారు. ► భారీ పేలుడు పదార్థాలను వినియోగించాల్సి వస్తే డిక్కీలో పెడతారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అమర జవాన్లకు సెల్యూట్
న్యూఢిల్లీ/లక్నో/జైపూర్: ఉద్వేగం ఉప్పొంగింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. మాతృ దేశ సేవలో నేలకొరిగిన అమర జవాన్లకు తుది వీడ్కోలు పలికేందుకు దేశమంతా కదిలొచ్చింది. మేమున్నామంటూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచింది. పుల్వామా దాడిలో అసువులు బాసిన ధీశాలుల అంత్యక్రియలు శనివారం దేశవ్యాప్తంగా వారివారి స్వస్థలాల్లో అధికార లాంఛనాలతో జరిగాయి. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తమ వారి పట్ల గర్వం ఓ వైపు, తమలో ఒకరు ఇక లేరని వేదన మరోవైపు. ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ..ఒక్కో వ్యథ. ఇంతటి విషాద సమయంలో జాతి అంతా ఒక్కటై ముష్కరుల కుట్రకు బలైన భరతమాత ముద్దు బిడ్డల సేవలను శ్లాఘిస్తూ ఘనంగా నివాళులర్పించింది. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించింది. చాలా ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాల్ని మూసేశారు. తమ గ్రామానికి చేరుకున్న అమర జవాన్ల భౌతికకాయాల్ని కడసారి చూసేందుకు ప్రజలు వీధుల్లో రోడ్లకు ఇరు వైపులా నిలబడ్డారు. పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీ నుంచి తమ స్వరాష్ట్రాలకు వెళ్లి అక్కడి మంత్రులతో కలసి వీర జవాన్ల అంతిమ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం కప్పిన జవాన్ల భౌతిక కాయాలను ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు సమీపంలోని విమానాశ్రయాలకు తరలించి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వారివారి స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి చితికి నిప్పంటించగా, రాజస్తాన్‌లో రెండు నెలల పసిగుడ్డుతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించడం కంటతడిపెట్టించింది. రాజస్తాన్‌లో... రోషితాష్ లాంబా(జైపూర్), నారాయణ్‌లాల్ గుర్జార్(రాజసమంద్), జీత్‌రామ్(భరత్పూర్), భగీరథ్‌సింగ్(ధోల్పూర్), హేమరాజ్ మీనా(కోట)ల అంతిమయాత్రలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’, ‘భారత్ మాతాకీ జై’నినాదాలు మిన్నంటాయి. ఉత్తరాఖండ్‌లో.. ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని మహ్మద్‌పూర్ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి వీరేంద్రసింగ్ చితికి నిప్పు పెట్టిన దృశ్యం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ సహచరుడికి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. ఇక డెహ్రాడూన్‌లో జరిగిన మోహన్‌లాల్ అంత్యక్రియలకు అశేష జనం హాజరయ్యారు. పంజాబ్‌లో.. మోగా జిల్లాలోని గలౌటీ కుర్ద్ గ్రామంలో అమర జవాను జైమల్ సింగ్ మృతదేహానికి ఐదేళ్ల ఆయన కొడుకు గురుప్రకాశ్ నిప్పు అంటించాడు. గురుదాస్‌పూర్‌లో మణిందర్ సింగ్ భౌతికకాయానికి ఆయన తమ్ముడు, సీఆర్పీఎఫ్ జవాన్ అయిన లక్వీర్ సింగ్ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇక రూప్‌నగర్‌లో 26 ఏళ్ల కుల్వీందర్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల్వీందర్ సింగ్ భౌతికకాయాన్ని చూసి ఆయనకు కాబోయే భార్య సొమ్మసిల్లిపడిపోవడం అక్కడున్న వారిని కలచివేసింది. ఒడిశాలో.. పుల్వామా దాడిలో మరణించిన తమ రాష్ట్రానికి చెందిన అమర జవాన్లకు విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన ప్రసన్నకుమార్ సాహూ, కటక్‌కు చెందిన మనోజ్కుమార్ల భౌతికకాయాలను స్వీకరించేందుకు భువనేశ్వర్ విమానాశ్రయానికి వేలాది మంది తరలివచ్చారు. మహారాష్ట్రలో.. అమర జవాన్లు నితిన్ శివాజీ రాథోడ్(36), సంజయ్ సింగ్ దీక్షిత్(47)ల భౌతికకాయాలను శనివారం ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామాలకు పంపించారు. తమిళనాడులో.. అమర జవాన్లు జి.సుబ్రమణ్యం, సి.శివచంద్రన్ భౌతికకాయాలకు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్ నివాళులర్పించారు. కర్ణాటకలో.. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న అమర జవాన్ 33 ఏళ్ల హెచ్. గురు భౌతికకాయానికి ముఖ్యమంత్రి కుమారస్వామి నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్‌లో.. కానౌజ్ జిల్లాలో అమర జవాన్ ప్రదీప్ సింగ్ యాదవ్ అంత్యక్రియల సందర్భంగా ఆయన పదేళ్ల కూతురు సుప్రియ సొమ్మసిల్లింది. ఆయన రెండో కూతురు రెండున్నరేళ్ల చిన్నారిది అక్కడేం జరుగుతోందో అర్థం చేసుకోలేని పరిస్థితి. రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్, ఆగ్రా, మేన్పురి, ఉన్నావ్, కాన్పూర్, దెహాట్, చందౌళి జిల్లాల్లోనూ అమర జవాన్ల అంత్యక్రియల్లో ఇలాంటి గంభీర వాతావరణమే కనిపించింది. మాతృదేశ సేవలో నేలకొరిగిన సైనికుల సాహసాలను కీర్తిస్తూ వేలాది మంది ప్రజలు నినాదాలు చేశారు. పుల్వామా దాడికి కారకులను శిక్షించాలని అంత్యక్రియలకు హాజరైన మంత్రులు, అధికారుల్ని డిమాండ్ చేశారు. దియోరియా జిల్లాలో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తేనే తన భర్త విజయ్ మౌర్య అంత్యక్రియలకు అంగీకరిస్తానని ఆయన భార్య విజయ్ లక్ష్మి పట్టుపట్టారు. మంత్రి అనుపమా జైస్వాల్, ఇతర నాయకులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చందౌళిలో అవధేశ్ యాదవ్ అంత్యక్రియలు గంగా నదీ తీరంలో నిర్వహించారు. మహరాజ్‌గంజ్‌లోని ఓ పాఠశాలకు అమర జవాను పంకజ్ త్రిపాఠి పేరు పెడతామని కేంద్ర మంత్రి శివప్రతాప్ శుక్లా ప్రకటించారు. తుదిహార్లో మహేశ్ యాదవ్ భౌతికకాయం వద్ద రోదిస్తున్న బంధువు.. కర్ణాటకలోని దొడ్డి గ్రామంలో విలపిస్తున్న హెచ్ గురు కుటుంబసభ్యులు ఆగ్రాలో కుశల్‌కుమార్ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యుల రోదన.. కోల్‌కతాలో సుదీప్బిశ్వాస్ భౌతికకాయం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు -
పాక్‌ను దెబ్బకొట్టేదెలా?
పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేందుకు భారత్ వీలున్నన్ని దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చైనా మినహా దాదాపు అన్ని ప్రధాన దేశాలు భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే దౌత్యపరమైన దెబ్బ కొడితే.. దీని ప్రభావం ఉన్మాదపు పాక్‌పై కనిపించేందుకు సమయం పడుతుంది. కానీ 40 మంది సహచరుల ప్రాణాలను తీసిన పాక్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భద్రతాదళాల రక్తం మరుగుతోంది. కశ్మీర్లో జరిగే ప్రతీ దాడి వెనుక పాక్ హస్తం ఉంటోందని.. స్పష్టమైన ఆధారాలు లభించాక కూడా ఇంకా చేతులు ముడుచుకుని కూర్చోవాలా? అంటూ బలగాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఎన్నేళ్లు ఉన్మాద పొరుగుదేశం ఆగడాలను సహించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనిపట్టడానికి సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడంతో మిలటరీ తన ముందున్న మార్గాలను విస్తృతంగా పరిశీలిస్తోంది. యుద్ధ విమానాల మోహరింపు పాక్‌పై చర్యలకు అన్నిరకాల దౌత్య మార్గాలను పరిశీలిస్తూనే.. అవసరమైతే దాడి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే.. ఇప్పటికే సరిహద్దుల్లో 150 యుద్ధ విమానాలను మోహరించింది. భారత్ వాయుసేన సత్తా చాటేలా.. వాయుశక్తి విన్యాసాలు చేయాలని కొద్ది నెలల క్రితమే భారత్ భావించింది. ఇందుకోసమే జాగ్వార్ ఫైటర్ విమానాలు, మిరాజ్–2000 విమానాలను, మల్టీ–రోల్ జెట్స్‌ను మోహరించింది. విన్యాసాల కోసం మోహరించిన ఈ యుద్ధ విమానాలతోనే ఇపుడు పాక్‌పై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. అప్రమత్తమైన పాక్.. టెర్రరిస్టులు వెనక్కి పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించకుండా కఠినమైన చర్యల్ని తీసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తూ ఉండటంతో పాక్ అప్రమత్తమైంది. కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల్ని వెనక్కి రప్పిస్తోంది. ఎన్నో ఉగ్రవాద శిబిరాలను మూసివేస్తోంది. ప్రతీకార దాడుల కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో ఉగ్రవాద స్థావరాలే భారత్ మొదటి టార్గెట్ అని గుర్తించిన పాక్ సరిహద్దులను ఖాళీ చేస్తోంది. మిలటరీ ముందున్న మార్గాలివే! ► పాక్ భూభాగంలోకి ప్రవేశించకుండానే అత్యాధునిక యుద్ధ విమానాలతో పాక్ దిమ్మ తిరిగేలా దాడులకు దిగడం. సూటిగా పయనించే గైడెడ్ బాంబులు, క్షిపణులు అమర్చిన సుఖోయ్–30 ఎంకేఐ, మిరాజ్–2000, జాగ్వార్ ఫైటర్ విమానాలను ప్రయోగించి ఉగ్రవాదుల కీలక స్థావరాలను ధ్వంసం చేయడం. ఇప్పటికే సైనిక విన్యాసాల కోసం సరిహద్దుల్లో విమానాలు మోహరించి ఉండటంతో ఈ దాడుల్ని చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు. ► భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలకు కారణం.. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీవోజేకే). ఆ ప్రాం తంలో నిర్దేశిత లక్ష్యాలపై వైమానిక దాడులు లేదంటే బ్రహ్మోస్ క్షిపణితో దాడికి పాల్పడటం. ► సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి నెలరోజులకు పైగా నిర్విరామంగా కాల్పులకు దిగడం. వాస్తవాధీన రేఖ వెంట భింబెర్ గలీ వంటి ప్రాంతాల నుం చి ఇలాంటి కాల్పులు జరిపితే భారతీయ సైనికులకు భద్రంగా ఉంటుంది. భారత ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సైన్యాన్ని మోహరించింది. ► 2016లో ఉడీలో సైనిక శిబిరంపై దాడి చేశాక పీవోజేకేలోని ఉగ్రవాద శిబిరాలపై ప్రత్యేక బలగాలు మెరుపు దాడులకు పాల్పడినట్లుగా.. మరోసారి సర్జికల్ స్ట్రైక్‌తో ఉగ్రస్థావరాలపై దాడులకు పాల్పడటం. అయితే.. సర్జికల్ స్ట్రైక్స్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో చేసిన ఈ తరహా దాడుల వల్ల పాక్‌కు బుద్ధి రాకపోగా.. వరుసగా దాడులకు పాల్పడుతోంది. అందుకే పాక్ మిలటరీపైనే నేరుగా దాడులు చేసి ఉగ్రవాదుల్ని ప్రేరేపించకుండా కట్టడి చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ► వాస్తవాధీన రేఖ చొరబాట్ల్లకు క్షేమం కాదని ఉగ్రవాద సంస్థలు గుర్తించేలా విస్తృత స్థాయిలో దాడులు జరపడం. ► పూంచ్, ఉడీ పట్టణాలను కలిపే కీలకమైన హజీపీర్ మార్గం ద్వారా చొరబాట్లు అత్యధికంగా ఉంటున్నాయి. 1965 పాక్ యుద్ధం తర్వాత జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్ తన దళాన్ని అక్కడ్నుంచి ఉపసంహరించింది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని పాక్ ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపిస్తోంది. ఆ ప్రాంతంలో మళ్లీ సైన్యాన్ని మోహరించి చొరబాట్లను అణచివేయడం. ► పాక్ సైనిక, ఉగ్రవాద శిబిరాలు, ఇతర కీలక స్థావరాలను నాశనం చేయడానికి 90 కిలోమీటర్ల రేంజ్లో సమర్థవంతంగా పనిచేసే స్మెర్చ్ (బీఎం–30) రాకెట్ల వ్యవస్థలు, 290 కిలోమీటర్ల రేంజ్లో పనిచేసే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను యుద్ధవిమానాలతో ప్రయోగించి మెరుపు దాడులకు దిగడం. ► జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను భారత్‌కు తీసుకువచ్చేలా అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం. ఇస్లామాబాద్‌లో భారత్ హైకమిషనర్ అజయ్ బిస్రాయ్వెనక్కి పిలిపించడం ద్వారా దౌత్యపరంగా పాక్‌కు ఒంటరిని చేసేందుకు ఇప్పటికే పావులు కదుపుతోంది. -
భారత్‌కు మద్దతు ఇస్తాం: అమెరికా
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎలాంటి ఆత్మరక్షణ చర్యలు తీసుకున్నా, దాన్ని సమర్థిస్తామని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాన్ బోల్టన్ ప్రకటించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు బోల్డన్ శుక్రవారం ఫోన్ చేశారు. దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించేందుకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాడిని ఖండించిన అమెరికా అధ్యక్ష భవనం.. తమ భూభాగంలోని అన్ని ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్న సాయాన్ని పాక్ నిలిపివేయాలని హెచ్చరించింది. పాక్ మూల్యం చెల్లించక తప్పదు: ఇరాన్ ఇస్ఫాహన్(ఇరాన్): తమ దేశంలో ఆత్మాహుతి దాడితో 27 మంది భద్రతా సిబ్బంది మృతికి కారణమైన పాకిస్తాన్‌పై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. పాక్– ఇరాన్ సరిహద్దుల్లోని సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బుధవారం సైనికులతో వెళ్తున్న బస్సును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చడంతో అందులోని 27 మంది మృతి చెందారు. ఆ సైనికుల అంతిమ యాత్రలో ఇరాన్ సైనిక దళాల(రివల్యూషనరీ గార్డ్స్) కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫారీ పాల్గొని, ప్రసంగించారు. ‘ఇప్పటిదాకా ఉపేక్షించాం. ఇకపై ధీటుగా బదులిస్తాం. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు. ఇరాన్ బద్ద విరోధి, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం నుంచి పాక్ పర్యటన ప్రారంభమవుతున్న సమయంలో ఇలాంటి హెచ్చరికలు వెలువడటం గమనార్హం. తమ సైనికులపై దాడికి పాక్ ప్రోత్సాహంతో నడుస్తున్న ‘జైషే ఆదిల్’ కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. -
కశ్మీరీలకు రక్షణ ఇవ్వండి: కేంద్రం
న్యూఢిల్లీ: దాడి తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కశ్మీర్ ప్రజలు, విద్యార్థులపై దాడుల నేపథ్యంలో వారి రక్షణకు బాధ్యత తీసుకోవాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను కోరింది. తమ ఆస్తులపై దాడులు జరుగుతాయన్న భయంలో ఉత్తరాఖండ్‌లో కశ్మీరీలకు అద్దెకిచ్చిన వారి గృహ యాజమానులు భయపడి, కశ్మీరీలను ఖాళీచేయిస్తున్నట్టు సమాచారం అందినట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇళ్లు ఖాళీ చేసిన కశ్మీరీలు అంబాలా: గ్రామంలో అద్దెకుంటున్న కశ్మీరీలను వెనక్కి పంపాలని హరియాణాలోని అంబాలా గ్రామపంచాయతీ తమ గ్రామస్తులను ఆదేశించింది. సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న ఒక వీడియో ప్రకారం, ములానా గ్రామ సర్పంచ్ నరేశ్ ఒక వీడియో ద్వారా సందేశమిచ్చారు. ‘దాడిలో కొందరు కశ్మీరీల ప్రమేయం ఉంది. 24 గంటల్లోగా అద్దెకుంటున్న కశ్మీరీలను పంపించివేయాలి’ అని వీడియోలో ఉంది. వీడియోను చూసిన కొందరు కశ్మీరీలు ఇళ్లు ఖాళీచేసి యూనివర్సిటీ హాస్టల్‌కు మకాం మార్చినట్లు సమాచారం. అంబాలాలోని వర్సిటీల్లో దాదాపు 1,200 మంది కశ్మీరీలు చదువుతున్నట్టుగా సమాచారం. -
‘భారత్ కే వీర్’కు రూ.7 కోట్లు
న్యూఢిల్లీ: జవాన్ల కుటుంబాల కోసం ప్రజలు ఇప్పటి వరకు రూ.7 కోట్ల సాయం ప్రకటించారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్ ‘భారత్ కే వీర్’ ద్వారా ఈ విరాళాలు పోగయ్యాయి. ‘కొన్ని నకిలీ సంస్థలు కూడా సాయుధ దళాలకు సాయం పేరుతో విరాళాలు వసూలు చేస్తున్నాయి. వాటిపై అప్రమత్తంగా ఉండండి. భారత్ కే వీర్ మాత్రమే విరాళం ఇవ్వండి’ అని హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రజలను కోరారు. షిర్డీ ట్రస్టు సాయం 2.51 కోట్లు సాక్షి ముంబై: అమరుల కుటుంబీకులకు రూ. 2.51 కోట్ల సాయం చేస్తామని షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ సురేశ్ హావరే చెప్పారు. ఇప్పటికే ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధి వినాయక ఆలయ ట్రస్టు రూ. 50 లక్షల సాయం ప్రకటించింది. ప్రతి ఒక్క అమరవీరుని కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. -
దాడి సూత్రధారి ఉమేర్
దాడికి జైషే మొహమ్మద్(జేఈఎం)కు చెందిన మహ్మద్ ఉమేర్ వ్యూహరచన చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు చెప్పారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఉమేర్ అఫ్గాన్‌లో శిక్షణ పొందాడని, ఆ అనుభవంతో దాడికి పథక రచన చేశాడన్నారు. జైషే చీఫ్ మసూద్ అజహర్‌కు ఉమేర్ స్వయానా సోదరుడి కొడుకని చెప్పారు. దాడికి ఉమేర్ సూత్రధారి కాగా, మరో ఇద్దరు ఆర్డీఎక్స్ బాంబును రూపొందించారని ఎన్ఐఏ అధికారులు అన్నారు. బాంబును తయారుచేసిన ఇద్దరు ఇప్పటికే సరిహద్దును దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోకి వెళ్లిపోగా, ఉమేర్ మాత్రం దాడిని పర్యవేక్షించేందుకు పుల్వామాలోనే ఆగిపోయాడని తెలిపారు. అతని కోసం భద్రతాబలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయన్నారు. మసూద్ అజహర్‌కు బంధువైన హైదర్ 2018, అక్టోబర్‌లో కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంతో, అతని స్థానంలో ఉమేర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. సిరియా, అఫ్గాన్ తరహాలో.. సిరియా, అఫ్గానిస్తాన్‌లోని అమెరికా బలగాలు లక్ష్యంగా తీవ్రవాదులు, తిరుగుబాటుదారులు కారుతో పుల్వామా తరహాలో ఆత్మాహుతి దాడులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో ఉగ్రవాదుల దగ్గర శిక్షణ పొందిన ఉమేర్ దాన్ని కశ్మీర్లో పక్కాగా అమలు చేశాడు. ఈ ఆత్మాహుతి దాడి కుట్ర రషీద్ ఘజీ, కమ్రాన్ అనే ఇద్దరు ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ)తో కలిసి తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. జమ్మూ–కశ్మీర్ జాతీయ రహదారికి సమీపంలో పుల్వామా–పొంపోర్‌ల మధ్య 20–25 కిలోమీటర్ల ప్రాంతం ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా ఉందన్నారు. ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నామనీ, గ్రామాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కాగా, ఉగ్రవాదుల జాడ తెలుసుకునేందుకు అధికారులు ఈ ప్రాంతంలో సెల్‌ఫోన్ కాల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. అలాగే దాడి జరగడానికి 48 గంటల ముందు వరకూ ఇంటర్నెట్ ద్వారా వెళ్లిన కాల్స్, సందేశాలను విశ్లేషిస్తున్నారు. ఐఎస్ఐ మునీర్ ముద్ర! దాడిలో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ ముద్ర కనిపిస్తోంది. పాక్ ఉత్తర ప్రాంతాల కమాండర్‌గా పనిచేసిన మునీర్‌కు కశ్మీర్‌పై పూర్తి అవగాహన ఉందని ఐఎస్ఐ నిపుణులు వెల్లడించారు. ఐఎస్ఐ చీఫ్‌గా మునీర్‌ను గత ఏడాది అక్టోబర్‌లో పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా నియమించారు. పుల్వామా దాడి జరిపిన జైషే మహ్మద్‌తోనే గతంలో కశ్మీర్లో ఐఎస్ఐ అనేక ఉగ్రవాద కార్యకలాపాలు చేయించింది. భారత పార్లమెంటుపై దాడి కేసులో మరణ శిక్షకు గురైన అఫ్జల్ గురు వర్ధంతి సమయంలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఇంతటి భారీ దాడి చేయించడానికి ఐఎస్ఐ కుట్ర పన్నిందని పాక్ నిఘా సంస్థ గురించి తెలిసిన వారంటున్నారు. కానీ, తన పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయడానికి దాడిని కొద్ది రోజులు వాయిదా వేసింది. ‘ఇది అమలు జరిగిన తీరులో ఐఎస్ఐ చీఫ్ ముద్ర కనిపిస్తోంది’ అని కేబినెట్ సెక్రెటేరియట్‌లో పనిచేసిన తిలక్ దేవాశర్ తెలిపారు. -
ప్రతీకారానికి సిద్ధమే
పోఖ్రాన్: ప్రభుత్వం ఆదేశించినట్లుగా ఉగ్ర ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నామని వైమానిక దళం చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ప్రకటించారు. పాకిస్తాన్, పుల్వామా దాడి గురించి నేరుగా మాట్లాడకుండా ఆయన ఇస్లామాబాద్ ప్రేరణతో పెచ్చరిల్లుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో శనివారం ‘వాయుశక్తి ఎక్సర్సైజ్’పేరిట ఒకరోజు వైమానిక దళ విన్యాసాల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధనోవా మాట్లాడుతూ ‘తన మిషన్లను సాకారం చేసుకోవడంలో వైమానిక దళం ఎప్పుడూ ముందుంటుంది. జాతీయ భద్రత, సార్వభౌమ పరిరక్షణలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు వైమానిక దళానికి ఉన్నాయని హామీ ఇస్తున్నా. యుద్ధాలు అరుదుగానే జరుగుతాయి. సంప్రదాయ యుద్ధంలో మనల్ని ఓడించలేమని శత్రువుకు తెలుసు. కాబట్టి మనకు ఊహించని, కొత్త రకపు ముప్పు ఎప్పుడూ ఉంటుంది. శత్రు భూభాగాల్లో మన సైనికుల్ని జారవిడవడం, విడిపించటం, ముష్కరులను శిక్షించడం కోసం ఈరోజు మన శక్తి, సామర్థ్యాల్ని ప్రదర్శిస్తున్నాం’ అని ధనోవా అన్నారు. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పుల్వామా దాడి చోటుచేసుకున్న రెండు రోజుల తరువాత జరగడం గమనార్హం. వాయుశక్తి ఎక్సర్సైజ్కు ప్రణాళికలను ఇంతకుముందే రూపొందించామని, పుల్వామా దాడితో సంబంధంలేదని వైమానిక దళ వర్గాలు తెలిపాయి. అబ్బురపరచిన విన్యాసాలు.. ఉదయం నుంచి చీకటి పడే వరకు వైమానిక దళ విన్యాసాల ప్రదర్శన కొనసాగింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో పాటు మొత్తం 140 యుద్ధ విమానాలు, ఆకాశ్, అస్త్ర క్షిపణి ప్రతిభాపాటవాల్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తమ ముందు నిర్దేశించిన లక్ష్యాల్ని కచ్చితత్వంతో ఢీకొట్టాయి. మిలిటరీ కసరత్తులో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, ఆకాశ్ క్షిపణిని మోహరించడం ఇదే తొలిసారి. అప్‌గ్రేడ్ చేసిన మిగ్–29 అనే యుద్ధ విమానాన్ని కూడా ఈసారి పరీక్షించారు. సుకోయ్–30, మిరేజ్–2000, జాగ్వార్, మిగ్–21 బైసన్, మిగ్–27, మిగ్–29, హెర్క్యూల్స్, ఏఎన్–32 విమానం తదితరాలు కూడా ఈ విన్యాసాల్లో కనువిందు చేశాయి. ముఖ్యంగా చీకటి పడిన తరువాత అంతిమ ఘట్టంలో ఏఎన్–32, సీ–132జె హర్క్యూల్స్ విమానాలు ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైమానిక దళ గౌరవ గ్రూప్ కెప్టెన్, మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్!
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికలపై ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయంపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)కు పుల్వామా ఘటనపై కీలక సాక్ష్యాధారాలను సమర్పించనుంది. వచ్చేవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఎఫ్ఏటీఏ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్‌కు పాకిస్తాన్ నిఘా సంస్థలు అందజేస్తున్న సాయాన్ని భారత్ ఎండగట్టనుంది. ఈ పత్రాలను భద్రతా సంస్థలు రూపొందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పారిస్‌లో జరిగే సమావేశంలో పాకిస్తాన్‌ను నిషేధిత జాబితా(బ్లాక్ లిస్ట్)లో చేర్చాల్సిందిగా కోరతామని తెలిపారు. మనీ లాండరింగ్‌తో పాటు ఉగ్రవాదులకు ఆర్థిక సాయమందించే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేరుస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ), యూరోపియన్ యూనియన్(ఈయూ)లు సదరు దేశపు రేటింగ్‌ను డౌన్‌గ్రేడింగ్ చేస్తాయి. దీంతో అంతర్జాతీయ సంస్థల నుంచి రుణసాయం, పెట్టుబడులు నిలిచిపోతాయి. అలాగే ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్ వంటి రేటింగ్ ఏజెన్సీలు సైతం పెట్టుబడులపై రిస్క్ రేటింగ్లను తగ్గించేస్తాయి. తద్వారా నిషేధిత దేశానికి అన్నివైపుల నుంచి దారులు మూసుకుపోతాయి. 2018, జూలైలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ను ‘గ్రే’ జాబితాలో చేర్చింది. నిర్దేశిత నిబంధనలను పాటించకుంటే నిషేధిత జాబితాలో చేరుస్తామని హెచ్చరించింది. ఎఫ్ఏటీఎఫ్లో 35 దేశాలు, ఈయూ కమిషన్, గల్ఫ్ సహకార మండలి సభ్యులుగా ఉన్నాయి. ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేర్చింది. -
పాక్ వస్తువులపై 200% పన్ను పెంపు
న్యూఢిల్లీ: ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై మరిన్ని కఠిన చర్యలను కేంద్రం ప్రకటించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్లు. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాటిలో ముఖ్యంగా తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి ఖనిజాలు తదితరాలున్నాయి. తాజా చర్యతో భారత్‌లో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ‘పుల్వామా దాడికి ఆ దేశమే కారణమని భావిస్తూ అత్యంత ప్రాధాన్యం గల దేశం (ఎంఎఫ్ఎన్) హోదాను ఉపసంహరించుకున్నాం. దీంతోపాటు పాక్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’ అని ఆర్థిక మంత్రి జైట్లీ ట్విట్టర్లో ప్రకటించారు. పాక్ నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానమైన తాజా పండ్లపై ప్రస్తుతం 50% వరకు, సిమెంట్‌పై 7.5% కస్టమ్స్ డ్యూటీ ఉంది. -
ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం
యావత్మల్/ధూలె(మహారాష్ట్ర): పాకిస్తాన్ ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారిందని ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భద్రతా బలగాలపై నమ్మకం ఉంచి ఓపికగా ఎదురుచూడాలని, ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలోని యావత్మల్, ధూలెలో ప్రధాని శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి బహిరంగ సభల్లో మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్రదాడి పట్ల దేశమంతా ఆగ్రహంతో ఉన్న సంగతి స్పష్టంగా తెలుస్తోందని, అందరి కళ్లు చెమర్చాయని అన్నారు. ప్రతి కన్నీటి బొట్టుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. మన సైనికులు లక్ష్యంగా బాంబులు, మారణాయుధాలు సమకూర్చే ఎవరినీ ‘నవ భారతం’ ఉపేక్షించదని అన్నారు. వాళ్ల త్యాగం వృథాగా పోదు.. ‘దేశ విభజన తరువాత ఉనికిలోకి వచ్చిన దేశం ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. దివాలా అంచుకు చేరిన ఆ దేశం ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారింది’ అని యావత్మల్లో జరిగిన బహిరంగ సభలో పాక్ పేరును ప్రస్తావించకుండా మండిపడ్డారు. పుల్వామా దాడి తరువాత దేశం తీవ్ర నొప్పిని అనుభవిస్తోందని, అమర జవాన్ల త్యాగాలను వృథా కానీయమని చెప్పారు. నాగ్‌పూర్‌లోని అజ్నీ–పుణే రైలు సేవలను ప్రారంభించి, స్వయం సహాయక బృందాలకు చెక్కులు అందించారు. విషాదంలోనే సంయమనమూ ఉండాలి.. ఉత్తర మహారాష్ట్రలోని ధూలెలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. విషాదం నిండిన ఈ సమయంలోనే సంయమనంతో వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. ‘మనది కొత్త విధానాలు, పద్ధతులతో కూడిన నవ భారతం. ఈ సంగతి ప్రపంచానికి కూడా తెలుస్తుంది’ అని అన్నారు. ‘పుల్వామా’తో మోదీ ప్రచారం: కాంగ్రెస్ పుల్వామా దాడి కేంద్రంగా జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ మోదీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. ‘రాజకీయ పార్టీలన్నీ విభేదాలు విడనాడి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చిన మోదీ..తాను మాత్రం సొంత పార్టీకి ప్రచారం చేస్తూ జాతీయభావాలు రెచ్చగొడుతున్నారు. అమర జవాన్ల మృతదేహాలు ఇంకా వారి స్వస్థలాలకు చేరుకోకముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు’ పేర్కొంది. మమ్మల్ని బెదిరించలేరు: పాక్ ఇస్లామాబాద్: ఉగ్రదాడి ఘటనపై తమను ఎవరూ బెదిరించలేరని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ తెలిపారు. ఈ ఘటనలో భారత్ ఆధారాలు సమర్పిస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిక్ భద్రతా సదస్సులో పాల్గొంటున్న ఖురేషీ మాట్లాడుతూ..‘ఉగ్రదాడి జరగ్గానే ఏమాత్రం విచారణ జరపకుండా పాక్‌ను భారత్ నిందిస్తోంది. సాక్ష్యాలులేని ఆరోపణలను ప్రపంచం అంగీకరించదు. మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. పాకిస్తాన్ శాంతిని మాత్రమే కోరుకుంటోంది. ఘర్షణను కాదు. ప్రపంచదేశాల ముందు మా వాదనల్ని కూడా వినిపిస్తాం’ అని పేర్కొన్నారు. -
దేశమంతా ఒకే గళం
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్ని ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో చెప్పాయి. ఉగ్రదాడి అంశంపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. భద్రతా దళాలకు సంఘీభావం తెలిపి, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం కోసం తామంతా కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో ఓ తీర్మానాన్ని పార్టీలన్నీ ఆమోదిస్తూ దాడిని, ఉగ్రవాదులకు సరిహద్దుల అవతలి నుంచి అందుతున్న సాయాన్ని ఖండించాయి. అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను పిలిచి ప్రధాని మోదీ ఓ సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నేత ఆజాద్ సూచించారు. ఆయన సూచనను తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్, సీపీఐ నాయకుడు డి.రాజ సమర్థించారు. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం విడుదల చేసిన తీర్మానంలో ‘ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటిరకు స్థైర్యాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ నిశ్చయంతో ఉందని దేశం మొత్తం ముక్తకంఠంతో చెబుతోంది. ఉగ్రవాదులతో పోరాడి దేశాన్ని రక్షిస్తున్న భద్రతా దళాలకు మేం అంతా సంఘీభావం తెలుపుతున్నాం’ అని నేతలు పేర్కొన్నారు. పాక్‌ను పరోక్షంగా పేర్కొంటూ సీమాంతర ఉగ్రవాదం కారణంగా సమస్యలను ఎదుర్కుంటోందని తీర్మానం తెలిపింది. అంతకుముందు రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఉగ్రదాడి గురించి, శుక్రవారం తన కశ్మీర్ పర్యటన వివరాలు అందరికీ తెలియజేశారు. ‘ఉగ్రవాదంపై పోరును అర్థవంతమైన దిశలో చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. బలగాల త్యాగాలు ఊరికేపోవు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు శాంతి కావాలి. వారు మనతోపాటే ఉన్నారు. కానీ కొన్ని సంఘవిద్రోహ శక్తులు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారు’ అని రాజ్‌నాథ్ ఇతర నాయకులకు తెలిపారు. సర్జికల్ దాడి ప్రభావం లేదు: సంజయ్ బీజేపీ మిత్రపక్షం శివసేన నేత సంజయ్ రౌత్ అఖిలపక్ష భేటీలో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి స్ఫూర్తిని పొంది (ఇందిర నేతృత్వంలో 1971 యుద్ధంలో పాక్‌పై భారత గెలుపు) పాకిస్తాన్‌ను నేరుగా దెబ్బ కొట్టాలని అన్నారు. కేంద్రం గొప్పగా చెప్పుకుంటున్న సర్జికల్ స్ట్రైక్స్ పాక్‌పై ఏమైనా ప్రభావం చూపి ఉంటే ఇప్పుడు ఈ దాడి జరిగేది కాదని ఆయన పేర్కొన్నారు. లాహోర్, ఇస్లామాబాద్ సహా పాకిస్తాన్ లోపలి భాగాలపై దాడి జరగాలన్నారు. ఉడీ సైనిక శిబిరంపై 2016లో ఉగ్రవాదులు దాడి జరిపిన అనంతరం ప్రతీకారంగా పాక్–భారత్ సరిహద్దుల్లో, నియంత్రణ రేఖకు అవతల, పాక్ వైపున ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ, సింధియా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ, టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఎల్జేపీ నేత రాం విలాస్ పాశ్వాన్, ఆప్ నేత సంజయ్ సింగ్, ఆర్ఎల్ఎస్పీ నుంచి ఉపేంద్ర కూష్వాహ, ఆర్జేడీ నాయకుడు జయ ప్రకాశ్ నారాయణ్ యాదవ్ తదితరులు కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తోమర్ చదివి వినిపించారు. దాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని కశ్మీర్ విద్యార్థులపై దాడులు జరగొచ్చన్న సమాచారం ఉన్నప్పటికీ ప్రజలంతా సంయమనాన్ని పాటించాలన్న అంశం ఈ తీర్మానంలో లేకపోవడం తనను నిరాశ పరిచిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు ఉగ్రవేటకు చర్యలు భద్రతా సమీక్షలో రాజ్‌నాథ్ దాడి జరిగిన రెండ్రోజుల అనంతరం శనివారం దేశవ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితులపై హోం మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ లోయలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను వేటాడేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతీయ భద్రతా సలహాదారు (నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ – ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్ తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దుతోపాటు దేశ వ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితిని అధికారులు రాజ్‌నాథ్‌కు ఈ సమావేశంలో వివరించినట్లు హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు తీసుకున్న భద్రతా చర్యలను హోం మంత్రికి అధికారులు వివరించారు. జమ్మూ కశ్మీర్‌లోని వేర్పాటు వాదులకు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణపై సమీక్ష నిర్వహించి, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న వేర్పాటు వాదులకు భద్రతను ఉపసంహరించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా గుడిగెరె గ్రామంలో అమర జవాన్ హెచ్.గురు అంత్యక్రియలకు భారీగా హాజరైన ప్రజలు భోపాల్‌లో కొవ్వొత్తులు వెలిగించి అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది -
నీరజ్ దేవి (ఒక వీర జవాన్ భార్య)-రాయని డైరీ
దుఃఖ పడటానికి దేవుడు సమయం ఇవ్వలేదు. సైనికుడి భార్యకు దుఃఖమేమిటి అనుకున్నాడేమో! ప్రదీప్ కూడా అనేవాడు.. ‘సైనికుడి భార్యకు కన్నీళ్లేమిటి’ అని. కళ్లయినా తుడిచేవాడా! ‘తుడుచుకో’ అని నవ్వేసి రైలు ఎక్కేసేవాడు. పిల్లల్ని తీసుకుని చీకట్లోనే అత్తగారి ఊరికి చేరుకున్నాను. దారి మధ్యలో.. ‘‘ఎ..క్క..డి..కీ..’’ అని అడిగింది సోనా వచ్చీరాని మాటల్తో. రెండేళ్లు దానికి. ‘‘నాన్న దగ్గరికి’’ అని చెప్పాను. మేము వచ్చేటప్పటికి ప్రదీప్ ఇంకా అమ్మగారింటికి ‘చేరుకోలేదు’. ‘‘నాన్నేరీ’’ అంటోంది సోనా నిద్రకు సోలుతూ. సుప్రియకు అర్థమైపోయింది. ‘‘రారు కదమ్మా నాన్న ఇక ఎప్పటికీ’’ అంది చెల్లికి వినిపించకుండా. దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాను. పదేళ్ల పిల్ల సుప్రియ! కొన్ని గంటల క్రితం వరకూ తనూ రెండేళ్ల పిల్లలానే ఉండేది. నాన్న ఫోన్ చేస్తే.. ‘ఎప్పుడొస్తావ్ నాన్నా’ అని అడిగేది. ‘నాన్నా.. మనం కట్టుకుంటున్న ఇంట్లో చెల్లికి, నాకు కలిపి.. మా ఇద్దరికే ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది కదా’ అనేది. ‘ఉంటుంది తల్లీ. మరి నేను, అమ్మ.. ఎప్పుడైనా మీ గదిలోకి రావచ్చా’ అని అడిగేవాడు ప్రదీప్. ‘రావచ్చు నాన్నా. అయితే మా గదిలో ఉన్నప్పుడు కశ్మీర్ నుంచి ఫోన్ వస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యకూడదు. ఎప్పుడు నీకు ఫోన్ వచ్చినా, వెంటనే రమ్మనే కదా వస్తుంది’ అనేది.. మూతి అదోలా ముడిచి. అమ్మవాళ్ల ఊళ్లో ఉన్నప్పుడు గురువారం తెల్లవారు జామున ప్రదీప్ నుంచి ఫోన్ వచ్చింది. చాలాసేపు మాట్లాడాడు. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. పది నిముషాలు సోనా గురించే మాట్లాడాడు. ‘జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతున్నాం’ అన్నాడు. ‘ఇంత రాత్రేమిటి?’ అన్నాను. నవ్వాడు. ‘‘నాకొక్కడికే కాదు రాత్రి. ఇంకా రెండువేల ఐదొందల మందికి కూడా. డెబ్భై ఎనిమిది వాహనాల్లో వరుసగా వెళుతున్నాం. వాహనాలు నడిపించడం లేదు మమ్మల్ని. దేశ సమగ్రతను కాపాడవలసిన బాధ్యత నడిపిస్తోంది’’ అన్నాడు! సుప్రియ గురించి, సోనా గురించి తప్ప ప్రదీప్ నాతో ఏం మాట్లాడినా సాటి జవానుతో మాట్లాడినట్లే ఉంటుంది. ‘‘సుప్రియ అడుగుతోంది.. ‘నాన్న మళ్లీ ఎప్పుడొస్తారని’. పని పూర్తవగానే వచ్చేస్తారని చెప్పాను’’ అన్నాను. నవ్వాడు. ‘‘సుప్రియ అడుగుతోంది. నేను అడగలేకపోతున్నాను’’ అన్నాను బెంగగా. ‘‘సైనికుడి భార్యవేనా నువ్వు?’’ అన్నాడు. పెద్ద శబ్దం. నా చేతిలోని ఫోనే పేలిపోయినంతగా శబ్దం! ‘ప్రదీప్.. ప్రదీప్..’ ప్రదీప్ పలకట్లేదు. సుప్రియ లేచింది. ‘ఏంటమ్మా..’ అని. మళ్లీ ఫోన్!! ‘‘ప్రదీప్’’ అన్నాను. నిశ్శబ్దం! ‘‘ప్రదీప్ భార్యేనా మీరు?’’ కంట్రోల్ రూమ్ నుంచి! నాకేదో అర్థమౌతోంది. ప్రదీప్ భార్యనని చెప్పుకోవాలంటే ఏడ్వకూడదు. ‘ఊ’ అన్నాను. పిల్లల్ని దగ్గరికి లాక్కున్నాను. ఊరింకా మేల్కోలేదు. బరసిరోహీ నుంచి సుఖ్సేన్పూర్ వచ్చేశాం. పిల్లలిద్దరూ.. నాన్న రావడం కోసం ఎదురు చూస్తున్నారు. అమరవీరుడైన ఒక జవాన్ రావడం కోసం సుఖ్సేన్పూర్ ఎదురు చూస్తోంది. సుప్రియ నా చెయ్యి పట్టుకుని మెల్లిగా ‘‘అమ్మా..’’ అని పిలిచింది. ‘‘నాన్న.. అక్కడ చెయ్యవలసిన పని పూర్తయి ఉండదు కదమ్మా..’’ అంది. నాన్నపై ఉన్న ప్రేమంతా కన్నీళ్లుగా కరిగి, దాని చెంపల్ని తడిపేస్తోంది. తన కళ్లు కదా తుడుచుకుని చెప్పాల్సింది.. నా కళ్లు తుడుస్తూ చెప్పింది.. ‘‘నాన్న మిగిల్చిపోయిన పని నేను పూర్తి చేస్తానమ్మా..’’ అని చెప్పింది! ఒడిలోకి తీసుకున్నాను. సైనికుడి కూతురు అది. -మాధవ్ శింగరాజు -
సమర్థ దౌత్యమే సరైన ఆయుధం
కశ్మీర్‌లోయలో పాకిస్తాన్ ఉగ్రపంజా విసిరి విశేషంగా ప్రాణనష్టం సంభవించిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన ఒకే విధంగా ఉంటుంది. ప్రదానమంత్రి ఆగ్రహం వెలిబుచ్చుతారు. పాకిస్తాన్‌కి తగినవిధంగా జవాబు చెబుతామంటూ తీవ్రంగా హెచ్చరిస్తారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరి చేయడానికి అవసరమైన సకల చర్యలూ తీసుకుంటామని హామీ ఇస్తారు. పాకిస్తాన్‌ను ఉగ్ర దేశంగా అభివర్ణిస్తారు. కొన్ని వారాలపాటు ప్రతీకార దాడుల గురించీ, ‘ముహ్ తోడ్ జవాబ్’ (మొహం పగిలే జవాబు) గురించీ ప్రధాని నరేంద్రమోదీ హెచ్చ రిస్తారు. టెలివి జన్ చానళ్ళు హడావిడి చేస్తాయి. వార్తాపత్రికలలో ప్రధాన శీర్షికలుగా వస్తాయి. 2008లో ముంబయ్‌పైన పాకిస్తాన్ ముష్కరులు దాడి చేసినప్పటి నుంచీ మొన్న పుల్వామాలో కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల (సీఆర్ పీఎఫ్)పైన దాడి వరకూ ఇదే వరుస. గురువారంనాడు అదిల్ మహమ్మద్ దార్ అనే కశ్మీరీ యువకుడు పేలుడు పదార్థాలను స్కార్పియో కారునిండా పెట్టుకొని సీఆర్పీఎఫ్ జవాన్లను తీసుకొని వెడుతున్న ట్రక్కుల శ్రేణిని ఢీకొట్టి పేలిపో యాడు. ఫలితంగా 40 మంది జవాన్లు మరణించారు. అనేకమంది గాయప డ్డారు. లోగడ ఎన్నడూ ఇంతటి తీవ్రమైన దాడి జరగలేదు. జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ భవనంపైన 2001లో పేలుడు పదార్థాలు కలిగిన ట్రక్కుతో దాడి జరిపిందీ, పఠాన్‌కోట, నాగ్రోతా, ఉడిలోని సైనిక స్థావరాలపైన దాడులు చేసిందీ కశ్మీర్‌కు చెందిన పౌరులు కాదు. వారు పాకిస్తానీయులు. అక్కడ ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులు. 2000 ఏప్రిల్‌లో కశ్మీర్లో తొలి మానవబాంబు పేలింది. బాదామీబాగ్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపైన దాడి చేసి ఇద్దరు సైనికులను హత్యచేశారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తి కశ్మీర్‌కు చెందిన యువ కుడు. కశ్మీర్‌కు చెందిన యువకులను ఆకర్షించి పాక్ తీసుకువెళ్ళి వారికి ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చి కశ్మీర్‌పైన ప్రయోగించడం పాకిస్తాన్ సైన్యం పోషి స్తున్న ఉగ్రవాదసంస్థల నిరంతర కార్యక్రమం. శనివారం దేశీయాంగ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ప్రభు త్వానికి అండగా నిలబడతామని ప్రకటించాయి. పుల్వామా దాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని సైతం అఖిలపక్ష సభ ఈ సందర్భంగా ఆమోదించింది. కశ్మీర్లో పాకిస్తాన్ చిచ్చు కశ్మీర్‌లోయలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చిచ్చుపెట్టే శక్తి పాకిస్తాన్‌కు ఉన్నది. పాకిస్తాన్‌కు ఇండియా ఎటువంటి జవాబు ఇవ్వగలదు? 2016 సెప్టెం బర్లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రయిక్ చేసినట్టు ప్రభుత్వం ప్రక టించింది. దేశంలోనూ, విదేశాలలోనూ సర్జికల్ స్ట్రయిక్ గురించి నరేంద్ర మోదీ పలు సందర్భాలలో చెప్పారు. అంతా బూటకమేనని పాకిస్తాన్ ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలనీ, ప్రతీకారం తీర్చుకోవాలనీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. సర్జికల్ స్ట్రయిక్ కంటే నేరుగా పాకిస్తాన్ భూభా గంలోకి యుద్ధవిమానాలు వెళ్ళి బాంబింగ్ జరిపితే పాకిస్తాన్ ఇకపైన జాగ్రత్తగా వ్యవహరిస్తుందని కొందరు సూచిస్తున్నారు. అయితే మన యుద్ధవిమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశిస్తే పాక్ సైనికులు చేతులు ముడుచుకొని కూర్చుంటారా? వారికి మనకిలాగే రాడార్ వ్యవస్థ ఉండదా? అయినా సరే, ఆవేశం, ఆక్రోశం ఉన్న సమయంలో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. నాయ కులు ఇటువంటి ప్రకటనలు సైతం చేస్తారు. ఎన్నికలు సమీపంలో ఉన్నాయి కనుకనే అసాధారణ రీతిలో ప్రభుత్వ స్పందన ఉంటుంది. ఈ కారణంగానే ప్రతిపక్షాలు సైతం ఇంటెలిజెన్స్ వైఫల్యాల గురించి ఏ మాత్రం మాట్లాడకుండా ఏకతాటిపై నిలబడి ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. ఈ పరిస్థితిలో కశ్మీర్‌ను రావణ కాష్టంగా మార్చిన భారత ప్రభుత్వ విధానాలనూ, వైఫల్యాలనూ ప్రస్తా వించడం సముచితం కాదు. ఇది సంతాప సమయం. విశ్లేషణలకూ, విమర్శ లకూ తగిన సందర్భం కాదు. సైనికంగా స్పందిస్తామంటూ, పాకిస్తాన్‌కి గుణపాఠం చెబుతామంటూ ప్రధాని గంభీరంగా ప్రకటిస్తుంటే ఆయన వైఖరిని ప్రశ్నించడం అవివేకం. అందుకే అఖిలపక్షం ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో నిర్ణయించే బాధ్యత పూర్తిగా సైన్యానికి వదిలినట్టు నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎప్పుడో ఏదో ప్రకటన వస్తుంది. ఇలా అధీనరేఖ దాటి కొందరు శత్రు సైనికులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకోవడం కొత్త కాదు. ప్రతీకారం చేసినట్టు పదేపదే చెప్పుకునే సంప్ర దాయానికి మోదీ శ్రీకారం చుట్టారు. కశ్మీర్‌పైన జరుగుతున్న దాడుల పట్ల కోపంతో కుతకుతలాడుతున్న దేశప్రజలను శాంతింపజేయడానికి ఉద్దేశించిన ప్రక్రియ ఇది. సర్జికల్ స్ట్రయిక్‌లు నిర్వహించామని ప్రకటించడమే కాకుండా వాటి తాలూకు దృశ్యాలను కూడా ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. ఎన్నికలు చాలా దూరంగా ఉన్న దశలోనే సర్జికల్ స్ట్రయిక్‌కు అత్యంత ప్రచారం ఇచ్చినవారు ఎన్నికలు సమీపించిన తరుణంలో చేయబోయే ప్రతీకారానికి ప్రచారం ఇవ్వకుండా ఉంటారా? ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకున్నట్టూ, పాకిస్తాన్ మదం అణచినట్టూ త్వరలోనే ప్రభుత్వం ప్రక టిస్తుంది. ఏ విధంగా చూసినా ఇది అనివార్యం. కొన్ని మాసాల తర్వాత ప్రజలు ఈ అంశాన్ని మర చిపోతారు. ఇది తాత్కాలిక ఉపశమనమే కానీ కశ్మీర్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కాదు. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ ప్రభుత్వం ఒక అంగుళమైనా వెనుకంజ వేశాయా? కశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయా? ఉగ్రవాదంవైపు మొగ్గుతున్న యువత ఉగ్రవాదుల దాడులు తగ్గినట్టు ప్రభుత్వం చెబుతున్నది. కానీ కొన్నేళ్ళుగా కశ్మీర్లో యువకులు తీవ్రవాదంవైపు మొగ్గుతున్నారు. తుపాకీ నీడన పుట్టి పెరిగిన యువకులకు సైనికులతో కానీ ప్రభుత్వాధికారులతో కానీ చేదు అనుభవం ఎదురైతే వారు ఉగ్రవాద సంస్థలలో చేరిపోతున్నారు. ఫేస్బుక్, ట్వీటర్, వాట్సాప్ వంటి అధునాతన సాంకేతికత ఉగ్రవాదం ప్రచారానికి కూడా దోహదం చేస్తోంది. ప్రపంచం పూర్తిగా తెలియని యువకులను ఆకర్షించడానికి రకరకాల వీడియోలు తయారు చేసి వదులుతున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దార్‌ను చితకబాదడంతో అతడు ఉగ్రవాదాన్ని ఆశ్రయించాడంటూ దార్ తల్లి దండ్రులు చెప్పారు. ఆత్మాహుతి దాడిలో మరణించిన జవాన్ల తల్లిదండుల వలెనే తాము కూడా కొడుకు చనిపోయాడని కుమిలిపోతున్నామని అన్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా దార్ తల్లిదండ్రుల పుత్రశోకానికి కారణాలు కనుగొని తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం కశ్మీర్‌లోయలో అస్థిరతకూ, అనిశ్చితికీ, శాంతభద్రతల వైఫల్యానికీ, పరిపాలన దెబ్బతినడానికీ దారితీసింది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితులలోనే ఉగ్రవాదం పైచేయి సాధిస్తుంది. ఇటువంటి వాతా వరణమే 1989లోనూ, 2010లోనూ కశ్మీర్‌లోయలో ప్రబలింది. ఈ పరిస్థితిని ఎప్పటికైనా చక్కదిద్దుకోవలసిందే. కశ్మీరీల మద్దతునూ, విధేయతనూ భారత ప్రభుత్వం, ప్రజ సంపాదించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రథమ కర్తవ్యం. ముఖ్యమైన అంశం పాకిస్తాన్‌కు సంబంధించింది. ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలకు ఊతం లభించినంత కాలం కశ్మీర్లో శాంతిభద్రతలు రక్షించడం అసాధ్యం. పాకిస్తాన్‌ను బలప్రయోగంతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించడం వృధా ప్రయాస. అది కూడా అణుశక్తి కలిగిన రాజ్యం. పైగా పాకిస్తాన్‌కు కొండంత అండగా చైనా ఉన్నది. ఆత్మాహుతి దాడి తమ పనే అని చాటుకున్న జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలన్న భారత ప్రతిపాదనకు చైనా పదేపదే మోకాలడ్డుతున్నది. సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిపట్ల సంతాపం తెలిపే ప్రకటనలో సైతం చైనా పాకి స్తాన్ ప్రస్తావన చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుభూతి ప్రకటిస్తూ మోదీకి సందేశం పంపించారు కానీ అమెరికా మరోవైపు పాకిస్తాన్‌కు గొప్ప ఉపకారం చేస్తున్నది. వ్యూహాత్మకంగా బలమైన స్థితిలో పాకి స్తాన్ ఉండ బోతోంది. మరోవైపున అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు పూర్తిగా నిష్క్రమించబోతున్నారు. ప్రపంచంలో ఎదురులేని శక్తిగా అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ క్రమంగా అమెరికా సైనికులను సంక్షుభిత ప్రాంతాల నుంచి ఉపసంహరించుకుంటున్నారు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వైదొలగడం అంటే అఫ్ఘానిస్తాన్ భద్రతాదళాలపైన దాడులు చేస్తున్న తాలిబాన్‌కు అఫ్ఘానిస్తాన్‌ను అప్పగించడమే. పరోక్షంగా పాకిస్తాన్ చేతు లలో అఫ్ఘానిస్తాన్‌ను పెట్టడమే. దౌత్యరంగంలో పాకిస్తాన్ ప్రభుత్వాలు మన ప్రభుత్వాల కంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. అఫ్ఘానిస్తాన్ వ్యవహారంలో భారత్ ఒంటరి అఫ్ఘానిస్తాన్ సమస్య పరిష్కారానికి మాస్కోలో రష్యా, చైనా, పాకిస్తాన్ ప్రతి నిధుల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భారత్ ప్రస్తావన కానీ ప్రమేయం కానీ లేదు. మన్మోహన్సింగ్. నరేంద్రమోదీ అఫ్ఘానిస్తాన్‌ను సందర్శించి, అఫ్ఘాన్ సైనికులకు ఇండియాలో శిక్షణ ఇచ్చి, ఆర్థిక సహాయం చేసి, కాబూల్‌లో పార్ల మెంటు భవన నిర్మాణంలో తోడ్పడినప్పటికీ అఫ్ఘాన్ సంక్షోభం పరిష్కరించ డంలో భారత్ ప్రమేయం ఉండాలని అమెరికా కానీ చైనా కానీ అఫ్ఘానిస్తాన్ కానీ భావించడం లేదు. అంతే కాదు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ అనుకూల ప్రభు త్వమో, తాలిబాన్ నడిపించే ప్రభుత్వమో ఏర్పడితే ఇంతకాలం ఆఫ్ఘాన్ భద్రతా దళాలతో పోరాడిన తాలిబాన్‌ను పాకిస్తాన్ కశ్మీర్‌వైపు మళ్ళిస్తుంది. 1989లో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థ (సీఐఏ) సహకారంతో పాకి స్తాన్ ప్రోత్సాహంతో తాలిబాన్ అఫ్ఘానిస్తాన్‌పై పోరాటం చేసి ఆ దేశం నుంచి సోవియెట్ సైన్యాన్ని జయప్రదంగా పంపించివేసింది. అంతవరకూ సోవియెట్ సైన్యంతో పోరాడిన తాలిబాన్‌ను కశ్మీర్‌పైకి పంపించింది పాకిస్తాన్. దాని ఫలితంగా ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్ కొన్ని సంవత్సరాలు అతలాకుతలమై పోయింది. ఇప్పుడు కూడా తాలిబాన్‌ను ప్రయోగిస్తే కశ్మీర్ మరోసారి అగ్ని గుండంగా మారిపోతుంది. జైషే మహమ్మద్, లష్కరే తొయిబాలు రెండు అఫ్ఘాన్ సంక్షోభం సృష్టించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే. ఇటువంటి సంస్థల సహకారంతో కశ్మీర్లో చిచ్చుపెట్టడం ద్వారా ఇండియాను నిరంతరంగా వేధిస్తూ ఉండటం పాకిస్తాన్ విధానం. సైనిక చర్య తీసుకోవాలంటే ఇజ్రేల్ ఎంటెబేలో చేసిన సాహసం ఇండియా చేయాలి. ఇస్లామాబాద్ పరిసరాలలో తలదాచుకున్న లాడెన్‌ను ఒబామా పంపిన సైనికులు మట్టుబెట్టినట్టే సయీద్ హఫీజ్, అజహర్ మసూద్ తదితర ఉగ్రవాదులను హతమర్చాలి. అంతటి తెగింపు, సాహసం, శక్తి ఇండియాకు ఉన్నాయా? దూరపు లక్ష్యాలను పేల్చేందుకు స్నైపర్స్ ఉపయోగించే ఆధునిక ఆయుధాలు భారత సైనికుల చేతుల్లో లేవు. పాత తరం రష్యా ఆయుధాలు భారత సైనికుల దగ్గర ఉంటే కొత్తతరం చైనా ఆయుధాలు పాకిస్తాన్ స్నైపర్స్ చేతుల్లో ఉన్నాయి. చైనా ఆయుధాల శక్తి, విస్తృతి అధికం. ఇదీ మనం గుర్తించాల్సిన క్షేత్ర వాస్తవికత. పాకిస్తాన్‌తో పూర్తి స్థాయి యుద్ధం అనూహ్యం. యుద్ధం ఆరంభించడం తేలికే. ముగించడం కష్టం. సర్జికల్ స్ట్రయిక్స్ వంటివి నిష్ప్రయోజనం. యుద్ధ విమానాల ప్రయోగం సైతం అంతే. దేశవాసుల ఆగ్రహం తగ్గించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ను తాలిబాన్ సహకారంతో పారదోలినా రష్యాతో పాకి స్తాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోలేదు. న్యూయార్క్‌లో జంటశిఖరాలపైన దాడులు చేయించి విధ్వంసం సృష్టిం చిన బిన్లాడెన్కు ఆశ్రయం ఇచ్చినా, అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా సైనికులను పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న తాలిబాన్ మట్టుపెడుతున్నా అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు బాగానే ఉన్నాయి. చైనా–పాకిస్తాన్ మైత్రి ప్రగాఢమైనది. పాకి స్తాన్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పోషిస్తున్నందుకు పాకిస్తాన్ మూల్యం చెల్లిస్తున్నది. దౌత్యరంగంలో మాత్రం వీగిపోకుండా నిలిచింది. ఎప్ప టికప్పుడు ఎత్తుగడలతో నెట్టుకొస్తున్నది. అటువంటి కపట రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్న పాకిస్తాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చాటవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దేశం ఉగ్ర వాదానికి స్థావరంగా ఉన్నదనే సందేశం ప్రపంచ దేశాలన్నిటికీ చేర్చాలి. ఆ దిశగా భారత విదేశాంగ యంత్రాంగం యావత్తూ కృషి చేయడానికి పుల్వామా దాడిని ఒక బలమైన సందర్భంగా వినియోగించుకోవాలి. -కె. రామచంద్రమూర్తి -
ఉగ్రవాది ఆదిల్‌కు శిక్షణ ఇచ్చింది అతడే!
అప్పటి దాకా సహచరులతో చర్చిస్తూ, కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాడుతూ సాఫీగా సాగిపోతున్న భారత సైనికుల ప్రయాణంలో ఒక్కసారిగా మృత్యుఘోష. జవాన్ల కాన్వాయ్‌ని ఢీకొట్టి యావత్ భారతావనికి తీరని శోకం మిగిల్చాడు కరుడు గట్టిన ఉగ్రవాది, జైషే కమాండర్ ఆదిల్ అలియాస్ వకాస్. తనను తాను పేల్చుకుని మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జవాన్లను పొట్టనబెట్టుకోవడానికి ముందే తన ఆశయం నెరవేరిన వెంటనే స్వర్గంలో ఉంటానంటూ ఆదిల్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆత్మాహుతికి ముందు అతడు ఎంతగా శిక్షణ పొందాడో అర్థమవుతోంది. (మాట ఇస్తున్నా.. ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రతీకారం : మోదీ) పుల్వామాలోని కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ పాఠశాల స్థాయిలోనే చదువు మానేశాడు. అనంతరం కొద్దికాలం తాపీమేస్త్రీగా, మరికొంత కాలం మసీదులో పనిచేశాడు. 2016, మార్చి 19న ఇద్దరు యువకులతో కలిసి ఆదిల్ అదృశ్యమయ్యాడు. ఇక ఆనాటి నుంచి జైషే కమాండర్‌గా మారిన ఆదిల్ ప్రస్తుతం ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. అయితే తనకు అప్పగించిన ఆపరేషన్‌ను ఆదిల్ పక్కాగా అమలు చేయడానికి జైషే మహ్మద్ టాప్ కమాండర్ ఘాజీ అబ్దుల్ రషీద్ ఇచ్చిన శిక్షణే కారణమని ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. (ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!) ఐఈడీ ఎక్స్పర్ట్ ఘాజీ.. జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్‌కు ఘాజీ అత్యంత నమ్మకస్తుడు. ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ గ్రూపులో శిక్షణ పొందిన ఈ 32 ఏళ్ల ఉగ్రవాది.. 2008లో జైషేలో చేరాడు. అనతి కాలంలోనే మసూద్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిన ఘాజీ.. ఐఈడీ తయారు చేయడం, అమర్చడం, పేల్చడంలో నిపుణుడు. 2010 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్లో జైషేలో యువకులను చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం పుల్వామా జిల్లాలో జైషే చీఫ్ మసూద్ మేనల్లుళ్లు తాలా రషీద్ (2017), ఉస్మాన్ (2018)లను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ క్రమంలో వారి మృతికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా భావించిన మసూద్ ఘాజీని రంగంలోకి దింపినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చేరుకున్న ఘాజీ దక్షిణ కశ్మీర్‌పై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. తీవ్రవాద భావాలున్న యువకులను ఆకర్షించి... జైషేను బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆదిల్ వంటి ఎంతోమంది యువకులను అతడు జైషేలో చేర్చుకుని శిక్షణనిచ్చినట్టు సమాచారం. ఎక్కడైతే తన మేనల్లుళ్లను అంతం చేశారో .. అదే జిల్లాలో జవాన్లే లక్ష్యంగా దాడికి సిద్ధం చేయాలంటూ మసూద్ ఇటీవలే ఘాజీకి సూచించిన క్రమంలో ఆదిల్ ద్వారా గురువారం నాటి హింసరచన సాగించినట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఇటీవల పుల్వామాలోని రతన్‌పోరాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఘాజీ తృటిలో తప్పించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏదేమైనా సరే భరత జాతికి ఆగ్రహం తెప్పించిన మసూద్, ఘాజీ వంటి వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు.. భారత్ సరైన సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్న విషయం జగమెరిగిన సత్యం. -
మాట ఇస్తున్నా.. ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రతీకారం : మోదీ
ముంబై : భారత వీరజవాన్ల కుటుంబాలు, యావత్ భారతావని కారుస్తున్న ప్రతీ కన్నీటి బొట్టుకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులను హెచ్చరించారు. శనివారం మహారాష్ట్రలో పర్యటించిన ఆయన... పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన మహారాష్ట్ర జవాన్లు నితిన్ రాథోడ్, సంజయ్ రాజ్‌పుత్‌లకు నివాళులు అర్పించారు. అనంతరం మోదీ ప్రసంగిస్తూ .. ‘ ఇది సంయమనం పాటించాల్సిన సమయం. అయితే మన జవాన్లను అత్యంత పాశవికంగా అంతమొందించిన వారెవరిని విడిచిపెట్టనని ప్రతీ ఒక్కరికి మాట ఇస్తున్నా. మన సైనికుల పట్ల యావత్ భరత జాతికి పూర్తి నమ్మకం ఉంది. వీర జవాన్ల త్యాగమెన్నటికీ వృథా కాదు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా సరే మన సైనికులు వారిని బయటికి లాగి కచ్చితంగా సరైన శిక్షే విధిస్తారు. మన పక్క దేశం ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఈ ఘటన వారి దివాళాకోరుతనం, దిగజారుడుతనాలకు నిదర్శనం. పాపం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఆత్మాహుతి దళసభ్యుడు తన కారుతో.. జవాన్ల కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. -
పాక్ పత్రికపై జాన్వి కపూర్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జాన్వి కపూర్ పాకిస్తాన్‌కు చెందిన ఓ పత్రికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడిని యావత్ ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్న విషయం తెలిసిందే. కానీ పాకిస్థాన్‌కు చెందిన ఓ పత్రిక తమ దేశానికి అనుకూలంగా ప్రచురించుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడి దాడిలో జవాన్లు చనిపోయారంటూ మొదటి పేజీలో ఓ కథనాన్ని రాసుకుంది. దీనిపై స్పందించిన జాన్వి.. ‘‘ఉగ్రవాదిని స్వాతంత్ర్య సమరయోధిడిగా వర్ణిస్తారా. చేసిన తప్పును సమర్థించుకుంటారా?. జవాన్ల మృతిని పక్క దేశం సంబరం చేసుకోవడం బాధాకరంగా ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జాన్వి పాక్ పత్రిక ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధకు, ఆగ్రహానికి గురి చేసింది. ఈ పత్రిక ఉగ్రదాడిని తమ స్వతంత్రం కోసం పోరాటం అంటూ సెలబ్రేట్ చేసుకుంటోంది. తీవ్రంగా ఖండించాల్సిన ఇలాంటి ఘోరమైన ఘటనకు సంబంధించిన నిజాల్ని మీడియా వక్రీకరించడం నిజంగా బాధ్యతారహితం. ఈ ఉగ్రవాది జవాన్ల జీవితాల్ని నాశనం చేయడమే కాదు దేశం కోసం పోరాడే వ్యక్తులును, వారికి ఉన్న గౌరవాన్ని కూడా కించపరిచారు. ప్రాణాలు త్యాగం చేసిన మన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు శక్తిని ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్న. జైహింద్’ అని జాన్వి పోస్ట్ చేశారు. -
పాకిస్థాన్‌తో టీవీ యాంకర్ల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన టెర్రరిస్ట్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్‌పై యుద్ధం చేయాల్సిందేనంటూ పలు ప్రాంతీయ టీవీలతోపాటు పలు జాతీయ టీవీ ఛానళ్ల యాంకర్లు తీర్మానించడమే కాదు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు భారత సైన్యానికి వెంటనే కదన రంగంలోకి దూకాల్సిందిగా శనివారం పదే పదే పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరు కూడా ఇదే కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. తెలుగు టీవీ యాంకర్ రష్మీ అవేశంతో ఊగిపోతూ పాకిస్థాన్‌పై రెండో సర్జికల్ స్ట్రైక్స్ చేయాలంటూ ‘తెర మాకీ....’ అంటూ రెచ్చిపోయారు. పాకిస్థాన్‌పై ఎలా బదులు తీర్చుకోవాలో తేల్చుకోవడానికి అఖిల పక్ష సమావేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ తర్జనభర్జనలు పడుతుండగానే ‘పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలకు మోదీ సిద్ధంగా ఉన్నారు’ అంటూ ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తూ వస్తున్నారు. ‘ప్రతీకారం కోరుకుంటున్న భారత్’ అన్న నినాదంతోనే ‘రిపబ్లిక్ టీవీ’ వార్తలను ప్రసారం చేసింది. సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ అర్నాబ్ గోసామి మాట్లాడుతూ ‘పాక్‌తో యుద్ధం చేయడం మినహా మరో మార్గం ఉందా ? లేదు!’ అంటూ సెలవిచ్చారు. ‘పాకిస్థాన్ విషయంలో ఇక వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేదు’ అంటూ టైమ్స్ నౌ యాంకర్ నావికా కుమార్ వ్యాఖ్యానించారు. ‘ ఓ భారత ప్రధాని ప్రజలనుద్దేశించి ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే మొదటి సారి. పాకిస్థాన్‌తో పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు’ అని ఇండియా టుడే టీవీ యాంకర్ రాహుల్ కన్వల్ వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్‌లోని అన్ని టెర్రరిస్టు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపాలి’ అంటూ న్యూస్ 18 యాంకర్ భూపేంద్ర చౌబే పిలుపునిచ్చారు. యుద్ధానికి సమయం ఆసన్నమైందంటూ 2016లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులను ప్రస్తావిస్తూ ఏబీపీ న్యూస్ ఛానల్ అయితే ఇటీవల విడుదలైన ‘యురి’ బాలివుడ్ సినిమాలోని క్లిప్స్‌ను చూపించారు. యాంకర్ల పిలుపులపై ‘ఎన్డీటీవీ ఇండియా’ రవిష్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ‘మన సైనికులు మరణించినందుకు మనకు బాధగా ఉంటుంది. మనసు ప్రతీకారం కోరుకుంటుంది. ఇక్కడే కాస్త సంయమనం అవసరం. అరుపులు, కేకలు వినిపించడానికి ప్రతి సంఘటన ఓ సినిమా ప్లాట్ కాదు. రెచ్చగొట్టే భాష రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తుంది. సమస్యను పరిష్కరించదు. ఈ సమయంలో మనం మౌనం పాటించడమే అమర వీరులకు నిజమైన నివాళి. మృధువుగా మాట్లాడుతాం. బాధిత కుటుంబాల మెదళ్లును తొలుస్తున్న విషయం గురించి ఆలోచిద్దాం. కశ్మీరు పరిస్థితి కంటే మీడియా పరిస్థితి దిగజారినందుకు బాధగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. కార్గిల్ వీరుడి అమూల్య సందేశం ‘జీ న్యూస్’ చర్చాగోష్టిలో పాల్గొన్న 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొని కుడి కాలును కోల్పోయిన యోధుడు మేజర్ నవదీప్ సింగ్ చాలా బాధ్యుతాయుతంగా స్పందించారు. ‘దేశ త్రివర్ణ పతాకానికి అండగా ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధంగానే ఉన్నారు. ఒకప్పుడు టెర్రరిస్టయిన నజీర్ వానిలాగా ఓ కశ్మీర్ యువకుడు ఎందుకు కావాలనుకుంటున్నాడో కూడా ఆలోచించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రాణాలే కాదు, అవయవాలు కూడా పోతాయి. ఆ తర్వాత నష్ట పరిహారం కోసం కోర్టుల తలుపులు తట్టాలి. యుద్ధంలో సైనికుడు చనిపోవాలని మనం కోరుకుంటాం. ఆ తర్వాత ఆ సైనికుడి వితంతు భార్య పింఛను కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. యుద్ధంలో కొన్నిసార్లు మృతదేహం ఆనవాళ్లు కూడా దొరకవు. పింఛను కావాలంటే భర్త మతదేహాన్ని తీసుకరావాలని అధికార యంత్రాంగం ఆదేశిస్తుంది. యుద్ధంలో గాయపడితే అంగవైకల్య నష్టపరిహార పింఛను కోసం ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాలి. యుద్ధంలో కాలు కోల్పోయిన నేను పింఛను కోసం ఏడేళ్లు కోర్టుల చుట్టూ తిరిగాను. సైనిక పింఛను విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పీళ్లను ఉపసంహరించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశించినప్పటికీ ఇప్పటికీ వెయ్యి కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రాణాలతో పరాచకాలొద్దు. అన్యాయంగా సైనికుల ప్రాణాలను బలిపెట్టవద్దు. భారత సైన్యానికి ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసు. ఎం చేయాలో వారికి మనం సూచించాల్సిన అవసరం లేదు. సముచిత సమయంలో సముచిత చర్య తీసుకోవడం వారికి తెలుసు. ముందుగా పాకిస్థాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రపంచం ప్రకంటించేలా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకరావాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందిగదా అంటూ ఆవేశంతో మాట్లాడడం సముచితం కాదు’ అని ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయినా ‘సార్! మీరు పుల్వామా దాడి చిత్రాలను చూసినట్లు లేదు. ప్రతీకారం ఒక్కటే పరిష్కారమని మీరు భావించకపోవడానికి అదే కారణం అనుకుంటా’ అని జీన్యూస్ యాంకర్ వ్యాఖ్యానించడం కొసమెరపు. -
పుల్వామా ఉగ్రదాడి; మరో కీలక సమావేశం
న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఆయన నివాసంలో కొనసాగుతున్న ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చీఫ్, ఇంటలెజిన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ సహా కేంద్ర హోంశాఖ సెక్రటరీ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పుల్వామా ఘటనపై అనుసరించాల్సిన వ్యూహాలపై, జమ్మూ కశ్మీర్లో భద్రత పెంపుపై చర్చిస్తున్నారు. అదేవిధంగా జమ్మూ కశ్మీర్ విద్యార్థులకు ఎటువంటి హాని కలగకుంగా చూసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు రాజ్‌నాథ్ ఆదేశాలు జారీ చేశారు. కాగా పుల్వామా ఉగ్రదాడిపై చర్చించేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో జరిగిన ఈ భేటీకి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిపై తీసుకోబోయే చర్యలను రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారు. భారత దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే చర్యలను అనమతించేదిలేదని అఖిలపక్షం అభిప్రాయపడింది. ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టాల్సిందేనని నిర్ణయించింది. -
పుల్వామా ఉగ్రదాడి; రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం
-
సౌదీ రాజు పాక్ పర్యటన వాయిదా
ఇస్లామాబాద్ : సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్‌లో రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈనెల 16,17 తేదీల్లో ఆయన పాక్‌లో పర్యటించి పలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల పర్యటన కాస్త ఆలస్యమైనట్లు తెలిసింది. శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆయన విదేశీ పర్యటన ఆదివారం నుంచి యథావిధిగా కొనసాగనుందని పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. సౌదీ రాజు వెంట పెద్ద ఎత్తున వ్యాపార ప్రతినిధులు ఇక్కడకు రానున్నారు. అయితే పర్యటనలో మార్పులు, ఆలస్యంపై పాక్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని సౌదీ రాజు సల్మాన్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. దాడి జరిగిన వెంటనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు వచ్చే వారం సౌదీ రాజు తమ దేశ వ్యాపార ప్రతినిధులతో భారత్‌కు రానున్నారు. -
‘చాలు.. ఇక చాలు.. గుణపాఠం చెప్పాల్సిందే’
చండీగఢ్ : ‘చాలు.. ఇక చాలు.. శాంతి మంత్రం జపించాల్సిన అవసరం లేకుండా చేశారు. వాళ్లకు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం సరైన సమయంలో స్పందిస్తుందని భావిస్తున్నాను’ అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భావోద్వేగానికి లోనయ్యారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పంజాబ్ అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది. ఈ క్రమంలో అమరీందర్ సింగ్ మాట్లాడుతూ... పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి అంటూ ప్రసంగాలు చేస్తుంటే.. ఇక ఆ దేశ ఆర్మీ జనరల్ కమర్ జావేద్ బజ్వా మాత్రం యుద్ధం గురించి మాట్లాడి అసలు నిజాన్ని బట్టబయలు చేస్తారు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంజాబీ(పాక్) అయిన జావేద్ బజ్వా... తానెంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించగలడో.. భారత పంజాబీలు కూడా అంతటి ధైర్యవంతులేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. పంజాబ్ జోలికి రావాలని చూస్తే బజ్వాను ఎలా దారికి తేవాలో ఇక్కడి పంజాబీలకు తెలుసునని హెచ్చరించారు. మరోసారి దుస్సాహసానికి పాల్పడకుండా ఉండాలంటే.. ‘పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ స్థాపించి గురుద్వార సాహిబ్ సేవ చేస్తానంటారు. కానీ ఆయన ఐఎస్ఐ మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. ద్వంద్వ విధానాలకు ఇది నిదర్శనం. ఆ దేశ ఆర్మీ జనరల్ బజ్వా మద్దతుతో గద్దెనెక్కిన ఇమ్రాన్ ఖాన్ ఇంతకన్నా ఏం చేస్తారు. చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి హేయమైన ఘటనలు ఆపండి. మరొక విషయం.. కొన్ని దేశాల ప్రోద్బలంతో 2020లో రిఫరెండం చేపట్టాలని చూస్తున్న కలిస్థాన్ వేర్పాటువాదుల ఆటలు కూడా ఇకపై కొనసాగవు’ అని అమరీందర్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ‘వాళ్లు(ఉగ్రవాదులు) అతిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోనట్లైతే వారు మరోసారి దుస్సాహసానికి పాల్పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పాకిస్తాన్ ఎత్తుగడలను సరైన విధంగా అంచనా వేయాలి. వారికి బుద్ధి చెప్పాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. కాగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ముష్కరులపై యావత్ భారతావని ఆవేశంతో రగిలిపోతోంది. జవాన్ల త్యాగాలు వృథా కాకుండా ఉండాలంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు సరైన జవాబు ఇచ్చి తీరాల్సిందేనంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఆత్మాహుతి దళసభ్యుడు తన కారుతో.. జవాన్ల కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. -
సైనికుల త్యాగాలకు వెలకట్టలేం : చంద్రబాబు
సాక్షి, అమరావతి : పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి.. మన కుటుంబాల కోసం పాటుపడుతున్న సైనికుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు. -
పుల్వామా ఉగ్రదాడి.. మోదీపై విపక్షాల ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పుల్వామా ఉగ్రవాద దాడిపై చర్చిందుకు పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కీలకమైన ఈ సమావేశానికి మోదీ హాజరుకాలేదు. ప్రధాని గైర్హాజరుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత పెద్ద ఘటన జరిగితే ప్రధానమంత్రి కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించపోవడం ఏంటని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శనివారం పార్లమెంట్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పొల్గొన్న పార్టీలు.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని చెబుతూనే ప్రధాని రాకపోవడంపై మండిపడ్డాయి. తమ అభిప్రాయాలను ప్రధానితోనే పంచుకుంటామని, మోదీతో ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేయాలని పలువురు నేతలు స్పష్టంచేశారు. ఉగ్రవాద పోరుపై ప్రధాని హోదాలో మోదీ చేసిన చర్యలేమిటో తెలపాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి మోదీ రాకపోవడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెబుతామని పార్టీ బహిరంగ సభల్లో ఊదరగొట్టే మోదీ.. ఉగ్రవాదాన్ని అణచడంలో ఇనాళ్లు ఏం చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. కేవలం మాటలే తప్ప మోదీ సాధించింది ఏమీ లేదని ఆయన అన్నారు. ఉగ్రదాడిపై చర్చించేందుకు అన్ని పార్టీలతో మోదీ సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించాలని ఆయన కోరారు. -
త్యాగాలకు మా బిడ్డలంతా సిద్ధం
భోపాల్: దేశం కోసం తమ బిడ్డలందరినీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు మధ్యప్రదేశ్‌లోని కుదవాల్ సిహోరా గ్రామస్థులు. పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఈ గ్రామానికి చెందిన 36 ఏళ్ల అశ్విన్ కచ్చి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే దేశం కోసం తమ బిడ్డ ప్రాణాలర్పించినందుకు తామెంతో గర్వపడుతున్నామని.. మిగతా బిడ్డలను కూడా సైన్యంలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అశ్విన్ తండ్రి మాట్లాడుతూ.. ‘నా కొడుకు అశ్విన్ లాంటి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకున్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలి’ అని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మా గ్రామానికి చెందిన దాదాపు 30 మంది ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరెంతోమంది యువకులు సైన్యంలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు' అన్నారు. -
ముగిసిన అఖిలపక్ష సమావేశం
-
‘మోదీ సర్కార్ వైఫల్యం వల్లే ఉగ్రదాడి’
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ వైఫల్యం వల్లే కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఆరోపించారు. జమ్మూ కశ్మీర్లో స్థానిక ప్రజల మద్దతును మోదీ సర్కార్ కోల్పోయిందని, అందుకే ఇంత పెద్ద దాడిని ఉగ్రవాదులు చేయగలిగారని వివరించారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి దురదృష్టకరమన్నారు. పాకిస్తాన్ అండతోనే భారత్‌లో ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నారు. సర్జికల్ దాడులు కేవలం ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగినట్లు ఎక్కువగా ప్రచారం చేసుకుందని.. కానీ యూపీఏ హయాంలో కూడా సర్జికల్ దాడులు జరిగాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. ఏపీసీసీ భరోసా యాత్ర ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పల్లం రాజు పేర్కొన్నారు. విభజన హామీలన్నీ అమలయ్యేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 19 నుంచి ఏపీకి ప్రత్యేక హోదా కోసం భరోసా యాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఏపీసీసీ భరోసా యాత్ర అనంతపురం మడకశిరలో ప్రారంభమై.. మార్చి 3 న ఇచ్చాపురంలో ముగుస్తుందన్నారు. అగ్రగామి ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో భరోసా యాత్ర సాగుతుందని పల్లం రాజు అన్నారు. -
నిప్పులు చెరిగిన యాంకర్ రష్మీ
సాక్షి, హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారకంగా పాకిస్తాన్‌పై యుద్దం చేయాల్సిందేనని, సర్జికల్ స్ట్రైక్ 2 జరపాల్సిందేనని యావత్ భారత్ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ దాడిలో అసువులు బాసిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ పాకిస్తాన్ దుశ్చర్యపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి, బుల్లితెర యాంకర్ రష్మీగౌతమ్ ట్విటర్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్‌లోనే ఉంటూ పాక్ మద్దతుగా మాట్లాడిన వారిని ఏకిపారేశారు. పుల్వామా దాడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధును సైతం ఈ బుల్లితెర యాంకర్ వదిలి పెట్టలేదు. ‘దేశ విభజన సమయంలోనే పాక్ వైపుకి వెళ్ళాల్సింది. కానీ మన దురదృష్టం కొద్దీ ఈ దేశంలో ఉన్నాడు.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ సిద్ధూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ( చదవండి : ‘సిద్ధూని తీసేయకపోతే చూడం’) పాకిస్తాన్ జిందాబాద్ అంటూ షోయబ్ హఫీజ్ అనే నెటిజన్ చేసిన కామెంట్‌కు రష్మీ గౌతం ఆగ్రహంతో ఊగిపోయింది. ‘నీ పాకిస్థాన్ గొప్పతనం ఏంట్రా? సాలే, మాతోనే అస్థిత్వం, లేకపోతే నువ్వు దానితో సమానం.. మూసుకుని కూర్చో.. దేశ వ్యతిరేక విధానం సిగ్గులేని చర్య.. ’ అని నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ స్టూడెంట్ చేసిన కామెంట్‌పై కూడా ఘాటుగానే కామెంట్ చేశారు. ‘ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఈ నాకొడుకులను ఏరి పారెయ్యాలి’.. అంటూ తన ఆవేశాన్ని వెళ్ళగక్కారు.. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్, రష్మీకి మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్నారు. (చదవండి: సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు) Teri Pakistan ki aise ki tesi Sale tum nikale hi humane HO bacha samhjke maaf karte rahe hai Hum hai tho tum HO Varna tum maati ke barabar Koi asthitva nahi hai tumhara Even few of ur pak states are named after us So shut the fuck up https://t.co/EsqY2pU2Nt — rashmi gautam (@rashmigautam27) February 15, 2019 At the time of partition he was supposed to go to the other side sadly to our bad luck he stayed back here https://t.co/9JSN8z3epP — rashmi gautam (@rashmigautam27) February 16, 2019 -
ఉగ్రదాడిపై ముగిసిన అఖిలపక్ష సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఉగ్రదాడిపై తీసుకోబోయే చర్యలను రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారు. భారత దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే చర్యలను అనమతించేదిలేదని అఖిలపక్షం అభిప్రాయపడింది. ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టాల్సిందేనని నిర్ణయించింది. ఈ విషయంలో ప్రభుత్వం చేపట్టే చర్యలకు పూర్తి మద్దతు ఉంటుందని సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీలు స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా చేసిన మూడు తీర్మానాలను అఖిలపక్షం ఆమోదించింది. ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టేందుకు సైనికులకు దేశమంతా అండగా నిలబడి ఉందని అఖిలపక్షం అభిప్రాయపడింది. -
పాక్‌కు ఆ స్టేటస్‌ను కొనసాగించండి.. కానీ
న్యూఢిల్లీ : ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ (ఎమ్‌ఎఫ్‌ఎన్)ను భారత ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టేటస్‌ను కొనసాగించాలని, కానీ ఎమ్ఎఫ్ఎన్లోని ‘ఎఫ్’ అర్థాన్ని మాత్రం భారత పౌరులు నిర్ణయిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు. I have some news for Pakistan. We should continue their ‘MFN’ status. Only thing is, that this time we the civilians will decide what ‘F’ stands for. https://t.co/5SsC6BlDvT — Gautam Gambhir (@GautamGambhir) February 16, 2019 ‘పాకిస్తాన్ గురించి ఓ వార్త విన్నాను. మనం ఆ దేశానికిచ్చిన ఎమ్‌ఎఫ్‌ఎన్ స్టేటస్‌ను కొనసాగిద్దాం. కానీ ఇందులోని ఎఫ్ అర్థాన్ని మాత్రం భారత పౌరులు నిర్ణయిస్తారు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై భారత నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తుండగా పాక్ నెటిజన్లు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత నెటిజన్లు ఎఫ్‌కు తమ తోచిన అర్థాన్ని ఇస్తూ కామెంట్ చేస్తుండగా.. పాక్ నెటిజన్లు మాత్రం.. ఈ దాడిలో తమ దేశ ప్రమేయమే లేదని సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి అనంతరం తీవ్ర భావోద్వేగంతో ట్వీట్ చేసిన గంభీర్.. ఇప్పటి వరకు జరిగింది చాలని.. వెంటనే పాకిస్తాన్‌తో యుద్దం చేయాలని డిమాండ్ చేశాడు. ఈ ఉగ్రదాడిని ఖండించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఎమ్‌ఎఫ్‌ఎన్ స్టేటస్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిని చేస్తామని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు సహకరించేవారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరించారు. (చదవండి: ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్) -
‘నా తండ్రిని చూస్తే గర్వంగా ఉంది’
సాక్షి, భువనేశ్వర్: కశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమర జవాన్ల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వారికి సంబంధించిన విషాదగాథలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తండ్రిని కోల్పోయిన బిడ్డలు, భర్తలను కోల్పోయిన భార్యలు.. ఇలా ఒక్కొక్కరి వ్యథలు వర్ణనాతీతం. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎప్ జవాను ప్రసన్న కుమార్ సాహూ కూతురు రోజీ చేసిన వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి. ‘నాన్నను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. అదే సమయంలో దేశం కోసం ప్రాణాలొదిలిని నా తండ్రిని చూస్తే గర్వంగా ఉంది’అని ప్రసన్న కుమార్ సాహూ కూతురు రోజీ బాధతప్త హృదయంతో చేసిన వ్యాఖ్యలివి. రెండు నెలల సెలవులను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి వెళ్లిన ప్రసన్న కుమార్ ఇక తిరిగిరాడని కుటుంసభ్యులు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒడిశాకు చెందిన ప్రసన్న కుమార్ 1995లో సీఆర్పీఎఫ్లో చేరారు. అతనికి భార్య మీన, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. సీఎం నవీన్ పట్నాయక్ ప్రసన్న కుమార్, మనోజ్ బెహ్రా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ దాడి పిరికి పందల చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ప్రసన్న కుమార్, మనోజ్ బెహ్రాల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. -
వారు చితక్కొట్టడంతోనే నా కొడుకు ఉగ్రవాదయ్యాడు
శ్రీనగర్ : మూడేళ్ల క్రితం భారత బలగాలు తన కొడుకును చితక్కొట్టడంతోనే మిలిటెంట్ గ్రూప్‌లో చేరాడని సూసైడర్ బాంబర్, ఆదిల్ అహ్మద్ దార్ తల్లిదండ్రులు తెలిపారు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆదిల్ ఆత్మహుతికి దాడికి తెగబడి 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఆదిల్ ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకొని జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిపై దుండగుడు ఆదిల్ అహ్మద్ దార్ తల్లిదండ్రులు రాయిటర్స్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకున్న బాధే తమకు ఉందని ఆదిల్ అహ్మద్ దార్ తండ్రి గులామ్ అహ్మద్ దార్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2016లో తన కొడుకు అతని స్నేహితులు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా.. భారత సైనికులు అడ్డుకొని చితక్కొట్టారని, ఈ ఘటనతోనే ఆదిల్ ఉగ్రవాద గ్రూప్‌ల పట్ల ఆకర్షితుడయ్యాడని తెలిపాడు. అప్పటి నుంచి భారత సైనికులపై కోపం పెంచుకున్నాడని అతని తల్లి ఫహమీదా పేర్కొంది. ఇక తన కొడుకు ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదని, ఈ దాడి వ్యూహం తమకు తెలియదన్నారు. గతేడాది మార్చి 19 నుంచి ఆదిల్.. పని చేసే చోటు నుంచి అదృశ్యమయ్యాడని, అప్పటి నుంచి జాడలేడన్నారు. అతని జాడ కోసం మూడు నెలలుగా ప్రయత్నించి ఆశ చాలించుకున్నామన్నారు. తన కొడుకు మరణానికి దేశంలోని రాజకీయనాయకులే కారణమని, కశ్మీర్ సమస్యపై తేల్చకుండా నాన్చుతున్నారని గులామ్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ అంశం తేలే వరకు.. తమలాంటి పేదల పిల్లలు, భారత జవాన్ల ప్రాణాలు పోతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. (చదవండి: ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!) -
ఉగ్రవాదంపై రెండేళ్ల తర్వాత అఖిలపక్ష భేటీ
-
‘ఆ శబ్దాన్ని నేను కూడా విన్నాను’
లక్నో : ఆర్మీ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన మెసేజ్ చూడగానే షాక్ అయ్యింది నీర్జా. ఇదేలా సాధ్యం.. రెండు నిమిషాల ముందు వరకూ తనతో మాట్లాడిన మనిషి ఇప్పుడు చనిపోవడం ఏంటని ఆలోచిస్తుంది. ఇదంతా అబద్ధమైతే బాగుండని కోరుకుంటుంది. కానీ ఆమె కోరిక నెరవేరలేదు. ముష్కరులు దాడిలో ఆమె భర్త మరణించాడు. దాంతో గుండెలవిసేలా విలపిస్తోంది నీర్జా. గురువారం పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లలో నీర్జ భర్త ప్రదీప్ కుమార్ కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ప్రదీప్(30) సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. గురువారం దాడి జరగడానికి ముందు వరకూ కూడా ప్రదీప్ తన భార్య నీర్జాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. తన గారల పట్టి మాన్య ఏం చేస్తుందని అడిగాడు ప్రదీప్. సమాధానం చెప్పేలోపే అవతలి వైపు నుంచి ఏదో పెద్ద శబ్దం వినిపించింది నీర్జాకు. రెండు సెకన్లలో ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. ఏదైనా సమస్య వచ్చిందేమో.. తర్వాత తనే కాల్ చేస్తాడు అనుకుంది నీర్జా. కానీ మరో రెండు నిమిషాల్లో ఆర్మీ కంట్రోల్ రూమ్ నుంచి ఆమెకు ఓ సందేశం వచ్చింది. ‘సీఆర్పీఎఫ్ జవాన్ ప్రదీప్ వీర మరణం పొందార’నేది దానిది సారాంశం. ఇది వినగానే ఒక్కాసారిగా షాక్ అయ్యింది నీర్జా. ఇదేలా సాధ్యం.. ఇప్పటివరకూ నాతో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి కేవలం రెండు నిమిషాల్లో మరణించడం ఏంటనుకుంది నీర్జా. కాసేపట్లో న్యూస్ చానెల్స్‌లో ఎక్కడ చూసిన ఈ వార్తలే. దాంతో తాను విన్నది నిజమే అని గ్రహించిన నీర్జా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన భర్త ఇక రాడని తెలిసి కన్నీరుమున్నిరుగా విలపిస్తుంది నీర్జా. ‘ప్రదీప్‌కు చిన్న కూతరు మాన్య అంటే చాలా ఇష్టం. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మాన్య గురించే అడిగాడు. నేను సమాధానం చెప్పేలోపే ఫోన్ కట్టయ్యింది. ఇంత దారుణం జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదం’టూ ఏడుస్తోంది నీర్జా. 2004లో సీఆర్పీఎఫ్లో చేరిన ప్రదీప్ 115వ బెటాలియన్‌లో విధులు నిర్వహించేవాడు. -
‘సిద్ధూని తీసేయకపోతే చూడం’
చండీగఢ్ : ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రజలు భగ్గుమన్నారు. సోషల్ మీడియా వేదికగా సిద్ధుపై దుమ్మెత్తిపోస్తున్నారు. 43 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై సిద్దూ స్పందిస్తూ.. ‘కొంతమంది కోసం మీరు దేశం మొత్తాన్ని నిందిస్తారా? హింసను ఎప్పుడూ ఖండించాల్సిందే. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించాల్సిందే. పాకిస్తాన్‌తో.. భారత్ చర్చలు జరిపినపుడు మాత్రమే ఇటువంటి ఘటనలు పునరావృతమవ్వవు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పాక్‌కు వత్తాసుగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో సోని టీవీలో ప్రసారమయ్యే ‘ది కపిల్ శర్మ షోను నిషేదించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఈ షో నుంచి సిద్ధూనన్న తీసేయాలని పట్టుబడుతున్నారు. ఈ షోను చూడకపోతే.. రద్దవుతోందని, ఇది అమరజవాన్లకు నిజమైన నివాళని పిలుపునిస్తున్నారు. సిద్ధూకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని కూడా కామెంట్ చేస్తున్నారు. ‘దేశ రక్షణ కోసం 40 మంది ప్రాణ త్యాగం చేస్తే.. సిగ్గులేకుండా పరాయి దేశానికి వత్తాసు పలుకుతావా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత జవాన్లపై ఏ మాత్రం గౌరవం ఉన్న సోనీ టీవీ వెంటనే కపిల్ శర్మ షో నుంచి సిద్ధుని తీసేయాలని సూచిస్తున్నారు. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో సిద్ధు తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి ప్రతీకారకంగా పాకిస్తాన్‌పై యుద్దం చేయాల్సిందేనని, సర్జికల్ స్ట్రైక్ 2 జరపాల్సిందేనని యావత్ భారత్ ముక్తకంఠంతో భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల విషయంలో భారత భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్చనిస్తున్నట్లు ప్రకటించారు. @SonyTV @KapilSharmaK9 We request you to expel @sherryontopp from The Kapil Sharma Show & show courtesy to nation where you earn revenue. Removing him would be great tribute to our martyrs of Pulwama,else we would boycott this show henceforth "Kapil Sharma" — Hitesh Vyas (@vyashit) February 15, 2019 We all must boycott Kapil Sharma show as long as Sidhu is there. — Rajendra Saluja (@RajendraSaluja) February 15, 2019 Throw Out Sidhu From The Kapil Sharma Show Or Els We #Boycott The Kapil Sharma Show..!!@SonyTV @KapilSharmaK9 — Soumya Roy (@SamRoy_) February 15, 2019 -
‘అలాంటి వారిని గాడిద మీద ఊరేగించాలి’
ఇక మీదట శాంతి, అహింస అని ఎవరైనా మాట్లాడితే వారిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి అంటున్నారు నటి కంగనా రనౌత్. గురువారం పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ అమానవీయ చర్యను ప్రపంచదేశాలన్ని ముక్తకంఠంతో ఖండించాయి. బాలీవుడ్ కూడా ఉగ్రచర్యలను తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఉగ్రదాడిని ఖండించారు. జవాన్ల మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘పాక్ మన దేశ భద్రతనే కాకుండా మన మర్యాదను కూడా గేళి చేసింది. మనకు హాని కలిగించడమే కాక అవమానించింది కూడా. ఇందుకు తగిన సమాధానం చెప్పాలి. ఈ పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండకూడదు. మన సహనాన్ని వారు చేతకానితనంగా భావిస్తున్నారు. ఫలితంగా ఈ రోజు దేశం రక్తమోడుతోంది. మన బిడ్డలను చంపి మనల్ని సవాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా శాంతి, అహింస అంటే అలాంటి వారి ముఖానికి నల్లరంగు పూసి.. గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి. నడి వీధిలో నిల్చోబెట్టి చెంప పగలకొట్టాలం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్ల మృతికి సంతాపంగా కంగనా మణికర్ణిక సక్సెస్ మీట్ కార్యక్రమాన్నికూడా వాయిదా వేశారు. -
ఇదే అసలైన సర్జికల్ స్ట్రైక్ అంటూ ఎగతాళి
కృష్ణరాజపురం (బెంగళూరు): కశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా బెంగళూరులో ఓ యువకుడు ‘అసలైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇదే’ అని ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న జమ్ముకశ్మీర్‌కు చెందిన అబిద్ మాలిక్ అనే యువకుడు ఉగ్రవాదుల దాడిపై తన ఫేస్బుక్ ఖాతాలో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అసలైన సర్జికల్ దాడి అంటే ఇదే అని అందులో ఎగతాళి చేశాడు. ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదిని పొగుడుతూ ‘రిప్ బ్రో’ అని కూడా వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ సమస్యపై స్పందించకపోతే భవిష్యత్‌లో మరో 40 మంది సైనికులు మరణిస్తారని కూడా ఆ పోస్ట్‌లో హెచ్చరించాడు. దీనిని చూసిన నెటిజన్లు అతనిపై భగ్గుమనడంతో వెంటనే ఖాతా నుంచి పోస్ట్ తొలగించి అబిద్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అబిద్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
పాక్‌కు అమెరికా హెచ్చరిక
ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం, ఆశ్రయం కల్పించడాన్ని తక్షణం మానుకోవాలని పాకిస్తాన్‌ను అమెరికా గట్టిగా హెచ్చరించింది. పుల్వామా ఉగ్రదాడిని అగ్ర దేశం ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రెస్ సెక్రటరీ శాండర్స్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండడాన్ని పాక్ విరమించుకుని ఆ దేశంలో ఉన్న అన్ని ఉగ్రవాద సంస్థలకు మద్దతును నిలిపేయాలి. పుల్వామాలో దాడి వల్ల అమెరికా, భారత్‌ల మధ్య ఉగ్రవాద వ్యతిరేక సహకారం, సమన్వయం మరింత పెరుగుతాయి’ అని తెలిపారు. బాధిత కుటుంబాలు, భారత ప్రభుత్వం, ప్రజలకు తాము సానుభూతి తెలుపుతున్నామన్నారు. -
పాక్‌పై దౌత్య యుద్ధం
న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ వంటి ఉగ్రమూకలకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, జపాన్ సహా 25 దేశాల దౌత్యాధికారులకు పుల్వామా ఉగ్రదాడి జరిగిన తీరును భారత్ వివరించింది. ఉగ్రవాదాన్ని విదేశీ విధానంగా మలుచుకున్న పాక్ వ్యవహారశైలిని ఎండగట్టింది. ఢిల్లీలోని తన కార్యాలయానికి రావాల్సిందిగా పాక్ హైకమిషనర్ సోహైల్ మహమూద్‌కు భారత విదేశాంగ కార్యదర్శి సమన్లు జారీచేశారు. దాడిపై ఆయన తీవ్ర నిరసనను తెలియజేశారు. జైషేకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సత్వరం, ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మసూద్‌కు చైనా మద్దతు బీజింగ్: దాడికి పాల్పడిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై ప్రపంచ ఉగ్రవాదిగా ముద్ర వేయించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి తాము మద్దతు తెలపబోమని చైనా వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడారు. మసూద్ అజార్‌పై ‘పంచ ఉగ్రవాది’ ముద్ర వేసే విషయంలో చైనా వైఖరేంటని ప్రశ్నించగా, ‘ఐరాస భద్రతా మండలి నిర్దేశించిన నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. జైషే మహ్మద్‌ను ఉగ్రవాద సంస్థగా ఇప్పటికే భద్రతా మండలి గుర్తించి ఆంక్షలు విధించింది’ అని చెప్పారు. మసూద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు భద్రతా మండలిలో వీటో అధికారాలున్న చైనా అడ్డుతగులుతోంది. -
దాడి పిరికిపందల చర్య
సాక్షి, హైదరాబాద్: సీఆర్పీఎఫ్ జవాన్లపై పుల్వామాలో జరిగిన దాడి పిరికిపందల చర్య అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్లో స్పందించారు. ‘సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన దాడి పిరికి పందల చర్య. వీరులైన జవాన్లకు సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. శోకంలో ఉన్న అమరవీరుల జవాన్ల కుటుంబాల పరిస్థితికి నా హృదయం ద్రవిస్తోంది. వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఈ ఘటనలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. -
గర్వపడుతున్నాం.. కానీ!
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి యువ సైనికులను అందించిన హమీర్పూర్ నుంచి కర్ణాటకలోని గుడిగెరె వరకు ఎన్నో గ్రామాల్లో శుక్రవారం విషాదం అలుముకుంది. ‘మా కొడుకు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం పట్ల గర్వంగా ఉంది. కానీ దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం ఉపేక్షించొద్దు’ అని బాధిత కుటుంబాలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. పలు గ్రామాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. పాక్‌ను విడిచిపెట్టొద్దు.. ‘మేం కొడుకును కోల్పోయాం. పాకిస్తాన్‌ను విడిచిపెట్టొద్దు. ఇలాంటి దాడులకు దిగకుండా ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా జవాలికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ తిలక్‌రాజ్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. 30 ఏళ్ల తిలక్‌రాజ్ మూడ్రోజుల క్రితమే ఇంటికి వచ్చి వెళ్లి సైన్యంలో చేరారు. ఇంతలోపే ఈ దారుణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. తిలక్‌రాజ్ కుటుంబానికి సీఎం జయరామ్ ఠాకూర్ రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు. 11నే ఇంటి నుంచి వెళ్లాడు.. ‘శ్రీనగర్ 115వ బెటాలియన్‌లో కొత్త పోస్టింగ్‌లో చేరడానికి ఈ నెల 11నే నా తమ్ముడు నాగ్‌పూర్ నుంచి వెళ్లాడు. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో ఫోన్ చేసి మాట్లాడాను. కొత్త పోస్టింగ్‌లో చేరేందుకు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో జమ్మూ నుంచి బయల్దేరినట్లు చెప్పాడు. మధ్యాహ్నంలోపే అంతా జరిగిపోయింది’ అని అమర జవాన్ సంజయ్ రాజ్‌పుత్ సోదరుడు రాజేశ్ వాపోయారు. మహారాష్ట్ర బుల్డానా జిల్లాలోని మాల్కాపూర్కు చెందిన సంజయ్(45) నాలుగేళ్లుగా నాగ్‌పూర్‌లోని సీఆర్పీఎఫ్ 213వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. వెళ్లిన మూడ్రోజులకే నిర్జీవంగా.. పుల్వామా దాడిలో అసువులు బాసిన వారిలో ఉత్తర ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ హర్పూర్ గ్రామానికి చెందిన పంకజ్ త్రిపాఠి ఒకరు. 2 నెలల సెలవుల్ని తమ కుటుంబంతో సరదాగా గడిపిన పంకజ్ మూడ్రోజుల క్రితమే తిరిగి విధుల్లోకి చేరేందుకు కశ్మీర్‌కు వెళ్లాడు. ఇంతలోనే ఆ కుటుంబం అతడి మరణ వార్తను వినాల్సి వచ్చింది. ‘అధికారులు మాకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. మాతృభూమి కోసం నా కొడుకు ప్రాణాలర్పించడం చాలా గర్వంగా ఉంది. అయితే ఉగ్రవాదులకు ప్రభుత్వం కచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే’నని పంకజ్ త్రిపాఠి తండ్రి ఓం ప్రకాశ్ త్రిపాఠి అన్నారు. చెట్టంత కొడుకే పోయాక ఏముంది? బిహార్‌కు చెందిన జవాన్లు సంజయ్‌కుమార్ సిన్హా, రతన్ఠాకూర్ సిన్హా ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల వేదన వర్ణనాతీతంగా ఉంది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్నాక ఇక తమకు దిక్కెవరంటూ విషణ్ణ వదనుడైన సంజయ్‌కుమార్ సిన్హా తండ్రి మహేంద్ర ప్రసాద్ సిన్హా రోదిస్తున్నారు. సంజయ్‌కుమార్‌కు పెళ్లీడొచ్చిన ఇద్దరు కుమార్తెలున్నారు. బాగల్పూర్కు చెందిన రతన్ఠాకూర్కు నాలుగేళ్ల కుమారుడు ఉండగా, ప్రస్తుతం అతని భార్య గర్భిణి. దియోరాలోని 30 ఏళ్ల విజయ్ కుమార్ మౌర్య ఇంటిలో రోదనలు మిన్నంటాయి. ఏడాదిన్నర కొడుకు, భార్యతో సంతోషంగా స్వగ్రామంలో గడిపిన మౌర్య ఫిబ్రవరి 9నే జమ్మూకు తిరిగి వెళ్లారు. పశ్చిమ బెంగాల్‌లోని చక్కాసి రాజ్బంగ్షీపుర గ్రామానికి చెందిన జవాను బబ్లూ సాంత్రా కుటుంబ సభ్యుల ఆవేదన అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది. ఆధార్, పాన్ కార్డులతో మృతుల గుర్తింపు న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ల మృతదేహాలు ముక్కలై చెల్లాచెదురుగా పడటంతో మృతులను గుర్తించడం కష్టమైంది. దీంతో సిబ్బంది బ్యాగులు, వారి దుస్తులకున్న జేబుల్లోని ఆధార్, పాన్ కార్డులు, సీఆర్పీఎఫ్ గుర్తింపు కార్డులు, సెలవు దరఖాస్తు పత్రాలతోనే గుర్తించారు. మరికొందరిని వారు ధరించిన చేతి గడియారాలు, వారి పర్సులు తదితరాల ద్వారా సహోద్యోగులు గుర్తించారు. మరికొంతమంది చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకుని ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారని ఓ అధికారి చెప్పారు. మరోవైపు ఆ సమయంలో కాన్వాయ్‌లో వెళ్తున్న జవాన్లందరి ఇళ్లకు అధికారులు ఫోన్లు చేసి.. జవాన్లలో ఎవ్వరూ గల్లంతు కాలేదనీ, చనిపోయినట్లుగా ప్రకటించిన జాబితా కచ్చితమైనదేనని చెప్పి, బతికున్న వారి కుటుంబాల్లో ధైర్యం నింపుతున్నారు. -
దాడిలో 80 కిలోల హైగ్రేడ్ ఆర్డీఎక్స్
న్యూఢిల్లీ: పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడిలో జైషే మొహమ్మద్ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ దాదాపు 80 కిలోల హైగ్రేడ్ ఆర్డీఎక్స్ను వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఐఈడీని ఈ దాడి కోసం వాడుంటే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదన్నారు. కశ్మీర్లో ఇప్పటివరకూ కాన్వాయ్‌ల రాకపోకల విషయంలో పాటిస్తున్న ప్రామాణిక విధాన ప్రక్రియ(ఎస్వోపీ)ను తాజా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై 272వ మైలురాయి వద్ద ఆదిల్ తన కారుతో సీఆర్పీఎఫ్ బస్సు ఎడమవైపు ఢీకొట్టించి తనను తాను పేల్చేసుకున్నాడని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన హెచ్ఆర్ 49 ఎఫ్ 0637 బస్సు తునాతునకలు అయ్యిందన్నారు. కాన్వాయ్ వరుసలో ఐదో బస్సును ఉగ్రవాది ఆదిల్ లక్ష్యంగా చేసుకున్నాడన్నారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో ప్రమాద సమయంలో మొత్తం 16 బుల్లెట్ ప్రూఫ్ బంకర్ వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 4న 2,871 మంది జవాన్లు 91 వాహనాల్లో ఇదే రోడ్డుపై శ్రీనగర్ నుంచి జమ్మూకు వచ్చారనీ, అప్పుడు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో యూపీకి చెందిన 12 మంది జవాన్లు అమరులు కాగా, రాజస్తాన్(5), పంజాబ్(4), పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా, తమిళనాడు, బిహార్ నుంచి ఇద్దరు చొప్పున, అస్సాం, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రాలకు చెందిన ఒక్కో జవాన్ ప్రాణాలు కోల్పోయారు. -
జమ్మూ ఆందోళన హింసాత్మకం
శ్రీనగర్ / జమ్మూ / న్యూఢిల్లీ: దాడి నేపథ్యంలో ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జమ్మూలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా పలుచోట్ల రెచ్చిపోయిన ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో తొలుత జమ్మూ పట్టణంలో కర్ఫ్యూ విధించిన జమ్మూ అధికారులు, చివరకు ఆర్మీ సాయాన్ని అర్థించారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది. జమ్మూలోని గుజ్జర్‌నగర్ ప్రాంతంలో ఆందోళనకారులు ఆస్తుల విధ్వంసానికి దిగారు. పలు వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు కార్లను ధ్వంసం చేశారు. మరోవైపు జమ్మూ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(జేసీసీఐ) గురువారం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై పూర్తిస్థాయి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ(సీవోఐ)కి సీఆర్పీఎఫ్ ఆదేశించింది. ఈ విషయమై సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. దాడిలో చనిపోయినవారంతా సీఆర్పీఎఫ్ రోడ్ ఓపెనింగ్ పార్టీ(ఆర్వోపీ)కి చెందినవారనీ, కాన్వాయ్కి వీరు రక్షణ కల్పించేవారని చెప్పారు. -
ఉగ్రదాడి తెస్తున్న పెను ప్రమాదం
జమ్మూ–కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి స్థానిక ఘర్షణల ఫలితం కాదు. ఐఎస్ఐ ప్రేరేపిత జైషే అహ్మద్ వ్యూహంలో భాగంగా ఆ దాడి జరిగింది. ఉగ్రదాడులు జరిగిన ప్రతి సందర్భంలోనూ పాక్ ప్రమాదకరమైన వ్యూహాన్ని అమలు చేస్తూంటుంది. నేను కోరిందల్లా ఇవ్వు. లేకపోతే నా తలను నేనే పేల్చుకుంటాను అంటూ తనతలపై తానే ట్రిగ్గర్ గురిపెట్టుకునే తరహాలో పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. పైగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగినప్పుడు చల్చార్చడానికి అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ముందుకొచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ క్రమంలో యుద్ధ ప్రకటన ఎవరు చేసినా దాని ఫలితం ప్రమాదకరంగానే ముగుస్తుంది. పాకిస్తాన్ వ్యూహచింతనపై దక్షిణాసియా వ్యవహారాల్లో అమెరికన్ నిపుణుడు స్టీఫెన్ పి. కోహెన్ తెలివిగా వర్ణించారు. పాకిస్తాన్ తన తలపై తుపాకీ గురిపెట్టుకుని ఇతర ప్రపంచంతో చర్చలు సాగిస్తూం టుందని వ్యాఖ్యానించారు. దాని సారాంశం ఏమిటంటే, నేను కోరిం దల్లా ఇవ్వు. లేకపోతే నా తలను నేనే పేల్చుకుంటాను. ఆ తర్వాత ఏర్పడే గందరగోళంతో మీరు తలపట్టుకోవలసి వస్తుంది. సరిగ్గా అలాంటి ట్రిగ్గర్నే పాకిస్తాన్ ఇప్పుడు పుల్వామాలో లాగిందా? (ఉగ్ర మారణహోమం) మొదటగా పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై జరిగిన దాడి పూర్తిగా దేశీయంగా జరిగిన ఉగ్రదాడి అని చెప్పడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయి. ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది తిరుగుబాటుతత్వం జీర్ణించుకుపోయిన భారతీయ కశ్మీర్ వాసి. కానీ అతడు పూర్తిగా భారతీయ వ్యూహరచనతో అమలుచేసిన ఉగ్రచర్యలో భాగం కాదని చెప్పడానికి తగిన కారణాలున్నాయి.1. జైషే మహమ్మద్ ఈ దాడికి తానే కారణమని ప్రకటించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఐఎస్ఐ నియంత్రణలో ఉండే సంస్థ. 2. ఈ ఉగ్రచర్యకు దారితీసిన తిరుగుబాటుతత్వం, ప్రేరణ స్థానికపరమైనదే కావచ్చు, కానీ ఔత్సాహిక స్థానిక బృందాల వద్ద ఇంతటి అధునాతనమైన పేలుడు పదార్థాలు (చాలావరకు ఆర్డీఎక్స్ లేక ఆర్డీక్స్ కలిపినవి) లభ్యమవుతాయని, గురిచూసి కొట్టే యంత్రాంగంతో కూడిన నైపుణ్యాలు వీరికి ఉంటాయని చెప్పడానికి కనీస సాక్ష్యాధారాలు కూడా లేవు. 3. ఆత్మాహుతి బాంబర్ రికార్డు చేసిన చివరి వీడియోను చూడండి. అతడు వాడిన భాష కశ్మీరీల బాధలకు ప్రతీకారం కోరుతున్నట్లు లేదు. పైగా భారత్‌లో ఇతర ప్రాంతాల్లోని ముస్లింలను రెచ్చగొడుతున్నట్లుగా కూడా ఆ ప్రకటనలో లేదు. పైగా బాబ్రీ మసీదు, గుజరాత్ ఘటనలు ప్రస్తావించాడు. ‘ఆవు మూత్రం తాగే వారికి’ వ్యతిరేకంగా తిరుగుబాటుకు ‘మన ముస్లింలు అందరూ’ సిద్ధపడాలని పిలుపునిచ్చాడు. ఇలాంటి భాష లష్కరే తోయిబా కంటే మించి జైషే ఉగ్రసంస్థ నుంచి పుట్టుకొచ్చిందే తప్ప స్థానికులది కాదు. (ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని) పుల్వామాలో జరిగిన దాడి గతంలో జైషే నిర్వహించిన దాడులకు అచ్చుగుద్దినట్లుంది. 2001లో శ్రీనగర్‌లో రాష్ట్ర అసెంబ్లీపై ఆత్మాహుతి దాడి, అదే సంవత్సరం పార్లమెంటుపై జరిగిన దాడి, ఇటీవల పఠాన్ కోట్, గుర్దాస్పూర్లపై దాడులు మొత్తంగా ఒకే లక్ష్యాన్ని ప్రకటించాయి. కశ్మీర్ వెలుపల ఏదో ఒక స్థాయిలో బీభత్సం సృష్టించాలి. ముంబైలో 2008లో లష్కర్ ఇలాగే చేసింది. కానీ దాని శక్తియుక్తులను చాలావరకు కశ్మీర్లో జరుగుతున్న పోరాటంలోనే ఇప్పటికీ ఉపయోగిస్తోంది. అయితే జైషే దానికంటే చిన్న సంస్థ అయినప్పటికీ, మరింత దుష్టత్వంతో, అపార వనరులతో ఐఎస్ఐ మద్ధతుతో ఇలాంటి ప్రభావశీలమైన దాడులను ఎంచుకుని మరీ సాగిస్తోంది. జైషే ఎంత శక్తిసంపన్నంగా తయారైందో మనకు ఐసీ–814 విమానం హైజాక్ కాలం నుంచే తెలుసు. అది 90ల చివర్లోనే భారతీయ విమానాన్ని కఠ్మాండులో హైజాక్ చేసి సురక్షితంగా కాందహార్‌లో దించి, ప్రయాణికులను వదిలిపెట్టాలంటే భారత్ జైళ్లలో ఉండే దాని కీలక నేతలను విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టి మరీ సాధించుకుంది. జైషే చీఫ్ మసూద్ అజర్ విడుదల ప్రక్రియ వరకు పూర్తిగా అది ఐఎస్ఐ కనుసన్నల్లో నడిచిందని పదే పదే రుజువవుతూ వస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం, ఐఎస్ఐ అయితే.. లష్కర్, హఫీజ్ సయీద్‌ల కంటే జైషేనే తమ అతిపెద్ద ఆస్తిగా భావిస్తున్నాయి. జైషే వీరి అతి ప్రధాన శక్తిగా తయారైంది. చైనా ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది కాబట్టే మసూద్ అజర్‌ని కాపాడే విషయంలో సిగ్గులేకుండా పాక్‌తో పోటీపడుతోంది. అందుకే ఉగ్రవాది స్థానిక కశ్మీరీ కావడంలో ఆశ్చర్యపడాల్సింది లేదు. విమాన హైజాక్, పార్లమెంట్ తదితర చోట్ల జరిపిన దాడులతో సహా జైషే సాగించిన ప్రతి ఉగ్రచర్యలోనూ భారతీయ కశ్మీరీలను కీలక భాగస్వాములుగా చేస్తూ వస్తోంది. కాబట్టే ఉగ్రవాదానికి స్థానిక మూలాలను వెదుకుతూ ఉగ్రచర్చల్లో పాకిస్తాన్‌కు నేరుగా పాత్ర లేదనిపించేలా జరుగుతున్న సూత్రబద్ధ చర్చల్లో సమయం వృ«థా చేయడం మానడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ ప్రశ్నను ఎందుకు లేవనెత్తుతున్నాం. పాకిస్తాన్ చివరికి తన తలపైకే ట్రిగ్గర్ గురిపెట్టుకుందా? జైషే, లష్కరే గతంలో ఎలాంటి ప్రతీకార ప్రకటనలకు దిగకుండానే దాడులకు పాల్పడేవి. అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి మన్మోహన్ సింగ్ హయాం మధ్య కాలంలో భారత్ ఆగ్రహావేశాల ప్రదర్శననుంచి బయటపడి పాక్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని తీసుకొచ్చే విధానాలవైపునకు మళ్లింది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం కంటే మౌలికంగా యుద్ధ వ్యతిరేక వ్యూహతత్వం వైపు మొగ్గుచూపింది. మోదీ ప్రభుత్వం ఇలాంటి నటనను సాగించడం లేదు. మన్మో హన్, వాజ్‌పేయి తదితర ప్రభుత్వాలు గతంలో వ్యవహరించిన తీరుని మోదీ ప్రభుత్వం పిరికి చేష్టగా భావిస్తోంది. ప్రత్యేకించి ఉడీ సర్జికల్ దాడుల అనంతరం ఉగ్రదాడులకు వ్యతిరేకంగా దాడిని నిలి పివేయడం, లేక చాలా కాలం తనకు తాను నిబ్బరంగా ఉండటం మోదీ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అలాగే పాక్ కూడా యుద్ధానికి సమీపంలోకి వచ్చింది. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా ఎక్కడ అనేది ఎవరికీ తెలీదు కానీ ఆ తరుణం సంభవించడానికి ఎక్కువ కాలం పట్టేట్టు లేదు. ప్రతీకారాత్మక ప్రతిస్పందన త్వరలో సంభవించవచ్చు. ప్రత్యర్థిపై తాము వీరోచిత విజయం అందుకున్నామంటూ పెద్దగా ప్రకటించుకునే రూపంలో అది ఉండవచ్చు. అదేసమయంలో భారత్ ఇంతవరకు కనీ వినీ ఎరుగని ఎన్నికల ప్రచారం ప్రారంభ దినాల్లోకి అడుగిడుతోంది. పుల్వామా కళంకాన్ని భరిస్తూ నరేంద్రమోదీ రెండో టర్మ్ అధికారంకోసం ప్రయత్నం చేయకపోవచ్చు. ఇక ఈ దాడుల వ్యూహాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని నిర్ణయించుకోవడం పాకిస్తాన్ వంతు కావచ్చు. లేదా భారత్ ప్రతిచర్యకు ప్రతీకారం తీసుకోవలసిందేనంటూ తన సొంత ప్రజల ఒత్తిళ్లకు అనుగుణంగా అది స్పందించవచ్చు. సైనికపరంగా ఏం జరిగినప్పటికీ అది ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పాలనకు ముగింపు పలుకుతుంది. భారత్‌తో ఎంత చిన్న లేక పెద్ద యుద్ధానికి దిగిన పాక్ పాలకుడు పదవిని కాపాడుకున్న ఘటన లేదని చరిత్ర మనకు తెలుపుతోంది. అయూబ్ ఖాన్(1965), యాహ్యా ఖాన్ (1971), నవాజ్ షరీఫ్(1999)ల పతనం ఇదే చెబుతోంది. తర్వాతేం జరుగుతుందో చెప్పే నిర్ణాయక శక్తి ఇమ్రాన్‌కు ఉండకపోవచ్చు. కార్గిల్ ఉదంతం తర్వాత నవాజ్‌లాగే తను కూడా ఆర్మీ లేక ఐఎస్ఐ తలబిరుసుతనానికి ఇమ్రాన్ కూడా ఫలితం అనుభవించవచ్చు. ఆరకంగా బలిపశువు కాకూడదంటే ఇమ్రాన్‌కు అపార నైపుణ్యంతోపాటు కాస్త అదృష్టం కూడా తోడు రావాల్సి ఉంది. ఇలాంటి అంశాల్లో ఎన్నికైన ఏ పాక్ ప్రధాని మాట కూడా ఇంతవరకు చెల్లుబాటు కాలేదు. పైగా ఇమ్రాన్ అందరికంటే బలహీనుడు. ఎలా స్పందించాలి అనేది ఆర్మీ చేతుల్లోనే ఉంది. ప్రతీకార చర్యకు పాల్పడొద్దని సైన్యానికి సలహా ఇచ్చే శక్తి ఇమ్రాన్‌కు ఉంటుందనీ చెప్పలేం. తమ తలలను పేల్చుకోవాలా వద్దా అనేది సైన్యమే నిర్ణయించుకోగలదు. వీటిలో ఏది జరిగినా నష్టపోయేది మాత్రం ఇమ్రానే మరి. మోదీకి ఆయన వారసులకు మధ్య తేఢాను పక్కనబెట్టి చూస్తే, రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 2008లో ముంబైలో లేక 2001–02లో జమ్మూ–కశ్మీర్, భారత పార్లమెంటుపై ఉగ్రదాడులు జరిగినప్పుడు అమెరికన్, యూరోపియన్ నేతలు పరుగున వచ్చి భారత్‌ను బుజ్జగించారు. రష్యా, చైనా కూడా తమ వంతు పాత్ర పోషించాయి. పాక్‌ను ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం ప్రకటించడం ద్వారా వారు భారతీయుల ఆగ్రహాన్ని చల్లార్చారు. కానీ అలాంటి ప్రపంచం ఇప్పుడు లేదు. అమెరికాలో ట్రంప్ గెలిచి అమెరికాను ఉన్నత స్థితిలో నిలుపుతానంటూ చేసిన బాసను నెరవేర్చుకునే దిశగా ప్రయాణిస్తూ ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేశాడు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా తక్షణం ట్వీట్ చేయడానికి కూడా ట్రంప్ పూనుకోకపోవచ్చు. ఆధునిక ప్రపంచపు చిరకాల ప్రత్యర్థులు తమ ప్రాంతంలో ఘర్షణల పరిష్కారంలోనే కొట్టుమిట్టులాడుతున్నారు. మనగురించి పట్టించుకునే తీరిక, శక్తి వారికి ఉండకపోవచ్చు. భారతీయ ఉపఖండం ప్రపంచానికి గతంనుంచి హెచ్చరిక చేస్తూ వచ్చేది. ‘మా మధ్యకు వచ్చి ఘర్షణలను నిలిపివేయడానికి ప్రయత్నించండి లేకుంటే మేం పరస్పరం అణ్వాయుధాలు ప్రయోగించుకుంటాం.’ తమవద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ప్రకటించుకుంటూ ఉపఖండం ప్రపంచాన్ని ఒకరకంగా బ్లాక్మెయిల్ చేసేది. ఇప్పుడు ఇలా బెదిరించినా ప్రపంచం పట్టించుకునే స్థితి కనిపించడం లేదు. పైగా అణ్వాయుధాలు బలహీనమైన ఓటమికి దగ్గరగా ఉన్న దేశాలకు ప్రాధాన్యతా ఆయుధాలుగా మారాయి. 1990లో వీపీ సింగ్ అసమర్థత కారణంగా పాకిస్తాన్ తన అణ్వాయుధ బూచిని పూర్తిగా తనకు ప్రయోజనం కలిగేలా ఉపయోగించుకుంది. ఆ క్రమంలో భారత్‌నుంచి ఎలాంటి చిన్న ప్రతిఘటన కూడా జరగకుండా పాక్ జాగ్రత్తపడింది. ఇక వ్యూహాత్మక అణ్వాయుధాల విషయానికి వస్తే పాకిస్తాన్ ఇంతవరకు వాటిని పరీ క్షించలేదు. ఇప్పుడు వారు విధ్వంసకరమైన దిగ్భ్రాంతిని కలిగించవచ్చు. పైగా భారత ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు అణ్వాయుధాలు ఏక పక్షంగా ప్రభావం చూపుతాయని ఎంతమాత్రం భావించడం లేదు. ఒకవేళ ఈ ఎన్నికల వారాల్లో అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకోవాలని భారత్ చూస్తున్నట్లయితే ముందుగా ట్రిగ్గర్ మనమే నొక్కవచ్చు కూడా. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
పౌర వాహనాలను రానివ్వడంతోనే..
జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై సైనికులు ప్రయాణిస్తున్న సమయంలో పౌరుల వాహనాలనూ అనుమతించడంతో దాడి సాధ్యమైందని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సైనికులు రాకపోకలు సాగించే మార్గాన్ని ముందుగా రోడ్ ఓపెనింగ్ పార్టీ(ఆర్వోపీ) తనిఖీ చేస్తుంది. దారిలో మందుపాతరలు, బాంబులు ఉన్నాయేమో తనిఖీ చేయడం ఈ పార్టీ పని. మరో బృందం దారి పక్కన పొంచి ఉండి ఉగ్రవాదులు కాల్పులు జరిపే లేదా బాంబు దాడి చేసే అవకాశాలను పరిశీలిస్తుంది. తర్వాతే సైనికుల రాకపోకలకు అనుమతిస్తారు. ఈ తనిఖీల్లో ప్రజలు వాడే వాహనాలను పెద్దగా పట్టించుకోరు. వాటి రాకపోకలకు అభ్యంతరాలు చెప్పరు. గురువారం జమ్ము–శ్రీనగర్ జాతీయ రహదారిని క్షుణ్ణంగా పరిశీలించాకే సైనిక వాహనాలకు ఉత్తర్వులిచ్చారు. చుట్టు పక్కల గ్రామాలను జాతీయ రహదారితో అనుసంధానిస్తూ సర్వీసు రోడ్లు ఉన్నాయి. స్థానికులు వాటి ద్వారా వాహనాల్లో జాతీయ రహదారిపై వస్తూ పోతూ ఉంటారు. ప్రతిసారీ తనిఖీ చేయడం వారికి ఇబ్బందిగా ఉంటుందన్న భావనతో సైన్యం వారి రాకపోకలను పట్టించుకోదు. జైషే ఉగ్రవాది ఆదిల్ ఇదే అవకాశాన్ని వాడుకున్నాడు. పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సర్వీసు రోడ్డుపై వేచి ఉండి సైనికుల వాహన శ్రేణి కనిపించగానే జాతీయ రహదారిపైకి దూసుకొచ్చాడు. హిమపాతం కారణంగా ఆరు రోజులుగా మూసి ఉన్న జమ్మూ– శ్రీనగర్ జాతీయ రహదారిని గురువారం తెరవడంతో సాధారణం కంటే రద్దీ ఎక్కువగానే ఉందని సైనికాధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఐఈడీ దాడులు చేసే అవకాశం ఉందంటూ ఈ నెల 8వ తేదీన ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో అదనపు జాగ్రత్తలు కూడా తీసుకున్నామని, అయినా ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందని సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) జుల్ఫికర్ హసన్ చెప్పారు. ‘ఆ ఉగ్రవాది తన వాహనంలో చాలా దూరం నుంచి వస్తూ ఉండి ఉంటే దారిలో ఎక్కడో అక్కడ తనిఖీ పాయింట్లో దొరికేవాడు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో అధికారి చెప్పారు. ఈ అనుభవంతో ఇకపై సైనికులు ప్రయాణించే సమయంలో జాతీయ రహదారిపై పౌరులకు అనుమతించకుండా ఉండాలని ఆయన అన్నారు. ప్రతీకారం తప్పదు: సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను క్షమించం, ప్రతీకారం తీర్చుకుంటాం’ అని సీఆర్పీఎఫ్ ప్రతినబూనింది. దేశంలోని అతిపెద్ద పారామిలటరీ బలగం సీఆర్పీఎఫ్ శుక్రవారం ట్విట్టర్లో ‘ ఉగ్రవాదులను క్షమించబోం. పుల్వామా దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు వందనం. అమరుల కుటుంబాలకు తోడుగా ఉంటాం. హేయమైన ఈ దాడికి మూల్యం తప్పదు’ అని పేర్కొంది. అమర జవాన్ల స్మృత్యర్థం సీఆర్పీఎఫ్ కేంద్ర కార్యాలయంలో జెండాను అవనతం చేయడంతోపాటు రెండు నిమిషాలు మౌనం పాటించినట్లు తెలిపింది. కశ్మీర్లో ఉగ్రవాదులు, వేర్పాటు వాదులతో జరిగే పోరులో 3.60 లక్షల మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు. సైన్యం వెళ్లే సమయంలో పౌర వాహనాల నిలిపివేత కశ్మీర్ రోడ్లపై అమలు: రాజ్‌నాథ్ శ్రీనగర్: కశ్మీర్లో ఇకపై ప్రధాన రహదారులపై సైనిక, భద్రతా దళాల వాహన శ్రేణులు వెళ్తున్నప్పుడు సాధారణ పౌరుల వాహనాలను కొద్దిసేపు నిలిపేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించారు. దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో రాజ్‌నాథ్ పర్యటించారు. భద్రతా దళాల వాహన శ్రేణులు వెళ్తున్న సమయంలో పౌరుల వాహనాలను నిలిపేయడం ఇబ్బందిని కలిగించే చర్యేననీ, కానీ జవాన్ల భద్రత కోసం ఇది తప్పదని ఆయన పేర్కొన్నారు. తర్వాత రాజ్‌నాథ్ సీఆర్పీఎఫ్ క్యాంపస్‌కు చేరుకున్నారు. సైనికుల భౌతిక కాయాలకు నివాళులర్పించారు. ఓ జవాన్ భౌతిక కాయాన్ని విమానంలోకి ఎక్కిస్తుండగా, ఆ శవపేటికను రాజ్‌నాథ్ తన భుజాలపై మోశారు. -
మాటలకందని విషాదం
మూడు దశాబ్దాలుగా నెత్తురోడని రోజంటూలేని జమ్మూ–కశ్మీర్లో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి దేశ ప్రజానీకాన్ని మాత్రమే కాదు... ప్రపంచాన్నే నిశ్చేష్టుల్ని చేసింది. జవాన్ల వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది ఒకడు ఆత్మాహుతి దాడికి పూనుకొని 43 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఉదంతం ఆ రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనిది. భద్రతా బలగాలు ఒక దాడిలో ఇంతమంది సహచరులను కోల్పోవడం కశ్మీర్లో ఇదే తొలిసారి. ఈ ఆత్మాహుతి దాడి జరిగిన కాసేపటికే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ దానికి తామే కారణమని ప్రకటించడంతోపాటు ఆ ఉగ్రవాది పేరు ఆదిల్ అహమ్మద్ దార్ అని వెల్లడించింది. (ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని) దాడికి ముందు ఉగ్రవాది ఆదిల్ మాట్లాడిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ‘కశ్మీర్ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధమ’ని గతంలో పాకిస్తాన్ పాలకులు చెప్పడాన్ని గుర్తుం చుకుంటే ఈ ఉగ్రవాద విషసర్పానికి అక్కడ ఏ స్థాయిలో అండదండలున్నాయో అర్ధమవుతుంది. అలాంటి మద్దతే లేకపోతే దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన జైషే మొహమ్మద్ సంస్థపై పాకి స్తాన్ చర్యలకు ఉపక్రమించేది. 24 గంటలు గడిచినా ఆ విషయంలో మౌనంగానే ఉండిపోయింది. కనుకనే ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించవలసి వచ్చింది. (ఉగ్ర మారణహోమం) సైనికంగా తనకంటే అనేక రెట్లు శక్తిమంతమైన భారత్ వంటి పొరుగుదేశాన్ని ఇలాంటి ఉన్మాద దాడులతో పాదాక్రాంతం చేసుకోగలమని, కనీసం అస్థిరత్వంలోకి నెట్టగలమని పాకిస్తాన్ భ్రమిం చడం దాని తెలివితక్కువ నైజాన్ని, మూర్ఖత్వాన్ని బయటపెడుతోంది. గతంలో అది తన మను షుల్ని సమీకరించి, వారికి అవసరమైన శిక్షణనిచ్చి, దాడి చేయాల్సిన ప్రాంతాల వివరాలను అంద జేసి సరిహద్దులు దాటించేది. కానీ అక్కడ భద్రత పటిష్టపడటం వల్ల కావొచ్చు... అంతర్జాతీ యంగా చీవాట్లు పడుతుండటంవల్ల కావొచ్చు దానికి స్వస్తి పలికి కశ్మీరీ పౌరులపై దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. చదువుసంధ్యల్లేని యువతను ఎంచుకుని వారికి ఉగ్రవాదం నూరిపోసి, ఆయుధా లిచ్చి పంపి తన ప్రయోజనాన్ని నెరవేర్చుకునే పన్నాగానికి పూనుకుంది. తాజా ఉదంతానికి కారకు డైన ఆదిల్ నేపథ్యం ఈ సంగతిని వెల్లడిస్తోంది. నిజానికి ఈ యువతలో ఎందరు ఇష్టప్రకారం ఆ ముఠాలోకి వెళ్తున్నారో చెప్పలేం. చావడానికి పోతూ ఉగ్రవాది ఆదిల్ ఇచ్చిన ‘సందేశం’ స్వచ్ఛం దంగా ఇచ్చిందో, చుట్టూ తుపాకులతో నిలబడి చెప్పించిందో ఎవరూ నిర్ధారించలేరు. ఇరాక్, సిరి యాల్లో ఉగ్రవాద సంస్థ ఐఎస్ నడిపిన శిబిరాల్లో ఆత్మాహుతి బాంబర్లుగా శిక్షణ పొంది మధ్యలోనే దొరికిపోయిన కొందరు పిల్లలు వెల్లడించిన కథనాలు గతంలో వెలువడ్డాయి. జైషే మొహమ్మద్ స్వతంత్ర ఉగ్రవాద సంస్థ కాదు. దానికి పాకిస్తాన్ సైన్యం కనుసన్నల్లో పనిచేసే గూఢచార సంస్థ ఐఎస్ఐతో ఉన్న సాన్నిహిత్యంలో దాపరికమేమీ లేదు. ఉగ్రవాదంపై పోరాటం బహుముఖంగా ఉండాలి. దాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం కోసం నిరంతరాయంగా ప్రయత్నించడంతోపాటు చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆ విషయంలో మనం విఫలమయ్యామని తాజా ఉదంతం తేట తెల్లం చేస్తోంది. ఫలితంగా ఆత్మాహుతి దాడుల సంస్కృతి కశ్మీర్ లోయకు సైతం జొప్పించడంలో జైషే సంస్థ విజయం సాధించినట్టు కనబడుతోంది. ఆత్మాహుతి దాడి 2000 సంవత్సరంలోనూ జరిగింది. కానీ 29మంది ప్రాణాలు తీసిన ఆ ఉదంతంతో పోలిస్తే తాజా ఉదంతం తీవ్రత అన్ని విధాలా అధికం. అప్పట్లో ఉగ్రవాది ప్రభుత్వ వాహనాన్ని హైజాక్ చేసి ఆ పని చేశాడు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఒక పల్లెలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఉగ్రవాది సిద్ధం చేసుకున్నాడు. జమ్మూ–కశ్మీర్ భద్రతా విషయాల్లో తలమునకలై ఉండే యంత్రాంగానికి సహ జంగానే ఇటీవల అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలేమిటో తెలియకపోవు. ఆ స్థాయిలోనే నిఘా ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కాలంగా ఆత్మాహుతి దాడులు జరగొచ్చునన్న సమాచారం ఇంటెలిజెన్స్ సంస్థలకు అందుతూనే ఉన్నదని ఆ వర్గాల కథనం. అటువంటప్పుడు అందుకనువైన విధానాలను రూపొందించుకోవడం భద్రతా బలగాల బాధ్యత. జవాన్ల వాహనశ్రేణి వెళ్లే దారిలో ముందుగా ప్రత్యేక బృందం వెళ్లి ఆ మార్గం సురక్షితంగా ఉన్నదో లేదో మదింపు వేయడం రివాజు. అది సక్రమంగానే జరిగిందా? ఆత్మాహుతి దాడికి గురైన వాహనశ్రేణిలో 78 వాహనాలుంటే, అందులో 2,547మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. అసా« దారణమైన, అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే భారీ కాన్వాయ్‌లు తరలిస్తారు. మామూలు పరిస్థితుల్లో వేయిమందికి మించని జవాన్లతో ఉండే వాహనశ్రేణిని అనుమతిస్తారని చెబుతారు. అలాంటి పద్ధతులను ఎందుకు పాటించలేదు? జమ్మూ నుంచి తెల్లారుజామున 3.30కు బయ ల్దేరిన జవాన్ల వాహనశ్రేణి గురించిన సమాచారం అక్కడికి 241 కిలోమీటర్ల దూరంలోని అవం తిపొరా పట్టణం సమీపంలో పొంచివున్న ఉగ్రవాదులకు ఎలా చేరింది? అలాగే అడుగడుగునా రాత్రింబగళ్లు తనిఖీలు సాగుతుండే రాష్ట్రంలో ఒక పల్లెకు 350 కిలోల అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) ఎలా చేరిందనుకోవాలి? వీటన్నిటిపైనా లోతైన సమీక్ష జరగాలి. ఏళ్ల తరబడి అనుసరించే మూస విధానాలు కూడా లొసుగులకు తావిస్తాయి. ఆ విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. పాక్‌పై తక్షణ చర్య అవసరమని కొందరంటున్నారు. కానీ ఆచితూచి అడుగేయడం శ్రేయస్కరం. ఇప్పటికే పాక్‌పై దౌత్యపరమైన దాడిని మన దేశం ప్రారంభించింది. దాన్ని పక డ్బందీగా కొనసాగించి, అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకి చేయడానికి గల అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలి. ఇప్పుడు సైతం జైషే చీఫ్ మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా గుర్తించ నిరా కరిస్తున్న చైనా నైతికతను కూడా ఎండగట్టాలి. -
దెబ్బకు దెబ్బ..!
భరతమాత కన్నీరు పెడుతోంది. కోట్లాది భారతీయుల గుండెలకు లోతైన గాయమైంది. మనల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేని కొందరు పిరికిపందలు చాటుమాటున నక్కి చేసిన దాడితో దేశానికి రక్షణగా నిలిచే వీరాధివీరులే నిర్జీవంగా నేలకొరిగిన దృశ్యాలు చూసి మనసు చలించిపోతోంది. కుట్ర కుతంత్రాలతో తన నీచ బుద్ధిని ఎప్పటికప్పుడు బయటపెట్టుకునే జిత్తులమారి దాయాది దేశానికి బుద్ధి చెప్పాలనే ఆరాటం, పగ , ప్రతీకారంతో భారతీయుల గుండెలు రగిలిపోతున్నాయి. ఇలాంటి సమయాల్లోనే కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతమే సరైనదే అనిపిస్తుంది.. అలాగంటే అదేదో యుద్ధోన్మాదం కాదు. అమరులైన వీర జవాన్లకు న్యాయం జరగాలి. భారతీయులు ఇప్పుడు కోరుకుంటున్నదదే. ఇక మీదట త్యాగాలకు విలువ లేదు. వాటికెప్పుడో కాలం చెల్లిపోయింది. మన దేశ సైనిక సత్తా, ఆర్థిక బలానికి కూడా కాలం చెల్లిపోయిందా ? పచ్చటి పచ్చికలపై పారే ఎర్రటి నెత్తురు మరకలు చూస్తుంటే మరిగిపోయిన రక్తం చప్పున చల్లారిపోతుందా? ఇంత నరకయాతనని కొద్ది రోజుల్లోనే మనం మర్చిపోతామా? కొన్ని వారాల్లోనే మళ్లీ సాధారణ మనుషులమైపోతామా? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో గెలిచి, ప్రజాప్రతినిధుల వేషాల్లో ఉన్నవారే ఉగ్రవాదులకు కొమ్ము కాస్తూ, బయటకి కల్లబొల్లి ఏడ్పులు ఏడుస్తూ ఉంటే, శాంతి నెలకొనాలన్న భారత్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఉంటే, కేంద్రం అడుగులు ఎటువైపు వేయాలి? ఇప్పుడు కశ్మీర్ భూతల స్వర్గం కాదు. మండుతున్న మంచుగోళం. శవాల దిబ్బల్ని చూసే ఓపిక లేదు. ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే సహించే పరిస్థితి లేదు. దాడి చూసాకైనా కేంద్రం సత్వర చర్యలు చేపట్టాలి. జాతి యావత్తూ అందుకోసమే ఎదురుచూస్తోంది. న్యూఢిల్లీ: ‘భారతీయుల రక్తం మరుగుతోంది. రోజూ వారీ ఖర్చులు వెళ్లదీయడానికి ఇతర దేశాల ముందు బిచ్చమెత్తుకుంటూ మన పొరుగుదేశం ఎంతో దిగజారింది. ఆ నిరాశ, నిస్పృహల ఫలితంగానే పుల్వామాలో దాడికి తెగబడింది. ఉగ్రవాదులపై ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఇదొక కొత్త సంప్రదాయం’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రచర్యలతో భారత్‌ను పాకిస్తాన్ బలహీనపరచలేదని, పుల్వామా దాడికి బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. మరోవైపు, పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత అనుకూల దేశం(మోస్ట్ ఫేవర్డ్ నేషన్–ఎంఎఫ్ఎన్) హోదాను భారత్ వెనక్కి తీసుకుంది. భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ సొహైల్ మహమూద్‌ను పిలిపించుకుని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే నిరసన వ్యక్తం చేశారు. పెద్ద తప్పు చేశారు..మూల్యం తప్పదు ఢిల్లీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపాక మోదీ మాట్లాడారు.‘ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులకు మద్దతునిస్తూ, వారిని ప్రేరేపిస్తున్న వారికి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. వారు చాలా పెద్ద తప్పు చేశారు. ఈ దుశ్చర్యకు వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. పుల్వామా దాడికి పాల్పడిన, ఈ కుట్ర వెనక ఉన్న వారందరినీ కఠినంగా శిక్షిస్తామని దేశానికి హామీ ఇస్తున్నా. ఇప్పటికే అంతర్జాతీయంగా ఏకాకి అయిన మన పొరుగుదేశం ఉగ్రదాడులతో మన దేశంలో అస్థిరత సృష్టించాలని కుట్రలు పన్నుతోంది. కానీ వాళ్ల ప్రణాళికలు సఫలం కావు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడానికి మన బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం’ అని అన్నారు. అనంతరం ఝాన్సీలో జరిగిన మరో సభలో ప్రసంగిస్తూ..పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వృథాగా పోదని పేర్కొన్నారు. ‘ ఉగ్రమూకల ఆటకట్టించేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వ్యూహం రచించాలో ఆ బాధ్యతను సైన్యానికే వదిలిపెట్టాం. ఇదే మన దేశ కొత్త విధానం, సంప్రదాయం’ అని పేర్కొన్నారు. అమరులకు మోదీ, రాహుల్ నివాళి పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల మృతదేహాలను వైమానిక దళ విమానం శుక్రవారం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది. హోం మంత్రి రాజ్‌నాథ్ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో అమరవీరుల భౌతికకాయాలను స్వీకరించారు. 40 శవపేటికలను పక్కపక్కన ఉంచారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాం: రాహుల్ భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ఆత్మపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి తమ పూర్తి స్థాయి మద్దతునిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ‘దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలన్న టెర్రరిస్టుల ఆశయం ఎన్నటికీ నెరవేరదు. మరో రెండు రోజులపాటు ఇతర విషయాలేవీ మాట్లాడదలచుకోలేదు’ అని తర్వాత మీడియా సమావేశంలో అన్నారు. ‘జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడమే మన మొదటి కర్తవ్యం. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదు. టెర్రరిజంపై ఐక్యంగా పోరాడాలి’ అని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అత్యంత అనుకూల దేశం హోదా రద్దు దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఇచ్చిన ‘అత్యంత అనుకూల దేశం’(ఎంఎఫ్ఎన్) హోదాను భారత్ రద్దుచేసింది. ప్రధాని నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ భద్రతా కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకాలు పెంచే చాన్సుంది. సుమారు 49కోట్ల డాలర్ల పాక్ ఉత్పత్తులపై ప్రభావం పడొచ్చు. పాక్‌కు అత్యంత అనుకూల దేశం హోదాను భారత్ 1996లో ఇవ్వగా, ఇంకా భారత్‌కు పాక్ ఆ హోదాను ఇవ్వలేదు. పాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ప్రధానంగా ముడిపత్తి, నూలు, రసాయనాలు, ప్లాస్టిక్, రంగులు తదితరాలున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సభ్యదేశాలు తమలో తాము వివక్షాపూరిత వాణిజ్య విధానాలు అవలంబించకుండా ఉండేందుకు ఎంఎఫ్ఎన్ హోదాను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ హోదా కలిగిన దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులు, ఉత్పత్తులపై పన్నులు తక్కువగా ఉంటాయి. నివాళి కార్యక్రమంలో రాజ్‌నాథ్, నిర్మల, కేజ్రీవాల్, రాహుల్, సైన్యాధికారులు జమ్మూలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ప్రజలు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ -
‘పొరుగు’ కుట్రలను సహించరాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రదాడులతో భారతదేశాన్ని అస్థిర పరిచేందుకు పొరుగు దేశం చేస్తున్న కుట్రలను సహించరాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. పొరుగు దేశం ఉగ్రవాదులకు సహకరించి నిధులు సమకూర్చ డం దురదృష్టకరమని అంటూ ఆయన.. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి మాతృదేశాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మార్చుకునేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి ప్రసంగాల సంకలనం ‘సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్–1’ను ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శుక్రవారం మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంక య్య మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో క్యారెక్టర్ (గుణం), కెపాసిటీ (సామర్థ్యం), క్యాలిబర్ (యోగ్యత), కండక్ట్ (నడత) కలిగిన వ్యక్తులను ఎన్నుకోవాలని, అలాంటి వారినే ప్రజాప్రతినిధులుగా చూడాలనుకుంటున్నా నని అన్నారు. ప్రస్తుతం చట్టసభలు సాగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసి న ఆయన.. ప్రజాస్వామ్య దేవాలయాల్లో ప్రజల గొంతు ప్రతిధ్వనించాలని సూచించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. భారతీయతను ప్రతిబింబించే ప్రసంగాలు చేసే వెంకయ్యకు తాను అభిమానినన్నారు. ఈ పుస్తకంలో స్ఫూర్తిదాయక అంశాలే గాక, మదిలో కలకాలం నిలిచి పోయే జ్ఞా పకాల సమాహారం కూడా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, థావర్ చంద్ గెహ్లాట్ పాల్గొన్నారు. -
అమరుల కుటుంబాలకు పరిహారం ప్రకటన..!
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమరుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున ప్రకటించగా, ఒడిశా 12 లక్షలు పరిహారం ప్రకటించింది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ.21 లక్షల పరిహారం ఇస్తున్నట్లు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ ప్రకటించగా, రూ.12 లక్షల పరిహారం ఇస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ తెలిపారు. (పాలం ఎయిర్‌బేస్‌లో అమర జవాన్లకు నివాళి) హిమాచల్ ప్రదేశ్ రూ.21 లక్షలు పరిహారం ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.25 ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి అమరుల కుటుంబాలకు అండగా నిలిచింది. ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని పలు ప్రభుత్వాలు ప్రకటించాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో శనివారం ఉదయం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులైన జవాన్లకు నివాళి అర్పించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. కాగా మృతిచెందిన వారిలో అత్యధికంగా 12 మంది జవాన్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, నలుగురు పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇక అమర జవాన్ల అంత్యక్రియాల్లో పాల్గొనాలని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలకు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. (ఉగ్రదాడిని ఖండించిన యావత్ భారతావని) -
పాలం ఎయిర్‌బేస్‌లో అమర జవాన్లకు నివాళి
-
పాక్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు..!
-
‘పుల్వామా ఉగ్రదాడి హేయమైన చర్య’
సాక్షి, వైఎస్సార్ : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైన చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న జవాన్లను యుద్ధ భూమిలో కాకుండా ఉగ్రదాడి చేయటం దుర్మార్గమన్నారు. పిరికితనంతో చేసిన దాడిలో, విధినిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
ఉగ్రదాడిపై అభ్యంతరకర ట్వీట్
లక్నో : పుల్వామా ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తమవుతుంటే జైషే దాడిని సమర్ధిస్తూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్ధి ట్విటర్లో చేసిన అభ్యంతరకర పోస్ట్ వివాదాస్పదమైంది. ఏఎంయూలో బీఎస్సీ మేథమేటిక్స్ అభ్యసిస్తున్న జమ్మూ కశ్మీర్‌కు చెందిన బాసిం హిలాల్ ట్విటర్లో చేసిన పోస్ట్‌పై వర్సిటీ తీవ్రంగా స్పందించింది. ఏఎంయూ ఫిర్యాదు నేపథ్యంలో హిలాల్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అభ్యంతరకర పోస్ట్ చేసిన విద్యార్ధిని సస్సెండ్ చేస్తున్నట్టు ఏఎంయూ వెల్లడించింది. జైషే దాడి ఎలా ఉంది..? గ్రేట్ సర్. అంటూ హిలాల్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్‌ను హిలాల్ తర్వాత తొలగించినా అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
అఖిలపక్ష సమావేశానికి మోదీ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడికి బదులుచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడికి ఏవిధంగా బదులివ్వాలన్న అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలిపునిచ్చారు. దేశంలోని ప్రధాన పార్టీల నేతలతో ప్రధాని నేతృత్వంలోని కీలక కమిటీ శనివారం ఉదయం పార్లమెంట్ లైబ్రరీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్రం తీసుకోనుంది. జవాన్ల దాడి హేయమైన చర్య అని.. దానిని అందరం ముక్తకంఠంతో ఖండించాలని మోదీ కోరే అవకాశం ఉంది. కాగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇదివరకు 2016 ఓసారి సమావేశం జరిగినప్పటికీ.. మెరపు దాడుల గురించి వివరించేందుకు మాత్రమే సమావేశమయ్యారు. విపక్షాల అభిప్రాయం కోసం తొలిసారి మోదీ పిలుపునిచ్చారు. పుల్వామా ఉగ్రదాడిని దేశంలో అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంలో ఖండించిన విషయం తెలిసిందే. దాడికి ఖచ్చింతంగా సమాధానం ఇవ్వాల్సిందేనని పలు పార్టీలు ఇదివరకే డిమాండ్ చేశాయి. కాగా ప్రధాని అఖిలపక్ష సమావేశ పిలుపును కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వాగతించారు. ఈ విషయంలో కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తామని ఆయన తెలిపారు. ఇదిలావుండగా ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ హైకమిషనర్‌కు భారత్ ఇదివరకే సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. పాకిస్థాన్‌ను అత్యంత ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి తొలగించినట్లు ప్రకటించారు. -
విషాదం..కూతురుని చూడకుండానే..
జైపూర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. వీరిలో ఓ జవాను తన రెండు నెలల కూతురిని పుట్టినప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా చూడకుండానే ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. రాజస్తాన్‌లోని జైపూర్ సమీపంలోని అమర్‌సర్‌లోని గోవింద్‌పురా గ్రామానికి చెందిన రోహితేష్ లంబా(27) సీఆర్పీఎఫ్ జవాన్‌గా సేవలందిస్తున్నారు. రోహితేష్ లంబా 25 ఏళ్లకే సీఆర్పీఎఫ్లో ఉద్యోగం రాగా, మరుసటి సంవత్సరం వివాహం చేసుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్లో రోహితేష్ లంబా దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఉద్యోగరీత్యా చిన్నారిని చూడడానికి వీలు దొరక్కపోవడంతో కన్నకూతరును చూడలేకపోయారు. బిడ్డను చూసేందుకు సెలవుపెట్టి గోవింద్‌పురాకు త్వరలోనే వెళ్లాలనుకున్నారు. కన్న కూతరును చూడడానికి వస్తాడనుకున్న భర్త ఉగ్రవాదుల దాడిలో మరణించాడన్న వార్తను భార్య వినాల్సి వచ్చింది. రోహితేష్ లంబా వీరమరణంతో గోవింద్‌పురాలో విషాదఛాయలు అలుముకున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. -
రివేంజ్ తీర్చుకునేందుకు టైమ్, ప్లేస్ డిసైడ్ చేయండి..
లక్నో : ‘మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం.. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం, ప్రదేశాన్ని నిర్ణయించండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సైనికులకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలోని బుందేల్‌ఖండ్‌లో డిఫెన్స్ కారిడార్ నిర్మాణానికి ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగిస్తూ... పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత సైన్యానికి అన్ని రకాల అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ‘మన జవాన్ల త్యాగం వృథా కాదు.. వారి సాహసాన్ని భరతజాతి మొత్తం వీక్షించింది. వారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు.(చదవండి : ఉగ్ర మారణహోమం) పాక్ ఆర్థిక సాయం కోసం యాచిస్తోంది.. ఉగ్రదాడితో తమకు సంబంధం లేదంటూ బుకాయిస్తున్న పాకిస్తాన్ తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అందుకే చేతిలో పాత్ర పట్టుకుని ప్రపంచ దేశాలను సాయం కోసం యాచిస్తోంది. కానీ వారికి ఎవరూ సహాయపడరు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు మద్దతుగా ఉన్నాయని మోదీ పునరుద్ఘాటించారు. ‘మన దాయాది దేశానికి సరైన సమాధానం ఇవ్వాలని భారతీయులు భావిస్తున్నారు. ప్రపంచంలోని చాలా వరకు దేశాలు మనకు అండగా ఉన్నాయి. పుల్వామా దాడి పట్ల వారు కేవలం సంతాపం తెలియచేయడానికే పరిమితం కాలేదు.. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భావిస్తున్న భారత్‌కు అన్ని రకాలుగా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నారు’ అని పాక్‌ను హెచ్చరించారు.(పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం) కాగా గురువారం కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మహుతి దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే..!
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల వివరాలను భారత ప్రభుత్వం విడుదల చేశారు. జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. వారిలో 36 మృతదేహాలను గుర్తించి వారి వివరాలను శుక్రవారం విడుదల చేశారు. మరికొంతమంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా మృతిచెందిన వారిలో అత్యధికంగా 12 మంది జవాన్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, నలుగురు పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఉగ్రదాడిలో మృతిచెందిన ఇద్దరు తమిళనాడు జవాన్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఇరవై లక్షల చెప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అమరులైన జవాన్లు వీరే.. 1. రాథోడ్ నితిన్ శివాజీ, మహారాష్ట్ర 2. వీరేంద్ర సింగ్, ఉత్తరాఖండ్ 3. అవదేశ్ కుమార్ యాదవ్, ఉత్తరప్రదేశ్ 4. రతన్ కుమార్ ఠాకూర్, బిహార్ 5. పంకజ్ కుమార్ త్రిపాఠి, ఉత్తర ప్రదేశ్ 6. జెట్ రామ్, రాజస్తాన్ 7. అమిత్ కుమార్, ఉత్తరప్రదేశ్ 8. విజయ్ మౌర్యా, ఉత్తరప్రదేశ్ 9. కుల్విందర్ సింగ్, పంజాబ్ 10, మనేశ్వర్ బసుమంతరాయ్, అస్సాం. 11. మోహన్ లాల్, ఉత్తరాఖండ్ 12. సంజయ్ కుమార్ సిన్హా 13. రామ్ వకీల్, ఉత్తరప్రదేశ్ 14. నాసీర్ ఆహ్మద్, జమ్మూ కశ్మీర్ 15. జైమాల్ సింగ్, పంజాబ్ 16. కుఖేందర్ సింగ్, పంజాబ్ 17. తిలక్ రాజ్, హిమాచల్ ప్రదేశ్ 18. రోహితేష్ లంబా, రాజస్తాన్ 19. విజయ్ సోరింగ్, జార్ఖండ్ 20. వసంత్ కుమార్, కేరళ 21. సుబ్రహ్మణ్యం , తమిళనాడు 22. గురు, కర్ణాటక 23. మనోజ్ కేఆర్ బెహరా 24. నారాయణ్ లాల్‌గుర్జార్, రాజస్తాన్ 25. ప్రదీప్ కుమార్, ఉత్తర ప్రదేశ్ 26. హమ్రాజ్ మీనా, రాజస్తాన్ 27. రమేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్ 28. సంజయ్ రాజ్‌పుత్, ఉత్తరప్రదేశ్ 29. కౌశల్ కుమార్ రాజ్‌పుత్, ఉత్తరప్రదేశ్ 30. ప్రదీప్ సింగ్, ఉత్తర ప్రదేశ్ 31. శ్యామ్ బాబు, ఉత్తరప్రదేశ్ 32. అజిత్ కుమార్, ఉత్తరప్రదేశ్ 33. మహేందర్ సింగ్ అట్టారి, పంజాబ్ 34. అశ్విన్ కుమార్, మధ్యప్రదేశ్, 35. సుదీప్ బిస్వాస్, బెంగాల్ 36. శివచంద్రన్, తమిళనాడు -
పాకిస్తాన్‌కు భారత్ సమన్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలపై చర్యలను తీసుకోవల్సిందిగా పాకిస్తాన్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీ చేసింది. భారత జవాన్లపై ఆత్మహుతి దాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు చెందిన జేషే ఏ మహ్మద్ ఉగ్రసంస్థపై చర్యలు తీసుకుకోని, వాటిని వెంటనే నిషేధించాలని భారత్ అదేశించింది. ఈమేరకు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం పాకిస్తాన్ హైకమిషనర్‌కు సమన్లు జారీచేశారు. పుల్వామాలో జరిగిన దాడికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని, ఉగ్రవాద మూలాలున్న గ్రూపులను, వ్యక్తులను నిలువరించాలని పాక్‌ను భారత్ ఆదేశించింది. భారత్ సైనికులపై దాడికి పాల్పడ్డ సంస్థలను నిషేధించకుంటే చర్యలు తప్పవని భారత్ హెచ్చరించింది. పుల్వామా దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. -
మారణహోమం
-
పాకిస్తాన్‌తో చర్చించాల్సిందే : సిద్ధు
చండీగఢ్ : ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 43 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌తో.. భారత్ చర్చలు జరిపినపుడు మాత్రమే ఇటువంటి ఘటనలు జరగవని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో వివాదానికి దారి తీసిన సిద్ధు.. తన తాజా వ్యాఖ్యలతో మరోసారి తీవ్ర విమర్శల పాలవుతున్నారు.(ఉగ్ర మారణహోమం) సిగ్గుచేటు.. సిద్ధు వ్యాఖ్యలపై స్పందించిన రిటైర్డు మేజర్ జనరల్ జీవీ భక్షి మాట్లాడుతూ..‘ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. దేశ భద్రత కోసం యూనిఫాం ధరించిన సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదుర్కొనే సమస్యల గురించి ఆయన అవగాహన లేనట్లుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.(ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాం : రాహుల్ గాంధీ) కాగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఇది నివాళులు అర్పించాల్సిన సమయం. భయంకరమైన విషాదం ఇది. మన సైనికుల పట్ల అత్యంత హేయమైన దాడి జరిగింది. జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాల్సిన వేళ ఇది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పాటు మరిన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయి. ఇందులో వేరే చర్చకు తావు లేదు అని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో సిద్ధు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
‘ద్వేషమెన్నటికి సమాధానం కాదు’
జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)తో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 43 మంది ప్రాణాలు కోల్పోగా కొందరు గాయపడ్డారు. ఈ దాడిని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించారు. బాలీవుడ్ కూడా ఈ దారుణాన్ని ఖండిస్తోంది మనలని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లు ఉగ్రదాడిలో మరణించడం మనసుని కలచి వేసింది. ప్రాణాలు విడిచిన జవాన్ల కుటుంబాలకి అండగా నిలబడడం మన బాధ్యత. - సల్మాన్ ఖాన్ పుల్వామా ఘటనతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. ద్వేషం ఎన్నటికి సమాధానం కాలేదు. ఉగ్ర దాడిలో గాయపడ్డ జవాన్ల ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబాలకి ధైర్యం అందించాలని దేవుడిని కోరుకుంటున్నాను. - ప్రియాంక చోప్రా పుల్వామా దాడి అమానుషం, అమానవీయం. కోపాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. - అజయ్ దేవగణ్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ సైనికులపై జరిగిన దాడిని ఇంకా నమ్మలేకపోతున్నాను. ఈ ఘటనని ఎప్పటికి మరచిపోలేము. దాడిలో గాయపడ్డ వారు త్వరగా కొలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాను. మరణించిన వారి ఆత్మలకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. - అక్షయ్ కుమార్ పుల్వామా ఘటనకి సంబంధించిన వార్త నన్ను ఎంతగానో కలచి వేసింది. దాడిలో మరణించిన వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి దేవుడు కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. - అనుష్క శర్మ -
సీఆర్పీఎఫ్ చూపిన జాలే.. ప్రాణాలు తీసింది
న్యూఢిల్లీ : భద్రతా బలగాలను తరలించే ముందు ఆ రూట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అణువణవు పరీక్షిస్తారు. రోడ్ ఓపెనింగ్ పార్టీలు ముందుగా వెళ్లి తనిఖీలు నిర్వహిస్తాయి. గురువారం జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడక ముందు కూడా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ స్థానికులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో వారి వాహనాలను అనుమతించారు. ఇదే సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన బెట్టుకుంది. స్థానికుని నెపంతో సర్వీస్ రోడ్డుపై నుంచి దూసుకొచ్చిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. గురువారం జరిగిన ఈ ఆత్మహుతి దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడిని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. (చదవండి : ఉగ్ర మారణహోమం) ఎవ్వరినీ వదిలిపెట్టం.. ప్రతీకారం తీర్చుకుంటాం ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్ -
‘ఈ తరహా దాడులను నివారించడం కష్టమే’
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్, పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 43 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాది ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకుని భద్రతాబలగాల కాన్వాయ్‌లో ప్రవేశించాడు. అనంతరం తన కారును కాన్వాయ్‌లోని ఓ బస్సుకు ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ విషయం గురించి ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘కొన్ని రోజుల ముందే ఈ తరహా దాడుల గురించి చర్చించాము. ఇలాంటి దాడులు ఎక్కువగా సిరియాలో జరుగుతుంటాయి. ముష్కరులు కూడా ఏదో ఒక రోజు మన దగ్గర ఇదే ప్రయోగాన్ని అమలు చేస్తారని భావించాం. కానీ అది ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఈ తరహా దాడులను ముందుగా గుర్తించడం, నివారించడం కాస్తా కష్టమైన పనే. ఎందుకంటే సాధరణంగా దాడులకు తెగబడే వారు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాన్ని ఎంచుకుని విధ్వంసం సృష్టిస్తారు. ఇలాంటప్పుడు రోడ్డు మీద ఉన్న అన్ని వాహనాలను పూర్తిగా పరిశీలించడం కుదరదు. ఫలితంగా దాడులను నియంత్రించడం సాధ్యమయ్యే పని కాదు’ అన్నారు. అయితే ‘ఈ సమస్య పరిష్కారానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి.. జవాన్ల కాన్వాయ్‌లను ట్రాఫిక్ లేని సమయంలో అంటే రాత్రి పూట లేదా తెల్లవారుజామున తరలించాలి. అప్పుడు తక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అన్ని వాహనాలను జాగ్రత్తగా పరీక్షించవచ్చు. లేదా.. భద్రతాబలగాల కాన్వాయ్‌ల తరలింపు పూర్తయ్యవరకే ఆయా మార్గాల్లో వాహనాలు తిరగకుండా రోడ్డును బ్లాక్ చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిష్కారాలు ఇవే. వీటి గురించి మరింత లోతుగా చర్చించాలని భావిస్తోన్న నేపథ్యంలో ఈ దాడి జరగడం విచారకరమ’ని తెలిపారు. అంతేకాక గతంలో సాయుధుడు ఆర్మీ శిబిరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం, లేదంటే బాంబులు విసరడం లాంటివి చేసేవారన్నారు. మిలిటరీ శిబిరంలోకి చొరబడి సైనికులు తేరుకునే లోపే చేయాల్సినంత నష్టం చేయడమే లక్ష్యంగా వారు తెగబడుతారని తెలిపారు. కానీ ముష్కరులు కూడా కొత్త వ్యూహాలు పన్నుతున్నారని.. ప్రస్తుత దాడి జరిగిన తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. -
వదిలిపెట్టం.. ప్రతీకారం తీర్చుకుంటాం: సీఆర్పీఎఫ్
న్యూఢిల్లీ : ఉగ్రదాడికి కారుకులైన ఏ ఒక్కరిని వదిలి పెట్టమని, అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటామని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ సీఆర్పీఎఫ్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో భావోద్వేగమైన వ్యాఖ్యలను చేసింది. ‘మేం ఎప్పటికీ మరిచిపోలేం, ఎవ్వరిని వదిలిపెట్టం.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మా సోదరులకు మేం సెల్యూట్ చేస్తున్నాం. వారి కుటుంబాలకు అండగా ఉంటాం. ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం.’ భావోద్వేగమైన వ్యాఖ్యలతో ట్వీట్ చేసింది. ఇక ఈ దాడిని ఖండించిన నరేంద్ర మోదీ భద్రతా బలగాలకు ఉగ్రవాదుల ఏరివేత విషయంలో పూర్తి స్వేచ్చను ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘సైనికుల త్యాగం వృథా పోదు.. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెబుతాం’ అని కేబినెట్ సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు. ఈ విషయంలో విపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. మోదీ తీసుకుబోయే నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దీంతో మరో సర్జికల్ స్ట్రైక్ జరగనుందా అనే చర్చ నడుస్తోంది. (చదవండి: పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం) WE WILL NOT FORGET, WE WILL NOT FORGIVE:We salute our martyrs of Pulwama attack and stand with the families of our martyr brothers. This heinous attack will be avenged. pic.twitter.com/jRqKCcW7u8 — 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) February 15, 2019 -
ప్రభుత్వానికి అండగా ఉంటాం : రాహుల్
న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు తాను, తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన పట్ల విచారం చేసిన రాహుల్.. రానున్న రెండు రోజుల పాటు ఇతర రాజకీయ చర్చలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదం అంతిమ లక్ష్యం దేశాన్ని విభజించడమేనని పేర్కొన్నారు. అందుకే వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదులు ఎంతగా ప్రయత్నించినా ఒక్క సెకను పాటు కూడా హిందుస్థాన్ ప్రజలను వేరుచేయలేరన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరం ఒకేతాటిపై నిలవాలని, అపుడే మన ఐక్యత గురించి వారి తెలుస్తుందని పేర్కొన్నారు. వేరే చర్చకు తావు లేదు.. ‘ ఇది నివాళులు అర్పించాల్సిన సమయం. భయంకరమైన విషాదం ఇది. మన సైనికుల పట్ల అత్యంత హేయమైన దాడి జరిగింది. జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాల్సిన వేళ ఇది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పాటు మరిన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయి. ఇందులో వేరే చర్చకు తావు లేదు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఉక్కుపాదం మోపాలి.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా పుల్వామా ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదం పట్ల ఉక్కుపాదం మోపాలని, ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా గురువారం పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. -
పుల్వామా ఉగ్రదాడి : పాక్‌ను హెచ్చరించిన అమెరికా
వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముష్కరుల విషయంలో పాక్ తీరు మారాల్సిందేనంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. పాక్ ఉగ్రవాదులకు మద్దతివ్వడం.. వారిని కాపాడేందుకు ప్రయత్నించడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే ముష్కరులకు మద్దతివ్వడాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని పాక్‌ను హెచ్చరించింది. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందంటూ అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాల్లో గందగోళాన్ని, హింసను వ్యాప్తి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యమని అమెరికా మండి పడింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో అమెరికా భారత్‌కు పూర్తి మద్దతిస్తుందని తెలిపింది. రెండు దేశాలు కలిసి ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తాయని పేర్కొంది. పుల్వామా ఉగ్రదాడిని అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడిని అమానవీయ చర్యగా పేర్కొన్న రష్యా ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్, జర్మనీలు ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. -
కొత్త ఉగ్రవాదులకు వల పన్నడం కుదరకే..
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పాకిస్తాన్ నిరాశలో మునిగిపోయిందని, కొత్త ఉగ్రవాదులకు వల పన్నడం వీలు కాకపోవడం వల్లే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దారుణానికి తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ చెత్తగా వాగుతోంది. ఉగ్రవాదులు నిర్భయంగా ర్యాలీలు చేసుకునేందుకు అనుమతినిస్తూ, మేమైనా చేయగలమనే అహంకారంతో భారత్‌ను బహిరంగంగానే హెచ్చరించాలని చూస్తోంది’ అని వ్యాఖ్యానించారు. తాను ఈరోజు అమర జవానుల సంస్మరణ సభకు హాజరవుతున్నానని తెలిపారు. తనతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌రాథ్ సింగ్ కూడా కశ్మీర్ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రతా, ఇంటలెజిన్స్ వర్గాలతో భేటీ అయి, ఘటనకు గల కారణాల గురించి చర్చిస్తామని పేర్కొన్నారు. కాగా గురువారం పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. J&K Governor Satya Pal Malik to ANI: I will be leaving for the wreath laying ceremony of the martyrs in Kashmir. HM Rajnath Singh is also coming. We will hold a review meeting with top security and intelligence officials. We will find out where the lapses occurred. (File pic) pic.twitter.com/aUMOiYoq6K — ANI (@ANI) February 15, 2019 J&K Governor Satya Pal Malik to ANI: Pakistan is frustrated, after successful elections they could not recruit new terrorists, stone pelting has stopped, so it wanted to do something. We have alerted all installations and cantonments as Pakistan may do something else. (File pic) pic.twitter.com/gBEQCyB8sv — ANI (@ANI) February 15, 2019 -
మా రక్తం మరిగిపోతోంది: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, దాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోందని తెలిపారు. (ఉగ్ర మారణహోమం) ఇలాంటి దాడులతో భారతదేశ సమగ్రతను, స్థిరత్వాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. మానవతావాదులంతా ఏకమై ఉగ్రవాదులపై పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై రాజకీయాలు అనవసరమని, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి రావాలన్నారు. ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడదామన్నారు. సైనికుల ధైర్యం, త్యాగాలు వెలకట్టలేనివని అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసాయిచ్చారు. (ఉగ్ర దాడికి కొత్త వ్యూహాలు) పాక్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ రద్దు పాకిస్తాన్‌కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిని చేస్తామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్, ఆ దేశ మద్ధతుదారుల హస్తం ఉందని ఆరోపించారు. పాకిస్తాన్‌కు సహకరించేవారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. -
పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం
-
పుల్వామా దాడిని ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. వీర సైనికులకు సంఘీభావం ప్రకటించారు. ముష్కరులు సాగించిన మారణకాండలో అమరులైన సైనికుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. (ఉగ్ర మారణహోమం) I strongly condemn this cowardly attack on @crpfindia convoy in #Pulwama and stand in solidarity with our brave soldiers. My heart goes out to the grieving families of the martyrs and I pray for the speedy recovery of the injured jawans. #CRPF — YS Jagan Mohan Reddy (@ysjagan) 15 February 2019 -
ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు జరిగింది చాలని, వెంటనే వేర్పాటు వాదులు, పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై తీవ్రంగా కలత చెందిన గంభీర్.. ఆవేశంగా ఇక మాటల్లేవని, యుద్ధమే ఈ సమస్యకు పరిష్కారమని ట్విటర్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. (చదవండి: ఉగ్ర మారణహోమం) అయితే ఈ దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. భూగోళంపై ఉగ్రవాదానికి చోటు లేదని, ముక్తకంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఈ దాడిని ఖండిస్తూ అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సురేశ్ రైనాలు ఈ దాడిని ఖండిస్తూ ట్విటర్ వైదికగా వీర జవాన్లకు నివాళులర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.(చదవండి: వైరల్ వీడియో : ‘అక్కడ శవాలు పడున్నాయి’) భారత క్రికెటర్ల ట్వీట్స్.. ఇక జరిగింది చాలు. వెంటనే వేర్పాటువాదులు, పాకిస్తాన్‌తో మాట్లాడనివ్వండి. కానీ ఈ సంభాషణ అనేది గదుల్లో కాకుండా.. యుద్ధ మైదానంలో ఉండాలి. - గౌతం గంభీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం, వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇదో విచారకరమైన వార్త. ఈ దాడిలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. - వీవీఎస్ లక్ష్మణ్ ఈ ఉగ్రదాడి వార్త తీవ్రంగా కలచి వేసింది. పుల్వామా జిల్లాలో జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాను. ఈ దాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - శిఖర్ ధావన్ జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరగడం.. అనేక మంది జవాన్లు ప్రాణాలుకోల్పోవడం వినడానికి చాలా బాధగా ఉంది. ఈ దాడిచేసిన పిరికి పందలకు త్వరలోనే గుణపాఠం కలగాలని ప్రార్థిస్తున్నాను. - మహ్మద్ కైఫ్ ఉగ్రదాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు నా ఆలోచన, ప్రార్థన అంతా వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాల గురించే. -సురేశ్ రైనా సీఆర్పీఎఫ్ జవాన్లపై పిరికిపందలు జరిపిన దాడిలో మన వీర జవాన్లు వీరమరణం పొందడం బాధను కలిగిస్తోంది. ఈ బాధను వర్ణించడానికి పదాలు రావడం లేదు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలి. - వీరేంద్ర సెహ్వాగ్ -
‘మరో కుమారుడ్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను’
పట్నా : పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పడం కోసం మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను అంటున్నారు ఓ వీరజవాను తండ్రి. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా మరణించిన వారిలో బిహార్ భాగల్పూర్కు చెందిన రతన్ ఠాకూర్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో రతన్ ఠాకూర్ తండ్రి ఏఎన్ఐతో మాట్లాడారు. ‘నా కొడుకు దేశం కోసం ప్రాణాలర్పించాడు. భరతమాత కోసం ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచిపోయాడు. ఓ తండ్రిగా ఇందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రస్తుతం నేను బాధను, గర్వాన్ని అనుభవిస్తున్నాను. నా కొడుకు లాంటి మరి కొందరు వీర జవాన్లను చంపి.. వారి తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిల్చిన పాకిస్తాన్‌కు బుద్ది చెప్పాలి. పాక్‌కు తగిన గుణపాఠం చెప్పడం కోసం మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను. తనను కూడా భరతమాత సేవకే అర్పిస్తాను’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. -
‘అక్కడ శవాలు పడున్నాయి’
-
వైరల్ వీడియో : ‘అక్కడ శవాలు పడున్నాయి’
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరుగుతుండగా తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సెల్ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో దాడి జరిగిన ప్రాంతంలోని భయానక పరిస్థితులను, నష్టాన్ని కళ్లకు కడుతుంది. వీడియోలో ‘చంపేశాడు, చంపేశాడు.. అక్కడ శవాలు పడి ఉన్నాయనే’ మాటలు వినిపిస్తున్నాయి. బహుశా వీడియో తీసిన వ్యక్తి దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని.. ప్రత్యక్షంగా చూసి ఉండవచ్చని భావిస్తున్నారు నెటిజన్లు. సెల్ఫోన్లో తీసిన ఈ వీడియోలో పేలుడు జరిగిన ప్రాంతం, చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు, తుక్కుతుక్కయిన వాహనాలు దాడి తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాగా, ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉగ్రవాదుల మౌలిక వసతులు కూల్చండి పాక్‌కు సూచించిన భారత్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు మద్దతివ్వడాన్ని ఆపాలని, తన భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల మౌలిక వసతుల్ని కూల్చివేయాలని భారత్ పాకిస్తాన్‌కు సూచించింది. జైషే చీఫ్ మసూద్ అజర్‌తో పాటు ఇతర ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించాలన్న తమ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. పుల్వామా దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని విదేశాంగ శాఖ ప్రకటన జారీచేసింది. ఐక్యరాజ్య సమితి, ఇతర దేశాలు నిషేధించిన, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే ఈ హేయమైన దాడికి పాల్పడిందని పేర్కొంది. జైషే చీఫ్ అయిన మసూద్ తన ఉగ్ర కార్యకలాపాల్ని విస్తరించడానికి, భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ఆరోపించింది. జాతీయ భద్రతను కాపాడేందుకు ఎలాంటి చర్యకైనా వెనకాడమని తేల్చిచెప్పింది. -
ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది ఆదిల్ అలియాస్ వకాస్‌కు సంబంధించిన చివరి వీడియోను జైషే మొహమ్మద్ సంస్థ విడుదల చేసింది. వెనుక జైషే జెండాతో పాటు చేతిలో తుపాకీ పట్టుకున్న ఆదిల్ ఆ వీడియోలో మాట్లాడుతూ..‘ఈ వీడియోను మీరు చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను. నేను ఏడాది కాలం పాటు జైషే మొహమ్మద్‌లో పనిచేశాను. కశ్మీర్ ప్రజలకు నేను ఇచ్చే చివరి సందేశం ఇదే. దక్షిణ కశ్మీర్ చాలాకాలంగా భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఉత్తర, సెంట్రల్ కశ్మీర్‌తో పాటు జమ్మూ ప్రజలు ఈ పోరాటంలో చేరాల్సిన సమయం ఆసన్నమైంది. మా కమాండర్లలో కొందరిని చంపేయడం ద్వారా మమ్మల్ని ఎన్నటికీ బలహీనపర్చలేరు’అని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా 2001లో ఐసీఏ18 విమానం హైజాక్, నగ్రోటా, ఉడీ, పఠాన్‌కోట్ ఉగ్రదాడుల్ని ప్రస్తుతించాడు. పుల్వామాలోని కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ పాఠశాల స్థాయిలోనే చదువు మానేశాడు. అనంతరం కొద్దికాలం తాపీమేస్త్రీగా, మరికొంత కాలం మసీదులో పనిచేశాడు. 2016, మార్చి 19న ఇద్దరు యువకులతో కలిసి ఆదిల్ అదృశ్యమయ్యాడు. -
సీఆర్పీఎఫ్ రాకపై సమాచారం లీక్
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు వెళ్లడంపై సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు లీకై ఉండొచ్చని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జవాన్లలో చాలామంది సెలవులు ముగించుకుని విధుల్లో చేరేందుకు వస్తున్నవారేనని వెల్లడించారు. శ్రీనగర్‌కు వెళ్లే సమయంలో సీఆర్పీఎఫ్ బలగాలు ప్రామాణిక విధాన ప్రక్రియ(ఎస్వోపీ)ను పాటించాయో? లేదో? విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో భద్రతాబలగాల కదలికలు జరిగినప్పుడు ఆ విషయం చాలామందికి తెలుస్తుందని పేర్కొన్నారు. వాళ్లలో కొందరు ఉగ్రవాదులకు బలగాల రాకపై సమాచారం అందించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ రహదారిపై గత రెండ్రోజులుగా రాకపోకలు లేకపోవడంతో కాన్వాయ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు భారీ సంఖ్యలో శ్రీనగర్‌కు బయలుదేరారనీ, దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. -
12 కి.మీ వరకూ పేలుడు శబ్దం
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో గురువారం జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడితో స్థానికులు వణికిపోయారు. లెత్‌పొరా మార్కెట్‌కు 300 మీటర్ల దూరంలోనే ఈ దాడి చోటుచేసుకోవడంతో దుకాణదారులు షట్టర్లు మూసేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఆత్మాహుతి దాడి సందర్భంగా ఏర్పడ్డ పేలుడు శబ్దం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్థానికులు తెలిపారు. జిల్లా సరిహద్దులో ఉన్న శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సైతం పేలుడు శబ్దం వినిపించదన్నారు. పేలుడు తీవ్రతకు ఉగ్రవాది ఆదిల్‌తో పాటు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాలు ఛిద్రం అయ్యాయని జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిని గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు. ఈ ఘటనలో జవాన్ల బస్సుతో పాటు స్కార్పియో వాహనం నామరూపాలు లేకుండా పోయాయన్నారు. 2001, అక్టోబర్ 1న జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై జైషే ఉగ్రవాదులు చేసిన దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. తాజాగా ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 43 మంది జవాన్లను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కశ్మీర్లో ఉగ్రదాడులు 1999 నుంచి ఇప్పటివరకు భద్రతా దళాలపై జరిపిన ప్రధాన దాడులు.. ► 2017 ఆగస్ట్ 26: పుల్వామా జిల్లా పోలీస్ లైన్స్‌పై ఉగ్రదాడి. ఎనిమిది మంది భద్రత సిబ్బంది మృతి. ► 2016 నవంబర్ 29: నాగ్రోటా వద్ద గల సైనిక ఆయుధాగారంపై దాడి. ఏడుగురు సైనికులు మరణించారు. ► 2016 సెప్టెంబర్ 18: బారాముల్లా జిల్లాలోని ఉరిలో ఆర్మీ శిబిరంపై నలుగురు పాక్ తీవ్రవాదులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ దాడి చేసింది. ► 2016 జూన్ 25: శ్రీనగర్–జమ్మూ హైవేపై పాంపోర్ వద్ద సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రకాల్పులు. ఎనిమిది మంది జవాన్ల మృతి. ► 2016 జూన్ 3: పాంపోర్‌లో సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రదాడి. దాడి తర్వాత ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు. రెండ్రోజులు కొనసాగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులంతా హతమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు చనిపోయారు. ► 2014 డిసెంబర్ 5: మొహ్రాలో ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి. పది మంది సైనికులు ప్రాణాలు వదిలారు. ► 2013 జూన్ 24: హైదర్పోరా వద్ద సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై దాడి. ఎనిమిది మంది సైనికుల మృతి. ► 2008 జూలై 19: శ్రీనగర్–బారాముల్లా రహదారిపై నరబల్ వద్ద రోడ్డు పక్కన ఐఈడీ అమర్చి పేల్చడంతో పది మంది సైనికులు చనిపోయారు. ► 2005 నవంబర్ 2: నౌగమ్‌లో నాటి సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ ఇంటి దగ్గర్లో కారుతో ఆత్మాహుతి దాడి. ముగ్గురు పోలీసులు, ఆరుగురు పౌరుల మరణం. ► 2005 జూలై 20: భద్రతా దళాల కాన్వాయ్‌పై కారుతో ఆత్మాహుతి దాడి. ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరుల దుర్మరణం. ► 2005 జూన్ 24: శ్రీనగర్ శివార్లలో కారు బాంబును పేల్చిన ఉగ్రవాదులు. తొమ్మిది మంది సైనికుల మృతి. ► 2004 ఏప్రిల్ 8: బారాముల్లా జిల్లాలోని ఉరి వద్ద పీడీపీ ర్యాలీపై గ్రెనేడ్లతో దాడి. 11 మంది చనిపోయారు. ► 2003 జులై 22: అక్నూర్లో సైనిక శిబిరంపై దాడి. బ్రిగేడియర్సహా ఎనిమిది మంది సైనికుల మరణం. ► 2003 జూన్ 28: సన్జాన్ ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి. 12 మంది సైనికుల దుర్మరణం. ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతం. ► 2002 మే 14: కలుచాక్ ఆర్మీ కంటోన్మెంట్‌పై దాడిలో 36 మంది సైనికులు నేలకొరిగారు. ► 2001 నవంబర్ 17: రాంబన్‌లోని భద్రతా దళ స్థావరంపై ఉగ్రదాడి. 10 మంది సైనికులు మరణించారు. నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ► 2001 అక్టోబర్ 1: శ్రీనగర్‌లోని పాత శాసనసభ కాంప్లెక్స్ వెలుపల కారు బాంబు పేలుడు. 38 మంది దుర్మరణం. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ► 2000 ఆగస్ట్ 10: శ్రీనగర్‌లోని రెసిడెన్సీ రోడ్లో భద్రతా సిబ్బందిపై గ్రెనేడ్ దాడి, కారు బాంబు పేలుడు. 11 మంది సైనికులు, ఓ జర్నలిస్టు మరణించారు. ► 2000 ఏప్రిల్ 19: శ్రీనగర్‌లోని బాదామిబాగ్‌లో ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద తొలిసారిగా కారుతో ఆత్మాహుతి దాడి. ఇద్దరు సైనికులు మరణించారు. ► 1999 నవంబర్ 3: బాదామిబాగ్ ఆర్మీ హెడ్‌క్వార్టర్ వద్ద దాడి చేసి 10 మంది సైనికులను చంపేశారు. -
ఉగ్ర దాడికి కొత్త వ్యూహాలు
న్యూఢిల్లీ: సైనిక బలగాలపై దాడులకు ఉగ్రవాదులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సాయుధుడు ఆర్మీ శిబిరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం, లేదంటే బాంబులు విసరడం లాంటివి ఇంతకుముందు చాలాసార్లు జరిగినవే. పుల్వామాలో జరిగిన దాడిలో ఉగ్రవాది 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నడుపుకుంటూ వచ్చి జవాన్ల వాహనశ్రేణి వద్ద పేల్చుకోవడం వారి కొత్త వ్యూహాన్ని సూచిస్తోంది. జమ్మూ కశ్మీర్లో ఇలాంటి తరహా పేలుళ్లు చివరిసారిగా 2001లో సంభవించాయి. అప్పుడు అసెంబ్లీ సమీపంలో కారులో పేలుడు పదార్థాలు అమర్చి ఉగ్రవాదులు 38 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 11న నౌషెరా సెక్టార్లో జరిగిన ఐఈడీ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. చాన్నాళ్లు తరువాత కశ్మీర్లో ఐఈడీ దాడులు పెరగడంపై ఆర్మీ ఆందోళన చెందుతోంది. గతేడాది జనవరిలో బారాముల్లాలో చోటుచేసుకున్న ఇలాంటి దాడిలో నలుగురు పోలీసులు మృత్యువాతపడ్డారు. నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఐఈడీ దాడులు భద్రతా బలగాలకు కొత్తేం కాదు. కానీ కశ్మీర్లో తక్కువ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదుల వ్యూహాలు వేరుగా ఉంటాయి. మిలిటరీ శిబిరంలోకి చొరబడి సైనికులు తేరుకునే లోపే చేయాల్సినంత నష్టం చేయడమే లక్ష్యంగా వారు తెగబడుతారు. ఇటీవల అగ్రస్థాయి ఉగ్రవాదుల్ని వరసగా మట్టుపెట్టడంతో, మిగిలిన టెర్రరిస్టుల్లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే వాంఛ పెరిగిందని, ఇందులో భాగంగానే ఐఈడీ పేలుళ్లకు పాల్పడుతున్నారని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. వేర్పాటువాదులకు చేరువకావాలనుకుంటున్న పాకిస్తాన్ ప్రయత్నాలను భారత్ అడ్డుకోవడం కూడా ఉగ్రవాదుల వ్యూహాల మార్పునకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్‌ను పాక్‌లో కలపడమే లక్ష్యం భారత్‌లో పలు ఉగ్రదాడులకు జైషే స్కెచ్ సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడికి పాల్పడిన జైషే మొహమ్మద్‌ను మౌలానా మసూద్ అజహర్(50) 2000, మార్చి నెలలో ప్రారంభించాడు. కశ్మీర్‌ను భారత్ నుంచి విడగొట్టి పాకిస్తాన్లో కలపాలన్న ఏకైక లక్ష్యంతో ఈ సంస్థ పనిచేసేది. పాక్ ప్రోద్బలంతో జైషే ఉగ్రవాదులు భారత్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సైనికులపై దాడులకు పాల్పడ్డారు. సొంత దేశంలోని ముస్లిమేతరులను ఈ ఉగ్రసంస్థ విడిచిపెట్టలేదు. 2001, అక్టోబర్ 1న కశ్మీర్ అసెంబ్లీపై దాడికి పాల్పడి 38 మందిని బలికొనడంతో జైషే మొహమ్మద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని తామే చేశామని తొలుత గర్వంగా ప్రకటించుకున్న జైషే సంస్థ.. ఆ తర్వాత తమకు సంబంధం లేదని బుకాయించింది. అదే ఏడాది భారత పార్లమెంటుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులతో కలిసి దాడిచేసింది. ఈ నేపథ్యంలో భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ జైషే మొహమ్మద్‌ను 2002లో నిషేధించింది. అయినప్పటికీ ఇతర సంస్థల ముసుగులో జైషే మొహమ్మద్ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలోనూ జైషే పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మసూద్ అజహర్ మేనల్లుడు, స్నైపర్ ఉస్మాన్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి మసూద్ తెగబడ్డాడని నిపుణులు భావిస్తున్నారు. -
ఉగ్ర మారణహోమం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను శ్రీనగర్‌లోని 92 బేస్ బదామీగఢ్ ఆర్మీ కంటోన్మెంట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లలో చాలామంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. విధుల్లో మళ్లీ చేరేందుకు వెళుతుండగా.. మళ్లీ విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరారు. వీరి వాహనాలు సూర్యాస్తమయంలోగా 266 కిలోమీటర్ల దూరంలోని శ్రీనగర్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై భద్రతాబలగాల వాహనాలు ఒకదానివెంట మరొకటి వెళుతున్నాయి. రెప్పపాటులో ఉగ్రవాది కారుతో బస్సును ఢీకొట్టాడు. భద్రతాబలగాలు తేరుకునేలోపే తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి. పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలానికి ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు, ఎన్ఎస్జీకి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు ఘటనాస్థలికి చేరుకుని సాక్ష్యాలు, పేలుడు అవశేషాలను సేకరించారు. ఉగ్రదాడి జరగడంతో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిహార్ పర్యటను రద్దుచేసుకుని వెనుదిరగగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబా భూటాన్ పర్యటన నుంచి అర్ధంతరంగా తిరుగుప్రయాణమయ్యారు. 2016, సెప్టెంబర్ 18న కశ్మీర్లో ఉడీ ఆర్మీ బేస్‌పై ఉగ్రదాడి తర్వాత భద్రతాబలగాలు భారీస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఉడీ ఘటనలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు మూసేయడంతో భారీ కాన్వాయ్ ప్రమాద విషయమై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆర్.ఆర్. భట్నాగర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వాతావరణం బాగోలేకపోవడంతో గత రెండ్రోజులగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ఉగ్రవాదుల ఆత్మాహుతిదాడికి గురైన బస్సులో 39 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. వీరంతా సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌కు చెందినవారని పేర్కొన్నారు. దాడి సందర్భంగా జవాన్ల వాహనాలపై కాల్పులు జరిగాయన్నారు. సాధారణంగా సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో వెయ్యి మంది జవాన్లు మాత్రమే ఉంటారనీ, కానీ గత రెండ్రోజులుగా రహదారి మూతపడటంతో ఒకేసారి భారీ సంఖ్యలో 2,547 మంది జవాన్లు శ్రీనగర్‌కు బయలుదేరారని తెలిపారు. ఈ ఘటనపైకశ్మీర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఉగ్రదాడి తీవ్రత దృష్ట్యా కశ్మీర్ పోలీసులతోపాటు ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు ఈ విచారణలో పాలుపంచుకుంటారని భట్నాగర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో శాంతిభద్రతలను సమీక్షించేందుకు శుక్రవారం కేంద్ర భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఖండించిన అంతర్జాతీయ సమాజం పుల్వామాలో భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి, అమెరికా, రష్యాతోపాటు, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, చెక్ రిపబ్లిక్, పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఖండించాయి. పుల్వామా దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి కారకులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలతోపాటు భారత ప్రభుత్వం, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్యాగాలు వృథా కావు జమ్మూకశ్మీర్‌లో జవాన్లపై జరిగిన దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. మన భద్రతా బలగాల త్యాగాలు వృథా కావని ఆయన అన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ దాడిలో వీరమరణం పొందినవారి కుటుంబాలకు జాతి మొత్తం మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన అనంతర పరిస్థితిపై హోం మంత్రి రాజ్‌నాథ్‌తోపాటు అధికారులతో చర్చించానన్నారు. ‘పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి అత్యంత హేయం. పిరికిపందలు పాల్పడిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. సాహసవంతులైన మన భద్రతా బలగాలు చేసిన త్యాగాలు వృథా కావు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉగ్రదాడి తరువాత మంటల్లో చిక్కుకున్న ఆర్మీ వాహనాలు. సైనికుడి మృతదేహాన్ని తరలిస్తున్న తోటి సైనికులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది ఎవరేమన్నారంటే.. ప్రతీకారం తీర్చుకుంటాం పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని హోం మంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. హింసాత్మక చర్యల ద్వారా శాంతికి భగ్నం కలిగించాలనుకునే శక్తుల ఆటలను కట్టించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ‘సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి జైషే మొహమ్మద్ సంస్థే కారణం. ఇందుకు తగినవిధంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నా. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క జవానుకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని అన్నారు. - హోం మంత్రి రాజ్‌నాథ్ ‘కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఉగ్ర మూకలపై జరిగే పోరాటంలో జాతి మొత్తం ఐక్యంగా నిలబడుతుంది. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. దుష్ట, ఉగ్ర మూకలపై జరిగే పోరులో జాతి మొత్తం ఒక్కటిగా నిలబడుతుంది. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘బలగాలపై ఉగ్రదాడిపై తీవ్ర వేదనకు గురయ్యా. పిరికిపందల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అమర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజీ ధోరణి అవలంభిస్తోంది. – రాహుల్ గాంధీ ‘కశ్మీర్లో భారత్ బలగాలపై జరిగిన దాడిని అమెరికా దౌత్య కార్యాలయం ఖండిస్తోంది. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్ చేసే పోరాటానికి అమెరికా వెన్నంటి ఉంటుంది’ –అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్ ‘అవంతిపొరాలో 30 మంది జవాన్లు అమరులయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ తీవ్రమైన ఉగ్రవాద చర్యను ఖండించడానికి ఏ పదాలూ సరిపోవు. ఈ మూర్ఖత్వపు చర్యలు ఆగిపోయేలోపు ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి?’ –జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ‘కశ్మీర్లో బలగాలపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నా. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసింది. ఇది యావత్ దేశానికే విషాద దుర్ఘటన. జవాన్ల కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం చర్యలు తీసుకోవాలి ‘పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాల వేదన తీరనిది. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. వీరుల కుటుంబాలకు కాంగ్రెస్‌తోపాటు దేశం యావత్తూ అండగా నిలుస్తుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి’ అని ట్విట్టర్లో ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గురువారం లక్నోలో తన మొట్ట మొదటి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆమె అమర జవాన్ల మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. - ప్రియాంకా గాంధీ -
నెత్తురోడిన కశ్మీర్!
నిత్యాగ్నిగుండమైన జమ్మూ–కశ్మీర్ మరోసారి నెత్తురోడింది. శనివారం ఆ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన దురదృష్ట ఘటనలో ఒక జవానుతోపాటు ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్లో ముగ్గురు మిలిటెంట్లు మరణించారు. పౌరులందరూ ఎన్కౌంటర్ ప్రాంతానికి చొచ్చుకురావడానికి ‘ప్రమాదకరమైన రీతి’లో ప్రయత్నించడం వల్ల ఇలా జరిగిందన్నది భద్రతాదళాల కథనం. ఈ ఉదంతంలో 30మంది పౌరులు కూడా గాయాలపాల య్యారు. జమ్మూ–కశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతూ ఆందోళనకరంగా మారుతు న్నాయి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఆ పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమవుతు న్నారు. అక్కడ చారిత్రక తప్పిదాలు చేయడం రివాజుగా మారింది. నాలుగురోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం చేసిన ప్రకటన దీనికి అద్దం పడుతుంది. 2010లో తమ ప్రభుత్వం కశ్మీర్‌పై ముగ్గురు మధ్యవర్తులతో నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక అమలుకు చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆ సమస్యతో సరిగా వ్యవహరించలేక పోయామని ఆయన ‘తీవ్ర పశ్చాత్తాపం’ వెలిబుచ్చారు. ఆయన పశ్చాత్తాపాలు ఇప్పుడెందుకూ కొరగావు. ముందూ మునుపూ అధికారం వచ్చినా ఇంతకన్నా మెరుగ్గా వ్యవహరిస్తారన్న నమ్మకం ఎవరికీ లేదు. ఎందుకంటే తమంత తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం వీసమెత్తు శ్రద్ధ చూపలేదు. ఆ కమిటీ నివేదికలో విలువైన అంశాలున్నాయి. విలీనం సమయంలో ఆ రాష్ట్రానికి ఇచ్చిన అనేక అధికారాలకూ, రాజ్యాంగం కల్పిస్తున్న ప్రత్యేక రక్ష ణలకూ కోత పెడుతూ వస్తున్న తీరును ఆ కమిటీ ప్రత్యేకంగా ఎత్తిచూపింది. వాటిని ‘కొంతమే రకైనా’ పునరుద్ధరించవలసిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. సాయుధ దళాల (ప్రత్యేకాధి కారాల) చట్టాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లకు ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేసి వాటిద్వారా ఆర్థిక పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిం చింది. అధికార వికేంద్రీకరణ జరిపి, పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలు అప్పగించాలని కోరింది. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల చట్టం అమలుపై 2005లో నియమించిన జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి కమిటీ సైతం ఆ చట్టం రద్దు కావలసిందేనని అభిప్రాయపడింది. అది అణచివేతకు ప్రతీ కగా, విద్వేషాన్ని కలిగించేదిగా, వివక్ష, పెత్తందారీ పోకడల ఉపకరణంగా ఉన్నదని అభివర్ణిం చింది. మిలిటెన్సీని అదుపు చేయడానికి గట్టి చర్యలు అవసరమనుకుంటే అందులోని కొన్ని నిబం ధనలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలో చేర్చవచ్చునని సూచించింది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లోనైనా, జమ్మూ–కశ్మీర్‌లోనైనా ఆ చట్టం అండ లేకుండా తాము పనిచేయలేమని సైన్యం చెప్పిన పర్యవసానంగా యూపీఏ ప్రభుత్వం అటు జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ సిఫార్సులనూ, ఇటు ముగ్గురు మధ్యవర్తుల కమిటీ ఇచ్చిన నివేదికనూ పక్కనబెట్టింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం కశ్మీర్‌ను కొత్త కోణంలో చూడటం ప్రారంభించింది. అంత క్రితం వరకూ తాము అధికారంలోకొస్తే కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తామని చెబుతూ వచ్చిన బీజేపీ అక్కడ పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాక ఆ విషయంలో పట్టు బట్టరాదని నిర్ణయించుకుంది. అటు సాయుధ దళాల చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ వచ్చిన పీడీపీ ఆ విషయంలో మెత్తబడింది. దాని అమలును తమ ప్రభుత్వం సమీక్షించి, చట్టం అవసరం లేని ప్రాంతాలేవో నిర్ణయించి, కేంద్రానికి సిఫార్సులు చేస్తుందని ఆ కూటమికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రకటించారు. ఆయన మరణానంతరం వచ్చిన మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈలోగా నిరుడు ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్రోత్సవంనాడు జాతి నుద్దేశించి మాట్లాడుతూ కశ్మీర్ సమస్యకు చర్చలే పరిష్కారం తప్ప బుల్లెట్లు కాదని చెప్పినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను కేంద్రం ప్రత్యేక దూతగా నియమించింది. అయితే దానివల్ల ఆశించిన ఫలితాలేవీ రాకపోగా, ఈలోగా రాష్ట్రంలో పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కాస్తా కుప్పకూలింది. ఆ తర్వాత అసెంబ్లీ రద్దయి గవర్నర్ పాలన వచ్చింది. ఇప్పుడు పుల్వామా జిల్లాలో జరిగిన ఘటన భద్రతా విభాగాల మధ్య సమన్వయం కొరవడటంవల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఎన్కౌంటర్ జరిగే ప్రాంతానికి సాధారణ పౌరులు చేరకుండా స్థానిక పోలీసుల సాయం తీసుకోవాల్సి ఉండగా అది జరగలేదంటున్నారు. అలాగే కాల్పులు జరిపేముందు ఎలాంటి హెచ్చరికలూ చేయలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కనుకనే ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలని ఇంటి ముందు నిల్చున్న యువకుడు సైతం ప్రాణాలు కోల్పోయాడని కాంగ్రెస్, పీడీపీ ఎత్తిచూపుతున్నాయి. ఈ ఏడాది ఇంతవరకూ రాష్ట్రంలో 587 హింసాత్మక ఉదంతాలు చోటుచేసుకున్నాయి. వీటిలో 47మంది పౌరులు, 90మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా 245మంది మిలిటెంట్లు హతమయ్యారు. పౌరుల మరణాలు 2016నాటితో పోలిస్తే 2017–18లో 167శాతం పెరిగాయని కేంద్ర హోంశాఖ చెప్పిందంటే అక్కడ ఎంతటి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయో అర్ధమవుతుంది. జమ్మూ–కశ్మీర్ పొరుగున పాకిస్తాన్‌వైపు నుంచి ఉండే చొరబాట్లు మిలిటెన్సీని అంతకంతకు పెంచుతున్నాయి. ఉపాధి దొరక్క, భవిష్యత్తు అగమ్యగోచ రమై అక్కడ యువత మిలిటెన్సీ వైపు అడుగులేస్తోంది. ఇలాంటి ఉదంతాలు దానికి మరింత దోహ దపడతాయి. కనుక అక్కడ ఆచి తూచి అడుగులేయాలి. ఆ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అవసరమైన చర్యలు ప్రారంభించాలి. అంతేతప్ప సమస్యకు బుల్లెట్లే పరిష్కారమన్నట్టు వ్యవహరించటం తగదు. -
ప్రధాని మోదీకి 72 గంటల డెడ్‌లైన్
శ్రీనగర్: ‘ప్రధాని నరేంద్ర మోదీకి నేను 72 గంటల టైమ్ ఇస్తున్నా. ఆలోగా నా కొడుకు మరణంపై భారత ప్రభుత్వం పగదీర్చుకోవాలి. లేదంటే మేమే ప్రతీకార చర్యకు దిగుతాం’... ఉగ్రవాదుల చేతిలో పైశాచికంగా హత్యగావించబడిన జవాన్ ఔరంగజేబ్ తండ్రి చెబుతున్న మాటలివి. ‘2003 నుంచి కశ్మీర్ పరిస్థితి మరి దారుణంగా తయారయ్యింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పరిస్థితుల్లో మార్పులు వస్తాయని భావించా. కానీ, ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. పైగా వేర్పాటువాదులు మరింతగా రెచ్చిపోతున్నారు. రాజకీయ నేతలు ఈ ప్రపంచాన్ని ఖూనీ చేస్తున్నారు. కశ్మీర్ గడ్డపై రక్తపాతానికి కారణం వాళ్లే. నేతలను, వేర్పాటువాదులను ఇక్కడి నుంచి తరిమేయాలి. రాజకీయాలను పక్కనపడేసి సైన్యం ఉగ్రవాదుల ఏరివేతకు రంగంలోకి దిగాలి. అప్పుడే ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. కశ్మీర్లో శాంతి వర్థిల్లుతుంది. ప్రధాని మోదీ 72 గంటల్లో నా కొడుకు మరణానికి కారణమైన వాళ్లకి ధీటైన బదులిప్పించాలి. నా కొడుకును చంపిన వాళ్లను అదే రీతిలో సైన్యం కాల్చి చంపాలి. లేదంటే గ్రామస్తులతో కలిసి నేనే సరిహద్దుకు వెళ్తా’ అని ఆయన అల్టిమేటం జారీ చేశారు. కాగా, ఔరంగజేబ్ తండ్రి ఆర్మీలో విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. ఔరంగేజ్ మావయ్య, సోదరుల్లో ఒకరు కూడా సైన్యంలో పనిచేస్తున్న వాళ్లే. గతంలో ఆ కటుంబంలో ఒకరిని ఉగ్రవాదులు అపహరించి చంపారు కూడా. ఇప్పుడు ఔరంగజేబ్‌ను కూడా ఉగ్రమూకలు పొట్టనబెట్టుకున్నాయి. (చిధ్రమైన ఔరంగజేబ్) ఫూంచ్‌కు చెందిన ఔరంగజేబ్ సోఫియాన్‌లోని షాదిమార్గ్ వద్ద ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్ 44వ దళంలో రైఫిల్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రంజాన్ పర్వదినం కావటంతో సెలవుపై ఔరంగజేబు గురువారం ఉదయం తన స్వస్థలానికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో అతన్ని ముసుగులు ధరించిన కొందరు అడ్డగించి తమ వెంట తీసుకెళ్లారు. అది గమనించిన ఓ ఫార్మసిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగు చూసింది. సైనికుడి అపహరణ విషయం తెలిసిన సైన్యం పెద్ద ఎత్తున్న గాలింపు చేపట్టింది. చివరాఖకిరి శుక్రవారం ఉదయం కలంపోరకు 10 కిలోమీటర్ల దూరంలోని గుస్సూ గ్రామంలో బుల్లెట్లతో ఛిద్రమైన ఔరంగజేబ్ మృత దేహాన్ని ఆర్మీ కనుగొంది. -
సెహ్రీ కోసం సిక్కు వృద్ధుడు... వైరల్
శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసం కావటంతో దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉపవాసం, ప్రార్థనలు, ఇఫ్తార్ల కోలాహలం కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం అరుదైన దృశ్యం దర్శనమిస్తోంది. సెహ్రీ (ఉపవాసానికి ముందుగా అంటే సూర్యోదయానికి ముందుగా తీసుకునే భోజనం) కోసం ఓ సిక్కు వృద్ధుడు సాయం చేస్తున్నారు. సాధారణంగా సెహ్రీ కోసం లౌడ్ స్పీకర్లు లేదా ఇలా డప్పులతో చాటింపు వేయించటం మాములే. అలా చేసేవారిని షహర్ఖ్వాన్ అంటారు. ఈ పనిని ఇస్లాం మతానికి చెందిన వ్యక్తే చేస్తుంటారు. మైనార్టీ తెగలకు చెందిన వారు ఈ పని చేయటం అరుదనే చెప్పొచ్చు. ఓ సిక్కు వ్యక్తి ఈ పని చేస్తుండటం, పైగా కశ్మీర్లో.. అది కూడా సమస్యాత్మక ప్రాంతం అయిన పుల్వామాలో కావటంతో ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పలువురు ఆ వృద్ధుడిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఉపవాసానికి ముందు తెల్లవారుఝామున ఏదైనా తినడం లేదా త్రాగడాన్ని సెహ్రీ అంటారు.. రోజా(ఉపవాసం) ముగించిన తరువాత అంటే సూర్యాస్తమయం తరువాత తీసుకునే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. -
సెహ్రీ కోసం సిక్కు వృద్ధుడు
-
ఉగ్రదాడిలో టెన్త్ విద్యార్థి
శ్రీనగర్: కొత్త ఏడాది ఆరంభానికి కొద్ది గంటల ముందు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో సంచలన విషయం వెలుగు చూసింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా లెత్‌పొరాలోని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంప్‌పై జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 16 ఏళ్ల బాలుడు ఉన్నట్టు గుర్తించారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు. పోలీసు కానిస్టేబుల్ గులాం మహ్మద్ ఖాండే కుమారుడైన ఫర్దీన్ అహ్మద్ ఖాండే మూడు నెలల క్రితం ఉగ్రవాదిగా మారాడని కశ్మీర్ పోలీసులు తెలిపారు. బుర్హాన్ వనీ స్వస్థలం త్రాల్‌కు చెందిన ఫర్దీన్ పదో తరగతి చదివాడు. ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో అతడితో పాటు మన్జూర్ బాబా డ్రబ్‌గామ్(22) కూడా హతమయ్యాడు. మరో ఉగ్రవాది కూడా మరణించి ఉంటాడని, అతని మృతదేహం కోసం క్యాంప్‌లో గాలిస్తున్నామని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి రాజేశ్ యాదవ్ తెలిపారు. చిన్నపిల్లలు ఉగ్రవాదం పట్ల ఆకర్షితులు కావడం కశ్మీర్ పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. దాడికి ముందు వీడియో మిలటరీ క్యాంప్‌పై దాడికి ముందు ఫర్దీన్ రికార్డు చేసిన ఎనిమిది నిమిషాల వీడియో మెసేజ్ వాట్సప్‌లో వైరల్‌గా మారింది. సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై వ్యూహం పన్నినట్టు వీడియో మెసేజ్‌లో ఫర్దీన్ వెల్లడించాడు. ‘ఈ సందేశం మీకు చేరేటప్పటికీ నేను స్వర్గంలో దేవుడి దగ్గర అతిథిగా ఉంటాన’ని వీడియోలో పేర్కొన్నాడు. ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్ర దాడి
శ్రీనగర్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా లెత్‌పొరాలోని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంప్‌పై జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాదులు దాడి జరిపి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. గ్రెనేడ్ లాంఛర్లు, ఆటోమేటిక్ ఆయుధాలు ధరించిన కొందరు ముష్కరులు ఆదివారం వేకువజామున సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్దకు వచ్చీ రావటంతోనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. క్యాంప్ లోపలికి దూసుకెళ్లటానికి వారు చేసిన యత్నాలను సీఆర్పీఎఫ్ గార్డులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఉగ్రవాది కూడా మరణించి ఉంటాడని, అతని మృతదేహం కోసం క్యాంప్‌లో గాలిస్తున్నామని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి రాజేశ్ యాదవ్ తెలిపారు. అమరులైన వారిని సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ తౌఫయిల్ అహ్మద్, ఇన్స్పెక్టర్ కుల్దీప్ రాయ్ (హిమాచల్ ప్రదేశ్), కానిస్టేబుళ్లు.. షరీఫుద్దీన్ గనీ (బుద్గాం), రాజేందర్ నైన్(రాజస్థాన్), పీకే పాండా(ఒడిశా)గా గుర్తించారు. చనిపోయిన ఉగ్రవాదులను మంజూర్ అహ్మద్ బాబా(పుల్వామా), ఫర్దీన్ అహ్మద్ ఖన్దే(త్రాల్)గా భావిస్తున్నారు. వీరి వద్ద ఉన్న మారణాయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ పోలీసులను పెద్ద సంఖ్యలో క్యాంప్‌నకు తరలించారు. ఈ దాడికి తమదే బాధ్యతని పాక్ ప్రేరేపిత జైష్–ఎ–మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పాక్ కాల్పుల ఉల్లంఘన రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత పోస్టులపైకి పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఒక జవాను చనిపోయాడు. వేకువ జామున పాక్ బలగాలు రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లోని భారత్ ఫార్వర్డ్ పోస్టుల పైకి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పంజాబ్‌కు చెందిన జవాను ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా పూంఛ్ జిల్లా దిగ్వార్ సెక్టార్లో అర్ధరాత్రి నుంచి వేకువజాము 5.30 గంటల వరకు పాక్ బలగాలు కాల్పులు కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ జమ్మూకశ్మీర్‌లోని భద్రతా బలగాల యుద్ధ సన్నద్ధత, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష జరిపారు. రాజౌరీ సెక్టార్‌లోని నియంత్రణాధీన రేఖ వెంబడి ఫార్వర్డ్ పోస్టులను ఆదివారం పరిశీలించారు. డిసెంబర్ 10వ తేదీ వరకు ఎల్వోసీ వెంబడి పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటనలు 881 జరగ్గా, గత ఏడేళ్లలో ఇదే అత్యధికం కావటం గమనార్హం. దీంతోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నవంబర్ వరకు మొత్తం 110 సార్లు పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ ఘటనల్లో 14 మంది సైనికులు, 12 మంది పౌరులు, నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు అమరులయ్యారని సైన్యం తెలిపింది. 2003లో భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మొత్తం 3,323 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ‘పుల్వామా దాడి ప్రధాని వైఫల్యం’ పుల్వామా సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి ప్రధాని మోదీ విదేశాంగ విధానం వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ మండిపడింది. దేశ విరోధులకు గట్టిగా బుద్ధి చెబుతామని ఎన్నికల సమయంలో చెప్పిన మోదీ మాటలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుశ్మితా దేవ్ ప్రశ్నించారు. -
వరదలో కొట్టుకుపోయిన 9 మంది జవానులు
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లో శనివారం వరద సహాయక చర్యల్లో పాల్గొన్న తొమ్మిదిమంది జవాన్లు వరద ఉధృతికి కొట్టుకు పోయారు. పుల్వామా జిల్లాలో వరద ఉధృతి శనివారం కూడా కొనసాగుతోంది. సహాయక చర్యలు చేపడుతుండగా.... ఒక్కసారిగా వరద ఉధృతి పెరగటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే శ్రీనగర్‌లో జీలమ్ నది పోటెత్తుతోంది. దాంతో నది వద్ద అయిదు కిలోమీటర్ల మేర రహదారి కొట్టుకుపోయింది. కాగా శ్రీనగర్ విమానాశ్రయంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. కాగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలలో మృతి చెందినవారి సంఖ్య 120కి చేరింది. వారిలో కొండచరియలు విరిగి 14మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదివేలమంది వరద తాకిడికి గురయ్యారు.