
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పుల్వామా ఉగ్రవాద దాడిపై చర్చిందుకు పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కీలకమైన ఈ సమావేశానికి మోదీ హాజరుకాలేదు. ప్రధాని గైర్హాజరుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత పెద్ద ఘటన జరిగితే ప్రధానమంత్రి కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించపోవడం ఏంటని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శనివారం పార్లమెంట్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పొల్గొన్న పార్టీలు.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని చెబుతూనే ప్రధాని రాకపోవడంపై మండిపడ్డాయి. తమ అభిప్రాయాలను ప్రధానితోనే పంచుకుంటామని, మోదీతో ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేయాలని పలువురు నేతలు స్పష్టంచేశారు. ఉగ్రవాద పోరుపై ప్రధాని హోదాలో మోదీ చేసిన చర్యలేమిటో తెలపాలని డిమాండ్ చేశారు.
అఖిలపక్ష సమావేశానికి మోదీ రాకపోవడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెబుతామని పార్టీ బహిరంగ సభల్లో ఊదరగొట్టే మోదీ.. ఉగ్రవాదాన్ని అణచడంలో ఇనాళ్లు ఏం చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. కేవలం మాటలే తప్ప మోదీ సాధించింది ఏమీ లేదని ఆయన అన్నారు. ఉగ్రదాడిపై చర్చించేందుకు అన్ని పార్టీలతో మోదీ సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment