all party meeting
-
ఈసీ అఖిలపక్షంలో ట్విస్ట్.. నోటాను వ్యతిరేకించిన కాంగ్రెస్
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా.. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలని ఈసీ ప్రతిపాదన చేసింది. దీనికి కాంగ్రెస్ తప్ప.. అన్ని రాజకీయ పార్టీల దాదాపుగా సానుకూలంగానే స్పందించాయి. నోటాతో ఎన్నిక ఖర్చు ఎక్కువ అని, ఒకవేళ నోటాతో ఎన్నిక నిర్వహించినా సెకండ్ లార్జెస్ట్ పార్టీనే విజేతగా ప్రకటించాలని కాంగ్రెస్ ఈసీని కోరింది. నోటాపై అభిప్రాయం సేకరణలో బీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది. ఏకగ్రీవానికి.. బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని ఈసీకి తెలిపింది. అలాగే.. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ఈసీని కోరింది. ఇక.. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. అలాగే.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని గుర్తు చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని స్పష్టం చేసింది. నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని సీపీఎం గుర్తు చేసింది. అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీ-ఎలక్షన్ కరెక్ట్ కాదు. ఎన్నిక కండక్ట్ చేయడం అవసరం.. నోటాకు ఎక్కువ ఓట్లు అనేది తర్వాత చర్చ అని వామపక్ష పార్టీ అభిప్రాయపడింది. ఇక.. తెలంగాణ టీడీపీ తమ అభిప్రాయాన్ని రెండు మూడు రోజుల్లో చెప్తామనగా, సింగిల్ అభ్యర్థిగా అయినా నోటా ఉండాలని జనసేన పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది.ఇదీ చదవండి: స్థానిక సంస్థల్లో ‘నోటా’ ఎందుకంటే.. -
పార్లమెంట్లో వాయిదాల పర్వం.. అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా లోక్‌సభలో సంభాల్ అంశంపై మాట్లాడేందుకు సమాజ్‌వాదీ పార్టీకి, బంగ్లాదేశ్ పరిస్థితులపై మాట్లాడేందుకు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుమతించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంటు సమావేశాలు సజావుగా నడిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే వచ్చే వారం రాజ్యాంగంపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంగీకరించారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో,16, 17 తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరుగనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంట్ వెలుపల విలేకరులతో చెప్పారు. ‘పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం మంచిది కాదు. రేపటి నుంచి పార్లమెంట్ సజావుగా జరిగేలా మనమందరం చేసుకున్న ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్ష నేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని రిజిజు పేర్కొన్నారు.అయితే అన్ని అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు కోరుతున్నాయి. నిరుద్యోగం, రైతుల సమస్యలు, సంబాల్ హింస, పెరుగుతున్న ధరలు తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాని అంశంపై బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరాయి.కాగా గతవారం (నవంబర్25) ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాలపర్వం కొనసాగుతోంది. విపక్షాల డిమాండ్లతో రోజూ సభ ప్రారంభం కావడం, వాయిదా పడటం పరిపాటిగా మారింది. అదానీ అవినీతి వ్యవహారం, సంభాల్ హింస, మణిపూర్ అంశం వంటి విషయాలపై చర్చించాలని విపక్షాలు నిరసనలు చేస్తుండటంతో ఉభయసభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. -
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ
-
అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ
సాక్షి,ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమవనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేవం నిర్వహిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం ఆదివారం(నవంబర్ 24) సమావేశమైంది. అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్‌లీడర్లతో పాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి , లోక్ సభపక్ష నేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు.పోలవరం ఎత్తు , ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్లు , విశాఖ స్టీలు ప్రైవేటీకరణ అంశాలను వైఎస్సార్సీపీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు లేవనెత్తనున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులను నేతలు ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పార్లమెంట్లో గళం విప్పనున్నారు.కాగా, సోమవారం(నవంబర్ 25) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. డిసెంబర్ 20దాకా సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు(జమిలి ఎన్నికలు) బిల్లులతో పాటు మరో 16 బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వక్ఫ్, జమిలి ఎన్నికల చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: మహాయుతి దెబ్బకు ఎల్వోపీ సీటు గల్లంతు -
నా టార్గెట్ అమరావతే..
-
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష భేటీలో YSRCP డిమాండ్
-
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. అఖిలపక్ష భేటీలో వైఎస్సార్సీపీ డిమాండ్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను వైఎస్సార్సీపీ వివరించింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేయగా, టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్ చేసింది.ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతాం: విజయసాయిరెడ్డిఅఖిల పక్ష భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో 45 రోజుల్లో 39 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని.. ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతామన్నారు. ఢిల్లీలో బుధవారం వైఎస్ జగన్ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే మీడియాను అడ్డుకునే చట్టం తీసుకురావాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న (శనివారం) ఆయన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనునరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు.రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24వ తేదీ బుధవారం నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైఎస్ జగన్ చెప్పారు.గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరించి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోదామని ఎంపీలకు సూచించారు. ధర్నా అనంతరం పార్లమెంట్‌కు హాజరై రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలనపై గళమెత్తాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను తమ సభల్లోని సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్భోధించారు. -
ఏపీలో రాష్ట్రపతి పాలన..!
-
జులై 21న అఖిలపక్ష సమావేశం.. టీఎంసీ డుమ్మా!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జులై 21న (ఆదివారం) పార్లమెంట్ ఉభయసభల్లోని అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ సెషన్, సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది. జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని ప్రధాన కమిటీ రూమ్‌లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్) హాజరు కావడం లేదు. జులై 21న రాష్ట్ర అమరవీరుల దినోత్సవం నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావడం లేదని టీఎంసీ ని ర్ణయించుకుంది.కాగా ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకావడం ఇదే తొలిసారి కానుంది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
నేడు కేంద్ర అఖిలపక్ష భేటీ
ఢిల్లీ: నేడు కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు అన్ని పార్టీల నేతలు భేటీ కానున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం జరపనుంది. బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. రేపు పార్లమెంటులో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఎల్లుండి ఇంటెరిమ్ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇదీ చదవండి: సిమిపై మరో ఐదేళ్ల నిషేధం -
రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లోని పారీ్టల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ అవుతారు. సమావేశాలు ఫిబ్రవరి 9 దాకా కొనసాగుతాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. -
‘బహిష్కరణ’పై చర్చ జరగాల్సిందే
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సులు.. అఖిలపక్ష భేటీలో వేడిపుట్టించాయి. ఆ సిఫార్సులపై లోక్‌సభలో తుది నిర్ణయం తీసుకు నేలోపే పార్లమెంట్లో వాటిపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఏర్పాటుచేసిన అఖిలపక్ష భేటీ వాడీవేడీగా జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి పార్ల మెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీలతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలు సుదీప్ బందోపాధ్యాయ్, డెరెక్ ఓబ్రియాన్, ఎన్సీపీ నేతలు ఫౌజియా ఖాన్ తదితరులు హాజరయ్యారు. ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో మహువా మొయిత్రాను బహిష్కరించేందుకు వీలుగా లోక్‌సభ ఎథిక్స్ కమిటీ నివేదికపై పార్లమెంట్ తొలిరోజే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోస్తోంది. దీంతో ప్రభుత్వ వైఖరిని విపక్ష సభ్యులు ఆక్షేపించారు. బహిష్కరణపై తుది నిర్ణయం తీసుకునే ముందు నివేదికపై చర్చ చేపట్టాలని టీఎంసీ నేతలు డిమాండ్ చేశారు. సభలో చర్చ జరక్కుండానే ఎథిక్స్ కమిటీ నివేదిక బహిర్గతం కావడాన్ని వారు నిరసించారు. మహువాపై బహిష్కరణ వేటు తీవ్ర శిక్ష: అధీర్ రంజన్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలన్న యోచన అత్యంత తీవ్రమైనదని, దీని పర్యవసానాలు ఎన్నో రకాలుగా ఉంటాయని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురి ఆగ్రహంవ్యక్తంచేశారు. పార్లమెంటరీ కమిటీ నిబంధనలు, ప్రక్రియలపై పునఃసమీక్ష చేపట్టాలని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నాలుగు పేజీల లేఖ రాశారు. అఖిలపక్షానికి హాజరుకాలేకపోయిన వైఎస్సార్సీపీ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చే ఎయిర్ఇండి యా విమానం శనివారం దారి మళ్లింపు కారణంగా పార్లమెంటు అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ హాజరుకాలేకపో యింది. ఉదయం 8.10 నిమిషాలకు ఢిల్లీ రావాల్సిన విమానా న్ని విజిబిలిటీ లేని కారణంగా జైపూర్ మళ్లించారు. ఇదే విమానంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రయాణించారు. విమానం దారి మళ్లింపు కారణంగా ఉదయం పార్లమెంటు లైబ్రరీ భవనంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకాలేకపోయారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ప్రారంభమైన కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం
-
అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రహ్లాద్ జోషి
ఢిల్లీ: అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ సెషన్ లో 21 బిల్లులు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం నేడు ముగిసింది. ఈ సమావేశానికి 23 పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. పేదల కోసం అనేక అద్భుత పథకాలు తెచ్చాం.. అయిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. పూర్తి స్థాయిలో జరగాల్సిన చివరి సెషన్.. స్వల్ప కాలిక చర్చకు వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విపక్షాలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడు(శనివారం) నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో రెండు జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. వివాదాస్పద ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లును కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశపెట్టనుంది. #WATCH | Delhi: An all-party meeting is underway at the Parliament Library building, ahead of the winter session of Parliament. The winter session of Parliament, 2023 will begin from December 4 and continue till December 22. pic.twitter.com/PSwDtGFyPk — ANI (@ANI) December 2, 2023 శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఐపిసి , సీఆర్పీసీలను మారుస్తూ కొత్త బిల్లులను తీసుకురానున్నారు. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇవి చివరి శీతాకాల సమావేశాలు గమనార్హం. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఇదీ చదవండి: Rajasthan Exit Poll Analysis: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు? -
పొగమంచు ఎఫెక్ట్‌తో పలు విమానాలు దారి మళ్లింపు
సాక్షి,న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డం పడింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. దీంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దారి మళ్లించిన విమానాల సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఉదయం 6.15కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని(AI559) జైపూర్‌కు దారి మళ్లించారు. ఈ విమానంలోనే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో ఆయన 11 గంటలకు జరుగనున్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు ఆలస్యంగా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు అఖిలపక్ష సమావేశం పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ఉదయం 11గం.లకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఈ భేటీ జరగనుంది. వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు అవుతుండగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎజెండాగా ఈ భేటీ జరుతోంది. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4 నుంచి 22 వరకూ కొనసాగనున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. -
Parliament Winter sessions 2023: రేపు అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: డిసెంబర్ నాలుగో తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. డిసెంబర్ రెండో తేదీన(శనివారం) అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని సంబంధిత రాజకీయ పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేంద్రం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్‌తోపాటు రాజకీయ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు పాల్గొంటారు. ప్రస్తుతం పార్లమెంట్ వద్ద 37 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సారి సెషన్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని, 12 బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ల తొలి అదనపు బిల్లులను ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తోంది. లోక్‌సభలో ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలంటూ నైతికవిలువల కమిటీ ఇచ్చిన సిఫార్సును ఈసారి సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులను సభ ముందు ఉంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లునూ ప్రవేశపెట్టే అవకాశముంది. -
ఢిల్లీలో అఖిలపక్ష భేటీ
ఢిల్లీ: రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ముందు నేడు కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో నేడు అల్ పార్టీ మీటింగ్ జరిగింది. అన్ని పార్టీల నేతలు, ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. YSRCP తరుపున విజయసాయిరెడ్డి హాజరయ్యారు. #WATCH | Delhi: All-party meeting underway at the Parliament library building, ahead of the special session of Parliament that will begin tomorrow pic.twitter.com/Sn66dXZ3yo — ANI (@ANI) September 17, 2023 పార్లమెంట్లో రేపు ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల గురించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. స్పెషల్ సెషన్ అజెండాపై చర్చించారు. సమావేశాలకు సహకరించాలని అన్ని పార్టీల నాయకుల్ని కోరారు. ఈ నెల 18న 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణం పై చర్చ జరగనుంది. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లుపై చర్చ జరగనున్నట్లు ఆయా బులిటెన్లు పేర్కొన్నాయి. రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, అలాగే లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మాధవన్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందన -
విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం :విజయసాయిరెడ్డి
-
బెంగళూరుకు వెళ్లలేదంటే బీజేపీతో ఉన్నట్టు కాదు
సాక్షి, న్యూఢిల్లీ: బెంగళూరులో ఇటీవల జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ హాజరుకాలే దంటే తాము బీజేపీతో ఉన్నట్టు కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు స్పష్టం చేశారు. 26 పార్టీలు ఒకవైపు, 38 పార్టీలు ఒకవైపు అన్న లెక్కలు రాజకీయాల్లో పనికిరావని, సిద్ధాంతపరంగా ఎవరు ఎటు ఉన్నారు అన్నది చూడాల న్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావే శంలో బీఆర్ఎస్ తరపున ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కేకే మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో అర్థ గణాంకాలు పనిచేయవని, రెండు రెండు నీటి బిందువులు కలిస్తే నాలుగు బిందువులు కావని కేవలం ఒక నీటి బిందువే అవుతుందన్నారు. కూట ములు విఫల ప్రయోగాలు అని ఇప్పటికే రుజువైందని వ్యాఖ్యానించారు. ఇండియా కూట మిలో ఉంటే బీజేపీకి వ్యతిరేకం అని, లేకపోతే బీజే పీకి మిత్రులని అనుకోవద్దన్నారు. ఐదుగురు జడ్జీల విషయంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కాదంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఆర్డినెన్స్ తేవడం అహంకారపూరితమని కేకే మండిపడ్డారు. న్యాయమూ ర్తుల కంటే తమకే ఎక్కువ తెలుసు అన్న ధోరణిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజన చట్టంలోని అంశాలపై చర్చ జరగాలి: నామా విభజన చట్టంలోని హామీలు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలు, పెండింగ్ నిధుల అంశంపై చర్చ జరగాలని ప్రతీ పార్లమెంట్ సమావేశ సమయంలో పట్టుబడుతున్నా, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సమావేశాల్లో గవర్నర్ వ్యవస్థపై కూడా చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని నామా డిమాండ్ చేశారు. -
విభజన హామీలు నెరవేర్చాలి.. అఖిలపక్ష భేటీలో ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ తరపున ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.ఈ భేటీలో రాష్ట్ర సమస్యలను లేవనెత్తారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బీసీ కులగణన జరిపించాలని కోరామన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని లేవనెత్తామని, జోన్ ఏర్పాటు చేసి నాలుగేళ్లైనా అమల్లోకి రాలేదన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించామన్నారు. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు. విశాఖ ఉక్కు ఇప్పుడు నష్టాల్లో లేదన్నారు. చదవండి: పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. ‘‘ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా మంజూరు చేయాలి. పోలవరం ప్రాజెక్ట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ఉమ్మడి పౌరస్మృతిపై ఇప్పటి వరకూ ఎలాంటి డ్రాప్ట్ లేదు. యూసీసీ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత మా విధానాన్ని ప్రకటిస్తాం. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలి’’ అని విజయసాయిరెడ్డి కోరారు. -
ముగిసిన అఖిలపక్ష భేటీ.. సహకరించాలని విపక్షాలకు ప్రభుత్వం వినతి..
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు జరిగిన అఖిలపక్ష భేటీ ముగిసింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అన్ని పార్టీలు ఈరోజు పార్లమెంట్లో సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి దేశంలో వివిధ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను ప్రభుత్వం కోరింది. కాగా.. ఈ వర్షాకాల సమావేశాలల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. #WATCH | Delhi: Defence Minister Rajnath Singh is chairing an all-party meeting ahead of the Monsoon Session of Parliament. pic.twitter.com/UnSWa8yMP5 — ANI (@ANI) July 19, 2023 అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ విజయ సాయిరెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఎంపీలు కేశవ రావు, నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ సమావేశానికి హాజరయ్యారు. కాగా.. ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అల్లర్లపై ప్రభుత్వం పెదవి విప్పనుందని సమాచారం. #MonsoonSession | Central Government informed all parties during the all-party meeting that government is ready to discuss on Manipur issue: Sources — ANI (@ANI) July 19, 2023 ఈ సమావేశాల్లోనే ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్ పై బిపార్ల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే.. విపక్షాలు పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఎన్నికల సమయం అయినప్పటికీ ప్రజా సమస్యల చర్చ కోసం పార్లమెంటుకు వస్తున్నామని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రం జాన్ చౌదరి తెలిపారు. విపక్షాలకు మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి మౌనాన్ని వీడాలని అన్నారు. ఇదీ చదవండి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: నేడు అఖిలపక్ష భేటీ.. ఎన్డీయే వర్సెస్ ఇండియాతో ఆసక్తికరంగా.. -
మణిపూర్: అమిత్ షా అఖిలపక్ష భేటీ.. ఏపీ, టీఎస్ నుంచి వెళ్లింది వీరే..
సాక్షి, ఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రహోం మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ ఘర్షనల నేపథ్యంలో నేడు(శనివారం) అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు.. శుక్రవారం కూడా మరోసారి మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల ప్రకారం.. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని, సాధారణ స్థితిని పునరుద్ధరించే మార్గాలపై ఆలోచించడమే అఖిలపక్ష సమావేశం ఉద్దేశమని అమిత్ షా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుందని తెలిపారు. అయితే, మణిపూర్ ఘర్షణల తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక, ఈ సమావేశానికి ఏపీ నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ వినోద్ హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో హింసాత్మక ఘటన నేపథ్యంలో తొమ్మిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని వారు విమర్శలు చేశారు. ఐదు అంశాలతో కూడిన మెమోరాండంను మోదీకి సమర్పించిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై, పరిపాలనపై తమకు నమ్మకం లేదన్నారు. చట్టపరంగా పరిపాలన అనుసరించడం ద్వారా సరైన పరిపాలన, ప్రభుత్వ పనితీరు కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు అని లేఖలో వివరించారు. కాగా, ఈ ఎమ్మెల్యేలంతా మైతి సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. లేఖపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలు వీరే.. - కరమ్ శ్యామ్ సింగ్, - తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్, - నిషికాంత్ సింగ్ సపం, - ఖ్వైరక్పం రఘుమణి సింగ్, - ఎస్. బ్రోజెన్ సింగ్, - టీ. రవీంద్రో సింగ్, - ఎస్, రాజేన్ సింగ్, - ఎస్. కేబీ దేవి, - వై. రాధేశ్యామ్. ఇది కూడా చదవండి: ఇండిగో విమానంలో మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేయడంతో.. -
మణిపూర్ అల్లర్లు: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన అమిత్ షా
న్యూఢిల్లీ: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎట్టకేలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈశాన్య రాష్ట్రంలో నెలన్నరగా జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తెచ్చి రాష్ట్రంలో శాంతిస్థాపనే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది హోంశాఖ. ప్రశాంతతకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మే 3న ఒక్కసారిగా భగ్గుమంది. ఇక్కడి జనాభాలో అత్యధికులు మెయిటీ, కుకీ తేగల మధ్య వైరం తారాస్థాయిలో రాజుకుంది. రెండు వర్గాలు పరస్పర దాడులు చేసుకుంటూ సృష్టించిన బీభత్సంలో అనేకమంది సామాన్యుల జీవితాలు చితికిపోయాయి. ఈ అల్లర్ల కారణంగా 98 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. దీంతో ఉలిక్కిపడిన కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సాయంతో సైనిక బలగాలను, పోలీసులను మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యటించి, రెండు వర్గాల మధ్య సంధిని కుదిర్చి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి సద్దుమణిగిందనుకుంటున్నంతలోనే మళ్ళీ నిప్పు రాజుకుంది. మరోసారి అల్లర్లు చెలరేగడంతో 9 మంది స్థానిక ఎమ్మెల్యేలు బైరెన్ సింగ్ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదని తేల్చి చెప్పేశారు. ఈ మేరకు ప్రధానమంత్రికి ఒక లేఖను రాస్తూ.. ఇక్కడి ప్రజల నమ్మకాన్ని చూరగొనాలంటే మొదట ప్రభుత్వం చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని, పరిపాలనా విధానంలో మార్పులు చేయాలని వారు తెలిపారు. ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మెయిటీ తెగకు చెందినవారే. దీంతో కేంద్ర హోంశాఖకు అన్నివైపుల నుండి ఒత్తిడి అధికమవడంతో ఆలస్యం చేయకుండా మణిపూర్‌లో శాంతిస్థాపనే ప్రధాన ఉద్దేశ్యంగా అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశం జూన్ 24న న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని ఈ ప్రకటనలో తెలిపింది హోంశాఖ. Union Home Minister Shri @AmitShah has convened an all party meeting on 24th June at 3 PM in New Delhi to discuss the situation in Manipur.@PIB_India @DDNewslive @airnewsalerts — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) June 21, 2023 ఇది కూడా చదవండి: భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు -
ఫిబ్రవరి 2న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: వాడీవేడీ చర్చలకు వేదికగా నిలిచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. రాష్ట్రపతిగా ఉభయసభలనుద్దేశిస్తూ ఆమె చేస్తున్న తొలి ప్రసంగం ఇది. ఆ తర్వాత సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుధవారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనే నిర్వహిస్తామని లోక్‌సభ స్పీకర్ బిర్లా గతంలో ప్రకటించారు. ఈసారి సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత ఫిబ్రవరి 14 వరకు, ఆ తర్వాతి విడత మార్చి 12న మొదలై ఏప్రిల్ ఆరో తేదీన పూర్తికానుంది. ప్రధాన సమస్యలపై నిలదీత! 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఓ వైపు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తాజా ఆర్థిక పరిస్థితి, సన్నగిల్లిన కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, పెరిగిన చైనా సరిహద్దు వివాదం, బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో గవర్నర్ల జోక్యం, గౌతమ్ అదానీ షేర్లపై హిండెన్‌బర్గ్ సంచలనాత్మక నివేదిక, జాతీయస్థాయి కుల గణన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని కొన్ని పార్టీలు ‘బాయ్‌కాట్’ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ సహా డీఎంకే, టీఎంసీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకోగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సీపీఐ, సీపీఎం ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్ కంపెనీల దోపిడీపై కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈసారి బడ్జెట్ సెషన్ మొత్తం 27 సిట్టింగ్‌లలో ఉండనుంది. ఈ సారి సమావేశాల్లో 36 బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ డుమ్మా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నా«థ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ, మంత్రులు పీయూశ్ గోయల్, అర్జున్ రామ్ మేఘవాల్, మురళీధరన్ ఆధ్వర్యంలో జరిగిన భేటీకి ఆర్జేడీ, జేడీయూ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, శివసేన, బీజేడీ తదితర 27 పార్టీల తరఫున 37 మంది నేతలు హాజరయ్యారు. సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వానికి విపక్షాలు సహకరించాలని మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించాల్సిందేనని విపక్షాల నేతలు డిమాండ్‌చేశారు. ఈ భేటీకి కాంగ్రెస్ దూరంగా ఉంది. ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభా పక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరీ, మల్లికార్జున ఖర్గే కశ్మీర్లో భారత్ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లడంతో భేటీకి హాజరు కాలేదు. మంగళవారం కాంగ్రెస్ పక్షనేతలు తనను కలసి తమ అభిప్రాయాలు పంచుకుంటారని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. తృణధాన్యాలతో వంటకాలు పార్లమెంట్ క్యాంటీన్లో ఈసారి తృణధాన్యాలతో చేసిన వంటకాలు ఎంపీలకు కొత్త రుచులను అందివ్వనున్నాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, సామలు ఇలా పలు రకాల చిరుధాన్యాలతో వండిన ఆహార పదార్థాలు ఎంపీలు, సిబ్బంది, సందర్శకులకు క్యాంటీన్లో అందుబాటులో ఉంచుతారు. -
అఖిలపక్ష భేటీ.. బడ్జెట్ సమావేశాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇవాళ(సోమవారం) అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా విపక్షాలను కోరింది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేకానుంది. అందుకే విపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్ సైతం హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. మంగళవారం పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలుకానున్నాయి. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఇక బుధవారం పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. -
ఆల్ పార్టీ మీట్ లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
-
ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
-
ప్రధాని అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశం.. హాజరైన ఏపీ సీఎం జగన్
Time 7:54 PM ముగిసిన జీ-20 సన్నాహక సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరిగిన జీ–20 సన్నాహక సమావేశం ముగిసింది. సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. జీ-20 సమావేశాల విజయవంతానికి సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. సమావేశం అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి ఎయిర్ పోర్టుకి సీఎం జగన్ బయలుదేరారు. Time 5:17 PM ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జీ–20 సన్నాహక సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తోంది. Time 3:55 PM సాక్షి, ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన జరిగే జీ–20 సన్నాహక సమావేశానికి హాజరుకానున్నారు. 2023లో జీ–20 సదస్సును నిర్వహించే అవకాశం భారతదేశం దక్కించుకుంది. దానికి ఎజెండాను ఖరారు చేయడానికి దేశంలోని అన్ని పార్టీల నాయకులతో (అఖిల పక్షం) ప్రధాని నరేంద్రమోదీ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు. భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించనుంది. సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ సమావేశానికి రావాలని గతంలోనే సీఎం జగన్‌కి ఆహ్వానం వచ్చినప్పటికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తుండటం, ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ఉండటంతో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లే విషయం ఖరారు కాలేదు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ప్రత్యేకంగా ఫోన్ చేసి జీ 20 సమావేశానికి తప్పనిసరిగా రావాలని ఆహ్వానించారు. దీంతో సీఎం వైఎస్ జగన్ ముందుగా ఖరారైన షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకుని ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్లో సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే మళ్లీ బయలుదేరి.. రాత్రి 10.30 సమయంలో విజయవాడ చేరుకుంటారు. -
ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. జీ-20 అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. కాగా, భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇటీవల ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. -
CM Jagan: జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రపంచ జీడీపీలో 90 శాతం, వ్యాపారంలో 80 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల వాటా ఈ దేశాలదే. ఈ దేశాలు కలిసి పని చేయడం ద్వారా ప్రపంచ ఆరి్థక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించడమే ఈ సమావేశాల లక్ష్యం. చదవండి: (Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే) -
స్థానికేతరులకు ఓటు హక్కు ఇస్తే ఖబడ్దార్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితాలో స్థానికేతరుల పేర్లను చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే సహించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. కోర్టుకు వెళ్లయినా సరే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. స్థానికేతరులకు ఓటు హక్కును ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించేందుకు ఆయన సోమవారం అఖిలపక్ష నాయకులతో సమావేశయ్యారు. ఈ భేటీకి 9 పార్టీల నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేకతను, గుర్తింపును దెబ్బతీసే చర్యలకు పాల్పడొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇక్కడ బయటి వ్యక్తులు ఓటు హక్కు ఇవ్వడం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీని స్థానికేతరుల చేతుల్లో పెట్టొద్దని డిమాండ్ చేశారు. -
మీ అప్పుల కతేంది?.. కేంద్రాన్ని నిలదీత
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కాస్త అధికార బీజేపీ, బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి వేదికగా మారింది. శ్రీలంక ఆర్ధిక పరిస్థితులకు మితిమీరన అప్పులే కారణమన్న కేంద్రం, ఆ క్రమంలో పలు రాష్ట్రాలు చేస్తున్న అప్పులను ప్రస్తావించడం ఉద్రిక్తతకు దారి తీసింది. కేంద్రం తీరును బీజేపీయేతర పక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శ్రీలంక సంక్షోభంపై చర్చకని పిలిచి రాష్ట్రాల అప్పులను చర్చకు పెడతారా అంటూ ధ్వజమెత్తాయి. ముందుగా కేంద్రం చేస్తున్న అప్పుల లెక్కలు చెప్పాలంటూ గట్టిగా నిలదీశాయి. దాంతో వాతావరణం వేడెక్కింది. శ్రీలంక సంక్షోభంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే సహా అన్ని విపక్షాలు పాల్గొన్నాయి. శ్రీలంక ప్రస్తుత పరిస్థితులు, మనపై దాని ప్రభావం, లంకకు భారత సాయం తదితరాలపై జైశంకర్ వివరించారు. లంక ఆర్ధిక, రాజకీయ సంక్షోభానికి కారణాలు, పర్యావసానాలు, దివాలాకు కారణమైన అప్పులపై విదేశాంగ కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరిగిన అప్పులతో తిప్పలు, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రస్తావించారు. ఆ వెంటనే పలు రాష్ట్రాల అప్పులపై కేంద్రం ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలను ప్రస్తావించారు. బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల అప్పులనే ప్రస్తావించడంతో భేటీ ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ అప్పులను ప్రస్తావించడాన్ని టీఆర్ఎస్ ఉభయ సభాపక్ష నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘భేటీ ఉద్దేశమేమిటి? మీరు మాట్లాడున్నదేమిటి?’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘తెలంగాణ జీఎస్డీపీని 25 శాతంగా నిర్ణయిస్తే చేసిన అప్పులు 23 శాతం మాత్రమే. కేంద్రం మాత్రం 40 శాతంగా జీస్‌డీపీ నిర్ణయిస్తే ఏకంగా 60 శాతం అప్పులు చేసింది’’ అంటూ దుయ్యబట్టారు. దేశ అప్పులు 2013–14 దాకా రూ.57 లక్షల కోట్లుంటే మోదీ హయాంలో ఏకంగా మరో రూ.100 లక్షల కోట్లు అప్పులు చేశారు’’ అంటూ గణాంకాలు తీశారు. ముందు కేంద్రం చేసిన అప్పులపై మాట్లాడి ఆ తర్వాతే రాష్ట్రాల అప్పులను ప్రస్తావించాలన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ధోరణితో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీ అప్పులను ప్రస్తావించడాన్ని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి కూడా తీవ్రంగా తప్పుపట్టారు. -
శ్రీలంక సంక్షోభంపై తమిళుల ఆందోళన.. అఖిల పక్ష భేటీకి కేంద్రం పిలుపు
ఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక. తినడానికి సరైన తిండి దొరకని పరిస్థితులో జీవనం వెళ్లదీస్తున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికే పలు విధాలుగా సాయం అందించింది భారత్. శ్రీలంకలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభంపై చర్చించేందుకు మరోమారు అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. వచ్చే మంగళవారం ఈ సమావేశం ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఆల్‌పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అనంతరం శ్రీలంక సంక్షోభంపై అఖిల పక్ష సమావేశం అంశాన్ని వెల్లడించారు జోషీ. శ్రీలంక పరిస్థితులపై భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతారని చెప్పారు. శ్రీలంక సంక్షోభంలో భారత్ కలుగజేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కోరినట్లు తెలిపారు. గొటబయ రాజపక్స రాజీనామా చేసిన క్రమంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రక్రియ ప్రారంభించింది శ్రీలంక పార్లమెంట్. ఈనెల 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం అఖిల పక్ష భేటీకి పిలుపునివ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తమకు సాయం చేసిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని శ్రీలంక మంత్రి ఒకరు పేర్కొన్నారు. ఇదీ చదవండి: అమెరికాలో 'గొటబయ' కుమారుడి ఇంటి ముందు ఆందోళన -
‘కేంద్రం విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలి’: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీలు హాజరయ్యారు. కాగా, అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళ్లాము. గత మూడు దశబ్దాలలో రాని వరదలు ఇప్పుడు వచ్చాయి. వరద ముంపు జిల్లాలకు కేంద్రం నష్ట పరిహారం ఇవ్వాలి. దీనిపై పార్లమెంట్లో చర్చించాలి. ఏపీ విభజన చట్టంలోని అన్ని అంశాలు నెరవేర్చాలి. విశాఖ రైల్వే జోన్‌పై కాలయాపన ఎందుకు చేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ సాధనకు కృషి చేస్తాము. భోగాపురం విమానాశ్రయం అనుమతులు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి. జీఎస్టీ నష్టపరిహారం కాల పరిమితి మరో అయిదేళ్లు పెంచాలి’’ అని కోరినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే -
టీపీసీసీ అధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం
-
టీఆర్ఎస్, బీజేపీ నేతలను కూడా పిలుస్తా.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
-
‘విభజన హామీలన్నీ నెరవేర్చాలని పార్లమెంటులో పోరాడతాం’
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. కాగా, సమావేశం అనంతరం వైఎస్సార్ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని సమావేశంలో కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న మరో 24 పంటలకు కూడా కేంద్రం ఎంఎస్పీని ప్రకటించాలని కోరామని పేర్కొన్నారు. అదే విధంగా, సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో.. దిశ బిల్లును ఆమోదించాలని, విభజన హామీలన్ని నెరవేర్చేలా పోరాడతామని తెలిపారు. చంద్రబాబు.. ఏడుపు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గతంలో.. వైఎస్సార్సీపీ వ్యవసాయ చట్టాలకు సంబంధించి పలు అభ్యంతరాలను తెలిపిందని గుర్తుచేశారు. కనీస మద్దతు ధర విషయంలో వైఎస్సార్సీపీ తమ విధానాన్ని చాలా స్పష్టంగా విశదీకరించిందన్నారు. ఎంఎస్పీ లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, వారితో చర్చించి వాటిని పునఃపరిశీలించాలని చెప్పడం జరిగిందని తెలిపారు. రైతులు, రైతు సంఘాలు, స్టేక్ హౌల్డర్స్ అభిమతాన్ని తెలుసుకునే విధంగా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని సమావేశంలో కోరామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
‘అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమే’
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అఖిలపక్షం ఆదివారం భేటీ అయింది. ఈ సమావేశానికి దేశంలోని 32 పార్టీల నేతలు హాజరయ్యారు. లోక్ సభ స్పీకర్ అనుమతితో అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు ఈ సందర్భంగా కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, సాగుచట్టాల వ్యతిరేకిస్తూ జరిపిన ఆందోళనలో మృతి చెందిన రైతులు, కరోనా మృతులకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. చదవండి: పార్లమెంట్లో కాంగ్రెస్‌తో సమన్వయంపై ఆసక్తి లేదు రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మూడు సాగు చట్టాలపై రైతులను ఒప్పించలేకపోయామన్న ప్రధాని మోదీ.. మరో రూపంలో వాటిని తీసుకువచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. అయితే ఈసారి జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకాకపోవడం గమనార్హం. -
బీసీ కులగణనతోనే సామాజికన్యాయం
సాక్షి, హైదరాబాద్: దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో కచ్చితంగా తేలితేనే ఆయా కులాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో సామాజికన్యాయం జరగాలంటే బీసీ కులాల జనగణన చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడి గాంధీభవన్‌లో బీసీల జనగణనపై అఖిలపక్ష సమావేశం జరిగింది. టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఎం.వి.రమణ(సీపీఎం), బాలమల్లేశ్(సీపీఐ), సంధ్య(న్యూడెమోక్రసీ)లతోపాటు ప్రొఫెసర్ మురళీమనోహర్, ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ బీసీల ఓట్లు లేకుండా ఎవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేరని, వారి జనాభా లెక్కలు చెప్పాలని అడగడంలో న్యాయం ఉందని అన్నారు. వన్‌నేషన్–వన్ సెన్సెన్ విధానాన్ని తీసుకురావాలని కోరారు. మన రాష్ట్రంలో కులాలవారీగా లెక్కలు తీసిన సమగ్ర కుటుంబసర్వే వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని రేవంత్ ప్రశ్నించారు. వెంటనే సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జనగణన కోసం బీసీలు చేపట్టే ఏ ఉద్యమానికైనా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ మురళీమనోహర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక బీసీలు వెనుకబడిపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ ఎం.కోదండరాం మాట్లాడుతూ బీసీ జనగణనపై రాష్ట్రపతికి అన్ని పార్టీల పక్షాన లేఖ రాయాలని సూచించారు. పెద్ద ఎత్తున ఉత్తరాల ఉద్యమం చేపట్టాలన్నారు. కాగా, అఖిలపక్ష భేటీలో భాగంగా వెంటనే బీసీ గణన చేపట్టాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. -
గాంధీభవన్‌లో అఖిలపక్ష నేతలతో భట్టి విక్రమార్క భేటీ
-
ఆఫ్గాన్‌లో తాజా పరిస్థితులను వివరించిన విదేశాంగశాఖ
-
ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై అఖిలపక్ష సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిణామాలపై గురువారం అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. విదేశాంగ మంత్రి జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలను ఫ్లోర్ లీడర్లకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌ని భారతీయులను, మైనారిటీ హిందువులు, సిక్కులను తరలించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరింస్తున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో భారత్‌పై పడే ప్రభావంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చదవండి: దేశంలో కొత్తగా 46,164 కరోనా కేసులు -
నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
-
సభా సమరం షురూ..!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అన్ని పార్టీ లు సహకరించాలని, ఈ సమావేశాలు సజావుగా సాగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా కొందరు సభ్యులు మృతిచెందడం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. సోమవారం నుంచి వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు అవసరమని, ఇవి చర్చలను మరింత ఫలప్రదంగా మారుస్తాయని చెప్పారు. సభ్యుల్లో అధికులు టీకాలు తీసుకున్నందున సభలు మరింత సజావుగా సాగుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగడానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. సోమవారం నుంచి ఆగస్టు 13 వరకూ నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19 సార్లు సభ సమావేశం అవుతుందన్నారు. 30 పైచిలుకు బిల్లులు వర్షాకాల సమావేశాల సందర్భంగా రెండు ఆర్థిక బిల్లులు సహా మొత్తం 30కి పైచిలుకు బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీటిలో ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు, ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ బిల్లు, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ తదితర బిల్లులున్నాయి. వీటితో పాటు పలు కీలక బిల్లులు సైతం సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ఈ అఖిలపక్ష సమావేశంలో టీఎంసీ, డీఎంకే, వైఎస్సార్సీపీ, శివసేన, జేడీయూ, బీజేడీ, ఎస్పీ, టీఆర్ఎస్, ఏఐడీఎంకే, బీఎస్పీ, ఎన్సీపీ, టీడీపీ, అకాలీదళ్ సీపీఐ, ఆప్ సహా 33 పార్టీల నేతలు పాల్గొన్నారు. వీరిలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ సింగ్, టీఎంసీకి చెందిన డెరిక్ ఓబ్రెయిన్, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, ఎస్పీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్, బీఎస్పీకి చెందిన సతీష్ మిశ్రా, అప్నాదళ్ నేత అనుప్రియ, ఎల్జేపీ నేత పశుపతి పరాస్ ఉన్నారు. ప్రధానితో పాటు హోం, రక్షణ మంత్రులు, రాజ్యసభ లీడర్ ఆఫ్ హౌస్ పీయూష్ గోయల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ తాజా విస్తరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో వీటిపై ఆసక్తి నెలకొంది. అందుకు ఒప్పుకోం దేశంలో కరోనా పరిస్థితిని పార్లమెంట్ ఉభయసభల ఎంపీలకు పార్లమెంట్ బయట ఏర్పాటు చేసే సమావేశంలో ప్రధాని వివరిస్తారనే కేంద్ర ప్రతిపాదనకు ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఇది పార్లమెంటరీ నియమాలను ఉల్లంఘించేందుకు మరోమార్గమని దుయ్యబట్టాయి. జూలై 20న ప్రధాని రెండు సభల ఎంపీలనుద్దేశించి పార్లమెంట్ అనుబంధ భవనంలో ప్రసంగిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషీ ప్రకటించగానే, తొలుత టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంటు జరుగుతోందని, సభకు వచ్చి మాట్లాడాలని ఆపార్టీ ఎంపీ డెరిక్ అభిప్రాయపడ్డారు. దీనికి పలు ఇతర పక్షాల నేతలు కూడా మద్దతు ప్రకటించారని తెలిసింది. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కొందరు నేతలు సూచించారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలన్నా సభలోనే చెప్పాలన్నది తమ అభిప్రాయమని సీపీఎం వ్యాఖ్యానించింది. వేరుగా ఎంపీలనుద్దేశించి ప్రసంగించడం తగదని పేర్కొంది. సోమవారం సభలు ఆరంభం కాగానే ఉప ఎన్నికల్లో ఎన్నికైన నూతన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఎన్డీఏ నేతలతో ప్రధాని భేటీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభమవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఎన్డీఏలోని పార్టీల పార్లమెంటరీ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్నా«థ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. ఎన్డీఏ పక్షాల నేతల్లో అప్నాదళ్‌కు చెందిన అనుప్రియ, జేడీయూ నేత రామ్‌నాథ్ ఠాకూర్, ఏఐఏడీఎంకే నేత నవనీతకృష్ణన్, ఆర్పీఐ నేత రామ్‌దాస్ అథవాలే, ఎల్జేపీ నేత పశుపతి పరాస్ తదితరులున్నారు. ఈ సమావే శాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో ప్రధాని చర్చించారు. సభ పవిత్రతను గౌరవించాలి: ఓం బిర్లా సభ పవిత్రత, గౌరవాన్ని సభ్యులందరూ గౌరవించాలని సభాపతి ఓంబిర్లా తెలిపారు. ఆదివారం సభాపతి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ సజావుగా సాగడానికి గత సమావేశాల మాదిరిగానే సహకరించాలని పార్టీల నేతలను ఓం బిర్లా కోరారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అందరికీ తగిన సమయం కేటాయిస్తానన్నారు. త్వరలోనే ఒక యాప్ తీసుకొస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి వన్‌స్టాప్ సొల్యూషన్‌గా అది ఉపకరిస్తుందని ఓం బిర్లా తెలిపారు. కరోనా నేపథ్యంలో సభ్యులు, సిబ్బంది, మీడియా అందరికీ తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఓం బిర్లా మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆకాంక్షలకు సభ ప్రాతినిధ్యం వహిస్తుందని, ప్రజల సమస్యలను తెలియజేయడం సభ్యుల బాధ్యత అన్నారు. ప్రజా ప్రయోజనాలపై చర్చించడానికి అవకాశం ఉండాలని .. చిన్నపార్టీలు, ఏక సభ్యుడున్న పార్టీలకు కూడా తగిన సమయం కేటాయిస్తానని సభాపతి ఓంబిర్లా తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేతలు మిథున్‌రెడ్డి, రామ్మోహన్నాయుడు, నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఎంపీలాడ్ ఫండ్స్ పునరుద్ధరించాలి! రాజకీయ పార్టీల డిమాండ్ ఎంపీ లాడ్ నిధులను పునరుద్ధరించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీలు ఈ డిమాండ్‌ను వినిపించాయి. పార్టీల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషీ ముందు ఎంపీ లాడ్ నిధులు మరలా ఇవ్వాలనే డిమాండ్‌ను వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్, టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ లేవనెత్తారు. ప్రజాప్రయోజన అంశాలపై మాట్లాడేందుకు సభ్యులకు తగిన సమయం ఇస్తానని ఈ సందర్భంగా స్పీకర్ హామీ ఇచ్చారు. ఎంపీలంతా సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరారు. ఐదు సెషన్లుగా పార్లమెంట్ సాఫీగా జరిగేందుకు సహకరించినందుకు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటంకాలు లేకుండా సభ నడిచేందుకు సహకరిస్తామని పార్టీల నేతలు స్పీకర్‌కు చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ నేపథ్యంలో సభా సమావేశాల ఏర్పాట్లను కట్టదిట్టం చేశామని స్పీకర్ చెప్పారు. -
కేంద్ర అఖిలపక్ష సమావేశం ప్రారంభం
సాక్షి, ఢిల్లీ: కేంద్ర అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ భేటీలో కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం కోరనుంది. సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హాజరయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు, విశాఖ స్టీల్‌ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, ప్రత్యేక హోదా అంశాలను వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రస్తావించనున్నారు. -
వర్షాకాల సమావేశాలు: రేపు ఉదయం అఖిలపక్ష సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 19(సోమవారం) నుంచి 17వ లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశాలలో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరనుంది. మొత్తం 19 రోజులు సమావేశాలు జరగనున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ భయాల నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ తరువాత వచ్చిన తొలి సమావేశాలు ఇవే. అలా పలువురు కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించాక సభలో ప్రతిపక్షాలను తొలిసారి ఎదుర్కోవాల్సి వస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీల చేతిలో బీజేపీ ఓటమి పాలయ్యాక జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలూ ఇవే. అలా ఈ ఏడాది జరగనున్న వర్షాకాల సమావేశాలకు ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం తన అజెండాను ముందుకు తీసుకురావాలనీ, ప్రతిపక్షాలు తమ వాణిని వినిపించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనీ ప్రయత్నించే వేళ... మొత్తం 19 రోజులు పార్లమెంట్ సమావేశం కానుంది. -
అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై బీజేపీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. దళితుల అభివృద్ధిపై అఖిలపక్షం నిర్వహించడం అభినందనీయమన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ అంశంలో చర్యలు తీసుకోవడం ద్వారా.. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందంటూ ఆయన అభినందించారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 'సీఎం దళిత్ ఎంపవర్మెంట్' పథకం విధి విధానాలపై అఖిలపక్షం చర్చించింది. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఈ భేటీకి హాజరయ్యారు. మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్ ఇదిలా ఉండగా, అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించగా, ఆ ఆదేశాలు పట్టించుకోకుండా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. అదే సమయంలో బీజేపీ కార్యాలయంలో దళిత నేతల భేటీకి ఆయన డుమ్మా కొట్టారు. దీంతో మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయినట్లు తెలిసింది. వద్దన్నా వినకుండా అఖిపక్ష భేటీకి హాజరు కావాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ పెద్దలు వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: సఫాయన్నా నీకు సలాం అన్న: సీఎం కేసీఆర్ Balka Suman: ఈటల ‘లేఖ’ నిజమే! -
దళితుల అభ్యున్నతి కోసం దశలవారీగా కార్యాచరణ: కేసీఆర్
-
సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో అఖిలపక్షం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో 'సీఎం దళిత్ ఎంపవర్మెంట్' పథకం విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. '' సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయి. దళితుల అభ్యున్నతి కోసం దశలవారీగా కార్యాచరణ చేపడతాం. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలి. అట్టడుగున ఉన్న వారి నుంచి సహాయం ప్రారంభించి.. వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా పర్యవేక్షించాలి. ఈ బడ్జెట్లో సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. మరో రూ.500 కోట్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చే నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ విజయవంతం చేయాలనేదే నా సంకల్పం. దళితుల అభ్యున్నతి కోసం అఖిలపక్షం సూచనలు ఇవ్వాలి.దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని విధానం.రాజకీయాలకతీతంగా సమిష్టి కార్యాచరణ బాధ్యత తీసుకుందాం. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలు వెతకాలి. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని విధానం రైతుబంధు పథకం, ఆసర పెన్షన్ల మాదిరిగా.. నేరుగా దళితులకు ఆర్థికసాయం అందేలా సూచనలు ఇవ్వాలి'' అని కేసీఆర్ తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్లినా సామాజికంగా, ఆర్థికంగా పీడిత వార్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులు, అందుకే ఈ బాధలు పోవాలన్నారు. తాము కూడా పురోగమించగలం అనే ఆత్మ స్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో తగిన సూచనలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అఖిలపక్ష నాయకులను కోరారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత భట్టి, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ ఆదేశాలు పట్టించుకోకుండా మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. బీజేపీ ఆఫీస్‌లో దళిత నేతల భేటీకి డుమ్మా కొట్టిన మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్‌గా ఉంది. చదవండి: మరియమ్మ కుమారుడికి డీజీపీ మహేందర్‌రెడ్డి పరామర్శ -
కాసేపట్లో ప్రగతి భవన్ లో అఖిల పక్ష సమావేశం
-
బీజేపీ నో... డైలమాలో కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ కార్యక్రమంపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. దళితుల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల విధివిధానాల ఖరారుపై జరిపే ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరుకావాలని ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. అయితే, ఈ భేటీని బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించగా, కాంగ్రెస్ మాత్రం డైలమాలో ఉంది. వామపక్షాల నుంచి చాడ, తమ్మినేని హాజరవుతున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. ఈ భేటీకి హాజరవుదామా వద్దా అనే విషయంలో కాంగ్రెస్ పార్టీలో కొంత మీమాంస నెలకొంది. సమావేశానికి వెళ్లాలా, గైర్హాజరవ్వాలా అనే విషయంపై ఆదివారం ఉదయం నిర్ణయం తీసుకుంటామని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఏడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు: బీజేపీ దళితుల అభివృద్ధిపై చర్చకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దళితులను మోసం చేసే కార్యక్రమంలో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భేటీని ఏర్పాటు చేసిందని ధ్వజమెత్తింది. దళితుల గురించి మాట్లాడే నైతికత, అర్హత టీఆర్ఎస్ సర్కార్‌కు లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని ప్రకటించి కేసీఆర్ మోసం చేశారని, ఇలా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులను టీఆర్ఎస్ మోసం చేస్తూనే ఉందన్నారు. గత ఏడేళ్లుగా మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు, దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. దళితులకు సంబంధించి గతంలో చేసిన వాగా>్దనాలు ఏ మేరకు పూర్తిచేశారన్న దానిపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. టీఆర్ఎస్ నుంచి దళితులు దూరమవుతున్నారని గ్రహించి.. మరియమ్మ ఘటన నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారే తప్ప దళితులపై ప్రేమతో కాదన్నారు. బహిష్కరణపై పార్టీ నేతలను సంప్రదించిన సంజయ్ అంతకుముందు రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, దళిత నాయకులతో అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ఆర్భాటంగా ప్రకటించిన దళితులకు మూడెకరాల సాగుభూమి, దళితులపై కొనసాగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు విచారణ కమిషన్ వేయడం తదితర హామీల అమలు ద్వారా సీఎం కేసీఆర్ ముందుగా తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలనే అభిప్రాయం ఈ సందర్భంగా పార్టీనాయకుల్లో వ్యక్తమైంది. పాత వాగ్దానాలు అమలు చేశాక కొత్త వాటి గురించి మాట్లాడాలని, దళితులకు న్యాయం చేయకుండా అఖిలపక్ష భేటీకి బీజేపీ వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయనే బండి సంజయ్ అభిప్రాయంతో ఇతర నాయకులు ఏకీభవించారు. వామపక్షాల నుంచి.. అఖిలపక్ష సమావేశానికి సీపీఐ నుంచి ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు బాలనర్సింహ, సీపీఎం నుంచి ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు బి.వెంకట్, జాన్‌వెస్లీ హాజరుకానున్నారు. నేడు ఉదయం 11:30 గంటలకు భేటీ ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ కార్యక్రమంపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వీరితో పాటు వివిధ పార్టీల శాసనసభాపక్ష నేతలు, మాజీ సభ్యులు కడియం శ్రీహరి, మందా జగన్నాథం, మోత్కుపల్లి నర్సింహులు, ఆరెపల్లి మోహన్, జి.ప్రసాద్‌కుమార్ హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి సభ్యులందరికీ వ్యక్తిగత ఆహ్వానాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. -
27న అఖిల పక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించనుంది. రాష్ట్రంలోని దళితుల గుణాత్మక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ’సీఎం దళిత సాధికారత’ పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం ఈ నెల 27న ప్రగతి భవన్లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం ప్రారంభంకానున్న ఈ సమావేశం రోజంతా కొనసాగనుంది. అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల శాసనసభా పక్షనేతలు కూడా పాల్గొంటారు. వీరికి అధికారికంగా ఆహ్వానాలు పంపించనున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాల్సిందిగా ఇప్పటికే ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభధ్రంకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి కోరారు. దళితుల సమస్యల పట్ల అవగాహన కలిగి, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులను ఆహ్వానించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దళితుల సంక్షేమానికి సర్కారు కృషి ‘నూతన తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మారుమూలన ఉన్న దళితులు తమ జీవితాల్లో గుణాత్మక అభివృద్ధిని మరింతగా సాధించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలో, ఈ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరం చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం.’ అని కేసీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేళ్ల విరామం తర్వాత రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఇది రెండోసారి. తొలిసారిగా 2014 డిసెంబర్ 16న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పు అంశంపై రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష భేటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించారు. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్ళీ అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు. 2017 జనవరి 27న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. కానీ ఇందులో కొన్ని పార్టీల నేతలు మాత్రమే పాల్గొన్నారు. ఇది అఖిలపక్ష భేటీ అని ప్రభుత్వం కూడా చెప్పుకోలేదు. అయితే అసైన్డ్ భూముల సమస్యలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇప్పుడు సుమారు ఆరేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: ఈడీ విచారణకు హాజరుకాని ఎంపీ నామా -
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అఖిలపక్ష సమావేశం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాయలసీమ ఎత్తిపోతలపై శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ వాదాన్ని ఖండిస్తూ పోరాటం చేయాలని అఖిలపక్షం తీర్మానించింది. అనుమతులు లేకుండా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు కడుతోందని అఖిలపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ జిల్లాలు అత్యంత కరవు ప్రాంతాలని అఖిలపక్షం పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ వితండవాదం చేస్తోందని.. మిగులు జలాలను తెలంగాణ అడ్డుకోవడం అన్యాయమని పేర్కొంది. శ్రీశైలానికి నీరు రాకుండా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు కడుతోందని అఖిలపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి -
జమ్మూకశ్మీర్‌తో ‘దిల్లీ కీ దూరీ.. దిల్ కీ దూరీ’ వద్దు
న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన తరువాత మాత్రమే జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని అక్కడి అఖిలపక్ష నేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విశ్వాసం మళ్లీ చూరగొనేందుకు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అత్యంత కీలకమని అఖిలపక్ష నేతలు ప్రధానికి తేల్చి చెప్పారు. 2019 ఆగస్ట్‌లో తొలగించిన రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని సమావేశంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్‌కు చెందిన అందరు నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై ఆక్కడి కీలక నేతలతో ప్రధానమంత్రి మోదీ గురువారం తన నివాసంలో దాదాపు మూడున్నర గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికలుంటాయని ప్రధాని తెలిపారని పీపుల్స్ కాన్ఫెరెన్స్ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామిక ప్రక్రియను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని తెలిపారని అధికార వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ 2019 ఆగస్ట్ 5న కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం.. అక్కడి కీలక నేతలతో మోదీ సమావేశమవడం ఇదే ప్రథమం. జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలను నిర్వహించిన తీరుగానే అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం ముఖ్యమని తాము భావిస్తున్నామని, అయితే, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరమే ఎన్నికలు ఉంటాయని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలతో మెజారిటీ నాయకులు ఏకీభవించారని అధికార వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌తో ‘దిల్లీ కీ దూరీ’, ‘దిల్ కీ దూరీ (ఢిల్లీతో అంతరాన్ని, మనసుల మధ్య దూరాలను)లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ‘సమావేశం సానుకూల, సుహృద్భావ వాతావరణంలో జరిగింది. ప్రజాస్వామ్యం కోసం పని చేయాలని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌ను ఘర్షణాత్మక ప్రాంతంగా కాకుండా, శాంతియుత ప్రాంతంగా నెలకొల్పేందుకు అన్నివిధాలా సహకరిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు’ అని బేగ్ తెలిపారు. నాయకులందరి అభిప్రాయాలను ప్రధాని సావధానంగా విన్నారన్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర సీఎంలుగా పనిచేసిన నలుగురు నాయకులు ఫరూఖ్ అబ్దుల్లా(ఎన్సీ), ఒమర్ అబ్దుల్లా(ఎన్సీ), మెహబూబా ముఫ్తీ(పీడీపీ), గులాం నబీ ఆజాద్(కాంగ్రెస్).. ఉపముఖ్యమంత్రులుగా పనిచేసిన తారాచంద్(కాంగ్రెస్), ముజఫర్ హుస్సేన్ బేగ్ (పీపుల్స్ కాన్ఫెరెన్స్), నిర్మల్ సింగ్ (బీజేపీ), కవీందర్ గుప్తా (బీజేపీ) ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. మొహమ్మద్ యూసుఫ్ తరిగమి (సీపీఎం), అల్తాఫ్ బుఖారీ (జేకేఏపీ), సజ్జాద్ లోన్ (పీపుల్స్ కాన్ఫెరెన్స్), జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ జీఏ మిర్, రవిందర్ రైనా (బీజేపీ), భీమ్ సింగ్ (పాంథర్ పార్టీ) కూడా ప్రధానితో సమావేశమైన వారిలో ఉన్నారు. హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ప్రధాని కార్యాలయంలో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కీలకం: షా రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో పాటు శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించడం అత్యంత ముఖ్యమైన మైలురాళ్లని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ‘జమ్మూకశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. సమావేశంలో జమ్మూకశ్మీర్ భవిష్యత్తుపై చర్చించాం. పార్లమెంట్లో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటే.. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు శాంతియుత ఎన్నికల నిర్వహణ చాలా కీలకం. జమ్మూకశ్మీర్ నేతలతో సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని నాయకులంతా స్పష్టం చేశారు’ అని షా ట్వీట్ చేశారు. రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే: ఫరూఖ్ జమ్మూకశ్మీర్ ప్రజల్లో మళ్లీ విశ్వాసం పాదుకొనాలంటే రాష్ట్ర హోదాను పునరుద్దరించడం చాలా ముఖ్యమని నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పి ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకోవాలని ప్రధాని మోదీకి సూచించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. ‘ప్రజల్లో నమ్మకం పోయింది. దాన్ని మళ్లీ పొందాలంటే సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించాలి. ఐఏఎస్, ఐపీఎస్ కేడర్లను పునరుద్ధరించాలి. జమ్మూకశ్మీర్ పూర్తిస్థాయి రాష్ట్రంగా మారాలి. రాష్ట్ర ఆస్తిత్వ గుర్తింపు చాలా అవసరం. ఈ విషయాన్నే ప్రధానికి స్పష్టంగా చెప్పాం’ అన్నారు. అస్సాంకు, మాకు మాత్రమే తేడా ఎందుకు?: ఒమర్ జమ్మూకశ్మీర్ విషయంలో ‘దిల్లీ కీ దూరీ.. దిల్ కీ దూరీ’ని తొలగించాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నామని మోదీ, షా తెలిపారన్నారు. ‘దిల్లీ కీ దూరీ.. దిల్ కీ దూరీని తొలగించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. అయితే, అది ఒక్క సమావేశంతోనే సాధ్యం కాదని నాతో పాటు ఇతర నాయకులు ఆయనకు చెప్పాం’ అన్నారు. డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఇవ్వగానే ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోందన్నారు. అస్సాంకు, జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ప్రత్యేక డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించామన్నారు. ఇది జమ్మూకశ్మీర్‌ను సంపూర్ణంగా భారత్‌లో భాగం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ భావనకు వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించామన్నారు. డీలిమిటేషన్ కమిషన్‌ను నిలిపేసి అస్సాంలో ఎన్నికలు నిర్వహించినట్లుగా, జమ్మూకశ్మీర్లోనూ నిర్వహించాలని కోరామన్నారు. అధికారులతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదని కేంద్రం కూడా భావిస్తోందన్నారు. పార్టీ తరఫున మాట్లాడాం: ఆజాద్ ప్రధానితో భేటీలో పార్టీ తరఫున పలు అంశాలను లేవనెత్తామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. ‘ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా పునరుద్ధరణ, కశ్మీరీ పండిట్లకు పునరావాస ప్రక్రియ, రాజకీయ ఖైదీల విడుదల, జమ్మూకశ్మీర్ యువతకు ఉద్యోగాల కల్పన కోసం స్థానికత నిబంధనలు.. మొదలైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాం’ అని వివరించారు. 370 రద్దుపై పోరాటం ఆగదు: ముప్తీ ప్రధాని నరేంద్ర మోదీతో అఖిలపక్షం భేటీ బాగా జరిగిందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో అనధికార చర్చల ద్వారా నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి, చొరబాట్ల తగ్గుదలకు కారణమైనందున ప్రధాని మోదీకి అభినందనలు తెలిపామన్నారు. ‘రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు, అవసరమైతే, చర్చలను పునరుద్ధరించాలని ప్రధానిని కోరాం. నియంత్రణ రేఖ ద్వారా వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశాం’ మెహబూబా ముఫ్తీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. ‘మాకు ప్రత్యేక హోదా పాకిస్తానేం ఇవ్వలేదు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల ప్రత్యేక హోదా వచ్చింది. దాన్ని పునరుద్ధరించుకునేందుకు రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా పోరాటం కొనసాగిస్తాం’ అని మెహబూబా స్పష్టం చేశారు. పునర్విభజన త్వరగా జరగాలి: పీఎం మోదీ జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన త్వరగా జరగాలని, తద్వారా త్వరగా ఎన్నికలు జరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ సమగ్ర అభివృద్ధి కోసం సంబంధిత వర్గాలతో చర్చలు జరపడం కీలకమైన ముందడుగు అని కశ్మీర్ నేతలతో భేటీ అనంతరం ట్వీట్ చేశారు. విభిన్న అభిప్రాయాలున్న వారు కూర్చుని చర్చలు జరపడం భారతీయ ప్రజాస్వామ్యంలోని బలమన్నారు. జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం తమ లక్ష్యమన్నారు. కశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు రాజకీయ నాయకత్వం లభించాల్సిన, వారి ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం ఉందని అక్కడి నాయకులతో చెప్పానన్నారు. జమ్మూ కశ్మీర్‌తో ఉన్న ‘దిల్లీ కీ దూరీ.. దిల్ కీ దూరీ’ని తొలగించాలన్నది తన ఆకాంక్ష అని జేకే నాయకులతో ప్రధాని మోదీ పేర్కొన్నారని అధికార వర్గాలు తెలిపాయి. కశ్మీర్లో ఒక్క మరణం సంభవించినా.. అది బాధాకరమేనని, కశ్మీరీ యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత తమ అందరిపై ఉందని ప్రధాని వారితో చెప్పారని వివరించాయి. రాజకీయంగా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా.. జమ్మూకశ్మీర్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరం కలసికట్టుగా కృషి చేయాలని ప్రధాని కోరారని తెలిపాయి. -
ప్రధాని అధ్యక్షతన జమ్మూకశ్మీర్ అఖిలపక్ష నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ భవిష్యత్‌పై ప్రణాళిక రూపొందించేందుకు ఆ ప్రాంతానికి చెందిన అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభమైన ఈ భేటీ దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి 8 రాజకీయ పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారి జరుగుతున్న అఖిలపక్ష భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ప్రధానిని కోరగా, ప్రధాని సానూకూలంగా స్పందించారని తెలుస్తోంది. అలాగే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎన్నికలు నిర్వహించాలని, కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించాలని ఆజాద్ ప్రధానిని కోరారు. భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. -
కశ్మీర్‌పై నేడు ప్రధాని అఖిలపక్ష సమావేశం
-
కలుపుగోలు సీఎం: స్టాలిన్ కొత్త సంప్రదాయం
కరోనా నియంత్రణకు పలు ఆంక్షలు విధించినా, లాక్డౌన్ అమలు చేసినా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో లాక్‌డౌన్‌ను తీవ్రతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఐదు తీర్మానాలు చేసింది. వాటిని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. పూర్తి లాక్డౌన్ విధించినా వైరస్ ప్రతాపం చూపుతూనే ఉంది. రోజుకు సగటున 30 వేల మంది కరోనా బారినపడుతున్నారు. ఇప్పటి వరకు 14,63,364 మంది కరోనా వైరస్‌కు గురికాగా, ప్రస్తుతం 1.85 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని పడకలు చాలక ప్రాంగణాలు, అంబులెన్స్‌లలో ఉండి చికిత్స పొందాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కల్యాణ మండపాలు, కాలేజీలు, పాఠశాలలను ఆక్సిజన్ వసతితో కూడిన పడకల ఆస్పత్రులుగా మారుస్తోంది. వ్యాక్సినేషన్ కూడా జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేత గా ఉన్న స్టాలిన్ కరోనా కట్టడికి అనేక సూచనలు చేశారు. అసెంబ్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం వాటిల్లో ఒకటి. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ గురువారం అసెంబ్లీ స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కరోనా నియంత్రణ చర్యలపై నేతల అభిప్రాయాలు సేకరించారు. డీఎంకే తరఫున టీఆర్ బాలు, ఆర్ఎస్ భారతి, అన్నాడీఎంకే నుంచి జయకుమార్, పరమశివం, కాంగ్రెస్ నుంచి విజయధరణి, మునిరత్నం, బీజేపీ నుంచి నయనార్ నాగేంద్రన్, పీఎంకే, ఎండీఎంకే వీసీకే, సీపీఎం, ఎంఎంకే, కేఎండీకే, టీవీకే తదితర 13 పారీ్టల నేతలు హాజరయ్యా రు. చెన్నైలోని సచివాలయంలో గురువారం సాయంత్రం 5.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. లాక్డౌన్ సమర్థవంతంగా అమలవుతోందా, 24వ తేదీ తర్వాత ఎత్తివేయడమా, కొనసాగించడమా అనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ రెమ్‌డెసివర్ మందు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని చెన్నైతోపాటు ఇతర నగరాల్లో అమ్మకాలు సాగిస్తున్నామని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో పారదర్శకతను పాటిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా సహాయక చర్యల నిమిత్తం 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమును ప్రారంభించామని, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి ఆక్సిజన్ దిగుమతి కోసం కేంద్రంపై చేసిన ఒత్తిడి సత్పఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. సింగపూరు, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఆక్సిజన్ కంటైనర్లను రప్పిస్తున్నట్టు వివరించారు. పాజిటివ్ కేసుల పెరుగుదల వల్ల ఆక్సిజన్ పడకలు పెంచుతున్నామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే ప్రకటించామని స్టాలిన్ వివరించారు. అఖలపక్షంలో ఐదు తీర్మానాలు : అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైద్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ మీడియాకు వివరించారు. కరోనా నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించే అవసరమైన అన్ని చర్యల్లో పాలుపంచుకోవాలని, అన్నిపార్టీల సభలు, సమావేశాలు, ఇతర పార్టీ కార్యకలాపాలను నిలిపివేయాలని తీర్మానించారు. అలాగే సంపూర్ణ లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయాలని, కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు అన్ని పార్టీలు సహకారం అందించాలని పేర్కొన్నారు. కరోనా కట్టడికి అఖిలపక్ష పార్టీ సభ్యులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరోనా రోగులను చివరి క్షణంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించడం అమానవీయ చర్య అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి పెరగగానే రెమ్‌డెసివర్ మందును సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. సింగపూర్ నుంచి 256 ఆక్సిజన్ సిలిండర్లు కరోనా బారిన పడిన వారిలో అధిక శాతం ఊపిరాడక ఇబ్బందిపడుతున్నారు. వారికి ఆక్సిజన్ అమర్చక తప్పడం లేదు. దీంతో ఆక్సిజన్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ఉత్పిత్తి చేసిన ఆక్సిజన్‌ను నిల్వ చేసేందుకు సరిపడా సిలిండర్లు, కంటైనర్లు లేవు. దీంతో ఇటీవల జర్మనీ, బ్రిటన్ దేశాల నుంచి 900 ఖాళీ సిలిండర్లు, కంటైనర్లను రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. తూత్తుకుడిలోని స్టెరిలైట్ కంపెనీ ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. తొలి లారీ కంటైనర్‌ను తిరునెల్వేలి ఆస్పత్రికి గురువారం పంపారు. మూడు రోజుల్లో 35 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది చాలక ఖాళీ సిలిండర్లు, కంటైనర్లను పంపాల్సిందిగా సింగపూరు ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు 256 ఖాళీ సిలిండర్లు బుధ, గురువారాల్లో చెన్నైకి చేరుకున్నాయి. చదవండి: అన్నాడీఎంకేకు మరో షాక్: చేజారనున్న ‘పెద్దరికం’ చదవండి: సీఎం స్టాలిన్ నిర్ణయం: టీచర్ నుంచి తమిళనాడు స్పీకర్‌గా -
కరోనా కల్లోలం: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం
కేరళ: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో ఇప్పటివరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించిన రాష్ట్రాలు ప్రస్తుతం లాక్డౌన్ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కట్టడికి విధిలేక లాక్డౌన్ విధిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్రలో లాక్డౌన్ అమల్లో ఉండగా తాజాగా కర్నాటక కూడా ప్రకటించింది. ఇక కేరళ కూడా ఆ దిశన అడుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు లాక్డౌన్ విధించేందుకు అంగీకరించలేదు. ‘లాక్డౌన్ కాకుండా కఠిన ఆంక్షలు విధించడం’ అంటూ అన్ని పార్టీలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. కేరళలో కరోనా కట్టడి చర్యలు, వైద్య సేవలు తదితర వాటిపై చర్చించేందుకు సోమవారం ముఖ్యమంత్రి పినరయి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలు లాక్డౌన్ వైపు మొగ్గు చూపలేదు. కరోనా కట్టడి చర్యలపై ఆయా పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పాయి. అనంతరం ముఖ్యమంత్రి పినరయి అఖిలపక్ష సమావేశం వివరాలు వెల్లడించారు. అఖిలపక్షం లాక్డౌన్ పెట్టవద్దనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సీఎం ప్రకటించారు. రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా ఉంటుందని తెలిపారు. వారాంతంలో మినీ లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. చదవండి: మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు -
లాక్‌డౌన్‌పై రేపు ముఖ్యమంత్రి ప్రకటన
ముంబై: రోజుకు 50వేల నుంచి 60 వేల కేసులు నమోదవుతుండడంతో మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భయాందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలు, ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. కాగా ప్రస్తుతం భారీగా కేసులు వెలుగులోకి వస్తుండడంతో ఇక లాక్డౌన్ విధించాల్సిందేనని ఆ రాష్ట్ర మంత్రి విజయ్ వాడెట్టివర్ సలహా ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేస్తారని చెప్పడం చూస్తుంటే లాక్డౌన్ విధించే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. ముంబైలో ఆయన ఈ విషయమై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతుండడంతో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని ప్రతిపాదన చేసినట్లు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి విజయ్ తెలిపారు. ప్రస్తుతం 5 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఇదే మాదిరి కొనసాగితే పది లక్షలకు యాక్టివ్ కేసులు చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తెంచి వేయాలి.. ప్రజలను సామూహికంగా ఉండకూడదు అని పేర్కొన్నారు. కరోనా చెయిన్‌ను తెంచేందుకు.. వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు మూడు వారాల పాటు కఠిన లాక్డౌన్ విధించాలని మంత్రి విజయ్ స్పష్టం చేశారు. ఈ విషయమై రేపు అఖిలపక్ష సమావేశం ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో కొనసాగుతుందని చెప్పారు. రేపు ఏ విషయమో ముఖ్యమంత్రి ప్రకటిస్తారు అని తెలిపారు. తాను తన అభిప్రాయం మాత్రం చెప్పినట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ అమలు చేస్తే ప్రజలకు నిత్యవసరాలు, కూరగాయలు అందిస్తామని చెప్పారు. ఏది ఏమున్నా రేపు సీఎం ఉద్దవ్ ప్రకటిస్తారని మంత్రి విజయ్ చెప్పి వెళ్లిపోయారు. చదవండి: డ్రగ్స్ ఎమ్మెల్యేలు, వసూల్ మంత్రిని తొలగించండి చదవండి: ‘ఆ నలుగురు’ లేక వృద్ధ దంపతుల ఆత్మహత్య -
ఎస్ఈసీ అసహనం: టీడీపీ నేత వర్ల రామయ్య ఔట్..
సాక్షి, విజయవాడ: అఖిలపక్ష నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ ముగిసింది. మున్సిపల్ ఎన్నికలపై అఖిలపక్ష నేతలతో ఎస్ఈసీ చర్చించారు. వైఎస్సార్ సీపీ నుంచి అధికార ప్రతినిధి నారాయణమూర్తి, పద్మజారెడ్డి.. టీడీపీ నుంచి వర్ల రామయ్య, సీపీఐ నుంచి విల్సన్.. కాంగ్రెస్ నుంచి మస్తాన్‌వలి, సీపీఎం నుంచి వైవీ రావు హాజరయ్యారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిశీలిస్తామని, ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు పాటించాలని ఎస్ఈసీ కోరారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అఖిలపక్ష భేటీలో టీడీపీ నేత వర్ల రామయ్యను ఎస్ఈసీ బయటకు పంపివేశారు. సమావేశంలో అడుగడుగునా ఎస్ఈసీ మాటలకు అడ్డుపడటంపై నిమ్మగడ్డ అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చరించినా వర్ల రామయ్య పట్టించుకోలేకపోవడంతో విధిలేక ఆయనను సమావేశం నుంచి బయటకు పంపించారు. బయటకు వచ్చిన వర్ల రామయ్య.. గతంలో ఉన్నట్లు ఎస్ఈసీ లేరంటూ ఆరోపణలు చేశారు. ఎస్ఈసీతో భేటీ అనంతరం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, వాలంటీర్ల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించొద్దని ఎస్ఈసీకి సూచించామని పేర్కొన్నారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకోవద్దని సూచించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లు వారధిగా పనిచేస్తున్నారని, పోలింగ్ సమయంలో వాలంటీర్ల ఫోన్లను డిపాజిట్ చేసుకుంటామనే రీతిలో ఎస్ఈసీ నిమ్మగడ్డ చెప్పారని తెలిపారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై టీడీపీ చేస్తోన్న దాడులను కంట్రోల్ చేయాలని ఎస్ఈసీని కోరామని చెప్పారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో కోడ్ ఉల్లంఘించి ధర్నా చేస్తున్న చంద్రబాబుపై ఎస్ఈసీనే కేసు నమోదు చేయాలని కోరామని నారాయణ మూర్తి తెలిపారు. చదవండి: ‘పచ్చ’పాతం: ఇదేమి వైపరీత్యం! రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా -
ఫోన్ చేస్తే చాలు..చర్చలకు సిద్ధం..
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రైతు సంఘాలకు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రైతు సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఫోన్‌కాల్ దూరంలోనే ఉందన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం శనివారం వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ‘రైతుల ఆందోళనలపై ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తుంది. జనవరి 22వ తేదీన రైతులతో జరిగిన చర్చల సందర్భంగా ఏడాదిన్నరపాటు కొత్త సాగు చట్టాల అమలును నిలిపివేస్తామంటూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఫోన్‌కాల్ చేస్తే చాలు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు వ్యవసాయ మంత్రి తోమర్ సిద్ధంగా ఉన్నారు’ అని స్పష్టం చేశారు. ‘పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పెద్ద పార్టీలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతరాయాలతో చిన్న చిన్న పార్టీలకు ఇబ్బందులు కలుగుతాయి. వాటికి తమ వాణి వినిపించే అవకాశం లేకుండా పోతుంది’అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు పార్లమెంట్ సమావేశాల్లో తాము ప్రస్తావించాలని భావిస్తున్న అంశాలను తెలిపారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన బల్వీందర్ సింగ్, శివసేన నేత వినాయక్ రౌత్, టీఎంసీ నేత బంధోపాధ్యాయ్ రైతు ఆందోళనలను ప్రస్తావించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ అంశాన్ని చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టీఎంసీ నేత బంధోపాధ్యాయ్ కోరారు. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దురదృష్టకరమంటూ వివిధ పార్టీల నేతలు పేర్కొన్నారు. ఆ ఘటనలకు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులను బాధ్యులుగా చేయరాదని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలంటూ బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రధానిని కోరాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో మహాత్ముని విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రధాని మోదీ ఖండించారు. ఫోన్ కాల్ దూరమే.. రైతుల ఆందోళనలపై ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తోంది. జనవరి 22న రైతులతో జరిగిన చర్చల సందర్భంగా ఏడాదిన్నరపాటు కొత్త సాగు చట్టాల అమలును నిలిపివేస్తామంటూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఫోన్‌కాల్ చేస్తే చాలు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. గాంధీజి వర్ధంతి పురస్కరించుకుని శనివారం ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఆయన బోధనలు ఇప్పటికీ కోట్లాదిమందికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. జాతి శ్రేయస్సు కోసం, దేశానికి స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను అర్పించిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. -
ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలి
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, దీనికి కరోనా మహమ్మారి ప్రభావం కూడా తోడు కావడంతో మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన వివరించారు. ప్రత్యేక హోదా కల్పించే అధికారాన్ని 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం విచక్షణకు వదిలిపెట్టినందున తక్షణమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన కోరారు. జాతీయ ప్రాజెక్ట్‌గా నదుల అనుసంధానం కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి నదులలోని నీటి ప్రవాహాన్ని టెలిమెట్రీ సాయంతో పరిశీలిస్తుండాలి. ఆయా రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణత ప్రాతిపదికన నీటి పంపకాలు జరగాలని కోరారు. నదుల అనుసంధానం కోసం పెద్ద ఎత్తున అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలని అన్నారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధిని ఆశిస్తూ మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం కర్నూలును న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన సంగతిని ఆయన సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని విజయసాయి రెడ్డి కోరారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కావలసి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను యధావిధిగా కొనసాగిస్తూనే ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ మొదలై రెండేళ్ళు కావస్తున్నా ఇంకా అది ఒక కొలిక్కి రాకుండా కాలయాపన జరుగుతుండటాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్లు పార్లమెంట్ ఉభయ సభలతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలు, కౌన్సిళ్ళలోను, నామినేటెడ్ పదవులలోను మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సవరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని విజయసాయి రెడ్డి కోరారు. ప్రస్తుతం పార్లమెంట్‌లోని మొత్తం సభ్యులలో మహిళలు కేవలం 13 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని ఆయన సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమాజంలో మహిళలకు సమప్రాధాన్యత కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీలలో 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ రంగ సమస్యలు వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ గిట్టుబాటు ధర చెల్లించాలి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించినా, ప్రైవేట్ సంస్థలు సేకరించినా రైతు గిట్టుబాటు ధర పొందే హక్కును చట్టబద్దం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ మాదిరిగానే రైతుల కోసం జాతీయ రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ పార్టీలకు తగినంత సమయం ఇవ్వాలి ప్రాంతీయ, అంతర్ రాష్ట్ర సమస్యలను యావత్ దేశం దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా పార్లమెంట్ చర్చల్లో ప్రాంతీయ పార్టీలకు మరింత ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు. పార్లమెంట్లో నాలుగవ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఉభయసభల్లో పార్టీ ఎంపీలకు కేటాయిస్తున్న సమయం సంతృప్తికరంగా లేదని అన్నారు. దేవాలయాలపై దాడుల వెనుక తెలుగుదేశం హస్తం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరిగిన దేవాలయాలలో విగ్రహాల ధ్వసం వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యం ద్వారా వెల్లడైందని అన్నారు. దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలపై దాడులపై ఏమాత్రం ఉపేక్షించడానికి వీలులేకుండా జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ప్రార్ధనా స్థలాల్లో జరిగే నేరాలకు విధించే శిక్షను 2 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళకు పెంచుతూ ఐపీసీని సవరించాలని కోరారు. రేప్ దోషులను శిక్షించేందుకు కఠిన చట్టాలు మహిళలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి వీలుగా ఐపీసీ, సీఆర్పీసీలను సవరించాల్సి తక్షణ ఆవశ్యకత ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ఇలాంటి కేసులను 21 రోజుల్లో పరిష్కరించే వీలు కల్పిస్తుందని ఆయన వివరించారు. రేప్ కేసులలో శిక్ష పడిన దోషులకు పెరోల్ ఇవ్వకుండా చట్టాలను కఠినతరం చేయాలని అన్నారు. విశాఖపట్నంలో జాతీయ విశ్వవిద్యాలయాలు విశాఖపట్నం త్వరలో ఎగ్జిక్యూటివ్ రాజధాని కాబోతున్న నేపథ్యంలో రాష్ట్రీయ రక్షా యూనివర్శిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ బిల్లుల కింద జాతీయ ప్రాధాన్యత కలిగిన విశ్వవిద్యాలయాను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
రైతులకిచ్చిన ఆఫర్ ఇప్పటికీ వర్తిస్తుంది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రైతులతో చర్చలకు మేం ఎల్లప్పుడు సిద్ధంగానే ఉన్నాం. చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సాగు చట్టాల విషయంలో కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాం. ఏడాదిన్నరపాటు సాగు చట్టాల అమలు నిలిపివేతకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులకు కేంద్రం ఇచ్చిన ఆఫర్ ఇప్పటికీ వర్తిస్తుంది. రైతులతో చర్చిండానికి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సిద్ధంగా ఉన్నారు. అన్నదాతలతో మరోసారి చర్చలకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారి అభ్యంతరాలను పరిశీలిస్తాం. రానున్న బడ్జెట్లో రైతులకు వరాలు ప్రకటిస్తాం’’ అని మోదీ తెలిపారు. (చదవండి: ‘స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివ్ అయ్యాయి’) -
బడ్జెట్ సెషన్‌కు సిద్ధం.. 30న అఖిలపక్ష భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఈనెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో వర్చువల్ విధానంలోనే ఈ సమావేశం నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయా పార్టీల పార్లమెంటరీ నేతలకు ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి జోషి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఉన్న శాసన వ్యవహారాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రతిపక్షాల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి విడత, మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడతగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈసారి పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కొత్తగా ఉండనుంది. ఉదయం రాజ్యసభ కొనసాగితే లోక్‌సభ సాయంత్రం జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ మేరకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు. -
కొన్ని వారాల్లో వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం మరెంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, మరికొన్ని వారాల్లో టీకా అందుబాటులోకి రావొచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని శుక్రవారం వర్చువల్‌గా జరిగిన అఖిలపక్ష భేటీలో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లో వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, తీవ్రమైన వ్యాధులతో బాధపడ్తున్న వృద్ధులు.. మొదలైన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. టీకా ధరపై అనేక ప్రశ్నలు వస్తున్నాయని, అది సహజమేనని, అయితే, ప్రజారోగ్యానికే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్లో రాష్ట్రాలను సంపూర్ణంగా భాగస్వాములను చేస్తామన్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా ‘కోవిన్’ అనే సాఫ్ట్‌వేర్‌ను భారత్ సిద్ధం చేసిందని వెల్లడించారు. కరోనా మహమ్మారితో దేశంలో నెలకొన్న పరిస్థితులు, టీకా సంసిద్ధత, పంపిణీ, టీకా ధర తదితర అంశాలను ఈ భేటీలో చర్చించారు. ప్రధానంగా 8 టీకాలు వివిధ ప్రయోగ దశల్లో ఉన్నాయని, భారత్‌లో వాటి ఉత్పత్తికి హామీ లభించిందని ప్రధాని తెలిపారు. భారత్‌లోనూ మూడు టీకా ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇటీవల పుణే, హైదరాబాద్, అహ్మదాబాద్‌ల్లోని టీకా ప్రయోగశాలలను సందర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమ ప్రయోగాలు కచ్చితంగా విజయవంతమవుతాయని అక్కడి శాస్త్రవేత్తలు గట్టి నమ్మకంతో ఉన్నారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు ప్రయోగదశల్లో ఉన్నప్పటికీ.. చవకగా, సమర్ధవంతంగా పనిచేసే టీకా కోసమే అంతా ఎదురు చూస్తున్నారన్నారు. అభివృద్ధి చెందిన చాలా దేశాల కన్నా భారత్ కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొందని ప్రధాని పునరుద్ఘాటించారు. పలు దేశాల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల భారత్‌లోనూ జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలని కోరారు. వ్యాక్సిన్ సిద్ధమవుతున్న దశలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ముప్పును కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష భేటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, హర్షవర్ధన్‌తో పాటు కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, ఆధిర్ రంజన్ చౌధురి, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, టీఎంసీ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్.. తదితరులు హాజరయ్యారు. కరోనా తరహా మహమ్మారులు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశముందని, దేశ విధాన నిర్ణేతలు ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ హెచ్చరించారు. మొదట కోటి మంది వైద్య సిబ్బందికి.. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి అఖిలపక్ష భేటీలో ఒక సమగ్ర ప్రజెంటేషన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చింది. మొదట టీకాను దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని సుమారు కోటి మంది వైద్య సిబ్బందికి ఇస్తామని వెల్లడించింది. ఆ తరువాత, కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు, సాయుధ దళాలు, మున్సిపల్ సిబ్బంది తదితర రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేస్తామని పేర్కొంది. కరోనా కేసులు 95.71 లక్షలు న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్–19 కేసుల సంఖ్య శుక్రవారానికి 95.71 లక్షలకు చేరింది. ఈ మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 90.16 లక్షలు దాటింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 94.20 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 36,559 అని, వ్యాధి కారణంగా ఒక్కరోజులో మరణించిన వారి సంఖ్య 540 అని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం పేర్కొంది. మొత్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 1,39,188 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కోవిడ్–19 మరణాల శాతం భారత్‌లో ప్రస్తుతం 1.45 గా ఉంది. డిసెంబర్ 3 వరకు 14,47,27,749 శాంపిల్స్‌ను పరీక్షించామని ఐసీఎంఆర్ గణాంకాలు చెబుతున్నాయి. -
డిసెంబర్ 4న మోదీ అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై చర్చించేందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 4 (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మోదీ, ఆల్ పార్టీ మిటింగ్ నిర్వహించడం ఇది రెండో సారి. ఇక ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మినిస్టర్ అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని పార్టీ నాయకులను సంప్రదించినట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 94 లక్షలకు మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇక కోవిడ్ కేసుల్లో ప్రపంచంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే అమెరికాతో పోలిస్తే ఇండియాలో కోవిడ్ మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఇక ఇప్పటిక వరకు దేశ వ్యాప్తంగా 88 లక్షలకు పైగా కోవిడ్ బారిన పడి కోలుకోగా.. 1.3లక్షలకు మందికి పైగా మరణించారు. దేశంలో తొలి కోవిడ్ మరణం జనవరి 30, 2020న కేరళలో నమోదయ్యింది. ఇక ప్రపంచ దేశాలన్ని కరోనా వ్యాక్సిన్ కోసం కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. భారత్‌లో కూడా నాలుగైదు వ్యాక్సిన్లు పలు దశల్లో ఉన్నాయి. దేశంలో కరోనా టీకా అభివృద్ధి కోసం మూడు ఫార్మా దిగ్గజ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్, పుణేలలో సుడిగాలి పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల నిర్వహణలో ఏకపక్ష నిర్ణయం తగదు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ)తో బుధవారం నిర్వహించిన రాజకీయ పార్టీల భేటీ ముగిసింది. మొత్తం 19 పార్టీలకు గాను 11 పార్టీలు హాజరయ్యాయి. ఇక ఎస్ఈసీ సమావేశానికి వైఎస్సార్సీపీ హాజరు కాలేదు. ఎన్నికల నిర్వహణలో ఏకపక్ష నిర్ణయం కుదరదని పార్టీలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. టీడీపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించాయి. ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ.. ‘గతంలో కరోనా లేకపోయినా ఎన్నికలు వాయిదా వేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సమావేశాలు పెట్టడం సరికాదు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సమావేశాల నిర్వహణతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినట్టుంది. ప్రైవేట్ హోటల్లో బీజేపీ-టీడీపీ నేతలను కలిసినప్పుడే నమ్మకం కోల్పోయారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిమ్మగడ్డ నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు’ అని తెలిపారు. (చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై విస్మయం) నవతరం పార్టీ నేతల అరెస్ట్ ఇక ఈసీ సమావేశానికి ఆహ్వానించక పోవడంపై నవతరం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డకు వినతిపత్రం ఇచ్చేందుకు నవతరం పార్టీ నేతలు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకుని, ఆరుగురిని అరెస్ట్ చేశారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై ‘రచ్చబండ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడానికి నడుం బిగించాయి. ప్రతిపక్షాల నిర్బంధం, కరోనా నియంత్రణ చర్యల్లో సర్కారు నిర్లక్ష్యం వంటి అంశాలపై అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి. ‘రచ్చబండ’పేరిట ప్రజల్లోకి వెళ్లి అన్ని విషయాలు వివరించాలని మంగళవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నివాసంలో జరిగిన భేటీలో నిర్ణయించాయి. సమావేశానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) నేత గోవర్ధన్ హాజరయ్యారు. కరోనా నియంత్రణ, కార్మికులను ఆదుకునే విషయంలో ప్రభుత్వవైఖరి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన విరాళాలు, ప్రతిపక్షపార్టీలపై ప్రభుత్వ నిర్బంధం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. కోవిడ్ కోరల్లో పేదలు: కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై బలమైన కార్యాచరణకు రూపకల్పన చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. సచివాలయం కూల్చివేతకు నిరసనగా గన్‌పార్కు వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేదలు కోవిడ్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకునే నాథుడేలేరని విచారం వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులు, చేతివృత్తిదారులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల వారి పక్షాన ఉద్యమించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వవైఫల్యాలపై ’రచ్చబండ’కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రులు, వివిధ జిల్లా ఆసుపత్రుల్లో సరైన వసతులు లేవని, తెలంగాణలో భవంతులు కాదు, బతుకులు కావాలన్న నినాదంతో పోరాటం చేస్తామని తెలిపారు. కొత్త భవనాలు అవసరంలేదు: రమణ ఎల్.రమణ మాట్లాడుతూ కరోనాతో ప్రజల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొత్త భవనాలు అవసరం లేదని అన్నారు. ప్రగతిభవన్ ఉద్యోగులకు కరోనా వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారని, మరి ఇల్లు లేని పేదలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నిరసన తెలిపే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై వర్చువల్ ర్యాలీలు , రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని చెప్పారు. -
కరోనా నియంత్రణకు అఖిలపక్షాన్ని పిలవండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రమవుతున్న ప్రమాదకరమైన కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించే కార్యాచరణపై చర్చించి ప్రణాళిక ఖరారు చేయడానికి వెంటనే అఖిలపక్షాన్ని పిలవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ పద్ధతిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, ఈ సమయంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాలను పెంచాలని, తీవ్రత లేని వారికి ఇంట్లోనే చికిత్స చేసి, తీవ్రమైన కేసులను మాత్రమే ఆసుపత్రులలో చేర్చాలని మల్లు రవి కోరారు. ఈ వ్యాధి చికిత్సపై ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు మార్గదర్శకాలు జారీ చేయాలని, చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. -
మన సరిహద్దు క్షేమం
న్యూఢిల్లీ: మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చైనా సాగించిన దురాగతానికి యావద్దేశం గాయపడిందని, ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ శాంతిని, స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని, అదే సమయంలో, దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని, అదే మనకు సర్వోన్నతమని స్పష్టం చేశారు. సరిహద్దులను కాపాడే విషయంలో సైన్యం సమర్ధంగా వ్యవహరిస్తోందన్నారు. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. వాస్తవాధీన రేఖకు సంబంధించి భారత్ విధానాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాకు స్పష్టం చేశామని ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలతో పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు అమరులై, చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని∙మోదీ శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని భేటీలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర ప్రధాన పార్టీల అగ్రనేతలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాల్వన్ లోయలో జూన్ 15 రాత్రి చైనా సైనికులతో చోటు చేసుకున్న ఘర్షణ తదనంతర పరిణామాలను, ప్రస్తుత పరిస్థితిని మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్ పార్టీల నేతలకు వివరించారు. చైనాతో వ్యవహరించాల్సిన తీరుపై దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ భేటీలో వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదట, చైనాతో సరిహద్దు ఘర్షణల్లో అమరులైన 20 మంది వీర జవాన్లకు ప్రధాని, మంత్రులు, పార్టీల నేతలు 2 నిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులర్పించారు. జవాన్ల త్యాగం వృధా కాబోదని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్ వైపు చూసే ధైర్యం చేసినవారికి మన వీర జవాన్లు తగిన గుణపాఠం చెప్పారని ప్రధాని వ్యాఖ్యానించారు. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లోని భారత భూభాగాల్లోకి చైనా సైనికులు చొచ్చుకువచ్చారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని వివరణ ఇచ్చారు. మన భూభాగంలో ఒక అంగుళాన్నైనా ఎవరూ ఆక్రమించుకునే ధైర్యం చేయలేనంత స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందించుకున్నామన్నారు. ఈ భేటీలో ఎన్సీపీ నేత శరద్‌పవార్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కే చంద్ర శేఖర రావు, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ, డీఎంకే నేత స్టాలిన్, బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం నేత సీతారాం యేచూరి పాల్గొన్నారు. చైనా పెట్టుబడులు వద్దు: మమత భారత్‌లోని మౌలిక వసతుల రంగంలో చైనా పెట్టుబడులను అంగీకరించవద్దని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సూచించారు. ఈ సంక్షోభ సమయంలో తమ పార్టీ కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. కమిటీ ఏర్పాటు చేస్తారా?: యేచూరి చైనాతో సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడ్డానికి, 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడానికి నిఘా వైఫల్యం కారణమా అని తేల్చేందుకు ఏదైనా కమిటీని నియమిస్తారా? అని సీపీఎం నేత సీతారాం యేచూరి ప్రశ్నించారు. గతంలో కార్గిల్ వార్ అనంతరం.. వైఫల్యాలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఒక కమిటీ వేసిన విషయాన్ని యేచూరి గుర్తు చేశారు. మీ సైనికులెవరూ మా ఆధీనంలో లేరు:చైనా బీజింగ్: భారతీయు సైనికులు ఎవరూ ‘ప్రస్తుతం‘తమ ఆధీనంలో లేరని చైనా శుక్రవారం స్పష్టం చేసింది. తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో జూన్ 15న భారత్ చైనాల మధ్య ఘర్షణలో పొరుగుదేశం మన సైనికులను బందీలుగా చేసి తీసుకెళ్లిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ మీడియాకు ఈ విషయం తెలిపారు. నిఘా వైఫల్యమా?: సోనియా సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల్లో 20 మంది భారత జవాన్ల మృతికి నిఘా వైఫల్యం కారణమా? అని సోనియాగాంధీ ప్రశ్నించారు. గాల్వన్ లోయలో యథాతథ స్థితి నెలకొంటుందని, చైనా వెనక్కు వెళ్తుందని హామీ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరారు. భేటీ ప్రారంభంలో సోనియా పలు ప్రశ్నలను సంధించారు. చైనా దళాలు తూర్పు లద్దాఖ్‌లో భారత భూభాగంలోకి వచ్చాయా? వస్తే ఎప్పుడు వచ్చాయి? ఆ ప్రాంతంలో చైనా దళాల అసాధారణ కదలికలపై మన నిఘా సంస్థలు సమాచారం ఇవ్వలేదా? అని ఆమె ప్రశ్నించారు. తదుపరి కార్యాచరణ ఏమిటన్నారు. సైనికుల మధ్య ఘర్షణలు ప్రారంభమైన మే 5 నుంచి జూన్ 6 వరకు విలువైన కాలాన్ని ప్రభుత్వం వృధా చేసిందని ఆరోపించారు. మమ్మల్ని ఆహ్వానించరా? ఈ భేటీకి ఆహ్వానించకపోవడంపై ఆప్, ఆర్జేడీ, ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్‌యాదవ్, ఆయన కూతురు మీసాభారతి, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బిహార్‌లో తమది ప్రధాన ప్రతిపక్షమని, ఈ భేటీకి ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. అయితే, అన్ని గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, లోక్‌సభలో ఐదుగురు, లేదా ఆపై ఎంపీలున్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, కేబినెట్లో మంత్రులున్న పార్టీలను మాత్రమే భేటీకి ఆహ్వనించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లేహ్‌లో ఐఏఎఫ్ చీఫ్ భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో.. భారత వైమానిక దళాధిపతి చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా లేహ్, శ్రీనగర్‌ల్లో పర్యటించారు. ఎయిర్‌ఫోర్స్ సన్నద్ధతను పరిశీలించారు. -
తొందరపడొద్దు.. తలవంచొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత్–చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సమయంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానికి సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజ కీయం (రాజనీతి) కాదని, యుద్ధనీతి (రణనీతి) కావాలని పేర్కొ న్నారు. దేశంలో పాలన సుస్థిరంగా ఉండడంతోపాటు గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలు దువ్వుతోందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష భేటీలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీతో కలసి అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి చైనాతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వ హించిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘చైనా, పాకిస్తాన్ లకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇప్పుడు చైనాలో అంతర్గత సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేసియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతోంది. చైనా వైఖరి ప్రపంచవ్యాప్తంగా బాగా బద్నాం అయింది’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అది తొందరపాటు చర్య అవుతుంది... ‘చైనా నుంచి వస్తువుల దిగుమతులు ఆపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది తొందరపాటు చర్య అవుతుంది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాలి. ప్రజలకు సరసమైన ధరల్లో వస్తువులు దొరకాలి. ముందుగా మనం ఈ విషయాలపై దృష్టి పెట్టాలి’అని కేసీఆర్ సూచించారు. రక్షణ వ్యవహారాల్లో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రతిపాదించిన డి–10 గ్రూపులో కలవాలని, ఓరాన్ అలయెన్సులో చేరాలని, హువాయ్ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టాలని అభిప్రాయపడ్డారు. ‘భారతదేశంతో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరి అవలంభిస్తోంది. గాల్వన్ లోయ వంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. ఇది మొదటిది కాదు.. చివరిదీ కాదు. 1957లో సరిహద్దు వివాదం లేవనెత్తింది. 1962లో ఏకంగా భారత్–చైనా మధ్య పూర్తిస్థాయి యుద్ధమే జరిగింది. ఇక ఇటీవల చైనా మనదేశంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభించడానికి ప్రత్యేక కారణాలున్నాయి. కాశ్మీర్ విషయంలో కొత్త చట్టాలు తెచ్చాం. అక్కడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. మనది శాంతికాముక దేశం. అదే సమయంలో సహనానికి హద్దు ఉంటుంది. ఎవరైనా మన మీదకి వస్తే తీవ్రంగా ప్రతిఘటించాలి. దేశ రక్షణ, ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు. ఈ పరిస్థితుల్లో రాజకీయం అవసరం లేదు. రణనీతి కావాలి. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయమిది. గతంలో కూడా ఇతర దేశాలతో ఘర్షణలు, యుద్ధాలు జరిగినప్పుడు ఇలాగే నిలబడిన సందర్భాలున్నాయి’అని కేసీఆర్ పేర్కొన్నారు. భారతదేశ పురోగతి చైనాకు నచ్చట్లేదు.. ‘కరోనా వైరస్‌కు చైనాయే కారణమనే అపఖ్యాతి వచ్చింది. ఆ దేశం నుంచి చాలా బహుళ జాతి సంస్థలు బయటకు వస్తున్నాయి. అవి భారతదేశంవైపు చూస్తున్నాయి. పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమైనదని ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. ప్రపంచబ్యాంకు రిపోర్టు ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ 142వ స్థానం నుంచి 63వ స్థానానికి ఎదిగింది. భారతదేశంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు బాగా అమలవుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. 2014 నుంచి 2017 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 36 బిలియన్ డాలర్ల నుంచి 61 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇంకా పెరగడానికి అవకాశాలున్నాయి. చైనా నుంచి తీసుకొచ్చి తెలంగాణలో తమ కంపెనీలు పెట్టడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఇది చైనాకు నచ్చడంలేదు’అని సీఎం కేసీఆర్ వివరించారు. -
ముక్తకంఠం
లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి 20మంది జవాన్ల ఉసురు తీసిన చైనా కుతంత్రంపై శుక్రవారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సంక్షోభాలు తలెత్తినప్పుడు, ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలెదురైన ప్పుడు అఖిల పక్ష సమావేశాలు నిర్వహించడం, అందరి అభిప్రాయాలూ తీసుకోవడం మన దేశంలో రివాజు. అందులో వ్యక్తమయ్యే విలువైన సూచనల్ని స్వీకరించడం, వాస్తవ పరిస్థితిపై అందరికీ అవగాహన కలిగించడం ప్రభుత్వం చేసే పని. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని పక్షాలకూ ప్రజల్లో అంతో ఇంతో పలుకుబడి వుంటుంది. అందువల్ల ఆ పార్టీలకు సమస్య పూర్వాపరాలు వివరించి, ఆ సమస్య పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలను, వాటి వెనకున్న కారణాలను తెలియజెప్పడం...వారి మనోగతాన్ని తెలుసుకోవడం, సందేహాలను తీర్చడం అఖిల పక్ష సమావేశాల నిర్వహణ వెనకుండే ఆంతర్యం. తమ నిర్ణయానికి అనుగుణంగా అందరినీ కూడ గట్టడం కోసం చేసే ప్రయత్నమిది. ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏకపక్షంగా కాకుండా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నదన్న అభిప్రాయం ప్రజానీకంలో కలగడానికి, సమష్టి భావనకు ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా పొరుగు దేశాలతో సంబంధాలు క్షీణించినప్పుడు, అవి సైనిక ఘర్షణకు దారితీసే పరిస్థితులున్నప్పుడు అఖిల పక్ష సమావేశాలు జాతీయంగానే కాదు... అంతర్జాతీయ కోణంలో కూడా చాలా అవసరం. తాము నిర్ణయాత్మకంగా వ్యవహరిం చబోతున్నామన్న స్పష్టమైన సందేశం ఘర్షణ పడే పొరుగు దేశానికి పంపడం ముఖ్యం. అఖిలపక్ష సమావేశంలో వ్యక్తమయ్యే అభిప్రాయాలు సమస్య తీవ్రతను ప్రపంచానికి చాటుతాయి. అవి నైతిక మద్దతిచ్చేందుకు దోహదపడతాయి. కల్నల్ సంతోష్ బాబుతో సహా 20మంది జవాన్లను అయిదు రోజులక్రితం చైనా సైనికులు అత్యంత దారుణంగా రాళ్లతో, ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. మరో పది మంది జవాన్లను అపహ రించుకుపోయారు. చర్చల తర్వాత విడుదల చేశారు. ఎప్పటినుంచో మన అధీనంలోవుంటున్న గాల్వాన్ లోయ నుంచి వెనక్కు వెళ్లాలని, ఈ విషయంలో అంతక్రితం కుదిరిన ఉమ్మడి అవ గాహనను గౌరవించాలని కోరినందుకు వారు విరుచుకుపడ్డారు. సరిహద్దుల్లో సైనిక ఘర్షణలెలా వుంటాయో మన సినిమాల్లో చూపిస్తుంటారు. ఆ దృశ్యాలను చూడటానికి అలవాటుపడినవారికి చైనా సైనికులతో జరిగిన ఘర్షణలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో వున్న దృశ్యాలు చూసిన ప్పుడు సహజంగానే ఆశ్చర్యం కలిగింది. అత్యాధునిక ఆయుధాల వినియోగం, పరస్పరం కాల్పులు, అందుకోసం పొజిషన్లు తీసుకోవడం వంటివిలేవు. ఒకరినొకరు తోసుకోవడం, ఆగ్రహంతో ఊగి పోతూ మాట్లాడటం కనబడింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కూడా ఇలాంటి సందేహమే కలిగింది. చైనా సైనికులతో సమావేశానికెళ్లే మన జవాన్లు నిరాయుధంగా ఎందుకెళ్లవలసి వచ్చిందని ప్రశ్నించారు. అందుకు 1996, 2005 సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాలు కారణమన్నది విదేశాంగమంత్రి జైశంకర్ జవాబు. వాటి ప్రకారం ఎల్ఏసీకి రెండు కిలోమీటర్ల లోపులో కాల్పులు జరపకూడదని, పేలుడు పదార్ధాలు, ప్రమాదకరమైన రసాయనాలు వినియోగిం చకూడదన్నవి షరతులు. ఉపయోగించాల్సిన పరిస్థితి వుంటే అయిదు రోజుల ముందు చెప్పాలని కూడా ఆ ఒప్పందాల్లో వుంది. భవిష్యత్తులో అనుకోనివిధంగా సరిహద్దులు ఉద్రిక్తంగా మారిన ప్పుడు మారణాయుధాలు, బాంబులు వినియోగిస్తే ఇరువైపులా ప్రాణనష్టంతో పరిస్థితి చేయిదాటి పోతుందని, పరిష్కారం జటిలమవుతుందని భావించబట్టే ఇవి ఉనికిలోకి వచ్చాయని ఎవరికైనా అర్ధమవుతుంది. కానీ చైనాకు ఇదంతా పట్టలేదు. మారణాయుధాలు వినియోగించకూడదు కాబట్టి కర్రలతో, ఇనుపరాడ్లతో, రాళ్లతో ఏమైనా చేయొచ్చని అది భావించినట్టుంది. ఇలాంటి కుతంత్రాన్నే మన జవాన్లు కూడా అనుసరిస్తే పరిస్థితి వేరుగా వుండేది. కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవిం చడం, వాటికి కట్టుబడటం ఏ దేశానికైనా గౌరవప్రతిష్టలు తెస్తుందే తప్ప వాటిని మసకబార్చదు. సమస్య పరిష్కారానికి వివిధ ప్రత్యామ్నాయాలున్నాయి. స్థానికంగా సైన్యంలోని బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారులు మొదలుకొని దౌత్యపరమైన మార్గాల వరకూ అనేకం వున్నాయి. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నవారంతా కేంద్రం తీసుకోబోయే ఎలాంటి చర్యలకైనా సంపూర్ణ మద్దతునిస్తామని చెబుతూనే దౌత్యపరంగా, వాణిజ్యపరంగా అన్ని రకాల ప్రయత్నాలూ చేయాలని సూచించడం హర్షించదగ్గది. చైనా దురాగతానికి దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతు న్నాయి. అయితే యుద్ధమే అన్నిటికీ పరిష్కారమనే వైఖరి ఎప్పుడూ మంచిది కాదు. గాల్వాన్ లోయ వద్ద ఇప్పుడు జరిగిన పరిణామాల్లో అంతర్జాతీయంగా ప్రతిష్ట కోల్పోయింది చైనాయే. ఎల్ఏసీ పొడవునా వున్న దాదాపు 23 సమస్యాత్మక ప్రాంతాల్లో గాల్వాన్ ఎప్పుడూ లేదని ప్రపంచ దేశాలు గుర్తించాయి. చైనా ఎత్తుగడల్లోని ఆంతర్యాన్ని గ్రహించాయి. ఈ సమయంలో దౌత్యపరంగా ఒత్తిళ్లు తీసుకురావడం అవసరం. అలాగే సరిహద్దుల్లో నిఘా పెంచడం కూడా కీలకం. మన జవాన్లతో చైనా సైనికులు తగాదాకు దిగే సమయానికి సంఖ్యాపరంగా వారు తక్కువుండటం...తోపులాటలతో, వాగ్వాదాలతో కాలక్షేపం చేసి, తమవారిని సమీకరించుకున్నాక దాడికి దిగడం వారి కుటిలత్వానికి అద్దం పడుతుంది. గాల్వాన్‌లో చైనా సైనికుల కదలికలు గురించి నెల్లాళ్లుగా స్థానికులు చెబుతున్నా ఆ సమాచారం మన సైన్యానికి లేదన్న విమర్శలున్నాయి. ఈ ఘర్షణల సమయంలోనూ అంతే. వెనకనుంచి వారికి మద్దతుగా మరిన్ని బలగాలు వస్తున్నాయన్న సమాచారం లేదు. ఇలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. సరైన సమయంలో అప్రమత్తమయ్యే స్థితివున్నప్పుడు ప్రత్యర్థిపక్షం ఆటలు సాగవు. -
‘ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం’
సాక్షి, తాడేపల్లి : గాల్వన్ సంక్షోభ సమయంలో దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సరైన మార్గంలో విజయవంతగా నడిపిస్తారని నమ్ముతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్ది తెలిపారు. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై మోదీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన 20 మంది వీరసైనికుల మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. అమరులైన సైనికుల కుటుంబాలకు అందరం తోడుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంక్షోభ సమయంలో ఏ వ్యుహాత్మక నిర్ణయం తీసుకున్నా దానిని తాము కట్టుబడి ఉంటామని మోదీకి చెప్పారు. -
‘అనుమానాలున్నాయి.. హామీ ఇవ్వండి’
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని విపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ దేశ ‘ప్రజలు యథాతథ స్థితి పునరుద్ధరించబడుతుంది అని.. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా తన అసలు స్థానానికి తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి హామీని కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఇప్పటికి కూడా ఈ సంక్షోభం గురించి తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ అంశం గురించి సోనియా కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘లడాఖ్‌లోని మన భూభాగంలోకి చైనా దళాలు ఏ తేదీన చొరబడ్డాయి? చైనా మన భూభాగంలోకి చేసిన అతిక్రమణలను ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది. మే 5 న లేదా అంతకుముందుగానా? భారత్-చైనా సరిహద్దుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ప్రభుత్వం స్వీకరించలేదా?’ అని సోనియా వరుస ప్రశ్నలు సంధించారు. సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎల్ఏసీ వెంట చోటు చేసుకుంటున్న అసాధారణమైన కార్యకలాపాల గురించి ప్రభుత్వానికి నివేదించలేదా? మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎల్ఏసీ వెంబడి భారత్, చైనా దళాలు చొరబడటం, భారీగా బలగాలను మోహరించడం గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేదా? ప్రభుత్వం అభిప్రాయంలో ఏదైనా వైఫల్యం ఉందా?’ అని సోనియా ప్రశ్నించారు. వీటికి ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది. -
కీలక భేటీకి ఆహ్వానించరా..?
సాక్షి, హైదరాబాద్ : చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీకి ఏఐఎంఐఎంను ఆహ్వానించకపోవడం పట్ల ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీని పిలవకపోవడం నిరాశకు గురిచేసిందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. కీలక భేటీకి తమను ఆహ్వానించకపోవడంపై ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జాతీయ ఏకాభిప్రాయం, సమిష్టి స్పందన అవసరం కాగా ఈ సమావేశానికి ఏఐఎంఐఎంను పిలవకపోవడం దురదృష్టకరమని లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ చిన్న రాజకీయ పార్టీయే అయినా ఆ పార్టీ అధ్యక్షుడిగా తాను భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడంపై మాట్లాడిన తొలి కొద్ది మంది ఎంపీల్లో తాను ఒకడినని గుర్తు చేశారు. విదేశీ సైన్యం సరిహద్దులు దాటి దేశ భూభాగాన్ని ఆక్రమించడం జాతీయ సవాల్ అని, అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకుంటేనే ఈ సవాల్‌ను అధిగమించగలమని ఓవైసీ అన్నారు. చదవండి : డ్రాగన్ అంతపని చేసిందా..? -
చైనాపై కఠిన చర్యలు తీసుకోవాలి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ.. దేశం, సైనిక బలగాల తరపున నిలబడుతుంది. చైనాపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. అయితే ఈ కీలక సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆహ్వానం లభించలేదు. గాల్వన్ లోయ సంఘటన తర్వాత కేజ్రీవాల్ ‘ఎల్ఏసీలో మా వీర సైనికులు మృతి చెందారనే వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఈ విషాద సమయంలో మేమంతా అమర జవాన్ల కుటుంబాలకు తోడుగా ఉన్నాం. ఈ త్యాగానికి మేం వందనం చేస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులపై దృష్టి సారించింది. జూన్ 19నాడు దేశ రాజధానిలో ఒకే రోజు 2000 పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 26,669కి పెరిగి కోవిడ్ కేసుల సంఖ్యలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. -
అఖిలపక్ష సమావేశం షురూ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని విపక్ష నేతలతో సమావేశమయ్యారు. ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలు సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీకి 20 పార్టీలకు చెందిన నేతలకు ఆహ్వానం అందింది. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు శరద్ పవార్, సోనియా గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, మమతా బెనర్జీ, సీతారాం ఏచూరి సహా పలువురు నేతలు సమావేశంలో పాల్గొన్నారు. గాల్వన్ లోయలో జరిగిన పరిస్ధితులపై రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇవ్వగా, ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్ష భేటీలో చర్చించారు. సమావేశం ప్రారంభం కాగానే అమర జవాన్ల మరణానికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అఖిలపక్ష భేటీలో ఏపీ సీఎం ప్రధానితో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీఎం జగన్‌తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ సమావేశంలో పాల్గొన్నారు. చదవండి : వ్యాపారం గాడిలో పడింది -
రేపు అఖిలపక్షం భేటీ
చైనా ఆర్మీ దాడిలో కల్నల్ సహా 20 మంది భారతీయ సైనికులు మరణించడం, తదనంతర పరిణామాలపై సమాచారం పంచుకునేందుకు ప్రధాని శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఆ భేటీలో విపక్ష, మిత్రపక్ష నేతలకు వివరించనున్నారు. ‘చైనా సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని చర్చించేందుకు జూన్ 19 సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమవనున్నారు’ అని పీఎంఓ ట్వీట్ చేసింది. గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దు వివాదానికి సంబంధించి దేశమంతా ప్రభుత్వం వెనుక ఉందని, ఘర్షణలకు సంబంధించిన అన్ని వాస్తవాలను వెల్లడించాలని రాహుల్ గాంధీ బుధవారం డిమాండ్ చేశారు. -
సరిహద్దు వివాదం: ప్రధాని అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: లడక్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలో కల్నల్ సహ 20 మంది సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దులో తాజా పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(జూన్ 19) సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది. (సరిహద్దు ఘర్షణ : రాజ్‌నాథ్ మళ్లీ కీలక భేటీ) In order to discuss the situation in the India-China border areas, Prime Minister @narendramodi has called for an all-party meeting at 5 PM on 19th June. Presidents of various political parties would take part in this virtual meeting. — PMO India (@PMOIndia) June 17, 2020 తూర్పు లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో జరిగిన పోరాటంలో 45 మంది చైనా సైనికులు మరణించడం లేదా గాయపడి ఉండవచ్చని సమాచారం. ఇరుదేశాల సైనికులు పరస్పరం రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీలో అందరికీ కరోనా టెస్టులు: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలందరికీ కరోనా వైరస్(కోవిడ్-19) నిర్దారణ పరీక్షలు నిర్వహించే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సోమవారం తెలిపారు. ఢిల్లీతో పాటు రాజధాని ప్రాంతం(ఢిల్లీతో సరిహద్దు కలిగిన ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు)లో కూడా ప్రతీ ఒక్కరికీ టెస్టులు చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం నాటికి అక్కడ 41, 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1327 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అమిత్ షా సోమవారం నార్త్ బ్లాక్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ అధికార పక్షం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, బహుజన్‌సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రజల్లో కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోందని.. రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లందరికీ టెస్టులు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అదే విధంగా కరోనా బాధిత కుటుంబానికి, కంటైన్మెంట్ ఏరియాలో నివసిస్తున్న కుటుంబాలకు రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అలాగే మెడిసిన్ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులను నాన్ పర్మినెంట్ రెసిడెంట్ డాక్టర్లుగా గుర్తించి సేవలు వాడుకోవాలని సూచించింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. కరోనా విజృంభణ నేపథ్యంలో రోజుకు 18 వేల మందికి చొప్పున కరోనా పరీక్షలు చేయించనున్నట్లు వెల్లడించారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులతో ఆదివారం సమావేశమైన అమిత్ షా కరోనాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపిన విషయం విదితమే. (మహమ్మారిపై పోరు బాట)