ఢిల్లీ: అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ సెషన్ లో 21 బిల్లులు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం నేడు ముగిసింది. ఈ సమావేశానికి 23 పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రహ్లాద్ జోషి మాట్లాడారు.
పేదల కోసం అనేక అద్భుత పథకాలు తెచ్చాం.. అయిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. పూర్తి స్థాయిలో జరగాల్సిన చివరి సెషన్.. స్వల్ప కాలిక చర్చకు వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విపక్షాలదని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నేడు(శనివారం) నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేసింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించినట‍్లు సమాచారం. ఇందులో రెండు జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. వివాదాస్పద ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లును కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశపెట్టనుంది.
#WATCH | Delhi: An all-party meeting is underway at the Parliament Library building, ahead of the winter session of Parliament.
— ANI (@ANI) December 2, 2023
The winter session of Parliament, 2023 will begin from December 4 and continue till December 22. pic.twitter.com/PSwDtGFyPk
శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఐపిసి , సీఆర్పీసీలను మారుస్తూ కొత్త బిల్లులను తీసుకురానున్నారు. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇవి చివరి శీతాకాల సమావేశాలు గమనార్హం. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి: Rajasthan Exit Poll Analysis: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు?
Comments
Please login to add a commentAdd a comment