ipc
-
Supreme Court: రాజ్యాంగబద్ధతను తేలుస్తాం
న్యూఢిల్లీ: మారిటల్ రేప్ నుంచి భర్తలకు రక్షణ కల్పిస్తున్న ఐపీసీ, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని మినహాయింపు నిబంధనల రాజ్యాంగబద్ధతను తేలుస్తామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. భార్య సమ్మతి లేకుండా ఆమెతో భర్త బలవంతంగా సంభోగం జరపడాన్ని మారిటల్ రేప్‌గా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఇది క్రిమినల్ నేరం. భారత్‌లో చట్టాలు దీనికి మినయింపునిస్తున్నాయి. మారిటల్ రేప్ నేరం కాదని భర్తలకు రక్షణ కల్పిస్తున్నాయి. భార్య 18 ఏళ్ల లోపు మైనర్ కాకుంటే మారిటల్ రేప్ నేరం కాదని పేర్కొంటున్నాయి. దీన్ని పలువురు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌పై పిటిషనర్ల ప్రతిస్పందన కోరింది. మారిటల్ రేప్‌ను నేరంగా చేస్తే దాంపత్య బంధంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, వివాహ వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే విషయాన్ని తాజా అఫిడవిట్లో సుప్రీంకోర్టు ముందుంచింది. ‘ఇది రాజ్యాంగబద్ధతకు సంబంధించిన అంశం. ఈ అంశంలో రెండు గత తీర్పులున్నాయి. మినహాయింపును ఇస్తున్న నిబంధనల రాజ్యాంగబద్ధతను తేల్చడమే ముఖ్యం’ అని సీజేఐ చంద్రచూడ్ విచారణ సందర్భంగా అన్నారు. భార్య వయసు 18 ఏళ్ల లోపు కానంతవరకు భర్త ఆమెను బలవంతంగా అనుభవించినా అది నేరం కాదు.. అని బీఎన్ఎస్లో సెక్షన్ 63 (రేప్) మినహాయింపు–2 చెబుతోంది. రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిబంధనను కొట్టివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కరుణా నంది కోరారు. ‘మారిటల్ రేప్‌కు మినయింపు నిబంధన.. ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 19, ఆరి్టకల్ 21 (జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ)కు భంగకరమని మీరు అంటున్నారు. 18 ఏళ్లు పైబడిన భార్యతో భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డా అది రేప్ కాదని మినహాయింపును ఇచి్చనపుడు పార్లమెంటు భావించింది. భర్తలకు రక్షణ కల్పిస్తున్న మినహాయింపును కొట్టివేస్తే అప్పుడా లైంగిక చర్య రేప్ నిర్వచనం కిందకు వస్తుంది. అలాంటపుడు దీన్ని ప్రత్యేక నేరంగా చూడాలా? మినహాయింపు చట్టబద్ధతను తేల్చాలా? అనే సమస్య కోర్టులకు ఉత్పన్నమవుతుంది’అని ధర్మాసనం పేర్కొంది. ‘భర్త డిమాండ్ చేస్తాడు. భార్య నిరాకరిస్తుంది. ఈ సందర్భంలో భర్త ఆమెను నిర్భందిస్తే అది చట్టవిరుద్ధమవుతుంది. ఆమెను గాయపరిస్తే నేరపూరిత బెదిరింపు అవుతుంది. చివరికి భార్య లొంగిపోతే అప్పుడా సంభోగం నేరం కాదు. మిగతావన్నీ నేరాలైనపుడు చివరికి ఎందుకు కాదనేగా మీ ప్రశ్న’ అని జస్టిస్ పారి్థవాలా అన్నారు. ‘కాదంటే కాదనే అర్థం. ఒక మహిళ వద్దు అదంటే వద్దనే అర్థం. వైవాహిక బంధంలో బలవంతంగా సంభోగం జరిపినా అది రేప్ అవుతుంది. కేసు నమోదు చేయాల్సిందే’ అని పిటిషనర్ తరఫున వాదించిన కోలిన్ గొంజాల్వెజ్ అన్నారు. వాదనల తర్వాత కేసు ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది. -
ఇది విజయమా... వైఫల్యమా?
చరిత్ర సృష్టించటం మంచిదే. కానీ ఆ చరిత్ర తరతరాలు చెప్పుకొనేలా వుండాలి. ఈ నెల 4న ప్రారంభమై ఎజెండా అంశాలన్నీ పూర్తికావటంతో ఒకరోజు ముందు గురువారం నిరవధిక వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు ఫలవంతమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. లోక్‌సభ వరకూ చూస్తే ఈ సమావేశాలు దాదాపు 62 గంటలు సాగాయి. అత్యంత కీలకమైన 18 బిల్లులు చర్చల అనంతరం ఆమోదం పొందాయి. ఇందులో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టం స్థానంలో కొత్త చట్టాలుగా వస్తున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులున్నాయి. టెలికమ్యూనికేషన్ల బిల్లువుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లుంది. వార్తాపత్రికల, మేగజిన్ల కొత్త రిజిస్ట్రేషన్ చట్టం తాలూకు బిల్లు కూడావుంది. మొత్తంగా లోక్‌సభ 74 శాతం ఉత్పాదకతను చూపింది. రాజ్యసభ సైతం 17 బిల్లుల్ని ఆమోదించింది. సమావేశాలు 65 గంటల పాటు సాగాయి. దాని ఉత్పాదకత రేటు 79 శాతం వుంది. ఈ 17వ లోక్‌సభకు సంబంధించిఇవి 14వ సమావేశాలు. వీటన్నిటా ఈ సమావేశాలే అత్యంత ఫలవంతమైనవని గణాంకాలు వివరి స్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా మరో సమావేశం మాత్రమే జరుగుతుంది. అందులో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడం మినహా మరే ఇతర కార్యకలాపాలూ వుండకపోవచ్చు. అయితే బాధాకరమైన అంశమేమంటే... ఈ ప్రధాన బిల్లుల చర్చల్లో దాదాపుగా విపక్షం లేదు. ఇరవైరెండేళ్ల నాటి చేదు అనుభవాన్ని గుర్తుకు తెస్తూ ఈనెల 13న యువకులు పదడుగుల ఎత్తునున్న ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కిందకు దూకి పొగగొట్టాలు వదిలి దిగ్భ్రమపరిచారు. పార్లమెంటువెలుపల సైతం అదే సాగింది. అమెరికాలో వున్న ఖలిస్తానీ తీవ్రవాది పన్నూ పార్లమెంటుపై దాడిచేస్తామని అంతకు చాలారోజులముందే బెదిరించాడు. అప్రమత్తంగా వుండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సూచించాయి. అయినా పార్లమెంటు భద్రత వ్యవహారాలు చూసే వ్యవస్థ నిద్రాణమై వుంది. దాడి జరిగి పదిరోజులు గడుస్తున్నా దానికి సూత్రధారులెవరో ప్రజలకు తెలియలేదు. 2001 దాడినుంచి భద్రతా వ్యవస్థలు ఏ గుణపాఠమూ నేర్చుకోలేదని ఈ పరిణామం తెలియజేసింది. ఇదిగాక దేశాన్ని ఆశ్చర్యపరిచిన ఘటన మరొకటుంది. అది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సభా బహిష్కరణ. ఇన్ని చేదు ఉదంతాల మధ్య సమావేశాలు ఫలవంతంగా జరిగాయని అనుకోగలమా? విపక్షాలు పాలకులను నిలదీయటం, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. తమ సూచనలనూ, సలహాలనూపట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించే ప్రభుత్వానికి మూకుమ్మడిగా తమ అసమ్మతిని తెలియ జేయటానికి వాకౌట్ ఒక ఆయుధం. తగిన జవాబిచ్చినా విపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, నినాదాలు చేస్తున్నారని, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని, అధ్యక్ష స్థానాన్ని కించపరుస్తున్నారని, దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని భావించినప్పుడు అందుకు కారకులైనవారిపై సస్పెన్షన్ వేటు వేయటం కూడా కొత్తేమీ కాదు. కానీ అటువంటి ఉదంతాలు రాను రాను పెరుగుతుండటం, రివాజుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి ఉభయ సభలనుంచీ 146 మంది ఎంపీలు సస్పెండయ్యారు. లోక్‌సభలోకి యువకులు చొరబడటంపై ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయాలంటూ సభలో ఆందోళన నిర్వహించటం, వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించటం కారణంగా ఈ సస్పెన్షన్లు చోటుచేసుకున్నాయి. కొందరు ఎంపీలపై సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు వెళ్లింది. దేశం మొత్తాన్ని దిగ్భ్రమలో పడేసిన ఉదంతంపై ప్రకటన చేసే విషయంలోకేంద్రం ఎందుకంత పట్టుదలకు పోయిందో ఆశ్చర్యం కలిగిస్తుంది. లోక్‌సభలో దాడిచేసిన ఉదంతంపై ప్రకటన చేసినంత మాత్రాన విపక్షాలకు లొంగిపోయినట్టు కాదు... సంప్రదాయ విరుద్ధం అసలే కాదు. ఈ ఉదంతం వెనక ఏ శక్తులున్నాయో, వారి ఉద్దేశాలేమిటో వివరించటం వల్ల, తదనంతరం తీసుకున్న పటిష్ట చర్యలేమిటో చెప్పటంవల్ల దేశ ప్రజలకు సాంత్వన కలుగుతుంది. ఈ సస్పెన్షన్ల పర్యవసానంగా అత్యంత కీలకమైన బిల్లులపై విపక్షం ఆలోచనలేమిటో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయసంహిత బిల్లు పోలీసులకు తగినంత జవాబుదారీతనం ఇవ్వకుండానే వారికి విస్తృతాధి కారాలు కట్టబెడుతున్నదని నిపుణులంటున్నారు. సీఆర్పీసీ స్థానంలో తెచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో ఏ చర్య ఉగ్రవాదమో, ఏది కాదో నిర్ణయించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చారు. దీన్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని విపక్షాలంటున్నాయి. ఇక టెలికాం బిల్లు అంశానికొస్తే జాతీయ భద్రతా ప్రయోజనాల కోసమంటూ తాత్కాలికంగా టెలికాం సర్వీసుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు అది వీలుకల్పిస్తోంది. సీఈసీ, ఈసీల నియామకం సంగతి సరేసరి. వీటన్నిటిపైనా లోతైన చర్చ సాగొద్దా? పౌరుల్లో తలెత్తిన సందేహాలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం లేదా? కనీసం అందుకోసమైనా విపక్షాల సస్పెన్షన్లు ఎత్తివేసివుంటే పాలకపక్షం పెద్ద మనసు వెల్లడయ్యేది. గత దశాబ్దం వరకూ రాజీవ్‌గాంధీ హయాంలో 66 మంది ఎంపీల సస్పెన్షనే రికార్డుగా నమోదైతే, ఈసారి ఆ సంఖ్య 146కి ఎగబాకటం ఆందోళనకరం. సమావేశాల అంతరా యానికి కారకులెవరన్న అంశాన్నలా వుంచితే... సమన్వయంతో, సదవగాహనతో మెలగి పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టడం ఇరుపక్షాల బాధ్యత కాదా? -
న్యాయం వేగంగా జరిగేనా?
కేంద్ర ప్రభుత్వం నూతనంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తెచ్చింది. పార్లమెంట్ భద్రతా వైఫల్యం గురించిన ప్రతిపక్షాల ఆందోళన, బదులుగా అత్యధిక ఎంపీలు సస్పెండ్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. ఇందులో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు తిరిగి శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన ఆసక్తిగా ఉంది. అయితే దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన,సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయవ్యవస్థను మాత్రం బీఎన్ఎస్ఎస్ ఊహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ లా బిల్లులను వేగంగా ఉపసంహరించు కుంది; వాటికి బదులుగా భారతీయ న్యాయ సంహిత (ఐపీసీ, 1860 స్థానంలో తీసుకొచ్చిన బీఎన్ఎస్–2), భారతీయ నాగరిక్ సురక్షాసంహిత (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 స్థానంలో వచ్చిన బీఎన్ఎస్ఎస్–2) కొత్త వెర్షన్ లను తెచ్చింది. అలాగే, భారతీయ సాక్ష్య చట్టాన్ని (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో తెచ్చిన బీఎస్బీ–2) తెచ్చింది. వీటి సారాంశం కచ్చితంగా, వివరంగా ఉన్నప్పటికీ, ఈ చట్టాలలో దాగి ఉన్న వాక్చాతుర్యం గురించి ఆందో ళన చెందవలసి ఉంటుంది. క్రిమినల్ చట్టం, న్యాయం విషయంలో ఏదైనా పరివర్తనా దృష్టిని చూడటం వీటిల్లో కష్టమనే చెప్పాలి. మొత్తంమీద మితిమీరిన నేరీకరణ (క్రిమినలైజేషన్), విస్తృతమైన పోలీసు అధికారాల ద్వారా ప్రభుత్వ నియంత్రణను అసమంజసంగా విస్తరించే వ్యవస్థ వైపు మనం వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పోలీసులకు విస్తృత అధికారాలా? బీఎన్ఎస్ఎస్కి చెందిన ఒక ప్రత్యేక అంశం పౌర హక్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ అది పెద్దగా ఎవరిదృష్టినీ ఆకర్షించలేదు. బీఎన్ఎస్ఎస్లో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీ గరిష్ఠ పరిమితిని 60 రోజులు లేదా 90 రోజులకు (నేర స్వభావాన్ని బట్టి) బీఎన్ఎస్ఎస్ విస్తరించింది. ఇప్పటివరకూ ఉన్న చట్టం ప్రకారం, పోలీసు కస్టడీని అరెస్టయిన మొదటి 15 రోజులకు పరిమితం చేస్తారు. అయితే బీఎన్ఎస్ఎస్లోని ఈ కస్టడీ విస్తరణ పోలీసుల మితిమీరిన చర్యల ప్రమాదాన్ని పెంచు తుంది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రత గురించి ఇప్పటికే ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. నిర్బంధపూరితంగా, బలవంతంగా పొందు పర్చే కల్పిత సాక్ష్యాలకు చెందిన అధిక ప్రమాదం కూడా ఉంటుంది. అయినప్పటికీ బీఎన్ఎస్ఎస్ పోలీసు అధికారాలను దిగ్భ్రాంతికరంగా విస్తరించిందనే చెప్పాల్సి ఉంది. విశేషమేమిటంటే, మన సాధారణ క్రిమినల్ చట్టం ఇప్పుడు ప్రత్యేక చట్టాలకే పరిమితమైన నిబంధ నలను కలిగి ఉండటం. వాస్తవానికి, ఈ నిబంధనలు పోలీసు కస్టడీ వ్యవధిపై ‘ప్రత్యేక చట్టాలు’ అందించిన వాటికంటే కూడా మించి ఉన్నాయి. ఈ పోలీసు కస్టడీ విస్తరణను భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని అత్యంత విస్తారమైన, అస్పష్టమైన నేరాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. అనేక నేరాలు మితిమీరిన నేరీకరణ గురించిన కసరత్తులా ఉన్నాయి. రాజ్య భద్రతను పరిరక్షించడానికి ఉద్దేశించిన నేరాలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఉదాహరణకు, బీఎన్ఎస్–1లోని విస్తృత పదాలతో కూడిన నిబంధనలు, తప్పుడు సమాచారానికి శిక్ష (భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రత లేదా భద్రతకు హాని కలిగించే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారం) వంటివి బీఎన్ఎస్–2లోనూ అలాగే ఉన్నాయి. పునర్నిర్మించిన బీఎన్ఎస్లో ‘విద్రోహం’ అనే పదాన్ని తొలగించి నప్పటికీ, దానికి మరోరూపమైన నేరం – భారత సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడం– రెండు వెర్షన్లలోనూ విస్తార మైన, అస్పష్టమైన పదాలతో బాధించడం కొనసాగింది. బీఎన్ఎస్–1 కూడా ‘వ్యవస్థీకృత నేరం’, ‘ఉగ్రవాద చర్య’పై విస్తారమైన పదాలతో కూడిన నేరాలను పరిచయం చేసింది. ప్రత్యేకించి వాటిని ఎదు ర్కోవడానికి వాటి ప్రస్తుత నిర్వచనాలకు మించి నిర్వచించింది. ‘చిన్న వ్యవస్థీకృత నేరం’ అనేది ఒకటి కొత్తగా చేరింది. ఇందులో స్నాచింగ్, పిక్–పాకెటింగ్, బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించడం వంటి వివిధ రకాల వ్యవస్థీకృత దొంగతనాల గురించిన అస్పష్టమైన జాబితా ఉంది.ఈ నేరాల పరిధి బీఎన్ఎస్–2లో విస్తృతంగా కొనసాగుతుండగా, చిన్న వ్యవస్థీకృత నేరాల, వ్యవస్థీకృత నేరాల పరిధిని స్పష్టం చేయడానికి, పరిమితం చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. ‘ఉపా’లోని సెక్షన్ 15 కింద ఉన్న ‘ఉగ్రవాద చట్టం’ నిర్వచనానికి అనుగుణంగానే బీఎన్ఎస్–2 కూడా ఉంది. అయినప్పటికీ, ఉపాపై పెట్టిన తీవ్రవాద నేరాలకు బీఎన్ఎస్ వర్తింపు గురించి స్పష్టత లేదు. బీఎన్ఎస్–2లో కొత్తగా జోడించిన వివరణ ప్రకారం, పోలీసు సూపరింటెండెంట్ స్థాయి కంటే తక్కువ స్థాయి లేని అధికారి ఈ నిబంధన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. అధికారి ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుంటారనే దానిపై నిజమైన మార్గదర్శకత్వం లేని ఇది ఒక ఆసక్తికరమైన నిబంధన. చట్టంలోని అనేక సానుకూల అంశాలు మన నేర న్యాయ వ్యవస్థలో ప్రాథమిక పరివర్తనలపై ఆధారపడి ఉంటాయి. దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన, సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా, న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయ వ్యవస్థను బీఎన్ఎస్ఎస్ ఊహించింది. శోధనకు, నిర్బంధానికి సంబంధించిన ఆడియో–వీడియో రికార్డింగ్ తప్పనిసరి అవసరం అనేది పోలీసు పనితీరులో మరింత జవాబుదారీతనం, పారదర్శకత తేవడంలో ఒక ముఖ్యమైన దశ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ, మనం లోతైన నిర్మాణాత్మక అడ్డంకులను పరిష్కరిస్తే తప్ప, సత్వర న్యాయం, సమర్థవంతమైన దర్యాప్తునకు చెందిన లక్ష్యాలను న్యాయబద్ధంగా సాధించలేమని గుర్తించడం చాలా ముఖ్యం. కస్టడీలో సీసీటీవీ కెమెరాలుండాలి అధికంగా ఉన్న ఖాళీలు, ఇప్పటికే అధిక భారం మోస్తున్న న్యాయవ్యవస్థ సమస్యలను పరిష్కరించకుండా సమయపాలనను చేరుకోలేము. విచారణలో ఫోరెన్సిక్ నిపుణుల తప్పనిసరి ప్రమేయం, విచారణ సమయంలో ఆడియో–వీడియో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం (పోలీసుల వాంగ్మూలాల రికార్డింగ్‌తో సహా), మౌలిక సదుపాయాలు, పరికరాలు, సిబ్బంది శిక్షణలో అభివృద్ధి అవసరం. ఫోరెన్సిక్స్‌లో, సామర్థ్య సమస్యలతో పాటు, మన నేర న్యాయ వ్యవస్థలో ఉపయోగించే పద్ధతుల శాస్త్రీయ ప్రామాణికతకు సంబంధించి చాలా లోతైన సమస్య ఉంది. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా దేశంలో ఫోరెన్సిక్ సైన్స్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి గణనీయమైన తోడ్పాటు అవసరం. అయితే ఫోరెన్సిక్, నిపుణుల సాక్ష్యాలకు సంబంధించిన విధానం గురించి ప్రాథమిక ప్రశ్నలు ఎక్కువగా పరిష్కృతం కాలేదు. సమర్థత, న్యాయం గురించి మనం జాగ్రత్త పడినట్లయితే, కస్టడీ హింసను నిరోధించడానికి పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం విధిగా ఉండాలి. ఇవి ఏ నేపథ్యంలో అమలు అవుతాయో తగినంతగా లెక్కించకుండానే మనం తరచుగా సాంకేతికత, సామర్థ్యానికి చెందిన ప్రశ్నలను పరిశీలిస్తాము. మొత్తంగా ఈ చట్టాలు మన నేర న్యాయ వ్యవస్థలో పాతుకు పోయిన అన్యాయాలను సరిదిద్దే అవకాశాలను కోల్పోయాయి. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్బి రెండు వెర్షన్ ల మధ్య మార్పులు ఉన్నాయి, కానీ నేర చట్టానికి సంబంధించిన విధానంలో ఎటువంటి ప్రాథమిక మార్పు వీటిలో లేదు. ఇప్పటికే ఉన్న క్రిమినల్ చట్టాన్ని నిర్వీర్యం చేసే బదులు, ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు మళ్లీ శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసక్తి ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడంగానే ఉంది. – అనూప్ సురేంద్రనాథ్, జెబా సికోరా వ్యాసకర్తలు ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ‘ప్రాజెక్ట్ 39ఏ’లో పనిచేస్తున్నారు. -
33 మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
33 మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు లోక్‌సభ నుంచి 33 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి సహా 33 మందిని సస్సెండ్ చేసిన స్పీకర్ వింటర్ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ గత వారం 14 మంది ఎంపీలు సస్పెన్షన్ జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం ఎస్సీ, ఎస్టీ మహిళలకు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్ కల్పించాలని బిల్లు విపక్షాల ఆందోళన మధ్య బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ బిల్లుకు మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులో బీసీ మహిళలకు సైతం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరిన ఎంపీ విజయసాయిరెడ్డి దాడి ఘటనపై రాజకీయాలా: స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్‌పై దాడి ఘటనపై రాజకీయాలా ఇది చాలా విచారకరం రాజ్యసభ మళ్లీ వాయిదా వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైనా ఆగని ఎంపీల ఆందోళన సభను తిరిగి 2 గంటలకు వాయిదా వేసిన చైర్మన్ పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్షాల పట్టు రాజ్యసభ 11.30 గంటలకు వాయిదా పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై పార్లమెంట్లో రభస ఉభయ సభల్లో విపక్షఎంపీల ఆందోళన ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్ లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నానికి వాయిదా లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పార్లెమంట్ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్షాల పట్టు ఆందోళకు దిగిన ఎంపీలు ప్రశ్నోత్తరాలకు అడ్డుతగిలిగి నినాదాలు చేసిన విపక్షాల సభ్యులు సభను మధ్యాహ్నానికి వాయిదా వేసిన స్పీకర్ విపక్షాల ఆందోళన పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్ష ఎంపీల పట్టు సభలో ఆందోళనకు దిగిన ఎంపీలు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్న ప్రతిపక్షాలు సహకరించాలని కోరిన స్పీకర్ ఓం బిర్లా భద్రతా వైఫల్యంపై ప్రధాని స్టేట్మెంట్కు డిమాండ్ పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్ల డిమాండ్ ఉదయం ఏఐసీసీ చీఫ్ ఖర్గే చాంబర్లో ఇండియా కూటమి నేతల భేటీ ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలంక స్పీకర్ మహింద అభయవర్ధనే స్వాగతం పలికిన స్పీకర్ ఓంబిర్లా పార్లమెంట్ భద్రతా వైఫల్యం..ఖర్గే చాంబర్లో ఇండియా కూటమి నేతల భేటీ పార్లమెంట్లో అలజడి ఘటనపై చర్చిస్తున్న ఇండియా కూటమి నేతలు పార్లమెంట్లో అనుసంచరించాల్సిన వ్యూహంపై కసరత్తు ఇప్పటికే ఘటనపై వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్షాలు పార్లమెంట్లో అలజడి ఘటనపై చర్చించాల్సిందే పార్లమెంట్లో భద్రతా వైఫల్యం సీరియస్ అంశం దీనిపై సభలో చర్చించాల్సిందే బీజేపీ ఎంపీ పాస్‌పై ఆగంతకులు ఎలా వచ్చారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పార్లమెంట్లో అలజడి.. విపక్షాల వాయిదా తీర్మానాలు పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై ఉభయసభల్లో విపక్షాల వాయిదా తీర్మానాలు హోమ్ మంత్రి సమాధానం చెప్పాలని, బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్ 10 గంటలకు ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి నేతల సమావేశం పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న నేతలు పార్లమెంట్లో నేడు కీలక బిల్లులు లోక్ సభలో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు బిల్లులపై చర్చ ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేర్లు మార్పు ఐపీసీకి భారత న్యాయ సంహితగా పేరు సీఆర్పీసీకి భారత నాగరిక సురక్ష సంహిత ఎవిడెన్స్ యాక్టును భారత సాక్ష బిల్లుగా పేరు మార్పు కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన దీని వల్ల న్యాయ ప్రక్రియలో అయోమయం ఏర్పడే అవకాశం ఉందని వాదన -
అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రహ్లాద్ జోషి
ఢిల్లీ: అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ సెషన్ లో 21 బిల్లులు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం నేడు ముగిసింది. ఈ సమావేశానికి 23 పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. పేదల కోసం అనేక అద్భుత పథకాలు తెచ్చాం.. అయిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. పూర్తి స్థాయిలో జరగాల్సిన చివరి సెషన్.. స్వల్ప కాలిక చర్చకు వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విపక్షాలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడు(శనివారం) నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో రెండు జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. వివాదాస్పద ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లును కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశపెట్టనుంది. #WATCH | Delhi: An all-party meeting is underway at the Parliament Library building, ahead of the winter session of Parliament. The winter session of Parliament, 2023 will begin from December 4 and continue till December 22. pic.twitter.com/PSwDtGFyPk — ANI (@ANI) December 2, 2023 శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఐపిసి , సీఆర్పీసీలను మారుస్తూ కొత్త బిల్లులను తీసుకురానున్నారు. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇవి చివరి శీతాకాల సమావేశాలు గమనార్హం. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఇదీ చదవండి: Rajasthan Exit Poll Analysis: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు? -
మూడు బిల్లులపై పరిశీలన ప్రారంభం
న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలి్చన మూడు బిల్లులపై పార్లమెంటరీ స్థాయీసంఘం గురువారం పరిశీలన ప్రారంభించింది. బీజేపీ ఎంపీ, మాజీ ఐపీఎస్ అధికారి బ్రిజ్‌లాల్ నేతృత్వంలో హోంశాఖ వ్యవహారాలపై ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏర్పాటైంది. మూడు బిల్లులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పార్లమెంట్ సభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ను ఉల్లంఘించడమే అవుతుందని డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ ఆక్షేపించారు. తన అభ్యంతరాలు, డిమాండ్లపై మారన్ ఒక లేఖ సమర్పించారు. మారన్ డిమాండ్లకు పలువురు విపక్ష ఎంపీలు మద్దతు పలికారు. మూడు బిల్లులను బీజేపీ సభ్యులు స్వాగతించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు’ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
అట్టహాసంగా ముగిసిన ఫార్మసీ కాంగ్రెస్.. హైదరాబాద్‌లో నెక్స్ట్
సాక్షి, నాగ్‌పూర్: కోవిడ్ మహమ్మారి సమయంలో డాక్టర్లు, నర్సులతో సమానంగా ఫార్మసిస్టులు తమ బాధ్యతలను నిర్వర్తించారని కొనియాడారు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. నాగ్‌పూర్‌లో ఇటీవలే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు జరగ్గా.. కొద్ది రోజులకే ఇండియన్ ఫార్మసీ కాంగ్రెస్ మహాసభలు ఇంత పెద్ద ఎత్తున జరగడం అభినందనీయమన్నారు గడ్కరీ. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోషియేషన్ తరపున 72వ భారతీయ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. జనవరి 20వ తేదీన ప్రారంభం కాగా, కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభోపన్యాసం చేశారు. ఇవాళ్టితో( 22 తేదీతో) మహాసభలు ముగిశాయి. ముగింపు సమావేశాలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హాజరయ్యారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ VG సోమాని అధ్యక్షతన జరిగిన ఈ సభల్లో "యాక్సెస్ టు క్వాలిటీ అండ్ అఫర్డబుల్ మెడికల్ ప్రోడక్ట్స్" అన్న అంశంపై చర్చ జరిగింది. ఈ సభలకు దేశవ్యాప్తంగా పదివేల మంది ఫార్మసీ విద్యార్థులు, రెండున్నర వేల మంది శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, ఫార్మసీ పరిశ్రమల యజమానులు హాజరయ్యారు. ఈ సభల వేదికగా తమ వార్షిక నివేదికను సమర్పించారు ఐపీసీఏ సెక్రటరీ జనరల్, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసొసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టీవీ నారాయణ. భారతీయ ఫార్మసీ రంగ పరిణామ క్రమాన్ని తన నివేదికలో సవివరంగా తెలిపారు. కోవిడ్ సమయంలో మన దేశం ప్రపంచానికి కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్లను అందించిందని, దాని వెనక ఇండియన్ ఫార్మసీల ఘనత ఉందని కొనియాడారు టీవీ నారాయణ. తెలంగాణ నుంచి హాజరైన ఫార్మా ప్రతినిధులు ఈ మహాసభల్లో భారత్ బయోటెక్ అధినేత, పద్మభూషణ్ కృష్ణ ఎల్లా, ప్రపంచ ఫార్మసీ సమాఖ్య అధ్యక్షులు డామ్నిక్ జోర్డాన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ మోంటు పటేల్, కామన్ వెల్త్ దేశాల ఫార్మసీ సంఘ పూర్వ అధ్యక్షులు డాక్టర్ రావు వడ్లమూడి, నాగ్‌పూర్ సభల ఫార్మసీ కాంగ్రెస్ నిర్వహణ ఛైర్మన్ అతుల్ మండ్లేకర్, మహాసభల కార్యదర్శి ప్రొఫెసర్ మిలింద్ ఉమేకర్, ఐపీసీఏ కోశాధికారి డాక్టర్ సి.రమేష్, ఇతర ఫార్మసీ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఫార్మసీ అభ్యసిస్తోన్న వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమ ముఖ్యఅతిథి ఫడ్నవీస్ నాగ్‌పూర్ వేదికగా మూడు రోజులుగా జరిగిన ఫార్మసీ కాంగ్రెస్ సభల్లో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. వంద సంవత్సరాల నాగ్‌పూర్ యూనివర్సిటీ ఫార్మసీ డిపార్ట్మెంట్ పూర్వ విద్యార్థులు వెలువరించిన ప్రత్యేక సంచికను ఫడ్నవీస్ ఆవిష్కరించారు. వచ్చే ఏడాది మహాసభలకు వేదిక హైదరాబాద్ జనవరి 2024లో జరగనున్న 73వ భారతీయ ఫార్మసీ కాంగ్రెస్ మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించాలని ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఏ అధ్యక్షులు టీవీ నారాయణ ప్రకటించారు. తెలంగాణ ఐపీఏ అధ్యక్షులు డాక్టర్ బి.ప్రభాశంకర్ అధ్వర్యంలో జరిగే ఈ మహా సభలకు దేశవ్యాప్తంగా 15 వేల మంది ఫార్మసీ విద్యార్థులు, ఫార్మసీ రంగ ప్రముఖులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఫార్మసీ కళాశాలల సంఘ నాయకులు డాక్టర్ కె.రామదాసు, టి. జైపాల్‌రెడ్డి, పుల్లా రమేష్ బాబు, ఏ.ప్రభాకర్‌రెడ్డి, మొలుగు నరసింహారెడ్డి, బొమ్మా శ్రీధర్, మధుసూధన్‌రెడ్డి, ఇతర ఫార్మసీ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. -
కాలంచెల్లిన చట్టాలో మార్పులు
సాక్షి, హైదరాబాద్ : దేశంలో నేటికీ అమల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలతోపాటు ఇతర పురాతన చట్టాలను పునఃసమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) పరిధిలోని ఏడు విభాగాల పరిధిలో వివిధ చట్టాలకు సంబంధించిన నిబంధనలను సమీక్షించి సూచనలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కార్మిక, తూనిక, కొలతలు, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, విద్యుత్, పురపాలన, వాణిజ్య పన్నుల విభాగాల పరిధిలో పాత చట్టాలను అధ్యయనం చేసి వాటి సరళీకరణతోపాటు ఆయా చట్టాల్లో చేయాల్సిన మార్పులు చేర్పులపై అధ్యయనం చేయాలని సూచించింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తుండటంతో డీపీఐఐటీ కూడా కేంద్రం సూచించిన ఏడు విభాగాల పరిధిలోని చట్టాలకు సంబంధించిన నియమ నిబంధనలను అధ్యయనం చేయాలని కోరుతోంది. రాష్ట్రంలో 25 శాఖల పరిధిలో: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రం ఈ అధ్యయనాన్ని కేవలం కేంద్రం సూచించిన ఏడు విభాగాలకే పరిమితం చేయకుండా పౌర సేవలతో ముడిపడిన అన్ని శాఖలకు వర్తింపచేయాలని ఆదేశించారు. పాత చట్టాలను అధ్యయనం చేయాల్సిన తీరు, వాటి సరళీకరణ, మార్పులు చేర్పులు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలపై డీపీఐఐటీకి చెందిన అధికారుల బృందం శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో వర్క్‌షాప్‌ను నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు ప్రభుత్వ విభాగాలతో పాటు సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మొత్తం 25 రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. పౌర సేవలు సరళీకృతంగా అందించేందుకు అడ్డుగా ఉన్న చట్టాల్లోని నిబంధనలను గుర్తించడం, వాటికి చేయాల్సిన సవరణలను సూచించడం లక్ష్యంగా వర్క్‌షాప్‌లో కేంద్ర బృందం దిశానిర్దేశం చేసింది. చట్టాల్లోని నియమ నిబంధనలను సాకుగా చూపుతూ పౌర సేవలను అందించడంలో ఆలస్యాన్ని తొలగించేందుకు ఈ కసరత్తు దోహదం చేస్తుందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి 31లోగా అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వ విభాగాల వారీగా ప్రణాళికను డీపీఐఐటీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కేంద్ర అధికారుల బృందం గడువు విధించింది. ఈ నేపథ్యంలో డీపీఐఐటీ మార్గదర్శకాలకు అనుగుణంగా 25 రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలో కసరత్తు ప్రారంభం కానున్నది. -
ఐపీసీ (సెక్షన్)171
ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని సైతం ఉల్లంఘిస్తుంటారు. మద్యం, డబ్బు పంపిణీ, నిషేధిత ప్రదేశాల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం తదితరాలకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగడంతో నియమావళిని ఉల్లంఘిస్తే పట్టుకోవడం మరింత సులువవుతుంది. వీటన్నింటిని పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన చట్టాలపై ప్రత్యేక కథనం. సాక్షి,ఆలేరు : ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ప్రజాప్రాతినిధ్య చట్టం (1951) ఐసీసీ సెక్షన్ 171 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. అవి నిరూపితమైతే ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులు అతిక్రమించిన నిబంధనలకు అనుగుణంగా సబ్‌క్లాజ్‌ల వారీగా కేసులు నమోదు చేయాలంటే ముందుగా న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిరూపణ జరిగితే అనర్హుడిగా ప్రకటన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఒక్కోసారి ప్రజాప్రతినిధి పదవికి గండం వచ్చే ప్రమాదముంది. కోడ్ ఉల్లంఘిస్తే సెక్షన్ 171లోని సబ్‌క్లాజ్‌ల కింద కేసులు నమోదు చేస్తారు. వీటి ప్రకారం జరిమానా లేదా జైలు శిక్షతోపాటు జరిమానా కలిపి విధించే అవకాశం ఉంటుంది. ఇవి నిరూపితమైతే ప్రజాప్రాతినిధ్య చట్టం (1961) ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుంది. నేర నిరూపణ జరిగితే అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించే అధికారం ఎన్నికల సెక్షన్–171 (ఎ) అభ్యర్థి ఎన్నికల హక్కులను తెలియజేస్తుంది. ఎన్నికల కోడ్ అమలవుతున్న సమయంలో అభ్యర్థులు చేయదగిన, చేయకూడని పనులను తెలియజేస్తుంది. సెక్షన్– 171(బీ) డబ్బుల పంపిణీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లు , అధికారులకు లంచం రూపంలో డబ్బులు ఇచ్చి ప్రలోభపెట్టాలని చూస్తే కేసు నమోదు చేయవచ్చు. సెక్షన్–171(సీ) స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉన్న చోట ఒత్తిడి తీసుకొచ్చినా, ఓటర్లను బెదిరించినా, ఇతరులకు ఓటు వేస్తే దేవుడు శాపం పెడతాడంటూ చెప్పినా చట్టప్రకారం చర్యలు తీసుకునే వీలుంటుంది. సెక్షన్–171(డీ) ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తులు ఓటర్లను ప్రాంతీయ కులం, మతంవారీగా వేరు చేసి ప్రలోభపెట్టేలా హామీలు ఇవ్వడం, అభివృద్ధి పనులు చేయడం, వ్యక్తిత్వం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు. సెక్షన్–171 (ఈ) ఎన్నికల సందర్భంగా ఓటర్లకు సామూహిక అన్నదానాలు నిర్వహించడం, మద్యంలాంటి పానియాలు అందించడం, వినోద కార్యక్రమాలు ఏర్పాట చేయడం ఈ నిబంధన కిందికి వస్తాయి. సెక్షన్–171 (ఎఫ్) అభ్యర్థులు తమకు కేటాయించిన దాని కన్నా ఎక్కువగా సమయం తీసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా మైకులు వాడడం, ప్రచార సామగ్రి వినియోగం, వార్తలు, ప్రకటనలు ఈ నిబంధనల కిందికి వస్తాయి. సెక్షన్–171 (జీ) అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసేలా తప్పుడు ప్రకటనలు చేయడం నిబంధనలకు విరుద్ధమవుతుంది. సెక్షన్–171 (హెచ్) అక్రమ చెల్లింపులు, నగదు పంపిణీ ఈ సెక్షన్ ప్రకారం నేరమవుతుంది. సెక్షన్–171 (ఐ) ఎన్నికల ఖర్చుకు సంబంధించిన ఖాతాలను ఏర్పాటు చేసి ఎన్నికలు ముగిసిన నెలలోగా ఖర్చుకు సంబంధించిన వివరాలు ఈసీకి సమర్పించడంలో విఫలం చెందితే ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారు. -
విద్యార్థులపై కళాశాల డైరెక్టర్ అరాచకం
విజయవాడ : హాస్టల్ విద్యార్థులపై కళాశాల డైరెక్టర్ దాడి చేసిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కానూరులోని విశ్వ అకాడమీ హాస్టల్ విద్యార్థులు తాము ఉంటున్న హాస్టల్లో చోరీ జరగడంతో డైరెక్టర్‌ను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన డైరెక్టర్ ఫణి కుమార్ ఐదుగురు విద్యార్థులపై పీవీసీ పైపులతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జానకి రాం, తిరుమల్ అనే ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారు రేపు జరిగే నీట్ పరీక్షకు హాజరవడంపై సందేహాలు నెలకొన్నాయి. మద్యం మత్తులో ఉన్న ఫణి కుమార్ తమపై దాడి చేశాడంటూ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడిని అరెస్టు చేశారు. విద్యార్థులపై దాడి చేసిన కారణంగా అతడిపై 324, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పరుష పదజాలం అంటే..
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కామెంట్ పెట్టిన అరెస్ట్ చేసే కుట్ర జరుగుతోందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజేఏసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగుర వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పరుష పదజాలం అంటే కొలమానం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ కక్షతో చేసే ఇలాంటి చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మందకృష్ణ మాదిగ, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌పై రాజకీయ కక్షతో కేసులు పెట్టారని తెలిపారు. ఐపీసీలోని 506, 507 సెక్షన్లను దుర్వినియోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పరుష పదజాలంతో దూషించడాన్ని కోర్టు అనుమతి లేకుండా విచారించదగిన నేరంగా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంను అమల్లోకి తెచ్చిన రోజున ఇలాంటి చట్ట సవరణలు తేవడాన్ని ఆయన వ్యతిరేకించారు. మనుషుల అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. రాజ్యాంగంలో లోపం లేదని, పాలకుల్లో ఉందని.. అందుకే మారుస్తాం అన్న ప్రతిసారి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వివరించారు. రాజకీయాల్లో ఉండాల్సిన అవసరంపై చర్చిస్తున్నామని తెలిపారు. రాజకీయాలు మారకుండా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి నెలలో పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్టు చెప్పారు. -
చట్టాలపై పట్టు సాధించాలి
ఆదిలాబాద్: బాధితులకు సరైన న్యాయం చేయాలంటే న్యాయస్థానంలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసే బాధ్యత పోలీసు అధికారులపై ఉందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నూతన చట్టాలపై ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రాసిక్యూషన్ డైరెక్టర్ వైజయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాధారణంగా పోలీసు అధికారులకు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కేసుల్లో సులువు పరిశోధన చేస్తారని, ప్రస్తుతం మారుతున్న కాలంలో నూతన చట్టాలపై అవగాహన లోపంతో పరిశోధన జరపడంతో న్యాయస్థానంలో కేసులు రుజువు చేయలేకపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రత్యేక చట్టాల్లోని ముఖ్యమైన పద్ధతులను పాటించకపోవడంతో పోలీసు కేసులు న్యాయస్థానాల్లో కొట్టివేస్తున్నారని సూచించారు. చట్టంలోని అంశాలను క్షుణ్ణంగా తెలియక, చట్టాలను కచ్చితంగా అమలు చేయకపోవడంలో జరుగుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రతీ నాలుగో శనివారం అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో వివిధ చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో పరిశోధనలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, నిందితులను శిక్షించే విధంగా ధృడమైన దర్యాప్తు చేయాలన్నారు. అనంతరం అదనపు ఎస్పీ పనసారెడ్డి మాట్లాడుతూ ఎస్పీ ఎం.శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతీనెల నిర్వహించే నేర సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు నూతన చట్టాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్ నిపుణులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసు అధికారులు మరింత రాటుదేలాలని సూచించారు. పోలీసు అధికారులకు సైబర్ నేరాల్లో దర్యాప్తు సామర్థ్యం పెంచేలా కృషిచేయాలని డైరెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా దర్యాప్తులోని ముఖ్య అంశాలైన నేరపరిశోధన, సొత్తు స్వాధీనం, నేరస్థలం పరిశీలించుట, జప్తు, అటాచ్మెంట్, ఇతరుల ఆధీనంలో ఉన్న దస్తావేజులను ఎలా నోటీసులు ఇచ్చి సాక్షులుగా సేకరించవచ్చో అనే అంశాలపై మెలకువలను కొత్తగూడెం జిల్లా అదనపు ప్రాసిక్యూషన్ నిపుణుడు ఫణికుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ దేవేందర్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి, మృత్యుంజయ, కె.శ్రీరాం, మల్లికార్జున్, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
పీసీఐపై నిషేధం తాత్కాలికంగా ఎత్తివేత!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పారా అథ్లెట్లకు ఊరట కలిగించే అంశం ఇది. భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ)పై ఉన్న నిషేధాన్ని తాత్కాలింగా ఎత్తివేస్తున్నట్లు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) ప్రకటించింది. దీంతో రియోలో భారత పారా అథ్లెట్లకు దేశం తరఫున బరిలోకి దిగే అవకాశం దక్కింది. సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీలకు 20 మంది పారా అథ్లెట్లు అర్హత సాధించారు. పారాలింపిక్స్ వరకు మాత్రమే నిషేధాన్ని ఎత్తివేసిన ఐపీసీ... సంస్కరణలు అమలు చేయకుంటే మళ్లీ బ్యాన్ కొనసాగుతుందని తెలిపింది. అం తర్గత సమస్యలు, గ్రూప్ రాజకీయాల వల్ల గతేడాది ఏప్రిల్‌లో పీసీఐపై అంతర్జాతీయ బాడీ నిషేధం విధించింది. -
‘ఐపీసీ'పై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
కొచ్చి: ‘భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)’ 155 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ శిక్షాస్మృతిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జేఎన్‌యూ విద్యార్థులపై దేశద్రోహం కేసులు మోపిన నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాలం చెల్లిన ఐపీసీ చట్టాలను ఇంకా యథాతథంగా కొనసాగిస్తుండటంపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తున్న విషయం తెలిసిందే. ఐపీసీకి 155 ఏళ్లు నిండిన సందర్భంగా కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి మాట్లాడుతూ ‘గత 155 ఏళ్లలో ఐపీసీ చాలా తక్కువ మార్పులకు గురైంది. అతి కొద్ది నేరాలు మాత్రమే శిక్షార్హమైన నేరాల జాబితాలో చేరాయి. ఇప్పడు ఇందులో ఉన్న నేరాలు బ్రిటిషు వారి పాలనా సౌలభ్యం కోసం వారే ఏర్పాటు చేసుకున్నారు. జాబితాలో చేరాల్సిన నేరాలు చాలానే ఉన్నాయి. దీన్ని 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్చాలి. న్యాయవ్యవస్థను పోలీసులు నిబద్ధతతో అమలు చేయాలి. పురాతన పోలీసు వ్యవస్థను కాలానికి అనుగుణంగా మార్చడం మన న్యాయవ్యవస్థ నెరవేర్చాల్సిన కర్తవ్యం’ అని సూచించారు. -
హేయమైన నేరాలైతే ఐపీసీ కిందే విచారణ
న్యూఢిల్లీ: హేయమైన నేరాలకు పాల్పడినట్లయితే 16 నుంచి 18 ఏళ్ల మధ్యనున్న బాలనేరస్తులను ఐపీసీ కిందే విచారిస్తారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. జువెనైల్ చట్టానికి సవరణ చేయడానికి సమ్మతించింది. ఈ విషయాన్ని సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేబినెట్ భేటీ అనంతరం వెల్లడించారు. జువెనైల్ చట్టాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని... నిందితులు అత్యాచారం, హత్య, దోపిడీ, యాసిడ్ దాడి లాంటి హేయమైన నేరాలకు పాల్పడినపుడు శిక్షలు కఠినంగా ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అనాథలు, శిశువిహార్లలోని పిల్లలను దత్తత తీసుకొనే ప్రక్రియను కూడా క్రమద్ధీకరించనున్నారు. పిల్లల సంరక్షణ రంగంలో ఉన్న సంస్థలన్నీ ఇకపై తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. ఈ మేరకు పలు సవరణలతో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును తేనున్నారు. అలాగే రూ. 5,150 కోట్లతో హరియాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో మూడు హైవేల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. -
ఈ సవరణ సరిపోతుందా?
ఢిల్లీతోసహా దేశంలోని పలుచోట్ల ఈశాన్య ప్రాంత వాసులపై కొంతకాలంగా పెరుగుతున్న దాడులు, ఇతరత్రా వేధింపులు ప్రజాస్వామికవాదులను ఆందోళనపరుస్తున్నాయి. ఇలాంటి ఉదంతాలు వెల్లడైనప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హామీలివ్వడం...కొంత వ్యవధి తర్వాత మళ్లీ ఏదో ఒకచోట మరో ఘటన చోటుచేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో భారత శిక్షా స్మృతి(ఐపీసీ)కి సవరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. నిరుడు జనవరిలో ఢిల్లీలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు నిడో తానియాను కొందరు కొట్టి చంపిన ఘటన తర్వాత ఢిల్లీ హైకోర్టు చొరవ తీసుకుని ఈశాన్యప్రాంత వాసుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సు చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంపీ బెజ్బారువా నేతృత్వంలో 11మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఇందుకోసం తీసుకోవాల్సిన ఇతరత్రా చర్యలతోపాటు ఒక పటిష్టమైన చట్టం అవసరం కూడా ఉన్నదని ఆ కమిటీ భావించింది. అయితే, కేంద్రం తాజా నిర్ణయాన్ని గమనిస్తే విడిగా చట్టం కాకుండా ఐపీసీకి సవరణలు తెస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నట్టు కనబడుతున్నది. ప్రభుత్వ యంత్రాంగంలో అలుముకున్న అలసత్వమే ఈశాన్యవాసులపై దాడులు పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు గతంలో పలుమార్లు చెప్పారు. దాడులు జరిగిన సందర్భాల్లో కేసు నమోదు చేయడానికి, చేసినా చురుగ్గా దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించడానికి, ఆ తర్వాత న్యాయస్థానాల్లో విచారణ వేగవంతం కావడానికి పోలీసులు ప్రయత్నించడం లేదన్నది ప్రధాన అభియోగం. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ఈశాన్యప్రాంత వాసుల కోసం ఢిల్లీ పోలీసు శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసినా పెద్దగా ఫలితం కనబడటంలేదు. అయితే, ఈ అలసత్వం కేవలం పోలీసుల్లో మాత్రమే ఉన్నదని చెప్పడం అర్థ సత్యమే అవుతుంది. బెజ్బారువా కమిటీ సిఫార్సుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో సాగిన తాత్సారాన్ని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ కమిటీ నిరుడు జూలైలోనే నివేదిక సమర్పించింది. ఇంతవరకూ ఆ కమిటీ సిఫార్సులపై కేంద్రం ప్రజాభిప్రాయాన్ని సేకరించలేదు. ఇంతకు మించి ఇంకేమి చేయవచ్చునన్న విషయంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోలేదు. బెజ్బారువా కమిటీ అయిదు విలువైన సిఫార్సులు చేసింది. ఈశాన్యవాసులపై వివక్ష చూపడాన్ని బెయిల్‌కు వీలులేని నేరంగా పరిగణించాలని, ఎఫ్ఐఆర్ దాఖలైన రెండు నెలల్లోగా దర్యాప్తు పూర్తికావాలని...90 రోజుల్లో కేసు విచారణ ప్రారంభం కావాలని సూచించింది. అంతేకాదు...డీఎస్పీ లేదా ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని పేర్కొంది. అలాగే, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేక పోలీసు దళాలు ఏర్పాటు చేయాలని, ఇలాంటి కేసుల విషయంలో సున్నితంగా, చురుగ్గా వ్యవహరించేలా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరింది. ఈశాన్య ప్రాంతం గురించి, అక్కడి ప్రజల జీవన విధానం గురించి అవగాహన కలిగేలా...దేశ పురోగతిలో వారి పాత్ర గురించి తెలిసేలా పాఠ్యాంశాలుండాలని అభిప్రాయపడింది. అదే సమయంలో ఈశాన్యప్రాంతంలో ఉన్నత విద్యావకాశాలను పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే, ఈశాన్యప్రాంత వాసులు తమ హక్కులను గుర్తించి, చట్టపరంగా తమకు సమకూరే రక్షణలేమిటో తెలుసుకోవడానికి వీలుగా న్యాయ నిపుణులతో శిబిరాలు ఏర్పాటుచేయాలని తెలిపింది. వీటన్నిటితోపాటు జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను ఈశాన్య ప్రాంతంలో ఏర్పాటు చేయడంద్వారా దేశ పౌరులకు ఆ ప్రాంతంపై అవగాహన పెంపొందించవచ్చునని సూచించింది. వీటన్నిటిపైనా ఎలాంటి చర్యలు తీసుకోదల్చుకున్నారో ఇంతవరకూ ఎవరికీ తెలియదు. ఢిల్లీలో ఈశాన్య ప్రాంత వాసులపై నేరాలు క్రమేపీ పెరుగుతున్నాయని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. 2011లో 27 కేసులు నమోదైతే ఆ మరుసటి ఏడాదికి అవి 44 అయ్యాయి. 2013లో వాటి సంఖ్య 73. నిరుడు ఆ సంఖ్య 139కి చేరుకుంది. ఇందులో హత్యలు, అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకొస్తామంటున్న సవరణలు ఈశాన్య ప్రాంత వాసులపై దాడుల నివారణకు ఎంతవరకూ ఉపయోగపడతాయన్నది అనుమానమే. మాటలద్వారా లేదా సంజ్ఞల ద్వారా ఒక ప్రత్యేక బృందానికి లేదా జాతికి చెందిన వ్యక్తిని, వ్యక్తులను అవమానించడానికి ప్రయత్నిస్తే మూడేళ్ల జైలు, జరిమానా విధించాలని తాజా సవరణ నిర్దేశిస్తున్నది. కేవలం ఇలాంటి చట్టాలద్వారా మాత్రమే అంతా చక్కదిద్దవచ్చునని భావించడం పొరపాటు. ఈశాన్యప్రాంత వాసులపై వివిధ ప్రాంతాల్లో నెలకొన్న దురభిప్రాయాలను గమనిస్తే ఇది అర్ధమవుతుంది. వారిది నేరస్వభావమని, నైతిక విలువలుండవని, దురలవాట్లు అధికమని చాలామంది అభిప్రాయపడుతున్నట్టు వివిధ సర్వేలు లోగడ వెల్లడించాయి. ఈశాన్యవాసులకు చాలా నగరాల్లో ఈ కారణాలవల్ల అద్దెకు ఇళ్లు లభించడం దుర్లభమవుతున్నదని ఆ సర్వేలు తెలిపాయి. శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నా అట్టడుగు కులాల విషయంలోనూ, మైనారిటీ మతస్తుల విషయంలోనూ గూడుకట్టుకుని ఉన్న దురభిప్రాయాలను గమనిస్తే...ఎక్కడో ఈశాన్య ప్రాంతంనుంచి వచ్చినవారిపై మెరుగైన అవగాహన ఉంటుందని భావించలేం. కనుకనే చట్ట సవరణతోపాటు కేంద్రం మరిన్ని విస్తృతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఐపీసీకి తలపెట్టిన సవరణకు సంబంధించిన బిల్లు త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదంటున్నారు. దీని సంగతెలా ఉన్నా బెజ్బారువా కమిటీ ఇతర సిఫార్సులపై కేంద్రం విస్తృతమైన, లోతైన అధ్యయనం చేయాలి. నిపుణుల అభిప్రాయాలను సేకరించాలి. అలాగే ఉపాధి నిమిత్తం, చదువుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఈశాన్యప్రాంత వాసుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటివేమీ జరగకుండా చట్టపరమైన చర్యలతో సరిపెడితే అది పెద్దగా ఫలితాన్నీయదు. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలి. -
బ్రహ్మాస్త్రం దుర్వినియోగమవుతుందా ?