రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పారా అథ్లెట్లకు ఊరట కలిగించే అంశం ఇది.
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పారా అథ్లెట్లకు ఊరట కలిగించే అంశం ఇది. భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ)పై ఉన్న నిషేధాన్ని తాత్కాలింగా ఎత్తివేస్తున్నట్లు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) ప్రకటించింది. దీంతో రియోలో భారత పారా అథ్లెట్లకు దేశం తరఫున బరిలోకి దిగే అవకాశం దక్కింది.
సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీలకు 20 మంది పారా అథ్లెట్లు అర్హత సాధించారు. పారాలింపిక్స్ వరకు మాత్రమే నిషేధాన్ని ఎత్తివేసిన ఐపీసీ... సంస్కరణలు అమలు చేయకుంటే మళ్లీ బ్యాన్ కొనసాగుతుందని తెలిపింది. అం తర్గత సమస్యలు, గ్రూప్ రాజకీయాల వల్ల గతేడాది ఏప్రిల్‌లో పీసీఐపై అంతర్జాతీయ బాడీ నిషేధం విధించింది.