rio olympics
-
పదే పదే అదే ప్రశ్న.. పీవీ సింధు ఆన్సర్ ఇదే
PV Sindhu Comments: తమ అభిమాన ఆటగాళ్ల రికార్డులతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్షిప్ స్టేటస్ ఏమిటన్న అంశంపై క్యూరియాసిటీ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇంటర్వ్యూ చేసే వాళ్లు కూడా సెలబ్రిటీలను ఇలాంటి విషయాల గురించి అడగటం కామన్. బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది. ఆట గురించి కాకుండా పదే పదే ఆమె వ్యక్తిగత విషయాల గురించి అడగటంతో దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది సింధు. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సింధును.. మీ రిలేషన్ స్టేటస్ ఏమిటని అడగగా.. సింగిల్ అని బదులిచ్చింది. ‘‘ప్రస్తుతం బ్యాడ్మింటన్ మీదే నా ధ్యాస. ఒలింపిక్స్‌లో మరో మెడల్ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొంది. అనంతరం.. ‘‘మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు’’ అని మరో ప్రశ్న ఎదురుకాగా.. ‘‘ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. అయితే, ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో డెస్టినీలో ఉంటుంది. నా నుదిటి రాతపై ఏది ఉంటే అదే జరుగుతుంది’’ అని ఈ ఒలింపియన్ సమాధానమిచ్చింది. ఆ తర్వాత మరో ప్రశ్న.. ‘‘మీరు ఎవరితో అయినా డేటింగ్ చేశారా?’’.. ఈసారి సింధు.. ‘‘లేదు.. అస్సలు లేదు’’ అని బదులిచ్చింది. అదే విధంగా.. ‘‘అసలు ఇలాంటి విషయాల గురించి అంతగా ఆలోచించే పనిలేదు. జీవితం అలా సాగిపోతుందంతే! ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది’’ అని బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుత ఆట తీరుతో ఎవరికీ సాధ్యం కాని రీతిలో కాగా.. పూసర్ల వెంకట సింధు ఇప్పటికే రెండుసార్లు విశ్వక్రీడల్లో పతకాలు సాధించింది. రియో ఒలింపిక్స్-2016లో రజతం గెలిచిన ఈ బ్యాడ్మింటన్ స్టార్.. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం అందుకుంది. తద్వారా రెండుసార్లు ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. ఇక ప్రస్తుతం సింధు దృష్టి మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడంపైనే కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో ఇప్పటికే బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణే మార్గదర్శనంలో ముందుకు సాగేందుకు సిద్ధమైంది. ప్రకాశ్ సర్ కేవలం తన మెంటార్, గురు మాత్రమే కాదని.. మంచి స్నేహితుడిలా తనను గైడ్ చేస్తూ ఉంటారని సింధు ఒక సందర్భంలో చెప్పింది. చదవండి: WC T20: గాయాలతో హార్దిక్ సతమతం.. బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక అతడికే పగ్గాలు.. -
సింధుకు సులువు
టోక్యో: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు తాజా ఒలింపిక్స్‌లో సులువైన ‘డ్రా’ ఎదురైంది. ఆరో సీడ్‌గా ఉన్న సింధు మహిళల సింగిల్స్ గ్రూప్ ‘జె’లో తన పోరును ప్రారంభించనుంది. ఇందులో సింధుతో పాటు హాంకాంగ్‌కు చెందిన చెంగ్ గాన్ యి (ప్రపంచ 34వ ర్యాంకర్), ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పొలికర్పొవా (58) ఉన్నారు. సింధు స్థాయితో పోలిస్తే వీరిద్దరు బలహీన ప్రత్యర్థులే. వీరిద్దరిపై సింధు రికార్డు 5–0, 2–0గా ఉంది. మొత్తం 16 గ్రూప్‌లు ఉండగా ఒక్కో గ్రూప్‌నుంచి ఒక్కో ప్లేయర్ ముందంజ వేస్తారు. ఆపై నాకౌట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. సంచలనాలు లేకపోతే సింధు క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన యామగూచితో తలపడే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ ముందంజ వేయాలంటే తన గ్రూప్‌లో ఉన్న మార్క్ కాల్జో (29; నెదర్లాండ్స్), జిల్బర్మన్ (47; ఇజ్రాయెల్)లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రిక్వార్టర్స్‌లో అతను లాంగ్ ఆంజస్ (హాంకాంగ్)ను ఓడించగలిగితే జపాన్ స్టార్, ఫేవరెట్ మొమొటాను క్వార్టర్స్‌లో ఎదుర్కోవాల్సి రావచ్చు. -
‘టోక్యో’లో పాల్గొంటా: స్ప్రింటర్ శ్రాబణి
న్యూఢిల్లీ: ఎలాగైనా టోక్యో ఒలింపిక్స్ 100, 200 మీటర్ల ఈవెంట్లలో పాల్గొనడమే తన లక్ష్యమంటోంది భారత స్ప్రింటర్ శ్రాబణి నందా. ఈ ఏడాది ఆరంభం నుంచే జమైకాలో తన శిక్షణను కొనసాగిస్తోన్న శ్రాబణి... రియో ఒలింపిక్స్‌లో 200 మీటర్ల పరుగులో హీట్స్‌లో ఆరో స్థానంతో నిష్క్రమించింది. 100, 200 మీటర్ల పరుగు ఈవెంట్లకు టోక్యో అర్హత ప్రమాణం వరుసగా 11.15 సెకన్లు; 22.80 సెకన్లు కాగా... శ్రాబణి అత్యుత్తమ ప్రదర్శన ఈ రెండింట్లో వరుసగా 11.45 సెకన్లు, 23.07 సెకన్లుగా ఉంది. 29 ఏళ్ల శ్రాబణి ఈ వారం మొదట్లో కింగ్‌స్టన్‌లో జరిగిన వెలాసిటీ ఫెస్ట్ ఈవెంట్లో 100 మీటర్లలో పోటీపyì మూడో స్థానం పొందింది. -
ఆ గెలుపే కీలక మలుపు
ముంబై: అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అద్వితీయ విజయాలు సాధించిన హైదరాబాద్ అమ్మాయి, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు... 2012లో సాధించిన ఓ గెలుపు తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని గుర్తు చేసుకుంది. చైనా ఓపెన్ సందర్భంగా నాటి లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్‌ని ఓడించడం తన ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసిందని చెప్పింది. సీనియర్ విభాగంలో అప్పటివరకు తొలి రౌండ్, క్వాలిఫయర్స్‌లో ఎదురైన ఓటములతో ఆవరించిన నిరాశ ఆ మ్యాచ్ గెలుపుతో ఎగిరిపోయిందని తన కెరీర్ తొలినాళ్లను తలుచుకుంది. నాడు 16 ఏళ్ల సింధు 2012 చైనా మాస్టర్స్ టోర్నీ క్వార్టర్స్‌లో లీ జురుయ్‌పై అద్భుత విజయాన్ని సాధించి వెలుగులోకి వచ్చింది. ఆ మరుసటి ఏడాదే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో తన సత్తాను ప్రపంచానికి చాటింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 5 ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలతో పాటు, ఒలింపిక్స్ రజతం ఉంది. ‘ఇన్ ద స్పోర్ట్‌లైట్’ షో సందర్భంగా టీటీ ప్లేయర్ ముదిత్ డానీతో సింధు పలు అంశాలపై ముచ్చటించింది. పొరపాటేంటో తెలిసేది కాదు... తొలి నాళ్లలో నా ఆట బాగానే ఉండేది. కానీ అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగకపోయేది. తరచుగా క్వాలిఫయింగ్ , తొలి రౌండ్లలోనే ఓడిపోయేదాన్ని. ఇంకా కష్టపడాలేమో అనుకొని తీవ్రంగా ప్రాక్టీస్ చేసేదాన్ని. అయినా ఓటములు ఎదురయ్యేవి. చాలా నిరాశగా ఉండేది. నా పొరపాటేంటో అర్థమయ్యేది కాదు. మిగతా వారిలాగే కష్టపడ్డా గెలుపు మాత్రం అందకపోయేది. దృక్పథం మారిందలా... 2012లో లండన్ ఒలింపిక్స్ చాంపియన్ చాంపియన్ లీ జురుయ్‌పై గెలవడంతో నా దృక్పథం మొత్తం మారిపోయింది. నా కెరీర్లో అదే టర్నింగ్ పాయింట్. నాటి నుంచి ప్రతీరోజు, ప్రతీ ఏడాదీ నా ఆటను మెరుగు పరుచుకుంటూనే ఉన్నా. బహుమతిగా అభిమాని నెలజీతం... రియోలో నా ప్రదర్శన మెచ్చి నేను హైదరాబాద్ రాగానే ఒకతను తన నెల జీతాన్ని బహుమతిగా ఇవ్వడం ఇంకా గుర్తుంది. అతని అభిమానానికి గుర్తుగా ఒక లేఖతో పాటు కొంత డబ్బు అతనికి పంపించా. -
ఒకే ఒక్కడు... కిప్‌చెగో
వియన్నా: గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను కెన్యా రన్నర్, రియో ఒలింపిక్స్ చాంపియన్ ఇలియుడ్ కిప్‌చెగో సాధించాడు. 42.195 కిలోమీటర్ల పురుషుల మారథాన్ రేసును 2 గంటల్లోపు పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా కిప్‌చెగో గుర్తింపు పొందాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో శనివారం ప్రత్యేకంగా జరిగిన మారథాన్ రేసులో 34 ఏళ్ల కిప్‌చెగో గంటా 59 నిమిషాల 40.2 సెకన్లలో గమ్యానికి చేరాడు. అయితే ఇది అధికారికంగా గుర్తింపు పొందిన మారథాన్ రేసు కాకపోవడంతో కిప్‌చెగో ఘనత రికార్డు పుస్తకాల్లో చేరడం లేదు. ప్రస్తుత మారథాన్ ప్రపంచ రికార్డు కిప్‌చెగో పేరిటే ఉంది. గత ఏడాది బెర్లిన్ మారథాన్‌లో కిప్‌చెగో 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శనివారం వియన్నాలో జరిగిన మారథాన్ రేసును తిలకించేందుకు కిప్‌చెగో స్వదేశం కెన్యాలోని వీధుల్లో ప్రత్యేకంగా టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది అభిమానులు కిప్‌చెగో ఘనతను టీవీల్లో వీక్షించారు. రెండేళ్ల క్రితం ఇటలీలో కిప్‌చెగో 2 గంటల్లోపు మారథాన్ రేసును పూర్తి చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో మాత్రం అతను సఫలమై తన ప్రత్యేకతను చాటుకున్నాడు. -
16 ఏళ్ల రికార్డు బద్దలు
డెస్ మొయినెస్ (అమెరికా): రియో ఒలింపిక్స్ చాంపియన్ దలీలా మొహమ్మద్ మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అమెరికాకు చెందిన 29 ఏళ్ల ఈ అథ్లెట్ యూఎస్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల మహిళల హర్డిల్స్ రేసును 52.20 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో 16 ఏళ్ల క్రితం 2003లో యులియా పెచొంకినా (రష్యా) నెలకొల్పిన 52.34 సెకన్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి బంగారు పతకం చేజిక్కించుకుంది. దోహా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అమెరికా జట్టు ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో దలీలా ఈ ఘనత సాధించింది. అయితే ఈ కొత్త ప్రపంచ రికార్డు విషయం తనకు కోచ్ చెబితేగానీ తెలియదని ఆమె చెప్పింది. పురుషుల 200 మీటర్ల పరుగు పందెంలో అమెరికా స్టార్ నోవా లైల్స్ విజేతగా నిలిచాడు. అతను అందరికంటే ముందు పరుగును 19.78 సెకన్లలో పూర్తి చేయగా... క్రిస్టియాన్ కోల్మన్ (20.02 సెకన్లు) రజతం, అమీర్ వెబ్ (20.45 సెకన్లు) కాంస్యం గెలుపొందారు. -
రియో పతకాలే అమూల్యం
న్యూఢిల్లీ: వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో 6 పతకాలు సాధించడం గొప్ప అనుభూతి అని అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం, 28 ఒలింపిక్స్ పతకాల విజేత మైకేల్ ఫెల్ప్స్ గుర్తు చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం భారత్ వచ్చిన ఈ దిగ్గజ స్విమ్మర్ తన రిటైర్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోనని స్పష్టం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ తను బరిలోకి దిగిన 8 ఈవెంట్లలోనూ స్వర్ణాలను సాధించడం విశేషం. రియోలో 5 స్వర్ణాలే గెలుచుకున్నప్పటికీ ఈ ప్రదర్శన... బీజింగ్ ప్రదర్శనకు ఏమాత్రం తీసిపోదని చెప్పుకొచ్చాడు. ‘గణాంకాల ప్రకారం బీజింగ్ ఒలింపిక్స్ గొప్ప. కానీ 2012 లండన్ ఒలింపిక్స్ అనంతరం నా వ్యక్తిగత జీవితం బాగో లేదు. డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఓ దశలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించా. కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించా. అనంతరం 2014లో మళ్లీ స్విమ్మింగ్‌ను మొదలుపెట్టాక రియో వరకు నా ప్రయాణం ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎన్నో ఆటు పోట్ల అనంతరం నాపై నేను నమ్మకాన్ని కోల్పోకుండా రియోలో పతకాలు సాధించా. అందుకే రియో ప్రదర్శనే నాకు ముఖ్యం’ అని ఫెల్ప్స్ వివరించాడు. -
తై జుకు సింధు చెక్
రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తై జు యింగ్‌పై సింధు విజయం సాధించింది... అంతే ఆ తర్వాత ఆమెను ఈ చైనీస్ తైపీ ప్రత్యర్థి వెంటాడింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు సార్లు తై జు ముందు సింధు తలవంచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, వ్యూహాలు మార్చినా తెలుగమ్మాయికి విజయం మాత్రం దక్కలేదు. ఎట్టకేలకు ఆమె ప్రత్యర్థి అడ్డుగోడను ఛేదించింది. అద్భుత ప్రదర్శనతో తై జును ఓడించి పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. తొలి గేమ్‌ను కోల్పోయినా ఆ తర్వాత సింధు కోలుకున్నతీరు అసమానం. గ్వాంగ్జౌ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎట్టకేలకు ప్రపంచ నంబర్‌వన్ తైజు యింగ్ సవాల్‌ను ఛేదించింది. తనకు పదేపదే పరాజయాన్ని చవిచూపిస్తున్న చైనీస్ తైపీ ప్రత్యర్థిని కసిదీరా ఓడించింది. సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ ఈవెంటైన వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో గ్రూప్ ‘ఎ’ మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగుతేజం, ఒలింపిక్ రన్నరప్ సింధు 14–21, 21–16, 21–18తో తై జును కంగుతినిపించింది. తొలి గేమ్‌లో ప్రతికూల ఫలితం వచ్చినా... తర్వాత గేముల్లో పట్టుదలతో ఆడింది. చివరి దాకా పట్టుసడలించకుండా ఆడిన సింధు 2–1 గేమ్‌లతో ప్రత్యర్థిని ఓడించింది. మొదటి 16 నిమిషాల పాటు జరిగిన తొలి గేమ్‌లో తై జు జోరే కనబడింది. అనవసర తప్పిదాలతో పాటు విన్నర్స్ కొట్టడంలో విఫలమైన సింధు 2–6తో వెనుకబడింది. స్మాష్‌లు, రిటర్న్ షాట్లతో తై జు తన ఆధిక్యాన్ని 17–12కు పెంచుకుంది. కాసేపటికే మరో నాలుగు పాయింట్లు సాధించిన తైపీ నంబర్‌వన్ తొలి గేమ్‌ను 21–14తో ముగించింది. ఇక రెండో గేమ్‌లో మాత్రం సింధు జాగ్రత్తగా ఆడింది. గేమ్ మొదలైన కాసేపటికే 6–3తో తన ఆధిపత్యాన్ని చాటింది. సుదీర్ఘ ర్యాలిలో మరింత దూకుడు కనబర్చిన సింధు మెరుపు షాట్లతో విరుచుకుపడింది. చూస్తుండగానే 11–6కు చేరిన ఆమె... ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు సాధించి గేమ్ ను చేజిక్కించుకునేదాకా చెమటోడ్చింది. 19–13 స్కోరుకు చేరాక సింధు ఈ గేమ్‌ను క్షణాల వ్యవధిలోనే తన వశం చేసు కుంది. చివరి గేమ్‌లో మొదట 0–3తో వెనుకబడిన భారత స్టార్ మ్యాచ్ సాగుతున్న కొద్ది టచ్‌లోకి వచ్చింది. 11–12 స్కోరుతో ప్రత్యర్థిని నిలువరించిన ఆమె క్రాస్ కోర్టు రిటర్న్ షాట్లతో తై జు యింగ్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరికి గేమ్ తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’ పోరులో సమీర్ వర్మ 21–16, 21–7తో వరుస గేముల్లో టామి సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచాడు. -
బజరంగ్‌పైనే ఆశలు
బుడాపెస్ట్ (హంగేరి): ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి జోరు మీదున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ (65 కేజీలు)... పసిడి పతకమే లక్ష్యంగా ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనున్నాడు. నేటి నుంచి ఈనెల 28 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో 30 మంది సభ్యులుగల భారత బృందం పోటీ పడనుంది. మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) పతకం తెచ్చే అవకాశముంది. -
లాల్బియాకిమా సంచలనం
అస్తానా (కజకిస్తాన్): 22 ఏళ్ల భారత బాక్సర్ లాల్బియాకిమా ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన 49 కేజీల విభాగం ఫైనల్లో లాల్బియాకిమా 4–1తో హసన్‌బోయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేశాడు. హసన్‌బోయ్ రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కావడం విశేషం. ఒక డిఫెండింగ్ ఒలింపిక్ విజేతను భారత బాక్సర్ ఓడించడం ఇదే మొదటిసారి. మిజోరాంకు చెందిన లాల్బియాకిమా తాజా విజయంతో టోర్నీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. -
పోరాడి ఓడిన భారత్
ఇఫో(మలేసియా): స్టార్ ఆటగాళ్లు లేకున్నా... సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ తొలి లీగ్ మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ అర్జెంటీనాకు భారత్ గట్టిపోటీ ఇచ్చింది. తుదికంటా పోరాడి ఓడిపోయినా ఆ ఓటమిలో గౌరవం కనిపించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 2–3 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. స్టార్ డ్రాగ్ ఫ్లికర్ గొంజాలో పిలాట్ (13వ, 24వ, 33వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ తరఫున అమిత్ రొహిదాస్ (26వ, 31వ నిమిషాల్లో) రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో నమోదైన ఐదు గోల్స్ కూడా పెనాల్టీ కార్నర్ల రూపంలోనే రావడం విశేషం. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. తొలి పది నిమిషాల్లో బంతిపై ఆధిపత్యం చలాయించిన భారత్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ సమయంలో అర్జెంటీనాకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. వాటిలో తొలి షాట్‌ను భారత డిఫెండర్లు అడ్డుకోగా... పిలాట్ కొట్టిన రెండో షాట్‌కు తిరుగులేకుండా పోయింది. దీంతో మ్యాచ్ ప్రారంభమైన 13వ నిమిషంలో అర్జెంటీనా తొలి గోల్ నమోదు చేసి 1–0తో ముందంజ వేసింది. 24వ నిమిషంలో పిలాట్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో 2–0తో అధిక్యాన్ని పెంచుకుంది. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలో భారత్‌కు మూడు పెనాల్టీ కార్నర్లు లభించాయి. వాటిలో తొలి రెండు వృథా కాగా... మూడో ప్రయత్నంలో అమిత్ రొహిదాస్ గోల్‌గా మలచడంతో భారత్ 1–2తో ఆధిక్యాన్ని తగ్గించింది. 31వ నిమిషంలో అమిత్ మరో గోల్ చేయడంతో 2–2తో స్కోరు సమమైంది. అనంతరం పిలాట్ మరో గోల్ చేయడంతో అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సమయంలో మ్యాచ్‌కు వర్షం అడ్డుపడటంతో దాదాపు గంట పాటు ఆట నిలిచిపోయింది. తిరిగి ఆట ఆరంభమయ్యాక భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినా స్కోరును సమం చేయలేకపోయారు. -
బాహుబలులను పంపుతున్నాం: రష్యా
మాస్కో: ఒలింపిక్స్‌లో పతకాలు గెలవటంలో పోటీపడే దేశాలలో రష్యా ఒకటి. అయితే దక్షిణ కొరియాలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌లో రష్యా పాల్గొంటుందా లేదా అనేది సగటు క్రీడాభిమానులకు కలిగిన సందేహం. గత కొన్ని రోజులుగా ప్రపంచమంతా ఈ అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. శీతాకాల ఒలింపిక్స్‌లో రష్యా పాల్గొనటంపై ఎందుకింత చర్చ అనుకుంటున్నారా.. రియో ఒలింపిక్స్‌లో కొంత మంది ఆటగాళ్లు డోపింగ్‌లో పట్టుబడంటంతో రష్యా అపఖ్యాతి మూటగట్టుకుంది. దీంతో శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొంటుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నామని రష్యా ప్రకటించింది. రష్యా ప్రకటనతో ఒలింపిక్ అభిమానుల అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఎందుకంటే ఒలింపిక్‌లో రష్యా అథ్లెట్స్ ప్రదర్శన అలాంటిది. అథ్లెట్స్ సంఖ్య తగ్గినా పతకాలు తెచ్చే 169మంది బాహుబలులను పంపుతున్నామని రష్యా ప్రకటించింది. ఈ సంఖ్య గతంలో జరిగిన ఒలింపిక్స్ పోటీలకు పంపిన అథ్లెట్ల కంటే తక్కువే ఉంది. రియో ఒలింపిక్స్‌కి 232 మందిని, వాంకోవర్ ఒలింపిక్స్‌కి 177 మందిని పంపింది. రష్యా అథ్లెట్లను శీతాకాల ఒలింపిక్స్‌కి పంపకపోతే ఆ దేశ జెండా, జాతీయ గీతం ప్రదర్శనలో ఉండబోదని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ముందే హెచ్చరించింది. ఒలింపిక్స్ ప్యానెల్ నిర్వహించే డోపింగ్ పరీక్షలోనూ నెగ్గాలని, లేకపోతే ఆదేశం నిర్వహించిన పరీక్షలపై అనుమానాలు కలిగే అవకాశం ఉంటుందని ఐఓసీ తెలిపింది. -
ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు
గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో పరాజయం... ఈ ఏడాది ఆగస్టులో వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమి... ఇప్పుడు తాజాగా సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో అదే ఫలితం.... పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో విక్టరీకి ‘ఫినిషింగ్ టచ్’ ఇవ్వలేకపోయింది. ఫైనల్లో పరాజయం అనంతరం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఓటమికంటే ఓడిన తీరు తనను ఎక్కువగా బాధ పెట్టిందని తెలిపింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే... ఫైనల్ పరాజయంపై... చాలా బాధగా ఉంది (ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ)... వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా ఇలాగే జరిగింది. మ్యాచ్ ముగిశాక చాలా సేపు వరకు కూడా కోలుకోలేదు. నా బాధను దాచుకోలేక ఒంటరిగా వెళ్లి ఏడ్చేశాను. చాలా కష్టపడి చాలా బాగా ఆడిన మ్యాచ్ ఇది. అసలు ఎలా ఓడానో అర్ధం కావడం లేదు. 19–19 వద్ద ఉన్నప్పుడు కూడా పరాజయం గురించి భయపడలేదు. నా వైపు నుంచి ఎలాంటి అనవసర తప్పిదాలు చేయలేదు. ఆఖరి రెండు పాయింట్లపై... నిజానికి ఆ రెండు కూడా నేను ర్యాలీలుగానే ఆడాలని భావించాను. దురదృష్టవశాత్తూ షటిల్స్ నెట్‌ను దాటలేకపోయాయి. వాటిలో ఒక్క పాయింట్ వచ్చినా ఫలితం భిన్నంగా ఉండేదేమో. మ్యాచ్ నాణ్యత గురించి చెప్పాలంటే అంతా గొప్పగా సాగింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే లీగ్ మ్యాచ్‌లో నేను ఓడించిన యామగుచి వేరు. ఫైనల్లో ఆడిన యామగుచి వేరు. ఫిట్నెస్పరంగా సమస్యలు... ఇంత సుదీర్ఘమైన మ్యాచ్‌లో అలసిపోవడం, మధ్యలో ఆటగాళ్లు ఇబ్బంది పడటం సహజం. ఆమెకు కూడా అలాగే అయింది. ఇటీవల చాలా మంది ర్యాలీలు ఎక్కువగా ఆడుతున్నారు. దానికి నేను కూడా సిద్ధమయ్యే వచ్చాను. అయితే డిఫెన్స్ కూడా బలంగా ఉండటం ముఖ్యం. ఆటపరంగా గెలిచేందుకు నేను ఏం చేయగలనో అంతా చేశాను కానీ చివర్లో అంతా చేజారింది. కీలక ఫైనల్ మ్యాచ్‌లలో ఓటములపై... నాకు కూడా ఫైనల్ ముగిశాక ఒకుహారా మ్యాచే గుర్తుకొచ్చింది. ఆటలో గెలుపోటములు సహజం కానీ కొన్ని విషయాల్లో నేను మరింత మెరుగు పడాల్సి ఉంది. 2017 సంవత్సరం చాలా బాగా సాగింది. నా కెరీర్లో ఒకే ఏడాది ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన సంవత్సరం ఇది. ఫైనల్స్‌లో గెలిస్తే ఇంకా బాగుండేది కానీ రన్నరప్ కూడా మంచి ఫలితమే. వచ్చే ఏడాది కొత్తగా మళ్లీ మొదలు పెడతాను. వరల్డ్ నంబర్‌వన్ కూడా సాధించే అవకాశం ఉంటుంది కదా. ‘చాలా హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఇద్దరూ బాగా ఆడారు. ఇద్దరూ గెలిచేలా కనిపించారు. అయితే యామగుచి కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించింది. చివర్లో సింధు కొంత అలసిపోవడంతో కొన్ని సార్లు అనుకున్న రీతిలో సరైన షాట్లతో స్పందించలేదు. కాస్త జలుబుతో కూడా బాధపడుతుండటంతో పదే పదే విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆటపరంగా నేను సంతృప్తి చెందాను. గత మ్యాచ్‌లలో ప్రదర్శనను బట్టి సింధు గర్వపడవచ్చు. ఈ ఓటమితో ఆమె బాధ పడటం సహజం. 2017లో ఆమె వరుసగా పెద్ద సంఖ్యలో టోర్నీలు ఆడింది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోకుండానే గెలిచింది. సుదీర్ఘ ర్యాలీలు సహజంగా మారుతున్నాయి కాబట్టి సమస్య లేదు. ఇక్కడ కొంత అలసట కనిపించినా... నా దృష్టిలో ఫిట్నెస్పరంగా బ్యాడ్మింటన్ సర్క్యూట్లో ఆమె అత్యుత్తమ క్రీడాకారిణులలో ఉంటుంది. కాబట్టి నాకు ఆమె ఫిట్నెస్ గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఆమె తన తప్పులు సరిదిద్దుకొని మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. – ‘సాక్షి’తో పుల్లెల గోపీచంద్, భారత కోచ్ -
'రియోకు వెళ్లకుండా ఉండాల్సింది'
గ్లాస్కో: గతేడాది రియో ఒలింపిక్స్ కు వెళ్లి పెద్ద పొరపాటు చేశానని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తాజాగా స్పష్టం చేశారు. ఆ మెగా ఈవెంట్ కు వెళ్లకుండా ఉండే బాగుండేదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్లాస్కోలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ లో సెమీస్ కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్న నేపథ్యంలో సైనా మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా దాదాపు ఏడాది పాటు ఎదురైన పరాజయాల్ని గుర్తు చేసుకున్నారు. ' నేను రియోకు వెళ్లకుండా ఉండాల్సింది. నాకు గాయం అంత పెద్దదనే విషయం నాకు అప్పుడు తెలియదు. రియో ఒలింపిక్స్ లో ఆదిలోనే నిష్క్రమించడం చాలా బాధించింది. నా తల్లిదండ్రులు, కోచ్ సాయంతో తిరిగి పుంజుకున్నా. ఇంకా కుడి మోకాలు ఇబ్బందిగానే ఉంది'అని సైనా తెలిపింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో సెమీస్ కు చేరడం సంతోషం కల్గించిందని సైనా పేర్కొంది. ఈ చాంపియన్ షిప్ లో తనకు కష్టమైన డ్రా ఎదురుకావడంతో పతకం సాధిస్తానని అనుకోలేదన్న సైనా.. సెమీస్ కు చేరడం ఒక గొప్ప అనుభూతిని తీసుకొచ్చిందని తెలిపింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-19, 18-21, 21-15 తేడాతో స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్‌మార్‌పై గెలుపొంది సెమీస్ బెర్తును పతకాన్ని ఖాయం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో సైనా తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఈరోజు జరిగే సెమీ ఫైనల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది. -
ఒలింపిక్ హర్డిల్స్ చాంప్ రోలిన్స్‌పై నిషేధం
లాస్ఏంజిల్స్: గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన అమెరికా అథ్లెట్ బ్రియానా రోలిన్స్‌పై ఏడాదిపాటు నిషేధం విధించారు. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించి... పోటీలు లేని సమయంలో తన ఆచూకీ వివరాలు వెల్లడించనందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా యాంటీ డోపింగ్ ఏజెన్సీ (యూఎస్‌ఏడీఏ) ప్రకటించింది. ఈ నిర్ణయంతో రోలిన్స్ గత ఏడాది సెప్టెంబరు 27 నుంచి సాధించిన ఫలితాలు చెల్లుబాటుకావు. అంతేకాకుండా వచ్చే ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అర్హత కోల్పోయింది. -
పీవీ సింధూ వాలీబాల్ ప్లేయరా!
హైదరాబాద్ : ఇటీవలే బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివానంటూ వ్యాఖ్యానిస్తూ అందరిన్నీ ఆశ్చర్యపరిచిన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జలీల్ ఖాన్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే పీవీ సింధూని వాలీబాల్ ప్లేయరంటూ తనకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. చార్మినార్‌లో శుక్రవారం 5కే రన్ ప్రొగ్రామ్ కోసం వచ్చిన పీవీ సింధూని ఏఐఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వాలీబాల్ ప్లేయర్ గా అభివర్ణించారు. రన్ ప్రారంభోత్సవ ప్రసంగంలో పాల్గొన్న ముంతాజ్ ఈ రన్‌ను నిర్వహిస్తున్న ఆర్గనైజర్లందరికీ, స్టేజ్‌పై ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం పీవీ సింధూని ప్రస్తావించే సమయంలో కొంత తడబడిన ఎంఎల్ఏ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెవిలో ఏదో గుసగుసలాడి, హైదరాబాద్ తరుఫున వాలీబాల్ ప్లేయర్‌గా ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్‌పై ఆడిన సింధూకి తాము థ్యాంక్సూ చెబుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఎంఎల్ఏ పొరపాటున తనను వాలీబాల్ ప్లేయర్ అనడంతో పీవీ సింధూ చిన్న నవ్వు నవ్వేసి ఊరుకున్నారు. కాగా సింధూ పేరెంట్స్ మాజీ వాలీబాల్ ప్లేయర్స్. కానీ సింధూకి బ్యాడ్మింటన్ మీద ఉన్న ఆసక్తితో ఆమె సంచనాలు సృష్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రజత పతకాన్ని కూడా సాధించారు. మన లీడర్లకు నాన్-పొలిటికల్ వ్యవహారాలపై ఏమేర నాలెడ్జ్ ఉందో ఇటీవల ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్న అంశాల వల్ల బయటపడుతున్నాయి. -
మెరిశారు మురిపించారు
అంతర్జాతీయ క్రీడాంగణంలో ఈ ఏడాదీ ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. రియో ఒలింపిక్స్ అందరి దృష్టిని ఆకర్షించగా... విశ్వక్రీడల వేదికపై అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ పలువురు స్టార్ క్రీడాకారులు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరిశారు. అభిమానులను మురిపించారు. కొత్త ప్రత్యర్థులు వచ్చినా... కొత్త తారలు తెరపైకి వచ్చినా తమ ఉనికిని చాటుకుంటూ వారందరూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అథ్లెటిక్స్‌లో ఉసేన్ బోల్ట్, స్విమ్మింగ్‌లో మైకేల్ ఫెల్ప్స్, టెన్నిస్‌లో సెరెనా విలియమ్స్... ఇలా పేరున్న వారందరూ ఈ ఏడాదిలో తమ అద్భుత ఆటతీరుతో అలరించారు. – సాక్షి క్రీడావిభాగం ఎదురులేని బోల్ట్ సమకాలీన అథ్లెటిక్స్‌లో తనకు ఎదురులేదని జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మరోసారి నిరూపించుకున్నాడు. రియో ఒలింపిక్స్ వేదికగా బోల్ట్ మూడు స్వర్ణాలు సాధించి ఔరా అనిపించాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో మాదిరిగానే రియోలోనూ బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచి వరుసగా మూడోసారి ‘ట్రిపుల్’ సాధించాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో అవే విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన ఏకైక అథ్లెట్‌గా బోల్ట్ రికార్డు నెలకొల్పాడు. కొత్తగా ప్రపంచ రికార్డులు సాధించకపోయినా అతనికి తన ప్రత్యర్థుల నుంచి కనీస పోటీ ఎదురుకాకపోవడం విశేషం. వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత వీడ్కోలు పలుకుతానని ఈ జమైకా స్టార్ ప్రకటించాడు. ‘బంగారు చేప’ వీడ్కోలు... ఒలింపిక్స్‌లో ఒక్క పతకం సాధిస్తేనే కెరీర్ ధన్యమైపోయిందని భావించే క్రీడాకారులు ఎందరో ఉన్నారు. కానీ అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మాత్రం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం ఇంత సులువా అని తన అద్వితీయ ప్రతిభతో అబ్బురపరిచాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రియో ఒలింపిక్స్‌కు సిద్ధమైన ఫెల్ప్స్ ఐదు స్వర్ణాలు, ఒక రజతం సాధించి తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలికాడు. ఈ ప్రదర్శనతో 31 ఏళ్ల ఫెల్ప్స్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఐదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న ఫెల్ప్స్ 23 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 28 పతకాలు గెలిచి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ‘డ్రాగన్’ జోరుకు బ్రేక్... బ్యాడ్మింటన్‌లో ఈ ఏడాది చైనా జోరుకు చెక్ పడింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్... డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ అక్సెల్సన్ సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. సీజన్‌లోని మొత్తం 12 సూపర్ సిరీస్ టోర్నీలలో పురుషుల సింగిల్స్‌లో మూడు... మహిళల సింగిల్స్‌లో రెండు టైటిల్స్ మాత్రమే చైనా క్రీడాకారులకు దక్కాయి. చైనా దిగ్గజం లిన్ డాన్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. వరుసగా మూడో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలని ఆశించిన లిన్ డాన్ రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో అక్సెల్సన్ చేతిలో ఓడిపోయాడు. మహిళల ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఒక్క సూపర్ సిరీస్ టైటిల్ సాధించకపోయినా రియో ఒలింపిక్స్‌లో పసిడి పతకం సంపాదించింది. రోస్‌బర్గ్... రయ్ రయ్... ఫార్ములావన్ (ఎఫ్1)లో ఈసారీ మెర్సిడెస్ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌ను వెనక్కినెట్టి మెర్సిడెస్‌కే చెందిన నికో రోస్‌బర్గ్ విశ్వవిజేతగా నిలిచాడు. సీజన్‌లోని 21 రేసుల్లో రోస్‌బర్గ్ తొమ్మిది రేసుల్లో గెలిచి, మరో ఏడు రేసుల్లో టాప్–3లో నిలిచి మొత్తం 385 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. 10 రేసుల్లో గెలిచినప్పటికీ హామిల్టన్ (380 పాయింట్లు) మిగతా రేసుల్లో ఆశించిన రీతిలో రాణించకపోవడంతో చివరకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. 1982లో రోస్‌బర్గ్ తండ్రి కేకె రోస్‌బర్గ్ ఎఫ్1 చాంపియన్‌గా నిలువగా... 34 ఏళ్ల తర్వాత అతని తనయుడు నికో అదే ఫలితాన్ని సాధించడం విశేషం. యూరోలో పోర్చు‘గోల్’... ప్రొఫెషనల్ లీగ్స్‌లో మెరుపులు మెరిపించే క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. తన జాతీయ జట్టు పోర్చుగల్‌ను తొలిసారి ‘యూరో’ చాంపియన్‌గా నిలబెట్టాడు. పారిస్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో పోర్చుగల్ 1–0 గోల్ తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై సంచలన విజయం సాధించింది. గాయం కారణంగా ఫైనల్ ఆరంభంలోనే రొనాల్డో మైదానం వీడినప్పటికీ... మిగతా పోర్చుగల్ ఆటగాళ్లందరూ పట్టుదలతో పోరాడి ఫ్రాన్స్‌ను నిర్ణీత సమయం వరకు నిలువరించారు. అదనపు సమయంలోని 109వ నిమిషంలో ఎడెర్ అద్భుత గోల్ చేసి పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని పోర్చుగల్ కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీకి ఈ ఏడాది నిరాశనే మిగిల్చింది. ‘కోపా అమెరికా కప్’ ఫైనల్లో మెస్సీ జట్టు పెనాల్టీ షూటౌట్లో 2–4తో డిఫెండింగ్ చాంపియన్ చిలీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. షూటౌట్లో తొలి షాట్ తీసుకున్న మెస్సీ గురి తప్పడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఈ ఫలితం తర్వాత మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అయితే జాతీయ జట్టు ప్రయోజనాలదృష్ట్యా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మళ్లీ బరిలోకి దిగాడు. ఇక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో లీస్టర్సిటీ జట్టు విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ చాంపియన్స్ లీగ్ టైటిల్‌తోపాటు ప్రపంచకప్ క్లబ్ టైటిల్‌ను గెల్చుకుంది. స్టెఫీ సరసన సెరెనా ఈ ఏడాది పురుషుల, మహిళల టెన్నిస్‌లో సంచలన ఫలితాలు వచ్చాయి. జర్మనీకి చెందిన ఎంజెలిక్ కెర్బర్... బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే వరుసగా మహిళల, పురుషుల విభాగాల్లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. కెర్బర్ ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించగా... స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. ‘అమెరికా నల్లకలువ’ సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచి ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) రికార్డును సమం చేసింది. పురుషుల సింగిల్స్‌లో ఆండీ ముర్రే రెండోసారి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకోగా... స్విట్జర్లాండ్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు. నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు. అయితే సీజన్ చివర్లో తడబడిన ఈ సెర్బియా స్టార్ తన ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను ఆండీ ముర్రేకు కోల్పోయాడు. ‘కింగ్’ కార్ల్సన్... అన్ని అవాంతరాలను అధిగమిస్తూ రియో ఒలింపిక్స్‌ను బ్రెజిల్ విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగిన ఈ క్రీడల్లో 205 దేశాల నుంచి 11 వేలకుపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. అమెరికా 46 స్వర్ణాలు, 37 రజతాలు, 38 కాంస్యాలతో కలిపి మొత్తం 121 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్ 27 స్వర్ణాలు, 23 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి 67 పతకాలు నెగ్గి రెండో స్థానంలో నిలిచింది. చైనా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రీడల్లో మొత్తం 27 కొత్త ప్రపంచ రికార్డులు... 91 ఒలింపిక్ రికార్డులు నమోదయ్యాయి. -
‘రియో’ డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు
గోల్ఫర్ అనిర్బన్ కోల్‌కతా: రియో ఒలింపిక్స్ సన్నాహాల కోసం ప్రకటించిన మొత్తాన్ని కేంద్ర క్రీడాశాఖ ఇప్పటివరకు ఇవ్వలేదని మరో గోల్ఫర్ అనిర్బన్ లాహిరి ధ్వజమెత్తాడు. ‘ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం అష్టకష్టాలు పడి అత్యున్నత శిక్షణ తీసుకున్న మాకు అప్పట్లో రూ. 30 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రియో గేమ్స్ ముగిసి నాలుగు నెలలైనా ఒక్క పైసా ఇవ్వలేదు’ అని అనిర్బన్ అన్నాడు. రియోలో మాకెదురైన చేదు అనుభవాలపై సహచర గోల్ఫర్ ఎస్ఎస్పీ చౌరాసియా చెప్పిందంతా నూటికి నూరుపాళ్లు నిజమని చెప్పాడు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), క్రీడా శాఖ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చుట్టూ తిరిగిన చౌరాసియా చివరకు రూ.5.5 లక్షలైనా అందుకున్నాడని... కానీ తనకు ఒక్క రూపాయి కూడా అందలేదని చెప్పాడు. ‘ఒలింపిక్స్ సన్నాహాలకు ఒక్కో గోల్ఫర్‌కు రూ. 30 లక్షలిస్తామన్నారు. తర్వాత ఆ మొత్తాన్ని రూ. 15 లక్షలకు తగ్గించారు. ఇలా ప్రకటించినవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఆటగాళ్లకు అందెదెన్నడో క్రీడాశాఖ వర్గాలే చెప్పాలి’ అని అనిర్బన్ అన్నాడు. ఒలింపిక్స్ కోసం తను సొంత డబ్బుతో సన్నద్ధమైనట్లు చెప్పాడు. భారత ఒలింపిక్ సంఘం, క్రీడాశాఖ ఇలా ఏ ఒక్కరి నుంచి ఆర్థిక సాయం అందలేదని వివరించాడు. -
ఇక ఒలింపిక్స్‌కు వెళ్లను గాక వెళ్లను!
రియో ఒలింపిక్స్ ముగిసి ఇన్నాళ్లయినా ఇంకా దాని చుట్టూ అలముకున్న వివాదాలు మాత్రం ఎడతెగకుండా వస్తూనే ఉన్నాయి. రియో ఒలింపిక్స్‌కు సంబంధించి ఇవ్వాల్సిన రూ. 30 లక్షలు ఇంతవరకు ఇవ్వకపోవడంతో భారత ఒలింపిక్ సంఘం మీద, క్రీడా మంత్రిత్వశాఖ మీద భారత అగ్రశ్రేణి గోల్ఫర్ ఎస్ఎస్పి చౌరాసియా మండిపడ్డాడు. అసలు ఈసారి ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం కూడా అనుమానమే అన్నాడు. అతడితో పాటు పాల్గొన్న మరో గోల్ఫర్ అనిర్బన్ లాహిరికి కూడా క్రీడా శాఖ నుంచి రావాల్సిన మొత్తం ఇంకా రాలేదు. రియో ఒలింపిక్స సమయంలో భారత ఒలింపిక్ సంఘం అధికారులు తమను సర్వెంట్లలా చూశారని చౌరాసియా ఆగ్రహంవ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 16 టైటిళ్లు గెలుచుకున్న లాహిరికి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, తనకు మాత్రం ఎలాగోలా ఇప్పటికి రూ. 5.5 లక్షలు ఇచ్చారని చౌరాసియా చెప్పాడు. తమకు రూ. 30 లక్షలు ఇస్తామని వాళ్లు చెప్పిన లేఖ కూడా తనవద్ద ఉందని, కానీ రియో గేమ్స్ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 15 లక్షలకు తగ్గించినట్లు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రియోలో అసలు సరైన ఏర్పాట్లన్నవే లేవని, కనీసం వాహనం కూడా లేదని అన్నాడు. తాను చలికి వణికిపోతున్నా, ఒకపక్క వర్షం పడుతున్నా కనీసం తమకు రెయిన్కోట్లు గానీ, గొడుగులు గానీ కూడా ఏర్పాటుచేయలేదన్నాడు. వాళ్లేదో యజమానులలా, తమను నౌకర్లలా చూశారని చెప్పాడు. వాహనం కోసం తమను నాలుగు గంటల పాటు విమానాశ్రయంలోనే ఉంచేశారని, లాహిరి తన సొంత వాహనంలో వచ్చాడని అన్నాడు. ఈసారి ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామన్నాడు. -
ఒకే జట్టులో సాక్షి, సత్యవర్త్
ప్రొ రెజ్లింగ్ లీగ్–2 ఆటగాళ్ల వేలం జనవరి 2 నుంచి ఆరంభం యోగేశ్వర్ దత్ దూరం బజరంగ్‌కు అత్యధిక మొత్తం న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్లర్ సాక్షి మలిక్‌తో పాటు తన కాబోయే భర్త సత్యవర్త్ కడియన్ ఇద్దరూ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్లు్యఎల్) రెండో సీజన్ కోసం శుక్రవారం జరిగిన వేలంలో వీరిద్దరిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. సాక్షికి రూ.30 లక్షల ధర పలకగా... సత్యవర్త్‌ను రూ.18 లక్షలకు తీసుకుంది. తొలి సీజన్లో సాక్షి ముంబై జట్టుకు ఆడగా... సత్యవర్త్ ఉత్తర ప్రదేశ్‌కు ఆడాడు. అలాగే భారత్ నుంచి స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా అత్యధిక ధర పలికాడు. అతడిని ఢిల్లీ జట్టు రూ.38 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే సందీప్ తోమర్ (హరియాణా, రూ.31 లక్షలు), రీతూ ఫోగట్ (జైపూర్, 36 లక్షలు), గీతా ఫోగట్ (ఉత్తర ప్రదేశ్, రూ.16 లక్షలు)లకు కూడా మంచి ధర పలికింది. అయితే జనవరి 16న వివాహం చేసుకోబోతున్న భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ వేలంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. ఐదు విభిన్న వేదికల్లో జరిగే ఈ లీగ్ వచ్చే నెల 2 నుంచి ప్రారంభమవుతుంది. రియోలో స్వర్ణం సాధించిన వ్లాదిమిర్ ఖించెగష్వి (జార్జియా) అత్యధిక ధర పలికిన రెజ్లర్‌గా నిలిచాడు. తనను టీమ్ పంజాబ్ జట్టు రూ.48 లక్షలకు కొనుగోలు చేసుకుంది. ఆ తర్వాత లండన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన మగోమెడ్ కుర్బనలీవ్ (అజర్బైజాన్)ను కూడా పంజాబ్ రూ.47 లక్షలకు తీసుకుంది. 200కు పైగా రెజ్లర్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. ప్రతీ జట్టులో తొమ్మిది మంది ఆటగాళ్లు (ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు) ఉండగా రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు. -
సూపర్ సింధు
మారిన్‌పై విజయంతో సెమీస్‌లోకి దుబాయ్: రియో ఒలింపిక్స్ ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఎదురైన పరాజయానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బదులు తీర్చుకుంది. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో సింధు 21–17, 21–13తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్ మారిన్‌ను మట్టికరిపించింది. మోకాలి గాయంతో బాధపడుతున్న మారిన్ వరుసగా మూడు పరాజయాలతో ఈ టోర్నీని ముగించి ఇంటిదారి పట్టింది. ఇదే గ్రూప్ నుంచి సున్ యు మరో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. గ్రూప్ ‘ఎ’ నుంచి సుంగ్ జీ హున్ (కొరియా), తై జు యింగ్ (చైనీస్ తైపీ) సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్‌తో సింధు, సుంగ్ జీ హున్‌తో సున్ యు తలపడతారు. ప్రపంచ రెండో ర్యాంకర్ మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు ఆద్యంతం దూకుడుగా ఆడింది. తొలి గేమ్ ఆరంభంలో 3–7తో వెనుకబడిన సింధు ఆ వెంటనే కోలుకొని వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 8–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఇద్దరి మధ్య ఆధిక్యం దోబూచులాడింది. అయితే స్కోరు 11–12 వద్ద సింధు మరోసారి ఐదు వరుస పాయింట్లు నెగ్గి 16–12తో ముందంజ వేసింది. అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు ప్రణాళిక ప్రకారం ఆడి మారిన్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. -
ఈ యేటి మేటి బోల్ట్, అయానా
ఐఏఏఎఫ్ పురస్కారాల ప్రదానం మొనాకో: వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ మూడేసి స్వర్ణాలు సాధించిన జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్... రియో ఒలింపిక్స్‌లో 10 వేల మీటర్ల విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించి పసిడి పతకం నెగ్గిన అయానా అల్మాజ్ (ఇథియోపియా) ఈ ఏడాది ‘ప్రపంచ ఉత్తమ అథ్లెట్స్’ పురస్కారాలు అందుకున్నారు. అథ్లెటిక్స్ అధికారులు, అథ్లెట్స్, జర్నలిస్టులతోపాటు ఆన్లైన్ పోలింగ్ ద్వారా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) ఈ ఇద్దరిని ఎంపిక చేసింది. రియో ఒలింపిక్స్‌లో బోల్ట్ 100, 200 మీటర్లతోపాటు 4్ఠ100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లోనూ బోల్ట్ ఈ మూడు విభాగాల్లో పసిడి పతకాలు గెలిచాడు. 30 ఏళ్ల బోల్ట్ ఐఏఏఎఫ్ మేటి అథ్లెట్ పురస్కారాన్ని అందుకోవడం ఇది ఆరోసారి కావడం విశేషం. గతంలో అతను 2008, 2009, 2011, 2012, 2013లలో ఈ గౌరవాన్ని అందుకున్నాడు. వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్న బోల్ట్ 19.19 సెకన్లతో తన పేరిటే ఉన్న 200 మీటర్ల ప్రపంచ రికార్డును సవరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నాడు. ‘రియో ఒలింపిక్స్‌లో 200 మీటర్లను 19 సెకన్లలోపు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని అనుకున్నాను. కానీ అది సాధ్యపడలేదు. వచ్చే సీజన్లో ఎలాంటి గాయాల బారిన పడకుండా ఉంటే ఏదైనా జరగొచ్చు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నేను పాల్గొనే అవకాశం లేదు. ఒకసారి రిటైరయ్యాక పునరాగమనం చేయొద్దని నా కోచ్ స్పష్టం చేశారు’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. -
బెస్ట్ బాక్సర్ వికాస్
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ వికాస్ క్రిషన్కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ‘ఉత్తమ ప్రొఫెషనల్ బాక్సర్’గా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) వికాస్‌ను ఎంపిక చేసింది. వచ్చే నెల 20న జరిగే ‘ఐబా’ సమావేశంలో ఈ అవార్డును వికాస్‌కు అందజేస్తారు. భారత్ నుంచి ఓ బాక్సర్‌కు ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. హరియాణాకు చెందిన 24 ఏళ్ల వికాస్ రియో ఒలింపిక్స్‌లో 75 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ‘నాకిది గొప్ప గౌరవం. అరుుతే నేనంతగా ఆనందంగా లేను. ఎందుకంటే రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆశించిన నాకు నిరాశే మిగిలింది’ అని ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో శిక్షణ తీసుకుంటున్న వికాస్ వ్యాఖ్యానించాడు. -
ఆఖరి పోరులో సాగని జోరు
ఫైనల్లో ఓడిన సింధు, సమీర్ వర్మ రజత పతకాలతో సరి హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ కౌలూన్: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్ గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోరుుంది. హాంకాంగ్ ఓపెన్ టోర్నీ ఆసాంతం చక్కటి ఆటతీరు కనబర్చిన సింధు, ఫైనల్లో పరాజయం పాలైంది. మరోవైపు సంచలన ఆటతో పురుషుల విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత ఆటగాడు సమీర్ వర్మ పోరాడి ఓడిపోయాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన మహిళల ఫైనల్లో సింధు 15-21, 17-21 స్కోరుతో చిరకాల ప్రత్యర్థి తై జు రుుంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. పురుషుల ఫైనల్లో లాంగ్ ఆంగస్ (హాంకాంగ్) 21-14, 10-21, 21-11 తేడాతో సమీర్ వర్మపై గెలుపొందాడు. రన్నరప్‌లుగా నిలిచిన సింధు, సమీర్ వర్మలకు 15,200 డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 7,800 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. రన్నరప్ సిక్కి రెడ్డి జంట మరోవైపు గ్లాస్గోలో ముగిసిన స్కాటిష్ ఓపెన్గ్రాండ్ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లోనూ భారత్‌కు నిరాశే మిగిలింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంక్ ద్వయం సిక్కి-ప్రణవ్ 21-13, 18-21, 16-21తో ప్రపంచ 229వ ర్యాంక్ జోడీ గో సూన్ హువాట్-జేమీ లై షెవోన్ (మలేసియా) చేతిలో ఓడిపోరుుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సిక్కి-ప్రణవ్ 16-12తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ వరుసగా 9 పారుుంట్లు కోల్పోరుు ఓటమిని మూటగట్టుకోవడం గమనార్హం. నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. నేను మెరుగ్గానే ఆడినా ప్రత్యర్థి నెట్ వద్ద చాలా చక్కటి ఆటతీరు కనబర్చింది. ఆమె ఎలాంటి తప్పులూ చేయలేదు. గతంలోనూ తై జుతో ఆడాను. ఆమె బలాల గురించి తెలిసే సన్నద్ధమయ్యా. అరుుతే ఆటలో ఓటమి సహజం. గత వారం చైనా ఓపెన్ గెలుపు కారణంగా నేను ఈ మ్యాచ్‌కు ముందు ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఈ రోజు ఆమెది. తిరిగి వెళ్లాక మరింతగా సాధన చేస్తా. వరుసగా రెండు టోర్నీల్లో నా ఆట సంతోషాన్ని కలిగించింది. - పీవీ సింధు -
స్ప్రింటర్ ధరమ్‌వీర్‌పై నిషేధం
న్యూఢిల్లీ: రియో ఒలిం పిక్స్‌కు ముందు డోపిం గ్లో దొరికిన స్ప్రింటర్ ధరమ్వీర్ సింగ్‌పై జా తీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. దీంతో ఈ హరియాణా అథ్లెట్ కెరీర్ ఇక ముగిసినట్టే. జూలై 11న బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్లో నిర్వహించిన డోపింగ్ పరీక్షలో ధరమ్వీర్ నుంచి శాంపిల్ తీసుకున్నారు. ఈ పోటీల్లోనే తను 20.45 సె. టైమింగ్‌తో జాతీయ రికార్డు నెలకొల్పుతూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అరుుతే అతడిచ్చిన శాంపిల్‌లో నిషేధిత ఎనబోలిక్ స్టెరారుుడ్ వాడినట్టు తేలడంతో చివరి నిమిషంలో రియో ఒలింపిక్స్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఈ 200మీ. రన్నర్‌కు ఇది రెండో డోపింగ్ అతిక్రమణ కావడంతో ‘నాడా’ కఠినంగా వ్యవహరించింది. 2012లో జరిగిన జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్స్‌లోనూ తను 100మీ. రేసులో స్వర్ణం నెగ్గినా... డోపింగ్ టెస్టుకు దూరంగా ఉండడంతో అతడి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. -
కెరీర్ ముగిసిందా అనిపిస్తోంది: సైనా
-
కెరీర్ ముగిసిందా అనిపిస్తోంది: సైనా
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో మోకాలి గాయంతో పాల్గొని లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వచ్చే వారంలో పునరాగమనం చేయనుంది. అయితే భవిష్యత్‌లో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోలేదని సైనా తెలిపింది. ‘చాలా మంది నా కెరీర్ ముగిసిందని భావిస్తున్నారు. ఇక పునరాగమనం చేయలేనని అనుకుంటున్నారు. గుండె లోతుల్లోంచి ఆలోచిస్తే ఒక్కోసారి నాకూ అలాగే అనిపిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం’ అని 26 ఏళ్ల సైనా అభిప్రాయపడింది. నవంబరు 15 నుంచి జరిగే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ కోసం సైనా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ‘సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడాలని అనుకుంటున్నాను. నా పని అరుుపోయిందని ఇతరులు అనుకుంటే సంతోషమే. ఒకరకంగా ఇప్పటిదాకా వారు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక నుంచి నా గురించి వారు ఆలోచించడం మానేస్తారేమో’ అని సైనా తెలిపింది. -
తప్పంతా జైషా కోచ్‌దే
విచారణలో తేల్చిన కేంద్ర క్రీడాశాఖ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత మారథాన్ రన్నర్, మహిళా అథ్లెట్ జైషా అస్వస్థతకు ఆమె కోచ్ నికొలాయ్ స్నేసరెవే కారణమని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ తమ విచారణలో తేల్చింది. పోటీ జరిగే రోజు మంచినీరు, శక్తినిచ్చే పానీయాలు సరఫరా చేయకపోవడానికి ఆమె కోచ్ ఇచ్చిన తప్పుడు మార్గదర్శకత్వమే కారణమని వెల్లడించింది. పోటీకి ముందు రోజు నీరు తదితర సదుపాయాల కల్పన కోసం ఆమె కోచ్ నికొలాయ్‌ను సంప్రదించగా ఆయన... అవేమీ అవసరం లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రతినిధులకు చెప్పారు. దీంతో మంచినీరు, శక్తి పానీయాలను వారు అందుబాటులో ఉంచలేకపోయారు. ఒలింపిక్స్‌లో ఆమె మారథాన్‌లో పరుగు పెట్టింది. అరుుతే సుదీర్ఘ పరుగు పోటీని పూర్తి చేసే క్రమంలో కనీసం మంచినీరైన తాగకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురై తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఐఓఏపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, క్రీడాశాఖ విచారణకు ఆదేశించింది. -
సింధు శుభారంభం
ఒడెన్‌స: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ ఈవెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-14, 21-19తో హీ బింగ్జియావో (చైనా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సయాకా సాటో (జపాన్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించారుు. మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్ 21-15, 21-16తో బున్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్)పై, ప్రణయ్ 21-13, 19-21, 22-20తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా)పై గెలిచారు. సారుుప్రణీత్ 17-21, 21-19, 15-21తో తనోంగ్సక్ సెన్సోమ్బున్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో సుమీత్-మనూ అత్రి ద్వయం 10-21, 19-21తో కిమ్ యాస్టప్-్రఆండర్స్ రస్ముసెన్ (డెన్మార్క్) జోడీ చేతిలో... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి-ప్రణవ్ జంట 15-21, 14-21తో జోచిమ్ ఫిషెర్ నీల్సన్-క్రిస్టినా పెడెర్సన్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యారుు. -
రెజ్లర్ సాక్షి నిశ్చితార్థం
-
రెజ్లర్ సాక్షి నిశ్చితార్థం
రోహ్తక్ (హరియాణా): రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజా మోగనుంది. సహచర రెజ్లర్ సత్యవర్త్ కడియన్‌తో ఆదివారం ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది. సాక్షి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె సమీప బంధువులు, సన్నిహిత మిత్రులు హాజరయ్యారు. రెజ్లర్ సత్యవర్త్ తన తండ్రికి చెందిన అఖాడాలో శిక్షణ పొందాడు. 97 కేజీల ఫ్రీస్టరుుల్ కేటగిరీలో బరిలోకి దిగిన అతను 2010 యూత్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గాడు. -
సంచలన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సాక్షి మాలిక్ !
⇒ ఆటగాళ్లకు ఏ దేశంలోనైనా ఆడే హక్కు ఉంది రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత, భారత రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన తీవ్ర పరిణామాల దృష్ట్యా.. పాక్ ఆటగాళ్లపై భారత్ లో నిషేధం విధించాలా అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎక్కడైనా, ఏ దేశంలోనైనా పోటీలో పాల్గొనే హక్కు అథ్లెట్లు, ఆటగాళ్లకు ఉంటుందని సాక్షి అభిప్రాయపడింది. దీంతో భారత్ లో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వాలని అర్థం వచ్చేలా కామెంట్ చేసిందని ఆమెపై భిన్న కథనాలు వచ్చాయి. అయితే తాను పాక్ ఆటగాళ్లను అన్ని ఈవెంట్లలోనూ భారత్ లో ఆడనివ్వాలని వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలను ఆమె తోసిపుచ్చింది. తాను ప్రస్తావించిన అంశాలను మీడియాకు మహిళా రెజ్లర్ వెల్లడించింది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ తో పాటు ఇతర దేశాల్లో నిర్వహించే అన్ని ఈవెంట్లలో ఆటగాళ్లు పాల్గొంటారు. అంతేకానీ, పాక్ ప్లేయర్స్ ను భారత్ లో నిషేధించవద్దని తాను ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఇతర ప్లేయర్స్ లా తాను వ్యవరించనని స్పష్టంచేసింది. పతకాలు సాధించడం కంటే దేశం కోసం ఇంకా ఏదైనా మంచిపని చేస్తే ఎక్కువగా సంతోషపడతానని సాక్షి చెప్పింది. ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన తర్వాత దేశంలో చాలా మంది తనను గుర్తిస్తున్నారని, దాంతో తన బాధ్యత మరింత పెరిగిందని వివరించింది. -
సమూల మార్పులు అవసరం
భారత షూటింగ్ భవిష్యత్ కోసం బింద్రా కమిటీ సూచనలు న్యూఢిల్లీ: కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని... నైపుణ్యానికి క్రమం తప్పకుండా మెరుగులు దిద్దుకుంటూ, పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో ముందుకు సాగితేనే భారత షూటింగ్ భవిష్యత్ బాగుంటుందని అభినవ్ బింద్రా సారథ్యంలో ఏర్పాటైన రివ్యూ కమిటీ అభిప్రాయపడింది. రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 12 మంది షూటర్లు పాల్గొన్నా... ఒక్కరు కూడా పతకం సాధించకపోవడంతో భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ)... బింద్రా నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరింది. ‘2004 ఏథెన్‌స ఒలింపిక్స్ నుంచి వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో షూటర్లు పతకాలు గెలవడంంతో 2016 రియోలోనూ షూటింగ్ నుంచి పతకం వస్తుందని అందరూ భావించారు. కానీ రియో ప్రదర్శన ద్వారా భారత షూటింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన సమయం వచ్చేసిందని అవగతమైంది. కొంతమంది నైపుణ్యమైన షూటర్ల కారణంగా కొన్నేళ్లుగా భారత్‌కు అంతర్జాతీయస్థారుులో పతకాలు వచ్చారుు. అంతేగాని పక్కా వ్యవస్థ ద్వారా ఈ ఫలితాలు రాలేదని రియో ప్రదర్శన ద్వారా తేలిపోరుుంది’ అని బింద్రా కమిటీ వివరించింది. ‘జాతీయ రైఫిల్ సంఘం ఇప్పటికై నా తమ ధోరణిని మార్చుకోవాలి. కొత్త విధానాలను తేవాలి. సత్తా ఉన్నా వారికి సరైన అవకాశాలు కల్పించాలి. ఎలా ఉన్నా ముందుకు సాగిపోతామన్న వైఖరిని విడనాడాలి’ అని ఈ కమిటీ సూచించింది. గగన్ నారంగ్, హీనా సిద్ధూలతోపాటు తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న అపూర్వీ చండీలా, అయోనికా పాల్ వ్యవహారశైలిని కూడా బింద్రా కమిటీ తప్పు పట్టింది. గగన్ నారంగ్ గాయంతోనే ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడని, సరైన ప్రణాళిక లేకుండా ప్రాక్టీస్ చేశాడని విమర్శించింది. మరోవైపు బింద్రా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేసేలా తాము చర్యలు తీసుకుంటామని జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణిందర్ సింగ్ తెలిపారు. -
‘సిల్వర్’ సింధుకు మరో కానుక
విజయవాడ (రామవరప్పాడు) : రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మరో కానుక లభించింది. డాట్సన్ కంపెనీ ప్రతినిధులు బుధవారం ఆమెకు కారును బహూకరించారు. ఎనికేపాడులోని లక్కి నిస్సాన్ షోరూమ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు సింధును సన్మానించారు. అనంతరం ఆమెకు డాట్సన్ రెడీగో స్పోర్ట్స్ కారు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ప్రయివేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ కారులో అకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. తన క్రీడా ప్రతిభ ద్వారా దేశానికి వన్నె తెచ్చిన సింధుకు కారును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. పీవీ సింధు మాట్లాడుతూ కానుక అందజేసిన కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడితే ఎవరికైనా విజయం సొంతమవుతుందని తెలిపారు. తాను ఎంతో కష్టపడి ఒలింపిక్స్‌లో పతకం సాధించానని గుర్తుచేసుకున్నారు. యువత ఏకాగ్రత, పట్టుదలను అలవరుచుకుంటే ఎదైనా సాధించవచ్చునని సూచించారు. -
కండబలంతో కాదు టెక్నిక్‌తో గెలిచా
న్యూఢిల్లీ: క్రీడల్లో ముఖ్యంగా కుస్తీ వంటి పోటీల్లో గెలవాలంటే కండబలం చాలా అవసరం. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ మాత్రం.. తాను కేవలం కండబలంతో గెలవలేదని, బుద్ధిబలం కూడా తోడైందని చెప్పింది. హరియాణాకు చెందిన సాక్షిని ఎయిరిండియా సన్మానించింది. బిజినెస్ క్లాస్‌లో సాక్షి ఉచితంగా ప్రయాణించేందుకు సదుపాయం కల్పించినట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఈ సందర్భంగా సాక్షి మాట్లాడుతూ.. ‘నేను శక్తి వల్ల మాత్రమే గెలవలేదు. టెక్నిక్ కూడా తోడైంది. రియోలో పతకం గెలవడం ఓ మధురానుభూతి. పోటీల కోసం బరువు తగ్గా. డైట్‌పై కంట్రోల్ చేశాను. అన్ని టోర్నమెంట్లకు ఒకేవిధంగా ప్రాక్టీస్ చేస్తాను. అయితే ప్రత్యర్థిని బట్టి దృష్టిసారించాలి. పవర్, వెయిట్, స్పీడ్ ట్రైనింగ్స్‌లో ప్రాక్టీస్ చేయాలి. నా కుటుంబ సభ్యులు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. రియోలో 15 రోజులు ఉన్నాం. ఏం జరుగుతుందో తెలియదు. నాపై గెలిచిన రష్యా రెజ్లర్ ఫైనల్‌కు చేరుతుందని వందశాతం నమ్మాను. ఏదేమైనా నేను పతకం గెలుస్తానని భావించా’ అని సాక్షి చెప్పింది. -
రియోకు అన్ ఫిట్ అథ్లెట్లను పంపారా?
ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ జంబో జట్టు (118)ను రియోకు పంపినా ఆశించిన ఫలితాలు రాలేదు. మనోళ్లు ఈసారి డబుల్ డిజిట్ పతకాలు గెలుస్తారని అంచనా వేస్తే.. రెండింటికే పరిమితమయ్యారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రజతం, రెజ్లర్ సాక్షిమాలిక్ కాంస్య పతకాలు సాధించడం మినహా చాలామంది స్టార్లు రిక్తహస్తాలతో తిరిగివచ్చారు. రియోలో మన క్రీడాకారుల వైఫల్యానికి గల కారణాలను విశ్లేషిస్తూ భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఓ నివేదికను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు పంపింది. సాయ్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు.. రియోకు అన్ ఫిట్ అథ్లెట్లను పంపడం ప్రతికూల ప్రభావం చూపించింది. విదేశీ కోచ్‌ల పనితీరును అంచనావేయాల్సిన అవసరముందని కేంద్ర క్రీడల శాఖకు సూచించింది. జాతీయ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై అంతర్గత విశ్లేషణ చేయాలని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైనట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రియోలో పాల్గొన్న క్రీడాకారులందరికి వ్యక్తిగతంగా లేఖలు రాసి, వారి నుంచి నేరుగా లేదా ఈమెయిల్ ద్వారా సూచనలు కోరినట్టు చెప్పారు. -
సాయిప్రణీత్ శుభారంభం
కశ్యప్, ప్రణయ్ కూడా ఇండోనేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ బాలిక్పాపన్ (ఇండోనేసియా): రియో ఒలింపిక్స్ తర్వాత జరుగుతున్న తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ ఇండోనేసియా మాస్టర్స్‌లో భారత ఆటగాళ్లు శుభారంభం చేశారు. పదో సీడ్ భమిడిపాటి సారుుప్రణీత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సిరిల్ వర్మ, కౌశల్, హర్షిల్ డాని తొలి రౌండ్లోనే ఓడిపోయారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సారుుప్రణీత్ 21-18, 13-21, 21-13తో సుబగ్జా రియాంతో (ఇండోనేసియా)పై, కశ్యప్ 21-6, 21-8తో సులిస్తో (ఇండోనేసియా)పై, జయరామ్ 21-8, 21-9తో మైనాకి (ఇండోనేసియా)పై, ప్రణయ్ 16-21, 21-19, 21-14తో హా యంగ్ వూంగ్ (దక్షిణ కొరియా)పై గెలిచారు. సిరిల్ వర్మ 7-21, 9-21తో వీ ఫెంగ్ చాంగ్ (మలేసియా) చేతిలో, కౌశల్ 23-21, 14-21, 13-21తో మేగనంద (ఇండోనేసియా) చేతిలో, హర్షిల్ 18-21, 16-21తో సిమోన్ సాంతొసో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగమ్మారుు గద్దె రుత్విక శివాని, తన్వీ లాడ్, పీసీ తులసీ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. రుత్విక 14-21, 14-21తో హనా రమదిని (ఇండోనేసియా) చేతిలో, తులసీ 12-21, 5-21తో జియో లియాంగ్ (సింగపూర్) చేతిలో, తన్వీ 14-21, 19-21తో రుసెల్లి హర్తావన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కిడాంబి నందగోపాల్-సాన్యమ్ శుక్లా (భారత్) జంట 10-21, 14-21తో మార్కిస్ కిడో-హెంద్రా గుణవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. గురువారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్‌తో కశ్యప్; కాంతాఫోన్ (థాయ్‌లాండ్)తో సారుుప్రణీత్; జూ వెన్ సుంగ్ (మలేసియా)తో ప్రణయ్ తలపడతారు. -
నా కెరీర్ ఏమవుతుందో : సుశీల్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తనకు అవకాశం కల్పించక పోవడంపై భారత రెజ్లర్ సుశీల్ కుమార్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ లో భారత్‌కు పతకాలు అందించిన ఏకైక ప్లేయర్ సుశీల్. రియో వివాదం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు. రియోలో పాల్గొనక పోవడం తన కెరీర్ పై ఎంతో ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు. రియో ఒలింపిక్స్ కోసం ఎంతగానో శ్రమించానని చెప్పాడు. వరుసగా మూడో ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి తన వంతుగా మూడో పతకం సాధించాలన్న తన ఆకాంక్షను నెరవేరలేదని వాపోయాడు. దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) తన పేరును ప్రతిపాదించడంపై హర్షం వ్యక్తం చేశాడు. డబ్ల్యూఎఫ్ఐ ఇప్పటికైనా తన విజయాలను గుర్తించిందన్నాడు. రష్యా రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ డోపీగా తేలడంతో లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ దత్ రజతానికి అప్ డేట్ అవడంపై సుశీల్ స్పందించాడు. యోగేశ్వర్ కు అభినందనలు తెలిపాడు. ఆ పతకం కుదుకోవ్ కుటుంబం వద్ద ఉంటడమే కరెక్ట్ అని చెప్పి యోగేశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నాడని ప్రశంసించాడు. 74 కేజీల విభాగంలో భారత్ నుంచి నర్సింగ్ యాదవ్ ను రియోకు పంపించగా నాటకీయ రీతిలో డోపింగ్ కారణాలతో అవకాశం ఇవ్వకపోగా, నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
అత్యంత స్ఫూర్తిదాయక మహిళగా దీప
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. తాజా సర్వేలో అత్యంత స్ఫూర్తిదాయక భారత మహిళగా పేరు తెచ్చుకుంది. షాదీ.కామ్ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఈ విషయం తేలింది. ‘ఇటీవలి కాలంలో మీలో స్ఫూర్తి పెంచిన భారత మహిళ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు 33.7 శాతం మంది దీపకే ఓటేశారు. ఈ సర్వేలో మొత్తం 12,500 మంది పాల్గొన్నారు. రెండో స్థానంలో 27.4 శాతంతో రెజ్లర్ సాక్షి మలిక్ నిలిచింది. అయితే ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి మహిళగా నిలిచి రికార్డు సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వైపు కేవలం 6.2 శాతం మందే మొగ్గు చూపారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఆకర్షిస్తున్న మహిళగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ (36.3 శాతం) నిలిచారు. నటి ప్రియాంక చోప్రా (31.2), టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (17.4) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
సచిన్ కానుక కన్నా నాకు అదే గొప్ప!
రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించి.. దేశ ప్రజల నిరీక్షణకు తెరదించింది సాక్షి మాలిక్. ఓ సాధారణ బస్సు డ్రైవర్ కూతురు అయిన సాక్షి జీవితం రియో పతకంతో పూర్తిగా మారిపోయింది. రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన ఆమెకు దేశ నీరాజనాలు పట్టింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నగదు నజరానాను ఆమెకు ప్రకటించాయి. హర్యానాలో అయితే ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో హర్యానా ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. హర్యానా ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నజరానా ప్రకటించగా, ఢిల్లీ ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా సాక్షితోతోపాటు షట్లర్ సింధు, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, సింధు కోచ్ గోపీచంద్‌కు బీఎండబ్ల్యూ కార్లు కానుకగా అందాయి. హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ వారికి సచిన్ చేతులమీదుగా ఈ కార్లను బహూకరించారు. ఖరీదైన బీఎండబ్ల్యూ కారు సాక్షికి కానుకగా అందినా తాను మాత్రం ఓల్డ్ పోలో కారులోనే ప్రయాణిస్తుందట. అందుకు కారణం.. 'రెండేళ్ల కిందట మా నాన్న బ్లూకలర్ ఫోక్స్‌వ్యాగన్ పోలో కారును కానుకగా ఇచ్చారు. ఈ కారు ఇచ్చిన తర్వాత నేను గ్లాస్గో కామన్వెల్గ్ క్రీడల్లో రజత పతకాన్ని గెలిచారు. ఇక ముందు కూడా ఇదే కారును వాడుతాను. బీఎండబ్ల్యూను మా నాన్నకు కానుకగా ఇస్తాను. ఆయన నాకోసం ఎన్నో త్యాగాలు చేశారు' అని సాక్షి చెప్పింది. ఎంతైనా బీఎండబ్ల్యూ కన్నా కన్నతండ్రి ఇచ్చిన కానుకే గొప్పది కదా! -
సింధును సత్కరించిన ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ పతక విజేతలు పి.వి.సింధు, సాక్షి మలిక్‌లను ఢిల్లీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రజతం నెగ్గిన సింధుకు రూ. 2 కోట్లు, కాంస్యం సాధించిన సాక్షికి రూ. కోటి నజరానాను అందజేశారు. వారిద్దరి కోచ్‌లు గోపీచంద్, మన్దీప్ సింగ్‌లకు రూ. 5 లక్షల చొప్పున, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానిక బాత్రా, అథ్లెట్ లలిత్ మాథూర్‌లకు రూ. 3 లక్షల చొప్పున బహూకరించారు. పతక విజేతల ఫిజియోలు సుబోధ్, కిరణ్‌లను కూడా సీఎం కేజ్రీవాల్ ఘనంగా సత్కరించారు. ‘ఇక్కడేం జరిగిందో తెలుసుకోడానికి రియోలో మా వద్ద ఫోన్లే లేవు. కానీ వచ్చాకే తెలిసింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని... ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారని. ఇంతగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు’ అని సింధు తెలిపింది. బ్యాడ్మింటన్ ఆటలోని గేమ్ ప్లాన్, వ్యూహాలపై పుస్తకం రాస్తానని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులు పాల్గొన్నారు. ‘ఫైనల్’ వీక్షకులు 1.72 కోట్లు ముంబై: సింధు, మారిన్‌ల మధ్య రియోలో జరిగిన పసిడి పతక పోరును టీవీల్లో కోటి 72 లక్షల మంది వీక్షించినట్లు స్టార్ ఇండియా నెట్వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టార్ ఇండియా యాప్ ‘హాట్‌స్టార్’లో 50 లక్షల మంది ఈ మ్యాచ్‌ను చూశారని ఆ సంస్థ వెల్లడించింది. భారత్‌లో ఆ రోజు మొత్తం టీవీ కార్యక్రమాల్లో ఇదే అత్యధిక వీక్షణ రికార్డని స్టార్ స్పోర్ట్స సీఈఓ నితిన్ కుక్రేజా పేర్కొన్నారు. ఒక క్రికెటేతర ఆటను ఈ స్థారుులో వీక్షించడం కూడా ఇదే తొలిసారని ఆయన చెప్పారు. -
విజేతలైతేనే మీవాళ్లా?!
సందర్భం దివంగత నేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూళ్లను నెలకొల్పి వందలాదిమంది క్రీడాకారులకు సదుపాయాలు కల్పించారు. ఇప్పుడలాంటి శ్రద్ధ తీసుకునేవారేరీ? సింధూ ఒలింపిక్స్‌లో రజతం గెలిచింది. యావత్ భారతదేశం పరువు నిలిపిన ఆ ఆణిముత్యాన్ని ఘనంగా సన్మానించుకున్నాం. ఈ ఘనతని తమదిగా చెప్పుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలు పోటీపడ్డారు. ఆ క్రీడాకారిణిని తన ప్రభుత్వంలో ఉద్యో గిగా మారుద్దామనుకున్నారు. చిత్రంగా ఒలింపిక్స్ క్రీడలు ఎలా జరుగుతాయి, తరువాతి ఒలింపిక్స్‌కు ఎంతకాలం ముందు వేదికను నిర్ణయిస్తారో అవగాహన లేకుండా అమరావతిలో త్వరలో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్నారు ఒక నేత. ఇదీ, ఏలికలకు క్రీడలపై ఉన్న అవగాహన! మన క్రీడారంగం ఒక్క పతకంతోనో, ఒక్క పరుగుతోనో చంకలు గుద్దుకోవడం రేపటి క్రీడాకారుల పట్ల చేస్తున్న నేరం. నేదురమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్పోర్ట్స్ స్కూల్‌ని హకీంపేట్‌లో నిర్మిస్తే, వైఎస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక జిల్లాకి ఒక స్పోర్ట్స్ స్కూల్ విధానంతో తొలుత వైజాగ్, కడప, కరీంనగర్, మెదక్, విజయవాడలలో స్పోర్ట్స్ స్కూళ్లను నెలకొల్పి ఒక్కొక్కటీ 400 నుండి 450 మంది క్రీడాకారులకు వసతి, సౌకర్యాలు, కోచ్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కానీ, వైఎస్ ఆకస్మిక మరణంతో ఆ స్కూళ్లు నామమాత్రంగా మిగిలాయి. అవినీతి కూపాలుగా మారిపోయాయి. కొన్ని నిధులు పెంచినా, క్రీడాకా రుల భోజనానికి మాత్రం పదేళ్ల క్రితం నిర్ణయించిన భత్యం రూ. 100–150 ఇస్తున్నారు. దీనితో వాళ్లు పౌష్టికాహారానికి దూరమైనారు. నాలుగోlతరగతి మొదలు ఇంటర్ చదివే వారిని స్పోర్ట్స్ స్కూళ్లలో చేర్చుకునే అవకాశం ఉన్నా, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సిఫార్సు మేరకు ప్రవేశాలు పొందాలనే నిబంధన ఉండటంతో దొడ్డిదారి ప్రవేశాలు పెరిగి, నిజమైన క్రీడాకారులు బయటే ఉండిపోతున్నారు. దివంగత రాజశేఖర రెడ్డిగారి హయాంలో కరణం మల్లీశ్వరి, మెదక్ జిల్లాకు చెందిన గీతా, శంకర్లు అత్యంత ప్రతిభ చూపారు. ఈ తారలు అధికారుల అవినీతి వ్యవహార శైలితో ఇప్పుడు కనుమరుగైపోయారు. మనకు కేవలం ఒక్కరో, ఇద్దరో స్పోర్ట్స్ తారలు దొరికినా, ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నుంచి కనబడుతున్నారు. ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్స్ నుంచి అలాంటి తారలు రాకపోవడానికి కారణం ప్రైవేట్ స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్లకు స్థలాలు, తాయిలాలు ఇస్తున్న ప్రభుత్వాలు తాము నడిపే స్పోర్ట్స్ స్కూల్స్ కోచ్‌లకు కేవలం 20 నుండి 25 వేల రూపాయలు వేతనం ఇస్తూ వారిని నిరుత్సాహపరుస్తున్నాయి. అలాంటి ప్రభుత్వాలు ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎలా తయారుచేస్తాయి? ఈ స్పోర్ట్స్ స్కూళ్లకి కొత్త నియామకాలు ఏవీ చేపట్టకుండా రిటైర్ అయిన వారినే కొన సాగిస్తూ మేమూ స్పోర్ట్స్ స్కూల్స్ నడిపిస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి తప్ప, అందులో నిజాయితీ లేదు. పాఠశాలల్లో స్పోర్ట్స్ గురించి పాఠ్యాంశాలుగానీ, క్రీడా మైదానం గానీ, శిక్షితులైన పీఈటీలు కానీ లేరు. ప్రైవేట్ పాఠశాలలైతే ఎంత ఉత్సాహం ఉన్న విద్యార్థినైనా ఆటలు, కళలవైపు వెళ్లనీయకుండా మార్కులూ, ర్యాంకుల బందిఖానాలకు పరిమితం చేస్తుంటే విద్యాశాఖ అడిగిన పాపాన పోలేదు. పాఠశాలల్లో ఎక్కడా ఆటస్థలం కనిపించక పోయినా అధికారులకు కాసులు కన్పిస్తే చాలు ప్రైవేటు పాఠశాలలు నడుపుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇలా ఆటలను నిర్వీర్య పరుస్తున్న విద్యా వ్యవస్థ కలిగి ఉన్న ప్రభుత్వాలు స్వంతంగా కృషి చేసి పతకాలను దక్కిం చుకున్న వారికి నజరానాలు గుప్పించి వారిని తామే తయారు చేశా మన్నట్లు పోజులివ్వడం ఎంతవరకు సబబు? ఈ అధినేతలు నిజంగా క్రీడాకారులను ప్రోత్సహించాలనుకుంటే ఒలింపిక్స్ నిర్వహిం చడం కాదు, కనీసం ఒలింపిక్స్ దాకా వెళ్లే స్థాయిలోనైనా క్రీడాకారులని తయారుచేసుకోవాలి. కానీ, నేలవిడచి సాము చేస్తామంటే చరిత్రహీనులౌతారు. వచ్చేసారి జపాన్ ఒలింపిక్స్‌కైనా పదిమంది క్రీడాకారులను పంపే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు కృషిచేయాలి. అంతేగానీ గెలిచినవారు మావారంటే మావారని గొప్పలు చెప్పుకోవడం మానాలి. అచ్యుతరావు వ్యాసకర్త రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు-93910 24242 -
సింధు మ్యాచ్.. సెన్సేషనల్ హిట్!
రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు అసమాన పోరాటం దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన ఆమె ఫైనల్ మ్యాచ్.. దేశ ప్రజలను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. ప్రపంచ నంబర్, స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో సింధు తలపడిన రియో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్‌ను ఏకంగా భారత్‌లో 6.65 కోట్లమంది చూశారు. భారత్ పరంగా చూసుకుంటే రియో ఒలింపిక్స్‌లో అత్యధికులు చూసిన సింగిల్ మ్యాచ్ ఇదే. అంతేకాదు దేశంలో అత్యంత పాపులర్ అయిన 'ద కపిల్ శర్మ షో' వంటివాటిని సింధు ఫైనల్ మ్యాచ్ అధిగమించడం విశేషం. 'ద కపిల్ శర్మ షో'ను ప్రతివారం ఐదు కోట్ల మంది వీక్షిస్తుండగా సింధు ఫైనల్ మ్యాచ్‌ను ఏకంగా 6.65 కోట్లమంది వీక్షించారని మీడియా రీసెర్చ్ సంస్థ జపర్ తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో సింధు ఆడుతున్న మ్యాచ్‌లకు క్రమంగా వ్యూయర్షిప్ పెరిగింది. మొదట ఆమె మ్యాచ్‌లకు 16.4 మిలియన్ల వ్యూయర్షిప్ ఉండగా.. ఫైనల్ మ్యాచ్‌కు వచ్చేసరికి అది అమాంతం పెరిగిపోయింది. ఇక, ఆమె సెమీఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన ప్రేక్షకుల్లో 57.4శాతం మంది ఫైనల్ మ్యాచ్‌ను కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. సింధు ప్రతిభ మీద ఉన్న అపారమైన నమ్మకమే ఆమె ఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో చూసేందుకు చాలామందిని ప్రోత్సహించినట్టు నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్‌లో రికార్డు వ్యూయర్షిప్ పీవీ సింధుకు స్వస్థలం హైదరాబాద్ నుంచి భారీ మద్దతు లభించినట్టు టీవీ వ్యూయర్షిప్ స్పష్టం చేస్తున్నది. దేశంలో ముంబై తర్వాత అత్యధికంగా సింధు మ్యాచ్‌ను చూసింది హైదరాబాదీలే. నగరాల వ్యూయర్షిప్ విషయంలో ముంబై ప్రథమస్థానంలో ఉంటే హైదరాబాద్ ద్వితీయ స్థానంలో ఉంది. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వివరాల ప్రకారం రెండువారాలపాటు జరిగిన రియో ఒలింపిక్స్‌ను దేశంలో తొమ్మిది చానెళ్లలో 22.8 కోట్లమంది వీక్షించారు. -
సగర్వంగా... సంతోషంగా...
* రాష్ట్రపతి భవన్లో ‘స్పోర్ట్స్ డే’ అవార్డుల ప్రదానం * ఖేల్‌రత్న అందుకున్న సింధు, సాక్షి, దీప, జీతూరాయ్ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ పరువు నిలబెట్టిన క్రీడారత్నాలకు జాతీయ క్రీడాదినోత్సవాన ఘనంగా సత్కారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది ముగ్గురు మహిళలకు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు దక్కింది. సోమవారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన క్రీడాపురస్కారాల వేడుకలో తెలుగమ్మాయి పి.వి. సింధుతో పాటు రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. షూటర్ జీతూరాయ్ కూడా ఈ అవార్డు అందుకున్నాడు. ఇలా ఒకే ఏడాది నలుగురు క్రీడాకారులకు అత్యున్నత క్రీడాపురస్కారం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. గతంలో బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీకోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్‌లకు 2009లో రాజీవ్ ఖేల్త్న్ర అందజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతియేటా ఆగస్టు 29న క్రీడాదినోత్సవాన్ని నిర్వహించే సంగతి తెలిసిందే. రియోలో బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు రజతం, రెజ్లింగ్‌లో సాక్షి కాంస్యం గెలిచారు. ఇక దీప జిమ్నాస్టిక్స్‌లో అసాధారణ విన్యాసంతో ఆకట్టుకుంది. తృటిలో కాంస్యం చేజారినా.. ఆమె చేసిన ప్రాణాంతక ప్రొడునోవా విన్యాసానికి గొప్ప గౌరవం లభించింది. ‘ఖేల్త్న్ర’ అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ. 7.5 లక్షల నగదు, సర్టిఫికెట్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. మరో 15 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు స్వీకరించారు. ఆరుగురు కోచ్‌లు ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. క్రీడల్లో ప్రతిభకు పదునుపెడుతున్న పలు సంస్థలకు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డులు ఇచ్చారు. పర్వతారోహకుడు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఇన్స్పెక్టర్ జనరల్ హర్భజన్ సింగ్‌కు ‘టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్’ అవార్డు లభించింది. అర్జున అవార్డును అందుకోవాల్సిన క్రికెటర్ రహానే అందుబాటులో లేకపోవడం వల్ల కార్యక్రమానికి రాలేదు. తెలుగు వెలుగులు ఈ సారి జాతీయ క్రీడాదినోత్సవ వేదికపై తెలుగువారికి చక్కని గుర్తింపు లభించింది. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు అత్యున్నత క్రీడాపురస్కారం అందుకుంటే... అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థారుులో పోటీపడే అథ్లెట్లను తయారు చేస్తున్న సీనియర్ కోచ్ నాగపురి రమేశ్‌కు ద్రోణాచార్య అవార్డు లభించింది. మాజీ అథ్లెట్ సత్తి గీత ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. అవార్డు గ్రహీతలు రాజీవ్ ఖేల్త్న్ర (పతకం, రూ. 7.5 లక్షలు): పి.వి.సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూరాయ్ (షూటింగ్). ద్రోణాచార్య (ట్రోఫీ, రూ. 7 లక్షలు): నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), రాజ్ కుమార్‌శర్మ (క్రికెట్లో కోహ్లి కోచ్), విశ్వేశ్వర్నంది (జిమ్నాస్టిక్స్‌లో దీప కోచ్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్), సాగర్మల్ దయాల్ (బాక్సింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (ట్రోఫీ, రూ. 5 లక్షలు): రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్, రఘునాథ్ (హాకీ), గుర్‌ప్రీత్‌సింగ్, అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫోగట్, అమిత్ కుమార్, వీరేందర్ సింగ్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ (మెమెంటో, రూ. 5 లక్షలు): సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనుస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షిల్కే (రోరుుంగ్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: యువ ప్రతిభావంతులను ప్రోత్సహించిన కేటగిరీ: హాకీ సిటిజన్ గ్రూప్, దాదర్ పార్సి జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్, ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్; కార్పొరేట్ సామాజిక బాధ్యత కేటగిరీ: ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఫైనాన్స కార్పొరేట్ లిమిటెడ్; క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమ కేటగిరీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రీడాభివృద్ధి కేటగిరీ: సుబ్రతో ముఖర్జీ స్పోర్ట్స ఎడ్యుకేషన్ సొసైటీ. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ: పంజాబ్ యూనివర్సిటీ వీల్‌చెయిర్‌లో... రియో ఒలింపిక్స్‌లో గాయపడిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ అర్జున అవార్డును అందుకుంది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో... వీల్ చెయిర్లో వచ్చి పురస్కారం అందుకుంది. -
సన్నద్ధం కాకుండానే...
* ‘రియో’లో పేస్-బోపన్న జంట * వైఫల్యంపై భూపతి అభిప్రాయం ముంబై: ఎలాంటి సన్నాహాలు లేకుండా రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నందుకే లియాండర్ పేస్-రోహన్ బోపన్న జంట తొలి రౌండ్లోనే నిష్కమ్రించిందని భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి అభిప్రాయపడ్డాడు. ‘పేస్-బోపన్న కలసి సాధన చేయలేదు. మేమిద్దరం ఏథెన్‌స, బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆడిన సమయంలో పలు టోర్నమెంట్లలో కలిసి ఆడాం. కానీ పేస్-బోపన్న అలా చేయలేదు. ఫలితంగా పురుషుల డబుల్స్‌లో పతకంపై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న-సానియా జంటకు పతకం నెగ్గే అవకాశం లభించినా వదులుకున్నారు’ అని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా భూపతి వ్యాఖ్యానించాడు. -
గౌరవం కాపాడింది... మన అమ్మాయిలే!
జాతీయ క్రీడా అవార్డు విజేతలకు ప్రధాని ఆతిథ్యం నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ విజేతలు పీవీ సింధు, సాక్షి మలిక్‌లతో పాటు జాతీయ క్రీడా పురస్కారాలు పొందిన అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7, రేస్ కోర్స్ రోడ్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా సింధు, సాక్షి తాము సాధించిన పతకాలను ఆయనకు చూపించారు. నేడు (సోమవారం) జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సింధు, సాక్షి, దీప, జీతూ రాయ్‌లు రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర పురస్కారాన్ని అందుకోనున్నారు. అలాగే అర్జున, ద్రోణాచార్య, మేజర్ ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారాలు ఆయా ఆటగాళ్లు స్వీకరించనున్నారు. ‘ప్రధానికి నా రజత పతకాన్ని చూపించాను. దేశం గర్వించదగ్గ స్థాయిలో చాలా బాగా ఆడావు అని ప్రశంసించారు. ఆయనతో సంభాషణ చాలా సంతోషాన్నిచ్చింది’ అని సింధు తెలిపింది. సాక్షి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘నన్ను కొట్టవు కదా’ అని ప్రధాని సరదాగా అన్నట్టు తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో దేశ గౌరవాన్ని కాపాడింది మన అమ్మాయిలేనని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా తన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆయన వీరిని ప్రశంసించారు. ‘మనకు వచ్చిన రెండు పతకాలు ఈ దేశ పుత్రికలు సాధించినవే. ఏ విషయంలోనూ తాము తక్కువ కాదని వారు మరోసారి నిరూపించుకున్నారు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతానికి చెందిన ఈ ముగ్గురు మనందరినీ గర్వపడేలా చేశారు. తమ పిల్లలను ఏదో ఒక ఉద్యోగంలో చేరేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ క్రీడలతో సమయం వృథాగా భావిస్తారు. కానీ ఇప్పుడు వారి ఆలోచనాసరళిని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది’ అని ప్రధాని అన్నారు. ప్రతీ రాష్ట్రం ఏదేని రెండు క్రీడలపై ఫోకస్ పెట్టాలని, క్రీడల అభివృద్ధికి ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్‌లో ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపడేందుకు ఇప్పటికే తాము టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మరోవైపు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్‌ను గుర్తుచేసుకున్నారు. క్రీడా స్ఫూర్తి, దేశ భక్తికి ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. -
సింధు, సాక్షి.. గోల్డ్ మెడళ్లు సాధించారా?
-
సింధు, సాక్షి.. గోల్డ్ మెడళ్లు సాధించారా?
రియో ఒలింపిక్స్‌లో పతకాల కోసం భారతీయులు కళ్లు కాయలు గాచేలా ఎదురుచూస్తే.. ఇద్దరు అమ్మాయిలు ఆ లోటును తీర్చారు. మొదట రెజ్లర్ సాక్షి మాలిక్ గొప్ప పోరాటపటిమతో కాంస్య పతకాన్ని సాధిస్తే.. ఆ తర్వాత షట్లర్ పీవీ సింధు స్ఫూర్తిదాయక పోరాటంతో రజతాన్ని కైవసం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై భారత్ గౌరవాన్ని నిలబెట్టిన ఈ ఇద్దరు అమ్మాయిలు ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. పీవీ సింధు, సాక్షితోపాటు ఖేల్ రత్న, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలైన క్రీడాకారులు కూడా ప్రధాని మోదీతో సమావేశమైన వారిలో ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పే సమయంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ కొంత తడబడ్డారు. రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్, పీవీ సింధు గోల్డ్ మెడలిస్టులని ఆయన మీడియాతో పేర్కొన్నారు. సాక్షాత్తు కేంద్ర క్రీడాశాఖ మంత్రే సింధు, సాక్షి మెడళ్ల విషయంలో తత్తరపడటం గమనార్హం. రియో ఒలింపిక్స్‌లోనే ప్రోటోకాల్ పాటించకుండా దురుసుగా విజయ్ గోయల్ ప్రవర్తించడం అప్పట్లో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. -
ఆయననే పెళ్లి చేసుకుంటా.. పేరుమాత్రం సీక్రెట్!
రియో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించి చరిత్ర సృష్టించింది రెజ్లర్ సాక్షి మాలిక్. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి దేశాన్ని ఆనందంలో ముంచెత్తిన ఈ అమ్మడు ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నది. అది కూడా సహచర రెజ్లింగ్ ఆటగాడినే. బెంగాలీ దినపత్రిక 'ఆనంద్‌బజార్ పత్రిక'కు ఇంటర్వ్యూ వచ్చిన సాక్షి.. తన పెళ్లి గురించి మనసులో మాటను చెప్పింది. 'అతను చాలా సపోర్టివ్‌గా ఉంటాడు. నా కలలను తన కలలుగా భావిస్తాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నాకో మంచి స్నేహితుడు దొరికినట్టే' అని సాక్షి తెలిపింది. అయితే, తనకు కాబోయే భర్త పేరు మాత్రం 'సీక్రెట్' అని చెప్పింది. ఈ ఏడాదే తాము పెళ్లి చేసుకుంటామని వివరించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన సన్నాహాలకు తన పెళ్లి ఏమాత్రం అడ్డు కాబోదని చెప్పింది. 'అతను నా సన్నాహాలకు సహాయంగా నిలుస్తాడు. పెళ్లి తర్వాత రెజ్లింగ్ క్రీడను కొనసాగించడం ఏమీ సమస్య కాబోదని నేను అనుకుంటున్నా' అని తెలిపింది. -
ఒలింపిక్ విజేతలతో సెల్ఫీ దిగిన సచిన్
-
బీఎండబ్ల్యూ కార్లు అందజేయనున్న సచిన్
-
బీఎండబ్ల్యూ కార్లు అందజేయనున్న సచిన్
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. సచిన్ శనివారం రాత్రి నగరానికి చేరుకుని ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆ సందర్భంగా నలుగురు ఒలింపియన్లకు బీఎండబ్ల్యూ కార్లను అందజేయనున్నారు. రియో ఒలింపిక్స్‌లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, కాంస్య పతక విజేత.. రెజ్లర్ సాక్షి మాలిక్‌లతో పాటు 52 ఏళ్ల తర్వాత దేశం తరఫున జిమ్నాస్టిక్స్‌లో పాల్గొని తృటిలో పతకం చేజార్చుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, సింధు కోచ్ గోపిచంద్‌లకు ఆయన బీఎండబ్ల్యూ కార్లను అందజేయనున్నారు. నగరానికి చెందిన చాముండేశ్వరినాథ్ ఫౌండేషన్ తరపున ఈ బహుమతులను సచిన్ తన చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. -
సింధు సిల్వర్ మెడల్ గెలిచినా...
రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టింది పీవీ సింధు. ఒలింపిక్స్‌లో సింధు అద్భుతమైన పోరాటపటిమను చూపినప్పటికీ.. ఆమె వరల్డ్ ర్యాంకు ఏమీ మారలేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించిన తాజా ర్యాంకుల్లో ఆమె పదో స్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు ఒలింపిక్స్‌లో అంచనాల మేరకు ఆడలేకపోయిన భారత షట్లర్ సైనా నేహ్వాల్ ర్యాంకు మరింత దిగజారింది. తాజా ప్రదర్శన కారణంగా స్థానాలు పడిపోయిన సైనా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో విఫలమైన భారత షట్లర్ల జోడీ గుత్తా జ్వాలా, అశ్వని పొన్నప్ప కూడా నాలుగు స్థానాలు దిగజారి 26 ర్యాంకుకు పరిమితమయ్యారు. అయితే, పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మాత్రం తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని అతను 10వర్యాంకులో నిలువగా.. మరో భారత షట్లర్ అజయ్ జయరాం కూడా ర్యాంకును మెరుగుపరుచుకొని 22వస్థానంలో నిలిచాడు. -
హామీ ఇస్తేనే... తిరిగి స్వదేశానికి వెళతా
ఇథియోపియా రజత విజేత లిలెసా అడిస్ అబబా: రియో ఒలింపిక్స్ వేదికగా తమ దేశ రాజకీయాంశాలపై నిరసన వ్యక్తం చేసిన మారథాన్ రజత పతక విజేత ఫెయిసా లిలెసా ఇథియోపియా వెళ్లేందుకు ససేమిరా అంటున్నాడు. తనకెలాంటి శిక్ష విధించబోమని ప్రభుత్వం నుంచి హామీ లభిస్తేనే తిరిగి వెళతానన్నాడు. రియోలో మారథాన్ రజతం నెగ్గిన అతను పోడియం వద్ద ఇథియోపియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇదిలావుండగా... 8 పతకాలు గెలిచిన ఇథియోపియా అథ్లెట్లకు స్వదేశంలో ప్రభుత్వ, క్రీడాధికారులు ఘనస్వాగతం పలికారు. అయితే లిలెసాకు హామీపై వ్యాఖ్యానించేందుకు అధికారులు నిరాకరించారు. -
నాకు నీళ్ల సమస్య రాలేదు: కవిత
రియో ఒలింపిక్స్ మారథాన్ సమయంలో తనకు కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని భారత అథ్లెట్ ఓపీ జైషా వాపోయిన సంగతి తెలిసిందే. అయితే అదే మారథాన్‌లో పాల్గొన్న మరో భారత క్రీడాకారిణి కవిత మాత్రం తనకు ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పింది. ‘జైషా ఏం చెప్పిందో, ఎందుకు చెప్పిందో నాకు తెలియదు. నాకు దాహం అయిన ప్రతిసారీ అందుబాటులో మంచినీళ్లు ఉన్నాయి. ముందు రోజు కూడా మన అధికారులు వచ్చి నాకు ప్రత్యేక డ్రింక్స్ ఏమైనా కావాలా అని అడిగారు. కానీ అవసరం లేదని చెప్పాను’ అని కవిత తెలిపింది. జైషా ఫిర్యాదుపై ఇప్పటికే విచారణ ప్రారంభం కాగా... కవిత చెప్పిన విషయాలు భిన్నంగా ఉండటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరగనుంది. -
అభినమాన సందేహం 'సాక్షి'గా...
రెజ్లర్ సాక్షి మలిక్‌కు భారీ స్వాగతం ఘనంగా సత్కరించిన హరియాణా ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నగదు పురస్కారం అందజేత న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన రెజ్లర్ సాక్షి మలిక్ సగర్వంగా సొంతగడ్డపై అడుగు పెట్టింది. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించింది. హరియాణా క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్ రియో నుంచి ఆమె వెంట రాగా, ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రులు స్వాగతం పలికారు. ముందుగా సాక్షి తల్లిదండ్రులు ఆమెను అభినందనలతో ముంచెత్తగా... ఆ తర్వాత క్రీడాభిమానులు ఎయిర్పోర్ట్ ముందు బ్యాండ్ బాజాలతో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. అనంతరం ఝజ్జర్ జిల్లా బహదూర్‌గఢ్‌లో హరియాణా ప్రభుత్వం నిర్వహించిన అధికారిక సన్మాన కార్యక్రమంలో సాక్షి పాల్గొంది. కాంస్య పతకం గెలుచుకున్న సాక్షికి ఈ సందర్భంగా రూ. 2.5 కోట్ల నగదు పురస్కారపు చెక్‌ను ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అందజేశారు. దీంతో పాటు హరియాణా ప్రభుత్వం క్లాస్-2 ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేసింది. సాంప్రదాయ ‘పగ్డీ’తో సాక్షిని సత్కరించిన ఖట్టర్, బేటీ పఢావో-బేటీ బచావో కార్యక్రమానికి హరియాణా ప్రచారకర్తగా సాక్షిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత అభిమానులు కరెన్సీ నోట్ల దండలను ఆమె మెడలో వేశారు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతీ హరియాణా క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు కూడా సీఎం చెప్పారు. అనంతరం భారీ జన సందోహం తోడు రాగా సాక్షి తన స్వగ్రామం మోఖ్రాకు వెళ్లింది. మోఖ్రాలో స్పోర్ట్స్ నర్సరీ, స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి... సాక్షి ఇద్దరు కోచ్‌లకు చెరో రూ. 10 లక్షల పురస్కారాన్ని ప్రకటించారు. కర్ణాటక సింధు! సాక్షి సత్కార కార్యక్రమంలో మాట్లాడే సమయంలో సీఎం ఖట్టర్ తడబడ్డారు. ముందుగా సాక్షి ఘనతల గురించి గొప్పగా చెప్పిన ఆయన ఇద్దరు అమ్మాయిలు దేశ గౌరవం నిలబెట్టారని ప్రశంసించారు. అయితే సింధు పేరు గుర్తుకు రాక పక్కవారిని ‘ఆ రెండో అమ్మాయి పేరు ఏమిటి’ అని అడిగి తెలుసుకున్నారు. దానితో ఆగిపోకుండా కర్ణాటకకు చెందిన సింధు అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. చాలా గర్వంగా ఉంది... స్వదేశంలో తనకు లభించిన స్వాగతం పట్ల సాక్షి మలిక్ అమితానందం వ్యక్తం చేసింది. తన 12 ఏళ్ల శ్రమకు తగిన ఫలితం లభించిందని ఆమె ఉద్వేగంగా చెప్పింది. ‘ఇంత మంది నా కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు అండగా నిలిచిన, ప్రార్థనలు చేసినవారందరికీ కృతజ్ఞతలు. ఒలింపిక్ పతకం గెలవాలనే నా కల నిజమైంది. ముగింపు ఉత్సవంలో పతాకధారి కావడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని 23 ఏళ్ల సాక్షి చెప్పింది. అమ్మాయికి కుస్తీ ఎందుకు అంటూ తమను చాలా మంది విమర్శించారని, ఇప్పుడు ఆమె ఘనత చూసి గర్విస్తున్నామని ఆమె తల్లిదండ్రులు సుఖ్బీర్, సుదేశ్ చెప్పారు. -
సింధుకు రూ.6లక్షల వజ్రాభరణం
ఎన్ఏసీ జ్యూవెలరీ ఎండీ అనంత పద్మనాభన్ విజయవాడ స్పోర్ట్స్ : రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు రూ.6లక్షల విలువైన వజ్రాభరణం బహూకరించనున్నట్లు ఎన్ఏసీ జ్యూవెలర్స్ ఎండీ అనంతపద్మనాభన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఓ కార్యక్రమం నిర్వహించి సింధుకు సిగ్నేచర్ నెక్‌పీస్‌ను బహూకరిస్తామని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌లోనే ఉమెన్ ఫ్రీస్టయిల్(58 కేజీల) విభాగం కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, జిమ్నాస్టిక్స్‌లో విశేష ప్రతిభ కనబరిచిన దీపా కర్మాకర్‌కు రూ.3లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌లను అందిస్తామని తెలిపారు. యువతకు స్ఫూర్తినిచ్చేందుకే తాము వీరికి ఆభరణాలు బహూకరించి గౌరవిస్తున్నట్లు వివరించారు. -
ఒలింపిక్స్‌లో భారతే చెత్త దేశం!
120 కోట్ల జనాభా. ప్రపంచ అగ్రదేశాలకు దీటుగా జీడీపీ. అయినా విశ్వక్రీడల వేదిక ఒలింపిక్స్‌లో భారత్‌కు దక్కిన పతకాలు రెండే. ఈ రెండు పతకాలైనా దక్కినందుకు దేశంలో సంబురాలు. మరీ ఒలింపిక్స్‌లో మన ప్రదర్శన గురించి బయటి ప్రపంచం ఏమనుకుంటోందంటే.. చాలానే నోరు పారేసుకుంటోంది. 'రియో ఒలింపిక్స్‌లో భారత్‌దే అత్యంత చెత్త ప్రదర్శన' అని ఓ న్యూజిల్యాండ్ దినపత్రిక నోరు పారేసుకుంటే.. ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్టు పీయర్స్ మోర్గాన్ మరింత చెత్త వ్యాఖ్యలు చేసి.. ట్విట్టర్లో దుమారం రేపాడు. '120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు తెచ్చుకున్నందుకు సంబురాలు జరుపుకొంటోంది. ఎంత చికాకు కలిగించే విషయమిది' అంటూ మోర్గాన్ చేసిన ట్వీట్‌పై భారతీయ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇతర దేశాలపై నోరు పారేసుకునేముందు నీ సొంత పనేంటో చూసుకోమని ఘాటుగా బదులిచ్చారు. ఎవరైనా, ఏదైనా గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం మీ సంస్కృతిలో చికాకు కలిగించే విషయం కావొచ్చుకానీ, మా దేశ సంస్కృతిలో కాదంటూ గట్టిగా మందలించారు. మరోవైపు 'ఒలింపిక్స్ ఇండియా వరెస్ట్ కంట్రీ' అనే శీర్షికతో న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రిక ఓ కథనాన్ని వండివార్చింది. భారత్ రెండు మెడల్స్ సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిందని, జనాభా, జీడీపీ ప్రకారం చూసుకుంటే.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇదే చెత్త ప్రదర్శన అని పేర్కొంది. ఇక ఒక్క పతకం కూడా గెలువకుండా ఇంటిముఖం పట్టిన మన దాయాది పాకిస్థాన్‌ను అసలు లెక్కలోకే రాదంటూ ఈ పత్రిక ఏకిపారేసింది. -
సాక్షి మాలిక్ కు ఘన స్వాగతం
-
రెజ్లర్ సాక్షి రాక నేడే...
రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మలిక్ నేడు (బుధవారం) భారత్‌కు రానుంది. తెల్లవారుజాము 3.50 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అడుగుపెట్టనున్న సాక్షికి హర్యానా రాష్ట్ర ఐదుగురు మంత్రులు స్వాగతం పలకనున్నారు. ‘నా దేశానికి, నా స్వంత ఇంటికి రాబోతున్నాను’ అని సాక్షి ట్వీట్ చేసింది. రోహ్తక్ జిల్లా మొఖ్రా ఖాస్ గ్రామంలోని తన ఇంటికి ఆమెతో పాటు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా వెళ్లనున్నారు. అక్కడ భారీ జనసమూహం మధ్య ఆమెకు సన్మానం చేయనున్నారు. కాంస్యం సాధించిన తనకు రూ.2.5 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
మరిన్ని విజయాలు సాధిస్తా: సింధు
బ్యాడ్మింటన్ స్టార్ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సన్మానం * కోచ్ పుల్లెల గోపీచంద్‌కు కూడా * నగదు ప్రోత్సాహకాలు అందజేత విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించినప్పటికీ... ఇప్పట్లో తనకు ఉద్యోగం చేసే ఉద్దేశం లేదని... భవిష్యత్‌లో దేశానికి మరిన్ని విజయాలు, పతకాలు అందించాలనే లక్ష్యంపైనే దృష్టి సారించినట్లు బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన 21 ఏళ్ల ఈ తెలుగు తేజం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం తన కోచ్ పుల్లెల గోపీచంద్, తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతో కలిసి విజయవాడకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘అందరికీ నమస్కారం, ఇంత మంది నాకోసం వస్తారని ఎన్నడూ ఊహించలేదు. మా తాతగారిది ఈ ఊరే. చిన్నప్పుడు వచ్చిన ప్రతిసారీ అప్పట్లో గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆడుతుంటే చూశాను. ఆయన ఆటతో స్ఫూర్తి పొందాను. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తా. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి మీ ప్రార్థనలు, కోచ్ గోపీచంద్, నా తల్లిదండ్రులే ప్రధాన కారణం’ అని సింధు వ్యాఖ్యానించింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింధు కలిసి కాసేపు సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం సింధుతోపాటు గోపీచంద్, శ్రీకాంత్, చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ధ్యాన్‌చంద్ అవార్డుకు ఎంపికైన మాజీ అథ్లెట్ సత్తి గీతను సన్మానించారు. అనంతరం రాత్రి కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవంలో పాల్గొన్న సింధు, గోపీచంద్‌లతోపాటు మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్‌లకు చంద్రబాబు చెక్‌లు అందజేశారు. సింధుకు రూ. 3 కోట్లు... వెయ్యి గజాల స్థలం పత్రాలు... గోపీచంద్‌కు రూ. 50 లక్షలు... శ్రీకాంత్‌కు రూ. 25 లక్షలు అందజేశారు. ఏసీఏ నజరానా రూ. 25 లక్షలు... రజత పతక విజేత సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) నజరానా ప్రకటించింది. సింధు కు రూ.25 లక్షలు... కోచ్ గోపీచంద్‌కు రూ. 10 లక్షలు నజరానా ప్రకటించింది. ఏసీఏ తరఫున వీరిద్దరికీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు చెక్‌లు అందజేశారు. అంతకుముందు సింధును, ఆమె తల్లిదండ్రులు రమణ, విజయలను ఆంధ్రప్రదేశ్ క్రీడా సంఘాలు భారీ గజమాలతో సన్మానించాయి. సింధును ఆదర్శంగా తీసుకోవాలి.... క్రమశిక్షణతోనే ఉన్నత స్థాయికి చేరుకుంటార నడానికి సింధునే ఆదర్శమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. స్థానిక విజయవాడ క్లబ్లో క్లబ్ ఆధ్వర్యంలో సింధును మంగళవారం ఘనంగా సన్మానించారు. సింధు దేశానికే గర్వకారణమన్నారు. సింధుతోపాటు ఆమె కోచ్ గోపీచంద్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, క్లబ్ ప్రతినిధులు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ వై.రాజారావు తదితరులు పాల్గొన్నారు. రూ. 50 లక్షల విలువ చేసే స్థలం...: ఫ్యూచరాల్ హోమ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సింధుకు రూ. 50 లక్షలు విలువచేసే స్థలాన్ని బహూకరించింది. విజయవాడ క్లబ్లో మంగళవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో సంస్థ ఎండీ చింతా రవికుమార్ స్థల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. మల్లీశ్వరి సన్మానంతో స్ఫూర్తి పొందా: కోచ్ గోపీచంద్ సిడ్నీ ఒలింపిక్స్‌లో (2000లో) ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించినప్పుడు ఆనాడు ప్రభుత్వం చేసిన సన్మానంతోనే తాను స్ఫూర్తి పొందినట్లు కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. సింధు విజయోత్సవ సభలో గోపీచంద్ చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఆనాడు కరణం మల్లీశ్వరికి ఎల్బీ స్టేడియంలో చేసిన సన్మాన కార్యక్రమంలో గ్యాలరీలో ఒకరిగా కూర్చొన్నానని తెలిపాడు. తాను కూడా ఎప్పటికైనా ఇలాంటి సన్మానం చేయించుకోవాలని కలలు కన్నట్లు తెలిపాడు. ఆ కలను సాకారం చేసుకొని ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌లో చాంపియన్‌గా నిలిచాక సీఎం చంద్రబాబుతో సన్మానం చేయించుకున్నాను. అలాగే ఈ సన్మాన కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిగా నిలవాలన్నాడు. సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతో ఆమెతోపాటు తనకు కూడా సన్మానం చేయడం గర్వంగా అనిపిస్తోందన్నాడు. -
అథ్లెట్ జైషా ఆరోపణలపై విచారణ కమిటీ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో మారథాన్ అథ్లెట్ ఓపీ జైషాకు రేసులో కనీసం మంచి నీళ్లు కూడా దొరకని ఘటనపై కేంద్ర క్రీడా శాఖ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి ఓంకార్ కేడియా, డెరైక్టర్ వివేక్ నారాయణ్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని నియమించింది. వారం రోజుల్లో వీరు నివేదిక అందించాల్సి ఉంది. ఒలింపిక్స్‌లో జరిగిన మహిళల మారథాన్ పోటీలో పాల్గొన్న ఓపీ జైషాకు కనీసం మంచినీళ్లను కూడా అందుబాటులో ఉంచలేదు. సుదీర్ఘమైన ఈ పోటీ సందర్భంగా అథ్లెట్ల కోసం ప్రతీ 2.5 కి.మీ దూరంలో ఆయా దేశాలు ఆహారం, నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్‌తో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేస్తుంటాయి. కానీ భారత్ స్టాల్స్ అన్నీ ఖాళీగా దర్శనమివ్వడంతో జైషా పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఓ వైపు విపరీతమైన ఎండ కాస్తుండగా, ఆమె దాహంతో అలమటించాల్సి వచ్చింది. చివరికి రేసు పూర్తి చేసినా డీహైడ్రేషన్‌కు గురై అపస్మారక స్థితిలో కుప్పకూలింది. అయితే జైషా ఆరోపణలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఖండించింది. రేసుకు ముందురోజే ఆమెను కలిసి నీటి ఏర్పాట్లు చేస్తామని చెప్పగా ఆమె తిరస్కరించిందని తెలిపారు. వాస్తవాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. -
సింధు విజయంపై అనుచిత వ్యాఖ్యలు చేసి..
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన పీవీ సింధుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. సగటు అభిమాని నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకు అందరూ తెలుగుతేజాన్ని అభినందించారు. కాగా మలయాళీ అవార్డు దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ ఫేస్బుక్లో సింధు విజయాన్ని అవహేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. 'సింధు విజయాన్ని ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని అంతగా సెలెబ్రేట్ చేసుకోవడానికి ఏముంది?' అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో పాటు సింధు విజయంపై మరో అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. దీనిపై నెటిజెన్లు తీవ్రంగా స్పందించారు. శశిధరన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావడంతో శశిధరన్ వివరణ ఇచ్చాడు. తన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదని చెప్పాడు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు వివిధ రాష్ట్రాలు, క్రీడా సంఘాలు, పలువురు వ్యక్తులు భారీ పారితోషకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వం సింధు, కోచ్ గోపీచంద్‌లను ఘనంగా సన్మానించాయి. -
వెండికొండకు స్వాగతం
-
రూ. 810 కోట్లను ఖర్చుచేస్తే వచ్చింది 2 పతకాలు
లండన్: రియో ఒలింపిక్స్‌లో రాణించి 67 పతకాలను గెలుచుకొని ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిన బ్రిటన్‌లో ఇప్పుడు పతకాల సాధన కోసం క్రీడాకారులపై ఖర్చు పెట్టిన సొమ్మెంత? అది పన్ను చెల్లింపుదారులపై ఎంత భారం పడిందన్న అంశంపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఆ చర్చలను పక్కన పెడితే 67 పతకాలను సాధించడం కోసం బ్రిటన్ ఎంత ఖర్చు పెట్టింది, కేవలం రెండు పతకాలతోనే సంతృప్తి పడాల్సి వచ్చిన భారత్ ఎంత ఖర్చు పెట్టిందో బేరీజు వేసి చూద్దాం. ఒక్కో మెడల్ కోసం సగటున 41 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టామని, అంటే మొత్తం 2,747 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టామని బ్రిటన్ స్పోర్ట్ అథారిటీ చెబుతుండగా, సగటున 46 కోట్లును, అంటే 3, 082 కోట్ల రూపాయలను బ్రిటన్ ఖర్చు పెట్టిందని భారత్ మాజీ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ట్వీట్ చేశారు. బ్రిటన్ బడ్జెట్ కేటాయింపులను పరిశీలించగా ఈ నాలుగేళ్లలో ఒలింపిక్స్ ప్రిమరేషన్స్ కోసం క్రీడాకారుల శిక్షణ, శిక్షణా వసతుల కోసం మొత్తం 2,380 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు భారత దేశం ఒలింపిక్స్ శిక్షణ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందన్న ప్రశ్న తలెత్తక మానదు. నాలుగేళ్ల కాలంలో శిక్షణా సెంటర్లు, కోచ్‌లు, ఇతర మౌలిక సౌకర్యాలపై భారత్ 750 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగా, నేషనల్ స్పోర్ట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 22.7 కోట్ల రూపాయలు, టార్గెట్ ఒలింపిక్ పోడియం ప్రోగ్రామ్ కార్యక్రమం కింద 38 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అంటే మొత్తం దాదాపు 810 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. బ్రిటన్ 2,380 కోట్ల రూపాయలను ఖర్చుచేసి 67 మెడళ్లను సాధించగా, అందులో మూడో వంతకుపైగా డబ్బును ఖర్చుపెట్టి రెండు పతకాలను భారత్ సాధించింది. బ్రిటన్ పెట్టిన ఖర్చునే మనం ప్రమాణంగా తీసుకున్నట్లయితే భారత్‌కు 23 పతకాలు రావల్సి ఉండింది. 67 పతకాలు సాధించి ప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించినప్పటికీ బ్రిటన్ పౌరులు సంతృప్తి చెందడం లేదు. ఆ భారం పన్ను చెల్లింపుదారులపై ఎంత పడిందో తేల్చాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో పన్ను చెల్లింపుదారులపై ఏడాదికి 1,090 రూపాయలు పడిందని బ్రిటన్‌కు చెందిన స్పోర్ట్ ఇండస్ట్రీ రిసెర్చ్ సెంటర్ తేల్చింది. వచ్చిన మెడళ్లతో పోలిస్తే చేసిన ఖర్చుకు గిట్టుబాటు దక్కినట్లేనని యూకే స్పోర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజ్ నికోల్ వ్యాఖ్యానించారు. ఏడాదికి టాక్స్ పేయర్‌పై పడుతున్న పన్ను భారాన్ని ఒక్క రోజుకు లెక్కిస్తే లండన్‌లో ఓ ప్రయాణికుడు ఓ బస్సు టిక్కెట్‌కు చెల్లించే మొత్తం కాదని మాజీ వింటర్ ఒలింపిక్స్ అథ్లెట్ జేమీ ఫాక్స్ వ్యాఖ్యానించారు. -
ఏపీలో పీవీ సింధు, గోపిచంద్‌కు ఘనస్వాగతం
కృష్ణా: రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి హైదరాబాద్ నగరంలో అపూర్వ స్వాగతం అందుకున్న పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే స్థాయిలో ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పీవీ సింధు, గోపిచంద్‌కు ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటిపుల్లారావు, నారాయణ, ఎంపీలు మురళీమోహన్, కేశినేని నాని, విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్వహించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రెండు కిలోమీటర్ల మేర పొడువైన జాతీయ పతాకంతో పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు చిన్నారులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ర్యాలీ సందర్భంగా విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సింధును సన్మానించనున్నారు. అందులోనూ ఈ రోజు కృష్ణా పుష్కరాలు ముగియనుండటంతో సాయంత్రం కృష్ణా హారతి కార్యక్రమానికి పీవీ సింధు హాజరుకానుంది. -
సింధుకు శుభాకాంక్షలు తెలుపుతూ శాండ్ ఆర్ట్
-
సింధోత్సవం అదిరింది
-
నేడు విజయవాడకు సింధు
ఇందిరాగాంధీ స్టేడియంలో సన్మాన కార్యక్రమం విజయవాడ/గాంధీనగర్: రియో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పీవీ సింధు మంగళవారం విజయవాడకు రానున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వం తరఫున ఆమెను సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు పాల్గొంటారు. సింధు రాక సందర్భంగా విజయవాడలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సింధుకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 1,000 గజాల స్థలం, రూ.3 కోట్ల నగదు, గ్రూపు-1 ఉద్యోగం నజరానాగా ప్రకటించిన విషయం తెలిసిందే. సన్మాన కార్యక్రమంలో సీఎం అధికారికంగా వీటిని ప్రకటించనున్నారు. రియో నుంచి సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్న సింధును మంగళవారం విజయవాడ రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానించింది. మరోవైపు కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమంలోనూ పీవీ సింధు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిత్యహారతికి ముందు పవిత్ర సంగమం వద్ద సింధుకు చిరు సత్కారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పుష్కరాల ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్ తెలిపారు. -
సింధోత్సవం అదిరింది
భారత బ్యాడ్మింటన్ స్టార్‌కు జన నీరాజనం సత్కారాలు, అభినందనల వెల్లువ రోడ్ల వెంట బారులు తీరిన వేలాది మంది జనం... పసివారి నుంచి పండు ముదుసలి వరకు అందరి నోటా ఒకటే జపం... జాతీయ పతాకం చేతబూని జయజయధ్వానాలు చేస్తున్న అభిమానం... ఇందులో బ్యాడ్మింటన్‌ను ఇష్టపడేవారు ఉన్నారు, ఆట గురించి తెలియని వారూ ఉన్నారు. కానీ అందరిలోనూ ఒకటే భావన... ‘మన అమ్మాయి’ దేశ గౌరవం నిలబెట్టింది. ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతకాన్ని ఎగురవేసిన తెలుగమ్మాయికి ‘జయహో సింధు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం లభించింది. ఆపై వరుస సత్కారాలు, సన్మానాలతో సోమవారం హైదరాబాద్ నగరం సింధు జపంతో ఊగిపోయింది. హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున స్వాగతం పలికింది. రియో నుంచి కోచ్ గోపీచంద్‌తో కలిసి సింధు సోమవారం నగరానికి చేరుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో పౌర సన్మానంతో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కూడా సింధును ప్రత్యేకంగా అభినందించారు. దారి పొడవునా హుషారు సింధు సొంతగడ్డకు రానున్న వార్త తెలియడంతో సోమవారం ఉదయం నుంచే శంషాబాద్ విమానాశ్రయం మొదలు ర్యాలీ సాగిన మార్గంలో సందడి నెలకొంది. ఉదయం 8.30 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సింధుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు ఇతర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఏపీ రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమ కూడా స్వాగతం పలికినవారిలో ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర పర్యాటక శాఖనుంచి ప్రత్యేకంగా తెప్పించిన ‘బెస్ట్’ ఓపెన్ టాప్ బస్సులో విజయయాత్ర ప్రారంభమైంది. సింధు వెంట కోచ్ గోపీచంద్, ఫిజియో కిరణ్ కూడా ఉన్నారు. ఎయిర్ పోర్ట్ పరిసరాలు దాటి శంషాబాద్ గ్రామంలోకి ప్రవేశించే వరకు ర్యాలీ వేగంగా సాగిపోయింది. విద్యార్థుల స్వాగతం ర్యాలీ కోసం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎయిర్పోర్ట్ నుంచి స్టేడియం వరకు భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో హోర్డింగ్‌లు పెట్టారు. ర్యాలీ సాగిన మార్గంలో గగన్ పహాడ్, రాజేంద్రనగర్, ఆరాంఘర్, అత్తాపూర్, టోలీచౌకి, దర్గా పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దారి పొడవునా నిలబడి సింధుకు ఘన స్వాగతం పలికారు. చేతుల్లో జాతీయ జెండాలతో చిన్నారులు కంగ్రాట్స్ చెప్పడం ఆకట్టుకుంది. వీరికి ప్రతిస్పందనగా థ్యాంక్స్ చెబుతూ తన రజత పతకాన్ని ప్రదర్శిస్తూ సింధు ముందుకు సాగిపోయింది. మొత్తం మార్గంలో స్వాగతం పలికేందుకు పదికి పైగా చోట్ల ప్రత్యేక వేదికలు నిర్మించారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పైనుంచి కూడా కొన్ని చోట్ల బస్సుపై పూల వర్షం కురియడంతో సింధు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికేందుకు రోడ్డుపైకి రావడం, ట్రాఫిక్ జామ్ కారణంగా అనుకున్న సమయంకంటే ర్యాలీ ఎక్కువ సేపు సాగింది. దేశానికి సింధు గర్వకారణం: నరసింహన్ హైదరాబాద్: తల్లి, తండ్రి, గురువు, దైవ శక్తుల సమష్టి దీవెనలతో పీవీ సింధు దేశ పేరుప్రతిష్టలు పెంచిందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసించారు. ఆమె విజయాలను చూసి దేశం గర్వపడుతోందన్నారు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు తన కుటుంబసభ్యులు, కోచ్ గోపీచంద్‌తో కలిసి సోమవారం గవర్నర్‌ను కలిసింది. రాజ్‌భవన్ సిబ్బంది వీరికి కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ... సింధు భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయం అన్నారు. ఆమె పతకం గెలుస్తుందని గోపీచంద్ గతంలో తనతో చెప్పారని, బహుశా ఆయనకు జ్యోతిష్యం తెలిసి ఉండవచ్చని ఆయన చలోక్తులు విసిరారు. గవర్నర్‌కు పతకాన్ని చూపించిన సింధు, తన విజయానికి దేవుడు సహకరించాడని చెప్పింది. తన అకాడమీ నిర్వహణలో అనేక సందర్భాల్లో సహకరించిన గవర్నర్‌కు ఈ సందర్భంగా గోపీచంద్ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం సింధు, గోపీలకు జ్ఞాపికలు అందించిన గవర్నర్... అకాడమీ అభివృద్ధి కోసం రూ. 2 లక్షలు ఇవ్వడం విశేషం. ఈ కార్యక్రమంలో గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, ముఖ్యకార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరు.. ఊరేగింది
మన సింధు సిటీకి వచ్చింది...ఉత్సాహం ఉరకలేసింది..ఊరు ఊరంతా ఊరేగింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి...ప్రశంసలందుకొన్న పీవీ సింధును భాగ్యనగరం ఘనంగా స్వాగతించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు జనం జేజేలు పలికారు. కాసేపు ఓపెన్ టాప్ వాహనంలో..మరికాసేపు గుర్రపు బగ్గీపై ఊరేగుతూ..పూలవర్షంలో తడుస్తూ..అభిమానుల అభినందనలు స్వీకరిస్తూ ఆమె గచ్చిబౌలి స్టేడియంకు చేరుకుంది. -
ఇటు సింధు సంతోషం.. అటు జైశా విషాదం
-
ఇటు సింధు సంతోషం.. అటు జైశా విషాదం
సంతోష సమయాల్లో విషాదాన్ని ఎవ్వరూ కోరుకోరు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ పరిస్థితి తలెత్తింది. రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులను జాతి ఘనంగా సన్మానించుకుంటున్న రోజే.. అదే ఒలింపిక్స్ లో పాల్గొని.. కనీసం గుక్కెడు మంచినీళ్లకు దొరక్క తీవ్ర అస్వస్థతకు గురైన అథ్లెట్ ఓ.పి. జైశా విషాదగాథ వెలుగులోకి వచ్చింది. ప్రఖ్యాత వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపిన వివరాలివి.. రియో ఒలింపిక్స్ లో 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన జైశా.. తనకు కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కులేకుండా పోయిందని మీడియాకు తెలిపింది. 42 కిలోమీటర్ల ర్యాలీలో ప్రతి 8 కిలోమీటర్లకు ఒకచోట నిర్వాహకులు ఏర్పాటుచేసిన వాటర్ బాటిల్స్ లభిస్తాయి. ఇవి కాకుండా అథ్లెట్లు ప్రాతినిథ్యం వహిస్తోన్న దేశాలు సొంతగా ప్రతి 2.5 కిలోమీటర్లకు ఒక చోట రన్నర్లకు మంచినీళ్లు అందించే వీలుంటుంది. 'గొంతు తడారిపోతున్నా పరుగు ఆపలేదు. ఎక్కడన్నా త్రివర్ణ పతాకం కనబడకపోదా అని ఒళ్లంతా కళ్లు చేసుకుని చూశా. మన జెండా పట్టుకుని నాకు నీళ్లిచ్చేవాళ్లు ఎక్కడా కనబడలేదు. దీంతో 8 కిలోమీటర్లకు ఒకసారి ఒలింపిక్ నిర్వహకులు ఏర్పాటుచేసిన నీళ్ల మాత్రమే తాగాల్సివచ్చింది'అని విలపించింది జైశా. 157 మంది రన్నర్లు పాల్గొన్న మారథాన్ లో 89 స్థానంలో రేసు పూర్తిచేసిన జైశా.. ఎండ్ లైన్ దాటగానే కుప్పకూలి పడిపోయింది. వెంటనే ఆమెను తాత్కాలిక క్లినిక్ కు తరలించారు. ఆమె అస్వస్థతకు గురైన సంగతి కనీసం మనవాళ్లకు తెలియదట! దాదాపు మూడు గంటల తర్వాతగానీ ఆసుపత్రికి చేరుకున్న భారత అధికారులు జైశాను స్వస్థలం (కేరళ)కు పంపించే ఏర్పాటుచేశారు. అయితే బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న జైశా మరీ నీరంగా కనిపించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 'ఇది నాకు రెండో జన్మలాంటింది. నీళ్లు తాగకుండా మారథాన్ పరుగెత్తడం చావును కొనితెచ్చుకున్నట్లే. కానీ ఏం చేస్తా! నిజానికి నేను లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ని. కోచ్ బలవంతం మేరకు మారథాన్ లో పరుగెత్తాల్సి వచ్చింది'అని జైశా చెప్పింది. ఆమెతో పాటు లాంగ్ డిస్టెన్స్ పోటీల్లో పాల్గొన్న మరో అథ్లెట్ సుధా సింగ్ కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు జికా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్న డాక్టర్లు ఆమేరకు నమూనాలను పరీక్షిస్తున్నారు. ఫలితం తెలియాల్సిఉంది. వీళ్లిద్దరే కాక భారత్ తరఫున ప్రాతిథ్యం వహించిన ఎంతో మంది అథ్లెట్లు, క్రీడాకారులు గాయాలపాలయ్యారు. కాస్తోకూస్తో పేరు, డబ్బున్నవాళ్లు సర్జరీలు చేయించుకుంటున్నారు కానీ జైశా లాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఈ వ్యవహారంపై క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ స్పందిస్తూ.. అథ్లెట్ల అస్వస్థతకు సంబంధించిన విషయాలను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) పర్యవేక్షిస్తుందని అన్నారు. జైశా విషయంలో అధికారులతో మాట్లాడతానని చెప్పారు. -
రియోలో మనకు ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు?
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధుకు బ్యాడ్మింటన్ లో రజత పతకం, హర్యానా అమ్మాయి సాక్షి మాలిక్‌కు రెజ్లింగ్‌లో కాంస్యం వచ్చినందుకు మనమంతా ఆనందిస్తున్నాం. హర్షిస్తున్నాం. అది సరే, రియో ఒలింపిక్స్‌పై మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నాం? ఎంత మంది క్రీడాకారులను పంపించాం? ఎన్ని పతకాలను సాధించాం? ఆశించిన స్థాయిలో రాణించామా, లేదా ? లేకపోతే ఎందుకు ? అన్న అంశాలను ఇప్పడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి దాదాపు వంద మంది క్రీడాకారుల బృందాన్ని పంపించినప్పుడు మనవాళ్లు దాదాపు పది నుంచి పన్నెండు పతకాలను సాధించుకొస్తారని మీడియా ప్రచారం చేసింది. మనకు బీజింగ్ ఒలింపిక్స్‌లో మూడు, లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు రాగా ఈసారి కచ్చితంగా రెండంకెల్లో పతకాలు వస్తాయని, 12 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని గత మే నెలలో నాటి కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి సర్వానంద సోనోవాల్ బల్లగుద్ది మరీ చెప్పారు. ఎప్పటికప్పుడు క్రీడాకారుల ప్రతిభా పాటవాలను అంచనా వేస్తూ వచ్చిన భారతీయ క్రీడల సంఘం (ఎస్ఏఐ) 12 నుంచి 19 పతకాలు వస్తాయని అంచనా వేసింది. మరి జరిగిందేమిటీ? కేవలం రెండు పతకాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? ఆ....అమెరికా లాంటి దేశాలెక్కడా, మన దేశం ఎక్కడ? అక్కడ క్రీడలను ప్రోత్సహిస్తారు, క్రీడా సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. బ్రిటన్ లాంటి దేశాల్లో ఒక్క పతకం రావడానికి సరాసరి 46 కోట్ల రూపాయల చొప్పున క్రీడాకారులపై ఖర్చు పెడతారని అభినవ్ భింద్రా లాంటి వారే కామెంట్ చేశారు. ఆ స్థాయిలో భారత్‌లో క్రీడా సౌకర్యాలు లేవని, నిధులు లేవని చెబుతారు. వాస్తవానికి ఇది అర్ధ సత్యమే. 2016-2017 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో భారత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ నిధులు ఎక్కడికి వెళుతున్నాయో, ఎక్కడ ఖర్చు చేస్తున్నారో, ఆ ఖర్చుకు వస్తున్న ఫలితాలేమిటో, అందుకు ఎవరు బాధ్యత వహిస్తున్నారో అన్న అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి దేశాల్లో అన్ని క్రీడలను ప్రోత్సహించాల్సిందే. కానీ ఏ క్రీడల్లో మనం రాణించగలం, ఎంత వరకు ప్రపంచ స్థాయిని అందుకోగలం? ముఖ్యంగా ఒలింపిక్స్‌లో మనకు మెడల్స్ దక్కాలంటే మనం ఏ ఆటలపైన ప్రధాన దృష్టిని కేంద్రీకరించాలి? అన్న అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరం. భారతీయులు ఏ ఆటల్లో రాణిస్తున్నారో, వాటి మీదనే దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఒలింపిక్స్‌లో ఆర్చరి, బ్యాడ్మింటన్, టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో భారత్ క్రీడాకారులు రాణి స్తున్నారు. వాటిలోనే వారిని ప్రోత్సహించేందుకు నిధులు ఎక్కువ ఖర్చు పెట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా 2014-2015 సంవత్సరానికి భారత ప్రభుత్వం టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాలకన్నా క్వాష్, యాటింగ్, వాలీబాల్ క్రీడలకు ఎక్కువ నిధులను కేటాయించింది. అమెరికా జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ మీద, దక్షిణ కొరియా ఆర్చరీ మీద, బ్రిటన్ సైక్లింగ్ మీద, చైనా టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ మీద, బెల్జియం హాకీ మీద, జర్మనీ ఫుట్‌బాల్ మీద దృష్టిని కేంద్రీకరించి, ఆ క్రీడల్లో రాణించడమే లక్ష్యంగా కృషి చేస్తున్న విషయం తెల్సిందే. మనం దేశం కూడా టార్గెట్ లక్ష్యంగానే కృషి చేయాలి. అభినవ్ భింద్రా, గగన్ నారంగ్, రాజ్యవర్ధన రాథోర్, మైఖేల్ ఫెరీరా, గీత్ సేథి, పంకజ్ అద్వానీ లాంటి క్రీడాకారుల అనుభవాలను ఉపయోగించుకోవాలి. పతకాలు గెలుచుకున్న క్రీడాకారులపై కాసుల వర్షం కురిపించి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు ఎవరికివారు భుజాలు చరచుకుంటే సరిపోదు. ఇచ్చే కాసులకు కూడా క్రీడలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారిని బాధ్యులను చేయాలి. క్రీడాకారులకు వ్యక్తిగత లబ్ధి చేకూర్చడం కన్నా క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల రాణింపునకు ఎక్కువ నిధులను ఖర్చు చేయాలి. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు క్రీడా విభాగాల అధికారులను బాధ్యుల్ని చేయాలి. అంతవరకు ఒలింపిక్స్ లాంటి క్రీడల్లో మనం రాణించలేం. -
పీవీ సింధు, సాక్షిలకు సముచిత గౌరవం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధు, కాంస్యపతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ కు సముచిత గౌరవం దక్కింది. సింధు, సాక్షిలతో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూ రాయ్ లకు అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం నలుగురు క్రీడాకారులకు ఈ అవార్డును ప్రకటించింది. సింధు ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకుంది. రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో దీప నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్ గా ఆమె రికార్డు నెలకొల్పింది. సోమవారం కేంద్ర ప్రభుత్వం అర్జున, ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది. టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానె, అథ్లెట్ లలితా బాబర్, శివ థాపా, అపూర్వి చండీలా సహా మొత్తం 15 మందికి అర్జున అవార్డులను ప్రకటించారు. ఆరుగురుకి ద్రోణాచార్య అవార్డులను ఇవ్వనున్నారు. తెలుగువ్యక్తి నాగపురి రమేష్ కు ఈ అవార్డు దక్కింది. అవార్డు గ్రహీతలు: ఖేల్ రత్న: పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, జీతూ రాయ్ ద్రోణాచార్య: దీపా కోచ్ విశ్వేశ్వర్ నంది, నాగపురి రమేష్ (అథ్లెటిక్స్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్), సాగర్ మల్ ధ్యాయల్ (బాక్సింగ్), రాజ్ కుమార్ శర్మ (క్రికెట్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్) ధ్యాన్ చంద్ అవార్డు: రాజేంద్ర ప్రహ్లాద్ షెల్కె (రోయింగ్), సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వాన్ ధంగ్ ధంగ్ (హాకీ అర్జున అవార్డు: రహానె (క్రికెటర్), రజిత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బాబర్ (అథ్లెటిక్స్), శివథాప (బాక్సింగ్), రాణి (హాకీ), విఘ్నేశ్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్), సుబ్రతా పాల్ (ఫుట్ బాల్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్), వీరేంద్ర సింగ్ (రెజ్లింగ్-బధిర), వీఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వి చండీలా, సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్) -
రియోలో పరాభవ భారతం
-
రియో ముగింపు వేడుకలు
-
బ్యాడ్మింటన్ ఆరోగ్యానికి విటమిన్
శారీరక ఉల్లాసంతో పాటు మానసిక వినోదానికీ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా రకాల క్రీడలున్నాయి. ముఖ్యంగా బ్యాడ్మింటన్ వయసుతో సంబంధం లేకుండా ఆడే ఆట. చిన్నతనం నుంచే ఈ ఆటను పిల్లలకు నేర్పిస్తుంటారు. దీంతో శారీరకంగానే, మానసికంగా చురుగ్గా ఉండొచ్చు. భారతీయులకు గత రెండు దశాబ్దాల కిందట బ్యాడ్మింటన్‌తో అంతగా పరిచయం లేదు. కానీ ఇటీవల కాలంలో యావత్ దేశ ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయి చూసేటట్టు చేసింది మన తెలుగు క్రీడాకారిణీ పీవీ సింధు. రియో ఒలింపిక్స్‌లో వెండి పతకం సాధించి తన సత్తాను చాటింది. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ ఆటతో ప్రయోజనాలు తెలుసుకుందాం! - సాక్షి, స్కూల్ ఎడిషన్ సాధారణంగా ఆటలన్నీ మొదట్లో వినోదం కోసం ఆవిర్భవించినవే. అనంతరం శారీరక వ్యాయామంగా కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. చరిత్రలో బ్యాడ్మింటన్ మూలాలను బ్రిటీష్ ఇండియాలో గమనించవచ్చు. బ్రిటిష్ వారు ఈ క్రీడను భారతదేశంలో ఆడినట్లు పలు ఆధారాలు ఉన్నాయి. సైనికుల శిక్షణలో భాగంగా బ్యాడ్మింటన్‌ను నేర్పించేవారు. దీంతో శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందవచ్చని అభిప్రాయం నాటి నుంచే ఉంది. తదనంతర కాలంలో బ్యాడ్మింటన్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలో ఎక్కువగా ఆడే క్రీడల్లో బ్యాడ్మింటన్ ఒకటి. ఇది వినోదంతోపాటు ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఉపకరణాలను అందిస్తుంది. - సాక్షి, స్కూల్ ఎడిషన్ బరువు తగ్గొచ్చు బ్యాడ్మింటన్ ఆడేవారిలో గంటకు 480 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. ఇంత ఎక్కువ మొత్తం శక్తి ఉపయోగపడేది కేవలం బ్యాడ్మింటన్‌లోనే. నిత్యం నిర్ధిష్ట కాలం కేటాయించి ఇంత శక్తిని ఖర్చు చేస్తే.. బ్యాడ్మింటన్ ఆటతో నెలరోజుల్లో 4 కిలోల బరువు తగ్గవచ్చు. మానవ శరీరంలో ఉన్న అన్ని కండరాలు పనిచేసేంది కూడా ఈ ఆటలోనే. పరిగెత్తేవారిలో కంటే బ్యాడ్మింటన్ ఆడే వారిలో రెట్టింపు శక్తి ఖర్చవుతుంది. కండరాల దృఢత్వం.. సాధారణంగా కండరాలు గట్టిపడాలంటే జిమ్‌లో డంబెల్ ఉపయోగించి వ్యాయామం చేస్తుంటాం. కాని బ్యాడ్మింటన్ క్రీడతో సులభంగా కండర సామర్థ్యం పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రతి షాట్ ఒక మినీ ఫిగర్ టోనింగ్ అవుతుంది. అంటే భుజవలయం, మోచేతి వలయంలో కదలికలు పెరగడంతో కండరం గట్టిపడుతుంది. ఈ ఆటతో అలిసిపోవడంతో శరీరం కావాల్సినంత నిద్ర తీసుకుంటుంది. దీంతో నిద్ర లేమి సమస్య ఉన్నవారికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. శరీరంలో అన్ని ఎముకలు బ్యాడ్మింటన్‌తో ధృడంగా తయారవుతాయి. శ్వాసక్రియా రేటునూ.. ఏదైన పని వేగంగా చేసినప్పుడు, పరిగెత్తినప్పుడు సహజంగా అలసట వస్తుంది. అయితే ఈ సమయంలో శ్వాసక్రియా రేటు పెరుగుతుంది. దీంతో ఎక్కువ శక్తి వెంటనే విడుదలవుతుంది. ఈ శక్తిని తక్షణమే ఉపయోగించుకోవచ్చు. బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. దీంతో శ్వాసక్రియా రేటు పెరిగి శక్తి వెంటనే విడుదలవుతుంది. ఇదే శక్తి వెంటనే ఉపయోగించుకోవడంతో ..ఎప్పటికప్పుడు జీవక్రియా సమస్యలు తగ్గిపోయి శరీరం చురుగ్గా పనిచేస్తుంది. గుండె పనితీరులో... స్థూలకాయుల హృదయంలోని రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి రక్త ప్రసరణకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీనికి పర్యవసానంగా గుండెకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధులు వచ్చేస్తాయి. దీనికి చికిత్స కేవలం కొవ్వు తగ్గించడమే. ప్రత్యేకంగా గుండెకు శస్త్రచికిత్స నిర్వహించి కొవ్వు తొలగించడంతో ఈ సమస్యకు పరిష్కారం. అయితే బ్యాడ్మింటన్ ఆడే వారిలో గుండె కండరాల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. నిత్యం వ్యాయామంగా ఆడేవారిలో మాత్రం పూర్తిగా కొవ్వు లేకుండా ఉండి రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. గుండె కండరాలు కూడా ధృడంగా ఉంటాయి. డయాబెటీస్‌కు ఆమడ దూరం.. ఈ రోజుల్లో షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతి పది మందిలో కనీసం ముగ్గురు వ్యక్తులు ఉంటారు. రక్తంలో చక్కెర పరిమాణం పెరగడంతో డయాబెటీస్ వచ్చేస్తుంది. బ్యాడ్మింటన్ వ్యాయామంగా నిత్యం ఆడే వారిలో రక్తంలో షుగర్ పరిమాణం ఎప్పటికప్పుడు తగ్గిపోతుంది. దీంతో శరీరంలో సర్వరోగాలకు కారణమయ్యే డయాబెటీస్‌ను దూరం చేసుకోవచ్చు. రక్తంలో కేవలం షుగర్‌లో పరిమాణం తగ్గిస్తే ఏ ఇతర శరీరానికి నిరోధకత శక్తి పెరుగుతుంది. దీంతో కాలేయ సయస్యలను కూడా దూరం చేయవచ్చు. -
అమెరికన్లు ఇంకెంత ఎగరాలి: వర్మ
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈసారి ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శన మీద సెటైర్లు వేశారు. 32 కోట్ల జనాభా మాత్రమే ఉన్న అమెరికాకు 46 బంగారు పతకాలు వస్తే, 5 కోట్ల జనాభా మాత్రమే ఉన్న దక్షిణ కొరియాకు 9 బంగారు పతకాలు వచ్చాయని ఆయన అన్నారు. అయితే 120 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశానికి మాత్రం ఒకే ఒక్క రజత పతకం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఒక్క రజత పతకం వచ్చినందుకే మనం 'మేరా భారత్ మహాన్' అని అరుస్తూ పైకి, కిందకు ఎగురుతుంటే.. 46 బంగారు, 37 వెండి పతకాలు వచ్చిన అమెరికన్లు ఇంకెంత ఎగరాలని ఆయన ప్రశ్నించారు. బ్రెజిల్‌లోని రియో డి జెనిరోలో ముగిసిన ఒలింపిక్స్‌లో భారత దేశం ఒక రజత పతకం, ఒక కాంస్య పతకంతో మొత్తం పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో మొత్తం 207 దేశాల తరఫున 11,544 మంది పాల్గొన్నారు. భారత దేశం నుంచి అత్యధికంగా 121 మంది పాల్గొన్నారు. A 32 crore population US wins 46 gold and a 5 crore population South Korea wins 9 gold nd a 120 crores population india wins 1 silver..Wah! — Ram Gopal Varma (@RGVzoomin) 22 August 2016 If for one silver we are jumping up and down screaming Mera Bharat Mahan. how high should be Americans jumping for 46 gold and 37 silver — Ram Gopal Varma (@RGVzoomin) 22 August 2016 -
'ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్ తీసుకున్నాడు'
న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఉద్దేశపూర్వకంగా నిషేధిత పదార్థాలు తీసుకున్నాడని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువసార్లు నిషేధిత డ్రగ్స్ టాబ్లెట్ రూపంలో నోటి ద్వారా తీసుకున్నాడని వెల్లడించింది. తనపై కుట్ర జరిగిందని ఆరోపించిన నర్సింగ్ ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యాడని తెలిపింది. అతడి నుంచి సేకరించిన అన్ని నమూనాలను క్షుణ్ణంగా పరిక్షించినట్టు వెల్లడించింది. అతడు నిషేధిత డ్రగ్స్ వాడినట్టు జూన్ 25 నిర్వహించిన డోపింగ్ టెస్టులో వెల్లడైందని గుర్తు చేసింది. ఒకటి లేదా రెండు మెథాన్డీనోన్ టాబ్లెట్లు నోటి తీసుకున్నట్టు తేలిందని, దీన్ని నీటిలో కలిపి తీసుకున్నట్టు నిర్థారణ కాలేదన్నారు. అయితే తన మంచినీళ్ల సీసాలో ఎవరో నిషేధిత పదార్థాలు కలిపారని, తాను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తీసుకోలేదని నర్సింగ్ యాదవ్ అంతకుముందుకు అన్నాడు. దీనికి ఆధారాలు సమర్పించడంలో విఫలమవడంతో అతడిపై సీఏఎస్ నాలుగేళ్ల నిషేధం విధించింది. దీంతో అతడు రియో ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.