రియోకు అన్ ఫిట్ అథ్లెట్లను పంపారా? | Unfit Athletes Were Sent to Rio, Finds Sports Authority: Sources | Sakshi
Sakshi News home page

రియోకు అన్ ఫిట్ అథ్లెట్లను పంపారా?

Sep 9 2016 7:19 PM | Updated on Sep 4 2017 12:49 PM

రియోకు అన్ ఫిట్ అథ్లెట్లను పంపారా?

రియోకు అన్ ఫిట్ అథ్లెట్లను పంపారా?

ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ జంబో జట్టు (118)ను రియోకు పంపినా ఆశించిన ఫలితాలు రాలేదు.

ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ జంబో జట్టు (118)ను రియోకు పంపినా ఆశించిన ఫలితాలు రాలేదు. మనోళ్లు ఈసారి డబుల్ డిజిట్ పతకాలు గెలుస్తారని అంచనా వేస్తే.. రెండింటికే పరిమితమయ్యారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రజతం, రెజ్లర్ సాక్షిమాలిక్ కాంస్య పతకాలు సాధించడం మినహా చాలామంది స్టార్లు రిక్తహస్తాలతో తిరిగివచ్చారు. రియోలో మన క్రీడాకారుల వైఫల్యానికి గల కారణాలను విశ్లేషిస్తూ భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఓ నివేదికను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు పంపింది.

సాయ్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు.. రియోకు అన్ ఫిట్ అథ్లెట్లను పంపడం ప్రతికూల ప్రభావం చూపించింది. విదేశీ కోచ్ల పనితీరును అంచనావేయాల్సిన అవసరముందని కేంద్ర క్రీడల శాఖకు సూచించింది. జాతీయ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. రియో ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై అంతర్గత విశ్లేషణ చేయాలని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైనట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రియోలో పాల్గొన్న క్రీడాకారులందరికి వ్యక్తిగతంగా లేఖలు రాసి, వారి నుంచి నేరుగా లేదా ఈమెయిల్ ద్వారా సూచనలు కోరినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement