Sports Authority of India
-
ఖోఖో ప్రపంచకప్ ట్రోఫీల ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్‌లో విజేతలుగా నిలిచే పురుషులు, మహిళా జట్లకు అందజేసే ట్రోఫీలను శుక్రవారం లాంఛనంగా ఆవిష్కరించారు. ఫురుషుల విభాగంలో నీలి రంగు ట్రోఫీని బహూకరించనుండగా, మహిళలకు ఆకుపచ్చ రంగు ట్రోఫీని ప్రదానం చేస్తారు. ఈ మెగా ఈవెంట్లో కనువిందు చేసే మస్కట్లకు తార, తేజస్ అని పేర్లు పెట్టారు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ ట్రోఫీలను ఆవిష్కరించి, మస్కట్లను మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ నుంచి రెండేసి జట్ల చొప్పున బరిలోకి దిగుతాయన్నారు. భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ నాలుగు జట్లను ఈ నెల 8న ఎంపిక చేస్తామని, ప్రస్తుతం ఇరు విభాగాల్లో 60 మంది ప్లేయర్ల చొప్పున జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ తొలి ఖోఖో ప్రపంచకప్‌లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయని, ఇండోనేసియా కేవలం మహిళల జట్టునే పంపిస్తుండగా మిగతా 23 దేశాలు ఇరు జట్లను పంపేందుకు సిద్ధంగా ఉన్నాయని సుధాన్షు వివరించారు. మొత్తం 615 మంది క్రీడాకారులు, 125 మంది సహాయ సిబ్బంది కోసం ప్రముఖ కార్పొరేట్ సంస్థ జీఎంఆర్ బస, తదితర ఏర్పాట్లకు స్పాన్సర్íÙప్ చేస్తోందని చెప్పారు. అయితే పాకిస్తాన్ జట్లకు ఇంకా వీసాలు మంజూరు కాలేదని, త్వరలోనే ఇది కొలిక్కి వస్తుందని... పాక్ జట్లు కూడా షెడ్యూల్ ప్రకారం టోర్నీలో పాల్గొంటాయని మిట్టల్ వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, గ్రేటర్ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు లీగ్ దశ పోటీలు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు పోటీపడతాయి. 17 నుంచి నాకౌట్ దశ మొదలవుతుంది. ఆ రోజు క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, 19న జరిగే ఇరు విభాగాల ఫైనల్స్‌తో ప్రపంచకప్ టోర్నీ ముగుస్తుంది. -
ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌పై దృష్టి
చెన్నై: చెస్ ఒలింపియాడ్ స్ఫూర్తితో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌పై దృష్టి కేంద్రీకరిస్తానని భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చెప్పాడు. నవంబర్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతానని తెలిపాడు. డిఫెండింగ్ చాంపియన్, చైనీస్ గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌తో భారత ఆటగాడు ప్రపంచ చాంపియన్గుకేశ్ ప్ టైటిల్ కోసం తలపడతాడు. ఈ టోరీ్నకి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఫామ్‌ను కాపాడుకునేందుకు... ఎత్తుల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు కావాల్సినంత సమయం లభించిందని చెప్పాడు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు సింగపూర్‌లో గుకేశ్, లిరెన్‌ల మధ్య ప్రపంచ పోరు జరుగుతుంది. ఏప్రిల్‌లో క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలుపొందడం ద్వారా ఈ మెగా టోరీ్నకి గుకేశ్ అర్హత సంపాదించాడు. 18 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చాలెంజర్ హంగేరిలో ముగిసిన చెస్ ఒలింపియాడ్‌లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పురుషుల టీమ్ విభాగంలో సహచరులు వెనుకబడిన ప్రతి సందర్భంలో కీలక విజయాలతో జట్టును అజేయంగా నిలపడంలో గుకేశ్ పాత్ర ఎంతో ఉంది. ఒలింపియాడ్‌పై మాట్లాడుతూ ‘ఈ టోర్నీని నేను ఒక వ్యక్తిగత ఈవెంట్‌గా భావించాను. కాబట్టే ప్రతి గేమ్‌లో ఇతరుల ఫలితాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఒలింపియాడ్‌లో నా ప్రదర్శన నాకెంతో సంతృప్తినిచ్చింది. జట్టు ప్రదర్శన కూడా బాగుంది’ అని అన్నాడు. తాజా ఫలితం తమ సానుకూల దృక్పథానికి నిదర్శనమని అన్నాడు. భారత ఆటగాళ్లంతా సరైన దిశలో సాగుతున్నారని చెప్పుకొచ్చాడు. ఘనస్వాగతం అంతకుముందు బుడాపెస్ట్ నుంచి చెస్ ఒలింపియాడ్ విజేతలు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన గుకేశ్, ప్రజ్ఞానంద, వైశాలి, పురుషుల జట్టు కెప్టెన్ శ్రీనాథ్ నారాయణ్‌లకు చెన్నైలో చెస్ సంఘం అధికారులు, అభిమానులు, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. పూల బోకేలతో స్వాగతం పలికిన అభిమానులు పలువురు గ్రాండ్మాస్టర్లతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. చెస్ ఒలింపియాడ్‌లో గతంలో ఉన్న కాంస్యం రంగు మార్చి బంగారు మయం చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రజ్ఞానంద అన్నాడు. అతని సోదరి వైశాలి మాట్లాడుతూ సొంతగడ్డపై జరిగిన గత ఈవెంట్లో కాంస్యంతో సరిపెట్టుకున్న తమ పసిడి కల తాజాగా హంగేరిలో సాకారమైందని హర్షం వ్యక్తం చేసింది. వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్లకు ఢిల్లీ చెస్ సంఘం అధికారులు, హైదరాబాద్‌లో ద్రోణవల్లి హారికకు భారత స్పోర్ట్స్ అథారిటీ అధికారులు స్వాగతం పలికి సన్మానం చేశారు. -
ఒలింపిక్ పతకాల వేటలో... ఖర్చు రూ. 470 కోట్లు
2012 లండన్ ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్ 29 స్వర్ణాలు, 18 రజతాలు, 18 కాంస్యాలతో (మొత్తం 65 పతకాలు) మూడో స్థానంలో నిలిచింది. సొంతగడ్డపై పెద్ద సంఖ్యలో పతకాలు గెలిచే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితమే ప్రణాళికలు రూపొందించి పెద్ద సంఖ్యలో నిధులు కేటాయించింది. వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తాము గెలిచిన ఒక్కో పతకం కోసం 45 లక్షల పౌండ్లు (సుమారు రూ.38 కోట్లు) ఖర్చు చేసినట్లు ఒలింపిక్స్ తర్వాత అధికారులు వెల్లడించారు. ఆధునిక సౌకర్యాలు, శిక్షణ, టోర్నీలు వంటి సన్నాహాల్లో దీనిని ఖర్చు చేశారు. ఇది పుష్కరకాలం క్రితం నాటి మాట. ఇదే విషయాన్ని భారత్ కోణంలో చూస్తే ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆటగాళ్లు వ్యక్తిగత కష్టం, పట్టుదలను నమ్ముకొనే బరిలోకి దిగుతూ వచ్చారు. ఒలింపిక్స్‌కు చేరువైన సమయంలో అక్కడక్కడా కొంత ఆర్థిక సహకారం లభించినా... అందులో ప్రభుత్వ పాత్ర పెద్దగా లేదు. 1956 నుంచి 1992 వరకు భారత్‌కు ఒలింపిక్స్‌లో ఒక్క వ్యక్తిగత పతకం కూడా రాలేదు. ఆ తర్వాతి ఒలింపిక్స్‌లలో పతకం సాధించినవారు కూడా సొంతంగా సన్నద్ధమైనవారే తప్ప ఒక్కరిని కూడా వ్యవస్థ తీర్చిదిద్దినవారుగా చెప్పలేం. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్ క్రీడలను, ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. గెలిచి వచ్చిన తర్వాత అందించే నజరానాల కంటే గెలిచేందుకు కావాల్సిన వాతావరణం సృష్టించడం కీలకమని నమ్మింది. అందుకే మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) పేరుతో ప్రత్యేకంగా ఆర్థిక వనరులను చేకూర్చింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) పథకం పేరుతో ఎంపిక చేసిన ఆటగాళ్లకు సహాయం అందించడం ఈ ఎంఓసీలోనే భాగంగా ఉంది. విదేశాల్లో శిక్షణ, పోటీల కోసం ప్రత్యేక క్యాలెండర్ (ఏసీటీసీ)తో ఈ ప్రణాళిక రూపొందించగా... వివిధ వర్గాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ద్వారా కూడా నిధులు సేకరించింది. – సాక్షి క్రీడా విభాగం టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ గరిష్టంగా 7 పతకాలు సాధించింది. ఇవి ముగిసిన తర్వాత పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నాహాలు షురూ అయ్యాయి. ఈ సారి పతకాల సంఖ్యను పెంచడమే ఏకైక లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తమ వంతు పని చేసింది. 16 క్రీడాంశాల్లో ఆయా జాతీయ క్రీడా సమాఖ్యల సూచనలు, ప్రతిపాదనలతో ప్రణాళిక సిద్ధమైంది.కేవలం నిధులు అందించడం మాత్రమే కాగా టోక్యో–పారిస్ మధ్య కాలంలో ఆటగాళ్ల ప్రదర్శనను కూడా ‘సాయ్’ పర్యవేక్షిస్తూ వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 470 కోట్లు ఖర్చు చేసింది. మన దేశం నుంచి ఈసారి 117 మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. పతకావకాశాలు ఉన్న వివిధ క్రీడలు, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు వివరాలను చూస్తే...అథ్లెటిక్స్: ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆర్థిక సహాయం అందుకున్న క్రీడాంశం అథ్లెటిక్స్. ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 29 మంది పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్‌కు కేంద్రం రూ.96.08 కోట్లు ఖర్చు చేసింది. గత టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించడంతో ఈ సారి అంచనాలు మరింత పెరిగాయి. మొత్తం 36 జాతీయ శిక్షణా శిబిరాలు నిర్వహించారు. విదేశీ కోచ్ క్లాజ్ బార్టొనెట్ వద్ద శిక్షణ తీసుకోవడంతో పాటు విదేశాల్లో టోర్నీలు, శిక్షణ కోసం నీరజ్ చోప్రాకే ప్రభుత్వం రూ.5.72 కోట్లు ఇ చ్చింది. బ్యాడ్మింటన్: ప్రభుత్వం ఈ క్రీడ కోసం మొత్తం రూ. 72.02 కోట్లు ఖర్చు చేసింది. భారత్ నుంచి సింగిల్స్ విభాగంలో ముగ్గురు... పురుషుల, మహిళల డబుల్స్‌లో కలిపి నలుగురు షట్లర్లు బరిలోకి దిగుతున్నారు. విదేశాల్లో శిక్షణ, టోర్నీలకు గరిష్టంగా బ్యాడ్మింటన్ ఆటగాళ్ల 81 ట్రిప్‌లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్ మథియాస్ బో వద్ద శిక్షణ, వీడియో అనలిస్ట్, ఇతర సౌకర్యాల కోసం డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలకు ప్రభుత్వం రూ. 5.62 కోట్లు ఇవ్వగా... పీవీ సింధుకు రూ.3.13 కోట్లు అందించింది. దీంతో పాటు 17 విదేశీ పర్యటనలు, వ్యక్తిగత కోచ్‌లు, సిబ్బంది నియామకం కోసం కూడా ‘టాప్స్’ ద్వారా సింధుకు సహకారం లభించింది. బాక్సింగ్: రూ.60.93 కోట్లు షూటింగ్: రూ.60.42 కోట్లు (ఆటగాళ్ల మొత్తం 45 విదేశీ ట్రిప్‌లకు ప్రభుత్వ సహకారం లభించింది. మొత్తం 41 జాతీయ క్యాంప్‌లు జరిగాయి) హాకీ: రూ.41.29 కోట్లు (టోక్యోలో కాంస్యం సాధించడంతో ఈ సారి మన జట్టునుంచి మరింత మెరుగైన ప్రదర్శనను ఆశిస్తూ 76 జాతీయ శిక్షణా శిబిరాలు నిర్వహించడంతో పాటు 19 విదేశీ పర్యటనలకు అవకాశం కల్పించింది) ఆర్చరీ: రూ.39.18 కోట్లు (41 జాతీయ క్యాంప్‌లు నిర్వహించారు) రెజ్లింగ్: రూ.37.80 కోట్లు వెయిట్‌లిఫ్టింగ్: రూ.26.98 కోట్లు (టోక్యో రజత పతక విజేత మీరాబాయి చానుకు శిక్షణ నిమిత్తం ప్రభుత్వం రూ. 2.74 కోట్లు అందించింది) టేబుల్ టెన్నిస్: రూ. 12.92 కోట్లు జూడో: రూ. 6.30 కోట్లు స్విమ్మింగ్: రూ.3.90 కోట్లు రోయింగ్: రూ.3.89 కోట్లు సెయిలింగ్: రూ.3.78 కోట్లు గోల్ఫ్: రూ.1.74 కోట్లు టెన్నిస్: రూ.1.67 కోట్లు ఈక్వె్రస్టియన్: రూ.95 లక్షలు -
‘సాయ్’ స్పందన సరిగా లేదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని భారత టాప్ రెజ్లర్లంతా పునరుద్ఘాటించారు. బ్రిజ్‌భూషణ్‌ను తప్పించి ఆటను కాపాడాలంటూ బుధవారం అనూహ్యంగా నిరసనకు దిగిన రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తదితరులు ఇప్పటికే నిరసనలో పాల్గొంటుండగా గురువారం ఒలింపిక్ రజత పతక విజేత రవి దహియా, అన్షు మలిక్ కూడా వారికి సంఘీభావం ప్రకటించారు. రెజ్లర్ల ఆరోపణలకు స్పందిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు వారితో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సుమారు గంట పాటు వారితో రెజ్లర్ల భేటీ సాగింది. అయితే దీనిపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు అండగా నిలుస్తామని అధికారులు చెబుతున్నా...వారి స్పందన సంతృప్తికరంగా లేదని, చర్యల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని రెజ్లర్లు చెప్పారు. ‘లైంగిక వేధింపులకు గురైన మరికొందరు బాధితులు ఇవాళ మాతో చేరారు. వారి పేర్లు ప్రస్తుతానికి బహిరంగపర్చదల్చుకోలేదు. ఏదైనా పరిష్కారం వస్తుందని భావించాం. కానీ ప్రభుత్వ స్పందన చూస్తే అలా అనిపించడం లేదు. ఇక మేం చట్టపరంగా, న్యాయపరంగా తేల్చుకుంటాం. బ్రిజ్‌భూషణ్ రాజీనామా మాత్రమే కాదు... ఆయనపై కేసు నమోదు చేయించి జైలుకు కూడా పంపిస్తాం. మేమంతా ఒలింపిక్ విజేతలం, ప్రపంచ విజేతలం. అన్నీ నిజాలే చెబుతున్నాం. తగిన ఆధారాలూ ఉన్నాయి. మా ఆరోపణలపై సందేహాలు వద్దు’ అని వినేశ్ స్పష్టం చేసింది. బీజేపీకి చెందిన మరో అగ్రశ్రేణి రెజ్లర్ బబితా ఫొగాట్ కూడా ప్రభుత్వం తరఫున చర్చలకు ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రిని కలిసిన రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలతో నిరసన తెలుపుతున్న రెజ్లర్లు గురువారం రాత్రి మరో కీలక అడుగు వేశారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి, రెజ్లర్ల మధ్య గంటకు పైగా చర్చలు కొనసాగాయి. చర్చల తుది ఫలితంపై స్పష్టత లేకున్నా... బ్రిజ్‌భూషణ్ రాజీనామాకే ఠాకూర్ కూడా మద్దతు పలికినట్లు తెలిసింది. 24 గంటల్లోగా ఆయన తన రాజీనామాను ప్రకటించాలని, లేదంటే తామే ఆయనను తొలగిస్తామని కూడా స్పష్టం చేసినట్లు రెజ్లింగ్ వర్గాల సమాచారం. -
డోపింగ్ టెస్టులో ఫెయిల్.. స్టార్ అథ్లెట్‌పై రెండేళ్ల నిషేధం!
భారత జిమ్నాస్టిక్స్ అథ్లెట్ దీపా కర్మాకర్ డోపింగ్ టెస్టులో ఫెయిల్ అయ్యింది. యాంటీ డోపింగ్ టెస్టులో ఫెయిల్ కావడంతో రెండేళ్ల నిషేధానికి గురయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ (ఎఫ్ఐజీ), జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్ఐ), నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) నిర్దేశించిన మార్గదర్శకాలను దీపా కర్మాకర్ అనుసరించడంలో ఫెయిల్ అయ్యిందని సమాచారం. అయితే శాయ్(SAI) కానీ.. భారత జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ కానీ దీపా కర్మాకర్ నిషేధం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ అయిన ప్రతీ అథ్లెట్, ప్రతీ ఏడాది యాంటీ డోపింగ్ టెస్టు కోసం నమూనాలు సమర్పించాల్సి ఉంటుంది. సాంపిల్స్ సమర్పించకపోతే వారిపై ఏడాది నుంచి రెండేళ్ల వరకూ నిషేధం పడుతుంది. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్ తృటిలో పతకం మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, 2015 ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో దీపా కర్మాకర్ రజతం సాధించింది. 2018 అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో మెర్సిన్‌లో స్వర్ణం గెలిచిన ఆమె కొట్బస్లో రజతం సాధించింది. 2015లో అర్జున అవార్డుని పొందిన దీపా కర్మాకర్.. 2016లో ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకుంది. -
జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులకు గడువు పెంపు
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులు సమర్పించేందుకు కేంద్ర క్రీడాశాఖ తుది గడువును మూడు రోజులు పెంచింది. ఇంతకుముందు ప్రకటించినట్లు ఈ నెల 27తో గడువు ముగియగా... తాజాగా వచ్చే నెల 1వ తేదీ (శనివారం) వరకు అర్హత గల క్రీడాకారులు, కోచ్‌లు, సంఘాలు, యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నుంచి క్రీడాశాఖకు సంబంధించిన ప్రత్యేక పోర్టల్‌లో ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ‘భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్యలు, స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డులు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు తమ నామినేషన్లను అక్టోబర్ 1లోపు ఆన్లైన్లో పంపాలి’ అని కేంద్ర క్రీడాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
సాయ్(SAI) మహిళా అధికారి నిర్వాకం.. వీడియో వైరల్
టీనేజ్ అథ్లెట్‌తో సాయ్(SAI) మహిళా అధికారి మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చేసింది. విషయంలోకి వెళితే.. షర్మిలా తేజావత్ అనే మహిళ ధార్‌లోని కుషాభౌ ఠాక్రే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పెషల్ ఏరియా గేమ్స్ సెంటర్లో ఇన్ఛార్జ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తోంది. సాయ్ సెంటర్‌కు వచ్చే టీనేజ్ అథ్లెట్స్‌ను షర్మిలా తేజావత్ తరచూ తన ఇంటికి తీసుకెళ్లి పర్సనల్ పనులకు వాడుకోవడమే కాకుండా వారితో మసాజ్ చేయించుకోవడం అలవాటుగా చేసుకుంది. తాజాగా ఇద్దరు టీనేజ్ అథ్లెట్లను తన ఇంటికి తీసుకెళ్లిన షర్మిలా తేజావత్ వారితో మసాజ్ చేయించుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. వీడియో తేదీ, సమయం, మసాజ్ చేస్తున్న అథ్లెట్స్ ఏ క్రీడకు చెందినవారు అనే దానిపై క్లారిటీ లేదు. కానీ షర్మిలాతో పాటే ఉన్న మరొక వ్యక్తి ఈ తతంగమంతా తన సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సాయ్ ఇంతవరకు స్పందించలేదు. అయితే మసాజ్ వ్యవహారంపై సదరు మహిళా అధికారిణిని ప్రశ్నించగా.. ఆమె తన సమాధానాన్ని దాటవేశారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన క్రీడా శిక్షణా శిబిరంగా పేరున్న సాయ్కు ఇది పెద్ద మచ్చ లాంటిదని పలువురు క్రీడా పండితులు అభిప్రాయపడ్డారు. బాధ్యత గల పదవిలో ఉంటూ మంచి అథ్లెట్స్‌గా తీర్చిదిద్దాల్సింది పోయి వారితో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏంటని మండిపడ్డారు. కాగా ధార్‌లోని జెట్‌పురాలోని కేంద్రానికి దేశం నలుమూలల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున శిక్షణ కోసం వస్తుంటారు. #धार #साई ट्रेनिंग सेंटर स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया का वीडियो वायरल हो रहा है, जिसमें साई सेंटर केंद्र प्रभारी सर्मिला तेजावत खिलाड़ियों से पैर दबवातीं नज़र आ रहीं हैं। खिलाड़ियों का ऐसा शोषण? कृपया संज्ञान लें @Media_SAI @YASMinistry @ianuragthakur #वायरल_वीडियो pic.twitter.com/JxxzJTR080 — 🇮🇳Sandeep Singh संदीप सिंह (@Sandeep_1Singh_) August 28, 2022 చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
‘మిషన్ ఒలింపిక్ సెల్’లో గగన్ నారంగ్
న్యూఢిల్లీ: భారత షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కీలక బాధ్యతలు అప్పగించింది. ‘సాయ్’ ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ)లో సభ్యుడిగా నారంగ్‌ను ఎంపిక చేసింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి వారిని ఒలింపిక్స్‌కు సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా 2014 నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) పని చేస్తోంది. ‘టాప్స్’ కోసం ఆటగాళ్లను గుర్తించడం, వారి సన్నాహకాలకు ఆర్ధికపరంగా సహకారం అందించే విషయంలో తగిన సూచనలు, సలహాలు అందించడం, ఫలితాలను పర్యవేక్షించడమే ‘మిషన్ ఒలింపిక్ సెల్’ బాధ్యత. 2024 పారిస్, 2028 లాస్ ఎంజెలిస్ ఒలింపిక్స్ కోసం అథ్లెట్లను ఎంపిక చేయడంలో తాను భాగస్వామిని కాబోతున్నట్లు హైదరాబాద్ షూటర్ గగన్ వెల్లడించాడు. ‘స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకొని డెవలప్మెంట్ గ్రూప్ కోసం ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఎంఓసీ కీలక పాత్ర పోషిస్తోంది. వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఆయా ఆటగాళ్ల అవసరాలను గుర్తించి ప్రత్యేక శిక్షణ కోసం నిధులు అందేలా చూడటంతో పాటు అత్యుత్తమ స్థాయి కోచింగ్ సౌకర్యం, ఫిట్నెస్ తదితర అంశాలపై కూడా ఎంఓసీ దృష్టి పెడుతుంది. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తా’ అని గగన్ వెల్లడించాడు. -
'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'
క్రీడలు ఏవైనా లైంగిక వేధింపులు సహజం. పాశ్చాత్య క్రీడల్లో భాగంగా ఉన్న ఇలాంటి వేధింపులు భారత్‌కు పాకాయి. తాజాగా భారత టాప్ మహిళా సైక్లిస్ట్.. భారత సైక్లింగ్ జాతీయ కోచ్ ఆర్కే శర్మపై సంచలన ఆరోపణలు చేసింది. ఆర్కే శర్మ తనను తన గదికి బలవంతంగా లాక్కెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. విషయంలోకి వెళితే.. స్లోవేనియాలో జరుగుతున్న సైక్లింగ్ పోటీలకు భారత సైక్లింగ్ టీమ్‌లో ఐదురుగు పురుషులు, ఓ మహిళా సైక్లిస్ట్ వెళ్లారు. వాస్తవానికి స్లోవేనియాలో భారత జట్టుకి మహిళా కోచ్‌లు ఎవ్వరూ అందుబాటులో లేరు. దీంతో ఆర్కే శర్మ సదరు మహిళకు కూడా కోచ్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. గదిలోకి లాక్కెళ్లి తనకు బార్యగా ఉండాలని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా భారత జట్టు సైక్లింగ్ పోటీల్లో పాల్గొని జూన్ 14న స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ టూర్‌ని మధ్యలోనే రద్దు చేసుకుని, వెనక్కి రావాల్సిందిగా సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ ఓంకార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎఫ్ఐ కలిసి రెండు ప్యానెల్స్‌తో విచారణ నిర్వహిస్తున్నాయి. ‘అథ్లెట్ ఫిర్యాదును స్వీకరించిన వెంటనే ఆమె భద్రత దృష్ట్యా, సైక్లింగ్ బృందాన్ని స్వదేశానికి రప్పించడం జరిగింది. కమిటీ ఈ విషయంపై పూర్తి విచారణ చేయనుంది. అతి త్వరలో నిజాలను నిగ్గు తేల్చి, బాధితురాలికి న్యాయం చేస్తాం.’ అని సాయ్ అధికారులు తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కే శర్మ ఇప్పటిదాకా స్వదేశానికి చేరుకోలేదు. త్వరలోనే అతన్ని స్లోవేనియా నుంచి స్వదేశానికి రప్పించి, నోటీసులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. చదవండి: మెస్సీకి వీరాభిమాని.. రెచ్చగొట్టే ఫోటోలతో చేతులు కాల్చుకుంది Tiger Woods: వేల కోట్లు వద్దనుకున్నాడు.. బిలీనియర్ అయ్యే చాన్స్ మిస్ -
జిమ్నాస్ట్ అరుణ ఆరోపణలపై విచారణ
న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి ఆరోపణలపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) విచారణకు ఆదేశించింది. మార్చిలో జిమ్నాస్టులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు నిర్వహిస్తుండగా... తన అనుమతి లేకుండా కోచ్ రోహిత్ జైస్వాల్ వీడియో తీయడంపై అరుణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆమె అప్పట్లోనే ఫిర్యాదు చేసినప్పటికీ భారత జిమ్నాస్ట్ సమాఖ్య (జీఎఫ్ఐ) సదరు కోచ్‌కు క్లీన్చిట్ ఇచ్చింది. జీఎఫ్ఐ తేలిగ్గా తీసుకోవడంపై నిరాశ చెందిన అరుణ చట్టపరమైన చర్య లకు ఉపక్రమించడంతో ‘సాయ్’ రంగంలోకి దిగింది. ‘సాయ్’లోని టీమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక శ్రీమన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని నియమించి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. -
13, 14 తేదీల్లో అథ్లెటిక్స్‌లో ఉచిత శిక్షణకు ఎంపికలు
సాక్షి, అమరావతి: ఆథ్లెటిక్స్ లోని వివిధ విభాగాల్లో అండర్ 14, 16, 18 కేటగిరీల్లో బాలబాలికలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్, స్టేట్ లెవల్ ఖేలో ఇండియా సెంటర్ (ఏఎస్ఆర్ స్టేడియం–ఏలూరు) ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు శాప్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే ఎంపిక పోటీల్లో అర్హత సాధించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ హాస్టల్లో ఉచిత భోజన వసతితో కూడిన అథ్లెటిక్స్ శిక్షణ అందిస్తారు. వివరాలకు 98853 12356 నంబరులో సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇవీ చదవండి: ప్రియుడి మోజులో భార్య.. భర్త మెడకు చీరచుట్టి..ఆపై! మచ్చా అన్నందుకు డబుల్ మర్డర్ -
విశాఖ ‘శాయ్’లో ప్రవేశాలు
విజయవాడ స్పోర్ట్స్: విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) కేంద్రంలో బాక్సింగ్, వాలీబాల్ క్రీడల్లో శిక్షణ తీసుకునేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, ఎండీ ప్రభాకరరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగా 10 నుంచి 16 ఏళ్ల వయసు కలిగిన బాలబాలికలకు వాలీబాల్, బాక్సింగ్‌ల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్ శిక్షణకు హాజరయ్యేవారు ఈ నెల 21, 22 తేదీల్లో, బాక్సింగ్ శిక్షణకు హాజరు కావాలనుకునేవారు ఈ నెల 23, 24 తేదీల్లో విశాఖపట్నం పోర్టు స్టేడియంలో జరిగే ఎంపిక పోటీలకు రావాలని సూచించారు. జనన ధ్రువీకరణ పత్రం, విద్యార్హత, ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్‌కార్డ్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇంతకుముందు పాల్గొన్న క్రీడల సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8247443921 (బాక్సింగ్), 9440587614 (వాలీబాల్) నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ శిక్షణ కేంద్రంలో అర్హత కలిగిన కోచ్‌లు, ట్రైనీలతో శిక్షణ ఇస్తామన్నారు. అలాగే పౌష్టికాహారం, అత్యాధునిక సదుపాయాలు కలిగిన కిట్లు, విద్య, వైద్య, బీమా సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు. -
విదేశీ కోచ్‌ల సత్తా! ఒక్కొక్కరి జీతాలు ఎంతంటే..
స్వదేశీ కోచ్‌లు ఎక్కడ? అనే విమర్శలను కాసేపు పక్కనపెడితే.. ఫారిన్ కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్లు ఈ దఫా ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యను పెంచడంలో భారత్‌కు వెన్నెముకగా నిలిచారు. నీరజ్ కోసం జర్మనీ ఉవీ హోన్, పురుషుల హాకీ కోసం ఆసీస్ గ్రాహం రెయిడ్, లవ్లీనా-మహిళా బాక్సింగ్ టీం కోసం ఇటలీ రఫలే బెర్గామాస్కో, భజరంగ్ పూనియా కోసం షాకో బెంటిండిస్, పీవీ సింధు కోసం దక్షిణకొరియా పార్క్, సెమీస్ దాకా చేరిన మహిళా హాకీ టీం కోసం నెదర్లాండ్స్ జోయర్డ్ మరీన్.. ఇలా అంతా విదేశీ కోచ్‌ల హవానే ఈసారి కనిపించింది. భారత అథ్లెట్లు-ప్లేయర్లు నీరజ్ చోప్రా, పీవీ సింధు, లవ్లీనా, మీరాబాయ్ ఛాను, రవి దహియా, భజరంగ్ పూనియా, మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల హాకీ టీం-రాణి రాంపాల్ నేతృత్వంలోని మహిళా హాకీ టీం.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో ప్రముఖంగా నిలిచిన వీళ్లందరికీ ఉన్న ఒకే కామన్ పాయింట్.. అంతా విదేశీ కోచ్‌ల ఆధ్వర్యంలో సత్తా చాటినవాళ్లే. అవును.. వీళ్ల ఘనత వల్ల స్వదేశీ కోచ్‌ల ప్లేసుల్లో ఈసారి విదేశీ కోచ్‌ల పేర్లు ఎక్కువగా తెరపై వినిపించి.. కనిపించాయి. పతకాల మేజర్ సక్సెస్ రేటు పరదేశీ కోచ్‌లదే అయినా.. స్వదేశీ కోచ్‌లకు స్థానం దక్కకపోవడంపై కొంత విమర్శలు వినిపించాయి. వీళ్లే టా(తో)ప్ విదేశీ కోచ్‌ల్లో ఎక్కువ జీతం అందుకుంది ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం, భారత పురుషుల హాకీ జట్టు కోచ్ గ్రాహం రెయిడ్. నెలకు పదిహేను వేల డాలర్ల జీతం(పదకొండు లక్షలకుపైనే) అందుకున్నాడాయన. ఆ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్ హాకీ లెజెండ్ జోయర్డ్ మరీన్ నెలకు పదివేల డాలర్లు(ఏడున్నర లక్షల రూపాయలపైనే) అందుకున్నారు. ఇక బాక్సింగ్ డైరెక్టర్ శాంటియాగో నియేవా(అర్జెంటీనా) ఈ లిస్ట్‌లో ఎనిమిది వేల డాలర్ల(దాదాపు ఆరు లక్షల రూపాయలు)తో మూడో ప్లేస్‌లో నిలవగా, జావెలిన్ త్రో కోచ్ ఉవే హోన్ నెలకు ఎనిమిదివేల డాలర్లతో నాలుగో ప్లేస్‌లో, రైఫిల్ కోచ్‌లు ఓలెగ్ మిఖాయిలోవ్-పావెల్ స్మిర్నోవ్ (రష్యా)లు చెరో 7,500 డాలర్లు ( ఐదున్నర లక్షల రూపాయలు)లతో తర్వాతి స్థానంలో నిలిచారు. కొత్తేం కాదు విదేశీ కోచ్‌ల్ని ఆశ్రయించడం మనకేం కొత్త కాదు. అందులో ఎలాంటి దాపరికమూ లేదు. 80వ దశకం నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ విదేశాల నుంచి స్పెషలిస్టులను తెప్పించుకోవడం మొదలుపెట్టింది. సిడ్నీ ఒలింపిక్స్(2000) టైం నాటికి అది తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా హాకీ, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్ లాంటి మేజర్ ఈవెంట్లు విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో మెరుగైన ప్రదర్శనకు దారితీయడంతో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ప్రముఖంగా విదేశీ కోచ్‌లకే ఎందుకు ప్రాధాన్యం? అనే ప్రశ్నకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నుంచి వివరణ.. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడమే. శాయ్ ఎంపిక చేసే కోచ్‌లలో ఎక్కువ మంది గతంలో ఛాంపియన్లుగా ఉన్నవాళ్లో లేదంటే విజయాలను అందుకున్న అనుభవం ఉన్నవాళ్లో ఉంటారు. వాళ్లకు మన కోచ్‌లతో పోలిస్తే సైంటిఫిక్-టెక్నికల్ నాలెడ్జ్, ట్రిక్కులు- జిమ్మిక్కులు, డైట్‌కు సంబంధించిన వివరాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. అందుకే కేవలం సలహాల కోసమే ఒక్కోసారి వాళ్లను నియమించుకుంటాయి కూడా. అలాగని మన దగ్గరా సత్తా ఉన్నవాళ్లు లేరని కాదు. ‘సక్సెస్‌తో పాటు అనుభవం’ అనే పాయింట్ మీదే ఫోకస్ చేస్తూ ఫారిన్ కోచ్‌లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తోంది శాయ్. అలాగే వీళ్లకు నెలకు మినిమమ్ నెలకు నాలుగు వేల డాలర్లకు తగ్గకుండా శాలరీ ఇస్తుంటుంది. అలాగే వాళ్లతో పని కూడా అదే తీరులో చేయించుకుంటాయి మన స్పోర్ట్స్ అథారిటీలు. విదేశీకే ప్రయారిటీ టోక్యో ఒలింపిక్స్ కోసం టోక్యోకు వెళ్లిన 126 మంది అథ్లెట్ల కోసం (9 విభాగాలు) 32 మంది విదేశీ కోచ్‌లు(50 మంది స్వదేశీ కోచ్‌లను సొంత ఖర్చులతో భారత ప్రభుత్వం పంపించింది) పని చేశారు. సక్సెస్ జోరు.. ఆటగాళ్లతో ఈ కోచ్‌ల టెంపో కారణంగా మరికొంత కాలం వీళ్లనే కోచ్‌లుగా కొనసాగించాలని శాయ్ భావిస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 30, 2021 వరకు వీళ్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. పారిస్, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టకుని.. మరో నాలుగేళ్లపాటు విదేశీ కోచ్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
ఒలింపిక్స్ విజేతలకు సన్మానం
సాక్షి, ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ విజేతలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఘనంగా సన్మానించింది. సోమవారం ఢిల్లీలోని హోటల్ అశోక్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, రవికుమార్, పీవీ సింధు, భజరంగ్ పునియా, లవ్లీనా, హాకీ పురుషుల జట్టుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రులు, అధికారులు క్రీడాకారులు, కోచ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. దేశానికి స్వర్ణపతకం తేవడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. -
Indian Athletes: వైద్యం కోసం 5 లక్షలు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో అథ్లెట్ల విషయంలో క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 13 వేల మందికిపైగా క్రీడాకారులతో పాటు వారితో పనిచేసే సహాయక సిబ్బందికి కూడా ఆరోగ్య బీమా చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గురువారం తన ప్రకటనలో పేర్కొంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారి వైద్యం కోసం రూ. 5 లక్షలు, రోడ్డు ప్రమాదంలో మరణించినట్లయితే రూ. 25 లక్షల వరకు బీమా లభించనుంది. గతంలో ఈ ఇన్సూరెన్స్ జాతీయ శిక్షణ శిబిరాలకు మాత్రమే వర్తించగా... ప్రస్తుతం ఏడాది మొత్తం ఉండనుంది. అంతే కాకుండా బీమా పొందే అథ్లెట్ల సంఖ్యను కూడా పెంచింది. బీమా అంశం గురించి కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘‘ అథ్లెట్లు జాతీయ సంపద. వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు. చదవండి: బ్లాక్ ఫంగస్: భారత షూటింగ్ కోచ్ కన్నుమూత ‘సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి’ -
ఒలింపిక్స్ నడక
‘‘ఒలింపిక్స్ అన్న మాటే నా ఆలోచనల్లో ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌లోనే ఆడబోతున్నాను’’. ఫిబ్రవరి 13 న రాంచీలో జరిగిన రేస్ వాకింగ్ జాతీయ స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి, ఒలింపిక్స్‌కి అర్హత పొందిన ప్రియాంక గోస్వామి (24) అన్న మాట ఇది!! నిజమే, ఆమె కుటుంబ పరిస్థితులు కూడా అటువంటివే! చదువే భారమైనప్పుడు ఆటలు, ఆటల పోటీలు, ఒలింపిక్స్.. ఇవన్నీ ఊహకైనా సాధ్యమయేవేనా! అయ్యాయి. అందుకు ముగ్గురు వ్యక్తులు కారణం. తల్లి, తండ్రి, కోచ్. ‘‘ఈ ముగ్గురూ స్పోర్ట్స్‌లో నాకొక అందమైన భవిష్యత్తును ప్రసాదించారు. వారు చూస్తుండగా ఒలింపిక్స్‌లో ఆడబోతున్నాను’’ అని సంబరంగా అంటున్న ప్రియాంక ప్రస్తుతం టోక్యోలో జూలైలో జరిగే ఒలింపిక్స్‌కి సాధన చేస్తోంది. ప్రియాంక ఈ ఫిబ్రవరిలో 1:28:45 నిముషాలలో 20 కి.మీ. రేస్ వాక్‌లో లక్ష్యాన్ని సాధించి, విజేతగా నిలిచినప్పటి నుంచీ రానున్న టోక్యో ఒలింపిక్స్ లో భారత్‌కు ఆమె ఒక పసిడి ఆశ అయింది. ప్రియాంక ఉత్తర ప్రదేశ్ క్రీడాకారిణి. ఆమె తండ్రి మదన్ పాల్ ప్రభుత్వ రవాణా శాఖలో బస్ కండక్టర్. వాళ్లుండే ముజఫర్‌నగర్ బుధాన ప్రాంతంలోని సాగడి గ్రామం నుంచి ఉద్యోగం కోసం భార్యాబిడ్డలతో మీరట్ వచ్చేశారు ఆయన. ప్రియాంక పెద్దమ్మాయి. ఆమె తమ్ముడు కపిల్. తల్లి అనిత గృహిణి. డ్యూటీలో ఉండగా ఒక రోడ్డు ప్రమాదం కేసులో బస్ డ్రైవర్ తో పాటు, ప్రియాంక తండ్రి ఉద్యోగం కూడా పోయింది. ఆర్థికంగా అసలే అంతంత మాత్రం అయిన ఆ కుటుంబం ఒక్కసారిగా కుదేలైపోయింది. అయితే బిడ్డల చదువు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగకూడదని తీర్మానించుకున్నారా భార్యాభర్తలు. మదన్‌పాల్ టాక్సీ అద్దెకు తీసుకుని నడిపాడు. భార్య చేత చిన్న కిరాణా దుకాణం పెట్టించాడు. పిండి మర ఆడించాడు. స్కూలు లేనప్పుడు పిల్లలిద్దరూ తల్లిదండ్రుల కష్టాన్ని పంచుకునేవారు. ప్రియాంక మీరట్‌లోని కనోహర్లాల్ గర్ల్స్ స్కూల్లో చదివింది. పాటియాలలో బి.ఎ. పూర్తి చేసింది. బి.ఎ. చదువుతున్నప్పుడే ఆమె రేస్ వాక్‌ను తనకు ఇష్టమైన క్రీడాంశం గా ఎంచుకుని ప్రాక్టీస్ చేసింది. ఆ సమయంలో తండ్రి పంపించిన డబ్బుతోనే సర్దుకునేది. నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు పంపేవారు ఆయన. వాటిల్లోనే కొంత మిగుల్చుకుని మిగతా ఖర్చులకు వాడుకునేది. అందుకోసం తరచు ఆమె ఒక పూట మాత్రమే భోజనం చేసింది. 2011లో రేస్ వాక్‌లో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాక ఆ ఈవెంట్‌పై మరింత శ్రద్ధ పెట్టింది ప్రియాంక. ఆమె తమ్ముడు కూడా స్పోర్ట్స్మనే. స్టేట్ లెవల్ బాక్సింగ్ ప్లేయర్. మీరట్‌లో ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2014–15లో ప్రియాంక డిగ్రీ అయ్యాక ఆమెకు బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉచితంగా శిక్షణ లభించడానికి ఆమె కోచ్ గౌరవ్ త్యాగి చేసిన ప్రయత్నాలే కారణం. 2018లో ప్రియాంకకు స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం వచ్చాక ఆ కుటుంబ పరిస్థితి కాస్త మెరుగైంది. ‘‘స్కూల్లో ఉన్నప్పుడే నాన్న నాకు అప్పు చేసి స్కూటీ కొనిచ్చాడు. దానిపై స్కూలుకూ, స్టేడియంలో ప్రాక్టీస్‌కీ వెళ్లేదాన్ని. పరీక్షలు, స్పోర్ట్ ఈవెంట్లు ఉన్నప్పుడు ఆమ్మ నిద్ర మానుకుని మరీ నాకోసం అన్నీ అమర్చిపెట్టే పనిలో ఉండేది. ఇక నా కోచ్ త్యాగి సర్ అయితే నా శిక్షణ కోసం చాలా కష్టపడ్డారు. వారందరి వల్లే నేను ఈ రోజు ఒలింపిక్స్‌కి అర్హత సాధించాను’’ అని ప్రియాంక చెబుతోంది. స్కూల్లో ఉండగా ప్రియాంకకు క్రీడల్లో అసక్తికరమైన అంశం జిమ్నాస్టిక్స్. కొంతకాలం తర్వాత అథ్లెటిక్స్ వైపు వచ్చింది. డిగ్రీ అయ్యాక రేస్ వాకింగ్పై ఇష్టం పెంచుకుంది. ఫ్యాషన్ మోడలింగ్ కూడా ఇష్టం. -
కరోనా కలకలం.. 30 మంది అథ్లెట్లకు పాజిటివ్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ 2020 సన్నాహకాల్లో భాగంగా నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) నిర్వహించిన కరోనా పరీక్షల్లో 30 మంది క్రీడాకారులు, సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పటియాల, బెంగళూరు నగరాల్లోని నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సెల్లెన్స్‌ల్లో 741 మంది క్రీడాకారులు, సహాయ సిబ్బందికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. అయితే టోక్యో ఒలింపిక్స్ వెళ్లే ఏ అథ్లెట్ కూడా వైరస్ బారిన పడకపోవడం ఊరట కలిగించే అంశం. వైరస్ సోకిన వారి జాబితాలో భారత పురుషుల బాక్సింగ్ చీఫ్ కోచ్ సీఏ కుట్టప్ప, షాట్‌పుట్ కోచ్ మోహిందర్ సింగ్ డిల్లాన్ లాంటి ప్రముఖులు ఉన్నట్లు సాయ్ ప్రకటించింది. పటియాల ఎన్ఐఎస్లో మొత్తం 313 మందికి పరీక్షలు నిర్వహించగా.. 26 మందికి పాజిటివ్‌గా తేలిందని, బెంగళూరు కేంద్రంలో 428 మందికి పరీక్షలు నిర్వహిస్తే నలుగురికి వైరస్ సోకిందని సాయ్ పేర్కొంది. అయితే, ఈ రెండు సెంటర్లలో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లు గానీ, కోచ్‌లుగానీ వైరస్ బారిన పడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మహమ్మారి బారిన పడిన బాక్సర్ల జాబితాలో ఆసియా సిల్వర్ మెడలిస్ట్ దీపక్ కుమార్, ఇండియా ఓపెన్ గోల్డ్ మెడలిస్ట్ సంజిత్ ఉన్నారు. చదవండి: నేను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు: భజ్జీ -
క్రీడా బడ్జెట్లో రూ. 230 కోట్లు కోత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ క్రీడా రంగం కుదేలైన వేళ బడ్జెట్లో క్రీడల ప్రాధాన్యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించారు. సోమవారం 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆమె క్రీడా బడ్జెట్లో రూ. 230.78 కోట్లు కోత విధిం చారు. గతేడాది క్రీడల కోసం రూ. 2826.92 కోట్లు కేటాయించగా... ఈసారి ఆ మొత్తాన్ని రూ. 2596.14కోట్లతో సరిపెట్టారు. ► మరోవైపు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి సైతం బడ్జెట్లో ప్రాధాన్యం భారీగా తగ్గింది. గతేడాది రూ. 890.42 కోట్లుగా ఉన్న ఈ మొత్తాన్ని ఈ ఏడాదికి గానూ రూ. 657.71 కోట్లకు కుదించారు. దీంతో ఏకంగా రూ. 232.71 కోట్లపై కోత పడింది. ► అయితే జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను, క్రీడాకారులను, సంస్థలను పర్యవేక్షించే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తోపాటు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు (ఎన్ఎస్ఎఫ్) కేంద్రం సముచిత ప్రాధాన్యాన్నిచ్చింది. బడ్జెట్ కేటాయింపులో గతేడాదితో పోలిస్తే భారీ పెంపును ప్రకటించింది. దీంతో ‘సాయ్’ నిధులు రూ. 500 కోట్లు నుంచి రూ. 660.41 కోట్లకు చేరగా... సమాఖ్యల బడ్జెట్ రూ. 245 కోట్లు నుంచి ఏకంగా రూ. 280 కోట్లకు పెరిగింది. ► క్రీడాకారులకు అందించే ప్రోత్సాహకాలను రూ. 70 కోట్ల నుంచి రూ. 53 కోట్లకు తగ్గిస్తున్నట్లుగా బడ్జెట్లో ప్రతిపాదించారు. ► జాతీయ క్రీడాభివృద్ధి నిధుల్లోనూ కత్తెర వేశారు. సగానికి సగం తగ్గించి ఈ మొత్తాన్ని రూ. 25 కోట్లుగా నిర్ధారించారు. ► కామన్వెల్త్ క్రీడల సన్నాహాల బడ్జెట్‌ను రూ. 75 కోట్లు నుంచి రూ. 30 కోట్లకు తగ్గించిన కేంద్రం... జమ్ము కశ్మీర్లో క్రీడా సదుపాయాల కల్పన నిధులు (రూ. 50 కోట్లు), జాతీయ క్రీడాకారుల సంక్షేమానికి కేటాయించే నిధుల్లో (రూ. 2 కోట్లు) ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదు. ► గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి జాతీయ వ్యాయామ విద్య సంస్థ బడ్జెట్‌ను యథాతథంగా రూ. 55 కోట్లుగా కొనసాగించింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు కేటాయించే నిధుల్ని రూ. 2 కోట్లు నుంచి రూ. 2.5 కోట్లకు పెంచింది. -
క్రీడా రంగానికి కేటాయింపులెన్నో!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి లభించే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. గత కొన్నేళ్లుగా బడ్జెట్లో క్రీడారంగానికి ప్రాధాన్యత పెరిగినప్పటికీ, కేటాయింపుల్లో నిలకడ లోపించింది. గతేడాది (2020–21) ఖేలో ఇండియా గేమ్స్ కోసం రూ. 890 కోట్లను కేటాయించిన కేంద్రం... భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల నిధుల్లో కోత విధించింది. 2019లో రూ. 615 కోట్లుగా ఉన్న ‘సాయ్’ కేటాయింపులు గతేడాది రూ. 500 కోట్లకు తగ్గగా... క్రీడా సమాఖ్యలకు (రూ. 245 కోట్ల నుంచి రూ. 55 కోట్లకు తగ్గింపు) సైతం భారీ కోత పడింది. అయితే కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సిద్ధం చేసిన ఈ బడ్జెట్లో క్రీడారంగానికి ఎన్ని నిధులు దక్కుతాయనేది ఆసక్తికరం. ► లాక్డౌన్ కారణంగా యూత్ స్పోర్ట్స్‌కు ఆదరణ పెరగడంతో ఈసారి బడ్జెట్లో క్రీడలపై ఎక్కువ వెచ్చించే అవకాశముంది. ► మరోవైపు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమాలను విజయవంతం చేయాలంటే అందుకు తగిన నిధులు కేటాయించాల్సిందే. ► లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు, క్రీడల్ని కెరీర్‌గా ఎంచుకున్న మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై కేంద్రం దృష్టి సారించాల్సి ఉంది. దీనితో పాటు ఒలింపిక్స్ ఏడాది కావడంతో ఆటగాళ్లకు దన్నుగా నిలిచేందుకు ‘సాయ్’, ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ► కరోనా కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో గతేడాది గేమింగ్ సెక్టార్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈస్పోర్ట్స్, గేమింగ్ సెక్టార్లను అభివృద్ధి చేసే స్వదేశీ గేమ్ డెవలపర్స్, స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తూ బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇస్తే... నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోన్న మేకిన్ ఇండియా బ్రాండ్‌కు మంచి ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది. -
నా కోచ్‌ను అనుమతించండి
న్యూఢిల్లీ : పాటియాలాలో జరుగుతోన్న జాతీయ బాక్సింగ్ క్యాంపులోకి తన కోచ్ అనిల్ ధన్కర్ను అనుమతించాల్సిందిగా భారత మేటి బాక్సర్, ఆసియా క్రీడల విజేత అమిత్ పంఘాల్ భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)ను కోరాడు. 52 కేజీల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ బాక్సర్ అయిన అమిత్ ఇదే విషయాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పాడు. ‘నేను కేవలం విజ్ఞప్తి మాత్రమే చేయగలను. సాయ్తో పాటు కేంద్రాన్ని కూడా కోరాను. వారి స్పందన కోసం వేచి చూస్తున్నా. ఇప్పటివరకు ఎవరూ దీనిపై స్పందించలేదు. వారి నిర్ణయం ఏదైనప్పటికీ నాకు కనీసం సమాధానం ఇవ్వాలి కదా. నా కోచ్ అనిల్ ఎన్ఐఎస్లో శిక్షణ పొందారు. ఆయన ‘ఐబా’ వన్ స్టార్ కోచ్. ఒలింపిక్స్ సన్నాహాల కోసం ఆయన అవసరం నాకెంతో ఉంది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీలకు ముందు కూడా నేను ఇదే ప్రతిపాదన చేశాను. ఇప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు’ అని 24 ఏళ్ల అమిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున రజతం సాధించిన ఏకైక బాక్సర్‌గా అమిత్ ఘనత సాధించాడు. -
నన్నెందుకు పక్కన పెట్టారు
హైదరాబాద్: జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు తనను ఎంపిక చేయకపోవడంపై సీనియర్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఏ ప్రాతిపదికపైన ఎనిమిది మందికే అవకాశం ఇచ్చారని అతను సూటిగా ప్రశ్నించాడు. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఈ క్యాంప్ జరుగుతోంది. ఇందులో 2021 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్న ఎనిమిది మందినే (సింధు, సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, చిరాగ్, సాత్విక్) శిక్షణ కోసం ఎంపిక చేశారు. తాను కూడా ప్రస్తుతం ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో ఉన్నానని, ఆ అవకాశం తనకూ ఉందని అతను గుర్తు చేశాడు. ‘నా దృష్టిలో ఎనిమిది మందినే అనుమతించడంలో అసలు అర్థం లేదు. నాకు తెలిసి ఒలింపిక్స్‌కు ముగ్గురు మాత్రమే ఇప్పటికే దాదాపుగా అర్హత సాధించారు. మిగిలినవారు అర్హత సాధించడం అంత సులువేం కాదు. ఈ జాబితాలో శ్రీకాంత్, మహిళల డబుల్స్ జోడి కూడా ఉన్నారు. సాయిప్రణీత్, శ్రీకాంత్‌ల తర్వాత నేను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో ఉన్నాను. నా పేరును ఎందుకు పరిశీలించలేదు’ అని కశ్యప్ అన్నాడు. ‘సాయ్’ స్పందించలేదు... ఈ జాబితాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రూపొందించిందని, అందుకే కోచ్ గోపీచంద్ సలహాపై వారినే ఈ విషయంలో ప్రశ్నించినా... సంతృప్తికర సమాధానం రాలేదని కశ్యప్ అసహనం వ్యక్తం చేశాడు. ‘సాయ్ డీజీని నేను ఇదే విషయం అడిగాను. మరో 7–8 అర్హత టోర్నీలు మిగిలి ఉన్న ప్రస్తుత దశలో ఈ ఎనిమిది మందినే ఎంపిక చేయడానికి, తనను పరిగణలోకి తీసుకుపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించాను. ఒక రోజు తర్వాత ‘సాయ్’ అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి ఉన్నతాధికారుల సూచనలతోనే ఈ పేర్లు చెప్పామని, వీరికి మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్నట్లుగా తాము భావించామని అన్నారు. ఆ ఎనిమిది మంది అనారోగ్యం బారిన పడకుండా ఒలింపిక్స్ వరకు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెబుతున్నారు. అయితే వారంతా క్యాంప్‌లో ఉండటం లేదు. బయట తమకు నచ్చినవారిని కలుస్తున్నారు కూడా. మరి వారిని ఆరోగ్యంగా ఉంచుతామని అనడంలో అర్థమేముంది’ అని కశ్యప్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. గోపీచంద్ అకాడమీలో ప్రస్తుతం 9 కోర్టులు ఉంటే వేర్వేరు సమయాల్లో నలుగురు మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారని... మిగిలిన సమయంలో తమకు శిక్షణకు అవకాశం ఇవ్వడంలో అభ్యంతరం ఏముందని అతను అన్నాడు. వీరి కోసం 9 మంది కోచ్‌లు, ఇద్దరు ఫిజియోలు కూడా పని చేస్తున్నారని గుర్తు చేసిన కశ్యప్... శిక్షణకు అవకాశం ఇవ్వకపోతే తాను ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించగలనని అతను తన ఆవేదనను ప్రకటించాడు. -
ఆ ఐదుగురు ఆసుపత్రికే...
బెంగళూరు : కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఐదుగురు భారత హాకీ జట్టు ఆటగాళ్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రికి తరలించారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి సాధారణం కంటే తక్కువకు పడిపోవడంతో మంగళవారం భారత పురుషుల హాకీ జట్టు కీలక ఆటగాడు మన్దీప్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఎస్ఎస్ స్పర్శ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో మన్దీప్ చికిత్స పొందుతుండగా... ఇదే ఆసుపత్రిలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, డిఫెండర్లు సురేందర్ కుమార్, జస్కరణ్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, గోల్‌కీపర్ కృషన్ బహదూర్ పాఠక్‌లను చేర్చారు. ఈనెల 20 నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో జాతీయ హాకీ శిక్షణ శిబిరం మొదలవుతుంది. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌గా వచ్చింది. -
విదేశీ కోచ్‌ల కాంట్రాక్టు పొడిగించిన ‘సాయ్’
న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) విదేశీ కోచ్‌ల ఒప్పందాల్ని పొడిగించింది. టోక్యో ఒలింపిక్స్ కోసం పలు క్రీడాంశాలకు చెందిన విదేశీ కోచ్‌లను నియమించిన ‘సాయ్’ ఇప్పుడు మెగా ఈవెంట్ వాయిదా పడటంతో కాంట్రాక్టు గడువునూ పొడిగించాల్సి వచ్చింది. 11 క్రీడాంశాలకు చెందిన మొత్తం 32 మంది విదేశీ కోచ్‌ల కాంట్రాక్టుల్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ దాకా పొడిగించింది. గడువు పొడిగించిన వారిలో బాక్సింగ్ మేటి కోచ్‌లు శాంటియాకో నియెవా, రఫాలే బెర్గమస్కొ, పురుషుల హాకీ జట్టు కోచ్ గ్రాహమ్ రీడ్‌తో పాటు స్మిర్నొవ్ (షూటింగ్) తదితరులు ఉన్నారు. ఈ 32 మంది కోచ్‌ల గడువు ఈ సెప్టెంబర్‌తోనే ముగియనుంది. అయితే ఒలింపిక్స్ లక్ష్యాల కోసమే వారిని నియమించారు. కాబట్టి అవి పూర్తికాకుండానే ముగించుకోవడం తగదనే పొడిగింపు ఇచ్చింది. -
‘చైనా బరువు’ మాకొద్దు
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదం కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలంటూ మన దేశంలో అన్ని వైపుల నుంచి పిలుపు వస్తోంది. ఈ నేపథ్యంలో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) ఒక అడుగు ముందుకు వేసింది. చైనా తయారు చేసిన వెయిట్‌లిఫ్టింగ్ సెట్లను తాము ఇకపై వాడబోమని ప్రకటించింది. బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్లతో కూడిన నాలుగు సెట్లను గతంలో ‘జెడ్కేసీ’ అనే చైనా కంపెనీకి ఆర్డర్ ఇచ్చి సమాఖ్య తెప్పించింది. ఇప్పుడు వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ఐడబ్ల్యూఎల్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సహదేవ్ యాదవ్ లేఖ రాశారు. ‘చైనా ఎక్విప్మెంట్ను మనం నిషేధించాల్సిందే. మున్ముందు కూడా ఆ దేశపు వస్తువులు ఏవీ వాడరాదని సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాం. భవిష్యత్తులో భారత కంపెనీలు గానీ లేదా ఇతర దేశాల కంపెనీలు తయారు చేసిన ఎక్విప్మెంట్లు వాడతాం కానీ చైనా వస్తువులు మాత్రం ముట్టం’ అని యాదవ్ స్పష్టం చేశారు. నాసిరకంగా ఉన్నాయి... మరోవైపు నిషేధాన్ని సమర్థిస్తూనే భారత వెయిట్ లిఫ్టింగ్ జాతీయ కోచ్ విజయ్ శర్మ మరో కారణాన్ని కూడా చూపారు. ఎక్విప్మెంట్ నాసిరకంగా ఉండటం వల్లే పక్కన పడేస్తున్నామని ఆయన వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్‌లో చైనా వెయిట్స్‌నే వాడతారు కాబట్టి మరో ప్రత్యామ్నాయం లేక సన్నాహాల కోసం తాము గతంలో వాటికి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పుడు ఇతర కంపెనీల ఎక్విప్మెంట్కు అలవాటు పడతామని కోచ్ చెప్పారు. ‘లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత లిఫ్టర్లు వాటిని వాడే ప్రయత్నం చేస్తే అవి ఏమాత్రం బాగా లేవని అర్థమైంది. దాంతో మూలన పడేశాం. మా లిఫ్టర్లంతా కూడా చైనా తయారీ వస్తువులను వాడేందుకు ఇష్టపడటం లేదు. ప్రస్తుతం స్వీడిష్ కంపెనీ ‘ఎలికో’కు చెందిన ఎక్విప్మెంట్తో సాధనకు సిద్ధమయ్యాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ టోర్నీలు ‘ఎలికో’తోనే నిర్వహిస్తారు. భారతీయ తయారీదారులతో సహా ప్రస్తుతం ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటప్పుడు చైనా ఉత్పత్తులు అవసరం ఏముంది’ అని ఆయన ప్రశ్నించారు. -
క్వారంటైన్లుగా ‘సాయ్’ సెంటర్లు: కేంద్ర క్రీడా శాఖ
న్యూఢిల్లీ: కోవిడ్–19 ఎఫెక్ట్‌కు ఇదివరకే భారత్‌లో క్రీడాకార్యకలాపాలన్నీ మూతపడ్డాయి. ఒక్క శిబిరం లేదు. పోటీల్లేవు. దీంతో భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రాలకు తాళాలు వేశారు. ఇప్పుడీ కేంద్రాలను కరోనా అనుమానిత, బాధిత కేసులకు క్వారంటైన్లుగా (నిర్బంధ వసతులు) వినియోగించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ‘సాయ్’ రీజినల్ సెంటర్లు, స్టేడియాలు, హాస్టళ్లను క్వారంటైన్లుగా మార్చేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర క్రీడా శాఖ తెలిపింది.