
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో అథ్లెట్ల విషయంలో క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 13 వేల మందికిపైగా క్రీడాకారులతో పాటు వారితో పనిచేసే సహాయక సిబ్బందికి కూడా ఆరోగ్య బీమా చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గురువారం తన ప్రకటనలో పేర్కొంది.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారి వైద్యం కోసం రూ. 5 లక్షలు, రోడ్డు ప్రమాదంలో మరణించినట్లయితే రూ. 25 లక్షల వరకు బీమా లభించనుంది. గతంలో ఈ ఇన్సూరెన్స్ జాతీయ శిక్షణ శిబిరాలకు మాత్రమే వర్తించగా... ప్రస్తుతం ఏడాది మొత్తం ఉండనుంది. అంతే కాకుండా బీమా పొందే అథ్లెట్ల సంఖ్యను కూడా పెంచింది. బీమా అంశం గురించి కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘‘ అథ్లెట్లు జాతీయ సంపద. వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు.
చదవండి: బ్లాక్ ఫంగస్: భారత షూటింగ్ కోచ్ కన్నుమూత
‘సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి’
Comments
Please login to add a commentAdd a comment