చంపేసి.. ప్రాక్టీస్‌ అని నమ్మిస్తా.. | A national level shooter has alleged that she was raped by a fellow sportsperson | Sakshi
Sakshi News home page

చంపేసి.. ప్రాక్టీస్‌ అని నమ్మిస్తా..

Published Sun, Dec 4 2016 10:04 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

చంపేసి.. ప్రాక్టీస్‌ అని నమ్మిస్తా.. - Sakshi

చంపేసి.. ప్రాక్టీస్‌ అని నమ్మిస్తా..

న్యూఢిల్లీ: జాతీయ స్థాయి మహిళా షూటర్ తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్‌లో పలు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న వ్యక్తి తనపై దారుణానికి ఒడిగట్టాడని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీలోని చాణక్యపురి పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు.. షూటింగ్ నేషనల్ చాంపియన్షిప్స్ కోసం ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షూటింగ్‌ రేంజ్‌లో బాధిత మహిళ శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో అక్కడే తనతో పాటు సాధన చేస్తున్న సీనియర్‌ షూటర్‌తో రెండేళ్ల కింద పరిచయం ఏర్పడింది. అతడు షూటింగ్‌లో ఆమెకు గైడ్‌లా వ్యవహరించేవాడు. ఇద్దరి మధ్య రిలేషన్షిప్‌ డెవలప్ అయింది. మహిళా షూటర్‌ను పెళ్లి చేసుకుంటానని అతడు మాట ఇచ్చాడు. ఇటీవల ఆమె బర్త్ డేకు చాణక్యపురిలోని ఇంటికి వెళ్లిన అతడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. ఆమెపై అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో పాటు పెళ్లి ప్రస్తావనను దాటవేస్తున్నాడు.

ఇటీవల పెళ్లి గురించి గట్టిగా నిలదీయగా.. షూటింగ్‌ రైఫిల్‌తో కాల్చేసి ప్రమాదం అని చెబుతా జాగ్రత్త అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మెడికల్‌ ఎగ్జామ్‌లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయింది. అత్యాచారానికి పాల్పడిన షూటర్‌పై పోలీసలు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. శనివారం నిందితుడిని కలిసిన పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement