
సాక్షి, హైదరాబాద్ : ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..డీఎస్ మక్తాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవలె కుటుంబసభ్యులు స్వస్థలం మహారాష్ట్రకు వెళ్లగా యువతి(23)ఇంట్లోనే ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంకు నుంచి వచ్చామంటూ ఇంట్లోకి ప్రవేశించారు.
ఓ వ్యక్తి ఇంటి బయట కాపలా ఉండగా, మరొక వ్యక్తి పాలసీ పేరుతో యువతితో మాటలు కలిపి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతిని వివస్త్రను చేసి లైంగిక దాడి అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు నిమిత్తం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
చదవండి : (పెట్రోల్‌తో భార్యకు నిప్పంటించి..)
(బయటకు వెళ్లకుండా తల వెంట్రుకలను కట్ చేయించి..)
.
Comments
Please login to add a commentAdd a comment