
సాక్షి, హైదరాబాద్: పెళ్లికి నిరాకరించిన ఓ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఈ నెల 1వ తేదీన తల్లితో కలిసి కల్యాణ్‌నగర్‌లో ఉండే బంధువుల ఇంటికెళ్లింది. 27 ఏళ్ల సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బంధువులు సూచించగా అందుకు బాలిక నిరాకరించింది.
దీంతో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. విషయాన్ని ఎవరికైన చెబితే చంపుతానని బెదిరించాడు. ఆ తర్వాత పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. మూసాపేట ప్రాంతంలో ఉండే అమ్మమ్మ అనారోగ్యం బారిన పడడంతో చూసేందుకు వచ్చిన బాలిక ముభావంగా కనిపించడంతో అమ్మమ్మ ఆరా తీయగా జరిగిన విషయాన్ని చెప్పడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment