oppose
-
‘మూసీ’ ప్రక్షాళన.. నిర్వాసితుల తరలింపు (ఫోటోలు)
-
ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్రం పచ్చ జెండా
-
TDP సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ ఫిక్స్
అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చేయడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇలానే 2014లో అలవి కాని హామీలు 650 వరకూ ఇచ్చేసి.. గద్దెనెక్కిన తరువాత వాటిని తుంగలో తొక్కేసిన ఆయన.. మేక వన్నె పులిలా.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వస్తూ సూపర్ సిక్స్ పేరిట గుప్పిస్తున్న హామీలు ఏవిధంగా నమ్ముతామని ప్రజలు పెదవి విరుస్తున్నారు. 2014 ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏ ఒక్కరూ రుణ వాయిదాలు చెల్లించవద్దని చంద్రబాబు ఢంకా బజాయించి మరీ చెప్పారు. బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కూడా చెల్లించవద్దని, తాను అధికారంలోకి రాగానే వాటిని విడిపిస్తానని గొప్పగా చెప్పారు. చంద్రబాబు మాటలు అమాయకంగా నమ్మిన చాలామంది తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. చివరకు రుణ భారం తడిసి మోపెడై, బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందుకుని అవమానాల పాలైన రైతులు, డ్వాక్రా మహిళలు లబోదిబోమన్నారు. తనఖా పెట్టిన బంగారం బ్యాంకుల నుంచి ఇంటికి వచ్చేస్తుందని నమ్మి మోసపోయారు. రైతులకు ‘బాబు’గారి జెల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు సహకార, వాణిజ్య బ్యాంకుల నుంచి ఏటా రూ.3,290 కోట్ల రుణాలు తీసుకుంటారు. వారికి రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. చివరకు అరకొరగా రూ.25 వేల లోపు మాత్రమే చేసి, మధ్యలోనే వదిలేసి, రైతులను నిలువునా ముంచేశారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న హామీలను ఏవిధంగా నమ్మాలని రైతులు ప్రశి్నస్తున్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారిలా.. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ ప్రకటించారు. అది నమ్మి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 1,10,336 స్వయం సహాయక సంఘాల్లోని 10,71,078 మంది మహిళలు అప్పటికి తమపై ఉన్న రూ.1,07,107 కోట్ల రుణాలు మాఫీ అయిపోతాయని సంబరపడ్డారు. తీరా గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు చిల్లిగవ్వ కూడా మాఫీ చేయకుండా దగా చేశారు. దీంతో ఆయనకు ఓట్లేసి మోసపోయామని డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు పసుపు – కుంకుమ పేరిట ప్రతి డ్వాక్రా మహిళకు మూడు విడతలుగా (రూ.2,500, రూ.3,500, రూ.4,000) రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా దానిని కొంతమందికే పరిమితం చేశారు. అది కూడా రూ.2,500, రూ.3,500 మాత్రమే బ్యాంకుల్లో జమ చేశారు. మిగిలిన రూ.4 వేలకు చెక్కులు ఇచ్చి ఏప్రిల్ చివరిలో మార్చుకోవాలని సూచించారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ చెక్కులు కాస్తా చెల్లుబాటు కాకుండా పోయాయి. వాటిని మహిళలు చిత్తుకాగితాల్లా చెత్తబుట్టలో వేయాల్సి వచ్చింది. నిరుద్యోగులకు కుచ్చుటోపీ 2014 ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చేంత వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, కొంత మందికి మొక్కుబడిగా రూ.1,000 చొప్పున వేసి చేతులు దులిపేసుకున్నారు. ఇంకా కాపులకు రిజర్వేషన్, ముస్లింలకు ప్రధాన నగరాల్లో హజ్ హౌస్‌లు నిర్మిస్తామంటూ ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు గాలికొదిలేశారు. ఇలా అప్పట్లో ఆయన ఇచ్చిన హామీల్లో దేనినీ నెరవేర్చకుండా ప్రజలను నిలువునా వంచించారు. చివరకు టీడీపీ అధికారి వెబ్సైట్ నుంచి నాడు ఇచ్చిన మేనిఫెస్టోను సైతం మాయం చేసేశారు. అప్పట్లో ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు.. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని జనం నిలదీస్తారనే జంకూ గొంకూ లేకుండా ఈ ఎన్నికల వేళ సూపర్ సిక్స్ పథకాలు అంటూ మరోసారి చేస్తున్న ప్రచారాన్ని నమ్మబోమని ప్రజలు స్పష్టంగా చెప్పేస్తున్నారు. కూటమిలోని జనసేన, బీజేపీల తరఫున టీడీపీ నుంచి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో ఇస్తున్న నాలుగు పేజీల బుక్‌లెట్‌ను చాలామంది ఏమాత్రం చూడకుండా పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు తీరుకు పూర్తి భిన్నంగా గత ఎన్నికల వేళ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేసిన వైఎస్సార్ సీపీకే తమ మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ‘ఆడియో’ దుమారం -
యూదుల ప్రత్యేక దేశాన్ని గాంధీ ఎందుకు వ్యతిరేకించారు?
హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటివరకు 3000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించి ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపాయి. భారత్ కూడా ఇజ్రాయెల్‌కు అండగా నిలిచింది. అయితే ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై నాటి రోజుల్లో మహాత్మా గాంధీ ఏమన్నారు? పాలస్తీనాలో ప్రత్యేక యూదు దేశస్థాపనను గాంధీ ఎందుకు వ్యతిరేకించారు? మహాత్మా గాంధీ 1938, నవంబర్ 26న ‘హరిజన్’ పత్రికలో ‘ది జ్యూస్’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఈ ఆర్టికల్‌లో ‘ఇంగ్లండ్ బ్రిటీష్ వారికి చెందినట్లే, ఫ్రాన్స్ ఫ్రెంచి వారిది. పాలస్తీనా అరబ్బులదని రాశారు. అయితే ఏళ్ల తరబడి యూదులు అణచివేత, వివక్షను ఎదుర్కోవలసి రావడంపై మహాత్మాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ తన వ్యాసంలో ఇలా రాశారు ‘నాకు యూదుల విషయంలో తీవ్రమైన ఆవేదన ఉంది. వీరు క్రైస్తవ సమాజంలో అంటరానివారిగా మిగిలారు. హిందూ సమాజంలో అంటరానితనం సమస్య ఉన్నట్లే, యూదులు కూడా ఈ సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. యూదుల విషయంలో నాజీ జర్మనీ ప్రవర్తించిన హీనమైన తీరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అని అన్నారు. కాగా యూదులను రక్షించడానికి, వారిపై జరుగుతున్న మారణహోమం ఆపడానికి జర్మనీతో యుద్ధాన్ని గాంధీ సమర్థించారు. ‘యూదులను రక్షించడానికి మనం జర్మనీతో పోరాడవలసి వస్తే, అది కూడా పూర్తిగా తార్కికంగా ఉంటుందని’ అన్నారు. పాలస్తీనాలో ప్రత్యేక యూదు రాజ్య స్థాపనను మహాత్మా గాంధీ ఎందుకు వ్యతిరేకించారనే విషయానికొస్తే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం మహాత్మా గాంధీ ఒక వ్యాసంలో ఇలా రాశారు ‘పాలస్తీనాలో యూదుల స్థిరనివాసం కల్పించడం లేదా వారుంటున్న ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తించడం అనేది అరబ్ ప్రజలకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుంది’ అని అన్నారు. ఈ విషయంలో మహాత్మా గాంధీ వ్యతిరేకత రెండు సూత్రాలపై ఆధారపడింది. మొదటిది పాలస్తీనా ఇప్పటికే అరబ్ ప్రజల జన్మస్థలమని గాంధీ విశ్వసించారు. బ్రిటిష్ పాలనలో యూదులను బలవంతంగా అక్కడ స్థిరపడ్డారు. ఇది ఒక విధంగా అరబ్ ప్రజల ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమే. ఇక రెండవది.. ప్రత్యేక దేశం కోసం యూదుల డిమాండ్ తాను అనుసరిస్తున్న శాంతియుత పోరాటానికి విరుద్ధంగా ఉందని గాంధీ భావించారు. అయితే ఆ సమయంలో గాంధీ ఈ అంశాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? -
UCC: అర్ధరాత్రి హడావిడిగా భేటీ
ఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావన రావడంతో.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అప్రమత్తమైంది. మంగళవారం అర్ధరాత్రి హడావిడిగా సమావేశమైంది. ఈ భేటీలో ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బోర్డు.. ఇందుకు సంబంధించిన ఓ కీలక నిర్ణయం సైతం తీసుకుంది. ముస్లిం లా బోర్డు ప్రెసిడెంట్ సైఫుల్లా రెహమానీ అధ్యక్షతన.. ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా చైర్మన్ మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగీ మహాలీ, ముస్లిం లా బోర్డు ఇతర సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. వర్చువల్‌గానే జరిగిన ఈ భేటీ మూడు గంటలపాటు సాగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. భోపాల్ వేదికగా ప్రధాని చేసిన ప్రంసగంతో ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో మళ్లీ చర్చ ఊపందుకుంది. ఒక దేశానికి రెండు చట్టాలు కావాలా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగానే ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఉండే ఇద్దరు వ్యక్తులకి రెండు నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళుతుందని నిలదీశారు. ఇప్పటికే 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు.. దేశ ప్రజలు, మత సంస్థల అభిప్రాయాలను 30 రోజుల్లోగా తీసుకోవాలని గడువు విధించారు. ఈ నేపథ్యంలో.. వర్చువల్‌గానే ముస్లిం లాబోర్డు భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలనే ప్రధానాంశంగా చర్చించి.. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను మరింత గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు లా కమిషన్‌కు ఓ డ్రాఫ్ట్‌ను సమర్పించేందుకు ముస్లిం బోర్డు సిద్ధమవుతోంది. ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా! -
Hyderabad: బంధువుతో పెళ్లి నిరాకరించిందని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
సాక్షి, హైదరాబాద్: పెళ్లికి నిరాకరించిన ఓ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. ఎస్ఆర్నగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఈ నెల 1వ తేదీన తల్లితో కలిసి కల్యాణ్‌నగర్‌లో ఉండే బంధువుల ఇంటికెళ్లింది. 27 ఏళ్ల సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బంధువులు సూచించగా అందుకు బాలిక నిరాకరించింది. దీంతో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. విషయాన్ని ఎవరికైన చెబితే చంపుతానని బెదిరించాడు. ఆ తర్వాత పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. మూసాపేట ప్రాంతంలో ఉండే అమ్మమ్మ అనారోగ్యం బారిన పడడంతో చూసేందుకు వచ్చిన బాలిక ముభావంగా కనిపించడంతో అమ్మమ్మ ఆరా తీయగా జరిగిన విషయాన్ని చెప్పడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఆ విషయంలో కేంద్రం నిర్ణయం సరైంది కాదు: సూర్య
సాక్షి, చెన్నై: ప్రజలను రక్షించడం కోసం చట్టం ఉండాలి గాని వారి గొంతు నొక్కడం కోసం కాదని నటుడు సూర్య అన్నారు. సినిమాటోగ్రఫీ చట్టం–1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్ననిర్ణయంపై సూర్య అసంతృప్తి వ్యక్తం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాన్ని కూడా ప్రేక్షకులు వ్యతిరేకిస్తే ఆ చిత్రాన్ని తిరిగి సెన్సార్ చేయడం, ప్రదర్శన నిలిపివేయడం సరికాదన్నారు. కాగా ఈ చట్టాన్ని బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, సీనియర్ దర్శకుడు భారతీరాజా, అమీర్, నటుడు సూర్య, విశాల్, కార్తీక్ వంటి ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నటుడు విశాల్ మాట్లాడుతూ.. సెన్సార్ అయిన చిత్రాలను కూడా నిర్వహిస్తే సెన్సార్ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. అదే విధంగా జీఎస్టీ, పైరసీని అరికట్టడం వంటి విషయాల గురించి స్పందించకపోవడం పైనా ప్రశ్నించారు. -
విషాదం: సారీ.. అమ్మానాన్న.. కలిసి ఉండలేం.. అందుకే
సాక్షి, మామడ(నిర్మల్): కులాలు వేరు కావడంతో పెళ్లికి ఒప్పుకోరని భావించి, కలసి బతికే అవకాశం లేదనుకున్న ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలంలో జరిగింది. పొన్కల్ గ్రామంలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన, కోండ్ర నిశిత(18), నిర్మల్‌లోని ప్రైవేట్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న సిలివేరి హరీశ్(21) గ్రామంలోని ఒకే కాలనీకి చెందినవారు కావడంతో వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని భావించిన ప్రేమజంట బుధవారం నిశిత ఇంట్లో ఒకే చీరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ‘కలిసి ఉండలేం.. అందుకే చనిపోతున్నాము. నన్ను క్షమించండి.. అమ్మానాన్న..’అంటూ హరీశ్ వాట్సాప్ స్టేటస్ ఉండటం చూసి అతడి మిత్రులు, కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులు వెతకగా నిశిత ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. చదవండి: జూబ్లీహిల్స్: లైసెన్స్డ్ గన్‌కు పని చెప్పమంటావా..? -
ఆ బిల్లును అడ్డుకుందాం.. సీఎం జగన్‌కు లేఖ రాసిన స్టాలిన్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2021 ముసాయిదాను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్ పోర్టుల విషయంలో రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని కోరుతూ 8 తీరప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తాజాగా లేఖ రాశారు. చిన్నతరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు(ఎంఎస్డీసీ) కట్టబెట్టేలా కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించేందుకు ఎంఎస్డీసీ ఈ నెల 24న సమావేశాన్ని తలపెట్టిందని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్ పోర్ట్స్ యాక్ట్–1908 ప్రకారం.. మైనర్‌పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ వంటివి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి అధికారాలను ఎంఎస్డీసీకి బదిలీ చేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోంది’’ అని స్టాలిన్ వెల్లడించారు. రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లుపై అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో సహా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే చిన్నతరహా ఓడరేవుల విషయంలో ఇక రాష్ట్రాలకు ప్రాధాన్యమైన పాత్ర ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలను హరించే బిల్లును కలిసికట్టుగా అడ్డుకుందామని తీరప్రాంత రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ నెల 24న జరిగే ఎంఎస్డీసీ సమావేశంలో మన గళం వినిపిద్దామన్నారు. -
ట్రిపుల్ తలాక్ బిల్లు.. ఒవైసీ అడ్డుపుల్ల
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్‌ను నేరంగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ తలాక్ సవరణ బిల్లు నేడు లోక్‌సభ ముందుకు రానుంది. అయితే ఇది విరుద్ధమంటూ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన ఆ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉదయం ఓ నోటీసును అందించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు 72వ నిబంధన ప్రకారం నోటీసు అందజేసినట్లు ఆయన తన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే దానిపై చర్చకు అంగీకరిస్తారా? అన్నది చూడాలి. ‘‘ముస్లిం మహిళలను రక్షించేందుకు రూపొందించిన బిల్లు అని కేంద్రం చెబుతోంది. తద్వారా ముస్లింలను దోషిగా చూపించి రెచ్చగొట్టే విధంగా కేంద్రం చేష్టలు ఉన్నాయని స్పష్టమౌతోంది’’ అని ఆయన చెబుతున్నారు. కావాలంటే ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డుతో సంప్రదించి, వారి సూచనల ప్రకారం చట్టాన్ని రూపొందించాలని అసదుద్దీన్ గతంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఓ లేఖ రాశారు. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు నేపథ్యంలో లోక్‌సభకు ఇవాళ, రేపు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయ్యింది. ముస్లిం మహిళా (వివాహ రక్షణ హక్కులు) బిల్లు-2017కు హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని బృందం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ బిల్లు చట్టరూపం ధరిస్తే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. ఇంకోపక్క బిల్లును రూపొందించడంలో సరైన పద్ధతిని అవలంబించలేదని కేంద్రంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రతిఘటిస్తాం
కాకినాడ సిటీ : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లి రాజేష్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి వ్యతిరేకంగా బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల మధ్య విభేదాలు సృష్టించడానికి, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్రమంత్రి వెంకయ్య ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు చెల్లదని ఒక పక్క కోర్టు స్పష్టం చేసినా అదే అంశాన్ని తెరమీదకు తీసుకురావడంలోని ఔనత్యం ఏంటని ప్రశ్నించారు. వర్గీకరణ జోలికొస్తే వెంకయ్యనాయుడుకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన వెంకయ్య, అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా రాదని రెండు నాల్కల« ధోరణితో మాట్లాడటం సరికాదన్నారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బీఎన్ రాజు, రామారావు, లోవరాజు పాల్గొన్నారు. -
బీసీలు సంఘటితం కావాలి
కాపులను బీసీల్లో చేర్చితే రోడ్డెక్కి ఉద్యమాలు 22న చలో కాకినాడకు సన్నాహక ఏర్పాట్లు రాష్ట్ర బీసీ కులాల జేఏసీ కన్వీనర్ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్ : కాపులను బీసీల్లో చేర్చితే సహించేది లేదని... అదే జరిగితే బీసీలు రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని రాష్ట్ర బీసీ కులాల జేఏసీ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీలంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అమలాపురంలోని శెట్టిబలిజ సంఘం భవనంలో ఆదివారం సాయంత్రం జరిగిన జిల్లా బీసీ కులాల ప్రతినిధుల సమావేశానికి కుడుపూడి అధ్యక్షత వహించి ప్రసంగించారు. రాష్ట్ర బీసీ జేఏసీ ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరై ఈనెల 22న జిల్లాకు మంజునాథ కమిషన్ వస్తున్న సందర్భంగా నిర్వహించనున్న చలో కాకినాడ కార్యక్రమంలో ప్రతి బీసీ సామాజిక వర్గీయుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపులను బీసీల్లో ఎందుకు చేర్చకూడదో..చేర్చితే బీసీలకు నష్టాలు ఎలా ఉంటాయో గణాంకాలతో సహా కమిషన్‌కు వివరించాలని బీసీ జేఏసీ నేతలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చితే తమ అభ్యంతరాలతో వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు వేసేందుకు కూడా బీసీలు సిద్ధం కావాలని సూచించారు. బీసీలను అణగదొక్కటానికే కాపులను రంగంలోకి దించారని ఆరోపించారు. ఇది చంద్రబాబు పన్నుతున్న కుట్రగా అభివర్ణించారు. సూర్యనారాయణరావు మాట్లాడుతూ బీసీల్లో నేటికీ వెలుగులోకి రాని దాదాపు 40 సంచార జాతుల ఉనికి గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. బీసీలకు రుణాలు, రాయితీలు వద్దని...రాజ్యాధికారాన్ని అందుకునే రిజర్వేషన్లు సంపూర్ణంగా కల్పించాలని డిమాండ్ చేశారు. సంచార జాతుల వారికి కనీసం ఆధార్ కార్డులు కూడా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయటంలేదని ధ్వజమెత్తారు. ఆ జాతుల వారిని గుర్తించి ప్రభుత్వమే ఉన్నత విద్య, కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించాలని రాష్ట్ర గంగిరెడ్ల సామాజిక సంఘం నాయకుడు అమ్మోరు అన్నారు. రాష్ట్ర బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, బీసీ నేతలు గుత్తుల సాయి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, మల్లాడి సత్తిబాబు, గుత్తుల శ్రీనివాసరావు, కుడుపూడి బాబు, వాసంశెట్టి సత్యం, యిళ్ల సత్యనారాయణ, అనుపోజు శ్రీనివాస్, పట్నాల వెంకటరమణ, దొమ్మేటి రాము, బండి రాధమ్మ తదితరులు ప్రసంగించారు. 22న చలో కాకినాడ కార్యక్రమం సన్నాహక ఏర్పాట్లపై సమావేశం విస్తృతంగా చర్చించింది. -
హక్కులను హరిస్తే సహించేది లేదు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు రావులపాలెం(కొత్తపేట) : అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బీసీల్లో చేర్చాలనే కోరిక అసమంజసమైనదని దీనిని తిరస్కరిస్తూ మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం రావులపాలెం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ, ఆర్థిక, వ్యాపార, తదితర అన్ని రంగాల్లో కాపులు ముందంజలో ఉన్నారన్నారు. సంచార జీవులు వివక్షకు గురైన కులాలను గుర్తించి ఆనాడు అంబేడ్కర్ బీసీ రిజర్వేషన్లు కల్పించారన్నారు. నేడు కాపులు వివక్షకు గురికాలేదని వారు సంచార జీవులుకాదని బీసీల్లో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబుకు చేర్చే అధికారం లేదన్నారు. మంజునాథ కమిషన్ కేవలం బీసీ కులాల స్థితిగతులను అధ్యయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీయే తప్ప కాపును బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిటీ కాదని ఆయన స్పష్టం చేశారు. మంజునాథ కమిషన్ ఇప్పటికే రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిందని తూర్పుగోదావరి జిల్లా మిగిలిఉందని చెప్పారు. ఇప్పటికీ బీసీ కులాలు అనుభవిస్తున్న సాంఘిక, విద్యాపరమైన వెనుకబాటుతనం గురించి కమిషన్‌కు వివరించామన్నారు. కాపు సంఘ నాయకులు కూడా తాము సాంఘికంగా ఎలా వెనుకబడి ఉన్నామో కమిషన్‌కు ఆధారాలు చూపలేకపోయారని, ఈ పరిస్థితుల్లో కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యం కాదనే నివేదికను నిస్పక్షపాతంగా ఇవ్వాల్సి ఉందన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లోను, స్థానిక సంస్థల్లోను రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతూ నివేదిక సమర్పించడం ద్వారా బీసీలకు న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామన్నారు. బీసీ రిజర్వేషన్ హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లిన సహించేది లేదని న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు, నియోజకవర్గ అధ్యక్షుడు మన్నే నాగేశ్వరరావు, రావులపాలెం, కొత్తపేట మండలాల అధ్యక్షుడు ఇళ్ల సతీష్, గుబ్బల వీర్రాజు, గుబ్బల వెంకటరమణ పాల్గొన్నారు. -
కాపులను బీసీల్లో చేర్చొద్దు
- మంజునాథన్ కమిటీని అడ్డుకుంటాం - రాష్ట్ర బీసీ నాయకుల సమావేశం కొత్తపల్లి (పిఠాపురం) : కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, బీసీ నాయకుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన కొత్తపల్లి ఊరచెరువు సెంటర్లో వున్న సతీష్చంద్రభవన్లో మంగళవారం రాష్ట్ర బీసీ నాయకులు, స్థానిక నాయకులతో మాజీ ఎంపీటీసీ కాకరపల్లి గంగాధర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలు విద్య, ఉద్యోగ అవకాశాలనే కాక రాజకీయ పదవులైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులను, హక్కులను కోల్పోతారన్నారు. కాకినాడలో జరగబోయే మంజునాథన్ కమిటీ పర్యటనను అడ్డుకుంటామన్నారు. కాపు కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.1,000 కోట్లు ప్రకటించిందని, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చంద్రబాబు 50 శాతం సబ్సిడీతో రుణాలను అందిస్తున్నారన్నారు. బీసీల్లో 144 కులాలు వున్నాయని వారికి మాత్రం 30 శాతం సబ్సిడీ కల్పిస్తున్నారన్నారు. అధికారం కోసం ఎన్నికల్లో అడగని వాగ్దానాలు చేసి బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. 93 కులాల బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర గణేష్‌బాబు, జిల్లా రజిక సంఘం నాయకుడు మురముళ్ల రాజాబాబు, జిల్లా పద్మశాలి సంఘ నాయకుడు పొన్నగంటి సత్యనారాయణ, పెద్దాపురం నియోజకవర్గ బీసీ నాయకుడు పెంకె వెంకటేష్‌బాబు, జిల్లా మత్స్యశాఖ నాయకుడు తుమ్మల రమేష్, మండల శెట్టిబలిజల సంఘ నాయకుడు కొప్పిశెట్టి ఈశ్వరరావు, మదర్ఇండియా ఇంటర్నేషనల్ చైర్మన్, బీసీ ఐక్య సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లి తిరుపతిరావు పాల్గొన్నారు. -
నీటి తరలింపుపై ఆందోళన
– అడ్డుకునే ప్రయత్నం చేసిన వెంగళాయిదొడ్డి రైతులు – సర్ధి చెప్పిన డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్ ఆస్పరి: వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిన పంటలకు రెయిన్గన్ల ద్వారా తడులందించేందుకు అవసరమైన నీటిని మండల పరిధిలోని వెంగలాయిదొడ్డి చెరువు నుంచి ట్యాంకర్లతో తరలిస్తుండడంపై ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఉన్న నీటినంతా ఊడ్చుకెళ్తే తమ పరిస్థితి ఏంటని ఆదివారం అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంగళాయిదొడ్డి చెరువు కింద కైరుప్పల, చెన్నంపల్లి, కారుమంచి, వెంగళాయిదొద్ది గ్రామాలకు చెందిన రైతులకు సుమారు 12వందల ఎకరాల భూములున్నాయి. చెరువు నీటి ఆధారంగా ఆయా భూముల్లో వరి, పత్తి, వేరుశెనగ సాగు చేశారు. అయితే వారంరోజులగా ఆ ప్రాంతానికి చెందిన 40 మంది మెట్ట ప్రాంత రైతులు రాత్రింబవళ్లు తేడా లేకుండా ట్యాంకర్లతో నీటిని తీసుకెళ్లి రెయిన్గన్ల ద్వారా పంటలు తడుపుకొంటున్నారు. ఈ కారణంగా చెరువునీరు రోజురోజుకు తగ్గుముఖం పడుతుండడంతో ఆయకట్టు రైతులు ఆదివారం అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్ చెరువు దగ్గరకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఈరన్న, రంగన్న, వీరభద్రి, రామాంజిని, వడ్డే వీరభద్రి, తిక్కయ్య, వీరేష్, హనుమంతు, బసప్ప, పరమేష్, మరికొందరు రైతులు డిప్యూటీ కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. చెరువు కింద సాగు చేసిన వరికి ఇంకా మూడు నెలలపాటు నీరు అవసరమని, ఉన్న నీటినంతా తోడుకెళ్తే తమ పంటలు ఏం కావాలని ప్రశ్నించారు. నీటి తరలింపు ఆపకపోతే ఆదోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతామని చెరువు ఆయకట్టు చైర్మన్ మల్లికార్జునరెడ్డి హెచ్చరించారు. అయితే మెట్ట ప్రాంత పంటల పరిస్థితి బాగా లేదని, వర్షం వస్తే మళ్లీ చెరువు నిండుతుందంటూ తిప్పేనాయక్ సర్ధిచెప్పి అంగీకరింపజేశారు. -
కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు అన్నారు. బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నర్సింహరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పర్వతాలు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు. స్వదేశి జపం చేస్తున్న ఎఫ్‌డీఐలను దేశంలో ప్రవేశ పెడుతున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపడుతున్నామన్నారు. ఇందులో 15 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని, ఆ రోజు నిర్వహించే సమ్మెను విజయవంతం చేసేందుకు సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సమ్మె కరపత్రాన్ని విడుదల చేశారు. కా ర్యక్రమంలో నాయకులు షాహిద్‌అలీ, చంద్రకాంత్, రాంమోహన్, అంబదాస్, రాముయాదవ్, బాలస్వామి, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
రాజీనామాకు నేను సిద్ధం: జానారెడ్డి
హైదరాబాద్: ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. రూ.5 భోజనం బాగుందంటూ జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను సర్వే మరోమారు లేవనెత్తారు. దీనిపై స్పందించిన జానా పదేపదే అదే విషయాన్ని లేవనెత్తడం సరికాదని అన్నారు. పార్టీని బలపరచడంలో జానా దూకుడుగా లేరని సర్వే ఆరోపించారు. ఆ సమయంలోనే.. ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని జానారెడ్డి చెప్పడంతో రాజీనామా అవసరం లేదని, పదవీలోనే కొనసాగాలని ఎమ్మెల్యేలు కోరారు. కాగా, సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వేల మధ్య కూడా స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై దళితుడైన తనను షబ్బీర్ అలీ టార్గెట్ చేస్తున్నారని సర్వే అన్నారు. పబ్లిక్ మీటింగ్ లోనే పార్టీ నాయకత్వ తీరుపై సర్వే వ్యాఖ్యలు చేయడం సరికాదని షబ్బీర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో షబ్బీర్ అలీ, సర్వే సత్యనారయణతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
'గాడ్సే పుస్తకాన్ని రిలీజ్ చేస్తే ఒప్పుకోం'
పనాజి: నాధురాం గాడ్సే పేరిట రచించిన ఓ పుస్తకం విడుదల వివాదానికి దారి తీయనుంది. మహాత్మగాంధీ వర్థంతి రోజునే ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం కూడా ఆ వివాదానికి ఆజ్యం పోయనుంది. మహాత్మాగాంధీని నాధూరాం గాడ్సే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ గాడ్సేపైనే 'నాధురాం గాడ్సే-ది స్టోరీ ఆఫ్ యాన్ అస్సాసిన్' అనే పుస్తకం శనివారం విడుదలవుతోంది. దీనిని అనూప్ సర్దేశాయి రచించగా.. బీజేపీ నేత ఒకరు విడుదల చేస్తున్నారు. అదికూడా ప్రభుత్వం భవనం అయినటువంటి రవీంధ్ర భవన్లో. దీంతో ఈ పుస్తకాన్ని అసలు విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తూ, విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ గోవాలో కొత్తగా ఏర్పాటయిన పార్టీ గోవా ఫార్వార్డ్ పార్టీ హెచ్చరిస్తోంది. రవీంధ్ర భవన్ ఎదుట తాము సత్యాగ్రహానికి దిగుతామని హెచ్చరిస్తోంది. తాము ఆ భవన్ వైపు వచ్చే మార్గాలన్నింటిని మూసివేస్తామని, ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకావొద్దని వారు సూచిస్తోంది. -
ఆ పాఠశాలలో జెండా ఎగురవేయొద్దంటూ..
డంకావూర్(గ్రేటర్ నోయిడా): గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ గ్రేటర్ నోయిడాలోని డంకావూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ముస్లిం బాలికల పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసేందుకు కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాల ఉత్తరప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ గుర్తింపును అక్టోబర్ 2011లో పొందింది. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్బంగా సోమవారం పాఠశాల అధికారులు జెండా ఎగురవేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే, అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు జెండా ఎగురవేయడానికి వీల్లేదంటూ, ఏర్పాట్లు వదిలేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈవివాదం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. దీంతో ఆ పాఠశాలలో తమ మతానికి విరుద్ధమైన బోధనలు చేస్తున్నారని స్కూల్ యాజమాన్యంపై ఆరోపించారు. అయితే, ఏదేమైనా జెండ వందనం అడ్డుకోవడానికి వీల్లేదంటూ, అలా చేస్తే చాలా కఠిన శిక్షలు ఎదుర్కొంటారని హెచ్చరించి వెనక్కి పంపారు. -
ఉత్తర కొరియాను తప్పుబట్టిన చైనా, భారత్
బీజింగ్: ఉత్తర కొరియా అణుపరీక్ష చేయడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్య ఏమాత్రం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది. ఈశాన్య ఆసియాలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి'ఒక్క దేశంపై ఉందని పేర్కొంది. 'అణుపరీక్షలకు దూరంగా ఉండాలని ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయాలకు ఉత్తర కొరియా కట్టుబడి ఉండాలి. ఈశాన్య ఆసియాలో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు అణుసంపదను దుర్వినియోగం చేసే చర్యలు మానుకోవాలి. ఈ విషయం ప్రపంచంలోని ప్రజలందరికీ ఆందోళనకరమైనదే అనే అంశాన్ని ఉత్తర కొరియా గుర్తించాలి' అని చైనా విదేశాంగా అధికార ప్రతినిథి హువా చనియింగ్ పేర్కొన్నారు. భారత్ కూడా ఉత్తర కొరియా చర్యను ఖండించింది. ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని భారత విదేశాంగ అధికారి ఒకరు అన్నారు. -
ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రమాదకరం!
ఫేస్బుక్ సంస్థ.. ఫ్రీ బేసిక్స్ పేరున ప్రజలను మోసగిస్తోందా? నెట్ న్యూట్రాలిటీకి తూట్లు పొడుస్తూ యూజర్లని మభ్యపెడుతోందా? గతంలో ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ వివాదాస్పదం అవ్వడంతో.. మరింత ఆకట్టుకునేందుకు ఫ్రీ బేసిక్స్ డాట్ కామ్ తో మళ్ళీ ముందుకొచ్చిందా? ఈ కొత్త ప్లాన్ వెనుక ఫేస్ బుక్ పెద్ద ఎత్తుగడే ఉందంటున్నారు నిపుణులు. జనానికి ఉచితి సర్వీసులు అందిస్తున్నట్లు చేసి... స్వలాభం కోసం ప్రయత్నిస్తోందని... ఫేస్ బుక్ అందిస్తున్న ఫ్రీ బేసిక్స్ ఎప్పటికైనా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నెట్ న్యూట్రాలిటీ అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్నెట్ను అందరికీ సమానంగా అందుబాటులో ఉంచడం ‘నెట్ న్యూట్రాలిటీ' ప్రధాన లక్ష్యం. ఇంటర్నెట్ లో అన్ని వెబ్ సైట్లనూ వినియోగదారులంతా ఒకే రీతిలో వాడుకునేందుకు వీలుగా.. యూజర్లంతా స్పందించాలని 'సేవ్ ద ఇంటర్నెట్' పేరున ఇప్పటికే ఆన్ లైన్ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఫేస్ బుక్ మార్కెటింగ్ మాయాజాలాన్ని ఎదుర్కొనేందుకు వినియోగదారులు ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతూ ట్రాయ్‌కు సైతం ఫిర్యాదులు చేశారు. అయితే కొందరు టెలికాం అపరేటర్లు ప్యాకేజీల పేరున వినియోగదార్లను ఆకట్టుకొని.. ఇంటర్నెట్ వినియోగం నియంత్రించే ప్రయత్నాలు చేయడంతోనే అసలు గొడవ మొదలైంది. ఇదే తరహాలో వచ్చిన ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ సరైన పద్ధతి కాదని, ఇతర దేశాలు ప్రోత్సహిస్తున్న ఈ మార్కెటింగ్ పద్ధతిని తిప్పికొట్టాలని యూజర్లు సంఘంగా ఏర్పడ్డారు. ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. ఫ్రీ బేసిక్స్ ద్వారా ఇంటర్నెట్ వాడకం మన చేతుల్లోనుంచి టెలికమ్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళబోతోంది అన్నది నిపుణుల ఉవాచ. ప్రజలకు ఫ్రీ ఇంటర్నెట్ అందించేందుకు ఇంకా ఎన్నో ఇతర పద్ధతులు ఉన్నాయని, ఫేస్ బుక్ పోటీతత్వంతో స్వప్రయోజనాలను ప్రజలపై రుద్దే ప్రయత్నంలో భాగంగా ఫ్రీ బేసిక్స్‌ను తెస్తోందని చెప్తున్నారు. ఫ్రీ బేసిక్స్‌కు ఏమాత్రం మద్దతివ్వద్దంటున్నారు. నిజానికి ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ కోసం టెలికాం ఆపరేటర్లకు ఎలాంటి బిల్లూ చెల్లించదు. ఇది టెలికాం ఆపరేటర్లే చెల్లించాల్సి వస్తుంది. ఈ విధంగా ఇంటర్నెట్ డేటా ఖర్చును తగ్గించుకుని ఫేస్ బుక్ తన పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు. అంతేకాదు ఫ్రీ బేసిక్స్ తన భాగస్వాములకు మాత్రమే ఉచిత సౌకర్యాన్ని అందిస్తుంది. మిగిలినవారంతా ఇంటర్నెట్ కోసం ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా నెట్ న్యూట్రాలిటీని ఉల్లంఘించడమే అవుతుంది. భారత దేశంలో రోజురోజుకీ ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2015 సంవత్సరంలో ఫ్రీ బేసిక్స్ అందుబాటులో లేని సమయంలో దేశంలో వంద మిలియన్ల వినియోగదారులు కొత్తగా చేరారు. ఇప్పుడు ఫ్రీ బేసిక్స్ బహిరంగ వేదిక కాకపోగా.. ప్రత్యేకంగా తమకు కొన్ని మార్గదర్శకాలను కూడ నిర్వచించుకోవడం విశేషం. అందుకు అనుగుణంగానే వినియోగదారులు కూడ నడచుకోవాల్సి వస్తుంది. ఇది ప్రజలను మభ్యపెట్టడమూ, తప్పుదారి పట్టించడమేనని కొన్ని టెలికాం సంస్థలు సైతం చెప్తున్నాయి. ఫ్రీ బేసిక్స్ పేరున ఫేస్ బుక్ అన్ని సైట్లలో ఉచితంగా చొరబడగలగడమే కాక, ఎన్.ఎస్.ఏ కు డేటా అందించడం కూడ భారత దేశ భ్రతకే ముప్పు అంటున్నారు నిపుణులు. నిజానికి ఫ్రీ బేసిక్స్ ప్రకటనలకూ అతీతమేం కాదు. తమ సైట్లో ప్రకటనలు ఉండవు అని చెప్పడం లేదు. 3.2 మిలియన్ల ప్రజలు తమకు మద్దతు పలుకుతున్నారని చెప్పడంలోనే నిజం కనిపించడం లేదు. వారికి వచ్చిన ఈ మెయిల్స్ లో న్యాయబద్ధమైనవి ఎన్ని ఉంటాయనేది అనుమానమే అంటున్నారు ఆన్ లైన్ ఉద్యమకారులు. ఫ్రీ బేసిక్స్ ను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించవద్దని గట్టిగా చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం నెట్ న్యూట్రాలటీ అంశం పై చెలరేగిన వివాదాన్ని క్రేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీన్ని అధ్యయనం చేసేందుకు పలువురు నిపుణుల కమిటీని కూడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
కోస్తా కల్లోలం
-
ఏపీ కేబినెట్లో భూసేకరణ చిచ్చు
-
ఈవ్ టీజింగ్ అడ్డుకున్నందుకు కాల్పులు
ఎతాహ్(ఉత్తరప్రదేశ్): తనపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను నిరోధించేందుకు ప్రయత్నించిన మహిళపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె గాయాలపాలయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలీ మలాన్ జిల్లాలోగల సెంధారిలో చోటుచేసుకుంది. ఇంట్లో పనిముగించుకుని ఆరుబయట కూర్చున్కన మహిళ వద్దకు ముందుగా సునీల్ అనే వ్యక్తి వచ్చాడు. ఆతర్వాత మరో ముగ్గురు అక్కడికి చేరుకుని లైంగిక వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె వారిని తీవ్రంగా అడ్డుకుంది. ఆ క్రమంలో సునీల్ తన చేతిలోని తుపాకీతో కాల్పులు జరిపారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది కానీ, ఇంతవరకు నిందితులనెవరినీ అరెస్టు చేయలేదు. వారు పరారీలో ఉన్నట్లు సమాచారం. -
'ఉస్మానియా ఆస్పత్రి తరలింపును వ్యతిరేకిస్తున్నాం'
నల్లగొండ: హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి తరలించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మంత్రులకు అధికారాలు లేవని, ఏక పక్ష పాలన కొనసాగుతోందన్నారు. కరువు పరిస్థితులను అధ్యయనం చేసి నివారించడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రి తరలింపుపై హైకోర్టులో దాఖలైన్ పిల్ రేపు(మంగళవారం) విచారణకు రానుంది. -
బాబు వచ్చాడు... జాబు ఏది???
-
ఎయిర్‌పోర్టుకు అన్ని ఎకరాలెందుకు.?
-
టీఆర్ఎస్లో ‘ఎర్రబెల్లి’ ముసలం!
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేరిక వ్యవహారం టీఆర్ఎస్లో అసంతృప్తికి తెర తీసింది. ముఖ్యంగా వరంగల్ జిల్లా పార్టీ నేతల్లో విభేదాలకు కారణమవుతోంది. పార్టీలో ఎర్రబెల్లి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి.. జిల్లాలోని పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశం కావాలనుకున్నారు. ఎర్రబెల్లిని పార్టీలో చేర్చుకోవద్దంటూ అందులో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని నిర్ణయించా రు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆ ప్రయత్నాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లికి వ్యతిరేకంగా ఎలాంటి సమావేశాలు పెట్టుకోవద్దంటూ శ్రీహరికి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ‘పార్టీ ప్రయోజనాల కోసమే ఎర్రబెల్లిని చేర్చుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో వ్యతి రేక సమావేశాలు పెట్టుకోవద్దు. ఇలాంటి పనులు మానుకో’ అని సీరియస్‌గానే కడియంని కేసీఆర్ హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాంతో ఎర్రబెల్లి వ్యతిరేక సమావేశం ఆలోచనను కడియం, ఇతర ఎమ్మెల్యేలు విరమించుకున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్లో చేరడాన్ని ఆ పార్టీలోని వరంగల్ పట్టణానికే చెందిన ఇద్దరు ముఖ్య ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్లోకి వస్తే ఆ పార్టీలో ఇక మేమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. -
'డబ్బింగ్ చిత్రాలు మాకొద్దు బాబోయ్'
బెంగళూరు: డబ్బింగ్ చిత్రాల విడుదలకు వ్యతిరేకంగా కన్నడ చిత్ర పరిశ్రమ శాండిల్‌వుడ్ మరోసారి గళం విప్పింది. కన్నడ చిత్ర పరిశ్రమలోకి అనువాద చిత్రాలు రాకుండా అడ్డుకోవాలంటూ కన్నడ సినీ కళాకారులు సమష్టిగా నినదించారు. డబ్చింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా శాండిల్‌వుడ్ సోమవారం బంద్ పాటిస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమలో తెలుగు, తమిళ చిత్రాల హవా ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కర్ణాటకలో తెలుగు, తమిళ భాషలు మాట్టాడే ప్రజలు ఎక్కవగా ఉండటంతో కన్నడ చిత్రాలకు సమాంతరంగా వీటికి ఆదరణ లభిస్తోంది. ఒక్కోసారి కన్నడ సినిమాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక కన్నడలోకి అనువాదం చేయడం వల్ల తమకు చాలా నష్టం ఏర్పడుతోందంటూ శాండిల్‌వుడ్ ప్రముఖులు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. దీనిపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో డబ్చింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా శాండిల్‌వుడ్ మరోసారి నిరసన బాట పట్టింది. -
చర్చించి.. వ్యతిరేకించాల్సిందే
ఏపీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు అశోక్‌బాబు విజయనగరం/విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో పూర్తిస్థాయి చర్చ జరిపి వ్యతిరేకించాల్సిందేనని, అప్పుడే ఆ బిల్లు పార్లమెంటులో వీగిపోతుందని ఏపీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. విజయనగరం, విశాఖలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐక్యకార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 28న హైదరాబాద్‌లో అఖిలపక్షాల సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేల నుంచి ప్రత్యక్షంగా అఫిడవిట్లు స్వీకరించలా, లేక వ్యక్తిగతంగా తీసుకోవాలా అనే దానిపై ఈ సదస్సులో నిర్ణయిస్తామన్నారు. ప్రతి పంచాయతీలో సమైక్య తీర్మానం చేయించి ఆ ప్రతులను రాష్ర్టపతి, స్పీకర్, గవర్నర్లకు పంపిస్తామని చెప్పారు. ఉద్యోగులు చేస్తున్న సమైక్య ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సీమాంధ్రుల మనోభావాలను కించపర్చే విధంగా వ్యవహరించిన కేంద్రమంత్రులు, ఎంపీల రాజకీయ భవిష్యత్‌ను సమాధి చేస్తామని హెచ్చరించారు. కాగా, ఉద్యోగ సంఘాల్లో కొంత అసంతృప్తి ఉండడం సర్వసాధారణమని, ఏపీఎన్జీవో అసోసియేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతున్నాయని అశోక్‌బాబు అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఐక్యంగా పోరాడతామని, దీనికోసం వాదనలు, అభిప్రాయాలను పక్కన పెట్టాల్సిదేనని స్పష్టంచేశారు. నాయకుడు ఎవరైనా సమైక్య ఉద్యమం కొనసాగుతుందన్నారు. -
నేడు YSR కాంగ్రెస్ శాసనసభ పక్షం భేటీ
-
దిగ్విజయ సింగ్ వ్యాఖ్యను తప్పుబట్టిన వైఎస్ఆర్సిపి