యూదుల ప్రత్యేక దేశాన్ని గాంధీ ఎందుకు వ్యతిరేకించారు? | Why Gandhi opposed a Jewish nation-state in Palestine? | Sakshi
Sakshi News home page

Gandhi Opposed Jewish Nation: యూదుల ప్రత్యేక దేశాన్ని గాంధీ ఎందుకు వ్యతిరేకించారు?

Published Thu, Oct 12 2023 11:40 AM | Last Updated on Thu, Oct 12 2023 11:49 AM

Why Mahatma Gandhi Opposed a Jewish Nation in Palestine - Sakshi

హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటివరకు 3000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించి ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపాయి. భారత్ కూడా ఇజ్రాయెల్‌కు అండగా నిలిచింది. అయితే ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై నాటి రోజుల్లో మహాత్మా గాంధీ ఏమన్నారు? పాలస్తీనాలో ప్రత్యేక యూదు దేశస్థాపనను గాంధీ ఎందుకు వ్యతిరేకించారు? 

మహాత్మా గాంధీ 1938, నవంబర్‌ 26న ‘హరిజన్‌’ పత్రికలో ‘ది జ్యూస్’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఈ ఆర్టికల్‌లో ‘ఇంగ్లండ్‌ బ్రిటీష్‌ వారికి చెందినట్లే, ఫ్రాన్స్‌ ఫ్రెంచి వారిది. పాలస్తీనా అరబ్బులదని రాశారు. అయితే ఏళ్ల తరబడి యూదులు అణచివేత, వివక్షను ఎదుర్కోవలసి రావడంపై మహాత్మాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ తన వ్యాసంలో ఇలా రాశారు ‘నాకు యూదుల విషయంలో తీవ్రమైన ఆవేదన ఉంది. వీరు క్రైస్తవ సమాజంలో అంటరానివారిగా మిగిలారు. హిందూ సమాజంలో అంటరానితనం సమస్య ఉన్నట్లే, యూదులు కూడా ఈ సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. యూదుల విషయంలో నాజీ జర్మనీ ప్రవర్తించిన హీనమైన తీరు చరిత్రలో  ఎప్పటికీ నిలిచిపోతుంది’ అని అన్నారు. కాగా యూదులను రక్షించడానికి, వారిపై జరుగుతున్న మారణహోమం ఆపడానికి జర్మనీతో యుద్ధాన్ని గాంధీ సమర్థించారు. ‘యూదులను రక్షించడానికి మనం జర్మనీతో పోరాడవలసి వస్తే, అది కూడా పూర్తిగా తార్కికంగా ఉంటుందని’ అన్నారు.

పాలస్తీనాలో ప్రత్యేక యూదు రాజ్య స్థాపనను మహాత్మా గాంధీ ఎందుకు వ్యతిరేకించారనే విషయానికొస్తే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం మహాత్మా గాంధీ ఒక వ్యాసంలో ఇలా రాశారు ‘పాలస్తీనాలో యూదుల స్థిరనివాసం కల్పించడం లేదా వారుంటున్న ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తించడం అనేది అరబ్ ప్రజలకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుంది’ అని అన్నారు. ఈ విషయంలో మహాత్మా గాంధీ వ్యతిరేకత రెండు సూత్రాలపై ఆధారపడింది. మొదటిది పాలస్తీనా ఇప్పటికే అరబ్ ప్రజల జన్మస్థలమని గాంధీ విశ్వసించారు. బ్రిటిష్ పాలనలో యూదులను బలవంతంగా అక్కడ స్థిరపడ్డారు. ఇది ఒక విధంగా అరబ్ ప్రజల ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమే. ఇక రెండవది.. ప్రత్యేక దేశం కోసం యూదుల డిమాండ్ తాను అనుసరిస్తున్న శాంతియుత పోరాటానికి విరుద్ధంగా ఉందని గాంధీ భావించారు. అయితే ఆ సమయంలో గాంధీ ఈ అంశాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. 
ఇది కూడా చదవండి: పార్లమెంట్‌ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement