country
-
ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్
ప్రపంచంలోని 10 అత్యంత పేద దేశాల జాబితా విడుదలయ్యింది. ఫోర్బ్స్ అందించిన ఈ సూచీలో టాప్‌లో నిలిచిన దేశాలు ప్రపంచంలో అతి చిన్న దేశాలుగా గుర్తింపుపొందాయి. వీటిలో భారత్‌కు సన్నిహిత దేశమైన మడగాస్కర్ 10వ స్థానంలో ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు.1. దక్షిణ సూడాన్దక్షిణ సూడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశపు జీడీపీ 29.99 బిలియన్ డాలర్లు. దక్షిణ సూడాన్ జనాభా 1.11 కోట్లు. ఈ దేశంలో యువత అత్యధిక శాతంలో ఉంది. 2011లో ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. ఈ దేశంలోని అత్యధిక జనాభా వ్యవసాయంపైననే ఆధారపడింది.2. బురుండీమధ్య ఆఫ్రికాలోని బురుండీ ప్రపంచంలో రెండవ అత్యంత పేద దేశం. బురుండీ జీడీపీ 2.15 బిలియన్ డాలర్లు. ఇక్కడి జనాభా 1,34,59,236. రాజకీయ అస్థిరత, అంతర్గత సంఘర్షణలు ఈ దేశపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలోని 80 శాతం జనాభా వ్యవసాయంపైననే ఆధారపడి జీవిస్తోంది.3. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రపంచంలో మూడవ పేద దేశం. ఇక్కడి జనాభా 58,49,358. జీడీపీ 3.03 బిలియన్ డాలర్లు. రాజకీయ అస్థిరత, సాయుధ పోరాటం మౌలిక సదుపాయాల కొరతతో ఈ దేశం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ దేశంలో 80 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు.4. మలావిమలావి ప్రపంచంలో నాల్గవ పేద దేశం. మలావి జనాభా 2,13,90,465. జీడీపీ 10.78 బిలియన్ డాలర్లు. మలావి గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. వర్షాధార వ్యవసాయంపై ఇక్కడ పంటలు సాగుచేస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి,పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.5. మొజాంబిక్మొజాంబిక్ ప్రపంచంలో ఐదవ పేద దేశం. మొజాంబిక్ జనాభా 3,44,97,736. జీడీపీ 24.55 బిలియన్ డాలర్లు. ఉగ్రవాదం, హింస మొజాంబిక్ ముందున్న ప్రధాన సమస్యలు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, జనాభా పెరుగుదల మొదలైనవి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టివేశాయి.6. సోమాలియాసోమాలియా ప్రపంచంలో ఆరవ పేద దేశం. సోమాలియా జీడీపీ 13.89 బిలియన్ డాలర్లు. జనాభా 1,90, 09,151. ఇక్కడి అంతర్యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. దీంతో దేశం పతనమయ్యింది.7. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ప్రపంచంలో ఏడవ పేద దేశం. జీడీపీ 79.24 బిలియన్ డాలర్లు. జనాభా 10,43,54,615. ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రువాండా అనుకూల తిరుగుబాటుదారుల దాడులతో అతలాకుతలమవుతోంది. కాంగోలో దాదాపు 62 శాతం మంది రోజుకు రూ.180 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు.8. లైబీరియాలైబీరియా ప్రపంచంలో ఎనిమిదవ పేద దేశం. లైబీరియా జీడీపీ 5.05 బిలియన్ డాలర్లు. జనాభా 54,92,486. ఆఫ్రికన్ దేశమైన లైబీరియాలో అంతర్యుద్ధం కారణంగా శాశ్వత పేదరికం ఏర్పడింది. ప్రపంచ ఆహార కార్యక్రమం వంటి అంతర్జాతీయ సంస్థలు విద్య , ఆరోగ్య సంరక్షణలో లైబీరియాకు సహకారాన్ని అందిస్తున్నాయి.9. యెమెన్ప్రపంచంలోని పేద దేశాలలో యెమెన్ తొమ్మిదవ స్థానంలో ఉంది. యెమెన్ జీడీపీ 16.22 బిలియన్ డాలర్లు. జనాభా 34.4 మిలియన్లు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత యెమెన్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఆహారం, నీరు, మందులు, నిత్యావసర వస్తువుల కొరత ఈ దేశాన్ని నిత్యం వెంటాడుతుంటుంది.10. మడగాస్కర్మడగాస్కర్ ప్రపంచంలోని 10వ పేద దేశం. మడగాస్కర్ జీడీపీ 18.1 బిలియన్ డాలర్లు. జనాభా 30.3 మిలియన్లు. ఈ దేశం భారతదేశానికి సన్నిహిత దేశంగా పేరొందింది. మడగాస్కర్ ఆఫ్రికాకు ఆగ్నేయ తీరంలో ఉన్న ఒక ద్వీప దేశం. మైనింగ్, పర్యాటకం ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.ఇది కూడా చదవండి: ఆరు అలవాట్లు.. విజయానికి అడ్డు గోడలు -
ఈ దేశంలో యువత అధికం.. 15 ఏళ్ల లోపువారు మరీ అధికం
ఎప్పుడైనా జనాభా విషయమై విస్తృత ప్రస్తావనకు వస్తే రెండు వాదనలు వినిపిస్తుంటాయి. వాటిలో ఒకటి.. అధిక జనాభా సమస్యగా మారుతున్న దేశాలు. మరొకటి తగ్గుతున్న జనాభా సంఖ్య కారణంగా జనన రేటును పెంచుకోవాలనుకుంటున్న దేశాలు.ఏ దేశంలోనైనా వృద్ధుల జనాభా అధికంగా ఉంటే ఆ దేశంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించడం ఆయా ప్రభుత్వాలకు సమస్యగా మారుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోని అతి పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశం గురించి తెలుసుకుందాం. ఆ దేశంలో జనాభాలో సగం మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరోవైపు ఆఫ్రికన్ దేశాలలో నెలకొన్న పేదరికం, వనరుల కొరత కారణంగా అక్కడి ప్రజల ఆయుర్దాయం అంతకంతకూ తగ్గుతోంది. ఫలితంగా అక్కడి ప్రజల సగటు వయస్సు క్షీణిస్తోంది.ఇక అత్యంత పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశాల విషయానికొస్తే ఆఫ్రికన్ దేశమైన నైజర్ ఈ జాబితాలో ముందువరుసలో ఉంటుంది. ఐక్యరాజ్యసమితి అందించిన డేటా ప్రకారం ఈ దేశంలోని ప్రజల సగటు వయస్సు 14.8 ఏళ్లు. ఈ జనాభాలో సగం మంది 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారేకావడం విశేషం. పేదరికం, వనరుల కొరత కారణంగా ఇక్కడ జనన రేటు చాలా ఎక్కువగా ఉంది. నైజర్‌లో సగటు జనన రేటు ప్రతి స్త్రీకి 7.6 మంది పిల్లలు. ప్రపంచ సంఖ్య 2.5 అయితే. ఇక్కడ ఆయుర్దాయం దాదాపు 58 ఏళ్లు.యువ జనాభా పరంగా నైజర్ ముందు వరుసలో ఉంది. అయితే పెరుగుతున్న యువత జనాభా ఈ దేశానికి సమస్యగా మారింది. నైజర్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో దేశంలో విద్యా సౌకర్యాలు, ప్రాథమిక అవసరాలు యువతకు అందడం లేదు. ఈ కారణంగా, ఇక్కడ పేదరికం, బాల్యవివాహాలు తదితర సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ప్రపంచ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం పేద దేశాలలో అధిక సంతానోత్పత్తి రేట్లు కూడా ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయి.ఆఫ్రికాలో పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశం నైజర్ ఒక్కటి మాత్రమే కాదు. ఉగాండా, అంగోలాలలో కూడా పిన్న వయస్కుల జనాభా అధికంగా ఉంది. ఈ రెండు దేశాలలో యువత సగటు వయస్సు 16 సంవత్సరాలు. మధ్యప్రాచ్యంలోని పాలస్తీనా, యెమెన్, ఇరాక్లలో యువత సగటు వయస్సు దాదాపు 22 ఏళ్లు. దీని తరువాత ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్లు, తైమూర్-లెస్టే 20.6 ఏళ్లు, పాపువా న్యూ గినియాలో యువత సగటు వయస్సు 21.7 ఏళ్లుగా ఉంది.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ప్రచారంలో మూమూస్ రుచిచూసిన కేజ్రీవాల్ -
యువత బలమే దేశానికి కలిమి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మన యువత బలమే మన దేశాన్ని అగ్రగామిగా మారుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువతీ యువకుల శక్తి సామర్థ్యాలతో భారత్ ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందడం ఖాయమని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా కార్యక్రమం’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్’ అనేది మన లక్ష్యమని గుర్తుచేశారు. ఆ లక్ష్యం సాధించడం కష్టం కావొచ్చేమో గానీ అసాధ్యం మాత్రం కాదని తేల్చిచెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సత్తా మన యువతలో ఉందన్నారు. మనది యువదేశమని, పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంచేశారు. మనం వేసే ప్రతి అడుగులో, ప్రతి విధానంలో, ప్రతి నిర్ణయంలో వికసిత్ భారత్ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో వేర్వేరు కీలక రంగాల్లో ఎన్నో విజయాలను మన దేశం సాధించబోతోందని మోదీ వెల్లడించారు. దేశం ముందుకు పరుగులు తీయాలంటే గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, మనం ఇప్పుడు అదే పనిలో నిమగ్నమై ఉన్నామని వివరించారు. ప్రభుత్వానికి యువత భుజం కలపాలి 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం బ్లెండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాస్తవానికి అంతకంటే ముందే అది సాధించబోతున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులూ చేయలేదని, యువత సైతం భుజం కలపాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్‌కు యువతే యజమానులని ఉద్ఘాటించారు. మన విధాన నిర్ణయాల్లో యువత ఆలోచనలు కూడా ఒక భాగమని చెప్పారు. వారి దిశానిర్దేశం దేశానికి అవసరమని అన్నారు. మనం అనుకున్నది సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరి సమ్మిళిత కృషి అవసరమన్నారు. 1930లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా అగ్రదేశంగా ఎదిగిందని, ఒకప్పుడు ఎంతో వెనుకబడిన దేశమైన సింగపూర్ ప్రస్తుతం బలీయమైన ఆర్థిక శక్తిగా మారిందని మోదీ గుర్తుచేశారు. గొప్ప లక్ష్యాలు పెట్టుకోవడం, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యమని ఉద్బోధించారు. రాబోయే 25 ఏళ్లు మనకు అమృతకాలమని వివరించారు. వికసిత్ భారత్ కలను యువత సాకారం చేస్తుందన్న విశ్వాసం తనకు పూర్తిగా ఉందని పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో మన దేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేలా యువత సన్నద్ధం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా కార్యక్రమానికి 3 వేల మందికిపైగా యువతీ యువకులు హాజరయ్యారు. -
‘ఆంగ్లం’లో భారత్ స్థానం ఎంత? నాన్ ఇంగ్లీషులో టాప్ దేశమేది?
ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ ప్రధాన భాషగా మారింది. భారతదేశంలో కూడా హిందీతో పాటు ఇతర భాషలకన్నా ఇంగ్లీషుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఏ దేశాల్లో ఇంగ్లీషు అధికంగా మాట్లాడతారో తెలుసా? ఈ విషయంలో భారత్ ర్యాంక్ ఎంత?ఇప్పుడున్న రోజుల్లో ఆంగ్లం అన్నిరంగాల్లో ప్రధాన భాషగా ఉంది. ఇంగ్లీషు(English)వస్తే ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లవచ్చని, అక్కడివారితో మాట్లాడవచ్చని అంటారు. ఇంగ్లీష్ మాట్లాడే విషయంలో భారతదేశం ప్రపంచ సగటుకు మించి ఉంది. దేశంలోని ఢిల్లీ ఆంగ్ల భాషణలో ముందంజలో ఉంది. ఈ విషయాన్ని ఒక నివేదిక వెల్లడించింది.పియర్సన్ గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొషిషియన్సీ(Pearson Global English Proficiency) నివేదిక ప్రకారం ఢిల్లీలోని ప్రజలకు ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం ఉత్తమంగా ఉంది. రాజస్థాన్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడేవారి విషయంలో ఢిల్లీకి 63 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత రాజస్థాన్‌కు 60 పాయింట్లు, పంజాబ్‌కు 58 పాయింట్లు వచ్చాయి.బ్రిటన్‌లో గరిష్టంగా 98.3 శాతం మందికి ఇంగ్లీషు బాగా వచ్చు. అమెరికాలో 95 శాతం మందికి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుసు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుండి అందిన డేటా ప్రకారం బ్రిటన్‌లోని జిబ్రాల్టర్‌లో 100 శాతం మంది ప్రజలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడతారు. ఇక్కడి జనాభా 32,669 మాత్రమే.భారతదేశంలో 20 శాతం మంది ప్రజలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరు. జనాభా పరంగా చూస్తే, భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య ప్రపంచంలో టాప్ 5 దేశాలలో ఉంది. పియర్సన్స్ గ్లోబల్ ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారిలో రాజధాని ఢిల్లీ(Delhi) ముందంజలో ఉంది. కాగా చైనాలో ఇంగ్లీష్ మాట్లాడేవారి సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ 0.9 శాతం మంది మాత్రమే ఇంగ్లీషులో మాట్లాడతారు. చైనీస్ ప్రజలు వారి మాతృభాషలోనే సంభాషిస్తారు. చైనాలో చైనీస్, మంగోలియన్, టిబెటన్, ఉయ్ఘర్, జువాంగ్ భాషల్లో మాట్లాడుతుంటారు.ఇది కూడా చదవండి: Winter Travel Ideas: శీతాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు -
విదేశీ పండ్లకు పెరిగిన క్రేజ్
అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్ కివీ, వాషింగ్టన్ యాపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్, థాయిలాండ్ డ్రాగన్ ఇలా అనేక రకాల విదేశీ పండ్లు ప్రసుత్తం నగర మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. దీంతో విదేశీ పండ్ల రుచులను ఆస్వాదించడానికి నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రోజు రోజుకూ నగరంలో వీటి అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సగటున రోజుకు 50–60 టన్నుల మేర అమ్మకాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సుమారు 18 దేశాల నుంచి వివిధ రకాలు దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపార వర్గాల చెబుతున్న మాట. కాగా ఈ మొత్తం ప్రక్రియలో అమ్మకాలు, దిగుమతులు గణనీయంగా పెరిగాయని, దీంతో విదేశీ పండ్ల విక్రయాల్లో నగరం దేశంలోనే మూడో స్థానంలో ఉందని తెలుస్తోంది.. ఒకప్పుడు స్థానికంగా దొరికే ఫలాలే సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసేవారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫలాలు ఎగువ మధ్య తరగతి వారు, లేదా ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసేవారు. అయితే మారుతున్న పరిస్థితులు, గ్లోబల్ మార్కెటింగ్‌లో భాగంగా ప్రతిదీ సామాన్యులకు అందుబాటులకి వచి్చంది. పైగా వాటికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు వాటి అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశంలో అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లు నగర మార్కెట్లో అందుబాటులో అమ్మకాలు జరుగుతున్నాయి... మాల్స్ నుంచి లోకల్ మార్కెట్‌కి.. విదేశీ పండ్లు ఒకప్పుడు పెద్ద పెద్ద మాల్స్‌లోనో.. లేదా సూపర్ మార్కెట్స్‌లోనో అమ్మకాలు జరిగేవి... అయితే విదేశీ పండ్లు నగరంలో మాల్స్, ఫ్రూట్ షాప్స్ నుంచి తోపుడు బండ్లపై అమ్మకాలు జరుగుతున్నాయి. పైగా దేశీయ పండ్ల ధరలకు సమానంగా వీటిని విక్రయిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఏదో ఒక సీజన్లో మత్రమే దేశయ మార్కెట్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వివిధ దేశాల పండ్లు అక్కడి సీజన్ల ప్రకారం మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. దీంతో యేడాది పొడవునా ఏదో ఒక దేశం నుంచి అన్ని రకాల పండ్లూ అన్ని సీజన్లలో లభ్యమౌతున్నాయి. దేశంలోనే మూడో స్థానంలో.. విదేశీ పండ్లుగా పేరుగాంచిన కివీ, స్ట్రాబర్రీ, బ్లాక్ బెర్రీస్, అవకాడో వంటి పళ్లు నగరంలో విరివిగా లభ్యమవుతున్నాయి. భారీగా అక్కడి నుంచి దిగుమతులు చేయడం ఒక కారణమైతే.. లోకల్ మార్కెట్‌తో పాటు ఇళ్ల వెంబడి కూడా అమ్మకాలు చేయడమే మరో కారణమని బాటసింగారం మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నారు. నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకూ, జిల్లాలకూ ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతాయి. అందుకే రాష్ట్రంలోనే బాటసింగారం పండ్ల మార్కెట్‌కు అతి పెద్దదిగా పెట్టింది పేరు. అయితే విదేశీ పండ్ల వినియోగంలో ముంబయి, బెంగళూరు తర్వాత నగరం మూడో స్థానంలో నిలిచింది. దిగుమతులు ఇలా.. గ్రీన్ యాపిల్‌కు ఇటీవల అదరణ పెరిగింది. నెదర్లాండ్స్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యాపిల్ పళ్లను వాషింగ్టన్, చైనా, న్యూజిల్యాండ్, చిలీ, బెల్జియం నుంచి ముంబాయి, చెన్నై పోర్టు ద్వారా నగరానికి దిగుమతవుతాయి. అవకాడో టాంజానియా నుంచి, కివీ పండ్లు న్యూజిల్యాండ్, ఇటలీ, ఇరాన్‌తో పాటు చైనా నుంచి వస్తాయి. ఇదే క్రమంలో వివిధ పళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతవుతున్నాయి. ప్రతి ఫలం..ఔషధ గుణం.. ప్లమ్.. చూడడానికి పెద్ద రెగు పండు సైజులో యాపిల్‌ను పోలివుంటుంది. ఇందులో క్యాల్షియం, సీ, బీ విటమిన్లు, మెగీ్నíÙయంతో పాటు ఇతర పోషకాలు మొండుగా ఉంటాయి. కివీ ఫ్రూట్లో విటమిన్ సీ, కే, ఇ అధికంగా ఉంటాయి. ఇక డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సీ, ఫాస్పరస్, క్యాల్షియం, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తితో పాటు కేన్సర్‌ను నియంత్రిస్తుంది. చెర్రీలో కార్బోహైడ్రేట్లు, షుగర్, విటమిన్ సీ, పోటాషియం పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సీ, క్యాల్షియం అధిక స్థాయిలో ఉంటుంది.ఆన్లైన్లోనే ఆర్డర్స్.. వివిధ దేశాల నుంచి ఇక్కడి వ్యాపారులు ఆయా సీజనల్ ఫ్రూట్స్‌ని ఆన్లైన్ ద్వారానే దిగుమతి చేసుకుంటారు.. అదెలా అంటే.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాట్సాప్, మెయిల్ ద్వారా పండ్ల నమునా ఫొటోలు పంపిస్తారు. దీంతో వ్యాపారులు ఆన్లైన్లో అడర్ ఇస్తారు. విదేశాల నుంచి ముంబయికి దిగుమితి అవుతాయి. అక్కడి నుంచి ఫ్రీజర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా నగరానికి వస్తాయి.మార్కెట్లో వివిధ దేశాల పండ్లు ప్రపంచ వ్యాప్తంగా లభించే దాదాపు 20 రకాల విదేశీ పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్‌కు కమీషన్ ఏజెంట్ల ద్వారా దిగుమతి అవుతున్నాయి. గతం కంటే ప్రస్తుతం దిగుమతులు పెరిగాయి. ట్రేడర్స్‌కు రెఫ్రిజిరేటర్ చాంబర్లు ఏర్పాటు చేశాము. దేశంలోని ఇతర పండ్ల మార్కెట్లతో పోలిస్తే నగర మార్కెట్లో అన్ని సౌకార్యలూ ఉన్నాయి. – ఎల్ శ్రీనివాస్, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపెరిగిన అమ్మకాలు గతంతో పోలిస్తే విదేశీ పండ్ల అమ్మకాలు పెరిగాయి. దీంతోపాటు నగరం ప్రజలకు కూడా విదేశీ పండ్లపై ఆసిక్తి పెరిగంది. కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెరగడం మరో కారణం.. దిగుమతులు కూడా విరివిగా జరుగుతుండడంతో ధరలు కూడా దేశీ పండ్ల స్థాయిలోనే ఉంటున్నాయి. యాపిల్, కివీ, పియర్స్‌తో పాటు మరికొన్ని విదేశీ రకాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. – క్రాంతి ప్రభాత్‌రెడ్డి, విదేశీ పండ్ల హోల్‌సేల్ వ్యాపారి -
Year Ender 2024: ఈ దేశాల్లో పర్యాటకుల తాకిడి.. హనీమూన్ స్పాట్లో జంటల సందడి
కొద్దిరోజుల్లో 2024కు వీడ్కోలు చెప్పబోతున్నాం. ఈ నేపధ్యంలో ముగుస్తున్న ఏడాదిలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను నెమరువేసుకుంటుంటాం. ఈ కోవలోకి టూరిజం రంగం కూడా వస్తుంది. 2024లో ఏ దేశంలో టూరిస్టుల తాకిడి అధికంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సర్వేలోని వివరాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.ఫ్రాన్స్2024లో 89.4 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులతో ఫ్రాన్స్ కళకళలాడింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ను సందర్శించడానికి టూరిస్టులు ఎంతో ఉత్సాహం చూపారు. దీంతో పారిస్ ఈ ఏడాది పర్యాటకులతో నిండిపోయింది. పలు జంటలు 2024లో హనీమూన్ కోసం పారిస్‌కు వచ్చారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను చూడాలని ప్రతీఒక్కరూ కోరుకుంటారు. ఈ ప్రాంతం ఎప్పుడూ టూరిస్టులతో రద్దీగా ఉంటుంది.స్పెయిన్నైరుతి ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పంలో స్పెయిన్ దేశం ఉంది. పర్యాటక పరంగా స్పెయిన్ దేశం టూరిస్టులకు ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా పేరొందింది. క్యాథలిక్ మతానికి చెందిన వారు అధికంగా ఇక్కడ నివసిస్తున్నారు. గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది 85 మిలియన్లకు పైగా పర్యాటకులు స్పెయిన్‌కు తరలివస్తుంటారు. ఫ్రాన్స్ తర్వాత అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఇష్టపడదే దేశం స్పెయిన్. 2024లో ఇప్పటివరకూ 83.7 మిలియన్ల మంది పర్యాటకులు స్పెయిన్‌ను సందర్శించారు.అమెరికా2024 చివరినాటికి అమెరికాకు 79.3 మిలియన్ల మంది పర్యాటకులు వస్తారనే అంచనాలున్నాయి. పర్యాటకులు సందర్శిస్తున్న ప్రదేశాల జాబితాలో అమెరికా ముందంజలో ఉంది. అమెరికాలోని న్యూయార్క్ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతం. న్యూయార్క్‌లోని ఎత్తయిన భవనాలు, లాస్ ఏంజిల్స్‌లోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.చైనాఅన్ని రంగాలలో ముందంజలో ఉన్న చైనా టూరిజంలోనూ దూసుకుపోతోంది. ఈ రంగంలో చైనా తనదైన ముద్ర వేసింది. 2024 చివరినాటికల్లా 65.7 మిలియన్ల పర్యాటకులు చైనాను సందర్శిస్తారనే అంచనాలున్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈ దేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చైనాలోని టెర్రకోటా ఆర్మీ, లింటాంగ్ డిస్ట్రిక్ట్, జియాన్, షాంగ్సీ, బీజింగ్ పురాతన అబ్జర్వేటరీ, డాంగ్చెంగ్, టెంపుల్ ఆఫ్ హెవెన్, డాంగ్చెంగ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు నిత్యం సందర్శకులతో కళకళలాడుతుంటాయి.ఇటలీయూరప్లోని ఇటలీ అత్యంత విలాసంతమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇటలీ 2024లో 64.5 మిలియన్ల మంది పర్యాటకులను స్వాగతించనుందనే అంచనాలున్నాయి. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్ వంటి నగరాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ దేశంలోని అమాల్ఫీ తీరాన్ని పర్యాటకులు సందర్శిస్తుంటారు.ఇది కూడా చదవండి: ఆప్ ఎన్నికల వ్యూహం: ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి.. కౌన్సిలర్లకు పట్టం -
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పర్వత ప్రాంతాలు మొదలుకొని మైదాన ప్రాంతాల వరకు అన్నిచోట్లా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాజస్థాన్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు సంభవించిన పలు ప్రమాదాలలో మరో ఎనిమిది మంది మృతి చెందారు. గడచిన రెండు రోజుల్లో 22 మంది వర్ష సంబంధిత ప్రమాదాల్లో మృతిచెందారు. కరౌలి, హిందౌన్లలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్యామ్‌లు, నదులు పొంగిపొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. విపత్తు సహాయక దళాలు కరౌలి, హిందౌన్‌లలో 100 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు జాతీయ రహదారులతో సహా మొత్తం 197 రోడ్లు మూసుకుపోయాయి. బీహార్‌లో గంగా నది సహా అన్ని ప్రధాన నదుల నీటిమట్టం పెరిగింది. రాజధాని పట్నాలో గంగ, పున్పున్ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గంగా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది.గంగానది నీటిమట్టం పెరగడంతో ముంగేర్, భాగల్పూర్, పట్నా తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. -
వారణాసిలో తొలి హైడ్రోజన్ క్రూయిజ్
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్‌ను నడపనున్నారు. ఈ క్రూయిజ్ ఆదివారం అర్థరాత్రి వారణాసికి చేరుకుంది. మొదట ఈ హైడ్రోజన్ క్రూయిజ్‌ను నమో ఘాట్‌కు తీసుకువచ్చి, తరువాత రామ్‌నగర్‌లోని మల్టీమోడల్ టెర్మినల్‌కు తరలించారు. ఈ క్రూయిజ్ కొచ్చిలోని షిప్‌యార్డ్‌లో అనేక సౌకర్యాలతో నిర్మితమయ్యింది.ఈ క్రూయిజ్‌లో 50 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది. కాలుష్యాన్ని ఉత్పత్తి చేయకుండా గంగానదిలో నడిచే తొలి క్రూయిజ్ ఇది. ఈ క్రూయిజ్ వారణాసి- చునార్ మధ్య నడుస్తుంది. దీనిని పర్యాటక శాఖ పర్యవేక్షించనుంది.ఈ క్రూయిజ్ నిర్వహణ కోసం వారణాసిలోని రామ్‌నగర్ మల్టీ మోడల్ టెర్మినల్‌లో తాత్కాలిక హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ క్రూయిజ్‌లో ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా అమర్చారు. తద్వారా హైడ్రోజన్ ఇంధనం తగ్గినప్పుడు, క్రూయిజ్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడపవచ్చు. వారణాసి తర్వాత అయోధ్య, మథురలలో కూడా ఈ క్రూయిజ్‌ను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
ఒకే కుటుంబం.. రెండు నెలల్లో అమరులైన ఇద్దరు జవానులు
జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయగా, ఐదుగురు భారత సైనికులు వీరమరణం పొందారు. వీరంతా ఉత్తరాఖండ్‌కు చెందిన వారు. ఈ ఘటన సైనికుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముఖ్యంగా రెండు నెలల వ్యవధిలో దేశం కోసం ఇద్దరు కుమారులు అమరులైన కుటుంబం అనుభవిస్తున్న వేదన మాటలకు అందనిది.ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ పరిధిలోగల డాగర్ గ్రామానికి చెందిన ఒక కుటుంబంలోని ఇద్దరు కుమారులు రెండు నెలల వ్యవధిలో దేశం కోసం ప్రాణాలర్పించారు. వీరిలో ఒకరైన ఆదర్శ్ నేగి గత సోమవారం జమ్ముకశ్మీర్‌లోని కథువాలో మరణించగా, మరో కుమారుడు మేజర్ ప్రణయ్ నేగి గత ఏప్రిల్‌లో లేహ్‌లో వీరమరణం పొందారు. కుమారులిద్దరూ అసువులుబాయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.కథువాలో వీరమరణం పొందిన సైనికుడు ఆదర్శ్ నేగి 2018లో గర్వాల్ రైఫిల్స్‌లో చేరాడు. తాజాగా ఆదర్శ్ తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఒక కుమారుని బలిదానం నుండి ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరో కుమారుడు మరణించడాన్ని వారు దిగమింగుకోలేకపోతున్నారు. సీఎం పుష్కర ధామి అమరవీరుల కుటుంబాన్ని ఓదార్చారు. -
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా... ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందుగానే అన్ని కేంద్రాల గేట్లు మూసివేశారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు.కాగా, ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ నుంచి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 99 పరీక్ష కేంద్రాలను, వరంగల్‌లో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మొత్తం 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 40 పోస్టులు వికలాంగులకు మాత్రమే కేటాయించారు. వ్రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. -
దేశానికి అత్యున్నత నేతలను అందించిన ఢిల్లీ
దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిన పలువురు నేతలు ఢిల్లీ తమకు రన్ వే అని నిరూపించారు. ఇక్కడి నుంచి గెలిచిన పలువురు నేతలు రాజకీయాల్లో తారాస్థాయికి చేరుకున్నారు. ఢిల్లీలో విజయం సాధించాక తొలిసారిగా లోక్‌సభకు ముగ్గురు నేతలు చేరారు. వీరిని కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు వరించాయి. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి, దేశ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిలో సుచేతా కృపలానీ పేరు మొదటిగా వినిపిస్తుంది. ఆమె 1952లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. తరువాత ఆమె 1960లో ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికై నాటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. మూడేళ్ల తరువాత 1963లో ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలో ఇంతటి అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా సుచేతా కృపలానీ నిలిచారు.బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ కూడా తొలిసారిగా 1989లో ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. ఆ తర్వాత దేశానికి ఉప ప్రధానిగా కూడా నియమితులయ్యారు. 1991లో న్యూ ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటుడు రాజేష్ ఖన్నాను ఓడించారు. ఈ క్రమంలోనే 1977లో లాల్ కృష్ణ అద్వానీ కేంద్ర మంత్రి కూడా అయ్యారు.బీజేపీ దిగ్గజ నేత, ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా లోక్‌సభకు చేరుకున్నారు. 1996లో రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత, ఆమె దక్షిణ ఢిల్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల తర్వాత ఆమె 13 రోజుల అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. దీని తరువాత ఆమె 1998లో దక్షిణ ఢిల్లీ నుంచి మరోమారు గెలిచారు. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో సాహిబ్ సింగ్ స్థానంలో బీజేపీ ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రిని చేసింది. 2009-2014 మధ్యకాలంలో ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా కూడా వ్యవహరించారు. మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. -
ఎండలకు చచ్చిపోతున్న చేపలు.. వ్యాపిస్తున్న దుర్వాసన!
మండుతున్న ఎండలు మన దేశాన్నే కాదు ప్రపంచంలోని పలు దేశాలను భయపెడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు అటు జనాలను, ఇటు జీవాలను మలమలమాడిపోయేలా చేస్తున్నాయి. కరువు బారిన పడిన దక్షిణ వియత్నాంను ఈ ఎండలు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దక్షిణ వియత్నాంలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చేపలను బలి తీసుకుంటున్నాయి. 300 హెక్టార్లలో విస్తరించి ఉన్న ‘సాంగ్ మే’ చెరువులోని వేలాది చేపలు ఎండ వేడికి తాళలేక చనిపోయాయి. డాంగ్ నైలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. 1998లో ఈ ప్రాంతంలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రిజర్వాయర్ నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం కూడా చేపలు చనిపోవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత వేసవి కాలంటో 200 టన్నులకు పైగా చేపలు చనిపోయాయి. అత్యధిక ఉష్ణోగ్రత, నీటి కొరత కారణంగా ఈ చేపలు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన చేపల వాసన గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో విపరీతంగా వ్యాపించడంతో ఇక్కడి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈ చనిపోయిన చేపలను చెరువులో నుంచి తొలగించే పనిలో మత్స్యకారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం విచారణ ప్రారంభించింది. -
పిల్లులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇల్లు, తిండి ఫ్రీ!
పిల్లులను చాలామంది ఎంతో ప్రేమగా పెంచుకుంటుంటారు. అయితే పిల్లులను ప్రభుత్వ విధుల్లో వినియోగించే దేశమొకటుందని మీకు తెలుసా? ఇంతకీ ఆ దేశంలో పిల్లులు ఏ పనులు చేస్తాయి? ఈ వివరాలు మీ కోసం.. పిల్లులను ప్రభుత్వ కార్యకాలాపాల్లో వినియోగించే దేశం ఇజ్రాయెల్. ఇక్కడి రైల్వే స్టేషన్లలో పిల్లులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నాయి. ఇజ్రాయిల్‌లో పిల్లుల జనాభా 20 లక్షలకు పైగానే ఉంది. జనాభాలో మనుషులతో పోటీ పడుతున్న పిల్లులకు ఉపాధి కల్పించాలని అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ నేపధ్యంలో వాటిని రైల్వే స్టేషన్ విధులలో నియమించింది. ఈ పిల్లులు ప్రయాణికుల టిక్కెట్లను తనిఖీ చేస్తుంటాయి. మీడియా కథనాల ప్రకారం ప్రభుత్వం ఈ పిల్లులకు టిక్కెట్లను తనిఖీ చేయడంపై శిక్షణ ఇస్తుంది. ఎవరైనా టికెట్ చూపించడానికి ఇష్టపడకపోతే, ఆ పిల్లులు వారికి ఎదురుతిరుగుతాయి. ఈ పిల్లులకు ఆహారంతోపాటు అవి ఉండేందుకు ప్రత్యేక స్థలం కూడా కేటాయిస్తారు. రైల్వే స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఈ పిల్లులను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతుంటారు. ఇజ్రాయెల్‌లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే అక్కడి ప్రభుత్వం పిల్లులను రైల్వేశాఖ విధుల్లో వినియోగిస్తోంది. దీనివలన ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం తగ్గుతోంది. శిక్షణ పూర్తయిన పిల్లులను విధుల్లో నియమిస్తారు. ఈ పిల్లులకు టిక్కెట్ చూపకుండా ఏ ప్రయాణికుడు కూడా రైల్వే ప్లాట్ఫారందాటి బయటకు వెళ్లలేరని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
ఇక్కడి బీచ్‌ల్లో రంగురాళ్లు ఏరితే, భారీ జరిమానా!
వేసవి సీజన్ వచ్చిందంటే చాలు సముద్ర తీరానికి, బీచ్‌లకు,అందమైన ద్వీపాలకు వెళతాం. బీచ్‌లకు వెళ్లామంటే గవ్వలు, రంగు రంగుల గులకరాళ్లు ఏరుకోవడం ఒక సరాదా. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఇదొక అలవాటు మారిపోయింది. కానీ ఈ అలవాటు ప్రకృతిని, పర్యావరణా సమతుల్యతను దెబ్బతీస్తుందని మీకు తెలుసా? ఈ నేపథ్యంలోనే కెనరీ ఐలాండ్స్ కఠిన చర్యలకు దిగింది. పర్యావరణ పరిరక్షణకోసం స్పెయిన్‌కు చెందిన ద్వీప సముదాయం కెనరీ ఐల్యాండ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లాంజరోటే, ఫుయెర్తెవెంట్యురా ద్వీపాల్లోని సముద్ర తీరం నుంచి గులకరాళ్లు ఏరడాన్ని నిషేధించింది. రాళ్లను సేకరించే టూరిస్టులకు రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. బీచ్‌లు క్షీణించకుండా పర్యాటకులకు అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. మాస్ టూరిజం కారణంగా కానరీ ద్వీపాలు దెబ్బతింటున్నాయంటున్నారు అధికారులు. కానరీ దీవుల్లోని దీవులకు వచ్చే పర్యాటకులు తమతో పాటు రంగురాళ్లు, ఇసుకను తీసుకువెళతారట. పర్యాటకుల రాళ్లను తీసుకెళ్లే అలవాటుతో అక్కడి సహజ సమతుల్యత దెబ్బతింటోందని ఆ దేశం భావిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో ఈ రాళ్లు,మట్టి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఈ సందర్భంగా అక్కడి అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలు ఏటా తీరంవెంబడి భారీ స్థాయిలో ఇసుక, మట్టి కోల్పోతోందని వెల్లడించారు. కానరీ దీవులు ఏడు ప్రధాన ద్వీపాల సమూహం. ఇందులో టెనెరిఫే, గ్రాన్ కానరియా, లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా, లా పాల్మా, లా గోమెరా , ఎల్ హిరో. ఈ ద్వీపాలలో టెనెరిప్ ద్వీపం కానరీ దీవులలో అతిపెద్ద ద్వీపం. స్పెయిన్‌లోని అతిపెద్ద పర్వతం మౌంట్ టీడే ఇక్కడే ఉంది. -
‘హస్తం’, ‘చర్ఖా’ లేకున్నా ఇందిర ప్రభంజనం!
స్వతంత్ర భారతావనిలో జరిగిన ఐదవ సాధారణ ఎన్నికలు దేశంలో ఎన్నికల ప్రక్రియ రూపురేఖలను మార్చివేశాయి. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ హవాను దేశమంతా చూసింది. ఆమె నేతృత్వంలోని పార్టీ లోక్‌సభలో మొత్తం 545 స్థానాలకు గానూ 352 సీట్లు గెలుచుకుంది. నాడు కాంగ్రెస్ (ఓ)కి 16 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలైంది. ఇందిర కాంగ్రెస్ (ఐ) పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్‌లోని వృద్ధ నాయకులకు వ్యతిరేకంగా తన సత్తా చాటారు. 1951-1952లో స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఈ ఎన్నికల సంప్రదాయం 1960ల చివరి వరకు కొనసాగింది. అయితే పలు అసెంబ్లీ స్థానాల పదవీకాలం ఇంకా ముగియకపోవడంతో ఎన్నికల తేదీలను ఏడాది పాటు వాయిదా వేయడం వల్ల జాతీయ, రాష్ట్ర షెడ్యూళ్లను వేరు చేయాల్సి వచ్చింది. 1971లో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 1-10 తేదీల మధ్య ఎన్నికలు జరిగాయి. 15,12,96,749 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సంఖ్య 1967 లోక్‌సభ ఎన్నికల కంటే 30 లక్షలు తక్కువ కావడం విశేషం. నాడు 518 స్థానాలకు గాను 2,784 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మారిన గుర్తుతో ఇందిర ఎన్నికల్లో పోటీ చేశారు. స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా (కాంగ్రెస్ ‘ఆర్), కాంగ్రెస్ (ఓ)) విడిపోయినప్పుడు జరిగిన మొదటి ఎన్నికలివి. ఇందిరా గాంధీ నేతృత్వంలోని పార్టీ ఎన్నికల గుర్తు ఆవు, పాలు తాగుతున్న దూడ. కాంగ్రెస్ (ఓ) ఎన్నికల గుర్తు చర్ఖా తిప్పుతున్న మహిళ. -
న్యూటన్ ఎక్కడ పుట్టారు? రెండు పుట్టిన రోజులు ఎందుకు?
ప్రముఖ శాస్త్రవేత్త, గణిత మేథావి ఐజాక్ న్యూటన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పాఠశాల పుస్తకాలలో అతని పేరు తప్పక కనిపిస్తుంది. న్యూటన్ గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, వేదాంతవేత్త ఇలా మరెన్నో సుగుణాలు ఆయనలో ఉన్నాయి. అయితే న్యూటన్ తన గురుత్వాకర్షణ, చలన నియమాలకు ప్రసిద్ధి చెందారు. అయితే న్యూటన్ ఎక్కడ పుట్టారో తెలుసా? అలాగే ఆయనకు రెండు పుట్టిన రోజులు ఎందుకు వచ్చాయో తెలుసా? న్యూటన్ ఇంగ్లాండ్‌లోని లింకన్షైర్ కౌంటీలోని వూల్స్టోర్ప్-బై-కోల్స్టర్వర్త్లోని వూల్స్టోర్ప్ మనోర్‌లో 1642, డిసెంబరు 25న జన్మించారు. న్యూటన్ పుట్టిన మూడు నెలలకు అతని తండ్రి కన్నుమూశారు. అతని పూర్తి పేరు ఐజాక్ న్యూటన్. న్యూటన్‌కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లి మరో వివాహం చేసుకుంది. ప్రపంచానికి వినూత్న ఆవిష్కరణలు అందించిన న్యూటన్ 1727 మార్చి 20న కన్నుమూశారు. వెస్ట్ మినిస్టర్ అబ్బేలో న్యూటన్ సమాధి ఉంది. న్యూటన్‌కు పిల్లలు లేరు. అతని ఆస్తిని బంధువులు స్వాధీనం చేసుకున్నారు. న్యూటన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. న్యూటన్‌కు రెండు పుట్టినరోజులు. నాటి రోజుల్లో అమలులో ఉన్న క్యాలెండర్ కారణంగా అతని పుట్టిన తేదీల మధ్య పది రోజుల తేడా ఉంది. న్యూటన్ పుట్టిన రోజు జనవరి 4నే కాకుండా, డిసెంబర్ 25న కూడా వస్తుంది. న్యూటన్ తన పుట్టినరోజును డిసెంబర్ 25న ఇంగ్లాండ్‌లో జరుపుకున్నారు. ఇంగ్లాండ్ వెలుపల అతని పుట్టినరోజు జనవరి 4 కింద లెక్కిస్తారు. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్‌ను ఇంగ్లాండ్‌లో ఉపయోగించారు. ఈ క్యాలెంటర్ యూరప్‌కు భిన్నమైనది. దీని ప్రకారం న్యూటన్ 1642, డిసెంబరు 25న జన్మించారు. ఆ సమయంలో ఐరోపాలో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరించేవారు. దీని ప్రకారం న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. -
100 శాతం ముస్లింలున్న దేశం ఏది?
ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న మతం ఇస్లాం . 2070 నాటికి ఇస్లాంను అనుసరించే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉండనున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2015తో పోలిస్తే 2060 నాటికి, మొత్తం ప్రపంచ ముస్లింల జనాభా 70 శాతం మేరకు పెరగనుంది. భారతదేశానికి పక్కనే ఉన్న మాల్దీవుల జనాభాలో 100 శాతం ముస్లింలు ఉన్నారు. అదే విధంగా ఆఫ్రికన్ దేశమైన మారిషస్‌లో 100 శాతం ముస్లిం జనాభా ఉంది. ట్యునీషియా మొత్తం జనాభాలో 99.8 శాతం మంది ముస్లింలు. సోమాలియా జనాభాలో 99 శాతం మంది ముస్లింను అనుసరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల్లో కూడా 99 శాతం మంది ఇస్లాంను అనుసరిస్తున్నారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశాల విషయానికొస్తే ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. మాల్దీవులను పన్నెండవ శతాబ్దం వరకు హిందూ రాజులు పరిపాలించారు. తరువాతి కాలంలో ఇది బౌద్ధమతానికి కేంద్రంగా మారింది. తమిళ చోళ రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాత మెల్లగా మాల్దీవులు ముస్లిం దేశంగా మారడం మొదలైంది. మాల్దీవుల అధికారిక మతం ఇస్లాం. ముస్లిమేతరులు ఎవరూ మాల్దీవులలో పౌరసత్వం పొందలేరు. ముస్లిం జనాభాలో ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ముస్లింల సంఖ్య 23 కోట్లకు పైగా ఉంది. గత జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభా 18,68,90,601 కాగా, అందులో 18 కోట్ల 25 లక్షల 92 వేల మంది ముస్లింలు. పాకిస్తాన్లో హిందువుల సంఖ్య దాదాపు 22,10,000 కాగా, 74 వేలకు పైగా సిక్కులు ఉన్నారు. క్రైస్తవులు దాదాపు 18 లక్షల 73 వేలు, అహ్మదీలు 1,88,340. పార్సీలు దాదాపు 4000 మంది ఉన్నారు. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్‌లో ముస్లింల జనాభా 20 కోట్లకు పైగానే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 17.22 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో 14.2 శాతం. ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్న దేశాలలో భారత్ ఒకటి. బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ ముస్లిం జనాభా 15 కోట్లకు పైగానే ఉంది. ఆఫ్రికన్ దేశం నైజీరియా ఐదవ స్థానంలో ఉంది. ఇస్లాం మతాన్ని అనుసరించే 11 కోట్ల మందికి పైగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. దీని తర్వాత ఈజిప్ట్ (11 కోట్లు), ఇరాక్, టర్కీ ఉన్నాయి. -
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట: ఆలయాలు శుభ్రం చేస్తున్న ప్రముఖులు (ఫొటోలు)
-
2024 కొత్త కొత్తగా వెల్కమ్
చూస్తూండగానే నూతన సంవత్సరం వచ్చేసింది. 2024కు గ్రాండ్‌గా వెల్కం చెప్పేందుకు అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని దేశాల వారు కొత్త ఏడాదిని స్వాగతిస్తూ పార్టీ మూడ్‌లో ఉంటే.. మరికొన్ని దేశాల వారు ఇంకా రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూనే ఉంటారు. అంతర్జాతీయ టైమ్ జోన్ల ప్రకారం.. ప్రపంచంలో మొట్టమొదటగా న్యూజిలాండ్ సమీపంలోని కిరిబతి దీవుల వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. తర్వాత న్యూజిలాండ్, ఆ్రస్టేలియా స్వాగతం పలుకుతాయి. ఇదే సమయంలో పలు దేశాల్లో ఇంకా డిసెంబర్ 31వ తేదీనే మొదలవుతూ ఉంటుంది. మరి ఇలా ఏయే దేశాలు కొత్త సంవత్సరానికి ముందుగా వెల్కం చెప్తాయో చూద్దామా.. ► ప్రపంచంలో మొదట పసిఫిక్ మహాసముద్రంలోని దీవులైన కిరిబతిలో నూతన సంవత్సరం మొదలవుతుంది. మన దేశంలో డిసెంబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలు అవుతున్న సమయంలోనే.. కిరిబతిలో అర్ధరాత్రి 12.00 గంటలు దాటేసి జనవరి 1 మొదలైపోయింది. మన దేశ సమయంతో పోల్చి చూస్తే, కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే.. ►న్యూజిలాండ్.. మనకు సాయంత్రం 4.30 ►ఆ్రస్టేలియా.. మనకు సాయంత్రం 6.30 ►జపాన్, దక్షిణ కొరియా.. మనకు రాత్రి 8.30 ►చైనా, మలేషియా, సింగపూర్.. మనకు రాత్రి 9.30 ►థాయిలాండ్, వియత్నాం.. మనకు రాత్రి 10.30 ►యూఏఈ, ఒమన్.. మనకు జనవరి 1 వేకువజాము1.30 ► గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్‌్ట.. మనకు వేకువజామున 3.30 ►జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, కాంగో.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 4.30 ►యూకే, ఐర్లాండ్, పోర్చుగల్.. మనకు వేకువన 5.30 ►బ్రెజిల్, అర్జెంటీనా.. మనకు జనవరి 1 ఉదయం 8.30 ►ప్యూర్టోరికో, బెర్ముడా, వెనెజువెలా.. మనకు జనవరి 1 ఉదయం 9.30 ►అమెరికా తూర్పుతీర రాష్ట్రాలు, పెరూ, క్యూబా.. మనకు జనవరి 1 ఉదయం 10.30 ►మెక్సికో, కెనడా, అమెరికా మధ్య రాష్ట్రాలు.. మనకు జనవరి 1 ఉదయం 11.30 ►అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు (లాస్ ఎంజిలిస్, శాన్ఫ్రాన్సిస్కో..).. మనకు జనవరి 1 మధ్యాహ్నం 1.30 ►హవాయ్.. మనకు 1న మధ్యాహ్నం ఉదయం 3.30 ►సమోవా దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 4.30 ►బేకర్, హౌలాండ్ దీవులు.. మనకు 1న సాయంత్రం 5.30 సమీపంలోనే ఉన్నా.. ఓ రోజు లేటు.. వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్నా.. ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాతగానీ మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో.. సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. ►దీనివల్ల పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్లైన్ కూడా మెలికలు తిరిగి ఉంటుంది. ►మామూలుగా అయితే.. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవులకన్నా రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా అధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి.. అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. ►ఉదాహరణకు కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలు అవుతుంటే.. దానికన్నా రెండు గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది. ►ఈ కారణంతోనే ప్రపంచంలో అన్ని ప్రాంతాలకన్నా చివరిగా.. ఈ దీవుల్లో కొత్త సంవత్సరం మొదలవుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఇంట్లోనే థియేటర్!
సాక్షి, హైదరాబాద్: భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టీప్లెక్స్‌లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్‌ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. అడ్డంకులు లేని అనుభూతి.. మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచ్చిన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్‌లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో... దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్‌ను 25 శాతం, వెబ్ సిరీస్‌లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే.. మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యత కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్‌ను మించి హోం థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
దేశమంతటా క్రిస్మస్ వెలుగులు.. చర్చిలు శోభాయమానం!
దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని చర్చిల్లో ఆకర్షణీయమైన అలంకరణలు చేశారు. కోల్‌కతాలోని చర్చిలు రంగురంగుల దీపాలతో కళకళలాడాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచారు. క్రిస్మస్తో పాటు రానున్న న్యూ ఇయర్ సందర్భంగా పర్యాటక ప్రదేశాల్లో జనం రద్దీ మరింతగా పెరిగింది. #WATCH | Kerala: Streets of Thiruvananthapuram all decked up with decorative lights on #Christmaseve pic.twitter.com/kn8jam5yqj — ANI (@ANI) December 24, 2023 క్రిస్మస్కు ముందుగానే హిమాచల్‌లోని పర్యాటక ప్రదేశాలకు పర్యాటకుల రాక మొదలయ్యింది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో సోలాంగ్‌లో దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వందలాది వాహనాలు జామ్‌లో చిక్కుకున్నాయి. ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు జామ్ కొనసాగింది. #WATCH | Tamil Nadu: Lighting and decorations at different churches in Ooty on #Christmas Eve. pic.twitter.com/WmM4zsfEDU — ANI (@ANI) December 24, 2023 కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్.. క్రిస్మస్ ఈవ్ వేడుకలతో సందడి చేస్తోంది. భారీ సంఖ్యలో జనం రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేక సామూహిక ప్రార్థనలకు చర్చిలు దీపాలతో ముస్తాబయ్యాయి. పార్క్ స్ట్రీట్‌తో పాటు, హరీష్ ముఖర్జీ రోడ్‌తో సహా కోల్‌కతాలోని ఇతర ప్రదేశాలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా భారీ అలంకరణలు కనిపించాయి. సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చితో పాటు పలు చర్చిలను రంగురంగుల లైట్లతో అలంకరించారు. Uttar Pradesh: Historic Roman Catholic Church in Meerut's Sardhana decked up ahead of Christmas Read @ANI Story | https://t.co/ZTzFuB3dqQ#UttarPradesh #Christmas #RomanCatholicChurch pic.twitter.com/S8hvA0Uch6 — ANI Digital (@ani_digital) December 24, 2023 ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రాత్మక రోమన్ క్యాథలిక్ చర్చ్ క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా అలంకరించారు. ఈ చారిత్రాత్మకమైన చర్చిని బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ అని పిలుస్తారు. ఈ చర్చి ఉత్తర భారతదేశంలో అతిపెద్దది. యూరోపియన్ సైనికుడు వాల్టర్ రెయిన్హార్డ్ సోంబ్రేను వివాహం చేసుకున్న 14 ఏళ్ల ముస్లిం బాలిక బేగం సమ్రు ఈ చర్చిని నిర్మించారని చెబుతుంటారు. #WATCH | J&K: A church in Jammu lit up colourful lights and decorated on #ChristmasEve pic.twitter.com/6QAaKDt4Kr — ANI (@ANI) December 24, 2023 జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. చర్చిల్లో క్రిస్మస్ పాటలు వినిపిస్తున్నాయి. మిజోరంలోని అన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. క్రిస్మస్.. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే పండుగ. ప్రతీయేటా ఈ పండుగను డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! #WATCH | Sacred Heart Cathedral Catholic Church in Delhi lit up and decorated on #Christmas Eve. pic.twitter.com/6ijcMysVEA — ANI (@ANI) December 24, 2023 -
10 ఒళ్లు గగుర్పొడిచే దారుణాలు.. 2023 మిగిల్చిన చేదు గురుతులు!
కొంతమందికి 2023వ సంవత్సరం ఆనందంగా గడిస్తే, మరికొందరికి వారి జీవితంలో అత్యంత భయంకరమైన అనుభవాలను మిగిల్చింది. 2023వ సంవత్సరంలో దేశంలో చోటుచేసుకున్న 10 అత్యంత దారుణాల గురించి ఇప్పుడు చూద్దాం. 1. ఉమేష్ పాల్ హత్య దేశంలో అత్యంత చర్చనీయాంశమైన హత్య కేసుల్లో ఉమేష్ పాల్ హత్య ఒకటి. యూపీలోని ప్రయాగ్‌రాజ్ పరిధిలోని ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ తుపాకీ తూటాలకు హతమయ్యాడు. ఇది యూపీలో గ్యాంగ్ వార్‌ను మరోమారు గుర్తుచేసింది. ఉమేష్ పాల్‌పై బుల్లెట్లు, బాంబులతో దాడి చేసినట్లు సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది. 2. అతిక్, అష్రాఫ్ హత్యలు పూర్వాంచల్ మాఫియా లీడర్లుగా పేరొందిన అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లు ప్రయాగ్‌రాజ్ మెడికల్ కాలేజీ సమీపంలో హత్యకు గురయ్యారు. పోలీసుల సంరక్షణలో ఉన్న అతిక్, అష్రఫ్ అహ్మద్‌లపై దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపి హత్యచేశారు. పోలీసు కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్‌తో ఒక జర్నలిస్టు మాట్లాడుతుండగా నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు పోలీసులకు పట్టబడ్డారు. 3. నిక్కీ యాదవ్ దారుణ హత్య ఢిల్లీలో నిక్కీ యాదవ్ హత్య.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి 10న నిక్కీ యాదవ్‌ను ఆమె ప్రియుడు సాహిల్ గొంతుకోసి హత్య చేశాడు. సాహిల్ ఫిబ్రవరి 10న ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న నిక్కీ అతనితో గొడవ పడింది. సాహిల్ కోపంతో నిక్కీని గొంతుకోసి హత్య చేశాడు. తరువాత నిక్కీ మృతదేహాన్ని తన దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. అనంతరం రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో ఉంది. 4. రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుని హత్య రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. సుఖ్‌దేవ్ సింగ్‌ను అంతమొందించే ప్లాన్‌తో వచ్చిన ఇద్దరు ముష్కరులు అతని ఇంటిలో కాసేపు కూర్చుని మాట్లాడారు. తరువాత వారిద్దరూ తమ తుపాకీలను తీసి సుఖ్‌దేవ్ సింగ్‌పై కాల్పులు జరిపారు. దీంతో సుఖ్‌దేవ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతలో నిందితులు అక్కడి నుండి పారిపోయారు. అయితే నిందితులను చండీగఢ్‌లోని సెక్టార్ -22లో ఉన్న హోటల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. 5. మైనర్ బాలిక దారుణ హత్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఓ మైనర్ బాలిక దారుణ హత్య దేశాన్ని కుదిపేసింది. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. దానిలో నిందితుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేస్తున్నా అక్కడున్న ఎవరూ పట్టించుకోకపోవడం కనిపిస్తుంది. నిందితుడు సాహిల్ ఈ 16 ఏళ్ల మైనర్‌పై 20 సార్లు కత్తులతో దాడి చేశాడు. తరువాత ఆ బాలికను రాయితో మోది హత్య చేశాడు. 6. డియోరియా ఊచకోత యూపీలోని డియోరియా జిల్లా రుద్రాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా మొత్తం ఆరుగురి హత్య దేశాన్ని కుదిపేసింది. భూ వివాదాల కారణంగానే ఈ హత్య జరిగింది. ఇందులో ఒక పార్టీకి చెందిన సత్య ప్రకాష్ దూబే, ఆయన భార్య కిరణ్, కుమార్తె సలోని, నందిని, కుమారుడు గాంధీ హత్యకు గురయ్యారు. జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు ప్రేమ్ యాదవ్ కూడా హత్యకు గురయ్యారు. 7. కానిస్టేబుల్ కాల్పులు జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో ఆర్పిఎఫ్ జవాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటన ఈ సంవత్సరం కలకలం రేపింది. జూలై 31 ఉదయం, జైపూర్-ముంబై రైలులో ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సీనియర్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన వాపి, బోరివాలి మీరా రోడ్ స్టేషన్ల మధ్య జరిగింది. 8. లక్నో కోర్టులో బుల్లెట్ల శబ్దం యూపీలోని లక్నోలోని కోర్టులో గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను కాల్చి చంపారు. జూన్ 7న విచారణ కోసం గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను లక్నో కోర్టుకు తీసుకువచ్చారు. ఇంతలో లాయర్ల వేషంలో వచ్చిన దుండగులు కోర్టు ఆవరణలోనే సంజీవ్ జీవాపై కాల్పులు జరిపారు. సంజీవ్ జీవా అక్కడికక్కడే మృతిచెందాడు. సంజీవ్ జీవా ముజఫర్‌నగర్ నివాసి. లక్నో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 9. రూ.350 కోసం దారుణ హత్య కేవలం రూ.350 కోసం 16 ఏళ్ల యువకుడు మరో టీనేజర్‌ను అత్యంత దారుణంగా అంతమొందించాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. టీనేజర్ తల, మెడపై నిందితుడు 60 సార్లు కత్తితో పొడిచాడు. ప్రాణాలు కోల్పోయిన టీనేజర్‌ను చూసి ఆ యువకుడు డ్యాన్స్ చేయటం సీసీటీవీ వీడియోలో కనపడింది. ఈ దారుణ హత్యకు పాల్పడిన 16 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10. పట్టపగలు దుకాణదారుని హత్య పంజాబ్‌లోని భటిండాలో పట్టపగలు ఓ దుకాణదారుని కాల్చి చంపిన ఉదంతం దేశాన్ని కుదిపేసింది. ఈ హత్య ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో దుకాణదారుడు హర్జిందర్ సింగ్ అలియాస్ మేలా తన దుకాణం ముందు కుర్చీలో కూర్చున్నట్లు ఈ సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తుంది. ఇంతలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగులు వచ్చి పిస్టల్స్‌తో హర్జిందర్‌పై కాల్పులు జరిపారు. దుండగులిద్దరూ ముఖాలకు మాస్క్‌లు కప్పుకున్నారు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం దుండగులిద్దరూ బైక్‌పై పారిపోయారు. బాధితుడు హర్జిందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇది కూడా చదవండి: 2023 సామాన్యునికి ఏమిచ్చింది? -
Covid: యాక్టివ్ కేసులు అక్కడే ఎక్కువ
న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 341 కొత్త కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. మృతి చెందిన ముగ్గురు కేరళకు చెందిన వారే. దేశంలో ప్రస్తుతం 2311 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో ఒక్క కేరళలోనే 2041 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ,మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ జేఎన్1 కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం(డిసెంబర్ 20) కరోనా కేసులు పెరుగుతండడంపై ఉన్నతస్థాయి సమీక్షనిర్వహించనుంది. ఈ సమీక్ష అనంతరం ఆరోగ్య శాఖ అధికారులు కొత్త వేరియెంట్ వ్యాప్తిపై మరిన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇదీచదవండి..ఈ ఏడాది ఈమె టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ.. -
నిత్యానంద కైలాసతో ఒప్పందాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
బ్యూనస్ ఎయిర్: నిత్యానంద ప్రకటించుకున్న 'యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస' ప్రత్యేక దేశంతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే దేశ అధికారి తన పదవిని కోల్పోయాడు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తనను మోసం చేసినట్లు ఆ పరాగ్వే అధికారి చెప్పారు. ఆర్నాల్డ్ చమోర్రో వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రధాన అధికారిగా పనిచేస్తున్నారు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తన వద్దకు వచ్చారు. కైలాసతో దౌత్య సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయించుకున్నారు. అంతేకాకుండా కైలాసకు ఐక్యారాజ్య సమితి గుర్తింపు తెప్పించడానికి సంబంధించిన పత్రాలపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. పరాగ్వే వ్యవసాయ మంత్రి కార్లోస్ గిమెనేజ్ను కూడా కలిశారు. నిత్యానంద దేశంతో ఒప్పందం వ్వవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పరాగ్వేలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో వివిధ కేసుల్లో నిందితునిగా ఉన్న నిత్యానందతో ఒప్పందం చేసుకోవడాన్ని ప్రజలు ప్రశ్నించారు. ఇక చేసేదేమి లేక ఒప్పందాలపై సంతకాలు చేసిన వ్యవసాయ శాఖ అధికారి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన
దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 28న దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో చలి మరింతగా పెరగనుంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం మహారాష్ట్ర, గోవా, కొంకణ్‌తో పాటు అనేక ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలో కూడా వర్షాలు కురవనున్నాయి. రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నవంబర్ 27న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 27న పశ్చిమ యూపీలోని పలు జిల్లాలు, తూర్పు యూపీలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుండగా శనివారం రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో గాలి నాణ్యత మెరుగుపడింది. అయితే ఇది ఇప్పటికీ ‘తీవ్రమైన’, ‘చాలా పేలవమైన’ విభాగంలోనే ఉంది. ఆదివారం నుండి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారం అందించే ఏజెన్సీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: 26/11 తరువాత ముంబై రైల్వే స్టేషన్ల పరిస్థితి ఇదే.. -
బొగ్గును మించిన నల్లని నది ఏది? కారణమేమిటి?
ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ వందల కొద్దీ నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో కొన్ని నదుల నీరు శుభ్రంగా ఉంటుంది. మరికొన్ని నదుల నీరు మురికిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బొగ్గుకన్నా నల్లగా ఉండే నది గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లని నదిగా పేరొందింది. ఈ నదిలో బొగ్గు కన్నా నల్లటి నీరు ప్రవహించడం వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో రుకీ అనే నది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలోని నీరు నల్లగా కనిపించడానికి కారణం.. ఆ నీటిలో కరిగిన సేంద్రియ పదార్థమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డెయిలీ మెయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రుకీ నదిలోని నీటితో కనీసం చేతులు కడుక్కునేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు ఈ నదికి సంబంధించిన తమ శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రపంచానికి అందించారు. నదిలోని నీటికి నలుపు రంగు రావడానికి కారణం వర్షారణ్యం నుండి సేంద్రియ పదార్థాలు వచ్చి, ఈ నీటిలో కలవడమేనని నిపుణులు చెబుతున్నారు. కాగా ఆఫ్రికన్ దేశమైన కాంగోలో స్విట్జర్లాండ్ కంటే నాలుగు రెట్లు అధికమైన డ్రైనేజీ బేసిన్ ఉంది. దీనిలో కుళ్ళిన చెట్లు, మొక్కల నుండి వచ్చే కార్బన్ సమ్మేళనాలు పేరుకుపోతున్నాయి. ఇవి వర్షాలు, వరదల కారణంగా నదులలోకి చేరుకుంటున్నాయి. నీటిలో కరిగిన ఇటువంటి కార్బన్ సమ్మేళనాల సాంద్రత అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డార్క్ టీ మాదిరిగా కనిపిస్తుంది. దీనికితోడు రుకీ నది.. అమెజాన్ రియో నెగ్రా కంటే 1.5 రెట్లు లోతుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నల్ల నీటి నదిగా పేరొందింది. రుకీ బేసిన్ దిగువన పెద్ద మొత్తంలో పీట్ బోగ్ మట్టి ఉంది. కాంగో బేసిన్‌లోని పీట్ బోగ్లలో సుమారు 29 బిలియన్ టన్నుల కార్బన్ ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా? -
ఎస్సీలకు సాయంలో రాష్ట్రం మేటి
సాక్షి, అమరావతి: మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే అట్టడుగు వర్గాలకు ఎంత మేలు జరుగుతుందో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన నిరూపిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఉన్నతికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ వర్గాల సాధికారతకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక అమలు, దాని ద్వారా ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి మూడు నెలల్లోనే మరే రాష్ట్రం అమలు చేయని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ ఉప ప్రణాళికను అమలు చేసిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల మంజూరు, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో, పట్టణ గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనపరిచిందని ఆ శాఖ విడుదల చేసిన నివేదికలో ప్రశంసించింది. 2023–24 తొలి తైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) వివిధ రాష్ట్రాల పథకాల లక్ష్యాలు, అమలు తీరును నివేదిక వివరించింది. లక్ష్యాల్లో 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాలు చాలా మంచి పనితీరు కనబరిచినట్లు, 80 నుంచి 90 శాతం అమలు చేసిన రాష్ట్రాలు మంచి పనితీరు కనపరిచినట్లు, 80 శాతం లోపు అమలు చేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక వర్గీకరించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏపీతో సహా 16 రాష్ల్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 14,54,481 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందగా, వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 14,43,619 కుటుంబాలకు సహాయం అందినట్లు నివేదిక స్పష్టం చేసింది. మిగతా ఏ రాష్ట్రంలోనూ కనీసం 10 వేల మందికి కూడా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించలేదని ఆ నివేదికను పరిశీలిస్తే అర్ధమవుతుంది. దేశంలోని రాష్ట్రాలన్నీ కలిపి 14,39,152 మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించగా అందులో సగం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,15,872 మంది ఎస్సీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల ద్వారా సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. గృహ నిర్మాణంలో, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ ప్రథమ స్థానం పేదల గృహాల నిర్మాణంలో, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ రాష్ట్రమే ముందుందని ఆ నివేదిక పేర్కొంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కింద పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా మొత్తం 1.01 లక్షల గృహాల నిర్మాణం జరగ్గా, వాటిలో ఒక్క ఆంద్రఫ్రదేశ్‌లోనే 66,206 గృహాల నిర్మాణం చేసి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో లక్ష్యానికి మించి రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం. తొలి త్రైమాసికంలో 6,213 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా, 19,085 కనెక్షన్లు ఇచి్చనట్లు నివేదిక వెల్లడించింది. అంటే లక్ష్యానికి మించి 307 శాతం అధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచి్చనట్లు వివరించింది. అలాగే రాష్ట్రంలో ఐసీడీఎస్‌లు, అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు నివేదిక ప్రశంసించింది. -
200 ద్వీపాలు గల దేశం ఏది? సందర్శనలో భారతీయులకు వెసులుబాటు ఏమిటి?
భారతదేశంలో ఏ ముస్లిం గురించి మాట్లాడినా, మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు పాకిస్తాన్. అయితే ఇదే సందర్భంలో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న దేశం పాకిస్తాన్ కాదు. మనం ఇప్పుడు మాల్దీవులకు సంబంధించిన ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మాల్దీవులు ఆసియాలోనే అతి చిన్న దేశం. దీని వైశాల్యం 298 చదరపు కిలోమీటర్లు. ఈ దేశ జనాభా లక్షల సంఖ్యలో మాత్రమే ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు మాల్దీవుల జనాభా విషయానికొస్తే 2016 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా దాదాపు 4 లక్షల 28 వేలు. అయితే 2021లో ఇక్కడి జనాభా 5.21 లక్షలుగా అంచనా వేశారు. మాల్దీవులలో సుమారు 212 ద్వీపాలు ఉన్నాయి. వాటిలో సుమారు 200 ద్వీపాలు స్థానిక జనాభాకు కేటాయించారు. 12 ద్వీపాలను పర్యాటకుల కోసం కేటాయించారు. భారతీయులు మాల్దీవులకు వెళ్లాలనుకుంటే వీసా అవసరం లేదు. మాల్దీవులకు వెళ్లే వారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో ఉంది. అంటే ఇక్కడి విమానాశ్రయంలో దిగగానే 30 నుంచి 90 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీసా లభిస్తుంది. అయితే చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, మాల్దీవులలోని హోటల్లో బస చేసినట్లు రుజువు కలిగి ఉండాలి. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం ఇస్లాం మతాన్ని విశ్వసించే వారు మాత్రమే మాల్దీవుల పౌరులవుతారు. అంటే ఇక్కడ ఉండే ముస్లింలకు మాత్రమే స్థానిక పౌరసత్వం లభిస్తుంది. మాల్దీవుల రాజ్యాంగంలోని వివరాల ప్రకారం సున్నీ ఇస్లాం ఇక్కడ జాతీయమతం. ముస్లిమేతరులెవరికీ ఈ దేశ పౌరసత్వం ఇవ్వకూడదని కూడా ఈ రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వ నియమాలు కూడా ఇస్లామిక్ చట్టంపై ఆధారపడి ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: హమాస్‌లో ‘మ్యాన్ ఆఫ్ డెత్’ ఎవరు? -
‘మామిడి’లో మనమే ఘనం
సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు. నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో హెక్టార్‌కు సగటున 9.6 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో హెక్టార్‌కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఒడిశాలో హెక్టార్‌కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్ ప్రాసెస్ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచాల్సి ఉంది. ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి. ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్‌లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్యమైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్‌లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్ ఎంఎస్‌ఎంఈలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్‌ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్‌గ్రేడేషన్ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్వర్డ్ లింక్‌లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. -
ఆ దేశంలో ప్రతి ఆరు నెలలకూ ఎన్నికలు!
మనదేశంలో ఏడాది పొడవునా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ దేశంలో మాత్రం ఎన్నికలు ఆరునెలలకు ఒకసారి! ఏమిటా దేశం? ఎక్కడుంది? పనిలో పనిగా మొదటిసారి అక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగాయో కూడా తెలుసుకుందామా? ప్రతి ఆరునెలలకు ఎన్నికలు జరిగే దేశం యూరప్ ఖండంలో ఉంది. పేరు శాన్ మారినో. ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం. జనాభా దాదాపు 34 వేలు. ఏడాదిలో రెండుసార్లు ఎన్నికలు జరగడం.. ఫలితాలు వెలువడిన తరువాత అధ్యక్షుడు మారడం ఇక్కడ సర్వసాధారణం. ఎన్నికైన దేశాధినేతను ఆ దేశ ప్రజలు కెప్టెన్-రీజెంట్ అని పిలుస్తారు. గ్రేట్, జనరల్ కౌన్సిల్‌లోని 60 మంది సభ్యులు కెప్టెన్ రీజెంట్‌ను ఎన్నుకుంటారు. ఇక్కడి పార్లమెంటును ఆరంగో అంటారు. శాన్ మారినోలో మొట్టమొదటి ఎన్నికలు క్రీస్తు శకం 1243లో జరిగాయి. ఈ దేశ రాజ్యాంగం 1600 నుంచి అమల్లోకి వచ్చింది. దేశం మొత్తం విస్తీర్ణం కేవలం 61 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది ఇటలీ పొరుగు దేశం. ఇటలీ సంస్కృతి, భాష ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌కు ధర్మశాలతో సంబంధం ఏమిటి? -
రాష్రంలో మహిళలే ఎక్కువ
దేశంలో అత్యధిక మహిళలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళలు 1,030 మంది ఉన్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను చూస్తే 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, అమరావతి దేశంలో పట్టణాలు ,గ్రామాల్లో పరిస్థితి ఇది దేశంలో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 941 మంది స్త్రీలు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 947 మంది స్త్రీలు ఏపీలో పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,030 మంది స్త్రీలు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,017 మంది స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,035 మంది స్త్రీలు -
యూదుల ప్రత్యేక దేశాన్ని గాంధీ ఎందుకు వ్యతిరేకించారు?
హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటివరకు 3000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించి ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపాయి. భారత్ కూడా ఇజ్రాయెల్‌కు అండగా నిలిచింది. అయితే ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై నాటి రోజుల్లో మహాత్మా గాంధీ ఏమన్నారు? పాలస్తీనాలో ప్రత్యేక యూదు దేశస్థాపనను గాంధీ ఎందుకు వ్యతిరేకించారు? మహాత్మా గాంధీ 1938, నవంబర్ 26న ‘హరిజన్’ పత్రికలో ‘ది జ్యూస్’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఈ ఆర్టికల్‌లో ‘ఇంగ్లండ్ బ్రిటీష్ వారికి చెందినట్లే, ఫ్రాన్స్ ఫ్రెంచి వారిది. పాలస్తీనా అరబ్బులదని రాశారు. అయితే ఏళ్ల తరబడి యూదులు అణచివేత, వివక్షను ఎదుర్కోవలసి రావడంపై మహాత్మాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ తన వ్యాసంలో ఇలా రాశారు ‘నాకు యూదుల విషయంలో తీవ్రమైన ఆవేదన ఉంది. వీరు క్రైస్తవ సమాజంలో అంటరానివారిగా మిగిలారు. హిందూ సమాజంలో అంటరానితనం సమస్య ఉన్నట్లే, యూదులు కూడా ఈ సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. యూదుల విషయంలో నాజీ జర్మనీ ప్రవర్తించిన హీనమైన తీరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అని అన్నారు. కాగా యూదులను రక్షించడానికి, వారిపై జరుగుతున్న మారణహోమం ఆపడానికి జర్మనీతో యుద్ధాన్ని గాంధీ సమర్థించారు. ‘యూదులను రక్షించడానికి మనం జర్మనీతో పోరాడవలసి వస్తే, అది కూడా పూర్తిగా తార్కికంగా ఉంటుందని’ అన్నారు. పాలస్తీనాలో ప్రత్యేక యూదు రాజ్య స్థాపనను మహాత్మా గాంధీ ఎందుకు వ్యతిరేకించారనే విషయానికొస్తే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం మహాత్మా గాంధీ ఒక వ్యాసంలో ఇలా రాశారు ‘పాలస్తీనాలో యూదుల స్థిరనివాసం కల్పించడం లేదా వారుంటున్న ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తించడం అనేది అరబ్ ప్రజలకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుంది’ అని అన్నారు. ఈ విషయంలో మహాత్మా గాంధీ వ్యతిరేకత రెండు సూత్రాలపై ఆధారపడింది. మొదటిది పాలస్తీనా ఇప్పటికే అరబ్ ప్రజల జన్మస్థలమని గాంధీ విశ్వసించారు. బ్రిటిష్ పాలనలో యూదులను బలవంతంగా అక్కడ స్థిరపడ్డారు. ఇది ఒక విధంగా అరబ్ ప్రజల ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమే. ఇక రెండవది.. ప్రత్యేక దేశం కోసం యూదుల డిమాండ్ తాను అనుసరిస్తున్న శాంతియుత పోరాటానికి విరుద్ధంగా ఉందని గాంధీ భావించారు. అయితే ఆ సమయంలో గాంధీ ఈ అంశాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? -
శాంతియుత దేశం ఏది? అశాంతికి నిలయమెక్కడ? భారత్ పరిస్థితేంటి?
అది.. మొన్నటి అక్టోబర్ 7 నాటి ఉదయం.. ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన హమాస్ ఇజ్రాయెల్‌పై దాడికి దిగినవార్త హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో వేలాది క్షిపణులను హమాస్ ప్రయోగించింది. అక్కడి ప్రజలు ముందురోజు రాత్రిపూట ఎంత ప్రశాంతంగా నిద్రించారో.. మరుసటి రోజు నాటికి విగతజీవులుగా ఎలా మారారో తలచుకుంటేనే ఆవేదన పెల్లుబికి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ప్రపంచంలో శాంతి కరువైపోతున్నదనే భావన అందరిలో కలుగుతుంది. ఏ దేశంలో ఎప్పుడు దాడి జరగవచ్చో అనే ఆందోళన అందరినీ పట్టిపీడిస్తుంది. ఈ ప్రశ్నకు తగిన సమాధానం ఎవరూ చెప్పలేకపోయినా, అందుకు బదులుగా ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన దేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2023లో ప్రపంచంలో అత్యంత శాంతియుతమైన దేశంగా ఐస్లాండ్ గుర్తింపు పొందింది. ఇది 2008 నుండి ఇదే స్థానంలో కొనసాగుతోంది. డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలు కూడా అత్యంత శాంతియుత దేశాల జాబితాలో ఉన్నాయి. 2023లో ప్రపంచంలో అత్యల్ప శాంతియుత దేశం ఆఫ్ఘనిస్తాన్. వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇదే స్థాయిలో ఉంది. యెమెన్, సిరియా, సౌత్ సూడాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు మరో నాలుగు తక్కువ శాంతియుత దేశాల జాబితాలో చేరాయి. అత్యధిక జనాభా కలిగిన భారత దేశం 2023 గ్లోబల్ పీస్ ఇండెక్స్ (జీపీటీ)లో 126వ అత్యంత శాంతియుత దేశంగా ఉంది. హింసాత్మక నేరాలు తగ్గుముఖం, పొరుగు దేశాలతో సంబంధాలు, రాజకీయ అస్థిరత కారణంగా గత ఏడాది దేశంలో శాంతి 3.5 శాతం మెరుగుపడింది. చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కూడా తగ్గింది. ఇది కూడా చదవండి: భారత్-యూరప్ కారిడార్‌తో టర్కీకి ఇబ్బంది ఏమిటి? చైనా సాయంతో ఏం చేయనుంది? -
అతి చిన్న స్వయం ప్రకటిత దేశం ఏది? జనాభా ఎంత?
విదేశీయులు భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారు వివిధ నియమాలను పాటించాల్సివుంటుంది. ఇటీవల కెనడా పౌరులకు భారతదేశం వీసాలపై నిషేధం విధించింది. అంటే ఇప్పుడు ఎవరైనా కెనడాకు చెందిన వ్యక్తి భారత్ వచ్చేందుకు అనుమతి లేదు. ఇతర దేశాల ప్రజలు భారతదేశానికి రావచ్చు. అయితే దీనికి భిన్నంగా.. ఆ దేశంలో ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆ దేశాధ్యక్షుడే స్వయంగా స్వాగతం పలుకుతాడు. కెవిన్ బాగ్ స్వయం ప్రకటిత దేశం. దీనిని రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా అని పిలుస్తారు. ఇది అమెరికాలోని నెవాడా సమీపంలో ఉంది. 30 మంది మనుషులు, 4 కుక్కలు ఉన్న ఈ చిన్న దేశానికి సొంత కరెన్సీ (వలోరా) కూడా ఉంది. 2.28 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బ్యాంక్ ఆఫ్ మొలోసియాలో నాణేలు, ముద్రించిన నోట్లను ఉపయోగిస్తారు. ఈ స్వయం ప్రకటిత దేశంలో కుక్కలకు కూడా పౌరసత్వం లభిస్తుంది. నియంత కెవిన్ బోగ్ తన భార్య, ముగ్గురు పిల్లలతో ఇక్కడ ఉంటున్నాడు. కెవిన్ బోగ్ ఎప్పుడూ సైనిక దుస్తులలో కనిపిస్తాడు. అతను తనను తాను స్వతంత్ర దేశానికి పాలకునిగా చెప్పుకుంటూ, దేశానికి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలుకుతాడు. 1990లలో రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా తూర్పు జర్మనీపై యుద్ధం ప్రకటించింది. 2006లో రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా ముస్టాచెస్టన్ అనే మరో మైక్రోనేషన్తో యుద్ధం చేసింది. దీనిలో కెవిన్ బాగ్ గెలిచాడు. బదులుగా ముస్టాచెస్టన్ పాలకుడు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. 2010లో ఈ చిన్న ‘దేశం’ మరో మైక్రోనేషన్తో యుద్ధం చేసింది. రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా తన జాతీయ గీతాన్ని రెండుసార్లు మార్చింది. ఈ దేశపు జెండా నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉంటుంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? -
పరిశోధనలపై దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దిగ్గజాలుగా ఎదగాలంటే పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు పెద్ద పీట వేయాలని దేశీ ఫార్మా పరిశ్రమకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. వినూత్న ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్ల కోసం కీలక యంత్రపరికరాలను తయారు చేయాలని అటు మెడికల్ టెక్నాలజీ కంపెనీలకు సూచించారు. ఫార్మా–మెడ్ టెక్ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి, నవకల్పనలపై జాతీయ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు తమ లాభాల్లో 20–25 శాతాన్ని పరిశోధన, ఆవిష్కరణలపై వెచ్చిస్తుంటాయి. కానీ దేశీ కంపెనీలు సుమారు 10 శాతమే వెచ్చిస్తున్నాయి. మనం పరిశోధన ఆధారిత వినూత్న ఉత్పత్తులను తయారు చేయనంతవరకూ అంతర్జాతీయంగా ఈ విభాగానికి సారథ్యం వహించలేము‘ అని ఆయన చెప్పారు. 2047 నాటికి ఫార్మా పరిశ్రమ స్వావలంబన సాధించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. నాణ్యత కూడా ముఖ్యమే.. భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడమే కాకుండా ఉత్పత్తుల నాణ్యతపై కూడా ఫార్మా పరిశ్రమ దృష్టి పెట్టాలని మాండవీయ చెప్పారు. మరోవైపు, ఫార్మా మెడ్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే పథకాన్ని (పీఆర్ఐపీ) కూడా కేంద్రం ఆవిష్కరించింది. ఈ స్కీము బడ్జెట్ రూ. 5,000 కోట్లని మాండవీయ చెప్పారు. పరిమాణంపరంగా 50 బిలియన్ డాలర్లతో భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో 120–130 బిలియన్ డాలర్లకు ఎదగగలదని అంచనాలు ఉన్నాయి. -
తల తీయడం మొదలు తుపాకీతో కాల్చడం వరకూ.. ఏ దేశంలో ఎటువంటి మరణశిక్ష?
ప్రపంచంలోని వివిధ దేశాలలో ఒకే రకమైన నేరానికి వేర్వేరు శిక్షల నిబంధన కనిపిస్తుంది. చిన్న నేరాలకు సైతం కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే దేశాలు అనేకం ఉన్నాయి. హత్య, అత్యాచారం, వికృత హింస వంటి తీవ్రమైన నేరాలకు మరణశిక్ష విధించే నిబంధన చాలా దేశాలలో అమలులో ఉంది. అయితే ప్రపంచంలోని వివిధ దేశాలు మరణశిక్షకు సంబంధించి వివిధ పద్ధతులను అనుసరిస్తాయి. భారతదేశంలో ఉరి ద్వారా మరణశిక్ష విధిస్తారు. ఈ శిక్ష విధించినప్పుడు దోషిని జైలులోనే ఉరితీస్తారు. తుపాకీతో కాల్చి.. బీబీసీ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 58 దేశాల్లో మరణశిక్ష పడిన ఖైదీలకు ఉరి తీస్తారు. అయితే మరణశిక్ష విధించేందుకు కొన్ని దేశాలలో తుపాకులను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని 73 దేశాల్లో ఉరిశిక్షపడిన దోషులను తుపాకీతో కాల్చి మరణశిక్ష విధిస్తున్నాయి. కొన్ని దేశాల్లో మరణశిక్ష విధించడానికి పలు విధానాలు ఉన్నాయి. పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి.. ఆఫ్ఘనిస్తాన్, సూడాన్‌తో సహా మొత్తం 6 దేశాల్లో దోషులను రాళ్లతో కొట్టి చంపుతారు. లేదా తుపాకీతో కాల్చడం ద్వారా మరణశిక్ష విధిస్తారు. యెమెన్, బహ్రెయిన్, చిలీ, థాయిలాండ్, ఇండోనేషియా, ఆర్మేనియా వంటి దేశాల్లో కాల్పుల ద్వారా మరణశిక్ష విధిస్తారు. చైనా, ఫిలిప్పీన్స్‌తో సహా ప్రపంచంలోని ఐదు దేశాలలో పాయిజన్ ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధిస్తారు. ప్రపంచంలోని మూడు దేశాల్లో శిరచ్ఛేదం ద్వారా మరణశిక్ష విధిస్తారు. ఇదిలావుంటే ప్రపంచంలోని చాలా దేశాలు మరణశిక్ష నిబంధనను రద్దు చేశాయి. ఈ జాబితాలో 97 దేశాలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: రైలు కదిలేముందు జర్క్ ఎందుకు? న్యూటన్ నియమంతో సంబంధం ఏమిటి? -
సౌర గ్రామాలు పెరిగేనా?
దేశంలోనే తొలిసారిగా సంపూర్ణమైన సోలార్ గ్రామంగా గుజరాత్‌లోని మొడేరా గ్రామాన్ని తీర్చిదిద్దడానికి పోయిన ఏడాది కార్యాచరణ మొదలైంది. అభివృద్ధి, పరిణామాలపై సమీక్ష జరగాల్సివుంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ బృహత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 24×7 అన్నట్లుగా అన్నివేళలా అంతటా సౌరశక్తి వెలుగాలన్నది లక్ష్యం. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కాలుష్యం, భయానకంగా మారుతున్న పర్యావరణం, ప్రబలుతున్న వింత వింత వ్యాధులు, అంతకంతకు పెరుగుతున్న విద్యుత్ ధరలు, తరిగిపోతున్న సహజవనరుల నడుమ సౌరశక్తిని సద్వినియోగం చేసుకొనే దిశగా వేసే ప్రతి అడుగూ ప్రశంసాపాత్రమే. దేశంలో సూర్యదేవాలయాలున్న అతి కొద్ది గ్రామాల్లో మొడేరా ఒకటి. సౌర దీప్తులు దేశంలోని ప్రతి గ్రామంలో విరగబూసినప్పుడే జాతి జ్యోతి మరింతగా వెలుగుతుంది. గుజరాత్ అభివృద్ధి నమూనాను అన్ని రాష్ట్రాలలో ప్రతిస్పందించేలా కేంద్రం కార్యాచరణ చేపట్టాలి. ప్రధాని సొంత రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాలలోనూ సౌర గ్రామాల సంఖ్య పెరగాలి. 2014లో మోదీని దేశ ప్రజలు ప్రధానమంత్రిగా ఎన్నుకున్న కారణాలలో గుజరాత్ అభివృద్ధి కూడా ఒక ముఖ్యమైన అంశం. 2014, 2019లో వరుసగా రెండు సార్లు ప్రధానిగా ఆయనకు ప్రజలు పట్టం కట్టారంటే ఆయనపై పెట్టుకున్న విశ్వాసం మరో ముఖ్య కారణం. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపై నేడు మరింతగా వుంది. మరి కొన్ని నెలలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపు అనుకున్న అభివృద్ధిని సాధించి, ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల్లో భరోసా నింపడం కీలకం. ఈ తొమ్మిదేళ్లలో దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా బిజెపి వశమయ్యాయి. దానికి కారణాలు అనేకం ఉండవచ్చు, తమకు గెలుపునిచ్చిన ప్రజలు కూడా జీవితంలో గెలిచేట్లు, జీవనాలు వెలిగేట్లు చూడడం ఏలికల ముఖ్య బాధ్యత. చాలా వరకూ సహజవనరులను మనిషి తన ఆర్ధిక స్వార్థంతో మట్టుపెట్టాడు. అయినా ఇంకా ఎంతో అమూల్యమైన సహజ సంపద మన చుట్టూ వుంది. ప్రణాళికా బద్ధంగా దానిని సద్వినియోగం చేస్తే జాతి ప్రగతి వేగం ఎన్నోరెట్లు ఊపందుకుంటుంది. సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం అత్యంత ముఖ్యం. ఇప్పటికీ విద్యుత్ సమస్యలు తీరడం లేదు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చినా, వర్షాలు పెరిగినా పల్లెలు చీకట్లోనే మగ్గుతున్నాయి. విద్యుత్ సంస్కరణలు జరగాలని నిపుణులు మొరపెట్టుకుంటున్నా అది అరణ్యరోదనగానే మిగులుతోంది. ఈ క్రమంలో సౌరశక్తిని సద్వినియోగం చేసుకుంటూ సౌరవిద్యుత్ వాడకం పెరిగితే ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి. వృధా డబ్బు ఆదా అవుతుంది. సౌర శక్తి వాడకంపై ఇంకా చాలినంత అవగాహన ప్రజల్లో రాలేదు. సూర్యరశ్మి నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను సౌరవిద్యుత్ అంటారు. 1980దశకం నుంచే సౌర విద్యుత్ వినియోగంపై అడుగులు పడడం మొదలయ్యాయి. ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి.ఇందులో కర్ణాటకలోని పావగడ ప్రాంతం తలమానికంగా నిలుస్తోంది. మనిషి మొదలు అనేక జీవరాసులకు అందే శక్తిలో ఎక్కువ భాగం సూర్యుడిదే.ఈ శక్తి అపారమైంది. దీనిని ఇంకా ఎన్నో రెట్లు వాడుకోవాల్సివుంది. సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయి. కాలుష్యం తగ్గిపోతుంది. పర్యావరణం పచ్చగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం ఒక సంవత్సరం పాటు ఉపయోగించే శక్తి కంటే ఒక గంటలో వెలువడే సౌరశక్తి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. సోలార్ వస్తువుల ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉత్పత్తుల వినియోగం పట్ల ఎక్కువమంది శ్రద్ధ చూపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. సోలార్ కార్లు, బైకులు పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు. సౌరశక్తిని నిల్వవుంచే వ్యవస్థలు పెరగాలి. పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను, రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను సౌరశక్తి వినియోగం దిశగా అనుసంధానం చేయడంలో కేంద్రం మరింతగా కదలాలి. ఉత్పాదకతకు ప్రోత్సాహకాలను పెంచాలి. గుజరాత్ లోని మొడేరా తరహా గ్రామాలను దేశంలో పెద్ద స్థాయిలో తయారు చెయ్యాలి.ముఖ్యంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మరింత ఆరోగ్యకరంగా సాగాలి. ప్రత్యక్ష నారాయణుడి ప్రభ దేశంలో ప్రకాశమాన మయ్యేలా గట్టి అడుగులు పడాలి -మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు
ఢిల్లీ: ఇండియా పేరు భారత్‌గా మారితే దేశంలోని వేలాది వెబ్సైట్లకు కష్టాలు మొదలుకానున్నాయి. ఎందుకంటే చాలా వెబ్సైట్లు తమ పేర్లలో .ఇన్ అనే డొమైన్‌ను వాడుతున్నాయి. ఇన్నాళ్లూ ఇండియా పేరు ఉంది కాబట్టే ఇండియా స్పెల్లింగ్‌లోని తొలి రెండు అక్షరాలు అయిన ఐఎన్‌లను ఆయా వెబ్సైట్ల పేరు చివరన పెట్టుకున్నాయి. .ఇన్ డొమైన్‌ను కంట్రీ కోడ్ టాప్ లేయర్ డొమైన్(టీఎల్‌డీ) అంటారు. దేశం పేరు ఇండియా నుంచి భారత్‌కు మారితే .ఇన్ అనే డొమైన్ భారత్ అనే కొత్త పేరును ప్రతిబింబించదు. అçప్పుడు భారత్ అనగానే ఠక్కున స్ఫురించేలా కొత్త టీఎల్‌డీ(డొమైన్)కు మారితే బాగుంటుంది. భారత్ ఇంగ్లిష్ స్పెల్లింగ్‌లోని బీహెచ్ లేదా బీఆర్ ఇంగ్లిష్ అక్షరాలతో కొత్త డొమైన్‌ను వాడాలి. అంటే .బీహెచ్ లేదా .బీఆర్ అని ఉంటే సబబుగా ఉంటుంది. కానీ ఈ రెండు డొమైన్లను ఇప్పటికే వేరే దేశాలకు కేటాయించారు. దీంతో వెబ్సైట్ పేరు చూడగానే ఇది భారత్‌దే అని గుర్తుపట్టేలా ఉండే కొత్త డొమైన్ మనకిప్పుడు అందుబాటులో లేదు. అదే ఇప్పుడు అసలు సమస్య. ఎన్ఐఎక్సై్స వారు ఇన్‌రిజిస్ట్రీ సంస్థ ద్వారా .ఇన్ డొమైన్‌ను రిజిస్టర్ చేశారు. ప్రత్యేకమైన అవసరాల కోసం ఇందులోనే సబ్‌డొమైన్‌లను సృష్టించి కొన్ని సంస్థలకు కేటాయించారు. ఉదాహరణకు జీఓవీ.ఇన్ అనే డొమైన్‌ను భారత ప్రభుత్వ రంగ సంస్థలు వాడుకుంటున్నాయి. ఎంఐఎల్.ఇన్ అనే డొమైన్‌ను దేశ సైన్యం వినియోగిస్తోంది. ఒక్కో డొమైన్ ఒక్కో దేశాన్ని వెంటనే స్ఫురణకు తెచ్చేలా ప్రాచుర్యం పొందాయి. ఉదాహరణకు .సీఎన్ అనగానే చైనా వెబ్సైట్లు, .యూఎస్ అనగానే అమెరికా వెబ్సైట్లు, .యూకే అనగానే బ్రిటన్ వెబ్సైట్లు గుర్తొస్తాయి. భారత్‌లోని చాలా ప్రముఖమైన వెబ్సైట్లు సైతం తమ ఐడెంటిటీ(గుర్తింపు)ను నిలబెట్టుకున్నాయి. మార్కెట్లో ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఒక్కసారిగా డొమైన్ మారిపోతే కొత్త డొమైన్‌తో ఆయా వెబ్సైట్లకు మళ్లీ అంతటి గుర్తింపు రావడం చాలా కష్టం. .బీహెచ్, .బీఆర్ మనకు రావేమో!.బీహెచ్, .బీఆర్ అనే భారత్‌కు సరిగ్గా సరిపోతాయి. కానీ ఇప్పటికే .బీహెచ్ను బహ్రెయిన్ దేశానికి, .బీఆర్‌ను బ్రెజిల్ దేశానికి, .బీటీను భూటాన్‌కు కేటాయించారు. దీనికి మరో పరిష్కారం ఉంది. డొమైన్లోని అక్షరాలను పెంచుకుని .BHARAT, లేదా .BHRT అనే కొత్త డొమైన్‌కు తరలిపోవడమే. కొత్త డొమైన్‌కు మారినాసరే ఆయా వెబ్సైట్లు పాత డొమైన్లనూ కొనసాగించవచ్చు. వీటి నిర్వహణలో వచ్చే ఇబ్బందేమీ లేదు. అయితే ఆయా సంస్థల అసలు వెబ్సైట్ ఏది అనేది గుర్తించడం కష్టమవుతుంది. నకిలీ వెబ్సైట్ల బెడద ఒక్కసారిగా పెరిగిపోతుంది. బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి సమస్య తలెత్తితే ఇక అంతే సంగతులు. కొత్త డొమైన్ ప్రాచుర్యం పొందాక పాత డొమైన్లకు.. ఇవి ఏ దేశానికి చెందినవబ్బా ? అనే కొత్త అనుమానం నెటిజన్లకు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే డొమైన్ పేరు సమస్య ఒక్కటే పొంచి ఉంది. నిజంగానే దేశం పేరు మారితే ఇలాంటి కొత్త రకం సమస్యలు ఏమేం వస్తాయో ఇçప్పుడే చెప్పలేం. చూద్దాం.. ఈ డొమైన్ల కథ ఏ మలుపు తిరుగుతుందో! ఇదీ చదవండి: తెరపైకి భారత్..! -
ఇది దేనికి సంకేతం?
అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న మోదీ సర్కారు అతి త్వరలో మన దేశం పేరును కూడా భారత్‌గా మార్చే ఆలోచనలో ఉందా? జీ 20 దేశాధినేతలకు తాజాగా కేంద్రం లాంఛనంగా పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి హోదాను ఇంగ్లీష్‌లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దేశం పేరు మార్పు దిశగా కేంద్రం నుంచి త్వరలో రానున్న ప్రకటనకు ఇది కచ్చితమైన ముందస్తు సంకేతమేనని అనుమానిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి జీ 20 దేశాధినేతలకు పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్రం పేర్కొనడం రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. కానీ మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న చర్చ నిజానికి చాలాకాలంగా జరుగుతున్నదే... కేంద్రంలో మోదీ సారథ్యంలోని – బీజేపీ సర్కారు కూడా దీన్ని ఎన్నోసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థిస్తూనే వచ్చింది, వస్తోంది. బ్రిటిష్ వలస వాసనలను సమూలంగా వదిలించుకోవాల్సిందేనని పదేపదే చెబుతోంది. ఆ దిశగా ఎన్నో చర్యలు చేపడుతోంది. 150 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ వంటి బ్రిటిష్ జమానా నాటి పేర్లకు భారత్ పేరు చేరుస్తూ తీసుకున్న తాజా నిర్ణయం అలాంటిదే. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లులు ప్రవేశపెడుతూ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న మోదీ సర్కారు, మెజారిటీ ఓటర్ల భావోద్వేగాలతో ముడిపడ్డ ఇలాంటి మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని పరిశీలకులు అప్పుడే అభిప్రాయపడ్డారు. ఆ అంచనాలు సత్య దూరం కాదనేందుకు తాజా ’ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ ఆహ్వానాలే నిదర్శనమని భావిస్తున్నారు. ఒకటో అధికరణాన్నే మార్చేయాలి! ఈ నేపథ్యంలో దేశం పేరు మార్పుకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగంలోని తొలి అధికరణే మన దేశాన్ని ’ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్య’ అని స్పష్టంగా పేర్కొంటోంది. అంటే, ఇండియా, భారత్ రెండింటినీ మన దేశ అధికారిక నామాలుగా ఒకటో అధికరణే గుర్తిస్తోందన్నది ఇక్కడ ఆసక్తికర అంశం. ఇప్పుడు వాటిలోంచి ఇండియాను తొలగిస్తూ, భారత్‌ను మాత్రమే ఏకైక అధికారిక నామంగా గుర్తించాలని కేంద్రం భావిస్తోందా అన్నది ఇక్కడ కీలకమైన అంశం. అలా జరగాలంటే ఆ మేరకు ఒకటో అధికరణాన్ని సవరించాల్సి ఉంటుంది. నచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు ‘భారతా? ఇండియానా? మన దేశాన్ని భారత్ అని పిలుచుకుంటారా? భేషుగ్గా పిలుచుకోండి.అదే సమయంలో ఎవరన్నా ఇండియా అని పిలవాలని అనుకుంటే అలాగే పిలవనివ్వండి‘– 2016లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్య గట్టిగా వ్యతిరేకించిన సుప్రీంకోర్టు మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న యోచనను సుప్రీంకోర్టు గట్టిగా వ్యతిరేకించడం విశేషం. ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ 2016లో దాఖలైన పిల్‌ను నాటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించే సమస్యే లేదని కుండబద్దలు కొట్టింది. 2020లో కూడా ఇలాంటి మరో పిల్‌ను తిరస్కరించింది. దాన్ని విజ్ఞాపనగా మార్చి సరైన నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నాటి సీజేఐ జస్టిస్ ఎస్ ఏ బొబ్డే సూచించారు. జంబూ ద్వీపం నుంచి ఇండియా దాకా.. అతి ప్రాచీనమని భావించే జంబూ ద్వీపం మొదలుకుని భారత్, హిందూస్తాన్ నుంచి ఇండియా దాకా. ఎన్నో, మరెన్నో పేర్లు. మన దేశానికి ఉన్నన్ని పేర్లు ప్రపంచంలో మరే దేశానికీ లేవేమో! ఇంగ్లీష్ వాడకంలో మన దేశాన్ని ఇండియా అని, స్థానికులు భారత్ అని అంటారు. పాలక వర్గం ఇండియా అని, పాలిత (సామాన్య) వర్గం భారత్ అని అంటారు. జంబూ ద్వీపం పురాణాలు, ప్రాచీన గ్రంథాలలో మన దేశాన్ని జంబూ ద్వీపం అన్నారు. జంబూ అంటే నేరేడు పండు. అప్పట్లో మన దేశంలో ఆ చెట్లు విస్తారంగా ఉండేవి గనుక ఆ పేరు వచ్చిందని అంటారు. నాటి మన సువిశాల దేశపు ఆకృతి కూడా నేరేడు ఫలం మాదిరే ఉండేదని, అందుకే ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. చైనా యాత్రికుడు ఫాహియాన్ కూడా మన దేశాన్ని అదే పేరుతో ప్రస్తావించడం విశేషం. ‘జంబూ ద్వీపం ఉత్తరాన విశాలంగా, దక్షిణాన సన్నగా ఉంటుంది. అక్కడి ప్రజల ముఖాలు అలాగే ఉంటాయి‘ అని తన యాత్రా చరిత్రలో రాసుకొచ్చాడు. హిందూస్తాన్, ఇండియా బ్రిటిష్ వలస పాలన దాకా మనకు హిందూస్తాన్ అనే పేరు వాడుకలో ఉండేది. తర్వాత బ్రిటిష్ వారు మన దేశం పేరును ఇండియాగా మార్చారు. ఈ రెండు పేర్లూ సింధు నది నుంచి వచ్చి నట్టు చెబుతారు. నాటి భారత ఉప ఖండానికి సింధు నది సరిహద్దుగా ఉండేది. దానికి ఈవలి వైపున ఉన్న దేశం అనే అర్థంలో తొలుత తురుషు్కలు ముఖ్యంగా పర్షియన్లు మనను హిందూస్తాన్ అని పిలిచారు. సింధులో ‘స’ అక్షరాన్ని వాళ్లు ‘హ’గా పలుకుతారు గనుక అలా పేరు పెట్టారు. అలా సనాతన ధర్మం పేరు హిందూ మతంగా మారింది. భారత్ భరతుడనే పౌరాణిక చక్రవర్తి పేరిట మన దేశానికి భారత్ అని పేరు వచ్చి నట్టు ఐతిహ్యం. విశ్వామిత్రుడు, మేనక సంతానంగా పుట్టి ముని కన్యగా పెరిగిన శకుంతలకు, మహారాజు దుష్యంతునికి పుట్టినవాడే భరతుడు. -
కళలు అనే వర్షం కావాలి! అప్పుడే..
అన్నార్భవంతు భూతాని... అసలు ప్రాణుల పుట్టుకకు, మనుగడకు అన్నం కావాలి. అన్నం దొరకాలంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. ఆకాశంలో నుంచి పడిన వర్షంతో భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్లు, ఒక దేశసంస్కృతి నిలబడాలంటే కళలు.. అనే వర్షం కావాలి. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. సంస్కృతి పెరిగితే ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలి, నడవడిక, ఆ దేశపు కీర్తిప్రతిష్ఠలు నిర్ణయింప బడతాయి. కళలు... అంటే కవిత్వం, శిల్పం, నృత్యం, వాద్యం.. ఎప్పుడూ అవతలివారికి సంస్కృతిని కల్పించేవి అయి ఉంటాయి. ఇవన్నీ కళలు కాబట్టి ఇవి వర్షం లాంటివి. అవి సంస్కృతిని మొలకెత్తించడానికి కారణం కావాలి. మన దేశానికి ఇన్ని కీర్తిప్రతిష్ఠలు రావడానికి కారణం ఏమిటి? భగవద్గీత పుట్టిన భూమి. రామాయణం, భారతం, భాగవతం వంటివి పుట్టిన భూమి. గంగానది ప్రవహిస్తున్న భూమి. ఒకనాడు తాళంకప్ప అవసరం తెలియని భూమి. సంస్కృత భాషలో తాళం కప్ప అన్నదానికి పదం లేదు.. ఆ అవసరం రాలేదు. కారణం – పరద్రవ్యాణి లోష్ఠవత్... రహదారిమీద రాయి దొరికితే నాది కాదు అని ఎలా అంటామో అలాగే నాది కానిదేదీ, పరవాడివస్తువు ఏదయినా నాకు దొరికితే నాది కాదు కాబట్టి అది నాకు రాయితో సమానమే... అన్న భావన. అదీ ఈ దేశ సంస్కృతి. ఇది ఎక్కడినుంచి వచ్చింది? రామాయణంలో నుంచి, భారతంలోంచి.. వచ్చింది. నీదికానిది నీవు కోరుకుంటే .. పతనమయి పోతావన్న హెచ్చరిక... దాని జోలికి వెళ్ళనీయదు. కళలు ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబించేవి అయి ఉంటాయి. మీరు ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, మనశ్శాంతికి కారకమైన భగవంతుని తత్త్వాన్ని ఆవిష్కరింపచేసేవిగా ఉంటాయి. ఒక నృత్యం జరుగుతోంది. ‘కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభమ్ నాసాగ్రే నవమౌక్తికమ్...’ అంటూ సాగుతున్న కీర్తనకు నర్తకి అభినయిస్తుంటే నర్తకి క్రమేణా కనుమరుగై కృష్ణపరమాత్మ కనబడడం మొదలవుతుంది. పాట అభినయంగా మీకు శ్రీకృష్ణ దర్శనం చేయించి, మీ ఉద్వేగాలను శాంతపరుస్తుంది. పాలగిన్నె కింద అగ్నిహోత్రం పెడితే పాలు పొంగుతాయి. నీళ్ళు చల్లితే పొంగు చల్లారుతుంది. అలా మనదేశంలో ఉన్న కళలు మన భావోద్వేగాలను అణచి ప్రశాంతతను, మనశ్శాంతిని కల్పించడానికి ఉపయుక్తమయ్యాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని, ఆదరణనూ పొందాయి. ఈ కళలన్నీ శాంతిని ప్రసాదించగల దివ్యత్వాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ కూడా వేదాలకు ఉపవేదాలయినటువంటి వాటి నుంచి వచ్చాయి. సామవేదానికి గాంధర్వ వేదం ఉపవేదం. మిగిలినవి ఇతర వేదాలకు ఉపవేదాలు. వేదానాం సామవేదోస్మి... అన్నాడాయన. ఎందుకు అంతస్థాయిని పొందింది? అంటే తినడం ఒక్కటే కాదు, శరీరం పెరగడం ఒక్కటే కాదు ప్రధానం, అది ఎంత అవసరమో, మనసు సంస్కారవంతంగా తయారు కావడం కూడా అంతే ప్రధానం. (చదవండి: మెట్ట వేదాంతం..?) -
పేదరికం పై పైకి!
యూకేను దెబ్బతీసిన కోవిడ్, యుద్ధాలు ప్రపంచదేశాలన్నింటి మాదిరిగానే యూకే కూడా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడింది. ఇక అఫ్గానిస్తాన్ యుద్ధం, ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ల మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఫలితంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీని ప్రభావం యూకేపై కూడా పడింది. – గారెత్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్ (కంచర్ల యాదగిరిరెడ్డి): కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని రకరకా లుగా మార్చేసిందనడంలో సందేహం లేదు! ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. కొందరికి కొత్త ఉద్యోగాలు వస్తే.. ఇంకొందరికి ఉన్నవి ఊడిపోయాయి. ఉద్యోగాలు ఉన్నా వేతనాలు తగ్గా యి. ముఖ్యంగా ప్రపంచం మొత్తమ్మీద పేదరికం పెరిగింది. ప్రపంచ బ్యాంకు మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎలా పెరిగింది? ఎందరు పేదలుగా మారిపోయారు? పేదరికం పెంచిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక మంది ఆదాయాలు పడిపోయాయని, ఫలితంగా దేశంలో 10 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే పేదరికం పెరగడం అనేది కోవిడ్ వల్ల మాత్రమే జరిగిన పరిణామం కాదని, లెక్కలు తప్పడం వల్ల నిన్నమొన్నటివరకూ పేదల సంఖ్య స్పష్టంగా ప్రపంచానికి తెలియలేదని ప్రపంచ బ్యాంకు అంటోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన వ్యయాన్ని లెక్కవేయడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పేదలు తక్కువగా ఉన్నట్లు కనిపించిందని, వాస్తవానికి వీరి సంఖ్య చాలా ఎక్కువని, గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కోవిడ్ వచ్చిపడటంతో పేదరికం మరింత పెరిగిపోయిందని చెబుతోంది. ఉద్యోగాలు, ఆదాయంపై ప్రభావం కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవడం తెలిసిందే. అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం ఇది కేవలం ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామందికి ఆదాయం తగ్గింది. మరికొంతమంది ఇళ్లూ కోల్పోయారు. ఫలితంగా పేదరికమూ పెరిగింది. పేదల్లోని దిగువ 40 శాతం మందికి 2021లో సగటు ఆదాయం 6.7 శాతం తగ్గిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో ధనికులైన 40 శాతం మందిలో ఈ తగ్గుదల కేవలం 2.8 శాతం మాత్రమే. కోవిడ్ దెబ్బ నుంచి కోలుకోలేకపోవడం పేదల ఆదాయం తగ్గేందుకు కారణమైంది. అయితే ధనికుల్లో సగం మంది తమ కష్టాల నుంచి బయటపడటం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం యూకేలో కోవిడ్ దాదాపు ఏడు లక్షల మందిని పేదరికంలోకి నెట్టేసింది. కోవిడ్‌కు ముందు జనాభాలో 15 శాతం మంది పేదరికంలో మగ్గుతుండగా.. తదనంతర పరిస్థితుల్లో ఇది 23 శాతానికి చేరుకోవడం గమనార్హం. అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం 2021లో పేదరికంలో ఉన్న జనాభా 11.6 శాతం. అంటే సుమారు నలభై లక్షల మంది. అయితే కోవిడ్ ముట్టడించిన 2020తో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన అంశం. యూరప్ విషయానికి వస్తే, చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైంది. యూరోపియన్ కమిషన్ ప్రాంతంలో సుమారు కోటీ ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు డిబేటింగ్ యూరప్ సంస్థ చెబుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ మూడొంతుల మంది వేతనాలు తగ్గాయి. దీంతో ఇక్కడ కూడా పేదరికం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా లెక్క అలా.. మనది ఇలా రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ పేదలే అని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కోవిడ్ కంటే ముందు ఇంతకంటే ఎక్కువ ఆదాయమున్న వారు కూడా మహమ్మారి కారణంగా పేదలుగా మారిపోయారని అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారి మోతాదు 7.8 శాతం నుంచి 9.1 శాతానికి చేరుకుందని లెక్క గట్టింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కూడు, గుడ్డ, నీడలకు కావాల్సినంత కూడా సంపాదించలేని వారే పేదలు. ఈ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సగటున 1.90 డాలర్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మన దేశంలో ఈ మూడింటితో పాటు ఆరోగ్యం, విద్య కూడా పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా వర్గీకరిస్తున్నాం. భారత్‌లో పేదరికాన్ని కొలిచేందుకు ‘టెండుల్కర్ మెథడాలజీ’ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం మనిషి మనుగడ సాగిచేందుకు కావాల్సిన కనిష్ట మోతాదు కేలరీలకు అయ్యే ఖర్చుతో పాటు, దుస్తులు, నివసించేందుకు పెట్టే వ్యయాన్ని బట్టి పేదలా? కాదా? అన్న వర్గీకరణ జరుగుతుంది. 2021 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే వీరి సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేతీరున లేదు. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగానూ, కేరళ, పంజాబ్ వంటిచోట్ల తక్కువగానూ ఉంది. 2020లోనే పేదల సంఖ్య సుమారు ఏడు కోట్లకు చేరుకుందని రెండు, మూడేళ్లలోనే ఈ సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబతున్నాయి. 16.3 కోట్ల దిగువ మధ్యతరగతి? రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు పేదలైతే..5.5 డాలర్లు సంపాదించేవారిని దిగువ మధ్య తరగతి వారిగా పరిగణిస్తున్నారు. ఈ వర్గీకరణలోకి వచ్చేవారు దేశం మొత్తమ్మీద 16.3 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. పేదరికంపై నడ్జ్ ఫౌండేషన్ పోరు ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లాభాపేక్ష లేని సంస్థ. పేదరిక నిర్మూలన మా లక్ష్యం. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా నడుపుతున్నాం. వీరికోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాల్లో అమలవుతోంది. సమాజ సేవ చేయాలనుకునే సీఈవో, సీఓఓలకూ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారు 30 మంది సీఈవో, సీఓఓలు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రుణాలిచ్చేందుకు, వడ్డీ సబ్సిడీలు కల్పించేందుకు ఆలోచన చేసి అమలు చేయడం వీరు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.– సుధా శ్రీనివాసన్, సీఈవో,ద నడ్జ్ ఫౌండేషన్ -
మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే..
ఊపిరి వాక్కుగా మారిన కారణంగా శరీరం పడిపోయినా, కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. నిజానికి మనకు సనాతన ధర్మంలో గొప్పది వేదం. వేదం అపౌరుషేయం. ఈశ్వరుడిచేత చెప్పబడినది. ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదం అంత సనాతనమైనది. నా ఊపిరి రెండు కాదు, ఊపిరి తీస్తున్నంతసేపే ‘నేను’ నేనుగా ఉన్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడమంటే మాట్లాడలేను. ఊపిరి విడిచి పెడుతున్నప్పుడు అది వాక్కుగా మారుతుంది. తీసిన ఊపిరులను సమాజ శ్రేయస్సు కోసం వాక్కులుగా మార్చిన వారున్నారు. తామేదీ ఆశించకుండా కేవలం సమాజ శ్రేయస్సే కోరుకున్నారు వారు. భగవంతుడిచ్చిన ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడుతున్నాను, అది నన్ను శాశ్వతుడిని చేస్తుందన్నాడు పోతన. శాశ్వతమైనది పరబ్రహ్మము. దానిలో చేరిపోతాను... అన్నాడు. శంకరాచార్యులవారు శివానందలహరి చేస్తూ..అసలు భక్తికి చివరి మాట ఏది అన్నదానికి సమాధానంగా ... ‘‘అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా/ సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం సింధు స్సరిద్వల్లభమ్/ ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదార వింద ద్వయమ్/ చేతో వృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ’’ అంటారు. నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నదికి రంగు, రుచి ఇవేం ఉండవు. అటువంటి త్యాగమయ జీవితాన్ని గడిపి భగవంతునిలో ప్రవేశించాడు, నది సముద్రంలో కలసిపోయినట్లు కలిసిపోయాడు. కానీ ఆయన మాత్రం లోకంలో చిరస్థాయిగా ఉండిపోయాడు. ఎలా ... వాక్కు కారణంగా. భారతం ద్వారా నన్నయ అలా ఉండిపోయాడు. ఎర్రాప్రగడ, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, రామదాసు... వీళ్ళందరూ అలాగే వాక్కుల కారణంగా ఉండిపోయారు. ఆ వాక్కును కొందరు పద్యరూపంగా, కొందరు గద్యరూపంగా, శ్లోకంగా, పాటగా చెప్పారు. పాటకున్న లక్షణం .. అది సంస్కృతికి మూలకందమై నిలబడుతుంది. భూమినుంచి మొక్కలు పుట్టాలి... అంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. అందుకే గ్రీష్మం తరువాత వర్షరుతువు వస్తుంది. దానిముందు ఆషాఢమాసం ప్రవేశించగానే ప్రతి ఊరిలోనూ అధిష్ఠాన దేవతయిన గ్రామదేవతను దర్శించుకుని నైవేద్యం పెడతారు. ఎందుకు! ఆమె అనుగ్రహంతో నేను ఈ ఊరిలో ఉండి అన్నం తినగలుగుతున్నా... కాబట్టి ఏడాదికొక్కసారి నేను ఆమెకు నైవేద్యం పెట్టాలి. ఆమె భూమికి ఆర్ద్రత కలిగిస్తుంది, వర్షరూపంలో. తడి తగలగానే ఏడాదికి సరిపడా నేను తినగలిగిన అన్నం నాకు దొరుకుతుంది... అన్న భావన. భూమికి తడి తగలకపోతే, ఎండి పడిపోయిన జామ గింజలు, బత్తాయి గింజలు, ధాన్యపు గింజలు ఏవీ మొక్కలుగా పైకి లేవవు. తడి తగలగానే గడ్డిపరకనుంచి మొదలుపెట్టి, భూమికి చేరిన గింజలన్నీ మొక్కలై పెరుగుతాయి. అంటే ఆర్ద్రత ఉండాలి. ప్రాణుల మనుగడకు అది ఆధారం. అలాగే ఒక దేశ సంస్కృతి నిలబడాలంటే... భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్టు, కళలుండాలి. కళలద్వారా సంస్కృతి పెరుగుతుంది. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణంలో వచ్చే రెండో శుక్రవారం ప్రత్యేకత ఏంటి?) -
సీటు రానివారికి టెలీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ, నీట్, జేఈఈ వంటి ప్రముఖ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చి ఎంబీబీఎస్, ఐఐటీ వంటి వాటిల్లో సీటు రాని వారికి మానసిక చికిత్స అందజేసేందుకు 24 గంటల టెలీ కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఆయా పరీక్షలు రాసి కొద్ది మార్కులతో సీట్లు కోల్పోతున్నవారు అనేకమంది ఉంటున్నారు. వీరిలో కొందరు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మానసిక ఆరోగ్యం.. వర్తమాన పరిస్థితుల్లో దాని నిర్వహణ’అనే అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఓ నివేదిక తయారు చేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందజేసింది. వివరాలిలా ఉన్నాయి.. ఆత్మహత్యలు 10 శాతానికి తగ్గాలి పాఠశాలల్లోనూ మానసికంగా కుంగిపోయే విద్యార్థుల కోసం కౌన్సిలర్లను నియమించాలి. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్యను 2030 నాటికి 10 శాతానికి తగ్గించాలి. కేంద్రీకృత సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ, స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. జైళ్లల్లోనూ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మానసిక ఆరోగ్య, సమస్యలను ఆరోగ్య బీమాలో చేర్చాలి. దేశంలో 47 మానసిక చికిత్సాలయాలున్నాయి. అయితే 2017లో ఏర్పాటైన మానసిక ఆరోగ్య చట్టానికి అనుగుణంగా అవి లేవు. ఆ మేరకు వాటిని తీర్చిదిద్దాలి. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మెంటల్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మానసిక చికిత్సకు సంబంధించిన 17 రకాల మందులను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. అవన్నీ మెడికల్ కాలేజీలు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఉన్నాయి. వాటిల్లో కనీసం 13 మందులను ప్రాథమిక ఆసుపత్రి స్థాయికి తీసుకురావాలి. పోలియో చుక్కల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు సినీ తారలు, క్రీడాకారుల వంటి ప్రముఖులతో ప్రచారం చేస్తారు. అలాగే మానసిక సమస్యలకు సంబంధించి కూడా ఆయా రంగాల ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి అవగాహన పెంచాలి. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. స్వయం ఉపాధి పొందుతున్నవారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తర్వాత వేతన జీవులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రైవేట్ రంగం, రైతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2021లో స్వయం ఉపాధికి చెందిన వారి లో 20,237 మంది ఆత్మహత్య చేసుకు న్నారు. వేతన జీవులు 15,870, నిరుద్యోగులు 13,714, విద్యార్థులు 13,089, వ్యా పారస్తులు 12,055, ప్రైవేట్‌రంగ ఉద్యోగులు 11,439, రైతులు 5,318, కూలీలు 5,563 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ తర్వాత మానసిక సమస్యలు 28% పెరిగాయి. 2017లో 1.29 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటే, 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్కహాల్ వల్ల 4.7 శాతం మంది, పొగాకు వల్ల 20.9 శాతం మంది మానసిక సమస్యలకు గురవుతున్నారు. డిప్రెషన్, ఉద్వేగాలు, ఇతరత్రా కారణాలతో 10.9 శాతం మందికి సమస్యలు వస్తున్నాయి. తీవ్రమైన స్కిజోఫ్రేనియా వంటి సమస్యలతో 1.4 శాతం, యాంగ్జయిటీతో 3.2 శాతం, స్ట్రెస్‌తో 3.7 శాతం, ఇతరత్రా ఏదో ఒక మానసిక సమస్యతో 13.7 శాతం బాధపడుతున్నారు. దేశంలో లక్ష జనాభాకు 0.75 మంది మానసిక చికిత్స నిపుణులు ఉన్నారు. అంటే 1.34 లక్షల మంది జనాభాకు ఒక మానసిక చికిత్స నిపుణుడు మాత్రమే ఉన్నారు. ప్రపంచ సగటు 1.7గా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షకు 8.6 మంది మానసిక నిపుణులు ఉన్నారు. . ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్న బడ్జెట్లో రెండు శాతమే మానసిక ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారు. దీన్ని 10 శాతానికి పెంచాలని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక మానసిక రోగుల్లో 85 శాతం మందికి తగిన వైద్యం అందడం లేదు. మానసిక చికిత్సలను ఆయుర్వేద, యోగా పరిధిలోకి తీసుకురావాలి. జిల్లా కేంద్రంగా మానసిక వైద్యం ఉండాలి. మానసిక రోగుల్లో అవగాహన పెంచాలి జిల్లాకొక యువ స్పందన కార్యక్రమం పెట్టి 20 మందిని రిక్రూట్ చేసుకొని ప్రజల్లో మానసిక రోగాలపై అవగాహన పెంచాలి. బ్రిక్స్ దేశాల్లోని దక్షిణాఫ్రికాలో 35.8 శాతం మంది మానసిక సమస్యలున్నవారే. మన దేశంలో 30.1 శాతం మంది ఏదో ఒక మానసిక సమస్యలతో ఉన్నారు. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ, సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ -
వింతజీవుల అకస్మాత్తు దాడులు.. గ్రహాంతరవాసులే అంటున్న జనం!
గ్రహాంతరవాసులు మనం ఉంటున్న భూమి మీద లేదా విశ్వంలోని మరే ఇతర గ్రహం మీదనైనా నివసిస్తున్నారా? ఈ ప్రశ్నకు ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్త కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి గురించి వేల సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. భూమిపై గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి శాస్త్రవేత్తల వాదనలు రెండు రకాలుగా ఉన్నాయి. గ్రహాంతర వాసులు విశ్వంలో ఎక్కడో ఉన్నారని, ఏదో ఒక రోజు తప్పకుండా మన ముందుకు వస్తారని ఒక వర్గం చెబుతుండగా, మరోవర్గం ఈ వాదనను పూర్తిగా ఖండిస్తోంది. పెరూలో 7 అడుగుల వింతజీవులు తాజాగా పెరూ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఆల్టో నానే జిల్లాలో ఇలాంటి ఉదంతం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహాంతరవాసుల పొడవు 7 అడుగులు ఉంది. వాటి కళ్లు పసుపు రంగులో ఉన్నాయి. చూపరులకు ఆ వింత జీవులు భయం గొలుపుతున్నాయి. ఆ వింతజీవిని చూసిన ఓ బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆమెను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. ఎదుటివారి ముఖంపై ‘ఏలియన్స్’ దాడి పెరూలోని ఆల్టో నానే జిల్లా నివాసి ఇక్విటు మాట్లాడుతూ గత కొంతకాలంగా నల్లటి హూడీలు ధరించిన ఈ ‘ఏలియన్లు’ జనాలపై దాడిచేస్తున్నాయని చెప్పారు. అలాగే ఇక్కడి గిరిజన ప్రాంతంలో నివసించే ఇకూటి జాతి ప్రజలు కూడా అకస్మాత్తుగా జనాల మధ్యలోకి వచ్చి, దాడి చేసి పారిపోతున్నారని తెలిపారు. వారు ఎదుటివారి ముఖానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారని, ఇది ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నదని తెలిపారు. 15 ఏళ్ల బాలికపై దాడి నెల రోజుల క్రితం ఆల్టో నానే జిల్లాలో తొలిసారిగా ఏలియన్స్‌గా చెబుతున్న వింత జాతి జీవులు కనిపించాయని అంటున్నారు. వారి దాడుల కారణంగా 15 ఏళ్ల బాలిక గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఈ అమ్మాయి గ్రహాంతరవాసులను చూసి భయపడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ‘వింత జీవుల నుంచి ప్రజలను కాపాడుతున్నాం’ మరోవైపు ఈ జీవులు గ్రహాంతరవాసులా లేదా మరొకరా అనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరికొందరు హుడీ ధరించిన ఇలాంటి జీవిని తమ జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేదని అంటున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే ఆ వింతజీవులు చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాయి. ఆల్టో నానే జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు జైరో రెటెగుయ్ దవిలా మాట్లాడుతూ గ్రహాంతరవాసులుగా కనిపించినవారు ఆ బాలిక మెడపై గాయం చేశారన్నారు. దీంతో రాత్రిపూట తాము కాపలాకాస్తూ, స్థానికులను రక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ వింతజీవులు రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుండటంతో, వారి రూపాన్ని సరిగా గుర్తించలేకపోతున్నామన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఇది కూడా చదవండి: Pakistan Richest Man: కేవలం 500 డాలర్లతో అమెరికా చేరుకుని.. -
భారతీయులు నైగర్‌ను వీడాలని కేంద్రం ఆదేశం..
తిరుగుబాటుతో నైగర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. నైగర్‌లో నెలకొన్న పరిస్థితులను కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోందని విదేశాంక శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ప్రస్తుతం ఆ దేశం నుంచి ఎయిర్‌లైన్స్ వ్యవస్థను నిలిపివేసినట్లు అరిందమ్ బాగ్చి తెలిపారు. భూభాగం గుండా ప్రయాణిస్తున్నవారు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. నైగర్ వెళ్లదలచినవారు కూడా అక్కడ సాధారణ పరిస్థితుల నెలకొనేవరకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. నైగర్‌లో దాదాపు 250 మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. #WATCH | MEA spokesperson Arindam Bagchi says, "Government of India is closely monitoring ongoing developments in Niger. In light of the prevailing situation, Indian nationals whose presence is not essential are advised to leave the country as soon as possible. They may bear in… pic.twitter.com/vjqzqxdyY2 — ANI (@ANI) August 11, 2023 నైగర్‌లో ఉన్న భారతీయులు మన దేశం చేపట్టిన ఇండియన్ మిషన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని, వారందరి బాధ్యతలను ఎంబసీ చూసుకుంటుందని అరిందమ్ బాగ్చి తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న భారతీయుల ప్రయాణానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భూభాగం ద్వారానే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నైగర్ ప్రెసిడెంట్ బజౌమ్‌ను తొలగించినట్లు ఆ దేశ ప్రెసిడెన్షియల్ గార్డ్ సభ్యులు జాతీయ టెలివిజన్‌లో జూలై 26న ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత ప్రెసిడెన్షియల్ గార్డ్‌కు అధిపతిగా పనిచేసిన జనరల్ అబ్దురహమనే ట్చియాని నైజర్కు కొత్త సైనిక నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో తిరుగుబాటు మొదలైంది. ఇదీ చదవండి: Flying Kiss Row: 'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. -
గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, హైదరాబాద్: గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగమన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచడంతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రకటనలో గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆదివాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించడానికి రూ. కోట్లలో నిధులు మంజూరు చేస్తోందని వెల్లడించారు. ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందన్నారు. గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరిపుత్రులను కేసీఆర్ ఆ భూములకు యజమానులని చేశారని, 4.06 లక్షల ఎకరాలకుగాను 1.51 లక్షల పోడు రైతులకు పట్టాలను అందజేశామన్నారు. గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదని మంత్రి వివరించారు. -
Kokapet Land Auction: రికార్డుల కోకాపేట.. ఒక్క ఫ్లాట్ రూ.22.50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట సరికొత్త రికార్డులను సృష్టించింది. గురువారం హెచ్ఎండీఏ నిర్వహించిన నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2 వేలంలో అత్యధిక బిడ్ వేసి ప్లాట్ నంబరు–11ను ఏపీఆర్ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎకరం రూ.67.25 కోట్ల చొప్పున రూ.506.39 కోట్లతో మొత్తం 7.53 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో హైదరాబాద్‌కు, ఏపీఆర్ గ్రూప్ తలమానికంగా నిలిచే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు చేస్తున్నామని డైరెక్టర్ ఆవుల సంజీవ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. నాలుగు టవర్లు, ఒక్కోటి 50 అంతస్తులలో ఉంటుంది. ఫ్లోర్‌కు ఒక ఫ్లాట్ చొప్పున ఒక్క ఫ్లాట్ 15 వేల చ.అ. విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 200 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు ఉంటాయి. ధర చ.అ.కు రూ.15 వేలు చొప్పున ఒక్క ఫ్లాట్ ప్రారంభ ధర రూ.22.50 కోట్లుగా ఉంటుంది. ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్స్ నుంచి మొదలుపెడితే క్లబ్ హౌస్, వసతులు, మెటీరియల్స్ ప్రతీది హైఎండ్గా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉంటుంది. ఇప్పటికే సింగపూర్ ఆర్కిటెక్చర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్లాట్ నంబరు–11 ఉన్న ప్రాంతం ఇతర మిగిలిన ప్లాట్ల కంటే ఎత్తులో ఉండటం, గండిపేట వ్యూ స్పష్టంగా కనిపిస్తుండటం దీని ప్రత్యేకతలు. అతి తక్కువ ధర ఈ ప్లాటే.. నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2లో అతి తక్కువ ధర పలికింది కూడా ఈ 11 నంబరు ప్లాటే కావటం గమనార్హం. ఎకరం రూ.67.25 కోట్లతో ఏపీఆర్ గ్రూప్ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. అయితే గతంలో కోకాపేట ఫేజ్–1 వేలంలో గరిష్ట ధర రూ.60 కోట్లు. గోల్డ్‌మైన్ లేఅవుట్లో రాజపుష్ప ప్రాపరీ్టస్ ఎకరం రూ.60.2 కోట్ల చొప్పున మొత్తం రూ.99.33 కోట్లతో 1.65 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. -
దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తున్న మోదీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని సామాజిక ఉద్యమ కార్యకర్త మేధా పాట్కర్ ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో కర్షక, కార్మిక సదస్సు నిర్వహించారు. మేధా పాట్కర్ మాట్లాడుతూ పేదలకు నిత్యావసర వస్తువులను అందించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర రావడంలేదని, అదానీ, అంబానీలకు మాత్రం రూ.వేల కోట్లు ఆదాయం వస్తోందన్నారు. ఆదివాసీల హక్కులను దెబ్బతీస్తూ అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టంలో మార్పులు చేస్తున్నారన్నారు.సంయుక్త కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు హన్నన్ ముల్లా మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని 13 నెలలపాటు రైతులు చేసిన ఉద్యమం సందర్భంగా ప్రధాని ఇచ్చిన హామీల అమలు కోసం ఆగస్టులో ఆందోళనలను నిర్వహిస్తామన్నారు. రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వినర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆల్ ఇండియా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం జాతీయ అధ్యక్షుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. -
పెరిగిన డ్రోన్ పైలెట్లు!
దేశంలో ఈ ఏడాది జూలై 1 నాటికి 5,072 మంది పైలెట్లు సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలోనే దేశంలో డ్రోన్ పైలెట్లు 1,365 శాతం మేర పెరిగారని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్లో వెల్లడించింది. సాధారణ సేవల నుంచి అత్యవసర సేవల వరకు అంతటా డ్రోన్ల వినియోగం పెరుగుతోందని పేర్కొంది. గత ఏడాది జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా కేవలం 346 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లుండగా.. ఈ ఏడాది జూలై 1 నాటికి ఆ సంఖ్య 5,072కు పెరిగిందని ఆ శాఖ తెలిపింది. 427 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా తమిళనాడులో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. అనేక రంగాల్లో వినియోగం.. ఇక డ్రోన్స్ వినియోగం వ్యవసాయంతో పాటు వ్యాక్సిన్ డెలివరీ, నిఘా, శోధన, రక్షణ, రవాణా, మ్యాపింగ్ రంగాల్లో ఉందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగించనున్నట్లు పేర్కొంది. మరోవైపు.. డ్రోన్స్ రిమోట్ పైలెట్ శిక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో 60 సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. ఏపీ విషయానికొస్తే గుంటూరులో రెండు సంస్థలకు, హిందూపురంలో ఒక సంస్థకు కేంద్రం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వీటి వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అలాగే, వచ్చే నెలలో 500 కిసాన్ డ్రోన్స్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రైతుల ఖర్చులు తగ్గించేందుకు.. డ్రోన్ రిమోట్ పైలెట్ల శిక్షణకు రైతులతో పాటు గ్రామాల్లోని నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసి వారికి శిక్షణ ఇప్పిస్తోంది. మానవ శ్రమను తగ్గించడంతో పాటు, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి.. ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం పెంచడం ద్వారా పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగు మందులు, పోషకాలను పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు. తద్వారా రైతుల ఉత్పాదకత వ్యయం తగ్గి, ఆదాయం పెరుగుతుంది. -
యువత సంకల్పం అత్యంత బలమైంది
తిరుపతి ఎడ్యుకేషన్: నేటి యువతే రేపటి దేశం. యువతకు మించిన గొప్ప శక్తి లేదు. యువత సంకల్పం అన్నింటి కన్నా బలమైనదని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీ వెటర్నిటీ వర్సిటీ) 12వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆ యువత సరైన దిశలో గమ్యం వైపు పయనిస్తే బలమైన భారత్‌గా ఎదుగుతుందన్నారు.పశుపోషణ, పాడి పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పాల ఉత్పత్తిని పెంచడంలో, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. అమూల్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుని గ్రామీణ మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శ్రీవారి నైవేద్యాలకు, భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీతో పాటు అన్ని అవసరాలకు సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం శుభసూచకమన్నారు. రైతులు సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించేలా వారిని ప్రోత్సహించేందుకు ఎద్దులు, ఆవులను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశీయ గోజాతులను రక్షించేందుకు టీటీడీ తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు.గురువుల మార్గనిర్దేశంలో క్రమశిక్షణతో విద్యనభ్యసించిన వెటర్నరీ విద్యార్థులు పశువైద్య నీతి సూత్రాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ దేశం గర్వించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఎస్వీ వెటర్నరి వర్సిటీ దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఏడాదికి ప్రకటించిన ర్యాంకింగ్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 31వ స్థానంలో నిలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు 35 బంగారు పతకాలు, రెండు రజతం, ఒకరికి నగదు బహుమతిని అందించారు. కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎంఆర్ శశీంద్రనాథ్, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అరుణాచలం రవి పాల్గొన్నారు. -
గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్’ తొలగించండి
వాషింగ్టన్: గ్రీన్‌కార్డులపై 7 శాతంగా ఉన్న కంట్రీ లిమిట్‌ను తొలగించాలని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారత–అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ జైన్ భుతోరియా అమెరికా పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిమితి వల్ల గ్రీన్‌కార్డుల కోసం అర్హులైన వారు సుదీర్ఘీకాలం నిరీక్షించాల్సి వస్తోందని చెప్పారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారతఅమెరికన్ పార్లమెంట్ సభ్యుడు రో ఖన్నా ఆధ్వర్యంలో తాజాగా జరిగిన యూఎస్–ఇండియా సదస్సులో అజయ్ జైన్ మాట్లాడారు. హెచ్–1 వీసాలపై లేని కంట్రీ లిమిట్ గ్రీన్‌కార్డులపై ఎందుకని ప్రశ్నించారు. అమెరికాలో ఇప్పుడు 8,80,000 మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. వీరిలో భారత్, చైనా నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. పదేళ్లకుపైగా నిరీక్షిస్తున్నవారు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. చట్టాన్ని మార్చకపోతే మరో 50 సంవత్సరాలు ఎదురు చూడక తప్పదని తేల్చిచెప్పారు. -
దేశాన్ని విభజించే కుట్ర పన్నుతున్నారు
కోల్‌కతా: కొందరు నేతలు విద్వేష రాజకీయాలతో దేశాన్ని విభజించే కుట్రలకు తెరతీశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘వారి కుట్రలను సాగనివ్వను. ఈ పోరాటంలో ప్రాణాలనైనా అర్పిస్తా’’ అని శనివారం కోల్‌కతాలో ఈద్ నమాజ్ సందర్భంగా ఆమె అన్నారు. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోంది. అయినా తలవంచే ప్రసక్తే లేదు’ అన్నారు. ‘‘ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలున్నాయి. విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడదాం. ఒక్కటిగా ఓటేసి బీజేపీని గద్దె దింపుదాం. ప్రజాస్వామ్య పరిరక్షణలో మనం విఫలమైతే అంతా అయిపోయినట్లే’’ అన్నారు. కాంగ్రెస్, సీపీఎంలపై ఈ సందర్భంగా మమత విమర్శలు గుప్పించారు. -
డాలర్, యూరోకి షాకిచ్చే కరెన్సీ? ‘గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్’ గురించి తెలుసా?
గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ గురించి ఎపుడైనా విన్నారా.భూమి లేని దేశం కానీ డాలర్, యూరో కంటే బలమైన కరెన్సీ దీని సొంతమా? నిజంగా ఈ కరెన్సీ అంత విలువైందా? మహర్షి మహేశ్ యోగి 2020 అక్టోబర్ 7న స్థాపించిన దీని గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే ఆసక్తికరమైన, ప్రత్యేకమైన దేశం గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్. సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలల నుండి శాంతియుత, సామరస్యపూర్వక వ్యక్తులను ఒకచోట చేర్చడమే దీని లక్ష్యం. మహర్షి మహేశ్ యోగి మరణానంతరం ప్రస్తుతం మహర్షి గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్‌కి న్యూరాలజిస్ట్, అధినేత రాజా రామ్ (టోనీ నాడార్) అధినేతగా ఉన్నారు. . గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ దాని స్వంత కరెన్సీని రామ్ అని పిలుస్తారు. ఇది లోకల్ కరెన్సీ. దీన్నే బేరర్ బాండ్ అని కూడా పిలుస్తారు.ఇది అయోవా, నెదర్లాండ్స్‌లో ఉపయోగిస్తున్నారు. ఐరోపాలో 10 యూరోలు, అమెరికా 10 డాలర్లకు సమానమైన ‘రామ్’. రామ్ 1, 5, 10 వివిధ డినామినేషన్లలో లభ్యం. ఇది ఇప్పటికే ఉన్న కరెన్సీలను భర్తీ చేయదు కానీ నిర్దిష్ట లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చు. రామ్‌ను బ్యాకప్ చేయడానికి బంగారాన్ని ఉపయోగించడాన్ని సంస్థ ప్రోత్సహిస్తుంది. 2001లో మహర్షి మహేష్ యోగి జారీ చేసిన కరెన్సీని డచ్ సెంట్రల్ బ్యాంక్ అనుమతించిందట. (వామ్మో! ఇళ్లకి హైదరాబాద్‌లో ఇంత డిమాండా? కళ్లు చెదిరే సేల్స్) అమెరికాలోని పలు నగరాల్లో నిర్మించిన "శాంతి భవనాలు" మరో విశేషం. ఈ భవనాలు దేవాలయాలు పోలిఉంటాయి. ఇక్కడ ఆయుర్వేద చికిత్సలు, మూలికా సప్లిమెంట్లు, అతీంద్రియ ధ్యానం వంటి వాటిపై బోధిస్తారు. బెథెస్డా, మేరీల్యాండ్, హ్యూస్టన్ ఆస్టిన్, టెక్సాస్, ఫెయిర్‌ఫీల్డ్, అయోవా, సెయింట్, పాల్, మిన్నెసోటా , లెక్సింగ్టన్, కెంటుకీ వంటి నగరాల్లో వీటిని చూడవచ్చు. గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ అంతిమ లక్ష్యం హింస లేదా సంఘర్షణ లేని ప్రపంచాన్ని సృష్టించడమేనని చెబుతారు. వారి బోధనలు, అభ్యాసాలతో అంతర్గత శాంతిని, సామరస్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. 2008 ఫిబ్రవరి 5న నెదర్లాండ్స్‌లోని తన నివాసంలో మహర్షి యోగి కన్నుమూశారు. (ఇదీ చదవండి: Vinod Rai Gupta Net Worth: వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?) ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ రామ్ అంటూ 2020లో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే రామ్ అనేది లోకల్ కరెన్సీ మాత్రమే తప్ప, గ్లోబల్ కరెన్సీగా గుర్తించలేమని ఆ సందర్భంగా నిపుణులు కొట్టిపారేశారు. మరోవైపు గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ వాటికన్ లాంటి స్వతంత్ర నగర రాజ్యంగా ను ఏర్పాటు చేయాలని సార్వభౌమాధికార హోదాను పొందేందుకు ప్రయత్నిస్తోంది. వారు అనేక దేశాల నుండి భూమిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు, కాని స్వతంత్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వారి భూమిని విక్రయించడానికి అంగీకరించలేదు. ఒకవేళ సార్వభౌమ రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగితే, ఆ తరువాత దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకుంటే, అపుడు రామ్ కరెన్సీ రెగ్యులర్ లీగల్ టెండర్ హోదాను పొందుతుందనేది నిపుణుల మాట. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా) -
దేశ రహస్యాలు అమ్మడానికి ప్రయత్నించి.. చివరికి బిగ్ ట్విస్ట్..
కెలమంగలం(కర్ణాటక): కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని రహస్యాలను సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ గూఢచార సంస్థలకు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని బైరగొండపల్లి గ్రామానికి చెందిన రామక్రిష్ణారెడ్డి కొడుకు ఉదయ్‌కుమార్ (32). బెంగళూరులో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా 2017 నుంచి 2019 వరకు పనిచేశాడు. ఈ సమయంలో కార్యాలయంలో భద్రపరిచిన పలు ధృవీకరణ పత్రాలు, పరిశోధనా ఉపకరణాలను సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ ఏజెన్సీల వద్ద విక్రయించి డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకొన్న తళి పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి ఉదయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉంది. చదవండి: మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో -
నిత్యానంద కైలాసకు బిగ్ షాక్
వాషింగ్టన్: కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో వార్తల్లోకెక్కిన వివాదాస్పద వ్యక్తి నిత్యానందకు పెద్ద షాకే తగిలింది. కైలాసానికి అంతర్జాతీయ ఉనికి, ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం నిత్యానంద అండ్ కో తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈలోపే కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా నగరం ఒకటి ప్రకటించింది. అమెరికన్ సిటీ నెవార్క్.. కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మేం మోసపోయాం. జరిగినదానికి చింతిస్తున్నాం. కైలాస పరిసర పరిస్థితుల గురించి తెలుసుకున్న వెంటనే మేం స్పందించాం. దాని చుట్టూరా అన్నీ వివాదాలే. అందుకే ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని జనవరి 18వ తేదీనే రద్దు చేసుకున్నాం’’ అని నగర అధికార ప్రతినిధి సుసాన్ గారోఫాలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కైలాస ప్రభుత్వ వెబ్సైట్ మాత్రం అమెరికా నగరం, తమ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసను(USK)ను గుర్తించిందని, ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందంటూ సంబంధిత పత్రాలను పోస్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించుకుంటోంది. జనవరి 12వ తేదీన నెవార్క్ సిటీ హాల్లో కైలాస ప్రతినిధులతో ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మోసం గురించి తెలిసిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని, అది చెల్లుబాటు కాదని, పైగా కైలాసం చుట్టూ వివాదాలు ఉన్నట్లు గుర్తించామని నెవార్క్ ప్రతినిధులు ఇప్పుడు చెప్తున్నారు. అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు నిత్యానంద స్వామి. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించి జనాల్ని బిత్తరపోయేలా చేశాడు. పైగా ఆ దేశానికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నాడు. తాజాగా కైలాస తరపున ఐక్యరాజ్యసమితికి ఓ ప్రతినిధి హాజరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఐరాస మానవహక్కుల కమిషన్‌లో నిత్యానంద వేధింపులకు గురవుతున్నాడని, స్వదేశం నుంచే బహిష్కరణకు గురయ్యాడంటూ ఆ దేశ ప్రతినిధిగా చెప్పుకుంటున్న విజయప్రియ చేసిన ప్రసంగం.. దానిని ఐరాస మానవహక్కుల కమిషన్ కొట్టిపారేయడం గురించి తెలిసిందే. అసలు నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ కైలాస దేశం ఎక్కడ ఉందో స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఒకదానిలో ఉందని చెబుతున్నప్పటికీ.. నిత్యానంద తమ దేశ పరిసరాల్లోనే లేడంటూ ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పరమహంస నిత్యానంద ఫాలోవర్స్ మాత్రం కైలాసను విపరీతంగా ప్రమోట్ చేస్తుంటారు. అంతర్జాతీయ ప్రతినిధులను కలిసి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా కైలాస మీద నడిచే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. -
వెరీ‘గుడ్డు’.. దేశంలోని టాప్–5 రాష్ట్రాల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: పశుసంవర్థక రంగంలోని పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తిలో ఐదు రాష్ట్రాలు మంచి ఫలితాలు కనబరిచాయని నాబార్డు నివేదిక వెల్లడించింది. ఇవి కోవిడ్ సంక్షోభంలో ఈ ఘనత సాధించాయని తెలిపింది. గుడ్ల ఉత్పత్తిలో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పశుసంవర్థక రంగం ఉత్పత్తుల వృద్ధిపై నాబార్డు తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలు గుడ్ల ఉత్పత్తిలో 64.77 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ, నాల్గో స్థానంలో పశ్చిమ బెంగాల్, ఐదో స్థానంలో కర్ణాటక నిలిచాయి. ఏపీ ప్రభుత్వం కోవిడ్ సమయంలో పశు సంవర్థక, వ్యవసాయ కార్యకలాపాలు నిలిచిపోకుండా అవసరమైన చర్యలను తీసుకోవడంవల్లే ఈ ఘటన సాధించింది. అలాగే.. ♦మాంసం ఉత్పత్తి విషయానికొస్తే.. టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాల్గో స్థానంలో ఉంది. ♦పాల ఉత్పత్తిలో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. 2020–21లో ఏపీ సహా ఐదు రాష్ట్రాలు 52.70 శాతం వాటా కలిగి ఉన్నాయి. ♦అలాగే, మాంసం ఉత్పత్తిలో ఈ ఐదు రాష్ట్రాలు 57 శాతం వాటా కలిగి ఉన్నాయి. ♦దేశంలో పశువుల జనాభా 1951లో 155.3 మిలియన్లు ఉండగా 2019 నాటికి 193.46 మిలియన్లకు పెరిగింది. పశుసంవర్థక రంగం వాటా పెరుగుదల మరోవైపు.. వ్యవసాయ రంగంలో పశుసంవర్థక రంగం వాటా దేశంలో భారీగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. 1950–51లో వ్యవసాయ రంగం స్థూల విలువల జోడింపులో పశు సంవర్థక రంగం వాటా 17.95 శాతం ఉండగా 2020–21 నాటికి అది 30.13 శాతానికి పెరిగింది. వ్యవసాయ రంగం స్థిరత్వానికి పశువుల రంగం చాలా ముఖ్యమైనదిగా నివేదిక స్పష్టం చేసింది. చదవండి: ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది! గ్రామీణ ఆదాయ వృద్ధికి పశుపోషణ ప్రధాన చోదకశక్తి అని నివేదిక వ్యాఖ్యానించింది. అలాగే, రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు పశుసంవర్థక రంగంలో అధిక ప్రభుత్వ పెట్టుబడులు అవసరమని సూచించింది. పాలు, పాల ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని నివేదిక పేర్కొంది. ఇటీవల కాలంలో శాస్త్రీయ, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా దేశంలో పశువుల ఉత్పత్తిని పెంచినట్లు నివేదిక పేర్కొంది. -
AP: స్టూడెంట్-టీచర్ నిష్పత్తిలో ఉత్తమం
సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, అత్యుత్తమ బోధనా విధానాలు, శిక్షణా కార్యక్రమాలు, నాడు – నేడు ద్వారా పాఠశాలలను మౌలిక వసతులతో తీర్చిదిద్దడం సత్ఫలితాలనిస్తున్నట్లు మరోసారి తేటతెల్లమైంది. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక తదితర ప్రోత్సాహాలతో ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరగగా అందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులను సమకూర్చడంతో నాణ్యమైన బోధన అందుతోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి (పీపుల్, టీచర్ రేషియో)లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థితిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇతర పెద్ద రాష్ట్రాల కన్నా ఏపీలో పరిస్థితి ఎంతో బాగున్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈమేరకు కేంద్ర విద్యా శాఖ ఈనెల 13వతేదీన పార్లమెంట్‌కు లిఖిత పూర్వకంగా తెలియచేసింది. రాష్ట్రాలవారీగా పీపుల్, టీచర్ రేషియో వివరాలను వెల్లడించాలని యూపీకి చెందిన బీజేపీ ఎంపీ అజయ్‌నిషాద్ కోరగా లోక్‌సభకు వివరాలను సమర్పించింది. ►2021–22 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు – ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రైమరీ స్కూళ్లలో 24 : 1గా, అప్పర్ ప్రైమరీలో 17 : 1 చొప్పున ఉంది. అంటే ప్రైమరీ తరగతుల్లో 24 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండగా అప్పర్ ప్రైమరీలో 17 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున టీచర్ ఉన్నారు. ►పాఠశాల విద్యకు ఆయువు పట్టు లాంటి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని జాతీయ విద్యాహక్కు చట్టం 2009లో స్పష్టంగా నిర్దేశించారు. ఈ చట్టం ప్రకారం పీపుల్, టీచర్ రేషియో ప్రైమరీలో 30 మంది విద్యార్ధులకు ఒక టీచర్ (30 : 1) ఉండాలి. అప్పర్ ప్రైమరీలో 35 మంది విద్యార్ధులకు ఒక టీచర్ (35 : 1) ప్రకారం ఉండాలని పేర్కొన్నారు. అయితే ఏపీలో అంతకంటే మెరుగ్గా టీచర్లు అందుబాటులో ఉండటం గమనార్హం. ►ఏపీలో పీపుల్, టీచర్ రేషియో జాతీయ సగటుకన్నా మెరుగ్గా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్ధులు – ఉపాధ్యాయుల నిష్పత్తి జాతీయ స్థాయిలో ప్రైమరీలో 28 : 1 కాగా అప్పర్ ప్రైమరీలో 24 : 1 చొప్పున ఉంది. పెద్ద రాష్ట్రాల కంటే మెరుగ్గా.. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతున్నట్లు కేంద్రం విడుదల చేసిన సమాచారాన్ని విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా విద్యారంగంలో అగ్రస్థానంలో కొనసాగిన కేరళ, తమిళనాడు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల కంటే ఏపీలో టీచర్ల నిష్పత్తి మెరుగైన స్థితిలో ఉన్నట్లు వెల్లడవుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం అప్పర్ ప్రైమరీలో 35 : 1 నిష్పత్తిలో పీపుల్, టీచర్ రేషియో ఉండాలి. ఏపీలో అంతకంటే మెరుగ్గా 17 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున ప్రభుత్వం టీచర్లను నియమించింది. -
రిటైల్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: దేశ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్స్) గతేడాది అరు రెట్లు వృద్ధి చెంది 492 మిలియన్ డాలర్లుగా (రూ.4034 కోట్లు) నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రభావం అనంతరం రిటైల్ వ్యాపారాలు పుంజుకోవడాన్ని కొలియర్స్ ఇండియా ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. 2021లో రిటైల్ రియల్ ఎస్టేట్‌లోకి 77 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం గమనించాలి. 2020, 2021లో కరోనా ఉధృతంగా ఉండడం పెట్టుబడులపై ప్రభావం చూపించింది. ఇక భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి సంస్థాగత పెట్టుబడులు 2022లో 20 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాదిలో ఇవి 4.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డేటా కేంద్రాలు, సీనియర్ హౌసింగ్, హాలీడే హోమ్స్ తదితర ఆల్టర్నేటివ్ రియల్ ఎస్టేట్‌లోకి గతేడాది 867 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2021లో వచ్చిన 453 మిలియన్ డాలర్ల కంటే 92 శాతం పెరిగాయి. సంప్రదాయ సాధనాలతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇచ్చే ప్రత్యామ్నాయ సాధనాల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లో 52 శాతం డేటా సెంటర్స్ ఆకర్షించాయి. ఆఫీస్ మార్కెట్లోకి 41 శాతం ఇక గతేడాది మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 41 శాతం ఆఫీస్ స్పేస్ విభాగంలోకి వచ్చాయి. అంటే 1.9 బిలియన్ డాలర్లను ఆఫీస్ స్పేస్ విభాగం ఆకర్షించింది. అంతకుముందు ఏడాది ఇదే విభాగంలో పెట్టుబడులు 1.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మిశ్రమ వినియోగ ప్రాజెక్టుల్లోకి రెట్టింపునకు పైగా పెరిగి 464 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ ఆస్తుల్లోకి 63 శాతం తక్కువగా 422 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 1,130 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నివాస ప్రాజెక్టుల్లోకి సైతం 29 శాతం తక్కువగా 656 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి పెట్టుబడులు గత కొన్నేళ్ల నుంచి స్థిరంగా వస్తున్నాయి. నిర్మాణాత్మక వచ్చిన మార్పుతో ఈ మార్కెట్ ఇంకా వృద్ధి చెందుతుంది’’అని కొలియర్స్‌ఇండియా తన నివేదికలో పేర్కొంది. తొమ్మిదేళ్ల గరిష్టానికి ఇళ్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా ఎనమిది ప్రధాన నగరాల్లో గతేడాది 3,12,666 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే 34 శాతం అధికం కాగా, తొమ్మిదేళ్లలో ఇదే గరిష్టం కావడం విశేషం. ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఈ స్థాయి వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ‘ముంబై అత్యధికంగా 85,169 యూనిట్లతో 35 శాతం వృద్ధి సాధించింది. ఢిల్లీ ఎన్సీఆర్ 58,460 యూనిట్లతో 67 శాతం, బెంగళూరు 53,363 యూనిట్లతో 40 శాతం, 43,410 యూనిట్లతో పుణే 17 శాతం అధికంగా విక్రయాలు నమోదు చేసింది. 28 శాతం వృద్ధితో హైదరాబాద్ 31,046 యూనిట్లు, 19 శాతం అధికమై చెన్నైలో 14,248 యూనిట్లు, 58 శాతం ఎక్కువై అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 14,062 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్‌కత 10 శాతం క్షీణించి 12,909 యూనిట్లకు పరిమితమైంది. 2022లో ఆఫీస్ లీజింగ్ స్థలం స్థూలంగా 36 శాతం అధికమై 5.16 కోట్ల చదరపు అడుగులుగా ఉంది’ అని నివేదిక వివరించింది. -
తెలంగాణ: ఆ ఏడు మండలాల్లో నాటు కోళ్ళు గాయబ్
అక్కడి వూళ్ళలో కోళ్ళు మాయం అవుతున్నాయి. మాయం అవుతున్నాయంటే వూళ్ళలో దొంగలేమీ పడి ఎత్తుకుపోలేదు. పోనీ ఏ రోగమో వచ్చి నాటు కోళ్ళన్నీ చనిపోలేదు. కానీ, ఏడు మండలాల్లో నాటు కోళ్ళు కనిపించడంలేదంట. ఎందుకిలా జరిగింది. ఇంతకీ ఆ వూళ్ళు ఎక్కడున్నాయి? పల్లెటూళ్ళలో నాటు కోళ్ళకు గిరాకీ ఎక్కువ. చాలా మంది ఇళ్ళలో పెంచుకుంటారు. బ్రాయిలర్ కోళ్ళు తిని విసుగు చెందినవారు కచ్చితంగా నాటు కోడిని తినాలనుకుంటారు. ఎంత రేటు పెట్టైనా కొనాలనుకుంటారు. సహజసిద్ధంగా పెరిగే నాటుకోడిలో పోషకాలు కూడా ఎక్కువే ఉంటాయి. కానీ ఇప్పుడు అదే నాటుకోడి ఉన్నట్లుండి నెల రోజుల్లోనే ఓ ప్రాంతం నుంచి కనిపించకుండా పోయింది. దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు ఇలా జరిగింది? అక్కడేమన్నా కోళ్లకు రోగాలు వచ్చాయా అంటే అదేం లేదు. అక్కడ ఉప ఎన్నిక వస్తోంది. అదేంటి ఉప ఎన్నిక వస్తే నాటు కోళ్లు మాయం కావడం ఏంటనుకుంటున్నారా? విషయం అంతా అక్కడే ఉంది మరి.. నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కడ చూసినా ఎనికల వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నికల తేదీ అయితే రాలేదు గాని ..మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ప్రచారానికి వచ్చే పార్టీల కార్యకర్తలు, నేతలు, జనాలకు మందు, విందు ఏర్పాటు చేస్తున్నాయి పార్టీలు. విందులో బ్రాయిలర్ కోళ్ళ కంటే నాటు కోళ్ళకే మక్కువ చూపిస్తున్నారట. అందుకే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నాటు కోళ్ళన్నీ అక్కడికొచ్చేవారికి ఆహారంగా మారిపోతున్నాయి. ఇప్పుడక్కడ నాటు కోళ్ళ కోసం దుర్భిణీ వేసి వెతికినా కనిపించడంలేదంటున్నారు. ఎక్కడైనా కనిపించినా..దాని ధర బంగారం స్థాయికి చేరిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో మటన్‌కు కూడా విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇంతకు ముందుకు గొర్రెలు, మేకలు విరివిగా దొరికేవి. వాటి రేట్లు కూడా అంతో ఇంతో అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి కూడా డిమాండ్ పెరిగి మటన్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రచార సభలు నిర్వహించే రాజకీయ పార్టీల నేతలకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. మీటింగులకు వచ్చేవారికి నాన్ వెజ్ భోజనం పెట్టకపోతే వారు నారాజ్ అవుతున్నారట. ఒకవేళ ముక్క భోజనం పెట్టకపోతే మనసులో పెట్టుకుని ఎక్కడ ఓటు వేయరోనన్న ఆందోళన కూడా నేతల్లో కనిపిస్తోందట.. మొత్తానికి మునుగోడులో మటన్ ముక్కతో పాటు నాటుకోడికి కూడా తిప్పలొచ్చాయి. ఉప ఎన్నిక ఏమో గాని మాకు నాటు కోళ్ళు దొరకడంలేదని మునుగోడు నియోజకర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్ ఉచిత పంటల బీమా దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఆర్థికంగా ఎంతో రక్షణ కల్పిస్తోందన్నారు. బుధవారం సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఉచిత పంటల బీమాను అమలు చేయడం చరిత్రాత్మకమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తూ 26 రకాల పంటలకు బీమా వర్తిస్తోందన్నారు. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ.. బీమా పరిహారం ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు నెలలోగా పంట నష్ట పరిహారం(ఇన్పుట్ సబ్సిడీ), సీజన్ మారేలోగా పంటల బీమా పరిహారం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇది గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. 2016 ఖరీఫ్‌లో 16.36 లక్షల మంది రైతులు పంటల బీమా కోసం నమోదు చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్య 30.6 లక్షలకు పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగా 2021 ఖరీఫ్‌లో నష్టపోయిన 15.60 లక్షల మంది రైతులకు 2022 ఖరీఫ్ ప్రారంభంలోనే రూ.2,977.82 కోట్లు పరిహారం జమ చేశామన్నారు. ఉల్లి, టమాట, దానిమ్మతోపాటు చిరుధాన్యాల పంటలను కూడా బీమా పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. ఇంకా అర్హులుంటే ఆర్బీకేలను సంప్రదించాలి.. పంటలు నష్టపోయిన అర్హుల జాబితాను ఆర్బీకేల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి పారదర్శకంగా రూపొందించినట్టు వివరించారు. బీమా పరిహారం అందని అర్హులైన రైతులు ఎవరైనా ఉంటే 15 రోజుల్లోగా ఆర్బీకేల్లో గానీ గ్రామ సచివాలయాల్లో సంప్రదిస్తే విచారించి పంట నష్ట పరిహారాన్ని అందిస్తామన్నారు. రెండు రకాలుగా నోటిఫైడ్ పంటలకు బీమా వర్తింపజేస్తున్నామన్నారు. ఇందులో దిగుబడి ఆధారిత పంటలు నష్టపోయిన 8,47,759 మంది రైతులకు రూ.2,143.85 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలు నష్టపోయిన 7,12,944 మంది రైతులకు రూ.833.97 కోట్లు జమ చేశామన్నారు. గతంలో ప్రైవేటు సంస్థల వల్ల రైతులకు సరైన పరిహారం దక్కేది కాదని, చాలామంది ఆర్థిక ఇబ్బందులతో పంటల బీమా ప్రీమియానికి దూరంగా ఉండేవారన్నారు. ఇప్పుడు ఈ–క్రాప్ నమోదు సమయంలోనే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. తగ్గిన రుణ ఎగవేతలు.. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు అన్ని రకాల సేవలను అందిస్తూ వ్యవసాయ సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున అందుతున్న సంక్షేమ పథకాలతో రుణ ఎగవేతలు బాగా తగ్గినట్టు ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లు కితాబు ఇచ్చారన్నారు. పంటల విస్తీర్ణంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ గణనీయంగా వృద్ధి నమోదైందన్నారు. క్రాప్ హాలిడే కాదు.. మూడు పంటల ముందస్తు జోరు.. రాష్ట్రంలో రైతులకు మేలు జరిగేలా ముందస్తుగా నీటిని విడుదల చేసి మూడు పంటలు సాగయ్యేలా ప్రోత్సహిస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు. క్రాప్ హాలిడేకు అవకాశం లేదన్నారు. మూడు పంటలు వస్తే రైతులకు ఆదాయం పెరగడమే కాకుండా నేల సారవంతం అవుతుందన్నారు. గత నాలుగేళ్లలో రైతుల మరణాలు రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్నాయని మీడియా ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్నారు. కోనసీమ డెల్టా చివరి ప్రాంతాలకూ నీరందేలా జలవనరుల శాఖతో సమన్వయం చేసుకుని కాలువల మరమ్మతులు, పూడికతీతపై దృష్టి సారించామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. గతంలో ఆలస్యంగా పంటలు వేయడంతో తుపాన్లతో పంట నష్టపోవడమేగాక మూడో పంటకు అవకాశం ఉండేది కాదన్నారు. -
యుద్ధమేదైనా.. అదే దృశ్యం!
కురుస్తున్న అగ్నిగోళాలు, కూలిపోతున్న నివాస స్థలాలు, జూడో ఫైటర్ పుతిన్ భద్ర సమాజంపై విసరుతున్న పంచ్‌లు.. యుద్ధాన్ని ఆపలేని జెలెన్స్కీ విదూషక ప్రసంగాలు. ‘చమురు’ గొంతులో ఇరుక్కుని మాట్లాడలేని మౌన ప్రేక్షక దేశాలు.. ఇవి మాత్రమే యుద్ధ చిత్రాలు కాదు. .. కొన్ని తరాలైనా కోలుకోలేని జీవన విధ్వంసం అసలు యుద్ధ రూపం. పిల్లలను పొదువుకుని పరుగెత్తే తల్లులు, పొలిమేరల్లో లైంగికదాడుల్లో ఆడబిడ్డల ఆక్రందనలు. రహదారులపై అన్నదమ్ముల శవాలు. ఇదీ అసలు రూపం.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధమొక్కటే కాదు. ఏ యుద్ధమైనా అంతే. కురుక్షేత్రానికి ఆజ్యం పోసిన ‘శకుని’, ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యే ‘హిట్లర్’ లాంటి వాళ్లు మానవ నాగరికతకు సమాధి లాంటి ‘బంకర్ల’లోనే ఆకలితో, అవమానంతో, ఆగ్రహంతో ఊపిరిపోసుకుంటారు. ఏ యుద్ధమైనా.. మరో యుద్ధానికి, మారణ హోమానికి నాంది అవుతుంది. యుద్ధమెక్కడైనా నష్టం అందరికీ.. యుద్ధమంటే ఓ దేశం మరో దేశంపై చేసే దాడి మాత్రమే కాదు. ఆ రెండు దేశాలే నష్టపోవు. ప్రపంచ దేశాలన్నీ వివిధ అవసరాల కోసం ఒకదానిపై ఒక టి ఆధారపడిన క్రమంలో.. చాలా దేశాల్లో, లక్షల మంది ప్రజలపై ప్రభావం పడుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి, రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షల ప్రభావం చాలా దేశాలపై పడింది. మన దేశాన్నే చూసుకుంటే.. పెట్రోలియం ఉత్పత్తులు, వంట నూనెలు సహా చాలా సరుకుల ధరలు పెరిగాయి. విద్య, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, తిరుగుబాట్లతో ఒక్క 2021వ సంవత్సరంలోనే రూ. 1,09,32,98,40,00,00,000–పదికోట్ల 93 లక్షల 29 వేల 840 కోట్లు (14.4 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక నష్టం జరిగినట్టు ‘ఎకనమిక్ వ్యాల్యూ ఆఫ్ పీస్ రిపోర్ట్’ అంచనా. కోట్ల ప్రాణాలు గాలికి.. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు, వాటి పర్యవసనాల ఫలితంగా కోట్లాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది అవయవాలు కోల్పోయి, ఆరోగ్యం దెబ్బతిని జీవచ్ఛవాలుగా మారారు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితులతో ఏటా సగటున లక్ష మందికిపైనే చనిపోతు న్నట్టు ఐక్యరాజ్యసమితి పేర్కొనడం గమనార్హం. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయాలు, రోగాల వల్ల రెండుకోట్ల మంది సైనికులు, కోటిన్నర మంది ప్రజలు మరణించినట్టు అంచనా. 1937–45 మధ్య జరిగిన చైనా–జపాన్ యుద్ధంలో రెండుకోట్ల మందికిపైగా చనిపోయారు. ఒక్క రెండో ప్రపంచ యుద్ధంలోనే 8.5 కోట్ల మంది చనిపోయినట్టు అంచనా. అందులో దాదాపు 80 శాతం అంటే ఆరున్నర కోట్ల మం దికిపైగా రష్యా, చైనా, జర్మనీ, పోలాండ్ దేశాలకు చెందినవారేనని నిపుణులు చెప్తున్నారు. ఇండియా సైనికులు, పౌరులు కలిపి 15 లక్షల మంది వరకు మరణించినట్టు అంచనా. 1950–53 మధ్య ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరిగిన యుద్ధంలో 45 లక్షల మంది చనిపోయారు. 1979–89 మధ్య సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో 20 లక్షల మంది, 1998–2003 మధ్య జరిగిన రెండో కాంగో వార్‌లో 54 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అంచనా. గత 20 ఏళ్లలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా అంతర్యుద్ధం వంటివాటిల్లోనూ లక్షల మంది చనిపోయారు. అంతా అతలాకుతలం.. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అంతర్యుద్ధం చెలరేగినా.. అమాయక ప్రజలకే ముప్పు. అప్పటిదాకా హాయిగా బతుకుతున్న వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులైపోతాయి. ఐదేళ్ల కింద సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్)లో ఓ స్వచ్చంద సంస్థ బాధితుల అనుభవాలు, దుస్థితిని పట్టి చూపింది. ఊరిపెద్దగా ఉండి అడుక్కునే దశకు.. ఆయన పేరు ఆల్బర్ట్.. సీఏఆర్లోని ఔకా ప్రాంతంలో ఓ గ్రామ పెద్ద. కాఫీ పండిస్తూ.. కుటుంబంతో సంతోషంగా బతికేవాడు. కానీ 2014లో ఓ రోజు రాత్రి తిరుగుబాటు దళాలు చేసిన దాడిలో ఆ గ్రామం నాశనమైంది. ఆల్బర్ట్ కుడి చెయ్యి తెగిపోయింది. అతను సహా ఊరిలోని వాళ్లంతా కాంగోకు వలస వెళ్లారు. అప్పటిదాకా నలుగురికి సాయం చేసిన ఆల్బర్ట్.. ఏ పనీ చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక.. చివరికి భిక్షమెత్తుకునే దుస్థితికి చేరాడు. పిల్లలకు పీడకలే.. యుద్ధాలు, అంతర్యుద్ధాలతో అన్నెంపున్నెం ఎరుగని చిన్నారుల బతుకు, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయి దేశాలు, మిలీషియా దళాలు పిల్లలను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నాయి. విద్యాసంస్థలపై దాడులు, పిల్లల కిడ్నాప్‌లు, చంపడం, బాలికలపై అత్యాచారాలు వంటివీ పెరిగాయి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు చెందిన బిట్రీస్ అనే మహిళ భర్త మిలీషియా దాడుల్లో చనిపోయాడు. ఆరేళ్ల కింద కొడుకుతో కాంగోకు పారిపోయింది. శరణార్థుల క్యాంపులో దుర్భర పరిస్థితిలో బతుకుతోంది. ‘‘సరిగా తిండి లేదు. ఏ సౌకర్యాలూ లేవు. అంతా స్వార్థంతో బతుకుతున్నారు. ఈ వాతావరణంలో పెరుగుతున్న నా కొడు కు భవిష్యత్తు ఏమవుతుందో’’నని ఆమె వాపోయింది. యుద్ధ విమానాల దాడిలో ధ్వంసమైన డ్రెస్డెన్ నగరం మధ్య చిన్న గుట్టలా కుప్పపోసి ఉన్న మృతదేహాలివి. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన దారుణ జన హననానికి ఈ ఫొటో చిహ్నంగా నిలిచింది. జర్మన్ నాజీలు యూదులను, ఇతర దేశస్తులను ఊచకోత కోస్తుంటే.. వారిని రక్షించేందుకని జర్మనీపై దాడికి దిగిన మిత్రదేశాల (బ్రిటన్, అమెరికా తదితర దేశాల) సైన్యాలు.. 1945 ఫిబ్రవరిలో జర్మనీలోని డ్రెస్డెన్ నగరంలో పౌరులు, జనావాసాలపై విచక్షణా రహితంగా బాంబులు వేశాయి. అమెరికన్ సైనికులు తన కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేయడం, తనకూ తీవ్రగాయాలవడంతో.. బాధతో రక్తమోడుతూ రోదిస్తున్నతో ఐదేళ్ల ఇరాకీ బాలిక ఈమె. ఇరాక్‌లో తిష్టవేసిన అమెరికా సైన్యాలు ఏర్పాటు చేసిన ఓ చెక్ పాయింట్ వద్ద 2005లో ఈ దారుణ విషాదం జరిగింది. 1937.. చైనాలో బాంబు దాడులతో కూలిపోయిన రైల్వేస్టేషన్.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. తల్లిని కోల్పోయి, తీవ్రంగా గాయపడి గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి.. 1937లో జరిగిన చైనా–జపాన్ యుద్ధంనాటి దారుణ పరిస్థితిని కళ్లకు కట్టే చిత్రమిది. చైనాలోని షాంఘై సౌత్ రైల్వేస్టేషన్‌పై జపాన్ వి«ధ్వంసక దాడి ఫలితం. 2022.. ఉక్రెయిన్‌లో ఉక్రెయిన్‌లోని రైల్వేస్టేషన్‌పై మొన్నటి శుక్రవారం రష్యా చేసిన మిస్సైల్ దాడిలో తీవ్రంగా గాయపడి రొదిస్తున్న మహిళ ఈమె. రష్యా దాడులతో సృష్టిస్తున్న విధ్వంసం నుంచి తప్పించుకుని మరోచోటికి వెళ్లిపోదామనుకున్న 52 మంది ఈ దాడిలో ప్రాణాలు వదిలారు. మరెందరో క్షతగాత్రులుగా మిగిలారు. .. ఒకటా.. రెండా.. ఇలాంటివి మరెన్నో. అసలేం జరుగుతోంది? తప్పెవరిదో.. ఒప్పెవరిదో.. ఏ దేశమైతేనేం.. ఎవరిపై యుద్ధం చేస్తేనేం.. జరిగేదంతా వినాశనం, విధ్వంసం, జన హననమే. ఎప్పుడో 19వ శతాబ్దంలో దేశాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు, ప్రపంచ యుద్ధాల నుంచి నేడు ఉక్రెయిన్‌పై రష్యా దాడి దాకా.. యుద్ధోన్మాదం సృష్టిస్తున్న బీభత్సం ఇంతా అంతా కాదు. ఇంకా గుణపాఠాలు నేర్చేదెప్పుడు? – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
AP: విద్యుత్ కోతలు తాత్కాలికమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ కొరత కారణంగా ఎదురవుతున్న కరెంట్ కోతల నుంచి ఈ నెలాఖరుకల్లా ఉపశమనం కలుగుతుందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ తెలిపారు. బొగ్గు కొరత, రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం, దేశీయంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్‌తో ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని, త్వరలోనే విద్యుత్ అందుబాటులోకి వచ్చి, అంతా చక్కబడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ పరిస్థితిపై ‘సాక్షి ప్రతినిధి’కి శుక్రవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బొగ్గు దొరకడంలేదు గతేడాది అక్టోబర్ నుంచి అంతర్జాతీయంగా చైనా వంటి దేశాలు తీసుకున్న నిర్ణయాలవల్ల దేశంలో బొగ్గు కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం పెరిగి లభ్యత తగ్గిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసి రాష్ట్రాలకు కోటా నిర్ణయించి బొగ్గు కేటాయింపులు ప్రారంభించింది. మార్చిలో మళ్లీ బొగ్గు సంక్షోభం వస్తుందని, నిల్వలు పెట్టుకోమని సూచించింది. కానీ, దొరకడంలేదు. 5 లక్షల మెట్రిక్ టన్నుల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచాం. రూ.6 వేలు ఉండే బొగ్గు టన్ను రూ.17 వేల నుంచి రూ.40 వేలు పలుకుతుండటంతో ఆ ధరకు టెండరు ఇవ్వలేకపోతున్నాం. దీంతో కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి జరగడంలేదు. మార్చిలో రూ.1,258 కోట్లతో విద్యుత్ కొనుగోలు ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు దాదాపు 60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ప్రతిరోజూ సింగరేణి కాలరీస్, మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి 10 నుంచి 12 ర్యాకులు వస్తోంది. ఇది ఏ రోజుకారోజు ఉత్పత్తికి సరిపోతోంది. నిల్వ చేసుకోవడం కుదరడంలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు పోటీ పెరిగింది. కానీ, పవర్ ఎక్సే్ఛంజ్‌లో 14వేల మెగావాట్లు వరకూ అందుబాటులో ఉండే విద్యుత్ ప్రస్తుతం 2 వేల మెగావాట్లు మాత్రమే ఉంది. దీనిని కొనేందుకు దేశంలోని డిస్కంలన్నీ పోటీపడుతున్నాయి. ఇక్కడ యూనిట్ ప్రస్తుతం రూ.12 వరకూ ఉంది. ఆ రేటుకి కొందామన్నా కూడా దొరకడంలేదు. మార్చిలో రూ.1,258 కోట్లతో 1,551 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశాం. పల్లెల్లో గంట.. పట్టణాల్లో అరగంట.. గ్రిడ్ డిమాండ్ బాగా పెరిగినప్పుడు గృహాలకు గ్రామాల్లో ఒక గంట, పట్టణాల్లో అరగంట అధికారిక లోడ్ రిలీఫ్ అమలుచేయాల్సిందిగా డిస్కంలకు ఆదేశాలిచ్చాం. కోవిడ్ పూర్తిగా అదుపులోకి రావడంతో పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేయడం, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పెరగడంవల్ల విద్యుత్ వాడకం పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉంది. 2021తో పోలిస్తే 3.54 శాతం, 2020తో పోల్చితే 46 శాతం ఎక్కువ వినియోగం జరుగుతోంది. ఏపీజెన్కో, ఏన్టీపీసీ నుంచి 120 మిలియన్ యూనిట్లు ధర్మల్ విద్యుత్ అందుబాటులో ఉంది. జల, సౌర, పవన, న్యూక్లియర్ విద్యుత్ మొత్తం కలిపి 180 మిలియన్ యూనిట్ల వరకూ అందుబాటులో ఉండగా మరో 40–50 మిలియన్ యూనిట్లు కొనాల్సి వస్తోంది. పెరిగిన వ్యవసాయ వినియోగం 2019లో దాదాపు 17.3 లక్షల వ్యవసాయ సర్వీసుండగా, 2022కి వాటి సంఖ్య 18.5 లక్షలకు చేరింది. అంతేకాక.. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట విద్యుత్ సరఫరా అందించడంవల్ల రైతులు ఏడాది పొడవునా మూడు, నాలుగు పంటలు వేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగింది. ఇలా 2018–19లో 10,832 మిలియన్ యూనిట్లు.. 2021–22లో 12,720 మిలియన్ యూనిట్లు జరిగింది. అంటే దాదాపు 20 శాతం పెరిగింది. అయినప్పటికీ రైతులకు ఇబ్బంది రాకుండా 9 గంటలు విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోంది. నెలాఖరుకు కొరత తీరుతుంది పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించాలని, వారాంతపు సెలవుకు అదనంగా మరోరోజు పవర్ హాలిడే విధించాలని ఆంక్షలు పెట్టాం. దీనివల్ల 15 నుంచి 20 మిలియన్ యూనిట్లు విద్యుత్ మిగులుతుంది. నెలాఖరుకల్లా పంట కోతలు పూర్తికానుండటంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతుంది. దానివల్ల కనీసం 15 మిలియన్ యూనిట్లు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నాం. పవన విద్యుత్ మే, జూన్ నెలల్లో మరికొంత అందుబాటులోకి వస్తుంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం రూ.12 ఉన్న యూనిట్ ధర కూడా రూ.4లకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ నెలాఖరుకి విద్యుత్ కొరత సమస్య తీరుతుంది. ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు ఈ ఆదా తోడయితే విద్యుత్ కోతలు ఉండవని భావిస్తున్నాం. మొదలైన ‘పవర్ హాలిడే’ వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు పరిశ్రమలకు ఇంధన శాఖ ఈ నెల 22 వరకు ప్రకటించిన ‘పవర్ హాలిడే’ శుక్రవారం నుంచి రాష్ట్రంలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ (డిస్కం)లు తమ పరిధిలోని జిల్లాల వారీగా దీనిని అమలుచేస్తున్నాయి. పవర్ హాలిడే లేని రోజుల్లో పరిశ్రమలు ప్రతిరోజూ 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించాలని.. షాపింగ్ మాల్స్ తరహాలోని వాణిజ్య సముదాయాల్లో కూడా 50 శాతం మేరకు తగ్గించుకోవాలని.. ప్రకటనలకు సంబంధించిన సైన్ బోర్డులకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని, అలాగే ఏసీల వాడకాన్ని కూడా తగ్గించుకోవాలని డిస్కంల సీఎండీలు ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వినియోగదారులు కాల్ సెంటర్ నంబరు 1912కు ఫోన్‌చేసి విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు సూచించారు. చదవండి: వాళ్ల కడుపు మంటకు మందే లేదు: సీఎం జగన్ -
‘హస్త’వ్యస్తం.. చివరికి మిగిలింది ఆ ‘రెండే’..
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రాభవం రోజురోజుకూ మసకబారుతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమినే మూటగట్టుకుంటోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలబడింది. తాజాగా పంజాబ్‌ను చేజార్చుకుంది. 2012లో దేశంలో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమయ్యింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నిరాశ నెలకొంది. ప్రసుత్తం దేశంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు ప్రధానంగా ఆ పార్టీ ఓటమికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను దక్కించుకోలేదు. నిలబెట్టుకోవడం కష్టమైందా? 2004లో దేశంలో మధ్యప్రదేశ్, ఒడిశా, మిజోరం రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. 2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా పలు రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది. అయితే పదేళ్ల పాలన తర్వాత ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. 2014 తర్వాత జాతీయస్థాయిలో పట్టు కోల్పోయిన హస్తం పార్టీ రాష్ట్రాల్లోనూ అదే తోవలో నడిచింది. 2014 సాధారణ ఎన్నికల్లో కీలకమైన మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటమి చెందింది. 2016 ఎన్నికల్లో కేరళ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లో అధికారం కోల్పోయింది. 2017లో పంజాబ్‌లో అధికారంలోకి రాగా, ఉత్తరాఖండ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్‌లో ఓటమి పాలైంది. 2018లో మిజోరం, మేఘాలయా రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. 2021 ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పుదుచ్చేరి, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్లో ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఆ రెండే ‘చేతి’లో.. 2014లో భారతీయ జనతా పార్టీ చేతిలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 282 దక్కించుకుని బీజేపీ తొలిసారి సొంతంగా మెజారిటీ సాధించింది. అనూహ్యమైన ఈ అపజయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిగమిస్తుందనీ, మళ్లీ పుంజుకుంటుందనీ చాలామంది ఊహించారు. కానీ 2019 ఎన్నికల్లో మరోసారి భంగపాటుకు గురైంది. ఒక్కటొక్కటిగా రాష్ట్రాలు హస్తం చేజారిపోగా.. తాజాగా పంజాబ్‌లో కూడా అధికారం కోల్పోయింది. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మాత్రమే మిగిలాయి. -
ప్రజావైద్యంపై రూ. 1,698
సాక్షి, హైదరాబాద్: ప్రజావైద్యంపై తెలంగాణ సర్కారు భారీగా ఖర్చు చేస్తోంది. ఒక్కో వ్యక్తిపై ఖర్చులో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై చేస్తున్న తలసరి ఖర్చు రూ. 1,698గా ఉందని పేర్కొంది. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా రూ. 3,177 ఖర్చు చేస్తూ తొలి స్థానంలో నిలవగా రెండో స్థానంలో నిలిచిన కేరళ ప్రభుత్వం రూ. 2,272 ఖర్చు చేస్తోంది. యూపీ, జార్ఖండ్ అతితక్కువగా రూ. 801 చొప్పున మాత్రమే ఖర్చు చేస్తూ చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కంటే వ్యక్తిగతంగా ప్రజలు వైద్యంపై చేస్తున్న ఖర్చు అధికంగా ఉంది. తమ జేబు నుంచి వైద్యం ప్రజలు చేస్తున్న తలసరి ఖర్చు రూ. 2,120గా ఉంది. ఈ విషయంలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో ఉంది. అంటే ప్రభుత్వం, ప్రజలు కలిపి ఆరోగ్యం కోసం ఉమ్మడిగా తలసరి రూ. 3,818 ఖర్చు చేస్తున్నారు ప్రజలు సొంతంగా చేస్తున్న తలసరి ఖర్చు కేరళలో అత్యధికంగా రూ. 6,363 ఉండటం విశేషం. ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చుకన్నా రెండింతలకుపైగా కేరళ ప్రజలు తలసరి ఖర్చు చేస్తున్నారని నివేదిక తెలిపింది. అత్యంత తక్కువగా తమ జేబు నుంచి వైద్యం కోసం తలసరి ఖర్చు చేస్తున్నది బిహార్‌వాసులు. ఆ రాష్ట్రంలో ఒక్కొక్కరు రూ. 808 ఖర్చు చేస్తున్నారు. -
అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చైనా..
బీజింగ్: ప్రపంచలో అత్యంత ధనిక దేశంగా చైనా కొత్త రికార్డ్ సృష్టించింది. సంపద సృష్టిలో అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి నెంబర్ వన్‌గా డ్రాగన్ దేశం అవతరించింది. గడిచిన రెండు దశాబ్ధాల్లో ప్రపంచ సంపదలో చైనా సంపద మూడు రేట్లు పెరిగినట్లు బ్యూమ్బెర్గ్లోని నివేదిక వెల్లడించింది. మెకిన్సే అండ్ కో పరిశోధనా విభాగం 10 దేశాల బ్యాలెన్స్ షీట్లను విశ్లేషించి ఈ నివేదిక అందించినట్లు పేర్కొంది. ప్రపంచం మొత్తం ఆదాయంలో 60 శాతం ఈ పది దేశాల వద్దే ఉన్నట్లు పేర్కొంది. ఆ దేశాల జాబితాలో అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్లు ఉన్నాయి. మెకిన్సే ఏజెన్సీ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సంపద 2000లో 156 ట్రిలియన్ డాలర్లు ఉండగా ఇది 2020లో అనూహ్యంగా 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు వెల్లడించింది. దీనిలో చైనాకు అత్యధిక వాటా లభించిందని, ప్రపంచ ఆదాయంలో దాదాపు మూడో వంతు చైనా సొంతమైందని తెలిపింది. కాగా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు మనం సంపన్నులమయ్యామని జూరిచ్‌లోని మెకన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ భాగస్వామి జాన్ మిచ్‌కి తెలిపారు. 2000 సంవత్సరంలో 7 ట్రిలియన్ల డాలర్లు ఉన్న చైనా సంపద ఇప్పుడు 120 ట్రిలియన్ల డాలర్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా చేరిన తర్వాత ఆ దేశ సంపద దూసుకెళ్తున్నట్లు మెకన్సీ తన రిపోర్ట్‌లో తెలిపింది. మరోవైపు అమెరికా సంపద రెండితలు పెరిగి 90 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. చైనా, అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న దేశాలు. అయితే ఈ రెండు దేశాల్లో మూడింట రెండొంతుల సంపద కేవలం 10 శాతం కుటుంబాల వద్దే ఉందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం వారు మాత్రమే మరింత ధనవంతులు అవుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం నికర సంపద మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉందని నివేదిక తెలిపింది. -
టీ కొట్టు నడుపుతూ.. రోజూ రూ.300 దాచిపెట్టి.. ఏకంగా 25 దేశాలు..
కొచ్చి: జీవితంలో ప్రతీఒక్కరికీ ఓ కల ఉంటుంది. అయితే కొందరు పరిస్థితుల ప్రభావాల వల్ల మధ్యలోనే వదిలేస్తుంటే మరికొందరు అనుకున్నది ఎలాగైనా సాధిస్తున్నారు. అచ్చం ఇలానే ఓ వృద్ధ జంట ప్రపంచాన్ని చేట్టేయాలని కలలు కన్నారు. వాటిని ఇప్పడు నిజం చేసుకుంటున్నారు. ఇందులో ఏముంది ధనవంతులు అనుకుంటే ఇలాంటివి ఈజీనే అంటారా! అలా అనుకుంటే పొరపాటే.. ఆ దంపతులు టీ కొట్టు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అలా సంపాదించిన డబ్బులతోను వాళ్లు తమ విదేశి యాత్రలను స్టార్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన వృద్ధ జంట కె.ఆర్. విజయన్, ఆయన భార్య టీ కొట్టుతో జీవనం సాగిస్తుంటారు. ప్రపంచాన్ని చుట్టేయాలన్నది వారి చిరకాల స్వప్నం. అయితే వారికి చిన్న టీ కొట్టు మాత్రమే ఆదాయ మార్గం. ఉన్నదాంతోనే వారు తమ కలలను నిజం చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లే వారు ఇప్పటికే 25 దేశాలను చుట్టేయగా, తరువాత 26వ దేశానికి కూడా వెళ్లనున్నారు. వీరికి పెద్దగా ఇంగ్లిష్ మాట్లాడటం రాదు కాబట్టి ట్రావెల్ ఏజెన్సీల సాయం తీసుకొని వీరు తమ ప్రయాణాలు ఖరారు చేస్తుంటారు. యాత్ర ఇలా ప్రారంభమైంది కాఫీ షాపు నుంచి రోజు దాచిపెట్టిన డబ్బులు ద్వారా ఈ జంట 2007లో మొదటి సారిగా వారి విదేశీ పర్యటనను ఇజ్రాయల్‌తో మొదలుపెట్టింది. వీరి స్ఫూర్తిదాయక యాత్ర గురించి తెలియడంతో మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ అనంద్ మహింద్ర ఆ వృద్ధ జంటకు ఒక పర్యటనను స్పాన్సర్ కూడా చేసేందుకు ముందుకొచ్చారు. 2019లో.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సందర్శించారు. అదే వారు చేపట్టిన చివరి విదేశీ పర్యటన. ఎందుకంటే ఆ తర్వాత మహమ్మారి కారణంగా వారి ప్రపంచ యాత్రలకు బ్రేక్ పడింది. విదేశీ పర్యటనల కోసం ఈ జంట తమ ఆదాయం నుంచి ప్రతీ రోజు రూ.300 దాచిపెట్టేవారు. పర్యటనల కోసం కొన్న సార్లు వీరు అప్పులు చేసి తిరిగి వచ్చాక వాటిని తీర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే కరోనా నుంచి ప్రపంచం క్రమంగా బయటకు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ జంట మరోసారి విదేశీ యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వారు రష్యా వెళ్లనున్నారు. ఎలాగూ అంత దూరం వెళ్తున్నాం కదా కుదిరితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవాలనుకుంటోంది ఈ వృద్ధ జంట. అక్టోబర్ 21న ప్రారంభమయ్యే వీరి యాత్ర అక్టోబర్ 28న ముగియనుంది. చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. -
గృహ నిర్మాణంలో దేశానికే ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’కు సంబంధించి ఇంధన శాఖ చేపడుతున్న పనుల ప్రగతిపై ఆదివారం అజయ్ జైన్, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌లు మూడు డిస్కంల సీఎండీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా 28.30 లక్షల ఇళ్లను రెండు దశల్లో నిర్మిస్తున్నట్టు అజయ్ జైన్ చెప్పారు. ఆ ఇళ్లకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వం రూ.34,109 కోట్లు వెచ్చిస్తోందన్నారు. పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం దేశంలోనే లేదన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తిచేయాలని గడువు విధించినట్టు అజయ్ జైన్ చెప్పారు. విద్యుదీకరణకు రూ.7,080 కోట్లు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ పనులకు రూ.7,080 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి చెప్పారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లే అవుట్లకు ఓవర్ హెడ్, 550 ప్లాట్ల కంటే ఎక్కువగా ఉన్న లే అవుట్లకు భూగర్భ విద్యుత్‌ను అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా డిస్కంల సీఎండీలు హరనాథరావు(ఏపీఎస్పీడీసీఎల్), పద్మాజనార్దనరెడ్డి(ఏపీసీపీడీసీఎల్), సంతోషరావు (ఏపీఈపీడీసీఎల్)లు మాట్లాడుతూ ఓవర్ హెడ్ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.98,521, భూగర్భ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి రూ.1,32,284 ఖర్చవుతుందని తెలిపారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లే అవుట్లలో మొత్తం విద్యుదీకరణకు రూ.2,368 కోట్లు, 550 కంటే ఎక్కువగా ఉన్న లేఅవుట్లలో రూ.3,628 కోట్లు ఖర్చవుతుందన్నారు. 389లే అవుట్లకు భూగర్భ, 9,678 లే అవుట్లకు ఓవర్ హెడ్ విద్యుత్ అందిస్తున్నట్టు వారు వివరించారు. -
దేశంలోనే మొదటి వ్యక్తిగా మరగుజ్జు శివలాల్ రికార్డు
-
స్థిరంగా పెట్రో ధరలు, ఏ నెలలో ఎన్నిసార్లు పెరిగాయో తెలుసా?
దేశంలో డీజిల్,పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం రోజు చమురు ధరలు స్వల్పంగా పెరిగినా శుక్రవారం,శనివారం వాటి ధరలు అలాగే స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా మే 4 నుంచి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత చమరు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 4నుంచి మే 27 మధ్యకాలంలో 14 సార్లు, జూన్ నెలలో 16సార్లు, జులై నెలలో(ఈరోజు వరకు) 8 సార్లు పెరిగాయి. కాగా,చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి(ఒపెక్) లతో జరిగే చర్చల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. ఇప్పుడు అదే అంశం పెట్రో ధరలపై పడినట్లు తెలుస్తోంది. ఇక శనివారం రోజు పెట్రోల్ డీజిల్ ధరలు వివరాలు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54 గా ఉండగా డీజిల్ ధర రూ.89.87 గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.23 గా ఉండగా డీజిల్ ధర రూ.94.39 గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.54 గా ఉండగా డీజిల్ ధర రూ. 97.45గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.94 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.95.26 గా ఉంది. విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ.106.5 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.98.43గా ఉంది. -
‘పిట్ట’ పిచ్చి పరాకాష్ఠకు..!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ అన్ని హద్దులు దాటుతోంది. భారత ప్రభుత్వంతో గత కొన్ని నెలలుగా తలపడుతున్న ట్విట్టర్.. తాజాగా, మరోసారి కట్టుదాటి ప్రవర్తించింది. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను ప్రత్యేక దేశంగా తన వెబ్‌సైట్‌లోని ప్రపంచ చిత్రపటంలో చూపింది. ట్విట్టర్ వెబ్‌సైట్‌లోని ‘కెరియర్ సెక్షన్’లో పోస్ట్ చేసిన ప్రపంచ పటంలో ట్విట్టర్ ఈ దుందుడుకుతనం చూపింది. ట్విట్టర్ తీరుపై పెద్ద సంఖ్యలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తక్షణమే ట్విట్టర్ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చివరకు ఆ మ్యాప్‌ను ట్విట్టర్ తొలగించింది. భారత చిత్రపటంలో మార్పులు చేయడం ట్విట్టర్‌కు ఇది తొలిసారి కాదు. గతంలో లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతాన్ని చైనా దేశంలో అంతర్భాగంగా చూపింది. భారత్ తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన ఐటీ నిబంధనల అమలు విషయంలో ట్విట్టర్ కొన్నాళ్లుగా ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. కావాల్సినంత సమయం ఇచ్చినప్పటికీ భారత ఐటీ చట్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ట్విట్టర్‌కు భారత్‌లో చట్టబద్ధ రక్షణ కల్పించే ‘ఇంటర్మీడియరీ హోదా’ను సైతం మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తొలగించడం తెల్సిందే. దీంతో, ట్విట్టర్లో పోస్ట్ అయ్యే సంఘవ్యతిరేక అంశాలకు సంబంధించి ఆ సంస్థే నేరుగా చట్టబద్ధ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అక్టోబర్ నెలలో లేహ్‌లో జరిగిన ఒక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఆ ప్రాంతాన్ని చైనాలో భాగంగా ట్విట్టర్ తన జియోట్యాగింగ్‌లో చూపింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం కూడా ట్విట్టర్‌కు గట్టిగా హెచ్చరించింది. భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడాన్ని సహించబోమని స్పష్టం చేసింది. గత నవంబర్లోనూ లేహ్‌ను లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా కాకుండా, జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రాంతంగా ట్విట్టర్ చూపింది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు నోటీసు పంపించింది. మ్యాప్‌ల్లో తప్పులు లేకుండా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. మే 26 నుంచి నూతన ఐటీ నిబంధనల మేరకు ప్రత్యేకంగా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న, భారత్‌లోనే నివసించే గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్లను నియమించాలన్న ఆదేశాలను సైతం ట్విట్టర్ బేఖాతరు చేసింది. తాజాగా, శుక్రవారం కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతాను గంటపాటు స్తంభింపజేసింది. ట్విట్టర్ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్తున్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమం సమయం నుంచి ట్విట్టర్, కేంద్రం మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. -
లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ స్పష్టత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించనున్నారనే ఊహాగానాల మధ్య లాక్డౌన్ అంచనాలకు ప్రధాని తెరదించారు. మహమ్మారిపై మరోసారి భీకర యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కరోనా యుద్ధంపై గెలవాలని మోదీ దేశ వాసులకు పిలుపునిచ్చారు. మోదీ ప్రసంగంలోని కొన్ని ముఖ్య విషయాలు కరోనా సెకండ్ వేవ్ తుపానులా విస్తరిస్తోంది. కరోనాపై దేశం అతిపెద్ద యుద్దం చేస్తోంది.ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశ ప్రజలు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు చాలా బాధ కలిగిస్తున్నాయి.అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దేశంలో ఆక్సిజన్ డిమాండ్ భారీగా పెరిగింది. డిమాండ్ కు తగ్గ ఉత్పత్తికి, కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి కృషి చేస్తున్నాం. ఈ మేరకు పలు ఫార్మా కంపెనీలను సంప్రదించాం. భారీగా కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.దేశంలో తయారైన రెండు టీకాల ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాం. ఇప్పటికే 12 కోట్లమందికి పైగా వ్యాక్సిన్లు అందించాం. మే ఒకటవ తేదీనుంచి 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం. కొత్త వ్యాక్సిన్ కోసం ఫ్రాస్ట్ ట్రాక్ పద్ధతిని అవలంభించనున్నాం. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీమీ ప్రాంతాల్లో, అపార్ట్మెంట్లలో కమిటీలుగా ఏర్పడి జాగ్రత్తలు తీసుకోవాలి. అపుడిక కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు అవసరమే ఉండదు. కరోనా నియంత్రణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే అత్యవసర పరిస్థితి వస్తే బయటికి వెళ్లకుండా ప్రజలు నియంత్రణలో ఉండాలని, లాక్డౌన్ వైపు దేశం పయమనించకుండా జాగ్రత్తగా ఉండాలని మోదీ ప్రజలకు సూచించారు. -
తప్పులో కాలేసిన ఫేస్బుక్
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తప్పులో కాలేసింది. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఫేస్బుక్ పేర్కొంది. అయితే వెంటనే పొరపాటును గుర్తించి క్షమాపణలు ప్రకటించింది. ఇరానియన్ నెట్వర్క్ ద్వారా ప్రభావితమైన దేశాలు, ప్రాంతాలు జాబితాలో కశ్మీర్‌ను పొరపాటున చేర్చామని ఫేస్బుక్ ప్రకటనలో తెలిపింది. ఇరాన్ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మారిన దేశాలను ప్రస్తావించిన బ్లాగ్ పోస్టులో పెట్టిన జాబితాలో ఈ పొరపాటు దొర్లింది. ఇరాన్‌కు సంబంధించిన బహుళ నెట్‌వర్క్‌లు అనధీకృత చర్యలకు పాల్పడిన కారణంగా 513 పేజీలను, గ్రూపులు, ఇతర ఖాతాలను తొలగించినట్లు ఫేస్బుక్ పేర్కొంది. ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియాలతోపాటు కశ్మీర్‌ను సదరు దేశాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలోంచి కశ్మీర్ పేరును చేర్చి ఉండాల్సింది కాదనీ, ఈ గందరగోళానికి క్షమించాలని కోరింది. అలాగే కశ్మీర్ పేరును ఈ జాబితాలోంచి తొలగించామని ఫేస్బుక్ వెల్లడించింది. -
వ్యవస్థల కంటే దేశమే ముఖ్యం
న్యూఢిల్లీ: లిక్విడిటీ పెంచడం, వడ్డీ రేట్లు సహా ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి పలు డిమాండ్లు చేయడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమర్థించుకున్నారు. వ్యవస్థల కంటే దేశమే ఎంతో ముఖ్యమన్న విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ వ్యాపార సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఎన్నిక కావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అప్పుడే ఆర్థిక రంగానికి స్థిరత్వం ఏర్పడుతుందని, రక్షకుడిని మార్చాల్సిన అవసరం రాదన్నారు. ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు లేదా ఎన్నికల తర్వాత ప్రకటనలు చేయడం వేర్వేరని, దీర్ఘకాలిక విధానాలపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. -
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
-
రాజధర్మం
దేశాన్ని పాలించే రాజు నీతిమంతుడైతే, న్యాయ బద్ధంగా వ్యవహరిస్తే ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తే ఆ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. యధా రాజా తథా ప్రజా అని ఆర్యోక్తి. రాజును బట్టే ప్రజలు. చరిత్రలో చక్కని పాలన చేసి, గణుతికెక్కిన రాజులను రామునితోను, ఆ రాజ్యాన్ని రామరాజ్యంతోను పోలుస్తారు. రాముడు అంతటి ఆదర్శవంతుడైన పాల కుడు. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చిన పాలకుడు. ప్రాచీన సాహిత్యం ఓ విజ్ఞాన భాండాగారం. పాలకులు పాటించవలసిన ధర్మాలు అందులో చక్కగా చెప్పారు. సుస్థిర దేశ పాలనకు, దేశ సౌభా గ్యానికి అవి ఎంతో ఉపకరిస్తాయి. మహా భారతంలో సభా పర్వంలో నారదుడు ధర్మరాజు దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలడుగు తాడు. పాలకులైనవారు ఎలా ఉండాలో తెల్పుతా యవి. సర్వకాలాలకు వర్తించే ధర్మాలవి. రాజు ఎప్పుడూ ధర్మమందే మనసు నిలపాలి. తను చేయవలసిన రాజకార్యాలను సొంత బుద్ధితో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలోచించాలి. ఎందుకంటే అప్పుడు రాజు ఏకాంతంగా ఉంటాడు. అతని ఆలోచ నలకు ఏకాగ్రత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో యోగ్యులైన వాళ్లను, వారి వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి నియమించాలి. ముఖ్యంగా పన్నులు వసూలు చేయటంవంటి ధనార్జనకు సంబంధించిన పనులలో నిజా యితీపరులను, సమబుద్ధితో వ్యవహరించేవారిని, విలువలను పాటించే వారిని నియమించాలి. అవినీతిపరులను నియమిస్తే ప్రభుత్వ ధనానికి లోటు ఏర్పడుతుంది. ప్రజలకు ప్రభుత్వంపై విముఖత ఏర్పడుతుంది. దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోతారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల కుటుంబాలను రాజు శాశ్వ తంగా ఆదుకోవాలి. ప్రభుత్వం ఎప్పుడూ వ్యవసా యాన్ని, వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి. సమాజాభ్యుదయానికి ఇవి చాలా అవసరం. మహాభారత కాలం లోనే అధికాహారోత్పత్తికి విత్తనాలు, తక్కువ వడ్డీతో రుణాలు వ్యవసాయదారులకు ప్రభుత్వం ఇచ్చినట్లు నారదుని మాటల వల్ల తెలుస్తోంది. రాజు దృష్టిలో ప్రజలందరూ సమానమే. అయితే లోపమున్న పిల్లలను తల్లి ఇంకా ఎంత బాగా ప్రేమి స్తుందో అలా కుంటివారు, గుడ్డివారు, వికలాంగు లకు రాజు ప్రత్యేక సదుపాయాలు కలుగజేయాలి. ఎప్పుడో మహాభారత కాలం నాడు చెప్పిన ఈ రాజధర్మాలు ఇప్పటికీ ఎప్పటికీ శిరోధార్యాలు! వాసంతి -
స్త్రీవాద దేశంగా వేల్స్
వేల్స్ ప్రభుత్వాన్ని ‘ఫెమినిస్టు ప్రభుత్వం’గా మార్చేందుకు ఏం చేయాలన్న విషయమై ఆ దేశంలో ఇప్పుడు ఒక కమిటీ ఆధ్యర్యంలో దీర్ఘాలోచన సాగుతోంది! గ్రేట్ బ్రిటన్ పరిధిలోని ఒక దేశం వేల్స్. ఆ దేశ ఫస్ట్ మినిస్టర్ కార్విన్ జోన్స్ (అక్కడ ప్రధానిని ‘ఫస్ట్ మినిస్టర్’ అంటారు) బి.బి.సి. రేడియో 4 లోని ‘ఉమెన్స్ అవర్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘లైంగిక సమానత్వాన్ని సాధించేందుకు ‘ఫెమినిజం’ అనే భావనను పురుషులు అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం’ అని కూడా అన్నారు. బ్రిటన్ యువరాణి మేఘన్ మార్కెల్ తన అధికారిక జీవిత చరిత్రలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఈ సందర్భంగా ఆయన మద్దతు తెలిపారు. ‘నేను స్త్రీనైనందుకు, స్త్రీవాదినైనందుకు గర్విస్తున్నాను అని స్త్రీ అనగానే (మేఘన్ ఇలాగే అన్నారు) ఆమెను మనం ఒక సాధారణ స్త్రీగా కాకుండా, ఆమెనొక దుడుకుమోతుగా చూస్తాం. దీనిని బట్టి స్త్రీ,పురుష సమానత్వం కోసం మనమింకా ఎంతో దూరం ప్రయాణించవలసి ఉందని తెలుస్తోంది’ అన్నారు కార్విన్ జోన్స్. పదేళ్లుగా అధికారంలో ఉన్న జోన్స్ ఈ ఏడాది డిసెంబరులో పదవి నుంచి దిగిపోతున్నారు. ఆలోపే వేల్స్‌ను ‘స్త్రీవాద దేశం’గా మలుస్తానని తన ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముందైతే ఒక విధాన నిర్ణయాన్ని రూపొందించే పనిలో పడ్డారు. ఆయన తర్వాత వచ్చేవారు ఆ విధానాలను పాటిస్తారు. -
అర్థం చేసుకోకపోతే అనర్థమే
విశ్లేషణ నీటి పారుదల సౌకర్యం పరిమితంగా ఉండడంతో పాటు, తక్కువ దిగుబడి వల్ల కూడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మరొక అభిప్రాయం ఉంది. దీనిని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా అంగీకరిస్తున్నాయి. కానీ ఈ వాదాన్ని నమ్మడం ఎంతవరకు న్యాయం? పంజాబ్‌ను తీసుకోండి. ఆ రాష్ట్రం గోధుమ, వరి, మొక్కజొన్న పంటల దిగుబడిలో ప్రముఖ స్థానంలో ఉంది. కానీ అక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ వార్తలు వెలువడని రోజులు చాలా తక్కువ. నిరాశా నిస్పృహలలో కూరుకుపోయిన రైతులు తాము పండించిన టొమేటో, బంగాళదుంప, ఉల్లి వంటి పంటలను వీధులలోకి తెచ్చి పార బోస్తున్న విషాదకర దృశ్యాలను మనం ఈ మధ్య చూస్తున్నాం. గడచిన రెండేళ్ల కాలం నుంచి ఇందుకు సంబంధించిన వార్తా కథనాలు పత్రికలలో చాలా కనిపిస్తున్నాయి. కొన్ని వీడియోలు కూడా వైరల్ అయినాయి. అలాగే తన పొలంలోని క్యాలీఫ్లవర్ మొక్కలను ఆ రైతే నిరాక్షిణ్యంగా తుడిచి పెడుతున్న దృశ్యాల వీడియో కూడా అందులో ఉంది. పండించిన టొమేటో లను టన్నుల కొద్దీ నిరాశతో నదులలోకి, జాతీయ రహదారుల మీద పార బోస్తున్న దృశ్యాలు కూడా దర్శనమిస్తున్నాయి. దిగుబడి ఖర్చులతో పాటు, రవాణా ఖర్చులు కూడా రైతులు దక్కించుకోలేకపోతున్నారన్నది రూఢి అయిన వాస్తవం. ఇలాంటి వేదన నేపథ్యంలో తాము కష్టించి పండించిన పంటను వారే ధ్వంసం చేసుకుంటున్నారంటే ఆ పరిణామాన్ని, అందులోని క్షోభని మనం అర్థం చేసుకోవలసిందే. ఇంకా చెప్పాలంటే న్యాయమైన ఆదా యాన్ని సంపాదించుకునే హక్కును రైతులకు లేకుండా చేస్తున్నారు. జాతీయ నేరాల నమోదు సంస్థ రైతుల బలవన్మరణాల గురించి తాజాగా కొన్ని గణాంకాలను వెల్లడించింది. వీటినే పార్లమెంట్‌కు సమర్పిం చారు కూడా. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరను పొందలేకపోతున్నామన్న రైతుల ఆవేదనే నేటి వ్యవసాయ సంక్షోభానికి అసలు కారణమని ఆ గణాంకాల ద్వారా అర్థమవుతున్నది. 2015 సంవత్సరంలో 12,602 బలవన్మరణాలు నమోదు కాగా, 2016 సంవత్సరంలో 11,370 మరణాలు నమోదయ్యాయి. వీటిలో భూమిలేని వ్యవసాయ కార్మికుల బల వన్మరణాలను కూడా చేర్చారు. రైతుల దుర్మరణాల సంఖ్యను తగ్గించి చూప డానికి ప్రయత్నం జరిగినప్పటికీ రాష్ట్రాలలో ఆ మరణాల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. నీటి సదుపాయం అందుబాటులో ఉండి, చాలా శాతం భూమి సాగులో ఉన్న రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. మొదటి బలవన్మ రణాల సంఖ్యను తక్కువగా చూపించడం గురించి పరిశీలిద్దాం. గణాంకాలలో వాస్తవమెంత? పంజాబ్ రాష్ట్రంలో మొత్తం బలవన్మరణాల సంఖ్య 217 (2016 సంవత్స రంలో) అని నమోదు చేశారు. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (లూధియానా), పంజాబీ విశ్వవిద్యాలయం (పాటియాలా), గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం (అమృత్సర్) సభ్యులు ఇంటింటికీ తిరిగి రైతుల బలవన్మరణాల వివరాలను నమోదు చేశారు. వీరు నమోదు చేసిన బలవ న్మరణాల సంఖ్యలో జాతీయ నేరాల నమోదు సంస్థ ఇచ్చిన ఆ సంఖ్య మూడో వంతు మాత్రమే. విశ్వవిద్యాలయాల సర్వే వివరాల ప్రకారం గడచిన 17 సంవత్సరాలలో, అంటే 2000 సంవత్సరం నుంచి 16,600 మంది రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణం చెందారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ మూడు విశ్వవిద్యాలయాలు అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారం ఏటా సగటున 1,000 మంది బలవన్మరణం పాలయ్యారు. కానీ జాతీయ నేరాల నమోదు సంస్థ 271 బలవన్మరణాలుగా లెక్క చెప్పింది. నా ఉద్దేశం ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన పరిశోధకులు కూడా ఇలాంటి వ్యత్యాసాలనే నమోదు చేసి ఉంటారు. మళ్లీ రైతులలో పెరిగిపోతున్న ఆదాయ అభద్రత అంశం దగ్గరకి వద్దాం. పంజాబ్, హరియాణా, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో రైతుల బలవన్మరణాల రేటు గణనీయంగా పెరిగిపోయింది. అయితే దేశంలో 60 శాతం పంట భూమి నీటి పారుదల సౌకర్యానికి నోచుకోలేదు కాబట్టి, భారతదేశంలో రైతుల బలవన్మరణాలు పెరిగాయన్న అవగాహనను పైన చెప్పుకున్న వాస్తవం పూర్తిగా ఖండిస్తుంది. రుతుపవనాలలో ఏమాత్రం హెచ్చుతగ్గులు కనిపించినా, అది పంటల మీద ప్రభావం చూపించడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతాయి. వ్యవసాయ సంక్షోభం ఎప్పుడు వచ్చినా అందుకు కారణం దేశంలో నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేనిఫలితమేనని అంటూ ఉంటారు. అయితే ఇంతకు మించిన కారణాలు కూడా వ్యవసాయ సంక్షోభా నికి కారణమవుతున్నాయని నేను అంటాను. వ్యవసాయ రంగ సంక్షోభానికి చాలా కారణాలు మళ్లీ మళ్లీ చెప్పుకుం టూనే ఉంటాం. కానీ రైతులకు మార్కెట్లు లాభయదాయకమైన ఆదాయాన్ని ఇవ్వకపోవడమే సంక్షోభానికి మూలకారణమన్న ముగింపునకే వస్తాం. ఆహారపు గిన్నెలు అనదగిన పంజాబ్, హరియాణా రాష్ట్రాలనే తీసుకోండి! పంజాబ్‌లో 98 శాతం భూమికి నీటి పారుదల సౌకర్యానికి నోచుకుని ఉంది. ఆ రాష్ట్రంలో 2016లో సంభవించిన రైతు మరణాలు 271 అని జాతీయ నేరాల నమోదు సంస్థ పేర్కొన్నది. 2015లో సంభవించిన మరణాలు 124. అంటే 112 శాతం మరణాలు పెరిగాయి. హరియాణాలో కూడా 82 శాతం భూమి సేద్యానికి అనుకూలంగా ఉండి, నీటి పారుదల సౌకర్యంతో ఉంది. ఇక్కడ రైతుల బలవన్మరణాలు 54 శాతం పెరిగాయి. 2015 సంవత్సరంలో 162 బలవన్మరణాలు నమోదు కాగా, 2016లో అవి 250కి చేరుకున్నాయి. నీటి పారుదల సౌకర్యాలు లేకపోవడమే వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కార ణమైతే, నీటి పారుదల సౌకర్యం ఇతోధికంగా ఉన్న పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాలు రైతుల బలవన్మరణాలకు ఎందుకు కేంద్రాలుగా మారాయన్నది నాకు అర్థంకాని విషయం. మహారాష్ట్రలో రైతాంగ సంక్షోభా నికి మూలం తక్కువ స్థాయి నీటి పారుదల సౌకర్యమేనని నిపుణులు చెబు తుండగా నేను చాలాసార్లు విన్నాను. విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలు రైతుల ఆత్మహత్యలకు జాతీయ రాజధాని అనదగ్గ స్థాయికి చేరుకున్నాయి. నిజమే, మహారాష్ట్రలో కేవలం 18 శాతం భూమికే నీటి పారుదల సౌకర్యం ఉండడం వల్లనే రైతాంగ సంక్షోభానికి దారి తీసిందని నిపుణులు, ఆర్థికవేత్తలు ఒక నిర్ణయానికి రావడం ఆశ్చర్యం కాదు. కానీ పంజాబ్‌తో మహారాష్ట్రను పోల్చి చూసుకున్నప్పుడు ఆర్థికవేత్తలు, నిపుణులు అలాంటి నిర్ణయానికి ఎలా రాగ లుగుతున్నారని నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. పైగా పంజాబ్‌లో ప్రతి ఏటా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. పొంతనలేని సూత్రీకరణలు నీటి పారుదల సౌకర్యం పరిమితంగా ఉండడంతో పాటు, తక్కువ దిగుబడి వల్ల కూడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మరొక అభిప్రాయం ఉంది. దీనిని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, ఆఖరికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా అంగీకరిస్తున్నాయి. కానీ ఈ వాదాన్ని నమ్మడం ఎంతవరకు న్యాయం? ఇది వాస్తవమేనా? పంజాబ్‌ను తీసుకోండి. ఆ రాష్ట్రం గోధుమ, వరి, మొక్కజొన్న పంటల దిగుబడిలో ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో ఉంది. కానీ అక్కడ ఒకరు, ఇద్దరు, ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ వార్తలు వెలువడని రోజులు చాలా తక్కువ. హరియాణా కూడా అంతే. అక్కడ కూడా పంట దిగుబడి ఎక్కువే. పంజాబ్ తరువాత రెండో స్థానంలో ఈ రాష్ట్రం ఉంటుంది. అయితే అక్కడ కూడా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి ఒక విషయం సుస్పష్టం. సమస్య ఒక చోట ఉంది. దాని పరిష్కారం గురించి మనం మరో చోట ఎక్కడో వెతుకుతున్నాం. సాగు విస్తరణకు నీటి పారుదల సౌకర్యం పెరగాలని నేను కోరుకుంటాను. అలాగే పంట దిగుబడి పెంచాలని కూడా అభిప్రాయపడతాను. అయితే రైతాంగ నికర ఆదాయం పెరుగుదల అంశం కూడా దీనికి జోడించవలసి ఉంటుంది. నాకు తెలిసి, మన విధాన నిర్ణయాలు ఆహార నిల్వల ఉత్పత్తిలో పెరుగుదలను నమోదు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ రైతు చేతికి రావలసిన లాభదాయకమైన ఆదాయం గురించి ఆలోచించడం లేదు. ఇదే వాస్తవంగా రైతాంగ సంక్షోభానికి దారి తీస్తున్నది. ఏటా ప్రభుత్వం 23 పంటలకు ప్రకటించే కనీస మద్దతు ధర వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా నిర్ణయమవుతుంది. కానీ చాలా సార్లు ఈ కనీస మద్దతు ధర రైతు దిగుబడి వ్యయం కంటే చాలా తక్కు వగా ఉంటుంది. తను నష్టాలను పండిస్తున్నానని ఏ రైతు పంట వేసేటప్పుడు భావించడు. ఇదేం పెద్ద వింత కాదు. వ్యవసాయ ఆదాయం పెంపు భారత దేశ ఆర్థిక ఎజెండాలో ఏనాడూ అధిక ప్రాధాన్యానికి నోచుకోలేదు. ఆఖరికి కనీస మద్దతు ధర సంగతే తీసు కోండి. దేశంలో ఆరు శాతం రైతాంగం మాత్రమే తమ పంటలను ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు విక్రయించుకోగలుగుతున్నారు. మిగిలిన 94 శాతం రైతులు దోపిడీ మార్కెట్ల మీదే ఆధారపడి ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నది. ఇప్పుడు కూడా దేశంలోని 17 రాష్ట్రాలలో ఒక రైతు కుటుంబానికి ఏటా దక్కే సగటు ఆదాయం సంవత్సరానికి రూ. 20,000. ఇది 2016 ఆర్థిక సర్వే చెప్పిన వాస్తవం. అంటే తీవ్రమైన ఈ వ్యవసాయ సంక్షోభానికి మూలం ఇక్కడే ఉంది. 2016 నాటి జాతీయ నేరాల నమోదు సంస్థ చెప్పిన వాస్తవాలను ఇది తిరుగు లేకుండా నిరూపిస్తున్నది. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు hunger55@gmail.com -
దేశంలో విధ్వంసానికి పాక్ కుట్ర?
-
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రుల శోభ
-
గూగుల్ మ్యాప్స్ ప్రామాణికం కాదట!
న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్‌లు 'ప్రామాణికం' కాదని దేశంలోని టాప్ సర్వేయర్ సర్వే ఆఫ్ ఇండియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ మ్యాప్స్ లో అంత కచ్చితత్వం లేదంటున్నారు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. ఎందుకంటే వీటిని ప్రామాణికంగా ప్రభుత్వ రూపొందించలేదు కాబట్టి గూగుల్ మ్యాప్‌ను విశ్వసించవద్దంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన సర్వే ఆఫ్ ఇండియా ఈ వ్యాఖ్యలు చేసింది. గూగుల్ మాప్స్ అథెంటిక్ కాదని జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన స్వర్ణ సుబ్బారావు వ్యాఖ్యానించారు.దీనికి బదులుగా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉపయోగించాలని సూచించారు. గూగుల్ మ్యాప్స్ చూసి మోసపోవద్దనిన ఆయన హెచ్చరించారు. సర్వే ఆఫ్ ఇండియా (1767) 250 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టాంపును విడుదలకు నిర్వహించిన కార్యక్రమంలో ఒక ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. డెహ్రాడూన్‌లోని 250 ఏళ్ల ఇన్స్టిట్యూట్ భారతదేశ సర్వే ఆఫ్ ఇండియా తయారుచేసిన పటాలు అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉపయోగించినట్లు ఆమె చెప్పారు. రెస్టారెంట్లు, పార్కులను వెతికే చిన్న, చిన్న పనులకు మాత్రమే ఉపయోగిస్తున్నారని.. ప్రభుత్వం పెద్దగా ఈ మ్యాప్‌లపై ఆధారపడటంలేదని తేల్చి చెప్పారు. రోడ్ల నిర్మాణం, రైల్వే ట్రాక్‌ల ఏర్పాటు లాంటి కార్యక్రమాల కోసం సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను ఉపయోగిస్తుంటుంది కేంద్రం. ఏది ఏమైనా అభివృద్ధి పనులు సరైన సర్వే తర్వాత మ్యాపింగ్ ప్రారంభించాలని సూచించారు. మరోవైపు సర్వే ఆఫ్ ఇండియా సహా, గూగుల్ లాంటి వివిధ కంపెనీలు వేర్వేరు ప్రయోజనాల కోసం తయారు చేస్తున్న ఉపగ్రహ మ్యాపింగ్‌లను తిరస్కరించడం తప్పు అని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అశుతోష్ శర్మ చెప్పారు. భారతదేశ మొట్టమొదటి తపాలా స్టాంప్, భారత రాజ్యాంగం మొదటి కాపీని ముద్రించిన ఘనత సర్వే ఆఫ్ ఇండియాకు దక్కుతుందని కమ్యూనికేషన్ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు.