ప్రముఖ శాస్త్రవేత్త, గణిత మేథావి ఐజాక్ న్యూటన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పాఠశాల పుస్తకాలలో అతని పేరు తప్పక కనిపిస్తుంది. న్యూటన్ గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, వేదాంతవేత్త ఇలా మరెన్నో సుగుణాలు ఆయనలో ఉన్నాయి. అయితే న్యూటన్ తన గురుత్వాకర్షణ, చలన నియమాలకు ప్రసిద్ధి చెందారు. అయితే న్యూటన్ ఎక్కడ పుట్టారో తెలుసా? అలాగే ఆయనకు రెండు పుట్టిన రోజులు ఎందుకు వచ్చాయో తెలుసా?
న్యూటన్ ఇంగ్లాండ్‌లోని లింకన్‌షైర్ కౌంటీలోని వూల్‌స్టోర్ప్-బై-కోల్‌స్టర్‌వర్త్‌లోని వూల్‌స్టోర్ప్ మనోర్‌లో 1642, డిసెంబరు 25న జన్మించారు. న్యూటన్ పుట్టిన మూడు నెలలకు అతని తండ్రి కన్నుమూశారు. అతని పూర్తి పేరు ఐజాక్ న్యూటన్. న్యూటన్‌కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లి మరో వివాహం చేసుకుంది. ప్రపంచానికి వినూత్న ఆవిష్కరణలు అందించిన న్యూటన్ 1727 మార్చి 20న కన్నుమూశారు. వెస్ట్ మినిస్టర్ అబ్బేలో న్యూటన్ సమాధి ఉంది. న్యూటన్‌కు పిల్లలు లేరు. అతని ఆస్తిని బంధువులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూటన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. న్యూటన్‌కు రెండు పుట్టినరోజులు. నాటి రోజుల్లో అమలులో ఉన్న క్యాలెండర్ కారణంగా అతని పుట్టిన తేదీల మధ్య పది రోజుల తేడా ఉంది. న్యూటన్ పుట్టిన రోజు జనవరి 4నే కాకుండా, డిసెంబర్ 25న కూడా వస్తుంది. న్యూటన్ తన పుట్టినరోజును డిసెంబర్ 25న ఇంగ్లాండ్‌లో జరుపుకున్నారు. ఇంగ్లాండ్ వెలుపల అతని పుట్టినరోజు జనవరి 4 కింద లెక్కిస్తారు. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్‌ను ఇంగ్లాండ్‌లో ఉపయోగించారు. ఈ క్యాలెంటర్ యూరప్‌కు భిన్నమైనది. దీని ప్రకారం న్యూటన్ 1642, డిసెంబరు 25న జన్మించారు. ఆ సమయంలో ఐరోపాలో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరించేవారు. దీని ప్రకారం న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు.
Comments
Please login to add a commentAdd a comment