మహామేధావికి రెండు జననమరణాలు! | Isaac Newton Discoveries on his Birth Anniversary | Sakshi
Sakshi News home page

Newton Birthday: ఆ మహాశాస్త్రవేత్తకు రెండు జననమరణాలు

Published Sat, Jan 4 2025 7:24 AM | Last Updated on Sat, Jan 4 2025 10:06 AM

Isaac Newton Discoveries on his Birth Anniversary

ఐజాక్ న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళశాస్త్రాల్లో మహనీయునిగా పేరొందారు. ఆయన ప్రపంచానికి అందించిన పలు ఆవిష్కరణలు కొత్తదారులను చూపాయి. న్యూటన్ జననమరణాలకు సంబంధించిన అంశాలు ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తాయి.

బహుముఖ ప్రజ్ఞాశీలిగా..
ఐజాక్ న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. యాపిల్ కిందనే పడటానికి ‍న్యూటన్‌ చెప్పిన కారణం, ఆయన అందించిన చలన నియమాల గురించి చాలా మందికి తెలుసు. కానీ న్యూటన్‌ ప్రపంచానికి అనేక ఇతర ఆవిష్కరణలను కూడా అందించారు. గణిత శాస్త్రజ్ఞునిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా న్యూటన్‌ ప్రపంచానికి సుపరిచితమే. న్యూటన్‌ అందించిన ఆవిష్కరణలు  కొన్నిరంగాల్లో సమూల మార్పులను తీసుకువచ్చాయి.

రెండు పుట్టినరోజులు
న్యూటన్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, అతనికి రెండు పుట్టినరోజులున్నాయి. న్యూటన్‌ జీవించివున్న కాలంలో వినియోగంలో ఉన్న క్యాలెండర్ల కారణంగా అతని పుట్టిన తేదీలలో పది రోజుల వ్యత్యాసం  కనిపిస్తుంది. న్యూటన్‌ పుట్టినరోజు జనవరి 4 అని కొందరు పరిణిస్తుండగా, డిసెంబర్ 25న  అతని పుట్టినరోజును జరుపుకునేవారున్నారు. నిజానికి న్యూటన్ తన పుట్టినరోజును డిసెంబర్ 25న ఇంగ్లాండ్‌లో జరుపుకున్నారు. అయితే ఇంగ్లాండ్ వెలుపల అతని పుట్టినరోజు జనవరి 4న చేసుకుంటారు.

అధికారిక జన్మదినం
న్యూటన్ ఇంగ్లాండ్‌లోని వూల్‌స్టోర్ప్‌లోని మనోర్ హౌస్‌లో జన్మించారు. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్‌ను ఇంగ్లాండ్‌లో ఉపయోగించేవారు. ఇది యూరప్‌కు భిన్నంగా ఉండేది. దీని ప్రకారం చూస్తే న్యూటన్ 1642, డిసెంబర్‌ 25న జన్మించారు. అయితే అదే కాలంలో ఐరోపాలో గ్రెగోరియన్ క్యాలెండర్‌కు ఆమోదం లభించింది. ఇదే నేడు అందరూ ఉపయోగిస్తున్న క్యాలెండర్‌. దీని ప్రకారం చూసుకుంటే న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. ఇదే తరువాతి కాలంలో న్యూటన్‌ అధికారిక పుట్టిన తేదీగా పరిగణించారు.

కెమిస్ట్రీలో అమితమైన ఆసక్తి
గురుత్వాకర్షణ భావన న్యూటన్ సిద్ధాంతానికి ముందే ఉన్నప్పటికీ, న్యూటన్ అందించిన సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపధ్యంలో న్యూటన్‌ సైన్స్‌లో కొత్త శకాన్ని ప్రారంభించారని అంటారు. ఆయన కాలిక్యులస్‌ని కనిపెట్టడం ద్వారా గణితానికి కొత్త శాఖను అందించారు. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్‌ను తయారు చేసిన మహనీయునిగానూ న్యూటన్‌ పేరొందారు. ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది అయిన ప్రిజం ద్వారా తెల్లని కాంతితో కూడిన రంగుల వర్ణపటాన్ని మొదటిసారి న్యూటన్‌ ప్రపంచానికి చూపించారు. న్యూటన్‌కు కెమిస్ట్రీలో  ఎంతో ఆసక్తి ఉంది. ఆయన రసాయన శాస్త్రంపై పలు రచనలను సాగించారు. రచయితగానూ పేరొందారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
జూలియన్ క్యాలెండర్‌ క్యాలెండర్ ప్రకారం న్యూటన్‌ 1727, మార్చి 20న మరణించారు. గ్రెగోరియన్ క్యాలెండర్‌ ప్రకారం అదే ఏడాది మార్చి 31న న్యూటన్‌ కన్నుమూశారు. న్యూటన్‌ నిద్రలో మరణించారని చెబుతారు. అతని మరణం తరువాత అతని శరీరంలో పెద్దమొత్తంలో పాదరసం కనుగొన్నారని అంటారు. న్యూటన్‌ తన జీవితంలోని తుదిదశలో మానసిక ఆరోగ్యంతో బాధపడ్డారు. నిరాశా నిస్పృహలకు గురయ్యారు. చుట్టుపక్కలవారిని కలుసుకోవడం మానేశారు. న్యూటన్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగాయి.

ఇది కూడా చదవండి: టెన్త్‌ అర్హతతో 10 మెడికల్‌ కోర్సులు.. తక్షణ ఉపాధి.. అధిక జీతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement