USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది? | Indian origin Student Sudiksha Konanki missing At Dominican Republic | Sakshi
Sakshi News home page

USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

Published Mon, Mar 10 2025 9:53 AM | Last Updated on Mon, Mar 10 2025 11:00 AM

Indian origin Student Sudiksha Konanki missing At Dominican Republic

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి(20) మిస్సింగ్‌ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కరేబియన్‌ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష ఓ బీచ్‌ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటోంది. అక్కడే పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో ఆమె చదువుకుంటున్నారు. అయితే, గత వారం ఆమె తన స్నేహితులతో కలిసి కరేబియన్‌ దేశానికి విహారయాత్రకు వెళ్లారు. ఐదుగురు అమ్మాయిలతో కలిసి డొమినికన్‌ రిపబ్లిక్‌లోని ప్రముఖ పర్యటక పట్టణమైన ప్యూంటా కానా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మార్చి ఆరో తేదీన స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్‌ వద్ద బీచ్‌ వెంట నడుచుకుంటూ కనిపించారు. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురై పోలీసులను సంప్రదించారు.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సముద్ర తీరం వద్ద, సముద్రం లోపల డ్రోన్లు, హెలికాప్టర్లతో గత నాలుగు రోజులుగా ఆమె కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఏ ఆచూకీ లభించకపోవడంతో బహుశా ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు.. సుదీక్ష ఆచూకీ తెలియకపోవడంతో ఆమె పేరెంట్స్‌ ఆందోళన చెందుతున్నారు.

ఈ సందర్బంగా ఆమె తండ్రి కోణంకి సుబ్బరాయుడు తాజాగా మాట్లాడుతూ..‘తప్పిపోయిన సుదీక్ష కోసం పోలీసులు గాలిస్తున్నారు. రిసార్ట్‌ పరిసరాలు, సముద్రం వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కిడ్నాప్‌, మానవ అక్రమ రవాణా వంటి అవకాశాలను కూడా పరిశీలించాలని పోలీసులను కోరాం’ అని చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement