Dominican Republic
-
మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం
సాంటో డొమింగో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్ దేశం కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ఆయనకు అందించింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గుయానా చేరుకున్నారు. అక్కడ డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఆయనన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో మోదీని డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ సత్కరించారు. కరోనా టైంలో తమ దేశానికి మోదీ నేతృత్వంలో భారత్ అందించిన సహకారం.. అందులో ఆయన పాత్రను బర్టన్ ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే.. Gratitude to President Sylvanie Burton of Dominica for conferring the 'Dominica Award of Honour' upon me. This honour is dedicated to my sisters and brothers of India. It is also indicative of the unbreakable bond between our nations. pic.twitter.com/Ro27fpSyr3— Narendra Modi (@narendramodi) November 20, 2024ఈ అవార్డును భారతీయ సోదర సోదరీమణులకు అంకితం ఇస్తున్నానని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు జార్జ్‌టౌన్‌లో డొమెనికా ప్రధాని రూజ్వె స్కెర్రిట్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. 1981 నుంచి ఈ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు.. 2019లో ఇండి-క్యారీకామ్లో భాగంగా మోదీ-స్కెర్రిట్ న్యూయార్క్‌లోనూ భేటీయ్యారు. కరోనా టైంలో ఈ దేశానికి భారత్ వ్యాక్సిన్ సహకారం అందించింది కూడా. -
మోదీకి డొమినికా జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి విజృంభించి దేశాన్ని కలావికలం చేస్తున్న వేళ భారత్ అందించిన ఆపన్నహస్తంతో తెరిపినపడిన డొమినికా దేశం తన కృతజ్ఞత చాటుకునేందుకు సిద్ధపడింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయానికి గుర్తుగా మోదీకి ‘ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ను ప్రదానం చేయనున్నట్లు ది కామన్వెల్త్ ఆఫ్ డొమినికా గురువారం ప్రకటించింది. భారత ప్రభుత్వ ఉదార గుణాన్ని స్మరించుకుంటూ ఆ దేశ ప్రధాని హోదాలో ఉన్న మోదీకి తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గయానాలోని జార్జ్‌టౌన్ పట్టణంలో నవంబర్ 19 నుంచి 21వ తేదీదాకా జరిగే ఇండియా–కరికోమ్ శిఖరాగ్ర సదస్సులో మోదీకి ఈ అవార్డ్‌ను అందజేస్తారు. ‘‘2021 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఆదేశాలతో భారతసర్కార్ మాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనికా కోవిడ్19 వ్యాక్సిన్లు అందించింది. మా స్థాయికి అది పెద్ద సాయం కావడంతో వాటిలో కొన్నింటిని మా పొరుగు దేశాలకూ సాయంగా అందించగలిగాం. ఆరోగ్యం, వైద్యం, సమాచార సాంకేతిక రంగాల్లోనూ భారత్ మాకు ఎంతో సాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో వాతావరణమార్పు నిరోధక చర్యలు చేపట్టడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకను గుణంగా ముందడుగు వేయడంలో మాకు వెన్నంటి నిలిచింది’’ అని ఆ దేశ ప్రధాని కార్యాలయం కొనియాడింది. -
అమ్మకానికి అందమైన ఐలాండ్ పాస్‌పోర్ట్‌లు
అందమైన కరేబియన్ ద్వీప దేశం డొమినికా తమ దేశ పాస్‌పోర్ట్‌లను అమ్మకానికి పెట్టింది. ఏడేళ్ల క్రితం మారియా హరికేన్ విధ్వంసంతో దెబ్బతిన్న ఈ ఐలాండ్ పునర్నిర్మాణానికి విభిన్న రీతిలో నిధుల సమీకరణ చేపడుతోందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది.ప్రపంచంలోనే వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలిచిన అత్యంత దృఢమైన ద్వీపంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కరేబియన్ దేశం.. ఇందుకోసం భారీ అప్పులు చేయకుండా, సంపన్న దేశాల సహాయం కోసం ఎదురుచూడకుండా నిధులు సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా చైనా, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని సంపన్నులకు పాస్‌పోర్ట్‌ల ద్వారా తమ దేశ పౌరసత్వాన్ని విక్రయిస్తోంది.ఆ దేశ పౌరసత్వ ప్రదాన కార్యక్రమం 90ల నాటి నుంచే ఉన్నప్పటికీ హరికేన్ తర్వాత వేగంగా విస్తరించింది. ఇదే దేశ ఆదాయానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ నిధులను కొత్త మెడికల్ క్లినిక్‌లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వినియోగిస్తున్నారు. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిన్ బారన్ ఈ చొరవను ఆపద్బాంధవిగా పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఈ కార్యక్రమం తమకు "స్వయం-స్వతంత్ర ఫైనాన్సింగ్"గా ఉపయోగపడుతోందని ఆర్థిక మంత్రి ఇర్వింగ్ మెక్ఇన్టైర్ చెబుతున్నారు.ఈ పౌరసత్వ కార్యక్రమం విజయవంతం అయినప్పటికీ, పారదర్శకత, భద్రతా సమస్యలపై ఆందోళనలను పెంచింది. ఈ దేశ పౌరసత్వ కనీస ధర ఇటీవలే 2 లక్షల డాలర్లకు (రూ. 1.68 కోట్లు) పెరిగింది. అయినప్పటికీ ఇదే ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన ఎంపికలలో ఒకటిగా ఉంది. 71,000 జనాభా కలిగిన ఒక చిన్న ద్వీపంలో పౌరసత్వాన్ని పొందినవారిలో కొంతమంది ఇక్కడ నివసిస్తున్నారు. -
ఏంటీ?.. మరుగు నీటి సరోవరమా!
ప్రపంచంలో అక్కడక్కడా వేడినీటి బుగ్గలు ఉంటాయి. వేడినీటి బుగ్గల్లోని నీళ్లు సాధారణంగా స్నానానికి అనువుగా ఉంటాయి. డోమనికా రాజధాని రోసోకు చేరువలోని మోర్నె ట్రాయిస్ పిటోన్స్ నేషనల్ పార్కులో ఏకంగా మరుగునీటి సరోవరం ఉంది. దీనిని తొలిసారిగా 1870లో ఇద్దరు బ్రిటిష్ వ్యక్తులు గుర్తించారు. ఈ సరోవరంలోని నీటి ఉష్ణోగ్రత 82 డిగ్రీల నుంచి 92 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఇందులోని నీరు నిత్యం సలసల మరుగుతూ పొగలు కక్కుతూ ఉంటుంది. డోమనికా వచ్చే విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా ఈ సరోవరం చూడటానికి వస్తుంటారు. దీని ఒడ్డున నిలబడి ఫొటోలు దిగుతుంటారు. (చదవండి: యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం) -
భారత్ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను కొనసాగిస్తోంది!కానీ ఆ ఒక్క దేశం..
భారత ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను కొనసాగించేందకు యత్నిస్తోంది అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. భారత తన సంబంధాలను తన వ్యక్తిగత దృక్ఫథంతోనే దృష్టి సారిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా, యూరప్, రష్యా, జపాన్‌తో సహా తదితర దేశాలతో ప్రత్యేకతను కోరుకోకుండా తన సంబంధాలను ముందుకు సాగేలే యత్నించిందన్నారు. కానీ చైనా మాత్రం వేరే కోవా కిందకి వస్తుందన్నారు. ఈ మేరకు జైశంకర్ డోమినికన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రసంగంలో ఈ వ్యాఖ్యల చేశారు. 2015లో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ హిందూ మహాసముద్రం దాని దీవుల అంతట విస్తరించి ఉన్న సమగ్ర దృక్పథాన్ని వ్యక్తికరించారు. ఆ తర్వాత ఉద్భవించిన ఇండో పసిఫిక విజన్ నుంచి మధ్య ఆసియా వరకు భారత్ ప్రభావవంతంగా తన వ్యూహాన్ని అనుసరించింది. దీంతో బహుళ దేశాలతో సంబంధాలను నెరపగలిగే స్థాయికి చేరుకుంది. కానీ చైనా విషయం అలా కాదని, సరిహద్దు ఒప్పందాల ఉల్లంఘన ఫలితం కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు అసాధారణంగా ఉన్నట్లు చెప్పారు. భారత్ తన పొరుగు దేశాలకు ప్రాధాన్యత ఇస్తుందని, తన ఆర్థిక బలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్న, పెద్ద పోరుగుదేశాలకు తన సహాయ సహాకారాలను అందిస్తుందన్నారు. నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీకే ప్రాధాన్యత ఇస్తుందని నొక్కి చెప్పారు. అందులో భాగంగానే శ్రీలంకకు నాలుగు బిలయన్ల ఆర్థిక సాయాన్ని అందించిందన్నారు. ఐతే సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే పాకిస్తాన్ దీనికి మినహాయింపు అని చెప్పారు. భారత్ తనకు అన్ని దిశలలో ఉన్న పొరుగు ప్రాంతాలకు సహాయ సహకారాలను అందిస్తూ తన సంబంధాలను ఏర్పరుచకున్నట్లు తెలిపారు. దీని ఫలితంగా క్వాడ్ సముహంగా ఏర్పడిందని, తద్వారా భారత్ మరింతగా తన సంబంధాలను విస్తరించుకుందన్నారు. అలాగే గల్ఫ్, మధ్య ప్రాచ్య దేశాలతో భారత్ సంబంధాలు గుర్తించ తగిన విధంగా ఉన్నాయన్నారు. భారత్ ఇజ్రాయెల్, యూఏఈ, యూఎస్ఏతో కలిసి ఐ2యూ2 అనే కొత్త సముహం ఏర్పడింన్నారు. దీంతో ఇరువైపులా ఉన్న ఈ రెండు ప్రాంతాలు భారత్‌కి ప్రధాన వాణిజ్య పెట్టుబడి కేంద్రాలుగా ఉద్భవించాయని జెశంకర్ అన్నారు. కాగా, ఆయన ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 29 వరకు డోమికన్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్నారు. (చదవండి: మన్‌కీబాత్ కార్యక్రమంలో అనూహ్య ఘటన..ఓ మహిళకి నొప్పులు రావడంతో..) -
డొమినికన్ రిపబ్లిక్లో కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి
శాంటా డొమింగో: కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలను కొల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, శాంటో డొమింగోలో.. ఒక ప్రైవేటు విమానం లా ఇసబెల్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఫ్లోరిడా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ విమానంలో ప్రముఖ ప్యూర్టోరికన్ సంగీత నిర్మాత జోస్ ఏంజెల్ హెర్నాండెజ్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన ‘ఫ్లోలా మూవీ, టె బోటే’వంటి హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. హెర్నాండెజ్ 38 ఏళ్లకే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మృతి చెందిన వారిలో అమెరికాకు చెందిన ఆరుగురు, డొమినికన్ రిపబ్లిక్ నుంచి ఇద్దరు, వెనిజులాకు చెందిన మరో ప్రయాణికుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: బంగ్లాలో భారత రాష్ట్రపతికి ఘనస్వాగతం -
రూ.2.75 లక్షల పూచీకత్తుతో చోక్సీకి బెయిల్
న్యూఢిల్లీ: అక్రమంగా దేశంలోకి ప్రవేశించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీకి డొమెనికా హైకోర్టు సుమారు రూ.2.75 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా బార్బుడాకు చోక్సీ వెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. దీంతో చోక్సీని ఇండియాకు తీసుకురావాలన్న యత్నాలకు విఘాతం కలిగినట్లయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడైన చోక్సీ 2018 నుంచి ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. ఇటీవలే ఆయన్ను కొందరు అపహరించి డొమెనికాకు తీసుకుపోవడం కలకలం సృష్టించింది. చోక్సీ అక్రమ చొరబాటుపై మెజిస్ట్రేట్ కోర్టు ముందు జరిగే విచారణపై కూడా స్టే మంజూరు చేసింది. చికిత్స అనంతరం చోక్సీ విచారణకు హాజరుకావాల్సిందేనని, ఈ విషయంలో బెయిల్ కుదరదని తెలిపింది. -
Mehul Choksi కిడ్నాప్: డొమినికా ప్రధాని స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కామ్ ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సిని ఆంటిగ్వా నుంచి బలవంతంగా అపహరించడం వెనుక తమ ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలను డొమినికా ప్రధాని రూజ్వెల్ట్ కొట్టి పారేశారు. ఆ దేశంలో ప్రసారమయ్యే ఒక వీక్లీ షోలో పాల్గొన్న రూజ్వెల్ట్, ఇవన్నీ అర్ధం లేని ఆరోపణలని వ్యాఖ్యానించారు. కోర్టు తన పని తాను చేస్తుందని, అలాగే తమ రాజ్యాంగం ప్రకారం చోక్సి ఉన్న హక్కులకు రక్షణ లభిస్తుందని తెలిపారు. భారత్ నుంచి పారిపోయిన చోక్సి 2018 నుంచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. ఆదేశం నుంచి చోక్సిని భారత్‌కు రప్పించడంలో కాలయాపన జరుగుతున్నందున అతన్ని భారత ప్రభుత్వంతో కలిసి రూజ్వెల్ట్ ప్రభుత్వం అపహరించిందని డొమినికాలో ఆరోపణలున్నట్లు ఆదేశ మీడియా తెలిపింది. వీటిని రూజ్వెల్ట్ తోసిపుచ్చారు. అలాంటి పనుల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. అయితే ఒకదేశంలో ఒక నేరం చేసి మరో దేశంలో హాయిగా తిరగనివ్వడం మంచిదా? లేక ఆ దేశం నుంచి హంతకుడిని తీసుకువచ్చి శిక్షించడం మంచిదా? ఆలోచించాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తులను వారి అంతస్తులను బట్టి తమ దేశం ప్రవర్తించే తీరులో మార్పుఉండదని, అందరినీ చట్టం ముందు సమానంగా చూస్తామని తెలిపారు. అయితే చోక్సి లాయర్లు మాత్రం ఇది ప్రభుత్వాల పనేనని ఆరోపిస్తున్నారు. డొమినికా లేదా ఆంటిగ్వా ప్రభుత్వాలకు ఇందులో ప్రమేయం ఉందని తేలితే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. మరోవైపు పారిపోయిన వ్యాపారవేత్తలు మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలపై చట్టపరమైన చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ శుక్రవారం (జూలై 2 ) తెలిపింది. మెహుల్ చోక్సీకిడ్నాప్ ఆరోపణలను డొమినికన్ ప్రధాని ఖండించిన నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ)ఈ ప్రకటన చేసింది. మెహుల్, నీరవ్లపై చర్యలు, స్వదేశానికి రప్పించే చర్యలపై ప్రశ్నించినపుడు చట్ట పరమైన అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని విదేశాఖ అధికారిక ప్రతినిధి అరిందం బాగ్చి వ్యాఖ్యానించారు. -
డబ్బు ఎర చూపి వీవీఐపీ ట్రీట్మెంట్ పొందిన చోక్సి
రోజో: భారత్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ. 13,500 కోట్ల మేర మోసం చేసిన మెహుల్ చోక్సి డొమినికా రాజధాని రోజోలోని ఆస్ప త్రిలో వీవీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నట్లు సమాచారం. డొమినికాలో న్యాయ పర్యవేక్షణలో ఉన్న ఆయన 2 వారాల క్రితం ఆరోగ్యం బాగోలేదంటూ ఆస్పత్రిలో చేరారు. అనంతరం తనకు చల్లదనం కోసం ఏకంగా ఆస్పత్రికే ఏసీలు దానం చేశాడని, వైద్యులకు లంచాలిచ్చి వీవీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నాడని తెలుస్తోంది. ఈ వ్యవహారం మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని, చోక్సి మరోసారి దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. గురువారం ఆయన రోజోలోని కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, అనారోగ్య కారణాలను చూపి హాజరుకాలేదు. చివరకు కోర్టు.. చోక్సి చికిత్స పొందుతున్న ఆస్పత్రి గదినే జైలుగా మార్చాలని ఆదేశించింది. -
చోక్సికి డొమినికా హైకోర్టు బెయిల్ నిరాకరణ
డొమినికా: పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆర్థిక కుంభకోణంలో నిందితుడు మెహుల్ చోక్సికి డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ ఇవ్వడానికి ఆ దేశ హైకోర్టు నిరాకరించింది. బెయిల్ మంజూరు చేస్తే చోక్సి దేశం విడిచిపెట్టే అవకాశాలున్నాయన్న ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. డొమినికాతో చోక్సికి సంబంధ బాంధవ్యాలు లేవని, అతనిపై కోర్టు కూడా ఎలాంటి ఆంక్షలు, షరతులు విధించలేదని న్యాయమూర్తి ఆడిరిన్ రాబర్ట్స్ వ్యాఖ్యానించారు. వెనక్కి రప్పించడానికి భారత్ ప్రయత్నాలు చోక్సిని భారత్‌కు వెనక్కి రప్పించడానికి విదేశాంగ శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. డొమినికా న్యాయస్థానంలో విదేశాంగ శాఖ, సీబీఐ రెండు వేర్వేరు ఇంప్లీడ్ పిటిషన్లను దాఖలు చేశాయి. చోక్సి పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు అన్న అంశాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించడానికి సీబీఐ పకడ్బందీగా అన్ని అంశాలను తన పిటిషన్లో జతపరిచింది. మరోవైపు విదేశాంగ శాఖ చోక్సి భారతీయుడన్న విషయాన్ని కోర్టులో రుజువు చేసే సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. చోక్సి మాత్రం తాను భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నానని, ప్రస్తుతం తాను ఆంటిగ్వా పౌరుడునని వాదిస్తున్నారు. -
చోక్సీకి కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి,న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. క్యూబాకు పారిపోతూ డొమినికాలో అరెస్ట్ అయిన చోక్సీకి డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్లైట్ రిస్క్ కారణాలతో బెయిల్ ఇవ్వలేమని అక్కడి న్యాయమూర్తి వైనెట్ అడ్రియన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. అలాగే చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు కూడా ఉందని న్యాయవాది లారెన్స్ వాదించారు. కాగా పీఎన్బీ బ్యాంకులో 13,500 కోట్ల రూపాయల స్కాం కేసులో నిందితుడగా ఉన్న చోక్పీ 2018లో అంటిగ్వాకు పారిపోయిన సంగతి తెలిసిందే. మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వాన్ని అనుభవిస్తున్న చోక్సీ మే 23న ఆంటిగ్వానుంచి పారిపోతూ డొమినికాలో అరెస్టయ్యాడు. దీంతో అక్కడ విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు చోక్సీని అక్రమ వలసదారుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. చదవండి : చోక్సీ గర్ల్‌ఫ్రెండ్ : మరో ట్విస్టు క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్ -
క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, డొమినికాలో కోర్టు విచారణని ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డొమినికా మీదుగా క్యూబాకు పారిపోవాలని చోక్సి పన్నాగం పన్నాడని ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా చెప్పారు. వచ్చేసారి క్యూబాలో కలుసుకుంటామని చోక్సి తనతో చెప్పినట్టుగా ఆమె ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ అతను క్యూబాలో స్థిరపడాలని భావించాడు’అని బార్బరా చెప్పారు. చోక్సికి తాను గర్ల్‌ఫ్రెండ్‌ని కాదన్నారు. చోక్సి నేరస్తుడని తెలీదు చోక్సి పరారీలో ఉన్న నేరస్తుడని తనకు అసలు తెలీదని, అతని అసలు పేరు, బ్యాక్ గ్రౌండ్ ఏదీ తనకు తెలీదని బార్బరా చెప్పారు. ‘నేను యూరోపియన్‌ని. భారత ఆర్థిక నేరగాళ్ల జాబితా గురించీ తెలీదు. చోక్సి అసలు పేరేమిటో గత వారం వరకు నాకు తెలీదు. గత ఏడాది ఆగస్టులో మొదటిసారి చోక్సిని కలుసుకున్నాను. తన పేరు రాజ్ అని పరిచయం చేసుకున్నాడు. తరచు నాకు మెసేజ్‌లు పెడుతూ ఉండేవాడు. కానీ నెలకోసారి మాత్రం రిప్లయ్ ఇచ్చేదాన్ని’ అని చెప్పారు. మరోవైపు ఆంటిగ్వాలో కిడ్నాప్ చేసి తనను డొమినికాకు తీసుకువచ్చారని, ఆ కిడ్నాప్‌లో బార్బరా హస్తం కూడా ఉందంటూ చోక్సి చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. మెహుల్ చోక్సి బెయిల్ పిటిషన్ విచారణని డొమినికా హైకోర్టు 11వ తేదీకి వాయిదా వేసినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. కింద కోర్టు అతని బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో చోక్సి హైకోర్టుకెక్కారు. -
మిషన్ చోక్సీ బృందం తిరుగుముఖం
న్యూఢిల్లీ: రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఇప్పట్లో భారత్‌కు అప్పగించే అవకాశాలు కనిపించడం లేదు. డొమినికా దేశ ప్రభుత్వం చోక్సీని అప్పగిస్తే వెంట తీసుకువద్దామని ఆ దేశానికి వెళ్లిన ‘మిషన్ చోక్సీ’భారత అధికారుల బృందం స్వదేశానికి తిరిగి బయల్దేరింది. సీబీఐ అధికారిణి శారద రౌత్ నేతృత్వంలోని బృందం డొమినికాలో ఏడు రోజుల పాటు మకాం వేసింది. చోక్సీ తరఫు లాయర్లు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ విచారణ వచ్చే నెలకి వాయిదా పడడంతో 8 మంది సభ్యులతో కూడిన భారత్ బృందం తిరుగుముఖం పట్టింది. జూన్ 3 రాత్రి 8 గంటల ప్రాంతంలో డొమినికా విమానాశ్రయం నుంచి ప్రత్యేక ప్రైవేట్ జెట్ విమానంలో భారతీయ అధికారులు స్వదేశానికి బయల్దేరినట్టుగా ఆ దేశంలోని స్థానిక మీడియా వెల్లడించింది. డొమినికాలో చోక్సీపై రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఆంటిగ్వా నుంచి డొమినికా దేశానికి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలతో అరెస్టయిన కేసులో న్యాయస్థానం చోక్సీకి బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసు విచారణ ఈ నెల 14న జరగనుంది. మరోవైపు చోక్సీ లాయర్లు ఆయన కనిపించడం లేదంటూ హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణను జూలైకి వాయిదా పడింది. ఈ పరిణామాలతో చోక్సీని డొమినికా ప్రభుత్వం వెనువెంటనే భారత్‌కు అప్పగించే అవకాశాలు లేకపోవడంతో భారత్ బృందం వెనక్కి బయల్దేరింది. మరోవైపు కోర్టులో విచారణ సాగుతుండగా కొందరు నిరసనకారులు డొమినికాకు చోక్సీని ఎవరు తీసుకువచ్చారు? అని రాసి ఉన్న ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. 62 ఏళ్ల వయసున్న చోక్సీ తన ప్రియురాలితో కలిసి డొమినికాకు వచ్చి పట్టుబడ్డాడని కొందరు చెబుతూ ఉంటే, ఆయనని కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని చోక్సీ తరఫు లాయర్లు వాదిస్తున్నారు. 2018లో భారత ప్రభుత్వం కళ్లుగప్పి అంటిగ్వాకు పరారైన చోక్సీ మే 23న అంటిగ్వాలో కనిపించకుండా పోయారు. డొమినికాలో పోలీసులకు పట్టుబడ్డారు. -
మెహుల్ చోక్సీకి నో బెయిల్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా న్యాయస్థానం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. అంటిగ్వా నుంచి తమ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన చోక్సికి బెయిల్ ఇవ్వలేమని గురువారం పిటిషన్‌ను కొట్టివేసింది. చోక్సీ(62) వీల్ చైర్లో కోర్టుకు హాజరయ్యారు. చోక్సీ అక్రమంగా డొమినికాకు రాలేదని, ఆయనని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని అందుకే బెయిల్ ఇవ్వాలంటూ చోక్సీ తరఫు లాయర్ వాదించారు. మరోవైపు చోక్సీకి బెయిల్ ఇస్తే అతను పారిపోతాడని, భారత్‌లో ఆర్థిక నేరాలకు సంబంధించిన 11 కేసులు ఉన్నాయని, ఇంటర్‌పోల్ నోటీసులూ అతనిపై జారీ అయ్యాయని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. చోక్సీ చుట్టూ ఉన్న పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉండడం వల్ల బెయిల్ ఇవ్వలేమని మెజిస్ట్రేట్ కేండియా కేరట్ జార్జ్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో అక్రమంగా ప్రవేశించినందుకు వేసే జరిమానాకు రెట్టింపు మొత్తం 10 వేల కరీబియన్ డాలర్లు చెల్లిస్తామని చోక్సీ తరఫు లాయర్ చెప్పినా న్యాయమూర్తి అంగీకరించలేదు. అయితే బెయిల్ కోసం పై కోర్టుకు వెళతామని లాయర్ విజయ్ అగర్వాల్ మీడియాకి వెల్లడించారు. వాదనల సమయంలో భారత్ నుంచి వెళ్లిన బృందం కోర్టుకి హాజరైంది. డొమినికా ప్రభుత్వం చోక్సీని అప్పగిస్తే భారత్‌కు తీసుకురావడానికి ఆ బృందం వెళ్లింది. అయితే ఇప్పుడిప్పుడే చోక్సీని అప్పగించే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులంటున్నారు. చోక్సీపై కోర్టుకు వెళితే మరిన్ని రోజులు ఈ కేసు సాగే అవకాశాలున్నాయి. 2018 నుంచి అంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ అక్కడ్నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతను ప్రేయసితో విహార యాత్ర కోసం డొమినికాకు వెళ్లాడన్న ఆరోపణలున్నాయి. మే 23న తమ దీవుల్లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారంటూ డొమినికా పోలీసులు చోక్సీని అదుపులోకి తీసుకున్నారు. చోక్సీని వెనక్కి తెస్తాం: భారత విదేశాంగ శాఖ మెహుల్ చోక్సీని కచ్చితంగా భారత్‌కు తీసుకువస్తామని విదేశాంగ శాఖ ధీమా వ్యక్తం చేసింది. డొమినికాలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయితే వెంటనే అతనిని భారత్‌కి తెస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చి చెప్పారు. ఆ సమస్య మనకొద్దు చోక్సీని డొమినికా నుంచే భారత్‌కు పంపిస్తే మంచిదని అంటిగ్వా, బార్బుడా దేశం భావిస్తోంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో చోక్సీ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ప్రస్తుతం చోక్సీ డొమినికా పోలీసు కస్డడీలో ఉన్నందున ఇది వాళ్ల వ్యవహారమని, ఇక్కడికి వస్తే ఆ సమస్యలు తమకు చుట్టుకుంటాయని సమావేశం అభిప్రాయపడింది. -
నేడు డొమినికా కోర్టులో చోక్సీ కేసు విచారణ
-
సినీ ఫక్కీలో పరార్.. దొరికిన చోక్సీ!
న్యూఢిల్లీ: సినిమాలో లాగా స్కెచ్ వేసి పరార్ అయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. పీఎన్బీ స్కామ్ నిందితుడు, పరారీలో ఉన్న వ్యాపారి చోక్సీ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న అంటిగ్వా పోలీసులు.. క్యూబాకు అతను పారిపోయి ఉంటాడని అంతా అనుమానించారు. అయితే.. ఆ అనుమానాలకు తగ్గట్లు చోక్సీ ముందుగా కరేబియన్ ద్వీపం డొమినికాకు బోటు ద్వారా చేరుకున్నట్లు తెలుస్తోంది. 62 ఏళ్ల చోక్సీ అక్కడి నుంచి క్యూబాకు వెళ్లాలని స్కెచ్ వేశాడు. ఈలోపు అంటిగ్వా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో చోక్సీకి గుర్తించిన డొమినికా పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు డొమినికా పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే అంటిగ్వా మాత్రం చోక్సీ మిస్సింగ్‌ను ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోవడం విశేషం. కాగా, పీఎన్బీ స్కామ్ కేసులో మెహుల్ చోక్సీ భారత్‌ను వీడి ఆంటిగ్వా, బార్బుడాకి పారిపోయిన విషయం తెలిసిందే. రూ.14 వేల కోట్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతన్ని దేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని క్యూబాకు చోక్సీ ప్రయత్నించి పట్టుబడ్డాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వేల కోట్ల రూపాయల రుణ మోసానికి పాల్పడిన ఆరోపణలున్న చోక్సీ చివరిసారిగా ఆదివారం తన కారులో ఆంటిగ్వా, బార్బుడాలో కనిపించాడు. అయితే తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ఈడీ అక్రమంగా భారత్‌లో ఉన్న 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అక్రమంగా చేసిందని చోక్సీ వాదిస్తున్నాడు. చదవండి: అర్జెంట్‌గా బాత్రూం వెళ్లిన డ్రైవర్, రైల్లో.. -
చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!
సాధారణంగా కోరికలనేవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందులో కొన్ని వింతవి కూడా ఉంటాయి. ఇలాంటి వింత కోరికే ఓ మహిళకు కలిగింది. మనిషి బతికిఉన్నప్పుడు ఒకలా మరణించన తరువాత మరోలా సన్నిహితులు, ఇతరులు ప్రవర్తిస్తారని అంటారు కదా. అందుకే ఓ మహిళ తాను చనిపోతే ఎవరెవరు వస్తారు, వారు ఏం చేస్తారో చూడాలనుకున్నదంట.. అందుకు తానే మరణించినట్లు అందరినీ నమ్మించడానికి పడరాని పాట్లు పడిందో మహిళ. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి వారు కూడా ఉన్నారంటే నమ్మడం కొంచెం కష్టమైనా నమ్మాలి మరీ. వివరాల్లోకి వెళితే.. చిలీ రాజధాని శాంటియాగోకు చెందిన మైరా అలోంజో అనే మహిళ తాను చనిపోతే తరువాత తన చుట్టు జరిగే పరిణామాలను చూడాలనుకుందంట. అదేంటి చనిపోతే ఎలా చూస్తాం అనే సందేహం వస్తుంది కదా. అదే సందేహం ఆమెకు వచ్చింది. దీంతో ఎలాగైనా తన కోరికను నేరవేర్చుకోవాలనుకుంది. అందుకని ఆమెది డెత్ రిహార్సల్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. అదే తడవుగా అద్దెకు లభించే లగ్జరీ శవపేటికను తెప్పించింది. ఫొటోగ్రాఫర్లను కూడా పిలిపించుకుంది. అంతా సిద్ధం చేసుకుని తెల్లటి దుస్తులతో మైరా.. తలపై పువ్వుల కిరీటం, ముక్కులో దూదిని పెట్టుకుని.. సంతాప సభ జరుగుతున్నట్లుగా ఏర్పాట్లు కూడా చేయించింది. అలా ఆమె దాదాపు మూడు గంటలపాటు శవపేటికలో పడుకుని చనిపోయినట్లు నటిస్తూనే ఉందంట. మహాతల్లి ఇదే నటన సనిమాల్లో ఇలా నటిస్తే ఆస్కార్ అయిన దక్కేదేమో అని అంటున్నారు చూసిన వాళ్లంతా. ఇందులో ఇంకో వింత ఏంటంటే.. ఈ డ్రామాలో ఆమె కుటుంబం, స్నేహితులు కూడా పూర్తి మద్దతుగా నిలిచి సహకరించడం. అంత్యక్రియల నాటకం మొదలుకాగానే కుటుంబ సభ్యులు నకిలీ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికంతటికి ఆ మహిళ దాదాపు 710 యూరోలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇలా ఉండగా, మైరా తీరును కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇటీవల ఎక్కడ చూసిన కరోనాతో చనిపోయినవారే ఎక్కువగా ఉన్నారు, ఇలా ప్రవర్తించి వారిని ఎగతాళి చేయడంలా ఉందని అది సరికాదని మైరా స్థానికులు అంటున్నారు. ( చదవండి: మరణం అంచున కన్నీటి వర్షంలో తల్లి.. చిన్నారికి చెప్పేదెలా! ) -
చికాగో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
ఇల్లినాయిస్ : డొమినికన్ రిపబ్లిక్లో ఆహారం కోసం అలమటిస్తున్న చిన్నారులకు సహాయాన్ని అందించడానికి చికాగో తెలుగు అసోసియేషన్(సీటీఏ), ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్(ఎఫ్ఎమ్ఎస్సీ)లు ముందుకొచ్చాయి. చికాగోలో 175 మంది వాలింటీర్లు కలిసి ఆహారాన్ని వండి, 2,85,00 మీల్స్ ప్యాకెట్లలో ప్యాక్ చేశారు. సీటీఏ ఆధ్యక్షులు నాగేంద్ర వేగె ఆధ్యక్షతన ఇల్లినాయిస్లో నేపర్విల్లోని నార్త్ సెంట్రల్ కాలేజీలో ఈ కార్యక్రమం జరిగింది. ప్యాక్ చేసిన ఆహారపొట్లాలను డొమినికన్ రిపబ్లిక్లో పోషకాహార లోపంతో బాధపుడుతున్న చిన్నారులకు వితరణ చేయనున్నారు. సీటీఏ వ్యవస్థాపక సభ్యులు రవి ఆచంట, ప్రవీణ్ మోతూరు, శేషు ఉప్పలపాటి, రావు ఆచంట, కోర్ సభ్యులు భూషణ్ భీమ్ శెట్టి, దేవ సుబ్రమణ్యం, వేణు ఉప్పలపాటి, ఫరీద్ ఖాన్, హరీష్ జన్ను, అదిల్ అహ్మద్, బాల చోడ, ముహ్మద్ రెహ్మాన్, భార్గవ్ కావూరి, కళ్యాణ్ కరుమురి, పవన్ నారం రెడ్డి, సూర్య గర్డె, భాను సోమ, విజయ్ బాబు క్రిష్ణ మూర్తి, రఘురెడ్డి, మురళి పర్మి, రాహుల్ వీరటపు, క్రిష్ణ రంగరాజు, సీటీఏ మహిళా సభ్యులు రాణి వేగె, భవాని సరస్వతి, మౌనిక చేబ్రోలు, మాధవి తిప్పిశెట్టి, తనుజా సజ్జ, సుధా కుంచనపల్లి, సుజనా ఆచంట, మాధవి ఆచంట, పూర్ణిమ, కవిత, శ్రీలక్ష్మి మందవలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తమవంతు సహకారాన్ని అందించారు. గత కొన్నేళ్లుగా సీటీఏ అందిస్తున్న సహకారాన్ని ఎఫ్ఎమ్ఎస్సీ సభ్యులు కొనియాడారు. -
ఆడ పిల్లగా పుట్టి మగాళ్లవుతున్నారు!
శాంటో డొమింగో: కరీబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో పుట్టే బిడ్డల్లో జన్యు లోపం కారణంగా అక్కడి తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు. వారికి పుట్టిన ఆడ శిశువులు 12వ ఏట మగ పిల్లలుగా మారిపోతున్నారు. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంజైమ్ లోపం కారణంగా మగ బిడ్డగా పుట్టాల్సిన బిడ్డ ఆడ శిశువుగా పుడుతోందని, ఇలాంటి వాళ్లను ‘గెవెడాసెస్’ అని శాస్త్ర పరిభాషలో పిలుస్తారని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆడపిల్లగా పుట్టిన వారిలో ‘డీహైడ్రో టెస్టోస్టెరోన్’ హార్మోన్ కారణంగా వారు 12వ ఏట మగ పిల్లలుగా మారుతున్నారని వైద్యులు వివరించారు. డొమెనిక్ రిపబ్లిక్లో ప్రతి 90 మందిలో ఒకరు ఇలా మారుతుండగా, సాలినాస్ పట్టణంలో ప్రతి 90 మందిలో ఇద్దరు ఆడ శిశువులుగా పుట్టి 12వ ఏట మగ పిల్లలుగా మారుతున్నారని, ఈ విషయం 1970వ దశకంలో మొదటిసారి వెలుగులోకి వచ్చిందని, ఇప్పటి వరకు అలాగే జరుగుతోందని డాక్టర్ మైఖేల్ మోస్లే తెలిపారు. డొమెనికన్లో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, లభించే ఆహారం కారణంగా ఇలా జరగుతోందని ఆయన చెప్పారు. జన్యుపరమైన ఈ కారణానికి ఇప్పటి వరకు రెమిడీ కనుక్కోలేక పోయామని ఆయన మీడియాకు తెలిపారు. తల్లుల్లో హార్మోన్ లోపాన్ని ముందుగానే గుర్తించి, వారికి ఆ హార్మోన్‌ను సకాలంలో ఎక్కించ గలిగితే ఫలితం ఉంటుందని, అయితే ఇంకా ఆ దిశగా ప్రయోగాలు జరగాల్సి ఉందని డాక్టర్ తెలిపారు. పుట్టిన ఆడ శిశువు ఊహించని విధంగా మగపిల్లాడుగా మారినప్పుడు అడిపిల్లగా పెట్టిన పేరును మార్చడంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు అదే పేరును కొనసాగిస్తుండగా, కొందరు పేర్లను మారుస్తున్నారు. ఇప్పుడిప్పుడు పేరు సులభంగా మార్చే విధంగానే తల్లిదండ్రులు ఆడ శిశువులకు పేర్లు పెడుతున్నారు. ఉదాహరణకు కార్లా అనే ఆడ పిల్ల పేరును కార్లోస్గా మారుస్తున్నారు. వారు ఇలాంటి తరుణోపాయాన్ని కనుగొనడం బాగానే ఉందిగానీ, తోటి పిల్లల మధ్య ఆడపిల్లగా పెరిగి హఠాత్తుగా మగ పిల్లాడిగా మారితే ఆ పిల్లలు అనుభవించే మానసిక క్షోభ ఎలా ఉంటుందో వైద్యులు అధ్యయనం చేయాల్సిందే.