
భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కరేబియన్ దేశానికి విహారయాత్ర కోసం వెళ్లి, కనిపించ కుండా పోయిన సుదీక్ష ఆచూకీ ఇంకా మిస్టరీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తప్పిపోయిన తమ కుమార్తె సుదీక్ష చనిపోయినట్లు ప్రకటించమని కోరినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోది. ఈ మేరకు సుదీక్ష కుటుంబం డొమినికన్ రిపబ్లిక్ జాతీయ పోలీసులకు లేఖ రాసింది.
అమెరికాలో శాశ్వత నివాసి వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల సుదీక్ష చివరిసారిగా మార్చి 6న పుంటా కానా పట్టణంలోని రియు రిపబ్లిక్ రిసార్ట్‌లో కనిపించింది. మెడిసన్ చదవాలని కలలు కన్న ఆమె, వెకేషన్‌లో భాగంగా ఐదుగురు స్నేహితులతో కలిసి డొమినికా రిపబ్లిక్ దేశానికి వెళ్లింది. తెల్లవారుజామున 3 గంటల వరకు స్నేహితులంతా కలిసి అక్కడే పార్టీ చేసుకోగా ఆ తర్వాత అందరూ హోటల్‌కు వెళ్లిపోయారు. కానీ సుదీక్ష ఎంతకూ తిరిగి రాకపోవడంతో స్నేహితులంతా వెతికినా, ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినా ఆమె ఆచూకీ లభించలేదు.

మరోవైపు తమ కుమార్తె అదృశ్యమై 12 రోజులు కావొస్తున్నా ఎలాంటి ఆచూకీ లభ్యం కాని నేపథ్యంలో ఆమె చనిపోయినట్లు ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. డొమినికన్ రిపబ్లిక్ జాతీయ పోలీసు ప్రతినిధి డియాగో పెస్క్వేరా మాటలను ఉటంకిస్తూ NBC న్యూస్ మంగళవారం నివేదించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
‘సుదీక్ష కోణంకి అదృశ్యం విషాదకరం, ఆమె కుటుంబం అనుభవిస్తున్న దుఃఖాన్ని ఊహించలేం.. సుదీక్ష మునిగిపోయి ఉంటుందనే అభిప్రాయాన్ని ఆమె ఫ్యామిలీ వ్యక్తం చేసింది. అటువంటి ప్రకటన చేయాలనే తుది నిర్ణయం డొమినికన్ రిపబ్లిక్ అధికారులదే అయినప్పటికీ, తాము బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని’ అధికారులు ప్రకటించారు.
ఇది మిస్సింగ్ కేసు తప్ప, క్రిమినల్ విషయం కాదని అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే ఆమె మృతిని అధికారికంగా ప్రకటించడానికి కొన్నిచట్టపరమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. సుదీక్ష అదృశ్యంలో ఎవరినీ అనుమానితులుగా పరిగణించలేదని డొమినికన్ రిపబ్లిక్ అధికారులు తెలిపారు.
కాగా సుదీక్ష ఆచూకో కోసం అక్కడి పోలీసులు అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో గాలించారు. కిడ్నాప్‌కు గురైందేమోనన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఈక్రమంలోనే బీచ్ వద్ద ఆమె బట్టలు, చెప్పులు దొరకాయి. వాటిని సుదీక్ష స్నేహితులు గుర్తించారు కూడ . సుదీక్షతో కలిసిచివరిసారి కనిపించిన 24 ఏళ్ల జాషువా స్టీవెన్ రిబెత్ అదుపులోకి తీసుకుని విచారించారు.అయితే మార్చి 6వ తేదీ రోజు తామిద్దరం కలిసే బీచ్‌కు వెళ్లామని,సుదీక్షతో పాటు తాను కూడా ఉన్నట్లు రిబె అంగీకరించాడు. ఒక పెద్ద అల వారిని బలంగా తాకిందని, దాంతో తాను స్పృహ తప్పి పడిపోయానని, అలల తాకిడికి గురైన ఆమెను రక్షించలేక పోయానన్నరిబె మాటలను విశ్వసింఇన పోలీసులు అతనిపై ఎలాంటి ఆరోపణలు నమోదు చేయలేదు. కానీ అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment