Indian origin
-
Trump 2.0: మనపై ప్రభావమెంత?
రెండోసారి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్వేతసౌధంలోకి ఆయన పునరాగమనం అక్కడి భారతీయులకు పలు అవకాశాలతో పాటు సవాళ్లను కూడా మోసుకొస్తున్నట్టే కనిపిస్తోంది. అమెరికాలో భారత సంతతికి చెందినవారు 45 లక్షలకు పైగా ఉన్నారు. సంఖ్యాపరంగా తక్కువగా అనిపిస్తున్నా కొన్నేళ్లుగా వాళ్లు ప్రబల శక్తిగా ఆవిర్భవించారు. ఐటీ, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తులుగా మారారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రాజకీయ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. అధ్యక్షునిగా ట్రంప్ తొలి హయాం భారత అమెరికన్లకు కాస్త తీపి, కాస్త చేదుగానే గడిచింది. ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ సాన్నిహిత్యం అందరినీ ఆకర్షించింది. ‘హౌడీ మోడీ’ పేరిట 2019లో హూస్టన్‌లో ట్రంప్ అట్టహాసం చేస్తే, అంతకుమించి అన్నట్టుగా మరుసటేడే మోదీ అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ పేరుతో భారీ సభ నిర్వహించారు. దానికి తరలివచ్చిన లక్ష పైచిలుకు జన సందోహాన్ని చూసి ఆశ్చర్యానందాల్లో మునిగిపోవడం అధ్యక్షుని వతయింది. ఆసియాలో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టడం వంటి ఉమ్మడి వ్యూహాత్మక లక్ష్యాలు ఇరు దేశాలను మరింత సన్నిహితం చేశాయి. వరక్త వ్యాపారాలూ ఇతోధికంగా పుంజుకున్నాయి. భారత్–అమెరికా సంబంధాలు మొత్తమ్మీద మరింత బలోపేతమే అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ 2.0 భారత్‌కు, అమెరికాలోని మనవారికి ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక ఆందోళనలు ట్రంప్ తొలి హయాంలో జాతి విద్వేష, విద్వేష నేర ఘటనలు పెరిగాయి. వాటిలో తరచూ దక్షిణాసియా మూలాలున్న వారినే లక్ష్యంగా చేసుకునే ఆందోళనకర ట్రెండుకు తెర లేచింది. దీని ప్రభావం భారతీయ అమెరికన్లపైనా బాగానే పడింది. దానికి తోడు ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదానికి ఈసారి మరింత ప్రాధాన్యమిస్తానని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. తమపట్ల వివక్షకు తావులేని వాతావరణాన్ని కోరుకుంటున్న భారతీయ అమెరికన్లలో ఈ ప్రకటన మరింత గుబులు రేపుతోంది. ఈ ఆందోళనలను తొలగించేందుకు రిపబ్లికన్ పార్టీలోని భారత మూలాలున్న నేతలు ఏ మేరకు కృషి చేస్తారన్నది కీలకం కానుంది. వర్తకం.. ఆచితూచి ట్రంప్ తొలి హయాంలో వర్తకానికి పెద్దపీటే వేసినా కొన్నిసార్లు వివాదాలూ తప్పలేదు. ఉక్కు, అల్యూమినియం, వ్యవసాయోత్పత్తుల వంటివాటిపై టారిఫ్‌లు గొడవకు దారితీశాయి. రిటైల్ నుంచి టెక్ స్టార్టప్‌ల దాకా రెండు ఆర్థిక వ్యవస్థల్లోనూ కీలకంగా మారిన భారత అమెరికన్ వ్యాపారవేత్తలకు ట్రంప్ తొలి హయాంలో మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. పన్ను తగ్గింపులు, నిబంధనల సడలింపు వంటి ట్రంప్ సర్కారు నిర్ణయాలు వ్యాపార విస్తృతికి దోహదపడినా మొత్తమ్మీద టారిఫ్‌ల విషయంలో కొనసాగిన అనిశ్చితి ఎప్పటికప్పుడు వారికి సవాలుగానే నిలుస్తూ వచ్చింది. వాటిపై సంప్రదింపులు కూడా పెద్దగా ఫలితమివ్వలేదు. ఈసారి వాటిని చక్కదిద్దుకోవడానికి ట్రంప్ ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. → విధానాలు ఇరు దేశాలకూ లాభసాటిగా ఉండేలా మెరుగు పరిచేందుకు ద్వైపాక్షిక వర్తకంతో ప్రత్యక్ష భాగస్వామ్యమున్న భారతీయ అమెరికన్ వ్యాపార దిగ్గజాలు ప్రయత్నించవచ్చు. → ఫార్మా, జౌళి, టెక్నాలజీ వంటి రంగాల్లో టారిఫ్‌లు తగ్గడమో, లేదంటే సరళంగా మారడమో ఖాయంగా కనిపిస్తోంది. → పన్ను ప్రోత్సాహకాలపై నియంత్రణల ఎత్తివేతతో పాటు చిన్న వ్యాపారాలకు ఇతోధికంగా వృద్ధి అవకాశాల కల్పన దిశగా అడుగులు పడవచ్చు. → ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానం భారతీయ అమెరికన్ వ్యాపారవేత్తలకు సవాలుగా పరిణమించే ఆస్కారమూ లేకపోలేదు.వలసలపై ఉత్కంఠే అమెరికాలో భారతీయుల విజయగాథకు హెచ్–1బీ వీసా విధానమే దశాబ్దాలుగా మూలస్తంభంగా నిలుస్తూ వచ్చింది. ముఖ్యంగా ఐటీ, వైద్య తదితర రంగాల్లో మన నిపుణులు అగ్ర రాజ్యంలో తిరుగులేని రీతిలో జెండా పాతారు. అంత కీలకమైన హెచ్–1బీ వీసా విధానం ట్రంప్ తొలి హయాంలో ఒడిదుడుకులకు లోనైంది. మితిమీరిన వడపోతలు, కఠినమైన అర్హత ప్రమాణాల వంటివి అమెరికా కలలుకనే భారతీయ ఔత్సాహికుల్లో, వారి కుటుంబాల్లో తీవ్ర అనిశి్చతికి దారితీశాయి. → ఈ సవాళ్లు ట్రంప్ 2.0లో మరింత పెరిగే సూచనలే కన్పిస్తుండటం ఆందోళనకరం. → గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుతెన్నుల్లోనే గడుపుతున్న భారత అమెరికన్లు మరిన్ని సమస్యలు ఎదుర్కోక తప్పేలా లేదు. → జీవిత భాగస్వామి ప్రధానంగా హెచ్–4 వర్క్ వీసా పర్మిట్లపై ఆధారపడే కుటుంబాల పరిస్థితి మరింత డోలాయమానంగా తయారైంది. ఆ వీసాలకు వర్క్ పర్మిట్లు రద్దు చేస్తామని ట్రంప్ గతంలో చేసిన ప్రకటన ఇప్పుడు మళ్లీ భయపెడుతోంది. అదే జరిగితే భారత మహిళలకు కోలుకోలేని దెబ్బే అవుతుంది. కుటుంబానికి ఆర్థిక భద్రత, వృత్తిగత ఎదుగుదలకు కీలకమైన అవకాశం వారి చేజారుతుంది. → వీసా పర్మిట్ల గందరగోళంతో నిపుణులైన భారతీయులపై ఎక్కువగా ఆధారపడే అమెరికా వ్యాపార సంస్థలు కూడా బాగా ప్రభావితమవుతాయి. → వర్క్ వీసాలపై పరిమితులు కీలక రంగాల్లో మానవ వనరుల కొరతకు దారితీస్తాయి.రూటు మారిన రాజకీయం భారత అమెరికన్లు మొదటినుంచీ డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ఉంటూ వచ్చారు. వలసలు, వైవిధ్యం, సామాజిక న్యాయం తదితర విధానాల్లో ఆ పార్టీ ప్రగతిశీల వైఖరే అందుకు ప్రధాన కారణం. కానీ వలస సంస్కరణలపై బైడెన్ సర్కారు నిర్లిప్తత, అంతూపొంతూ లేని గ్రీన్‌కార్డుల వెయిటింగ్ లిస్టు వంటివి ఆ పార్టీపై వారిలో అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కుటుంబ విలువలు, విద్య తదితరాల్లో అచ్చం తమను పోలి ఉండే రిపబ్లికన్ పార్టీ వైఖరి, దాని సరళీకృత ఆర్థిక విధానాలు సంప్రదాయ భారతీయులను కొంతకాలంగా అమితంగా ఆకర్షిస్తున్నాయి. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేతలు మరింతగా వారి ఆదరణను చూరగొంటున్నారు. ముఖ్యంగా దూకుడుకు మారుపేరైన ట్రంప్ రిపబ్లికన్ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ ఈ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. భారత అమెరికన్ సమాజం నానాటికీ ఆ పార్టివైపు మొగ్గుతోంది. ట్రంప్ 2.0 విధానాలను బట్టి ఇది మరింత ఊపందుకున్నా ఆశ్చర్యం లేదు. -
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్లు మన చుట్టూనే వై..ఫై లా తిరుగుతుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నమ్మించి నట్టేట ముంచేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలా 17జంటలకు టోకరా ఇచ్చిన ఒక ఎన్ఆర్ఐ మహిళా స్కామర్ పోలీసులకు చిక్కింది. ఆమె చేసిన ఫ్రాడ్ ఏంటి? పోలీసులు ఆమెను ట్రాక్ చేశారు? భారతీయ సంతతికి చెందిన ప్రీలిన్ మోహానాల్ (53) దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేస్తోంది. వివాహాలను ప్లాన్ చేసుకోవాలనుకునే ప్రేమ జంటలను సోషల్ మీడియా ద్వారా వలవేసి పట్టుకునేంది. వారికి అందమైన వెడ్డింగ్ నేషన్స్ చూపిస్తానంటూ వారితో నమ్మబలికేది. ఆ స్థలంతో ఎటువంటి సంబంధం లేకుండా వేదిక కోసం పెద్ద మొత్తాలను ముందుగానే చెల్లించాలన పట్టుబట్టేది. సొమ్ములనురాబట్టేది. తీరా అక్కడికెళ్లాక విస్తుపోవడం ఖాళీ ప్లేస్ ప్రేమ జంట వంతయ్యేది. ఉనికిలో లేని, లేదా కనీస వసతులు కూడా లేని ప్రదేశాన్ని చూసి లబోదిబోమనేవారు. నీళ్లు, కరెంట్ కూడా లేకపోవడంతో వారి కలకాలం తీపి గుర్తుగా మిగిలిపోవాల్సిన పెళ్లి సందడి కాస్త జీవితంలో మర్చిపోలేనంత విచారకరంగా మారిపోయేది. ఇలా దక్షిణాఫ్రికా వ్యాప్తంగా ఒకే రోజు ఒకే వేదిక కోసం డబ్బులు తీసుకొని దేశవ్యాప్తంగా 17 జంటలను మోసం చేసింది. తమ వివాహాన్ని రద్దు చేసుకుని, ఈ సంవత్సరం చివరిలో తిరిగి ప్లాన్ చేసుకోవడానికి చాలాకష్టపడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.చివరికి పేరు చెప్పడానికి ఇష్టపడని జంట ఫిర్యాదుతో గుట్టు రట్టయింది. వీరు గత ఏడాది డిసెంబర్లో భద్రతా సంస్థ రియాక్షన్ యూనిట్ సౌత్ ఆఫ్రికా (RUSA) తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమెను ట్రాక్ చేసి (జనవరి 7) అరెస్టు చేశారు. నిందితురాలు మోసానికి పాల్పడినట్లు ,ఆమెకు క్రిమినల్ రికార్డ్ ఉందని 20 సంవత్సరాలకు పైగా జరిగిన స్కామ్‌ల చరిత్ర ఉందని నిర్ధారించినట్టు రూసా ప్రతినిధి బలరామ్ చెప్పారు.మరోవైపు ఇది స్కామ్ కాదు, తాను స్కామర్‌ను కాదని ఆమె వాదిస్తోంది. కంపెనీ చాలా కష్టాలను ఎదుర్కొంది. ప్రతీ పైసా తిరిగి చెల్లిస్తానని ప్రతీ జంటకు లేఖలు పంపాననీ తెలిపింది. కానీ భాగస్వాములు అక్టోబర్‌లో వైదొలిగిన కారణంగా సకాలంలో తిరిగి చెల్లించలేకపోయానని స్థానికమీడియాకు తెలిపింది. తొమ్మిది జంటలకు సుమారు 60వేలు దక్షిణాఫ్రికా రాండ్ (రూ.2,72,319) బాకీ ఉందని అంగీకరించి, వాటిని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది.అయితే నేరాన్ని అంగీకరించి, బాధితులందరికీ తిరిగి చెల్లిస్తానని ఆమె న్యాయవాది, కుటుంబ సభ్యులు కేడా చెప్పడంతో ఆమె జైలు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి దీనిపై కోర్టు ఎలా నిర్ణయిస్తుందో చూడాలి. -
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమాదంలో 26 ఏళ్ల భారత సంతతికి వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్ దుర్మరణం పాలయ్యారు. యూఏఈలోని రస్ అల్ ఖైమా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్, కోపైలట్ ఇద్దరూ చనిపోయారని యుఎఇ ప్రభుత్వ విభాగమైన జెనెరల్ సివిల్ ఏమియేషన్ అథారటీ ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేసింది.చనిపోయిన ఇద్దరిలో 26 ఏళ్ల పాకిస్థానీ మహిళ కాగా మరొకరు సులేమాన్ అల్ మాజిద్. ఇతను విమానంలో కోపైలట్‌గా ఉన్నాడు. సులేమాన్ దుబాయ్‌లోనే పుట్టి పెరిగాడు. విమానాన్ని అద్దెకు తీసుకున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. బెంగుళూరుకి చెందిన ఇతని కుటుంబం యూఏఈ దేశానికి వలస వెళ్లింది. యూకే దేశంలోని డుర్హాం కౌంటీ, డార్లింగ్టన్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్‌లో ఫెలో డాక్టర్‌గా ఉద్యోగం చేసేవాడు. బిట్రీష్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా, హానరరీ సెక్రటరీ, నార్తరన్ రెసిడెంట్ డాక్టర్స్ కమిటీలో కో-చైర్మన్ పదవులు చేపట్టాడు. అలాగే యూకేలో డాక్టర్‌గా ఉన్న సమయంలోజూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల వేతనం పెంచాలని ఉద్యమం చేసినట్టు సోషల్‌మీడియా ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.సులేమాన్ తన కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని సరదాగా కొంత సమయం గడిపాడు. ఆ తరువాత తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఒక ప్రైవేట్ ఏమియేషన్ క్లబ్ కు వెళ్లాడు. అక్కడ ముందుగా సులేమాన్ సరదాగా గాల్లో విహరించేందుకు క్లబ్ విమానంలో వెళ్లాడు. పైలట్ ఒక పాకిస్తానీ మహిళ ఉన్నారు. అయితే వీరి విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కాంటాక్ట్ మిస్ అయింది. కోవ్ రొటానా హోటల్ సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఆస్పత్రి తరలించారు. కానీ ఇద్దరూ చనిపోయారు. సులేమాన్ అకాల మరణంపై తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకుతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో ఉన్నాం. త్వరలోనే అతడికి పెళ్లి కూడా చేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. తమకు సర్వస్యం అయిన సులేమాన్ లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
సిమ్రత్ కేసులో కెనడా పోలీసుల కీలక ప్రకటన
భారత సంతతికి చెందిన యువతి గుర్సిమ్రత్ కౌర్(19).. ఓ ప్రముఖ స్టోర్‌లోని వాక్ ఇన్ ఒవెన్‌లో శవమై కనిపించడం తెలిసిందే. ఆమె మృతిపై తల్లితో సహా సహోద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణ జరిపిన కెనడా పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తైందని, అనుమానాస్పద హత్యగా అనిపించలేదని హాలీఫాక్స్ పోలీసులు సోమవారం ప్రకటించారు. అలాగే.. తప్పు జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని వెల్లడించారు. ‘‘ఈ కేసులో ఏం జరిగిందో అనేదానిపై అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, మా విచారణలో అలాంటి అనుమానాలేవీ మాకు కనిపించలేదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తైంది’’ అని ఓ అధికారి వీడియో సందేశంలో తెలిపారు.Statement on Sudden Death Investigation pic.twitter.com/0IsyAfMkzX— Halifax_Police (@HfxRegPolice) November 18, 2024 పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల గురుసిమ్రన్.. గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి హాలీఫాక్స్‌లోని వాల్‌మార్ట్ షోరూంలో పని చేస్తోంది. తండ్రి, సోదరుడు భారత్‌లోనే ఉంటారు. అయితే కిందటి నెలలో.. వాక్ ఇన్ ఒవెన్‌లో ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.సిమ్రన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె స్టోర్ మొత్తం వెతికింది. చివరకు ఒవెన్ నుంచి పొగలు రావడం గమనించి స్టోర్ సిబ్బంది అనుమానంతో తెరిచి చూడగా అందులో కాలిపోయిన స్థితిలో గురుసిమ్రన్ మృతదేహం కనిపించింది. సిమ్రన్ మృతిపై తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను బలవంతంగా అందులో ఎవరో నెట్టేసి హత్య చేసి ఉంటారని, వాక్ ఇన్ ఒవెన్ తలుపు లాక్ చేసి ఉండడమే తమ అనుమానాలకు కారణమని సిమ్రన్ సహోద్యోగులు చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం అనుమానాలేవీ లేవని చెబుతుండడం గమనార్హం. -
కాష్ పటేల్‌ను వదులుకోని ట్రంప్
సీఐఏ.. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన నిఘా సంస్థ. అలాంటి ఏజెన్సీకి డైరెక్టర్ రేసులో.. ఓ భారతీయ మూలాలున్న వ్యక్తిని నియమించవచ్చనే ప్రచారం హాట్ టాపిక్ అయ్యింది. అయితే తృటిలో ఆ అవకాశం చేజార్చుకున్నారు కశ్యప్ పటేల్ అలియాస్ కాష్. అలాగని ట్రంప్ ఆయన్ని వదులుకోలేదు. ఇప్పుడు మరో కీలకమైన విభాగానికి కాష్ పటేల్‌ను డైరెక్టర్‌గా నియమించబోతున్నారు.జనవరి 20వ తేదీ తర్వాత ప్రస్తుతం ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టోఫర్ వ్రేను.. ట్రంప్ తప్పిస్తారని, ఆ స్థానంలో 44 ఏళ్ల వయసున్న కాష్ పటేల్‌ను కూర్చోబెడతారని వైట్‌హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బానోన్ ప్రకటించారు. అయితే వ్రేను 2017లో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించింది ట్రంపే. పదేళ్ల కాలపరిమితితో ఆయన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే.. తర్వాతి కాలంలో ట్రంపే ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో వ్రే జోక్యం ఎక్కువైందని మండిపడుతూ వచ్చారు. అంతేకాదు.. ఈ ఏడాది జులైలో వ్రేను రాజీనామా చేయాల్సిందేనని ట్రంప్ గట్టిగా డిమాండ్ చేశారు కూడా. అయితే వ్రే మాత్రం తాను ఎఫ్‌బీఐలో పూర్తి కాలం కొనసాగుతానని చెబుతూ వచ్చారు.ఎవరీ కాష్ పటేల్ ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్ పటేల్‌కు పేరుంది. ఈయన కుటుంబమూలాలు గుజరాత్లో ఉన్నాయి. ఈయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అతడి తండ్రి, ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. కాష్ పటేల్ పూర్తి పేరు.. కశ్యప్ ప్రమోష్ వినోద్ పటేల్. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా.. కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్లో చేరారు. కాష్ పటేల్‌ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్‌కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాదీ, అల్-ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు. అంతేకాదు పలుచోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో అతడి పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు కూడా. ట్రంప్ రహస్య పత్రాల వ్యవహారం విచారణ సమయంలోనూ ఈయన పేరు ప్రముఖంగానే వినిపించింది. అయితే..ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక.. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి కొత్త చీఫ్ ఎవరవుతారనే చర్చ నడిచింది. ఆ సమయంలో రేసులో కాష్ పటేల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అమెరికా మాజీ గూఢచారి జాన్ రాట్క్లిఫ్ ఆ అవకాశం దక్కించుకున్నారు. వ్యక్తిగత జీవితంకాష్ పటేల్ ప్రస్తుతం కొలంబియాలో నివసిస్తున్నారు. ఐస్ హాకీ అంటే ఆయన మక్కువ ఎక్కువ. ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. -
విపక్ష నేత పదవికి సునాక్ గుడ్‌బై
లండన్: బ్రిటన్ విపక్ష నేత పదవి నుంచి రిషి సునాక్ (44) బుధవారం తప్పుకున్నారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా రెండేళ్ల క్రితం ఆయన చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఆయన సారథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ గత జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. నాటినుంచి సునాక్ తాత్కాలికంగా విపక్ష నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. ‘రెండేళ్ల నాడు దీపావళి సంబరాల సందర్భంగానే నా పార్టీ నాయకునిగా ఎన్నికయ్యా. మళ్లీ అవే సంబరాల వేళ తప్పుకుంటున్నా’ అంటూ హాస్యం చిలికించారు. ‘‘ఈ గొప్ప దేశానికి తొలి బ్రిటిష్ ఏషియన్ ప్రధాని కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. బ్రిటన్ అనుసరించే గొప్ప విలువలకు ఇది తార్కాణంగా నిలిచింది’’ అన్నారు. తన చివరి ప్రైమ్‌మినిస్టర్స్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్)లో భాగంగా ప్రధాని కియర్ స్టార్మర్‌కు సునాక్ పలు సరదా ప్రశ్నలు వేసి అందరినీ నవ్వించారు. వెనక బెంచీల్లో కూచుంటాఅమెరికాలో స్థిరపడాలని తాను భావిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను ఈ సందర్భంగా సునాక్ తోసిపుచ్చారు. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ ఎంపీగా పారల్మెంటులో వెనక బెంచీల్లో కూర్చుని కనిపిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. దాంతో సహచర ఎంపీలంతా నవ్వుల్లో మునిగిపోయారు. -
భారతీయ అమెరికన్లలో హారిస్‌కు తగ్గిన ఆదరణ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ డెమొక్రాట్లకు చేదు కబురు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ ఓటర్ల సంఖ్యలో గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా ఏడు శాతం తగ్గుదల నమోదైంది! భారత మూలాలున్న కమలా హారిస్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య 61 శాతానికి తగ్గింది. అంతేగాక తాము డెమొక్రాట్లమని చెప్పుకున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా 56 నుంచి 47 శాతానికి తగ్గింది. సోమవారం వెలువడ్డ ‘ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్స్’ సర్వేలో ఈ మేరకు తేలింది. ట్రంప్‌కు ఓటేస్తామని వారిలో 32 శాతం మంది పేర్కొన్నారు. 2020లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌కు 68 శాతం మద్దతు దక్కగా ట్రంప్‌కు 22 శాతం మాత్రమే జైకొట్టారు!→ ఇండియన్ అమెరికన్ మహిళా ఓటర్లలో 67 శాతం మంది హారిస్‌కు జైకొట్టారు. ట్రంప్‌కు మద్దతిచ్చిన వారు కేవలం 22 శాతమే.→ 40 ఏళ్ల పైచిలుకు వయసు వారిలో ఏకంగా 70 శాతం మహిళలు, 60 శాతం పురుషులు హారిస్‌కు జైకొట్టారు.→ 40 ఏళ్ల లోపువారిలో మాత్రం 60 శాతం మహిళలే హారిస్‌కు మద్దతిచ్చారు.→ ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్‌కు, 39 శాతం మంది ట్రంప్‌కు ఓటేస్తామని చెప్పారు.→ 40 ఏళ్లలోపు పురుషుల్లో మాత్రం ట్రంప్‌దే పైచేయి కావడం విశేషం. ఆయనకు 48 శాతం, హారిస్‌కు 44 శాతం జైకొట్టారు.→ యువ ఇండియన్ అమెరికన్లలో మాత్రం ట్రంప్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు సర్వే తేల్చింది.→ అమెరికాలో 52 లక్షలకు పైగా భారత సంతతి వారున్నారు. వారిలో ఓటర్ల సంఖ్య 26 లక్షల పై చిలుకు.→ హిందూయేతరులతో పోలిస్తే హిందువుల్లో ట్రంప్ మద్దతుదారులు అధికంగా ఉండటం విశేషం. ఆయనకు ఓటేస్తామని 58 శాతం మంది హిందువులు తెలిపారు. 35 శాతం హిందువులు హారిస్‌కు మద్దతిస్తామన్నారు.→ హిందూయేతర భారతీయ అమెరికన్లలో 62 శాతం హారిస్‌కు, 27 శాతం ట్రంప్‌కు మద్దతిచ్చారు.→ 17 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.→ ఉపాధి, ఆర్థిక అవ్యస్థ, అబార్షన్ ప్రధానాంశాలని 13 శాతం చెప్పారు.→ భారత్–అమెరికా సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పిన వారు కేవలం 4 శాతమే. -
నిశేష్ రెడ్డి ఖాతాలో తొలి ఏటీపీ టైటిల్
కాలిఫోరి్నయా: భారత సంతతికి చెందిన అమెరికా యువ టెన్నిస్ ప్లేయర్ నిశేష్ బసవ రెడ్డి తన కెరీర్లో తొలి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ సింగిల్స్ టైటిల్ సాధించాడు. టిబురోన్ ఓపెన్ ఏటీపీ–75 చాలెంజర్ టోరీ్నలో 19 ఏళ్ల నిశేష్ చాంపియన్‌గా అవతరించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో నిశేష్ 6–1, 6–1తో అమెరికాకే చెందిన ఇలియట్ స్పిజిరిపై గెలుపొందాడు. విజేతగా నిలిచిన నిశే‹Ùకు 11,200 డాలర్ల (రూ. 9 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టైటిల్‌తో నిశేష్ ఏడు స్థానాలు ఎగబాకి ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 192వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన నిశేష్ తల్లిదండ్రులు 1999లో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. -
డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్
నేటి తరానికి పెళ్లంటే ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట. అత్యంత విలాసవంతంగా తమ పెళ్లి జరగాలి అనేది ఒక డ్రీమ్. ఎంత ఖర్చైనా సరే మెహిందీ, సంగీత్‌లు, బారాత్‌లు, ఖరీదైన డిజైనర్ దుస్తులు, డైమండ్ నగలు, వంద రకాల వంటలు ఉండాల్సిందే. వరుడు, మురారి సినిమాల్లో లాగా అంగరంగ వైభంగా తమ పెళ్లి జరగాలని ముందునుంచే కలలు కంటారు. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా వధువు సినిమా తరహాలోనే పెళ్లి చేసుకుంది. ఈ జీవితకాల వేడుక చాలా స్పెషల్‌గా ఉండాలని ప్లాన్ చేసుకుని మరీ ప్రియుడిని పెళ్లాడింది. నెట్టింట సందడి చేస్తున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నితాషా పటేల్ అచ్చం బాలీవుడ్ పెళ్లి సందడిలా తన పెళ్లిని జరిపించుకుంది. అంతేకాదు తన గ్రాండ్ వెడ్డింగ్ కోసం డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన ప్రత్యేకమైన దుస్తులకోసం ఇండియాకు వచ్చింది. నితాషా పటేల్, కృష్ణ గగ్లానీ ఇద్దరు ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. ప్రొఫైల్‌తో నితాషా కాలిఫోర్నియాకు బదులుగా ఆమె తన బేస్ లొకేషన్ లండన్ అని రాయడంతో తొలుత ఇద్దరి మధ్య కొంత అపార్థాలకు దారి తీసింది. కానీ అన్నీ సర్దుబాటు చేసుకుని నాలుగు నెలలపాటు కాల్స్, మెసేజెస్ ద్వారా మాట్లాడుకున్నారు. ఆ తరువాత లండన్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. అనంతరం కాలిఫోర్నియాకు వచ్చిన కృష్ణ రెండు నెలలు అక్కడే ఉన్నాడు. ఇలా ఒక ఏడాది డేటింగ్ తర్వాత, కృష్ణ నితాషాకు ప్రపోజ్ చేశాడు. చివరికి పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు.నితాషా పటేల్, కృష్ణ గగ్లానీ తన పెళ్లికి హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా ఉండాలని భావించారు. ముఖ్యంగా నితాషా తన వివాహ ఈవెంట్లకు బాలీవుడ్ టచ్ ఉండాలని కోరుకుంది. నితాషా, తన తల్లితో కలిసి, ఇండియాలోని ముంబైలో ఉనన ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా స్టోర్‌ని సందర్శించి, తన డ్రెసెస్ సెలెక్ట్ చేసుకుంది. పెళ్లిలో ఐవరీ హ్యూడ్ త్రీ పీస్ పలాజో సెట్లో, డైమండ్ హె లేయర్డ్ డైమండ్ నెక్లెస్, చెవిపోగులు , బ్రాస్లెట్తో సింపుల్ బ్యూటీగా మెరిసింది. మరోవైపు, వరుడు కృష్ణ తన వధువును క్రీమ్-హ్యూడ్ కుర్తా సెట్,రోలెక్స్ వాచ్, కార్టియర్ రింగ్‌తో కొత్త పెళ్లికళతో ఆకట్టుకున్నాడు.నితాషా, కృష్ణ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్గ్రాండ్ వెడ్డింగ్ తరువాత రిసెప్షన్‌ను కూడా అంతే గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఐవరీ కలర్ నెక్లైన్ సీక్విన్ లెహంగా, షీర్ సీక్విన్ దుపట్టాతోపాటు డైమండ్ డైమండ్ నెక్లెస్‌తో హైలైట్‌గా నిలిచింది వధువు నితాషా. ఇక వరుడు కృష్ణ తెల్లటి చొక్కా, సిల్క్ బౌటీ,మోనోగ్రామ్ కఫ్లింక్ల, బ్లాక్ టక్సేడోలో అందంగా కనిపించాడు. -
అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
అమెరికాలో భారత సంతతి వ్యక్తి మైనాంక్ పటేల్(36) ఓ మైనర్ జరిపిన కాల్పుల్లో హత్య చేయబడ్డారు. నార్త్ కరోలినాలోని తన కన్వీనియన్స్ స్టోర్‌లో దోపిడీకి వచ్చిన మైనర్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. 2580 ఎయిర్పోర్ట్ రోడ్‌లోని టొబాకో హౌస్ యజమాని అయన మైనాంక్ పటేల్‌పై మంగళవారం ఉదయం ఈ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన మైనర్‌ను రోవాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు. ‘‘టొబాకో హౌస్ స్టోర్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించాం. స్టోర్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న తర్వాత పటేల్ బుల్లెట్ గాయాలతో పడి ఉన్నాడు. దీంతో అతన్ని నోవాంట్ హెల్త్ రోవాన్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమించటంతో షార్లెట్లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించి చిక్సిత అందించినప్పటికీ చాలా తీవ్రమైన గాయాల వల్ల మృతి చెందాడు’’ అని రోవాన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కెప్టెన్ మార్క్ మెక్‌డానియల్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సంఘటన స్థలం నుంచి పారిపోతున్నట్లు వెల్లడైందని తెలిపారు. అతను తుపాకీని పట్టుకుని కనిపించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కాల్పులకు ఖచ్చితమైన కారణం స్పష్టం కాలేదని, దోపిడీ వచ్చిన మైనర్.. కాల్పులు జరిపినట్లు ప్రథమికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు చెప్పారు. మృతి చెందిన మైనాంక్ పటేల్‌కు భార్య అమీ, 5 ఏళ్ల కుమార్తెను ఉన్నారు. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి. ఆయన మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే ఆయన మృతికి బుధవారం పటేల్ షాప్ ముందు పలువురు పూలు, కార్డులు పెట్టి నివాళులు అర్పించారు. -
బ్రిటన్ విపక్షనేత రేసులో మాజీ మంత్రి ప్రీతీ పటేల్
లండన్: బ్రిటన్ విపక్షనేత పదవి కోసం భారతీయ మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్ పోటీపడుతున్నారు. తన సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో రిషి సునాక్ తన విపక్ష నేత పదవి నుంచి నవంబర్ రెండోతేదీన వైదొలగనున్నారు. దీంతో పార్టీని మళ్లీని విజయయంత్రంగా మారుస్తానంటూ 52 ఏళ్ల ప్రీతీపటేల్ ఆదివారం తన అభ్యరి్థత్వాన్ని ప్రకటించారు. మాజీ మంత్రులు జేమ్స్ క్లెవర్లీ, టామ్ టగెన్డాట్, మెల్ స్టైడ్, రాబర్ట్ జెన్రిక్లతో ఆమె పోటీపడనున్నారు. -
45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్ సీక్రెట్ ఇదే..!
బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ. డైట్‌ని, జీవనశైలిని మార్చకుంటేనే ఇదంతా సాధ్యం. చెప్పాలంటే బరువు తగ్గాలనే గట్టి సంకల్పం ఉంటేనే తగ్గగలం. అలానే భారతసంతతి వ్యక్తి ఏకంగా 45 కిలోలు బరువు తగ్గి చూపించాడు. అందుకోసం ఆయన కొన్ని పత్యేకమైన ఆహారపు అలవాట్లను అనుసరించినట్లు తెలిపాడు. అతనెవరు? ఎలా ఇన్ని కిలోలు మేర బరువు తగ్గగలిగాడు సవివరంగా చూద్దామా..!భారత సంతతికి చెందిన బిహేవియరల్ సైన్స్ సోల్యూషన్స్ కంపెనీ ఫైనల్ మైల్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్ ప్రసాద్ ఏకంగా 45 కిలోలు బరువు తగ్గారు. ఆయన తన వెయిట్ లాస్ జర్నింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా నెటిజనల్తో షేర్ చేసుకున్నారు. తాను స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గగలిగానని అన్నారు. ముందుగా వెయిట్ లాస్ జర్నీలో తలెత్తే సందేహాలను, అనుమానాలను పక్కకు పెట్టేయాలి. "ఎక్స్ప్లోర్ వర్సెస్ ఎక్స్‌ప్లోయిట్," "ట్రెయిట్స్ వర్సెస్ స్టేట్," "హాబిట్ లాడరింగ్ వర్సెస్ మోటివేషన్," "డిఫెరింగ్ రివార్డ్స్ వర్సెస్ విల్‌పవర్." వంటి పాయింట్లపై దృష్టిపెట్టండి. అంటే.. ఇక్కడ మీకు ఎలాంటి జీవనశైలి ఎంచుకుంటే బెటర్ అనేది సోధించాలి. ఒక్కోసారి ఆ డైట్‌ని స్కిప్ చేయాలనిపించినప్పుడూ ఎలా ఆ ఫీలింగ్‌ని వాయిదా వేయాలి. అలాగే ఉన్న ప్రస్తుత పరిస్థితి, మీ శరీర తత్వానికి అనుగణంగా తీసకోవాల్సిన జాగ్రత్తలు, దీంతోపాటు అలవాట్లను స్కిప్ చేయకుండా ఉండేలా ప్రేరణనిచ్చే వాటిని ఎంచుకోవడం. వాయిదా పద్దతికి స్వస్తి పలికి విల్‌పవర్ చేయడం వంటివి అనుసరించాలని అంటున్నారు రాం ప్రసాద్. అలాగే బరువు తగ్గడంలో తనకు ఉపకరించిన వాటి గురించి కూడా చెప్పారు. డైట్లో రెండు నెలలు పాటు షుగర్ తీసుకోకుండా ఉండటం. ఏడాదిపాటు వాకింగ్ చేయడం. నాలుగైదు నెలలు పాటు శుభ్రంగా తినడం వంటివి చేసినట్లు సీఈవో రాం ప్రసాద్ చెప్పారు. అలాగే మూడేళ్లు ఒక పూటే భోజనం, వర్కౌట్లపై దృష్టిసారించడం వంటివి చేసినట్లు తెలిపారు. చివరిగా బరువు తగ్గాలనుకున్నప్పుడూ అందుకు సంబంధించి ఏర్పరుచుకున్న మన లక్ష్యాలపై ఫోకస్ ఉండాలని అన్నారు. అప్పుడే సులభంగా బరువు తగ్గగలమని చెప్పారు. అయితే నెటిజన్లు సీఈవో రాం ప్రసాద్ వెయిట్‌లాస్ జర్నీ చాలా స్ఫూర్తిని కలిగించిందంటూ ఆయన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఖర్జూరం తింటే మలబద్దకం వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
UK general elections: ముందస్తు ఓటమే?!
సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు వేళైంది. హోరాహోరీ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి. కొత్త సభ జూలై 9న కొలువుదీరుతుంది. స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. విపక్ష నేత స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజారిటీతో 14 ఏళ్ల అనంతరం గద్దెనెక్కడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. భారత మూలాలున్న ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎదురీదుతోందని అప్పటికే స్పష్టం చేశాయి. సునాక్ కూడా బుధవారం ప్రచారాన్ని ముగిస్తూ, ‘లేబర్ పార్టీకి ఘనవిజయం దక్కకుండా అడ్డుకుందాం’ అని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికలు డిసెంబర్లో జరగాల్సి ఉన్నా ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టి సునాక్ ముందస్తుకు వెళ్లారు. కానీ అది కూడా కలిసొచ్చేలా కని్పంచడం లేదు... బరిలో భారతీయం బ్రిటన్ ఎన్నికల బరిలో భారతీయుల జోరు పెరుగుతోంది. 2019లో 63 మంది బ్రిటిష్‌ఇండియన్లు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. ఈసారి ఏకంగా 107 మంది బరిలో దిగుతుండటం విశేషం. ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్‌తో పాటు రిఫామ్ యూకే వంటి కొత్త పారీ్టల నుంచి కూడా ఇండియన్లు పోటీలో ఉన్నారు. పలు స్థానాల్లో బ్రిటిష్ ఇండియన్లే ప్రత్యర్థులుగా తలపడుతుండటం మరో విశేషం. హారో ఈస్ట్ స్థానం నుంచి ప్రిమేశ్ పటేల్ (లేబర్), రీతేంద్రనాథ్ బెనర్జీ (లిబరల్ డెమొక్రాట్స్), సారాజుల్హగ్ పర్వానీ (వర్కర్స్ పార్టీ ఆఫ్ బ్రిటన్) బరిలో ఉన్నారు. లీసెస్టర్ ఈస్ట్‌లో లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ (లేబర్), శివానీ రాజా (కన్జర్వేటివ్) పోటీ చేస్తున్నారు. 37.3 లక్షల బ్రిటిష్ ఇండియన్లు బ్రిటన్‌లో భారత మూలాలున్న వారి సంఖ్య ఏకంగా 37.3 లక్షలు దాటేసింది! ఓటర్లలోనూ వారు 10 లక్షల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూలాలున్న వారు కూడా భారీగానే ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవడానికి పారీ్టలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. లేబర్ పార్టీ నేత స్టార్మర్ ఇటీవల బ్రిటిష్ బంగ్లాదేశీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, గాజా దుస్థితిపై ఆ పార్టీ వైఖరి కారణంగా ముస్లిం ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు కన్జర్వేటివ్ నేతలు ప్రయతి్నస్తున్నారు. కన్జర్వేటివ్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలతో పాటు 23 మంది బ్రిటిష్ ఇండియన్లకు కొత్తగా టికెట్లిచ్చింది. వీరిలో ప్రధాని రిషి సునాక్, మాజీ మంత్రులు ప్రీతీ పటేల్, సుయెల్లా బ్రేవర్మన్‌తో పాటు చంద్ర కన్నెగంటి, నీల్ శాస్త్రి హర్‌స్సŠట్, నీల్ మహాపాత్ర, రేవ గుడి, నుపుర్ మజుందార్, ఎరిక్ సుకుమారన్ తదితరులున్నారు. లేబర్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు కాగా 26 మంది కొత్తవారు. వీరిలో ఉదయ్ నాగరాజు, హజీరా ఫరానీ, రాజేశ్ అగర్వాల్, జీవన్ సంధెర్ తదితరులున్నారు.ఒపీనియన్ పోల్స్ ఏం చెబుతున్నాయ్.. లేబర్ పారీ్టకి కనీసం 41 శాతం ఓట్లు ఖాయమని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 21 శాతానికి మించబోవని అవి జోస్యం చెప్పాయి. రిఫామ్ పారీ్టకి 16 శాతం, లిబరల్ డెమొక్రాట్లకు 12 శాతం రావచ్చని పేర్కొన్నాయి. అవే నిజమైతే లేబర్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమే. సునాక్ ఎదురీత వెనక... 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆర్థిక సంక్షోభం కొన్నేళ్లుగా బ్రిటన్‌కు చుక్కలు చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆర్థిక నిపుణుడై ఉండి కూడా పరిస్థితిని రిషి చక్కదిద్దలేదన్నది బ్రిటన్‌వాసుల ఫిర్యాదు. ప్రధానమైన హౌజింగ్ సంక్షోభాన్ని చక్కదిద్దడంలోనూ ఆయన విఫలమయ్యారని వారు భావిస్తున్నారు. దాంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామన్న తాజా హామీలను ఎవరూ నమ్మడం లేదు. యూగవ్ తాజా సర్వేలో 52 శాతం మంది ఆర్థిక సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యలు తమను బాగా కుంగదీస్తున్నట్టు 50 శాతం చెప్పారు. కీలకమైన వలసదారులు, వారికి ఆశ్రయం విషయంలో కన్జర్వేటివ్ పార్టీ వైఖరిని 40 శాతం మంది తప్పుబడుతున్నారు. ఎలా చూసినా సునాక్ పాలనకు 20 నెలలకే తెర పడటం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా విని్పస్తోంది.స్టార్మర్‌కు కలిసొచ్చిన అంశాలు... ప్రధానంగా 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పారీ్టకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. లేబర్ పార్టీకి ఓటేస్తే ఆర్థిక స్థిరత్వానికి వేసినట్టేనన్న ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది. నిరుపేద కారి్మక కుటుంబం నుంచి వచి్చన తనకు సామాన్యుల కష్టనష్టాలు బాగా తెలుసునని, ధరాభారాన్ని తగ్గించి తీరతానని, సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హామీలిచి్చన స్టార్మర్ వైపు ప్రజలు స్పష్టమైన మొగ్గు చూపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
UK PM Rishi Sunak: హిందూ ధర్మమే నాకు స్ఫూర్తి
లండన్: హిందూ ధర్మమే తనకు ప్రేరణను, సాంత్వనను అందిస్తుందని భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ’’భగవద్గీతపై పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుంది’ అని ఆయన అన్నారు. ఆదివారం రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్‌లోని నియాస్డెన్ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించుకున్నారు. వచ్చే 4వ తేదీన బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ వారు ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు రిషి సునాక్ దంపతులకు ఆలయంలోకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జై స్వామినారాయణ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సునాక్ టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించడం విశేషం. చీర ధరించిన అక్షతా మూర్తి అక్కడి మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న వేళ ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత కీర్ స్టార్మర్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం లండన్‌లోని కింగ్స్బరీ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. జై స్వామి నారాయణ్ అంటూ స్టార్మర్ ప్రసంగించారు. అధికారంలోకి వస్తే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో హిందువులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలు హిందువుల ఓట్లపై కన్నేశాయి. -
మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు కచి్చతంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. స్టార్‌లైనర్‌లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో స్టార్‌లైనర్ మిషన్ వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజులదాకా పొడిగించాలని భావిస్తున్నారు. జూన్ 5న సునీత, విల్మోర్ అంతరిక్షంలోకి బయలుదేరారు. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. హీలియం గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. థ్రస్టర్లు కూడా మొరాయించాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం త్వరలో తిరిగి రావాల్సి ఉంది. కానీ, మరమ్మతులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇవి పూర్తయిన తర్వాతే సునీత విలియమ్స్, విల్మోర్ భూమిపైకి చేరుకొనే అవకాశం ఉంది. -
కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
ఒట్టావా: భారత సంతతికి చెందిని ఓ యువకుడు కెనడాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురుయ్యాడు. జూన్ 7 (శుక్రవారం) ఉదయం అతనిపై కాల్పులు జరగటంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకుడిని భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్‌గా గుర్తించారు. బ్రిటిష్ కోలంబియాలోని సర్రే నుంచి హత్య జరిగినట్లు సమాచారం అందటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువరాజ్ గోయల్ మృతి చెంది ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. యువరాజ్‌పై ఎటువంటి నేరపూర్తి రికార్డు లేదు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతన్ని టార్గెట్ చేసి కొందరు కాల్పులు జరిపినట్లు తేలింది. ఈ హత్య ఎందుకు జరిగిందనే కారణాల కోసం పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. యువరాజ్ గోయాల్ స్టూడెంట్ వీసాపై 2019లో పంజాల్‌లోని లూథీయానా నుంచి కెనడా వెళ్లారు. 28 ఏళ్ల యువరాజ్ కెనడాలో సెల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. యువరాజ్ తండ్రి రాజేశ్ గోయెల్ ఫైర్‌వుడ్ వ్యాపారవేత్త. యువరాజ్ మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఇవాల్టి (జూన్ 1) నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి సారి రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గతంలో ఈ టోర్నీ 12 జట్లతో సాగేది. క్రికెట్ పసికూనలకు ప్రోత్సహించడంలో భాగంగా ఐసీసీ ఈ ఎడిషన్ నుంచి 20 జట్లకు అవకాశం కల్పిస్తుంది.ఈ ఎడిషన్ ప్రపంచకప్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈసారి ఏకంగా 15 మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. న్యూజిలాండ్ నుంచి ఒక్కరు.. యూఎస్ఏ నుంచి ఆరుగురు.. కెనడా నుంచి నలుగురు.. సౌతాఫ్రికా, ఒమన్‌ల నుంచి ఒక్కొక్కరు.. ఉగాండ నుంచి ఇద్దరు చొప్పున ఈ ఎడిషన్‌లో పాల్గొంటున్నారు.గతంలో ఎన్నడూ ఈ సీజన్లో పాల్గొంటున్నంత మంది భారత సంతతి ఆటగాళ్లు పాల్గొనలేదు. ఈ ఎడిషన్ ప్రపంచకప్‌లో అందరి కళ్లు న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్రపై ఉన్నాయి. అలాగే సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ప్రదర్శనల కోసం కూడా భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొంటున్న భారత సంతతి ఆటగాళ్లు..రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా)కశ్యప్ ప్రజాపతి (ఒమన్)అల్పేశ్ రాంజనీ (ఉగాండ)రోనక్ పటేల్ (ఉగాండ)రవీందర్ పాల్ సింగ్ (కెనడా)నిఖిల్ దత్తా (కెనడా)పర్గత్ సింగ్ (కెనడా)శ్రేయస్ మొవ్వ (కెనడా)మోనాంక్ పటేల్ (యూఎస్ఏ)హార్మీత్ సింగ్ (యూఎస్ఏ)మిలింద్ కుమార్ (యూఎస్ఏ)నిసర్గ్ పటేల్ (యూఎస్ఏ)నితీశ్ కుమార్ (యూఎస్ఏ)సౌరభ్ నేత్రావాల్కర్ (యూఎస్ఏ) -
ముందస్తు ఎన్నికలకు సునాక్
లండన్: ముందస్తు ఎన్నికలపై జోరుగా సాగిన ఊహాగానాలే నిజమయ్యాయి. పలురకాలుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్–3కి తెలిపానని, పార్లమెంట్ రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. వేసవిలో ఆరు వారాల్లో ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పారు. అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో కేబినెట్ భేటీ అనంతరం భారతీయ సంతతి బ్రిటన్ ప్రధాని సునాక్ ముందస్తు ఎన్నికల ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమైతే 2025 జనవరిలోగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. 10 డౌనింగ్ స్ట్రీట్ బయట ఎన్నికల ప్రకటన చేస్తూ.. తన పదవీకాలంలో సాధించిన విజయాలను సునాక్ వివరించారు. ‘మీకు వీలైనంత భద్రత ఇవ్వడానికి నా అధికార పరిధికి లోబడి చేయగలిగినంతా చేస్తాను. ఇది నా హామీ. బ్రిటన్ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిది’ అని రిషి సునాక్ దేశ ప్రజలనుద్దేశించి అన్నారు. సునాక్ కన్జర్వేటివ్ పారీ్టకి ఓటమి తప్పదని, లేబర్ పార్టీకి విస్పష్ట మెజారిటీ కనిపిస్తోందని చాలా ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వరుసబెట్టి లేబర్ పారీ్టయే గెలుస్తూ వచ్చింది. ఈ తరుణంలో రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేయడం గమనార్హం. అంతకుముందు బుధవారమే పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సునాక్ బదులిస్తూ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలుంటాయని చెప్పారు. అయితే ఆకస్మింగా కేబినెట్ భేటీని ఏర్పాటు చేయడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆకస్మిక కేబినెట్ భేటీ కోసం విదేశాల్లో ఉన్న మంత్రులు సైతం అర్ధంతరంగా తమ పర్యటనలు ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. చివరికి కేబినెట్ సమావేశం అనంతరం సునాక్ జూలై 4న ఎన్నికలుంటాయని ప్రకటించారు. -
US: ఐసీఈ కస్టడీలో ఉన్న భారత సంతతి వ్యక్తి మృతి!
యూఎస్‌లో ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కస్టడీలో ఉన్న 57 ఏళ్ల భారత సంతతి వ్యక్తి విషాదకరంగా జార్జియా ఆస్పత్రిలో మరణించాడు. ఈ విషయాన్ని ఫెడరల్ అధికారులు ధృవీకరించారు. భాదితుడు 57 ఏళ్ల జస్పాల్ సింగ్ గుర్తించి, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌కు సమాచారం అందించారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అతని బంధువులకు కూడా సమాచారం అందించింది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ప్రకారం.. "అక్టోబర్ 25, 1992న అక్రమంగా యూఎస్‌లో ప్రవేశించాడు. అక్కడ అతడిని భారతీయ పౌరుడిగా గుర్తించారు. జనవరి 21, 1998న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి సింగ్‌ను యూఎస్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో సింగ్ స్వచ్ఛందంగా భారతేదానికి తిరిగి వచ్చేశారు. మళ్లీ జూన్ 29, 2023న యూఎస్ మెక్సికో సరిహద్దు వద్ద అక్రమంగా ప్రవేశించడంతో మళ్లీ యూఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రోటక్షన్ అధికారులకు పట్టుబడ్డాడు. బోర్డర్ పెట్రోల్ అధికారులు సింగ్ కస్టడీని ఎన్ఫోర్సమెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ అట్లాంటా(ఈఆర్ఓ)కు బదిలీ చేసింది. దీంతో అతను అట్లాంటాలో ఫెడరల్ ప్రాసెసింగ్ సెంటర్లో నిర్బంధించబడ్డాడు. ఇంకొద్ది రోజుల్లో యూఎస్ నుంచి బహిష్కరణకు గురవ్వుతాడు అనగా విషాదకరమైన రీతీలో ఆస్పత్రిలో మృతి చెందాడు. ఐతే అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది". అని ఐసీఈ పేర్కొంది. (చదవండి: US: వరుస విద్యార్థుల మరణాలు..ఎఫ్ఐఐడీఎస్ సీరియస్!) -
US: ఐసీఈ కస్టడీలో ఉన్న భారత సంతతి వ్యక్తి మృతి!
యూఎస్‌లో ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కస్టడీలో ఉన్న 57 ఏళ్ల భారత సంతతి వ్యక్తి విషాదకరంగా జార్జియా ఆస్పత్రిలో మరణించాడు. ఈ విషయాన్ని ఫెడరల్ అధికారులు ధృవీకరించారు. భాదితుడు 57 ఏళ్ల జస్పాల్ సింగ్ గుర్తించి, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌కు సమాచారం అందించారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అతని బంధువులకు కూడా సమాచారం అందించింది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ప్రకారం.. "అక్టోబర్ 25, 1992న అక్రమంగా యూఎస్‌లో ప్రవేశించాడు. అక్కడ అతడిని భారతీయ పౌరుడిగా గుర్తించారు. జనవరి 21, 1998న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి సింగ్‌ను యూఎస్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో సింగ్ స్వచ్ఛందంగా భారతేదానికి తిరిగి వచ్చేశారు. మళ్లీ జూన్ 29, 2023న యూఎస్ మెక్సికో సరిహద్దు వద్ద అక్రమంగా ప్రవేశించడంతో మళ్లీ యూఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రోటక్షన్ అధికారులకు పట్టుబడ్డాడు. బోర్డర్ పెట్రోల్ అధికారులు సింగ్ కస్టడీని ఎన్ఫోర్సమెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ అట్లాంటా(ఈఆర్ఓ)కు బదిలీ చేసింది. దీంతో అతను అట్లాంటాలో ఫెడరల్ ప్రాసెసింగ్ సెంటర్లో నిర్బంధించబడ్డాడు. ఇంకొద్ది రోజుల్లో యూఎస్ నుంచి బహిష్కరణకు గురవ్వుతాడు అనగా విషాదకరమైన రీతీలో ఆస్పత్రిలో మృతి చెందాడు. ఐతే అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది". అని ఐసీఈ పేర్కొంది. (చదవండి: US: వరుస విద్యార్థుల మరణాలు..ఎఫ్ఐఐడీఎస్ సీరియస్!) -
సింగపూర్‌లో తమిళ భాష వైభవం.. ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!
పరాయి దేశాల్లో మన భాషకు ప్రాముఖ్యత ఇస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. అక్కడ విద్యా విధానంలో మన భాషలకు ప్రాధాన్యం ఇస్తే.. ప్రతి భారతీయ పౌరుడిగా సగర్వంగా అనిపిస్తుంది. సింగపూర్ దేశంలో అలాంటి అద్భుత సన్నివేశమే చోటు చేసుకుంది. సాక్షాత్తు ఆ దేశ మంత్రి అందుకు నడుబిగిస్తే అది మాములు విషయం కాదు కదా. ఏం జరిగిందంటే..సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మంత్రి ఇంద్రాణి రాజా తమిళ భాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సంపన్న నగర రాష్ట్రంలో నాలుగు అధికారిక భాషల్లో ఒక దానిని చిన్నారులకు పరిచయం చేయాల్సిన అవసరం గురించి తెలిపారు. అక్కడ సింగపూర్ విద్యా విధానం హిందీ, ఉర్దూ, పంజాబీ, వంటి ఇతర ప్రధాన భారతీయ భాషల తోపాటు తమిళం, మలయాళమ్, చైనీస్(మాండరిన్) వంటి భాషలను పాఠశాలల్లో సెకండ్ లాగ్వేజ్గా ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ఇంద్రాణి రాజా సింగపూర్ ప్రధాన మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ..తమిళ భాష ఇక్కడ ఉండే భారతీయ ప్రజలందర్నీ కలిపే పాస్‌పోర్ట్‌గా పనిచేస్తుంది. దాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత మనది కాబట్టి దాన్ని పాఠ్యాంశంగా పిల్లలు నేర్చుకోవాలని అన్నారు. కేవలం చదువుగానే గాక వాడుకలో కూడా ఆ భాషను వినియోగించాలన్నారు. చిన్నప్పటి నుంచి చిన్నారులు మాతృభాషను ఉపయోగిస్తున్నంత కాలం ఏ భాష అయిన సజీవంగానే ఉంటుందన్నారు. అంతేగాదు సింగపూర్‌లో తమిళ భాషా వారసత్వాన్ని నిలబెట్టేందుకు తమిళ భాషా మండలి(టీఎల్సీ) గత 18 ఏళ్లుగా తమిళ భాషా ఉత్సావాన్ని(టీఎల్ఎఫ్) నిర్వహిస్తోంది. గత శనివారమే ఈ టీఎల్ఎఫ్ని ప్రారంభించారు. ప్రతి తరం వారి మాతృభాషతో అనుసంధానింపబడి ఉండాలని అదే వారసత్వ సాంస్కృతిక గుర్తింపు అని దాని ప్రాముఖ్యత గురించి చెప్పుకొచ్చారు. 'క్యాపబిల్టీస్' అనే పేరుతో ఈ ఏడాది టీఎల్సీ సింగపూర్‌లో ఈ తమిళ భాషా ఉత్సవాన్ని మార్చి 30 నుంచి ఏప్రిల్ 28 వరకు జరుపుతోంది. ఈ వేడుకల్లో మొత్తం 47 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఇలా సింగపూర్‌లో భారత సంతతి తమిళులు సాముహికంగా వినూత్న కార్యక్రమాలు రూపొందించడానికి ఈ ఏడాది థీమ్‌ను కూడా ఎంచుకున్నట్లు టీఎల్సీ చైర్పర్సన్ ఎస్ మనోగరన్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 65%కి పైగా ఎక్కువ ఈవెంట్లు యువకులచే నిర్వహించనున్నారు. కళ, సంస్కృతి, సాహిత్య కార్యక్రమాల ద్వారా యువతకు తమిళ భాషను చేరువ చేయనున్నట్లు పేర్కొన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా అయినా తమిళ భాషను నేర్చుకోవడం వల్లే కలిగే ప్రయోజనం తెలుసుకోవాలన్నదే తమ ధ్యేయమని అన్నారు మనోగరన్. (చదవండి: US: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!) -
Canada: భారత సంతతి ఫ్యామిలీ అనుమానాస్పద మృతి
ఒటావా: కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో భారత సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 7వ తేదీ రాత్రి బ్రాంప్టన్‌లోని వారి నివాసంలో మంటలు చెలరేగి సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలకు పోలీసులు పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల ద్వారా మృతులను ఆ ఇంట్లో నివాసం ఉండే రాజీవ్ వరికూ(51), భార్య శిల్ప కొత్త(47) వారి కుమార్తె మహెక్ వరికూ(16)గా నిర్ధారించారు. మంటలు చెలరేగటానికి ముందు ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదంగా భావించడం లేదని తెలిపారు. ఇదీ చదవండి.. నేరగాళ్ల గుప్పిట్లో హైతీ -
Texas: భారత సంతతి కంప్యూటర్ ఇంజినీర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
టెక్సాస్: భారత సంతతికి చెందిన రీసెర్చర్ కంప్యూటర్ ఇంజినీర్‌ను అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. టెక్సాస్‌లో అత్యున్నత అకడమిక్ అవార్డుగా పేరొందిన ఎడిత్ అండ్ పీటర్ ఓ డన్నెల్ అవార్డును ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్‌కు అందజేశారు. ఈ అవార్డును ద టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ(టామ్‌సెట్)ఏటా అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారికి ప్రతి ఏటా అందిస్తుంది. అశోక్ వీర రాఘవన్ హూస్టన్‌లోని రైస్ యూనివర్సిటీకి చెందిన జార్జ్ ఆర్.బ్రౌన్ స్కూల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇమేజింగ్ టెక్నాలజీలో చేసిన పరిశోధనలకుగాను వీరరాఘవన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా వీరరాఘవన్ మాట్లాడుతూ ‘అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుత ఇమేజింగ్ టెక్నాలజీలో చాలా సమస్యలున్నాయి. కాంతి ప్రసరించకుండా అడ్డంకులున్నచోట మనకు కావాల్సిన వాటిని చూడలేకపోతున్నాం. దీనిని అధిగమించేందుకు మేం చేసిన పరిశోధనలు చాలా వరకు పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఉదాహరణకు కారు నడుపుతుంటే పొగమంచు వల్ల కాంతి పడకపోవడంతో ఎక్కువ దూరం రోడ్డును చూడలేకపోతున్నాం. విజిబిలిటీకి సంబంధించి ఇలాంటి సమస్యలు ఇక ముందు ఉండకపోవచ్చు’అని తెలిపారు. అశోక్ వీరరాఘవన్ తన బాల్యాన్ని తమిళనాడులోని చెన్నైలో గడిపారు. ఇదీ చదవండి.. సౌర రేడియేషన్‌తో పెను ముప్పు -
బీబీసీ చైర్మన్‌గా భారతీయుడు
లండన్: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జని్మంచారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం గడించిన సమీర్ గతంలో బీబీసీ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించారు. బీబీసీలో సమకాలీన, రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్‌గానూ పనిచేశారు. బ్రిటన్ రాజు చార్లెస్–3 ఈవారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేయడంతో గురువారం ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి నాలుగో తేదీ నుంచి నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే సమీర్ దాదాపు రూ.1.68 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. బ్రిటన్ టెలివిజన్ రంగానికి చేసిన విశేష కృషికిగాను 2019లో దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 సమీర్‌ను కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్‌తో సత్కరించారు. 1998 నుంచి సొంతంగా జ్యూపిటర్ టీవీని ఈయన నడుపుతున్నారు. -
ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల నమోదు తప్పనిసరి
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), భారత సంతతికి చెందిన విదేశీయులు(ఓసీఐ)–భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాల పెరుగుతండటం ఆందోళనకరమని న్యాయ కమిషన్ పేర్కొంది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి సమగ్రమైన చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. భారతీయులు–ఎన్ఆర్ఐలు, భారతీయులు–ఓసీఐల మధ్య పెళ్లిళ్లను విధిగా రిజిస్టర్ చేసే విధానం ఉండాలని స్పష్టం చేసింది. జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ ‘లా ఆన్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఎన్ఆర్ఐ, ఓసీఐ’ అంశంపై అధ్యయనం చేసింది. ఇటీవల కేంద్ర న్యాయ శాఖకు ఇటీవలే నివేదిక సమర్పించింది. దీనిపై కేంద్రం తేదలచిన చట్టం పెళ్లిళ్లకు వివాదాలన్నింటినీ పరిష్కరించేలా సమగ్రంగా ఉండాలని అభిప్రాయపడింది. మోసపూరిత ఎన్ఆర్ఐ వివాహాలతో భారత యువతులు అధికంగా నష్టపోతున్నారని గుర్తుచేసింది. విడాకులు, భాగస్వామికి భరణం, కస్టడీ, చిన్నారుల జీవన వ్యయాన్ని భరించడం వంటి అంశాలను చట్టంలో చేర్చాలని సిఫార్సు చేసింది. వైవాహిక స్థితిని కచి్చతంగా వెల్లడించేలా పాస్‌పోర్టు చట్టం–1967లో సవరణలు చేయాలని పేర్కొంది. పాస్‌పోర్టులో మ్యారేజీ రిజి్రస్టేషన్ నెంబర్ కూడా ఉండాలని తెలిపింది. ఇద్దరు జీవిత భాగస్వాముల పాస్‌పోర్టులను అనుసంధానించాలని, దీనివల్ల మోసాలను అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. -
అమెరికాలో మరో భారతీయుడి హత్య
వాషింగ్టన్: అమెరికాలో భారతీయుల వరస మరణాలు అక్కడి భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. కాలిఫోరి్నయా రాష్ట్రంలో కేరళ కుటుంబం మొత్తం సొంతింట్లో మరణించిన వార్త మరువకముందే మరో హత్యోదంతం అమెరికాలో వెలుగుచూసింది. అలబామా రాష్ట్రంలో రహదారి వెంట హోటల్‌ను నడుపుకుంటున్న 76 ఏళ్ల ప్రవీణ్ రావూజీభాయ్ పటేల్‌ను అద్దె గది కోసం వచి్చన ఒక కస్టమర్ కాల్చి చంపారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జరిగిన ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలను షెఫీల్డ్ పట్టణ పోలీస్ ఉన్నతాధికారి రిక్కీ టెర్రీ గురువారం వెల్లడించారు. షెఫీల్డ్ పట్టణంలో హిల్‌క్రెస్ట్ మోటెల్ పేరుతో ఒక హోటల్‌ను ప్రవీణ్ సొంతంగా నిర్వహిస్తున్నారు. ఆ హోటల్‌కు 35 ఏళ్ల విలియం జెరిమీ మోరే అనే వ్యక్తి వచ్చి రూమ్ కావాలని ప్రవీణ్‌ను అడిగాడు. కొద్దిసేపటికే విలియం, ప్రవీణ్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. వెంటనే విలియం తన వద్ద ఉన్న గన్‌తో ప్రవీణ్‌ను కాలి్చచంపాడు. అక్కడి నుంచి పారిపోయి దగ్గర్లోని ఇంట్లో చొరబడేందుకు ప్రయతి్నస్తుండగా పోలీసులు అరెస్ట్‌చేశారు. మూడు సార్లు తుపాకీ శబ్దం విన్నానని అక్కడే ఉన్న ఒక సాక్షి చెప్పారు. అసలు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. -
మరో భారతీయ విద్యార్థి అమెరికాలో దుర్మరణం
న్యూయార్క్: ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెడుతున్న కొందరు భారతీయ విద్యార్థుల భవిత అర్ధంతరంగా ముగిసిపోతోంది. ఆ విషాదపర్వంలో మరో ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. భారతీయ మూలాలున్న విద్యార్థి సమీర్ కామత్ సోమవారం సాయంత్రం ఇండియానా రాష్ట్రంలో విగతజీవిగా కనిపించారు. 23 ఏళ్ల సమీర్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. క్రోవ్స్ గ్రో ప్రాంతంలోని స్థానిక నేచర్ ప్రిసర్వ్లో సమీర్ మృతదేహాన్ని కనుగొన్నట్లు వారెంట్ కౌంటీ అధికారి వెల్లడించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చాకే మరణానికి కారణాలపై అంచనాకు రాగలమన్నారు. హైదరాబాద్ విద్యార్థిపై దాడి అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజహర్ అలీ అనే విద్యారి్థపై దుండుగులు దాడికి పాల్పడ్డారు. అతను ఇండియానా వెస్లియాన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చదువుతూ షికాగోలో నివసిస్తున్నాడు. ఈ నెల 4న ఇంటి సమీపంలో ముగ్గురు దండగులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఇటీవల పలువురు భారత విద్యార్థులు అమెరికాలో హత్యకు గురవడం తెలిసిందే. -
లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలు
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మేయర్ పదవికి భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు పోటీ పడనున్నారు. మే 2వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలో వీరిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో, 2016 నుంచి లండన్ మేయర్‌గా కొనసాగుతున్న పాక్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఢిల్లీలో జన్మించిన తరుణ్ గులాటి(63) స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా లండన్‌లో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో భారత్ పర్యటన సమయంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అదేవిధంగా, ప్రాపర్టీ వ్యాపారి శ్యామ్ భాటియా(62) మేయర్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తాజాగా ప్రకటించారు. గులాటి ఎన్నికల ట్యాగ్ లైన్ ‘విశ్వాసం–అభివృద్ధి’కాగా, భాటియా ‘అంబాసిడర్ ఆఫ్ హోప్’ట్యాగ్‌లైన్‌తో ముందుకు వెళ్తున్నారు. చదవండి: ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు! -
ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన
జీవితంలో స్థిరపడాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం, రియల్ ఎస్టేట్ ఇలా ఏదో ఒకటి చేస్తూ బాగా సంపాదించాలనుకునే యువకులు ప్రస్తుతం కోకోల్లలుగానే ఉన్నారు. ఉద్యోగం చేసేవారితో పోలిస్తే.. ఏదో ఒక బిజినెస్ చేసేవారికి ఎక్కువ ఆదాయం వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యాపారాల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బు బాగా సంపాదించవచ్చు. భారతీయ సంతతికి చెందిన 'కరుణ్ విజ్' కెనడాలో నెలకు రూ. 9 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇతడు కెనడాలోని అంటారియోలోని హామిల్టన్‌లోని మెక్‌మాస్టర్ యూనివర్సిటిలో ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి తెలుసుకున్నాడు. 26 సంవత్సరాల వయసు నాటికే.. అతడు హామిల్టన్ ఆస్తిని కొనుగోలు చేసి ఏడు మంది కాలేజీ విద్యార్థులకు అద్దెకు ఇవ్వడం మొదలెట్టాడు. ప్రస్తుతం కరుణ్ విజ్ కెనడాలో 28 గదులతో ఉన్న నాలుగు ప్రాపర్టీలను కొనుగోలు చేసి, వాటి ద్వారా నెలకు రూ. 9 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇదీ చదవండి: 13 రాష్ట్రాల్లో వీరిదే హవా..! ఆదాయం రూ. కోట్లలోనే.. చదువు పూర్తయిన తరువాత అప్లికేషన్ ఇంజనీర్‌గా పనిచేసిన కరుణ్.. ఇప్పుడు సేల్స్ మేనేజర్‌గా పంచేస్తూ.. సంవత్సరానికి రూ. 1.52 కోట్లు వేతనంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇతడు ప్రస్తుతం చికాగోలో తన భార్య, కూతురుతో కలిసి నివాసముంటున్నాడు. తక్కువ రుణాలతో ఇంకా ఆస్తులను పెంచుకుంటూ వెళ్తున్న ఈ ఎన్నారై తన ఆస్తిని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకుంటూ.. ఎంతోమంది యువ వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
రిషి సునాక్‌పై సుయెల్లా బ్రేవర్మన్ ధ్వజం: మూడు పేజీల లేఖ కలకలం
మంత్రివర్గంలో అనూహ్యంగా మార్పులు చేసి, కొత్త వివాదానికి తెరలేపిన బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత, భారత్ సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ స్పందించారు. ప్రధాని సునాక్‌కు ఎవరూ మద్దతుగా లేని సమయంలో తాను ఎంతో అండగా నిలిచానని, వాగ్దానాలన్నింటినీ పక్కన బెట్టి, పాలనలో విఫలమై, ఇపుడు తనపై వేటు వేశారంటూ ఘాటు విమర్శలతో ఒక లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం నుండి వైదొలగమని కోరినందుకు ధన్యవాదాలు. ఇది బాధ కలిగించింది కానీ, బ్రిటీష్ ప్రజలు కోరికమేరకు హోం సెక్రటరీగా పని చేయడం తన అదృష్టమనీ, ఈ సందర్బంగా పౌరసేవకులు, పోలీసులు, బోర్డర్ ఫోర్స్ అధికారులు , భద్రతా నిపుణులందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు. కొన్ని షరతులపై 2022లో అక్టోబ్లో హోం సెక్రటరీగా సేవ చేయడానికి ఆఫర్‌ని అంగీకరించాను అంటూ తన లేఖను మొదలు పెట్టారు. (వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే: దిగ్గజాలు ఇపుడేమంటాయో?) రిషి సునాక్ ప్రధాని కావడానికి తాను ఎంతో తోడ్పాడ్డానని ఆమె పేర్కొన్నారు. కీలకమైన పాలసీలపై తనకిచ్చిన దృఢమైన హామీల మేరకు ఆయనకు మద్దతిచ్చాననీ, అయితే ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి, కీలకమైన విధానాల అమల్లో విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే దేశానికి మేలు చేస్తానని బ్రిటన్ ప్రజలకిచ్చిన హామీలను రిషి విస్మరించాంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అంతేకాదు ప్రధానిగా కొన సాగేందుకు రిషి సునాక్ అనర్హుడంటూ మండిపడ్డారు. అక్రమ వలసలను తగ్గించడం, ఇంగ్లీషు ఛానల్నుదాటకుండా వలస పడవలను ఆపడం, బయోలాజికల్ సెక్స్‌ను రక్షించేలా పాఠశాలలకు చట్టబద్ధమైన మార్గదర్శకత్వం జారీ చేయడం, ఉత్తర ఐర్లాండ్ ప్రోటోకాల్‌పై లాంటి వాగ్దానాల్ని ఆమె ప్రస్తావించారు. ఇది తమ పరస్పర ఒప్పందానికి ద్రోహం మాత్రమే కాదు, దేశానికి చేసి ద్రోహం కూడా అంటూ మూడు పేజీల లేఖలో బ్రేవర్మన్ ధ్వజమెత్తారు. ఎవరైనా నిజాయితీగా ఉండాలి అసలు మీ ప్లాన్లేవీ పని చేయడం లేదు, రికార్డు స్థాయిలో ఎన్నికల పరాజయాల్ని చూశాం. సమయం మించి పోతోందంటూ ఆమె ఒక రేంజ్లో ప్రధానిపై విరుచుకుపడ్డారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?) ఇది ఇలా ఉంటే రిషి సునాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. రిషి క్యాబినెట్‌లోని సీనియర్, సుయెల్లా బ్రేవర్మన్ను హోంమంత్రిగా తొలగించడాన్ని వారు తప్పు పడుతున్నారు. గాజాపై ఇజ్రాయేల్ దాడులను వ్యతిరేకిస్తూ లండన్ వీధుల్లో పాలస్తీనా మద్దతుదారులు మార్చ్, పోలీసుల తీరుపై గత వారం చేసిన వ్యాఖ్యల తర్వాత సుయెల్లాను తొలగించిన విషయం తెలిసిందే. -
రిషి సునాక్ ఇంట దీపావళి వేడుక
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొ న్నారు. ప్రధానిగా సునాక్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నివాసాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. ప్రధాని రిషి సునాక్, అక్షతామూర్తి దంపతులు కలిసి దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ప్రధాని రిషి సునాక్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కమలా హ్యారిస్ నివాసంలోనూ.. వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మంగళవారం వాషింగ్టన్‌లోని తన అధికార నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు భారతీయ అమెరికన్లు సహా 300 మంది వరకు పాల్గొన్నారు. దీపాలు వెలిగించిన అనంతరం చట్టసభల ప్రతినిధులైన రో ఖన్నా, శ్రీ థానెదార్, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ తదితరులతో ఆమె మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరును ప్రస్తావించారు. పాలస్తీనియన్లకు సాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. -
కెమెరాలే మంటను డిటెక్ట్ చేసేలా..సరికొత్త ఆవిష్కరణ!
అగ్ని ప్రమాదాలను ఎంత ముందుగా పసిగట్టగలిగితే నష్టాన్ని అంతగా తగ్గించవచ్చు. స్మోక్ డిటెక్టర్ల వంటి పరికరాలు ఇందుకే వాడుతుంటాం మనం. అయితే వీటితో కొన్ని చిక్కులున్నాయి. ప్రమాదాన్ని గుర్తించి స్పందించేందుకు కొంత సమయం పడుతుంది. ఈ సమస్యను కూడా అధిగమించేలా చాలా వేగంగా మంటలు, అగ్ని ప్రమాదాలను గుర్తించేందుకు ఓ అద్భుత పరికరాన్ని భారత సంతతి విద్యార్థి ఒకరు ఆవిష్కరించారు. ఆ వినూత్న ఆవిష్కరణకు గానూ రూ. 21 లక్షల ఫ్రైజ్ మనీని గెలుపొందింది. వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాలో శాన్‌జోస్‌కు చెందని 12 ఏళ్ల షాన్యా గిల్ ఆమె రూపొందించిన ఫైర్ డిటెక్టర్ డివైస్ థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ పోటీల్లో అత్యున్నత అవార్డు థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఆస్కెండ్ అవార్డును గెలుచుకుంది. తాను చూసిన ఆ ప్రమాదం షాన్యాను ఆ డివైజ్‌ను రూపొందించడానికి ప్రేరేపించింది. 2022 వేసవిలో తమ ఇంటి వెనుక ఉన్న రెస్టారెంట్ అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో తన అమ్మ చాలా జాగ్రత్తగా ఉండేదని. ఇంటి నుంచి బయటకొస్తే చాలు వంటగదిలో స్టవ్ ఆఫ్ అయ్యిందో లేదో అని ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం లేదా ఒక్కోసారి తననే చూడమని పదేపదే అడుగుతుండేదని చెబుతోంది షాన్యా. దీంతో ఈ సమస్యను ఎలా నివారించాలని ఆలోచిస్తుండగా.. థర్మల్ కెమెరాలు శీతకాలంలో ఇళ్లలో వేడి లేకపోవడాన్ని గుర్తించగలవని కనుగొంది. ఈ కెమెరాలే ఇళ్లలోని మంటలను త్వరితగతిన గుర్తించగలవా? అని ఆశ్చర్యపోయింది. ఆ థర్మల్ కెమరానే కాంపాక్ట్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసే ఫైర్ డిటెక్షన్ సిస్టమ్‌ను రూపొందించింది. ఆ తర్వాత వ్యక్తుల మధ్య తేడాను గుర్తించేలా ప్రోగ్రామింగ్ చేసింది. ఫలితంగా బర్న్ అయ్యే వస్తువులను ఐడెంటిఫై చేయడం మొదలు పెట్టింది షాన్యా రూపొందించిన డివైజ్. ఈ ముందస్తు హెచ్చరికతో ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలను రక్షించగలుగుతామని చెప్పుకొచ్చింది. ఈ డివైజ్ సుమారు పది నిమిషాలన పాటు మనుషులను గుర్తించడమే కాకుడుండా వేడకి కారణమయ్యే వాటిని గుర్తించి టెక్స్ట్ సందేశాన్ని ఇచ్చేలా ప్రోగ్రామ్ చేసింది. ఈ డివైజ్ నూటికి 97 శాతం మనుషులను, ఉష్ణానికి కారణమయ్యే కారకాలను విజయవంతంగా గుర్తిస్తోంది. ఈ ఫైర్ డిటెక్షన్ ఆవిష్కరణకు గానూ శాన్యా అత్యున్నత అవార్డు తోపాటు సుమారు రూ. 21 లక్షలు ఫ్రైజ్ మనీని గెలుచుకుని అందరిచేత శెభాష్ అని ప్రసంశలందుకుంది. (చదవండి: కూతురి పెళ్లిలో స్లిమ్‌గా కనిపించాలని ఆ మాత్రలు వేసుకుంది..అంతే ఆమె..) -
సునాక్ పాలనకు ఏడాది
లండన్: భారతీయ మూలాలున్న రిషీ సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే వార్షికోత్సవ సంబరాల వంటివాటికి దూరంగా రోజంతా ఆయన రోజువారీ అధికారిక విధుల్లోనే గడపడం విశేషం. 43 ఏళ్ల సునాక్ సరిగ్గా ఏడాది కింద ఎన్నో సవాళ్ల నడుమ ప్రధాని కావడం తెలిసిందే. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ‘ఏడాదిలో ఎంతో సాధించాం. కానీ సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది’ అంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియో పోస్ట్ చేశారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ చైర్మన్ గ్రెగ్ హ్యాండ్స్ సైతం రిషి పాలనను ఈ సందర్భంగా ప్రశంసించారు. -
ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోవడమా..! పాపం ఆ వ్యక్తి..
సాధారణంగా గుండెపోటు వస్తేనే మనుషులు గిలగిల లాడిపోతారు. అలాంటిది ఒకేరోజు ఆరుసార్లు గుండె ఆగిపోతే ఆ మనిషి ఉంటాడా? అని డౌటు వస్తుంది కదా!. ఒకవేళ బతికినా పూర్తిస్థాయిలో కోలుకుంటాడా అన్నది అనుమానమే. అచ్చం అలానే భారత సంతతి విద్యార్థి కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యాడు. అయితే అతను ఏమయ్యాడు? బతికాడా? అనే కదా!. నిజానికి ఇలా ఆరుసార్లు గుండె ఆగిపోవడం జరుగుతుందా? ఎందుకిలా? తదితరాల గురించే ఈ కథనం. యూకేలోని 21 ఏళ్ల భారత సంతతి అమెరికన్ విద్యార్థి అతుల్ రావు ఒకే రోజు ఆరుసార్లు గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడి స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌ని పిలిపించారు. ఇంతలో సెక్యూరిటీ గార్డు అతని ఛాతీకి కంప్రెషన్ ఇచ్చేలా సీపీఆర్ చేశాడు. ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చేరేటప్పటికీ తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు. ఎక్స్ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్(ఈసీఎంవో)కి యాక్సిస్ చేశారు. గుండె, ఊపిరితిత్తుల పనిని పూర్తిగా భర్తీ చేసేలా లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ని అమర్చారు వైద్యులు. ఇంతలో క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ పనిచేయం ప్రారంభించాయి. దీంతో అతను లైఫ్ సపోర్ట్ మెషీన్లు, ఈసీఎంఓ తదితరాలు లేకుండానే పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అతుల్ ఇప్పుడు యూఎస్‌కి తిరిగి వెళ్లాడు. పూర్తిగా కోలుకున్నాడు కూడా. స్టూడెంట్ అతుల్ రావు ఎదుర్కొన్న ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో పల్మనరీ ఎంబోలిజం అంటారు పల్మనరీ ఎంబోలిజం అంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం..పల్మోనరీ ఎంబోలిజం చాలా సందర్భాల్లో కాలులోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడం మొదలై ఊపిరితిత్తులకు వెళ్తుంది. అరుదుగా శరీరంలోని వేరే ఏదైనా భాగంలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. ఫలితంగా ఊపిరితిత్తులకు రక్తప్రవాహాన్ని పరిమితం చేసి, ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా పల్మనరీ ధమనుల్లో రక్తపోటు పెరిగిపోతుంది. దీన్నే పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఈ పల్మోనరీ ఎంబోలిజంలో గుండె లేదా ఊపిరితిత్తులకి రక్తప్రవాహం ఆగిపోయి పనితీరుకి ఆటకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె లేదా ఊపిరితిత్తులు ఆకస్మికంగా వైఫల్యం చెంది మరణానికి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా ఉన్న గుండె, రక్తనాళాల వ్యాధులకు సంబంధించిన వాటిల్లో ఇదొకటి. లక్షణాలు శ్వాస ఆడకపోవడం మరియు ఛాతీ నొప్పులు కాలక్రమేణా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే, చాలా మంది రోగులు శ్లేష్మంతో దగ్గినా. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోవడం ఛాతీ, చేయి, భుజం, మెడ లేదా దవడలో పదునైన నొప్పి దగ్గు పాలిపోయిన చర్మం వేగవంతమైన హృదయ స్పందన విపరీతమైన చెమట ఆత్రుత మూర్ఛపోవడం లేదా స్ప్రుహతప్పిపోవడం గురక ఎవరికి ప్రమాదం అంటే.. కాలులో రక్తం గడ్డకట్టిన వారు కూర్చొని పనిచేసేవారు సిరకు గాయం లేదా గాయం కలిగిన వారు చాలా కాలం పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం లేదా హార్మోన్ పునఃస్థాపన చికిత్స చేయించుకోవడం పొగ స్ట్రోక్ వంటి గుండె జబ్బుల చరిత్రను కలిగి ఉండటం అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
యోగిని అభినందిస్తూ.. భారత సంతతి బ్రిటిష్ ఎంపీ లేఖ!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని అభినందిస్తూ భారత సంతతి బ్రిటిష్ ఎంపీ వీరేంద్ర శర్మ లేఖ రాశారు. ఆ లేఖలో.. యూపీలో శాంతిని నెలకొల్పేలా.. మీరు చేసిన ప్రయత్నాలు, సాధించిన విజయాలకు గాను మీకు అభినందనలు అని రాశారు. ఈ సందర్భంగా రచయిత శంతను గుప్తా తనకు ప్రెజెంట్ చేసిన గ్రాఫిక్ నవల "అజయ్ టు యోగి ఆదిత్యనాథ్" గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. అంతేగాదు హౌస్ ఆఫ్కామన్స్లో రచయిత శంతను గుప్తా ఉత్తరప్రదేశ్ అభివృద్ధి ప్రయాణం గురించి తనతో చర్చించినట్లు కూడా లేఖలో తెలిపారు. రచయిత శంతను హౌస్ఆఫ కామన్స్‌లో మాట్లాడుతూ....ప్రపంచ వ్యాప్తంగా బ్రాంబ్ ఇండియాను ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించారని, దాని కారణంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్లే భారత్ బలమైన బ్రాండ్‌గా మారింది. అంతేగాదు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వ హయాంలో అగ్రశ్రేణి పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. అలాగే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో 2017లో 14వ స్థానంలో ఉన్న యూపీ కాస్తా 2కి ఎగబాకింది. అంతేగాదు ఉత్తరప్రదేశ్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే, కొత్త విమానాశ్రయాలు, బలమైన శాంత్రి భద్రతలు గురించి కూడా రచయిత శంతను భారత సంతతి బ్రిటిష్ ఎంపీతో చెప్పుకొచ్చారు. ఇంకా రచయిత శంతను వీరేంద్ర శర్మతో యోగి ఆదిత్యనాద్ తండ్రి గురించి కూడా ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే యోగి ఆధిత్యానాథ్ సాధించిన విజయాలు, ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్న బ్రిటిష్ ఎంపీ వీరేంద్ర శర్మ ఆయన్ని అభినందిస్తూ లేఖ రాశారు. (చదవండి: డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్!) -
ట్రంప్‌కి సైతం వణుకుపుట్టించే స్థాయికి వివేక్ రామస్వామి
భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున రేసులో ఉన్న ఆయన... ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నారు. బయోటిక్ రంగంలో అమెరికాలో సంచలనం సృష్టించిన రామస్వామి... మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా వణుకుపుట్టించే స్థాయికి ఎలా ఎదిగారు? రిపబ్లిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో భారత సంతకి అభ్యర్థి వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తర్వాతి స్థానంలోకి చేరుకొన్నారు ఆయన. ఈమధ్యనే జరిగిన జీవోపీ పోల్స్‌లో ఇది వెల్లడైంది. ఇంతకుముందు మూడో ప్లేస్‌లో ఉన్న భారత సంతతికి చెందిన రామస్వామి తాజాగా రెండో స్థానానికి చేరుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు... అధ్యక్ష రేసు కోసం జరుగుతున్న ప్రైమరీ పోల్స్‌లో 39 శాతం మంది డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారు. రామస్వామికి 13 శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు. దీన్నిబట్టి ట్రంప్‌కు రామస్వామే ముఖ్య పోటీదారుగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి నిక్కీహెలీ 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ట్రంప్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ రెండు స్థానాలు తగ్గి అనూహ్యంగా ఐదో స్థానానికి పడిపోయారు. న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ 11 శాతం మద్దతుతో నాలుగో స్థానంలో ఉన్నారు. మరోవైపు...వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 75 శాతం మందిని తొలగిస్తానని అనూహ్య ప్రకటన చేశారు రామస్వామి. అంతేకాదు FBI లాంటి అనేక సంస్థలను మూసేస్తాని కూడా స్పష్టంచేశారు. వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగుల్ని తగ్గించడమే తన లక్ష్యమని కూడా చెప్పారు రామస్వామి.అంతేకాదు.. హెచ్-1 వీసా విధానంలో సంస్కరణలు తీసుకొస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ విభాగంలో సుమారు 22 లక్షల 50 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 75 శాతం మంది తొలగించడమంటే 16 లక్షల మందికి ఉద్వాసన పలనకడమేనన్నమాట. అంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేస్తే బడ్జెట్లో వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయి. కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలు మూతపడే అవకాశముందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు... ఈమధ్య జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలు చేసిన వివేక్ రామస్వామి చాలా మంది మద్దతు సంపాదించారు. తర్వాత నిర్వహించిన పోల్‌లో 504 మంది స్పందన తెలియజేస్తే... అందులో 28 శాతం మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల విషయానికి వస్తే ...రష్యా విషయంలో విభిన్న వైఖరిని ప్రకటించారు రామస్వామి. అమెరికాకు ప్రధాన అడ్డంకిగా మారిన చైనా ను ఎదుర్కొనే సమయంలో రష్యా చాలా కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్కోను ఎట్టి పరిస్థితుల్లో బీజింగ్ పక్షాన చేరనీయకూడదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రష్యాకు మంచి డీల్‌ను ఆఫర్ చేస్తానని కూడా ప్రకటించారు రామస్వామి. మాస్కోతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరిస్తానన్నారు. అప్పుడు చైనాతో అవసరం మాస్కోకు తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు రామస్వామి. మరోవైపు.. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందంజలోనే ఉన్నారు. కానీ ఆయనకు భారత సంతతికి చెందిన అభ్యర్థుల నుంచి చివరిదాకా గట్టిపోటీ తప్పేలాలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధ్యక్ష ఎన్నికల నాటికి పరిస్థితులు మారే అవకాశముందని కూడా అంచనావేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబరులో జరగుతాయి. గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఆసమయంలోనే తాను 2024 నాటి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీచేస్తానని ప్రకటించారు ట్రంప్. ఇక.. రామస్వామి పూర్వీకులు భారత్‌కు చెందిన వారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా నుంచి అమెరికా వలసవెళ్లిన గణపతి రామస్వామి, గీతా రామస్వామికి 1985 ఆగస్టు 9న జన్మించారు వివేక్ రామస్వామి. హార్వర్డ్ నుంచి జీవశాస్త్రంలో డిగ్రీ తీసుకున్న వివేక్.. 2014లో రోవెంట్ సైన్సెస్ అనే సంస్థను స్థాపించారు. 2015లో అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓకు వెళ్లారు. క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు విజయవంతంగా మందులు తయారుచేసి బయోటెక్ రంగంలో అమెరికాలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అమెరికాలోని టాప్ యువ బిలియనీర్లలో రామస్వామి ఒకరు. రిపబ్లికన్ పార్టీలో ఇప్పుడు ఆయన కీలక వ్యక్తిగా మారారు. -
మరో ఘనత.. సింగపూర్ అధ్యక్ష పీఠంపై భారతీయుడు
సింగపూర్: అంతర్జాతీయ రాజకీయాల్లో మరో భారతీయుడు పతాకశీర్షికలకెక్కారు. సింగపూర్ నూతన అధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న ఆర్థికవేత్త థర్మాన్ షణ్ముగరత్నం గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారులైన చైనా మూలాలున్న ఎంగ్కోంక్ సాంగ్( 15.72 శాతం ఓట్లు), తన్కిన్ లియాన్ (13.88 శాతం)లను వెనక్కి నెట్టేసి ఏకంగా 70.4 శాతం ఓట్లు సాధించి షణ్ముగరత్నం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అధ్యక్ష భవనం ఇస్టానాలో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి, భారతీయ మూలాలున్న జడ్జి సుందరేశ్ మీనన్ ఈయనతో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. బహుళ జాతుల, సమ్మిళిత సమాజాభివృద్ధికి కృషిచేస్తానని అధ్యక్ష హోదాలో షుణ్ముగరత్నం హామీ ఇచ్చారు. 66 ఏళ్ల షణ్ముగరత్నం ఆరేళ్లపాటు అధ్యక్షునిగా పాలన కొనసాగిస్తారు. Tharman Shanmugaratnam was sworn in as Singapore's ninth President on Thursday, September 14, 2023. He was elected in the 2023 presidential election with 70.41% of the vote. Congrats!#Singapore #inauguration #presidentofsingapore #tharmanshanmugaratnam [📸 CNA/Jeremy Long] pic.twitter.com/7JtMOYGLLE — Bryan Toh (@bryan__toh) September 15, 2023 -
మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!
భారత సంతతికిచెందిన టాప్ సీఈవోలు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ మొదలు, గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల వరకు భారతీయులు గ్లోబల్ కంపెనీలకు సారధులుగా ఉండిమెప్పిస్తున్నారు. 76వ ఇండిపెండెన్స్‌డే సందర్భంగా దిగ్గజ కంపెనీల్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ, దేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటుకుంటున్న సీఈఓలు గురించి తెలుసుకుందాం. అయితే ఈ స్థాయి వారికి అలవోకగా రాలేదు. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని, మొక్కవోని ధైర్యంతో అడుగులు వేయడమేకాదు, ఆధునిక టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 1990 దశకం నుంచి భారత సంతతికి చెందిన టెక్ నిపుణులు, వ్యాపార దిగ్గజాలు గ్లోబల్ కంపెనీల్లో కీలక పదవుల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా రాహ్మ్ అండ్ హాస్ ఛైర్మన్, సీఈఓగా రాజ్ గుప్తా బాధ్యతలు స్వీకరించి కొత్త శకానికి నాంది పలికారు. ఆ తరువాత స్టాన్ర్ట్ఫోర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్, సీఈఓగా యూఎస్ ఎయిర్వేస్ గ్రూప్‌నకు రాకేశ్ గంగ్వాల్ సీఈగా ఎంపికై తమ ఘనతను చాటుకున్నారు. అజయ్‌పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్‌పాల్ సింగ్ బంగా లేదా అజయ్‌బంగా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కుమారుడు. పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ,అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశారు.నెస్లే తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం వరల్డ్ బ్యాంకు అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అజయ్‌పాల్ సింగ్ బంగా అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా, అంతకు ముందు ఏప్రిల్ 12, 2010 నుంచి 11 సంవత్సరాల పాటు మాస్టర్‌కార్డ్ సీఈవోగా పనిచేశారు. గతంలో పెప్సికో ,సిటీ గ్రూప్‌లో కూడా పనిచేశారు.ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. గీతా గోపీనాథ్ గీతా గోపీనాథ్ 1971లో పశ్చిమ బెంగాల్లోనికోల్కతాలో పుట్టారు. 2022లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికై తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2019-2022 దాకా ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ఐఎంఎఫ్‌లో చేరడానికి ముందు, గోపీనాథ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్ర విభాగంలో విద్యావేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించారు. జాన్ జ్వాన్‌స్ట్రా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ (2005-2022), అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. గోపీనాథ్ క్రీడలు, సంగీతంపై కూడా మక్కువ ఎక్కువ. అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిచాయ్ సుందరరాజన్ సుందర్‌పిచాయ్ తమిళనాడులో చెన్నైలోని అశోక్ నగర్లో జన్మించారు. తల్లి లక్ష్మి వృత్తిరీత్యా స్టెనోగ్రాఫర్, తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేశారు. వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. 2015లో గూగుల్ సీఈగా నియమితులయ్యారు. అనంతరం కేవలం నాలుగేళ్లకే 2019లో గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్ సీఈవోగా ఎంపిక కావడం గమనార్హం. సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో తన బ్యాచిలర్స్ డిగ్రీని, విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్‌కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.2021లో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అరవింద్ కృష్ణ ఐబీఎం ఛైర్మన్ , సీఈవో 1990లో ఐబీఎంలోచేరారు కృష్ణ. ఏప్రిల్ 2020 నుంచి కంపెనీ సీఈవో ఆతరువాత జనవరి 2021లో ఛైర్మన్‌గా బాధ్యలను స్వీకరించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్ ,బ్లాక్‌చెయిన్, నానోటెక్నాలజీతో సహా కోర్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆవిష్కరణలతో ఐబీఎం మార్కెట్‌ను విస్తరించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అరవింద్ న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు , అలాగే నార్త్రోప్ గ్రుమ్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన అరవింద్ కాన్పూర్ ఐఐటీనుంచి డిగ్రీ , అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేశారు. లక్ష్మణ్ నరసింహన్ స్టార్‌బక్స్ సీఈఓ 2023 ఏప్రిల్ 1న స్టార్‌బక్స్ సీఈవోగా ఎంపికయ్యారు. లక్ష్మణ్ నరసింహన్ యూనివర్సిటీ ఆఫ్ పుణెలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ , యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా జర్మన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఆయనకు ఎంఏ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్ష్టన్ స్కూల్ నుంచి ఆయన ఫైనాన్స్‌లో ఎంబీఏ పొందారు. ఇంద్రా నూయి: భారత సంతతికి చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి 12 ఏళ్ల పాటు అమెరికా దిగ్గజం పెప్సీకోకు సీఈవోగా పనిచేశారు. 2018లో ఆమె పదవీ విరమణ చేశారు. చెన్నైకి చెందిన నూయి, 1996లో పెప్సికోలో చేరిన ఆమె 2006- 2018 వరకు సీఈఓగా పనిచేశారు. శ్రీకాంత్ దాతర్ భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్. హార్వర్డ్ హార్వర్డ్ లో ఏకకాలంలో ఆర్థర్ లోవ్స్ డికిన్సన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గా పనిచేసారు 2021లో ఆయనకు భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం లభించింది.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శ్రీకాంత్ 1976-78లో IIMAలో మేనేజ్మెంట్లో PGP చేసారు. 1978-80 టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తో కలిసి పనిచేశారు. 1985లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో వ్యాపారం (అకౌంటింగ్)లో పీహెచ్డీ పొందారు. కార్నెగీ మెల్లన్ అండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, 1996 నుండి, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో IIMAలో విద్యార్థిగా, విద్యార్థి వ్యవహారాల మండలి సమన్వయకర్త (1977-78) గా పనిచేయడమే కాదు ఔట్ స్టాండింగ్ ఓవర్ ఆల్ పెర్పామెన్స్ అవార్డు' అందుకున్నారు. ఆతరువాత, IIMA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (2012-18)లో పనిచేశారు. డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా 2009లో ఆసియాలోనే పాపులర్బ్యాంకు డీబీఎస్గ్రూప్ సీఈవో డైరెక్టర్‌గా ఎంపికైనారు.ఈ గ్రూప్ ఆస్తుల విలువ 2019లో నాటికి 500 బిలియన్ల కంటే ఎక్కువ. 1960లో మీరట్‌లో జన్మించిన పీయూష్ గుప్తా ఢిల్లీలోని సెయింట్ కొలంబా ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. 1980లో అహ్మదాబాద్‌లో ఐఐఎంలో ఎంబీఏ చేశారు. ప్రముఖ కంపెనీల్లోని మరికొంతమంది భారత సంతతి సీఈవోలు వివేక్ శంకరన్- ఆల్బర్ట్సన్స్ అధ్యక్షుడు, సీఈవో సంజయ్ మెహ్రోత్రా- మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్,సీఈవో శాంతను నారాయణ్- అడోబ్ ఐఎన్‌సీ ఛైర్మన్, సీఈవో సీఎస్ వెంకట కృష్ణన్- బార్క్లేస్ సీఈవోపునిత్ రెన్జెన్- డెల్లాయిట్ సీఈవో రేవతి అద్వాతి- ఫ్లెక్స్ సీఈవో -
చరిత్ర సృష్టించింది.. యూఎస్ సెనేట్ బరిలో భారత సంతతి మహిళ!
ఇటీవల అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో అమెరికా ఉపాధ్యక్ష పదవిలో భారత మూలాలున్న కమలా హారిస్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత సంతతికి చెందిన రెజనీ రవీంద్రన్ అనే కళాశాల విద్యార్ధిని విస్కాన్సిన్ నుంచి సెనేట్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించింది. డెమొక్రాటిక్ సెనేటర్ టామీ బాల్డ్‌విన్‌పై అధికారికంగా పోటీ చేసిన ఆమె.. మొదటి రిపబ్లికన్‌గా చరిత్ర సృష్టించారు. ప్రైమరీకి ఇంకా ఏడాది మాత్రమే సమయం వున్నట్లు మిల్వాకీ జర్నల్ సెంటినెల్ పేర్కొంది. ఈ సందర్భంగా రెజనీ మాట్లాడుతూ. . "నేను చాలా మంది రాజకీయ నాయకులు, లాబీయిస్టులు, పాలసీ మేకర్స్‌ను కలిశాను. వారిలో చాలా మంది 20, 30 సంవత్సరాలుగా ఉన్నారు. మనమే వారిని ఎన్నుకుంటున్నాం, అధికారాన్ని ఇస్తున్నాం. అయితే వారు మాత్రం వాష్టింగ్టన్ డీసీలో సుఖంగా ఉంటున్నారని చురకలంటించారు. మన గురించి మరిచిపోయినప్పుడు, వారిని అక్కడికి పంపడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. రవీంద్రన్ రాజకీయాలకి కొత్త. ఆమె ఈ సంవత్సరం స్టీవెన్స్ పాయింట్ కాలేజ్ రిపబ్లికన్లలో చేరింది. ఈ వేసవి ప్రారంభంలో వాషింగ్టన్ పర్యటన తర్వాత సెనేట్‌కు పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె వచ్చే ఏడాది పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయాలని యోచిస్తోంది. రవీంద్రన్ భారతదేశం నుంచి 2011లో యుఎస్‌కి వలస వెళ్లారు. ఆమె 2015లో అమెరికా పౌరసత్వం పొందింది. 2017లో విస్కాన్సిన్కు వెళ్లడానికి ముందు కాలిఫోర్నియాలో నివసించేది. చదవండి చికాగో రోడ్లపై దయనీయస్థితిలో ఉన్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం -
టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, ఆసక్తికర విషయాలు
Tesla new Indian-origin CFO VaibhavTaneja ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ అధీనంలోని ఆటో మేజర్ టెస్లాకు సీఎఫ్‌వోగా భారత సంతతికి చెందిన వ్యక్తి నియమితులయ్యారు. జాచరీ కిర్‌ఖోర్న్ స్థానంలో భారతీయ సంతతికి చెందిన అకౌంటింగ్ హెడ్ వైభవ్ తనేజాను నియమించినట్లు సంస్థ ప్రకటించింది. తనేజా ఢిల్లీ యూనివర్సిటీ నుండి కామర్స్ గ్రాడ్యుయేట్. రెండు దశాబ్దాలకు పైగా అకౌంటింగ్ అనుభవం ఉంది.దీంతోపాటుటెక్నాలజీ ఫైనాన్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్‌లో పలు బహుళజాతి కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం వైభవ్ సొంతం. (నిన్న బియ్యం ఎగుమతులపై నిషేధం: నెక్ట్స్ ఏంటో తెలిస్తే..!) అమెరికన్ ఆటోమొబైల్ మేజర్ టెస్లాలో ప్రస్తుతం చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైభవ్ తనేజాకు అదనపు బాధ్యతగా సీఎఫ్‌వో బాధ్యతలు అప్పగించారు.అయితే ఈ మార్పునకు గల కారణాలను కంపెనీ అధికారికంగా ప్రకటించారు. కానీ సజావుగా పరివర్తనను నిర్ధారించేందుకుగాను సంవత్సరం చివరి వరకు అతని స్థానంలో ఉంటారని ఈ ఏడాది చివరి వరకు జాచరీ కిర్ఖోర్న్ఈ పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది. "మాస్టర్ ఆఫ్ కాయిన్" గా పాపులర్ అయిన వైభవ తనేజా గురించి ఆసక్తికర విషయాలు: ఎవరీ వైభవ్ ♦ వైభవ్ తనేజా 2017లో టెస్లాలో చేరారు, 2016లో టెస్లా కొనుగోలు చేసిన సోలార్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థ సోలార్‌సిటీలో వైస్ ప్రెసిడెంట్‌గా , తరువాత కార్పొరేట్ కంట్రోలర్‌గా పనిచేశారు. 2016లో దీన్ని టెస్లా టేకోవర్ చేసింది. ఈ విలీనంలోరెండు కంపెనీల అకౌంటింగ్ బృందాల విజయవంతమైన ఏకీకరణకు కూడా నాయకత్వం వహించారు. వైభవ్ మార్చి 2019 నుండి టెస్లా సీఏవోగా పనిచేస్తున్నారు. అలాగే మే 2018 నుండి కంపెనీ కార్పొరేట్ కంట్రోలర్‌గా కూడా పనిచేస్తున్నారు. (అయ్యయ్యో..దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది) ♦ 13 సంవత్సరాలు పాటు సంస్థకు సేవలందించిన జాచరీ కిర్‌ఖోర్న్ స్థానంలో వైభవ్ తనేజాకొత్త సీఎఫ్‌వోగా ఎంపికయ్యారు. ♦ టెస్లా త్రైమాసిక ఆదాయాలు , అమెరికా, అంతర్జాతీయ నియంత్రణపై తనేజా మాజీ సీఎఫ్ఓలు దీపక్ అహుజా , జాచరీ కిర్ఖోర్న్లకు సన్నిహితుడు. ♦ తనేజా జనవరి 2021లో టెస్లా ఇండియన్ ఆర్మ్, టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా కూడా నియమితులయ్యారు. కాగా భారత మార్కెట్లో ఎగుమతి రెండింటి కోసం టెస్లా ప్రస్తుత ఎంట్రీ మోడల్ కంటే దాదాపు 25శాతం తక్కువ ధరతో ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని భారతదేశంలో నిర్మించాలని టెస్లా భారీ ప్రయత్నాలే చేస్తోంది. ఈ వార్తల మధ్య ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి తోడు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమైనట్టు తెలుస్తోంది. టెస్లా సీనియర్ పబ్లిక్ పాలసీ , బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోహన్ పటేల్, సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ రోషన్ థామస్‌తో భేటీ అయ్యారు. -
Neha Narkhede: టెక్నోస్టార్
పుణెలోని ఆ ఇంట్లో మరాఠీ, హిందీ పాటలతో పాటు పాఠాలు కూడా వినిపించేవి. అయితే అవి క్లాస్రూమ్ పాఠాలు కాదు. ఎన్నో రంగాలలో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన మహిళల గురించిన గెలుపు పాఠాలు. ఆ పాఠాలు వింటూ వింటూ ‘నేను కూడా సాధిస్తాను’ అన్నది చిన్నారి నేహ. అవును ఆమె సాధించింది! ఫోర్బ్స్ అమెరికా ‘రిచ్చెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్–2023’ జాబితాలో వివిధ రంగాలకు చెందిన వందమంది మహిళలకు చోటు దక్కింది. వీరిలో పదకొండు మంది నలభై ఏళ్ల వయసులోపు ఉన్నవారు. వారిలో ఒకరు 38 సంవత్సరాల టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ నేహ నర్ఖాడే.... మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగింది నేహ. ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తనకు కంప్యూటర్ కొనిచ్చారు. అప్పుడు టెక్నాలజీపై మొదలైన ప్రేమ అలా కొనసాగుతూనే ఉంది. టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్త కొత్త విజయాలు సాధించేలా చేస్తూనే ఉంది. తన బలం ‘తల్లిదండ్రులు’ అని చెప్పుకుంటుంది నేహ. ‘మొదట చదువు విలువ గురించి చెప్పారు. చదువుపై ఆసక్తి పెరిగేలా చేశారు. ఎంతోమంది మహిళా రోల్‌మోడల్స్ గురించి చెప్పేవారు. నువ్వు కూడా ఏదైనా సాధించాలి అంటూనే... యస్. నువ్వు సాధించగలవు అనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించారు’ అంటుంది నేహ. పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో చదువుకున్న నేహ ... జార్జియా (యూఎస్)లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. జార్జియాలో చదువుకునే రోజుల్లో ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి అనే విషయంలో ఎంతోమంది స్నేహితులతో చర్చిస్తూ ఉండేది. ‘ఒరాకిల్’లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తొలి ఉద్యోగం చేసిన నేహ ఆ తరువాత ‘లింక్ట్ ఇన్’లో చేరింది. ఆ సమయంలో రకరకాల స్టార్టప్‌లు, వాటి విజయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘అపాచీ కాఫ్కా’ అనే ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. కంపెనీలు తమ డాటాతో వేగంగా యాక్సెస్ అయ్యే అవకాశాన్ని ఈ ప్లాట్‌ఫామ్ కల్పిస్తుంది. ‘ఎలాంటి జటిలమైన సమస్యను అయినా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి’ అనేది లక్ష్యంగా నిర్ణయించుకుంది. రెండు సంవత్సరాల తరువాత ‘కన్‌ఫ్లూయెంట్’ అనే ఫుల్–స్కేల్ డాటా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది నేహ. ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీలు ‘కన్‌ఫ్లూయెంట్’ నుంచి సేవలు పొందుతున్నాయి. కంపెనీకి సంబంధించి భాగస్వాములు, ఉద్యోగులను ఎంచుకోవడంలో నేహ అనుసరించే పద్ధతి ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘తెలివితేటలతో పాటు కష్టపడే స్వభావం ముఖ్యం. వీరితో ఐడియాలు షేర్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది అనిపించాలి. సమస్య తలెత్తినప్పుడు మెరుపు వేగంతో పరిష్కరించే సామర్థ్యం ఉండాలి’ నేహ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు స్టార్టప్ కల్చర్‌పై ఇప్పుడు ఉన్నంత అవగాహన లేదు. ప్రతి అడుగు ఆచితూచి వేసినా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుండేది. వెంటనే ఆ తప్పును దిద్దుకొని ముందుకు సాగేది. నేహా నర్ఖాడే విజయరహస్యం ఏమిటి? ‘వ్యూహాలు, ప్రతివ్యూహల సంగతి తరువాత. ఎంటర్ప్రెన్యూర్లకు తప్పనిసరిగా కావాల్సింది మానసిక బలం. ఆ బలం ఉంటే యుద్ధరంగంలో అడుగు ముందుకు వేయగలం. విజయాలు సాధించగలం. ఇది నా దారి... అంటూ పరుగెత్తడం కాదు. చుట్టూ ఏం జరుగుతుందో అనేదానిపై పరిశీలన దృష్టి ఉండాలి. మన తప్పుల నుంచీ కాదు ఇతరుల తప్పుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. టైమ్మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి’ అంటుంది నేహ. నేహ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు రోల్‌మోడల్, తన రోల్‌మోడల్ మాత్రం ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ‘నియో’ ఫౌండర్, సీయివో పద్మశ్రీ వారియర్. ‘రోల్‌మోడల్ స్థానంలో మనల్ని మనం చూసుకుంటే వారిలా విజయం సాధించడం కష్టం కాదు’ అంటుంది నేహ నర్ఖాడే. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి. – నేహ -
స్పెల్లింగ్ బీ విజేతగా భారత సంతతి దేవ్ షా
అమెరికాలో ఏటా జరిగే ప్రతిష్టాత్మక స్పెల్లింగ్ బీ పోటీల్లో ఈ ఏడాది భారత సంతతికి చెందిన 14 ఏళ్ల కుర్రాడు దేవ్ షా విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ట్రోఫీతో పాటు 50వేల డాలర్ల(మన కరెన్సీలో 41 లక్షల రూపాయలకు పైనే..) క్యాష్ ప్రైజ్ అందుకుని వార్తల్లోకి ఎక్కాడు. psammophile అనే పదానికి కరెక్ట్‌గా స్పెల్లింగ్ చెప్పాడు దేవ్ షా (14). psammophile అంటే డిక్షనరీ మీనింగ్.. ఇసుకలో ఉండే జీవులు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పోటీలో ఈమారు మొత్తం కోటి పది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తుది దశకు చేరుకున్న 11 మందిలో దేవ్ షా కూడా ఒకరు. గత 24 ఏళ్లలో ఈ పోటీల్లో గెలిచిన 22వ దక్షిణాసియా సంతతి వ్యక్తిగా దేవ్ షా నిలవడం గమనార్హం. ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా నిలిచినందుకు దేవ్ షా సంబరపడిపోయాడు. ‘‘ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. నా కాళ్లు ఇంకా వణుకుతున్నాయి’’ అని వ్యాఖ్యానించాడు. ఇక వర్జీనియా రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ల షార్లెట్ వాల్ష్ ఈ పోటీలో రెండో స్థానంలో నిలిచింది. దేవ్ తండ్రి దేవల్ 29 ఏళ్ల కిందట అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఆయన కుటుంబం ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉంటోంది. గతంలో దేవ్ షా రెండుసార్లు ఈ పోటీల్లో పాల్గొన్నాడు. మూడేళ్ల వయసు నుంచే సరైన స్పెల్లింగ్స్ చెప్పడం దేవ్ షా ప్రారంభించాడని, ప్రస్తుతం ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని దేవల్ సంబురపడిపోతున్నారు. 1925లో అమెరికాలో నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి.. పోటీల్లో ఇండో-అమెరికన్ల ఉత్తమ ప్రదర్శన కొనసాగుతోంది. పోటీల్లో అడిగే కఠినమైన ఆంగ్ల పదాల అక్షర క్రమాన్ని సరిగ్గా చెప్పే వారు విజేతలు అవుతారు. ఎనిమిదవ గ్రేడ్ లోపు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. 2020లో కరోనా కారణంగా పోటీ నిర్వహించలేదు.. తిరిగి 2021లో స్వల్ప మార్పులతో ఈ పోటీలు జరిగాయి. ఇక కిందటి ఏడాది టెక్సాస్‌లో జరిగిన పోటీల్లో హరిణి లోగన్ విజేతగా నిలిచింది. మరో భారత అమెరికన్ విక్రమ్ రాజుపై ఆమె గెలుపొందింది. ఇదీ చదవండి: డేంజర్‌బెల్స్.. ఎటు చూసినా రెడ్ సిగ్నల్స్ -
నిర్ధాక్షిణ్యంగా బిడ్డను వదిలేసింది..అదే ఉచ్చులా మారి కటకటాల్లోకి నెట్టింది!
నాలుగేళ్ల క్రితం నాటి కేసు అనుహ్యంగా ఆమె అరెస్టుతో చిక్కుముడి వీడింది. ఆమె బిడ్డను కని వదిలించేసుకున్నా.. అనుకుంది. కనివినీ ఎరుగని రీతిలో అదే తనకు ఉచ్చులా బిగిసి జైల్లోకి వెళ్లేలా చేస్తుందని ఊహించుకుని కూడా ఉండదు ఆ తల్లి. ఈ షాకింగ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని జార్జియాలో ఓ మహిళ ఆడ శిశువుని కని నిర్ధాక్షిణ్యంగా అడవిలో ఒక చెక్పెట్టేలో వదిలేసింది. సమీపంలోని ఓ కుటుంబం ఫోర్సిత్ కౌంటీ షెరీఫ్(పోలీసులు)కు సమాచారం అందించడంతో వారు ఆ శిశువుని స్వాధీనం చేసుకుని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆ చిన్నారికి ప్రస్తుతం నాలుగేళ్లు. ఆమె పూర్తి ఆరోగ్యంతో బాగానే ఉంది. సదరు ఆస్పత్రి ఆ చిన్నారిని 'బేబి ఇండియాగా' పిలిచేది. ఆ తర్వాత ఆ శిశువును ఒక కుటుంబం దత్తత కూడా తీసుకుంది. అయితే కౌంటీ షెరీఫ్ ఆ చిన్నారి గోప్యత నిమిత్తం పూర్తి వివరాలను అందించలేదు. ఐతే ఆ శిశువుని ఎవరో అలా వదిలేశారనే దానిపై గత నాలుగేళ్లుగా కౌంటీ షెరీఫ్ అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. పది నెలల క్రితం ఆ శిశువు డీఎన్ఏ ఆధారంగా ఆ చిన్నారి తండ్రిని పట్టుకోగలిగారు. గానీ ఆ మహిళ గర్భవతి అని కూడా అతనికి తెలియకపోవడం, ఆమెను వదిలేశానని చెప్పడం తదితర కారణాలతో కేసు మళ్లి మొదటికి వచ్చినట్లు అనిపించింది అధికారులకు. చేసేదేమిలేక అధికారులు సదరు తండ్రిని అరెస్టు చేయకుండా వదిలేశారు. ఎట్టకేలకు వారి దర్యాప్తు ఫలించి..ఆ చిన్నారి తల్లి ఆచూకిని కనుగొనడమే గాక బిడ్డ తల్లిని కరిమా జివానీగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రసవం తర్వాత వదిలేయాలనే ఉద్దేశ్యంతోనే ఓ కారులో నిర్మానుష్యమైన అడవికి వచ్చినట్లు పేర్కొంది. అక్కడే ప్రసవించి శిశువుని ఓ ప్లాస్టిక్ సంచిలో చుట్టి ఓ చెక్కబాక్స్లో ఉంచినట్లు విచారణలో ఒప్పుకుంది. జార్జియ నిబంధనల ప్రకారం ఆస్పత్రి, పోలీస్టేషన్, అగ్నిమాపక స్టేషన్లో పిల్లలను వదిలేసినట్లయితే ఎలాంటి నేరారోపణ ఎదుర్కొనవలసిన అవసరం లేదు. కానీ ఈ తల్లి కనీసం అలాంటి నిబంధనలను ఏమి ఉపయోగించకుండా ఆ శిశువు చనిపోవాలనే ఉద్దేశంతోనే ఇలా నిర్మానుష్యమైన అడవిలో వదిలేసిందని కౌంటీ షరీష్ అధికారులు చెప్పుకొచ్చారు. దేవుడిలా ఓ కుటుంబ మాకు సమాచారం అందించడంతోనే ఆ శిశువుని కాపాడగలిగామని చెప్పారు. ఈ మేరకు అధికారులు నాలుగేళ్ల అనంతరం సదరు మహిళపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఐతే ఆ తల్లి జివానీకి మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఎప్పుడో చేసిన నేరం కనుమరగవుతుందనుకుంటే నీడలా వెంటాడి దోషిలా పట్టించేంత వరకు వదలలేదు ఆ తల్లిని. (చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..) -
యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ
లండన్: యూకే స్థానిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టాక జరిగిన మొదటి ఎన్నికలివి. ఇంగ్లండ్‌లోని 317 కౌన్నిళ్లకుగాను 230 కౌన్సిళ్లలోని 8 వేల సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో అధికార పార్టీ 20కిపై కౌన్సిళ్లను కోల్పోయింది. ఎన్నికలు జరిగిన 8 వేల సీట్లలో లేబర్ పార్టీ 1,384, కన్జర్వేటివ్ పార్టీ 1,041, లిబరల్ డెమోక్రాట్లు 768 సీట్లను సాధించాయి. 20 ఏళ్లుగా అధికారపక్షానికి కంచుకోటగా ఉన్న మెడ్వే లాంటి కౌన్సిళ్లను సైతం లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా వెలువడిన ఈ ఫలితాలపై ప్రధాని రిషి సునాక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
డింగ్ డాంగ్ డిచ్ కేసు.. ఎన్నారై చంద్రను దోషిగా తేల్చిన కోర్టు
శాక్రమెంటో: కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. పదే పదే కాలింగ్ బెల్ కొట్టి విసిగిస్తున్నారనే కోపంలో ముగ్గురు టీనేజర్లను కారుతో గుద్ది చంపేశాడు. అయితే మూడేళ్ల కిందటి నాటి ఈ కేసులో.. తాజాగా నిందితుడిని దోషిగా తేల్చింది కోర్టు. కాలిఫోర్నియాలో అనురాగ్ చంద్ర.. భార్య, కూతురితో నివాసం ఉంటున్నాడు. అరోమాథెరపీలో, కొన్నిరకాల సెంట్లలో వాడే ఆయిల్ తయారు చేసే కంపెనీకి చంద్ర వైఎస్ ప్రెసిడెంట్ కూడా. 2020 జనవరి చివరి వారంలో ఓ సాయంత్రం.. ముగ్గురు టీనేజీ కుర్రాళ్లు అనురాగ్ ఇంటి కాలింగ్ బెల్‌ను పదే పదే కొట్టి ఆయన్ని విసిగించారు. డింగ్ డాంగ్ డిచ్(డోర్‌బెల్ డిచ్) పేరిట అక్కడ బాగా ప్రచారంలో ఉండే ప్రాంక్ గేమ్ ఆయన మీద ప్రయోగించాలని వాళ్లు భావించారు. ఆపై కుర్రాళ్లు పారిపోయే క్రమంలో అనురాగ్‌కు అసభ్య సంజ్ఞలు చేశారట. దీంతో అనురాగ్‌కు చిర్రెత్తుకొచ్చింది. 👉 అప్పటికే పీకల దాకా తాగి తూలిపోతున్న అనురాగ్.. కారు వేగంగా నడుపుతూ వాళ్లను వెంబడించాడు. అయితే కారు అతి వేగంగా వెళ్లి ఆ టీనేజర్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ముందుకెళ్లి ఓ చెట్టును ఢీ కొట్టింది. టెమెస్కల్ వ్యాలీ దగ్గర జరిగిన ఈ కారు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. అనురాగ్ చిన్న చిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీంతో డింగ్‌డాంగ్ డిచ్ కేసుగా, డోర్‌బెల్ ప్రాంక్ కేసుగా ఇది పాపులర్ అయ్యింది. 👉 ఇక ఈ ఘటనలో.. చంద్ర చంపిన ముగ్గురూ 18 ఏళ్లలోపు వాళ్లు కావడం గమనార్హం. అయితే తాను కేవలం తన కోపాన్ని ప్రదర్శించే క్రమంలోనే వాళ్లను వెంబడించానే తప్పా.. చంపాలనే ఉద్దేశంతో కాదని చంద్ర చెబుతూ వచ్చాడు. అంతేకాదు ఘటనకు ముందు తాను 12 బీర్లు తాగననని, వచ్చినవాళ్లు తన భార్యాకూతురిని ఏమైనా చేస్తారేమోననే ఆవేశంలోనే అలా ప్రవర్తించానని వాంగ్మూలం ఇచ్చాడు. 👉 అయితే పోలీసులు మాత్రం చంద్ర కారును 64 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన జోన్లో.. 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కావాలనే ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టాడని కోర్టుకు నివేదించారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఈ దాడిలో చంద్రను కఠినంగా శిక్షించాలని తెలిపారు. అన్ని వాదనలు విన్న కోర్టు.. చివరకు తాజాగా అనురాగ్ చంద్రను దోషిగా ఖరారు చేసింది. ఇక శిక్ష జులైలో ఖరారు కావాల్సి ఉంది. అయితే.. నేరం తీవ్రత దృష్ట్యా పెరోల్ దొరకకుండా ఆదేశిస్తూ.. అనురాగ్ చంద్రకు కోర్టు జీవిత ఖైదు విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదీ చదవండి: అమ్మాయిలకు తెలియకుండా సీక్రెట్ కెమెరాలు! కట్ చేస్తే.. -
చిన్నారి హత్య కేసు నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష
ఒక వ్యక్తి అనుకోకుండా చేసిన హత్యకు భారీ మూల్య చెల్లించుకున్నాడు. క్షణికావేశలోనూ లేక ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కూడా కాదు. ఒక వ్యక్తితో జరిగిన వివాదంలో కోపంలో తన వద్ద ఉన్న హ్యండ్ గన్‌తో అవతలి వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. అంతే అనుకోకుండా గన్ నుంచి బుల్లెట్ విడుదలైంది. అవతలి వ్యక్తి ఆ తూటా నుంచి తప్పించుకున్నాడు గానీ సమీపంలోని గదిలో ఆడుకుంటున్న చిన్నారి తలలో దూసుకుపోయింది. అభం శుభం తెలియని ఒక నిండు ప్రాణం ఆ తూటాకి బలైంది. దీంతో కోర్టు ఆ వ్యక్తి ఏకంగా వందేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...ష్రేవ్పోర్ట్కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తి సూపర్ 8 లగర్జీ హోట్లోని పార్కింగ్ వద్ద ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన స్మిత్ ఆవ్యక్తిపైకి ఎంఎం హ్యాండ్‌గన్‌ని ఎక్కుపెట్టారు. దీంతో విడుదలై బుల్లెట్ నుంచి సదరు వ్యక్తికి తప్పించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ హోటల్ గదిలో ఆడుకుంటున్న భారత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మయాపటేల్ తలలోకి దూసుకుపోయింది. దీంతో మయా పటేల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆ చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా..అక్కడ మూడు రోజులు పాటు మృత్యువుతో పోరాడి మార్చి 23, 2021న చనిపోయింది. దీంతో స్మిత్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ హోటల్ని విమల, స్నేహల్ పటేల్ యజామాన్యంలో ఉంది, వారే ఆ హోటల్ని నిర్వహిస్తున్నారు. వారు ఆ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో తమ కూతరు మాయా పటేల్, ఆమె చిన్న చెల్లెలుతో కలిసి ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో ఆ కుటుంబం ఒక బిడ్డను పోగోట్టుకోవలసి వచ్చింది. ఈ క్రమంలో కోర్టు సదరు వ్యక్తికి ఎలాంటి పెరోల్ లేదా శిక్ష తగ్గింపుకు అవకాశం లేకుండా 60 ఏళ్లు కఠిన కారాగారా శిక్ష విధించింది. అలాగే బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు గానూ 20 ఏళ్లు, అలాగే ఈ దారుణమైన ఘటనకు బాధ్యుడిగా మరో 20 ఏళ్ల కలిపి మొత్తం వందేళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కాడో పారిష్ జిల్లా అటార్నీ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే సదరు నిందితుడు స్మిత్‌కి గతంలో కూడా కొంత నేర చరిత్ర ఉందని, దాన్ని పునరావృతం చేశాడే గానీ ప్రవర్తన మార్చుకోనందున ఈ శిక్ష విధించినట్లు సమాచారం. (చదవండి: క్లాస్‌మేట్‌ను 114 సార్లు పొడిచాడు) -
ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి.. కారణం ఇదే!
ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ పోలీసులు జరిపిన కాల్పుల్లో భారతీయ యువకుడు మృతిచెందాడు. కాగా, మృతుడిని తమిళనాడుకు చెందిన మహ్మద్ రెహ్మత్తుల్లా సయ్యద్ అహ్మద్‌గా గుర్తించారు. ఇక, ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. వివరాల ప్రకారం.. సయ్యద్ అహ్మద్(32) బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. అయితే, మంగళవారం సయ్యద్.. సిడ్నీ రైల్వే స్టేషన్లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడవడమే కాకుండా అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై అటాక్ చేయబోయాడు. దీంతో, పోలీసులు.. అహ్మద్‌పై మూడు రౌండ్లలో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో రెండు బుల్లెట్స్ అతడి చాతీలోకి దూసుకెళ్లాయి. అనంతరం, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించగా.. సయ్యద్ అహ్మద్ మృతిచెందినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిడ్నీ ఏసీపీ స్మిత్ మీడియాతో మాట్లాడుతూ.. సయ్యద్ అహ్మద్‌పై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదన్నారు. దీన్ని తీవ్రవాద దాడిగా తాము పరిగణించడంలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, సయ్యద్ మృతిపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయమని ఆవేదన వ్యక్తపరిచింది. అలాగే, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతోపాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని పేర్కొంది. Australia 🇦🇺: A 32-year-old Mohamed Rahmathullah Syed Ahmed was shot dead by the Australian Police after he stabbed a railway station cleaner & threatened police officials with a knife at the Auburn train station in Sydney + #Australia #Sydney #India pic.twitter.com/GuXskFvmqE — Ashwini Shrivastava (@AshwiniSahaya) March 1, 2023 -
‘డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్’.. 5 వేల ఫోటోలను దాటి విజేతగా నిలిచింది
నేషనల్ జియోగ్రాఫిక్ ‘పిక్చర్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో విజేతగా నిలిచిన చిత్రమిది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్, ఫోటోగ్రాఫర్ కార్తీక్ సుబ్రమణియన్ ఈ ఫోటో తీశారు. అలాస్కాలోని చిల్కాట్ బాల్డ్ ఈగల్ అభయారణ్యంలో తీసిన ఈ ఫోటోకు ‘డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్’ అని పేరు పెట్టారు. ప్రకృతి, ప్రజలు, ప్రాంతాలు, ప్రాణులు కేటగిరీలో వచ్చిన 5000 ఫోటోల్లోంచి చివరికి దీన్ని ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ పోటీలో గుర్తింపు పొందిన కొన్ని ఫోటోలుపై ఓ లుక్కేద్దాం. -
ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్
లండన్: బ్రిటన్‌లోని అతిపెద్ద బోధనా ఆసుపత్రుల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్–ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు సీఈఓగా భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రొఫెసర్ మేఘనా పండిట్ నియమితులయ్యారు. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ట్రస్టుకు ఒక మహిళ, అందునా భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈఓ కావడం ఇదే తొలిసారి. ఆమె 2022 జూలై నుంచి ఓయూహెచ్ మధ్యంతర సీఈఓగా ఉన్నారు. కఠిన పోటీని ఎదుర్కొని తాజాగా పూర్తిస్థాయి సీఈఓ అయ్యారు. భాగస్వామ్య వర్సిటీలతో, ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ చారిటీతో కలిసి పనిచేస్తానని మేఘనా చెప్పారు. అత్యున్నత నాణ్యతతో కూడిన పరిశోధనలు, నవీన ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. ఆమె అబ్స్టెట్రిక్స్, గైనకాలజీలో మేఘనా పండిట్ శిక్షణ పొందారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో యూరోగైనకాలజీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఎన్హెచ్ఎస్ ట్రస్టులో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, వార్విక్ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా చేశారు. -
అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి వివేక్ రంగస్వామి!
వాషింగ్టన్: 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిక్కీ హేలీ, మైక్ పాంపియో, మైక్ పెన్స్ వంటి హేమా హేమీలు పోటీలో ఉండబోతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరంతా డొనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి చెందినవారే. అయితే తాజాగా మరో యువ పారిశ్రామికవేత్త పేరుకూడా గట్టిగా వినపడుతోంది. భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వివేక్ రామస్వామికి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడే అవకాశం ఉందని చాలా మంది చెబుతున్నారు. ఈయన కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వారే గమనార్హం. శాకాహారి అయిన వివేక్ రంగస్వామి వ్యాపారవేత్తగానే గాక.. ఇన్వెస్టర్‌గా గుర్తింపుపొందారు. బయోఫార్మాసూటికల్ కంపెనీ 'రోయివంట్ సైన్సెస్'కు వ్యవస్థాపక సీఈఓ. వోకిఇజం, సోషల్లీ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్‌పై తన అభిప్రాయాలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. అమెరికా ప్రముఖ మేగజీన్ 'ది న్యూయార్కర్'.. వివేక్ రంగస్వామిని 'యాంటీ-వోక్ సీఈఓ'గా అభివర్ణించింది. వోక్యిజం అంటే సామాజికంగా, రాజకీయంగా అందరీ న్యాయం జరగడం లేదని బాధపడే సున్నిత మనస్తత్వం లేదా భావజాలం. అయితే వోకియిజం పిడివాద భావజాలం అని వివేక్ వాదిస్తుంటారు. ఇది ప్రపంచంలోని వాస్తవ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం కంటే సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంపైనే ఎక్కువ ఆసక్తి కలిగిఉందని చెబుతుంటారు. అందుకే ఈయనను 'యాంటీ-వోక్ సీఈవో' అని న్యూ యార్కర్ అభివర్ణించింది. రాజకీయంగా వివేక్‌కు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికి రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన అధ్యక్ష రేసులో నిలబడేందుకు సరైన అభ్యర్థి అని చాలా మంది భావిస్తున్నారు. అయితే వివేక్ అభ్యర్థిత్వాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రెసిడెన్సీకి వ్యాపార ఆధారిత విధానాన్ని తీసుకురాగల సరికొత్త వ్యక్తిగా అతడ్ని కొందరు చూస్తున్నారు. మరికొందరేమో అతనికి ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదని, వోకియిజంపై అతని ఆలోచనలు వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా.. ఒకవేళ వివేక్ రంగస్వామికి అమెరికా అభ్యర్థిగా నిలబడే అవకాశం లభిస్తే మాత్రం అది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా చెప్పొచ్చు. చదవండి: ట్రంప్‌కు షాక్ ఇస్తున్న రిపబ్లికన్లు.. అధ్యక్ష ఎన్నికల్లో సవాల్.. నమ్మినవాళ్లే వ్యతిరేకులుగా.. -
75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న వారిలో 75 ఏళ్ల వయసుకు పైబడి ఉంటే వారికి ఎంతవరకు ఆ పదవికి యోగ్యత ఉందో అమెరికన్లు తప్పనిసరిగా చూడాలని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లోకి కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాషింగ్టన్లో ఎందరో రాజకీయ నాయకులకు వయసు మీదపడిందన్నారు. కాంగ్రెస్‌కి ఎన్నికవాలంటే వయసు పరిమితి విధించాల్సిన ఆవశ్యకత ఉందని హేలీ అన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన 75 ఏళ్లకు పైబడిన వారికి యోగ్యతా పరీక్షలు నిర్వహించాలని కొత్త ప్రతిపాదన చేశారు. మరోవైపు హేలీ అభిప్రాయాలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతూ ఉండడం, వారి వయసు 75 దాటిపోవడంతో హేలీ చేసిన ప్రతిపాదనపై విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు, దాడులు గతంలో కూడా చూశామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీనా జీన్ పియరే అన్నారు. -
బైడెన్ ఆర్థిక బృందంలో భారతీయుడు
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక విధానాల విషయంలో అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే ఆర్థిక బృందంలో భారతీయ మూలాలున్న అమెరికన్ భరత్ రామమూర్తి కీలక స్థానంలో నియ మితులయ్యారు. భరత్‌ను నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్(ఎన్ఈసీ) డెప్యూటీ డైరెక్టర్‌గా మళ్లీ నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ బుధవారం ప్రకటించింది. వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలకు సంబంధించి భరత్ బైడెన్‌కు సలహాదారుగానూ వ్యవహరిస్తారు. 2020 డిసెంబర్లో భరత్ ఎన్ఈసీలో ఆర్థిక సంస్కరణలు, వినియోగదారుల రక్షణ విభాగానికి డెప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. చదవండి: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. మరోసారి క్షిపణుల వర్షం.. -
ఒక్కరికే 36 యావజ్జీవాలు.. లండన్‌లో భారత సంతతి జడ్జి తీర్పు!
లండన్: అత్యాచారం కేసుల్లో నిందితుడికి భారత సంతతి న్యాయమూర్తి పరమ్‌జిత్ కౌర్ బాబీ చీమా–గ్రప్ ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధించడలో యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో సంచలనాత్మకంగా మారింది. మెట్రోపాలిటన్ పోలీసు మాజీ అధికారి అయిన డేవిడ్ కారిక్(48) 2003 నుంచి 2020 దాకా.. 17 ఏళ్ల వ్యవధిలో దాదాపు 12 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిని దారుణంగా హింసించాడు. అతడు 49 నేరాలకు పాల్పడినట్లు తేలింది. నేరాలన్నీ నిరూపితమయ్యాయి. లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి పరమ్‌జిత్ కౌర్ మంగళవారం తీర్పు ప్రకటించారు. దోషికి 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని, పెరోల్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 30 ఏళ్లు జైల్లో ఉండాల్సిందేనని ఆమె తేల్చిచెప్పారు. -
పోలాండ్‌లో భారతీయ యువకుడి హత్య..
వార్సా: పోలాండ్‌లో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేరళ త్రిస్సూర్ జిల్లాలోని ఒల్లూర్‌కు చెందిన సూరజ్(23) పోలాండ్లోని ఓ ప్రైవేటు సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అయితే జార్జియా దేశానికి చెందిన ఓ ముఠా సూరజ్, అతని స్నేహితులతో గొడవపడ్డారు. ఈ ఘర్షణలో సూరజ్‌ను జార్జియా దేశస్థులు కత్తితో పొడిచిచంపారు. అతని స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సూరజ్ మృతిని వార్సాలోని ఇండియన్ ఎంబసీతో పాటు అతని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఎందుకు జరిగిందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కొద్దిరోజుల క్రితం కేరళ పాలక్కడ్‌కు చెందిన ఇబ్రహీం షరీఫ్ అనే యువకుడు కూడా పోలాండ్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఇతడ్ని ఓనరే క్రూరంగా చంపాడు. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే ఎందుకు హత్య చేశాడనే విషయం మాత్రం తెలియరాలేదు. చదవండి: ఒక్క నిమిషం పట్టదు.. పుతిన్‌పై సంచలన ఆరోపణలు -
భారత సంతతి రాజా చారికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి!
న్యూయార్క్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి రాజా చారి అరుదైన ఘనత సాధించనున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ ఈయనను ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి నామినేట్ చేశారు. సెనేట్ దీన్ని ఆమోదిస్తే అగ్రరాజ్యం వాయుసేనలో రాజా చారి కీలక బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారు. అమెరికా వైమానిక దళంలో సైన్యంలాగే బ్రిగేడియర్లను వన్-స్టార్ జనరల్స్‌గా పరిగణిస్తారు ర్యాంకులుంటాయి. చంద్రునిపైకి తిరిగివెళ్లేందుకు సిద్ధమవుతున్న అమెరికా మిషన్ అర్టెమిస్ బృందలో చారి సభ్యుడు. ఈయన సారథ్యంలోనే 2021లో నాసా సిబ్భంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. అక్కడ 177 రోజులు ఉన్న చారి.. స్పేస్ వాక్ కూడా నిర్వహించారు. రాజా చారి నాసాలో చేరకముందు అమెరికా ఎయిర్‌ఫోర్సులో టెస్ట్ పైలట్‌గా ఉన్నారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదవండి: మిలటరీ సామర్థ్యంలో స్థిరంగా భారత్ -
ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతికి చెందిన వ్యక్తి
-
Noor Inayat Khan: స్పై ప్రిన్సెస్
కలం పట్టి కవితలు రాసిన అమ్మాయి రణక్షేత్రంలోకి అడుగుపెట్టింది. పియానోతో సుస్వరాలు వినిపించిన అమ్మాయి ఫిరంగి ధ్వనులు వినిపించే చోట పనిచేసింది. నూర్ ఇనాయత్‌ఖాన్ అనేది నామం కాదు నాజీలను వణికించిన శబ్దం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్–ఇండియా తొలి మహిళా గూఢచారి నూర్ గురించి... నూర్ ఇనాయత్ ఖాన్ అనే పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె గురించి ఈ తరానికి తెలియజేయడానికి నాటక రూపంలో ఒక ప్రయత్నం జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ ఇండియా తరఫున నియామకం అయిన తొలి మహిళా గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్. ఆమె సాహసిక జీవితంపై రూపొందించిన ‘నూర్’ నాటకాన్ని ఈ నెలలో లండన్‌లోని సౌత్‌వార్క్ ప్లే హౌజ్‌లో ప్రదర్శించబోతున్నారు. ‘ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయా అని ఆశ్చర్యపోయేంత జీవితం ఆమెది’ అంటారు ‘నూర్’ నాటక రచయిత్రి అజ్మా దార్. నూర్ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే.... తండ్రి పేరు ఇనాయత్‌ఖాన్. బాంబే ప్రెసిడెన్సీలో జన్మించాడు. పూర్వీకులు టిప్పు సుల్తాన్ వంశస్థులు. ఇనాయత్‌ఖాన్ సూఫీ గురువు. సంగీతకారుడు. ‘ది సూఫీ ఆర్డర్ ఇన్ ది వెస్ట్’ అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా సూఫీ భావజాలాన్ని పాశ్చాత్య సమాజానికి పరిచయం చేశాడు. నూర్ తల్లి అమెరికన్. రే బేకర్ అనే ఆమె పేరు పెళ్లి తరువాత అమీనా బేగంగా మారింది. చిన్న వయసులోనే రచయిత్రిగా తన కెరీర్ మొదలుపెట్టింది నూర్. ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కవిత్వంతోబాటు, పిల్లల కథల పుస్తకాలను ప్రచురించింది. బుద్దిస్ట్ జాతక కథల స్ఫూర్తితో ‘ట్వంటీ జాతక టేల్స్’ అనే పుస్తకాన్ని రాసింది. పిల్లల పత్రికలకు రెగ్యులర్‌గా రచనలు చేస్తుండేది. ఫ్రెంచ్ రేడియో కోసం రచనలు చేసేది. ‘చైల్డ్ సైకాలజీ’ చదువుకున్న నూర్ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. పియానో అద్భుతంగా వాయించేది. రెండో ప్రపంచ యుద్ధం నాటి కల్లోల కాలం అది. ఎటు చూసినా భయం రాజ్యమేలుతున్న ఆ కాలంలో కుటుంబాన్ని తీసుకొని ఇంగ్లాండ్‌కు వెళ్లాడు ఇనాయత్‌ఖాన్. మొదట పోర్ట్ సిటీ సౌత్ హాంప్టన్లో ఒక తత్వవేత్త దగ్గర ఆశ్రయం పొందారు. తండ్రి చనిపోయే నాటికి నూర్ వయసు పదమూడు సంవత్సరాలు. సున్నిత స్వభావి. కొత్త వాళ్ల దగ్గరికి వెళ్లేది కాదు. చాలా తక్కువగా మాట్లాడేది. అలాంటి నూర్లో అనూహ్యంగా మార్పు వచ్చింది. తల్లి తరువాత ఇంటికి తానే పెద్ద. ఒకవిధంగా చెప్పాలంటే చిన్న వయసులోనే తన కుటుంబానికి పెద్ద అండగా నిలబడింది. కుమార్తెలో వచ్చిన మార్పు చూసి తల్లి ఆశ్చర్యపోయేది! నవంబర్, 1940లో ఉమెన్స్ ఆగ్జిలరీ ఎయిర్ ఫోర్స్ (డబ్ల్యూ ఎఎఎఫ్)లో చేరి వైర్లెస్ ఆపరేటర్‌గా శిక్షణ పొందింది. ఆ తరువాత ‘బాంబర్ ట్రైనింగ్ స్కూల్’లో చేరింది. సీక్రెట్ బ్రిటిష్ వరల్డ్ వార్–2 ఆర్గనైజేషన్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్వోయి)లో నియామకం అయింది. ప్రత్యేక శిక్షణ తీసుకొని నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో అండర్ కవర్ వైర్లెస్ ఆపరేటర్‌గా పనిచేసింది. ఈ విధులు నిర్వహించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో వైర్లెస్ ఆపరేటర్‌గా పని చేయడం అంటే చావుకు చాలా సమీపానికి వెళ్లడం. ఒళ్లు జలదరించే ఎన్నో భయానక అనుభవాలు కళ్ల ముందున్నాయి. అయినా భయపడింది లేదు. దురదృష్టకరమైన పరిస్థితులలో నాజీలకు చిక్కి, కాన్సంట్రేషన్ క్యాంపుల్లో చిత్రహింసలకు గురై చనిపోయింది. ధైర్యసాహసాలకు ఇచ్చే జార్జ్ క్రాస్ పురస్కారాన్ని నూర్ మరణానంతరం బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది? ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది?... ఇలాంటి సందేహాలకు ‘స్పై ప్రిన్సెన్స్–ది లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్’లాంటి రచనలు సవివరంగా సమాధానాలు ఇచ్చాయి. ఈ క్రమంలో తాజా నాటకం ‘నూర్’ అనేది మరో ముందడుగుగా చెప్పుకోవచ్చు. శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది? ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది? -
బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్..
లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్ తాను మరోసారి బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అత్యంత గొప్ప దేశమైన బ్రిటన్.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని పేర్కొన్నారు. తాను ప్రధాని అయి పరిస్థితిని చక్కదిద్దుతానని, పార్టీని ఏకం చేసి అందరి మద్దతుతో దేశాన్ని ముందుకు నడిపిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గతంలో తాను ఆర్థిక మంత్రిగా పని చేసిన విషయాన్ని రిషి సునాక్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ అనుభవం ఉపయోగపడుతుందన్నారు. అయితే అందరూ అనుకున్న దానికంటే కఠిన సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. అందుకే ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తీసుకునే నిర్ణయం భవిష్యత్ తరాలకు మనకంటే ఎక్కువ అవకాశాలు తెచ్చిపెట్టేలా ఉండాలన్నారు. తాను పార్టీ నాయకుడిగా, ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. The United Kingdom is a great country but we face a profound economic crisis. That’s why I am standing to be Leader of the Conservative Party and your next Prime Minister. I want to fix our economy, unite our Party and deliver for our country. pic.twitter.com/BppG9CytAK — Rishi Sunak (@RishiSunak) October 23, 2022 రిషి సునాక్ ప్రధాని పదవికి పోటీ చేసి రెండు నెలలు కూడా గడవలేదు. లిజ్ ట్రస్‌తో పోటీ పడిన ఆయనకు సొంత ఎంపీల మద్దతు లభించినా.. పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఓట్లు రాలేదు. దీంతో ఓటమి పాలయ్యారు. అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ట్రస్ ఘోరంగా విఫలం కావడంతో 45 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు నెలల వ్యవధిలోనే మరోసారి కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అయితే ఈసారి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కూడా 100మందికిపైగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే బోరిస్ తన అభ్యర్థిత్వాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఈసారైనా రిషి ప్రధాని అవుతారో లేదో చూడాలి. చదవండి: రిషి, బోరిస్ నువ్వా, నేనా? -
బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో రిషి సునక్..ఆయన గురించి ఐదు కీలక విషయాలు
లండన్: బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ వైదొలగడం ఖాయమని వార్తలు వస్తున్న తరుణంలో కొత్త ప్రధాని ఎవరు? అనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. అయితే పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ భారత సంతతికి చెందిన రిషి సునక్ ఈ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటివరకు ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించారు రిషి. అయితే బోరిస్‌పై అసంతృప్తితో అందరికంటే ముందుగా మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఆ తర్వాత చాలా మంది ఆయన బాటలోనే నడిచారు. మొత్తం 54 మంది మంత్రులు తమ పదులకు రాజీనామా చేశారు. దీంతో గత్యంతరం లేక ప్రధానిగా తప్పుకునేందుకు బోరిస్ అంగీకరించినట్లు బ్రిటన్ మీడియా తెలిపింది. అయితే భారత మూలాలున్న రిషి గతంలో చాలా సార్లు వార్తల్లో నిలిచారు. ఆయనకు సంబంధించి ఐదు కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం. ►రిషి సునక్ వయసు 42 ఏళ్లే. 2020లో బోరిస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక తన తొలి కేబినెట్లో రిషిని ఆర్థిక మంత్రిగా నియమించారు. ►కరోనా సంక్షోభ సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం వందల కోట్ల పౌండ్ల ప్యాకేజీ తీసుకొచ్చి రిషి మంచి గుర్తింపు పొందారు. నూతన ప్రధాని రేసులో రక్షణశాఖ మాజీ మంత్రి పెన్నీ మోర్డాంట్తో పాటు రిషి సునక్ తమ ఫేవరేట్ అని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు. ►అయితే రిషిపై కొన్ని వివాదాలు కూడా ఉండటం ఆయనకు కాస్త మైనస్‌గా మారే అవకాశం ఉంది. తన భార్య ట్యాక్స్ వివాదం, అమెరికా గ్రీన్ కార్డు, బ్రిటన్ జీవన వ్యయం సంక్షోభం సమయంలో ఆయన కాస్త నెమ్మదిగా స్పందించారనే ఆరోపణలు ఉన్నాయి. ►డౌన్స్ట్రీట్లో సమావేశానికి హాజరై కోడివ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిషికి జరిమానా విధించారు. ►రిషి గ్రాండ్ పేరెంట్స్ పంజాబ్‌కు చెందినారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకవేళ రిషి బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎంపికైతే చరిత్ర సృష్టిస్తారు. బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారు. ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ కన్జర్వేటిప్ పార్టీ నాయకుడిగా ఈరోజే రాజీనామా చేస్తారని బ్రిటన్ మీడియా తెలిపింది. తదుపరి ప్రధాని ఎంపిక జరిగే వరకు ప్రధాని పదవిలో ఆయనే కొనసాగుతారని తెలిపింది. ఈ ప్రక్రియ అక్టోబర్‌లో పూర్తయ్యే అవకాశముంది. -
అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఎవరీ నివేథన్ రాధాకృష్ణన్
అండర్-19 ప్రపంచకప్‌లో ఒక భారత సంతతి కుర్రాడు అదరగొట్టాడు. ఆస్ట్రేలియన్ టీమ్‌లో ఆడుతున్న ఆ కుర్రాడు యాంబిడెక్స్‌ట్రస్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. తనదైన బౌలింగ్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అతనే నివేథన్ రాధాకృష్ణన్. వెస్టిండీస్ వేదికగా సాగుతున్న అండర్-19 ప్రపంచకప్ మెగా ఈవెంట్లో మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా యువ జట్టు అఫ్గనిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన నివేథన్ రాధాకృష్ణన్ ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఆసీస్‌దే విజయం ముందుగా బౌలింగ్‌లో 31 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. అతని దెబ్బకు అఫ్గనిస్తాన్ 201 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ కాంప్‌బెల్ కెలావే(51 పరుగులు) అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నివేథన్ రాధాకృష్ణన్ 66 పరుగులు సాధించాడు. ఆ తర్వాత టపాటపా వికెట్లు పడ్డాయి. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయం ఎట్టకేలకు ఆసీస్‌నే వరించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడోస్థానంతో అండర్-19 ప్రపంచకప్‌ను ముగించింది. ఎవరీ నివేథన్ రాధాకృష్ణన్.. ►2013లో నివేథన్ రాధాకృష్ణన్ భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చి సిడ్నీలో స్థిరపడ్డాడు. ►ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో బౌలింగ్‌లో రాటు దేలాడు. ►అండర్-16 లెవెల్ ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించి వైవిధ్యమైన బౌలింగ్‌తో తొలిసారి గుర్తింపు పొందాడు ►ఎన్ఎస్డబ్ల్యూ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో ఆడిన నివేథన్ రాధాకృష్ణన్ ఆ సిరీస్‌లో 898 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఎన్ఎస్డబ్ల్యూ, తస్మానియా క్రికెట్ నుంచి అవార్డులతో పాటు అవకాశాలు అందుకున్నాడు. ►తస్మానియా క్రికెట్ తరపున ఈ సీజన్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన నివేథన్ రాధాకృష్ణన్ 622 పరుగులతో రాణించాడు. చదవండి: జట్టులో స్టార్స్ లేరు.. వందకు వంద శాతం ఎఫర్ట్ పెడతాం.. కోహ్లి మాకు ఏం చెప్పాడంటే.. సాధారణంగా స్పిన్ బౌలర్ అయిన రాధాకృష్ణన్‌లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అతను రెండు చేతులతో(ఎడమ, కుడి) బౌలింగ్ చేయడంలో దిట్ట. దీంతో అతన్ని లెఫ్టార్మ్ ? లేక రైట్ ఆర్మ్? స్పిన్నర్ అనాలా అనేది సందిగ్దంగా మారింది. క్రికెట్లో ఇలాంటి బౌలర్లు ఉండడం అరదుగా జరుగుతుంటుంది. బౌలింగ్‌లో వైవిధ్యత చూపించడం కోసం ఏ బౌలర్ అయినా ఒకే శైలి బౌలింగ్‌కు పరిమితమవుతాడు. కానీ నివేథన్ రాధాకృష్ణన్ మాత్రం అటు లెఫ్ట్.. ఇటు రైట్ ఆర్మ్‌తో బౌలింగ్ చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్ అంటే... సాధారణంగా ఏకకాలంలో లెఫ్టార్మ్, రైట్ ఆర్మ్ బౌలింగ్ చేయగలిగిన వారిని యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్ అని పిలుస్తారు. అయితే ప్రస్తుత క్రికెట్లో ఇలాంటి శైలి అరుదుగా కనిపిస్తుంది. తాజాగా నివేథన్ రాధాకృష్ణన్ వార్తల్లో నిలవడం ద్వారా యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్ పదం మరోసారి వెలుగులోకి వచ్చింది. క్రికెట్ చరిత్రలో యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్లు చాలా మందే ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఒక ఐదుగురి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపించాయి. హనీఫ్ మొహ్మద్(పాకిస్తాన్) పాకిస్తాన్ బ్యాటింగ్‌లో సూపర్ స్టార్‌గా వెలుగొందిన హనీఫ్ మొహ్మద్ నిజానికి రెగ్యులర్ బౌలర్ కాదు. కానీ పార్ట్‌టైమ్ బౌలింగ్ చేసిన హనీఫ్ రెండు చేతులతో బౌలింగ్ చేయగలడు. పాకిస్తాన్ తరపున 55 టెస్టు మ్యాచ్‌ల్లో 3915 పరుగులు చేశాడు. గ్రహం గూచ్(ఇంగ్లండ్) ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం గ్రహం గూచ్ కూడా యాంబిడెక్స్‌ట్రస్ ఆటగాడే. బ్యాటింగ్‌లో ఎన్నోసార్లు మెరుపులు మెరిపించిన గ్రహం గూచ్.. రైట్ ఆర్మ్.. లెఫ్ట్ఆర్మ్ మీడియం పేస్‌తో 23 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్ తరపున గ్రహం గూచ్ 118 టెస్టుల్లో 8900 పరుగులు.. 125 వన్డేల్లో 4290 పరుగులు సాధించాడు. హసన్ తిలకరత్నే(శ్రీలంక) స్వతహాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన హసన్ తిలకరత్నే ఒకానొక సమయంలో శ్రీలంక క్రికెట్లో రాణించాడు. లంక తరపున 83 టెస్టులు.. 200 వన్డేలు ఆడిన హసన్ తిలకరత్నే బౌలింగ్‌లో రైట్ ఆర్మ్ స్పిన్ ఎక్కువగా వేసేవాడు. కానీ 1996 వన్డే ప్రపంచకప్‌లో కెన్యాతో మ్యాచ్‌లో తిలకరత్నే ఆఖరి ఓవర్లో రైట్ ఆర్మ్.. లెఫ్టార్మ్ బౌలింగ్ చేసి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 1996 వన్డే ప్రపంచకప్‌ను శ్రీలంక ఎగరేసుకపోయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కర్నేవార్(భారత్) విదర్భ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అక్షయ్ కర్నేవార్ ప్రస్తుతం దేశవాలీలో లిస్ట్-ఏ, టి20 మ్యాచ్‌లు ఆడుతు బిజీగా గడుపుతున్నాడు. అక్షయ్ కర్నేవార్ లెఫ్ట్ ఆర్మ్.. రైట్ ఆర్మ్ బౌలింగ్ చేయడంలో సమర్థుడు. విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున అక్షయ్ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో 16 వికెట్లు తీసి సీజన్ బెస్ట్ నమోదు చేశాడు. కమిందు మెండిస్(శ్రీలంక) 17 ఏళ్ల కమిందు మెండిస్ శ్రీలంక తరపున రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్.. స్లో లెఫ్ట్ఆర్మ్ ఆర్థడోక్స్ బౌలింగ్ చేయడంలో దిట్ట. అండర్-19 వరల్డ్‌కప్‌లో లంక తరపున ప్రాతినిధ్యం వహించి కమిందు మెండిస్ ఆకట్టుకున్నాడు. -
ఆస్ట్రేలియా అండర్-19లో భారత సంతతి కుర్రాడు.. వింత బౌలర్ల జాబితాలో చోటు
Australia insane spinner Nivethan Radhakrishnan Facts.. వచ్చే ఏడాది జనవరిలో అండర్-19 వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజగా ఆస్ట్రేలియా కూడా 15 మందితో కూడిన అండర్-19 ప్రాబుబుల్స్ను ప్రకటించింది. ఈ జట్టులో ఒక కుర్రాడు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అతనే నివేథన్ రాధాకృష్ణన్. చదవండి: Ashes 2021-22: ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌లో తెలంగాణ కుర్రాడు.. సాధారణంగా స్పిన్ బౌలర్ అయిన రాధాకృష్ణన్‌లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అతను రెండు చేతులతో(ఎడమ, కుడి) బౌలింగ్ చేయడంలో దిట్ట. దీంతో అతన్ని లెఫ్టార్మ్ ? లేక రైట్ ఆర్మ్? స్పిన్నర్ అనాలా అనేది సందిగ్దంగా మారింది. క్రికెట్లో ఇలాంటి బౌలర్లు ఉండడం అరదుగా జరుగుతుంటుంది. బౌలింగ్‌లో వైవిధ్యత చూపించడం కోసం ఏ బౌలర్ అయినా ఒకే శైలి బౌలంగ్‌కు పరిమితమవుతాడు. కానీ నివేథన్ రాధాకృష్ణన్ మాత్రం అటు లెఫ్ట్.. ఇటు రైట్ ఆర్మ్‌తో బౌలింగ్ చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఇదే అతన్ని అందరిలో ప్రత్యేకంగా మార్చి ఇవాళ అండర్-19 వరల్డ్ కప్‌లో ఆసీస్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కేలా చేసింది. This is insane 🤯 @CricketTas recruit Nivethan Radhakrishnan bowls finger spin - with both arms. The ambidextrous tweaker took 20 wickets and scored 898 runs in NSW Premier Cricket last season: https://t.co/1zM8VN2OM1 pic.twitter.com/G3jLMWh3Lp — MyCricket (@MyCricketAus) June 24, 2021 చదవండి: Big Bash 2021: డబుల్ మీనింగ్ డైలాగ్స్.. గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్ మజాక్ ఆస్ట్రేలియన్ అండర్-19 క్రికెటర్ నివేథన్ రాధాకృష్ణన్ ముఖ్య విషయాలు ►2013లో నివేథన్ రాధాకృష్ణన్ భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చి సిడ్నీలో స్థిరపడ్డాడు. ►ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో బౌలింగ్‌లో రాటు దేలాడు. ►అండర్-16 లెవెల్ ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించి వైవిధ్యమైన బౌలింగ్‌తో తొలిసారి గుర్తింపు పొందాడు ►ఎన్ఎస్డబ్ల్యూ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో ఆడిన నివేథన్ రాధాకృష్ణన్ ఆ సిరీస్‌లో 898 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఎన్ఎస్డబ్ల్యూ, తస్మానియా క్రికెట్ నుంచి అవార్డులతో పాటు అవకాశాలు అందుకున్నాడు. ►తస్మానియా క్రికెట్ తరపున ఈ సీజన్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన నివేథన్ రాధాకృష్ణన్ 622 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు: హర్కీరత్ బజ్వా, ఐడాన్ కాహిల్, కూపర్ కొన్నోలీ, జాషువా గార్నర్, ఐజాక్ హిగ్గిన్స్, క్యాంప్‌బెల్ కెల్లావే, కోరీ మిల్లర్, జాక్ నిస్బెట్, నివేతన్ రాధాకృష్ణన్, విలియం సాల్జ్‌మన్, లచ్లాన్ షా, జాక్సన్ సిన్‌ఫీల్డ్, టోబియాస్ స్నెల్, టామ్ విట్నీ, టెయాగ్ విట్నీ యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్ అంటే... సాధారణంగా ఏకకాలంలో లెఫ్టార్మ్, రైట్ ఆర్మ్ బౌలింగ్ చేయగలిగిన వారిని యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్ అని పిలుస్తారు. అయితే ప్రస్తుత క్రికెట్లో ఇలాంటి శైలి అరుదుగా కనిపిస్తుంది. తాజాగా నివేథన్ రాధాకృష్ణన్ వార్తల్లో నిలవడం ద్వారా యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్ పదం మరోసారి వెలుగులోకి వచ్చింది. క్రికెట్ చరిత్రలో యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్లు చాలా మందే ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఒక ఐదుగురి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపించాయి. హనీఫ్ మొహ్మద్(పాకిస్తాన్) పాకిస్తాన్ బ్యాటింగ్‌లో సూపర్ స్టార్‌గా వెలుగొందిన హనీఫ్ మొహ్మద్ నిజానికి రెగ్యులర్ బౌలర్ కాదు. కానీ పార్ట్‌టైమ్ బౌలింగ్ చేసిన హనీఫ్ రెండు చేతులతో బౌలింగ్ చేయగలడు. పాకిస్తాన్ తరపున 55 టెస్టు మ్యాచ్‌ల్లో 3915 పరుగులు చేశాడు. గ్రహం గూచ్(ఇంగ్లండ్) ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం గ్రహం గూచ్ కూడా యాంబిడెక్స్‌ట్రస్ ఆటగాడే. బ్యాటింగ్‌లో ఎన్నోసార్లు మెరుపులు మెరిపించిన గ్రహం గూచ్.. రైట్ ఆర్మ్.. లెఫ్ట్ఆర్మ్ మీడియం పేస్‌తో 23 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్ తరపున గ్రహం గూచ్ 118 టెస్టుల్లో 8900 పరుగులు.. 125 వన్డేల్లో 4290 పరుగులు సాధించాడు. హసన్ తిలకరత్నే(శ్రీలంక) స్వతహాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన హసన్ తిలకరత్నే ఒకానొక సమయంలో శ్రీలంక క్రికెట్లో రాణించాడు. లంక తరపున 83 టెస్టులు.. 200 వన్డేలు ఆడిన హసన్ తిలకరత్నే బౌలింగ్‌లో రైట్ ఆర్మ్ స్పిన్ ఎక్కువగా వేసేవాడు. కానీ 1996 వన్డే ప్రపంచకప్‌లో కెన్యాతో మ్యాచ్‌లో తిలకరత్నే ఆఖరి ఓవర్లో రైట్ ఆర్మ్.. లెఫ్టార్మ్ బౌలింగ్ చేసి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 1996 వన్డే ప్రపంచకప్‌ను శ్రీలంక ఎగరేసుకపోయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కర్నేవార్(భారత్) విదర్భ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అక్షయ్ కర్నేవార్ ప్రస్తుతం దేశవాలీలో లిస్ట్-ఏ, టి20 మ్యాచ్‌లు ఆడుతు బిజీగా గడుపుతున్నాడు. అక్షయ్ కర్నేవార్ లెఫ్ట్ ఆర్మ్.. రైట్ ఆర్మ్ బౌలింగ్ చేయడంలో సమర్థుడు. విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున అక్షయ్ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో 16 వికెట్లు తీసి సీజన్ బెస్ట్ నమోదు చేశాడు. కమిందు మెండిస్(శ్రీలంక) 17 ఏళ్ల కమిందు మెండిస్ శ్రీలంక తరపున రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్.. స్లో లెఫ్ట్ఆర్మ్ ఆర్థడోక్స్ బౌలింగ్ చేయడంలో దిట్ట. రానున్న అండర్-19 వరల్డ్‌కప్‌లో లంక తరపున ప్రాతినిధ్యం వహించనున్న కమిందు మెండిస్ ఆ జట్టుకు కీలకంగా మారనున్నాడు. -
నమ్మశక్యం కాని అనుభవం
హ్యూస్టన్: అంతరిక్షం నుంచి భూగోళాన్ని వీక్షించడం నమ్మశక్యం కాని, జీవితాన్ని మార్చే గొప్ప అనుభవమని ఇండియన్ అమెరికన్, తెలుగు బిడ్డ శిరీష బండ్ల పేర్కొన్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వీఎస్ఎస్ యూనిటీ–22 స్పేస్‌షిప్‌లో రిచర్డ్ బ్రాన్సన్, మరో నలుగురితో కలిసి ఆమె ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. రోదసిలో తనకు ఎదురైన అనుభవాన్ని శిరీష సోమవారం ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్పేష్‌షిప్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం, క్షేమంగా భూమిపైకి తిరిగి రావడం.. మొత్తం ప్రయాణం ఒక అద్భుతమన్నారు. తన అనుభవాన్ని వర్ణించడానికి ‘నమ్మశక్యం కాని’ కంటే మరో ఉత్తమమైన పదం కోసం వెతుకుతున్నానని, ప్రస్తుతానికి ఆ పదమే తన మదిలో మెదులుతోందని అన్నారు. రోదసి నుంచి మన భూమిని వీక్షించడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. రోదసిలోకి వెళ్లాలన్నది తన కల అని, అదిప్పుడు సాకారమయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగామి కావడం చిన్నప్పటి నుంచి తన లక్ష్యమని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అల అంతరిక్షంలో..
-
శిరీషకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్
-
అంతరిక్షంలోకి తెలుగు అతివ
-
నేడే అంతరిక్షంలోకి తెలుగు అతివ
హూస్టన్: భారతీయ సంతతికి చెందిన బండ్ల శిరీష ఆదివారం అంతరిక్షయానానికి సిద్ధమైంది. అంతరిక్ష యాత్ర విజయవంతమైతే ఈ ఘనత సాధించిన మూడో భారతీయ సంతతి మహిళగా శిరీష నిలుస్తుంది. గతంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్పేస్‌లో ప్రయాణించారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ షిప్లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్ బ్రాన్సన్తో మరియు 5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేయనుంది. ఈ షిప్లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీషట్వీట్ చేశారు. షిప్లో ఆమె రిసెర్చర్ ఎక్స్పీరియన్స్ బాధ్యతలు చేపట్టనుంది. తనకు ఈ అవకాశం దక్కినట్లు తెలియగానే మాటలు రాలేదంటూ వర్జిన్ గెలాక్టిక్ ట్విట్టర్లో ఒక వీడియో పోస్టు చేశారు. అమెరికాలోని ప్యూర్‌డ్యూ యూనివర్సిటీలో ఆమె విద్యాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా తాను చదివిన యూనివర్సిటీని గుర్తు చేసుకున్నారు. 2015లో వర్జిన్ గలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల విభాగ మేనేజరుగా చేరారు. ప్రస్తుతం కంపెనీ గవర్నమెంట్ ఎఫైర్స్ అండ్ రీసెర్చ్ ఆపరేషన్స్ విభాగం ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. -
చరిత్ర సృష్టించిన రష్మీ సామంత్
లండన్ : భారత్‌కు చెందిన రష్మీ సామంత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. లినారె కాలేజ్‌లో ఎమ్మెస్సీ చదువుతున్న రష్మీ మొత్తం 3,708 ఓట్లకుగానూ, 1,966 ఓట్లు సాధించారు. 2021–22 సంవత్సరానికి ఆమె విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలిగా పని చేయనున్నారు. సిలబస్ డీకాలనైజేషన్, డీకార్బొనైజింగ్ అనే రెండు ప్రధానాంశాలను ఆమె తన మేనిఫెస్టోలో చేర్చి విద్యార్థుల ఆదరణ చూరగొన్నారు. బేమ్ (బ్లాక్, ఏసియన్, మైనారిటీ, ఎత్నిక్) వర్గానికి చెందిన ఆమె బలహీన వర్గాలకు చెందిన వారి సమస్యలను అర్థం చేసుకున్నట్లుగా విజన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తానని కూడా తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలిగా దేవికా అనే మరో బారతీయురాలు ఎన్నికయ్యారు. -
బైడెన్‌కే భారతీయుల బాసట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌కే ఇండియన్ అమెరికన్లు జై కొడతారని ఇండియాస్పొరా అండ్ ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐల్యాండర్స్ (ఏఏపీఐ) డేటా సర్వేలో తేలింది. 77 ఏళ్ల వయసున్న బైడెన్ ఇండియన్ అమెరికన్ ఓటర్లతో గత కొన్నేళ్లుగా మంచి సంబంధ బా«ంధవ్యాలు కలిగి ఉన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడం కూడా ఆయనకి కొంత వరకు కలిసి వచ్చినట్టుగా మంగళవారం విడుదలైన సర్వే నివేదిక పేర్కొంది. ఏఏపీఐ డేటా సర్వే ప్రకారం బైడెన్‌కు 66 శాతం మంది ఇండియన్ అమెరికన్లు మద్దతుగా ఉంటే, ట్రంప్‌కి 28శాతంఅనుకూలంగా ఉన్నారు. మరో 6 శాతం మంది ఎవరికి ఓటు వెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అయినప్పటికీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే ట్రంప్ మద్దతుదారులు పెరగడం డెమోక్రాట్లలో ఆందోళన పెంచుతోంది. పట్టు పెంచుకుంటున్న ట్రంప్ ఏఏపీఐ డేటా సర్వేకి నేతృత్వం వహించిన డాక్టర్ కార్తీక్ రామకృష్ణన్ ఎన్నికల సమయానికి ఓటర్ల మూడ్ మారి ట్రంప్‌కి 30 శాతం మంది వరకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో ట్రంప్‌కి ఇండియన్ అమెరికన్లు 16శాతం మంది ఓటు వేశారు. ఈ సారి 30 శాతం మంది మద్దతిస్తే భారీ పెరుగుదలగానే చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రవాస భారతీయుల్ని ఆకర్షించే ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టడం లేదని కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, దక్షిణాసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ మిలాన్ వైష్ణవ్ అన్నారు. జో బైడెన్‌కే ఇండియన్ అమెరికన్లు అత్యధికులు అండగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 77శాతం మంది హిల్లరీ క్లింటన్‌కి అనుకూలంగా ఓటు వేస్తే, అంతకు ముందు 2012 ఎన్నికల్లో బరాక్ ఒబామాకు 84శాతం మంది ఇండియన్ అమెరికన్లు ఓట్లు వేశారు. వారితో పోల్చి చూస్తే బైడెన్ వెనుకబడి ఉండడం డెమొక్రాట్లలో కాస్త ఆందోళన పెంచుతోంది. స్వింగ్ స్టేట్స్లో ప్రతీ ఓటు అత్యంత కీలకం కాబట్టి డెమొక్రాట్లు వివిధ ప్రవాస భారతీయ సంస్థల్ని తమ వైపు తిప్పుకునేలా చర్యలు చేపట్టాలని సర్వే నివేదిక రచయిత డా. కార్తీక్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకి మద్దతు ఇస్తారో చివరి నిముషం వరకు తేల్చుకోలేని స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిషిగావ్, ఫ్లోరిడా, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది. -
భారతీయులపై కోవిడ్ పడగ
లండన్/న్యూయార్క్/ఇస్లామాబాద్/బీజింగ్: బ్రిటన్‌లోని భారతీయులపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. దేశంలో కోవిడ్ కారణంగా మరణించిన వారిలో కనీసం 3 శాతం మంది భారతీయ సంతతి వారు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్రిటన్‌లోని ఆసుపత్రుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. ఈనెల 17వ తేదీ వరకు 13,918 మంది కోవిడ్‌తో మరణించగా ఇందులో 16.2 శాతం మంది నల్లజాతీయులు, ఆసియా, మైనార్టీ తెగల నేపథ్యం ఉన్న వారు. ఈ వర్గానికి చెందిన వారు మొత్తం 2,252 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతీయ సంతతికి చెందిన వారు ఇందులో 420 మంది ఉన్నారు. దేశంలో మైనార్టీ నేపథ్యమున్న వారి సంఖ్య 13 శాతం మాత్రమే అయినా కరోనా వైరస్‌తో మరణాల్లో ఇంతకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మృతుల్లో శ్వేత జాతీయులు 73.6 శాతం ఉండగా, మిశ్రమ నేపథ్యమున్న వారు 0.7 శాతమని, ఇతర ఆసియా దేశాలకు చెందిన వారు 1.6 శాతమని సమాచారం. కోవిడ్ బాధితులకు చికిత్సచేసే వైద్య సిబ్బందిలో 69 మంది వైరస్‌కు బలయ్యారు. రెండు పిల్లులకు వైరస్ పాజిటివ్ కోవిడ్ నెమ్మదిగా జంతువులకు విస్తరిస్తోంది. న్యూయార్క్‌లో రెండు పిల్లులు ఈ వ్యాధి బారిన పడ్డాయని అధికారులు ప్రకటించారు. పెంపుడు జంతువులకు ఈ వైరస్ సోకడం ఇదే తొలిసారి అని తెలిపారు. న్యూయార్క్ రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ పిల్లులు ఉన్నట్లు చెప్పారు. వైరస్ సోకిన ఒక పిల్లి యజమాని కుటుంబంలో వైరస్ లేదు. ఇంకో పిల్లి యజమాని కోవిడ్ బాధితుడు. అమెరికాలో 1,738 మంది మృతి అమెరికాలో కరోనా వైరస్ బుధవారం 1,738 మందిని బలితీసుకుంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటివరకు 46,583 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు కూడా ఇక్కడే నమోదయ్యాయి. కోవిడ్‌పై చైనా, పాక్ ఉమ్మడి ప్రయోగాలు కోవిడ్–19 టీకాపై ప్రయోగాల నిర్వహణకు సహకరించాలని పాకిస్తాన్‌ను చైనా కోరింది. ఇస్లామాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) ద్వారా పాక్‌లో కోవిడ్ టీకా ప్రయోగాలు నిర్వహించాలని చైనా సంస్థ సైనోఫార్మ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ నిర్ణయించింది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకూ ఒక నిర్ణయం తీసుకోలేదని, ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తమకు మేలు జరుగుతుందని పాక్ అంటోంది. డబ్ల్యూహెచ్‌వోకు చైనా అదనపు గ్రాంట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు ఏటా ఇచ్చే రూ.152 కోట్లకు అదనంగా మరో రూ.228 కోట్లు ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేస్తున్నట్లు ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన వెంటనే తాము ఎక్కువ నిధులు ఇస్తామని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాలో 2.32 లక్షల కేసులు: అధ్యయనం చైనాలో కరోనా కేసులను ఆ దేశ ప్రభుత్వం తక్కువగా చెబుతోందని ప్రపంచ దేశాలన్నీ ఆరోపణలు గుప్పిస్తున్న వేళ, చైనాలో దాదాపు 2.32 లక్షల కేసులు నమోదై ఉంటాయని హాంకాంగ్ యూనివర్సిటీ నిపుణులు అంచనా వేశారు. ఫిబ్రవరి 20 నాటికి చైనా 55 వేల మందికి కరోనా సోకినట్లు చెప్పిందని, కానీ అప్పటికే దాదాపు 2.32 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ఓ నివేదిక ప్రచురితమైంది. చైనా చెబుతున్న సంఖ్యకు, నిజమైన సంఖ్యకు వ్యత్యాసం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. చెప్పిన సంఖ్య కంటే ఎక్కువ కేసులు నమోదై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. -
భిన్నత్వంలో ఏకత్వం భారత్ సొంతం
సాక్షి, అమరావతి : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు విలక్షణమైనవని.. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం వెల్లివిరుస్తుందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, భావ ప్రకటన వంటి మంచి అవకాశాలను భారత రాజ్యాంగం అందించిందని.. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే ఇటువంటి మౌలిక సూత్రాలను ప్రజలకు అందించగలుగుతున్నాయని వివరించారు. ‘భారతదేశం గురించి తెలుసుకోండి (నో ఇండియా)’ పేరిట కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల యువజనాభ్యుదయ శాఖలు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భారతీయ సంతతికి చెందిన వివిధ దేశాల యువత సోమవారం విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. భారతీయతపట్ల ఆసక్తితో ఫిజి, గయానా, మారిషస్, మయన్మార్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో తదితర దేశాల నుండి యువత రావటం ముదావహమన్నారు. రాష్ట్ర అధికారిక భాష తెలుగు ‘ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్‘గా ప్రసిద్ధిగాంచిందని చెబుతూ రాష్ట్ర విశిష్టతలను వారికి విపులంగా వివరించారు. అలాగే, దేశం మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ప్రవాస యువత భారత్ పర్యటనకు రావటం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వినీత్‌కుమార్, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
అంధుడికి ఆసరాగా తొలిసారి ఓ గుర్రం!
లండన్: సాధారణంగా పశ్చిమ దేశాల్లోని అంధులు తమ రోజువారీ కార్యక్రమాల్లో సహాయానికి శిక్షణ పొందిన శునకాలను వినియోగిస్తారు. కానీ, బ్రిటన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఓ అంధుడు తొలిసారి తన సహాయకారిగా శునకానికి బదులు ఓ గుర్రాన్ని వినియోగించనున్నాడు. మహమ్మద్ సలీమ్ పటేల్(24) బ్లాక్బర్న్ పట్టణంలో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. రెటీనాస్ పిగ్మెంటొసా అనే కంటి సమస్య కారణంగా ఆయన చూపు కోల్పోయాడు. అతడికి చిన్నప్పటి నుంచి కుక్కలంటే మహా భయం. దీంతో ఆయన కుక్కలను సహాయకారిగా ఎంచుకునేందుకు సంకోచిస్తున్న సమయంలో పొట్టిరకం గుర్రం అతడి మదిలో మెదిలింది. ఆ గుర్రానికి (డిగ్బీ) వచ్చే ఏడాది మే నెలలో రెండేళ్లు నిండుతాయని, అనంతరం అది రెండేళ్లు శిక్షణ పూర్తి చేసుకుని తన దగ్గరికి వస్తుందని పటేల్ పేర్కొన్నారు. కుక్కలతో పోలిస్తే డిగ్బీతో ఎన్నో లాభాలున్నాయంటున్నాడు పటేల్. డిగ్బీ జీవిత కాలం ఎక్కువని, తనకు నలభై దాటాక కూడా అది సాయం చేస్తుందన్నాడు. శునకాలు కేవలం 8 ఏళ్లు పనిచేసి రిటైర్ అవుతాయని, అవి చీకటిలో చూడలేవని పేర్కొన్నాడు. -
ఆన్లైన్ మిత్రుడితో డేటింగ్లో ఉందని..
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి వ్యక్తిపై హత్యా నేరం కేసు నమోదైంది. ప్రేమ్ రామ్‌పర్సోడ్(50) అనే వ్యక్తి భార్య రజ్వాంటీ బాల్డియో(46)ను సోమవారం దారుణంగా హత్య చేశాడు. స్థానికంగా ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న రజ్వాంటీ బాల్డియో.. తన విధులు ముగించుకొని ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో ప్రేమ్ భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అనంతరం కత్తితో విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడేగల సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. ఇది చాలా తీవ్రమైన నేరమైని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ బ్రౌన్ వెల్లడించారు. విచారణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం ప్రేమ్ 9000 డాలర్లు ఇచ్చి బాల్డియోను ప్రేమ్ అమెరికాకు పంపాడు. ఇటీవల బాల్డియో ఓ ఆన్లైన్ మిత్రుడితో డేటింగ్లో ఉన్నట్లు తెలుసుకున్న ప్రేమ్ అక్కడకు వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
అమెరికాలో ఐదుగురు ‘భారతీయ’ సంపన్నులు
ఫోర్బ్స్ టాప్-400 జాబితాలో చోటు న్యూయార్క్: అమెరికాలోని సంపన్నుల్లో భారత సంతతికి చెందిన ఐదుగురికి చోటు లభించింది. ఫోర్బ్స్ సంస్థ అమెరికా వ్యాప్తంగా మొదటి 400 మంది సంపన్నులతో ఈ ఏడాదికి గాను ‘రిచెస్ట్ పీపుల్ ఇన్ అమెరికా - 2016’ పేరుతో ఓ జాబి తాను రూపొందించి విడుదల చేసింది. మొదటి స్థానాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ సొంతం చేసుకున్నారు. ఆయన నెట్‌వర్త్ 81 బిలియన్ డాలర్లు. బిల్‌గేట్స్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం వరుసగా ఇది 23వ సంవత్సరం. జాబితాలో భారత సంతతి వారు వీరే సింఫనీ టెక్నాలజీ కంపెనీ వ్యవస్థాపకుడు రొమేష్ వాద్వానీ (69) మూడు బిలియన్ డాలర్ల (రూ.20,100 కోట్లు) నెట్‌వర్త్‌తో జాబితాలో 222వ స్థానంలో నిలిచారు. ఐఐటీ ముంబై, కార్నెగీ మెలన్ యూనివర్సిటీల్లో చదివిన వాద్వానీ భారత్‌లో కొత్త కంపెనీల ఏర్పాటుకు బిలియన్ డాలర్ల నిధుల సాయం అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. సింటెల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు నీర్జా దేశాయ్ (64) ఈ జాబితాలో 274వ స్థానంలో ఉన్నారు. నెట్‌వర్త్ 2.5 బిలియన్ డాలర్లు(రూ.16,750 కోట్లు). 1980లో మిచిగాన్‌లోని తన అపార్ట్మెంట్లో సింటెల్ కంపెనీని స్థాపించిన దేశాయ్ నేడు 950 మిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచ వ్యాప్తంగా 24వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు ఫోర్బ్స్ ప్రశంసించింది. రాకేష్ గంగ్వాల్(63) 2.2 బిలియన డాలర్ల (రూ.14,740 కోట్లు) నెట్‌వర్త్‌తో 321వ స్థానంలో ఉన్నారు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన గంగ్వాల్ దేశంలో బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ సహ వ్యవస్థాపకుడు. వ్యాపారవేత్త జాన్ కపూర్(73) జాబితో 335వ స్థానంలో నిలవగా ఆయన నెట్‌వర్త్ 2.1 బిలియన్ డాలర్లు(రూ.14,070 కోట్లు). అకోర్న్, ఇన్సిస్ టెక్నాలజీస్ అనే ఔషధ కంపెనీలకు చైర్మన్‌గా ఉన్నారు. సిలికాన్ వ్యాలీ ఏంజెల్ ఇన్వెస్టర్ కవితార్క్ రామ్ శ్రీరామ్(9) 1.9 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ (రూ.12,730 కోట్లు)తో 361 స్థానాన్ని దక్కించుకున్నారు. -
భారత సంతతి బాలికకు గూగుల్ ఉపకారవేతనం
జొహానెస్బర్గ్: భారత సంతతికి చెందిన కియారా నిర్ఘిన్ అనే 16 ఏళ్ల దక్షిణాఫ్రికా విద్యార్థిని గూగుల్ సైన్స్ సదస్సులో రూ. 33 లక్షల ఉపకార వేతనాన్ని గెలుపొందింది. కరువును తరిమికొట్టి, పంటలకు తగినంత నీరందించేందుకు ఉపయోగపడే శోషక పదార్థాన్ని రూపొందించినందుకు ఈ బహుమతి లభించింది. నారింజ పండు తోలును వాడి కియారా ఈ పదార్థాన్ని రూపొందించింది. వర్షం పడినపుడు మట్టి.. నీటిని పట్టి ఉంచడంలో ఇది సాయపడుతుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను శాస్త్ర సాంకేతికతల సాయంతో ఎలా పరిష్కరించవచ్చనే విషయంపై ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 13 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల మధ్య గూగుల్ ఈ పోటీని నిర్వహిస్తుంది. -
నిజమైన హీరో అంటే ఈ తాతయ్యనే!
65 ఏళ్ల అవతార్ హోతి, ఆయన కొడుకు పాల్ ఎప్పటిలాగే తమ పంటపొలంలో పనిచేసకుంటున్నారు. వీరి పొలానికి పక్కనే నార్త్ తాంప్సన్ నది కాలువ ఉంది. చలికాలం కావడంతో చల్లటి నీటితో నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇంతలోనే ఓ 14 ఏళ్ల అమ్మాయి అరుపులు-కేకలు వినిపించాయి. నదిలో కొట్టుకుపోతూ ఆమె సాయం కోసం అర్థించింది. వెంటనే అవతార్, పాల్ నది దగ్గరకు వెళ్లి చూశారు. కెరటాల్లో కొట్టుకుపోతూ బాధితురాలు కేకలు వేస్తోంది. పాల్‌కు ఏం చేయాలో తోచలేదు. కానీ చురుగ్గా ఆలోచించిన హోతి మాత్రం వెంటనే తలపాగా తీసి.. సాయంగా బాధితురాలి కోసం విసిరాడు. ఆమె దానిని అందుకొని సురక్షితంగా బయటపడింది. నదిలో కొట్టుకుపోతున్న షాక్‌లో ఉన్న ఆమెకు తండ్రీకొడుకులు ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. భారత సంతతికి చెందిన 65 ఏళ్ల హోతిని ఇప్పుడు కెనడాలో అందరూ నిజమైన హీరో అని పొగుడుతున్నారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం కేమ్లూప్స్లో ఉంటున్న ఆయన చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. నదిలో కొట్టుకుపోతున్న అమ్మాయికి తలపాగాను తాడులా అందించి.. ఒడ్డుకు తీసుకురావడమే కాదు.. చలినీటిలో గడ్డకట్టుకుపోయిన ఆమె కోలుకునేలా తండ్రీ-కొడుకులు సపర్యలు చేశారు. షాక్ నుంచి తేరుకున్న తర్వాత బాధితురాలిని తమ కారులో సమీపంలోని ఆమె బామ్మ ఇంట్లో వదిలిపెట్టి వచ్చామని పాల్ తెలిపాడు. సమయస్ఫూర్తితో తన తండ్రి చేసిన సాహసం తనకు గర్వకారణంగా ఉందని అతను సీబీసీ న్యూస్‌కు తెలిపాడు. -
భారత సంతతి వైద్యుడికి అమెరికాలో రెండోస్థానం
న్యూయార్క్: న్యూరోసర్జన్‌గా అమెరికన్లకు సుపరిచితులైన భారతసంతతి వైద్యుడు సంజయ్ గుప్తా ఆ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వైద్యుడిగా స్థానం దక్కించుకున్నారు. వైద్యుల ట్విటర్ ఖాతా సాయంతో ఓ సంస్థ చేసిన సర్వేలో గుప్తాకు రెండోస్థానం దక్కింది. అమెరికాలోని అట్లాంటాలో ఎమోరి క్లినిక్ పేరుతో ఆస్పత్రిని నడుపుతున్న గుప్తాకు ట్విటర్లో దాదాపు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. పలుమార్లు ఎమ్మీ అవార్డుతోపాటు సీఎన్ఎన్ చీఫ్ మెడికల్ కరెస్పాండెంట్ అవార్డును కూడా అందుకున్న గుప్తాకు అత్యం త సక్సెస్ రేటుతో ఆపరేషన్లు చేసిన వైద్యుడిగా గుర్తింపు ఉంది. ఇక ఈ సర్వే లో 30 లక్షల మంది ఫాలోవర్లతో డ్రూ పిన్స్కీ మొదటిస్థానంలో నిలిచారు. 2006 నుంచి కొనసాగుతున్న వైద్యుల ట్విటర్ ఖాతాల ఆధారంగా ఆగస్టానా యూనివర్సిటీ విద్యార్థులు ఈ వివరాలను వెల్లడించారు. -
భారత హీరోయిన్‌కు మరో హాలీవుడ్ చాన్స్!
లాస్ ఏంజిల్స్: భారత సంతతికి చెందిన బ్రిటిషన్ నటి ఆర్చీ పంజాబీ మరో హాలీవుడ్ సినిమాలో మెరువనుంది. ఇప్పటికే 'ద గుడ్ వైఫ్' సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులను పలుకరించిన ఈ అమ్మడు.. తాజాగా ఏబీసీ అంతాలజీ 'జ్యూరీ'లో నటించనుంది. ఈ సినిమాలో కిమ్ డింప్సేగా ప్రధాన పాత్రలో నటించనుంది. ఓ హత్య ఘటన విచారణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. వ్యక్తిగత అనుభవాలు, పక్షపాతాలు న్యాయమూర్తుల తీర్పులను ఎలా ప్రభావితం చేస్తాయి.. కాలక్రమంలో అభిప్రాయాలు ఎలా మారుతాయా? అన్న అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. వృత్తిరీత్యా ఎవరితో స్నేహంగా ఉండకుండా సత్యాన్వేషణలో నిమగ్నమయ్యే గంభీరమైన పాత్రను పంజాబీ పోషిస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి. వీజే బొయ్డ్ స్క్రిప్ట్ అందిస్తున్న ఈ సినిమాను ఏబీసీ స్టూడియో, సోని పిక్చర్స్ టెలివిజన్ సహ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించనున్నాయి. -
'ఆ ప్రమాదంలో ఒక్క ప్రాణం పోకపోవడం ఆశ్చర్యం'
మెల్బోర్న్: నిర్లక్ష్యంగా కారు నడిపి కొందరిని తీవ్రంగా గాయపరిచినందుకు ఓ భారతీయ సంతతి వ్యక్తికి న్యూజిలాండ్ కోర్టు భిన్నంగా శిక్ష విధించింది. 125గంటలపాటు (ఐదు రోజుల ఐదుగంటలు) కమ్యూనిటీ సేవ చేయాలని ఆదేశించింది. దీంతోపాటు మరో ఏడాదికాలంపాటు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని రద్దు చేసింది. సందీప్ కుమార్ అనే భారత సంతతి పౌరుడు 2014 జనవరిలో నిర్లక్ష్యంగా కారు నడిపాడు. ఆ సమయంలో కారులో మొత్తం ఏడుగురు తన కుటుంబ సభ్యులు ఉన్నారు. కారు డ్రైవింగ్ చేస్తూ అతడు నిద్రలోకి జారడంతో అది కాస్త రోడ్డుపక్కకు వెళ్లి ఓ పది మీటర్ల ఎత్తున్న కొండలాంటిదానికి తగిలి ఆగిపోయింది. దీంతో ఆ కారులో ప్రయాణించేవారిలో అతడి వదిన, అన్నయ్య, వారి కుమారుడు తీవ్రంగా గాయపడగా స్నేహితులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడు ఆరోపణలతో కోర్టు ఈ ఏడాది జూన్‌లో విచారణ చేపట్టింది. ఈ తీర్పు సందర్భంగా అంతపెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరగకపోవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. -
కూలిన ఎఫ్-18 విమానం.. పైలట్ మృతి
లండన్: ఇంగ్లండ్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-18 యుద్ధవిమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన పైలట్ తేజ్ శరీణ్ (34) మరణించారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు శరీణ్ విమానంలో నుంచి బయటకు దూకినా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. శరీణ్ కాలిఫోర్నియలో నివసించేవారు. 2004లో శాన్ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. -
టాక్సీ డ్రైవర్.. ఆస్ట్రేలియన్ ఆఫ్ ద డే
ఆదివారం వస్తోందంటే చాలు.. శనివారం రాత్రి నుంచే హాయిగా రిలాక్స్ అయిపోడానికి ప్రయత్నిస్తాం. కానీ ఓ సాధారణ వ్యక్తి అసాధారణ సేవలను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నెలలో ఒక ఆదివారం సమాజసేవకు అంకితం అవుతూ.. 'ఆస్ట్రేలియన్ ఆఫ్ ది డే' పేరిట ఓ వినూత్నకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇండియాలో పుట్టి ఆస్ట్రేలియాలోని డర్విన్ లో ఉంటున్న తేజేందర్ సింగ్... అక్కడ కూడు, గూడుకు నోచుకోని నిరుపేదలకు ఆహారం అందిస్తూ ఆపద్బాంధవుడయ్యాడు. తేజేందర్ సింగ్ ప్రతి ఆదివారం.. ఉదయం ఏడు గంటలకు షిఫ్టు ముగించుకొని ఇంటికి వచ్చే అతడు కిలోల కొద్దీ అన్నం, కూరగాయలను వండుతాడు. అతని కుమారుడు నవదీప్ ఆ ఆహారాన్ని సిటీలోని పేదలకు అందిస్తాడు. మూడేళ్లుగా తేజేందర్ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. మంచి పని చేస్తున్నపుడు తనకు మరింత శక్తి వస్తుందంటున్న అతడు... పగలు ఎయిర్ కండిషనర్ మెకానిక్ గానూ పని చేస్తూ తన సంపాదనను ప్రజాసేవకు వినియోగిస్తున్నాడు. ''సంపాదించిన దానిలో పదిశాతం బీదలకు, దిక్కు లేనివారికి వెచ్చించాలన్నది మా మత ధర్మంలో ఉంది'' అంటున్న తేజేందర్ సింగ్.. ఈ రకమైన సేవ పదిమందీ చేయాలన్న ఉద్దేశంతో.. ఫేస్‌బుక్‌ను ప్రచార సాధనంగా ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఆఫ్ ద డే గా గుర్తింపు పొందాడు. రాత్రంతా టాక్సీ నడిపి, తెల్లవారుతుండగా ఇంటికి చేరే తేజేందర్ తిరిగి పని చేయాలంటే శక్తి అవసరం కాబట్టి ఏదో కాస్త తిని, కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఓపిక కూడదీసుకొని మళ్లీ పనిలో నిమగ్నమైపోతాడు. తేజేందర్ ఎందరికో ఆర్థికంగానూ అండగా నిలుస్తున్నాడు. తాను చేసే సేవకు ఎటువంటి నిధులు, విరాళాలు సేకరించడు. స్వయంగా సంపాదించిన దానిలోనే ఇతరులకు సహాయ పడతాడు. తనలాగా మరెందరో సేవలు అందించగలిగితే మరింత ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నాడు. అందుకు ముందుకు వచ్చేవారు తన వ్యాను, వంట పాత్రలు వినియోగించుకోవచ్చని చెబుతున్నాడు.