విపక్ష నేత పదవికి సునాక్‌ గుడ్‌బై | Rishi Sunak bows out as UK Opposition Leader on Diwali | Sakshi
Sakshi News home page

విపక్ష నేత పదవికి సునాక్‌ గుడ్‌బై

Oct 31 2024 5:36 AM | Updated on Oct 31 2024 5:36 AM

Rishi Sunak bows out as UK Opposition Leader on Diwali

లండన్‌: బ్రిటన్‌ విపక్ష నేత పదవి నుంచి రిషి సునాక్‌ (44) బుధవారం తప్పుకున్నారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్‌ ప్రధానిగా రెండేళ్ల క్రితం ఆయన చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఆయన సారథ్యంలో కన్జర్వేటివ్‌ పార్టీ గత జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. నాటినుంచి సునాక్‌ తాత్కాలికంగా విపక్ష నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం పార్లమెంటులో ప్రకటించారు.

 ‘రెండేళ్ల నాడు దీపావళి సంబరాల సందర్భంగానే నా పార్టీ నాయకునిగా ఎన్నికయ్యా. మళ్లీ అవే సంబరాల వేళ తప్పుకుంటున్నా’ అంటూ హాస్యం చిలికించారు. ‘‘ఈ గొప్ప దేశానికి తొలి బ్రిటిష్‌ ఏషియన్‌ ప్రధాని కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. బ్రిటన్‌ అనుసరించే గొప్ప విలువలకు ఇది తార్కాణంగా నిలిచింది’’ అన్నారు. తన చివరి ప్రైమ్‌మినిస్టర్స్‌ క్వశ్చన్స్‌ (పీఎంక్యూస్‌)లో భాగంగా ప్రధాని కియర్‌ స్టార్మర్‌కు సునాక్‌ పలు సరదా ప్రశ్నలు వేసి అందరినీ నవ్వించారు. 

వెనక బెంచీల్లో కూచుంటా
అమెరికాలో స్థిరపడాలని తాను భావిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను ఈ సందర్భంగా సునాక్‌ తోసిపుచ్చారు. రిచ్‌మండ్‌–నార్త్‌ అలెర్టన్‌ ఎంపీగా పారల్మెంటులో వెనక బెంచీల్లో కూర్చుని కనిపిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. దాంతో సహచర ఎంపీలంతా నవ్వుల్లో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement