opposition leader
-
Maharashtra: ప్రతిపక్ష నేత ఎవరు..?
ముంబై: ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా... మహాయుతి కూటమి 235 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 132 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ 41 స్థానాలు దక్కించుకున్నాయి. ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా!ఊహించని విధంగా రికార్డు బద్దలు కొడుతూ భారీ మెజార్టీతో మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించగా ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షంలోని ఏ పార్టీ కూడా పది శాతం స్థానాలు రాబట్టుకోలేక పోయాయి. దీంతో ప్రతిపక్ష పదవిలో ఎవరు ఉండక పోవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ) లేకపోవడం ఆరు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. రాష్ట్ర శాసన మండలి నియమాల ప్రకారం మొత్తం స్థానాల్లో పది శాతం స్థానాలు దక్కించుకున్న పార్టీకే ప్రతిపక్ష పదవి లభిస్తుంది. కానీ శనివారం వెలువడిన ఫలితాల్లో మహా వికాస్ అఘాడీలోని యూబీటీ, కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) మిత్రపక్షాల్లోని ఏ ఒక్క పార్టీకి పది శాతం స్థానాలు రాలేకపోయాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 49 చోట్ల గెలుపొందింది. ప్రస్తుతం కాంగ్రెస్ వద్ద 16, యూబీటీ–శివసేన వద్ద 20, ఎన్సీపీ (ఎస్పీ) వద్ద 10 స్థానాలున్నాయి. దీంతో ఏ పార్టీ వద్ద తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష పీఠంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం పీఠంపై వీడని ఉత్కంఠమరోవైపు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం, శివసేన (షిండే) అధినేత ఏక్నాథ్ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తం ఆ పోస్టు కోసం పోటీలో ఉన్నారు.బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో తీరనుంది. కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి. -
విపక్ష నేత పదవికి సునాక్ గుడ్‌బై
లండన్: బ్రిటన్ విపక్ష నేత పదవి నుంచి రిషి సునాక్ (44) బుధవారం తప్పుకున్నారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా రెండేళ్ల క్రితం ఆయన చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఆయన సారథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ గత జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. నాటినుంచి సునాక్ తాత్కాలికంగా విపక్ష నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. ‘రెండేళ్ల నాడు దీపావళి సంబరాల సందర్భంగానే నా పార్టీ నాయకునిగా ఎన్నికయ్యా. మళ్లీ అవే సంబరాల వేళ తప్పుకుంటున్నా’ అంటూ హాస్యం చిలికించారు. ‘‘ఈ గొప్ప దేశానికి తొలి బ్రిటిష్ ఏషియన్ ప్రధాని కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. బ్రిటన్ అనుసరించే గొప్ప విలువలకు ఇది తార్కాణంగా నిలిచింది’’ అన్నారు. తన చివరి ప్రైమ్‌మినిస్టర్స్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్)లో భాగంగా ప్రధాని కియర్ స్టార్మర్‌కు సునాక్ పలు సరదా ప్రశ్నలు వేసి అందరినీ నవ్వించారు. వెనక బెంచీల్లో కూచుంటాఅమెరికాలో స్థిరపడాలని తాను భావిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను ఈ సందర్భంగా సునాక్ తోసిపుచ్చారు. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ ఎంపీగా పారల్మెంటులో వెనక బెంచీల్లో కూర్చుని కనిపిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. దాంతో సహచర ఎంపీలంతా నవ్వుల్లో మునిగిపోయారు. -
దృష్టి మరల్చేందుకే.. నిజ్జర్ హత్య తెరపైకి
ఒట్టావా: ఇతర వివాదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతాన్ని తెరపైకి తెచ్చి భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారని కెనడా విపక్షనేత మాక్సిమ్ బెర్నియర్ అన్నారు. గతంలో జరిగిన తప్పిదాన్ని సరిచేసుకోవాలంటే మరణానంతరం నిజ్జర్ పౌరసత్వాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయముందని ట్రూడో ఆరోపించడం, పరస్పర దౌత్యవేత్తల బహిష్కరణతో భారత్– కెనడా సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి కేంద్రబిందువైన నిజ్జర్ విదేశీ ఉగ్రవాది అని, అతనికి 2007లో కెనడా పౌరసత్వం లభించిందని పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా నేత బెర్నియర్ అన్నారు. కెనడా గడ్డపై భారత రాయబార సిబ్బంది నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది నిజమైతే.. అది చాలా తీవ్రమైన విషయమని, తగుచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా భారత్ ప్రమేయంపై ఎలాంటి ఆధారాలను ప్రభుత్వం బయటపెట్టలేదని, ఇతర వివాదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ట్రూడో నిజ్జర్ హత్యను వాడుకుంటున్నారని సుస్పష్టంగా కనపడుతోందన్నారు. నిజ్జర్ విదేశీ ఉగ్రవాది అని, 1997 నుంచి పలుమార్లు తప్పుడు పత్రాలతో కెనడా పౌరసత్వాన్ని పొందడానికి ప్రయత్నించాడని అన్నారు. పలుమారు తిరస్కరణకు గురైనా మొత్తానికి 2007 పౌరసత్వం దక్కించుకున్నాడని తెలిపారు. నిజ్జర్ కెనడా పౌరుడు కాదని, అధికారిక తప్పిదాన్ని సరిచేసుకోవడానికి వీలుగా.. మరణానంతరం అతని పౌరసత్వాన్ని రద్దు చేయాలని బెర్నియర్ డిమాండ్ చేశారు. అతని దరఖాస్తు తిరస్కరణకు గురైన మొదటిసారే నిజ్జర్‌ను వెనక్కిపంపాల్సిందన్నారు. -
లోక్‌సభలో ప్రతిపక్షనేతగా 100 రోజులు.. రాహుల్ ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టి నేటికి(శుక్రవారం) 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పందిస్తూ.. దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయాన్ని పునరుద్దరించడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. మరింత న్యాయబద్దంగా, ఆర్థికంగా సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి మనం కలిసి పని చేస్తున్న సమయంలో ఈ సూత్రాలే తనకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు.కాగా ప్రతిపక్ష నాయకుడిగా అవతరించిన తర్వాత గాంధీ.. ఎన్నో గుర్తుండిపోయే ప్రసంగాలు, బీజేపీపై పదునైన వ్యాఖ్యలతో విమర్శలు చేశారు. పార్లమెంటులో ఎన్నో సమస్యలపై ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హింసాత్మక మణిపూర్ వంటి అనేక సంఘటనలు జరిగిన ప్రాంతాలను సందర్శించి, అక్కడి వారితో సమావేశమయ్యారు. అంతేగాక జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించి ప్రచారం నిర్వహించారు.ఇదిలా ఉండగా పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్షనేత పదవిని పొందేందుకు అర్హత లభించింది. దీంతో ఆ పదవిని రాహుల్ గాంధీకి ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జూన్‌లో తీర్మానాన్ని ఆమోదించింది. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నకల్లో వయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీ నుంచి 3.5 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందిన అనంతరం ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. -
Independence Day 2024: ఐదో వరుసలో రాహుల్
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రతిపక్ష నేత పాల్గొనడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అయితే ఆయనకు ఐదో వరుసలో సీటు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. రాహుల్ ముందు వరుసలో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ క్రీడాకారులు కూర్చున్నారు. ఈ ఉదంతం ప్రధాని నరేంద్ర మోదీ అల్పబుద్ధికి నిదర్శనమంటూ కాంగ్రెస్ మండిపడింది. ‘‘లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన రాహుల్, మల్లికార్జున ఖర్గేలకు ప్రొటోకాల్ ప్రకారం తొలి వరుసలో సీటు కేటాయించాలి. కానీ వారిని ఐదో వరుసలో కూర్చోబెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మోదీలో అహంకారం తగ్గలేదు’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ దుయ్యబట్టారు. ముందు వరుసలను ఒలింపిక్ విజేతలకు కేటాయించినందున రాహుల్‌ను వెనక వరుసకు మార్చామన్న రక్షణ శాఖ వివరణపై ఆయన తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘క్రీడాకారులకు గౌరవమివ్వాల్సిందే. కానీ అందుకోసం కొందరినే వెనక్కు జరిపారెందుకు? అమిత్ షా, జేపీ నడ్డా, ఎస్.జైశంకర్, నిర్మలా సీతారామన్ తదితర కేంద్ర మంత్రులను మొదటి వరుసలోనే ఎలా కూర్చోబెట్టారు?’’ అని ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియాలోనూ బాగా చర్చ జరిగింది. లోక్‌సభలో విపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుంది. కేంద్ర మంత్రులతో పాటు ఆయనకు కూడా ముందు వరుసలో సీటు కేటాయిస్తారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో విపక్ష నేత పదవి పదేళ్లు ఖాళీగా ఉంది. -
బ్రిటన్ విపక్షనేత రేసులో మాజీ మంత్రి ప్రీతీ పటేల్
లండన్: బ్రిటన్ విపక్షనేత పదవి కోసం భారతీయ మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్ పోటీపడుతున్నారు. తన సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో రిషి సునాక్ తన విపక్ష నేత పదవి నుంచి నవంబర్ రెండోతేదీన వైదొలగనున్నారు. దీంతో పార్టీని మళ్లీని విజయయంత్రంగా మారుస్తానంటూ 52 ఏళ్ల ప్రీతీపటేల్ ఆదివారం తన అభ్యరి్థత్వాన్ని ప్రకటించారు. మాజీ మంత్రులు జేమ్స్ క్లెవర్లీ, టామ్ టగెన్డాట్, మెల్ స్టైడ్, రాబర్ట్ జెన్రిక్లతో ఆమె పోటీపడనున్నారు. -
Venezuela presidential election: సామ్యవాద కోటలో నారీ భేరి
వెనిజులా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న లాటిన్ అమెరికా దేశం. అయినా అత్యంత నిరుపేద దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పాతికేళ్లుగా సాగుతున్న స్వయం ప్రకటిత సామ్యవాద కూటమి నియంతృత్వ పాలనే అందుకు ప్రధాన కారణం. నిరసనలపై ఉక్కుపాదం, హక్కుల అణచివేత, విపక్ష నేతలకు సంకెళ్లు తదితరాలతో వెనిజులా యువత విసిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉపాధి అవకాశాలూ లేకపోవడంతో కట్టకట్టుకుని దేశం వీడుతోంది. నిండా 3 కోట్ల జనాభా కూడా లేని దేశంలో గత పదేళ్లలో ఏకంగా 80 లక్షల మంది విదేశీ బాట పట్టారు! సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వమే గుప్పెట్లో పెట్టుకోవడంతో పాతికేళ్లుగా వెనిజులాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకపక్షమే. 2018 ఎన్నికల్లోనైతే విపక్షాలన్నీ కట్టకట్టుకుని ఎన్నికలనే బహిష్కరించేంతగా ప్రభుత్వ అధికార దురి్వనియోగం శ్రుతి మించిపోయింది. దాంతో ప్రహసనప్రాయంగా సాగిన ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు నికొలస్ మదురో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వెనిజులాలో ఆరేళ్ల అనంతరం ఆదివారం మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పట్లా లేవు! విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మదురోపై ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. విపక్షాల ప్రచార సభలకు జనం విరగబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై ఎప్పుడూ లేనంత ఆసక్తి, ఉత్సుకత వారిలో కనిపిస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈసారి ఎన్నికలను అత్యంత ఆసక్తితో వీక్షిస్తోంది. ఇన్ని మార్పులకు కారణం ఒక్క మహిళ. ఒకే ఒక్క మహిళ. మదురోకు ముచ్చెమటలు పోయిస్తున్న ఆమే...విపక్ష నేత మరియా కొరీనా మచాడో. అనర్హత వేటేసినా... వెనిజులా అధ్యక్ష ఎన్నికల బరిలో 10 మంది ఉన్నారు. ప్రధాన పోటీ 61 ఏళ్ల మదురో, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ రూపంలో ఇద్దరి మధ్య కేంద్రీకృతమైంది. కానీ అసలు పోటీలోనే లేని 56 ఏళ్ల మచాడో పేరు మాత్రమే దేశమంతటా మారుమోగిపోతోంది! ఎన్నికల ప్రచారం పొడవునా ఆమే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అటు అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా, ఇటు విపక్ష ‘యూనిటరీ ప్లాట్‌ఫాం’ కూటమి ప్రచారమంతా ఆమెనే కేంద్రంగా చేసుకుని సాగడం విశేషం. ముఖ్యంగా మదురో ప్రసంగాలన్నీ ఆద్యంతం మచాడోను విమర్శిస్తూనే సాగాయి. ఆమె ఎన్నికల పోటీకి దూరమైన వైనమూ ఆసక్తికరమే. విపక్ష అభ్యర్థిని తేల్చేందుకు గతేడాది జరిగిన ప్రైమరీలో దేశవ్యాప్తంగా జనం వెల్లువలా వచ్చి మచాడోకు ఓటేశారు. దాంతో ఆమె రికార్డు స్థాయిలో ఏకంగా 93 శాతం ఓట్లు సాధించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆమెపై అవినీతి ఆరోపణలు మోపి ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. విపక్ష ప్రైమరీనే చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మచాడో మద్దతుదారులైన నాయకులు, జర్నలిస్టులు, హక్కుల నేతలు తదితరులందరినీ జైలుపాలు చేసింది. ప్రభుత్వ గుప్పెట్లో ఉన్న సుప్రీంకోర్టు కూడా వేటునే సమరి్థంచింది. అయినా మచాడో వెనక్కు తగ్గకుండా పెద్ద జనాకర్షణ శక్తి లేని మాజీ దౌత్యవేత్త గొంజాలెజ్‌ను తనకు బదులుగా రేసులో దించారు. తనపై వేటునే అతి పెద్ద ప్రచారాస్త్రంగా మలచుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తించారు. మదురో ప్రభుత్వ అవినీతి, అస్తవ్యస్త పాలనపై ఆమె విమర్శలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దాంతో అందరి దృష్టీ ఆదివారం జరిగే పోలింగ్ మీదే కేంద్రీకృతమైంది. 40 లక్షల మంది ఓటర్లపై ‘వేటు’ వెనిజులా మొత్తం ఓటర్లే 2.1 కోట్లు. వారిలో 40 లక్షల మందికి పైగా విదేశాల్లో ఉన్నారు. మదురో పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వారెవరూ ఓటేసే వీల్లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. లెక్కలేనన్ని కొత్త నిబంధనలు తేవడంతో ప్రవాసుల్లో 69 వేల మంది మాత్రమే ఓటింగ్‌కు అర్హత పొందారు! బస్సు డ్రైవర్ నుంచి అధికార పీఠం దాకా... నికొలస్ మదురో మోరోస్. ఒకప్పుడు సాదాసీదా బస్సు డ్రైవర్. అనంతరం కార్మిక సంఘాల నేతగా మారారు. మెల్లిగా రాజకీయంగా ఒక్కో మెట్టే ఎక్కుతూ అధ్యక్ష పీఠం దాకా ఎదిగారు. 2000లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికవడం మదురో కెరీర్లో కీలక మలుపు. వెనిజులా చరిత్రలో అత్యంత జనాకర్షక నేతగా పేరొందిన హ్యూగో చావెజ్ అభిమానం చూరగొనడంతో ఆయన దశ తిరిగింది. చావెజ్ హయాంలో నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా, విదేశాంగ మంత్రిగా చేసి 2012లో దేశ ఉపాధ్యక్షుడయ్యారు. ఏడాదికే చావెజ్ క్యాన్సర్ బారిన పడ్డారు. 2013లో మదురోను తన తాత్కాలిక వారసునిగా ప్రకటించి మరణించారు. మదురో గద్దెనెక్కుతూనే అధ్యక్ష పదవికి తూతూ మంత్రంగా ప్రత్యేక ఎన్నికలు జరిపించి తనకు 50 శాతానికి పైగా ఓట్లొచ్చాయని ప్రకటించుకున్నారు. నాటినుంచి నేటిదాకా అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ కుప్పకూలిందంటూ జనం ఆగ్రహంగా ఉన్నారు. కొన్నేళ్లుగా మదురోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రతరమవుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. ఢిల్లీలో కొత్త బంగ్లా
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఢిల్లీలో ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. సునేహ్రీ బాగ్ రోడ్‌లోని నెంబర్ 5 బంగ్లాను రాహుల్‌కు హౌస్ కమిటీ ఆఫర్ కల్పించినట్లు సమాచారం. ఈ మేరకు రాహుల్ సోదారి ప్రియాంకాగాంధీ కొత్త బంగ్లాను పరిశీలించి వెళ్లినట్లు వినికిడి. మరీ ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.కాగా పరువునష్టం కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం దిల్లీలోని 12-తుగ్లక్ లేన్‌లోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని పార్లమెంటరీ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఆ ఇంటిని ఖాళీ చేసి.. 10 జన్‌పథ్‌లోని తన తల్లి, కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ నివాసానికి మారారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు.ఇదిలా ఉండగా 2004లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి గతేడాది ఏప్రిల్ వరకు రాహుల్.. 12- తుగ్లక్ లేన్ బంగ్లాలోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం రాహుల్ లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. దీంతో ఆయన కేబినెట్ హోదాను కలిగి ఉన్నందున టైప్ 8 బంగ్లాకు రాహుల్ అర్హుడు. -
TG: రేపు అసెంబ్లీకి కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్షనేత హోదాలో గురువారం(జులై 25) తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణభవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్శాసనసభాపక్ష భేటీకి కేసీఆర్ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతురుణమాఫీ సహా పలు అంశాలపై పోరాడాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.కాగా, గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి అసెంబ్లీ సెషన్‌కు కేసీఆర్ హాజరవలేదు. -
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డి
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్ పేరిట సోమవారం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మరోవైపు శాసనసభలో తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. -
రాహుల్ వర్సెస్ బీజేపీ.. దద్దరిల్లిన లోక్‌సభ
ప్రతిపక్షనేతగా లోక్‌సభలో రాహుల్‌గాంధీ తన గళం విప్పారు. పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు వేదికగా నిలదీశారు. ప్రతిపక్షనేతగా ముందు ముందు తన శైలి ఎలా ఉండబోతుందనేదానిపై తొలి సెషన్లోనే సంకేతాలిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణమయ్యాయి. ఈ సందర్భంగా మోదీ మొదలుకుని అమిత్ షా ఇతర బీజేపీ నేతలు రాహుల్‌పై ఎదురుదాడికి దిగారు. వీరికి సమాధానం చెబుతూనే అటు స్పీకర్ ఓంబిర్లాకు రాహుల్ పలు సూచనలు చేశారు. రాహుల్ ప్రసంగిస్తుండగా బీజేపీ ఎంపీలు పదే పదే అంతరాయం కలిగించారు. మొత్తంగా సోమవారం(జులై1)న లోక్‌సభలో రాహుల్ వర్సెస్ ఆల్ అన్నట్లుగా మారింది. పదేళ్లలో నేనూ బాధితుడినే.. దేశమంతా ఏకమై రాజ్యాంగాన్ని రక్షించేందుకు కృషి చేసిందని రాహుల్‌గాంధీ అన్నారు. గత పదేళ్లలో బీజేపీని ఎదుర్కొన్న లక్షలాదిమందిపై దాడి జరిగిందని ఆరోపించారు. తానూ బాధితుడినేనని తనపై చాలా కేసులు మోపారన్నారు. నాకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. నా ఇల్లు తీసేసుకున్నారు. ఈడీ విచారణను 55 గంటల పాటు ఎదుర్కొన్నానని రాహుల్ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్షంలోనే సత్యం ఉందన్నారు. పవర్లో ఉండటం కంటే ఇదే గొప్పదన్నారు.శివుడి ఫొటో చూపిస్తూ మాటల తూటాలు..ప్రసంగంలో ఆర్ఎస్ఎస్, బీజేపీపై విమర్శల దాడి చేసిన రాహుల్ గాంధీ సభలో ఒక సందర్భంలో శివుని ఫొటో చూపించారు. శివుని ఎడమ చేతి వెనుక ఉన్న తత్రిశూలం హింసకు గుర్తు కాదన్నారు. హింసకే అయితే కుడిచేతిలో ఉండేదని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు రూల్స్ ఒప్పుకోవని స్పీకర్ ఓం బిర్లా రాహుల్‌కు చెప్పారు.ప్రధానితో సహా బీజేపీ నేతల ఎదురుదాడి.. ఇంతలో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్ పేర్కొనడం సరైనది కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రధాని, షా వ్యాఖ్యలకు రాహుల్ స్పందించారు. తాను కేవలం బీజేపీని ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ స్పష్టం చేశారు.రైతులకు కనీసం సంతాపం తెలపలేదు..రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్ల ప్రస్తావన లేదని, నీట్‌ను వాణిజ్య పరీక్షగా మార్చారని రాహుల్ ఆరోపించారు. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారికి సంతాపంగా సభలో కనీసం మౌనం కూడా పాటించలేదని విమర్శించారు. బీజేపీ హయాంలో రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఫైర్ అయ్యారు. మీ విధానలతో ప్రజలకు ఒరిగిందేంటి..దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా ప్రధానే చెప్పిన విషయాన్ని రాహుల్ సభలో గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను రెండు ముక్కలు చేసిందని మండిపడ్డారు. అల్లర్లతో మణిపుర్ అట్టుడికినా ప్రధాని అటువైపు వెళ్లలేదు.మణిపూర్‌లో తన కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.నోట్ల రద్దు వల్ల యువత ఉపాధి కోల్పోయిందన్నారు. జీఎస్టీ కారణంగా వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాల వల్ల దేశ ప్రజలకు కలిగిన లాభమేంటని రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.స్పీకర్‌కూ రాహుల్ చురకలు..ప్రసంగిస్తుండగా తన మైక్‌ను మళ్లీ కట్ చేశారని రాహుల్‌గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్ కట్ చేశారని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభలో స్పీకర్ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ. తొలి రోజు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు స్పీకర్ తలవంచారని, తాను షేక్ హ్యాండ్ ఇస్తే నిటారుగా నిలుచున్నారని రాహుల్ గుర్తుచేశారు. తన కంటే వయసులో మోదీ పెద్దవారైనందునే తలవంచానని స్పీకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. -
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా.. రాహుల్ నిర్ణయంపైనే ఉత్కంఠ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా మరోసారి సోనియా గాంధీని ఎన్నుకున్నారు. శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా తీర్మానం జరిగింది. అయితే ఆ తీర్మానానికి రాహుల్ అంగీకరించనట్లు సమాచారం. కాసేపట్లో దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. సీడబ్ల్యూసీ తీర్మానం
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీని నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత ఎంపికపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శనివారం సమావేశమమైంది. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోవాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, అలప్పుజా నుంచి ఎంపీగా ఎన్నికైన కేసీ కెసి వేణుగోపాల్ తెలిపారు. అలాగే ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. ‘రాహుల్ నడిపించిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర ఎంతో చురుకుగా సాగింది. ఈ రెండు యాత్రలకు ప్రజల్లో విశేష ఆదరణ లభించాయి. ఆయన ఆలోచన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు మన దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు, ఆశలను రేకెత్తించాయి. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లపై కాంగ్రెస్‌పై విశ్వాసం కల్పించాయి. పంచన్యాయ్-పచ్చీస్ హామీ కార్యక్రమం ఎన్నికల ప్రచారంలో అత్యంత శక్తివంతంగా మారింది’ అని తెలిపిందికాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. -
Russia: ఆంక్షల మధ్య నవాల్నీ అంత్యక్రియలు
మాస్కో: రష్యా విపక్ష నేత అలెక్సీ నవాల్నీ అంత్యక్రియలు శుక్రవారం ఆంక్షల నడుమ ముగిశాయి. జైల్లో అనుమానాస్పద రీతిలో మరణించిన ఆయన మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు పుతిన్ సర్కారు ఒక పట్టాన అంగీకరించని విషయం తెలిసిందే. అనంతరం సర్కారు భయంతో అంత్యక్రియ నిర్వహణకు చర్చిలు కూడా వెనకడుగు వేశాయి. ఎట్టకేలకు మాస్కోలోని ఓ చర్చి ఒప్పుకున్నా శ్మశానవాటికకు పార్థివదేహాన్ని తరలించేందుకు వాహనం దొరకడమూ గగనమే అయింది. మృతదేహాన్ని తరలించేందుకు ముందుకొచ్చిన వారికి బెదిరింపులు వచ్చినట్టు నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మిష్ చెప్పారు. చివరకు మాస్కో పరిధిలోని మేరినో జిల్లా బోరిసోవస్కోయీ శ్మశానవాటికలో నవాల్నీ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. జనం గుమికూడొద్దన్న ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరుచేస్తూ వేలాదిగా వేలాదిగా మద్దతుదారులు, ఉద్యమకారులు, అభిమానులు హాజరయ్యారు. మృతదేహాన్ని ఉంచిన మదర్ ఆఫ్ గాడ్ సూథీ మై సారోస్ చర్చిలో వేలాదిగా నివాళులర్పించారు. నవాల్నీ నవాల్నీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అమెరికా, ఫ్రాన్స్ రాయబారులు తదితరులు పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. అంత్యక్రియల్లో ఆంక్షలు అతిక్రమించిన వారికి శిక్షలు తప్పవని ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. -
నావల్నీ అంత్యక్రియలకు చర్చిలు నిరాకరించిన వేళ..
మాస్కో: ఇటీవల అనుమానాస్పదంగా జైలులో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు చర్చిలేవీ స్వచ్ఛందంగా ముందుకు రావడ లేదు. అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహిస్తారన్న భయమే ఇందుకు కారణమని నావల్నీ సంస్థ అధికార ప్రతినిధి ఆరోపించారు. ‘‘నావల్నీ పేరు చెప్పగానే ఇప్పటికే బుకింగ్ అయిపోయాయంటూ చాలా చర్చిల నిర్వాహకులు తప్పించుకున్నారు. ఎట్టకేలకు మాస్కో శివార్లలోని మేరీనో పట్టణంలో ఉన్న మదర్ ఆఫ్ గాడ్ క్వెంచ్ మై సారోస్ చర్చి నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు ముందుకొచ్చింది’’ అని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘వాస్తవానికి గురువారమే అంత్యక్రియలు పూర్తిచేద్దామనుకున్నాం. కానీ పార్లమెంట్‌ను ఉద్దేశిస్తూ పుతిన్ ప్రసంగం ఉండటంతో ఆ రోజు అంత్యక్రియలకు చర్చిలేవీ ముందుకు రాలేదు. అందుకే శుక్రవారం మధ్యాహ్నం ఖననం చేయనున్నాం’ అని చెప్పారు. -
‘నవాల్నీ’ మృతదేహం అతని తల్లికి అప్పగింత
మాస్కో: ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదస్పద స్థితిలో మృతి చెందన రష్యా ప్రతిపక్షనేత, అధ్యక్షుడు పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని మృత దేహాన్ని ఎట్టకేలకు అతని తల్లికి అప్పగించారు. అలెక్సీ నావల్ని మరణించిన వారం రోజులకు ఆయన మృతదేహాన్ని తన తల్లికి అప్పగించారు. ‘అలెక్సీ మృతదేహాన్ని అతని తల్లికి అప్పగించారు. ఆయన మృతదేహాన్ని తన తల్లికి అప్పగించాలని కోరిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు’ అని నవల్నీ ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు. Alexey's body was handed over to his mother. Many thanks to all those who demanded this with us. Lyudmila Ivanovna is still in Salekhard. The funeral is still pending. We do not know if the authorities will interfere to carry it out as the family wants and as Alexey deserves. We… — Кира Ярмыш (@Kira_Yarmysh) February 24, 2024 ఇటీవల.. నావల్ని మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని, ఎలాంటి అంతిమయాత్ర నిర్వహించడానికి వీలు లేదని తమపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందని నావల్ని తల్లి లియుడ్మిలా ఆవేదన వ్యక్తం చేశారు. పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేతగా పేరున్న జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నావల్నీ(47) జైలులోనే మృతి చెందారు. ఈ విషయాన్ని యమాలో నెనెట్స్ ప్రాంత జైలు సర్వీసు డిపార్ట్మెంట్ వెల్లడించింది. నావల్నీ పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో దోషిగా తేలడంతో 2021 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. చదవండి: నవాల్నీ మృతదేహం అప్పగింత కోసం తల్లి ఆవేదన -
Alexi Navalni: కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్
మాస్కో: రష్యాలోని జైలులో ఇటీవల వివాదస్పద స్థితిలో మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని కుటుంబాన్ని కూడా పుతిన్ ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సీ నావల్ని తమ్ముడు ఒలెగ్ నావల్నిపై గతంలో ఉన్న క్రిమినల్ కేసులకు తోడు అక్కడి ప్రభుత్వం తాజాగా మరో కేసు పెట్టింది. ఈ విషయాన్ని అక్కడి అధికారిక వార్తా ఏజెన్సీ టాస్ వెల్లడించింది. అయితే ఏ సెక్షన్‌పై ఎందుకు ఒలెగ్పై కేసు పెట్టారన్న వివరాలు తెలపలేదు. కేసు నమోదైన వెంటనే పోలీసులు ఒలెగ్ కోసం గాలింపు చేపట్టారు. ఒలెగ్ ఇప్పటికే పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఓ కేసులో ఒక ఫ్రాడ్ కేసులో ఒలెగ్‌కు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అప్పట్లో అన్న అలెక్సీపై ఒత్తిడి పెంచడానికి అతడి తమ్ముడు ఒలెగ్పై రష్యా ప్రభుత్వం అక్రమ కేసులు మోపిందనే ఆరోపణలున్నాయి. కాగా, మరోవైపు అలెక్సీ మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అలెక్సీ మరణానికి పుతినే కారణమన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అలెక్సీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన భార్య ఇప్పటికే ప్రతిజ్ఞ కూడా చేసింది. ఇదీ చదవండి.. పుతిన్ ప్రేమలో పడ్డారా.. ఆమెతో సన్నిహితంగా -
కనీసం చివరిచూపు చూసుకోనివ్వండి
మాస్కో: రష్యా మారుమూల జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు అలెక్సీ నవాల్నీ పార్థివదేహాన్ని వెంటనే అప్పగించాలని ఆయన తల్లి ఆవేదనతో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చనిపోయాక మృతదేహాన్ని వేరే చోటుకు తరలించామంటూ తల్లి, నవాల్నీ న్యాయవాదులను అటూ ఇటూ తిప్పుతూ అధికారులు తిప్పలు పెడుతున్నారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలు చేయిస్తేగానీ విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలియని పరిస్థితి. అందుకే కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించట్లేరనే వాదన వినిపిస్తోంది. మాస్కోకు 1,900 కిలోమీటర్ల దూరంలోని ఆర్కిటిక్ ధృవ సమీపంలో మంచుమయ మారుమూల కారాగారంలో శుక్రవారం నవాల్నీ మరణించిన విషయం తెల్సిందే. విషయం తెల్సి నవాల్నీ తల్లితో కలిసి న్యాయవాది కిరా యామిష్క్ ఆ జైలుకెళ్లారు. అక్కడ మృతదేహం లేదు. దర్యాప్తులో భాగంగా సలేఖర్డ్ సిటీకి తరలించామని అధికారులు చెప్పారు. తీరా అక్కడి సిటీ మార్చురీకి వెళ్తే మూసేసి ఉంది. ఇక్కడికి తీసుకురాలేదని అక్కడి అధికారులు చెప్పారు. ‘మరణానికి కారణాన్ని రష్యా ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. మృతదేహాన్ని అయినా అప్పగించాలి’ అని లాయర్ డిమాండ్‌చేశారు. -
Alexey Navalny: నిరసన గళం మూగబోయింది
మాస్కో: రష్యాలో మరో అసమ్మతి గళం శాశ్వతంగా మూగబోయింది. మూడేళ్లుగా నిర్బంధంలో ఉన్న విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు 47 ఏళ్ల అలెక్సీ నవాల్నీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ‘‘ఆయన శుక్రవారం ఉదయం వాకింగ్ అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయతి్నంచినా, తక్షణం అంబులెన్సు రప్పించినా లాభం లేకపోయింది’’ అని జైలు వర్గాలు తెలిపాయి. అయితే మరణానికి కారణమేమిటో బయట పెట్టలేదు. దశాబ్దానికి పైగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంట్లో నలుసుగా మారి ఆయనకు ప్రబల ప్రత్యర్థిగా ఎదిగిన నవాల్నీ మృతిపై తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది కచి్చతంగా ప్రభుత్వ హత్యేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో రష్యా అధ్యక్ష పదవి కోసం పుతిన్‌తో పోటీ పడేందుకు విఫలయత్నం చేసిన నవాల్నీ, నాటినుంచీ ప్రభుత్వ అవినీతిపై పోరును తీవ్రతరం చేశారు. పలు స్థాయిల్లో పెచ్చరిల్లిన అవినీతిని బయటపెడుతూ సంచలనం సృష్టిస్తూ వచ్చారు. దాంతో ప్రభుత్వం ఆయన్ను నిర్బంధించడమే గాక దేశద్రోహం తదితర అభియోగాలు మోపింది. 19 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న నవాల్నీని మాస్కో సమీపంలోని జైలు నుంచి గత డిసెంబర్లో దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలోని స్పెషల్ రెజీమ్ పీనల్ కాలనీకి తరలించారు. అతి శీతల ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ కాలనీ రష్యాలోకెల్లా అత్యంత కఠినమైన పరిస్థితులుండే కారాగారం. వచ్చే నెలలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలున్న నేపథ్యంలో ఇది కచి్చతంగా ఆయన గొంతు నొక్కే ప్రయత్నమేనని అభిమానులు అప్పుడే ఆందోళనలకు దిగారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌ను సవాలు చేసే గట్టి ప్రత్యర్థి లేకపోయినా ‘నవాల్నీ ఫ్యాక్టర్’ ఆయన్ను బాగా చీకాకు పరుస్తోంది. నవాల్నీ అనుయాయులతో పాటు నానాటికీ పెరిగిపోతున్న అభిమాన గణం సోషల్ మీడియా ద్వారా పుతిన్ వ్యతిరేక ప్రచారంతో దేశమంతటా హోరెత్తిస్తోంది. దేశ విదేశాల్లోని పుతిన్ అపార ఆస్తుల చిట్టాను కొద్ది రోజులుగా ఒక్కొక్కటిగా విప్పుతూ ఫొటోలు, వీడియోలతో సహా బయట పెడుతూ వస్తోంది. వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షలాది లైక్‌లు వచ్చి పడుతున్నాయి! ఈ నేపథ్యంలో నవాల్నీ ‘మృతి’ పుతిన్ పనేనని భావిస్తున్నారు. దీనిపై పాశ్చాత్య దేశాలన్నీ స్పందించాయి. పుతిన్ అణచివేతను నవాల్నీ ఆజన్మాంతం అత్యంత ధైర్యసాహసాలతో ఎదిరించారంటూ పలు దేశాధినేతలు కొనియాడారు. విషప్రయోగం జరిగినా... మూడున్నరేళ్ల క్రితం ప్రాణాంతక విషప్రయోగం జరిగినా వెరవని గుండె ధైర్యం నవాల్నీది! ఆయన 2020 ఆగస్టులో సైబీరియా పర్యటన ముగించుకుని తిరిగొస్తుండగా ‘నొవిచోక్’ దాడికి గురయ్యారు. రష్యాకే ప్రత్యేకమైన ఆ ప్రాణాంతక రసాయనాన్ని నవాల్నీ లో దుస్తులపై చల్లినట్టు తర్వాత తేలింది. నాడీ మండలాన్ని నేరుగా దెబ్బ తీసే నొవిచోక్ ప్రభావానికి విమానంలోనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అనుయాయులు హుటాహుటిన జర్మనీకి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. నెలల తరబడి చికిత్స తర్వాత కోలుకున్నాక పుతిన్‌పై ‘అండర్‌ప్యాంట్స్ (లో దుస్తుల) పాయిజనర్’ అంటూ చెణుకులు విసిరారు. దాంతో అండర్‌ప్యాంట్స్ పదబంధం ఒక్కసారిగా రష్యా సోషల్ మీడియాలో పాపులరైంది. దానిపై లెక్కలేనన్ని మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. నిర్బంధం ఖాయమని తెలిసి కూడా ఆరోగ్యం చక్కబడుతూనే 2021 జనవరిలో నవాల్నీ రష్యా తిరిగొచ్చారు. మాస్కోలో విమానం దిగీ దిగగానే ఆయన్ను నిర్బంధంలోకి తీసుకుని జైలుకు తరలించారు. చివరికి జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నవ్వుతూనే కన్పించారు... నవాల్నీ చివరిసారిగా గురువారం బయటి ప్రపంచానికి కన్పించారు. ఓ కేసు విచారణలో వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండటమే గాక సరదాగా నవ్వుతూ, విచారణ సందర్భంగా జడ్జితోనూ జోకులు వేస్తూ గడిపారు. సాహసమే శ్వాస... మాస్కో శివారు ప్రాంతమైన బుటిన్లో జని్మంచిన నవాల్నీ మాస్కోలో లా డిగ్రీ అనంతరం విదేశాల్లో పై చదువులు పూర్తి చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం ద్వారా పుతిన్ వ్యతిరేకునిగా తెరపైకి వచ్చారు. రష్యా చమురు, గ్యాస్ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసి వాటిలోని విచ్చలవిడి అవినీతిని బయట పెట్టారు. 2008 నుంచీ ఆయన పేరు క్రమంగా రష్యా అంతటా పాకింది. దాంతో 2012లో నవాల్నీ అరెస్టుల పర్వం మొదలైంది. 2014లో ఆశ్చర్యకరంగా జైలు నుంచి విడుదల చేయడంతో మాస్కో మేయర్ ఎన్నికల బరిలో దిగారు. ప్రచార మార్గాలన్నింటినీ మూసేసినా పుతిన్ బలపరిచిన అభ్యరి్థకి గట్టి పోటీ ఇవ్వడంతో నవాల్నీ పేరు మారుమోగిపోయింది. దాంతో ప్రభుత్వం మళ్లీ అరెస్టుల పర్వానికి తెర తీసింది. చివరికి 2018 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించడంతో ప్రజల దృష్టిలో నవాల్నీ మళ్లీ హీరోగా మారారు. రష్యాలో రెండు దశాబ్దాలుగా విపక్ష నేతలు, పుతిన్ విమర్శకులు, వ్యతిరేకులు నిర్బంధం పాలవడం, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పరిపాటిగా మారింది. విపక్ష నేత బోరిస్ నెమ్త్సోవ్ను 2015లో పుతిన్ అధికార నివాసం క్రెమ్లిన్ ప్రాసాదానికి కూతవేటు దూరంలోనే కాల్చి చంపారు. పుతిన్‌ను విమర్శించిన వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ 2023 ఆగస్టులో ‘విమాన ప్రమాదం’లో మరణించాడు. ప్రభుత్వంపై విమర్శలు చేసి అకాల మరణం పాలైన రష్యా కుబేరుల జాబితా చాలా పెద్దది. నవాల్నీ మాత్రం పుతిన్‌ను గట్టిగా సవాలు చేస్తూ ప్రబల ప్రత్యర్థిగా ఎదుగుతూ వచ్చారు. సోషల్ మీడియాను, స్వతంత్ర మీడియాను సమర్థంగా వాడుకుంటూ చెమటలు పట్టించారు. భౌతిక దాడులు, హత్యాయత్నాలను ఏమాత్రం లెక్కచేయని తీరు ఆయనకు అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించి పెట్టింది. నిరసనలు... ఆగ్రహావేశాలు నవాల్నీ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పుతిన్ పనేనంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. నవాల్నీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎవరినైనా అంతమొందించడం పుతిన్ నైజమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ దుయ్యబట్టారు. ఆయన సర్వం కోల్పోవడంతో పాటు తన తప్పిదాలకు బాధ్యునిగా శిక్ష అనుభవించి తీరాల్సిందేనన్నారు. నవాల్నీ తన అసమాన ధైర్యసాహసాలకు జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి రావడం బాధాకరమని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కొల్జ్ ఆవేదన వెలిబుచ్చారు. అడుగడుగునా ప్రాణాపాయం పొంచి ఉన్నా మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శించడం నవాల్నీకే చెల్లిందంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కొనియాడారు. ఆయన్ను రష్యా ప్రభుత్వమే క్రూరంగా పొట్టన పెట్టుకుందని లాతి్వయా అధ్యక్షుడు రింకేవిక్స్ ఆరోపించారు. తాను అత్యంత బలహీనుడినని ఈ చర్యతో పుతిన్ రుజువు చేసుకున్నారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. రష్యాలో స్వేచ్చా గళాలపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మండిపడ్డారు. సొంత ప్రజల అసమ్మతి పుతిన్‌ను విపరీతంగా వణికిస్తోందని మరోసారి రుజువైందని ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్ అన్నారు. పుతిన్ ఆదేశాల మేరకే నవాల్నీ హత్య జరిగిందని ప్రపంచ మాజీ చెస్ చాంపియన్, రష్యా విపక్ష నేత గారీ కాస్పరోవ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పుతినే బాధ్యుడు: భార్య నవాల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యూలియా నవాల్నయా అనుమానాలు వెలిబుచ్చారు. శుక్రవారం మ్యూనిచ్ భద్రతా సదస్సులో మాట్లాడుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అన్నారు. సదస్సులో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తదితర నేతలు ఆమెను ఓదార్చారు. -
మాల్దీవులు-భారత్ వివాదం ముగియాలంటే ఇదే మార్గం..!
మాలే: భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించడంపై ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు, డెమోక్రాటిక్ పార్టీ ఛైర్పర్సన్ ఫయ్యాజ్ ఇస్మాయిల్ చక్కని ఫార్ములా సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన వైఖరి ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా ద్వారానే ఇద్దరి వ్యక్తులు వివాదం రెండు దేశాల మధ్య వివాదంగా మారిందని అన్నారు. 'భారత్-మాల్దీవుల మధ్య వివాదం ప్రభుత్వాలను దాటిపోయింది. సోషల్ మీడియా ద్వారానే ఇరుదేశాల సామాన్య ప్రజలకు కూడా ఈ అంశం చేరింది. ఇరుపక్షాల నుంచి వాదించుకుంటున్నారు. ఒకరినొకరు అవమానించుకుంటున్నారు. ప్రధాని మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేయడంలో ప్రభుత్వానికి ఎలాంటి ఉద్దేశం లేదని మనం స్పష్టంగా తెలియజేయాలి. ప్రభుత్వంలో స్థానం కల్పించిన వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయలు మాత్రమేనని ఇరుపక్షాలకు తెలిపేలా చర్యలు తీసుకోవాలి' అని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వివాదం ఇరుదేశాల మధ్య సంబంధాలను, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందా? అని అడిగిన ప్రశ్నకు.. ఈ సమస్య ఇరుదేశాల ఆర్థిక ప్రయోజనాలకు మించినదని అన్నారు. ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వ నేతలు ఇండియా-మాల్దీవుల మధ్య మంచి బంధాలను ఏర్పరిచారని తెలిపిన ఇస్మాయిల్.. కేవలం ఇద్దరు వ్యక్తులు రెండు మెసేజ్‌లతో చెడగొట్టారని మండిపడ్డారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మళ్లీ నెలకొల్పడంపైనే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అది సహజమే.. ఇరుదేశాల్లో జాతీయవాదులు వైరుధ్యంగా మాట్లాడవచ్చు. భారత్ పాత్ర లేకుండానే మాల్దీవులు రాణించగలదని, అలాగే.. మాల్దీవులు చిన్న దేశం అని ఇరుపక్షాలు చెప్పవచ్చు. కానీ ఇది సరైన విధానం కాదు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుకోవడం మాత్రమే ప్రధానం.' అని ఇస్మాయిల్ అన్నారు. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చైనా పర్యటనపై స్పందించిన ఇస్మాయిల్.. ప్రభుత్వాలు మారినప్పుడు విదేశాంగ విధానం మారడం సహజమేనని చెప్పారు. గత తమ ప్రభుత్వంలో భారత్‌కు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం.. ప్రస్తుత ప్రభుత్వం చైనాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడంలో సమస్యేమి లేదని అన్నారు. ఒక్క ఇజ్రాయెల్ తప్పా.. ప్రపంచంలో అన్ని దేశాలతో మాల్దీవులు మంచి సంబంధాన్నే కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: మాల్దీవుల వివాదం.. భారత్‌పై చైనా మీడియా అక్కసు -
దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై దాడి
దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత దాడి లీ జే మ్యుంగ్ జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన బూసన్ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్ పోర్టు సైట్‌ను సందర్శించారు. అనంతరం లీ జే మ్యుంగ్ మీడియాతో మాట్లాడున్న సమయంలో పెద్ద సంఖ్యయలో యువకులు చుట్టూ చేరారు. ఒక్కసారిగా ఓ యువకుడు లీ జే మ్యుంగ్‌పై దాడి చేశాడు. కత్తి వంటి ఓ ఆయుధంతో ఆయన మెడపై బలంగా పొడిచాడు. దీంతో లీ జో కుప్పకూలిపోయాడు. వెంటనే స్పదించిన భద్రత అతన్ని అక్కడి నుంచి లాక్కువెళ్లి అరెస్ట్ చేశారు. లీ జే మ్యుంగ్ను స్థానికఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందాల్సి ఉంది. Footage showing the Stabbing Attack earlier against the Leader of the Democratic Party of South Korea, Lee Jae-myung while he was Speaking to a Crowd in the Southeastern City of Busan. pic.twitter.com/uEAabsxzmX — OSINTdefender (@sentdefender) January 2, 2024 దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రతిపక్ష నేత లీ జే పై జరిగిన దాడి ఘటనను దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిటం సరికాదని అన్నారు. అయితే 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీ యూన్ సుక్ యోల్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు -
పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీని తీవ్రవాదంతో సహా అనేక నేరాలపై ఇప్పటికే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించనున్నాయి క్రెమ్లిన్ వర్గాలు. ప్రాసిక్యూటర్లు అలెక్సి నవాల్నీపై మోపబడిన అదనపు కేసులు.. తీవ్రవాద సంస్థ ఏర్పాటు, నాజీ మద్దతుదారులకు పునరావాసం, తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా రెండు బహిరంగ సభలు, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా నవాల్నీ అవినీతి నిరోధక నిధి పేరిట మరో సంస్థను స్థాపించడం, మైనర్లను ఉగ్రవాదం వైపు నడిపించడం (నవాల్నీ సభలకు 18 సంవత్సరాల లోపు వారు హాజరైనందుకు), తీవ్రవాదానికి ఆర్ధికంగా ఊతమిచ్చేందుకు నిధులు సేకరించడం వంటి అభియోగాలను మోపారు. కొత్తగా నమోదైన కేసుల విషయమై నవాల్నీ స్పందిస్తూ ప్రజా జీవితానికి నన్ను దూరంగా ఉంచాలన్న కారణంతోనే మరిన్ని కేసులు మోపి మరో 20 ఏళ్ళ పాటు జైల్లోనే మగ్గిపోయేలా చేయాలని పుతిన్ నేతృత్వంలోని క్రెమ్లిన్ వర్గాలు చూస్తున్నాయన్నారు. తనను తీవ్రవాదిగా చిత్రీకరించి మొత్తంగా 35 ఏళ్ల జైలు శిక్ష విధించాలన్నదే రష్యా అధ్యక్షుడి అభిమతమని అన్నారు. జైల్లో ఉన్నా కూడా తన సోషల్ మీడియా ద్వారా అనుచరుల సాయంతో ఎప్పటికపుడు యాక్టివ్ గా ఉంటారు నవాల్నీ. కొత్త అభియోగాల విషయంలో క్రెమ్లిన్ పన్నుతున్న కుట్రను కూడా ఆయన సోషల్ మీడియాలో పొందుపరిచారు. స్వేచ్ఛతో కూడిన కొత్తదైన ధనిక రాజ్యానికి జన్మనివ్వాలంటే ప్రతి ఒక్కరూ అలాంటి రాజ్యం కోసం త్యాగం చేసి తల్లిదండ్రులు కావాలని కోరారు. ఇది కూడా చదవండి: మెక్సికోలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. మృతుల్లో భారతీయులు -
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మద్దతివ్వం
న్యూఢిల్లీ: ఇటీవల బీహార్‌లో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఆర్డినెన్స్ పై స్పందించిన విధానం నచ్చక బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో షాక్ ఇచ్చారు. విపక్షాలు తమ నాయకుడిగా రాహుల్ గాంధీని ఎంచుకుంటే మాత్రం తాము మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు ఆప్ నేత ప్రియాంక కక్కర్. ట్విట్టర్ వేదికగా ప్రియాంక కక్కర్ స్పందిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతివ్వకుంటే వారి నేతృత్వంలోని విపక్షాలతో మేము భాగస్వామ్యులము కాలేము. దేశం బాగుపడాలంటే మొదట కాంగ్రెస్ మరోసారి రాహుల్ గాంధీని నాయకుడిగా నిలబెట్టి విపక్షాలను కూడా అతడికి మద్దతివ్వమని అడగకూడదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించడం కంటే కూడా చాలా ముఖ్యమైన విషయమని రాశారు. అనుకుందొక్కటి.. అయినదొక్కటి.. బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతిస్తుందని కోటి ఆశలతో వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కు దానిపై కూలంకషంగా చర్చించి గాని నిర్ణయం తీసుకోలేమని రాహుల్ చెప్పిన సమాధానం రుచించలేదు. సమావేశం అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడకుండా ఢిల్లీ పయనమైన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తమకు మద్దతివ్వకుంటే వారితో కలిసి ప్రయాణించడం కష్టమని సందేశం పంపించారు. ఈ సమావేశానికి ఆప్ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, ఎంపీ సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా కూడా హాజరయ్యారు. సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని విభేధాలన్నిటినీ పక్కన పెట్టేసి కలిసి నడుద్దామని అభ్యర్ధించగా రాహుల్ మాత్రం ఆర్డినెన్స్ పై చర్చించడానికి ఒక పద్ధతుంటుందని తేలికగా చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై ఆప్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్టికల్ 370 రద్దుకు మీరు మద్దతిచ్చినప్పుడు కూడా మేము ఇలాగే బాధపడ్డామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. अगर देश बचाना है तो सबसे पहले कांग्रेस को बोल देना चाहिए की वो तीसरी बार भी Rahul Gandhi पर दाव नहीं लगायेंगे और समूचे विपक्ष पर ये दबाव नहीं डालेंगे। देश हित में ये संविधान बचाने से भी ऊपर है। — Priyanka Kakkar (@PKakkar_) June 24, 2023 ఇది కూడా చదవండి: మరో ప్రమాదం.. లూప్ లైన్లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్ -
ఎన్సీపీలో కలవరం.. అజిత్ పవార్ కొత్త డిమాండ్..
ముంబయి: ఎన్సీపీలో ప్రధాన బాధ్యతను సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లకు అప్పజెప్పుతూ శరద్ పవార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే..పార్టీ నిర్ణయానికి ఎదురుచెప్పలేక అప్పటికి సరే అని తలాడించిన అజిత్ పవార్.. ప్రస్తుతం కొత్త మెలిక పెట్టారు. పార్టీలో తనకు కొత్త బాధ్యత కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఎన్సీపీలో కొత్త కలవరం మొదలైంది. మహారాష్ట్ర అసెంబ్లీలో తనకున్న ప్రతిపక్ష నాయకుని బాధ్యత వద్దంటూ అధిష్ఠానానికి అజిత్ పవార్ తెగేసి చెప్పారు. ముంబయిలో జరిగిన 24 వ వసంతోత్సవ వేడుకల్లో ఈ మేరకు తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా పూర్తి న్యాయం చేస్తానని చెప్పారు. ప్రతిపక్ష నాయకునిగా మాత్రం పనిచేయలేనని తెలిపారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు అజిత్ పవార్. శివసేన పార్టీలో చీలికలు వచ్చి, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత గతేడాది జులై నుంచి అజిత్ పవార్ ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: న్యూయార్క్‌లో మోదీ యోగా ఈవెంట్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం -
ఇమ్రాన్ ఖాన్‌ను బహిరంగంగా ఉరితీయాలి: పాక్ ప్రతిపక్ష నేత
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను బహిరంగంగా ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రతిపక్ష నేత రాజా రియాజ్ అహ్మద్ ఖాన్. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టులపై కూడా విమర్శలు గుప్పించారు. ఇమ్రాన్‌ను జడ్జీలు అల్లుడిలా ట్రీట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్.. అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారని, యూధుల ఏజెంట్ అని తీవ్ర ఆరోపణలు చేశారు రియాజ్. ఈ ఉగ్రవాదులే పాక్ పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారని, దాడులు చేశారని పేర్కొన్నారు. కమాండర్ జిన్నా ఇంటిని కూడా తగలబెట్టారని మండిపడ్డారు. కోర్టులు ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఒకవేళ ఆయన అంతగా నచ్చితే జడ్జీలంతా వెళ్లి పీటీఐ పార్టీలో చేరాలని సెటైర్లు వేశారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్, పీటీఐ మద్దతుదారులు పాకిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న తెలిసిందే. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు, భవనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు చనిపోయారు. దీంతో ప్రజలంతా శాంతియుతంగా నిరసనల్లో పాల్గొనాలని ఇమ్రాన్‌ఖాన్ పిలుపునిచ్చారు. పోలీసులు పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. హింసకు పాల్పడింది ఒవరో నిర్ధారించుకోకుండా పీటీఐ శ్రేణలపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. చదవండి: అమ్మో హాజీ! పాకిస్తాన్ అండతో రెచ్చిపోతున్న డ్రగ్ కింగ్.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్... -
‘మహిళా పోలీస్ వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే’
సంబల్పూర్: ఒడిషాలో ప్రధాన ప్రతిపక్ష నేతకు, ఓ మహిళా పోలీస్ అధికారిణికి మధ్య వాగ్వాదం ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. బహిరంగంగా ఆమెపై ఆరోపణలు గుప్పించిన బీజేపీ నేత జయనారాయణ్ మిశ్రా.. ఆమెను ఒక్కసారిగా తోసేశాడు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆమెనే తనను తోసేసిందంటూ మిశ్రా సైతం ఫిర్యాదు చేశాడు. ఒడిషాలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు పిలుపు ఇచ్చింది బీజేపీ. ఈ క్రమంలో సంబల్పూర్ కలెక్టరేట్ వద్ద బుధవారం ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. అయితే ఆ సమయంలో మిశ్రాకు, ధనుపలి స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంచార్జ్ అనితా ప్రధాన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అది ఒక్కసారిగా తీవ్రంగా మారి.. ఆయన ఆమెను తోసేశాడు. అనితా ఏం చెప్తోందంటే.. ఆయన నన్ను చూసి.. లంచాలు తీసుకుంటావంటూ విమర్శించాడు. నన్నొక దొంగగా వ్యాఖ్యానించారు. ఎందుకలా విమర్శిస్తారని అడిగితే.. ముఖం మీద చెయ్యేసి తోసేశారు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. Presenting a super SANSKARI leader from Odisha. He assaulted the Lady Police Officer. Even threatened to burn her Police Station down. He is LOP #JaynarayanMishra of @BJP4Odisha . How much more Respect India can expect!! @Indian10000000 @TamilRatsaschi @cpimlliberation pic.twitter.com/pzdh9TbniJ — Parwez ପରୱେଜ (@parwezalli) February 15, 2023 అయితే మిశ్రా ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. బీజేపీ మహిళా కార్యకర్తలను వేధించడం గురించే ఆమెను ప్రశ్నించాను. అసలు ఆమె ఎవరో కూడా అంతకు ముందు నాకు తెలియదు. నేనేం ఆమెను తోసేయలేదు. ఆమెనే నన్ను తోసేసిందని చెప్తున్నారు. ఈ ఇద్దరి ఫిర్యాదు మీద సంబల్పూర్ ఎస్పీ గంగాధర్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, సమగ్ర నివేదిక వచ్చాకే ఏదైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారాయన. ఇక ఈ ఘటనను ప్రస్తావిస్తూ బీజేపీ.. నవీన్ పట్నాయక్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఓ అధికారి ఓ మంత్రిని కాల్చి చంపేశాడు. ఇప్పుడేమో ఓ పోలీస్ అధికారిణి ప్రతిపక్ష నేతపై దాడికి దిగింది. అసలు ఒడిషాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? అని నిలదీస్తోంది. మిశ్రా అసెంబ్లీలో ఎక్కడ ప్రభుత్వాన్ని కడిగిపారేస్తారేమోననే భయంతోనే ఇలాంటి చర్యలకు పోలీసులను వుసిగొల్పుతోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తోంది. మరోవైపు బీజేడీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. మిశ్రా మీద హత్య కేసుతో సహా 14 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడేమో దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని విమర్శిస్తోంది. -
బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్ యూటర్న్.. !
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కొనసాగించనుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే.. ఈ నిర్ణయంతో కాంగ్రెస్‌లో ‘ఒక వ్యక్తి.. ఒకే పదవి’ సిద్ధాంతానికి తూట్లు పొడిచినట్లు అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్ తీర్మానం ప్రకారం.. ఎవరికైనా ఇది వర్తిస్తుందని రాజస్థాన్ కాంగ్రెస్ ముసలం సమయంలో ఆ పార్టీ ఎంపీ, కీలక నేత రాహుల్ గాంధీ నొక్కి మరీ చెప్పారు. అయినప్పటికీ ఖర్గేనే కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుత నిబంధనల ప్రకారం మరో పదవిలో కొనసాగడానికి వీల్లేదు. కానీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి మరొకరికి ఇప్పటిదాకా ఎంపిక చేయలేదు కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ఆయనే ఇంకా ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఇక ముందు కూడా ఆయన్నే కొనసాగించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ స్ట్రాటజీ గ్రూప్ రేపు(శనివారం) సోనియా నివాసంలో భేటీ కానున్నారు. ఈ భేటీకి రాజ్యసభ నుంచి ఖర్గే, జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్ మాత్రమే హాజరు కానున్నారు. దిగ్విజయ్ సింగ్, పీ చిదంబరం ఇద్దరిలో ఒకరిని రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని తొలుత కాంగ్రెస్ భావించినందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ ఇద్దరినీ రేపటి భేటీకి ఆహ్వానించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ మినహాయింపు కేవలం ఖర్గేకు మాత్రమే పరిమితం కాలేదు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న అధిరంజన్ చౌదరీ.. బెంగాల్ పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఇక సీనియర్ నేత జైరామ్ రమేశ్ కూడా రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్‌గా, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. -
శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. నూతన ఆర్థిక మంత్రి రాజీనామా
Sri Lanka finance minister Ali Sabry resigned: శ్రీలంక అప్పుల ఊబిలో చిక్కుకుంది. నివేదికల ప్రకారం శ్రీలంకకి సుమారు రూ. 3 లక్షల కోట్ల విదేశీ అప్పు ఉంది. అందులో సుమారు 400 కోట్లు ఈ ఏడాది చెల్లించవలసి ఉంది. శ్రీలంక తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కుంటున్న తరుణంలో ఆర్థిక మంత్రి అలీ సబ్రీ ప్రమాణస్వీకారం చేసిన తదుపరి రోజే రాజీనామ చేశారు. ఆయన తన సోదరుడు బాసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రిగా తొలగించి న్యాయ మంత్రిగా ఉన్న అలీ సబ్రీని ఆర్థిక మంత్రిగా శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్సే నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సబ్రీ మాట్లాడుతూ...నేను ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పనిచేశానని నమ్ముతున్నాను. దేశ సమస్యలను పరిష్కరించడానికి సత్వర చర్యలు అవసరం అని ఆయన అన్నారు. నిజానికి సబ్రీ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో శ్రీలంక ఆర్థిక పరిస్థితిని చర్చించేందుకు ఈ నెలాఖరులో అమెరికాను సందర్శించాల్సి ఉంది. అయితే అధ్యక్షుడు గోటబయట రాజపక్సే పిలుపునిచ్చిన ఐక్యత ప్రభుత్వాన్ని ప్రతిపక్షం తిరస్కరించడంతో పాలక సంకీర్ణం మెజారిటీని కోల్పోయింది. దీంతో సబ్రీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఫ్రీడమ్ పార్టీ అధినేత మైత్రిపాల సిరిసేన మాట్లాడుతూ..‘మా పార్టీ ప్రజల పక్షాన ఉంది. స్వతంత్ర చట్టసభ సభ్యుల సహాయంతో శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికీ పనిచేయగలదు. కానీ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దాని సామర్థ్యం మరింత బలహీనపడింది.అని అన్నారు. అంతేగాక ప్రధాన మంత్రి మహింద్ర రాజపక్స క్యాబినెట్‌లోని మొత్తం 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. అదీగాక శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న రాజపక్స కుటుంబంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. ఈ క్రమంలో గత వారం శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్స ఇంటిని ముట్టడించేందుకు వందలాది మంది ప్రయత్నించారు కూడా. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన హింస కారణంగా డజనుకు పైగా జనాలు గాయపడ్డారు. తప్పనిసరై రాజపక్స జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే కాకుండా సైన్యానికి అరెస్టు చేసే అధికారాన్ని ఆదేశించారు. వారాంతంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కూడా విధించారు. ఇప్పటికే భారత్ సుమారు రూ. 200 కోట్ల క్రెడిట్ లైన్లు, దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ఇంధన సాయాన్ని అందించింది. (చదవండి: లంకలో కల్లోలం) -
పుతిన్‌ని వ్యతిరేకిస్తే ఖతం... జైల్లోనే మగ్గిపోయేలా ప్రతి పక్ష నాయకుడి పై కేసులు
President Vladimir Putin’s most ardent foe in prison: ఉక్రెయిన్ పై రష్యా గత మూడు వారాలకుపైగా ఘెరంగా విరుచుకుపడుతోంది. ఈ తరుణంలో రష్యా అధ్యుకుడికి సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచదేశాలు, ఆఖరికి అంతర్జాతీయ న్యాయ స్థానం సైతం యుద్ధం వద్దన్న తగ్గక పోవడంతో వ్లాదిమిర్ పుతిన్‌కి సంబంధిచిన వ్యక్తిగత వ్యవహార శైలి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ తన ప్రతిపక్ష నాయకుడిని కూడా అలాగే ఇబ్బుందులకు గురిచేసి జైలు పాలు చేశాడని అతని రాజకీయ విమర్శకులు అంటున్నారు వివరాల్లోకెళ్లే,....రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ పుతిన్‌కి పరమ బద్ద శత్రువని చెబుతున్నారు. అతని పై రష్యా అధికారులు సుదీర్ఘకాలం జైల్లో ఉండిపోయేలా కేసులు పెట్టారు. ఈ మేరకు రష్యా కోర్టు అలెక్సీ నవల్నీని ఛీటింగ్, కోర్టు దిక్కారాలకు పాల్పడినందుకు గానూ సుమారు 8 లక్షలు జరిమాన విధించడమే కాకుండా తోమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. నిజానికి నవాల్నీ పెరోల్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసు విషయమై రెండున్నర జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పడూ మళ్లీ తనకు ఫౌండేషన్ సంబంధించి డబ్బును అపహరించారని, విచారణ సమయంలో న్యాయమూర్తిని అవమానించారని ఆరోపణలతో శిక్ష విధించారు. అతను జర్మనీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే 2021లో అరెస్టు చేశారు. ఆ తర్వాత రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. తదనంతరం అతని సహచరులను, మద్దతుదారులను అణిచివేయడమే కాకుండా నేరారోపణలు చేయడం మొదలు పెట్టారు. దీంతో వాళ్లు రష్యాని వదిలి వెళ్లిపోయారు. నిజానికి నవల్నీ అవినీతిపై పోరాడేందుకు ఒక ఫౌండేషన్‌ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు పుతిన్ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టేవాడు. దీంతో రష్యా అధికారులు అతనిని అణిచివేసేలా కేసులు పెట్టి కటకటాల్లో ఉండేలా చేశారు. అంతేకాదు అతని ఫౌండేషన్‌కి సంబంధించిన దాదాపు 40 ప్రాంతీయ కార్యాలయాల నెట్వర్క్ తీవ్రవాదంగా నిషేధించారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు సుదీర్ఘం కాలంలో జైల్లో మగ్గిపోయాలా శిక్షలు విధించారు. నవల్నీ మద్దతుదారులు ఇది రాజకీయ కుట్ర అని, అతనిపై కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. (చదవండి: హిట్లర్ నుంచి మిస్ అయినా.. పుతిన్ చేతిలో ఖతమయ్యాడు!) -
పాక్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
ఇస్లామాబాద్: దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించలేకపోయిందంటూ పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మంగళవారం అసమ్మతి తీర్మానం ప్రవేశపెట్టాయి. పీఎంఎల్– నవాజ్, పీపీపీ పార్టీలకు చెందిన 100మంది సభ్యులు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. ఈ తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్‌కు సమర్పించినట్లు పీఎంఎల్ఎన్ ప్రతినిధి ఔరంగజేబు తెలిపారు. పాక్ ప్రజల కోసమే ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ అధినేత షెబాజ్ షరీఫ్ చెప్పారు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత తమలో ఎవరు పదవిని అధిరోహించాలనే విషయంపై చర్చలు జరుపుతామన్నారు. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానానికి కనీసం 68 మంది మద్దతుండాలి. సరిపడ సభ్యుల మద్దతులో లేఖ అందితే 3– 7 రోజుల్లో స్పీకర్ సభను సమావేశపరిచి తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం సభలో సభ్యుల సంఖ్య 342 కాగా, తీర్మానం నెగ్గేందుకు 172మంది సభ్యుల మద్దతు అవసరం. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇమ్రాన్ సొంత పార్టీ టీఐఐకి 155మంది సభ్యులుండగా మరో ఆరు చిన్నపార్టీలు, ఒక స్వతంత్రుడు మద్దతిస్తున్నారు. ప్రతిపక్షాలన్నింటికీ కలిపి 163 మంది సభ్యులున్నారు. అధికార కూటమి నుంచి 28మందికి పైగా సభ్యులు తమకు మద్దతిస్తారని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ఇమ్రాన్‌కు పాక్ ఆర్మీ మద్దతున్న నేపథ్యంలో తీర్మానం నెగ్గడం అంత సులభం కాదని నిపుణుల అంచనా. పాక్‌లో ఆర్మీ ప్రభావం ప్రభుత్వాలపై అధికం. తన ప్రభుత్వం పడిపోదని తాజాగా ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: మా దేశం ఇక నాటో సభ్యత్వం గురించి ఆశించదు) -
రష్యాకు అమెరికా వార్నింగ్.. అదే గనుక జరిగితే..
వాషింగ్టన్: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(44) ఆరోగ్య పరిస్థితిపై అమెరికా స్పందించింది. ఒకవేళ ఆయన గనుక జైలులో మరణించినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ సీఎన్ఎన్తో మాట్లాడుతూ... ‘‘మిస్టర్ నావల్నీకి ఏం జరిగింది, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందన్న అంశం గురించి రష్యా ప్రభుత్వంతో మాట్లాడాము. కస్టడీలో ఆయనకు ఏమైనా జరిగితే అంతర్జాతీయ సమాజానికి జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేశాం. ఆయన పోలీస్ కస్టడీలో మరణిస్తే, రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించాలన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నాం. అయితే వీటన్నింటినీ ఇప్పుడే బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ మిస్టర్ నావల్నీ మృతి చెందితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, యూరోపియన్ యూనియన్ సైతం నావల్ని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ‘‘నావల్నిని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత రష్యా అధికారులపై ఉంది. ఏదైనా జరగరానిది జరిగితే వాళ్లు జవాబుదారీగా ఉండాల్సిందే’’అని ఈయూ విదేశాంగ విధాన విభాగం అధినేత జోసెఫ్ బారెల్ ట్వీట్ చేశారు. కాగా పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించే అలెక్సీ నావల్నీ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాననీ, కాళ్లలో స్పర్శ కోల్పోయానని వ్యక్తిగత వైద్యులను అనుమతించాలంటూ నావల్నీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇందుకు సానుకూల స్పందన రాకపోవడంతో మూడు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఆయన ఏ క్షణంలోనైనా మరణించే అవకాశం ఉందని నావల్నీ పర్సనల్ డాక్టర్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తిన నేపథ్యంలో, రష్యా నుంచి తమ రాయబారిని వెనక్కి పంపించే యోచనలో బైడెన్ ప్రభుత్వం ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా, ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి రష్యా పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను తరలించడంపై జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసిన ఆయన, ఉద్రిక్తతలను నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. చదవండి: రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యం విషమం: ‘ఏ క్షణంలోనైనా మృతి’ -
రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యం విషమం.. ‘ఏ క్షణంలోనైనా మృతి’
మాస్కో: రష్యా ప్రతిపక్ష నేత, అధ్యక్షుడు పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించే అలెక్సీ నావల్నీ(44) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నావల్నీ మూడు వారాలుగా నిరాహార దీక్ష కొనసాగిస్తుండటంతో ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణిస్తోందని ఆయన వ్యక్తిగత వైద్యుడు యరోస్లావ్ అషిఖ్మిన్ వెల్లడించారు. ఆయన ఏ క్షణంలోనైనా తుదిశ్వాస విడిచే ప్రమాదముందన్నారు. కుటుంబసభ్యులు అందజేసిన నావల్నీ వైద్య పరీక్షల రిపోర్టులు పరిశీలిస్తే.. రక్తంలో పొటాషియం, క్రియాటినిన్ స్థాయిలు పెరిగిపోయాయనీ, ఇది గుండెపోటుకు, కిడ్నీల వైఫల్యానికి దారితీస్తుందన్నారు. కాగా విష ప్రయోగం అనంతరం జర్మనీలో 5 నెలలపాటు చికిత్స పొంది జనవరిలో స్వదేశం చేరుకున్న నావల్నీని అధికారులు అరెస్ట్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై కోర్టు ఆయనకు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే, వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాననీ, కాళ్లలో స్పర్శ కోల్పోయానని వ్యక్తిగత వైద్యులు అనుమతించాలంటూ చేసిన నావల్నీ వినతిని జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు. చదవండి: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత: పుతిన్‌కు బైడెన్ ఫోన్ -
వేల సంఖ్యలో రష్యన్లు అరెస్ట్
మాస్కో: ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ విడుదలను డిమాండ్ చేస్తూ వేల సంఖ్యలో అతని మద్దతుదారులు ఆదివారం మాస్కో వీధుల్లోకి చేరారు. భారీ సంఖ్యలో ప్రజలు రోడ్డెక్కడంతో అప్రమత్తమైన రష్యన్ అధికారులు 1000 మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలను చూడలేదని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అవినీతిపై అను నిత్యం విమర్శలు చేసే 44 ఏళ్ల అలెక్స్ నవాల్నీపై ఐదు నెలల క్రితం ఓ విమానంలో విషప్రయోగం జరగడంతో అతను కోమాలోకి వెళ్లాడు. రష్యాలో అతనికి సరైన చికిత్స అందదన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన అతని మద్దతుదారులు అతన్ని జర్మనీకి తరలించి చికిత్సనందించారు. అనంతరం కోలుకున్న ప్రతిపక్ష నాయకుడు ఐదు నెలల తరువాత జనవరి 17న మాస్కోకు తిరిగి వచ్చారు. అయితే గతంలో నమోదైన మనీ లాండరింగ్ కేసులో రష్యా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్న అతని మద్దతుదారులు గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళలకు దిగారు. -
ప్రధానికి హత్యా బెదిరింపులు.. సంచలన తీర్పు
చిట్టగాంగ్: బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉపాధ్యక్షుడు గైసుద్దీన్ ఖాదర్ చౌదరికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ చిట్టగాంగ్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను చంపేస్తానని గత ఏడాది గైసుద్దీన్ ఖాదర్ చౌదరి బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ బెదిరింపు వ్యాఖ్యలపై అధికార ఆవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి నిజాముద్దీన్ ముహురీ కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారించిన చిట్టాగాంగ్ కోర్టు.. ఆరోపణలు నిజమేనని రుజువుకావడంతో గత ఏడాది మే 31వతేదీన గైసుద్దీన్ అరెస్టుకు వారంట్ జారీ చేసింది. తాజాగా తుది తీర్పును వెలువరించిన ధర్మాసనం.. సాక్షాత్తూ ప్రధానమంత్రిని చంపేస్తానని బెదిరించిన గైసుద్దీన్ కు మూడేళ్ల జైలు శిక్షతోపాటు ఐదువేల బంగ్లాదేశీ టాకాలను జరిమానాగా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. జరిమానా చెల్లించకుంటే మరో మూడు నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తెలిపింది. -
సుష్మా స్వరాజ్ రోజుకో రంగు చీర
2009–14 మధ్య (15వ లోక్‌సభ) కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉండగా, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు ప్రధానిగా మన్మోహన్, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ ఉన్న సమయంలో వారిరువురి మధ్య పలు కవితా యుద్ధాలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాలతో 15వ లోక్‌సభ సమావేశాల్లో అనేకసార్లు అసహ్యకర పరిస్థితులు తలెత్తాయి. అయితే కొన్నిసార్లు మన్మోహన్, సుష్మలు.. ఒకరిపై ఒకరు కవితాత్మకంగా చేసుకున్న విమర్శలు సభ్యులను ఉల్లాసపరిచాయి. వారిద్దరి హాస్య చతురత అందరికీ గుర్తుండేలా చేశాయి. ఓ సారి మన్మోహన్ మాట్లాడుతూ, మీర్జా ఘాలిబ్ రాసిన ప్రఖ్యాత కవితను చదివారు. ‘హమ్ కో ఉన్ సే వఫా కీ హై ఉమ్మీద్, జో నహీన్ జాన్తే వఫా క్యా హై’ (విశ్వాసం అనే పదానికి అర్థం కూడా తెలియని మనుషుల దగ్గరి నుంచి మేం విశ్వాసాన్ని ఆశిస్తున్నాం) అని మన్మోహన్ అనగా, సుష్మ దీనికి స్పందిస్తూ, బషీర్ బద్ర్ కవితతో సమాధానం ఇచ్చారు. ‘కుచ్ తో మజ్బూరియా రహీ హోంగీ, యూం హీ కోయీ బేవఫా నహీ హోతా’ (కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉండుండాలి. ఏ కారణమూ లేకుండా ఊరికే ఎవ్వరూ నమ్మిన వారిని మోసం చేయరు) అని సుష్మ బదులిచ్చారు. ఆ వెంటనే మన్మోహన్‌ను ఉద్దేశించి సుష్మ మరో కవిత చదువుతూ ‘తుమ్హే వఫా యాద్ నహీ, హమే జఫా యాద్ నహీ; జిందగీ ఔర్ మౌత్ కే తో దో హీ తరణే హై, ఏక్ తుమ్హే యాద్ నహీ, ఏక్ హమే యాద్ నహీ’ (నా విశ్వాసాన్ని మీరు గుర్తుంచుకోరు. మీకు విశ్వాసం లేకపోవడాన్ని నేను గుర్తుంచుకోను. జీవితంలో రెండే పాటలు ఉన్నాయి. ఒకటి మీరు గుర్తుంచుకోరు. ఇంకోటి నాకు గుర్తుండదు) అని చెప్పడంతో సభ్యులంతా ప్రశంసించారు. ఇలాంటి సందర్భాలు 15వ లోక్‌సభలో ఎన్నో ఉన్నాయి. వచ్చి మీ రూపాయి తీసుకోండి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి తనకు చేసిన ఫోన్ కాల్‌ను, మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని సాల్వే కంట తడి పెట్టారు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన ఆమె అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేకపోయారని అన్నారు. గుండెపోటుకు అరగంట ముందు, మంగళవారం రాత్రి 8:50 గంటల ప్రాంతం లో సుష్మా హరీష్‌కి కాల్ చేసి మాట్లాడారు. . ‘మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఉద్వేగపూరితమైనది. ఒక్క రూపాయి నేను నీకు ఇవ్వాల్సి ఉంది. వెంటనే వచ్చి తీసుకోండి’ అని ఆమె చెప్పారని ఆయన అన్నారు. ‘‘నిజంగానే ఆ రూపాయి ఎంతో విలువైనది. ఎందుకంటే అది ఒక లాయర్‌గా నాకు ఆమె చెల్లించే ఫీజు. అందుకే తప్పకుండా వచ్చి తీసుకుంటా’ అని నేను చెప్పాను. ‘ సరే బుధవారం సాయంత్రం 6 గంటలకల్లా వచ్చి ఆ రూపాయి తీసుకోండి’ అని ఆమె చెప్పారు. ‘నేను సరే’ అనడంతో ఆమె ఫోన్ పెట్టేశారు. సుష్మాతో అవే చివరి మాటలవుతాయని ఊహించలేకపోయానని సాల్వే గద్గద స్వరంతో చెప్పారు. ఆ రూపాయి కథేంటంటే.. పాక్ జైల్లో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో సాల్వే వాదించారు. అందుకు ఆయన భారత ప్రభుత్వం దగ్గర కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకుంటానని చెప్పారు. ఈ కేసులో ఆయన గెలవడంతో జాదవ్ ఉరి ఆగింది. భారత్ తరఫున సాల్వేను నియమించినప్పుడు విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ ఉన్నారు. రోజుకో రంగు చీర సుష్మా స్వరాజ్‌కు ఓ వైవిధ్యమైన అలవాటు ఉంది. వారంలో ఏ రోజు ఏ రంగు చీర కట్టుకోవాలనే దానిపై ఆమె కొన్ని నిబంధనలను పెట్టుకున్నారు. ప్రతి సోమవారం ముత్యపు తెలుపు రంగు లేదా క్రీమ్ కలర్ చీరలు, మంగళవారాల్లో ఎరుపు, కాషాయం లేదా దొండపండు రంగు చీరలు, బుధవారాల్లో ఆకుపచ్చ రంగు, గురువారాల్లో పసుపుపుచ్చ రంగు, శుక్రవారాల్లో బూడిద లేదా వంగపూత రంగు, శనివారాల్లో నీలం లేదా నలుపు రంగు చీరలను ఆమె ధరించేవారు. ఆదివారం ఏ రంగు దుస్తులు వేసుకోవాలనేదానిపై ప్రత్యేకమైన నిబంధనలేమీ ఉండేవి కావు. దాదాపు గత రెండు దశాబ్దాలపాటు ఆమె ఈ అలవాటును పాటించారు. ఇలా రోజుకో రంగు చీర ధరించేందుకు జ్యోతిష్యం లేదా మూఢనమ్మకాలు కారణం కాదనీ, కేవలం అది తన అలవాటని సుష్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లువాలియాకు కూడా ఇలాంటి అలవాటే ఉంది. సిక్కు అయిన ఆయన, రోజుకో రంగు తలపాగాను ధరిస్తారు. -
సంఖ్యే ముఖ్యం... శాతం కాదు
పదిహేడో లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి చర్చనీయాంశమయింది. విపక్షాల్లో ఎక్కువ మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకే ప్రతిపక్ష నేత పదవి దక్కాలని కొందరు అంటోంటే, మొత్తం సీట్లలో కనీసం పది శాతం సీట్లు సాధించిన పార్టీకే ఆ పదవి దక్కుతుందని, కాంగ్రెస్‌కు పది శాతం సభ్యులు లేరు కాబట్టి ప్రతిపక్ష నేత పదవిని కోరే హక్కు లేదని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే, ప్రతిపక్ష నేత పదవి అన్నది చట్టబద్ధమైన హోదా అని, పది శాతం నిబంధన చట్టంలో ఎక్కడా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శాతంతో సంబంధం లేకుండా లోక్‌సభలో ఎక్కువ మంది సభ్యులున్న ప్రతిపక్ష సభ్యునికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి తీరాలని వారు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా కోరే పార్టీకి లోక్‌సభలో ఎక్కువ మంది సభ్యులున్నారా లేదా అన్నదే స్పీకర్ చూడాలి కాని ఎంత మంది లేదా ఎంత శాతం అన్న లెక్క వేసే అధికారం స్పీకర్‌కు లేదని వివరిస్తున్నారు. బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థలో అయితే విపక్ష నేతను ‘షాడో ప్రైమ్ మినిస్టర్’గా పేర్కొంటారు. ఒకవేళ అధికార పక్షం పార్లమెంటులో మెజారిటీ కోల్పోతే వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఈ విపక్ష నేత సిద్ధంగా ఉంటారు. అందుకే విపక్ష నేతను షాడో ప్రధానమంత్రిగా పేర్కొంటారు. స్పీకర్‌దే తుది నిర్ణయం మన పార్లమెంటరీ విధానంలో ఉభయ సభల్లోనూ విపక్ష నేత పదవి చట్టబద్ధమైనది. 1977 నాటి ‘పార్లమెంటులో విపక్ష నేతల జీత, భత్యాల చట్టం’ ఈ పదవిని నిర్వచించింది. లోక్‌సభ/రాజ్యసభలో ప్రతిపక్షాల్లో దేనికి ఎక్కువ మంది సభ్యులుంటే ఆ పార్టీ సభ్యుడు విపక్ష నేత అవుతారని, ఆ సభ్యుడిని విపక్ష నేతగా స్పీకర్/రాజ్యసభ చైర్మన్ గుర్తించాలని ఆ చట్టం నిర్దేశించింది. ఎక్కువ మంది అని చెప్పిందే కాని ఎంత శాతం అన్నది చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ ప్రతిపక్షాల్లో ఒకటి కంటే ఎక్కువ పార్టీలకు సమాన సంఖ్యలో సభ్యులు ఉన్నట్టయితే, వాటిలో ఏదో ఒక పార్టీ సభ్యుడిని విపక్ష నేతగా స్పీకర్ గుర్తించవచ్చని, ఈ విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమని ఆ చట్టం స్పష్టం చేస్తోంది. సభలో ఎక్కువ మంది సభ్యులున్న ప్రతిపక్షం తమ పార్టీ సభ్యుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేయాలి. ఆ అభ్యర్థనను పరిశీలించిన స్పీకర్ ఆ పార్టీ పేర్కొన్న వ్యక్తికి విపక్ష నేతగా గుర్తింపు ఇస్తారు. సంఖ్యాపరంగా పెద్ద పార్టీకి విపక్ష నేత హోదా కోరే హక్కుందని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. ఏది పార్టీ... ఏది గ్రూప్ చట్టం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు విపక్ష నేత హోదా గురించి ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది. 1950 దశకంలో స్పీకరు పార్లమెంటులో ప్రతిపక్షాలను సభ్యుల సంఖ్య ఆధారంగా కొన్నింటిని పార్టీలుగా, కొన్నింటిని గ్రూపులుగా గుర్తించడం మొదలైంది. సభలో సీట్లు, చర్చల్లో సమయం, పార్టీ లకు గదులు కేటాయించడం కోసం అప్పట్లో ఈ పద్ధతిని అనుసరించారు. మొత్తం సీట్లలో పది శాతం సీట్లు సాధించిన రాజకీయ పక్షాన్ని పార్టీ అని, అంతకంటే తక్కువ శాతం సీట్లు ఉన్నదాన్ని గ్రూప్ అని వర్గీకరించారు. అప్పటి నుంచి పది శాతం అన్నది నిబంధనగా మారిపోయింది. 1977లో జీత భత్యాల చట్టం ఈ విషయంలో సందేహానికి, గందరగోళానికి తెరదించింది. ఢిల్లీ అసెంబ్లీలో ముగ్గురున్నా... రాజ్యాంగంలోని పదో షెడ్యూలు పార్టీ ఫిరాయింపు నిరోధక నిబంధనలు తెచ్చింది. దాని ప్రకారం సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా సభలో ఉండే ప్రతి రాజకీయ పక్షాన్ని పార్టీగానే పరిగణిస్తున్నారు. ఒక సభ్యుడున్న పక్షాన్ని కూడా పార్టీగానే గుర్తిస్తున్నారు. ఢిల్లీ శాసనసభలో సభ్యులు 70 మంది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి ముగ్గురే సభ్యులున్నారు. పదిశాతం నిబంధన ప్రకారం ఆ పార్టీకి విపక్షనేత హోదా రాకూడదు. అయితే, స్పీకర్ రామ్ నివాస్ గోయల్ బీజేపీకి ఆ గుర్తింపు ఇచ్చారు. -
ఏపీ ప్రతిపక్షనాయకుడు ఎవరు?
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం.. ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఈ నెల 30న ముహుర్తం ఖరారు కావడం తెలిసిందే. అయితే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన టీడీపీ నుంచి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరుంటారనే అంశంపై టీడీపీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకున్న సమయానికి ఆ పార్టీ కేవలం 24 సీట్లకే పరిమితమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు మినహా హేమాహేమీలు ఫ్యాన్ సుడిగాలికి కొట్టుకుపోయారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు ఈ సారి ఘోర పరాజయం పొందారు. ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలను మరో సీనియర్‌కు అప్పగిస్తారనే అభిప్రాయం పార్టీలో అంతర్గతంగా వ్యక్తం అవుతోంది. చంద్రబాబు రాజకీయ అనుభవమంత వయసున్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనుండటం.. రేపటి రోజున సభలో సభానాయకుడిని ఎదుర్కునే విషయంలో చంద్రబాబు ఇబ్బందికరంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకుడిగా తన స్థానంలో మరో సీనియర్ని నియమించి తాను తప్పుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. -
ఎన్నికల ప్రచారం.. షురూ !
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రం ప్రభుత్వం దాదాపు 9 నెలల ముందుగానే రద్దు కావడం.. ఆ వెనువెంటనే టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. ఆయా ప్రతిపక్ష పార్టీల తరఫున ఇంకా అభ్యర్ధులను ఖరారు చేయకున్నా.. అపుడే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రచారం పోటా పోటీగా మొదలైంది. టీఆర్ఎస్ కోదాడ, హుజూర్‌నగర్‌లో తప్ప మిగిలిన పది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ, ఇతర పార్టీలన్నీ ఇంకా పొత్తులపై ఎటూ నిర్ణయించుకోలేదు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి. చివరకు కాంగ్రెస్ సైతం అభ్యర్థుల విషయంలో ఉలుకూ పలుకూ లేకుండానే ఉంది. మరోవైపు సీపీఐ, టీడీపీ, బీజేపీ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జనసమితి పార్టీలు తాము పోటీ చేయబోయే స్థానాలపై కానీ, అభ్యర్థుల విషయంగా కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, శాసన మండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు రోజుల కిందటే ప్రచారం మొదలుపెట్టారు. కొన్నింటిని మినహాయిస్తే, మెజారీటీ నియోజకవర్గాల్లో ప్రచారం షురూ అయ్యింది. దేవాలయాల్లో పూజలతో ప్రచారానికి శ్రీకారం టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కానీ కోదాడ, హుజూర్‌నగర్‌లో ఎలాంటి కదలికా లేదు. అసమ్మతి గళాలు ఎక్కువగా వినిపిస్తున్న మిర్యాలగూడలోనూ చడీ చప్పుడు లేదు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహయ్య ఇప్పటికే పూజలు చేసి ప్రచారం మొదలు పెట్టారు. దేవరకొండ టీఆర్ఎస్ అభ్యర్ధి రమవాత్ రవ్రీందకుమార్ శుక్రవారమే చింతపల్లి సాయిబాబా దేవాయలంలో పూజలు చేసి బైక్ ర్యాలీతో ప్రచారంలోకి దిగారు. మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారంలో మునిగిపోయాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శనివారం అంథోల్ మైసమ్మ గుడిలో అపద్దర్మ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పూజలు చేశారు. కాంగ్రెస్ తరఫున తానే బరిలోకి దిగుతున్నానని ప్రకటించిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రెండు రోజులుగా ఆయా మండలాల్లో ప్రచారం చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు టీఆర్ఎస్ అభ్యర్థులు పూజలతో ప్రచారంలోకి దిగారు. తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ శనివారం అర్వపల్లి దేవాలయంలో పూజలు చేసి రెండు మండలాల్లో ప్రచారం చేశారు. అపద్దర్మ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శనివారం జిల్లా సరిహద్దులోని అంథోల్ మైసమ్మ గుడిలో పూజలు చేశాక, సూర్యాపేట చేరుకుని ప్రచార ఢంకా మోగించారు. నకిరేకల్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ప్రచారంలో దిగాయి. టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం రెండు రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా టికెట్ ప్రకటించకున్నా, పార్టీ ఇన్చార్జిగా ఉన్న చిరుమర్తి లింగయ్య సైతం శుక్రవారమే ప్రచారంలోకి దిగారు. నల్లగొండ నియోజకర్గంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారమే దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి కనగల్ మండలంలోప్రచారం మొదలు పెట్టారు. శనివారం తిప్పర్తి మండలంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి శనివారం హైదరాబాద్ రోడ్‌లోని మర్రిగూడ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. పార్టీలో ఉన్న సీనియర్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఆయన ప్రచార రథం జిల్లా కేంద్రంలో వీధుల్లో ప్రచారం చేస్తోంది. బీజేపీ ప్రచార రథం సైతం నల్లగొండలో రోడ్లపైకి ఎక్కింది. మంచి రోజులు, ముహూర్త బలం, సెంటిమెంటు ఉన్న దేవాలయాలు చూసుకుని పూజలతో ప్రచారం మొదలు పెట్టారు. -
ఏసీబీ ముందు గోవా ప్రతిపక్షనేత హాజరు
పణజి: గోవా ప్రతిపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చంద్రకాంత్ కావ్లేకర్ శుక్రవారం రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ముందు హాజరయ్యారు. అక్రమంగా ఆస్తులు సంపాదించారని గత సంవత్సరం ఆయనపై, ఆయన భార్య సావిత్రిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల ఫిబ్రవరి 5న కావ్లేకర్‌కు విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు సమన్లు జారీ చేశారు. కానీ రాబోయే అసెంబ్లీ సెషన్స్ కారణంగా తాను తీరిక లేకుండా ఉన్నానని ఐదో తారీఖున రాలేకపోతున్నానని ఇదివరకే తెలిపారు. తాను అమాయకుడినని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలనీ, విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని చంద్రకాంత్ తెలిపారు. కావ్లేకర్ ఇప్పటికే స్థానిక కోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాడు. ఫిబ్రవరి 12 వ తేదీ వరకు అతన్ని అరెస్టు చేయకుండా కోర్టు నుంచి అనుమతి పొందాడు. 2007 జనవరి నుంచి 2013 ఏప్రిల్ మధ్యకాలంలో గోవా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి కేరళలో ఆస్తులు కొనుగోలు చేశారని ఆయనపై అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు. -
ఏపీ మండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి
-
ఏపీ మండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కాంగ్రెస్ నాయకుడు సి. రామచంద్రయ్య ప్రతిపక్ష నేతగా ఉండేవారు. అయితే ఆయన పదవీకాలం ముగియడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కూడా ఎవరూ ఎన్నిక కాలేదు. దాంతో ప్రతిపక్ష నాయకుడిని ఎంచుకునే అవకాశం వైఎస్ఆర్సీపీకి వచ్చింది. సీనియర్ నాయకుడైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. -
‘ప్రతిపక్ష నేతగా ఎప్పటికీ ఆయనే ఉండాలి’
వచ్చేసారి నువ్వే ప్రతిపక్ష నేత అవుతావేమో: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండేలా ఆయనను ఆశీర్వదించండి’ అని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డిని ఉద్దేశించి నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి దీటుగా జానారెడ్డి స్పందిస్తూ ‘ప్రజలు ఎప్పుడు, ఎట్లా తీర్పునిస్తారో తెలియదు. వచ్చేసారి ప్రతిపక్ష నేత స్థానంలో నువ్వే ఉంటావేమో. అప్పటివరకు ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు’ అని వ్యాఖ్యానించారు. ధర్మపురి నుంచి కొంతమంది అర్చకులు సీఎం కేసీఆర్ ను కలవడానికి వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావును కలసి, శాలువాను కప్పి, ఆశీర్వదించారు. హరీశ్‌తో కలసి చాంబర్ నుంచి బయటకు వచ్చిన అర్చకులకు సభకు వస్తున్న జానారెడ్డి ఎదురయ్యారు. దీంతో జానారెడ్డికి కూడా శాలువాను కప్పి ఆశీర్వదించారు. -
అడుగుడుగునా అభిమానం..
జనహృదయ నేతకు ఘనస్వాగతం కరచాలనం చేసేందుకు పోటీపడిన యువత జయంతి(వీరులపాడు) : పుష్కర మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్రప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పుష్కర స్నానానికి వెళ్లి మృతి చెందిన నందిగామ నగేష్ కుటుంబసభ్యులను పరామర్శించడానికి గురువారం ఆయన వీరులపాడు మండలం జయంతి గ్రామానికి వచ్చారు. జగన్ గ్రామానికి వస్తున్నారని తెలియటంతో ఆయనను చూసేందుకు ప్రజలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామస్తులు, నాయకులు గ్రామ శివారులోనే జగన్‌కు స్వాగతం పలికి మృతుని నివాసం వద్దకు తీసుకెళ్లారు. దారి పొడవునా జగన్‌తో కరచాలనం చేసేందుకు యువత ఒకరికొకరు పోటీ పడ్డారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు ఆధ్వర్యంలో పార్టీ మండల కన్వీనర్ కోటేరు ముత్తారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఆవుల రమేష్‌బాబు, జెడ్పీటీసీ సభ్యురాలు షహనాజ్‌బేగం, సర్పంచిలు కోటేరు సూర్యనారాయణ రెడ్డి, ఆవుల మాధవి, ఎంపీటీసీ సభ్యులు సాదా భారతి, ఆదాం, బాయమ్మ, పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్‌కు స్వాగతం పలికారు. -
నేడు నగరానికి వైఎస్ జగన్ రాక
బలిరెడ్డి మనమరాలి వివాహానికి హాజరు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విశాఖ నగరానికి రానున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బలిరెడ్డి సత్యారావు మనమరాలు బిందు మౌనిక వివాహం నగరంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్(ఆంకోసా) హాలులో గురువారం జరగనుంది. ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. రాత్రి 7.45 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. -
రోజాకు వేసిన శిక్ష చాలా చిన్నది: పీతల
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యురాలు రోజాకు స్పీకర్ వేసిన శిక్ష చాలా చిన్నదని, ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. సస్పెన్షన్‌ను నిలిపివేస్తూ కోర్టు తీర్పు ఇచ్చినా విపక్షం ఈ అంశంపైనే ఆందోళన చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు శనివారం మీడియా పాయింట్ వద్ద ప్రతిపక్షం, విపక్ష నేతపై విమర్శలు చేశారు. అసెంబ్లీలో అసలు అధికార పక్షానికే ఎక్కువ సమయం ఇవ్వాలని మంత్రి పీతల సుజాత అన్నారు. రోజాపై తాము దయదలిచామని, తామే కేసులు పెట్టి ఉంటే పెద్ద శిక్ష పడేదని చెప్పారు. -
నాటకీయంగా సురేశ్‌ను వదిలిన పోలీసులు
వారం రోజులుగా పోలీసుల అదుపులో ఉన్న నూతక్కి సురేశ్‌ను బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య వదిలేశారు. పోలీసులు సురేశ్‌ను అదుపులోకి తీసుకుని వదలడం లేదంటూ కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచి సురేశ్ కుటుంబసభ్యులకు ఫోన్లు చేసి అతడిని తీసుకెళ్లాలంటూ హడావుడి చేసినట్లు చెబుతున్నారు. ఎస్.ఐ. రవిబాబు బుధవారం సురేశ్‌ను తెలుగుదేశం పార్టీకి చెందిన తుళ్ళూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్ర వద్ద విడిచి వెళ్లారు. సురేశ్‌ను జెడ్పీటీసీ సభ్యుడి వద్ద ఎలా వదిలి వెళతారంటూ కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. సురేశ్‌ను వారం రోజులుగా చిత్రహింసలకు గురిచేసి పంట దహనానికి పాల్పడింది తానేనని, తన మేనమామ చంద్రశేఖర్ చేయించాడని పేపర్లపై రాయించుకుని సంతకాలు చేయించారని కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రస్థాయిలో భయపెట్టి సెల్ఫోన్లో రికార్డు చేశారని, ఈ కేసులో అన్యాయంగా ఇరికిచేందుకు పోలీసులు కుట్రపన్నడం దారుణమని వాపోతున్నారు. జగన్ వచ్చిపరామర్శించడంజీర్ణించుకోలేకే కుట్ర రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్‌కు పొలం ఇవ్వలేదనే కోపంతో గుర్తుతెలియని వ్యక్తులు మల్కాపురంలోని నా చెరకు పంటను దహనం చేశారు. స్పందించిన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పంట పొలానికి వచ్చి నన్ను పరామర్శించి ప్రభుత్వ తీరును తప్పు పట్టడాన్ని జీర్ణించుకోలేక పోలీసులను అడ్డుపెట్టి నన్ను, నా మేనల్లుడిని కేసు లో ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. 29వ తేదీ న విచారణ పేరుతో నామేనల్లుడు సురేశ్‌ను తీసుకెళ్లి డీఎస్పీ విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. తానే ఈ పంట దగ్ధానికి పాల్పడినట్లుగా సురేశ్‌చేత రాయించుకుని సంతకాలు చేయించి సెల్లో వీడియో రికార్డు కూడా చేశారు. రాజధాని ప్రాంతం లో 13 చోట్ల పంట పొలాల్లో వెదురు బొంగులు దగ్ధమైన సంఘటనలకు సంబంధించి కేసులను సైతం సురేశ్‌పై మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. - గద్దే చినచంద్రశేఖర్ -
తప్పులు చేస్తాం.. నోరెత్తకండి!
ముఖ్యమైన అంశాలు చాలా ఉండగా దేన్నీ చర్చించకుండానే సభను ఐదు రోజులకే ఎందుకు ముగించారు? తమకు కావలసిన బిల్లులను ఆమోదింపజేసుకుని సభను చాలించడమనే ఈ సంప్రదాయం ఏ ప్రజాస్వామ్య విలువల కోసం? నీటి గురించి, ప్రాజెక్టులకు నీటి లభ్యత గురించిగాక కరువు మీదే చర్చించాలని ప్రతిపక్ష నేతను కట్టడి చెయ్యచూడటం ఏమిటి? దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఓటుకు కోట్లు ఉదంతంలో ఒక ముఖ్యమంత్రి ప్రమేయంపై వచ్చిన ఆరోపణలపై వీధుల్లో కాక శాసనసభలోనే చర్చించి ఉండాల్సింది కాదా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈసారి చాలా ఆసక్తికరం గా సాగుతాయని అందరూ భావించారు. అందుకు కారణం ఉంది. ప్రభు త్వం ఆత్మరక్షణలో పడే పలు సంఘటనలు గత సమావేశాలకూ ఈ సమావే శాలకూ మధ్య జరిగాయి. ఒకటా రెండా అనేక సంఘటనలు. గోదావరి పుష్కరాల తొలి రోజున ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయక భక్తులు చనిపోయారు. అంతకుముందే ఎమ్మార్వో వన జాక్షి మీద చింతమనేని ప్రభాకర్ మనుషులు దాడి చేసి కొట్టారు. లైంగిక వేధింపులను తట్ట్టుకోలేక రిషితేశ్వరి అనే విద్యార్థిని నాగార్జున విశ్వవిద్యాల యంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదేమో నన్న దిగులుతో కనీసం ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో సాక్షాత్తూ రాష్ర్ట మంత్రి నారాయణకు సంబంధించిన కళాశా లలో ఇద్దరు విద్యార్థినులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఎలుకలు ఇంకా కళ్లు పూర్తిగా తెరవని ఒక పసి కందును కొరికి చంపేశాయి. వీటన్నిటికి తోడు తెలంగాణలో జరిగిన ఓటుకు కోట్ల వ్యవహారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతు న్న ఉద్యమం. ఈ సమస్యలన్నిటిని సావకాశంగా చర్చించాలంటేనే ఇతర అం శాలన్నీ పక్కన పెట్టి కనీసం పదిహేను రోజులు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలోని పెద్దలు ఈ అంశాలన్నిటి మీదా ఇప్పటికే బయట ఏం మా ట్లాడినా ఎటువంటి వివరణలు ఇచ్చినా చట్టసభలో వీటి మీద జరిగే చర్చకు ఉండే ప్రాధాన్యమే వేరు. ఆ చర్చ పర్యవసానంగా రూపొందే పరిష్కారాలు వేరు. అందుకే సభను కనీసం పదిహేను రోజులు జరపాలని ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శాసనసభా వ్యవహారాల సలహా కమి టీ సమావేశంలో కూడా కోరింది. అందుకు ససేమిరా అన్నది అధికార పక్షం. చర్చకు తావేలేని సమావేశాల అంతరార్థం? 175 మంది సభ్యులుగల ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రతిపక్షంగా ఉంది. అయితే అది 67 మంది సభ్యులున్న బలమైన ప్రతిపక్షం. ఆ పార్టీ విశ్వప్రయత్నం చేసినా పైన పేర్కొన్న సమస్యల్లో ఏ ఒక్క దాని మీదా అధికార పక్షం చర్చను సాగనివ్వలేదు. ఆగస్టు 31 నుంచి సెప్టెం బర్ నాలుగు వరకు ఐదు రోజులపాటు సభను తూతూ మంత్రంగా జరిపించి నిరవధికంగా వాయిదా వేశారు. ముఖ్యమైన అంశాలు ఇన్ని ఉన్నా దేనిపైనా చర్చను ఎందుకు చేపట్టలేదు? సభ ఐదు రోజులే ఎందుకు జరిగింది. అంత కన్నా మించి సభ జరగరాదన్న నిబంధన ఏదైనా ఉందా? లేకపోతే చట్ట సభలో చర్చ కంటే ముఖ్యమైన పనులు ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికార పక్ష సభ్యులకు ఏమైనా ఉన్నాయా? ఏ చర్చా లేకుండానే ఇలా సమా వేశాలను ముగించేట్టయితే... బోలెడు ప్రజాధనం వెచ్చించి శాసన సభను సమావేశపరచడం ఎందుకు? తమకు కావలసిన బిల్లులను ఆమోదింపజేసు కుని సభను చాలించడమనే ఈ సంప్రదాయాన్ని ఏ ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం ప్రవేశపెట్టినట్టు? స్థాయిని మరచిన జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పక్షం తెలుగుదేశం, దాని మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కాక పతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఉంది. బీజేపీ ఇక్కడ రాష్ర్ట ప్రభుత్వంలో భాగస్వామి, టీడీపీ అక్కడ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి. ఆ కారణంగా బీజేపీ మిత్ర ధర్మంగా భావించి ఇక్కడి ప్రభుత్వం పక్షానే నిలిచి, దాని అప్రజాస్వామిక వైఖరికి మౌనంగా ఆమోద ముద్ర వేసింది. అంతే తప్ప ఒక జాతీయ పార్టీగా కొం తలో కొంతయినా స్వతంత్రంగా వ్యవహరించలేదు. ముఖ్య అంశాలపై చర్చ జరపడానికి అధికార పక్షాన్ని ఒప్పించి ఉంటే... అది ఆ పార్టీ స్థాయికి తగిన దిగా ఉండేది, మంచి మార్కులు పడి ఉండేవి. ఆ పనిచెయ్యక పోగా కొన్ని సందర్భాలలో తెలుగుదేశం కంటే కూడా అది ఒక అడుగుముందుకేసి, ప్రతి పక్ష నిరసనను అడ్డుకునే ప్రయత్నం చెయ్యడమే విడ్డూరం. మంత్రులు తమ స్థాయి మరచి వాడిన భాష, చేసిన విమర్శలు రాజకీయాలకే తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడాలని లేచినా, చివరకు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలన్నా మైకులు సరిగా పనిచేయవు. ఆంధ్రప్రదే శ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తమను తాము సమర్థించుకోవడంలో బీజేపీకి ఇబ్బందులు ఉండొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామే కాబట్టి, ప్రత్యేక హోదా ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఉండాల్సిందే అని నాడు ప్రతి పక్ష నేతగా గట్టిగా పట్టుబట్టింది, మాట్లాడింది తమ నేత వెంకయ్యనాయుడే కాబట్టి రాష్ట్ర బీజేపీకి ఇది ఒక్కటే సంకటం కావచ్చు. ఆశ్చర్యకరంగా ఆ ఒక్క అంశం మీదే కొద్దిలో కొద్దిగా అయినా చర్చ జరిపి ఒక తీర్మానం చేసి కేం ద్రానికి పంపించారు. మిగతా సమస్యలేవీ బీజేపీని అలా ఇరకాటంలో పెట్టేవే కావు. అది ఎంత టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నా, మిగతా అంశాలపై చర్చకు అవకాశం కల్పించే రీతిలో ఎందుకు ప్రవ ర్తించలేకపోయింది? అన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే! గోదావరి పుష్కరాల ప్రారంభ దినాన ముఖ్యమంత్రి, ఆయనతో ఉన్న ప్రము ఖుల బృందం... వీఐపీల కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌లో కాక సామాన్య ప్రజల కోసం ఉద్దేశించిన ఘాట్‌లో స్నానాలు, పూజాదికాలు చేశారు. ఆ కార ణంగానే జరిగిన తొక్కిసలాటలో ముఖ్యమంత్రి కళ్ళ ముందే 27 మంది చని పోయారు. ఒక విదేశీ చానల్‌కు స్వల్పకాలిక ప్రచార చిత్రాన్ని షూట్ చెయ్య డంలో భాగంగానే ముఖ్యమంత్రి ఆ ఘాట్‌లోకి వచ్చారు. జనం పెద్ద సంఖ్యలో కనిపించాలంటే ఆ ఘాట్‌లోనే షూట్ చెయ్యాలి మరి! నిజానికి పుష్కరాల వంటి సందర్భాలలో ప్రముఖ పాత్ర నిర్వహించాల్సిన దేవాదాయ శాఖ మంత్రి ప్రమేయం ఎక్కడైనా కనిపించిందా? ప్రభుత్వ మహిళా అధికారి వనజాక్షి మీద దాడి చేసిన గుంపు మీద చర్యలు ఎందుకు లేవు? సరికదా, ఆ దాడికి బాధ్యుడయినా శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను ఎందుకు వెనకేసుకొచ్చారు? పదే పదే ఆయనకు ఎందుకు కితాబులు ఇస్తున్నారు? రిషితేశ్వరి ఆత్మహత్య సంఘటనలో ప్రిన్సిపాల్ బాబూరావు మీద చర్యలు ఎందుకు లేవు? ఆయనను ఎందుకు, ఎవరు కాపాడుతున్నారు? ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయి ఔరా! అనే విధంగా రాజధాని అమరావతిని నిర్మిస్తా మంటున్న ప్రాంతంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో పది రోజుల పసికందును ఎలుకలు కొరుక్కుతినే దుర్భర పరిస్థితులు ఎందుకున్నాయి? ఆ ఘటనలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి బాధ్యత ఉండదా? పైగా మంత్రి తనిఖీలంటూ అదే ఆస్పత్రిలో అంతకుముందే రాత్రి నిద్ర చేశారు కూడా. ఎందుకోగానీ మంత్రిగారికి మాత్రం ఆ ఎలుకల దండు కనిపించలేదు. తానే మొత్తం ప్రభు త్వంగా చక్రం తిప్పుతున్న మంత్రి నారాయణకు సంబంధించిన కళాశాలలో ఇద్దరు అమ్మాయిల అనుమానాస్పద మృతి ఘటనకు ఆయనను నైతిక బాధ్యడ్ని చేస్తూ ఎందుకు రాజీనామా చేయించలేకపోయారు? విడ్డూరపు ప్రభుత్వం... చమత్కారాల సభ శాసనసభ సమావేశాల కాలం పొడిగిస్తే... ఇదిగో ఇటువంటి అంశాలన్నిటి మీదా చర్చ జరుగుతుంది. కాబట్టే ‘శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం’ అన్న చందంగా వర్షాకాల సమావేశాలను ముగించేశారు. ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ వర్షాకాల సమా వేశాలు జరిగాయి. కనీసం కరువు మీదన్నా చర్చ సజావుగా సాగిందా? అదీ లేదు. నీటి గురించి మాట్లాడుకోకుండా, ఆ నీటి లభ్యతకు అవసరమైన ప్రాజె క్టుల ఊసే ఎత్తకుండా కరువు మీద మాత్రమే చర్చించాలని ప్రతిపక్ష నేతను కట్టడి చెయ్యచూడటం ఈ సమావేశాల్లో జరిగిన మరో చమత్కారం. ప్రభుత్వ ఉత్తరువుల్లో కనీస ప్రస్తావన కూడా లేకుండానే పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు నీళ్ళు ఎలా ఇస్తారు? నీళ్ళే లేని ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చెయ్యడం ఏం విడ్డూరం? అని ప్రశ్నించబోయిన ప్రతిపక్ష నాయకుడి మైకు పని చెయ్యదు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఓటుకు కోట్లు గుమ్మరించ బోయిన ఉదంతంలో ఒక ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడం, స్వయంగా ఆయన గొంతు రికార్డై బయటికి రావడం మీద ఆ రాష్ర్ట శాసన సభలో చర్చ జరగదు. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వీధుల్లో కాక శాసనసభలోనే చర్చించి... ఆ ఉదంతంలో తన ప్రమేయం లేని పక్షంలో మొత్తం సభను ఒప్పించి ఒక తీర్మానం చేయించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ప్రతిష్ట ఇనుమడించి ఉండేది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సమావేశమయ్యే చట్ట సభలు ప్రజా సమస్యల మీద కూడా కొంత చర్చ జరిపితే బాగుంటుందేమో! - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
మాకు 5 సెకన్లకే కట్.. మీకు 27 నిమిషాలా!
-
మాకు 5 సెకన్లకే కట్.. మీకు 27 నిమిషాలా!
ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే 5 సెకన్లకోసారి మైకు కట్ అవుతుంది గానీ మంత్రులు, ఇతర అధికార పక్ష నేతలకు మాత్రం 27 నిమిషాల అవకాశం ఎలా వచ్చిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నాడు అసెంబ్లీ 15 నిమిషాల పాటు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. సీఎం దర్శకత్వంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సభను టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుకుంటున్నారు అనేక సమస్యలున్నాయి.. నిత్యావసరాల ధరలు, కరువు, రైతు ఆత్మహత్యలు, అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు చంద్రబాబు సినిమా పిచ్చికి బలైన పుష్కర ప్రాణాలున్నాయి రాష్ట్ర పరువు, ప్రతిష్ఠలను దిగజార్చిన ఓటుకు కోట్లు ఘటన ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో తీర్మానం పెట్టాలంటే ఇన్నాళ్లూ ఉలుకూ పలుకు లేని చంద్రబాబు అనేక మంది ఆత్మహత్యలకు కారణమయ్యారు ఎట్టకేలకు వైఎస్ జగన్ ఒత్తిడితో టీడీపీ ముందుకొచ్చినా, అది తూతూ మంత్రంగానే ఉంది నిన్న సీఎం 10 పేజీల స్టేట్మెంట్ చదివారు. అయితే, స్టేట్మెంట్లో అంటే ఆ నోట్లో ఉన్న విషయాలు మాత్రమే చదవాలి, దానిపై చర్చలో ఏమైనా చెప్పచ్చు. కానీ దుర్మార్గంగా స్టేట్మెంట్ ఒక పేజీ చదువుతూనే అందులో లేని అంశాలను చెబుతూ జగన్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడారు జగన్ మాట్లాడుతుంటే 5 సెకన్లకోసారి మైకు కట్ అవుతుంది. అధికార పక్షానికి మాత్రం 27 నిమిషాలు అవకాశం ఇస్తారు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై వెంటనే ప్రకటన చేయాలి. సమస్యలున్నాయి గానీ, అవన్నీ ప్రత్యేక హోదా తర్వాతే అసలు ఆ అంశమంటే ప్రభుత్వానికి భయమెందుకో నాకు అర్థం కావట్లేదు ప్రత్యేకహోదా తీర్మానానికి ఒక విలువ ఉండాలంటే కేంద్రంలో ఉన్న మీ మంత్రులు రాజీనామా చేయాలి అలా కాకుండా మాయమాటలతో ప్రభుత్వాన్ని మోసం చేయద్దు ఢిల్లీలో ఒకమాట, హైదరాబాద్‌లో ఒకమాట చెబుతున్నారు బీజేపీ మంత్రులు కూడా అప్పుడో మాట, ఇప్పుడోమాట అంటున్నారు ప్రత్యేక హోదా సాధన కోసం చిత్తశుద్ధితో ముందుకు రావాలి అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి కాలపరిమితితో కూడిన తేదీని నిర్ణయించాలని కోరుతున్నాం రెచ్చగొట్టే మాటలతో సభను నిలిపివేయడం కాకుండా సభను సజావుగా నడవనివ్వాలని కోరుతున్నాను -
బాబుతో కొట్లాడుతున్నామా? మీతో పోరాడుతున్నామా?
హైదరాబాద్ : వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభలో ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. అయితే అందుకు అంగీకరించని స్పీకర్ కోడెల శివప్రసాద్.. ప్రశ్నోత్తరాలు చేపడతామని ప్రకటించడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎప్పుడైనా ప్రశ్నోత్తరాలు జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమైన అంశాలను తప్పుదోవ పట్టించవద్దని, చర్చ జరగకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. శాసనసభ సమావేశాలు జరిగేది ఐదు రోజులు మాత్రమే అని, 15 రోజుల సమావేశాలు జరపాలని కోరినా కాదన్నారని వైఎస్ జగన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పలువురు ప్రాణత్యాగం చేశారని...హోదాపై తీర్మానం ఇచ్చినా...చర్చ జరిపేందుకు మాత్రం అనుమతి ఇవ్వటం లేదన్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు మాత్రం అనుమతి ఇవ్వరని, అదే చంద్రబాబు మాత్రం 15 నిమిషాలు పాటు మాట్లాడేందుకు మాత్రం అనుమతి ఇస్తారని అన్నారు. తాము సభలో అధికారపక్షంతో కొట్లాడుతున్నామా... మీతో పోరాడుతున్నామా అనేది అర్థం కావటం లేదని వైఎస్ జగన్ అన్నారు. -
మండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మహ్మద్ అలీ షబ్బీర్ నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలి చైర్మన్ స్వామి గౌడ్‌కు మంగళవారం లేఖ రాశారు. ఇప్పటిదాకా ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్న డి.శ్రీనివాస్ మార్చి 29న రిటైర్ కావడంతో ఖాళీ అయిన ప్రతిపక్ష నేత స్థానాన్ని షబ్బీర్ భర్తీ చేస్తారని లేఖలో పేర్కొన్నారు. శాసనమండలిలో ఉన్న ఖాళీలు భర్తీ అయ్యే దాకా ప్రతిపక్ష నేతగా షబ్బీర్ వ్యవహరిస్తారన్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు. అయితే షబ్బీర్ నియామకంపై పలువురు ఎమ్మెల్సీలు అసంతృప్తితో ఉన్నారు. ఈ వ్యవహారంపై బుధ, గురువారాల్లో రాష్ట్ర పర్యటనకు రానున్న దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేయాలని వారు భావిస్తున్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా డి.శ్రీనివాస్ ఎన్నికయ్యేనాటికి కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్సీలు ఉండగా ఆ తరువాత కాలం లో 9 మంది ఎమ్మెల్సీలు పార్టీని వదలి టీఆర్ఎస్లో చేరారు. మిగిలిన వారిలో డి.శ్రీనివాస్, పీర్ షబ్బీర్ అహ్మద్ మార్చి 29న రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌కు ఒక స్థానం రానుంది. దీని ప్రకారం ఈ ఎన్నిక పూర్తయ్యేదాకా ప్రతిపక్షనేత ఎన్నికను వాయిదా వేయాలంటూ మార్చి 20న దిగ్విజయ్‌కు షబ్బీర్ మినహా మిగిలిన నలుగురు ఎమ్మెల్సీలు (పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రంగారెడ్డి, ఎం.ఎస్.ప్రభాకర్, ఫారూఖ్ హుస్సేన్) లేఖ రాశారు. అమెరికాలో ఉన్న ఎమ్మెల్సీ పి.సంతోష్‌కుమార్ కూడా ఇదే అభిప్రాయంతో దిగ్విజయ్‌కు ఎస్ఎంఎస్ పంపినట్టు సమాచారం. అయినా ఇవేవీ పట్టించుకోకుండా షబ్బీర్‌ను ఎలా నియమిస్తారంటూ పలువురు ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకులు లేకుండా, పార్టీ ఎమ్మెల్సీల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా షబ్బీర్ అలీని ఎలా నియమిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేయనున్నట్టుగా ఒక ఎమ్మెల్సీ వెల్లడించారు. -
తెలంగాణ మండలి ప్రతిపక్షనేతగా షబ్బీర్!
-
'జానారెడ్డి అవినీతిని త్వరలో బయట పెడతాం'
హైదరాబాద్: ప్రతిపక్ష నేత జానారెడ్డి చేసిన అవినీతిని త్వరలోనే బయట పెడతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. మంగళవారం వారు అసెంబ్లీలో మాట్లాడుతూ...జానారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని, త్వరలో ఆయన అవినీతిని బయటపెడతామని వారు హెచ్చరించారు. అంతేకాకుండా జానారెడ్డికి జైలుకు పోతానన్న భయం పట్టుకుందన్నారు. ఆయన అక్రమాస్తులపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందన్నారు. అంతేకాకుండా జానారెడ్డిని సొంతపార్టీ ఎమ్మెల్యేలే గుర్తించడం లేదని పేర్కొన్నారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ పేరును నల్గొండ పార్టీగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. -
హనీమూన్ అనే ఆగాం..!
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతాం.. కట్టుతప్పిన ఎమ్మెల్యేలపై కఠినంగా ఉంటాం షబ్బీర్‌పై విమర్శలు సరికాదు మీడియాతో ప్రతిపక్షనేత జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ర్టంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్ఎస్పై వెంటనే విమర్శలు చేస్తే తొందరపడుతున్నామనే భావన రాకుండా ఉండడానికే హనీ మూన్ సమయం ఇచ్చాం... అంతేకానీ అధికారపక్షానికి అనుకూలంగా ఉన్నామని భావిం చడం సరికాదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు. ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రమశిక్షణ తప్పిన పార్టీ ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షపాత్రలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్‌నేత షబ్బీర్ అలీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను జానారెడ్డి ఖండించారు. టీడీపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యవ్యవస్థకు మంచిది కాదని, వారిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరామన్నారు. జాతీయగీతాలాపన సమయంలో జరి గిన ఘర్షణలకు సంబంధించిన వీడియో సీడీల పుటేజీలను పూర్తిగా చూపించాలని స్పీకర్‌కు గతంలోనే లేఖ రాసినట్టు చెప్పారు. అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపైనా స్పీకర్‌కు లేఖ రాశానన్నారు. టీపీసీసీ, సీఎల్పీ మధ్య ఎలాంటి విభేదాల్లేవని, అలా ఉన్నాయని ఎవరైనా చెబితే వా రి వ్యాఖ్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కు ఏది ఉపయోగమో, వాటికోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకుని రావడమే లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. సీఎల్పీలతో విభేదాలున్నాయని చెప్పే నాయకులు క్రమశిక్షణను ఉల్లంఘించినట్టేనన్నారు. క్రమశిక్ష ణ లేకుండా మాట్లాడడం తనకు చేతకాదన్నారు. -
విపక్ష నేత ఎంపికపై కొనసాగుతున్న అనిశ్చితి
శాసనసభ సమావేశాలు మొదలై పదిరోజులు గడిచిపోయినా నాగపూర్: శాసనసభ సమావేశాలు మొదలై పదిరోజులు గడిచిపోయినప్పటికీ మండలిలో ప్రతిపక్ష నేత ఎంపికపై నెలకొన్న అనిశ్చితికి ఇంకా తెరపడలేదు. ఇందుకు సంబంధించి తక్షణమే ఓ ప్రకటన చేయాలని డిమాండ్‌చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు బుధవారం కూడా మండలి కార్యకలాపాలను స్థంభింపజేశారు. గతవారం కూడా ఇదే అంశంపై మండలిలో కార్యకలాపాలను విపక్షం అడ్డుకున్న సంగతి విదితమే. బుధవారం మండలిలో కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఎన్సీపీ సభ్యుడు సునీల్ తట్కరే ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘నిబంధనల ప్రకారమే సభా కార్యకలాపాలు సాగాలి. ప్రతిపక్ష నేత లేకుండా జరగకూడదు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ అంశాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవాళ ప్రతిపక్ష నేత పేరును ప్రకటించాలి’అని డిమాండ్ చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ ‘ఈ అంశం సభాపతి పరిధిలో ఉంది. ఈ విషయంలో నాకు ఎలాంటి అధికారమూ లేదు. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదు. సభాధ్యక్షుడే కచ్చితంగా ఓ నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నారు. అంతకుముందు ఇదే అంశంపై కాంగ్రెస్ సభ్యుడు మాణిక్‌రావ్‌ఠాక్రే మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇరు సభల సభ్యులను పిలిచి ఓ సమావేశం నిర్వహించాలి. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి’అని అన్నారు. ఇందుకు ఎన్సీపీ సభ్యులు అభ్యంతరం చెబుతూ ఇరు సభలూ వేర్వేరని పేర్కొన్నారు. సభాపతి శివాజీరావ్ దేశ్‌ముఖ్ జోక్యం చేసుకుంటూ ఈ అంశాన్ని తాను పరిశీలిస్తానన్నారు. వీలైనం త్వరగా ప్రతిపక్ష నాయకుడి పేరును ప్రకటించేందుకు యత్నిస్తానన్నారు. సభాపతి జవాబుపట్ల సంతృప్తిచెందని ఎన్సీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా వెల్‌లోకి దూసుకుపోయారు. ‘గివ్ జస్టిస్, గివ్ జస్టిస్, గివ్ జస్టిస్’ అంటూ సభ దద్దరిల్లేలా నినదించారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో సభాపతి సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. ఆ ఆలోచనేదీ లేదు కొత్త ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు యోచనేదీ లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం విధానమండలిలో వెల్లడించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో వివిధ కళాశాలల్లో 43 శాతం సీట్లు వృథాగాఉన్నాయన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా నాగోగనార్, అనిల్ సోలే తదితర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు. రాష్ర్టంలో మొత్తం 367 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని, ఇందులో పది ప్రభుత్వ కళాశాలలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ కళాశాలల సీట్ల సంఖ్య 1,56,067 కాగా అందులో 67,184 సీట్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వ కళాశాలల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా లేదన్నారు. కొన్ని విద్యాసంస్థలు భారీ పెట్టుబడులతో ఇంజనీరింగ్ కళాశాలలను, అయితే అక్కడ తరగతులు సరిగా జరగడం లేదన్నారు. ఇటువంటి కళాశాలల ప్రాంగణాలను ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదన్నారు. -
రెండు దశాబ్దాల తర్వాత..
సంప్రదాయాలకు విరామం ఉపముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత లేకుండా శీతాకాల సమావేశాలు సమావేశాలకు ముందు అధికారపక్షంలో చేరిన శివసేన ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్, ఎన్సీపీ హోరాహోరీ సాక్షి ముంబై: రాష్ర్టంలో ఈసారి శీతాకాల సమావేశాలు ఉపముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు లేకుండా జరుగుతుండటం విశేషం. 20 ఏళ్ల అనంతరం ఉపముఖ్యమంత్రి లేకుండా ఈ సమావేశాలకు నాగపూర్ వేదికకావడం విశేషంగా చెప్పుకోవచ్చు. 1995-99 మధ్య కాలంలో శివసేన-బీజేపీల కాషాయ కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి పరంపర కొనసాగుతూ వచ్చింది. అయితే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ఒంటరిగా పోరాడాయి. ఎవరికీ పూర్తి మద్దతు లభించకపోయినప్పటికీ 122 స్థానాలను దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం మళ్లీ మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనలు ఒక్కటయ్యాయి. అయితే ఉపముఖ్యమంత్రి పదవి మాత్రం ఇంతవరకు ఎవరికీ కేటాయించలేదు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న శివసేన శీతాకాల సమావేశాలకు ఒక రోజు ముందు ప్రభుత్వంలో భాగస్వామిగా మారడంతో ఈసారి ప్రతిపక్ష నాయకుడు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు 2012లో ఉపముఖ్యమంత్రి లేకుండా సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైనప్పటికీ చివరి క్షణంలో మళ్లీ అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ సమయంలో జలవనరుల కుంభకోణంపై ఆరోపణలు రావడంతో ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో ఉపముఖ్యమంత్రి ఖాళీ అయింది. ఈ పదవిని భర్తీ చేయరని భావించినప్పటికీ శీతాకాల సమావేశాలకు ఒకరోజు ముందు భర్తీ చేసి ఆ సమావేశాల్లోనే ప్రమాణస్వీకారం చేశారు. 1978 నుంచి డిప్యూటీ సీఎం... రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 1978లో ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించారు. ఆ సమయంలో ఎస్ కాంగ్రెస్‌కు చెందిన వసంత్‌దాదా పాటిల్ ముఖ్యమంత్రి ఉండగా ఉపముఖ్యమంత్రిగా ఇందిరా కాంగ్రెస్‌కు చెందిన నాశిక్‌రావ్ తిరపుడే బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఉపముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్‌కు చెందిన రామారావ్ అధిక్‌కు లభించింది. ఆయన వసంత్‌దాదా పాటిల్‌తోపాటు శరద్‌పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రామారావ్ అధిక్ అనంతరం మళ్లీ కాంగ్రెస్‌లో ఎవరికి ఉపముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టే గౌరవం లభించలేదు. 15 ఏళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎవరికీ ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదు. అనంతరం శివసేన-బీజేపీ కాషాయ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో శివసేనకు చెందిన మనోహర్ జోషీ ముఖ్యమంత్రిగా ఉండగా దివంగత బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. నాలుగేళ్ల అనంతరం శివసేనకు చెందిన నారాయణ రాణే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ ఉపముఖ్యమంత్రిగా మాత్రం గోపీనాథ్ ముండేనే కొనసాగారు. అదే సమయంలో శరద్‌పవార్ కాంగ్రెస్‌నుంచి విడిపోయి నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అలాగే శివసేన ప్రముఖ నాయకుడైన ఛగన్‌భుజ్‌బల్ తిరుగుబాటు బావుట ఎగురవే సి ఎన్సీపీలో చేరిపోయారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీల డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టగా, ఎన్సీపీలో చేరిన ఛగన్ భుజ్‌బల్‌కు ఉపముఖ్యమంత్రి పదవి లభించింది. 2003లో ఎన్సీపీకి చెందిన విజయ్‌సింగ్ మోహితేపాటిల్, 2004లో ఎన్సీపీకి చెందిన ఆర్ ఆర్ పాటిల్‌లు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2008 నవంబర్‌లో జరిగిన ముంబై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌తోపాటు ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆర్ ఆర్ పాటిల్ రాజీనామా చేయాల్సివచ్చింది. దీంతో మరోసారి ఛగన్‌భుజ్‌బల్‌కు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం లభించింది. 2009 ఎన్నికల్లో తిరిగి డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పృథ్వీరాజ్ చవాన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2012లో శీతాకాల సమావేశాలకు ముందు కొన్నిరోజులపాటు అజిత్‌పవార్ రాజీనామా చేసి, చివరిక్షణంలో మళ్లీ పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈసారి ఇప్పటివరకు ఉపముఖ్యమంత్రి పదవిని ఎవరికీ కట్టబెట్టలేదు. దీంతో 20 యేళ్ల అనంతరం మరోసారి శీతాకాల సమావేశాలు ఉపముఖ్యమంత్రి లేకుండా జరుగుతున్నాయి. -
బాధ్యత అంతా వైఎస్ జగన్‌పైనే!
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సిపి ఒక్కటే కావడంతో ఆ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డిపైనే అధికారపక్షాన్ని నిలదీసే బాధ్యత అంతాపడింది. శాసనసభలో టిడిపి, వైఎస్ఆర్సి, బిజెపి మూడు పార్టీలకు మాత్రమే సభ్యులు ఉన్నారు. బిజెపి ఎన్నికలలో టిడిపితో పొత్తు పెట్టుకొని గెలిచింది. ఆ తరువాత మంత్రి పదవులు స్వీకరించి ప్రభుత్వంలో కూడా చేరింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. దాంతో వైఎస్ఆర్సి ఒక్కటే ప్రతిపక్షంగా మిగిలింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పటిష్టంగాలేకపోతే అధికార పక్షం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతుంది. వారి ఆగడాలు యధేచ్ఛగా కొనసాగుతాయి. అది ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. అధికార పక్షం నియంతృత్వ పోకడలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు అధికారపక్షం దుందుడుకుపోకడలకు శాసనసభలోనూ, బయట ప్రతిపక్షాలు కళ్లెం వేయవలసి ఉంటుంది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వంటి పార్టీలకు శాసనసభలో కనీసం ఒకటి రెండు స్థానాలైనా లభించి ఉంటే ఆయా లెజిస్లేచర్ పార్టీ నేతలు సభలో గళం విప్పడానికి అవకాశం ఉండేది. ప్రస్తుత శాసనసభలో ఆ అవకాశంలేదు. కొత్త రాష్ట్రం - 30 సంవత్సరాల అనుభవం ఉన్న టిడిపి అధికారం చేజిక్కించుకుంది - ప్రతిపక్ష హోదా పొందిన కొత్త పార్టీ వైఎస్ఆర్సిపి - శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. అయినా అధికారపక్షానికి ధీటుగా గొంతెత్తి హుందాగా వ్యవహరిస్తున్నారు. సభలో గళం విప్పి ప్రజాసమస్యలు లేవనెత్తుతున్నారు. సభకు కొత్తైనా ఎంతో పరిణతిచెందిన నేతగా, సందర్భానుసారంగా మాట్లాడుతున్నారు. సుదీర్ఘకాలం రాజకీయానుభవం గల నేతలకు తగిన రీతిలో సమాధానం చెబుతున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్న అధికారపార్టీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. తమని ప్రశ్నించకుండా ఉండేందుకు ప్రజాసమస్యలపై దృష్టిసారించకుండా సభలో అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ ప్రస్తుత సమస్యలను ప్రస్థావించినా సమాధానం చెప్పలేని స్థితిలో పార్టీకి గానీ, అతనికి గానీ సంబంధంలేని పాత విషయాలను లేవనెత్తి సభ సమయాన్ని వృధా చేస్తున్నారు. అయినా జగన్ ఎంతో అనుభవం గల నేత మాదిరిగా తగిన రీతిలో స్పందిస్తున్నారు. సమాధానం చెబుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. అధికారపక్షాన్ని నిలదీస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అధికార పక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని గళం విప్పి గర్జిస్తున్నారు. మరో ప్రతిపక్షపార్టీ లేనందున ఆ భారం అంతా వైఎస్ జగన్‌పైనే పడింది. ప్రస్తుత పరిస్థితులలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగాలంటే సభలో స్థానం సంపాదించలేని పార్టీలు కూడా వైఎస్ఆర్సిపి చేపట్టే ఆందోళనలకు సభ బయట మద్దతు పలకవలసిన అవసరం ఎంతైనా ఉంది. - శిసూర్య -
'పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం బాధాకరం'
పార్లమెంట్లో పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం పోందటం బాధాకరమని తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జానారెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికత అంశంలో సెటిలర్లకు నష్టం జరగదని అన్నారు. పోలీసు భద్రత కల్పించైనా ఆర్డీఎస్కు మరమ్మతులను పూర్తి చేయాలని జానారెడ్డి ఏపీ సర్కార్‌కు హితవు పలికారు. పోలవరం ఆర్డినెన్స్ ఈ రోజు పార్లమెంట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. -
నేడు ఘటనాస్ధలానికి జగన్ రాక
-
నేడు జగన్ రాక
- నగరంలో పేలుడు ప్రాంతం సందర్శన - కాకినాడ, అమలాపురంలలో - క్షతగాత్రులకు పరామర్శ సాక్షి, కాకినాడ : నగరం పైపులైన్ పేలుడులో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ, రాష్ర్ట ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మధురపూడి చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో కాకినాడ చేరుకుని, అక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేలుడు క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం అమలాపురం చేరుకొని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి నగరం గ్రామం చేరుకొని పైపులైన్ పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించి పేలుడులో దుర్మరణం పాలైన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. -
ప్రతిపక్ష హోదాలో తొలిసారి...
పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం పులివెందుల చేరుకున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో తొలిసారి ఆయన పులివెందులకు విచ్చేసారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన వైఎస్ జగన్‌కు కార్యకర్తలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా వైఎస్ జగన్ ఈరోజు ఉదయం 10గంటల ప్రాంతంలో బద్వేలు బయలుదేరి వెళతారు. అక్కడ నూతన జంట మానస వీణ, సుభోద్ కుమార్ రెడ్డిలను ఆశీర్వదించనున్నారు. అనంతరం కొద్దిసేపు నాయకులు, ప్రజలను కలిసి ఆ తర్వాత కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. 27, 28 తేదీలలో పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. అలాగే శనివారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన అధికారులతోపాటు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమీక్షించనున్నారు. -
లోక్‌సభలో విపక్షనేతగా రాహుల్ ఉండాలి
రాహుల్ గాంధీని పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చేయాలని, దానివల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి వీలుంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించాలనుకుంటే, ఆయన వహించాల్సిందేనని చెప్పారు. ఆయన ముందుండి నాయకత్వం వహించాలని, లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీయే ఉండాలని డిగ్గీరాజా చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 ఎంపీ స్థానాలు మాత్రమే దక్కడంతో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. అయితే లోక్‌సభ స్పీకర్ విచక్షణను అనుసరించి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశముంది. ఒకవేళ అలా వస్తే ఎవరు ప్రతిపక్ష నాయకత్వం వహించాలన్న విషయమై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. -
మళ్లీ మరో పదేళ్లు ప్రతిపక్షంలో చంద్రబాబు
విజయవాడ: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ మరో పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటారని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారని, మళ్లీ పొత్తుతో మరో 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటారన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హవా అనేది మీడియా స్పష్టేనన్నారు. దేశంలో మోడీ హవా ఉంటే ఆయన రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తారు? అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాతే తృతీయ ఫ్రంట్‌పై నిర్ణయం జరుగుతుందని సీతారాం ఏచూరి చెప్పారు. -
'లడ్డూబాబు మేకప్' లా టీడీపీలో చేరికలు
-
టీడీపీలో చేరికలు 'లడ్డూబాబు మేకప్' లాంటివి
వలసలు పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ఆర్బాటం చూస్తుంటే బాధేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ... టీడీపీలో చేరికలు లడ్డూబాబు మేకప్ లాంటివని ఎద్దేవా చేశారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా పదేళ్లలో మీరేం సాధించారని చంద్రబాబును ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ పదేళ్ల కాలవ్యవధిలో ఎవరు తరపున పోరాడారో చెప్పాలని చంద్రబాబును వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేతిలో చంద్రబాబు ఓ కీలుబొమ్మలా మారారని ఆమె ఆరోపించారు. గత పదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ శాసనసభలో ప్రతిపక్ష స్థానంలో ఉంది. అయిన ఆ పార్టీ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన దాఖలాలు లేవు. కనీసం ప్రజల సమస్యలపై పోరాడిన పాపాన కూడా పోలేదు. దాంతో చంద్రబాబు గత పదేళ్ల కాలంలో ప్రతిపక్ష నేతగా ఉత్సవ విగ్రహం ఉన్నారు. అయితే రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నూకలు చెల్లాయి. దాంతో ఆ పార్టీలోని మాజీ మంత్రులు, సీనియర్లు అంతా జపింగ్ రాగం అలపించుకుంటూ తెలుగు దేశం పార్టీలో చేరుతున్నారు. ఆ పరిణామాన్ని చూసి చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. రానున్న ఎన్నికలలో తమ పార్టీ విజయం తథ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మపై విధంగా స్పందించారు.