ముంబయి: ఎన్సీపీలో ప్రధాన బాధ్యతను సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లకు అప్పజెప్పుతూ శరద్ పవార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే..పార్టీ నిర్ణయానికి ఎదురుచెప్పలేక అప్పటికి సరే అని తలాడించిన అజిత్ పవార్.. ప్రస్తుతం కొత్త మెలిక పెట్టారు. పార్టీలో తనకు కొత్త బాధ్యత కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఎన్సీపీలో కొత్త కలవరం మొదలైంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో తనకున్న ప్రతిపక్ష నాయకుని బాధ్యత వద్దంటూ అధిష్ఠానానికి అజిత్ పవార్ తెగేసి చెప్పారు. ముంబయిలో జరిగిన 24 వ వసంతోత్సవ వేడుకల్లో ఈ మేరకు తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా పూర్తి న్యాయం చేస్తానని చెప్పారు. ప్రతిపక్ష నాయకునిగా మాత్రం పనిచేయలేనని తెలిపారు.
మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు అజిత్ పవార్. శివసేన పార్టీలో చీలికలు వచ్చి, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత గతేడాది జులై నుంచి అజిత్ పవార్ ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చదవండి: న్యూయార్క్‌లో మోదీ యోగా ఈవెంట్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం
Comments
Please login to add a commentAdd a comment