role
-
వేట్టయాన్‌లో నానికి ఆఫర్ ఆ రోల్.. చివరికీ!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నానికి ఓ పాత్ర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నాని ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే నాని ప్లేస్‌లో పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్‌ను ఎంపిక చేశారు. అయితే నాని నిర్ణయంపై అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. కానీ వీరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీనిపై ఓ అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా నుంచి నాని తప్పించుకున్నాడని రాసుకొచ్చారు. -
జెండర్, లైంగిక సమస్యల పరిష్కారంలో థియేటర్ రోల్
వర్గం, మతం, జెండర్, లైంగిక సమస్యలను పరిష్కార దిశగా న్యూ ఢిల్లీలోని కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ థియేటర్లో జరిగిన ఫెస్టివల్ నటీనటుల పెర్ఫార్మెన్స్ను సరికొత్తగా చూపింది. లైంగికతతో పాటు సామాజిక దుర్బలత్వాలను పరిష్కరించడంలో ఈ సమకాలీన థియేటర్ దృష్టి పెడుతుంది.ఫెస్టివల్ క్యూరేటర్‌గా ఉన్న బెంగళూరుకు చెందిన నటుడు, దర్శకుడు, చిత్రనిర్మాత కీర్తన కుమార్ కొత్త విషయాలను అన్వేషించే నాటకాలను ఒకచోట చేర్చాలని కోరుకున్నారు. అలాగే ‘ఈ రోజుల్లో కళాకారులు ఎలాంటి నాటకాలు వేస్తున్నారు’ అనే అంశం గురించి సంభాషణలను ప్రోత్సహించారు. ‘ఈసారి దృష్టి సమకాలీన థియేటర్‌పై ఉంది. ఎందుకంటే కళాకారులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలనే ఆసక్తితో ΄ాటు వారు ఏ రంగస్థల రూపాలు, భాషలను అన్వేషిస్తున్నారు, ఏ సమస్యలు వారిని ఉత్తేజపరుస్తాయి, ఎలా సృష్టిస్తారు, డబ్బు సమస్యలేంటి, వారి ప్రేరణ ఏమిటి, ఏం వ్యక్తం చేయాలనుకుంటున్నారు...అనేవి ఈ విధానం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు జాతీయ దృష్టిని ఆకర్షించని కళాకారుల నాటకాలు, వారి ఆలోచనలు, రూపాలను ఆహ్వానించాలనుకుంటున్నాను’అని కీర్తన కుమార్ చెప్పింది.ఇతిహాసాల నుంచి...మైసూరు ప్రాంతాలకు సమీపంలో ఉన్న మలే మహదేశ్వర కొండలలోని హలు కురుబా కమ్యూనిటీ పురుషులతో అనుబంధించబడిన బీసు కంసలే అనే విన్యాస జానపద రూపంతో ఈ పండుగ ప్రారంభమైంది. దీని తర్వాత కటకథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్ సమర్పించిన ది నైట్స్, అరేబియన్ నైట్స్ సిరియన్, చైనీస్, ఇండియన్ వెర్షన్లకు తోలుబొమ్మల గౌరవం, కీటకాలతో నిండిన అద్భుత ప్రపంచంలోకి ప్రేక్షకులను స్వాగతించింది. ఇంకా, రామాయణంలోని అరణ్యకాండ నుండి తీసుకున్న అడవిలో నివసించే సోదరులు, వాలి మరియు సుగ్రీవుల కథను పరిచయం చేసింది.మోహిత్ తకల్కర్ రాసిన ‘లవ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్–హోపింగ్ / సోషల్ మీడియా స్క్రోలింగ్’ వేగాన్ని ప్రతిబింబిస్తుంది. అభి తాంబే ద్వారా పోర్టల్ పెయిటింగ్, థియేటర్లో రాక్ షో అనుభవం మనల్ని సమ్మోహితులను చేస్తాయి. నిషా అబ్దుల్లా సోలో ప్రదర్శన. ఇది పోగొట్టుకున్న, శాశ్వతమైన స్నేహాల గురించి మాట్లాడటానికి పాట, కథ, పురాణం, చరిత్రను కలిపి అల్లినది. -
తెరపై చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో నిలిచిపోతుంది: మృణాల్ ఠాకూర్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామలీ స్టార్. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈ మృణాల్ ఠాకూర్ తన పాత్రపై ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ. మృణాల్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను ఇందుగా ఉన్న క్షణాలు. ఇందు నేనుగా ఉన్న క్షణాలు. తెరపై నేను చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో ఉంటుంది. ఇందు పాత్రకు న్యాయం చేయడానికి నేను ఇందుగానే ఉండాలి. ఆమెలా కేవలం షూస్ ధరించడం మాత్రమే కాదు. ఆమెలా ఒక మైలు నడవాలి. ఆమెను నా జీవితంలోకి తీసుకురావడానికి మొదట కొంచెం సవాలుగా అనిపించింది. కానీ నేను నెమ్మదిగా ఆమెను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ... నేను ఆ పాత్రను ఇంకా వదిలివేయాలని అనుకోలేదు. ఇందు పాత్రను నేను ఎంత ఆనందించానో మీరు కూడా ఆస్వాదించారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఇందు పాత్రలో కనిపించింది. ఓ కంపెనీకి సీఈవోగా అందరినీ మెప్పించింది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
హిట్ సినిమాలో రోల్.. నటిపై నెటిజన్స్ ట్రోలింగ్!
గుడ్‌నైట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం లవర్. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్'గా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్‌గా ఐషు పాత్రలో నటి హరిణి సుందరరాజన్ కనిపించింది. ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన లవర్ మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైంది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సోషల్ మీడియా వేదికగా నటి మండిపడింది. మీరు నాపై కోపం ప్రదర్శించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నా పాత్ర నచ్చకపోతే ఒక నటి పట్ల అలా నీచంగా, అగౌరవంగా ప్రవర్తించడం సరైంది కాదని ట్వీట్ చేసింది. ఇకనైనా ఇలాంటి విమర్శలకు ముగింపు పలకాలని కోరింది. కాగా.. హరిణి ఫింగర్‌టిప్ అనే తమిళ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. హీరోయిన్ స్నేహితురాలిగా.. లవర్ చిత్రంలో దివ్య (శ్రీ గౌరీ ప్రియ), అరుణ్ (మణికందన్) ప్రేమించుకుంటారు. అతనిపై అభద్రతా భావంతో అరుణను దివ్య తన మాటలతో దుర్భాషలాడుతూ ఉంటుంది. దీంతో అరుణ్‌కు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. అదే సమయంలో దివ్యకి స్నేహితురాలైన ఐషూ అతనితో బంధానికి ముగింపు చెప్పమని సలహా ఇస్తుంది. దీంతో నెటిజన్ల దృష్టిలో ఐషూ ఒక చెడ్డ స్నేహితురాలిగా కనిపించింది. ప్రేమ జంటకు సమస్యలు సృష్టించారంటూ ఆన్లైన్ ట్రోలింగ్‌కు గురైంది. చాలామంది నెటిజన్స్ ఆమె పాత్రపై కామెంట్స్ చేయడంతో హరిణి స్పందించింది. అది కేవలం సినిమాలో పాత్ర మాత్రమేనని మీకు తెలియదా? అంటూ ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసింది. Secondly, don’t these thick heads realise that this behaviour only warrants the need for more Aishus? Disagreement does not have to be shown with disrespect. — Rini (@rinibot) April 10, 2024 This morning, I woke up to some idiots in my DMs swearing at me because they don’t like Aishu in Lover. Firstly, that they think it’s okay to be vile and disrespectful towards an actor because they didn’t like a character they played is beyond me. — Rini (@rinibot) April 10, 2024 -
ప్రభాస్ కల్కి.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
సలార్ తర్వాత వస్తోన్న ప్రభాస్ మరో చిత్రం 'కల్కి 2989 ఏడీ'. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తోంది. కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్.. భైరవగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ పోస్టర్‌ను షేర్ చేస్తూ రివీల్ చేశారు. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా..ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ప్రభాస్‌తో ఆయన తొలిసారి నటిస్తున్నారు. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. #BHAIRAVA 💥💥💥#Prabhas #Kalki2898AD pic.twitter.com/5QR4icF6w7 — Kalki 2898 AD (@Kalki2898AD) March 8, 2024 -
‘పాక్’ ప్రధాన అభ్యర్థులెవరు? భారత్‌పై వైఖరి ఏమిటి?
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 8న జరగనుంది. ఈ నేపధ్యంలో నవాజ్ షరీఫ్ నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చచే అంచనాలున్నాయి. పలు కేసుల్లో దోషిగా తేలి, జైలులో ఉన్నందున ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల రేసుకు దూరంగా ఉన్నారు. అయితే పాక్ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు ఎవరు? భారత్ విషయంలో వారి అభిప్రాయమేమిటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. నవాజ్ షరీఫ్.. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్)అధినేత నవాజ్ షరీఫ్ నాల్గవసారి ప్రధాని అవుతారనే అంచనాలున్నాయి. షరీఫ్ పలుమార్లు జైలుకు వెళ్లారు. ఆర్థిక వ్యవస్థ, స్వేచ్ఛా మార్కెట్‌పై మంచి పట్టు ఉన్న నవాజ్ షరీఫ్ భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు. తన పార్టీ మేనిఫెస్టోలో భారత్‌తో శాంతి చర్చలపై వాగ్దానం చేశారు. అయితే దీనితోపాటు పాటు ఒక షరతు కూడా విధించారు. కాశ్మీర్ నుంచి రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తే, అప్పుడు భారత్‌తో శాంతి చర్చలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. బిలావల్ భుట్టో జర్దారీ.. 35 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్ పార్టీ (పీపీపీ) నేత. బిలావల్ భుట్టో మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, మాజీ ప్రధాని అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. 2007లో బెనజీర్ హత్యకు గురయ్యారు. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే బిలావల్ పార్టీ పీపీపీ కింగ్ మేకర్ అవుతుంది. భారతదేశంపై బిలావల్ భుట్టో జర్దారీ వైఖరి బహువిధాలుగా ఉంది. ఇమ్రాన్‌ఖాన్ 2022లో పలు అవినీతి ఆరోపణలతో ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ తన పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ద్వారా ప్రజల్లో నానుతున్నారు. సైన్యంతో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎన్నికలలో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019లో ఇమ్రాన్ ఖాన్ శాంతి చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన పుల్వామా దాడి కారకులపై భారత్ చర్య తీసుకునేందుకు తన సంసిద్ధతను తెలిపారు. -
ప్రైవేటు బ్యాంకులకూ ఆ బాధ్యత ఉంది
న్యూఢిల్లీ: దేశంలో పౌరులందరినీ ఆర్థిక రంగంలో భాగస్వాములు చేయాలన్న (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) కేంద్రం సంకల్పంలో ప్రైవేటు రంగ బ్యాంకులూ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక పథకాలకు దూరంగా ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయని సూచిస్తూ, నగదు సంక్షేమ పథకాల ప్రాచుర్యానికి అవి కూడా జత కలవాలన్నారు. తాజాగా జరిగిన 20వ గ్లోబల్ ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, బ్యాంకులు– ఆర్థిక సంస్థలను మూడు రంగాల్లో– కేవైసీ నిబంధనల అమలు, బ్యాంక్ ఖాతాలకు నామినీలు, సైబర్ భద్రతను బలోపేతం చేయడంపై అత్యధిక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లోని 92 శాతం మంది పెద్దలకు కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉందని, ప్రతి సంవత్సరం 3 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరవడం జరుగుతోందని ఆయన వివరించారు. అందరికీ బ్యాంకింగ్ ఖాతాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో సమయం లేదన్న ఆయన ప్రభుత్వ పథకాల విజయవంతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర హర్షణీయమన్నారు. -
కాప్–28లో భారత్ భూమిక కీలకం!
వాతావరణ మార్పులపై మనిషి పోరుకు వేదికగా నిలిచిన కాప్ సమావేశాలు నవంబర్ 30న ప్రారంభం కానున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల 28వ సదస్సు మానవాళి భవిష్యత్తును నిర్దేశించవచ్చు. అంతర్జాతీయ వాతావరణ మార్పుల చర్చల్లో సమూలమైన మార్పు తీసుకు రావాలని భారత్ కాంక్షిస్తోంది. ఆతిథ్య దేశంతో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా కాప్–28 సమా వేశాలు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు. దీనికి కేంద్రబిందువుగా భారత ప్రభుత్వపు లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (లైఫ్) కార్యక్రమం ఉండాలి. సుస్థిర, అతితక్కువ ఇంధన ఖర్చును పోత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు లైఫ్ దోహదపడుతుంది. గత వారం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షంతో యుఏఈలో జనజీవితం స్తంభించిపోయింది. పాఠశాలలు బంద్ అయ్యాయి. పాఠాలు ఆన్లైన్ మార్గం పట్టాయి. కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమయ్యారు. ఒక్కసారిగా ముంచెత్తిన వాన జోరుకు వీధుల్లో కార్లు పడవలయ్యాయి. పౌరుల భద్రతకు అధికార యంత్రాంగం నానా పాట్లూ పడాల్సి వచ్చింది. చిత్రమైన విషయం ఏమిటంటే... యుఏఈ, సౌదీ, బెహ్రాయిన్ వంటి దేశాల ప్రజలు నిన్నమొన్నటివరకూ నింగి నుంచి నేలకు జారే వాన చినుకులు చూసేందుకు రుతుపవవాల సీజన్లో ముంబైకి వచ్చేవారు. కేవలం వాన హోరు, జోరులను ఆస్వాదించేందుకు వీరు నరీమన్ పాయింట్, గేట్ వే ఆఫ్ ఇండియా వంటి ప్రాంతాల్లో సముద్రాభిముఖంగా ఉన్న ఖరీదైన బంగళాలు, హోటళ్లలో దిగేవారు. 1970లలో బయటపడ్డ ముడిచమురు వారి ఈ విలాసానికి సాయపడేది. వాన చినుకులకు వారు ముఖం వాచిపోయి ఉండేవారు. అయితే అది గతం. ఇప్పుడు వారే భారీ వర్షాలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూండటం వైచిత్రి. గాలి మూటలు... నీటి రాతలు... 15 రోజులపాటు కొనసాగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 28వ సమావేశానికీ, వాతావరణ మార్పులపై జరిగే ఇతర సమావేశాలకూ మధ్య స్పష్టమైన తేడా ఇదే కానుంది! ధనిక దేశాలు అనేకం కాప్ సమావేశాల్లో పెద్ద మాటలు మాట్లాడతాయి. అలివికాని హామీలూ గుప్పిస్తాయి. సమావేశాల తరువాత అన్నింటినీ మరచిపోతూంటాయి. ఇప్పుడు ఆ దేశాలూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రత్య క్షంగా చవిచూస్తున్నాయి. అయితే అవి యూఏఈ మాదిరిగా పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటాయన్న గ్యారెంటీ లేదు. మరికొన్ని దేశాలు అసలు సమస్యను కాకుండా, లక్షణాలపై ఎక్కువ దృష్టి పెడతాయి. డోనాల్డ్ ట్రంప్ 2025 జనవరి నాటికి మళ్లీ అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణ మార్పులపై అతడికి నమ్మకం లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాలి. గత పాలకులు సంతకం చేసిన అనేక అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకొనేలా చేసిన ఘనత ఆయనదే. రెండేళ్ల క్రితం గ్లాస్గోలో జరిగిన కాప్–26 సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ కూడా పెద్ద హామీలిచ్చింది. వాతావరణ మార్పులకు మూల కారణాలను వెతికి సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన తరువాత ఏం జరిగిందన్నది వెనుదిరిగి చూసుకుంటే... స్వదేశంలో జరిగిన కాప్–26 సమావేశాలకు వైఫల్యం ముద్ర అంట కూడదనే యూకే అలా ప్రకటించి ఉండవచ్చునన్న అనుమానాలు బల పడుతున్నాయి. యూకేతోపాటు పారిశ్రామిక దిగ్గజ జీ–7 దేశాలన్నీ ఇలాంటి మాటలే మాట్లాడాయి. వాతావరణ మార్పుల సమస్యకు చేసింది మాత్రం సున్నకు సున్న హళ్లికి హళ్లి! కాప్–26లో ఇచ్చిన హామీల అమలును మాత్రమే కాదు... 2015 నాటి కాప్–21 అంటే చారిత్రాత్మక ప్యారిస్ ఒప్పందం విషయంలోనూ యూకే వెనకడుగు వేసింది. వాతావరణ మార్పుల విషయంలో ప్యారిస్ ఒప్పందం మొట్టమొదటి అంతర్జాతీయంగా అమలు చేయదగ్గ చట్టంగా మారడం గమనార్హం. మొత్తం 196 దేశాలు సంతకాలు చేసిన ఈ ఒప్పందం విషయంలో ప్రస్తుత బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్... వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకయ్యే ఖర్చులతో బ్రిటిష్ ప్రజలపై పడే ఆర్థిక భారం ఆమోదయోగ్యం కాదంటున్నారు. మరోవైపు యూఏఈ ఈ ఖర్చులను భరిస్తానని చెప్పడమే కాదు... సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పెట్టుబడుల ద్వారా ఇతర దేశాలకూ సాయం చేస్తామని ప్రకటించింది. సమస్యను పరిష్కరించే గాంధేయవాదం 2015 నాటి కాప్ 21 సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన వాతావరణ మార్పుల విషయంలో నిర్ణయాత్మకంగా మారింది. అప్పటివరకూ సమస్యగా భావించినదే పరిష్కారంలో భాగమైపోయింది. వాస్తవానికి భారత్, కాప్–28కు ఆతిథ్యమిస్తున్న యూఏఈ రెండూ వాతావరణ మార్పుల సమస్య పరిష్కారం విష యంలో ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. అందుకే ఈ కాప్– 28 సమావేశాల్లో భారత్ పాత్ర కీలకం కానుంది. ప్రపంచ దేశాలన్నీ సమస్య పరిష్కారానికి ఒక్కమాటపై కదిలేలా చేసేందుకూ భారత్ గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది జనవరిలో యూఏఈ పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత శాఖ మంత్రి సుల్తాన్ అహ్మద్ అల్ జబేర్‌ను కాప్–28 అధ్యక్ష స్థానం వరించింది. ఆ వెంటనే ఆయన మొదటగా భారత్ పర్యటనకు విచ్చేశారు. దీన్ని భారత్ మరచిపోలేదు. బెంగళూరులో మాట్లాడుతూ కాప్–28పై జబేర్ తన అంచనాలను వివరించారు. దశాబ్ద కాలంగా అల్ జబేర్ తరచూ భారత్‌కు వస్తూన్నారు. భారతీయ నేతలతో ఆయన సంబంధాలు బాగా తెలిసినవే. అల్ జబేర్ మంత్రి మాత్రమే కాకుండా, అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ గ్రూపు సీఈవో కూడా. యూఏఈతో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు మోదీ ప్రయ త్నిస్తున్న సమయంలో ద్వైపాక్షిక ఇంధన సంబంధాలను మార్చేయ డంలో అల్ జబేర్ కీలకపాత్ర పోషించారు. అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ద్వారా భారత్ ఇంధన భద్రతకు గట్టి హామీ కూడా ఇచ్చారు. పరస్పర ప్రయోజనకరమైన ఈ అంశం ప్రస్తుత సమావేశాల్లోనూ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాప్–28 అధ్యక్షుడిగా అల్ జబేర్ మద్దతు ఉండటంతో అంత ర్జాతీయ వాతావరణ మార్పుల చర్చ దిశను నిర్ణయాత్మకంగా మార్చా లని భారత్ కూడా ఆశిస్తోంది. ఆయా దేశాలే కేంద్రంగా సాగుతున్న ప్రయత్నాలను సార్వజనీనం చేసేందుకు భారత్ ప్రయత్నించాలి. దీనికి కేంద్రబిందువుగా మోదీ ప్రభుత్వపు లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరా న్మెంట్ (లైఫ్) కార్యక్రమం ఉండాలి. సుస్థిర, అతితక్కువ ఇంధన ఖర్చును పోత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రజలు అల వర్చుకునేందుకు లైఫ్ కార్యక్రమం దోహదపడుతుంది. దీనికి ప్రపంచ ఆమోదముద్ర పడితే ప్రస్తుత జీవనశైలి భిన్నంగా మారుతుంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు ఆలోచనలు ఆచరణ రూపం దాలుస్తాయి. ధనిక దేశాల ఖరీదైన జీవనశైలి, వృథా వ్యవహారాలకు చెక్ పడుతుంది. వీటి కారణంగా భూమ్మీద వనరులు కరిగిపోతున్న విషయం తెలిసిందే. అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ సీఈవో అయిన అల్ జబేర్ ఆ దేశంలో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహానికీ కృషి చేస్తున్న విషయం చెప్పుకోవాలి. యూఏఈ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ మస్దార్కు ఆయన తొలి సీఈవోగా, తరువాతి కాలంలో చైర్మన్ గానూ పనిచేశారు. ఈ కంపెనీకి దాదాపు 40 దేశాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. కాప్–28లో పర్యావరణానికి హాని కలిగించని ఇంధనాల వాడకం వైపు ప్రపంచం మళ్లేందుకు అల్ జబేర్ కాలుష్య కారక ముడిచమురు పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. యూఏఈ స్వయంగా చమురు అమ్మకాలు చేస్తున్నప్పటికీ పశ్చి మాసియాలో అణుశక్తి కేంద్రం కలిగిన తొలి దేశం కూడా ఇదే కావడం గమనార్హం. పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చేచ్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు యూఏఈ వద్ద పుష్కలం. ఈ నేపథ్యంలోనే 2015 నాటి ప్యారిస్ సమావేశాల కంటే ఈ సారి జరిగే కాప్ సమావేశాలు మరింత ఫలప్రద మవుతాయని ఆశిద్దాం. - కె.పి. నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘గంటా’ అంటే గయ్ గయ్!
సాక్షి, అమరావతి: యాధృచ్ఛికమో.. తనకు కలిసొస్తుందని భావించారో తెలియదుగానీ మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పరంపర రెండు పేర్లతో ప్రత్యేకంగా ముడిపడి ఉండటం గమనార్హం. వీటిలో ఒక పేరు ‘గంటా’ అయితే మరోపేరు ‘లక్ష్మీనారాయణ’!! విచారణ సమయంలో ఈ పేర్లు వింటేనే మాజీ సీఎం చంద్రబాబు గయ్ గయ్‌మంటున్నారు! ఏదో చెప్పలేని గుబులు ఆయనలో మొదలవుతోంది! అటు అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీలో.. ఇటు స్కిల్ కుంభకోణంలోనూ ఈ రెండు పేర్లు ప్రధానంగా తెరపైకి వచ్చాయి. అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రులు, వియ్యంకులైన గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ కీలకం కాగా స్కిల్ స్కామ్‌లో గంటా సుబ్బారావు, రిటైర్డ్ అధికారి లక్ష్మీ నారాయణ ద్వారా చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు! చిర్రుబుర్రులు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఐడీ కస్టడీలో రెండు రోజుల పాటు విచారణ సందర్భంగా గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణ పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు హడలిపోయారు! మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి గుట్టు అంతా వారిద్దరి గుప్పిట్లోనే ఉంది మరి!! అందుకే వారి పేర్లను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ చంద్రబాబు అంతెత్తున లేచారు. మరికొందరు పేర్లను ప్రస్తావిస్తూ వారిని ఎందుకు విచారించరంటూ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. అక్రమ నిధుల తరలింపులో పాత్రధారులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల గురించి అధికారులు ప్రస్తావించగానే చంద్రబాబు చిర్రుబుర్రులాడుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఇంతకీ గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణలతోపాటు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించగానే చంద్రబాబు ఎందుకు అంతగా బెంబేలెత్తిపోయారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే...?? అంతా ఒకే ఒక్కరే.. గంటా 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని వేగంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు మార్గాలను అన్వేషించారు. అందుకోసం ఏర్పాటు చేసిందే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)! తన అక్రమాలకు అక్షయపాత్రగా భావించిన ఏపీఎస్ఎస్డీసీ పూర్తిగా తన సొంత మనుషుల చేతిలో ఉండాలని ఆయన భావించారు. అందుకే ఆ సంస్థను నిబంధనలకు విరుద్ధంగా తనకు సన్నిహితులైన ప్రైవేట్, రిటైర్డ్ వ్యక్తుల గుప్పిట్లో పెట్టారు. వారిలో ఒకరు గంటా సుబ్బారావు. ఆయన ప్రభుత్వ అధికారి కాదు. కానీ ఏకంగా ఏపీఎస్ఎస్డీసీతోపాటు ఆ సంస్థ వ్యవహారాలతో సంబంధం ఉన్న మరో మూడు పోస్టులూ కట్టబెట్టేశారు. గంటా సుబ్బారావును ఏపీఎస్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్– చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ–సీఈవో)గా నియమించారు. అంతటితో ఆగలేదు. మొదట్లో ఏపీఎస్ఎస్డీసీని ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీంతో సంస్థ బిల్లులను ఉన్నత విద్యా శాఖ ద్వారా పంపించాలి. ఈ క్రమంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వద్దకు ఫైళ్లు వెళ్లకుండా పాస్ చేసేందుకు మరో ఎత్తుగడ వేశారు. గంటా సుబ్బారావును ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. అనంతరం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ అనే శాఖను ఏర్పాటు చేశారు. ఆ శాఖకు కూడా గంటా సుబ్బారావునే ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ప్రాజెక్ట్ ఆమోదం, బిల్లుల చెల్లింపు ఫైళ్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకే గంటా సుబ్బారావును నాడు చంద్రబాబు తన ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. దాంతో ఏపీఎస్ఎస్ఎస్డీసీలో ప్రాజెక్ట్ ఫైళ్లు తయారు చేసేది, ఉన్నత విద్యా శాఖ, స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ శాఖల్లో పరిశీలించి ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపేది, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ ఫైళ్లను పరిశీలించి తుది ఆమోదం తెలిపేది అంతా ఒకే ఒక్కరే ఆయనే గంటా సుబ్బారావు కావడం గమనార్హం. ప్రైవేట్ వ్యక్తికి నాలుగు పోస్టులు కట్టబెడుతూ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి ఆమోదించారు. ఆ ముగ్గురి ప్రస్తావనే రానివ్వకుండా గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ ప్రధాన పాత్రధారులుగా చంద్రబాబు కొల్లగొట్టిన స్కిల్ ప్రాజెక్ట్ నిధులను అక్రమంగా తరలించడంలో బాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలకంగా వ్యవహరించారు. సిట్ దర్యాప్తులో ఈ ముగ్గురి గురించి ప్రశ్నించే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. సిట్‌కు ఇచ్చిన రెండు రోజుల సమయాన్ని వీలైనంత వరకు వృథా చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణ షెడ్యూల్ అని ముందే కోర్టు నిర్ణయించింది. అందులో ప్రతి గంటకు ఐదు నిముషాలు విరామం, భోజన విరామం కూడా ఉంటుంది. మొదటి రోజు శనివారం మధ్యాహ్నం 12గంటల వరకు అసలు విచారణ మొదలు కాకుండా అడ్డుకున్నారు. కస్టడీ కాపీ కావాలని అడిగి దాన్ని చదువుతూ కాలహరణం చేశారు. వివిధ పత్రాలను పరిశీలించాలంటూ సమయాన్ని వృథా చేశారు. రెండో రోజు తన రాజకీయ అనుభవం గురించి పాతచింతకాయ పచ్చడిలా కథలు చెబుతూ సమయాన్ని గడిపారు. గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణ గురించి గానీ, పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల గురించి ప్రస్తావించగానే చంద్రబాబు అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం గమనార్హం. అంటే ఆ ఐదుగురితో ఈ కుంభకోణం ముడిపడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. బాబు బాల్య స్నేహితుడే.. విద్యార్థి దశలో తన స్నేహితుడైన రిటైర్డ్ అధికారి కె.లక్ష్మీనారాయణను ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా చంద్రబాబు నియమించారు. తాను ఇతరత్రా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా ఏపీఎస్ఎస్డీసీలో వ్యవహారాలు సాగేలా చూసేందుకే లక్ష్మీనారాయణను తెచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ రూపకల్పన, అందుకు అనుగుణంగా జీవో జారీ, నకిలీ ఒప్పందం ఆమోదం, షెల్ కంపెనీల ద్వారా నిధుల అక్రమ తరలింపు.. అంతా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. అంటే స్కిల్ స్కామ్ కీలక గుట్టు అంతా గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ వద్దే ఉంది. ఈ క్రమంలో వారిద్దరిని ఎందుకు నియమించారు? వారితో సాగించిన వ్యవహారాలేమిటి? అని సిట్ అధికారులు అడిగేసరికి చంద్రబాబు కంగుతిన్నారు. ఎవరిని విచారించాలో బాబే చెబుతారట..! ఎక్కడైనా దర్యాప్తు అధికారులు చట్ట ప్రకారమే విచారణ నిర్వహిస్తారు. దీనిపై ముద్దాయిలు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించవచ్చు. చంద్రబాబు మాత్రం తాను చెప్పినట్లే దర్యాప్తు సాగాలనే రీతిలో వ్యవహరించారు. స్కిల్ స్కామ్‌లో సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, సంబంధిత కంపెనీల ప్రతినిధులను సిట్ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా విచారించారు. కానీ చంద్రబాబు మాత్రం వివిధ హోదాల్లో పనిచేసిన ఉన్నతాధికారులను ఎందుకు విచారించరంటూ ఎదురు ప్రశ్నించడం గమనార్హం. వాస్తవానికి ప్రేమచంద్రారెడ్డి ఆ పోస్టులోకి వచ్చేసరికే 90శాతం నిధులను టీడీపీ ప్రభుత్వం చెల్లించేసింది. దీంతో ఆయన మూడో పార్టీ నివేదిక కావాలని కోరారు. దీనిపై నాడు గంటా సుబ్బారావు, డిజైన్ టెక్ కంపెనీ ప్రతినిధులు సీఐటీడీ పేరుతో కనికట్టు చేశారు. స్కిల్ ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కేవలం పత్రాల్లో ఉన్న వివరాలను పొందుపరుస్తూ ఇచ్చిన ఓ నివేదికను మూడో పార్టీ మదింపు నివేదికగా మభ్యపుచ్చారు. ఈ విషయాలన్నీ సిట్ దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడయ్యాయి. సీఐటీడీ ఆ విషయాన్ని సిట్‌కు లిఖితపూర్వకంగా వెల్లడించింది కూడా. సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా తెలియజేయడంతోపాటు న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. దీన్నిబట్టి సిట్ ఎంత పకడ్బందీగా నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తోందన్నది వెల్లడవుతోంది. -
మస్టర్ ఒకరిది! డ్యూటీలో మరొకరు!! అంతలోనే..
మంచిర్యాల: సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా అధికారుల పర్యవేక్షణ లోపంతో.. కార్మికుడి స్థానంలో మరొకరు విధులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంస్థ వ్యాప్తంగా సంచలనమైంది. సమాచారం అందుకున్న అధికారులు గని అధికారికి చార్జి మెమో జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏరియాలోని కేకే–5 గనిలో టెక్నికల్ ఉద్యోగి విధి నిర్వహణకు 15 రోజుల క్రితం గనిపైకి వచ్చి మస్టర్ పడ్డాడు. ఆరోజు ఆదివారం కావడంతో సహోద్యోగులు దావత్ ఏర్పాటు చేశారు. ఈమేరకు విధులకు వచ్చిన కార్మికుడికి కూడా సమాచారం అందించారు. దీంతో సదరు కార్మికుడు విధులకు డుమ్మా కొట్టలేక ఆ గనిలోనే విధులు నిర్వహించే మరో టెక్నికల్ ఉద్యోగిని పిలిపించి అతడితో డ్యూటీ చేయించాడు. ఈ విషయం ఇటీవల బయటకు వచ్చింది. విధులు నిర్వహించిన ఉద్యోగికి గని అధికారి నోటీస్ జారీ చేసినట్లు సమాచారం. సింగరేణి చరిత్రలో మస్టర్ ఒకరు పడి విధులు మరొకరు చేయడం ఇంత వరకు ఎరిగి ఉండమని, విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఉండేదని అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. -
ఎన్సీపీలో కలవరం.. అజిత్ పవార్ కొత్త డిమాండ్..
ముంబయి: ఎన్సీపీలో ప్రధాన బాధ్యతను సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లకు అప్పజెప్పుతూ శరద్ పవార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే..పార్టీ నిర్ణయానికి ఎదురుచెప్పలేక అప్పటికి సరే అని తలాడించిన అజిత్ పవార్.. ప్రస్తుతం కొత్త మెలిక పెట్టారు. పార్టీలో తనకు కొత్త బాధ్యత కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఎన్సీపీలో కొత్త కలవరం మొదలైంది. మహారాష్ట్ర అసెంబ్లీలో తనకున్న ప్రతిపక్ష నాయకుని బాధ్యత వద్దంటూ అధిష్ఠానానికి అజిత్ పవార్ తెగేసి చెప్పారు. ముంబయిలో జరిగిన 24 వ వసంతోత్సవ వేడుకల్లో ఈ మేరకు తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా పూర్తి న్యాయం చేస్తానని చెప్పారు. ప్రతిపక్ష నాయకునిగా మాత్రం పనిచేయలేనని తెలిపారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు అజిత్ పవార్. శివసేన పార్టీలో చీలికలు వచ్చి, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత గతేడాది జులై నుంచి అజిత్ పవార్ ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: న్యూయార్క్‌లో మోదీ యోగా ఈవెంట్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం -
శాంతి స్థాపనలో భారత్ ముఖ్యపాత్ర?
ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. శాశ్వత కాల్పుల విరమణను, స్థిరమైన శాంతిని సాధించడానికి దీర్ఘకాలిక అంకితభావం, పట్టుదలతో పాటు అంతర్జాతీయ ఒత్తిడి అవసరం. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో శాంతి భద్రతలను నిర్వహించడంలో భారత్ ముఖ్యమైన పాత్రను పోషించింది. పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ భారత్ నాయకత్వం సన్నిహితంగా ఉండటంతో శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధాని మధ్యవర్తిత్వం వహించవచ్చని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. సమస్యను పరిష్కరించడంలో అగ్రదేశాలు విఫలమవుతున్న నేపథ్యంలో భారత్ గురుతర బాధ్యత పోషించాల్సి ఉంది. మెజారిటీ దేశాల ఆర్థిక వ్యవస్థలను అధమ స్థాయికి చేర్చిన 15 నెలల రష్యా–ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఇంధనం, ఆహార మార్కెట్లకు భారీ షాక్ ఇచ్చింది. సరఫరాను తగ్గించి, నిత్యావసరాల ధరలను మునుపెన్నడూ లేని స్థాయికి పెంచింది. ఇతర ఆర్థిక ప్రాంతా లతో పోలిస్తే, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర రేపే ఆర్థిక పరిణామా లకు యూరో ప్రాంతానికి ప్రత్యేకించి హాని కలుగుతుంది. అణ్వాయుధాలను ఆశ్రయించవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పదేపదే హెచ్చరించినప్పటికీ, అణుయుద్ధం జరిగే అవకాశాలు పెద్దగా లేవు. తనను బెదిరించినట్లయితే రష్యా ‘ప్రాదేశిక సమగ్రతను’ రక్షించడానికి ‘అందుబాటులో ఉన్న అన్ని ఆయుధ వ్యవస్థలను’ ఉపయోగిస్తానని పుతిన్ 2022 సెప్టెంబరు 21న తేల్చిచెప్పారు. భారత్ స్పందనేమిటి? భారతదేశం సాంప్రదాయకంగా అంతర్జాతీయ సంఘర్షణలలో అలీన విధానాన్ని, తటస్థ విధానాన్ని అనుసరిస్తోంది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ, సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చింది. పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నిహితంగా ఉండటంతో శాంతి నెల కొల్పేందుకు ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం వహించవచ్చని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని భారత్ నిల కడగా సమర్థిస్తోంది. అయితే ఉక్రెయిన్‌లో ‘సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత శాంతి’ ఆవశ్యకతను నొక్కిచెప్పే తీర్మానంపై ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఓటింగుకు మాత్రం భారత్ దూరంగా ఉండి పోయింది. 2015లో, క్రిమియాను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ చేసిన తీర్మానానికి... ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే విధానాన్ని పేర్కొంటూ భారతదేశం దూరంగా ఉంది. అయితే దౌత్య మార్గాల ద్వారా వివా దానికి శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం పిలుపునిచ్చింది. అలాగే మిన్స్క్ ఒప్పందం అమలు జరగాలని సూచించింది. భారత్ వైఖరిని ఉక్రెయిన్‌తో సహా కొన్ని దేశాలు విమర్శించాయి, రష్యా చర్యలపై న్యూఢిల్లీ మరింత బలమైన వైఖరిని తీసుకోవాలని ఉక్రెయిన్ వాదించింది. అంతర్జాతీయ శాంతి పరిరక్షక ప్రయత్నాలలో, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి మిషన్లలో పాల్గొనడం ద్వారా భారత దేశం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఐరాస శాంతి పరిరక్షక కార్యకలాపాలకు దళాలను స్థిరంగా అందించిన సుదీర్ఘ చరిత్ర భార త్‌కు ఉంది. పైగా ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో శాంతి భద్రతలను నిర్వహించడంలో భారత్ ముఖ్య పాత్రను పోషించింది. విశ్వసనీయ దేశం దేశాల సఖ్యత విషయంలో భారతదేశం విశ్వసనీయతను పొందు తోంది. ఇండో–పసిఫిక్ ఫోరమ్ దేశాలు భారత టీకా దౌత్యం, అవస రమైన సమయంలో మానవతా సహాయం తర్వాత భారతదేశంతో సహకారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఆస్ట్రేలి యాతో ద్వైపాక్షిక సంబంధాలు కూడా గణనీయమైన పురోగతిని చూపుతున్నాయి. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బ నీస్ మధ్య సమావేశాలు పరస్పర విశ్వాసంతో గౌరవంతో జరిగాయి. సంబంధాలను మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేసిన తర్వాత, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీల కోసం భారత్‌కు లిథియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉండటంతో ఇరుపక్షాల సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. హిరోషిమాలో ఇటీవల జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ రష్యాతో యుద్ధాన్ని ముగించే శాంతి ప్రణాళికను ప్రధాని మోదీకి అందించారు. దానికి భారతదేశం ఆమోదం కోరారు. ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా మోదీని ఆహ్వానించారు కూడా. అధికారిక సోర్సుల ప్రకారం, అనేక దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్ వైపు చూస్తున్నాయని భావించినందున, తన శాంతి ప్రతిపాదనకు మద్దతు కోరడం మినహా జెలెన్స్కీ భారతదేశంపై ఎటువంటి డిమాండ్ మోపలేదు. ఈ ప్రతి పాదనను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. శాంతి స్థాపన చర్యలు ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణను అమలు చేయడం అనేది బహుళ పార్టీలతో, భౌగోళిక రాజకీయ పరిగణనలతో కూడిన సంక్లిష్ట సమస్య. కాల్పుల విరమణ కోసం తీసుకోవాల్సిన కొన్ని చర్యలు: ఉక్రెయిన్, రష్యా, తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద సమూహాలతో సహా వివాదాస్పద పక్షాల మధ్య చర్చలను సులభ తరం చేయడానికిగానూ దౌత్య ప్రయత్నాలను ప్రోత్సహించడం; సంభాషణను, శాంతి చర్చలను సులభతరం చేయడానికి ఐక్యరాజ్య సమితి లేదా ఐరోపాలో భద్రత, సహకార సంస్థ (ఓఎస్‌సీఈ) వంటి అంతర్జాతీయ మధ్యవర్తులు లేదా సంస్థలను నిమగ్నం చేయడం; విరుద్ధమైన పార్టీలు శత్రుత్వాలను విరమించుకోవడానికి తగిన దౌత్య పరమైన ఒత్తిడి తీసుకురావాలని యూఎస్, యూరోపియన్ యూని యన్, పొరుగుదేశాల వంటి అంతర్జాతీయ పాత్రధారులను కోరడం; కాల్పుల విరమణకు అనుగుణంగా ఆర్థిక ఆంక్షలు విధించడం; దౌత్య పరంగా ఒంటరయ్యేట్టు చూడటం; ఇంకా ఇతర రాజకీయ చర్యలను ఉపయోగించవచ్చు. ప్రమేయం ఉన్న పక్షాల మధ్య సంభాషణ, నమ్మ కాన్ని పెంపొందించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేలా పరస్పర విశ్వాసాన్ని పాదుగొలిపే చర్యలు తప్పనిసరి. ఇందులో ఖైదీల మార్పిడి, భారీ ఆయుధాల ఉపసంహరణ, నిర్దిష్ట స్థానికప్రాంతాల్లో కాల్పుల విరమణల అమలు వంటివి ఉంటాయి. అంతేకాకుండా, సంఘర్షణలో చిక్కుకున్న పౌరులకు వైద్య సామగ్రి, ఆహారం, ఆశ్రయంతో సహా ప్రభావిత ప్రాంతాల్లో మాన వతా సహాయానికి, తోడ్పాటుకు అనియంత్రిత ప్రాప్యతను ఏర్పరచా ల్సిన అవసరం ఉంది. జనాల బాధలను తగ్గించడానికి, సద్భావనను పెంపొందించడానికి రెండు వైపులా మానవతా సాయాన్ని అందించాలి. దీనితో పాటు కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించడానికి, ధృవీకరించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇందులో అంతర్జాతీయ పరిశీలకులు, శాంతి పరిరక్షక దళాలకు ప్రమేయం ఉండాలి. ఈ సంస్థలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను నివేదించడంలో సహాయపడతాయి. అలాగే అంగీకరించిన నిబంధ నలకు అనుగుణంగా ఉండేలా చూడటం ద్వారా పార్టీల మధ్య విశ్వా సాన్ని పెంపొందించవచ్చు. రాజకీయ, ఆర్థిక, జాతిపరమైన మనోవేద నలతో సహా సంఘర్షణ మూల కారణాలను పరిష్కరించడానికి రాజ కీయ సంభాషణలను, సయోధ్యను ప్రోత్సహించాలి. సంఘర్షణ– ప్రభావిత ప్రాంతాల ప్రతినిధులతో సహా మొత్తం వాటాదారులను నిమగ్నం చేయడం అనేది, అంతర్లీన సమస్యలను పరిష్కరించడంలో, స్థిరమైన శాంతి ఒప్పందం కోసం పని చేయడంలో సహాయపడుతుంది. ఈ పరిమాణంలో ఉన్న సంఘర్షణను పరిష్కరించడానికి అన్ని పార్టీల నిబద్ధత, సహకారం అవసరం. శాశ్వత కాల్పుల విరమణను, సుస్థిరమైన శాంతిని సాధించడానికి దీర్ఘకాలిక అంకితభావం, పట్టుదల, అంతర్జాతీయ ఒత్తిడి అవసరం. వ్యాసకర్త అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నా కుటుంబాన్ని మిస్ అయ్యాను.. నేను ప్రేమించిన వాళ్ళ దగ్గరకు వెళ్లి బాధలు పడ్డాను
-
సీనియర్ ఎన్టీఆర్‌గా తారక్‌ను అందుకే తీసుకోలేదు: అశ్వినీదత్
దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ను తీసుకొచ్చింది. ఓవర్ నైట్ స్టార్డమ్తో కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిందీ సినిమా. అంతేకాకుండా జాతీయ అవార్డును సైతం అందుకుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో శివాజీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించగా, అక్కినేని నాగేశ్వర రావు పాత్రను ఆయన మనవడు, యంగ్ హీరో నాగ చైతన్య పోషించి మెప్పించిన విషయం తెలిసిందే. కానీ నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ పాత్రను మాత్రం ఎవరూ చేయలేదు. ముందుగా సీనియర్ ఎన్టీఆర్ రోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సింది. పలు కారణాల వల్ల అలా కుదరలేదని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తాజాగా తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మహానటి చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను తారక్‌తో చేయిద్దామని అనుకున్నాం. కానీ ఈలోగా బాలకృష్ణ గారు ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించారు. దీంతో మా సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో ఎవరిని పెట్టి తీసినా తప్పుగా భావిస్తారేమో అని అనిపించింది. ఒకవేళ తారక్ చేసినా బాగుండదేమో అని కూడా అనిపించింది. నాగ్ అశ్విన్‌తో చెబితే అసలు ఆయన పాత్ర లేకుండానే తీస్తా అని చెప్పి తెరకెక్కించాడు. ఆయన పాత్రకు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చేప్పారు. మిగతా అంతా మేనేజ్ చేశాం'' అని వెల్లడించారు. చదవండి: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు ! నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్ సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! -
అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి..
Chiranjeevi Introduces Kareena Kapoor As Roopa: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ 57 ఏళ్ల వయసులోనూ విభిన్న పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను చిరంజీవి సమర్పణలో తెలుగు వెర్షన్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది బాలీవుడ్ దివా కరీనా కపూర్. తాజాగా కరీనా పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 'లాల్‌సింగ్ చద్దా' ప్రేయసి 'రూప'గా కరీనాను పరిచయం చేశారు చిరంజీవి. ''‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను.. వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’'' అని ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ పోస్టర్లో అమీర్ ఖాన్‌ను కరీనా కపూర్ హగ్ చేసుకుని ఉండటం చూడముచ్చటగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికీ.. ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను...వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’. Introducing Rupa from #LaalSinghChaddha #Rupa #KareenaKapoorKhan #AamirKhan @AKPPL_Official @Viacom18Studios @chay_akkineni #11August22Release pic.twitter.com/fcKUJ4QTy3 — Chiranjeevi Konidela (@KChiruTweets) July 18, 2022 -
తండ్రి కోసం కొడుకు చేసే యుద్ధమే ఈ సిరీస్: నవీన్ చంద్ర
Naveen Chandra About His Role In Parampara 2: హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్.. ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. నవీన్ చంద్ర 'గోపీ' పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'పరంపర'. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ విశేషాలను పంచుకున్నారు నవీన్ చంద్ర. - పరంపర వెబ్ సిరీస్ మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయ్యింది. తొలి భాగంతో పాటు సెకండ్ సీజన్ కూ అప్పుడే సన్నాహాలు ప్రారంభించాం. అందుకే ఇంత త్వరగా సెకండ్ సీజన్ ను మీ ముందుకు తీసుకురాగలిగాం. దీనికి ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ముందు చూపే కారణం. ఫస్ట్ సీజన్ హిట్టయితే తప్పకుండా సెకండ్ సీజన్ కు క్రేజ్ ఉంటుందని వాళ్లు సరిగ్గానే అంచనా వేశారు. - ఈ వెబ్ సిరీస్ లో గోపి అనే పాత్రలో నటించాను. పొలిటికల్ రివేంజ్ డ్రామా ఇది. నా క్యారెక్టర్ ఈ సెకండ్ సీజన్ లోనే పవర్ ఫుల్ గా మారుతుంది. ఫస్ట్ సీజన్ లో శరత్ కుమార్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ సీజన్ లో నేను అతని మీద పైచేయి సాధిస్తాను. తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరు ప్రతిష్టలను తిరిగి నాన్నకు ఇచ్చేందుకు ఓ కొడుకు చేసిన యుద్ధమే ఈ వెబ్ సిరీస్. తండ్రిని పరాజితుడిగా చూడలేకపోతాడు గోపి. నాన్న కోల్పోయినవన్నీ తిరిగి ఇప్పించేందుకు ఫైట్ చేస్తుంటాడు. - ఈ వెబ్ సిరీస్ లో ఆరేడు పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నాకు ఇలాంటి కథలంటే చాలా ఇష్టం. హీరోకు స్కోప్ ఉండి మిగతా పాత్రలు తేలిపోతే అందులో ఆసక్తి ఉండదు. అన్ని క్యారెక్టర్స్‌కు నటించేందుకు అవకాశం ఉండాలి. అప్పుడే కథ బాగుంటుంది. మొదటి సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ సిరీస్ ను ఇంకా జాగ్రత్తగా అన్ని ఎమోషన్స్ కలిపి చేశాం. - రామ్ చరణ్ మా సిరీస్ ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. స్టార్స్ తో ప్రమోషన్ చేస్తే దాని రీచింగ్ వేరుగా ఉంటుంది. కోవిడ్ వల్ల థియేటర్స్ కు దూరమైన ప్రేక్షకులు ఓటీటీని ఎక్కువగా ఆదరించడం మొదలుపెట్టారు. మధ్యలో మళ్లీ థియేటర్లకు వెల్లారు. ఇప్పుడు ఓటీటీపై ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంటెంట్ ఎక్కడున్న వాళ్ల ఆదరణ దక్కుతుందని నా నమ్మకం. - నటుడిగా పేరు తెచ్చే అవకాశాలు ఎక్కడున్నా వదులుకోను. నా మొదటి చిత్రం 'అందాల రాక్షసి'తో గుర్తింపు దక్కింది. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత వీర రాఘవ'లో నటించినప్పుడు మరోసారి ఫేమ్ అయ్యాను. ఎన్టీఆర్ ఆ సినిమా ఫంక్షన్ స్టేజీ మీదే నా పాత్ర గురించి, నెను ఎంత బాగా నటించాను అనేది చెప్పారు. అది ఇండస్ట్రీలో బాగా రీచ్ అయ్యింది. - నేను విలన్ పాత్రల్లో నటించినా మీ విలనీ బాగుంది అంటారు. గ్రే క్యారెక్టర్స్ చేసినా బాగుంటుంది అని చెబుతుంటారు. ప్రేక్షకుల నుంచి వచ్చేది స్పందన నిజాయితీగా ఉంటుంది. నేను అది ఎక్కువగా తీసుకుంటాను. సోషల్ మీడియా ద్వారా కూడా అన్నా, మీ క్యారెక్టర్ బాగుంది అని కామెంట్స్ చేస్తుంటారు. 'విరాటపర్వం'లో నా రోల్ పెంచాల్సింది అనే కామెంట్స్ వచ్చాయి. - నటుడిని అయ్యేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నాలో నటన మీద ఎలాంటి ఇష్టం ఉందో, ఇప్పటికీ అదే ఆసక్తి , ఉత్సాహం ఉన్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా వెబ్ సిరీస్ ఏది చేసినా నటుడిగా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాను. -
ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్
Vaani Kapoor Reveals Her Horse Riding Experience: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ వాణీ కపూర్. నాని నటించిన 'ఆహా కల్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు కమర్షియల్ మూవీస్తోపాటు మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్‌లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన చిత్రం 'షంషేరా'. రణ్‌బీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో సోనా అనే పాత్రలో అలరించనుంది వాణీ కపూర్. అయితే ఈ పాత్ర కోసం వాణీ కపూర్ స్పెషల్‌గా గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు తెలిపింది. గుర్రపు స్వారీ నేర్చుకున్న అనుభవాలను 'షంషేరా' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఇది నాకెంతో ఛాలేంజింగ్ పాత్ర. దీనికోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకున్నా. నా దృష్టిలో గుర్రాలు అత్యంత అందమైన జంతువులు. వాటికి ప్రేమ భాష మాత్రమే తెలుసు. స్వారీ నేర్చుకోవడానికి ముందు వాటితో సన్నిహితంగా ఉండటం, స్నేహం చేయడం, ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవడం అవసరం. లేకపోతే అవి మనల్ని విసిరేస్తాయి. అందుకే శిక్షణ సమయంలో నేను వాటికోసం ఆహారం తీసుకొచ్చేదాన్ని. అలా వాటిని మచ్చిక చేసుకుని స్వారీ నేర్చుకున్నా.' అని తెలిపింది వాణీ కపూర్. కాగా కరణ్ మల్హోత్రా తెరకెక్కించిన 'షంషేరా' చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Meet Sona ✨ Watch how Sona's character came to life.. pic.twitter.com/loe1mbEgUR Shamshera releasing in Hindi, Tamil & Telugu. Celebrate #Shamshera with #YRF50 only at a theatre near you on 22nd July. #RanbirKapoor @duttsanjay @RonitBoseRoy @saurabhshukla_s @karanmalhotra21 @yrf — Vaani Kapoor (@Vaaniofficial) July 9, 2022 -
'శక్తిమాన్'గా రానున్న ఆ స్టార్ హీరో ?
Ranveer Singh As Shaktiman: శక్తిమాన్.. ఈ టీవీ షో అంటే 1990 కిడ్స్‌కు అమితమైన అభిమానం. ఇప్పుడంటే మార్వెల్, డిస్నీ వంటి హాలీవుడ్ సూపర్ హీలోలు ఉన్నారు కానీ, అప్పట్లోనే ఇండియన్ సూపర్ హీరోగా వెలుగొందాడు ఈ శక్తిమాన్. ఈ శక్తిమాన్ పాత్రలో ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే సుమారు 29 ఏళ్ల తర్వాత ఈ టీవీ షో సినిమాగా రానుంది. దీనికి సంబంధించిన హక్కుల్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాంగా తెరకెక్కించేందుకు 'భీష్మ్ ఇంటర్నేషనల్'తో కలిసి సోనీ పిక్చర్స్ నిర్మించనుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో సూపర్ హీరో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పాత్ర చేసేందుకు రణ్వీర్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శక్తిమాన్‌గా రణ్వీర్ నటిస్తే ఆ పాత్రకు ఒక ప్రత్యేకత వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 'శక్తిమాన్' రీమేక్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చదవండి: బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. తనకన్నా చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్, ఇద్దరు పుట్టాక పెళ్లి ! -
ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు
Bengali Actor Rahul Arunoday Banerjee Kept Mum For 15 Days: సినిమాల్లో రియల్ స్టంట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచే హీరోలు ఉన్నారు. అలాగే పాత్రలో ఒదిగిపోయేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడతారు కొందరు నటులు. అలాంటి నటుల్లో ఒకరు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ. ఆయన తాజాగా నటించిన బెంగాలీ చిత్రం 'మృత్యుపతోజాత్రి (ఎవరు చనిపోతారో)'. సౌమ్య సేన్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరణశిక్ష పడిన ఖైదీ పాత్రలో రాహుల్ నటించారు. చనిపోవడానికి 12 గంటల ముందు ఖైదీల మానసిక పరిస్థితిని ఇందులో చూపించారు. అయితే ఇందుకోసం షూటింగ్‌కు ముందు సుమారు 15 రోజులు ఎవరితోనూ రాహుల్ మాట్లాడలేదట. కనీసం వారి ఇంటిసభ్యులతో కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నాడట. 'నిజానికి తాము ఎప్పుడూ చనిపోతామో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ, తన జీవితం 12 గంటల తర్వాత ముగుస్తుందని తెలుసు. దానిని అర్థం చేసుకోవడం కష్టం. అతనికి తెలుసు ఆ మరణంలో ఎలాంటి గౌరవం ఉండదని. ఆ సమయంలో అతనికి మద్దతుగా ఎవరు నిలబడరు. నేను చిత్రీకరణకు 15 రోజులు ముందు నుంచే మా ఇంట్లోవాళ్లతో మాట్లాడటం మానేశాను. మా డైరెక్టర్ సౌమ్య సేన్‌గుప్తా చాలా బాగా రీసెర్చ్ చేశారు. చాలా స్టడీ మెటీరియల్స్ ఇచ్చారు.' అని పేర్కొన్నారు నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ. చదవండి: వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. 'ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. ఇది కల్పితమైనప్పటికీ నిజ జీవితంలో ఖైదీల గురించి కొన్ని పుస్తకాలు, న్యాయవాదులు, పోలీసులతో జరిగిన చర్చల ఆధారంగా స్క్రిప్ట్‌ను డెవలప్ చేయడంలో ఉపయోగపడ్డాయి. ఉరిశిక్ష పడిన ఖైదీ చివరి 12 గంటలు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. ఆ సమయంలో అపరాధ భావం, మానసిక సంఘర్షణ, మరణ భయం వంటి విషయాలను ఎలా అనుభవిస్తారో ప్రేక్షకులకు తెలియచెప్పాలనుకున్నాను. ప్రేమ, జీవితాలపై సినిమాలు చేయగలిగినప్పుడు మరణంపై ఎందుకు సినిమా తీయకూడదు.' అని తెలిపారు డైరెక్టర్ సౌమ్య సేన్‌గుప్తా. -
ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్
Sathyaraj About His Role In Chennai Express Movie: దక్షిణాది ప్రముఖ నటుల్లో సత్యరాజ్ ఒకరు. దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన బాహుబాలితో కట్టప్పగా వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయ్యారు. కథ, పాత్ర నచ్చితే చాలు అందులో ఇమిడిపోతారు. ఎలాంటి సన్నివేశాలకైన వెనుకాడరు. అలాంటి ఆయన పాత్ర నచ్చకపోయిన ఓ మూవీ ఒప్పుకున్నారట. కేవలం అందులోని హీరో కోసమే ఆ పాత్ర చేశానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కట్టప్ప. 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో పాత్ర కోసం చిత్రబృందం నన్ను సంప్రదించింది. కానీ నాకు ఆ పాత్ర గొప్పదిగా అనిపించలేదు. ఇదే విషయాన్ని షారుక్, డైరెక్టర్ రోహిత్ శెట్టికి చెప్పాను. కానీ ఫైనల్‌గా షారుక్ ఖాన్‌పై అభిమానంతో ఆ మూవీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే షారుక్ అంటే నాకెప్పటి నుంచో అభిమానం. ఆయన నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే ఎన్నోసార్లు చూశా. అందులో షారుక్ నటన నాకెంతో నచ్చింది. అందుకే ఆయనతో నటించాలన్న ఉద్దేశంతో ఆ సినిమా ఒప్పుకున్నా.' అని సత్యరాజ్ తెలిపారు. కాగా యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో హీరోయిన్ దీపిక పదుకొణె తండ్రి పాత్రలో లోకల్ మాఫియా నాయకుడిగా సత్యరాజ్ నటించారు. -
డైరెక్టర్‌గా మారిన పాపులర్ హీరోయిన్.. ఏ సినిమా అంటే ?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. టాలీవుడ్లో 'నెం 1 నేనొక్కడినే' సినిమాతో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన కృతి సనన్ నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఎత్తు విషయంలో తనకు సరైన జోడి అని ఆ మూవీ ఫంక్షన్లో మహేశ్ బాబు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి 'దోచెయ్' సినిమాతో అలరించింది. అనంతరం తెలుగులో ఆశించినంతగా అవకాశాలు రాకపోయేసరికి మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది. తాజాగా కృతి నటిస్తున్న చిత్రం 'బచ్చన్ పాండే'. బాలీవుడ్ యాక్షన్, కామేడీ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి పూర్తి స్థాయిలో మసాలా ఎంటర్టైనర్ను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీలో డైరెక్టర్‌గా మైరా దేవేకర్గా కృతి సనన్ అలరించనుంది. దర్శకురాలిగా నటించడంపై 'కృతి ఒక నటిగా మీరు నిర్దిష్ట సంఖ్యలో సినిమాలను పూర్తి చేసిన తర్వాత మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా నటించాలనుకుంటారు. ఈ యాక్టింగ్ కేవలం చుట్టూ ఉన్న పరిసరాను గమనించడం ద్వారా దర్శకులు ఎలా తెరకెక్కించాలనుకుంటారో అర్థంమవుతుంది. వారి దృష్టి కోణం, తీర్చిదిద్దే విధానం, ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుంది. ఇదంతా నేను చాలా ప్రతిభావంతులైన డైరెక్టర్లలో చూశాను. వారి నుంచి ఇది నేర్చుకోవడం నాకు చాలా సులభమైనట్లు అనిపిస్తుంది. ఒక డైరెక్టర్ సెట్లో అన్ని కంట్రోల్ ఉంచుతూ కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా ఉంటారు. అలాగే మైరా ఒక ప్రదేశంలో ఇరుక్కుపోయి, పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందనేదే ఈ చిత్రం'. అని తెలిపింది. -
'స్పిరిట్'లో ప్రభాస్ రోల్ రివీల్ !.. ఇక ఫ్యాన్స్‌కు పండగే
Prabhas Role Revealed In Spirit Movie: ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్లో తెరంగ్రేటం చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అప్పటినుంచి ఏ మూవీ తెరకెక్కిన పాన్ పాన్ ఇండియా చిత్రంగానే చేస్తున్నాడు. ఇలా వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా రాధేశ్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ చేసిన ట్వీట్‌తో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే ఆదిపురుష్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న మిర్చీ హీరో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్. ఇక ఈ సినిమా తర్వాత సెట్స్ మీదకు వెళ్లేది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ మూవీ. అర్జున్ రెడ్డితో సూపర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డితో ప్రభాస్ సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా సినిమా టైటిల్ మరింత హైప్ పెంచేలా ఉంది. వీటన్నిటికి తోడు ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించేలా ఉంది. అదేంటంటే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫిసర్‌గా కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని ఆదిపురుష్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ ప్రభాస్ పోలీసు పాత్రలో నటించలేదు. కానీ అభిమానులు మాత్రం ఆ రోల్లో తమ డార్లింగ్‌ను చూసుకోవాలని ఎప్పటినుంచో ఆరాటపడుతున్నారు. ఒకవేళ భూషణ్ కుమార్ చెప్పిందే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇంతకుమించిన ఆనందం ఇంకొకటి ఉండదని చెప్పుకోవచ్చు. ఇదీ చదవండి: రాధేశ్యామ్ చిత్రానికి తమన్ బీజీఎం.. అందుకోసమేనా ? -
Pushpa: చిత్తూరు యాసలో ఇరగదీశాడు.. అసలు ఎవరీ కేశవ?
టాలీవుడ్లో మోస్ట్ అవైటడ్ మూవీగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’. సుకుమార్ టేకింగ్, బన్నీ యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవడంతో టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లలో కొత్త రికార్డు సాధించడం చూసి సినీ పండితులు కూడా షాక్‌కు గురవుతున్నారు. కరోనా తరువాత ఈ రేంజ్లో బాక్సాఫీస్‌ని షేక్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికే పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో నటన పరంగా చెప్పుకోదగిన మరో విషయం ఏంటంటే బన్నీ పక్కన కేశవ పాత్రలో చేసిన జగదీష్ ప్రతాప్ బండారి గురించే. ఇంత వరకు చిన్న క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న జగదీష్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో సఫలమయ్యాడనే చెప్పాలి. పుష్ప లాంటి భారీ బడ్జెట్ సినిమాలో హీరో పక్కన నటించే పాత్రల కోసం డైరెక్టర్ కొత్త నటులను తీసుకుని రిస్క్ తీసుకోరు. ఎందుకంటే ఏ మాత్రం తేడా కొట్టిన అది సినిమాపై ప్రభావం చూపిస్తుంది. అందుకు అలాంటి పాత్రలకోసం దర్శకులు ఇండస్ట్రీలో పేరున్న నటులను ఎంపిక చేసుకుంటారు. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం పేరు కంటే ప్రతిభ ఉన్నవాళ్లకు తన సినిమాలలో అవకాశాలను ఇచ్చారు. కేశవ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్ బండారి సినిమాలను చూస్తే.. అతను పలాస 1978, మల్లేశం సినిమాలలో నటించాడు. అది కూడా చిన్న పాత్ర మాత్రమే. అయినా అతను చేసిన ప్రాత పరిధిని కాకుండా తన నటన గుర్తించాడు సుకుమార్. సీమ యాసలో బాగా మాట్లాడే ఈ నటుడికి అదే యాసలో మాట్లాడే పాత్రను సుకుమార్ ఇవ్వడంతో పాత్ర న్యాయం చేశాడని సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే పుష్ప సినిమాకు నెరేషన్ ఇచ్చింది కూడా ప్రతాప్ బండారి కావడం గమనార్హం. పుష్ప సక్సెస్ తో ప్రతాప్ బండారి పేరు ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఈ పేరుతో భవిష్యత్తులో మరిన్నీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. చదవండి: Samantha-Pushpa Movie: ఎట్టకేలకు పుష్ప స్పెషల్ సాంగ్ ట్రోల్స్‌పై స్పందించిన సామ్ -
బతుకు చిత్రం : పతకాల సాధనలో కోచుల పాత్ర
-
కాజల్ స్పందించింది
మీడియాల్లో వచ్చే వార్తల్లో ఏది వాస్తవమో.. ఏది అబద్ధమో స్వయంగా సెలబ్రిటీలే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా నటి కాజల్ అగర్వాల్ తనపై వస్తున్న ఓ వార్తపై స్పందించారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆమె జయలలిత పాత్రను పోషించబోతుందన్న వార్త ఒక్కటి గత కొన్ని రోజులుగా వెబ్సైట్లలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వార్త నిజం కాదని ఆమె వివరణ ఇచ్చారు. ‘ఎన్టీఆర్ బయోపిక్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. జయలలిత పాత్ర పోషిస్తున్నానన్న వార్తలో నిజం లేదు’ అని కాజల్ స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ చిత్రంలో ఈ పాత్ర ఎవరు పోషించబోతున్నారన్న దానిపై ఆసక్తి మొదలైంది. మరోపక్క ఈ చిత్రంలో బాలకృష్ణ తప్ప.. మిగతా పాత్రలేవీ ఇంకా ఖరారు చేయలేదని చిత్ర యూనిట్ ప్రకటించినా రోజుకో వార్త వినిపిస్తోంది. దిగ్గజ నటుడు, దివంగత నేత ఎన్టీఆర్ జీవితగాథగా ఎన్టీఆర్ చిత్రాన్ని దర్శకుడు తేజ డైరెక్షన్లో తెరకెక్కిస్తుండగా.. సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉంది. దసరాకి ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.