సచిన్ పాత్రలో సచిన్ తనయుడు! | Arjun Tendulkar to play younger Sachin in his biopic! | Sakshi
Sakshi News home page

సచిన్ పాత్రలో సచిన్ తనయుడు!

Published Fri, Apr 15 2016 4:08 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

సచిన్ పాత్రలో సచిన్ తనయుడు!

సచిన్ పాత్రలో సచిన్ తనయుడు!

ముంబై: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ జీవిత కథతో తెరకెక్కుతున్న, స్వయంగా ఆయన నటిస్తున్న చిత్రం 'సచిన్' టీజర్ విడుదలై అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో విషయం ఇప్పుడు అభిమానులకు సంతోషాన్నిస్తోంది. అదేంటంటే.. సచిన్ తనయుడు అర్జున్ 'సచిన్' చిత్రంలో మెరవనున్నాడట.

'సచిన్' చిత్రంలో సచిన్ చిన్ననాటి పాత్ర కోసం.. సచిన్లా మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్న, అదీ సచిన్ పోలికలతో ఉన్న యంగ్ కిడ్ కోసం ఎంతో మందిని వెతికిన ఈ చిత్ర బృందం చివరికి అర్జున్ అయితేనే దీనికి న్యాయం చేయగలుగుతాడని భావించారట. దీంతో ఈ సినిమాలో అర్జున్ తన తండ్రి పాత్రలో నటిస్తున్నాడని తెలిసింది. 120 నిమిషాల నిడివితో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 40 నిమిషాలకు పైగా సచిన్ అద్భుతమైన ప్రదర్శనలను సందర్భానుసారం జోడించినట్లు సమాచారం. దీంతో మరోసారి మాస్టర్ స్వీట్ ఇన్నింగ్స్ను చూడటానికి అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement