Arjun
-
నటుడు అంబటి అర్జున్ కూతురి ఫస్ట్ బర్త్‌డే (ఫోటోలు)
-
ముగింపు మెరవాలి!
న్యూయార్క్: ఈ ఏడాది భారత చెస్ క్రీడాకారులు విశ్వవేదికపై అదరగొట్టారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో మెరిపించగా... క్లాసికల్ ఫార్మాట్లో దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. క్యాడెట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ చిన్నారి దివిత్ రెడ్డి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పలువురు భారత గ్రాండ్‌మాస్టర్లు టాప్–3లో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీలకు నేడు తెర లేవనుంది. న్యూయార్క్‌లో ఆరు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 9 మంది గ్రాండ్‌మాస్టర్లు, మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఫలితంగా ఈ ఏడాది ఆఖరి టోర్నీలోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించి సూపర్ ఫినిషింగ్ ఇవ్వాలని ఆశిద్దాం. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ర్యాపిడ్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ అయ్యాక మరో భారత ప్లేయర్ ఈ విభాగంలో టాప్–3లో నిలువలేదు. ఇక ఓపెన్ విభాగంలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు. మహిళల ర్యాపిడ్ విభాగంలో అనస్తాసియా బొడ్నారుక్ (రష్యా), బ్లిట్జ్ విభాగంలో వాలెంటీనా గునీనా (రష్యా) తమ ప్రపంచ టైటిల్స్‌ను కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. భారత్ నుంచి ఎవరెవరంటే.... ఓపెన్ విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని, సందీపన్ చందా, అరవింద్ చిదంబరం, హర్ష భరతకోటి, ప్రణవ్, దీప్తాయన్ ఘోష్, కార్తీక్ వెంకటరామన్. మహిళల విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య, వైశాలి, వంతిక అగర్వాల్, సాహితి వర్షిణి, పద్మిని రౌత్, నూతక్కి ప్రియాంక. ఫార్మాట్ ఎలా అంటే... ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో మొత్తం 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. నిర్ణీత రౌండ్ల తర్వాత రెండు విభాగాల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.ముందుగా ఓపెన్ విభాగంలో 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో ఏర్పాటు చేశారు. నిర్ణీత రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశ (నాకౌట్)కు అర్హత పొందుతారు. నాకౌట్ దశలో అజేయంగా నిలిచిన ప్లేయర్లు విజేతలుగా అవతరిస్తారు. టైమ్ కంట్రోల్ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 15 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 10 సెకన్లు జత కలుస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 3 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 2 సెకన్లు జత కలుస్తాయి. నిర్ణీత రౌండ్ల తర్వాత ప్లేయర్లు సమంగా పాయింట్లు సాధిస్తే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించి విజేతలను నిర్ణయిస్తారు. ప్రైజ్‌మనీ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో టాప్–40లో నిలిచిన ప్లేయర్లందరికీ ప్రైజ్‌మనీ ఇస్తారు. విజేతకు 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 56 వేల డాలర్లు (రూ. 47 లక్షలు) అందజేస్తారు. బ్లిట్జ్ ఫారామ్ట్ ఓపెన్ విభాగంలోనూ టాప్–40లో నిలిచిన ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ లభిస్తుంది. చాంపియన్‌గా 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన వారికి 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానం పొందిన ఆటగాడికి 42 వేల డాలర్లు (రూ. 35 లక్షలు) అందజేస్తారు. ర్యాపిడ్ ఫార్మాట్ మహిళల విభాగంలో టాప్–20లో నిలిచిన వారందరికీ ప్రైజ్‌మనీ దక్కుతుంది. విజేతకు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 28 వేల డాలర్లు (రూ. 23 లక్షలు) లభిస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్ మహిళల విభాగంలోనూ టాప్–20లో నిలిచిన ప్లేయర్ల ఖాతాలో ప్రైజ్‌మనీ చేరుతుంది. చాంపియన్‌కు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానం పొందిన ప్లేయర్‌కు 20 వేల డాలర్లు (రూ. 17 లక్షలు) లభిస్తాయి.4 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి సాధించిన పతకాలు. ర్యాపిడ్ ఫార్మాట్లో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకాన్ని, 2023లో రజత పతకాన్ని సాధించింది. బ్లిట్జ్ ఫార్మాట్లో హంపి 2022లో రజతం సొంతం చేసుకుంది. -
కూతురి డ్రీమ్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా అర్జున్..
-
శభాష్ రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) ద్వయం తమ కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకుంది. కజకిస్తాన్‌లో ఆదివారం ముగిసిన అల్మాటీ ఓపెన్ అసోసియేన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్–అర్జున్ జోడీ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. వీరిద్దరి కెరీర్లో ఇదే తొలి ఏటీపీ–250 టోర్నీ టైటిల్ కావడం విశేషం. ఒక గంటా 41 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్–అర్జున్ జంట 3–6, 7–6 (7/3), 14–12తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోలస్ బారింటోస్ (కొలంబియా)–స్కాండర్ మన్సూరి (ట్యూనిషియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన రిత్విక్–అర్జున్‌లకు 54,780 డాలర్ల (రూ. 46 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 6–9తో వెనుకబడి... తొలి సెట్‌ను కోల్పోయిన రిత్విక్–అర్జున్రెండో సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గి నిలిచింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో ఒకదశలో రిత్విక్–అర్జున్ 6–9తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచారు. అయితే పట్టుదలతో పోరాడిన రిత్విక్–అర్జున్ స్కోరును సమం చేశారు. చివరకు 14–12తో విజయాన్ని అందుకున్నారు. సాధారణ టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన వారికి సెట్ లభిస్తుంది. ‘సూపర్ టైబ్రేక్’లో మాత్రం తొలుత పది పాయింట్లు నెగ్గిన వారికి విజయం దక్కుతుంది. ఒకవేళ స్కోరు 9–9తో సమమైతే రెండు పాయింట్ల ఆధిక్యం లభించినపుడు గెలుపు ఖరారవుతుంది. 23 ఏళ్ల రిత్విక్ ఈ ఏడాది మూడు ఏటీపీ–250 టోర్నీల్లో (హాంగ్జౌ, అట్లాంటా, న్యూపోర్ట్) ఆడినా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. అయితే నాలుగో ఏటీపీ–250 టోర్నీలో మాత్రం టైటిల్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు రిత్విక్ 10 ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నాడు. మూడింటిలో టైటిల్స్ నెగ్గి, ఏడింటిలో రన్నరప్‌గా నిలిచాడు. -
పోటాపోటీ యాక్షన్
అర్జున్, జేడీ చక్రవర్తి లీడ్ రోల్స్‌లో నటించిన కన్నడ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ ‘ఒప్పంద: కాంట్రాక్ట్’. ఈ చిత్రంలో రాధికా కుమార స్వామి, సోనీ చరిష్ఠ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో డీఎస్ రెడ్డి సమర్పణలో మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ‘ఇద్దరు’ పేరుతో రేపు విడుదల కానుంది.ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సమీర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో అర్జున్, చక్రవర్తిగార్లు పోటాపోటీగా నటించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌గారు, ఆమిర్ ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ కూడా నటించారు. మా సినిమాని ప్రేక్షకులు సక్సెస్ చేయాలి’’ అని అన్నారు. -
ప్రపంచ మూడో ర్యాంకర్‌గా అర్జున్
చెన్నై: చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలతో అదరగొట్టిన భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) స్టాండర్డ్ ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లోనూ ముందుకు దూసుకొచ్చారు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో తెలంగాణకు చెందిన అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌కు చేరుకోగా... గుకేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్‌ను అందుకున్నాడు. అర్జున్ ఖాతాలో 2797 ఎలో రేటింగ్ పాయింట్లు, గుకేశ్ ఖాతాలో 2794 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2831 రేటింగ్ పాయింట్లతో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతుండగా... హికారు నకముర (అమెరికా; 2802 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్–100లో భారత్ నుంచి ఏకంగా తొమ్మిది మంది గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు.ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో, ప్రజ్ఞానంద 12వ స్థానంలో ఉన్నారు. విదిత్ సంతోష్ గుజరాతి 22వ ర్యాంక్‌లో, అరవింద్ చిదంబరం 33వ ర్యాంక్‌లో, పెంటేల హరికృష్ణ 42వ ర్యాంక్‌లో, నిహాల్ సరీన్ 58వ ర్యాంక్‌లో, రౌనక్ సాధ్వాని 66వ ర్యాంక్‌లో, శ్రీనాథ్ నారాయణన్ 95వ ర్యాంక్‌లో, అభిమన్యు పురాణిక్ 98వ ర్యాంక్‌లో నిలిచారు. నంబర్‌వన్‌గా హంపి మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకొని భారత నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. చెస్ ఒలింపియాడ్‌కు హంపి దూరంగా ఉన్నా ఆమె ర్యాంక్‌లో మార్పు రాలేదు. భారత రెండో ర్యాంకర్‌గా మహారాష్ట్రకు చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ అవతరించింది. ఇన్నాళ్లు భారత రెండో ర్యాంకర్‌గా ద్రోణవల్లి హారిక కొనసాగింది. చెస్ ఒలింపియాడ్‌లో టీమ్ స్వర్ణ పతకంతోపాటు వ్యక్తిగత పసిడి పతకం నెగ్గిన దివ్య నాలుగు స్థానాలు పురోగతి సాధించి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. హారిక 14వ ర్యాంక్‌లో, వైశాలి 15వ ర్యాంక్‌లో, తానియా సచ్దేవ్ 54వ ర్యాంక్‌లో, వంతిక అగరాŠవ్ల్ 58వ ర్యాంక్‌లో ఉన్నారు. తెలంగాణ అమ్మాయి వేల్పుల సరయు 76వ ర్యాంక్‌లో, భక్తి కులకర్ణి 82వ ర్యాంక్‌లో, సవితాశ్రీ 99వ ర్యాంక్‌లో నిలిచారు. -
విజేత అర్జున్... రన్నరప్ సరయు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆదిరెడ్డి అర్జున్, వేల్పుల సరయు అదరగొట్టారు. హరియాణాలోని కర్నాల్ పట్టణంలో జరిగిన ఈ టోరీ్నలో ఓపెన్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఆదిరెడ్డి అర్జున్ టైటిల్‌ను నిలబెట్టుకోగా... వరంగల్ జిల్లాకు చెందిన సరయు రన్నరప్‌గా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 14 ఏళ్ల అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అర్జున్ 8 గేముల్లో గెలిచి, 3 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు. సౌరత్ బిశ్వాస్ (పశ్చిమ బెంగాల్; 8.5 పాయింట్లు) రెండో స్థానంలో, జైవీర్ మహేంద్రు (మహారాష్ట్ర; 8.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో సరయు నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9 పాయింట్లతో మృతిక మల్లిక్ (పశ్చిమ బెంగాల్)తో కలిసి సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. అయితే చాంపియన్‌ను నిర్ణయించేందుకు మైరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. మెరుగైన టైబ్రేక్ స్కోరుతో మృతిక టైటిల్ సొంతం చేసుకోగా... సరయుకు రెండో స్థానంతో రన్నరప్ ట్రోఫీ దక్కింది. సరయు తొమ్మిది గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయింది. విజేత అర్జున్, రన్నరప్ సరయులను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు. -
హార్ట్ బ్రేకింగ్.. ఒకే ఒక్క పాయింట్! తృటిలో చేజారిన పతకం
ప్యారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో భారత్‌కు తృటిలో మరో పతకం చేజారింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత షూటర్ అర్జున్ బాబుటా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో పతకానికి 1.1 పాయింట్ దూరంలో అర్జున్ నిలిచిపోయాడు.ఓ దశలో గోల్డ్‌మెడల్ రేసులో ఉన్న అర్జున్ ఒత్తడిలో తప్పిదాలు చేస్తూ 208.4 పాయింట్లతో నాలుగో స్ధానానికి పడిపోయాడు. క్రొయేషియా షూటర్ మిరాన్ మారిసిచ్ 209.3 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.ఇక 231.1 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచిన చైనా షూటర్ షెంగ్ లిహావోకు గోల్డ్ మెడల్, 230.5 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన జర్మనీ షూటర్ విక్టర్ లిండ్‌గ్రెన్ సిల్వర్ మెడల్ దక్కింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో కూడా భారత్‌కు నిరాశే ఎదురైంది. ఫైనల్స్‌లో భారత షూటర్ రమితా జిందాల్ ఏడో స్ధానంతో సరిపెట్టుకుంది. దీంతో ఒలింపిక్ పతకాన్ని సాధించే అవకాశాన్ని రమితా జిందాల్ కోల్పోయింది. -
కన్నడ సినీ నిర్మాతను మోసం చేసిన విశాఖ వాసి
కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, వైభవి శాండిల్య జంటగా మార్టిన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సీనియర్ హీరో అర్జున్ కథ అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాసవి ఎంటర్ప్రైజెస్ ద్వారా ఉదయ్ కె మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే, రూ. 3 కోట్ల వరకు విశాఖ వాసి సత్యారెడ్డి తమను మోసం చేశాడంటూ మార్టిన్ చిత్ర నిర్మాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో నిందితుడు సత్యారెడ్డిని విశాఖపట్నంలో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మార్టిన్ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్‌ను సత్యారెడ్డి ఏజన్సీకి సదరు నిర్మాత అప్పగించారు. అయితే, డబ్బు తీసుకుని ఆ సినిమాకు చేయాల్సిన పనిని చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని నిర్మాత ఉదయ్ కె మెహతా ఇలా చెప్పారు.. 'మార్టిన్ సినిమాకు ప్రత్యేక గ్రాఫిక్స్, సిజి, విఎఫ్ఎక్స్ వర్క్ అవసరం కాబట్టి మేము గత జూన్-జూలైలో సత్యారెడ్డి నేతృత్వంలోని గ్రాఫిక్ డిజైన్ ఏజెన్సీని సంప్రదించాము. మేము వారికి అడ్వాన్స్‌గా రూ. 3 కోట్ల రూపాయలు చెల్లించాము. అయితే, సినిమాకు సంబంధించిన పని విషయంలో సత్య ఆలస్యం చేస్తూ గత డిసెంబర్ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ జూన్‌లో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీంతో ఆయన్ను అరెస్టు చేశారు.' అని మార్టిన్ చిత్ర నిర్మాత చెప్పారు. సినిమా విడుదల ఆలస్యానికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు. ఆయన నిర్లక్ష్యం వల్ల తాము 15 వేర్వేరు సంస్థలకు గ్రాఫిక్స్ పనిని అప్పగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ పోలీస్ స్టేషనులో సత్యారెడ్డిపై ఉదయ్ కె మెహతా చీటింగ్ కేసు పెట్టారు. తాజాగా ఆయన బెంగళూరు నుంచి విశాఖ వెళ్లాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. -
టాప్ సీడ్ జోడీని ఓడించిన అనిరుధ్–అర్జున్ ద్వయం
హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో అనిరుద్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 3–6, 10–7తో టాప్ సీడ్, 28వ ర్యాంక్ జోడీ లామోన్స్ –విత్రో (అమెరికా)ను బోల్తా కొట్టించింది. ప్రస్తుతం అనిరుధ్ 128వ ర్యాంక్‌లో, అర్జున్ 111వ ర్యాంక్‌లో ఉన్నారు. -
స్టాలిన్‌కు శుభలేఖ అందించిన అర్జున్
యాక్షన్‌కింగ్‌గా అభిమానులను అలరించిన హీరో అర్జున్.. ఆయన కూతురు నటి ఐశ్వర్య వివాహబంధంలో అడుగుపెట్టబోతుంది. సినీ దర్శకుడు, నటుడు తంబిరామయ్య కుమారుడు, నటుడు ఉమాపతితో ఆమె వివాహం జరగనుంది. ఈ వేడుక జూన్‌లో చెన్నైలో జరగనుంది. వీరి వివాహ నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన జరిగింది. కాగా ఉమాపతి, ఐశ్వర్యల వివాహ వేడుకను ఘనంగా నిర్వహించడానికి అర్జున్, తంబిరామయ్య కుంటుంబాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వివాహ వేడుకను జూన్ 10న చెన్నై, గిరకంబాక్కంలో నటుడు అర్జున్‌కు చెందిన తోటలో నిర్విహించ తలపెట్టినట్లు సమాచారం. ఈ వివాహా వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే పనిలో అర్జున్, తంబిరామయ్య కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా తాజాగా వీరి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆహ్వన పత్రికను అందించారు. పెద్ద పెట్టెలా ఉన్న ఈ ఆహ్వన పత్రిక అందరినీ ఆకర్షిస్తోంది. -
'ప్రసన్న వదనం'థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్, డౌటే లేదు: సుహాస్
‘ప్రసన్న వదనం’ ఫస్ట్ కాపీ నిన్ననే చూశాను. సినిమా థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు.ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది’ అన్నారు హీరో సుహాస్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. అదిరిపోయిందని క్లాప్స్ కొడతారు. నా సినిమాలు మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి’ అని కోరారు. ‘ఇది యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ ఫిల్మ్. ఫన్, థ్రిల్ రోమాన్స్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని అన్నారు దర్శకుడు అర్జున్. ‘ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం కచ్చితంగా అందరిని అలరిస్తుంది’ అన్నారు హీరోయిన్ రాశిసింగ్. ‘ ఈ సినిమా పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.అందరూ థియేటర్స్ కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం’ అని నిర్మాతలు ప్రసాద్ రెడ్డి, జెస్ మణికంఠ అన్నారు. -
జీవన్–అర్జున్ జోడీకి డబుల్స్ టైటిల్
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో భారత్‌కు చెందిన జీవన్ నెడున్‌జెళియన్–అర్జున్ ఖడే జోడీ విజేతగా నిలిచింది. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్–అర్జున్ ద్వయం 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ మటుస్‌జెవ్‌స్కీ (పోలాండ్)–రోమియోస్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. జీవన్–అర్జున్ జోడీకి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీ,75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత నంబర్‌వన్‌గా అర్జున్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా అర్జున్ అవతరించాడు. ఏప్రిల్ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్‌లో 20 ఏళ్ల అర్జున్ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి భారత టాప్ ర్యాంకర్‌గా వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2751 పాయింట్లతో ప్రపంచ 11వ ర్యాంక్‌లో ఉన్నాడు. గత ఏడాది సెపె్టంబర్ 1న తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలిసారి అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి భారత కొత్త నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆనంద్ మళ్లీ టాప్ ర్యాంక్‌కు చేరుకోగా... ఏడు నెలల తర్వాత అర్జున్ ప్రదర్శనకు ఆనంద్ మరోసారి భారత నంబర్‌వన్ స్థానాన్ని చేజార్చుకున్నాడు. ఆనంద్, పెంటేల హరికృష్ణ, గుకేశ్ తర్వాత ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. తాజా రేటింగ్స్‌లో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 2830 పాయింట్లు), ఫాబియానో కరువానా (అమెరికా; 2803 పాయింట్లు), నకముర (అమెరికా; 2789 పాయింట్లు) వరుసగా తొలి మూడు ర్యాంక్‌ల్లో నిలిచారు. భారత్ నుంచి టాప్–100లో 10 మంది గ్రాండ్ మాస్టర్లు (అర్జున్–9, ఆనంద్–11, ప్రజ్ఞానంద –14, గుకేశ్–16, విదిత్–25, హరికృష్ణ–37, నిహాల్ సరీన్–39, నారాయణన్–41, అరవింద్ చిదంబరం–72, రౌనక్ సాధ్వాని–81) ఉన్నారు. -
నటుడు అర్జున్ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!
బాలీవుడ్ బుల్లి తెర నటుడు అర్జున్ బిజ్లానీకి గతవారమే ముంబై ఆస్పత్రిలో అపెండిసైటిస్ అపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ విషయాన్నే ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. శస్త్ర చికిత్స బాగా జరిగిందని, తాను కోలుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తనకు పూర్తిగా నయం అయ్యేంత వరకు వైద్యులు మంచి కేరింగ్‌గా చూసుకున్నారని అన్నాడు. తనను కోలుకునేలా చేసిన వైద్య బృందానికి, అలాగే అత్యంత జాగ్రతగా చూసుకున్న భార్య నేహ స్వామికి కృతజ్ఞతలంటూ పోస్ట్ పెట్టాడు. అసలేంటీ అపెండిసైటిస్? ఎందువల్ల వస్తుందంటే.. కడుపులో ఉండే పెద్ద పేగుకు తోకలా అనుసంధానమై ఉండేదే అపెండిక్స్. దీనివల్ల ఏర్పడే సమస్యనే అపెండిసైటిస్ అని పిలుస్తారు. అపెండిక్స్‌లో మలినాలు చేరడం వల్ల లేదా బ్యాక్టీరియా సోకినా వాటి గోడలు వాచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా కడుపులో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. ఆ నొప్పినే అపెండిసైటిస్ లేదా 24 గంటల నొప్పి అని అంటారు. ఈ అపెండిక్స్ కేవలం 3 నుంచి 4 అంగుళాల పొడవే ఉంటుంది. పెద్ద ప్రేగుకు అనుసంధానమై చిన్న ట్యూబ్ తరహాలో కనిపిస్తుంది. ఇందులోకి మలినాలు చేరితే అపెండిసైటిస్ సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. View this post on Instagram A post shared by Arjun Bijlani 🧿 (@arjunbijlani) ఎందుకు వస్తుందంటే.. అపెండిక్స్ లోపలి పొరలు శ్లేష్మం లేదా చీమును ఉత్పత్తి చేస్తాయి. ఆ చీము పెద్ద పేగు మొదటి భాగం (Cecum)లోకి వెళ్తుంది. ఈ సెకమ్ మలాన్ని అపెండిక్స్‌లోకి రాకుండా అడ్డుకుంటుంది. ఒక వేళ ఈ చీము సెకమ్‌లోకి ప్రవేశించకపోతే పెద్ద పేగులోని మలం అపెండిక్స్‌లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా అపెండిక్స్ గోడలు వాచిపోయి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. లేదా అపెండిక్స్‌లో ఏదైనా పూడిక ఏర్పడితే.. అందులోని బ్యాక్టీరియా గోడలపై దాడి చేస్తుంది. ఫలితంగా అపెండిక్స్‌లో వాపు ఏర్పడి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. ఒక్కోసారి కేన్సర్ వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు. 24 గంటల నొప్పి అనడానికి రీజన్.. సాధారణ కడుపు నొప్పిలా వస్తుంది. ఆ తర్వాత క్రమేణ కొన్ని రోజులకు నొప్పి తీవ్రమవుతుంది. జ్వరం కూడా వస్తుంది. ఈ నొప్పి కాస్త తారాస్థాయికి చేరుకుని భరించలేనిధిగా ఉన్నప్పుడూ 24 గంటల్లోపు సర్జరీ చేయాలి లేదంటే చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దీన్ని 24 గంటల నొప్పి అని అంటారు. ఎలా గుర్తిస్తారంటే.. అంత సులభంగా ఈ వ్యాధిని గుర్తించలేం. ఇది ఉదరంలో ఏర్పడే గాల్ బ్లాడర్, మూత్రకోశాలు, పేగుల ఇన్ఫెక్షన్, ఓవరీ, క్రాన్ వాటికి సంబంధించిన సాధారణ నొప్పిలా ఉంటుంది. అందువల్ల వైద్యులు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు చేసి ఈ సమస్యను గుర్తిస్తారు. పెండిసైటిస్ ప్రారంభంలో తెల్లరక్త కణాలు సాధారణంగానే ఉంటాయి. కానీ, ఇన్ఫెక్షన్ మొదలైన తర్వాత వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వాటి ఆధారంగా వైద్యులు అపెండిసైటిస్ సమస్యను గుర్తిస్తారు. సర్జరీ తప్పదా అంటే.. చాలా కేసుల్లో సర్జరీ ద్వారా అపెండిక్స్ను పూర్తిగా తొలగిస్తుంటారు. నొప్పి తీవ్రమైన వెంటనే సర్జరీ చేయకపోతే అపెండిక్స్ పగిలిపోయి అందులోని పదార్థాలు ఉదరంలోకి చేరుతాయి. ఫలితంగా అక్కడ కూడా వాపు ఏర్పడి ‘పెరిటోనైటిస్’ అనే సమస్య ఏర్పడుతుంది. వెంటనే సర్జరీ చేసి అపెండిక్స్ తొలగించకపోతే ప్రాణాలు పోతాయి. ఈ సమస్య ముందుగానే గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ ద్వారా తగ్గించొచ్చు అని వైద్యులు చెబుతున్నారు. నివారణ.. ఈ అపెండిక్స్ అవయవం రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో పెరిగే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు ఔషదంలా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. అపెండిక్స్లోని గోడల్లో ఉండే లింఫాటిక్ కణజాలం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే దీన్ని పూర్తిగా తొలగించినా పెద్దగా సమస్యలు కూడా ఏమీ లేవని పలు పరిశోధనల్లో నిరూపితమయ్యింది. కానీ అపెండిసైటిస్ రాకుండా నివారణ మార్గాలు మాత్రం ఏమీ లేవు. పరిశోధనల్లో మాత్రం అధిక పీచు పదార్థాలను ఆహారంగా తీసుకొనేవారిలో ఈ సమస్య తక్కువగా ఉన్నట్లు తేలింది. (చదవండి: హీరో అజిత కుమార్ ఎదుర్కొంటున్న వ్యాధేంటీ? దేని వల్ల వస్తుందంటే..!) -
అర్జున్‌కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: షెన్జెన్ లాంగాంగ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. చైనా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య నిర్ణీత ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో జియాంగ్జి బు (చైనా), యాంగీ యు (చైనా), అర్జున్ 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... జియాంగ్జి టైటిల్ గెల్చుకోగా... యాంగీ యు రన్నరప్‌గా నిలిచాడు. అర్జున్‌కు మూడో స్థానం ఖరారైంది. ఏడు గేమ్‌లు ఆడిన అర్జున్ మూడు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. -
కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన ‘హస్తం’ ఎమ్మెల్యే!
కాంగ్రెస్ ‘హస్తం’ నుంచి మరో ఎమ్మెల్యే చేజారిపోయారు. గుజరాత్లో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నేత, ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా తాజాగా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ బడానేతలు కూడా బీజేపీలో చేరారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు అంబరీష్ ధేర్, ములుభాయ్ కందేరియా ఉన్నారు. గుజరాత్లో బలమైన ప్రతిపక్ష నేతగా మోద్వాడియా పేరు సంపాదించారు. 2022 ఎన్నికల్లో పోర్బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత బాబు బోఖిరియాను ఓడించారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మార్చి 7న గుజరాత్‌లోకి ప్రవేశించబోతున్న సమయంలో ఆయన బీజేపీలో చేరడం చర్చనీయాంశంగామారింది. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో అనుబంధం కలిగిన మోద్వాడియా .. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని పార్టీ అధిష్టానం తిరస్కరించడాన్ని తప్పుబట్టారు. మోద్వాడియా ప్రస్తుతం పోర్బందర్ ఎమ్మెల్యే. కాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబరీష్ దేర్ కూడా బీజేపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా దేర్ను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తి సింగ్ గోహిల్ సస్పెండ్ చేశారు. #WATCH | Gandhinagar | Senior leaders from Gujarat Arjun Modhwadia, Ambrish Der, and others - who resigned from the Congress yesterday - join BJP in the presence of State BJP chief CR Paatil. pic.twitter.com/ioOe5K2cnD — ANI (@ANI) March 5, 2024 -
ఆయన మాటల వల్ల ఎక్కువ నష్టపోయింది నేనే: విశ్వక్ సేన్
యంగ్ హీరో విశ్వక్ సేన్ నుంచి వరుసగా రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక చిత్రం 'గామి' రిలీజ్‌కు సిద్ధమైంది. అఘోరాగా విశ్వక్ నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కూడా కొద్ది గ్యాప్‌లోనే విడుదల కానుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్సేన్. ఒకరు చేసిన పని వల్ల తాను చాలా నష్టపోయానని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ప్రముఖ నటుడు అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా ప్రారంభమైన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి అప్పట్లో అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి విశ్వక్సేన్ కమిట్మెంట్ లేని నటుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో టాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ తర్వాత విశ్వక్ ఈ విషయం గురించి పెద్దగా రెస్పాండ్ కాలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ వ్యాఖ్యలపై విశ్వక్ ఇలా రియాక్ట్ అయ్యాడు. ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోకి ఇలానే జరిగితే ఏమయ్యేది..? సినిమాని క్యాన్సిల్ చేయమని నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కరోజు షూటింగ్ మాత్రమే ఆపమని కోరాను. ఆ సమయంలో ఆయన మా ఇంటికి కూడా వచ్చారు. మా అమ్మ, నాన్నలకు విజ్ఞప్తి కూడా చేశారు. ఆ విషయాలు ఎవరికీ తెలియదు. నాకు సినిమా నేపథ్యం లేదనో, మరేదో కావచ్చు అనుకుని అనుకుని మీడియా సమావేశం పెట్టారు. కానీ ఆయన మీద గౌరవంతో దానిని మళ్లీ సాగదీయాలనుకోలేదు. ఆ అంశంపై నేను ఎందుకు సమాధానం చెప్పాలి.. ఆ అవసరం కూడా లేదు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి నేను తీసుకున్న రెమ్యునరేషన్‌కు రెట్టింపు తిరిగిచ్చేశాను. నాపై కోపంతో ఆయన చేసిన దానివల్ల ఎక్కువ నష్టపోయింది నేనే.' అని విశ్వక్ అన్నారు. హీరోగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న విశ్వక్.. నిర్మాతగా కూడా ఒక సినిమా తీస్తున్నారు. కానీ మార్చి 8న రానున్న గామి చిత్రంపై ఆయన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కొత్త దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ సుమారు నాలుగేళ్ల పాటు జరిగింది. ఎంతో కష్టపడి చిత్రాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. -
వాచ్మెన్ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా: మంచిరేవులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న జంగయ్యపై మేస్త్రి అర్జున్ దాడి చేశాడు వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న జంగయ్య స్క్రాప్ అమ్ముకుంటున్నాడని కోపంతో మేస్త్రి అర్జున్ దాడి చేశాడు దాడిలో జంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు మేస్త్రి అర్జున్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
'డైరెక్టర్స్ రొమాంటిక్ హీరోయిన్‌గానే చూస్తారు.. కానీ అలా తొలిసారి'
డైరెక్టర్స్ రొమాంటిక్ హీరోయిన్‌గానే చూస్తారుహాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లండన్‌కు చెందిన బోల్డ్ అండ్ బ్యూటీ మోడలింగ్ రంగంలో రాణిస్తూ దర్శకుడు ఎంఎల్ విజయ్ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన మదరాసు పట్టణం చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ తరువాత రజినీకాంత్, విజయ్, విక్రమ్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించి భారతీయ సినీ నటిగా గుర్తింపు పొందారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో లండన్‌కు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ వెబ్‌సీరీస్‌లో నటించారు. అలాంటి పరిస్థితుల్లో తనను కథానాయకిగా పరిచయం చేసిన దర్శకుడు ఏఎల్ విజయ్ మళ్లీ అమీజాక్సన్‌ను కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఆమె నటించిన తాజా చిత్రం మిషన్ చాప్టర్–1. అరుణ్‌విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లైకా పొడక్షన్ సంస్థ నిర్మించింది. పొంగల్ సందర్భంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో అమీజాక్సన్ లండన్‌కు చెందిన పవర్ఫుల్ పోలీసు అధికారిగా నటించడం విశేషం. అయితే అనారోగ్యంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు విజయ్ తన చిత్రాల్లో పాత్రలను శక్తివంతంగా రూపొందిస్తారన్నారు. ఎంతగా అంటే.. ఎన్నేళ్లయినా కూడా ఆ పాత్రలు అలా గుర్తుండిపోతాయన్నారు. అలాంటి దర్శకుడి ద్వారా మదరాసు పట్టణం చిత్రంతో తాను హీరోయిన్గా పరిచయం అవడం తన అదృష్టమని అన్నారు. మిషన్ చాప్టర్ –1 చిత్రంలో తాను చాలా ముఖ్యమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. చాలా మంది దర్శకులు తనను రొమాంటిక్ హీరోయిన్‌గానే చూస్తారని.. అందువల్ల తనకు యాక్షన్ కథాపాత్రలు వస్తాయని ఊహించలేదన్నారు. అలాంటిది దర్శకుడు తనకు యాక్షన్ హీరోయిన్గా చూపించారని చెప్పారు. ఈ చిత్రం తన సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం తనకు ఉందని అమిజాక్సన్ పేర్కొన్నారు. -
చివరకు అలాంటి పాత్రలు కూడా చేస్తున్న స్టార్ హీరోయిన్!
రెజీనా పేరు చెప్పగానే తెలుగు యంగ్ హీరోయిన్ గుర్తొస్తుంది. దాదాపు కెరీర్ అంతా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెబ్ సిరీసులు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన ఏ మూవీ కూడా హిట్ కావడం లేదు. దీంతో ఎలాంటి పాత్రకు అయినా సరే రెడీ అంటోంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్‌కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ 'విడమయూర్చి' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అజిత్ పుట్టినరోజు కానుకగా మే 1న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కొత్త మూవీ చేస్తాడు. (ఇదీ చదవండి: అక్కడ 'సలార్'ని మించి కలెక్షన్స్ సాధిస్తున్న చిన్న సినిమా!) -
అర్జున్ ఆరో స్థానంలో... హారిక ఏడో స్థానంలో
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు విశేషంగా రాణించినా పతకాలు మాత్రం సాధించలేకపోయారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో భారత్ నుంచి తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ అత్యుత్తమంగా ఆరో స్థానాన్ని సాధించాడు. నిర్ణీత 21 రౌండ్ల తర్వాత అర్జున్ 14 పాయింట్లతో మరో ముగ్గురితో (నెపోమ్నిషి, లెవాన్ అరోనియన్, డెనిస్ లాజావిక్) కలిసి ఉమ్మడిగా ఐదో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా నెపోమ్నిషికి ఐదో ర్యాంక్, అర్జున్‌కు ఆరో ర్యాంక్, అరోనియన్‌కు ఏడో ర్యాంక్, డెనిస్‌కు ఎనిమిదో ర్యాంక్‌లు ఖరారయ్యాయి. భారత్‌కే చెందిన ఇతర గ్రాండ్‌మాస్టర్లు అరవింద్ చిదంబరం 14వ ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద 28వ ర్యాంక్‌లో, నారాయణన్ 35వ ర్యాంక్‌లో, గుకేశ్ 38వ ర్యాంక్‌లో నిహాల్ సరీన్ 43వ ర్యాంక్‌లో నిలిచారు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక అత్యుత్తమ ప్రదర్శన చేసింది. నిర్ణీత 17 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లతో ఏడో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. హారికతోపాటు మరో ఎనిమిది మంది క్రీడాకారిణులు కూడా 11 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హారికకు ఏడో ర్యాంక్ దక్కింది. భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్ 13వ ర్యాంక్‌లో, కోనేరు హంపి 17వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి 27వ ర్యాంక్‌లో, వైశాలి 36వ ర్యాంక్‌లో, ప్రియాంక నూతక్కి 46వ ర్యాంక్‌లో నిలిచారు. -
Leo Success Meet: విజయ్ ‘లియో’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
ఓ చాంపియన్ కథ
భారతదేశానికి 1980లలో ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి జీవితం ఆధారంగా రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘అర్జున్ చక్రవర్తి: జర్నీ ఆఫ్ యాన్ అన్సంగ్ ఛాంపియన్’. విజయ రామరాజు టైటిల్ రోల్లో, సిజా రోజ్ కీ రోల్లో విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల ఈ చిత్రాన్ని నిర్మించారు. -
Aishwarya-Umapathy Engaged: ఘనంగా హీరో అర్జున్ కుమార్తె ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
భారత షూటర్ల జోరు
చాంగ్వాన్ (కొరియా): ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత రైఫిల్ షూటర్లు అర్జున్ బబుతా, తిలోత్తమ సేన్ రజత పతకాలు సాధించారు. ఈ ప్రదర్శనతో భారత్‌కు రెండు ఒలింపిక్స్ కోటా బెర్త్‌లు దక్కాయి. ఇప్పటికే భారత షూటర్లు 8 బెర్తులు పొందారు. దీంతో వచ్చే ఏడాది పారిస్‌కు పయనమయ్యే షూటర్ల సంఖ్య పదికి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 24 ఏళ్ల అర్జున్ 251.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఫైనల్లో 15 ఏళ్ల తిలోత్తమ (252.3 పాయింట్లు) త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. కొరియన్ షూటర్ కోన్ ఎంజీ (252.4) 0.1 తేడాతో బంగారం గెలుచుకుంది. ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్లో అర్జున్, దివ్యాన్‡్ష, హృదయ్ హజారికా (1892.4 పాయింట్లు) త్రయం బంగారు పతకం గెలిచింది. తిలోత్తమ, శ్రీయాంక, రమితలతో కూడిన మహిళల బృందం కాంస్యంతో సంతృప్తి చెందింది. సీనియర్ స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్, దర్శన రాథోడ్ జోడీ 139 పాయింట్లతో స్వర్ణం గెలిచింది. -
హీరోతో ప్రేమలో అర్జున్ సర్జా కూతురు.. త్వరలోనే నిశ్చితార్థం!
అర్జున్ సర్జా.. సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషల్లో నటించి యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఏళ్లపాటు హీరోగా నటించిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఈయనకు డైరెక్షన్‌లోనూ అనుభవం ఉంది. అర్జున్ సర్జాకు ఇద్దరు కూతుర్లు. అందులో పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేసి గుర్తింపు తెచ్చుకుంది. కానీ సరైన హిట్ మాత్రం తన ఖాతాలో పడలేదు. కూతురి కోసం నటుడి విశ్వ ప్రయత్నాలు కూతురి కోసం అర్జున్ డైరెక్టర్‌గా మారి సొల్లితరవా సినిమా తీశాడు. ఇది కూడా ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. దీంతో మరోసారి తన కూతురిని హీరోయిన్గా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. కన్నడ స్టార్ ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఐశ్వర్య కథానాయికగా నటిస్తోంది. ఇకపోతే ఐశ్వర్య చాలాకాలంగా ప్రముఖ నటుడి తనయుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. లెజెండరీ నటుడు తంబి రామయ్య తనయుడు ఉమాపతితో ఆమె ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఉమాపతి కూడా హీరోయే! వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపారని, త్వలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి! ఇకపోతే ఉమాపతి కూడా కోలీవుడ్‌లో హీరోగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. చదవండి: నన్ను చూసి ఈమె హీరోయినేంటి? అని ఓ లుక్కిచ్చారు -
ఆ ఇద్దరు హీరోయిన్స్ తో నాకు చాలా కంఫర్ట్..!
-
ఆ సినిమా చూసి నన్ను పాలిటిక్స్ లోకి వెళ్ళమన్నాడు
-
రిత్విక్–అర్జున్ జోడీకి ఏటీపీ చాలెంజర్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో హైదరాబాద్ యువ క్రీడాకారుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ కెరీర్లో తొలి చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటలీలో జరిగిన ఒల్బియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–1, 6–3తో ఇవాన్ సబనోవ్–మాతెజ్ సబనోవ్ (సెర్బియా) జంటపై గెలిచింది. ఈ ఏడాది రిత్విక్ –అర్జున్ జోడీ పోర్టో ఓపెన్, బ్రాన్òÙ్వగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలలో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డారు. మూడో ప్రయత్నంలో ఈ జంట తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ 6–3, 6–4తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఆండ్రీ బెగెమన్ (జర్మనీ)లపై... క్వార్టర్ ఫైనల్లో 6–3, 6–4తో ఆండ్రూ హారిస్–జాన్ ప్యాట్రిక్ (ఆ్రస్టేలియా)లపై... సెమీఫైనల్లో 2–6, 7–6 (11/9), 10–7తో జెబవి–జెడెనెక్ (చెక్ రిపబ్లిక్)లపై గెలుపొందారు. టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ జోడీకి 8,420 యూరోల (రూ. 7 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీ, 125 పాయింట్లు లభించాయి. -
LEO Review: ‘లియో’మూవీ రివ్యూ
టైటిల్: లియో నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి తెలుగులో విడుదల: సితార ఎంటర్టైన్మెంట్స్ రచన-దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస విడుదల తేది: అక్టోబర్ 19, 2023 కథేంటంటే.. పార్తి అలియాస్ పార్తిబన్(విజయ్) హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ.. భార్య సత్య(త్రిష), ఇద్దరు పిల్లలు(పాప, బాబు)తో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ సారి తన కాఫీ షాపుకు ఓ దొంగల ముఠా వచ్చి డబ్బును దోచుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకితో అందరిని కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మ రక్షణ కోసమే వారిని చంపినట్లు కోర్టు భావించి..అతన్ని నిర్ధోషిగా ప్రకటిస్తుంది. పార్తి ఫోటో ఓ వార్త పత్రికలో చూసి ఏపీలోని ఆంటోని దాస్(సంజయ్ దత్) గ్యాంగ్.. హిమాచల్ ప్రదేశ్‌కు వస్తుంది. పార్తిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏంటంటే.. పార్తి, 20 ఏళ్ల కిత్రం తప్పిపోయిన ఆంటోని దాస్ కొడుకు లియోలా ఉండడం. అసలు లియో నేపథ్యం ఏంటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోని, అతని సోదరుడు హెరాల్డ్ దాస్(అర్జున్) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్తి, లియో ఒక్కరేనా? ఆంటోని గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలిని కాపాడుకునేందుకు పార్తి ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లియో.. లోకేష్ కగనరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ, విక్రమ్ చిత్రాలతో దీనికి సంబంధం ఉండదు. ఖైదీలోని నెపోలియన్ పాత్ర, చివర్లో ‘విక్రమ్’(కమల్ హాసన్) నుంచి లియోకి ఫోన్ రావడం.. ఇవి మాత్రమే లోకేష్ కగనరాజ్ యూనివర్స్ నుంచి తీసుకున్నారు. మిగత స్టోరి అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలీష్‌గా, రేసీ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టిపెట్టాడు. ఓ ముఠా కలెక్టర్‌ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హైనా(కృర జంతువు)ఫైట్ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత పార్తి ఫ్యామిలీ పరిచయం.. భార్య, పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. కాఫీ షాపులో యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. పార్తి ఫోటో పేపర్లో చూసి ఆంటోని గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్‌కు రావడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అసలు లియో ఎవరు? ఆంటోని నేపథ్యం ఏంటనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఆంటోని, పార్తి తొలిసారి కలిసే సీన్ కూడా అదిరిపోతుంది. ఇంటర్వెల్ ముందు ఆంటోని, పార్తికి మధ్య వచ్చే ఛేజింగ్ సన్నివేశం అయితే హైలెట్. లియో నేపథ్యం ఏంటి? తండ్రి, కొడుకులను ఎందుకు వైరం ఏర్పడిదనేది సెకండాఫ్‌లో చూపించారు. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఏమి ఉండదు కానీ లోకేష్ మేకింగ్ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ‘ఖైది’ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం బాగుంటుంది. అయితే లియో పాత్ర పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ కాలేదు. తండ్రి,బాబాయ్, చెల్లి.. ఏ పాత్రతోనూ ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. క్లైమాక్స్‌లో హెరాల్డ్ దాస్‌తో వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే.. లియో, పార్తి.. రెండు విభిన్నమైన పాత్రలో విజయ్ అదరగొట్టేశాడు. స్టార్‌డమ్‌ని పక్కకి పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించాడు. పార్తి పాత్రలో ఆయన లుక్, గెటప్ ఆకట్టుకుంటాయి. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న లియో పాత్రలో అభిమానులు కొరుకునే విజయ్ కనిపిస్తాడు. గెటప్ పరంగానే కాదు యాక్టింగ్ పరంగానూ రెండు విభిన్నమైన పాత్రల్లో విజయ్ చక్కగా నటించాడు. ఇక హీరో భార్య సత్య పాత్రకి త్రిష న్యాయం చేసింది. విజయ్, త్రిషల కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. విలన్ ఆంటోనిగా సంజయ్ దత్, అతని సోదరుడు హెరాల్డ్ దాస్‌గా అర్జున్.. మంచి విలనిజాన్ని పండించారు. కానీ ఆ రెండు పాత్రలను ముగించిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. గత సినిమాల మాదిరే లియోకి కూడా అదరిపోయే బీజీఎం ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో అనిరుద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
మూవీ ఫ్లాప్ అయితే నాకు చాలా బాధగా ఉంటుంది : అర్జున్
-
ఆ హీరోతో కలిసి నటించాలని ఉంది... మనసులో కోరిక బయటపెట్టిన అర్జున్
-
బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే?
ప్రముఖ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్(Byjus) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అండ్ ఇండియా బిజినెస్ హెడ్ 'మృణాల్ మోహిత్' స్టార్టప్‌కు రాజీనామా చేశారు. ఈ స్థానంలోకి అనుభవజ్ఞుడైన 'అర్జున్ మోహన్' వచ్చాడు. ఇంతకీ మృణాల్ ఎందుకు రాజీనామా చేసాడు? కొత్త సీఈఓ బ్యాగ్రౌండ్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మృణాల్ మోహిత్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అప్పుల భారంతో ముందుకెళుతున్న కంపెనీకి ఈయన అపారమైన సేవ అందించినట్లు కంపెనీ ఫౌండర్ రవీంద్రన్ వెల్లడించారు. కాగా ఇప్పుడు ఇప్పటికే సంస్థతో అనుభందం ఉన్న 'అర్జున్ మోహన్' సీఈఓగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన సారథ్యంలో సంస్థ మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నారు. గతంలో అర్జున బైజూస్‌లో కీలక పాత్ర పోషించాడు. 2020 వరకు కంపెనీ చీప్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తరువాత రోనీ స్క్రూవాలా స్థాపించిన ఎడ్టెక్ స్టార్టప్ సీఈఓగా వెళ్లే క్రమంలో రాజీనామా చేశారు. కాగా మళ్ళీ ఇప్పుడు సొంత గూటికి చేరుకున్నారు. మృణాల్ రాజీనామా సందర్భంగా బైజూ రవీంద్రన్ మాట్లాడుతూ.. బైజూస్ ఈ రోజు గొప్ప స్థాయికి చేరుకుందంటే అది తప్పకుండా మా వ్యవస్థాపక బృందం అసాధారణ ప్రయత్నాలే అంటూ అతనికి వీడ్కోలు తెలిపాడు. బైజూస్ నుంచి నిష్క్రమించడం గురించి మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. బైజూస్ వ్యవస్థాపక బృందంలో భాగం కావడం ఒక అద్భుతమైన ప్రయాణం, విద్యారంగంలో పరివర్తనకు సహకరించినందుకు నేను కృతజ్ఞుడను. ఈ సంస్థలో పనిచేసినందుకు గరివిస్తున్నాను అన్నాడు. -
అర్జున్ పరాజయం సెమీస్‌లో ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద 5–4తో గెలుపొందాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన తొలి భారత ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల అర్జున్ కడదాకా పోరాడినా చివరకు తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఎత్తులకు చేతులెత్తేశాడు. బుధవారం ఇద్దరి మధ్య రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత స్కోరు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు గురువారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు గేమ్‌లు ఆడించారు. ఈ రెండూ ‘డ్రా’ కావడంతో ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లను ఆడించారు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 76 ఎత్తుల్లో గెలుపొందగా... రెండో గేమ్‌లో అర్జున్ 28 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో స్కోరు 3–3తో సమంగా నిలిచింది. ఈ దశలో 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు ఆడించారు. ఇందులో తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో అర్జున్ 36 ఎత్తుల్లో గెలుపొందడంతో స్కోరు 4–4తో సమంగా నిలిచింది. దాంతో ‘సడన్ డెత్’ టైబ్రేక్ మొదలైంది. ‘సడన్‌డెత్’లో తొలుత నెగ్గిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటిస్తారు. ‘సడన్‌డెత్’ తొలి గేమ్‌లోనే ప్రజ్ఞానంద 72 ఎత్తుల్లో అర్జున్ను ఓడించి విజేతగా అవతరించాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్ తొలి గేముల్లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)... కరువానా (అమెరికా)తో ప్రజ్ఞానంద తలపడతారు. -
క్వార్టర్స్‌లో అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద తమ ప్రత్యర్థులపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అర్జున్ 1.5–0.5తో నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్)పై, ప్రజ్ఞానంద 1.5–0.5తో ఫెరెంక్ బెర్కిస్ (హంగేరి)పై, గుకేశ్ 1.5–0.5తో హావో వాంగ్ (చైనా)పై గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గుకేశ్; ప్రజ్ఞానందతో అర్జున్ తలపడతారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్ తొలి గేముల్లో నెగ్గిన అర్జున్, గుకేశ్ ఆదివారం జరిగిన రెండో గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ప్రజ్ఞానంద 49 ఎత్తుల్లో గెలుపొంది క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. నిపోమ్‌నిషి (రష్యా)తో జరుగుతున్న మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో గేమ్‌ను కూడా విదిత్ (భారత్) ‘డ్రా’ చేసుకోవడంతో ఇద్దరూ 1–1తో సమఉజ్జీగా ఉన్నారు. వీరిద్దరి మధ్య నేడు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా నేడు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు ఆడనుంది. హారిక–అలెగ్జాండ్రా గోర్యాచ్కినా (రష్యా)తో క్వార్టర్ ఫైనల్లో రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో నేడు టైబ్రేక్ అనివార్యమైంది. -
ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ.. చూసేందుకు రెడీనా..?
బాక్సాఫీస్ కలెక్షన్లు దండుకోవడానికి థియేటర్స్ స్టేషన్లో కొందరు స్టార్స్ పోలీసాఫీసర్స్‌గా చార్జ్ తీసుకోనున్నారు. కొందరు పోలీస్ యూనిఫామ్ వేసుకుని, సెట్స్‌లో లాఠీ తిప్పుతున్నారు. మరికొందరు కథలు విన్నారు.. యూనిఫామ్‌తో సెట్స్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ వివరాలు తెలుసుకుందాం. మళ్లీ డ్యూటీ ‘మూండ్రు ముగమ్’ (1982), ‘పాండియన్ ’ (1992), హిందీలో ‘హమ్’ (1991), ‘దర్బార్’ (2020)... ఇలా ఇప్పటివరకూ రజనీకాంత్ ఏడెనిమిది చిత్రాల్లో పోలీసాఫీసర్‌గా నటించారు. మళ్లీ రజనీ పోలీస్‌గా చార్జ్ తీసుకోనున్నారట. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ముస్లిమ్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీ కనిపించనున్నారని టాక్. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఆగస్టు 10న విడుదల కానున్న ‘జైలర్’ చిత్రంలో రజనీ జైలర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పోలీస్ స్పిరిట్ పోలీసాఫీసర్‌గా ప్రభాస్ కటౌట్ స్క్రీన్‌పై సూపర్‌గా ఉంటుందని, సిల్వర్ స్క్రీన్‌పై ఖాకీ డ్రెస్ వేసిన ఫుల్ లెంగ్త్ పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్‌ను చూడాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆశపడుతున్నారు. వీరి ఆశ ‘స్పిరిట్’తో తీరనుందనే టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందట. పుష్పర కాలం తర్వాత... ‘శౌర్యం (2008)’, ‘గోలీమార్ (2010)’ వంటి చిత్రాల్లో గోపీచంద్ పోలీస్‌గా సిల్వర్ స్క్రీన్‌పై డ్యూటీ చేశారు. పుష్కర కాలం తర్వాత గోపీచంద్ మళ్లీ పోలీస్‌గా లాఠీ పట్టారు. హర్ష తెరకెక్కిస్తున్న ‘భీమా’ చిత్రం కోసమే పోలీస్‌గా డ్యూటీ చేస్తున్నారు గోపీచంద్. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఆఫీసర్ అర్జున్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు నాని. ‘హిట్’ ఫ్రాంచైజీలో ‘హిట్ 3’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘హిట్ 1’లో విశ్వక్సేన్, ‘హిట్ 2’లో అడివి శేష్ పోలీసాఫీసర్స్‌గా నటించారు. ‘హిట్ 3’లో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ్రపారంభమవుతుందట. కొన్ని సన్నివేశాల్లో... హీరో నితిన్ పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా’ (ప్రచారంలో ఉన్న టైటిల్). శ్రీలీల హీరోయిన్. ఇందులో హీరోగా నటిస్తున్న నితిన్ కొన్ని సీన్స్‌లో పోలీస్‌గా కనిపిస్తారట. అమరన్.. ఇన్ ది సిటీ ‘బ్లాక్’, ‘సీఎస్ఐ: సనాతన్’ వంటి చిత్రాల్లో ఆది సాయికుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్‌గా సిల్వర్ స్క్రీన్ క్రైమ్స్‌ను చేధించారు. తాజాగా ‘అమరన్: ఇన్ ది సిటీ చాఫ్టర్ 1’ చిత్రంలో ఆది సాయికుమార్ పోలీసాఫీసర్‌గా ఓ కేసును పరిశోధిస్తున్నారు. ఎస్. బాలేశ్వర్ దర్శకత్వంలో ఎస్వీఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ది కానిస్టేబుల్ ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’, ‘కుర్రాడు’ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ తాజాగా పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ పాత్ర చేస్తున్నారు. ‘బలగం’ జగదీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎవరు? హంతకులు ఎవరు? అనేది కనిపెట్టేందుకు జేడీ చక్రవర్తి ఓ స్కెచ్ వేశారు. పోలీసాఫీ సర్గా జేడీ చక్రవర్తి వేసిన ఈ స్కెచ్ డీటైల్స్ ‘హూ’ సినిమాలో తెలుస్తాయి. జేడీ చక్రవర్తి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రెడ్డమ్మ కె. బాలాజీ నిర్మించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారు. పోలీసులే ప్రధాన నిందితులైతే... దోషులను పట్టుకునే పోలీసులే నిందులైతే ఏం జరుగు తుంది? అనే కథాంశంతో దర్శకుడు తేజా మార్ని ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలోని ముఖ్య తారలంతా పోలీసులుగా నటిస్తున్నారని తెలిసింది. ‘ఖడ్గం’ (2002), ‘ఆపరేషన్ దుర్యోధన’ (2007), ‘టెర్రర్’ (2016) వంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన శ్రీకాంత్ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ పోలీస్‌గా కనిపిస్తారు. ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. పోలీస్ రన్నర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘రన్నర్’. విజయ్ చౌదరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ భాస్కర్, ఫణీంద్ర, ఎం. శ్రీహరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కొడుకుల అనుబంధంతో సాగే ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో జానీ మాస్టర్ నటిస్తున్నారని తెలిసింది. వీరే కాదు... మరికొందరు కూడా పోలీసాఫీసర్లుగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. -
బైజూస్ ‘ఇంటర్నేషనల్’ సీఈవోగా అర్జున్ మోహన్
న్యూఢిల్లీ: విద్యా రంగ సేవల్లో ఉన్న బైజూస్, తన ఇంటర్నేషనల్ వ్యాపారానికి సీఈవోగా అప్‌గ్రాడ్ మాజీ చీఫ్ అర్జున్ మోహన్‌ను నియమించుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ ఇక ముందు కూడా గ్రూప్ సీఈవోగా కొనసాగనున్నారు. మృణాల్ మోహిత్ భారత వ్యాపారానికి చీఫ్‌గా కొనసాగుతారని సంస్థ ప్రకటించింది. తాజా నియామకంతో అర్జున్ మోహన్ తన సొంతగూటికి తిరిగి వచి్చనట్టయింది. అప్‌గ్రాడ్ సీఈవోగా చేరడానికి ముందు 11 ఏళ్ల పాటు అర్జున్ మోహన్ బైజూస్లోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా సేవలు అందించడం గమనార్హం. గతేడాది డిసెంబర్లోనే అప్‌గ్రాడ్‌కు మోహన్ రాజీనామా చేశారు. అమెరికా, కెనడా, మెక్సికో, ఆ్రస్టేలియా, యూకే, బ్రెజిల్, మధ్య ప్రాచ్యం తదిత 100 దేశాల్లో బైజూస్‌కు యూజర్లు ఉన్నారు. అంతేకాదు విదేశాల్లో పెద్ద ఎత్తున కంపెనీలను సైతం కొనుగోలు చేస్తూ వచి్చంది. అమెరికాకు చెందిన రీడింగ్ ప్లాట్‌ఫామ్ ఎపిక్ (500 మిలియన్ డాలర్లు), కోడింగ్ సైట్ టింకర్(200 మిలియన్ డాలర్లు)ను బైజూస్ గతంలో కొనుగోలు చేసింది. అలాగే, సింగపూర్‌కు చెందిన గ్రేట్ లెర్నింగ్(600 మిలియన్ డాలర్లు), ఆస్ట్రియాకు చెందిన జియోగెర్బా(100 మిలియన్ డాలర్లు)ను లోగడ కొనుగోలు చేయడం గమనార్హం. ఈ వ్యాపారాలన్నింటికీ మోహన్ నేతృత్వం వహించనున్నారు. ఇటీవలి కాలంలో బైజూస్ పలు ప్రతికూల పరిణామాలు ఎదురు చూసింది. జీవీ రవిశంకర్, రస్సెల్ డ్రీసెన్స్టాక్, చాన్ జుకర్‌బెర్గ్ తదితరులు బైజూస్ బోర్డుకు రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాలను తాము ఇంకా ఆమోదించదేని రవీంద్రన్ వాటాదారులకు స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణ పేరుతో 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జూన్‌లో బైజూస్ ప్రకటించింది. కంపెనీ ఆడిటర్ సేవలకు డెలాయిట్ రాజీనామా చేసి ని్రష్కమించింది. ఏప్రిల్‌లో కంపెనీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సలహా మండలిలో రజనీష్ కుమార్, మోహన్‌దాస్ పాయ్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్, ఐటీ రంగ దిగ్గజం టీవీ మోహన్‌దాస్ పాయ్ తమ సంస్థ సలహా మండలిలో చేరనున్నట్లు బైజూస్ వెల్లడించింది. తమ విజన్‌పై వారికి గల నమ్మకానికి ఇది నిదర్శనమని సంస్థ వ్యవస్థాపకులు దివ్యా గోకుల్‌నాథ్, బైజు రవీంద్రన్ తెలిపారు. వ్యవస్థాపకులు కంపెనీని సరైన దారిలో నడిపించేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నారని తమకు నమ్మకం కుదిరిన మీదట సలహా మండలిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కుమార్, పాయ్ తెలిపారు. -
Anjana Arjun : అర్జున్ సర్జా చిన్నకూతురు గ్లామర్ షో, హీరోయిన్ అవ్వడానికేనా? (ఫోటోలు)
-
ఆ డైరెక్టర్ నన్ను కొట్టాడు.. ఎగతాళి చేశాడు..
-
ఆటో, బొలెరో ఢీ.. ముగ్గురి దుర్మరణం
ధరూరు: బతుకుదెరువు కోసం ఆటోలో బయల్దేరిన ఆ కుటుంబాన్ని బొలెరో రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని పారుచర్ల సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గద్వాలలోని దౌదర్పల్లికి చెందిన బొప్పలి జమ్ములమ్మ(55), ఆమె కుమారుడు అర్జున్ (24), కోడలు వైశాలి (22) పల్లెల్లో నిత్యం బొంతలు కుట్టడం..పాత చీరలు అమ్మడం వంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తమ ఆటోలో గద్వాల నుంచి రాయ్చూరుకు బయల్దేరారు. మార్గంలోని పారుచర్ల–ధరూరు గ్రామాల మధ్య రాయ్‌చూరు వైపు నుంచి వచ్చి న బొలెరో, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న జమ్ములమ్మ, అర్జున్, వైశాలి అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే వాహనదారులు, చుట్టుపక్కల పొలాల రైతులు అక్కడికి చేరుకుని ఆటోలో ఇరుక్కున్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. బొలెరోలో పెబ్బేరులో జరిగే సంతకు రైతులు ఎద్దులతో వెళ్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్‌తోపాటు మిగతా వారు పరారయ్యారు. అయితే అర్జున్‌కు మూడు నెలల క్రితమే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వైశాలితో వివాహం జరిగినట్లు బంధువులు తెలిపారు. రేవులపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. -
లియో సినిమాలో యాక్షన్ కింగ్, డిఫరెంట్ లుక్‌లో..
హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా లియో. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు రూపొందిన మాస్టర్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తాజాగా మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే లోకేశ్ కనకగరాజ్ చివరి సినిమా విక్రమ్ ఘన విజయం సాధించింది. అటు విజయ్ నటించిన వారసుడు కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. సక్సెస్ సినిమాలతో జోరు మీదున్న ఇద్దరి కాంబినేషన్లో లియో రాబోతోంది. త్రిష, ప్రియా ఆనంద్, నటుడు అర్జున్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మన్సూర్ అలీఖాన్, దర్శకుడు మిష్కిన్, గౌతమ్ మీనన్, థ్యూ థామస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే కాశ్మీర్లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా లియో చిత్ర షూటింగ్లో యాక్షన్ కింగ్ అర్జున్ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం వేసిన భారీ సెట్లో అర్జున్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది.. కాగా ఈ చిత్రంలో అర్జున్ గెటప్ కోసం ప్రత్యేకంగా ఇటీవల లుక్ టెస్ట్ చేసినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. చదవండి: రజనీకాంత్ చిన్నకూతురి ఇంట్లో చోరీ -
సిల్క్ స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!
సిల్క్ స్మిత పేరు ఇప్పటి సినీ ప్రేక్షకులను తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో తెలుగు సినీ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే పేరు. ఆ రోజుల్లో తన అందంతో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ కూడా మరిచిపోలేరంటే ఎంతలా పేరు సంపాదించిందో అర్థమవుతోంది. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయ లక్ష్మి. సిల్క్ స్మిత తమిళ చిత్ర పరిశ్రమలో తన నటన జీవితాన్ని ప్రారంభించింది. నిజం చెప్పాలంటే.. సిల్క్ స్మిత జీవితం ముళ్ల పాన్పు లాంటిది. అందరూ తెరపై ఆమె అందాన్ని చూశారే కానీ.. దాని వెనుక ఉన్న కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. ఎంతోమంది అభిమానుల గుండెల్లో ఆమె శృంగార తారగానే ముద్రపడిపోయింది. తాజాగా ఆమె ఫోటోను నాని నటించిన దసరా మూవీలో ప్రదర్శించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆమెకు వీరాభిమాని కావడం వల్లే ఆమె పోస్టర్‌ను సినిమాలో చూపించారు. తక్కువ కాలంలోనే ఎన్నో ఆవమానాలు ఎదుర్కొన్న సిల్క్ స్మిత తొందరగానే స్టార్ డమ్ తెచ్చుకుంది. అదే సమయంలో తెరమీద ఆమె అందాలను చూసిన వారే.. బయట చాలా చులకనగా చూసేవారట. వాటితో పాటు మన అనుకున్న వారే ఆస్తి కోసం మోసం చేశాడని తెలియడంతో తాను మరింత డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. దీంతో వాటిని భరించలేక 1996లో బలవన్మరణానికి పాల్పడింది. అప్పట్లో సిల్క్ స్మిత మరణం ఇండస్ట్రీలో ఎంతోమందిని కలిచివేసింది. అంతే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు కూడా భౌతికకాయాన్ని చూడడానికి కూడా రాలేదట. కనీసం ఆమె కుటుంబ సభ్యులు కూడా రాలేదు. ఒక అనాథలా ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. కానీ సిల్క్ స్మిత భౌతికకాయాన్ని చూడడానికి ఒకే ఒక్క హీరో వచ్చాడట. అతనే యాక్షన్ కింగ్ అర్జున్. ఎవరేమనుకున్నా తనకు నష్టం లేదని.. ఆమె కడచూపు కోసం వచ్చాడట అర్జున్. అందుకు ప్రధాన కారణం సిల్క్, అర్జున్ మంచి స్నేహితులుగా ఉండేవారట. సిల్క్ స్మిత ఎప్పుడు అర్జున్ తో నేను చనిపోయాక నన్ను చూడడానికి వస్తావా అని అడిగేదని చెప్పారు. తాజాగా ఈ విషయాన్ని కోలీవుడ్‌కు చెందిన సినీ జర్నలిస్టు తోట భావనారాయణ రివీల్ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరలవుతోంది. కాగా.. సిల్క్ స్మిత చివరిసారిగా తిరుంబి పార్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నాలుగు సినిమాలు మరణానంతరం 2002లో విడుదలయ్యాయి. -
పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు పతకం ఖరారైంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర ప్లేయర్ ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సురేఖ–ఓజస్ రెండో రౌండ్లో 159–157తో మరియా–గైల్స్ (లక్సెంబర్గ్)లపై... క్వార్టర్ ఫైనల్లో 159–156తో సోఫీ–అడ్రియన్ గోంటీర్ (ఫ్రాన్స్)లపై... సెమీఫైనల్లో 157–155తో ఫాతిన్ నూర్‌ఫతే–జువైది (మలేసియా)లపై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో చెన్ యి సువాన్–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ)లతో జ్యోతి సురేఖ–ఓజస్ తలపడతారు. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మాత్రం అతాను దాస్–భజన్ కౌర్ (భారత్) ద్వయం తొలి రౌండ్లో 3–5తో డెన్మార్క్ జోడీ చేతిలో ఓడిపోయింది. ధీరజ్ అద్భుతం... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో ధీరజ్ 6–0తో థియో కార్బొనెటి (బెల్జియం)పై, రెండో రౌండ్లో 6–4తో కెజియా చాబిన్ (స్విట్జర్లాండ్)పై, మూడో రౌండ్లో 6–4తో జిగా రావ్నికర్ (స్లొవేనియా)పై, నాలుగో రౌండ్లో 6–5తో అమెరికా దిగ్గజం బ్రాడీ ఇలిసన్పై, క్వార్టర్ ఫైనల్లో 6–4తో తరుణ్‌దీప్ రాయ్ (భారత్)పై గెలుపొందాడు. ప్రపంచ మాజీ చాంపియన్, మూడు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఇలిసన్తో జరిగిన మ్యాచ్‌లో ధీరజ్ ‘షూట్ ఆఫ్’లో గెలిచాడు. ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేసినా ధీరజ్ కొట్టిన బాణం 10 పాయింట్ల లక్ష్యబిందువుకు అతి సమీపంలో ఉండటంతో విజయం ఖరారు చేసుకున్నాడు. ఆధిక్యంలో అర్జున్ సాటీ జుల్డిజ్ ఓపెన్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఎనిమిది రౌండ్ల తర్వాత తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఏడు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన నాలుగు గేముల్లో మూడింట గెలిచిన అర్జున్, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. వఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), బిబిసారా (కజకిస్తాన్), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)లపై నెగ్గిన అర్జున్ జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్‌తో జరిగిన గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. 12 మంది అగ్రశ్రేణి ప్లేయర్ల మధ్య 11 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నేడు చివరి మూడు రౌండ్లు జరుగుతాయి. -
సచిన్ కొడుకుపై షారుక్ ట్వీట్ అదే రేంజ్ లో సచిన్ రిప్లై
-
సవిత శ్రీ అరుదైన ఘనత.. నిరాశపరిచిన హారిక! ఐదో స్థానంలో అర్జున్
FIDE World Rapid Championship- అల్మాటీ (కజకిస్తాన్): ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో మహిళల ఈవెంట్లో భారత్‌కు చెందిన 15 ఏళ్ల టీనేజర్ సవిత శ్రీ గ్రాండ్మాస్టర్లను ఢీకొట్టి కాంస్య పతకం సాధించింది. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తర్వాత వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మూడో భారత క్రీడాకారిణిగా సవిత శ్రీ నిలిచింది. మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన సవిత ఈ టోర్నీలో 36వ సీడ్‌గా బరిలోకి దిగి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన మూడు రౌండ్లలో ఆమె 1.5 పాయింట్లు సాధించింది. దీంతో మొత్తం 8 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. తొమ్మిదో రౌండ్లో జాన్సయ అబ్దుమలిక్ (కజకిస్తాన్) చేతిలో ఓడటంతో ఆమె రజత అవకాశానికి గండి పడింది. నిరాశపరిచిన హారిక పదో రౌండ్లో క్వియాన్యున్ (సింగపూర్)పై గెలిచిన సవిత... ఆఖరి రౌండ్లో దినార సదుకసొవా (కజకిస్తాన్)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సీనియర్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కూడా 8 పాయింట్లు సాధించినప్పటికీ సూపర్ టై బ్రేక్ స్కోరు ఆధారంగా ఏపీ అమ్మాయి ఆరో స్థానంలో నిలిచింది. ద్రోణవల్లి హారిక 29వ స్థానంతో నిరాశపరిచింది. విజేత కార్ల్సన్ ఓపెన్ కేటగిరీలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ (9) ఐదో స్థానంలో నిలిచాడు. 8 రౌండ్లలో గెలిచి 3 ఓడిన అర్జున్ 2 రౌండ్లు డ్రా చేసుకున్నాడు. ఈ విభాగంలో ఇందులో ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ కార్ల్సన్ (10) విజేతగా నిలిచాడు. భారత సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 77వ స్థానంలో నిలిచాడు. చదవండి: IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. -
Bigg Boss 6: ‘అరేయ్ పప్పు’.. ఈ ఒక్కమాటే టాస్క్‌ని రద్దు చేసిందా?
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ రద్దయింది. బిగ్‌బాస్ ఇచ్చిన ‘సెలెబ్రెటీ గేమింగ్ లీగ్’ టాస్క్‌ని కంటెస్టెంట్స్ సరిగా ఆడలేదు. దీంతో బిగ్‌బాస్ అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి సీరియస్ అయ్యాడు. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇలాంటి చెత్త ఆటను చూడలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. అంతేకాదు.. ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించడంలేదంటూ.. టాస్క్‌నే నిలివివేశాడు. హౌస్‌లో ఈ వారం కెప్టెన్ ఉండబోడని స్పష్టం చేశాయి. (చదవండి: కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ ఫైర్.. కెప్టెన్సీ టాస్క్ నిలిపివేత) అయితే ఈ టాస్క్ రద్దుకు శ్రీసత్య కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. అర్జున్‌ని రెచ్చగొట్టిమరి రేవంత్‌తో గొడవకు దిపింది. దీంతో వారు పాత్రల్లోని బయటకు వచ్చి గొడవపడ్డారు. అసలు విషయం ఏంటంటే.. రెండు టీమ్‌లుగా విడిపోయిన కంటెస్టెంట్స్‌కి ‘వాల్‌పోస్టర్’అనే చాలెంజ్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ఇరు టీమ్ సభ్యులు.. వాల్‌పోస్టర్లను అతికించడం ప్రారంభించారు. మధ్యలో అర్జున్ ఏదో అంటుంటే.. ‘అరేయ్ పప్పు’అని రేవంత్ అంటాడు. ఆ విషయాన్ని అర్జున్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ శ్రీసత్య మాత్రం ‘నిన్ను ఏమైనా అంటే రియాక్ట్ అవ్వవా, మనిషివి కావా’అంటూ కసురుకుంది. దాంతో అర్జున్ రేవంత్ తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరు పాత్రల్లోంచి బయటకు వచ్చి మరి తిట్టుకుంటారు. ఈ గొడవ తర్వాత ఇంటి సభ్యులెవరు తమ తమ పాత్రల్లో ఉన్నట్లు కనిపించదు. అసలే ఎంటర్టైన్మెంట్ లేదు.. పోనీ గేమ్ అయినా సరిగా ఆడుతున్నారా అంటే అదీ లేదు. అందుకే బిగ్‌బాస్ రంగంలోకి దిగి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి కంటెస్టెంట్స్‌ని ఏ సీజన్లో చూడలేదని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ ఆదేశాలను, ఇంటి నియమాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇష్టం లేకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవచ్చుని గేట్లు ఎత్తేశాడు. దీంతో ఇంటి సభ్యులు దిగొచ్చి క్షమాపణలు కోరారు. అయినప్పటికీ బిగ్‌బాస్ కరగలేదు. ఈ వారం టాస్కే లేదని చెప్పేశాడు. మరి ఇప్పుడు హౌజ్‌మేట్స్ ఏం చేస్తారో? గేమ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. -
డెవిల్ కపుల్స్.. భర్తతో కలిసి దుర్మార్గాలు చేసే భ ‘లేడీ విలన్స్’
విలన్.. హీరోయిన్ వెంట పడ్డాడు. లేకపోతే హీరోతో గొడవ పడ్డాడు. ఏదో ఒకటి. హీరోయిన్ విల న్ అసహ్యయించుకుంటుంది. అతన్ని ఛీ కొడుతుంది. హీరో ఏమో చావకొడతాడు. మూకీ నుంచి టాకీ వరకు ఒకటే స్టోరీ లైన్. విలన్ని చూసి భయపడే ఆడవాళ్లు ఉంటారు. చీదరించు కునే ఆడవాళ్లు ఉంటారు…మరి…విలన్‌కి జోడీ మాటేంటి ? ఈడూ జోడూ అంటే హీరో హీరో యిన్స్ మాత్రమేనా ? ఈ డౌట్ సహజంగా అందరికీ వస్తుంది కదా. ఇంతకీ తెలుగు సినిమాల్లో విలన్ జోడీలు లేరా? చిలకాగోరింకల్లా అనోన్యంగా ఉంటూ…కలిసికట్టుగా దుర్మార్గాలు చేసే డెవిల్ కపుల్స్ మీద ఒక లుక్ వేసేద్దామా.. ఏ సినిమా చూసినా హీరోకే జోడి. అది లవర్ కావచ్చు. లేదా భార్య కావచ్చు. కానీ…విలన్ కి మాత్రం జోడి ఉండదు. హీరోయిన్ చేత ఛీ కొట్టించుకునే విలన్లే అందరూ. ఒకవేళ భార్య రూపం లో జోడి ఉన్నా…ఆమె విలన్ని…విలన్ లానే చూస్తుంది. అలా కాకుండా విలన్ చేసే ప్రతి దుర్మార్గాన్ని సపోర్ట్ చేసే జోడి ఉంటే ? ఆమె భార్య కావచ్చు. ప్రేయసి కావచ్చు. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా విలన్‌కి అలాంటి జోడి దొరుకుతూ ఉంటుంది. అతను చేసే వెధవ పనున్నింటికీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. విలన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. క్రాక్ సినిమా తో మరోసారి ఈ ట్రెండ్ ఫోకస్‌లోకి వచ్చింది. కఠారి కృష్ణకి అన్ని రకాలుగా అండగా ఉండే జయమ్మ క్యారెక్టర్ అందరినీ ఆకర్షించింది. ఈ చిత్రంలో కటారి కృష్ణ పాత్రని సముద్రఖని పోషించగా, జయమ్మగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించింది. అర్జున్.. ఒక్కడు తర్వాత గుణశేఖర్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ బ్యాగ్రౌండ్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మధుర మీనాక్షి టెంపుల్ సెట్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఈ సినిమాలో విలన్ బాల నాయ గర్ అయితే, అంతకు మించి అన్న టైప్‌లో విలనీజాన్ని పండించింది ఆండాల్ పాత్ర. బాల నాయగర్గా ప్రకాష్ రాజ్, ఆయన సతీమణి ఆండాల్గా సరిత నటించారు. భర్త మనసు తెలు సుకుని మరీ దుర్మార్గపు పనులు చేసే భార్యగా సరిత నటన ప్రశంసలు అందుకుంది. మహేశ్ బాబుతో పాటుగా సరితకు కూడా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. విలన్‌కి జోడిగా ఉంటూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసే ఆడవాళ్లు తెలుగు సినిమాల్లో తక్కు వే. మహేశ్‌బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో అలాంటి క్యారెక్టర్ని డిజై న్ చేశారు. నిజంలో విలన్‌గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ సినిమాలో గోపిచంద్‌కి జంటగా రాశి నటించింది. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్‌కి క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. సినిమాకి, సినిమాకి పూర్తి భిన్నమైన జానర్స్‌ని ఎంపిక చేసుకునే హీరోల్లో రానా ఒకడు. నేనే రాజు, నేనే మంత్రి అందుకో ఉదాహరణ. జోగేంద్ర, రాధ చూడముచ్చటైన జంట. చివరి వరకు మూవీలో ఈ కపుల్ ట్రావెల్ చేయక పోయినా…కథ మలుపు తిరగడానికి మాత్రం కారణమౌ తుంది. అదే ఊరి సర్పంచ్ జంట. సర్పంచ్‌గా ప్రదీప్ రావత్ నటిస్తే…అతని భార్యగా బిందు చంద్రమౌళి నటించారు. ప్రదీప్ రావత్, బిందు చంద్రమౌళి ఇద్దరూ నెగిటివ్ రోల్స్‌లో తెగ జీవించేశారు. ఒక సినిమా. పది విభిన్నమైన క్యారెక్టర్లు. దశావతారంతో నట విశ్వరూపం చూపించేశారు కమలహాసన్. ఒక్కో పాత్ర పూర్తి భిన్నమైన నేపథ్యంతో సాగుతోంది. కథానాయకుడు, ప్రతికథా నాయకుడుతో పాటుగా కథని మలుపు తిప్పే కీలక పాత్రలన్నీ తానే పోషించారు. అందులో విలన్ పాత్ర ఫ్లెచర్కి జంటగా మల్లికా షరావత్ నటించింది. గోవింద్‌ని పట్టుకునే క్రమంలో ఫ్లెచర్కి మల్లికా షరావత్ అన్ని రకాలుగా సహకరిస్తుంది. అమ్మోరు. పాతికేళ్ల క్రితమే వి.ఎఫ్.ఎక్స్ తో సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించిన చిత్రం. అసలే స్పెషల్ ఎఫెక్ట్స్. ఆ పైన భక్తి చిత్రం. ఒకవైపు భక్తి భావోద్వేగం. మరోవైపు తొలి సారిగా కళ్ల ముందు కనిపిస్తున్న సరికొత్త సాంకేతిక మాయజాలం. అందుకే…అమ్మోరు అం తటి ఘన విజయం సాధించింది. దేశంలోని అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లో చర్చ జరిగే చేసింది. అమ్మోరు చిత్రంలో ప్రధాన విలన్‌గా గోరఖ్ పాత్రలో రామిరెడ్డి నటించారు. అదే చిత్రంలో మరో విలన్‌గా బాబూమోహన్ నటించారు. బాబూ మోహన్‌కి జంటగా వడివుక్కరసి నటించారు. హీరో కుటుంబంలో చిచ్చు పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భార్యా, భర్తలిద్దరూ కలిసికట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య కుట్రల కోణంలో కెమిస్ట్రీ చాలా బాగా పండింది. టాలీవుడ్లో దాదాపు పదేళ్ల పాటు ఏలేసిన హీరోయిన్స్‌గా ఒకరు సిమ్రాన్. సహజంగా హీరో యిన్‌గా ఫేడౌట్ అయిన తర్వాత ఏ వదినగానో, అక్కగానో రీఎంట్రీ ఉంటుంది. కానీ…సిమ్రాన్ మాత్రం లేడీ విలన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ మూవీ సీమరాజా తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో విలన్ లాల్ భార్యగా నెగివిట్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేసింది సిమ్రాన్. హీరోయిన్ సమంతాతో పాటుగా లాల్, సిమ్రాన్ ల విలనీజం కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. -
నేహాపై ఫైర్ అయిన మెరీనా.. బుద్ధి ఉండదా అంటూ ఆగ్రహం
బిగ్‌బాస్ సీజన్-6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరిరోజు కూడా పోలీసులకు, దొంగలకు మధ్య వాగ్వివాదం నడుస్తుంది. పట్టుబడిని మెరీనాను దొంగలు బెడ్రూమ్లో వేసి లాక్ చేస్తారు. దీంతో ఆమె అక్కడున్న కబోర్డ్స్లలో బొమ్మలు వెతుకుతుంటుంది. దీంతో ఆమెకు ఆ యాక్సిస్ లేదని, అలా చేయడానికి వీళ్లేదని నేహా ఫైర్ అవ్వగా.. మాటిమాటికి గుర్రు అంటే ఎట్లా? బుద్ది ఉండదా? అంటూ మెరీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు వంద రూపాయలకి ఒక బొమ్మ కొంటానంటూ గీతూ దొంగలతో డీల్ మాట్లాడుతుంది. అంతేకాకుండా చివర్లో వాళ్లకు ఓ బహుమతి కూడా ఇస్తానని ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా సత్యతో పరిహోర కలపేందుకు అర్జున్ తెగ ట్రై చేస్తున్నాడు. అయినా సరే పట్టించుకోని సత్య.. హౌస్‌లో అందరినీ అన్నయ్య అనే పిలుస్తానని చెప్పడంతో అర్జున్ కాస్త ఫీల్ అయినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సత్యను తప్పా మిగతా అందిరినీ సిస్టర్ అని పిలుస్తానని చెప్పిన అర్జున్ సత్యతో లవ్ ట్రాక్ నడిపిందుకు రకరకాల ఫీట్లు చేస్తున్నాడు. దీనికి సత్య రియాక్షన్ ఏమైనా మారుతుందా లేక నో ఫీలింగ్స్ అంటూ అలానే ఉండిపోతుందా చూద్దాం. -
BWF World Badmintonship: చరిత్ర సృష్టించిన ధ్రువ్- అర్జున్ జోడీ.. తొలిసారిగా
MR Arjun- Dhruv Kapila: భారత షట్లర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ అద్బుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. టోక్యో వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్-2022లో భాగంగా ఈ ద్వయం గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సింగపూర్ జోడీతో తలపడింది. ఈ మ్యాచ్‌లో హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ జంటను ఓడించింది. మొదటి గేమ్‌లో (18-21) కాస్త వెనుకబడినా.. వరుసగా రెండు గేమ్‌లలో 21-15, 21-16తో సత్తా చాటి విజయం అందుకుంది. తద్వారా ధ్రువ్ కపిల- ఎం. ఆర్ అర్జున్ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక అంతకు ముందు రెండో రౌండ్లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్(అన్‌సీడెడ్) ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ ఆస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 21–17, 21–16తో విజయం నమోదు చేసి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. క్వార్టర్ ఫైనల్లో ధ్రువ్- అర్జున్.. మూడో సీడ్ ఇండోనేషియా ద్వయం మహ్మద్ అహ్సాన్, హెండ్రా సెటీవాన్తో తలపడనున్నారు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం! Asia Cup 2022 Ind Vs Pak: బాబర్ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్! రషీద్‌తోనూ ముచ్చట! Big task ahead for @arjunmr & @dhruvkapilaa in their maiden #BWFWorldChampionships quarterfinals and they are up for it 👊🔥#BWFWorldChampionships2022#BWC2022#Tokyo2022#IndiaontheRise#Badminton pic.twitter.com/idvcF3rX2V — BAI Media (@BAI_Media) August 25, 2022 -
Shooting World Cup 2022: భారత్‌కు మరో స్వర్ణం, రజతం
దక్షిణకొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత్ గురువారం మరో స్వర్ణం, రజతం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు బంగారు పతకం లభించింది. అర్జున్ బబుటా, తుషార్ మానే, పార్థ్ మఖీజా సభ్యులుగా ఉన్న భారత బృందం ఫైనల్లో 17–15 తేడాతో ఆతిథ్య కొరియా టీమ్‌పై విజయం సాధించింది. అదే విధంగా.. మహిళల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు రజతం లభించింది. ఎలవెనిల్ వలరివన్, మెహులీ ఘోష్, రమిత సభ్యులుగా ఉన్న భారత జట్టు ఫైనల్లో కొరియా చేతిలోనే 10–16తో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యం లభించింది. -
అర్జున్ గురి అదిరె...
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఈ సీజన్‌లోని మూడో ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పసిడి బోణీ కొట్టింది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత యువ షూటర్ అర్జున్ బబూటా సంచలన ఫలితంతో స్వర్ణ పతకం సాధించాడు. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అర్జున్‌కు సీనియర్ స్థాయిలో ఇదే తొలి బంగారు పతకం. 2016 జూనియర్ ప్రపంచకప్‌లో అతను స్వర్ణం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన అమెరికా షూటర్ లుకాస్ కొజెనిస్కయ్తో జరిగిన ఫైనల్లో అర్జున్ 17–9తో గెలుపొందాడు. కొత్త నిబంధనల ప్రకారం ఫైనల్లో పోటీపడుతున్న ఇద్దరు షూటర్లలో తొలుత 16 పాయింట్లు గెలిచిన షూటర్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో షాట్లో ఇద్దరు షూటర్లలో అత్యధిక స్కోరింగ్ షాట్ సాధించిన షూటర్‌కు రెండు పాయింట్లు కేటాయిస్తారు. ఇద్దరు స్కోరింగ్ షాట్ సమంగా ఉంటే ఒక్కో పాయింట్ ఇస్తారు. లుకాస్‌తో జరిగిన ఫైనల్లో 13 షాట్లలో అర్జున్ ఎనిమిదింట పైచేయి సాధించగా, లుకాస్ నాలుగు షాట్లలో భారత షూటర్కంటే ఎక్కువ స్కోరు చేశాడు. మరో షాట్లో ఇద్దరూ సమానంగా స్కోరింగ్ షాట్ కొట్టారు. అంతకుముందు ఎనిమిది మంది మధ్య జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో అర్జున్ 261.1 పాయింట్లు, లుకాస్ 260.4 పాయింట్లు సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. భారత్‌కే చెందిన పార్థ్ మఖీజా 258.1 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
చెస్ టోర్నీ విజేత అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్ –19 జూనియర్ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన ఆదిరెడ్డి అర్జున్ విజేతగా నిలిచాడు. ఆరు రౌండ్లపాటు నిర్వహించిన ఈ టోర్నీలో అర్జున్ 5.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. చివరిదైన ఆరో రౌండ్లో చల్లా సహర్షపై అర్జున్ గెలుపొందాడు. ఈ టోర్నీలో అర్జున్ ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. మొహమ్మద్ బాషిక్ ఇమ్రోజ్ (నల్లగొండ) రన్నరప్‌గా, సీహెచ్ కార్తీక్‌సాయి (రంగారెడ్డి) మూడో స్థానంలో, విహాన్ కార్తికేయ (రంగారెడ్డి) నాలుగో స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
తెలుగులో ఎంట్రీ ఇస్తున్న హీరో అర్జున్ కూతురు!
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్‌కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్యను ఇది వరకే కన్నడలో హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ముద్దుగుమ్మను తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయం చేయాలని అర్జున్ భావిస్తున్నారట. తన సొంత డైరెక్షన్లోనే ఓ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నట్లు సమాచారం. 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విశ్వక్సేన్ను ఈ సినిమాలో హీరోగా చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. -
తొలిరోజు భారత్‌కు మూడు కాంస్యాలు
Asia Senior Wrestling Championship- ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత రెజ్లర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ హలాకుర్కి (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను దక్కించుకున్నారు. కాంస్య పతక బౌట్లలో కర్ణాటకకు చెందిన అర్జున్ 10–7తో దవాబంది ముంఖ్‌ఎర్డెన్ (మంగోలియా)పై... నీరజ్ 7–4తో బఖ్రమోవ్ (ఉజ్బెకిస్తాన్)పై... సునీల్ 9–1తో బత్బెయర్ లుత్బాయర్ (మంగోలియా)పై నెగ్గారు. 77 కేజీల విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సజన్ 1–11తో సకురాబా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు! -
అభిషేక్‌ను పట్టుకోవడంతో అర్జున్ జంప్!
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ బ్లూప్లాజా హోటల్ ఆధీనంలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమీప బంధువైన అర్జున్ వీరమాచినేని తృటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నట్టు తెలిసింది. గత ఆదివారం తెల్లవారుజామున పబ్‌పై పోలీసులు దాడిచేసి అందరినీ బంజారాహిల్స్ ఠాణాకు తరలించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం అర్జున్ ఠాణా వద్దకు వచ్చాడు. తానెవరో చెప్పకుండా గమనించడం మొదలుపెట్టాడు. అప్పటికే పబ్ భాగస్వామి అభిషేక్, మేనేజర్ అనిల్కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఇది చూసిన అర్జున్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంటికి కూడా వెళ్లకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిర్ధారించుకున్నట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందాలు గురువారం అర్జున్, కిరణ్‌రాజ్‌ల ఇళ్లకు వెళ్లి ఆరా తీసినట్టు తెలిసింది. ఈ పబ్‌లో అభిషేక్‌తోపాటు అర్జున్, పెనుమత్స కిరణ్‌రాజు భాగస్వాములుకాగా.. అనిల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు దాడి చేసినప్పుడు అనిల్, అభిషేక్ పబ్ వద్దే ఉండటంతో పట్టుబడ్డారు. రిమాండ్‌లో ఉన్న ఈ ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై శుక్రవారం ఎంఎస్‌జే కోర్టులో వాదనలు జరగనున్నాయి. (చదవండి: లగేజ్ బ్యాగేజ్‌లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
అనసూయ సినిమాకు అర్జున్ సాయం
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దర్జా’.కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని సునీల్ పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్ని యాక్షన్ కింగ్ అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దర్జా’ మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుందనిపిస్తుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి, చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’అని తెలిపారు. ‘ఇంతకుముందు విడుదలైన అనసూయగారి మోషన్ పోస్టర్‌లానే.. ఇప్పుడు విడుదలైన సునీల్ మోషన్ పోస్టర్ కూడా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది’అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ రాప్ రాక్ షకీల్. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ ‘యాక్షన్ కింగ్ అర్జున్‌గారి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ మోషన్ పోస్టర్‌కి షకీల్ అద్భుతమైన ఆర్ఆర్ అందించాడు. మోషన్ పోస్టర్ లాగే సినిమాను కూడా అంతా ఎంజాయ్ చేస్తారు’అని అన్నారు. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సంయుక్తంగా అగ్రస్థానంలో అర్జున్
జాతీయ సీనియర్ పురుషుల చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. కాన్పూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పదో రౌండ్లో అర్జున్ 41 ఎత్తుల్లో ఇనియన్ (తమిళనాడు)తో ‘డ్రా’ చేసుకోగా... గుకేశ్ 64 ఎత్తుల్లో అభిజిత్ గుప్తా (పీఎస్‌పీబీ)పై గెలిచాడు. నేడు చివరిదైన 11వ రౌండ్ గేముల్లో సేతురామన్ (పీఎస్‌పీబీ)తో అర్జున్, ఆర్యన్ చోప్రా (ఢిల్లీ)తో గుకేశ్ ఆడతారు. -
అజేయంగా నిలిచిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్
Tata Steel Chess 2022: టాటా స్టీల్ చాలెంజర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీని తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ విజయంతో ముగించాడు. నెదర్లాండ్స్‌లో ఆదివారం జరిగిన చివరిదైన 13వ రౌండ్ గేమ్‌లో 18 ఏళ్ల అర్జున్ 62 ఎత్తుల్లో మార్క్ మౌరిజి (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఎనిమిది గేముల్లో నెగ్గిన అర్జున్ ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని 10.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. చాలెంజర్స్ టోర్నీ విజేత హోదాలో అర్జున్ వచ్చే ఏడాది జరిగే టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీకి అర్హత పొందాడు. చదవండి: ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచలనం సృష్టించిన జాసన్ హోల్డర్ -
లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో అర్జున్‌కు క్లీన్ చిట్
Hero Arjun Sarja Gets Clean Chit In Me Too Case After Three Years: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో అర్జున్ సర్జాకు క్లీన్ చిట్ లభించింది. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో సాక్ష్యులు ఎవరూ లేకపోవడంతో అర్జున్‌పై అభియోగాలు వీగిపోయినట్లు బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించారు. కాగా మూడేళ్ల క్రితం అర్జున్‌పై శృతి హరిహరన్ అనే హీరోయిన్ మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగులో రిహార్సల్ సాకుతో అర్జున్ తనను కౌగిలించుకున్నాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు దాదాపు మూడేళ్ల విచారణ అనంతరం తాజాగా అర్జున్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందున అతనిపై ఉన్న అభియోగాలు ఎత్తివేస్తున్నట్లు తమ నివేదికలో రూపొందించారు. -
`ఫ్రెండ్షిప్’లో తప్పకుండా వైవిధ్యంగా ఉంటుంది: ఎ.ఎన్ బాలాజీ
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్షిప్’. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకులు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎ.ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేరోజున విడుదలవుతున్న ఫ్రెండ్షిప్ చిత్రాన్ని తెలుగులో ఎ.ఎన్.బాలాజీ సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ.. ‘మలయాళంలో అందరూ కొత్త నటీనటులతో చేసి సూపర్ హిట్ అయిన `క్వీన్` సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని `ఫ్రెండ్షిప్` పేరుతో రీమేక్ చేశారు. హర్భజన్, అర్జున్ పోటాపోటీగా నటించారు. దాపు పాతిక కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా వైవిధ్యంగా ఉంటుంది. రాజకీయాలకు, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా, కమర్షియల్ అంశాలతో ఎంగేజింగ్‌గా దర్శకుడు జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య తెరకెక్కించారు. సినిమా ఐదు భాషల్లో(తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం) విడుదలవుతుంది. సెన్సార్‌కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేశాం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం’అన్నారు. -
రోయర్ల తడాఖా...
భారత రోయర్లు అర్జున్–అరవింద్ సింగ్ ఒలింపిక్స్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ముందంజ వేశారు. లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో సెమీఫైనల్లోకి చేరారు. టోక్యోలోని సీ ఫారెస్ట్ వాటర్‌వేలో ఆదివారం జరిగిన రెపిచేజ్ రౌండ్లో భారత జోడీ పోటీని 6ని:51.36 సెకన్ల టైమిం గ్‌తో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. శనివారం జరిగిన హీట్స్‌లో అర్జున్– అరవింద్ ద్వయం ఐదో స్థానంలో నిలిచింది. ఇదే ఉత్సాహంతో 28న జరిగే గ్రూప్ ‘బి’ సెమీఫైనల్లో భారత జట్టు టాప్–3లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. గ్రూప్ ‘ఎ’ నుంచి మరో మూడు జోడీలు ఫైనల్‌కు చేరుతాయి. -
సీఎం స్టాలిన్‌తో నటుడు అర్జున్ భేటీ
ముఖ్యమంత్రి స్టాలిన్‌ను నటుడు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెబుతున్న విషయం తెలిసిందే. అదేక్రమంలో కరోనా కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు అర్జున్ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు అర్జున్ పేర్కొన్నారు. అలాగే ఇక్కడ మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. నటుడు అర్జున్ చెన్నై కెరుగంబాక్కంలోని తన తోటలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ ఆలయ కుంభాభిషేకం కార్యక్రమాన్ని గతంలో నిర్వహించతలపెట్టారు. అయితే కరోనా కారణంగా ఆ ఉత్సవం వాయిదా పడుతూ వచ్చింది. కాగా జులై 1, 2వ తేదీల్లో ఆంజనేయస్వామి దేవాలయ కుంభాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఉత్సవానికి ఆహ్వానించడానికే నటుడు అర్జున్ ఆయన్ని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే శ్రీఆంజనేయ ఆలయ కుంభాభి షేకానికి ప్రజలను భారీఎత్తున ఆహ్వానించాలని భావించినా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యం కాదని, అయితే భక్తులకు ఆ కొరత లేకుండా కుంభాభిషేక కార్యక్రమాన్ని యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని నటుడు అర్జున్ వెల్లడించారు. చదవండి: తమిళనాడు నూతన డీజీపీగా శైలేంద్రబాబు -
మహేష్‌కి విలన్‌గా కన్నడ సూపర్ స్టార్?
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో విలన్ పాత్రకు ఇప్పటికే ఉపేంద్ర, సుదీప్ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యాక్టర్ అర్జున్ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రంలోని ఓ ప్రధాన పాత్రకు అర్జున్ను చిత్రయూనిట్ సంప్రదించిందని, అది విలన్ పాత్రే అని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. మరి.. ‘సర్కారువారి పాట’ చిత్రంలో విలన్‌గా అర్జున్ ఖరారవుతారా? వేచి చూడాల్సిందే. -
కరోనా : అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన యంగ్ హీరో
బెంగళూరు : ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్‌గా మారాడు. కరోనా రోగులకు సహాయం అందించడానికి ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’ పేరుతో అర్జున్ అంబులెన్స్ సేవలలను ప్రారంభించాడు. ఇప్పటకే సోనూ సూద్, ప్రియాంక చోప్రా, ఆలియాభట్, సహా పలువురు నటులు కరోనా రోగులకు సహాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ నటుడు అర్జున్ గౌడ మరో అడుగు ముందుకేసి స్వయంగా అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. గత రెండు రోజులుగా అంబులెన్స్‌ను స్వయంగా నడుపుతూ పలువురు కోవిడ్ రోగులకు సహాయం అందించాడు. ఈ సందర్భంగా అర్జున్ గౌడ మాట్లాడుతూ..తాను ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’..అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కోవిడ్ రోగులను హాస్పిటల్స్‌కు తరలించడం సహా కోవిడ్ కారణంగా చనిపోయినవారికి అంత్యక్రియలను సైతం నిర్వహిస్తుందని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు తానే స్వయంగా ఆరుగురికి అంత్యక్రియలు జరిపించానని వెల్లడించాడు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు ఏ మతానికి చెందిన వారు అన్న దానితో సంబంధం లేకుండా అందరికీ సహాయం చేస్తానని తెలిపాడు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీంతో రానున్ను రెండు నెలల వరకు ఈ ఆంబులెన్స్ సర్వీసులు కొనసాగించాలని యోచిస్తున్నట్లు వివరించాడు. తనకు వీలైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, కర్ణాటక ప్రజలకు సేవ చేయడం గౌవరంగా భావిస్తానని చెప్పాడు. ‘యువరత్న’, ‘రుస్తుమ్’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందిన అర్జున్ గౌడ చేస్తోన్న మంచి పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అర్జున్ గౌడను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చదవండి : ఐసీయూలో కరీనా కపూర్ తండ్రి రణదీర్ KV Anand: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ కన్నుమూత -
హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ ఫోటోషూట్: వైరల్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీకి త్వరలో పరిచయం కాబోతున్న యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య లాంచింగ్ ముందే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా చీర కట్టులో ఐశ్వర్య ఫోటోలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి నీలాకాశం రంగు చీరతో ఐశ్వర్య చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్య 2013లో విశాల్ హీరోగా వచ్చిన పట్టాత్తు యానాయ్ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిపిందే. ఆ తర్వాత ప్రేమ బారాహ సినిమాతో కన్నడ ప్రేక్షకులనూ పలకరించింది. మంచి అందం, అభినయం ఉన్నా బాక్సీఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన స్వీయ దర్శకత్వంలో ఐశ్వర్యను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకుంటున్నాడు అర్జున్. మరి ఈ భామ ఎంతవరకు ఆకట్టుకుంటుదో వేచి చూడాలి. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
ఇది ప్రభుత్వంపై స్టార్ హీరోల నిరసన గళమా?
చెన్నె: ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఓటేసేందుకు అగ్ర తారలు తరలివచ్చినప్పటికీ సాధారణ ఓటర్లు అంతగా ఆసక్తి కనబర్చలేదని పోలింగ్ శాతం చూస్తే అర్ధమవుతోంది. అయితే పోలింగ్ రోజు పలు ఆసక్తికర సంఘటనలు తమిళనాడులో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సినీ నటులు వినూత్నంగా ఓటేయడానికి ముందుకువచ్చారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓటేయడానికి వచ్చారు. తదనంతరం నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఓటేసేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో అగ్రనటులు అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జయం రవి ముఖ్యంగా వారు వేసుకున్న మాస్క్‌లతో పరోక్షంగా డీఎంకే పార్టీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు నలుపు రంగు మాస్క్ ధరించి ఓటేసేందుకు వచ్చారు. డీఎంకే పార్టీ జెండాలో నలుపు ఉంటుంది. అందుకే ఆ పార్టీకి ఓటేయాలని పరోక్షంగా పిలుపునిచ్చినట్లుగా తమిళనాడులో చర్చ నడుస్తోంది. దీంతోపాటు విజయ్ సైకిల్ మీద రావడం తమిళనాడే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది. అయితే విజయ్ పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండడానికి నిరసనగా సైకిల్‌పై వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున అభిమానులు, ఓటర్లకు ఆ విషయం గుర్తు చేసేందుకు విజయ్ సైకిల్ ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక నటుడు విక్రమ్ కూడా పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఇదే విషయం ప్రస్తావించేందుకు నడుచుకుంటూ వచ్చాడని సమాచారం. శింబు ఈ చర్యలతో పరోక్షంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు అందరూ భావిస్తున్నారు. దీనిపై తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పరిణామం అధికార పార్టీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక అగ్రనటుడు రజనీకాంత్, సూర్య, కార్తీ తెల్లటి మాస్క్ ధరించి వచ్చారు. ఓటేసే సమయంలో నటుడు అజిత్ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటేయడానికి వచ్చే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అతడి ఫోన్‌ను లాగేసుకున్నాడు. మరికొద్దిసేపటి తర్వాత వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ తిరిగిచ్చేశాడు. చదవండి: బెంగాల్ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా.. -
'ఫ్రెండ్షిప్'.. లైఫ్‌లో మజా కోసం..
క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "ఫ్రెండ్షిప్". 'సింగ్ అండ్ కింగ్' అనేది ట్యాగ్ లైన్. ఇటీవల ఈ సినిమా నుంచి 'లైఫ్ లో మజా కోసం' అనే పాట విడుదలైంది. శరత్ సంతోష్ ఆలపించిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. సుమారు 25 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో తమిళ బిగ్ బాస్ విన్నర్, మాజీ 'మిస్ శ్రీలంక' 'లోస్లియా' హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. పలు సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న కమెడియన్ సతీష్ నటిస్తున్నాడు. శాంతకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా డి.ఎం.ఉదయ్ కుమార్ సంగీతం అందించారు. చదవండి: నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు! సుమ తొలి యాంకరింగ్ ప్రోగ్రాం ఏంటో తెలుసా? -
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో అర్జున్ భేటీ
సాక్షి, చెన్నై: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ కిషన్‌రెడ్డితో నటుడు అర్జున్ భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జోరందుకుంది. చెన్నైలో తిష్ట వేసి ఎన్నికల వ్యూహాలకు కిషన్‌రెడ్డి పదును పెట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్, కిషన్‌రెడ్డిలను అర్జున్ మంగళవారం కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. కొంత సేపు వీరి మధ్య పలు అంశాలపై చర్చ సాగిన సమాచారంతో అర్జున్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ పలకరింపు మర్యాద పూర్వకమేనని, కిషన్‌రెడ్డి తనకు సన్నిహితుడు కావడంతోనే ఆయన్ను కలిసినట్టుగా అర్జున్ పేర్కొన్నారు. చదవండి: అన్నాడీఎంకే- బీజేపీ కూటమి నుంచి మిత్రపక్షం అవుట్! -
‘రజత’ సరిత
రోమ్: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సరిత మోర్ (57 కేజీలు) రజతం పతకం దక్కించుకోగా... పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), నవీన్ (130 కేజీలు), కుల్దీప్ మలిక్ (72 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. గిలియా రోడ్రిగ్స్ (బ్రెజిల్)తో జరిగిన ఫైనల్లో సరిత 2–4 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషం వరకు 2–0తో ఆధిక్యంలో నిలిచిన సరిత ఆ తర్వాత నాలుగు పాయింట్లు సమర్పించుకొని రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల గ్రీకో రోమన్ కాంస్య పతక బౌట్లలో అర్జున్ 8–0తో రికార్డో (పోర్చుగల్)పై, నీరజ్ 6–4తో శామ్యూల్ జోన్స్ (అమెరికా)పై, నవీన్ 3–1తో స్టీఫెన్ డేవిడ్ (చెక్ రిపబ్లిక్)పై, కుల్దీప్ 10–9 తో లబజనోవ్ (రష్యా)పై గెలుపొందారు. -
యుద్ధ ట్యాంకర్ల హబ్‌గా తమిళనాడు
సాక్షి, చెన్నై: మోటార్ వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధ ట్యాంకర్ల ఉత్పత్తిలోనూ హబ్‌గా తమిళనాడు మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత ఆర్మీని అపార శక్తివంతంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. డీఆర్డీఓ దేశీయంగా తయారు చేసిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంక్(ఎంకే–1ఏ)ను భారతీయ సైన్యానికి అప్పగించారు. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంలతో కలిసి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. మెట్రో సేవలు.. రూ.3,770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్మెన్ పేట–విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు, రూ.293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్–అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్‌లో, రూ.423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం–తంజావూరు – తిరువారూర్ మార్గంలో రైలు సేవలకు జెండా ఊపారు. తంజావూరు, పుదుకోట్టైలకు సాగు నీరు అందించడం లక్ష్యంగా రూ. 2,640 కోట్లతో చేపట్టనున్న కళ్లనై కాలువ పునరుద్ధరణ పనులకు, రూ.1000 కోట్లతో చెంగల్పట్టు జిల్లా తయ్యూరు సమీపంలో 163 ఎకరాల్లో నిర్మించనున్న ఐఐటీ డిస్కవరీ క్యాంపస్ పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నై ఆవడిలోని ఆర్మీ ఫ్యాక్టరీలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో 71 సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న అర్జున యుద్ధ ట్యాంకర్‌ను భారత ఆర్మీకి అందించారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత చిత్ర పటాలకు మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ దశాబ్దం భారత్‌దేనని, కోవిడ్–19పై పోరు విషయంతో సహా అన్ని విషయాలలో ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని ప్రధాని తెలిపారు. ఏప్రిల్ నెలలో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంలతో కలిసి ప్రధాని మోదీ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలను తన ప్రసంగంలో ప్రధాని కొనియాడారు. తమిళ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. శ్రీలంక తమిళుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి కోసం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జాఫ్నాలో పర్యటించిన ఏకైక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తానే కావడం తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. శ్రీలంకలోని తమిళుల హక్కుల గురించి ఆ దేశంతో చర్చించామని వెల్లడించారు. దేశీయంగా తయారు చేసిన మార్క్1ఏ ట్యాంక్‌ను ఆర్మీకి అప్పగిస్తున్న సందర్భంగా సైన్యంతో మోదీ ప్రతి నీటి చుక్క కీలకం.. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళంలో వణక్కం చెన్నై.. వణక్కం తమిళనాడు అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టారు. తమిళనాడు రైతులు ఇక్కడి వనరుల్ని సద్వినియోగం చేసుకుని ఆహార ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నారని కొనియాడారు. ప్రతి నీటి చుక్క కీలకం అని, పొదుపు గురిం చి వివరిస్తూ భావితరాల కోసం జల, వనరుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తక్కువ జల వినియోగంతో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. చెన్నై మెట్రో ఫేజ్–2కు బడ్జెట్లో రూ. 63 వేల కోట్లను ప్రకటించామని గుర్తుచేశారు. ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయని, ఇది 130 కోట్ల మంది శ్రమ ఫలితమని పేర్కొన్నారు. పుల్వామా అమరులకు నివాళి.. రెండేళ్ల క్రితం ఇదే రోజున (ఫిబ్రవరి 14) పుల్వామా దాడి జరిగిందని గుర్తు చేస్తూ, ఆ దాడిలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమిళ కవి సుబ్రమణ్య భారతియార్ రాసిన ‘ఆయుధం సెయ్‌వోం...(ఆయుధం తయారు చేద్దాం)’ అన్న కవితను గుర్తు చేస్తూ, డిఫెన్స్ కారిడార్‌కు తమిళనాడు ఎంపికైనట్టు తెలిపారు. మోటారు వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధట్యాంకర్ల ఉత్పత్తికి హబ్‌గా తమిళనాడు మారిందని పేర్కొంటూ, తాజాగా ఆర్మీకి అంకితం ఇచ్చిన ఎంకే–1ఏ గురించి వివరించారు. భారత ఆర్మీ శాంతియుతంగా సరిహద్దుల్లో దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. ప్రపంచ స్థా యి ప్రమాణాలతో ఐఐటీ డిస్కవరీ రూపుదిద్దుకోబోతున్నదని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానికి బ్రహ్మరథం పట్టే రీతిలో చెన్నైలో ఆహ్వానం లభించింది. ప్రధాని పర్యటన సందర్భం గా చెన్నైలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బీపీసీఎల్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ జాతికి అంకితం కొచ్చి: కేరళలో పలు అభివృద్ధి పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 6 వేల కోట్ల విలువైన బీపీసీఎల్‌కు చెందిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేశారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను, మెరైన్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం ‘విజ్ఞాన సాగర్’ను ప్రారంభించారు. పెట్రో కెమికల్ ప్రాజెక్టుతో అక్రిలిక్ యాసిడ్, ఆక్సో ఆల్కహాల్, అక్రిలేట్స్ తదితర ఉత్పత్తుల దిగుమతులు తగ్గి గణనీయ మొత్తంలో విదేశీ మారకం ఆదా అవుతుందన్నారు. బోల్గట్టి, విలింగ్డన్ ఐలండ్ మధ్య జల మార్గ రవాణా కోసం రెండు నౌకలను ప్రారంభించారు. కేరళలో పర్యాటక రంగ మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. కొచ్చిలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు అందులో భాగమేనన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేరళ బీజేపీ నేతలతో మోదీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో కేంద్రం అభివృద్ధి పథకాలను ప్రధానంగా ప్రచారం చేయాలన్నారు. -
భజ్జీ సినిమా హక్కులు ఎ.ఎన్.బాలాజీకీ
క్రికెటర్ హర్భజన్ సింగ్, నటుడు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. ‘సింగ్ అండ్ కింగ్’ అన్నది ఉపశీర్షిక. మాజీ మిస్ శ్రీలంక, తమిళ బిగ్ బాస్ విన్నర్ లోస్లియా హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్ పాల్ రాజ్–శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. 25 కోట్ల బడ్జెట్‌తో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ.ఎన్.బాలాజీ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎ.ఎన్ . బాలాజీ మాట్లాడుతూ –‘‘ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ నేపథ్యంలో ప్రేమలు, గొడవల మధ్య ఆద్యంతం ఉత్కంఠగా నడిచే చిత్రమిది. చివరి షెడ్యూల్ ప్రస్తుతం కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది. హర్భజన్ సింగ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ చిత్రం హిందీలోనూ విడుదల కానుంది’’ అన్నారు. -
జెంటిల్‌మేన్ 2
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా శంకర్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ కేటీ కుంజుమోన్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్‌మేన్’. 1993లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు దేశవ్యాప్తంగా శ్రోతలను అలరించాయి. ఈ సినిమా విడుదలైన 27ఏళ్లకు ‘జెంటిల్‌మేన్2’ చిత్రాన్ని నిర్మించనున్నట్లు నిర్మాత కేటీ కుంజుమోన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘జెంటిల్‌మేన్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనువదించిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన రాబట్టుకుంది. తొలి భాగానికి రెండింతలు గొప్పగా ‘జెంటిల్‌మేన్ 2’ని తెరకెక్కించనున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఈ సినిమాని రూపొందిస్తాం. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జెంటిల్‌మేన్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. -
మూడు భాషల్లో ఇద్దరు
అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. తెలుగు–తమిళ–కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రాధికా కుమారస్వామి, సోనీ చరిష్టా, జె.డి. చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాధ్, హీరో ఆమిర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శనివారం అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘ఇద్దరు’ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రబృందం విడుదల చేయించింది. ‘‘అర్జున్‌గారితో కలిసి నేను చేసిన స్పెషల్ సాంగ్ బోయపాటి సార్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సోనీ చరిష్టా. ఈ పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, చిత్ర సహనిర్మాత శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. -
కన్నీటిపర్యంతమైన అర్జున్
సాక్షి, కర్ణాటక : గుండెపోటుతో ఆదివారం కన్నుమూసిన కన్నడ చిత్ర హీరో చిరంజీవి సర్జా (39) అంత్యక్రియలు కనకపుర రోడ్డులోని నెలగోళి గ్రామంలోని ఫారంహౌస్‌లో ముగిశాయి. ఒక్కలిగ సంప్రదాయం ప్రకారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జరిపారు. ఆదివారం రాత్రి నుంచి నగరంలోని బసవనగుడిలోని చిరంజీవి సర్జా నివాసం వద్ద ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. పెద్దసంఖ్యలో బంధువులు, రాజకీయ నాయకులు, అభిమానులు అంతిమ దర్శనం చేసుకున్నారు. పురోహితులు సంస్కార పూజలను పూర్తి చేసి, మధ్యాహ్నం రెండు గంటలకు పూలతో అలంకరించిన వాహనంలో కనకపుర రోడ్డులోని సొంత ఫాంహౌస్ బృందావనకు తీసుకెళ్లారు. అభిమానులు అధిక సంఖ్యలో వస్తారని భావించి రామనగర జిల్లా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మొదట మధుగిరి తాలూకా జక్కేనహళ్లిలో అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ తమ్ముడు ధృవ సర్జా బృందావనంలోనే అన్న స్మృతి ఉండాలని కుటుంబ సభ్యులను ఒప్పించారు. అశ్రు నివాళులు మధ్య పార్థివ దేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు వెక్కివెక్కి ఏడ్చిన అర్జున్ చిరంజీవి సర్జా మామ, బహుభాషా నటుడు అర్జున్ కుటుంబం ఆదివారం రాత్రి చెన్నై నుంచి కారులో రాత్రి 11:30 గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. నేను మీ మామ వచ్చాను, లేవరా అని బిగ్గరగా విలపించడం చూసి అందరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కరోనా వైరస్ కారణంగా పార్థవశరీరం దర్శించటానికి ప్రముఖులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఆత్మీయునికి దూరమయ్యాం యశవంతపుర: కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆకస్మిక మృతి పట్ల శాండల్‌వుడ్ ముఖ్యలు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సర్జా సతీమణి మేఘనారాజ్‌ను, కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం డీకేశి మీడియాతో మాట్లాడుతూ మనిషిగా పుట్టాక మరణం అనివార్యమన్నారు. చావు ఎవరి చేతిలో లేదు. యముడు మనపై ఎలాంటి కరుణ చూపడు అనటానికీ చిరంజీవి సర్జా మరణం సాక్షి. చిన్న వయస్సులోని ఒక నటుడు దూరం కావటం సినిమా రంగానికీ తీవ్ర నష్టం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని పేర్కొన్నారు. నాకు గాడ్ ఫాదర్ : చందనశెట్టి తను బెంగళూరుకు వచ్చిన మొదటలో చిరంజీవి సర్జా ఆశ్రయం కల్పించిన్నట్లు బిగ్‌బాస్ విజేత, గాయకుడు చందనశెట్టి తెలిపారు. చిరంజీవి సర్జా మరణవార్త విని షాక్‌కు గురైన్నట్లు చెప్పారు. అర్జున్, చిరంజీవి సర్జాలు వారి ఇంటిలోనే పెట్టుకొని సంవత్సరం పాటు తనకు ఆశ్రయం కలి్పంచిన్నట్లు చెప్పారు. చిరంజీవి సర్జా నటించిన వరదనాయక్ సినిమాలో పాటలు పాడే చాన్స్ ఇచ్చాడని తెలిపారు. మిత్రున్ని కోల్పోయా : రాధికా పండిత్ ఒక మంచి స్నేహితుడిని దూరమైనాడని నటి రాధికా పండిత్ సంతాపం వ్యక్తం చేశారు. ఇన్‌స్ట్రాగాంలో పోస్ట్ చేస్తూ చిరంజీవి సర్జా మరణవార్తను నమ్మలేకపోతున్నా. మేఘనా, ధృవ కుటుంబానికీ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు కల్పించాలని అని కోరుకున్నారు. సర్జా కుటుంబానికి జూన్ నెల విషాదం చిరంజీవి సర్జా ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చిరంజీవి సర్జా అన్న కిశోర్ సర్జా 2009 జూన్ 27న గుండెపోటుతో 50 ఏళ్లు వయస్సులో మృతి చెందారు. దీనితో జూన్ నెల సర్జా కుటుంబానికి కలిసి రావటం లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామస్థులు కన్నీరు చిరంజీవి సర్జా కుటుంబానికి రామనగరకు సమీపంలో నెలగుళి వద్ద నాలుగు ఎకరాల తోట ఉంది. అప్పుడప్పుడు అక్కడకు వెళ్లేవారు. గ్రామస్థులను చూసి ఆయన కారు నిలిపి ఆప్యాయంగా మాట్లాడేవారు. చిరంజీవి సర్జా మరణ వార్తతో గ్రామస్తులు కన్నీరుకార్చారు. సర్జా పెళ్లి సందర్భంగా తోటలో గ్రామస్తులకు విందునిచ్చారని గుర్తుచేసుకున్నారు. -
నాలుగు భాషల్ ఫ్రెండ్షిప్
క్రికెటర్ హర్భజన్‌సింగ్ హీరోగా నటిస్తోన్న తొలి చిత్రం ‘ఫ్రెండ్షిప్’. ఈ చిత్రంలో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ‘యాక్షన్ కింగ్’ అర్జున్, సతీష్ ప్రధాన పాత్రధారులు. దర్శక ద్వయం జాన్‌పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమాను జేపీఆర్, స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హర్భజన్ ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా కనిపిస్తారని సమాచారం. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్మురుగన్, రాబిన్. -
క్రికెటర్ టు స్టూడెంట్!
క్రికెటర్ నుంచి యాక్టర్‌గా మారి ‘ఫ్రెండ్షిప్ యువర్స్ ఫ్రెండ్లీ’ అనే చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు హర్భజన్ సింగ్. ఇందులో లోస్లియా మరియాసేన్ కథానాయికగా నటిస్తున్నారు. జాన్‌పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు అర్జున్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమాలో మెకానికల్ స్టూడెంట్‌గా హర్భజన్ సింగ్ నటిస్తున్నట్లు తెలిసింది. ‘‘స్కూలింగ్ తర్వాత కొంత గ్యాప్ వచ్చి, మళ్లీ చదువును కొనసాగించే వ్యక్తి పాత్రలో కనిపిస్తారు హర్భజన్ సింగ్. మెకానికల్ ఇంజినీరింగ్ చదవడం కోసం పంజాబ్ నుంచి కోయంబత్తూర్ వచ్చి ఓ కాలేజ్‌లో జాయిన్ అవుతారు హర్భజన్. కోయంబత్తూర్కే హర్భజన్ ఎందుకు వచ్చాడు? అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే కథాంశం. ఈ చిత్రంలో అర్జున్ క్యారెక్టర్ ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. లాక్‌డౌన్‌కి ముందే తొలి షెడ్యూల్ పూర్తయింది. లాక్డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మీరు వర్క్ చేసే ఫీల్డ్ అలాంటిది..
‘అగ్నిసాక్షి’ సీరియల్ హీరో శంకర్ బుల్లితెర ప్రేక్షకులకు చిరపరిచితం. అసలు పేరు అర్జున్ అంబటి. బుల్లితెరపై గౌరితో ప్రణయం, పరిణయం గురించి ప్రేక్షకులకు తెలిసిందే. ‘స్టార్ మా’లో వచ్చే ఇస్మార్ట్ జోడీ రియాల్టీ షో ద్వారా తన అర్ధాంగి సురేఖతో కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్‌తో సందడి చేస్తున్నారు. ‘నేను బెంగళూరు నుంచి వచ్చాను అనుకున్నారు చాలామంది. కానీ, తెలుగింటి అబ్బాయినే’ అంటూ తన గురించి వివరించారు అర్జున్. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌కు ముందు ‘అర్ధనారి’ అనే సినిమా చేశాను. మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత సౌఖ్యం, దేశముదురు ఇటీవల అశ్వమేధం సినిమాల్లో నటించాను. నేను స్క్రీన్ ముందుకు రాకముందు సాఫ్ట్వేర్ ఉద్యోగిని. చెన్నై, హైదరాబాద్‌లలో ఐటీ కంపెనీలో జాబ్ చేశాను. సినిమాలంటే ఉన్న ఆసక్తితో ఈ రంగం వైపుగా వచ్చాను. అయితే, సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుండగా సీరియల్ ఆఫర్ వచ్చింది. ఆసక్తిగా అగ్నిసాక్షి వందలో ఒకటో రెండో ఇలాంటి సీరియల్ టాపిక్స్ వస్తాయనుకుంటాను. అరుదైన కథతో ఆసక్తిగొలిపే కథనం గల ఈ సీరియల్ నన్ను వరించడం గొప్పగా భావిస్తున్నాను. ఈ సీరియల్ నటుడిగా నన్ను నిలబెట్టింది. ఈ సీరియల్లో డ్రెస్సింగ్ స్టైల్ మిగతా అన్నింటికీ భిన్నంగా ఉంటుంది. అలాగే పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ఆప్యాయంగా చూడటం, కుటుంబం.. ఆ పద్ధతులు... అన్నీ చాలా డిఫరెంట్. ఈ సీరియల్లోని విషయాలు కొన్ని నా నిజజీవితంలో పాటించేలా చేశాయి. చేసిన ఫస్ట్ సీరియల్‌కే మంచి గుర్తింపు వచ్చింది. అవార్డులూ వరించాయి. సాఫ్ట్వేర్ నుంచి.. మొదట్లో అందరూ నన్ను బెంగుళూరు అబ్బాయి అనుకున్నారు. కానీ, నేను పుట్టి పెరిగింది ఇక్కడే. మాది విజయవాడ దగ్గర నర్సరావు పేట. మా నాన్న ఫిల్మ్ డిస్టిబ్యూటర్. అమ్మ గృహిణి. తమ్ముడు, చెల్లీ ఉన్నారు. వాళ్లిద్దరూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుకోకుండా నేనూ, సురేఖ బయట కలిశాం. మా పరిచయం స్నేహంగా మారింది. రెండేళ్లు గడిచాక ఇరు కుటుంబాల అంగీకారంతో మా ప్రేమ పెళ్లి పీటలెక్కింది. రియాల్టీ షో ‘స్టార్ మా టీవీ’లో ఇస్మార్ట్ జోడీ అనే పేరుతో వచ్చే భార్యభర్తల డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. నా భార్య సురేఖ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగి. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మా ఇరువైపు కుటుంబాల్లో ఏ చిన్న ఈవెంట్ అయినా తన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాకపోతే ఇలా కెమెరా ముందు డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. తను చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఈ షోలో పాల్గొంది. అది చూసి నాకూ చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్‌లో ప్రతీవారం ఒక థీమ్ ఇస్తారు. వెడ్డింగ్, కుకింగ్ స్పెషల్.. అంటూ ఒక్కోవారం ఫన్ టాస్క్‌లు ఉంటాయి. రూమర్స్‌కి దూరం మా పెళ్లి అయ్యి ఏడాది పూర్తయ్యింది. సురేఖ చాలా సపోర్టివ్ నాకు. రూమర్స్ వచ్చినప్పుడు నేను కొంత డిస్టర్బ్ అయినా తనే నన్ను అర్థం చేసుకుంటుంది. ‘మీరు వర్క్ చేసే ఫీల్డ్ అలాంటిది. నేను అర్ధం చేసుకోగలను’ అంటుంది. తను చాలా కూల్ పర్సన్. మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. ఏదైనా విషయంలో ఇద్దరం గొడవపడినా.. తనే ముందు మాట్లాడి మూడీగా ఉన్న వాతావరణాన్ని ప్లెజెంట్‌గా మార్చేస్తుంది. అందరం ఒక చోట మా అమ్మ నాన్న విజయవాడలో. తమ్ముడు, చెల్లి విదేశాల్లో. మేం హైదరాబాద్‌లో. మా ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర ఇటీవల కాలంలో ఉన్నది లేదు. పండగలప్పుడు కూడా అందరం కలవడానికి కుదరడం లేదు. అదొక్కటే బాధగా ఉంటుంది. మేమందరం కలుసుకుని సరదాగా గడిపేలా ఒక్క పండగైనా చేసుకోవాలని మా వాళ్లకు చెబుతుంటాను.’– సంభాషణ: నిర్మలారెడ్డి -
సామాజిక బాధ్యతతో శక్తి
‘రెమో’, ‘సీమ రాజా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘హీరో’. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించారు. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్. ఈ చిత్రంలో అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రలు చేశారు. తమిళ్లో గతేడాది డిసెంబర్లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘హీరో’ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో తెలుగులో అనువదించారు. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి జె.రాజేష్ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ– ‘‘సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రస్తుత విద్యావ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందింది. విద్యావ్యవస్థపై సినిమా అంటే ‘జెంటిల్‌మేన్’ సినిమా గుర్తుకు వస్తుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థని సరిచేయడానికి ‘జెంటిల్‌మేన్’ వస్తే మా ‘శక్తి’లా ఉంటాడు. అర్జున్‌గారు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌లో ‘శక్తి’ సినిమా విడుదల చేస్తున్నాం.. 22 నుంచి తెలంగాణలో థియేటర్లు మళ్లీ ప్రారంభిస్తారని అంటున్నారు. రెండు రోజులు ఆలస్యంగా నైజాంలో కూడా విడుదల చేస్తాం. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో ఓ సినిమా చేస్తున్నాం. సంతానం హీరోగా ఇంకో చిత్రం చేస్తున్నాం’’ అన్నారు. -
‘సిస్టమ్‌ను మార్చడానికి హీరో కావాలి’
కౌసల్యాకృష్ణమూర్తి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘హీరో’. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘శక్తి.. ది సూపర్ హీరో’ పేరుతో విడుదల చేయనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేసింది. యాక్షన్, ఎమోషన్, డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలతో సాగే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. చదువు ప్రాముఖ్యత చెప్తూ, విద్య పేరుతో జరిగే వ్యాపారం నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'చదువుతో వ్యాపారం చేసేవాడిని కాదు .. చదువుకున్న వాళ్లతో వ్యాపారం చేసేవాడిని'. 'స్వయంగా ఆలోచించగలిగే ప్రతి ఒక్కడూ సూపర్ హీరోనే', ‘మన విద్యావిధానంలో అందరు చదువుకోవచ్చు కానీ అందరు సాధించలేరు. ఈ సిస్టమ్‌ను మార్చడానికి ఒక కామన్ మ్యాన్‌గా ఉండే సరిపోడు.. ఒక హీరో కావాలి’, ‘ఒక మనిషిని నాశనం చేయవచ్చు.. వాడి శిలా విగ్రహాన్ని నాశనం చేయవచ్చు.. కానీ వాడి ఐడియాలను, ఐడియాలజీస్ని ఎవడూ నాశనం చేయలేదు’ వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంఈ నెల 20న సినిమా విడుదల కానుంది.