మిత్రన్, అర్జున్, విశాల్, హరి, అమర్
‘‘అభిమానులే కాదు, విమర్శకుల నుంచి కూడా ‘అభిమన్యుడు’ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. నా కెరీర్‌లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులు హ్యాపీగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం’’ అన్నారు హీరో విశాల్. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్, సమంత, అర్జున్ ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘ఇరంబు దురై’. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకాలపై ఎమ్. పురుషోత్తమ్ సమర్పణలో జి. హరి నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అభిమన్యుడు’ టైటిల్‌తో విడుదలైంది.
రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్రం ఇంకా సక్సెస్‌ఫుల్‌గానే ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో విశాల్ మాట్లాడుతూ– ‘‘తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్‌కు ప్లాన్ చేశాం. కానీ సోలోగా రావాలని తెలుగులో జూన్ 1న రిలీజ్ చేశాం. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ‘అభిమన్యుడు’ నిలిచింది. మిత్రన్ ఇంటిలిజెంట్‌గా సినిమాను తెరకెక్కించారు. అర్జున్ బాగా నటించారు’’ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్స్ ముఖాల్లో ఆనందం కనపడుతోంది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మిత్రన్‌కు దక్కుతుంది. ఈ సినిమాతో రియల్ లైఫ్ హీరోగా విశాల్ ప్రూవ్ చేసుకున్నారు.
హరి సినిమాను చాలా ప్లాన్డ్‌గా ప్రమోట్ చేశారు’’ అన్నారు. ‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. దర్శకుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. విశాల్‌గారు, నిర్మాత చాలా కష్టపడ్డారు. వైట్ డెవిల్‌గా అర్జున్ యాక్టింగ్ సూపర్’’ అన్నారు. ‘‘మా ‘అభిమన్యుడు’ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నాకు డబ్బుతో పాటు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమాకు నిర్మాత కావడం గర్వంగా ఉంది. వారం రోజుల్లోనే 12 కోట్లు రాబట్టింది. విశాల్‌గారు రియల్ హీరో’’ అన్నారు హరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిబ్యూటర్ సినిమా సక్సెస్ పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment