Abhimanyudu
-
స్పెషల్ రోల్
టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఏర్పడే అనర్థాలను చూపిస్తూ విశాల్ ‘ఇరుంబు తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) తీశారు. పీయస్ మిత్రన్ తీసిన ఈ సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఎళిల్ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాలో అతిథి పాత్రలో రెజీనా కనిపిస్తారని సమాచారం. కథలో చాలా కీలకమైన పాత్ర ఇదని తెలిసింది. విశాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అభిమన్యుడుతో శ్రద్ధ
‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘పందెంకోడి 2’ తో మంచి హిట్ అందుకున్నారు విశాల్. ఇప్పుడాయన ‘అభిమన్యుడు’ కి సీక్వెల్‌గా రూపొందనున్న ‘అభిమన్యుడు 2’ లో నటించనున్నారు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ గత ఏడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇందులో విశాల్‌కి జోడీగా సమంత నటించారు. అయితే సీక్వెల్లో మాత్రం విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ని తీసుకున్నారట చిత్రబృందం. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు శ్రద్ధాశ్రీనాథ్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ‘అభిమన్యుడు’ సినిమాని తెరకెక్కించిన పి.ఎస్.మిత్రన్ ‘అభిమన్యుడు 2’ కి దర్శకత్వం వహించకపోవడం. ఈ సీక్వెల్‌కి కొత్త డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పందెంకోడి 2’ కి మీరాజాస్మిన్ ప్లేస్‌లో కీర్తీసురేష్ని తీసుకున్నారు. ఇప్పుడు ‘అభిమన్యుడు 2’కి సమంత ప్లేస్‌లో శ్రద్ధాశ్రీనాథ్ని, మిత్రన్ స్థానంలో ఆనంద్‌ని తీసుకోవడం ఆసక్తికరం. త్వరలోనే ‘అభిమన్యుడు 2’ సినిమా పట్టాలెక్కనుందట. -
‘అభిమన్యుడు’ దర్శకుడితో అఖిల్..!
ప్రస్తుతం మిస్టర్ మజ్ను సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న అఖిల్ అక్కినేని తదుపరి చిత్రాలను కూడా ఫైనల్ చేసేస్తున్నాడు. తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మిస్టర్ మజ్ను చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత ఓ తమిళ దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట అఖిల్. విశాల్ హీరోగా ఇరుంబు తిరై (తెలుగులో అభిమాన్యుడు) సినిమాను తెరకెక్కించిన పీయస్ మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్‌కు లైన్ వినిపించిన మిత్రన్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందుగా పట్టాలెక్కుతుందో చూడాలి. -
డబుల్ సెలబ్రేషన్స్
ఆదివారం హాలీడే తీసుకోకుండా వర్క్ చేస్తున్నారు విశాల్, కీర్తీ సురేశ్. ప్రస్తుతం వీరిద్దరు ‘సండై కోళి 2’ (‘పందెం కోడి 2’)లో యాక్ట్ చేస్తున్నారు. 2005లో వచ్చిన ‘పందెం కోడి’కి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తు్తన్నారు. దర్శకుడు ప్యాకప్ చెప్పగానే ఇంటికి వెళ్లిపోకుండా సెట్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు విశాల్, కీర్తీ. ఎవరిదైనా బర్త్‌డేనా? అంటే.. కాదు. ఇవి సక్సెస్ సెలబ్రేషన్స్. ‘అభిమన్యుడు’తో విశాల్, ‘మహానటి’తో కీర్తీ సురేశ్ సూపర్ హిట్స్ అందుకున్నారు. అందుకే ఈ డబుల్ సెలబ్రేషన్స్‌ను ప్లాన్ చేశారు. విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలు ఇటు తెలుగు అటు తమిళంలోనూ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ‘సండై కోళి 2’ దసరాకు రిలీజ్ కానుంది. -
షూటింగ్లో మహానటి, అభిమన్యుడు సెలబ్రేషన్స్
-
పందెం కోడి2 షూటింగ్లో సెలబ్రేషన్స్!
మహానటి సినిమాతో తిరుగులేని కీర్తిని సంపాదించారు కీర్తి సురేష్. తమిళ నాట నడిగైయార్ తిలగం పేరుతో విడుదలై అక్కడ కూడా విజయవంతమైంది. కీర్తి ప్రస్తుతం విజయ్, విక్రమ్, విశాల్ లాంటి అగ్ర కథనాయకులతో నటిస్తున్నారు. తెలుగులో ఇంకా ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పలేదు. కీర్తి సురేష్ విజయ్‌తో సర్కార్, విక్రమ్‌తో సామీ స్క్వేర్, విశాల్‌తో పందెం కోడి2 సినిమాలు చేస్తున్నారు. విశాల్ ఇరుంబుదురై (తెలుగులో అభిమన్యుడు) తో మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే పందెంకోడి సినిమాకు సీక్వెల్‌గా పందెంకోడి 2 తో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ షూటింగ్లో కీర్తి సురేష్, విశాల్ పాల్గొన్నారు. చిత్ర యూనిట్ మహానటి, అభిమన్యుడు సినిమాలు విజయవంతం కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. విశాల్ ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోను ట్విటర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. Double Blockbusters Celebrations at Sandaikozhi 2 shoot - #Irumbuthirai & #NadigayarThilagam@Samanthaprabhu2 @KeerthyOfficial @akarjunofficial @thisisysr @dirlingusamy @Psmithran @george_dop @AntonyLRuben @dhilipaction @thinkmusicindia @LycaProductions pic.twitter.com/8ugjlGASNT — Vishal (@VishalKOfficial) June 24, 2018 -
అభిమన్యుడికి మరో హీరో ప్రశంసలు
మాస్ హీరో విశాల్ హీరోగా సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా అభిమాన్యుడు. పి.ఎస్. మిత్రన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సైబర్ నేరాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ విశాల్ కెరీర్ లో నే బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది. 18 రోజుల్లో 18 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తుండటం కూడా అభిమన్యుడికి కలిసోస్తుంది. ఇటీవల మహేష్ బాబు అభిమన్యుడు యూనిట్ ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ హీరో నితిన్ అభిమన్యుడు యూనిట్‌ను అభినందించారు. ‘అభిమన్యుడు సినిమా చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. విశాల్, అర్జున్ సార్, సమంత ల నటన, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ అద్భుతమైన స్క్రిప్ట్ తో పాటూ ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే తో సినిమా ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హరి కి, చిత్ర బృందానికి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు నితిన్. వెంటనే స్పందించిన విశాల్ ‘ థాంక్స్ బ్రదర్. నీకు సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ రిప్లై ఇచ్చారు. Watched #Abhimanyudu..liked the film a lot..superb performances from @VishalKOfficial @akarjunofficial sir and @Samanthaprabhu2 n dir @Psmithran tk a bow for coming up with a superb script n grippin screenplay..n congrats to the entire cast n crew and producer Hari👍👍 — nithiin (@actor_nithiin) 19 June 2018 -
ప్రిన్స్ మెచ్చిన అభిమన్యుడు
సినిమా బావుంటే చాలు.. అది పెద్ద హీరో.. చిన్న హీరో అని చూడకుండా కచ్చితంగా ప్రశంసిస్తారు మహేశ్‌బాబు. తాజాగా ‘అభిమన్యుడు’ సినిమాను ప్రశంసించారాయన. విశాల్, సమంత, అర్జున్ ముఖ్యపాత్రల్లో పి.యస్. మిత్రన్ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన ‘అభిమన్యుడు’ జూన్ 1న రిలీజై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ‘‘అభిమన్యుడు’ చిత్రం చాలా బాగా నచ్చింది. మిత్రన్ ఓ విజన్‌తో చక్కగా తెరకెక్కించారు. రీసెర్చ్‌తో, ఫాస్ట్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకుంది. విశాల్, చిత్రబృందానికి అభినందనలు’’ అని పోస్ట్ చేశారు మహేశ్. ‘‘మంచి చిత్రాలను ప్రోత్సహించే మహేశ్ మా సినిమాను ప్రశంసించడం ఆనందంగా ఉంది. థ్యాంక్స్’’ అన్నారు విశాల్. ‘‘మహేశ్‌గారి అభినందనలు మాకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఈ సినిమా 18రోజుల్లో 18 కోట్లు వసూలు చేసింది’’ అన్నారు జి.హరి. ‘‘నా మొదటి సినిమానే ఇంత హిట్ సాధించడం, మహేశ్‌గారి అభినందనలు పొందడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు మిత్రన్. -
మహేష్ కూడా ఇంప్రెస్ అయ్యాడు!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అభిమన్యుడు. కోలీవుడ్‌లో సూపర్ హిట్ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ హిట్ టాక్ వచ్చింది. టెక్నాలజీ మూలంగా మనిషి ప్రైవసీకి ఎలా భంగం కలుగుతోంది. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఎలా వినియోగించుకుంటున్నారు అన్న అంశాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. అందుకే అభిమాన్యుడు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రంశసల జల్లు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయాడు. అభిమన్యుడు సినిమా చూసిన మహేష్ దర్శకుడు మిత్రన్, హీరో నిర్మాత విశాల్‌పై ప్రశంసలు కురిపించారు. పీఎస్ మిత్రన్ ఎంతో రిసెర్చ్ చేసి సినిమాను రూపొదించారన్న మహేష్, విశాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. Very impressed with Abhimanyudu. The vision & direction of @Psmithran is skilfully conveyed.. A well-researched and fast paced film... Hearty congratulations to @VishalKOfficial and the entire team!👏👏 — Mahesh Babu (@urstrulyMahesh) 19 June 2018 -
మా మధ్య ఏం లేదు : విశాల్
కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్. ఇటీవల అభిమన్యుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని నమోదు చేసిన విశాల్ ప్రమోషన్ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కోలీవుడ్ హీరోయిన్, శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మీతో విశాల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా కోలీవుడ్ మీడియాలో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విశాల్ స్పందించాడు. ‘మా ఇద్దరి మధ్య ఏదో సంబంధమున్నట్టుగా షికారు చేస్తోన్న వార్తలు నా వరకూ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు నేను వరలక్ష్మీ మంచి స్నేహితులం, ఒకరి కష్టా సుఖాలు ఒకరం పంచుకుంటాం.. అంతే’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. రజనీకాంత్, కమల్ హాసన్‌ల రాజకీయ అరగేంట్ర శుభపరిణామం అన్న విశాల్, తాను ఎవరికి మద్దతు తెలిపేది ఇప్పుడే చెప్పలేనన్నారు. -
రైతుల కష్టాలు.. కన్నీళ్లు చూశా..
సాక్షి, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ) : రైతులు పడుతున్న కష్టాలను దగ్గర్నించి చూశా..అందుకే వారికి చేయూతగా నిలవాలని నిర్ణయించుకున్నా. తమిళనాడులో రైతులు వ్యవసాయం చేసేందుకు అవసరమైన నీటిని ఎలా నిల్వ ఉంచుకోవాలో అవగాహన కల్పిస్తున్నాను.. అని సినీ నటుడు విశాల్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన అభిమన్యుడు చిత్ర విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి మెలోడీ థియేటర్‌కు దర్శకుడు మిత్రన్‌తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో తను అనుభూతులు పంచుకున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చా. మా తాత వ్యవసాయదారుడు. చిన్నతనం నుంచి పొలం గట్లు..రైతుల కష్టాలూ చూశా. సకాలంలో రుణాలు మంజూరు కాక..పంటలు సరిగా పండక..తీసుకున్న రుణాన్ని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే అన్నంపెట్టే రైతన్నను ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నాను. రాజకీయం అంటగట్టవద్దు రైతుల పట్ల చూపిస్తున్న ఆదరణకు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. రైతు అనేవాడు ప్రతి ఏటా కష్టాలు పడుతూనే ఉన్నాడు. వారి కష్టాలను తీర్చడం సమాజంలో వ్యక్తిగా బాధ్యతగా ప్రవర్తిస్తున్నానంతే. తమిళనాడులోని బోరు వేయించుకొనే స్తోమత ఏ రైతుకూ లేదు. సకాలంలో వర్షాలు పడక పంటలు నాశనం అవుతున్నాయి. ప్రతి టిక్కెట్ నుంచి ఓ రూపాయి రైతుకు.. అభిమన్యుడు చిత్రానికి సంబంధించి ప్రేక్షకులు కొనుగోలు చేసే ప్రతి టిక్కెట్ నుంచి ఒక రూపాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నా. దీనికి డిస్ట్రిబ్యూటర్లూ అంగీకరించారు. పేదలకు ఏం చేస్తే బాగుంటుంది.. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను మరింత అభివృద్ధి చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్యం అందక చాలా మంది పేదవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. నిపుణులైన వైద్యులను ప్రభుత్వ ఆస్పత్రులలో నియమించి పేదలకు మంచి వైద్యాన్ని అందించాలి. అప్పుడే మనం కోరుకున్న మంచి సమాజాన్ని చూడగలం. మీ తరువాత చిత్రం.. నా 25వ చిత్రంగా ‘పందెంకోడి–2’ ఈ ఏడాది దసరా రోజు (అక్టోబర్ 18)న విడుదల అవుతుంది. నేను కూడా టిక్కెట్ కొనుక్కుని ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడాలని ఉంది. ‘అభిమన్యుడు’ పార్ట్ 2ను వచ్చే ఏడాది చేసేందుకు ప్లాన్ చేశాం. నేనూ మోసపోయా స్మార్ట్ ఫోన్, ఫేస్బుక్, ఆధార్ సీడింగ్, క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ వంటి ఆధునిక సదుపాయాలు వచ్చిన తరువాత అనేక మంది మోసపోయి, ఆర్థికంగా నష్టపోయారు. అందులో నేనూ ఒకడ్ని. నాకు తెలియకుండా నా క్రెడిట్ కార్డు వినియోగించి రూ.30వేల దొంగలించారు. ఇది నా ఒక్కడి అనుభవమే కాదు, సినిమాకు వచ్చే ప్రేక్షకుల్లో అనేక మంది అనుభవం. దీని నుంచి ఎలా బయటపడాలన్నదే సందేశం. వైట్ డెవిల్‌గా అర్జున్ సూపర్ నా చిన్నతనంలో వంద రూపాయలు పెట్టి బ్యాట్ కొనిచ్చిన అర్జున్‌తో ఫైటింగ్ సీన్లో నటించాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అభిమన్యుడు చిత్రం క్రైమాక్స్‌లో ఆయనతో చేసిన ఫైట్ మంచి అనుభవం. చిత్రంలో వైట్ డెవిల్‌గా ఆయన నటన చిత్రానికి పేరు తెచ్చింది. సత్తా ఉన్న దర్శకుడు మిత్రన్ అభిమన్యుడు చిత్ర దర్శకుడు మిత్రన్‌కు ఇది తొలి చిత్రం. అయినా ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మంచి మెసేజ్‌తో చిత్రాన్ని రూపొందించారు. ఇటువంటి మంచి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల ఆభిమానం సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను. మీ ఇష్ట దైవం.. థియేటర్లు నా దేవాలయాలు అయితే..ప్రేక్షకులే నా దేవుళ్లు..ఎందుకంటే వారు నామీద చూపిస్తున్న అభిమానం ప్రేమ ఎన్నటికి మరువలేనిది. నా చిత్రాలను ఆదరించి నన్నింతటివాడిని చేసింది ప్రేక్షకులే. -
నిజమైన ఆనందం అదే
‘‘అభిమానులే కాదు, విమర్శకుల నుంచి కూడా ‘అభిమన్యుడు’ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. నా కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులు హ్యాపీగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం’’ అన్నారు హీరో విశాల్. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్, సమంత, అర్జున్ ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘ఇరంబు దురై’. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకాలపై ఎమ్. పురుషోత్తమ్ సమర్పణలో జి. హరి నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అభిమన్యుడు’ టైటిల్‌తో విడుదలైంది. రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం ఇంకా సక్సెస్‌ఫుల్‌గానే ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో విశాల్ మాట్లాడుతూ– ‘‘తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్‌కు ప్లాన్ చేశాం. కానీ సోలోగా రావాలని తెలుగులో జూన్ 1న రిలీజ్ చేశాం. నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ‘అభిమన్యుడు’ నిలిచింది. మిత్రన్ ఇంటిలిజెంట్‌గా సినిమాను తెరకెక్కించారు. అర్జున్ బాగా నటించారు’’ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్స్ ముఖాల్లో ఆనందం కనపడుతోంది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మిత్రన్‌కు దక్కుతుంది. ఈ సినిమాతో రియల్ లైఫ్ హీరోగా విశాల్ ప్రూవ్ చేసుకున్నారు. హరి సినిమాను చాలా ప్లాన్డ్గా ప్రమోట్ చేశారు’’ అన్నారు. ‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. దర్శకుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. విశాల్‌గారు, నిర్మాత చాలా కష్టపడ్డారు. వైట్ డెవిల్‌గా అర్జున్ యాక్టింగ్ సూపర్’’ అన్నారు. ‘‘మా ‘అభిమన్యుడు’ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నాకు డబ్బుతో పాటు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమాకు నిర్మాత కావడం గర్వంగా ఉంది. వారం రోజుల్లోనే 12 కోట్లు రాబట్టింది. విశాల్‌గారు రియల్ హీరో’’ అన్నారు హరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిబ్యూటర్ సినిమా సక్సెస్ పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
విశాల్ రియల్ లైఫ్‌లో కూడా హీరోనే..
విశాల్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా హీరోనే. నుటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్రను వేస్తున్నారు. విశాల్ హీరోగా గత వారం రిలీజైన అభిమన్యుడు సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. విశాల్ గత సినిమాలకు లేనంత రికార్డ్ కలెక్షన్లు సాధిస్తోంది అభిమన్యుడు. మొదటి వారాంతానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12కోట్లు కొల్లగొట్టింది. రెండో వారంలో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే తాజాగా విశాల్ ఓ నిర్ణయాన్ని ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెగిన ప్రతి టికెట్‌పై ఒక్క రూపాయిని ఇక్కడి రైతులకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. గతంలో విశాలో తమిళనాట కూడా ఇదే విధంగా ప్రకటించి రైతులకు తన వంతు సహాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడ తన సినిమా లాభాల్లో వాటా ఇవ్వబోతున్నానని ప్రకటించడంతో విశాల్‌కు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. -
సత్తా చూపిస్తున్న అభిమన్యుడు
విశాల్ చాలా ఏళ్ల తరువాత పెద్ద హిట్ కొట్టారు. పందెంకోడి లాంటి హిట్ తరువాత మళ్లీ ఆ రేంజ్లో హిట్పడలేదు. మాస్ ఇమేజ్ అంటూ ఒకే ధోరణిలో సినిమాలు చేస్తూ ఉన్న విశాల్ గతేడాది డిటెక్టివ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. కానీ ‘అభిమన్యుడు’ సినిమా ఆ లోటును తీర్చేస్తోంది. విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ... విజయవంతంగా ఫస్ట్ వీక్‌ను కంప్లీట్ చేసుకుంది. మొదటి వారాంతానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ వారాంతంలో కూడా ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. సమంత, అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి హారిస్ జయరాజ్ సంగీతమందించగా, పీఎప్ మిత్రన్ దర్శకత్వం వహించారు. విశాల్ ప్రస్తుతం పందెంకోడి2, టెంపర్ రీమేక్ మూవీలతో బిజీగా ఉన్నారు. -
‘పందెంకోడి’ తర్వాత ‘అభిమన్యుడు’
‘అభిమన్యుడు’ సినిమా మేం ఊహించిన దాని కంటే చాలా పెద్ద హిట్ అయ్యింది. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇదొక ఉదాహరణ. మంచి హిట్ కోసం నాలుగేళ్లుగా వెయిట్ చేసిన నాకు ఈ సక్సెస్ సంతోషాన్నిచ్చింది’’ అని నిర్మాత గుజ్జలపూడి హరి అన్నారు. విశాల్, సమంత జంటగా పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన చిత్రం ‘ఇరుంబు తిరై’. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాని ఎం.పురుషోత్తమన్ సమర్పణలో జి.హరి ‘అభిమన్యుడు’ పేరుతో ఈ నెల 1న విడుదల చేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ– ‘‘స్క్రిప్ట్ దశ నుంచే నాకీ సినిమా గురించి తెలుసు. గ్యారంటీ హిట్ అని నమ్మాను. డిజిటల్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో సామాన్యుడు ఎదుర్కొంటున్న కష్టాలను మిత్రన్ బాగా తెరకెక్కించడంతో ‘అభిమన్యుడు’కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. విశాల్‌కి సామాజిక బాధ్యత ఎక్కువ. ఈ చిత్రంలో చేసిన పాత్ర ఆయన నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. 600 థియేటర్స్‌లో విడుదలైన మా సినిమాకు మరో 60 థియేటర్స్ పెంచాం. సినిమా విడుదలైన 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 40 లక్షలు వసూలు చేసింది. ‘పందెం కోడి’ సినిమా తర్వాత విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ‘అభిమన్యుడు’. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని విశాల్‌గారు అనుకుంటున్నారు. గురువారం సక్సెస్ మీట్ నిర్వహించనున్నాం. విశాల్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం ‘పందెంకోడి’కి సీక్వెల్‌గా విశాల్‌గారు చేస్తున్న ‘పందెం కోడి’ 2 రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. దసరాకు సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
అభిమన్యుడు సినిమా దూసుకెళ్తోంది
విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమాతో థియేటర్లు హౌస్‌ఫుల్‌తో కలకలలాడుతున్నాయి. ఈ వారం విడుదలైన ఆఫీసర్, రాజుగాడు పూర్తిగా తేలిపోవడంతో అభిమన్యుడు కలెక్షన్స్‌లో దుమ్ముదులుపుతోంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. విశాల్ గత సినిమా డిటెక్టివ్ విభిన్న కథతో తెరకెక్కడం, అది కూడా విజయవంతం కావడంతో అభిమన్యుడు సినిమాపై టాలీవుడ్ కూడా ఆసక్తితో ఎదురుచూసింది. మొదటి వారాంతానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 7కోట్లు వసూళ్లను సాధించింది. ఓ డబ్బింగ్ సినిమా ఈ రేంజ్లో కలెక్షన్స్ సాధించడం చూసి చాలా కాలమైంది. తమిళ నాట కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లను సాధిస్తోంది. ఈ సినిమాలో విశాల్‌కు జోడిగా సమంత నటించగా, ప్రతినాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిచగా, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. " #Abhimanyudu has collected 7.10 Crs in 3 Days and emerged as Biggest Hit in @VishalKOfficial's career. Film has already became a Superhit." - Producer Gujjalapudi Hari pic.twitter.com/toOiWbYDlr — BARaju (@baraju_SuperHit) June 4, 2018 -
‘అభిమన్యుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : అభిమన్యుడు జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : విశాల్, అర్జున్, సమంత, ఢిల్లీ గణేష్ తదితరులు సంగీతం : యువన్ శంకర్ రాజా నిర్మాత : విశాల్ దర్శకత్వం : పీఎస్ మిత్రన్ కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్, టాలీవుడ్లో మార్కెట్ సాధించేందుకు చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. గతంలో అతను నటించిన కొన్ని చిత్రాలు ఇక్కడా విజయాలు సాధించి విశాల్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అదే ఊపులో మరో డిఫరెంట్ ఎంటర్టైనర్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్. కోలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ఇరుంబు తిరై సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేశారు. మరి అభిమన్యుడుగా విశాల్ ఆకట్టుకున్నాడా..? కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిందా..? చూద్దాం కథ : కరుణ(విశాల్) ఆర్మీ మేజర్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఆవేశపరుడైన ఆఫీసర్. కుటుంబ సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కరుణ ఫేక్ డాక్యుమెంట్స్‌తో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ తీసుకున్న లోన్ డబ్బులు నిమిషాల్లోనే బ్యాంక్ ఎకౌంట్ నుంచి మాయం అవుతాయి. దీంతో హీరో ఏం చేయాలలో తెలియని పరిస్థితుల్లో నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. హీరో అకౌంట్ నుంచి డబ్బు ఎలా మాయం అయ్యింది..? ఈ నేరాల వెనకు ఉన్న వైట్ కాలర్ పెద్ద మనిషి ఎవరు..? ఈ సైబర్ క్రైమ్‌ను హీరో ఎలా చేధించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : విశాల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెచ్యూర్డ్‌గా కనిపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో విశాల్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. మిలటరీ ఆఫీసర్‌గా విశాల్ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉంది. సినిమాలో మరో కీలక పాత్ర ప్రతినాయకుడు అర్జున్. వైట్ డెవిల్ పాత్రకు అర్జున్ వంద శాతం న్యాయం చేశాడు. అర్జున్ను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేని స్థాయిలో ఉంది ఆయన నటన. ముఖ్యంగా విశాల్, అర్జున్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి నటన సూపర్బ్. హీరోయిన్ సమంత రెగ్యులర్ కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రే. పాటలు, కామెడీ సీన్స్ తప్ప ఆ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవటానికేం లేదు. విశ్లేషణ : దర్శకుడు మిత్రన్ నేటి డిజిటల్ లైఫ్‌కు తగ్గ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశాల్ బాడీ లాంగ్వేజ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అభిమన్యుడు సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కించేందుకు మిత్రన్ చేసిన పరిశోధన తెర మీద కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారం ఎలా చోరికి గురవుతుందన్న అంశాలను చాలా బాగా చూపించాడు. అయితే హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు తొలి భాగంలో చాలా సేపు రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. అసలు కథ మొదలైన తరువాత సినిమా వేగం అందుకుంటుంది. అయితే పూర్తిగా టెక్నాలజీకి సంబంధించిన కథ కావటంతో సామాన్య ప్రేక్షకులు ఏ మేరకు అర్థం చేసుకోగలరో చూడాలి. యువన్ శంకర్ రాజా థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఇంటెన్స్ మ్యూజిక్ తో మెప్పించాడు. సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి. జార్జ్ సీ విలియమ్స్ తన కెమెరా వర్క్‌తో సినిమా మూడ్‌ను క్యారీ చేశారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగంలో అనవసర సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : అర్జున్ నటన నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : తొలి భాగంలో కొన్ని బోరింగ్ సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘అభిమన్యుడు’ మూవీ ట్రైలర్
-
అభినవ అభిమన్యుడు
-
‘అభిమన్యుడు’ ప్రోమోలు విడుదల
-
రిలీజైన ‘అభిమన్యుడు’ ప్రోమోలు
మాస్ ఇమేజ్‌తో తమిళ నాట దూసుకుపోతున్న హీరో విశాల్. ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలను చేస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. గతేడాది వచ్చిన డిటెక్టివ్ సూపర్ హిట్ అయింది. ఈ మధ్యే తమిళనాట విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘ఇరుంబుదురై’. సైబర్ క్రైం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో వసూళ్ల సునామిని సృష్టిస్తోంది. తెలుగులో ఈ సినిమా ‘అభిమన్యుడు’గా రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు విడుదల చేశారు చిత్రయూనిట్. విశాల్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా పాత్రను పోషిస్తున్నారు. విశాల్, అర్జున్ మధ్య జరిగే సీన్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమా జూన్ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
వాయిదా పడ్డ సినిమాలన్నీ ఒకే రోజు
కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమాలన్నీ ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. భారీ చిత్రాలేవి బరిలో లేకపోవటంతో జూన్ 1న వాయిదా పడిన సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సీనియర్ హీరో నాగార్జున కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆఫీసర్ సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మే 25నే రిలీజ్ కావాల్సి ఉండగా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో జూన్ 1కి వాయిదా వేశారు. అదే రోజు రిలీజ్ కు రెడీ అవుతున్న మరో ఆసక్తికరమైన చిత్రం నా నువ్వే. కల్యాణ్ రామ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా మే 25నే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను కూడా జూన్ 1కి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన రాజుగాడు సినిమా కూడా ఎన్నో వాయిదాల తరువాత జూన్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మహిళా దర్శకురాలు సంజన రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ వింతవ్యాధితో బాధపడుతున్న యువకుడిగా కనిపించనున్నాడు. జూన్ 1న రిలీజ్ అవుతున్న మరో ఆసక్తికర చిత్రం అభిమన్యుడు. విశాల్, అర్జున్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే తమిళ్లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. అయితే తమిళ వర్షన్‌తో పాటు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేయాల్సి ఉన్నా తెలుగులో స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేశారు. తమిళ నాట మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
జూన్ 1న విశాల్ ‘అభిమన్యుడు’
‘ఇరుంబుదురై’ అంటూ ప్రస్తుతం తమిళ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు విశాల్. ఈ సినిమా విడుదలైన రెండో వారంలో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా తెలుగులో అభిమన్యుడుగా ఎప్పుడో రిలీజ్ కావల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. విశాల్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉండడం, సమంత హీరోయిన్గా నటించడం వల్ల అభిమన్యుడు సినిమాను పెద్ద ఎత్తులో జూన్ 1న రిలీజ్ చేయబోతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం విశాల్ ‘పందెంకోడి 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత తెలుగు ‘టెంపర్’ రీమేక్‌లో నటించనున్నారు. -
అభిమన్యుడు వస్తున్నాడు
విశాల్, సమంత జంటగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇరుంబుదురై’. యాక్షన్‌కింగ్ అర్జున్ కీలక పాత్ర చేశారు. రీసెంట్గా తమిళనాడులో విడుదలై, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాను తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో ఎం. పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి. హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెలాఖర్లో రిలీజ్ కానుంది. ‘‘తమిళంలో విడుదలైన ‘ఇరుంబుదురై’ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ‘రంగస్థలం, మహానటి’ వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన సమంతకు ఈ చిత్రం హ్యాట్రిక్ అవుతుంది. తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు హరి. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా. -
అభిమన్యుడు వచ్చేస్తున్నాడు..!
కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమా అభిమాన్యుడు. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళనాట సమ్మె కారణంగా వాయిదా పడింది. అయితే సమ్మె పూర్తయిన వెంటనే సినిమా రిలీజ్ చేయాలని భావించినా ఇతర సినిమాలు లైన్ లో ఉండటంతో వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్‌గా అభిమన్యుడు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. పలు వాయిదాల తరువాత ఈ సినిమాను మే 11న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. అదే రోజు మరో రెండు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయినా విశాల్ ఆ చిత్ర నిర్మాతలను ఒప్పించి తన సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ చేశాడు. విశాల్ సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకుడు. -
'అభిమన్యుడు' మూవీ స్టిల్స్
-
అమ్మ ప్రార్థనలే నన్ను కాపాడుతున్నాయి
చిన్నప్పుడు జరిగిన సంఘటనలు పెద్దయ్యాక గుర్తు చేసుకుంటుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. సమంత కూడా తన బాల్యానికి సంబంధించిన చిన్ని చిన్ని జ్ఞాపకాలను అప్పుడప్పుడూ నెమరు వేసుకుంటుంటారు. కొన్ని విషయాలను బయటకు కూడా చెబుతుంటారు. ‘‘ప్రతి బుధవారం, శనివారం, ఆదివారం మా అమ్మగారు నన్ను చర్చ్‌కు లాక్కొని వెళ్లేవారు. చిన్నప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుండేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే తన ప్రార్థనలే నన్ను కాపాడుతున్నాయి అనిపిస్తుంది’’ అని సమంత పేర్కొన్నారు. అంతే.. చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పినవన్నీ చిరాకుగానే అనిపిస్తాయి. పెద్దయ్యాక ఆ మాటలకు విలువ తెలుస్తుంది. ఇది కాకుండా సమంత మరో స్వీట్ మెమరీని కూడా పంచుకున్నారు. ‘‘ఒకసారి పరీక్షలప్పుడు నేను విపరీతమైన అనారోగ్యానికి గురయ్యాను. మా అమ్మగారు నాతో పాటు స్కూల్‌కి వచ్చి నా పక్కనే కూర్చుని పరీక్ష రాయించారు. యాక్చువల్లీ నాకు రాసే ఓపిక కూడా లేదు. కానీ, పక్కనే అమ్మ ఉందనే బలం నాతో రాయించింది. మై మామ్ ఈజ్ ట్రూలీ అమేజింగ్’’ అని చెప్పుకొచ్చారు సమంత. ప్రస్తుతం సమంత ‘మహానటి, రంగస్థలం’ సినిమాలు చేస్తున్నారు. తమిళంలో నటించిన ‘ఇరుంబుదురై’ తెలుగులో ‘అభిమన్యుడు’గా జనవరి 26న విడుదల కానుంది. -
'అభిమన్యుడు' మూవీ స్టిల్స్
-
ఆసక్తికరంగా 'అభిమన్యుడు' ఫస్ట్ లుక్
డిటెక్టివ్ గా టాలీవుడ్ కోలీవుడ్ లలో సత్తా చాటిన విశాల్, త్వరలో అభిమన్యుడుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్షన్ హీరో అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ హీరో విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిస్తుండగా తెలుగులో హరి వెంకటేశ్వరా ఫిలింస్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను 2018 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన విశాల్ తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. -
సంక్రాంతి రేస్‌లో...
‘పందెంకోడి’ ఫేమ్ విశాల్, సమంత జంటగా రూపొందిన చిత్రం ‘అభిమన్యుడు’. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నారు. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి గుజ్జలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని రేపు విడుదల చేయనున్నారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘నా గత సినిమాలకంటే హై రేంజ్లో రూపొందిన సినిమా ఇది. ఈ కథని మిత్రన్ చాలా బాగా డీల్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో లావిష్‌గా తెరకెక్కించాం. ఈ సంక్రాంతికి నాకు మరో పెద్ద హిట్ సినిమా అవుతుందనడంలో సందేహం లేదు’’ అన్నారు. ‘‘షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రేపు ఉదయం ‘అభిమన్యుడు’ ఫస్ట్ లుక్‌ని, సాయంత్రం మోషన్ పోస్టర్ని రిలీజ్ చేస్తాం. డిసెంబర్ 27న పాటలను, జనవరి 13న సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, కెమెరా: జార్జి సి. విలియమ్స్. ‘డిటెక్టివ్–2’ కూడా... విశాల్ హీరోగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘డిటెక్టివ్’. ఇటీవల ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 10న విడుదలైన ‘డిటెక్టివ్’కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి రెస్పాన్స్‌తోపాటు కలెక్షన్స్ బాగున్నాయి. ఈ సినిమా నా కెరీర్లోనే స్పెషల్. తమిళ్లో ఎంత హిట్ అయిందో తెలుగులోనూ అంతే హిట్ అవడం మాకెంతో ధైర్యాన్నిచ్చింది. మంచి కంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం మరింత పెరిగింది. నా కెరీర్లోనే మొదటిసారి పాటలు లేకుండా చేసిన సినిమా ఇదే. మంచి డైలాగ్, కామెడీ సీన్స్‌కి చప్పట్లు కొట్టడం కామన్. మా సినిమాలోని క్లైమాక్స్ ఫైట్‌కి చప్పట్లు కొట్టడం సంతోషాన్నిచ్చింది. ‘డిటెక్టివ్’ కథ, క్యారెక్టర్ నాకు బాగా నచ్చాయి. అందుకే ‘డిటెక్టివ్–2’ని ప్లాన్ చేస్తున్నాం. కొత్త సంవత్సరంలో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది’’ అన్నారు. -
మహేష్ మూవీ టైటిల్ అదేనా..?
బ్రహ్మోత్సవం సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు జెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేస్తోన్న మహేష్, తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు టైటిల్‌గా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముందుగా ఎనిమి అనే టైటిల్ దాదాపుగా ఫైనల్ అన్న టాక్ వినిపించింది. తరువాత చట్టంతో పోరాటం, వాస్కోడాగామ లాంటి పేర్లు తెర మీదకు వచ్చినా.. చిత్రయూనిట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు అభిమన్యుడు అనే టైటిల్‌ను నిర్ణయించారన్న వార్త ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేష్ కూడా ఇదే టైటిల్‌కు మొగ్గుచూపుతున్నాడట. మరి ఈ టైటిల్ పై అయినా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. -
అభిమన్యుడు
శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రకీ మేనబావ అర్జునుడికీ పుట్టిన అభిమన్యుడిలో అటు మేనమామ శ్రీకృష్ణుడి ఉజ్జ్వలమైన గుణాలూ ఇటు పితృపాదులైన పాండవు లందరి గుణాలూ గుదిగుచ్చినట్టు అవుపిస్తాయి. యుధిష్ఠిరుడి ధర్మ పరాక్రమమూ శ్రీకృష్ణుడి ధర్మశీలమూ భీమసేనుడి వీరోచితమైన కర్మతత్వమూ అర్జునుడి రూపమూ పరాక్రమమూ విలు విద్యా నైపుణ్యమూ నకుల సహదేవుల వినయశీలమూ అభిమన్యుడిలో రూపుగట్టి అవుపిస్తాయి. ‘అభి’ అంటే, అభిముఖంగా అని అర్థం; ‘మన్యు’వంటే దీప్తీ ఉత్సాహ మూను. మన్యువంటే కోపమనే అర్థం కూడా ఉంది. చైతన్యమంతా లక్ష్యంమీద కేంద్రీకృతమై, లోపలి శత్రువుల మీదా బయటి శత్రువుల మీదా అదుపునూ సంయమనాన్నీ కనబరిచే తీవ్రమైన మనోభావమే అభిమన్యుత్వమంటే. తీవ్రంగా కేంద్రీకృతమై, అంటే దృఢమైన ధారణతో అంతటినీ ప్రకాశింప జేసే మనస్సు తాలూకు ధ్యానస్థితినే అభిమన్యు స్థితి అంటారు. దుర్యోధనుడు ద్రోణుణ్ని సేనా పతిగా చేసినప్పుడు, ‘ధర్మరాజును సజీవంగా పట్టుకొని తీసుకు రావాలి’ అని వరం అడిగాడు. ‘నేను యుధిష్ఠిరుణ్ని పట్టి తెస్తే, తరువాత ఏం చేద్దామని?’ అని ద్రోణుడు అడిగాడు. ‘మళ్లీ జూదమాడించి అడవులకు పంపుదామని. దానితో నాకు ఈ రాజ్యం చాలా కాలం ఉంటుంది. అతన్ని చంపితే, తతిమ్మా పాండవులు మాలో ఎవర్నీ మిగలకుండా చంపేస్తారు. అంచేతనే అతనిచేత జూదమాడించి తిరిగి అడవులకు పంపించడమే నా ధ్యేయం’ అని దుర్యోధనుడు అనగానే, ద్రోణుడి మనస్సు చివుక్కుమంది. వరం ఇచ్చాడు గనక సర్ది చెప్పాడు. ‘ఎవడో ఒకడు, అర్జునుణ్ని రణానికి ఆహ్వానించి, మరో ప్రదేశానికి తీసుకొని పోతే, అతన్ని జయించి గానీ అర్జునుడు తిరిగిరాడు గనక, ఆ మధ్య కాలంలో ధర్మరాజును పట్టి ఇస్తాను’ అని ద్రోణుడు అన్నమాటను విని త్రిగర్త దేశాధిపతి సుశర్మ, సత్యరథుడూ సత్యవర్మా సత్యవ్రతుడూ సత్యేషువూ సత్యకర్మా అనే ఐదుగురు తమ్ముళ్లతో సహా అర్జునుణ్ని పక్కకు తీసుకొనిపోయి యుద్ధం చేస్తానని ముందుకు వచ్చాడు. ఈ ఆరుగురూ నలభై వేలమంది రథికులతో సహా చచ్చిపోయేంత దాకా అర్జునుడితో యుద్ధం చేస్తామని సంశప్తక శపథం చేశారు. ద్రోణుడి సైన్యాధిపత్యంలోని మొదటి రెండు రోజులూ ధర్మరాజును పట్టుకోవడం కుదరనే లేదు. మొదటిరోజు ద్రోణుడు గరుడ వ్యూహాన్ని పన్నాడు. యుధిష్ఠిరుణ్ని భయం వెన్నాడింది. అయితే, ధృష్టద్యుమ్నుడి భరోసాతో రణాన్ని కొనసాగించాడు. ద్రోణుడి యుద్ధ పద్ధతిని చూసి దుర్యోధనుడు మురిసిపోయాడు. కర్ణుడు మాత్రం భీముడి గురించి భయపడుతూనే ఉండాలని హితవు చెబుతూనే ఉన్నాడు. అర్జునుడు సంశప్తక సైన్యంలో చాలా మందిని చంపేశాడు. నరకుడి కొడుకు భగదత్తుణ్నీ అతని భీకరమైన ఏనుగునీ కూడా వైష్ణవాస్త్రంతో చంపేశాడు. రెండు రోజులైపోయినా తనకిచ్చిన వరాన్ని నెరవేర్చలేదని దుర్యోధనుడు ద్రోణుడితో నిష్ఠూరంగా మాట్లాడాడు. ద్రోణుడికి చాలా బాధవేసింది. ‘ఈ రోజు దేవతలకు అభేద్యమైన ఒక వ్యూహాన్ని పన్నుతాను. ఏదో ఒక యోగంతో అర్జునుణ్ని దూరంగా వెళ్లేలా చెయ్యి. ఎవడో ఒక మహాయోద్ధ అంతం కావడం ఖాయం ఈ రోజున’ అన్నాడు. సంశప్తక గణాలు మళ్లీ అర్జునుణ్ని చాలా దూరం తీసుకుపోయాయి. మూడో రోజున చక్ర వ్యూహాన్ని పన్ని, ఆ చక్రపు ఆకుల మీదుగా అతి తేజస్వులైన చాలామంది రాజ కుమారుల్ని మోహరించాడు ద్రోణుడు. ఆ సైన్యానికి ముఖభాగంలో తానే నిలబడ్డాడు. జయద్రథుడూ అశ్వత్థామా అతని పక్కనే స్థాణువుల్లా నిలుచున్నారు. ఈ విధంగా వ్యూహాన్ని రచించిన ద్రోణుణ్ని ఎదుర్కో వడం అర్జునుడు లేని తరుణంలో మరొకడి వల్ల కాదని ఆలోచించి యుధిష్ఠిరుడు ఆ భారాన్నంతనీ కుర్రాడే అయినా దిట్ట అయిన సౌభద్రుడి భుజ స్కందాల మీద ఉంచాడు. ‘నాన్న నాకు ఈ చక్రవ్యూహాన్ని భేదించడమే ఉపదేశించాడు. కానీ ఏదైనా ఆపత్తి వచ్చి పడితే, ఆ వ్యూహం నుంచి బయటపడడమెలాగో నాకు చేతగాదు’ అని అభిమన్యుడన్నప్పుడు ‘నువ్వు వ్యూహాన్ని భేదిస్తే చాలు, నీ వెన్నంటి మేమందరం దానిలోకి చొరబడతాం. అందరూ నీ వెన్ను కాస్తూ ఉంటారు’ అంటూ యుధిష్ఠిరుడూ భీముడూ అతనికి ధైర్యం చెప్పారు. అభిమన్యుడు తన సారథి సుమిత్రుణ్ని తన కర్ణికారధ్వజాన్వితమైన రథాన్ని ముందుకు నడపమని ప్రచోదించాడు. అతను చక్రవ్యూహ ద్వారం నుంచి లోపలికి చొరబడినప్పుడు, యుధిష్ఠిరుడూ భీముడూ శిఖండీ సాత్యకీ నకుల సహదేవులూ ధృష్టద్యుమ్నుడూ విరటుడూ మొదలైనవాళ్లందరూ అభిమన్యుడి వెనక ఉండి రక్షించాలని ముందుకు ఉరికారు. కానీ సైంధవుడు పాండవుల్ని వ్యూహంలోకి చొరబడకుండా ఒక గట్టి గోడలాగ అడ్డు పడ్డాడు. ఇలాగ ఆపగలగడానికి కారణం అతనికి శివుడిచ్చిన వరం. ద్రౌపదిని అపహరించుకుపోతూంటే భీమసేనుడూ అర్జునుడూ వచ్చి సైంధవుణ్ని ఓడించి బాగా అవమాన పరిచారు. ఆ అవమానంతో బాధపడుతూ శివుడి గురించి తపస్సు చేశాడు జయద్రథుడు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు.. ‘నేను పాండవులను యుద్ధంలో అడ్డుకొని ఆపగలగాలి’ అని వరం కోరుకున్నాడు. ‘అర్జునుణ్ని తప్ప తతిమ్మా నలుగుర్నీ నువ్వు ఆపగలుగుతావు’ అని శివుడు వరమిచ్చాడు. అప్పుడిచ్చిన ఆ వర ప్రభావం కొద్దీ ఈ రోజున సైంధవుడు అభిమన్యుడి వెనక వెళ్లబోతూన్న పాండవుల్ని ఆపగలిగాడు. కానీ ఆ వరమే అతని చావుకు బీజాన్ని వేసింది. ఈ అడ్డుకోవడం వల్లనే వ్యూహంలోకి చొరబడిన అభిమన్యుడు ఒంటరిగా పోరాడవలసి వచ్చింది, తిరిగి రాలేకపోయాడు కూడా. దానికి మూల్యాన్ని సైంధవుడు చెల్లించవలసి వచ్చింది.వ్యూహంలోకి చొరబడుతూనే ఒంటరి వాడైన సుభద్రాకుమారుడు తీక్షణమైన బాణాల జడివానతో కౌరవ సేనలకు ఊపిరాడకుండా చేసి, వాళ్లనందర్నీ పారిపోదామనిపించేలాగ నీరసపరిచాడు. ఆమీద శల్యుణ్ని మూర్ఛితుడిగా చేయడంతో శల్యభ్రాత దాడిచేశాడు. అతని తలా మెడా చేయీ కాలూ విల్లూ గుర్రమూ గొడుగూ ధ్వజమూ అన్నీ ఒక్కసారిగా కోసి ముందుకు సాగిపోయాడు అసహాయ శూరుడైన అభిమన్యుడు. శ్రీకృష్ణుణ్నించీ అర్జునుణ్నించీ నేర్చిన అస్త్రాలను శ్రీకృష్ణా ర్జునుల్లాగానే అంత నేర్పుతోనూ ఉపయో గిస్తూ ద్రోణుడి సేనను గడగడలాడిం చాడు. ద్రోణుణ్నీ కర్ణుణ్నీ కృపాచార్యుణ్నీ అశ్వత్థామనీ కృతవర్మనీ బృహద్బలుణ్నీ దుర్యోధనుణ్నీ భూరిశ్రవసుణ్నీ శకునినీ ఇతర రాజుల్నీ రాజకుమారుల్నీ బాణాల్ని వేసి వేసారిపోయేలాగ చేశాడు. అది చూసి ద్రోణుడు ‘ఈ అభిమన్యుడికి మరో వీరుడెవడూ సమానుడు కాలేడు, అతను తలచు కున్నాడంటే మన మొత్తం సేనను నాశనం చేయగలడు’ అంటూంటే దుర్యోధనుడు కర్ణ దుశ్శాసనులతో... ‘ఆచార్యుడు అభిమన్యుణ్ని చంపుదామనుకోవటం లేదు, మీరందరూ కలిసి అతని మీద దాడిచెయ్యండి’ అంటూ ఉసిగొలిపాడు. ఆ మాట విని దుశ్శాసనుడూ కర్ణుడూ అభి మన్యుడి మీదకు దూసుకొనిపోయారు. అభిమన్యుడు దుశ్శాసనుణ్ని దెబ్బతీశాడు. అది చూసి కర్ణుడు విక్రమించాడు గానీ, అతణ్ని ఒకేసారి డెబ్భై మూడు బాణాలతో కొట్టి, వ్యూహంలోంచి వెలుపలికి పోవ డానికి ప్రయత్నం చేశాడు. ఎండిపోయిన అడవిలో అగ్ని వ్యాపించినట్టుగా అభి మన్యుడు శత్రువుల్ని కాలుస్తూ కౌరవ సేన మధ్యలో దుర్నిరీక్ష్యంగా నిలుచున్నాడు. బిక్కచచ్చి వణికిపోతూన్నవాళ్లను ఊరడిస్తూ ‘నేను అభిమన్యుణ్ని ప్రాణాలతో పట్టుకుంటాను చూడండి’ అంటూ శల్యుడి కొడుకు రుక్మరథుడు ముందుకు వచ్చాడు. అతను అభిమన్యుడి భుజాలను మూడు మూడు బాణాలతో వేధించాడు. బదులుగా అభిమన్యుడు రుక్మరథుడి విల్లు విరగ్గొట్టి, అతని భుజాలనూ తలనూ ఒకేసారి కోసి భూమ్మీద పడేశాడు. అప్పుడు చక్రవ్యూహపు ఆకుల స్థానాల్లో ఉన్న యుద్ధ దుర్మదులైన రాజపుత్రులు ఒక్కపెట్టున అర్జునుడి కొడుకును శర వర్షంతో ముంచెత్తారు. అది చూసి దుర్యోధనుడు ఆనందిస్తూ ‘అభిమన్యుడి పని ఇక అయిపోయింది’ అనుకున్నాడు. కానీ అభిమన్యుడు గాంధర్వాస్త్రాన్ని వేసి రథమాయను ప్రదర్శించాడు. ఆ రాజ పుత్రులందరూ ముక్కముక్కలైపోయారు. ఇలా భగ్నమైన సైన్యవర్గాన్ని చూసి, ద్రోణుడూ అశ్వత్థామా బృహద్బలుడూ కృపుడూ కర్ణుడూ కృతవర్మా విపరీతమైన కోపంతో అభిమన్యుడి మీద విరుచుకు పడ్డారు. కానీ వాళ్లందర్నీ అభిమన్యుడు ఇట్టే విముఖులుగా చేసేశాడు. అప్పుడు దుర్యోధనుడి కొడుకు లక్ష్మణుడు అభి మన్యుణ్ని ఎదుర్కొన్నాడు. కొడుక్కోసం దుర్యోధనుడు పక్కనే నిలుచున్నాడు. లక్ష్మణుడు సుభద్ర కొడుకు భుజాలమీదా ఛాతి మీదా బాణాలతో దెబ్బ తీశాడు. బదులుగా కుబుసం విడిచిన పాములాగ బుసకొడుతూ ఒక భల్లాన్ని లక్ష్మణుడి మీద విసిరాడు అభిమన్యుడు. ఆ భల్లం దుర్యోధనుడు చూస్తూండగానే లక్ష్మణుడి తలను మొండెం నుంచి వేరు చేసేసింది. దుర్యోధనుడు పుత్ర శోకంతో ఆక్రో శించాడు. ద్రోణుడిక్కూడా అర్జునుడికీ అభిమన్యుడికీ మధ్య ఏ రకమైన తేడా కనిపించలేదు. కర్ణుడేమో నిశ్చేష్ఠుడై పోయాడు. అప్పుడు కర్ణుడితో ద్రోణుడు ‘అభిమన్యుడి కవచం దుర్భేద్యం. అర్జునుడికి నేను చెప్పిన కవచ ధారణ విధిని ఇతను పాటించాడు. కానీ ఇతని విల్లు విరగ్గొట్టి నారిని ఛేదించవచ్చు. ఇతని గుర్రాల్నీ అటూ ఇటూ వెనక నుంచి కాపాడుతూన్న సారథుల్ని నాశనం చేయ వచ్చు’ అని ఉపాయాన్ని చెప్పాడు. కర్ణుడు వెంటనే ఆ ఉపాయాన్ని అమలుపరుస్తూ రథాన్నీ ధనుస్సునీ విరగ్గొట్టాడు; కృతవర్మ గుర్రాలను చంపాడు; కృపుడు వెనకనున్న రక్షకులిద్దర్నీ కూల్చాడు. ఆ మీద ద్రోణుడితో సహా అందరూ కలిసి అతన్ని బాణవర్షంలో ముంచెత్తారు. అతని శరీరం రక్తసిక్తమైపోయింది. అయినా ధైర్యాన్ని విడవకుండా చక్రాన్ని తీసుకొని అపర శ్రీకృష్ణుడిలాగ విక్రమించాడు. కానీ అన్యాయంగా ఆరుగురు కలిసి అతని చక్రాన్ని ముక్కలు చేశారు. ఆమీద గదను తీసుకొని అభిమన్యుడు వాళ్లమీదకు ఉరికాడు. అశ్వత్థామ తాలూకు నాలుగు గుర్రాల్నీ పార్శ్వ రక్షకుల్నీ చంపాడు; శకుని తమ్ముడు కాలికేయుణ్ని నేలకొరికేలాగ మోదాడు; అతని డెబ్భై ఏడు మంది అనుచరుల్నీ సంహరించాడు. అప్పుడు దుశ్శాసనుడి కొడుకు కోపంతో గదను తీసుకొని సౌభధ్రుడి మీద దాడిచేశాడు. తలమీద గదతో మోది అభిమన్యుణ్ని చంపేశాడు. పద్మ సరస్సును కకావికలు చేసిన వనగజంలాగ మొత్తం కౌరవ సైన్యంతో మూడు చెరువుల నీళ్లు తాగించి, అంతమందీ అధర్మంగా ఒకేసారి దాడి చేయడంతో... దుశ్శాసనుడి కొడుకు చేతిలో నేలకు ఒరిగిపోయాడు అభిమన్యుడు. సంసార చక్రవ్యూహంలో చిక్కుకొన్నా... అత్యంతమైన ధారణతోనూ సమాధితోనూ చివరదాకా పోరాడిన ఒక మహా సాధకుడి వారసుడిగా అభిమన్యుడి పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.