
‘పందెంకోడి’ ఫేమ్ విశాల్, సమంత జంటగా రూపొందిన చిత్రం ‘అభిమన్యుడు’. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నారు. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి గుజ్జలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని రేపు విడుదల చేయనున్నారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘నా గత సినిమాలకంటే హై రేంజ్‌లో రూపొందిన సినిమా ఇది. ఈ కథని మిత్రన్ చాలా బాగా డీల్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో లావిష్‌గా తెరకెక్కించాం. ఈ సంక్రాంతికి నాకు మరో పెద్ద హిట్ సినిమా అవుతుందనడంలో సందేహం లేదు’’ అన్నారు. ‘‘షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రేపు ఉదయం ‘అభిమన్యుడు’ ఫస్ట్ లుక్‌ని, సాయంత్రం మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేస్తాం. డిసెంబర్ 27న పాటలను, జనవరి 13న సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: యువన్
శంకర్‌రాజా, కెమెరా: జార్జి సి. విలియమ్స్.
‘డిటెక్టివ్–2’ కూడా... విశాల్ హీరోగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డిటెక్టివ్’. ఇటీవల ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 10న విడుదలైన ‘డిటెక్టివ్’కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి రెస్పాన్స్‌తోపాటు కలెక్షన్స్ బాగున్నాయి. ఈ సినిమా నా కెరీర్‌లోనే స్పెషల్. తమిళ్‌లో ఎంత హిట్ అయిందో తెలుగులోనూ అంతే హిట్ అవడం మాకెంతో ధైర్యాన్నిచ్చింది. మంచి కంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం మరింత పెరిగింది. నా కెరీర్‌లోనే మొదటిసారి పాటలు లేకుండా చేసిన సినిమా ఇదే. మంచి డైలాగ్, కామెడీ సీన్స్‌కి చప్పట్లు కొట్టడం కామన్. మా సినిమాలోని క్లైమాక్స్ ఫైట్‌కి చప్పట్లు కొట్టడం సంతోషాన్నిచ్చింది. ‘డిటెక్టివ్’ కథ, క్యారెక్టర్ నాకు బాగా నచ్చాయి. అందుకే ‘డిటెక్టివ్–2’ని ప్లాన్ చేస్తున్నాం. కొత్త సంవత్సరంలో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment