Vishal
-
ఈ ఏడాది ఇదే అతిపెద్ద ఐపీవో..!
ముంబై: సూపర్‌మార్కెట్ చైన్ విశాల్ మెగా మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్లో ఐపీవో చేపట్టనుంది. తద్వారా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్ అండ్ పార్ట్నర్స్కు పెట్టుబడులున్న కంపెనీ లిస్టయితే 2024 ఏడాదికి అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది.అంతేకాకుండా దేశీ ప్రైమరీ మార్కెట్లో నాలుగో పెద్ద ఐపీవోగా రికార్డులకు ఎక్కనుంది. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) రూ. 8,912 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 462 కోట్ల నికర లాభం ఆర్జించింది.డిసెంబర్ మధ్యలో.. నిజానికి దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నమోదవుతున్న దిద్దుబాట్ల కారణంగా నవంబర్‌లో చేపట్టదలచిన ఇష్యూని విశాల్ మెగామార్ట్ డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే లండన్, సింగపూర్ తదితర ప్రాంతాలలో రోడ్‌షోలపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెల మధ్యలో చేపట్టనున్న ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ లేనట్లు తెలుస్తోంది.నిధుల సమీకరణకు వీలుగా హోల్డింగ్ కంపెనీ సంయత్ సర్వీసెస్ ఎల్ఎల్పీ వాటాలు విక్రయించనుంది. ప్రస్తుతం విశాల్ మెగామార్ట్‌లో సంయత్ సర్వీసెస్‌కు 96.55 శాతం వాటా ఉంది. కంపెనీ సీఈవో గుణేందర్ కపూర్ వాటా 2.45 శాతంగా నమోదైంది. సుమారు 626 సూపర్మార్కెట్ల ద్వారా కంపెనీ దుస్తులు, ఎఫ్ఎంసీజీ, సాధారణ వర్తక వస్తువులు తదితర పలు ప్రొడక్టులను విక్రయిస్తోంది. -
లైంగిక దాడులు చేసేవారిపై తీవ్రమైన చర్యలు: విశాల్
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) 68వ వార్షిక సర్వసభ్య సమావేశం చెన్నైలో జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడుల గురించి హీరో విశాల్ రియాక్ట్ అయ్యారు. నటీమణలకు రక్షణగా నడిగర్ సంఘం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ జనరల్ కమిటీ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచీ మురుగన్, కరుణాస్, ఇతర సంఘం సభ్యులు పాల్గొన్నారు.తమిళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు ఒడిగట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ తెలిపారు. మహిళ రక్షణ కోసం విశాఖ కమిషన్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. లైంగిక వేధింపులకు ఎవరైన గురైనట్లు ఫిర్యాదు వస్తే.. తప్పు చేసినవారిపై తీవ్రమైన చర్యలుంటాయని విశాల్ హెచ్చరించారు. ఈమేరకు ఒక తీర్మానం కూడా చేశామని ఆయన అన్నారు. బాధితులు నేరుగా తమకే ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఇప్పటికైతే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.అనంతరం విలేకరులతో అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ.. '68వ వార్షిక సభను అద్భుతంగా పూర్తి చేశాం. ప్రతి కార్యక్రమంలో సీనియర్ ఆర్టిస్టులను అభినందించి వారిని సత్కరిస్తున్నాం. జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తాం. నటీనటుల సంఘం పొడిగింపును సభ్యులందరూ అంగీకరించారు.' అని అన్నారు. -
సైకిల్‌పై వచ్చిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత విశాల్ చెన్నైలో సందడి చేశారు. చాలా సింపుల్‌గా సైకిల్ తొక్కుతూ కనిపించారు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన విశాల్ 68వ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు కార్యాలయానికి వచ్చారు. సైకిల్‌పై తమ అభిమాన హీరో రావడంతో ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అక్కడే గేట్ దగ్గర ఉన్న అభిమానులతో విశాల్ కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవల మాలీవుడ్‌లో హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొద్దిరోజుల క్రితమే నడిగర్ సంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో పది రోజుల్లో నడిగర్ సంఘం ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ప్రకటన వస్తుందని విశాల్ వెల్లడించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే ఇండస్ట్రీ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తామని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. VIDEO | Actor Vishal arrives on a bicycle to attend 68th South Indian Artist Association meeting being organised in Chennai.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/EYP25aY3rb— Press Trust of India (@PTI_News) September 8, 2024 -
నడిగర్ సంఘం హెచ్చరిక.. అలాంటి వారిపై ఐదేళ్ల నిషేధం!
హేమ కమిటీ నివేదిక సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టాలీవుడ్‌లోనూ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తాజాగా కోలీవుడ్‌కు చెందిన నడిగర్ సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే సినీ ఇండస్ట్రీ నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని విశాల్ నేతృత్వంలోని కమిటీ తీర్మానించింది. చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని అందించడానికి నడిగర్ సంఘం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార సెల్ కోసం ప్రత్యేక మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేధింపులకు గురైన వారు నేరుగా తమ ఫిర్యాదులను ముందుగా నడిగర్ సంఘానికి సమర్పించాలని కోరారు. మీడియాకు వెల్లడించవద్దని హెచ్చరిక కూడా ఉంది. చెన్నైలో నడిగర్ సంఘం నిర్వహించిన సమావేశంలో నాసర్, విశాల్, కార్తీ పాల్గొన్నారు. -
అలాంటివారిని చెప్పు తీసుకుని కొట్టండి: విశాల్
మలయాళ చలనచిత్రపరిశ్రమలో ఆడవారిని వేధిస్తున్నారని, ఆర్టిస్టులు దుర్భరమైన జీవనం గడుపుతున్నారని జస్టిస్ హేమ కమిటీ బయటపెట్టింది. అయితే ఈ ఒక్కచోటే కాదు దాదాపు ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి సమస్యలున్నాయి. అందుకే తమిళనాట కూడా దీనిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నాడు హీరో విశాల్.అతడు మాట్లాడుతూ.. అవకాశం కావాలంటే తాము చెప్పినదానికి అంగీకరించమని ఎవరైనా అడిగితే చెప్పు తీసుకుని కొట్టండి. కొందరు ఫోటోషూట్ పేరుతో ఆడవారిని ఆఫీసుకు రమ్మని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇలాంటివి ఎదురైనప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే వెంటనే చెంప చెళ్లుమనిపించాలి. దీని గురించి ఫిర్యాదు చేయాలి. తమిళ ఇండస్ట్రీలోనూ ఇలాంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.ఇకపోతే విశాల్ నేడు (ఆగస్టు 29న) 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇతడు చెల్లమే మూవీతో వెండితెరపై అడుగుపెట్టాడు. సండకోడి (పందెంకోడి)తో హిట్ అందుకున్నాడు. లాఠీ, మార్క్ ఆంటోని, రత్నం.. తదితర చిత్రాలతో అలరించాడు.చదవండి: 'నా భర్త అందగాడు.. గతాన్ని మర్చిపో'.. హీరోయిన్‌కు సూచన! -
నాపై చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి: విశాల్
‘‘ప్రస్తుత తమిళ నిర్మాతల మండలి నాపై చేసిన తీర్మానాన్ని 24 గంటల్లో వెనక్కి తీసుకోవాలి. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని హీరో విశాల్ అన్నారు. గతంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పని చేసిన విశాల్ పలు అవకతవకలకు పాల్పడ్డారని, మండలి నిధుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఇకపై విశాల్‌తో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు తమను సంప్రదించాలంటూ తమిళ నిర్మాతల మండలి ఓ ప్రకటనలో పేర్కొంది.దీనిపై విశాల్ స్పందించి, తమిళ నిర్మాతల మండలికి ఓ లేఖ రాశారు. ‘‘మండలి నిబంధనలకు అనుగుణంగానే అప్పటి కార్యవర్గంలో బాధ్యతలు నిర్వహించిన కదిరేశన్, ఇతర సభ్యుల అంగీకారంతోనే సభ్యుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాం.. వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు వేశాం. ప్రత్యేక ఆడిటర్ చేసిన ఆరోపణల విషయంలో నన్ను వివరణ కోరలేదు.కార్యవర్గం చేసిన తీర్మానంతోనే ‘ఇళయరాజా 75’ పేరుతో సంగీత విభావరి నిర్వహించి, నిర్మాతల మండలికి మంచి పేరు తెచ్చిపెట్టాను. వాటికి సంబంధించిన వివరాలు మండలి కార్యాలయంలో ఉన్నాయి. అలాంటిది ఏ ఆధారాలున్నాయని నాతో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు మండలిలో చర్చించాలని తీర్మానం చేస్తారు? ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని స్పందించారు విశాల్. – సాక్షి, చెన్నై -
ఇది మూవీ షూటింగ్ కాదు, సరిగ్గా ఆన్సరివ్వు: విశాల్‌పై మండిపడ్డ కోర్టు
చెన్నై: కోలీవుడ్ హీరో విశాల్‌పై న్యాయస్థానం మండిపడింది. విశాల్‌కు, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. తాను ఖాళీ కాగితంపై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే తెలియదన్నాడు. అతడి వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా సమాధానం చెబుతున్నారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదు. సరిగ్గా బదులివ్వండి అని గద్దించి అడిగారు.కాగా విశాల్.. ఫైనాన్షియర్ అన్బచెలియన్ దగ్గర తీసుకున్న రూ.21.29 కోట్ల రుణాన్ని లైకా సంస్థ చెల్లించింది. అందుకుగానూ ఆ డబ్బు తిరిగిచ్చేవరకు విశాల్ నిర్మించే సినిమా హక్కుల్ని తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్.. వీరమె వాగై చూడమ్ అనే సినిమా హక్కుల్ని లైకాకు బదులు వేరే సంస్థకు విక్రయించాడు. దీంతో రెండేళ్లక్రితం లైకా సంస్థ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.చదవండి: కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్న బ్యూటీ.. వెనక్కు తగ్గిందా? -
హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?
హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'పందెం కోడి' సినిమా నుంచి ఇప్పటివరకు అడపాదడపా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడూ వివాదాలని వెంటేసుకునే తిరిగే విశాల్.. గతంలోనూ ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ గుత్తాధిపత్యాన్బ్ని, థియేటర్ల మాఫియాని ప్రశ్నించాడు. ఇప్పుడు తమిళ నిర్మాతల మండలితో వాగ్వాదానికి దిగాడు.(ఇదీ చదవండి: సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్ పోస్ట్ వైరల్!)గతంలో ఇదే తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా విశాల్ పనిచేశాడు. ఆ సమయంలో దాదాపు రూ.12 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విశాల్‌తో ఎవరూ సినిమాలు చేయొద్దని నిర్మాతల మండలి అల్టిమేటర్ జారీ చేసింది. ఈ క్రమంలోనే విశాల్ ట్విట్టర్ వేదికగా పెద్ద పోస్ట్ పెట్టాడు.'మనం ఓ బృందంగా, సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు నీకు తెలియదా? మిస్టర్ కథిరేశన్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాం. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా సంక్షేమానికి ఖర్చు చేశాం. మీరు అక్కడ మీ పని సక్రమంగా చేయండి.. ఇండస్ట్రీలో చాలా పని ఉంది.. డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కరాలు వెతకాల్సి ఉంది.. విశాల్ ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు.. కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు.. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలున్నారా?' అని విశాల్ తన ట్వీట్‌తో ఆగ్రహాన్ని అంతా బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ధనుష్ 'రాయన్' సినిమా రివ్యూ) -
చిత్రపరిశ్రమలో మీ జోక్యం ఎందుకు అంటూ విశాల్ ఫైర్
కోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో తన రత్నం సినిమా విడుదల సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు.తమిళ చిత్రసీమలో రెడ్ జెయింట్ మూవీస్ ఆధిపత్యం గురించి బహిరంగంగానే విశాల్ మాట్లాడారు. ఆ సంస్థ అధినేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కూడా విశాల్ విమర్శలు చేశారు. తను నటించిన రత్నం సినిమా విడుదలను కూడా అడ్డుకున్నారంటూ.. వారికి అలాంటి అధికారం ఎవరిచ్చారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కడలూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన విశాల్ మీడియాతో సమావేశమై మాట్లాడారు. ఇక సినిమా రంగంపై డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని సంచలన ఆరోపణ చేశాడు.ఆయన మాట్లాడుతూ.. 'తమిళ సినిమాకు ఈ ఏడాది చాలా కష్టం కాలంగా ఉంది. సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే దీనికి కారణం. రాబోయే రోజుల్లో 10 పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఆ 10 సినిమాలు కూడా దీపావళి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకుని విడుదలవుతున్నాయి. దీంతో చిన్న సినిమాలను కొనేవారు లేరు, విడుదల చేసేవారు లేరు. మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అయితే ఈ ఏడాది కమర్షియల్‌గా చిత్ర పరిశ్రమకు కష్టతరమైన సంవత్సరంగా మారనుంది. దీనికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమలోకి ప్రభుత్వం చొచ్చుకు రావడమే.. ఇందులోకి ప్రభుత్వం ఎందుకు రావాలి..? గత ప్రభుత్వం ఇలాంటి పనులు చేయలేదు. అని విశాల్ తెలిపారు. తమిళనాడులో తాము షూటింగ్‌కి వెళ్లినప్పుడు తాగునీరు లేని గ్రామాలు ఎన్నో చూశామని విశాల్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైగానే అవుతున్నా తాగునీరు లేని గ్రామాలు చూస్తున్నామంటే కాస్త విడ్డూరంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. -
రెబల్ ఎంపీ మద్దతు.. వందకు చేరిన కాంగ్రెస్ బలం!
ముంబై: కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య 100కు చేరనుంది. మహారాష్ట్రలోని సాంగ్లీ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విశాల్ పాటిల్ గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గేను కలిసి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపే లేటర్‌ను అందజేశారు. ఈ విషయాన్ని ఖర్గే ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని అధ్యక్షడు ఖర్గే స్వాగతించారు. మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ మనవుడు విశాల్ పాటిల్. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల ఒప్పందాని కంటే ముందే శివసేన(యూబీటీ) కూటమి తరఫున తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది. దీంతో కాంగ్రెస్ పునరాలోచించాలని శివసేన(యూబీటీ)ని కోరినా ఫలితం లేకుండా పోయింది.People of Maharashtra defeated the politics of treachery, arrogance and division. It is a fitting tribute to our inspiring stalwarts like Chhatrapati Shivaji Maharaj, Mahatma Jyotiba Phule and Babasaheb Dr Ambedkar who fought for social justice, equality and freedom.… pic.twitter.com/lOn3uYZIFk— Mallikarjun Kharge (@kharge) June 6, 2024 దీంతో విశాల్ పాటిల్.. సాంగ్లీలో స్వతంత్రంగా బరిలోకి దిగి గెలుపొందారు. ఆయన బీజేపీ అభ్యర్థి సంజయ్ కాకాపై విజయం సాధించారు. విశాల్ పాటిల్ గురువారమే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మద్దతు తెలిపే లెటర్‌ను అందజేశారు. లోక్‌సభ సెక్రటరీ అనుమతి ఇస్తే.. విశాల్ పాటిల్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన ఎంపీగా కొనసాగుతారు. దీంతో కాంగ్రెస్ అభ్యుర్థులు సంఖ్య కూడా 99 నుంచి 100కు పెరుగుతుంది. మరోవైపు.. బిహార్‌లో పూర్ణియా లోక్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పప్పు యాదవ్ సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపిన పప్పు యాదవ్.. ఆర్జేడీతో సీట్ల ఒప్పందంతో టికెట్ లభించకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. -
అప్పు చేసి జిరాక్స్ షాప్.. వందల కోట్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ
ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ప్రధానం. పట్టుదల, కృషి, తెలివితేటలతో వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే నడకకు దూరం చేసిన విధికి తన విజయంతో గుణపాఠం చెప్పిన స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త విశాల్ మెగా మార్ట్ వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్.పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యానికి ఎప్పుడూ కుంగిపోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కసితో తెలిసినవారి వద్ద అప్పు చేసి 1986లో ఒక చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కోల్‌కతాలో 15 ఏళ్ల పాటు బట్టల వ్యాపారం చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి మకాం మార్చిన ఆయన 2001-02లో విశాల్ రిటైల్ సంస్థను స్థాపించారు. ఆ వ్యాపారంలో విజయం సాధించి క్రమంగా విశాల్ రిటైల్స్ విశాల్ మెగా మార్ట్ గా మారింది.రెండో దెబ్బరూ.1000 కోట్ల ల ఆయన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అయితే 2008లో స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆయన కంపెనీ విశాల్ మెగా మార్ట్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన తన కంపెనీని శ్రీరామ్ గ్రూపునకు విక్రయించాల్సి వచ్చింది. ఎవరైనా అయితే ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ రామచంద్ర అలా ఆగిపోలేదు.మరోసారి విధి కొట్టిన దెబ్బను తట్టుకుని ముందుకు సాగి వీ2 రిటైల్ సంస్థను స్థాపించి రిటైల్ మార్కెట్లో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఆయన కంపెనీ వీ2 రిటైల్ మార్కెట్ ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. రూ .800 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. -
Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే!
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కాని ప్రసాదులు చాలామందే ఉన్నారు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన హీరోలు పెళ్లి వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. అదేమంటే.. ఆ హీరో పెళ్లయ్యాక చేసుకుంటా, ఈ హీరో జోడీని వెతుక్కున్నాక చేసుకుంటా అని సాకులు చెప్తుంటారు. హీరో విశాల్ కూడా ఇదే రూటులో వెళ్తున్నాడు.పెళ్లి ఊసే లేదు!తను గతంలో ప్రేమించిన ఓ బ్యూటీ కూడా పెళ్లి చేసుకోబోతుంది. 46 ఏళ్లొచ్చినా ఈయన మాత్రం వివాహానికి తొందరేముంది అన్నట్లుగా నిమ్మకు నీరెత్తకుండా ఉండిపోయాడు. కానీ జనాలు ఊరుకుంటారా? మెడ మీద కత్తిపెట్టి అడిగినట్లుగా పెళ్లెప్పుడో చెప్పు అని ప్రశ్నిస్తూనే ఉన్నారు.తెలివైన సమాధానందీనికి విశాల్ చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. సల్మాన్ ఖాన్, శింబు, ప్రభాస్.. ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్నాకే నేను కూడా లైఫ్‌లో సెటిలవుతాను అని చెప్పాడు. శింబుకు మంచి అమ్మాయిని చూసి మూడు ముళ్లు వేయించాలని వేట మొదలుపెట్టారట అతడి పేరెంట్స్. ప్రభాస్ అంటారా? సినిమాల మీద తప్ప పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకుందే లేదు.సల్మాన్ పేరు చెప్పాడంటే..ఇక సల్మాన్ విషయానికి వస్తే.. ఆయనకసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదు. మరి విశాల్ ఈ ముగ్గురి తర్వాతే అంటున్నాడంటే తనకసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.చదవండి: విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు -
నెల రోజుల్లోపే ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం 'రత్నం'. గతనెల ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 26 విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
కోలీవుడ్ డైరెక్టర్ హరి- విశాల్ కాంబోలో వచ్చిన సినిమా 'రత్నం'. ఏప్రిల్ 26న విడుదలైన ఈ చిత్రం విశాల్ అభిమానులను మెప్పించింది. పలు ట్విస్ట్‌లతో పాటు భారీ ఫైట్స్‌తో మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. అయితే, సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. కమర్షియల్ చిత్రాలను అందించడంలో దర్శకుడిగా హరికి మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఇప్పటికే భరణి, పూజా,సింగం సీక్వెల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ నటించింది. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ రోజు సినిమాకు పోటీగా మరే పెద్ద సినిమా విడుదల కాకపోవడంతో రత్నం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో రత్నం సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రత్నం సినిమా ఓటీటీలోకి రానుంది. మే 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల్లో చిత్ర మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. -
‘రత్నం’ మూవీ రివ్యూ
టైటిల్ : రత్నంనటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు తదితరులునిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్దర్శకత్వం: హరిసంగీతం: దేవీ శ్రీ ప్రసాద్విడుదల తేదిఫ: ఏప్రిల్ 26, 2024‘భరణి’, ‘పూజా’సినిమాల తర్వాత మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్, యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌ని ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ‘రత్నం’పై టాలీవుడ్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రత్నం(విశాల్) చిత్తూరు మార్కెట్లో పని చేస్తుంటాడు. చిన్నప్పుడు ఓ సారి అదే మార్కెట్‌కు చెందిన పన్నీర్ సామి(సముద్రఖని)ని చంపేందుకు వచ్చిన ఓ మహిళను కత్తితో చంపేస్తాడు. తన ప్రాణాలను కాపాడడనే సానుభూతితో రత్నాన్ని తనవద్దే ఉంచుకుంటాడు పన్నీర్. కొన్నాళ్లకు పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. అతని తోడుగా ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాడు రత్నం. ఓ సారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరు వచ్చిన మల్లిక(ప్రియా భవానీ శంకర్)ని చూసి, ఫాలో అవుతాడు. అదే సమయంలో అమెను చంపేందుకు లింగం(మురళీ శర్మ) గ్యాంగ్ చిత్తూరు వస్తుంది. వారి నుంచి మల్లికను కాపాడమే కాదు, దగ్గరుండి మరీ పరీక్ష రాయిస్తాడు. అసలు మల్లిక ఎవరు? ఆమెకు రత్నంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లింగం మనుషులు ఆమెను ఎందుకు వెంబడిస్తున్నారు? రత్నం తల్లి రంగనాయకమ్మ ఎలా చనిపోయింది? లింగం నేపథ్యం ఏంటి? మల్లిక కుటుంబానికి వచ్చిన సమస్యను తీర్చే క్రమంలో రత్నంకు తెలిసిన నిజం ఏంటి? ఆ నిజం తెలిసిన తర్వాత రత్నం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాస్ సినిమాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే సింగంతో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. రత్నం కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావాల్సినంత యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్‌తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కాని అది ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. 1994లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో జరిగే బస్సు దోపిడి సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరో.. హీరోయిన్ చూసి ఎక్కడో చూసినట్లు భావించడం.. ఆమెను ఫాలో అవుతూ.. లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం.. ఇలా ప్రతీ సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్‌గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విసింగ్‌గా అనిపించడు. దీంతో సెకండాఫ్ అంతా మరింత రొటీన్ సాగుతు బోర్ కొట్టిస్తుంది. కథనం పరుగులు పెట్టినట్లే అనిపిస్తుంది కానీ..ఎక్కడా ఆసక్తిని రేకెత్తించదు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ఆయన నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరే లెవల్లో ఉంటుంది. ఈ జానర్ సినిమాల్లో విశాల్ మరింత రెచ్చిపోయి నటిస్తాడు. రత్నంలోనూ అలానే నటించాడు. ఎప్పటిమాదిరే కథంతా తన భుజానా వేసుకొని నడిపించాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్ సీన్స్‌లోనూ చక్కగా నటించాడు. మల్లిక పాత్రకు ప్రియా భవానీ శంకర్ న్యాయం చేసింది. కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లింగంగా మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఎమ్మెల్యే పన్నీర్‌గా సముద్రఖనీ తన పాత్ర పరిధిమేర బాగానే నటించాడు. హీరో స్నేహితుడు మూర్తిగా యోగిబాబు వేసే పంచులు, కామెడీ బాగా వర్కౌట్ అయింది. హరీశ్ పేరడీ, గౌతమ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు కొన్ని చోట్ల అదిరిపోయే బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రత్నం కథ ఇదే.. అందరికి నచ్చే హీరో ఎవరంటే: హరి
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన రత్నం చిత్రం ఏప్రిల్ 26న తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరపైకి రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారంలో ముమ్మరంగా మునిగిపోయింది. కమర్శియల్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న హరి దర్శకత్వం వహించిన చిత్రం రత్నం. ఈయన నటుడు విశాల్‌తో భరణి,పూజా చిత్రాలతో హిట్ కొట్టారు. ఇప్పుడు మూడో చిత్రంగా రత్నం వస్తుంది. కాగా దర్శకుడు హరి ఇటీవల పుదుచ్చేరిలో విశాల్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రత్నం చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.రోడ్డులో వెళుతున్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరూ సాయపడటానికి ముందుకు రావడం లేదని, వేడుకగా చూస్తున్నారని, అలా సాయం చేసే ఒక యువకుడి ఇతి వృత్తమే రత్నం చిత్రం కథ అని చెప్పారు. ఇకపోతే నటుడు విజయ్, త్రిష జంటగా నటించిన గిల్లీ తెలుగులో (ఒక్కడు) చిత్రం ఇటీవల రీ-రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తోందన్నారు. మంచి చిత్రాలు ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ అన్నారు.ఇలాంటి చిత్రాలను చూస్తున్నప్పుడు మంచి చిత్రాలు చేయాలని దర్శకులకు ఉద్వేగం కలుగుతుందన్నారు. సాధారణంగా నటులకు ఒక వర్గం అభిమానులే ఉంటారని, అయితే రజకాంత్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమాన నటుడని పేర్కొన్నారు. తలైవన్ చిత్రం వస్తుందంటే తొలిరోజునే చూస్తానని చెప్పారు. మరో విషయం ఏమిటంటే ఏ దర్శకుడు జాతి గురించో, మతం గురించో చిత్రం చేయాలని భావించరని దేశంలో జరుగుతున్న జాతి, మతం ఆలోచనలనే సినిమాగా తీస్తారని చెప్పారు. సినిమా అనేది జాతి, మతం, భాషలకు అతీతం అని దర్శకుడు హరి పేర్కొన్నారు. -
రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన హీరో శివకార్తికేయన్
తమిళ ప్రముఖ హీరో శివకార్తికేయన్ రూ.50 లక్షలు విరాళం అందించారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం నుంచి శివకార్తికేయన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశారు. నడిగర్ భవన నిర్మాణ కోసం ఇప్పటికే కోలీవుడ్ టాప్ హీరోలు తమ వంతుగా సాయం చేస్తూనే ఉన్నారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న హీరో విశాల్.. భవన నిర్మాణం కోసం విరాళాలు సేకరించే పనిలో గత కొన్ని నెలలుగా ఉన్నారు. ఆయన పిలుపుతో కమల్ హాసన్,విజయ్,సూర్య,కార్తీ వంటి స్టార్ హీరోలు తమ వంతుగా సాయం అందించారు. తాజాగా శివకార్తికేయన్ కూడా రూ. 50 లక్షలు విరాళం అందించారు. ఇప్పటికే రూ.40 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి కాగా, నిర్మాణ పనులకు మరో రూ.25 కోట్లు అవసరం ఏర్పడటంతో నటీనటుల సంఘం తరపున బ్యాంకు రుణం ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే రూ.12.5 కోట్లు డిపాజిట్ చేస్తే రూ.30 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకు సరిపడ మొత్తాన్ని ఏర్పాటు చేసే పనిలో విశాలు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. Actor #Sivakarthikeyan donated Rs 50Lakh from his personal fund towards the construction of New Nadigar Sangam Building. He handed the cheque to South Indian Artistes' Association President M.Nasser and Treasurer Si.Karthi.#NadigarSangam #siaa@actornasser @VishalKOfficial… pic.twitter.com/vGfoTURb0t — Ramesh Bala (@rameshlaus) April 23, 2024 -
'ప్రభాస్ పెళ్లయ్యాకే చేసుకుంటా'.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా క్రేజ్ దక్కించుకున్న హరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ చూడగానే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం హీరో విశాల్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ప్రశ్నించారు. దీనికి విశాల్ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రభాస్ పెళ్లి అవ్వగానే తప్పకుండా చేసుకుంటానని తెలిపారు. అంతే కాకుండా ఫస్ట్ ఇన్విటేషన్ కూడా ప్రభాస్‌కే ఇస్తానని తెలిపారు. అయితే గతంలో తమిళ నిర్మాతల నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. తాజాగా మరోసారి పెళ్లి ప్రస్తావన రావడంతో విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. రత్నం మూవీ ఈనెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. 😅 #Vishal Anna during #Rathnam movie promotions 😁 " #Prabhas anna pelli ayyaka Nen kuda pelli cheskuntanu " - @VishalKOfficial pic.twitter.com/ioVpmw8fgb — Prabhas Fan (@ivdsai) April 18, 2024 -
ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు: హీరో విశాల్
♦ ‘నేను ఎవరికీ వ్యతిరేకం కాదు.. మనసు లోతుల్లో అనిపించిందే చెబుతున్నా.. ♦ జగన్ ప్రభుత్వంలో పల్లెల్లో విద్యా రంగంలో మార్పులు బాగా అనిపించాయి. ♦ ఏ నాయకుడైనా సరే... ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం. ♦ పొత్తు పెట్టుకోండి.. అయితే గతంలో ఇంత మంచి చేశామని ప్రజలకు చెప్పగలరా? ♦ ఈ ఐదేళ్లూ ఇప్పుడున్న ఆయన ఏం చేయలేకపోయారని ధైర్యంగా మాట్లాడగలరా? ♦ ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు. ప్రజలకు అన్నీ తెలుసు. ♦ ఎవరెన్ని కూటములు కట్టినా... ఈ ఎన్నికల్లో జగన్‌దే గెలుపు అని నా భావన ♦ వీడెందుకు ఇంత మంచి చేస్తున్నాడనే మంటతో కొందరు కాళ్లు పట్టుకుని లాగాలని చూస్తారు. ♦ అలాంటి వాటికి వెరవని నేత జగన్ అనేది నా నమ్మకం..’ అని హీరో విశాల్ తన మనసులో మాటను బయటపెట్టారు. రత్నం సినిమా విడుదల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ ఆయనే సీఎం.. నేనెప్పుడూ మనసులో ఉన్నదే మాట్లాడతా. పాదయాత్ర రోజుల నుంచి జగన్‌ను గమనిస్తున్నాను. ట్రెడ్ మిల్‌పై రెండు కి.మీ వాకింగ్ చేస్తే అలసి పోతాం. అలాంటిది ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కిలోమీటర్లు నడవడం ప్రజా సమస్యల పట్ల ఆయన నిబద్ధతను చాటిచెబుతోంది. ఒక కొడుకుగా తండ్రి ప్రజాసేవను కొనసాగించడం మామూలు విషయం కాదు. జగన్ నాకు నచ్చిన నాయకుడు. మళ్లీ ఆయనే సీఎం. విద్యలో సంస్కరణలు భేష్ ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో విద్యారంగంలో మార్పులు నన్ను ఆకట్టుకున్నాయి. ఎంత ఖర్చయినా సరే ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న జగన్ సంకల్పం నచ్చింది. ఆడపిల్లలకు మంచి విద్య నేర్పించి మంచి భవిష్యత్‌ను ఇవ్వాలి. ఆడపిల్ల చదువు సమాజానికి మలుపు. జగన్ పాలనలో అది సాకారమవుతోంది. అందరికీ నాణ్యమైన విద్య అందాలనేది నా కోరిక. అందుకే మా అమ్మ పేరుతో ట్రస్ట్ నిర్వహిస్తున్నాను. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేస్తున్నారు. మా వలంటీర్లు అలాంటి వారిని వెదికి చదివించడం చేస్తున్నారు. మంచి నేతను ఎవరూ ఆపలేరు ఏ నాయకుడైనా ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి చేయాలంటే చాలా కష్టం.. మంచి చేసేవాళ్లని చూసి ఎన్నో కుట్రలు చేస్తారు. వైఎస్ జగన్‌పై దాడులు జరుగుతున్నాయి. అయితే మంచి చేయాలనుకునే నాయకుడిని ఆపడం ఎవరితరం కాదు. సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేయడం కష్టం. రాజకీయాలంటే చాలా కష్టమైన విషయం. ఏసీ రూముల్లో కూచుని రాజకీయాలు చేయాలంటే కుదరదు. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోవాలి. –సాక్షి, అమరావతి మనసులో ఉన్నదే చెబుతున్నా నాకు ఆంధ్రలో ఓటు లేకున్నా.. కొంతకాలంగా ఇక్కడి రాజకీయాలు గమనిస్తున్నా. జగన్ ఇంటర్వ్యూలు తరచుగా చూస్తాను. నేను వైఎస్సార్సీపీ ని సపోర్ట్ చేయడం లేదు. చంద్రబాబుకు వ్యతిరేకం కాదు. మనసులో ఏమనిపిస్తుందో అదే చెబుతున్నాను. పార్టీ లు జత కట్టడం మంచిదే. అయితే ఆ పార్టీలన్నీ ఒకే మేనిఫెస్టో పెట్టాలి. గతంలో మీరు ఏం మంచి చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి. ఈ ఐదేళ్లలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేదో చెప్పగలగాలి. అలా కాకుండా ఇప్పుడు వచ్చి ఐదేళ్ల నాటి మేనిఫెస్టోను తుడిచి దానికే రెండు, మూడు తాయిలాలు చేర్చి ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు. ప్రజలకు అన్నీ తెలుసు. పొత్తులు పెట్టుకోండి.. అయితే మీరెందుకు పొత్తులు పెట్టుకుంటున్నారో ఓటరుకు తెలుసు. ఎవరికి ఓటేయాలో కూడా తెలుసు. ఎవరెన్ని కూటములు కట్టినా ఈ ఎన్నికల్లో జగన్‌దే గెలుపు. -
మళ్లీ జగనే సీఎం ఎందుకంటే..!
-
ఏపీ ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే: హీరో విశాల్ కామెంట్స్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ హీరో విశాల్ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారని అన్నారు. గతంలోనూ సీఎం జగన్‌పై ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి దాడులను జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని విశాల్ వెల్లడించారు. తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా లేనని.. కానీ సీఎం జగన్ అంటేనే తనకు విపరీతమైన అభిమానమని విశాల్ తెలిపారు. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆయన రత్నం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం ఆయన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదారాబాద్‌లో పర్యటించిన విశాల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని విశాల్ అన్నారు. (Read this article in English) -
మీరు ఎవరు అలా చెప్పడానికి? బడా నిర్మాణ సంస్థపై హీరో విశాల్ ఫైర్
తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతడు నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నాడు. 'రత్నం' మూవీతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా అలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పిక్చర్స్ తీరుపై మండిపడ్డాడు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) 'సినిమాలు ఏ తేదీన విడుదల కావాలి? ఎప్పుడు విడుదల కావాలి? ఎన్ని థియేటర్లు ఇవ్వాలో రెడ్ జెయింట్ డిసైడ్ చేస్తోంది. మేం ఎక్కడెక్కడి నుంచో వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి, కష్టపడి రక్తం చిందించి సినిమాలు తీస్తుంటే.. ఎవరో ఒకరు ఏసీ రూంలో కూర్చుని థియేటర్ల ఓనర్లకు ఫోన్ చేసి.. ఆ సినిమా వేయకండి ఈ మూవీ వేసుకోండి. దాన్ని తీసేయండని చెబుతున్నారు. అసలు మీరు ఎవరు అలా చెప్పడానికి? మీకు అంతటి అధికారం, హక్కులు ఎవరిచ్చారు' అని విశాల్ మండిపడ్డాడు. విశాల్ గత చిత్రాలు 'ఎనిమీ', 'మార్క్ ఆంటోని' సినిమాలని వేరే సంస్థ తమిళనాట డిస్ట్రిబ్యూషన్ చేశాయి. దీంతో వీటికి థియేటర్ల కొరత ఏర్పడేలా రెడ్ జెయింట్ పిక్చర్స్ వ్యవహరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్.. దీనికి యజమాని. దీంతో చాలామంది నిర్మాతలు ఎందుకులే అని ఊరుకోగా, విశాల్ మాత్రం బహిరంగంగానే విమర్శలు చేశాడు. తన 'రత్నం' చిత్రానికి కూడా వీళ్లు ఇబ్బందులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓ చెత్త సినిమా.. చూస్తుంటే చిరాకేసింది: 12th ఫెయిల్ నటుడు) Vishal's bold statement against Red Giant😳🔥 He says "Red Giant movies involved in Monopoly activities during release of Enemy & Mark Antony. He also mentions that they may raise an issue during #Rathnam release also"pic.twitter.com/8LuKcqjLWT — AmuthaBharathi (@CinemaWithAB) April 15, 2024 -
త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ ఇదే!
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లికూతురిగా ముస్తాబు కానుంది. ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. తన పెళ్లి తనకే సర్ప్రైజింగ్గా ఉందని.. ఏదేమైనా ఈ ఏడాదిలోనే మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. తాజాగా దీనిపై హీరో విశాల్ స్పందించాడు. వరలక్ష్మి పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాల్లో తనను తాను నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడింది. సంతోషంగా ఉంది అలాంటిది తను అనుకున్నది సాధించి తెలుగు చిత్రపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. తను ఎంతో మంచి వ్యక్తి.. ఆమె తల్లిని నేను కూడా అమ్మ అనే పిలుస్తాను. పర్సనల్ లైఫ్‌లో సెటిలవుతున్న వరలక్ష్మికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నాడు. కాగా గతంలో వరలక్ష్మి, విశాల్ ప్రేమించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఓ కార్యక్రమంలో లక్ష్మీకరమైన అమ్మాయితో ఏడడుగులు వేస్తానన్నారు. స్నేహితులమే.. దీంతో అతడు వరలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం ఊపందుకుంది. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమకు చోటు లేదని విశాల్ క్లారిటీ ఇచ్చాడు. ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండే విశాల్ - వరలక్ష్మి 2019లో నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శత్రువులుగా మారిపోయారు. తన తండ్రి శరత్ కుమార్ గురించి విశాల్ అడ్డగోలుగా మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. ఆ సమయంలో విడిపోయిన వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..! -
'రత్నం' ట్రైలర్.. విశాల్ మళ్లీ అలాంటి సినిమానే!
విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా 'రత్నం'. ఫస్ట్ లుక్, పాటలు అవి రిలీజైనప్పుడే ఇది యాక్షన్ చిత్రమని అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ రావడంతో స్టోరీపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పడు చూద్దాం. (ఇదీ చదవండి: నా పెళ్లి వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు: ప్రియమణి) 'రత్నం' కథ విషయానికొస్తే.. హీరో పేరు రత్నం. ఓ రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తుంటాడు. హీరోయిన్ (ప్రియా భవానీ శంకర్)ని కొందరు దుండగులు ఎందుకో చంపాలని చూస్తుంటారు. వాళ్ల నుంచి హీరో ఆమెని ఎలా రక్షించాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. 'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా సెపరేట్ క్రేజ్ సంపాదించిన దర్శకుడు హరి.. 'రత్నం' సినిమాని తీశాడు. పూర్తిస్థాయి యాక్షన్ కథతో తీశారు కానీ కథే పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. ఇదివరకే ఈ తరహా సినిమాల్లో విశాల్ కనిపించాడు. మరి ఈ సినిమాలో ఏమైనా కొత్తగా ఉందా లేదా అనేది థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అసలే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్ సినిమాల్ని తప్పితే రొటీన్ చిత్రాల్ని పెద్దగా ఆదరించడం లేదు. మరి 'రత్నం' సినిమాని ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?) -
సినిమాలో విలన్స్ కంటే బయటే ఎక్కువ: విశాల్ హాట్ కామెంట్స్
సినిమాల్లో కంటే బయటే ఎక్కువ విలన్లు ఉన్నారని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పేర్కొన్నారు. ఆయన ఇటీవల హీరోగా నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తాజాగా హరి దర్శకత్వంలో రత్నం చిత్రంలో నటించారు. నటి ప్రియా భవానీశంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రం ఈనెల 26న తెరపైకి రానుంది. తాజాగా తమిళ నూతన సంవత్సరం సందర్భంగా తమిళ సినీ పాత్రికేయుల సంఘం ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని సంగీత కళాకారుల సంఘం ఆవరణలో నిర్వహించిన వేడుకలో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాను తాజాగా నటించిన రత్నం చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. దర్శకుడు హరి ఈ చిత్ర కథ చెప్పినప్పుడే అందులోని ముఖ్య పాయింట్ అద్భుతం అనిపించిందన్నారు. ఈ చిత్రం విడుదల తరువాత తాను స్వీయ దర్శకత్వంలో నటించే తుప్పరివాలన్- 2 చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. మే 5తేదీన షూటింగ్ లండన్‌లో మొదలవుతుందని చెప్పారు. దీంతో విశాల్ కూడా దర్శకుడు అవుతున్నాడు.. కొత్తగా ఈయనే చేస్తారులే అని అనుకునేవారు ఇక్కడ ఉంటారన్నారు. అలాంటి వారి కోసమే తాను తుప్పరివాలన్–2 చేస్తున్నట్లు చెప్పారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పారు. మెరీనా తీరంలో ఎంజీఆర్ సమాధిని చూడడానికి ఎలాగైతే ప్రజలు వస్తారో.. అలా నటీనటుల సంఘం నూతన భవనాన్ని చూడడానికి వచ్చేలా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే విధంగానూ, కల్యాణమంటపం, రంగస్థల నటుల కోసం వేదికను వంటి పలు వసతులతో ఈ భవనం ఉంటుందని విశాల్ పేర్కొన్నారు.