అదిరిపోయే పంచ్‌లతో 'మదగజరాజా' తెలుగు ట్రైలర్‌ | Vishal's Madha Gaja Raja Official Telugu Trailer Out Now | Sakshi
Sakshi News home page

అదిరిపోయే పంచ్‌లతో 'మదగజరాజా' తెలుగు ట్రైలర్‌

Published Sun, Jan 26 2025 10:13 AM | Last Updated on Sun, Jan 26 2025 10:36 AM

Vishal's Madha Gaja Raja Official Telugu Trailer Out Now

విశాల్‌(Vishal ) నటించిన  ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్‌లో విడుదలైంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌కు దగ్గరలో ఈ మూవీ ఉంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వర్షన్‌ కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

విశాల్‌ హీరోగా సుందర్‌. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్‌ పేర్కొంది. కాగా ఈ జనవరి 31న సత్య కృష్ణన్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. జెమినీ ఫిలిం సర్క్యూట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్‌గా నటించారు. 

తెలుగు వర్షన్‌లో సినిమా రానున్నడంతో తాజాగా ‘మదగజరాజా’ ట్రైలర్‌ను హీరో వెంకటేశ్‌ హైదరాబాద్‌లో విడుదల చేశారు. కామెడీ ప్రధానంగా ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జానర్‌ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు సుందర్‌.సి. దిట్ట అని చెప్పవచ్చు. ఆయన తన మార్క్‌ మాస్‌ అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఇందులో హీరోయిన్‌ సదా కూడా ఒక ఐటెమ్‌ సాంగ్‌లో కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement