Sundar C
-
అదరగొడుతున్న హారర్ మూవీ.. ఏకంగా వంద కోట్లు..
హారర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఏకంగా వంద కోట్లు రాబట్టింది. ఆ సినిమా మరేదో కాదు అరణ్మనై 4. సుందర్, తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 3న తమిళనాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో బాక్ పేరిట విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టింది. ఈ ఏడాది సెంచరీ కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.సెంచరీ..ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అరణ్మనై వంద కోట్లు వసూలు చేసిందంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అరణ్మనై ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ విజయం సాధించగా ఈసారి నాలుగో పార్ట్ తీశారు. గత చిత్రాలన్నింటికంటే అరణ్మనై 4 అద్భుత విజయం సాధించింది. నాలుగో పార్ట్‌లో మెయిన్ లీడ్..ఇక గత మూడు చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా డైరెక్టర్ సుందర్ నాలుగో పార్ట్‌లో మాత్రం ప్రధాన పాత్రలో నటించడం విశేషం. కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో యోగిబాబు, కోవై సరళ, రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్ సహాయక పాత్రల్లో నటించారు. హిప్హాప్ ఆది సంగీతం అందించాడు. A celebration in theaters 🥳 A phenomenon at the box office 🔥 The 1st Tamil movie of 2024 to gross 100 crores worldwide 😍❤🔥And it's all from the love you've given us ✨ #Aranmanai4BlockbusterHitA #SundarC unstoppable blockbuster entertainer🥳A @hiphoptamizha… pic.twitter.com/VvrcKGT63g— KhushbuSundar (Modi ka Parivaar) (@khushsundar) May 22, 2024 చదవండి: పవిత్ర-చందు మరణం.. నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు -
ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్
తమిళ నటుడు, నిర్మాత సుందర్ సి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన అరణ్మనై-4తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నటుడిగా స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సుందర్ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో తన భార్య ఖుష్బు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఖుష్బుకు పిల్లలు పుట్టరనే విషయం తెలియడంతో తాను తీవ్ర భావోద్వేగానికి గురైందని వెల్లడించారు.సుందర్ మాట్లాడుతూ..'ఇదంతా మా పెళ్లికి ముందు జరిగింది. అప్పుడు ఖుష్బు అనారోగ్యంతో ఉంది. తనకు పిల్లలు పుట్టరని ఒక వైద్యుడు చెప్పాడు. దీంతో నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఖుష్బు ఏడుస్తూ చెప్పింది. కానీ నేను తననే వివాహం చేసుకోవాలకున్నా. నా జీవితంలో సంతానం లేకపోయినా సరే తననే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాను. కానీ దేవుడు మమ్మల్ని మరోలా దీవించాడు. ప్రస్తుతం మాకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.' అని తెలిపారు.సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై- 4 తెలుగులో బాక్ పేరుతో విడుదల అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా మే 3కి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఖుష్బు నిర్మించారు. ఈ చిత్రంలో యోగి బాబు, వీటీవి గణేష్, ఢిల్లీ గణేష్, కోవై సరళ కూడా నటించారు. ఈ ఫ్రాంచైజీలో మొదటి చిత్రం 2014లో విడుదల కాగా.. 2016లో పార్ట్-2 రిలీజైంది. 2021లో విడుదలైన మూడవ భాగం విడుదలైంది. -
19 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్!
కమర్షియల్ చిత్రాల దర్శకుడు సుందర్ సి తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టారు. అవ్నీ సినీమాక్స్, బెంజ్ మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో జీవా, జై, శ్రీకాంత్, మాళవిక శర్మ, రైజా విల్సన్, అమృత అయ్యర్, ఐశ్వర్యదత్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. యోగిబాబు, కింగ్స్ లీ, ప్రతాప్ పోతన్, సంయుక్త షణ్ముగం, దివ్యదర్శిని తదితరులు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా 19 ఏళ్ల తరువాత సుందర్ సి, యువన్ శంకర్ రాజా కాంబోలో చిత్రం రూపొందుతుండడం గమనార్హం. ఇ.కృష్ణస్వామి ఛాయాగ్రహణంను అందిస్తున్న ఈ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. వినోదమే ప్రధానంగా రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను చెన్నై, ఊటీ పరిసర ప్రాంతాల్లో నిర్వహించి ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. -
దర్బార్ నుంచి మహల్‌కు...
దర్బార్‌లో షూటింగ్ పూర్తి చేసి నేరుగా మహల్లోకి వెళ్లిపోయారు రాశీ ఖన్నా. లాక్డౌన్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారామె. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు రాశీ. ఈ సినిమా చిత్రీకరణలో దసరా హాలీడే కూడా తీసుకోకుండా పాల్గొన్నారామె. ఇది పూర్తవ్వగానే తమిళ చిత్రం ‘అరన్ మణై’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. దర్శకులు సుందర్ .సి తెరకెక్కించిన హిట్ సిరీస్ ‘అరన్ మణై’ (మహల్) సిరీస్‌లో మూడో చిత్రం ‘అరన్ మణై 3’. ఆర్య, ఆండ్రియా, రాశీ ఖన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయింది. లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. తాజాగా మళ్లీ షూటింగ్ షూరూ అయింది. ప్రస్తుతం ఈ సినిమా సెట్లో బిజీగా ఉన్నారు రాశీ. ఈ రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ పూర్తి చేయనున్నారట. అప్పటివరకూ దర్బార్ నుంచి మహాల్ సెట్స్‌కి అటూ ఇటూ తిరుగుతూ రాశీ ఖన్నా బిజీ బిజీ. -
విశాల్ ‘యాక్షన్’ టీజర్ విడుదల
-
త్వరలో సెట్స్ మీదకు 300 కోట్ల చిత్రం
బాహుబలి రిలీజ్ తరువాత తమిళ సీనియర్ దర్శకుడు సుందర్.సి అదే స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. జయం రవి, ఆర్యలు ప్రధాన పాత్రల్లో శృతిహాసన్ టైటిల్ రోల్లో సంఘమిత్ర సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే సినిమాను లాంఛనంగా ప్రారంభించిన కొద్ది రోజులకే శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుంది తప్పుకుంది. తరువాత మరో హీరోయిన్ను ప్రకటించకపోవటంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారన్న టాక్ వినిపించింది. అయితే సుందర్ ఈ సినిమా త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. శృతిహాసన్ స్థానంలో బాలీవుడ్ నటి దిశాపటాని నటించనున్నారట. ఈ ఏడాది జూలైలో ఈ సినిమాను షూటింగ్‌ను ప్రారభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. శ్రీ తేండాల్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిచనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్కు సంబంధించి చిత్రయూనిట్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
సినిమా ఆగిపోలేదు.. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది..!
బాహుబలి ఘనవిజయం సాధించిన తరువాత అదే స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు తల పెట్టిన కోలీవుడ్ సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సి సుందర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌కు ముందుగా శృతిహాసన్ ను తీసుకున్నారు. శృతి కూడా లండన్ వెళ్లి మరీ యుద్ధవిద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కానీ సినిమా అధికారికంగా ప్రారంభించిన తరువాత స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదన్న కారణంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.అయితే శృతిహాసన్ హ్యాండ్ ఇచ్చిన దగ్గర నుంచి సంఘమిత్ర ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై దర్శకుడు సుందర్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. 18 నెలలుగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపిన డైరెక్టర్, కొంత గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తయిన తరువాత షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెళ్లడించారు. జయం రవి, ఆర్యలు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో దిశాపటానిని హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశం ఉంది. -
సంఘమిత్రలో దిశాపఠాని?
నటి దిశాపఠాని ఇంకా నిర్ణయం జరగలేదు అంటోంది. ఏమిటా నిర్ణయం అన్నది తెలుసుకోవాలనుందా? ఎంఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరి చిత్రంతో బాలీవుడ్లో రంగప్రవేశం చేసిన ఈ ఉత్తరాది దిశాపఠాని. అయితే బీటెక్ చదివిన ఈ అమ్మాయి చాలా మంది బ్యూటీస్ లాగానే మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. క్యాడ్బరీ వాణిజ్య ప్రకటన ద్వారా ప్రాచుర్యం పొందిన దిశాపఠానిపై మొట్టమొదట దృష్టి పడింది టాలీవుడ్ దర్శకుడు పూరిజగన్నాథ్‌దే. అంతే లోఫర్ చిత్రంలో హీరోయిన్ అయ్యిపోయింది. ఆ తరువాతే హిందీలో ఎంఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరి చిత్రంతో బాలీవుడ్ తెరపై మెరిసింది. తాజాగా కోలీవుడ్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్‌లో బాహుబలి చిత్రం తరహాలో సంఘమిత్ర చిత్రం తెరరూపానికి చాలా కాలంగా సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మెర్శల్ వంటి సంచలన చిత్రాన్ని నిర్మించిన శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ ఈ చారిత్రాత్మక కథా చిత్రాన్ని రూపొందించనుంది. సుందర్.సీ దర్శకత్వం వహించనున్న ఇందులో జయం రవి, ఆర్య కథానాయకులుగా సెట్ అయ్యారు. కథానాయకిగా శ్రుతిహాసన్ ముందు ఓకే అన్నా, ఆ తరువాత అనూహ్యంగా వైదొలగి పెద్ద వివాదానికే కారణమైన విషయం తెలిసిందే. దీంతో ఆమె పాత్రలో నటించడానికి నయనతార, హన్సికల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వారూ సెట్ కాలేదు. చివరికి బాలీవుడ్ చిన్నది దిశాపఠాని ఎంపికైనట్లు ప్రచారం హోరెత్తింది. ఈ సంచలన చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఇంకా క్లారిటీ రాలేదు. దర్శకుడు సుందర్.సీ సంఘమిత్ర చిత్రం అనుకున్న తరువాత కలగలప్పు 2 చిత్రాన్ని పూర్తి చేసేశారు. ఆ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక జయం రవి ‘టిక్ టిక్ టిక్’ చిత్రాన్ని పూర్తి చేసి అదంగమణు చిత్రానికి రెడీ అయిపోయారు. ఆర్య కూడా గజనికాంత్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి దిశాపఠాని కూడా షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంఘమిత్ర చిత్రంలో నటించే విషయం గురించి ఆ చిత్ర యూనిట్ వర్గాలు చర్చించారు కానీ ఇంకా అందులో నటించే విషయంలో తుది నిర్ణయం జరగలేదని పేర్కొంది. అంటే సంఘమిత్రలో దిశాపఠాని నటించే విషయంలో కూడా క్లారిటీ లేదన్నమాట. -
డేరింగ్ స్టెప్@డిసెంబర్!?
మొన్నటివరకూ కథ... రెడీ! కత్తులు... రెడీ! కథానాయకులు... రెడీ! కానీ, ఒక్కరు మాత్రం రెడీగా లేరు. ఎవరు? అంటే... కథానాయిక! కథానాయకులతో సమానంగా కత్తి పట్టుకుని యుద్ధం చేసే కథానాయిక లేరు. మరి, ఇప్పుడు... కత్తి పట్టుకోవడానికి దిశా పాట్నీ రెడీ! తమిళ నటులు ఆర్య, ‘జయం’ రవి హీరోలుగా నటి ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ .సి తీయనున్న ‘సంఘమిత్ర’లో రాణి సంఘమిత్రగా నటించడానికి దిశా పాట్నీ అంగీకరించిన సంగతి తెలిసిందే. తెలుగులో ‘లోఫర్’, హిందీలో ‘ఎం.ఎస్. ధోని’ సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించిన ఈ బ్యూటీ, వారియర్ ప్రిన్సెస్ రోల్ యాక్సెప్ట్ చేయడం డేరింగ్ స్టెప్‌గా చెప్పుకోవచ్చు. ఓ పక్క హిందీ ‘బాఘీ–2’లో నటిస్తున్న దిశ, మరోపక్క ‘సంఘమిత్ర’ కోసం కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ తదితర అంశాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. డిసెంబర్ నుంచి డేరింగ్ స్టెప్ వేస్తారట! అంటే... డిసెంబర్లో ‘సంఘమిత్ర’ షూటింగ్ ప్రారంభించడానికి సుందర్ .సి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ 200 కోట్ల బడ్జెట్‌తో శ్రీ తేనాండాళ్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. -
డెరైక్టర్ని కావాలనుకున్నా!
హీరో విశాల్ ‘‘సుందర్.సి దర్శకత్వంలో నేను చేసిన మొదటి చిత్రమిది. నేను, విజయ్ ఆంటోని కలిసి చదువుకునే రోజుల్లో నేను డెరైక్టర్, తను మ్యూజిక్ డెరైక్టర్ అవ్వాలనుకున్నాం. కానీ, నేను హీరో అయ్యాను. విజయ్ మంచి మ్యూజిక్ డెరైక్టర్, హీరో అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ‘మదగజరాజ’ చిత్రంలో ఉంటాయి’’ అని హీరో విశాల్ తెలిపారు. విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కాంబినేషన్లో జెమిని ఫిలిం సర్క్యూట్స్ సమర్పణలో సుందర్.సి. దర్శకత్వంలో తమటం కుమార్ రెడ్డి అందిస్తున్న చిత్రం ‘మదగజరాజ ’. విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘విశాల్ ఎనర్జిటిక్ హీరో. ఈ చిత్రంలో ఆయన ఓ పాట కూడా పాడారు’’ అని దర్శకుడు సుందర్.సి. పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకముంది’’ అని తమటం కుమార్ రెడ్డి చెప్పారు. హీరోయిన్ వరలక్ష్మి, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని, నిర్మాత ఏఎం రత్నం, సహ నిర్మాత రొక్కం సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.