
దర్బార్‌లో షూటింగ్ పూర్తి చేసి నేరుగా మహల్‌లోకి వెళ్లిపోయారు రాశీ ఖన్నా. లాక్‌డౌన్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారామె. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు రాశీ. ఈ సినిమా చిత్రీకరణలో దసరా హాలీడే కూడా తీసుకోకుండా పాల్గొన్నారామె. ఇది పూర్తవ్వగానే తమిళ చిత్రం ‘అరన్ మణై’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు.
దర్శకులు సుందర్ .సి తెరకెక్కించిన హిట్ సిరీస్ ‘అరన్ మణై’ (మహల్) సిరీస్‌లో మూడో చిత్రం ‘అరన్ మణై 3’. ఆర్య, ఆండ్రియా, రాశీ ఖన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయింది. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయింది. తాజాగా మళ్లీ షూటింగ్ షూరూ అయింది. ప్రస్తుతం ఈ సినిమా సెట్లో బిజీగా ఉన్నారు రాశీ. ఈ రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ పూర్తి చేయనున్నారట. అప్పటివరకూ దర్బార్ నుంచి మహాల్ సెట్స్‌కి అటూ ఇటూ తిరుగుతూ రాశీ ఖన్నా బిజీ బిజీ.
Comments
Please login to add a commentAdd a comment