19 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌ రిపీట్‌! | Sundar C, Yuvan Shankar Raja Collaborate After 19 Years | Sakshi
Sakshi News home page

Sundar C - Yuvan Shankar Raja: సుందర్‌ సి తాజా చిత్రం ప్రారంభం

Published Wed, Feb 2 2022 7:54 AM | Last Updated on Wed, Feb 2 2022 7:54 AM

Sundar C, Yuvan Shankar Raja Collaborate After 19 Years - Sakshi

కమర్షియల్‌ చిత్రాల దర్శకుడు సుందర్‌ సి తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టారు. అవ్నీ సినీమాక్స్, బెంజ్‌ మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో జీవా, జై, శ్రీకాంత్, మాళవిక శర్మ, రైజా విల్సన్, అమృత అయ్యర్, ఐశ్వర్యదత్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. యోగిబాబు, కింగ్స్‌ లీ, ప్రతాప్‌ పోతన్, సంయుక్త షణ్ముగం, దివ్యదర్శిని తదితరులు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

కాగా 19 ఏళ్ల తరువాత సుందర్‌ సి, యువన్‌ శంకర్‌ రాజా కాంబోలో చిత్రం రూపొందుతుండడం గమనార్హం. ఇ.కృష్ణస్వామి ఛాయాగ్రహణంను అందిస్తున్న ఈ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. వినోదమే ప్రధానంగా రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను చెన్నై, ఊటీ పరిసర ప్రాంతాల్లో నిర్వహించి ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement