ఇంటి అద్దె చెల్లించలేదని యువన్‌ శంకర్‌ రాజాపై ఫిర్యాదు | Yuvan Shankar Raja Struck House Rent Not Paid Issue | Sakshi
Sakshi News home page

ఇంటి అద్దె చెల్లించలేదని యువన్‌ శంకర్‌ రాజాపై ఫిర్యాదు

Published Sun, Aug 18 2024 11:04 AM | Last Updated on Sun, Aug 18 2024 11:25 AM

Yuvan Shankar Raja Struck House Rent Not Paid Issue

త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు యువన్ శంకర్ రాజా టాలీవుడ్‌ సినీ అభిమానులకు కూడా పరిచయమే.. మ్యాస్ట్రో ఇళయరాజా తనయుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి త‌క్కువ స‌మయంలోనే త‌న‌కంటూ మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే, తాజాగా యువన్‌పై రూ. 20 లక్షల డబ్బు వ్యవహారంలో పోలీసులుకు ఫిర్యాదు అందింది.

సౌత్‌ ఇండియాలో సుమారు 130 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించడంతో పాటు పలు కచేరీలు నిర్వహిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే యువన్‌ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే, తాను ఉంటున్న ఇంటి అద్దె రూ. 20 లక్షలు చెల్లించకుండా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసేందకు ప్రయత్నిస్తున్నారని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది చాలా మందిని షాక్‌కి గురి చేసింది. చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో నివసించే యువన్ శంకర్ రాజాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

కొన్నేళ్లుగా నుంగంబాక్కం సరస్సు ప్రాంతంలో అజ్మత్ బేగం అనే వారికి సంబంధించిన ఇంట్లో యువన్‌ అద్దెకు ఉంటున్నాడు. అద్దె చెల్లించకుండా యువన్‌ ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పటి వరకు రూ. 20 లక్షలు బకాయిలు ఉన్నాయని  అజ్మత్ బేగం సోదరుడు మహ్మద్ జావిద్ తిరువల్లికేణి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌లో ఫిర్యాదు చేశారు. అద్దె అడగడానికి ఫోన్ చేస్తే అతను ఫోన్ కూడా లిఫ్ట్‌ చేయడం లేదని వారు పేర్కొన్నారు. అయితే, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇల్లు కాలి చేస్తున్నాడని, ఈ క్రమంలో కొన్ని వస్తువులు కూడా మరో ఇంటికి షిఫ్ట్‌ చేశారని యువన్‌పై ఇంటి యజమాని ఆరోపించారు. 

ఈ ఫిర్యాదు మేరకు పోలీసు శాఖ విచారణ ప్రారంభించింది. అయితే, ఈ విషయం గురించి యువన్‌ శంకర్‌ రాజా నుంచి ఎలాంటి వివరణ రాలేదు. కానీ, భారీ బడ్జెట్‌ సినిమాలతో ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకునే యువన్‌ కేవలం రూ.20 లక్షలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడా..? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సౌత్‌ ఇండియాలో చాలా సినిమాలకు హిట్‌ మ్యూజిక్‌ అందించారు. విజయ్‌ సినిమా గోట్‌, మారి2,లవ్‌ టుడే,బిల్లా,గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి,విరూమాన్‌,మాస్టర్‌,హ్యాపీ,ఓయ్, పంజా వంటి సినిమాలకు ఆయన పనిచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement