సినిమాలకు దూరం.. చివరిసారి పాట పాడనున్న విజయ్‌! | GOAT: Vijay Sings a Song in Yuvan Shankar Raja Direction | Sakshi
Sakshi News home page

GOAT: మరోసారి గొంతు సవరించనున్న దళపతి..

Published Mon, Mar 11 2024 1:07 PM | Last Updated on Mon, Mar 11 2024 1:25 PM

GOAT: Vijay Sings a Song in Yuvan Shankar Raja Direction - Sakshi

దళపతి విజయ్‌ హీరోగా టాప్‌ పొజిషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేసి సినిమాలకు దూరం కాబోతున్నారన్న మాట ఆయన అభిమానులను ఎంతో బాధిస్తోంది. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలా విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.

యువన్‌ శంకర్‌ రాజా సంగీతంలో..
ఈ చిత్రంలో విజయ్‌ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇకపోతే యువన్‌ శంకర్‌రాజా చాలా కాలం క్రితం విజయ్‌ హీరోగా నటించిన పుదియ గీతై చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం చిత్రానికి సంగీతాన్ని అందించడం విశేషం. ఇకపోతే విజయ్‌లో మంచి గాయకుడు ఉన్నాడన్న విషయం తెలిసిందే.

మరోసారి పాట పాడనున్న విజయ్‌
పలు సినిమాల్లో ఆయన పాటలు పాడుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్‌, హరీష్‌ జయరాజ్‌, అనిరుధ్‌ వంటి ప్రముఖ సంగీత దర్శకుల మ్యూజిక్‌ డైరెక్షన్‌లో పాట పాడగా అవన్నీ ప్రేక్షకాదరణ పొందాయి కూడా! తాజాగా యువన్‌ శంకర్‌ రాజా సంగీత దర్శకత్వంలో ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం చిత్రం కోసం విజయ్‌ ఒక పాటను పాడడం విశేషం. ఈ విషయాన్ని యువన్‌ శంకర్‌రాజా ఇటీవల ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఇది విజయ్‌ అభిమానులను ఖుషీ పరిచే విషయమే అవుతుంది.

చదవండి: పెళ్లి చేసుకుని లక్షలు కాజేసింది.. ఇప్పుడు బెదిరింపులు.. మీడియాను ఆశ్రయించిన భర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement