ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్ | Sundar C reveals Khushbu asked him to marry someone else | Sakshi
Sakshi News home page

Sundar C: 'త‌న‌కు పిల్ల‌లు పుట్ట‌ర‌ని న‌న్ను వేరే పెళ్లి చేసుకోమంది'

Published Fri, May 3 2024 9:03 AM | Last Updated on Fri, May 3 2024 10:26 AM

Sundar C reveals Khushbu asked him to marry someone else

తమిళ నటుడు, నిర్మాత సుందర్ సి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన అరణ్మనై-4తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నటుడిగా స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సుందర్‌ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో తన భార్య ఖుష్బు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఖుష్బుకు పిల్లలు పుట్టరనే విషయం  తెలియడంతో తాను తీవ్ర భావోద్వేగానికి గురైందని వెల్లడించారు.

సుందర్ మాట్లాడుతూ..'ఇదంతా మా పెళ్లికి ముందు జరిగింది. అప్పుడు ఖుష్బు అనారోగ్యంతో ఉంది. తనకు పిల్లలు పుట్టరని ఒక వైద్యుడు చెప్పాడు. దీంతో నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఖుష్బు ఏడుస్తూ చెప్పింది. కానీ నేను తననే వివాహం చేసుకోవాలకున్నా. నా జీవితంలో సంతానం లేకపోయినా సరే తననే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాను. కానీ దేవుడు మమ్మల్ని మరోలా దీవించాడు. ప్రస్తుతం మాకు  అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.'  అని తెలిపారు.

సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై- 4 తెలుగులో బాక్ పేరుతో విడుదల అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా మే 3కి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఖుష్బు నిర్మించారు. ఈ చిత్రంలో యోగి బాబు, వీటీవి గణేష్, ఢిల్లీ గణేష్, కోవై సరళ కూడా నటించారు. ఈ ఫ్రాంచైజీలో మొదటి చిత్రం 2014లో విడుదల కాగా.. 2016లో పార్ట్‌-2 రిలీజైంది. 2021లో విడుదలైన మూడవ భాగం విడుదలైంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement