నా జీవితంలోకి ఒక దేవత వచ్చింది: పెళ్లిపై సిద్ధార్థ్‌ ఆసక్తికర కామెంట్స్ | Kollywood Hero Siddharth Responds On His Marriage With Aditi Rao Hydari | Sakshi
Sakshi News home page

Siddharth: మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది: ఆదితిరావుతో పెళ్లిపై సిద్ధార్థ్ రియాక్షన్‌

Published Mon, Nov 25 2024 7:28 PM | Last Updated on Mon, Nov 25 2024 7:40 PM

Kollywood Hero Siddharth Responds On His Marriage With Aditi Rao Hydari

కోలీవుడ్ హీరీ సిద్ధార్థ్‌ మరోమూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది చిన్నా మూవీతో సూపర్ హిట్‌ కొట్టిన సిద్ధార్థ్ మిస్ యూ అంటూ వచ్చేస్తున్నారు. ఈ చిత్రంలో నా సామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఈవెంట్‌లో హాజరైన సిద్ధార్థ్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆదితి రావు హైదరీతో పెళ్లి తర్వాత వస్తోన్న మీ మొదటి చిత్రం.. మీ లైఫ్‌ ఎలా ఉందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.

సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నా లైఫ్ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇలాంటి వరం దొరికినందుకు నేను చాలా గ్రేట్‌ఫుల్‌. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. అంతేకాదు నా లైఫ్‌లోకి నా దేవత వచ్చింది. 2024లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్‌ సర్‌ప్రైజ్. ఏంటి మంచి జరిగిందా? అనేది. సెకండ్‌ రిలీఫ్. హమ్మయ్య ఆ దేవుడి దయతో అంతా మంచి జరిగిందని.. ‍అలాంటి టైమ్‌లో మనం బతుకుతున్నాం కాబట్టి.. నాకైతే నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు' అంటూ తన పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు.

కాగా.. కోలీవుడ్​ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement