Khushboo
-
కండరాల ఎలర్జీతో బాధపడుతున్న కుష్బూ
సీనియర్ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు కుష్బూ ప్రస్తుతం షూటింగులతో బిజీగా ఉన్నారు. అయితే ఆమె ఎడమ చేతి కండరాలు ఎలర్జీకి గురైంది. సాధారణంగా ఇలాంటి ఎనర్జీ తీవ్ర నొప్పికి గురి చేస్తుంది. నటి కుష్బూ ఇప్పుడు నొప్పితో బాధపడుతున్నారు. క్రీడాకారులు తీవ్ర ఎక్సర్సైజులు చేయడం కారణంగా ఇలాంటి కండరాల ఎలర్జీకి గురవుతుంటారు. ఇంతకుముందు చాలా బొద్దుగా ఉండే నటి కుష్బూ కూడా కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైన విషయం తెలిసిందే. లేకపోతే ఈమె అంత నొప్పితోనూ మంగళవారం కూడా షూటింగ్లో పాల్గొన్నారు. అదేవిధంగా మరో పక్క వైద్యులు ఆమె చేతికి ఫిజియోథెరపీ వైద్యం అందిస్తున్నారు. కాగా తన చేతికి కట్టుతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆమె ఫోటోలు చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. కుష్బూ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారు. -
నాన్నతోనే లైంగిక వేధింపులు.. చెప్పుతో కొట్టేవాడు : ఖుష్భూ
ఏ బిడ్డకు అయినా తండ్రే సూపర్ హీరో. ముఖ్యంగా ఆడపిల్లలు నాన్న అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. ఎవరైనా వేధిస్తే నాన్నతో చెప్పుకోవాలనుకుంటారు. కానీ నాన్నే వేధిస్తే.. లైంగిక దాడికి పాల్పడితే?.. ఈ కష్టాలను తట్టుకొని నిలబడింది సీనియర్ నటి ఖుష్భూ(Khushboo Sundar). పలు సందర్భాల్లోనూ తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ బహిరంగంగా చెప్పింది. తాజాగా మరోసారి తన తండ్రి వల్ల ఆమె పడిన కష్టాలు, ఫ్యామిలీకి ఎదురైన సమస్యల గురించి బయటపెట్టింది. తనపై తండ్రి చేసిన లైంగిక దాడి బయటకు చెబితే ఎక్కడ ఇబ్బంది పెడతారోనని భయపడి చాలా కాలం దాచానని ఆమె చెప్పారు. కెరీర్ పరంగా బాగా సెట్ అయిన తర్వాత తండ్రిని ఎదురించానని చెప్పింది.మా నాన్నతోనే నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. నా తల్లిని, సోదరులను దారుణంగా హింసించేవాడు. బెల్టు, చెప్పులు, కర్ర.. ఇలా ఏది దొరికితే దాడితో కొట్టేవాడు. చిన్నతనంలోనే నేను ఇలాంటి వేధింపులను చూశా. నాపై జరుగుతున్న లైంగిక వేధింపులు బయటకు చెబితే ఇంకెంత హింసిస్తారోనని భయపడి చెప్పలేదు. చెన్నైకి వచ్చి, నా కాళ్లపై నేను బతకడం ప్రారంభించిన తర్వాత నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ఆ తర్వాత కూడా మా నాన్న నన్ను వేధించాడు. దీంతో నేను ఎదురు తిరిగాను .అది తట్టుకోలేక షూటింగ్ ప్రదేశానికి వచ్చి అందరి ముందు కొట్టేవాడు. ఉబిన్ అనే ఒక హెయిర్ డ్రెస్సర్ నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పింది. 14 ఏళ్ల వయసులో మా నాన్న చేసిన లైంగిక వేధింపుల గురించి బయటకు చెప్పాను. ఆ తర్వాత ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లాడు. ఆయన ఎక్కడి వెళ్లాడని కూడా మేము ఆరా తీయలేదు. ఎప్పుడు ఆయనను కలవలేదు. గతేడాది ఆయన చనిపోయాడని విషయం బంధువుల ద్వారా తెలిసింది. కానీ నేను మాత్రం ఆయనను చూసేందుకు కూడా వెళ్లలేదు’ అని ఖుష్భూ చెప్పింది. -
ఓ హీరో కమిట్మెంట్ అడిగితే.. నా చెప్పుల సైజు 41 అని చెప్పా: ఖుష్బు సుందర్
సీనియర్ నటి ఖుష్బు సుందర్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ)-2024 వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అనే సదస్సులో ఆమె పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రతపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తనకెదురైన ఓ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.ఖుష్బు సుందర్ మాట్లాడుతూ..' మహిళలపై వేధింపులు కేవలం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు. అన్ని చోట్లా ఉన్నాయి. బస్సులో, ట్రైన్లో, ఆటోల్లో కూడా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ సినిమా సెట్లో హీరో నాతో అసభ్యంగా మాట్లాడారు. మాకు ఏదైనా ఛాన్స్ ఉందా? అని నాతో అన్నాడు. అప్పుడు వెంటనే నేను నా చెప్పుల సైజు 41. షూటింగ్ సెట్లోనే అందరిముందు చెంప పగలకొట్టనా? అని వార్నింగ్ ఇచ్చా' అని అన్నారు.కాగా.. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో మహిళల వేధింపులపై మాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. హేమ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చాలామంది తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటికి చెప్పారు. పలువురు నటులపై ఫిర్యాదులు రావడంతో కేసులు కూడా నమోదయ్యాయి. -
వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి ఖుష్బూ!
సాక్షి, న్యూఢిల్లీ: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున సినీనటి ఖుష్బూ సుందర్‌ను బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోందని తెలుస్తోంది. పార్టీ తరఫున పోటీలో నిలిపే అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌లో ఖుష్బూ పేరును సైతం చేర్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీకి ఖుష్బూ అయితేనే గట్టిపోటీ ఇవ్వగలరనే భావన వ్యక్తమవుతోంది. వయనాడ్‌లో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. పార్టీ సీనియర్లయిన ఎంటీ రమేశ్, శోభా సురేంద్రన్, ఏపీ అబ్దుల్లా కుట్టి, షాన్ జార్జ్ పేర్లను బీజేపీ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ కసరత్తు కొలిక్కి వస్తున్న వేళ ఖుష్బూ పేరు తెరపైకి వచ్చింది. నిజానికి ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరి, అనంతరం 2014లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అనంతరం 2021లో కాంగ్రెస్‌ను వీడి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు యూనిట్లో భాగంగా ఉన్నారు. తమిళనాడు నేపథ్యం ఉన్న ఆమెను వయనాడ్‌లో పోటీకి నిలిపే విషయమై బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్ర శాఖ తెలిపే అభిప్రాయం మేరకు అభ్యర్థిత్వంపై పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకట్రెండు రోజుల్లోనే పార్టీ అభ్యర్థిని ప్రకటించనుంది. -
'ఈ ఊరు అమ్మాయిలు.. ఈ ఊరు అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలి'
తేజస్ కంచెర్ల, ఖుష్బూ చౌదరి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఉరుకు పటేలా'. ఈ సినిమాకు వివేక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్లో కంచెర్ల బాల భాను ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తే ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీతో పాటు ఫుల్ హారర్ కామెడీతో అదిరిపోయేలా ఉంది. దెయ్యంతో ప్రేమ ఎలా ఉంటుందో అనే కోణంలో కథను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్నారు. -
వెంకటేశ్‌తో మొదటి సినిమా.. ఖుష్బు ఎమోషనల్ పోస్ట్!
కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించింది. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో పాటు దక్షిణాదిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. ఇవాళ ఆమె నటించిన మొదటి చిత్రం కలియుగ పాండవులు రిలీజై 38 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఖుష్బు ఎమోషనల్ పోస్ట్ చేసింది.ఖుష్బు ట్వీట్లో రాస్తూ..'నా సౌత్ ఇండియా మొదటి సినిమా 14 ఆగస్టు 1986న విడుదలైంది. వెంకటేశ్ పక్కన నటించడం నా అదృష్టం.. ఇప్పటికీ ఆయన నా ఫ్రెండ్‌గా ఉన్నారు. ఈ చిత్ర యూనిట్ అంతా ఒక కుటుంబంలా నన్ను ఆదరించారు. తెలుగు ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. డి రామానాయుడు నిర్మించారు. ఖుష్బు చివరిసారిగా అరణ్మనై-4 చిత్రంలో కనిపించింది. It's been 38 years since my very first south Indian film released. #KaliyugaPandavalu released on 14th August 1986. I am eternally grateful to my dearest @VenkyMama for being the most precious co star & friend till date. @SureshProdns for treating me like a family.… pic.twitter.com/FOwH0wdrpw— KhushbuSundar (@khushsundar) August 14, 2024 -
Khushboo Gandhi: బీ గుడ్.. డూ గుడ్!
మనదేశంలో ఏడాదికి 9,400 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ కాలువలు, నదుల్లోకి చేరుతోంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాకింగ్‌కు ఉపయోగించినదే ఉంటోంది. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. ఓ చిన్న హెయిర్ ఆయిల్ బాటిల్‌ని ప్యాక్ చేయడానికి దానికంటే నాలుగురెట్లు బరువున్న ప్యాకింగ్ మెటీరియల్‌ని ఉపయోగిస్తారు. అందులో కాగితంతో చేసిన అట్టపెట్టె ఉంటుంది. బాటిల్ పగలకుండా ప్లాస్టిక్ బబుల్ రేపర్ ఉంటుంది. కాగితం ఇట్టే మట్టిలో కలిసిపోతుంది. దాంతో ఇబ్బంది ఉండదు. మరి ప్లాస్టిక్ బబుల్ ర్యాపర్ ఎన్నేళ్లకు మట్టిలో కలుస్తుంది. ‘వస్తువులు రవాణాలో పగలకుండా ఉండాలంటే బబుల్ ర్యాపర్ ప్లాస్లిక్తోనే చేయాలా? కొబ్బరిపీచుతో బబుల్ ర్యాప్ చేసాను చూడండి’ అంటూ కుషన్‌ను పోలిన కాయిర్ పౌచ్‌ను చూపించింది ఖుష్బూ గాంధీ. అలాగే కాయిర్ బోర్డ్‌లో ఒక పొరలోకి గాలిని చొప్పించి బుడగలు తెప్పించింది. ముంబయిలో పుట్టి పెరిగిన ఖుష్బూ గాంధీ నిఫ్ట్‌లో మెటీరియల్ డెవలప్మెంట్ కోర్సు చేసింది.‘గో డూ గుడ్’ స్టార్టప్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ మెటీరియల్‌ని తయారు చేస్తోంది. ప్లాస్టిక్‌కి వ్యతిరేకంగా తనదైన శైలిలో ఉద్యమిస్తోన్న ఖుష్బూ... ‘ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి’ అని మైకులో గొంతుచించుకుంటే సరిపోదు, ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం చూపిస్తే ఆటోమేటిగ్గా ప్లాస్టిక్‌ని దూరం పెట్టేస్తారు’ అంటోంది. ఇంకా...‘నా ప్రయోగాలు నాకు లాభాలను తెచ్చిపెడతాయో లేదో తెలియదు, కానీ సస్టెయినబుల్ లైఫ్ స్టయిల్ వైపు సమాజాన్ని నడిపించడంలో మాత్రం విజయవంతం అవుతాను’ అంటోంది ఖుష్బూ గాంధీ. ఎకో ఫ్రెండ్లీ సిరా!‘‘ప్లాస్టిక్ బబుల్ ర్యాపరే కాదు, పేపర్ మీద ప్రింటింగ్ కోసం ఉపయోగించే ఇంక్ కూడా అంత త్వరగా నేలలో ఇంకదు. పైగా మట్టిని కలుషితం చేస్తుంది. సీ వీడ్ (సముద్ర నాచు), నాచురల్ కలర్ పిగ్మెంట్స్తో ఇంకు తయారు చేశాం. ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్‌కు బదులు వ్యవసాయ వ్యర్థాలతో ప్లేట్లు తయారు చేస్తున్నాం. ఇక్కడ మరో విషయం చె΄్పాలి. ఒకసారి వాడిపారేసే పేపర్ ప్లేట్లు, గ్లాసులకు ల్యామినేషన్తో కోటింగ్ వేస్తుంటారు. నేను దానికి కూడా ప్రత్యామ్నాయం కనుక్కున్నాను. ఎకో ఫ్రెండ్లీ కోటింగ్ చేస్తున్నాం. ‘గో డూ గుడ్’ ద్వారా మేము పది టన్నుల ప్లాస్టిక్ వాడకాన్ని నివారించగలిగాం. అలాగే ఎకో ఫ్రెండ్లీ ఇంక్‌తో ఒకటిన్నర లక్షల ఉత్పత్తులు అక్షరాలద్దుకున్నాయి. ఏడు టన్నుల బయో డీగ్రేడబుల్ బబుల్ ర్యాపర్లను వాడుకలోకి తెచ్చాం. ఈ ప్రయత్నంలో ఐదు టన్నుల వ్యవసాయ వ్యర్థాలు వినియోగంలోకి వచ్చాయి. లధాక్‌లో ప్లాస్టిక్ వేస్ట్! నేను ఈ రంగలోకి అడుగు పెట్టడానికి కారణం పదేళ్ల కిందటి లధాక్ పర్యటన. మారుమూల ప్రదేశాలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి ఉన్నాయి. షాంపూ సాషే నుంచి లేస్ ర్యాపర్ వరకు అవీ ఇవీ అనే తేడా లేకుండా ప్రతి పదార్థమూ ప్లాస్టిక్‌లోనే ప్యాక్ అవుతోందని నాకు తెలిసిందప్పుడే. ఆ చెత్త కాలువల్లోకి చేరకుండా అంతటినీ ఒకచోట పోగు చేసి తగలబెడుతున్నారు. వాళ్లకు చేతనైన పరిష్కారం అది. ఇంతకంటే పెద్ద పరిష్కారమార్గాన్ని కనుక్కోవాలని అప్పుడు అనిపించింది. ఆ తర్వాత నేను మెటీరియల్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం స్పెయిన్కెళ్లాను. కోర్సు పూర్తయ్యేలోపు నా ఆలోచనకు ఒక స్పష్టమైస రూపం వచ్చింది. బయోడీగ్రేడబుల్ వస్తువులతో ప్లాస్టిక్‌కి సమాధానం చెప్పవచ్చనే ధైర్యం వచ్చింది. పీజీ పూర్తయి తిరిగి ఇండియాకి రాగానే మా తమ్ముడు, మా వారితో కలిసి పూణేలో నా డ్రీమ్ ్రపాజెక్ట్ ‘గో డూ గుడ్’కు శ్రీకారం చుట్టాను. ఇది విజయవంతంగా నడుస్తోంది’’ అని వివరించిందామె. ఖుష్బూ పేరుకు తగినట్లు పరిమళభరితంగా తన విజయ ప్రస్థానాన్ని రాసుకుంటోంది. మరి... మనం మన చరిత్రను ఏ సిరాతో రాసుకుందాం... మట్టిని కలుషితం చేసే ఇంకుతోనా లేక మట్టిలో కలిసిపోయే ఇంకుతోనా. మనమే నిర్ణయించుకోవాలి. -
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష కనిపంచనుంది. వీరిద్దరు గతంలో స్టాలిన్ చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ నటిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి కోసం దర్శకుడు వశిష్ట సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పినట్లు టాక్. అయితే అదే పాత్ర కోసం మరో సీనియర్ నటి ఖుష్బూని సంపద్రించగా కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో స్టాలిన్ చిత్రంలో కూడా ఖుష్బు నటించారు. మరోవైపు ఈ చిత్రంలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే నిజమైతే చిరంజీవి కెరీర్లో ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుంది. ఇందులో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. -
ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్
తమిళ నటుడు, నిర్మాత సుందర్ సి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన అరణ్మనై-4తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నటుడిగా స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సుందర్ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో తన భార్య ఖుష్బు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఖుష్బుకు పిల్లలు పుట్టరనే విషయం తెలియడంతో తాను తీవ్ర భావోద్వేగానికి గురైందని వెల్లడించారు.సుందర్ మాట్లాడుతూ..'ఇదంతా మా పెళ్లికి ముందు జరిగింది. అప్పుడు ఖుష్బు అనారోగ్యంతో ఉంది. తనకు పిల్లలు పుట్టరని ఒక వైద్యుడు చెప్పాడు. దీంతో నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఖుష్బు ఏడుస్తూ చెప్పింది. కానీ నేను తననే వివాహం చేసుకోవాలకున్నా. నా జీవితంలో సంతానం లేకపోయినా సరే తననే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాను. కానీ దేవుడు మమ్మల్ని మరోలా దీవించాడు. ప్రస్తుతం మాకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.' అని తెలిపారు.సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై- 4 తెలుగులో బాక్ పేరుతో విడుదల అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా మే 3కి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఖుష్బు నిర్మించారు. ఈ చిత్రంలో యోగి బాబు, వీటీవి గణేష్, ఢిల్లీ గణేష్, కోవై సరళ కూడా నటించారు. ఈ ఫ్రాంచైజీలో మొదటి చిత్రం 2014లో విడుదల కాగా.. 2016లో పార్ట్-2 రిలీజైంది. 2021లో విడుదలైన మూడవ భాగం విడుదలైంది. -
ఈమె స్టార్ హీరోయిన్‌కి అక్క.. ఆర్మీలో 12 ఏళ్లుగా దేశసేవ.. గుర్తుపట్టారా?
అందంగా ఉన్నోళ్లు సినిమాల్లోనే ఉంటారనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం డాక్టర్, టీచర్, హౌస్ వైఫ్, ఆర్మీ ఆఫీసర్.. ఇలా ఎక్కడో చోట సింపుల్‌గా బతికేస్తుంటారు. సోషల్ మీడియా వల్ల అనుకోకుండా అలా వైరల్ అయిపోతుంటారు. ఈమె కూడా సేమ్ అలానే. కాకపోతే ఈమెకి సినీ ఇండస్ట్రీతో సంబంధముంది. ఎందుకంటే ఈమె చెల్లెలు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ మరి. ప్రభాస్ సినిమాలోనే నటిస్తోంది. మరి ఈ అక్కచెల్లెళ్లు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ఖుష్బూ పటానీ. హా.. అవును మీరు అనుకున్నది నిజమే. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి ఓ అక్క ఉంది. ఆమె ఈమెనే. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఖుష్బూ.. బరేలీలో స్కూలింగ్ పూర్తిచేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశారు. అయితే అందరిలా ఐటీ సైడ్ కాకుండా ఆర్మీలో చేరింది. సాధారణ సోల్జర్ స్థాయి నుంచి లెఫ్ట్‌నెంట్ వరకు చేరుకున్నారు.దాదాపు 12 ఏళ్ల పాటు ఆర్మీలో దేశ సేవ చేసిన ఖుష్బూ పటానీ.. ఊహించని విధంగా గతేడాది వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే చెల్లి దిశా లానే ఈమె కూడా హెల్త్, ఫిట్నెస్ విషయంలో పక్కాగా ఉంటారు. ఎందుకంటే ఈమె సర్టిఫైడ్ న్యూట్రిషియన్ ట్రైనర్ కాబట్టి. ఇన్ స్టాలోనూ ఖుష్బూకి దాదాపు 3,80,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా తన ఆర్మీ జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈమె గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే చూడటానికి అక్కాచెల్లెళ్లు ఒకేలా కనిపిస్తున్నారు. కానీ ఒకరేమో నటి కాగా, మరొకరు మాత్రం ఆర్మీలో సేవ చేశారు.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) -
'నువ్వు ప్రపోజ్ చేసిన క్షణం.. కళ్లార్పకుండానే': సీనియర్ హీరోయిన్
సీనియర్ నటి ఖుష్బు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలతో మెప్పించింది. 1990లో సౌత్‌లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో మెప్పించింది. కాగా.. 1995లో మురై మామన్ చిత్రంలో నటిస్తుండగానే డైరెక్టర్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాద ఐదేళ్లకు మార్చి 9న 2000 ఏడాదిలో దర్శకుడు సుందర్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను పంచుకుంది. తన భర్త ప్రపోజ్ చేసిన తేదీని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆయన ప్రపోజ్ చేసిన రోజు నుంచి ఇప్పటివరకు నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని పోస్ట్ చేశారు. సోషల్ మీడియా లేని రోజుల్లో మీరు ప్రపోజ్ చేయగానే ఎలాంటి ఆలోచన లేకుండా అంగీకరించానని రాసుకొచ్చింది. 29 ఏళ్ల క్రిత నేను తీసుకున్న ఆ నిర్ణయం అత్యుత్తమమని ఖుష్బు ఎమోషనలయ్యారు. ఖుష్బు తన ట్వీట్లో రాస్తూ..'22 ఫిబ్రవరి 1995 నుంచి.. 22 ఫిబ్రవరి 2024 వరకు ఏమీ మారలేదు. కేవలం నా వయసు మాత్రమే పెరిగింది అంతే. మీలో ఉప్పు, మిరియాల సువాసన అలానే ఉంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం.. మన తప్పులను అంగీకరించడం.. ఒకరినొకరు ప్రోత్సహించడం. ఆపద సమయంలో అండగా నిలవడం. ఒకరి చేయి ఒకరం పట్టుకుని.. మన అందమైన కుటుంబాన్ని నిర్మించే మార్గంలో నడుస్తున్నాం. మీరు నాకు ప్రపోజ్ చేసి ఈ రోజుకు 29 సంవత్సరాలైంది. ఎలాంటి కెమెరాలు, ఫోటోలు, సోషల్ మీడియా లేని రోజుల్లో నీ ప్రేమను అంగీకరించా. ఒక్కసారి ఆలోచించకుండా.. కను రెప్పవేయకుండానే ఓకే చెప్పా. కొన్నిసార్లు ఉత్తమ నిర్ణయాలు గట్స్ ఫీలింగ్‌తో తీసుకోబడతాయి. ఈ రోజు మీరు అది నిరూపించారు. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. మీ ప్రపోజల్‌ను అంగీకరించడం నా జీవితంలోనే అత్యుత్తమ నిర్ణయం. నీపై 29 ఏళ్ల క్రితం మొదలైన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఖుష్బు గతేడాది తెలుగులో గోపించంద్ చిత్రం రామబాణంలో కనిపించింది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అందువల్లే సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో ఒకరైన దర్శకుడు సుందర్ తమిళంలో 32 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. అంతే కాదు 20కి పైగా సినిమాల్లో నటించారు. ఉల్లతై అల్లిత, అరుణాచలం, అన్బే శివం, విన్నర్, గిరి, కలకలప్పు, తీయ వేళై సెయ్యనుం కుమారు, అరణ్మనై, అంబాల, వంత రాజావతాన్ వరువేన్ సినిమాలు చేశారు. From then on, 22nd Feb 1995, to now, 22 Feb 2024, nothing has changed. Except that I have grown older and you have salt n pepper sauciness now. The love, respect for each other, accepting each other with our minuses, encouraging each other to give and do our best. Standing by… pic.twitter.com/j0H5DNzuXP — KhushbuSundar (@khushsundar) February 21, 2024 -
స్టార్ హీరోయిన్ కూతురి బర్త్ డే.. నటి ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ నటి ఖుష్బూ సుందర్ తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. విక్టరీ వెంకటేశ్ హీరోగానటించిన ‘కలియుగ పాండవులు’అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్ హిట్. ఆ తర్వాత తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. దాదాపు తమిళ స్టార్స్ అందరితో ఖుష్బూ కలిసి నటించారు. గతేడాది గోపిచంద్ నటించిన రామబాణం చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఖుష్బు.. చాలా అరుదుగా సినిమాల్లో కనిపిస్తున్నారు. అయితే నటుడు సుందర్‌ను పెళ్లాడిన ఖుష్బుకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. (ఇది చదవండి: నటి ఖుష్బూ కూతురును చూశారా..ఎంత అందంగా ఉందో) తాజాగా తన కూతురు బర్త్ డే సందర్భంగా ఖుష్బు ట్వీట్ చేసింది. తన చిన్నారి తల్లికి అప్పుడే 21 ఏళ్లు నిండాయా అంటూ భావాద్వేగానికి లోనైంది. నీ అందం, చిరునవ్వు చూస్తే చాలు ఎంతో ఆనందంగా ఉంటుందని రాసుకొచ్చారు. నువ్వు నా కడుపులో పెరిగిన రోజు నుంచి.. ఇప్పటివరకు నీపై ప్రేమ తగ్గలేదని ట్వీట్ చేశారు. లవ్యూ మై బొమ్మై అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఖుష్బు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తమ అభిమాన నటి కూతురు అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. My baby. My adorable little one. All of 21 today. You grew up suddenly. From a little cutie button to literally towering over me, you have not given me a single sleepless night. You have been an angle. Your smile, your eyes, your dimple, your hug, your sweet nothings, all are so… pic.twitter.com/cAU0yvqHG7 — KhushbuSundar (@khushsundar) January 25, 2024 -
స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!
ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటుడు మోహన్. 16 ఏళ్ల తర్వాత మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇస్తోన్న చిత్రం హరా. ఇంతకుముందు దాదా 87, పౌడర్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించిన విజయ్శ్రీ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కోయంబత్తూర్ ఎస్పీ.మోహన్ రాజ్‌తో కలిసి జీ.మీడియా పతాకంపై జయశ్రీ విజయ్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందే చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా.. అయితే మధ్యలో దర్శకుడు విజయ్ ప్రమాదానికి గురికావడంతో షూటింగ్ వాయిదా పడింది. తాజాగా హరా చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమై ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఒక ప్రముఖ నటి కథానాయకిగా నటించాల్సి ఉండగా కాల్షీట్స్ సమస్య కారణంగా ఈ చిత్రం నుంచి వైదొలగింది. దీంతో ఆమె ప్లేస్‌లో అయాలి నటి అనుమోల్‌ను ఎంపిక చేసినట్లు దర్శకుడు విజయ్ తెలిపారు. ఆమె అయాలి వెబ్ సిరీస్‌లో మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ఆయన 68వ చిత్రంలోనూ అనుమోల్ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. కాగా.. హరా చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఈ సినిమాలో యోగిబాబు, మొట్టై రాజేంద్రన్, సింగం పులి, దీప, మైమ్ గోపి, శ్యామ్స్, కౌశిక్, అనిత నాయర్, చారుహాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి లియాండర్ లీ మార్టీ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
‘చెప్పులతో కొట్టాలి’.. నటి, బీజేపీ నేత కుష్బూపై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, చైన్నె: సినీ నటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ సుందర్‌పై తిరునల్వేలి పోలీసు కమిషనర్‌కు పాళయం కోట్టైకు చెందిన న్యాయవాది రాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు విషయంగా అధికారులతో కమిషనర్ రాజేంద్రన్ గురువారం సమావేశమయ్యారు. గత నెల ట్విట్టర్ వేదికగా జయశంకర్, జయ నాథ్ అనే వ్యక్తులకు సమాధానం ఇచ్చే క్రమంలో కుష్బూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, గృహిణులు, మహిళలను ఉద్దేశించి ఆమె అనుచితంగా స్పందించారని ఆరోపించారు. చెప్పులతో కొట్టాలి వంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా తీవ్ర విమర్శలు చేశారని, దీనిని చూసిన తన ఇంట్లోని మహిళలే అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ట్వీట్ వేదికగా ఆమె చేయడాన్ని ఖండిస్తున్నామని, దీనిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే విషయంగా కమిషనర్ రాజేంద్రన్ అదనపు కమిషనర్ శరవణకుమార్, సతీష్‌కుమార్, అనిత నగర పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో అని పరిశీలిస్తున్నారు. -
చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్
దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన గొప్ప నటి. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు అభిమానులు ఏకంగా గుడినే నిర్మించారంటే ఖుష్బూకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకొవచ్చు. ఆమెతో కలిసి నటించేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపేవారట. (ఇది చదవండి: నా బెడ్ రూమ్‌లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్ ఉంటాయి: ఖుష్బూ) అలాగే ఖుష్బు కూడా దాదాపు అందరికి స్టార్లలతో కలిసి నటించింది. కానీ తన అభిమాన హీరోతో కలిసి రొమాన్స్ చేసే అవకాశం రాలేదని ఇప్పటికీ బాధపడుతోంది. అయితే ప్రస్తుతం ఆమె గోపీచంద్ నటించిన రామబాణంలో కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్) ఖుష్బూ.. మాట్లాడుతూ.. 'మెగాస్టార్ ఓ లెజెండ్. ఆయనకు వర్క్‌పై ప్యాషన్. ప్రతి రోజు సెట్స్‌లో కొత్తగా కనిపిస్తారు. ప్రతి రోజు ఇంకా ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. నా జీవితంలో బిగ్గెస్ట్ డ్రీమ్ చిరంజీవితో రొమాన్స్ చేయడం. ఇప్పటివరకు అది నెరవేరలేదు. స్టాలిన్‌లో మేము నటించాం. కానీ ఆయనతో ఏదైనా లవ్ స్టోరీ లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఉంది. అది నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నా. రామబాణం నిర్మాత నన్ను కలిశారు. చాలా బాగా మాట్లాడుతారు. సక్సెస్ఫుల్ నిర్మాత కూడా. రామబాణం మూవీ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రం. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి సినిమాకు రిలీజ్ అయినప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటా.' అని అన్నారు. -
జగపతిబాబు అంతకు ముందే తెలుసు.. ఆయనను చౌ మామా అని పిలుస్తా
‘‘నా కెరీర్ ప్రారంభంలో రాఘవేంద్రరావు, పి. వాసు, భారతీరాజా, బాలచందర్, జంధ్యాల, గోపాల్ రెడ్డి వంటి ఎందరో గొప్ప దర్శకులతో పని చేశాను. నా పాత్ర బాగుందన్నా, బాగా లేదన్నా ఆ క్రెడిట్ దర్శకులదే. ఎందుకంటే వారు చెప్పినట్టే నేను చేస్తాను. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం నా పనిని ప్రేమిస్తాను.. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని నటి ఖుష్బూ అన్నారు. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన ఖుష్బూ చెప్పిన విశేషాలు. ► ‘రామబాణం’ ప్రధానంగా కుటుంబ బంధాల నేపథ్యంలో ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబమంతా కలిసి ఉండాలని ఈ సినిమా చెబుతుంది. ప్రస్తుతం మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ మూవీలో నేను చేసిన భువనేశ్వరి పాత్ర మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుంది. ► మొదట్లో తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలోనే ఉండేది.. ఆ తర్వాత హైదరాబాద్‌కి తెలుగు ఇండస్ట్రీ వచ్చింది. అయితే నా కుటుంబం కోసం నేను అక్కడే ఉండిపోయాను. అప్పుడు తమిళ్లో ఎక్కువ చాన్సులు వచ్చాయి. డేట్స్ సర్దుబాటు కాక తెలుగులో ‘చంటి’ వంటి సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ బాధ ఉంది. ► గోపీచంద్‌తో మొదటిసారి ‘రామబాణం’లో నటించాను. జగపతిబాబుగారు నటుడు కాకముందు నుంచే నాకు తెలుసు. ఆయన తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్‌గారు నిర్మించిన రెండు సినిమాల్లో నేను బాలనటిగా చేశాను. జగపతిగారు మంచి మనసున్న వ్యక్తి. నేను చౌ మామా అని పిలుస్తాను. ► ప్రస్తుత కాలంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలాంటి గొప్ప నిర్మాణ సంస్థను చూడటం చాలా కష్టం. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారు సెట్స్‌కి పెద్దగా వచ్చేవారు కాదు. వారు వరుస హిట్స్ అందుకోవడం సంతోషంగా ఉంది. శ్రీవాస్‌తో మొదటిసారి పని చేస్తున్నట్లు అనిపించలేదు. తనతో పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. ► అప్పటికి, ఇప్పటికి మేకింగ్ పరంగా, నటన పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. నేనే ఇప్పటి తరం నుంచి కొన్ని నేర్చుకోవాలి. హీరోయిన్ డింపుల్ హయతి మేకప్, హెయిర్ స్టైల్ చేసుకునే విధానం నన్ను ఆకట్టుకుంది. నటనలోనూ మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు సెటిల్డ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అయితే అప్పట్లో లొకేషన్లో సరైన వసతులు లేకపోయినా ఎలా మేకప్ వేసుకోవాలి? ఎలా కాస్ట్యూమ్ మార్చుకోవాలి? అనే ట్రిక్స్ మాకు తెలిసేవి. ఈ తరానికి అలాంటివి తెలీదు. ► కెరీర్లో గ్లామర్ రోల్స్ చేశాను, డ్యాన్స్‌లు చేశా. ఇప్పుడు అవన్నీ అయిపోయాయి. ప్రేక్షకులు సినిమా చూసే కోణం కూడా మారింది. వారి మనసుల్లో స్థానం సంపాదించుకునే పాత్రలు చేయాలి. అలాంటి పాత్రనే ‘రామబాణం’లో చేశాను. తెలుగులో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్రకిప్రాధాన్యత ఉంటే నిడివి తక్కువ అయినా చేస్తాను. ప్రస్తుతం మనసుకి నచ్చిన పాత్రలే ఎంచుకుంటున్నాను.. అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నా. విజయ్ హీరోగా చేసిన ‘వారసుడు’లో నాది 18 నిమిషాల పాత్ర.. అయితే సినిమా నిడివి ఎక్కువ కావడంతో నా పాత్ర సన్నివేశాలు తొలగించారు. ► సినిమాల్లో డైరెక్టర్స్ సృష్టించిన పాత్రకి తగ్గట్లు చేయాలి. కానీ, టీవీ షోల్లో నాకు నచ్చినట్టు ఉండొచ్చు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నాను. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయాను. అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. -
గోపిచంద్‌తో శ్రీవాస్ హ్యాట్రిక్ పక్కా! ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోంది..
‘‘గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్యం, లౌక్యం’ సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాల తరహాలోనే ఫ్యామిలీ, యాక్షన్, బ్రదర్ సెంటి మెంట్ నేపథ్యంలో ‘రామబాణం’ ఉంటుంది. ఈ చిత్రంతో గోపీచంద్– శ్రీనివాస్ హ్యాట్రిక్ హిట్ కొడతారు’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా జగపతిబాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ చెప్పిన విశేషాలు. ► సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో సాఫ్ట్వేర్ రంగం నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పరిశోధన చేసి, ఫ్యాక్టరీ మోడల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. మిగతా కొత్త నిర్మాతల్లాగా ఒకట్రెండు సినిమాలు కాకుండా ఎక్కువ తీస్తున్నాం. మంచి విజయాలతో విజయవంతమైన సంస్థగా ఎదగడం హ్యాపీ. ► శ్రీవాస్ ‘రామబాణం’ కథ చెప్పినప్పుడు ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందనిపించింది. క్రియేటివ్ సైడ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.. మంచి ఔట్పుట్ తీసుకొచ్చారు. ► కాన్సెప్ట్ నచ్చితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు నిర్మిస్తున్నాం. అయితే సినిమా విజయం అనేది మన చేతుల్లో ఉండదు.. కానీ వంద శాతం మన ప్రయత్నం చేయాలి. మేం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుండటంతో విజయాల శాతం ఎక్కువగానే ఉంది. మా అబ్బాయి వ్యాపారం చూసుకుంటున్నాడు. మా అమ్మాయికి సినిమాపై ఆసక్తి ఉంది. శర్వానంద్‌తో చేస్తున్న సినిమా విషయంలో తన ప్రమేయం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, అల్లు అర్జున్.. ఇలా అందరి హీరోలతో సినిమాలు నిర్మించాలనుంది.. ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. -
8 ఏళ్లప్పుడు మా నాన్న లైంగికంగా వేధించాడు
చెన్నై/జైపూర్: నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ సంచలన విషయాలు వెల్లడించారు. ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రే తనను లైంగికంగా వేధించారని చెప్పారు! ‘మోజో స్టోరీ’ డిజిటల్ వార్తా చానల్ ఇటీవల జైపూర్‌లో నిర్వహించిన ‘వుయ్ ది విమెన్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘మా నాన్న వల్ల అమ్మ జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంది. అమ్మను, నన్ను కొట్టేవాడు. లైంగికంగా వేధించేవాడు. ఒక మగవాడిగా దాన్ని జన్మహక్కుగా భావించేవాడు. నాకు 8 ఏళ్లప్పుడే లైంగికంగా వేధించాడు. 15 ఏళ్ల వయస్సులో ఆయన్ను ఎదిరించే ధైర్యం వచ్చింది. ఆపైన ఉన్నవన్నీ తీసేసుకుని మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు’ అని గుర్తు చేసుక్నున్నారు. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైతే అది వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వెలిబుచ్చారు. -
నా కన్నతండ్రే లైంగికంగా వేధించాడు.. ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై రియాక్ట్ అయిన ఆమె చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. 'చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైతే, అది వాళ్లఅది వాళ్లను జీవితాంతం భయానికి గురి చేస్తుంది. నా కన్నతండ్రే నాపై వేధింపులకు పాల్పడ్డాడు. అప్పుడు నా వయసు కేవలం ఎనిమిదేళ్లు. నాపై జరుగుతున్న ఈ ఆకృత్యాలను బయటపెట్టేందుకు ధైర్యం ఉండేది కాదు. ఈ విషయాన్ని బయటపెడదామంటే మా అమ్మ నమ్మదేమో అని బాధపడేదాన్ని. ఎందుకంటే ఆమె భర్తే ప్రత్యేక దైవం అన్నట్లు ఉండేది. కానీ నాకు పదిహేనేళ్లు వచ్చాక ఆ బాధను భరించలేక తండ్రిని ఎదిరించాను. దీంతో ఆయన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. అప్పుడు మేం తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ధైర్యం కూడగట్టుకొని జీవితంలో పోరాడటం నేర్చుకున్నాను' అంటూ ఖుష్భూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. -
తెలంగాణలో అధికారం ఖాయం: ఖుష్బూ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయ మని సినీనటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ధీమా వ్యక్తంచేశారు. ఆవో దేఖో, సీఖో అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పకొట్టారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఖుష్బూ మాట్లాడుతూ బీజేపీని చూసి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు పెట్టారని, అవన్నీ టీఆర్ఎస్ భయాన్ని తేటతెల్లం చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఖుష్బూ కళాకారులతో కలిసి కోలాటం ఆడారు. -
కెరీర్‌ను సీరియస్‌గా తీసుకున్న ఖుష్బూ
‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. కోల్కత్తా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రంలో ఖుష్బూ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్లో ఆమె పాల్గొంటున్నారు. హీరోహీరోయిన్లు గోపీచంద్, డింపుల్ హయతి, ఖుష్బూ తదితర ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నాలుగేళ్ల క్రితం వరకూ ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తూ వచ్చారు ఖుష్బూ. అది కూడా ఎక్కువగా గెస్ట్ రోల్స్ మాత్రమే చేశారు. అయితే ఇప్పుడు కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. ఇటీవల ‘అన్నాత్తే’లో నటించారు. తాజాగా విడుదలైన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేశారామె. ఇప్పుడు గోపీచంద్ సినిమా. దీన్ని బట్టి చూస్తే ఖుష్బూ ఇక నాన్‌స్టాప్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ఇటీవల బరువు కూడా తగ్గినట్లున్నారు. -
తారలు కలిసి మెరిశారు: చాలా ఎంజాయ్ చేశాం!
తమిళసినిమా: 1980 సంవత్సరంలో ప్రముఖ కథానాయకులు, నాయకిలుగా వెలుగొందిన తారలు కొన్ని ఏళ్లుగా ఏడాదికోసారి ఒక చోట కలిసి సరదాగా గడపడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. దక్షిణాదికి చెందిన రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, నటీమణులు రాధిక శరత్‌కుమార్, సుహాసిని, అంబిక, రాధ, లిజి మొదలగు పలువురు నటీనటులు ఏడాదికి ఒకసారి ఒక ఫాంహౌస్లాంటి ప్రాంతంలో కలుసుకుని తమ అనుభవాలను, అనుభూతులను పంచుకుంటుంటారు. అదేవిధంగా ఈ వీకెండ్లో 1980లో ప్రముఖ నాయికలుగా రాణించిన నటీనటులు చెన్నైలో కలుసుకుని సరదాగా ముచ్చట్లు చెప్పుకొని పసందైన విందు ఆరగించి ఆనందంగా గడిపారు. అలా కలుసుకున్న వారిలో నటి రాధిక శరత్‌కుమార్, కుష్బూ, సుహాసిని, రాధ, అంబిక, పూర్ణిమా భాగ్యరాజ్, లిజి, నటుడు రఘు వున్నారు. ఫొటోలను నటి రాధిక శరత్‌కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ 1980లలో ప్రముఖ హీరో హీరోయిన్లుగా రాణించిన వారందరూ ఇప్పటికీ సన్నిహితంగా మెలుగుతున్నారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా తాము కలుసుకోలేకపోయామని ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుతో ఈ వీకెండ్లో మళ్లీ తామంతా కలుసుకుని గత అనుభవాలను, అనుభూతులను పంచుకుని ఆనందంగా గడిపినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ఖుష్బూ సుందర్.. ‘‘చాలా చాలా ఎంజాయ్ చేశాం. ఎంతో ఉల్లాసంగా గడిపాం’’ అని పేర్కొన్నారు. -
ఎట్టకేలకు ఖుష్బూకు ఛాన్స్: థౌజండ్ లైట్స్ నుంచి..
సాక్షి, చెన్నై: గతంలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డ సినీ నటి ఖుష్బూకు ఈసారి బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇటీవల బీజేపీలోకి చేరిన ఆమె చేపాక్కం–ట్రిప్లికేన్ నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా ఆ స్థానం అన్నాడీఎంకేకు వెళ్లింది. దీంతో ఆ నియోజకవర్గానికి పక్కనే ఉన్న థౌజండ్ లైట్స్ సీటును బీజేపీ ఖుష్బూకు ఖరారు చేసింది. అలాగే ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఎల్మురుగన్ తారాపురంలో, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ సినీ నటుడు కమల్ హాసన్ బరిలో ఉన్న కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక డీఎంకే నుంచి సీటు ఆశించి భంగపడ్డ మదురై జిల్లా తిరుప్పరగుండ్రం డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే శరవణన్ ఆదివారం బీజేపీలో చేరారు. ఆయనకు మదురై ఉత్తరం సీటును బీజేపీ కేటాయించింది. డీఎంకే నుంచి బీజేపీలో చేరిన రెండో ఎమ్మెల్యేగా శరవణన్ నిలిచారు. మిత్రపక్షం బీజేపీకి అన్నాడీఎంకే కన్యాకుమారి లోక్‌సభ స్థానంతో పాటు 20 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. చదవండి: నా కొడుకు రాజకీయాల్లోకి రాడు: కనిమొళి -
బీజేపీ వ్యూహం: ఎన్నికల బరిలో కేంద్ర మంత్రి.. ఎంపీలు..
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రిని, ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలోకి దింపింది. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా నలుగురు ఎంపీలను పశ్చిమబెంగాల్లో, ఇద్దరు ఎంపీలను, మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను కేరళలో, ప్రముఖ సినీ నటి, పార్టీ జాతీయ ఆఫీస్‌బేరర్ ఖుష్బూను తమిళనాడులో పోటీలో నిలిపింది. పార్టీ ప్రదాన కార్యదర్శి అరుణ్‌సింగ్, బాబుల్ సుప్రియో, మరో కేంద్ర మంత్రి దేబశ్రీ చౌధురి ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. పశ్చిమబెంగాల్‌కు సంబంధించి 63 మందితో, తమిళనాడు, అస్సాంల్లో 17 మంది చొప్పున, కేరళలో 112 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. కేరళలోని మొత్తం 140 స్థానాల్లో 115 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో మిత్ర పక్షాలు పోటీ చేస్తాయని అరుణ్ సింగ్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్లో టాలీగుంగే నుంచి బాబుల్‌సుప్రియో, దిన్హట నుంచి ఎంపీ నిశిత్ ప్రామాణిక్, చుంచురా స్థానం నుంచి ఎంపీ లాకెట్ చటర్జీలను, తారకేశ్వర్ స్థానం నుంచి రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్ గుప్తాను బరిలో దింపారు. మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరికి అలీపుర్దౌర్ స్థానం కేటాయించారు. లాహిరి 2017 నుంచి 2020 వరకు ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. టికెట్ నిరాకరించడంతో తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు రవీంద్రనాథ్ భట్టాచార్యకు సింగూరు నుంచి అవకాశం కల్పించారు. సినీతారల్లో తనుశ్రీ చక్రవర్తి(శ్యాంపూర్), పాయల్ సర్కార్(బెహల పుర్బ), యశ్‌దాస్ గుప్తా(చండితల)లకు టికెట్లు ఇచ్చారు. అశోక్ లాహిరి, స్వపన్‌దాస్ గుప్తాలకు అవకాశం కల్పించడం ద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమకు దూరంగా ఉన్న రాష్ట్రంలోని మేధావి వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించింది. కేరళలో ఇటీవలే బీజేపీలో చేరిన మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్‌ను పాలక్కాడ్ నుంచి, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ కేజే ఆల్ఫోన్స్‌ను కంజీరప్పల్లి నుంచి, రాజ్యసభ ఎంపీ, నటుడు సురేశ్ గోపీని త్రిస్సూర్ నుంచి, మరో నటుడు కృష్ణ కుమార్‌ను తూర్పు తిరువనంతపురం నుంచి బీజేపీ పోటీలో నిలిపింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా ఉద్యమించిన కే సురేంద్రన్ కొన్ని, మంజేశ్వర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. సీనియర్ నేత పద్మనాభన్‌కు ముఖ్యమంత్రి విజయన్ పోటీలో ఉన్న ధర్మడం స్థానాన్ని బీజేపీ కేటాయించింది. అస్సాంలో బాఘ్బర్ సీటు నుంచి హసీనారా ఖాతూన్, హాజో స్థానం నుంచి సుమన్ హరిప్రియ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మార్చ్ 27 నుంచి 8 దశల్లో పశ్చిమబెంగాల్లో, మూడు దశల్లో అస్సాంలో, ఒకే దశలో ఏప్రిల్ 6న కేరళ, తమిళనాడుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: అక్కడ మాత్రమే బీజేపీ గెలుస్తుంది: శరద్ పవర్ -
అన్నయ్య రెడీ
‘అన్నాత్తే’ తిరిగి షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నాడు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అన్నాత్తే’. పెద్దన్నయ్య అని అర్థం. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తీ సురేష్, నయనతార నటిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. కానీ చిత్రబృందంలో కొందరు కరోనా బారిన పడటంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి దర్శకుడు శివ సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్లో స్వల్ప అస్వస్థతకు గురయ్యాక, విశ్రాంతిలో ఉన్న రజనీ షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అయ్యారట. మార్చి 15న చిత్రీకరణ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్లోనే రజనీకాంత్ కూడా పాల్గొంటారట. ఇప్పటికే షూటింగ్ బాగా ఆలస్యమైందని...ఆర్టిస్టుల కాల్షీట్స్ ఇబ్బంది లేకుండా సినిమా షూటింగ్‌ను తొందరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట శివ. నవంబరు 4న ‘అన్నాత్తే’ విడుదల కానుంది. -
‘నివర్’ ముప్పు : కుష్బూ, ప్రకాశ్ రాజ్ స్పందన
సాక్షి, చెన్నై: తీవ్ర తుపానుగా ముంచుకొస్తున్న ‘నివర్’పై నటి,ఇటీవల బీజేపీలో చేరిన కుష్పూ స్పందించారు. రానున్న విపత్కర పరిస్థితి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె ట్వీటర్లో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే కరోనా భయపెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తుపానుదూసుకు వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసంవత్సరం తమిళనాడును తుపాను ముంచెత్తి భారీ నష్టాన్ని మిగులుస్తోంది.ఎవ్వరు కూడా బయటకు వెళ్లకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పుడు నివర్ తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే బలమైన గాలులు వీస్తున్నాయి. వర్షాలు పడుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లన్నీ మూసుకుపోయాయని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. దయచేసి చెన్నై, పాండిచ్చేరి తదితర ప్రాంతంలో ప్రజలకోసం అందరం ప్రార్ధిద్దాం అని కుష్పూ భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు నటుడు ప్రకాశ్ రాజ్ తుపాను బాధితుల సహాయ కార్యక్రమాల్లో మునిగిపోయారు. స్థానిక యువకుల సాయంతో, ప్రకాశ్ రాజ్‌ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగారు. కోవలం ప్రాంతంలో సుందర్ నేతృత్వంలోని స్కోప్‌ఎంటర్‌ప్రైజ్ ద్వారా కార్యక్రమాన్ని చేపట్టామంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. కాగా 2020 ఏడాదిలో ప్రజలం కరోనా మహమ్మారితో అతలాకుతలమయ్యారు. లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆర్థికంగా తీవ్ర సంక్షోభం పట్టి పీడిస్తోంది. దీనికి తోడు ప్రకృతి ప్రకోపంతో మరో ముప్పు పొంచివుంది. తీవ్రమైన తుపానుగా మారిన ‘నివర్’ తమిళనాడు వైపుకు దూసుకు వస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యల్ని మొదలు పెట్టింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. #CycloneNivar #hindi pic.twitter.com/pwX9dWs32V — KhushbuSundar ❤️ (@khushsundar) November 25, 2020 #NivarCylone as the cyclone is about to strike ..we are on the field ...empowering the local team of youngsters #scopeenterprise led by Sundar in my neighbourhood #kovalam .. a #prakashrajfoundation initiative.. blessed to be able to cherish the joy of “giving back to life “ 🙏🏻🙏🏻 pic.twitter.com/dNRaI5I4EL — Prakash Raj (@prakashraaj) November 25, 2020 -
కాంగ్రాస్ పార్టీకి కుష్బూ రాజీనామా
-
సందిగ్ధంలో కుష్బూ..
సాక్షి, చెన్నై: బీజేపీ జాతీయ కార్యవర్గంలో తమిళనాడు నేతలకు చోటు దక్కలేదు. ఇది ఆ పార్టీ వర్గాల్ని షాక్‌కు గురి చేసింది. రాజాను సైతం పక్కన పెట్టడంతో చర్చ మొదలైంది. ఇక, బీజేపీలోకి నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బూ చేరబోతున్నట్టు ప్రచారం జోరందుకుంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తున్న నేతలెందరో రాష్ట్ర బీజేపీలో ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా పొన్ రాధాకృష్ణన్‌కు మంత్రి వర్గంలో చోటు గ్యారంటీ. అయితే, ఈ సారి ఆయన కన్యాకుమారి నుంచి ఓటమి చవిచూడడంతో అది చేజారింది. పార్టీపరంగా బీజేపీ జాతీయ కమిటీలో రాష్ట్రానికి చెందిన సీనియర్లకు అవకాశాలు ఏళ్ల తరబడి ఇవ్వడం జరుగుతోంది. అయితే, ఈ సారి అది కూడా చేజారింది. ఇప్పటికే రాష్ట్ర కమిటీలో సీనియర్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పక్కన పెట్టారని చెప్పవచ్చు. ఇందుకు కారణం, కొత్త రక్తాన్ని నింపే దిశగా రాష్ట్ర కమిటీని ఎంపిక చేసి కొలువుదీర్చి ఉండడమే. రాష్ట్ర కమిటీలో చోటుదక్కని నేతలు జాతీయ కమిటీ పదవుల ఆశల పల్లకిలో ఉన్నా, ప్రస్తుతం అక్కడ కూడా అవకాశం దక్కలేదు. రాష్ట్ర బీజేపీలో పొన్ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్, ఇలగణేషన్, హెచ్ రాజా వంటి నేతలు ఉన్నా, ఏ ఒక్కరికి ఈ సారి అవకాశం దక్కలేదు. రాజానూ పక్కన పెట్టారు.. వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరుగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా రాష్ట్రంలో ఉన్నారు. ఆరేళ్లుగా జాతీయ కార్యదర్శి పదవిలో ఉన్న ఆయన్ను కూడా పక్కన పెట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా ఎనిమిదేళ్లు ఉన్న మురళీ ధర్‌రావుకు సైతం చోటు దక్కలేదు. దీంతో రాష్ట్ర బీజేపీ సీనియర్లను షాక్‌కు గురి చేసింది. అయితే రాష్ట్రంలో ఒక్క లోక్‌సభ, అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలిపించుకోలేని పరిస్థితుల్లో ఇక్కడి నేతలు ఉండబట్టే, ఈసారి వారికి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని నడ్డా తీసుకున్నట్టు సమాచారం. దీంతో 2021 ఎన్నికల్లో అసెంబ్లీల్లో అడుగుపెట్టడం లక్ష్యంగా నేతలు వ్యూహాలు, పరుగులకు సిద్ధమవుతుండడం గమనార్హం. అక్టోబరు నుంచి ‘వెట్రివెల్’(విజయం సాధిద్దాం) నినాదంతో రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. (శశికళను ఎదుర్కొనేందుకు సిద్ధం) కుష్బూకు గాలమా.. కుష్బూ బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జోరందుకుంది. ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలు కుష్బూను సందిగ్ధంలో పడేసినట్టు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీలోకి కుష్బూ వస్తే బలం మరింత పెరుగుతుందన్న చర్చ సాగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే కుష్బూ అడుగులు వేస్తున్నారా అనే సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు కారణం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్, కుష్బూ భర్త, నటుడు, దర్శకుడు సుందర్ సి భేటీ కావడమే. ఈ భేటీతో కుష్బూ బీజేపీలోకి చేరబోతున్న ప్రచారం జోరందుకుంది. అయితే, ఎల్ మురుగన్, సుందర్ సి భేటీ యాదృచ్ఛికంగా జరిగినట్టు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఓ మిత్రుడి ఇంట్లో సుందర్ సి ఉండగా, అక్కడికి మురుగన్ వచ్చారేగానీ, ఈ పలకరింపు మర్యాదపూర్వకం అని పేర్కొనడం గమనార్హం. -
రజనీ వర్సెస్ జాకీ
రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారనే విషయం ఇప్పటివరకూ ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తారని తెలిసింది. ఈ ఫ్యామిలీ డ్రామాలో జాకీతో తలపడనున్నారట రజనీకాంత్. ఈ ఏడాది చివర్లో చెన్నైలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అని చిత్రబృందం తెలిపింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించడం లేదు. -
అప్పుడు అక్క.. ఇప్పుడు చెల్లి
చిరంజీవి హీరోగా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖుష్బూ నటించనున్నారని తెలిసింది. ‘లూసిఫర్’లో చెల్లెలి పాత్ర కీలకమైనది. ఈ పాత్రకే ఖుష్బూని తీసుకున్నారట. 2006లో విడుదలైన ‘స్టాలిన్’ చిత్రంలో చిరంజీవికి అక్కగా నటించారు ఖుష్బూ. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత ‘లూసిఫర్’ చిత్రంలో ఆయనకు చెల్లెలు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘సాహో’ ఫేం సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు ‘లూసిఫర్’ కథలో పలు మార్పులు చేర్పులు చేశారట. మరోవైపు తమిళంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా అంగీకరించారు ఖుష్బూ. ప్రస్తుతానికి సూపర్ స్టార్ రజనీ పాత్రకు సంబంధించినవి కాకుండా ఇతర పాత్రధారులతో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా, మీనా కీలక పాత్ర చేస్తున్నారు. -
బయటపెట్టండి.. బయటపడండి!
శ్రుతిహాసన్‌లో ఏదో కోల్పోయిన భావన ఇలియానా వారం రోజులు బయటకు రాలేదు దీపికా పదుకోన్ అంతకు ముందులా చలాకీగా లేదు పరిణీతీ చోప్రా వారాల తరబడి బయటకు రాలేదు పాయల్ ఘోష్ పరిస్థితీ ఇంతే సీనియర్ నటి ఖుష్బూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కారణం... డిప్రెషన్ మన తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నది డిప్రెషన్ వల్లే... నాలుగు రోజుల క్రితం హిందీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్శ్రుతీహాసన్ ఆత్మహత్యకు కారణం ఇదే.. ఇప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఒకటే మాట.. మనసులో బాధ ఉంటే ఆ బాధను బయటపెట్టండి.. డిప్రెషన్ నుంచి బయటపడండి.. శ్రుతీహాసన్, ఇలియానా, దీపికా, పరిణీతి, పాయల్, ఖుష్బూ డిప్రెషన్‌ను తరిమికొట్టారు. ఇప్పుడు హాయిగా ఉన్నారు. ఈ ఆరుగురు నాయికలూ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం. వాళ్లకంటే బలమైనదాన్ని ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు ఖుష్బూ. కథానాయికగా తెలుగు, తమిళ్, ఇతర భాషల్లో ఓ వెలుగు వెలిగారు. డబ్బు, పేరు రెండూ ఉన్నాయి. కానీ ఖుష్బూని ఏదో సమస్య డిప్రెషన్లోకి నెట్టేసింది. ఆమెకు ఇక జీవితం ఆగిపోయిందనిపించింది. ‘‘జీవితం చాలా చీకటిగా అనిపించింది. సమస్యలను చూడ్డానికి భయపడి నా కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా నాకనిపించింది. అన్ని బాధలూ మరచిపోయి నిద్రపోవాలనుకుంటే నా మానసిక స్థితి నన్ను నిద్రపోనివ్వలేదు’’ అని గతాన్ని తలుచుకున్నారు ఖుష్బూ. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. అయితే తను పడిపోతే చూడాలనుకునేవారిని జయించాలనే పట్టుదల ఆమెను బతికించింది. ‘‘నా మనసుని బాధపెట్టి, నన్ను భయపెట్టి, నన్ను చీకట్లోకి నెట్టాలనుకున్నవాళ్ల కోసం నా అమూల్యమైన జీవితాన్ని ఎందుకు వదలుకోవాలి అనుకున్నాను. వాళ్లకంటే బలమైనదాన్ని అని నిరూపించుకోవాలనుకున్నాను. నా స్నేహితుల సహాయంతో డిప్రెషన్ నుంచి బయటపడ్డాను’’ అన్నారు ఖుష్బూ. ‘‘ఎవరి జీవితమూ సాఫీగా సాగదు, సమస్యలకు పారిపోకూడదు. మనల్ని ఏ సమస్యా ఏమీ చేయలేనంత బలంగా తయారవ్వాలి’’ అని సలహా ఇచ్చారు ఖుష్బూ. ప్రతి సెకనూ నరకమే ‘ఓం శాంతి ఓం’ అంటూ బాలీవుడ్లో తన కెరీర్‌ని చాలా ప్రశాంతంగా మొదలుపెట్టారు దీపికా పదుకోన్. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయ్యారు. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో కూడా పడ్డారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చోవడమే ఆలస్యం అనే సమయంలో ఇద్దరూ విడిపోయారు. తన డిప్రెషన్‌కి ఇదే కారణం అని చెప్పలేదు కానీ ఆ తర్వాత దీపికా మానసికంగా కుంగిపోయారు. ‘‘ఆ సమయంలో ప్రతి సెకను నాకు నరకంలా అనిపించేది. దేని మీదా ఆసక్తి ఉండేది కాదు. కొన్ని రోజులు ఇదే పరిస్థితి. వన్ ఫైన్ డే బతకడం అంటే ఇలా కాదు అనిపించింది. మా అమ్మానాన్నతో మనసు విప్పి మాట్లాడాను. డాక్టర్ని సంప్రదించాను. నా మానసిక ఒత్తిడినంతా పోగొట్టేసుకున్నాను. మన బాధను బయటకు చెప్పాలి. అప్పుడే దాన్ని దూరం చేయగలుగుతాం’’ అన్నారు దీపికా. అంతే కాదు.. ఇలా డిప్రెషన్‌తో బాధపడుతున్నవారి కోసం ఓ సంస్థ కూడా నడుపుతున్నారామె. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దీపికా తన ట్వీటర్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఆత్మహత్య పరిష్కారం కాదు. మెంటల్ హెల్త్ గురించి ఇవాళ చాలామంది బయటకు వచ్చి మాట్లాడటం అభినందనీయం. డిప్రెషన్లో ఉన్నవాళ్లు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరి కాదు. మీతో పాటు అందరూ ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యం నమ్మకం’’ అన్నారు. ఐదేళ్లుగా మానసిక ఒత్తిడి ‘‘నేను ఐదేళ్లుగా మానసిక వేదనతో బాధపడుతున్నా’’ అని ఇటీవల పాయల్ ఘోష్ తన ట్వీటర్లో పేర్కొన్నారు. తెలుగు చిత్రాలు ‘ప్రయాణం’, ‘ఊసరవెళ్లి’, ‘మిస్టర్ రాస్కెల్’లో నటించిన ఆమె తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. కెరీర్‌పరమైన కారణాలే పాయల్ మానసిక ఒత్తిడికి కారణం అని తెలుస్తోంది. ‘‘నేను ఐదేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నా. ఒక్కోరోజు బాగా బాధపడేదాన్ని. ఆ సమయంలో ఆత్మహత్య బెటర్ అనిపించేది. మందులు తీసుకుంటున్నా. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలబడుతున్నారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడితే మంచిది’’ అన్నారు పాయల్. అయితే ఏంటి? గోవా బ్యూటీ ఇలియానా నాలుగైదేళ్ల క్రితం వరకూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. బాలీవుడ్ కాలింగ్ అంటూ అక్కడికెళ్లారు. అయితే ఇక్కడ చేసినన్ని సినిమాలు చేయలేకపోతున్నారు. కానీ ఇలియానాకి అదేం పెద్ద సమస్య కాదు. తన శరీరాకృతిని విమర్శించారు. అది ఇలియానాని మానసికంగా కుంగదీసింది. ఓ వారం అంతా ఇంట్లోనే ఉండిపోయారు. ఆత్మహత్య చేసుకుంటే? అనే ఆలోచన మొదలైంది. ఈ ఆలోచన ప్రమాదం అని గ్రహించి, తన స్థితి గురించి ఎవరో ఒకరికి చెప్పుకోవాలనుకున్నారు. ఆ టైమ్‌లోనే డాక్టర్ని కలిశారు. ‘ఇలా జరిగిపోతుందేమో’ అని భయపడేకంటే ‘అయితే ఏంటి?’ అనే భావన పెంచుకోవాలని ఆ డాక్టర్ చెప్పిన సలహా ఇలియానాకి బాగా నచ్చింది. ‘‘ఈ ప్రపంచంలో ఏ ఒక్కరినీ మన లుక్స్‌తో కానీ ప్రవర్తనతో కానీ సంతృప్తిపరచలేం. అందుకే మనం మనలా ఉండటం అలవాటు చేసుకోవాలి. నేను నా కోసం బతుకుతున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. ఎవరో ఏదో అన్నారని మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు’’ అంటున్నారు ఇలియానా. మూడేళ్ల మానసిక ఒత్తిడి చిన్నప్పుడు, సినిమాల్లోకి వచ్చాక శ్రుతీహాసన్ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురయ్యారట. అయితే గడచిన మూడేళ్లల్లో ఆమె మానసికంగా చాలా కుంగిపోయారు. ‘‘నా ఒత్తిడి గురించి బయటకు చెప్పడానికి సిగ్గు అనిపించింది. కానీ చెప్పకపోతే ఇవాళ ఇంత హాయిగా ఉండగలిగేదాన్ని కాదు. నా సమస్య చెప్పుకుని మానసిక చికిత్స పొందుతున్నాను. అలా ఒత్తిడి నుంచి దూరం కాగలిగాను. ధ్యానం, యోగా వంటి వాటితో మానసిక ప్రశాంతత లభిస్తోంది. ‘మెంటల్ ఇల్నెస్’ అనేది బయటకు చెప్పకూడనిది కాదు. చెబితేనే దూరం అవుతుంది’’ అన్నారు శ్రుతీహాసన్. రోజుకి పదిసార్లు ఏడ్చాను మరో భామ పరిణీతీ చోప్రా గురించి చెప్పాలంటే.. 2014–2015 మధ్యకాలంలో పరిణీతి కెరీర్ ఏం బాగాలేదు. ‘దావత్–ఎ–ఇష్క్’, ‘కిల్ దిల్’.. ఇలా వరుసగా ఆమె నటించిన సినిమాలు పరాజయంపాలయ్యాయి. సక్సెస్‌లో ఉన్నవారి డోర్ ముందుకు డేట్స్ లేవన్నా అవకాశాలు వస్తాయి. ఫ్లాప్‌లో ఉన్నవారికి ఆ చాన్స్ ఉండదు. అలా పరిణీతికి అవకాశాలు తగ్గాయి. సరిగ్గా అప్పుడే ఓ పెద్ద సంస్థలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం, ఇల్లు కొనడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు. ఖర్చులకు కూడా డబ్బులు ఉండేవి కాదు. ‘‘అప్పుడు వారాల తరబడి ఇంటి నుంచి బయటకు రాలేదు. రోజుకి కనీసం పదిసార్లయినా ఏడ్చేదాన్ని. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు’’ అన్నారు పరిణీతి చోప్రా. అయితే తన సోదరుడు, స్టయిలిస్ట్ సహాయంతో ఆమె డిప్రెషన్ నుంచి బయటపడగలిగారు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్ని దగ్గరివాళ్లతో పంచుకోవాలంటున్నారు పరిణీతి. -
చికుబుకు చికుబుకు రైలే
హైదరాబాద్‌లోని ఓ రైల్వేస్టేషన్‌కు రాబోతున్నారు రజనీకాంత్. కానీ ఇది నిజమైన రైల్వేస్టేషన్ కాదండోయ్. సినిమా కోసం వేసిన సెట్ రైల్వేస్టేషన్ . రజనీకాంత్ హీరోగా శివ ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తు న్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరగనున్నట్లు సమాచారం. ట్రైన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ప్రకాష్‌రాజ్, సూరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. -
లుక్ లీక్
శివ దర్శకత్వంలో ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్. ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. పంచె కట్టు, మెలి తిప్పిన మీసాలతో కనిపిస్తున్నారు రజనీ. లుక్ అదిరిందంటున్నారు ఫ్యాన్స్. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
స్పెషల్ 2020
సిద్ధార్థ్‌కి ఈ ఏడాది స్పెషల్‌గా ఉండబోతోందని కోలీవుడ్ టాక్. తమిళ సూపర్‌స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాల్లో సిద్ధార్థ్ కీలక పాత్రలు చేయడమే అందుకు కారణం. ఇప్పటికే కమల్‌హాసన్–శంకర్ ‘ఇండియన్ 2’లో సిద్దార్థ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా రజనీకాంత్–శివ సినిమాలో ఓ పాత్ర కోసం సిద్ధార్థ్‌ను సంప్రదించారట. ఈ సినిమాలో మీనా, ఖుష్భూ, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రజనీకాంత్ కుమార్తెగా కీర్తీ సురేశ్ కనిపిస్తారు. కీర్తీకి జోడీగా సిద్ధార్థ్ పాత్ర ఉండబోతోందట. ఒకేసారి రజనీ, కమల్ సినిమాల్లో కీలక పాత్ర చేయడం అంటే సిద్ధార్థ్‌కి ఈ 2020 స్పెషల్ ఇయర్ అనే చెప్పొచ్చు. -
రజనీ కూతురు?
రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారని తెలిసింది. శనివారం ఖుష్బూ ఈ సినిమా సెట్లో జాయినయ్యారు. దాదాపు 28ఏళ్ల తర్వాత రజనీ–ఖుష్బూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ సినిమాలో రజనీ కూతురి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారని, ఆల్రెడీ ఆమె షూటింగ్లో పాల్గొంటున్నారన్నది తాజా సమాచారం. అలాగే ఈ సినిమాలో రజనీ రెండు పాత్రలు చేస్తున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ప్రకాష్‌రాజ్, సూరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. -
‘కవిత బతుకమ్మ చీర కడుతుందా..?’
సాక్షి, ఆదిలాబాద్ : డబుల్ బెడ్రూం పేరిట ప్రజలను మోసం చేసిన కేసీఆర్ తన కోసం మాత్రం బుల్లెట్ ప్రూఫ్ ఇళ్లు కట్టుకున్నారంటూ కాంగ్రెస్ నేత, సిని నటి ఖుష్బు ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఖుష్బు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ మండి పడ్డారు. బతుకమ్మ చీరల పేరిట వందల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలకు నాసిరకం బతుకమ్మ చీరలు పంచారని విమర్శించారు. పేదలకు పంచిన బతుకమ్మ చీరలను కేసీఆర్ కూతురు కవిత కట్టుకుంటుందా అంటూ ఖుష్బు ప్రశ్నించారు. కేసీఆర్ పేదలందరికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానంటూ ప్రజలను మోసం చేశారన్నారు. కానీ ఆయన కోసం మాత్రం రూ. 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి బుల్లెట్ ప్రూఫ్ ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. ప్రజలు తనను ప్రశ్నించి, దాడులకు పాల్పడతారనే భయంతోనే కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ ఇంటిలో దాక్కున్నారని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఖుష్బు కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని.. ప్రతి సంఘానికి రూ. 10 లక్షలు వడ్డిలేని రుణం ఇస్తామని తెలిపారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలే అని.. రాష్ట్రంలో పాలన సాత్ చోర్ అనే విధంగా సాగించారంటూ ఖుష్బు విమర్శించారు. జోగురామన్న దొంగలతో జత కట్టారు : గద్దర్ ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ తిరిగిన జోగురామన్న చివరకూ దొంగలతో జత కట్టారంటూ ప్రజా యుద్ధనౌక గద్దర్ ఆరోపించారు. ఉద్యమకారులు, విద్యార్థుల వల్ల అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత వారిని ఏ మాత్ర పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా శక్తి ఏంటో కేసీఆర్‌కు ఓటు రూపంలో రుచి చూపండంటూ ప్రజలను కోరారు. ఆడపడుచు సుజాతను గెలిపించండంటూ విజ్ఞప్తి చేశారు. -
మరోసారి అత్తగా..
ఇటీవల వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో పవర్ఫుల్ అత్తగా కనిపించిన రమ్యకృష్ణ మరోసారి అత్త పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ముందుగా నదియా పాత్రలో ఖుష్భు కనిపిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా శింబు అత్త పాత్రను రమ్యకృష్ణ పోషించనున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా మేఘా ఆకాశ్, కేథరీన్ థెరీసా నటిస్తున్నారు. ఫైనల్‌గా అత్త దొరికేసింది. ఇక అత్తారింటికి దారి వెతికే పనిలో బిజీ అయ్యారు శింబు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. -
రా.. వదినా రా...
కుదురితే పిన్నిలా రా.. వీలైతే అమ్మలా రా.. లేకపోతే అక్కలా రా.. లేదా అత్తలా రా.. కానీ.. రా. తెలుగు సినిమాలో హీరోయిన్లుగా నటించిన అమ్మళ్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కుమ్ముళ్లు స్పెషల్ స్టోరీ. చెక్కుచెదరని నటన చెక్కు చెదరని అందం.. అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని గురించి అందరూ అనుకునే మాట ఇది. నటన కూడా అంతే. చెక్కు చెదరలేదు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఆమె చేసిన రాణి గౌతమి బాలశ్రీ పాత్ర అందుకు నిదర్శనం. చాలా విరామం తర్వాత తెలుగు తెరపై ఆమె కనిపించిన చిత్రం ఇది. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... 1965లో విడుదలైన ‘పాండవ వనవాసం’లో ఒక పాటకు నర్తించారామె. ఆ తర్వాత ఐదేళ్లకు ‘శ్రీకృష్ణ విజయం’లో ఓ గెస్ట్ రోల్లో కనిపించారు. 45 ఏళ్ల తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించారు. లేఖ తిరిగొచ్చింది లేఖ గుర్తుందా? అదేనండీ.. దర్శకుడు కృష్ణవంశీ ‘చంద్రలేఖ’లో లేఖ పాత్రలో చూపించిన ఇషా కొప్పీకర్ గుర్తుందా? ఆ సినిమా తర్వాత ఇషా హిందీ బాట పట్టారు. ఆల్మోస్ట్ పంతొమ్మిదేళ్ల తర్వాత ఆమె తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన సినిమా ‘కేశవ’. ‘కార్తికేయ’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారామె. శివరాజ్‌కుమార్ హీరోగా కన్నడంలో రూపొందుతున్న ‘కవచ’ చిత్రంలో నటిస్తున్నారు ఇషా. మోడ్రన్ గ్రాండ్‌మదర్ కాంచన పేరు వినగానే, ఏదో గుడిలో సేవ చేస్తున్నారట అని మాట్లాడుకున్న మాటలు గుర్తుకొస్తాయి. నిజం అది కాదు. దాదాపు 15 కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానంకు విరాళంగా ఇచ్చారామె. వెండితెర వెలుగు జిలుగులకు దూరంగా ఉంటున్న కాంచన 32ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్‌పై కనిపించడం, అది కూడా ‘అర్జున్ రెడ్డి’లాంటి బోల్డ్ మూవీలో కనిపించడం విశేషం. 1960, 70, 80లలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తిరుగు లేని నాయికగా రాణించడంతో పాటు పలు హిందీ చిత్రాలు కూడా చేశారామె. తెలుగు తెరకు దూరమైన.. ఆ మాటకొస్తే గతేడాది మలయాళంలో చేసిన ‘ఒలప్పీపీ’ మినహా 1985 తర్వాత కాంచన సినిమాలు చేయలేదు. 32 ఏళ్ల తర్వాత మోడ్రన్ గ్రాండ్మదర్గా ‘అర్జున్ రెడ్డి’లో కనిపించారు. ‘సఫరింగ్ ఈజ్ పర్సనల్ లెట్ హిమ్ సఫర్..’ అని 77 ఏళ్ల కాంచన ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ ఫేమస్ అయింది. 1985లో ‘శ్రీ దత్త దర్శనం’ తర్వాత తెలుగు తెరపై ఆమె కనిపించిన చిత్రం ఇదే. జానకీ నాయకుడితో మళ్లీ... ‘ఘరానా మొగుడు’ ఫేమ్ వాణీ విశ్వనాథ్ గుర్తున్నారా? తెలుగులో దాదాపు 40 సినిమాలు చేశారు. వాటిలో ‘కొదమ సింహం’, ‘గాడ్ ఫాదర్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. పదేళ్ల తర్వాత వాణి టాలీవుడ్‌కి వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘జయ జానకి నాయక’లో జగపతిబాబు చెల్లెలిగా పవర్ఫుల్ రోల్లో కనిపించారామె. ఇక మిస్సవ్వను ఎంత ట్రెడిషనల్‌గా కనిపించగలరో అంతే గ్లామరస్‌గా కనిపించగలరు భూమిక. అందుకు ఉదాహరణ ‘ఒక్కడు’, ‘మిస్సమ్మ’. ‘ఖుషి’లో బుక్ చదివే సీన్‌ని ఎవరూ మరచిపోలేరనుకోండి. ఈ బ్యూటీ మూడేళ్ల క్రితం వచ్చిన ‘లడ్డూబాబు’లో ఓ కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. అప్పటికే భూమిక పెళ్లవడం, ఒక బాబు కూడా పుట్టడంతో సినిమాలు తగ్గించేశారు. ఇక, భూమిక సినిమాల్లో కనిపించరు అనుకుంటున్న సమయంలో మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ)తో వచ్చారు. ఈ చిత్రంలో నాని వదిన పాత్రలో భూమిక నటన సూపర్బ్. గతేడాది హిందీ చిత్రం ‘ఎం.ఎస్. ధోని’లో ధోని సిస్టర్ క్యారెక్టర్లోనూ మెరిశారు. సో.. కుర్ర హీరోలకు అక్క, వదిన అంటే భూమిక బాగుంటారని ఓ ముద్ర పడింది. అందుకు తగ్గట్టుగానే ‘సవ్యసాచి’లో నాగచైతన్యకు అక్క పాత్రకు భూమికను అడగడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక.. తెలుగు సినిమాలను మిస్సయ్యే ప్రసక్తి లేదంటున్నారు భూమిక. జయప్రదం ఫ్రమ్ సౌత్ టు నార్త్ హీరోయిన్గా సక్సెస్ అయినట్లుగానే ఫ్రమ్ తెలుగు స్టేట్ టు యూపీ పొలిటీషియన్‌గా జయప్రద సక్సెస్ అయ్యారు. ‘భూమి కోసం’తో తెలుగు తెరపై మెరిసి, ‘అంతులేని కథ’తో అంతు లేని ఫేమ్ తెచ్చేసుకున్నారు. అడవిరాముడు, సాగర సంగమం, మేఘసందేశం వంటి హిట్ మూవీస్‌తో జయప్రదంగా ఆమె కెరీర్ సాగింది. పదేళ్ల క్రితం పి. వాసు దర్శకత్వం వహించిన ‘మహారథి’లో బాలకృష్ణకు అత్తగా నటించారామె. ఆ తర్వాత మాతృభాషలో నటించలేదు. హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. మాతృభాషలో నటించడంలేదన్న కొరతను ‘శరభ’ తీర్చేసింది. ఈ చిత్రం విడుదలకు రెడీ అయింది. ఇది చేస్తున్నప్పుడే మరో తెలుగు సినిమా ‘సువర్ణ సుందరి’ కమిట్ అయ్యారామె. అన్నకు అక్క.. తమ్ముడికి పిన్ని అన్నయ్యకు అక్కగా, తమ్ముడికి పిన్నిగా నటించే చాన్స్ కొంతమంది తారలకే వస్తుంది. ఖుష్బూకి ఆ చాన్స్ వచ్చింది. పదకొండేళ్ల క్రితం ‘స్టాలిన్’లో చిరంజీవికి అక్కగా నటించారామె. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్‌కి పిన్నిగా ‘అజ్ఞాతవాసి’లో నటిస్తున్నారు. యాక్చువల్లీ తెలుగులో ఖుష్బూ కనిపించిన చివరి సినిమా రాజమౌళి ‘యమదొంగ’. అందులో మోహన్‌బాబు చేసిన యమధర్మరాజు పాత్రకు సతీమణిగా నటించారు. స్మాల్ గ్యాప్ జూనియర్ ఐశ్వర్యారాయ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో స్నేహా ఉల్లాల్‌ని చూసినప్పుడు అందరూ అలానే అన్నారు. ఆ తర్వాత కొంతకాలం తెలుగులో చురుగ్గానే సినిమాలు చేశారీ తేనెకళ్ల సుందరి. ఫోర్ ఇయర్స్ బ్యాక్ ‘అల్లరి’ నరేశ్ హీరోగా వచ్చిన ‘యాక్షన్ 3డీ’ సినిమా తర్వాత తెలుగులో స్నేహా ఉల్లాల్ నటించలేదు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడ్డానని, అందుకే కెమెరా ముందుకి రాలేకపోయానని స్నేహా ఉల్లాల్ స్వయంగా పేర్కొన్నారు. స్మాల్ గ్యాప్ తర్వాత ‘ఆయుష్మాన్ భవ’తో రీ–ఎంట్రీ షురూ అయింది. మమ్మీ ఫాలోస్ డాటర్ ఎక్కడైనా పిల్లలు అమ్మలను ఫాలో అవుతారు. మరి.. మమ్మీ ఫాలోస్ డాటర్ అన్నారేంటి అనుకుంటున్నారా? మరేం లేదు.. టూ డేస్ బ్యాక్ ‘హలో’ అన్నారు కల్యాణి ప్రియదర్శన్ డాటరాఫ్ డైరెక్టర్ ప్రియదర్శన్ అండ్ యాక్ట్రస్ లిజి. ఈ ఏడాది కూతురు తెరపైకి వస్తే.. వచ్చే ఏడాది నితిన్ సినిమాలో ‘గుర్తుందా శీతాకాలం’ (పరిశీలనలో ఉన్న టైటిల్) తల్లి పాత్రలో కనిపించనున్నారు. అన్నట్లు లిజికి ఇది మొదటి తెలుగు సినిమా కాదు. నైన్టీస్లో ‘సాక్షి, మగాడు, 20వ శతాబ్దం’ వంటి సినిమాల్లో నటించారామె. చాలా గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో చేస్తోన్న చిత్రమిది. – ముసిమి శివాంజనేయులు -
వారిద్దరూ రాజకీయాల్లోకి రావాలి
తమిళనాడు : నటులు కమలహాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని సీనియర్ నటి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకురాలు కుష్బు వ్యాఖ్యానించారు. ఆమె ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీలో తన స్థానం, తదుపరి తాను తీసుకునే నిర్ణయం వంటి పలు అంశాలపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా రజనీకాంత్, కమలహాసన్‌ల రాజకీయరంగప్రవేశం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా? అన్నది వేచి చూడాలన్నారు. నటుడు కమలహాసన్ మాత్రం రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారని, అయితే ఈ విషయమై ఆయన దృఢనిశ్చయంతో ఉన్నారా? అన్నదానిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆధారపడి ఉంటుందన్నారు. అయితే ఈ ఇద్దరికీ ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారని, మరి ఆ అభిమానం అంతా ఓట్లుగా మారుతుందా? అన్నది వేచిచూడాలన్నారు. తానైతే రజనీకాంత్, కమలహాసన్‌లను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. వారు రాజకీయాల్లోకి వస్తే మీరు వారితో చేరతారా అన్న ప్రశ్నకు.. ఎప్పటికీ తాను వారితో చేరేది లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, ఒక వేళ ఈ పార్టీని వదలాల్సి వస్తే రాజకీయాలనుంచే తప్పకుంటానని కుష్బు తెలిపారు. -
కమల్ కు ఖుష్బూ మద్ధతు
పెరంబూరు: అదే మాటమీద నిలబడండి మీకు నేను ఉన్నా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త, నటి కుష్బూ నటుడు కమలహాసన్ కు మద్దతు పలికారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని నటుడు కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి ఏడపాడి పళనిస్వామితో సహా మంత్రి జగదీశ్‌కుమార్ తదితరులు కమల్‌పై ప్రతి విమర్శల దాడికి దిగుతున్నారు. కాగా ఇదంతా ఒక కంట కనిపెడుతున్న కుష్బూ సోమవారం సోషల్ మీడియా ద్వారా కమలహాసన్ ను ఉద్దేశించి పేర్కొంటూ మీరు ఇదే మాటపై నిలబడండి. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. రాజకీయాల్లో రెక్కలు విరిగిన కొందరు మీ మీద సవారీ చేసి ప్రచారం పొందాలనుకుంటున్నారు. మీ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉండండి. మంచి మార్పు కోసం మీ పోరాటం కొనసాగాలి. మీకు నేను ఉన్నాను అంటూ మద్ధతు పలికారు. -
మామా... ఎక్కడున్నావ్!?
మామ కోసం హీరో పవన్ కల్యాణ్ వెయిటింగ్! దాంతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన్ను వెతికే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబయ్, కొచ్చిలకు మనుషుల్ని పంపించి మామ ఎక్కడ ఉన్నాడో చూడమని చెప్పారట. ఎవరీ మామ? అంటే పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమాలో ఓ క్యారెక్టర్ ఉందట! హీరోకు మామ వరసయ్యే ఆ పాత్రకు ఎవరు సూటవుతారోనని త్రివిక్రమ్ అండ్ కో తెగ వెతుకుతున్నారట. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ నటుల పేర్లను త్రివిక్రమ్‌కు కాస్టింగ్ డైరెక్టర్స్ చెబుతున్నారట. ఆయన మనసులో మాత్రం మమ్ముట్టి అయితే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం. మరి, మమ్ముట్టి ఏమంటారో!! మామ పాత్రకు ఎవరూ సెట్ కాకపోవడం వల్లే షూటింగ్‌కు చిన్న గ్యాప్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ టాక్. అన్నట్టు... ఈ సిన్మాలో ఖుష్బు పవన్‌కు అత్తగా నటిస్తున్నారనే ప్రచారం తెలిసిందే. అత్త భర్తే ఈ మామ అట! -
బీజేపీపై నటి ఆరోపణలు
టీనగర్: తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని సినీ నటి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కుష్బూ ఆరోపించారు. ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కుష్బూ మంగళవారం కలిసి మాట్లాడారు. ఈ భేటీ గురించి కుష్బూ అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి రాహుల్‌గాంధీకి వివరించానని తెలి పారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు బీజేపీతో అన్నాడీఎంకే కూటమి ఏర్పరచుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. అయితే ఇలా దొడ్డిదారిన ప్రవేశించేందుకు బీజేపీ ప్రయత్నిస్తే, అది కలగానే మిగిలిపోతుందని కచ్చితంగా చెప్పగలనన్నారు. తమిళనాట రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టేందుకు బీజేపీ పథకం రూపొందిస్తోందన్నారు. బీజేపీ కలలు ఫలించవు: దురైమురుగన్ రాష్టంలో కాలుమోపడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ పగటి కలలు ఫలించబోవని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ తెలిపారు. రాష్ట్ర రైతుల 19 డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ డీఎంకే తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతమైందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ డీఎంకేపై, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై అనుచిత ప్రకటనలు చేస్తున్నట్లు విమర్శించారు. -
హైకోర్టును ఆశ్రయించిన నటి
పెరంబూర్: విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాల్సిందిగా నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ శుక్రవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు విదేశాలకు వెళుతున్నానని మదురై బెంచ్‌కు విన్నవించుకున్నారు. తన ప్రయాణానికి అనుమతి తెలపాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లే ముందు ఏ దేశానికి వెళ్లుతున్నారు, ఎక్కడ బస చేస్తారు లాంటి వివరాలను తమకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించిండంతో ఆమె కోర్టు అనుమతి కోరారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 24 నుంచి మే నెల 14వ తేదీ వరకు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలకు విహారయాత్రకు వెళ్లనున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయస్థానం త్వరలో నిర్ణయం వెలువరించనుంది. తమిళనాడులో 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలతో కుష్బూపై ఆండిపట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో ఉన్నందున ఆమె పాస్‌పోర్టును రెన్యూవల్ చేయడానికి అధికారులు నిరాకరించారన్నారు. -
ఈసారి ఏం ప్రాజెక్ట్ బాబు?
బాబు సాఫ్ట్వేర్ ఇంజినీర్. పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆఫీసులో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్‌తో పాటు ఓ ఫ్యామిలీ ప్రాజెక్ట్‌నూ టేకప్ చేస్తాడు. బాబు మెయిన్ టార్గెట్ కూడా ఫ్యామిలీ ప్రాజెక్టే. అదేంటో ప్రేక్షకులకు తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న సినిమా మెయిన్ పాయింట్ ఇదేనట! ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో పవన్‌కల్యాణ్, ఖుష్బూ, ఇతర ముఖ్య తారాగణంపై సాఫ్ట్వేర్ ఆఫీసు నేపథ్యంలో సీన్స్ తెరకెక్కిసున్నారు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్, త్రివిక్రమ్ కలసి చేస్తున్న చిత్రమిది. అత్తారిల్లులో నదియా పవన్‌కు అత్తగా నటిస్తే... ఈ సినిమాలో ఖుష్బూ అత్త పాత్ర చేస్తున్నారు. అత్తారిల్లులో మేనత్తను తాతయ్యకు దగ్గర చేసే ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసిన హీరో పాత్రలో పవన్ కనిపించారు. ఈ సినిమాలో ఏం ప్రాజెక్ట్ టేకప్ చేశారో? ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ‘దేవుడే దిగి వస్తే’, ‘ఇంజినీర్ బాబు’ టైటిల్స్ ఈ చిత్రానికి పరిశీలనలో ఉన్నాయట! -
దక్షిణ భారతీయులంతా నల్లవారే
తరుణ్ విజయ్ నోటి దురుసు వ్యాఖ్యలు ► బీజేపీ మాజీ ఎంపీ తీరుపై నెటిజన్ల మండిపాటు ► ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్న కాంగ్రెస్, డీఎంకే న్యూఢిల్లీ: భారత్‌లో జాత్యహంకారం లేదంటూనే బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతీయులంతా నల్లవారే అంటూ వివక్షపూరితంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఇటీవల నోయిడాలో ఆఫ్రికన్లపై జరిగిన దాడికి సంబంధించి ఓ టీవీ చానెల్ లో జరిగిన చర్చలో తరుణ్ మాట్లాడుతూ.. ‘భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గం. అదే నిజమైతే దక్షిణ భారతీయులతో ఎలా కలసి ఉంటాం. అక్కడ ఎక్కువ మంది నల్ల రంగులో ఉంటారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వాసులు నల్లగా ఉంటారనీ అయినా వారితో ఉంటున్నాం. నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తాం. మా చుట్టూ నల్లజాతీయులు ఉన్నారు’అని ఆయన వ్యాఖ్యానించారు. తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ అంటే ఉత్తరాది ఒకటే అని ఆయన భావిస్తున్నారని కామెంట్లు పెట్టారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. దక్షిణ భారతీయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తన ఉద్దేశం కాదని.. కేవలం భారత్‌లో జాతివివక్ష లేదని, విభిన్న సంస్కృతులు, విభిన్న రంగుల వారు కలిసి ఉంటామని చెప్పడమేనని ట్విట్టర్లో విజయ్ పేర్కొన్నారు. ఒకవేళ తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. తరుణ్ వ్యాఖ్యలపై విమర్శలు.. విజయ్ మాటలు తమను షాక్‌కు గురిచేశాయని.. బీజేపీ వివక్షను ఇది ప్రతిబింబించిందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. దక్షిణ భారతీయులంతా నల్లగా ఉండరన్న విషయాన్ని తరుణ్ గుర్తుంచుకోవాలని డీఎంకే నేత ఇలంగోవన్ , నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బు అన్నారు. అయితే తరుణ్ విజయ్‌కు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఆయన మాటలను వక్రీకరించారని పేర్కొంది. -
మోడల్, టీవీ యాంకర్ ఆత్మహత్య
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ మోడల్ ఖుష్బూ భట్ (27) ఆత్మహత్య కలకలం రేపింది. గతంలో టీవీ యాంకర్‌గా పనిచేసిన ఖుష్బూ జోధ్‌పూర్ లోని సుకేతు టవర్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకొంది. దీంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వర్దమాన మోడల్ గా వెలుగొందుతున్న ఖుష్బూ ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. తండ్రి మనీష్ (59) అమ్మమ్మ(92)తో కలిసి వుంటున్న ఆమె ఆదివారం తండ్రితో కలిసి జోథ్‌పూర్ లోని సుకేతు టవర్ లో నివసిస్తోంది. మధ్యాహ్నభోజనం చేసిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు చెప్పారు. ప్రమాదవశాత్తు మృతి చెందినట్టుగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే కుష్బూ ఎందుకు ఆత్మహత్యకు గలకారణాలను ఆరా తీస్తున్నామని, సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదని పోలీసులు చెప్పారు. అయితే భోజనం చేసే సమయంలో తాను డయాబెటిక్ రోగినని తనకు ఎక్కువ భోజనం పెట్టకూడదని కుష్బూను కోరారని ఆమె తండ్రి చెప్పారు. దీంతో ఆమె డిప్రెషన్ కు గురైందని, వెంటనే రూమ్ లోకి వెళ్ళి తాళం వేసుకొందని తెలిపారు. సోమవారం మధ్యాహ్యం ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి పొరుగువారి సహయంతో రూమ్ తాళం పగులగొట్టించి చూడగా.. ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్టు గమనించామన్నారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆమె సోదరుడు వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అటు ఈమె మరణంపై ఇరుగుపొరుగు వారు పలు అలుమానాలను వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
విద్యా ఓకే... వెయిటింగ్లో ఖుష్బూ!
దీపికా పదుకొనె కాదు... విద్యా బాలన్‌తో సూపర్‌స్టార్ జోడీ కడుతున్నారట! మరో హీరోయిన్గా ఖుష్బూ పేరు వినిపిస్తోంది. ‘కబాలి’ తర్వాత రజనీకాంత్ హీరోగా మరో సినిమా తీయడానికి దర్శకుడు పా. రంజిత్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ముంబయ్ నేపథ్యంలో మాఫియా కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్‌కు జోడీగా దీపికా పదుకొనె నటిస్తారంటూ వచ్చిన వార్తలను దర్శకుడు ఖండించారు. మరి, రజనీకి జోడీగా ఎవరు నటిస్తారంటే? ‘‘ఓ హీరోయిన్గా విద్యా బాలన్‌ను ఎంపిక చేశారు. మరో హీరోయిన్గా ఖుష్బు నటించే ఛాన్సుంది. 90లలో స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి’’ అని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. రాజకీయాలతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఖుష్బు రీసెంట్గా రీ–ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో రాధిక, సుహాసిని, ఊర్వశి, ఆమె ముఖ్య తారలుగా ఓ సినిమా రూపొందుతోంది. తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించారు. రజనీ–రంజిత్ సినిమా ఓకే అయితే సూపర్ ఛాన్స్ వచ్చినట్లే! ‘కబాలి’లోనూ రజనీకి జోడీగా యంగ్ లుక్స్‌తో కనిపించే హీరోయిన్లను కాకుండా కాస్త ఎక్కువ వయసున్న హీరోయిన్లా కనిపించే రాధికా ఆప్టేను దర్శకుడు పా. రంజిత్ ఎంపిక చేశారు. అందులో ఆమె పాత్ర కూడా అటువంటిదే. మరి, ఇప్పుడీ సినిమాలో విద్యా బాలన్, ఖుష్బు పాత్రలు ఎలా ఉంటాయో!? రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ మేలో ప్రారంభించాలనుకుంటున్నారు. -
ఖుష్బూ పవర్ఫుల్ రీ–ఎంట్రీ !
-
పవర్ఫుల్ రీ–ఎంట్రీ!
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ‘స్టాలిన్’ చిత్రంలో చిరూకి అక్కగా నటించారు ఖుష్బూ. ఆ చిత్రం విడుదలై పదేళ్లవుతోంది. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ‘స్టాలిన్’ తర్వాత ‘యమదొంగ’లో అతిథి పాత్రలో కనిపించిన ఖుష్బూ తొమ్మిదేళ్ల తర్వాత నటించనున్న తెలుగు చిత్రం ఇది. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఓ చిత్రం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో కీలక పాత్రకి ఖుష్బూని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘అభిమానులకు శుభవార్త. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేయబోతున్నా. పవన్– త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రంలో నేనూ భాగం అయినందుకు సంతోషిస్తున్నా. త్రివిక్రమ్ అద్భుతమైన కథ సిద్ధం చేశారు. ఇందులో నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. తెలుగులో నా చివరి సినిమా చిరంజీవితో చేశా. ఇప్పుడు ఆయన తమ్ముడితో చేస్తుండటం సంతోషంగా ఉంది. ‘స్టాలిన్’ తర్వాత ‘యమదొంగ’లో నటించినా అతిథి పాత్ర కావడం.. మూడు రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొనడంతో పూర్తి స్థాయి చిత్రంగా లెక్కలోకి తీసుకోను. ఇప్పుడు అంగీకరించిన ఈ సినిమాలో నాది పెద్ద పాత్ర’’ అని చెప్పారు. -
పవన్ సినిమాలో సీనియర్ హీరోయిన్
ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ సాధించిన ఆ కాంబినేషన్లో మరో సినిమా వస్తుండటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2017 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అత్తారింటికి దారేది సినిమాలో కీలక పాత్రకు సీనియర్ నటి నదియాను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొత్త సినిమా కోసం మరో సీనియర్ నటిని తీసుకొస్తున్నాడు. గతంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన స్టాలిన్ సినిమాతో చిరుకు అక్కగా నటించిన ఖుష్బు, పవన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని ఖుష్బు స్వయంగా కన్ఫామ్ చేసింది. తన ట్విట్టర్ పేజ్‌లో త్రివిక్రమ్ పవన్‌ల సినిమాలో నటిస్తున్నట్టుగా తెలిపింది కుష్బు. OK..now 4 one mre gud news..I officially announce me dng a telugu film aftr 9 long yrs..wl b part of #Trivikram+Pawan's prestigious project😊 — khushbusundar (@khushsundar) 28 December 2016 Brilliant script by Trivikram..v.powerful character..my last telugu film was wid #MegaStarChiranjeevi n now bck wid his bro..feels gud..😊😊 — khushbusundar (@khushsundar) 28 December 2016 Takes long 4 me 2 dcd 2 do a film..n it hs tkn me 9 long yrs in telugu n 7 long yrs in tamil..hope 2 do justice n nt disappoint my fans..😊😊😘 — khushbusundar (@khushsundar) 28 December 2016 -
అన్నయ్యకు అక్కగా...మరి... తమ్ముడికి?
తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌ది కూడా అలాంటి కాంబినేషనే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు ఒకదాన్ని మించి ఒక్కటి విజయవంతమయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో సీనియర్ నటి ఖుష్బూ ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘అత్తారింటికి దారేది’లో పవన్ అత్తగా నదియాకు ఎంతటి ప్రాధాన్యం ఉన్న పాత్రను త్రివిక్రమ్ సృష్టించారో తెలిసిందే. తాజా చిత్రంలో ఖుష్బూ ఏ పాత్రలో కనిపిస్తారనే చర్చ అప్పుడే మొదలైంది. పదేళ్ల క్రితం ‘స్టాలిన్’ చిత్రంలో చిరంజీవికి అక్కగా నటించారు ఖుష్బూ. ఇప్పుడు తమ్ముడికి కూడా అక్కగా నటిస్తారా? లేక అత్తగా నటిస్తారా? వేరే ఏదైనా పాత్రలో కనిపిస్తారా? అనేది చూడాలి. -
తమిళనాడు పీసీసీ చీఫ్‌గా ఖుష్బూ
-
నేనే సిఫారసు చేశా!
చెన్నై: మైలాపూర్ అభ్యర్థిగా కరాటే త్యాగరాజన్ ఎంపికకు తానే సిఫారసు చేసినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ ట్వీట్ చేశారు. డీఎంకే నుంచి కాంగ్రెస్‌లో చేరిన సినీ నటి కుష్భుకు అధికార ప్రతినిధి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల బరిలో దిగాలని ఖుష్బూ భావించారు. కాంగ్రెస్‌కు మైలాపూర్‌ను డీఎంకే కేటాయించడంతో ఆ స్థానం నుంచి పోటీచేయాలని ఆమె భావించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం సాగింది. అయితే, ఆ స్థానం తనకే అన్న దీమాతో ఇప్పటికే ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం మద్దతు ఉన్న నాయకుడు కరాటే త్యాగరాజన్ ఉరకలు తీస్తున్నారు. అదే సమయంలో టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు సైతం పోటీ పడ్డారు. అయితే, ఆ నియోజకవర్గంలో అన్నాడిఎంకే అభ్యర్థిగా మాజీ డీజీపీ రేసులో ఉండటంతో ఆయన్ను ఢీ కొట్టేందుకు బలమైన వ్యక్తిగా కరాటే త్యాగరాజన్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఖుష్బూ ఢీలా పడ్డట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. తనపై వస్తున్న వార్తలపై ఆమె ట్విటర్ ద్వారా స్పందించారు. ఎవరెవరో ఏదెదో అంటున్నారని, తన మదిలో ఉన్నది మాత్రం ఒక్కటే ఎన్నికలకు దూరంగా ఉంటానని ఆమె పేర్కొన్నారు. మైలాపూర్ అభ్యర్థిగా కరాటే త్యాగరాజన్ పేరును సిఫారసు చేసింది తానేనని ఆమె పేర్కొనడం గమనార్హం. ఊహించి ఏదేదో చెప్పేస్తున్నారని, రాసేస్తున్నారని.. మైలాపూర్ సీటుకు కరాటే త్యాగరాజన్ అర్హుడని సీనియర్ నేత తంగబాలు వద్ద పట్టుబట్టి మరీ ఆ పేరును సిఫారసు చేసిన కమిటీలో తానూ ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఇక, తనకు సీటు రావడంతో రాయపురం కాంగ్రెస్ అభ్యర్థి రాయపురం మనో... ఖుష్బూకు కృతజ్ఞత పూర్వకంగా కలిశారు. అలాగే, తన నియోజకవర్గంలో ప్రచారం చేపట్టాలని ఖుష్బూను ఆయన కోరారు. -
ఆమెను ఎన్నికల్లో పోటీ చేయిస్తారా?
ఈవీకేఎస్ ఆకర్షణ మంత్రం ఆశావహులకు కృతజ్ఞత లేఖలు పార్టీ వర్గాలకు గెలుపు సందేశం అవకాశం ఇస్తే పోటీకి రెడీ అంటున్న కుష్భు సాక్షి, చెన్నై: పార్టీలో తనపై ఉన్న వ్యతిరేకతను చెరిపేసేందుకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ కసరత్తుల్లో పడ్డారు. ఆకర్షణ మంత్రంతో అందరి మన్ననలు అందుకునేందుకు సిద్ధం అయ్యారు. సీట్లను ఆశిస్తున్న ఆశావహులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖాస్త్రాలు సంధించే పనిలో పడ్డారు. గ్రూపులకు అతీతంగా పార్టీ వర్గాలకు గెలుపు సందేశాన్ని ఇస్తూ, అధిష్టానం పాదాల వద్ద సమర్పణ పిలుపులో పడ్డారు. తనకు అవకాశం ఇస్తే పోటీకి రెడీ అని అధికార ప్రతినిధి కుష్భు ఎన్నికల కదన రంగంలోకి దిగాలన్న ఆశాభావంతో ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రాజకీయాలే పార్టీకి గడ్డు పరిస్థితుల్ని సృష్టించాయి. రానున్న ఎన్నికల్లో తమ బలాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. తమను డీఎంకే అక్కున చేర్చుకోవడంతో కాంగ్రెస్ ఆనందానికి అవధులు లేవు. అయితే, గ్రూపు రాజకీయ సెగ మాత్రం తగ్గినట్టు లేదు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్‌కు వ్యతిరేకంగా అన్ని శక్తులు వ్యవహరిస్తుండడం, ఇది కాస్త కాంగ్రెస్ పార్టీ బలం మీద దెబ్బకు పరిణామాల్ని సృష్టిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌ను ఎందుకు అక్కున చేర్చుకున్నామా? అన్న డైలమాలో పడాల్సిన పరిస్థితి డీఎంకేకు ఏర్పడింది. ఇందుకు కారణం కాంగ్రెస్‌లోని గ్రూపులు రోజుకో హెచ్చరికలు చేస్తూ రావడమే. అందర్నీ కలుపుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితి ఈవీకేఎస్‌కు ఏర్పడి ఉన్నది. దీంతో ఆకర్షణ మంత్రంతో పార్టీ వర్గాల్ని కలుపుకుని ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ఈవీకేఎస్ కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. ఆకర్షణ మంత్రం ఎన్నికల్లో పోటీకి సీటు ఆశిస్తూ ఏడు వేల మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అన్ని గ్రూపులకు చెందిన నాయకులు, వారి మద్దతుదారులు ఉన్నారు. వీరందర్నీ ఆకర్షించడమే కాకుండా, వీరిని కలుపుకుని ముందుకు సాగేందుకు లేఖాస్త్రాలు సంధించే పనిలో ఈవీకేఎస్ నిమగ్నం అయ్యారు. సీటు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మొదలయ్యే ఈ లేఖలో పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఐక్యతా రాగాల్ని వల్లించి ఉండడం విశేషం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు సైతం సందేశాల్ని పంపించే పనిలో ఈవీకేఎస్ నిమగ్నం అయ్యారు. రాష్ర్టంలో అన్నాడీఎంకే పతనం లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల సమరంలో ‘గెలుపు’ కోసం ఐక్యతతో ముందుకు సాగుదామని, ఆ విజయాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పాదాల చెంత సమర్పిద్దామని పిలుపునిస్తున్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వాళ్లందరికీ న్యాయం జరుగుతుందని, గెలుపు కోసం శ్రమించే ప్రతి ఒక్కరిని పదవులు వరిస్తాయంటూ అందర్నీ కలుపుకునే ముందుకు సాగేందుకు విశ్వ ప్రయత్నంలో మునిగి ఉండడం గమనార్హం. ఇక, అందర్నీ కలుపుకునే పనిలో ఈవీకేఎస్ నిమగ్నం అవుతోంటే, తనకు సీటు ఇస్తే పోటీకి సై అంటూ సినీ నటి, పార్టీ అధికార ప్రతినిధి కుష్భు ముందుకు సాగుతున్నారు. సీటు ఇస్తే ఓకే డీఎంకే నుంచి బయటకు వచ్చిన కుష్భును కాంగ్రెస్‌లో అందలం ఎక్కించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశ ఆమెలో ఉన్నా, దానికి డీఎంకే వర్గాలు తొక్కేశాయి. కాంగ్రెస్‌లో ఆ ఛాన్స్ దక్కుతుందా..? అన్న ఎదురు చూపుల్లో కుష్భు ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ప్రత్యేక గ్లామర్‌గా ఉన్న కుష్భు సేవలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అవసరం. ఈ దృష్ట్యా, ఆమెను ఎన్నికల్లో పోటీకి చేయిస్తారా? లేదా, కేవలం ఎన్నికల ప్రచారానికి పరిమితం చేస్తారా? అన్న ప్రశ్న బయలు దేరి ఉన్నది. దీంతో తన మదిలో ఉన్న కోరికను ముందే పార్టీ అధిష్టానం ముందు ఉంచే పనిలో కుష్భు ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే, పోటీకి సిద్ధమని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పలువురు దరఖాస్తులు చే సి ఉన్నారని గుర్తు చేశారు. అయితే, తాను పోటీ చేయాలా..? వద్దా..? అన్న తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని పేర్కొన్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ డీఎంకే కూటమిలోకి రావాలన్న ఆశ తనకు ఉందని, ఆయన వస్తారన్న నమ్మకం కూడా ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కార్తీ చిదంబరం వ్యవహారం కేవలం రాజకీయం ఎత్తుగడ మాత్రమేనని, ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అప్రతిష్ట పాలు చేయడానికి పన్నిన కుట్రగా కుష్భు వ్యాఖ్యానించారు. -
బాలయ్య రాకపోవడంతో ఇన్కంప్లీట్గా అనిపించింది!: ఖుష్బూ
చిరంజీవి లుంగీ డ్యాన్స్ అదిరింది... వెంకటేశ్ స్టెప్పులు సింప్లీ సూపర్... మోహన్‌లాల్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది... జయసుధ, సుమలత, సుహాసిని, రాధిక, రాధ తదితర నటీమణుల హంగామాకి హద్దే లేకుండాపోయింది. ఇంతకీ ఈ సందడంతా జరిగింది ఎక్కడో తెలుసా? చెన్నయ్ మహానగరంలో. అక్కడి ఆలివ్ బీచ్‌లో గల నీనా రెడ్డి గెస్ట్ హౌస్‌లో. మొత్తం 34 మంది నటీనటుల ఆట, పాటలతో, జోక్స్‌తో, కామెడీ స్కిట్స్‌తో ఆ గెస్ట్ హౌస్ ఓ కొత్త శోభను సంతరించుకుంది. 1980లో వెండితెరను ఏలిన నాయకా నాయికలంతా ఐదేళ్లుగా ‘ఎయిటీస్ రీ యూనియన్’ పేరుతో ప్రతి ఏడాదీ కలుసుకుంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రంగానికి చెందిన తారలు కలుసుకుని పండగ చేసుకుంటారు. ఈ ఏడాదికి సంబంధించిన ఈ సెలబ్రేషన్స్ చెన్నయ్‌లో జరిగాయి. సుమన్, సీనియర్ నరేశ్, మోహన్, ప్రభు, శరత్‌కుమార్, జయరామ్, భానుచందర్, సరిత, లిజి, రేవతి, రమ్యకృష్ణ, శోభన... ఇలా పలువురు తారలు హాజరయ్యారు. కాగా, ప్రతి ఏడాదీ బాలకృష్ణ కూడా హాజరవుతుంటారని, ఈసారి షూటింగ్ కోసం బల్గేరియా వెళ్లడం వల్ల రాలేదని, దాంతో సెలబ్రేషన్స్ ఇన్కంప్లీట్గా అనిపించిందని ఖుష్బూ పేర్కొన్నారు. ఈసారి తమ పార్టీకి కొత్త అతిథులు కూడా వచ్చారని ఆమె పేర్కొన్నారు. హిందీ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ కూడా ఈ సౌత్ స్టార్స్ రీ-యూనియన్‌లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ నెలలోనే పుట్టిన రోజులు జరుపుకున్న చిరంజీవితో పాటు మరో ఆరుగురితో కేక్ కట్ చేయించారు. ఖుష్బూ, సుహాసిని, లిజీ 10 రోజుల పాటు కష్టపడి ఈ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ‘మౌలిన్ రోగ్’ అనే థీమ్‌తో జరిగిన ఈ పార్టీలో తారలందరూ రెడ్ అండ్ బీజ్ కలర్ డ్రెస్సుల్లో కళకళలాడారు. కేవలం డ్రెస్‌లు మాత్రమే కాదు.. ఆ పార్టీ కోసం వాడిన వస్తువులన్నీ దాదాపు ఎరుపురంగులో ఉండేట్లు చూసుకున్నారు. తారలందరూ తమ స్టార్ స్టేటస్‌ని పక్కన పెట్టి, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కొసమెరుపు ఏంటంటే.. ఈ పార్టీలో లుంగీ డ్యాన్స్ కోసం హీరోలు కట్టుకున్న లుంగీలను జాకీ ష్రాఫ్ తీపి గుర్తుగా ముంబయ్ తీసుకెళ్లారు. -
కాబోయే సీఎం కుష్బు
సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌లో కుష్బు సెలబ్రెటీ అయ్యారు. ఆమెకు అధికార ప్రతినిధి హోదాను ప్రకటించిన వెంటనే నాయకులు పలాన పదవికి అంటే, పలాన పదవికి ఆమె అర్హురాలు అని ఊకదంపుడు ప్రసంగాలతో పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. నిన్న మొన్నటి పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కుష్బును మంత్రిగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ సహకారంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పడ్డా కుష్బు మంత్రి కావడం తథ్యమని ప్రకటించేశారు. ఈ ప్రకటన వినడానికి బాగానే ఉన్నా, కాంగ్రెస్‌లోని గ్రూపు నేతలు మాత్రం కారాలు మిరియాలు నూరే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తిరుచ్చి వేదికగా జరిగిన నిరసన సభలో ఏకంగా అక్కడి నాయకులు కాబోయే సీఎం కుష్బు అని నినదిస్తూ, సీఎం పదవికి ఆమె అర్హు రాలిగా ప్రకటిస్తూ నినాదాలు హోరెత్తించడం గమనార్హం. భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా, ఆ చట్టాన్ని మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే సర్కారు వైఖరిని ఎండగడుతూ తిరుచ్చిలోని అన్నా విగ్రహం వేదికగా సోమవా రం సాయంత్రం నిరసన సభ జరిగింది. ఈ నిరసనకు కుష్బు నేతృత్వం వహించా రు. ఇందులో ప్రసంగించిన ఆ జిల్లా పార్టీ నాయకులు ఆరోగ్య రాజ్, వేలు స్వామి తదితరులు కుష్బును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సమయంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం మద్దతు దారులకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. అదే సమయంలో చిదంబరానికి మద్దతు గా నినాదాలు అందుకోవడం, మరి కొం దరు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో నిరసనలో గందరగోళం చోటు చేసుకుంది. ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా చిదంబరం వర్గీయులు నినాదాలు చేయడంతో తామింతే అన్నట్టుగా గ్రూపు తగదా రాజుకుంది. చివరకు పోలీ సులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమనిగింది. అనంతరం నిరసనను ఉద్దేశించి కుష్బు ప్రసంగిస్తూ, కేసుల నుంచి బయట పడేందుకే భూ సేకరణ చట్టానికి అన్నాడీఎంకే మద్దతు ప్రకటిం చిందని ఆరోపించారు. కేంద్రం తీరును ఎండగట్టే రీతిలో ఆమె వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనూ కుష్బు సీఎం అంటూ నినాదాలు మార్మోగాయి. తర్వాత మీడియా కుష్బు ను కదలించింది. తమరిని కాబోయే సీఎంగా పేర్కొంటున్నారే, ఆ పదవికీ తమరు అన్ని రకాల అర్హులుగా వ్యాఖ్యానిస్తున్నారని గుర్తు చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునేందుకు అవకాశం ఉందని, ఎవరికి వారు తమ అభిప్రాయాలతో కూడిన ప్రసంగాలు చేస్తుంటారని, వాటన్నింటినీ పరిగణించాల్సిన అవసరం లేదని ముందుకు సాగారు. కుష్బుకు హోదా: ఇన్నాళ్లు ఎలాంటి పదవి లేకుండా తన సేవల్ని పార్టీకి అందిస్తూ వచ్చిన నటి కుష్బును కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. కుష్బు వాక్ చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే ఆమెను ఏఐసీసీలో అందలం ఎక్కించేలా చేసిందని చెప్పవచ్చు. సమస్యలపై స్పందించే విధానం, సందర్భోచితంగా వ్యాఖ్యలు చేయడం, రాజకీయ అవగాహన వెరసి కుష్బుకు ఏఐసీసీలో చోటు దక్కేలా చేశాయి. ఆమెకు అధికార ప్రతినిధి హోదాను కల్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. 17 మంది ఏఐసీసీ అధికార ప్రతినిధుల జాబితాలో కుష్బుకు ఆరో స్థానం దక్కడం విశేషం. జాతీయ అధికార ప్రతినిధిగా తమిళనాడుకు చెంది న కుష్బు పేరును మంగళవారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు. కుష్బుకు పదవి దక్కడంతో పార్టీలో దూసుకెళ్లడం ఖాయం. ఆమెకు మద్దతు దారుల సంఖ్య పెరగడం ఖాయం. అదే సమయంలో కొత్త నినాదం మరింతగా ప్రచారంలోకి రానుండడం గమనార్హం. -
కుష్బుకు పదవి ఖాయం
కాంగ్రెస్‌లో అడుగు పెట్టిన కుష్బు త్వరలో మంత్రి కాబోతున్నారట. ఇదేదో సినిమా షూటింగ్ మాత్రం కాదు. ఆమెను మంత్రిగా చూడాలన్న ఆశలో రాష్ర్ట కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా అధికార పగ్గాలు చేపట్టగానే ఆమెకు కేబినెట్లో పదవి గ్యారంటీ అని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై : డీఎంకే కుటుంబ రాజకీయాల్ని తట్టుకోలేక, గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి కుష్బు ఇటీవల అడుగు పెట్టారు. ఆమె ఆ పార్టీలో సెలబ్రెటీ అయ్యారు. తమ ప్రాంతానికి కంటే తమ ప్రాంతానికి రావాలంటూ ఆమెను ఆహ్వానించి మరీ సభలను కాంగ్రెస్ వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి. పార్టీ పరంగా ఆమెను అందలం ఎక్కించేందుకు ఏఐసీసీ ఓ వైపు కసరత్తుల్లో ఉంటే, మరో వైపు ఆమెను మంత్రిగా చూడాలన్న ఆశల పల్లకిలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ ఊగిసలాడుతున్నట్టున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారం చేపడితే, కుష్బు మంత్రి కావడం తథ్యమని స్పష్టం చేస్తున్నారు. అరుంబాక్కంలో కాంగ్రెస్ నేతృత్వంలో సభ జరిగింది. ఇందులో సాగిన ఆసక్తికర ప్రసంగాలు విన్న వారిని విస్మయంలో పడేశాయి. కుష్బు తన ప్రసంగంలో అన్నాడీఎంకే సర్కారు తీరును ఎండగట్టారు. డీఎంకే హయాంలో విద్యుత్ కోతలు పెరిగాయంటూ అన్నాడీఎంకేకు అధికార పగ్గాలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో వీధి దీపాలు కూడా వెలగడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ విషయానికి వస్తే మిస్డ్ కాల్ రూపంలో రోజుకు లక్షల మందిని చేర్పించేస్తున్నామని డప్పులు వాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రోజుకు లక్షల మంది సభ్యత్వం తీసుకుంటున్నప్పుడు శ్రీరంగంలో ఐదు వేల ఓట్లే వచ్చాయి ఎందుకో? అని ప్రశ్నించారు. ప్రజల సీఎం...ప్రజల సీఎం అని డప్పులు వాయించుకున్న వాళ్లకు కనీసం సిగ్గు కూడా లేదని విమర్శించారు. ప్రజా సీఎం కామరాజర్ మాత్రమేనన్నది ప్రతి ఒక్కరూ గుర్తు ఎరగాలని హితవు పలికారు. జైలు శిక్ష పడ్డ వాళ్లను ప్రజా సీఎం .. అని సంబోధిస్తుండడం సిగ్గు చేటుగా వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తాము అధికారంలోకి రావడంలో ఎలాంటి మార్పు లేదని, తప్పకుండా వస్తామని స్పష్టం చేశారు. కుష్భు ప్రసంగం అనంతరం మైకు అందుకున్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆమెను పొగడ్తల పన్నీరులో ముంచారు. ఆమె రాకతో పార్టీలో కొత్త ఉత్సాహం ఆవహించిందన్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అన్నం తినడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని, అందుకే శ్రీరంగం ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. కేంద్రంలో, రాష్ట్రంలోని పాలకుల శకం ఇక ముగిసినట్టేన్నారు. ప్రజల్లో ఆ రెండు ప్రభుత్వాలపై వ్యతిరేకత బయలుదేరిందని పేర్కొన్నారు. కుష్బు చెబుతున్నట్టుగా 2016లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. అధికారంలోకి రాగానే, మంత్రి వర్గంలో ఆమెకు చోటు ఖాయం అని స్పష్టం చేశారు. ఆమె మంత్రి కావడంలో ఎలాంటి మార్పు లేదని, ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రసంగాల్ని ఆసక్తికరంగా నోళ్లు ఎల్లబెట్టిన కాంగ్రెస్ వర్గాలు చివరకు ఈవీకేఎస్ సినీ భక్తికి అవధులు లే కుండాపోయాయని పెదవి విప్పారు. మరి కొందరు ఏకంగా కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా కుష్భును ప్రకటించేస్తారేమోనన్నట్టుగా వ్యాఖ్యానించడం గమనార్హం. -
రాజ్య సభకు కుష్భు
కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి కుష్భు ను అందలం ఎక్కించేందుకు ఏఐసీసీ కసరత్తు వేగవంతం చేసింది. త్వరలో మహారాష్ట్ర నుంచి ఆమెను రాజ్య సభకు పంపించేందుకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించినట్టుగా సత్యమూర్తి భవన్లో చర్చ సాగుతోంది. ఆమెకు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. సాక్షి, చెన్నై: కుష్భు డీఎంకే నుంచి బయటకు వచ్చాక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. కుష్భు వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్భు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. పార్టీలో చేరినప్పటి నుంచి తన సేవల్ని విస్తృత పరిచే పనిలో పడ్డారు. రాష్ట్రంలో పర్యటిస్తూ తనదైన శైలిలో ప్రజల్ని ఆకర్షించే పనిలో ఉన్నారు. ఆయూ ప్రాంతల్లో జరిగే పార్టీ కార్యక్రమాలకు కాంగ్రెస్ వాదులు ఆమెను ఆహ్వానించడంలో ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇది వరకు రాష్ట్రానికి ఏ మహిళా నాయకురాలు ప్రజా సమస్యలపై స్పందించింది లేదు. అలాగే, కేంద్రం తీరును దుయ్యబట్టే రీతిలో వ్యాఖ్యలు చేయలేదు. అయితే, కుష్భు రెండు అడుగులు ముందుకు వేసి పాలకుల తీరును ఎండగట్టే పనిలో పడ్డారు. దీంతో ఆమెకంటూ కాంగ్రెస్‌లో మద్దతు వర్గం పెరుగుతోంది. ఆమె వెళ్తున్న సభలకు స్పందన వస్తుండడంతో పార్టీ పరంగా అందలం ఎక్కించాలన్న నిర్ణయానికి ఏఐసీసీ వచ్చి ఉన్నట్టు కాంగ్రెస్ కార్యాలయంలో చర్చ ఆరంభం అయింది. గౌరవ పదవి : కుష్భు సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. కుష్భు హిందీ, ఆంగ్ల, తమిళం, ఉర్దూ భాషల్ని అనర్గళంగా మాట్లాడటం, ఆమె వాక్ చాతుర్యం, దూకుడు, సందర్భానుచితంగా స్పందించడాన్ని పరిశీలించిన ఏఐసీసీ ఆమెను పార్టీ పరంగా అందలం ఎక్కించేందుకు సిద్ధం అవుతోన్నది. తమిళనాడుతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోనూ ఆమెకు అభిమానులు ఉండడంతో అవసరాన్ని బట్టి, ఆయా ప్రాంతాల్లో ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని అక్కడ కూడా కుష్భు సేవల్ని ఉపయోగించుకునే రీతిలో కార్యాచరణను ఏఐసీసీ సిద్ధం చేస్తోంది. ఆమె సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే, పార్టీ పరంగా ఉన్నతమైన, గౌరవ ప్రదంగా ఉండే పదవి అప్పగించాలని నిర్ణరుుంచారు. తొలుత పార్టీ అధికార ప్రతినిధి పదవి అప్పగించి, దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె సేవల్ని ఉపయోగించుకునేందుకు నిర్ణయించారు. అలాగే, త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ పదవులకు జరిగే ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆమెకు ఎంపీ పదవి సైతం అప్పగించే వ్యూహంతో ఏఐసీసీ ఉన్నట్టుగా సత్యమూర్తి భవన్లో ప్రచారం సాగుతోంది. కుష్భు స్వస్థలం మహారాష్ట్ర కావడంతో అక్కడి నుంచి ఆమెకు రాజ్య సభ సీటు ఇస్తే, ఎలాంటి వ్యతిరేకత, ఇబ్బందులు ఉండవన్న నిర్ణయానికి వచ్చిన ఏఐసీసీ పెద్దలు అందుకు తగ్గ కార్యాచరణను వేగవంతం చేశారు. -
యువహీరోతో సీనియర్ తారల హంగామా!
బి. సరోజాదేవి... 1950, 60లలో తిరుగు లేని తార. ఖుష్బూ, సిమ్రాన్... 1990, 2000లలో హవా నడిపించిన తారలు. ఈ ముగ్గురూ కలిసి ఒక పాటలో కనిపిస్తే.. చూడటానికి కనువిందుగా ఉంటుంది. అందుకు వేదిక కానుంది తమిళ చిత్రం ‘వాలు’. శింబు, హన్సిక జంటగా రూపొందుతున్న ఈ చిత్రం ఓ పాట మినహా పూర్తయ్యింది. త్వరలో ఆ పాటను చిత్రీకరించనున్నారు. ఈ పాటలోనే ఈ ముగ్గురు తారలూ కనిపించనున్నారు. ఇందులో దివంగత నటుడు ఎమ్జీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో అజిత్.. గెటప్స్‌లో శింబు కనిపిస్తారట. ఎమ్జీఆర్ గెటప్ సీక్వెన్స్‌లో ఈ యువహీరోతో కలిసి సరోజా దేవి కాలు కదుపుతారు. రజనీకాంత్ వేషానికి ఖుష్బూ జతకడతారు. అజిత్‌లా మారినప్పుడు సిమ్రాన్ కాలు కదుపుతారట. మూడు తరాలకు చెందిన ముగ్గురు నాయికలతో శింబు డాన్స్ చేయడం అంటే ఆసక్తిగానే ఉంటుంది. ఆ విధంగా ఈ పాట ‘వాలు’కి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెప్పొచ్చు. వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. -
బీజేపీలో చేరను
సాక్షి, చెన్నై : బీజేపీలో చేరుతున్నట్లుగా సాగుతున్న ప్రచారానికి నటి కుష్బు ముగింపు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. చక్కటి వాక్చాతుర్యం, అనర్గళంగా సమస్యలపై ప్రస్తావన, తనదైన సినీ గ్లామర్‌తో ప్రజల్ని ఆకర్షించే ప్రసంగం చేయడంలో దిట్ట కుష్బు. రాజకీయ పయనానికి డీఎంకే ద్వారా శ్రీకారం చుట్టారు. డీఎంకేలో ఎంత వేగంగా ఆమె ఎదిగారో, అంతే వేగ ంతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీఎంకేలోని రాజకీయాలు కుష్బులో తీవ్ర ఆవేదనను మిగిల్చాయి. అధినేత కరుణానిధికి లేఖాస్త్రం సంధించి డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆమెను తమ వైపు తిప్పుకునేందుకు పలు పార్టీలు తీవ్రంగానే ప్రయత్నించాయి. అయితే, రాజకీయ ప్రస్తావనలకు కుష్బు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ సర్కారు నటి స్మృతి ఇరానీకి పెద్ద పీట వేస్తూ కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం కుష్బుకు ఆనందాన్ని కల్గించింది. స్మృతి ఇరానీకి ప్రశంసలు, అభినందలు తెలపడంతోపాటుగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలను కుష్బు సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. ఇది కాస్త కుష్బుకు వ్యతిరేక ప్రచారానికి దారి తీసింది. కుష్బు బీజేపీలో చేరబోతున్నట్టు, చేరినట్టు రాష్ట్రంలో తెగ ప్రచారం బయలు దేరింది. సోషల్ మీడియాల్లో ఈ ప్రచారం మరింత హల్చల్ చేసింది. స్మృతి ఇరానీ ద్వారానే బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్టుగా ఓ వైపు, రాష్ట్రంలోని బీజేపీకి ప్రత్యేక గ్లామర్‌గా కుష్బును ఎంపిక చేసి ఉన్నట్టుగా మరో వైపు ప్రచారం సాగుతోంది.నో చాన్స్: ఈ ప్రచారాలు కుష్బు చెంతకు చేరాయి. దీంతో చాలా కాలం అనంతరం రాజకీయ ప్రస్తావనతో ఆమె ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. బీజేపీనా...నో చాన్స్ అంటూ ట్వీట్ చేశారు. తాను బీజేపీలో చేరినట్టుగా, చేరుతున్నట్టుగా వస్తున్న సంకేతాలన్నీ అవాస్తవ మని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరలేదని, చేరే ప్రసక్తే లేదని తేల్చారు. -
ఘాటుగా స్పందించిన కుష్బు
చెన్నై : సినీ రంగంలో అనుభవంతో పాటు రాజకీయాల్లో సినీనటి కుష్బు రాటుదేలారు. అయితే ఆమె ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ డేరింగ్ లేడీ ఏ విషయమైనా తనకు తప్పు అనిపిస్తే వెంటనే నిర్భయంగా చెప్పేస్తారు. ఇటీవల వర్షాల కారణంగా నగరంలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గుంతలు జన జీవనానికి ప్రమాదకరంగా మారాయి. దాంతో అధికారులు రోడ్లపై తాత్కాలిక మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వ్యవహారంపై కుష్బు ఘాటుగా స్పందించారు. ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ ''వర్షాల అనంతరం నగరాల్లోని రోడ్లను చూస్తుంటే మనం ఎందుకు పన్నులు చెల్లిస్తున్నామని... ప్రశ్నించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా గుంతలు, కోతలు, చేతికందే ఎత్తులో కరెంటు తీగలు ప్రమాదకరంగా మారాయి. ప్రజలందరూ పన్నుకడుతున్నారు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి'' అంటూ వ్యాఖ్యలు చేశారు. -
దేన్నీ అరికట్టలేనని తెలుసు కానీ...నా వంతుగా గళమెత్తుతాను!
‘‘పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదు’’... నిక్కచ్చిగా ఖుష్బూ తన అభిప్రాయం చెప్పేశారు... భారతీయ వనితల నోటి నుంచి ఇలాంటి మాటలా? చాలామంది చెలరేగిపోయారు.. ఫలితంగా 22 కేసులు... ఇక ఖుష్బూ జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం.. చాలామంది ఊహించారు... కానీ సీన్ రివర్స్... ‘ప్రజాస్వామ్య దేశంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పొచ్చు’ అంటూ... ధర్మాసనం అన్ని కేసులూ కొట్టేసింది... ‘‘కథానాయికలు వేశ్యల్లాంటివారు...’’ ఓ దర్శకుడి వ్యాఖ్య.. ఎవరూ పట్టించుకోలేదు.. కానీ ఖుష్బూ నోరు విప్పారు.. ‘‘ఏమన్నావ్... నీ అంతు చూస్తా!’’.. అనేశారు... చివరికి ఆ దర్శకుడు దిగొచ్చి ‘సారీ’ చెప్పేశారు... అక్కడెక్కడో కుంబకోణంలోని పాఠశాలలో అగ్ని ప్రమాదం... 100 మంది పిల్లలు చనిపోయారు.. ఈసారి ఖుష్బూ నోరు విప్పలేదు... ‘ఇక నుంచి దేవుణ్ణి నమ్మకూడదు’.. అని ఫిక్సయ్యారు. సమాజంలో ఎక్కడేం జరిగినా తనకే కావాలి. ఎందుకులే అని ఊరుకుంటే ఎవరు ముందుకొస్తారు? అందుకే నేను సైతం అంటూ దూసుకెళ్తారీ ఫైర్ బ్రాండ్. నేడు ఖుష్బూ పుట్టినరోజు. ‘ఇంటర్వ్యూ కావాలి’ అంటూ ‘సాక్షి’ ఫోన్ చేస్తే.. ‘నేను తమిళ పత్రికలకు కూడా ఇవ్వడం లేదు.. ప్లీజ్ ఏమీ అనుకోకండి’ అనేశారు. రెండు, మూడు సార్లు ఫోన్లు, ఓ ఇ-మెయిల్ తర్వాత ‘ప్లీజ్ కాల్ మీ’ అంటూ ఎస్ఎమ్ఎ్స్... ఆ తర్వాత ఖుష్బూతో జరిపిన సంభాషణ ‘సాక్షి’కి ప్రత్యేకం... హాయ్ ఖుష్బూగారు... ఎలా ఉన్నారు? ఖుష్బూ: చాలా బాగున్నానండి. తెలుగు ప్రేక్షకులందరూ బాగున్నారనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇవాళ మీ పుట్టినరోజు కదా.. ప్రత్యేకత ఏంటి? ఏమీ లేదు. నాకసలు పుట్టినరోజులు జరుపుకొనే అలవాటు లేదు. కానీ, మా పిల్లలు ఊరుకోరు కాబట్టి, వాళ్ల కోసం బయటికి ఎక్కడికైనా వెళుతుంటాం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే తత్వం నాది. అందుకే నాకు మాత్రం అన్ని రోజులూ ఒకేలా అనిపిస్తాయి. మీ ఇంట్లో ఏదో హడావిడిగా ఉన్నట్లుంది.. ఫోన్లో శబ్దాలు వినిపిస్తున్నాయి? నిజమే. ఈ రోజు (శనివారం) మా పెద్దమ్మాయి అవంతిక పుట్టినరోజు. నాకూ, మా ఆయనకూ పుట్టినరోజు వేడుకల మీద శ్రద్ధ లేనప్పటికీ పిల్లల సరదా కాదనలేం కదా! అందుకని చిన్న సెలబ్రేషన్ ఏర్పాటు చేశాం. తల్లితండ్రుల నుంచి పిల్లలు కొన్ని కొన్ని కోరుకుంటారు. వారి కోరికలను తీర్చడం మన బాధ్యత కదా! భలే ఉంది. రెండు రోజుల గ్యాప్‌లో మీ ఇంట్లో రెండు పుట్టినరోజు పండగలన్నమాట. అవంతిక పుట్టినప్పుడు మీకు కలిగిన అనుభూతిని ఓసారి గుర్తు చేసుకుంటారా? నా కడుపులోని బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు, ‘మీ బిడ్డ చాలా పొడవుగా, కొనదేరిన ముక్కుతో, గులాబీ రంగుతో ఉంది’ అని డాక్టర్ చెప్పగానే, ఆనందం పట్టలేక ఏడ్చేశాను. బిడ్డను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ స్పర్శ కలిగించిన ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మా చిన్ని దేవత అవంతిక మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఆనందం రెట్టింపు అయ్యింది. అవంతికకు ఇప్పుడు పధ్నాలుగేళ్లు. ఆనందితకు పదకొండేళ్లు. ఇద్దరికీ తండ్రి పోలికలు ఎక్కువ. భార్యాభర్తల బంధాన్ని బిడ్డలు మరింత పటిష్ఠం చేస్తారు. అందుకు ఓ నిదర్శనం నా వైవాహిక బంధం. పెద్దయిన తర్వాత మీ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారు? పెద్ద పాప వాళ్ల నాన్నలా ఇంగ్లిష్ లిటరేచర్ చేయాలనుకుంటోంది. రెండో పాప కూడా వాళ్ల నాన్నలా సినీ టెక్నీషియన్ కావాలనుకుంటోంది. ఆమెకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. ‘మేం ఆర్టిస్ట్‌లం అవుతాం’ అని మా పిల్లలిద్దరూ ఎప్పుడూ అనలేదు. మాకు కూడా ఆ ఉద్దేశం లేదు. మరి.. పెద్దయిన తర్వాత ఏమవుతారో చూడాలి. చాలామంది సెలబ్రిటీలు తమ పిల్లల ఆలనా పాలనను పనిమనుషులకు వదిలేసి, పార్టీలు, షికార్లంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారనే ఫీలింగ్ బయటివాళ్లకు ఉంటుంది... అది తప్పంటాను. మేమంతా ఇంట్లో పది మంది పనిమనుషులను పెట్టుకొని ఏ పుస్తకాలు చదువుకుంటూనో, టీవీ చూస్తూనో, పార్టీలు చేసుకుంటూనో గడిపేస్తామనుకుంటే పొరపాటు. నా పిల్లలకు నేను స్వయంగా వండి పెడితేనే నాకు తృప్తిగా ఉంటుంది. వాళ్లకి స్కూల్ లేనప్పుడు ఆలస్యంగా నిద్ర లేస్తాను. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఉదయం 5 గంటలకల్లా నిద్రలేచి, బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టి, లంచ్ బాక్స్ రెడీ చేసి, పంపిస్తాను. ఎప్పుడైనా మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి కుదరలేదనుకోండి.. డిన్నర్లో నా స్వహస్తాలతో వండినదే తినిపిస్తా. మా పిల్లలు నన్ను సెలబ్రిటీ అనుకోరు. నేను నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకూ వాళ్ళు పూర్తిగా చూడనేలేదు. బయటివాళ్లెవరైనా ‘మీ అమ్మగారు గొప్ప ఆర్టిస్ట్’ అంటే ‘అవునా..’ అంటూ చిలిపిగా ఓ నవ్వు నవ్వుతారు. ఇప్పుడు చెప్పండి నేను ఓ సాదాసీదా తల్లినా? కాదా? నేను మాత్రమే కాదు... సుహాసిని, రాధ, రాధిక, నదియా.. వీళ్లందరూ తమ కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు. కానీ అదేం తెలుసుకోకుండా ‘సెలబ్రిటీలు కదా..’ అని కొంతమంది ఏవేవో స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. సమాజంలో జరిగే సంఘటనలకు మీరు ఎక్కువగా స్పందిస్తుంటారు. చాలామందిలా మనకేంటిలే అని ఊరుకోకపోవడం మిమ్మల్ని వివాదాలపాలు చేస్తోంది కదా..? చేయనివ్వండి.. ‘నేను బాగుంటే చాలు.. నా కుటుంబం బాగుంటే చాలు’ అనుకుంటే సమాజం గురించి ఎవరు ఆలోచిస్తారు? నేను స్వయంగా వెళ్లి, దేన్నీ అరికట్టలేను. అందుకే నా వంతుగా నాకు అనిపించింది, ధైర్యంగా చెబుతున్నాను. మన కళ్ల ముందు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మన జీవితానికి సంబంధం లేకపోయినా స్పందించాలనుకుంటాను. మంచి మాటలు చెప్పినప్పుడు వివాదాలపాలు కావడం సర్వసాధారణం. నేను చేసే వ్యాఖ్యలకు నిందించినా ఫరవాలేదు. ఎందుకంటే, నిందించేవాళ్లందరూ అపరిచితులే. ముక్కూ, మొహం తెలియనివాళ్లు అనే మాటలను మనసు వరకూ తీసుకెళ్లి, నా సమయాన్ని వృథా చేసుకోను. నాకు కుటుంబ బాధ్యతలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం పూర్తిగా కుటుంబానికే పరిమితమైపోయినట్లున్నారు. వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉండటంతో పాటు రాజకీయాలకు కూడా దూరం ఉంటున్నారెందుకని? తమిళంలో సినిమా చేసి ఐదారేళ్లయ్యింది. తెలుగులోనూ అంతే. కన్నడంలో చేసి ఎనిమిదేళ్లయ్యింది. మలయాళంలో మూడేళ్లయ్యింది. అది కూడా నేను పెట్టిన నిబంధనలకు అంగీకరించడం వల్లే మలయాళ సినిమా చేశాను. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్ చేస్తాననీ, సాయంత్రం ఆరు తర్వాత షూటింగ్ చేయననీ, ఒకవేళ రాత్రి తొమ్మిది గంటల వరకూ చేస్తే, మర్నాడు మధ్యాహ్నం రెండు గంటల వరకూ షూటింగ్‌కి రాననీ కరాఖండిగా చెప్పాను. ఆ నిబంధనలకు ఒప్పుకోవడంతో అంగీకరించాను. కానీ, నేనలా చేయడం తప్పు కదా! నేనో దర్శకుడి భార్యను. ఓ ఆర్టిస్ట్ ఇలా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్లిపోతానంటే దర్శకుడి కడుపు మంట ఏ స్థాయిలో ఉంటుందో నాకు తెలుసు. మా సొంత సంస్థలో తీస్తున్న సినిమాలకు నిర్మాతను నేను. ఓ ఆర్టిస్ట్ ఇన్ని కండిషన్లు పెడితే నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే, నా నిబంధనలతో ఇతరులను హింసించడం ఇష్టం లేక సినిమాలకు దూరంగా ఉంటున్నా. ఈ మధ్య ‘గెట్ రెడీ’ అనే టీవీ షోకి యాంకర్‌గా చేశాను. అది 52 ఎపిసోడ్స్ పూర్తయ్యింది. తర్వాతి సీజన్‌ను ప్రారంభిస్తే చేయాలనుకుంటున్నా. అలాగే, మరో తమిళ టీవీ షో ‘మానాడ మయిలాడ’ 75 ఎపిసోడ్స్ పూర్తయ్యింది. ఇక చాలనిపించింది. రాజకీయాల విషయానికొస్తే.. ప్రస్తుతానికి కామా పెట్టాను. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతానో ప్రస్తుతానికి చెప్పలేను. ఓవర్ వర్క్ చేశాననే ఫీలింగ్‌తో ఇప్పుడు రిలాక్స్ కావాలనుకుంటున్నారా? అది ఒక కారణం. నాకు పూర్తిగా ఇంట్లో ఉండాలనే ఆశ ఉంది. అందుకే, ఇంటిపట్టున ఉంటున్నా. మీరు తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ భర్త ఏమన్నారు? నేను వర్క్ చేస్తానన్నా ఆయన కాదనలేదు. ఇప్పుడు చేయనన్నా ఏమీ అనలేదు. పెళ్లయిన తర్వాత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి కుదరడం లేదని, భర్త మీద ఆధారపడిపోతున్నానని బాధపడేలా నా జీవితం లేదు. మా ఇరవయ్యేళ్ల వైవాహిక జీవితంలో ‘ఇది చెయ్యొద్దు’ అని మా ఆయన అన్నది లేదు. ఒకవేళ నేను తీసుకునే నిర్ణయాల విషయంలో తికమక పడితే అప్పుడాయన సలహా అడుగుతాను. అప్పుడు కూడా తన అభిప్రాయం చెప్పి, ‘నాకిలా అనిపిస్తోంది... నీక్కూడా సరైనదనిపిస్తే ఇలానే చెయ్.. లేకపోతే వేరే ఆలోచించు’ అంటారు. ఈ మధ్య సుందర్‌గారు దర్శకత్వం వహిస్తున్న చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్టవుతున్నాయి. ఆ విజయంలో మీ భాగస్వామ్యం ఎంత? దేని కోసమూ ఆయనను వేధించను. అదే నా భాగస్వామ్యం. ‘ఏ సినిమా చేయబోతున్నారు? కథ ఏంటి? ఆర్టిస్టులెవరు?’ అని ప్రశ్నలతో విసిగించను. ఆయన పనిని సంపూర్ణంగా చేసుకోనిస్తాను. ఆయన చాలా కూల్ పర్సన్. ఒకేసారి ఐదు, పది సినిమాలు చేసేయాలనుకోరు. అటు సినిమాలనూ, ఇటు ఇంటినీ చక్కగా పట్టించుకుంటారు. ఉత్తరాది అమ్మాయి అయిన మీరు.. దక్షిణాది ఇంటి కోడలినవుతానని కలలో అయినా అనుకున్నారా? అస్సలు లేదండి. జీవితం అంతే! ఏదీ మన చేతుల్లో ఉండదు! ఇరవైఅయిదేళ్ల క్రితం నేను మద్రాసు (ఇప్పటి చెన్నై)లో అడుగుపెట్టినప్పుడు నటిగా రాణిస్తాననీ, దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటిస్తాననీ అనుకోలేదు. చివరికి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. ఇప్పుడు తమిళ అమ్మాయిని అయిపోయాను. మీరేమో ఉత్తరం.. సుందర్‌గారు దక్షిణం.. మరి అత్తగారింట్లో సులువుగానే ఇమిడిపోగలిగారా? ఓ ఆరేళ్లు డేటింగ్ చేసిన తర్వాత మేం పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందే నేను సుందర్ ఇంటికి వెళ్లేదాన్ని. ఇంట్లో అందరితోనూ కలుపుగోలుతనంగా ఉండేదాన్ని. అందుకని, ఆ ఇంటి కోడలైన తర్వాత సులువుగానే ఇమిడిపోగలిగాను. పుట్టినిల్లు ముంబయ్.. మెట్టినిల్లు చెన్నైల్లో మీకు దేని మీద మమకారం ఎక్కువ? ఇది క్లిష్టమైన ప్రశ్న. పుట్టిన ఊరు మీద మమకారం చంపుకోలేం. మిగతా జీవితాన్ని గడపాల్సిన ఊరి మీద కూడా ప్రత్యేకమైన మమకారం ఉంటుంది. నేను ముంబయ్‌లో ఉన్నది 16 ఏళ్లు. చెన్నయ్‌తో నా అనుబంధం 27 ఏళ్లు. రెండు భిన్న సంస్కృతులకు సంబంధించిన జీవితం చూశామని అనిపించడం లేదు. ఉత్తరం, దక్షిణం అనే గీత చెరిగిపోయింది. మీరు దేవుణ్ణి నమ్మరట.. దానికి కారణం ఏదైనా ఉందా? దాదాపు పదేళ్ల క్రితం తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం నా మనసును మార్చేసింది. ఆ ప్రమాదంలో సుమారు వంద మంది పిల్లలు చనిపోయారు. పెద్దవాళ్లు చనిపోతే ఏదో పాపం చేసి ఉంటారులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ, చనిపోయింది అభం శుభం తెలియని పసివాళ్లు. దేవుడే ఉండి ఉంటే.. ఎందుకు కాపాడలేకపోయాడు? అని ఆ రోజు చిన్నపాటి సందేహం కలిగింది. ఆ సందేహమే అపనమ్మకానికి దారి తీసింది. మరి.. మీ భర్త కూడా నాస్తికవాదేనా? ఆయనకు దైవభక్తి ఎక్కువ. పూజలు, పునస్కారాలు బాగా చేస్తారు. గుడికి వెళుతుంటారు. ఆయన గుడికి వెళుతున్నప్పుడు, నేనూ వస్తానంటాను. ‘వద్దులే’ అనేస్తారు. కుటుంబంతో సహా మీరెళ్లే హాలిడే స్పాట్? నాకు ఊటీ అంటే ఇష్టం. మాకు అక్కడో ఇల్లు కూడా ఉంది. మా పిల్లలకు స్కూల్ హాలిడేస్ అప్పుడు అక్కడికి వెళుతుంటాం. విదేశాల్లో న్యూజిలాండ్, సింగపూర్, లండన్ ఇష్టం. అక్కడికి కూడా వెళుతుంటాం. కథానాయికగా చేస్తున్నప్పుడు మీ సమకాలీన తారల్లో మీరే బొద్దుగా ఉండేవారు. ఇప్పుడూ అలానే ఉన్నారు.. ఎప్పుడూ సన్నబడాలనుకోలేదా? ఆడవాళ్లకు సరైన కొలతలు 36-24-36 అంటారు. నేనా కొలతలను ఎప్పుడూ పట్టించుకోలేదు. నేనెలా ఉన్నానో అలానే నాకిష్టం. మీ శరీరం బరువెంత? నడుము కొలత ఎంత? అన్నది కాదు... ఆరోగ్యంగా ఉన్నారా? లేదా అన్నదే ముఖ్యం. నాకు బీపీ, షుగర్ లేవు. కంటి చూపు బ్రహ్మాండంగా ఉంది. ఇంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు జీరో సైజ్ ఫ్యాషన్ కదా? ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు ఫ్యాషన్‌ను ఫాలో అవుతారు. నాకిలా ఉండటమే ఇష్టం. ఎక్కువగా చీరలే కట్టుకుంటారెందుకని? సినిమాల్లో పాత్రలకు తగ్గట్టుగా మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నాను కానీ.. నాకు మాత్రం చీరలే ఇష్టం. చీరలో ఉన్న అందం వేరే ఎందులో ఉంటుంది! మీ పిల్లలు మోడ్రన్ డ్రెస్లేసుకోమని చెప్పరా? ఈ విషయంలో మా ఇంట్లో వాదనలు జరుగుతుంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి బయటికెళుతున్నప్పుడు చుడీదార్లు వేసుకోమని చెబుతుంటారు. నేనేమో చీరలే కట్టుకుంటా అంటే గొడవ గొడవ చేసేస్తారు. మీ మేనిఛాయ చాలా బాగుంటుంది. ఆ రహస్యం చెబుతారా? మా అమ్మానాన్నల స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. నేను ఫేషియల్ కూడా చేయించుకోను. సినిమాల్లో నటించేటప్పుడు కూడా తక్కువ మేకప్ వాడతాను. మీ మనసు స్వచ్ఛంగా ఉంటే.. అది మీ ముఖంలో ప్రతిబింబిస్తుంది. నా ఒంటి మెరుపుకు ఒక కారణం జీన్స్ అయితే మరో కారణం ఇదే! ఫైనల్‌గా... ఒక్కసారి మీ జీవితాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది? ఇంకా అంత జీవితాన్ని చూడలేదు. నలభై ఏళ్ల వయసులోనే అసలు జీవితం ప్రారంభం అవుతుందంటారు. సో.. నా జీవితం ఇప్పుడే ప్రారంభమైంది. ప్రస్తుతానికి చాలా బాగుంది. భవిష్యత్తు ఇంకా ఆనందంగా ఉంటుందనుకుంటున్నా. - డి.జి. భవాని సుహాసిని నా బెస్ట్ ఫ్రెండ్ నటి సుహాసిని నా బెస్ట్ ఫ్రెండ్. రాత్రి ఒంటి గంటకు కూడా ఫోన్ చేసి, నా మనోభావాలను చెప్పుకునేంత స్నేహం మా మధ్య ఉంది. ఇప్పటి కథానాయికల్లో త్రిష మంచి స్నేహితురాలు. ఇంకా కొరియోగ్రాఫర్ బృంద, నిర్మాత పంజు అరుణాచలంగారి అబ్బాయి పంజు సుబ్బు, ఒకప్పుడు చిరంజీవిగారితో ‘స్వర్ణ’ అనే అమ్మాయి సినిమాలు చేసింది కదా.. తన అసలు పేరు సుజాతా విజయ్‌కుమార్... ఆమె కూడా మంచి స్నేహితురాలు. -
నాకు గుడి కట్టొద్దు ప్లీజ్
సినీ తారలను అభిమానులు ఆరాధ్య దేవతల్లా భావిస్తారు. ఒక్కోసారి ఈ అభిమానం పరిధులు దాటి గుళ్లు కట్టే స్థాయికి వెళ్లిపోతుంది. అలా అప్పట్లో తమిళ నటి ఖుష్బూకి గుడి కట్టారు. ఆ తర్వాత సిమ్రాన్‌కి కట్టాలనుకున్నారనే వార్త వచ్చింది. అనంతరం తమిళనాడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తారల్లో నమిత ఉన్నారు. ఈ సూరత్ సుందరి కోసం అభిమానులు గుడి కట్టారనే వార్త అప్పట్లో వచ్చింది. ఇక, ఇప్పుడు నయనతార అభిమానులు ఆమెకోసం గుడి కట్టాలనుకున్నారట. ఇటీవల నయనతారను కలిసి, ఆమె అనుమతి కోరారని సమాచారం. తమకు ఆర్థిక సహాయం ఏమీ అవసరం లేదని, కేవలం గుడి కట్టడానికి అనుమతిస్తే చాలని అడిగారట. కానీ, నయనతర ఇందుకు సమ్మతించలేదని భోగట్టా. ‘మీరింత అభిమానం చూపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ, గుడి కట్టొద్దు ప్లీజ్’ అని సున్నితంగా వారి ప్రతిపాదనను నయనతార తిరస్కరించారట. -
రజనీకాంత్ తో నటించను
అవకాశం వచ్చినా రజనీకాంత్‌తో నటించనంటున్నారు నటి కుష్బూ. అటు సినిమాల్లోను, ఇటు రాజకీయాల్లోను నాయకురాలిగా సంచలనం సృష్టించిన నటి కుష్బు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా సినిమాకు మాత్రం చేరువగానే ఉన్నారు. పలు బుల్లితెర కార్యక్రమాలతోపాటు వెండితెర నిర్మాతగా కొనసాగుతూ అడపాదడపా నటిగా మెరుస్తున్న కుష్బూ ఇటీవల ట్విట్టర్లో తన అభిమానుల ప్రశ్నలకు కింది విధంగా బదులిచ్చారు. రాజకీయ పునఃప్రవేశం ఉంటుందా? మళ్లీ రాజకీయ రంగప్రవేశ ఆలోచన ప్రస్తుతానికి లేదు. ఇంతకు ముందు రజనీకాంత్ సరసన అన్నామలై లాంటి హిట్ చిత్రాఓ్ల నటించారు. మళ్లీ అవకాశం వస్తే ఆయనతో నటిస్తారా? అలాంటి అవకాశం వచ్చినా రజనీకాంత్‌తో నటించను. కమల్ హాసన్‌తో కలిసి నటిస్తారా? కమల్‌తో నటించే అవకాశం వస్తే వదులుకోను. సీనియర్ నటుడు కార్తీక్ నటించిన చిత్రాలు మీకు నచ్చాయూ? కార్తీక్ నటించిన అగ్ని నక్షత్రం, మౌనరాగం చిత్రాలు బాగా నచ్చాయి. మీ రియల్ హీరో ఎవరు? ఇంకెవరు? నా భర్త సుందర్ సి నే దర్శకత్వం ఆలోచన ఉందా? ఈ విషయంలో నాకింకా స్పష్టత లేదు. సుందర్ సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన మదగజరాజా చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది? ఆ చిత్రం విడుదల సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. మీరెప్పుడు చీరలోనే కనిపిస్తున్నారు? చీరలంటేనే నాకిష్టం అది ధరించడం కూడా సౌకర్యంగా ఉంటుంది. -
సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై కేసు
-
సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై కేసు
హైదరాబాద్: సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఈ కేసు పెట్టారు. అదనపు కట్నం కోసం తనను అత్తింటివారు వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా శ్రీనివాస్ పై కేసు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, వ్యాపారవేత్త ఇంద్రకుమరన్‌ని రంభ పెళ్లి చేసుకున్న కెనడాలో ఉంటున్నారు. వీరికి ‘లాన్య’ అనే పాప ఉంది. అయితే భర్త నుంచి రంభ విడాకులు తీసుకోనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సీనియర్ నటి కుష్బూ ఖండించారు. రంభ చక్కగా కాపురం చేసుకుంటోందని ఆమె తెలిపారు. రంభ గురించి అలాంటి ప్రచారం చేయొద్దు: కుష్బూ -
కుష్బుపై ‘హస్తం’ కన్ను
సాక్షి, చెన్నై: సినీరంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ కుష్బు తన సత్తాను చాటుకున్న విషయం తెలి సిందే. వాక్చాతుర్యం, అనర్గళంగా ప్రసంగించ డం, వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో దిట్ట. అయితే, ఆమెకు డీఎంకేలో సరైన గుర్తింపు రాలేదు. కోటి ఆశలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమెకు డీఎంకేలో చివరకు మిగిలింది నిరాశే. ఎట్టకేలకు ఆ పార్టీ నుంచి బయట పడ్డ కుష్బు తన రాజకీయ పయనం ఎటో? అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఢిల్లీలోని మిత్రుల సహకారంతో బీజేపీలో ఆమె చేరబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. తమిళ మీడియా కోడైకూసినా, ఆమె మాత్రం ఖండించలేదు. దీంతో బీజేపీలో ఆమె చేరడం ఇక ఖాయం అన్నట్టుగా ప్రచారం సాగింది. అయితే, రాష్ట్ర బీజేపీలో మహిళా నేతలకు, ఎన్నికల సమయంలో ఆ పార్టీ అధిష్టానం ఇచ్చిన గుర్తింపును పరిగణనలోకి తీసుకుని కుష్బు వెనక్కు తగ్గినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే అవకాశంగా తీసుకున్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ కుష్బును తమ వైపు తిప్పుకునేందుకు రెడీ అయ్యారు. గాలం : రాజకీయ అరంగేట్రం చేయనున్న తరుణంలో తొలుత కుష్బు చూపు కాంగ్రెస్ వైపు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఆమె డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కుష్బును తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు టీఎన్‌సీసీ మళ్లీ రెడీ అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా కసరత్తులు జరుగుతున్న వేళ తమకు సినీ గ్లామర్ అవసరమని జ్ఞాన దేశికన్ ఆలోచిస్తున్నట్లు సత్యమూర్తి భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో సరైన మహిళ నాయకులు ఎవ్వరూ లేని దృష్ట్యా, ఆ స్థానాన్ని కుష్బు ద్వారా భర్తీ చేయించి, కీలక బాధ్యతల్ని అప్పగించేందుకు సైతం రెడీ అయ్యారు. అయితే, ఇందుకు కుష్బుఅంగీకరిస్తారా? అన్న ప్రశ్న బయలుదేరింది. రంగంలోకి కార్తిక్ : సినీ నటుడు కార్తిక్ , కుష్బు మంచి మిత్రులు. లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచార బరిలో కార్తిక్ దిగారు. తనకంటూ అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి ఉన్నా, కార్తిక్ కాంగ్రెస్‌తో సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. ఇది జ్ఞాన దేశికన్‌కు వరంగా మారింది. కార్తిక్ సహకారంతో కుష్బును ఒప్పించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఆషాడం ముగియగానే కుష్బు వద్దకు కార్తిక్‌ను రాయబారిగా పంపించేందుకు రెడీ అయ్యారు. అంతలోపు కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ మద్దతు దారుడైన సినీ ప్రముఖుడు గజనాథన్ ద్వారా కుష్బుతో సంప్రదింపులకు ఏర్పాట్లు చేసినట్లు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాబిలోనాకు ఛాన్స్ : కుష్బు గుడ్ బై చెప్పడంతో డీఎంకేలో మహిళా సినీ గ్లామర్ కరువైంది. ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి శృంగార తార బాబిలోన రెడీ అవుతున్నారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ రాజకీయ ప్రసంగాల్ని అమితంగా అభిమానిస్తానంటూ ఇది వరకు బాబిలోన ప్రకటించారు. తనకు రాజాకీయాలంటే ఇష్టం అని, తాను డీఎంకేలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తన సన్నిహితుల ద్వారా ఆ పార్టీ అధిష్టానానికి సంకేతాన్ని ఆమె పంపించారు. ఆషాడ మాసం అనంతరం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీలో చేరడానికి బాబిలోన రెడీ అవుతున్నట్టు కోలీవుడ్లోను టాక్. దీన్ని బట్టి చూస్తే, ఆషాడం అనంతరం అటు కాంగ్రెస్‌కు, ఇటు డీఎంకేకు సినీ గ్లామర్లు దక్కనున్నారన్నమాట! -
రంభ గురించి అలాంటి ప్రచారం చేయొద్దు : కుష్బూ
గాసిప్పురాయుళ్లను నోరుమూసుకోమని చెబుతున్నారు కుష్బూ. అంత మాట అన్నారంటే, కుష్బూ గురించి చేయకూడని ప్రచారం ఏదో చేసే ఉంటారని ఊహించవచ్చు. కానీ, కుష్బూ ఈ విధంగా స్పందించింది తనకోసం కాదు.. రంభ కోసం. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమరన్‌ని రంభ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లకో పాప ఉంది. పేరు ‘లాన్య’. పెళ్లయినప్పట్నుంచీ కెనడాలోనే ఉంటున్నారు రంభ. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించడానికి ఆమె ఇండియా రానున్నారని, నిర్మాతగా కూడా మారనున్నారని అడపా దడపా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇటీవల మాత్రం తన భర్త నుంచి రంభ విడాకులు తీసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయం గురించే కుష్బూ ఘాటుగా స్పందించారు. ఇటీవల ఆమె కెనడా వెళ్లారు. కుష్బూ అక్కడికొచ్చిన విషయం తెలుసుకుని రంభ తన ఇంటికి ఆహ్వానించడం, ఈమె వెళ్లడం జరిగింది. రంభతో కబుర్లు చెప్పడంతో పాటు ఆమె కూతురు లాన్యని కూడా ముద్దు చేశారు కుష్బూ. అది మాత్రమే కాదు నయాగరా జలపాతాలను వీక్షించాలనుకున్న కుష్బూతో కలిసి రంభ, ఆమె భర్త కూడా వెళ్లారు. అక్కడ బాగా ఎంజాయ్ చేశామని కుష్బూ పేర్కొన్నారు. రంభ, ఇంద్రకుమరన్‌ని చూస్తే, చాలా ముచ్చటేసిందని ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారని కుష్బూ చెప్పారు. ఈ దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారామె. -
డీఎంకే కు ఖుష్బు గుడ్‌బై
సాక్షి, చెన్నై:అశేషాభిమాన లోకం హృదయం లో చెరగని ముద్ర వేసుకున్న నటి ఖుష్బు. ఈమెకు ఆలయాన్ని సైతం నిర్మించిన అభిమానులున్నారు. అయితే, అనవసరంగా నోరు జారి వివాదాల్లో ఇరుక్కోవడం ఈమెకు పరిపా టే. అదే సమయంలో మంచి వాక్చాతుర్యం, సమస్యలపై అవగాహన, పట్టు, ఆత్మ స్థైర్యం, నిక్కచ్చిగా మాట్లాడడం,సూటిగా ప్రశ్నించడం వంటి తత్వాలు ఆమెను రాజకీయాల్లోకి వచ్చే లా చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్టీ సభ్యురాలిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చారు. తరువాత డీఎంకే కోశాధికారి స్టాలిన్‌తో విబేధాలున్నట్లు మీడియా కోడైకూసింది. ఇదే అంశాన్ని ఎత్తి చూపుతూ ఆమె ఇంటిపై దాడి జరిగింది. మరికొన్ని ఆరోపణలు వచ్చినా, ఖుష్బు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆమెను డీఎంకేలో అణగదొక్కుతున్నారంటూ మీడియాల్లో కథనాలు వచ్చినా, పార్టీకి తన సేవలందిస్తూనే వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లోను పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార బాట సైతం పట్టిన ఖుష్బు సోమవారం ఉన్నట్టుండి కీలక నిర్ణయం తీసుకున్నారు. అధినేత కరుణానిధికి లేఖ రాశారు. డీఎంకే నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించి, ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు.వెళ్తున్నా...వెళ్తున్నా...: తనను కుటుంబంలో ఓ సభ్యురాలిగా గుర్తించినందుకు గాను తమిళనాడు ప్రజలకు సేవ చేయాలన్న కాంక్షతో రాజకీయాల్లోకి వచ్చానని తన లేఖలో వివరించారు. సేవే లక్ష్యంగా డీఎంకేలోకి చేరానని గుర్తు చేశారు. తనకు పార్టీలో అప్పగించిన బాధ్యతలను వంద శాతం పూర్తి చేశానని, ఇది అందరికీ తెలుసునని పేర్కొన్నారు. తనకు కేటాయించిన అన్ని బాధ్యతల్ని ఆనందంతో, చిరునవ్వుతో పూర్తి చేసినా, తన శ్రమ అంతా ఒకే మార్గంలో సాగుతున్నట్టు అనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రయాణం ఏమిటో అన్నది అంతు చిక్కక మనో వేదనకు గురయ్యానన్నారు. అందుకే బరువెక్కిన హృదయంతో డీఎంకే నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తి స్థాయిలో తాను వైదొలగుతున్నానని ఖుష్బు ప్రకటించినా, తదుపరి తన కార్యాచరణ ఏమిటో? అన్నది ప్రశ్నార్థకంగానే మిగిల్చారు. మరో పార్టీలో రాజకీయ సేవను ఆమె కొనసాగిస్తారా లేదా, మళ్లీ సినిమాలు, లేదా టీవీ షోల్లో ప్రత్యక్షం కాబోతున్నారా..? అన్నది వేచి చూడాల్సిందే...! -
డీఎంకే పార్టీకి సినీ నటి కుష్బూ గుడ్ బై!
చెన్నై: తమిళ సినీనటి, రాజకీయ నేత కష్బూ డీఎంకే పార్టీకి గుడ్ బై చెప్పారు. గతకొద్దికాలంగా డీఎంకే పార్టీకి దూరంగా ఉంటున్న కుష్బూ ఆపార్టీకి రాజీనామా చేయాలని సోమవారం నిశ్చయించుకున్నారు. మంగళవారం కుష్బూ బీజేపీలో చేరే అవకాశముందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సరియైన సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలు ఓ చిరునవ్వుతో తీసుకోవాలి. ఓ కఠినమైన నిర్ణయాన్ని నేను తీసుకున్నాను అని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. కరుణానిధి కేవలం ఓ పార్టీ నేతనే కాదు, నాకు తండ్రిలాంటి వాడు అని కుష్బూ వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధికారంలో ఉండగా, 2010 మే 15 తేదిన కుష్బూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. At times hard decisions have to be taken at the right time with a smile..I hve done just tat..no point in pondering over something tat hurts— khushbusundar (@khushsundar) June 16, 2014 -
ప్రచారానికి కని, ఖుష్బు సిద్ధం
సాక్షి, చెన్నై: డీఎంకే సినీ గ్లామర్లు ప్రచారానికి సిద్ధం అయ్యారు. నటి ఖుష్బు, నటుడు వాగై చంద్రశేఖర్ పర్యటన వివరాలను డీఎంకే ప్రకటించింది. డీఎంకే ఎంపీ, కరుణానిధి గారాలపట్టి కనిమొళి పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలో డీపీఏ పేరుతో కూటమిగా డీఎంకే ఎన్నికల్లోకి వెళ్లిన విషయం తెలి సిందే. డీఎంకే 35 స్థానాల్లో, ఆ కూటమిలోని వీసీకే రెండు చోట్ల, ఇండియ యూనియన్ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ నిధి కట్చిలు తలా ఓ చోట బరిలో దిగాయి. కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. పార్టీ అధినేత కరుణానిధి ప్రచారానికి సిద్ధమయ్యారు. తమ పార్టీలో ఉన్న నటీ, నటులను ఎన్నికల ప్రచారంలోకి పంపించేందుకు డీఎంకే అధిష్టానం సిద్ధం అయింది. అలాగే, తన గారాల పట్టి కనిమొళి సైతం ప్రచార బాట పట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో వారి పర్యటనల వివరాలను డీఎంకే కార్యాల యం అన్నా అరివాళయం సోమవారం ప్రకటించింది. ప్రచారం నిమిత్తం ప్రత్యేక వాహనాలు సిద్ధం అయ్యాయి. ప్రచార బాట: ఏప్రిల్ ఐదు నుంచి కనిమొళి తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఆ రోజు ఉత్తర చెన్నైలో ఆమె ప్రచారానికి శ్రీకారం చుడతారు. విరామం లేకుండా ఆమె పర్యటన 22వ తేదీ వరకు సాగనున్నది. ఏడో తేదీన కంచి, కడలూరు, చిదంబరం, 9న శ్రీ పెరంబతూరు, పదిన అర్కోణం, 11న తిరువళ్లూరు,12నవేలూరు, 13నఆరణి, 14న సేలం, 15న నామక్కల్, 16న ఈరోడ్, 17న దిండుగల్, 18న విరుదునగర్, 19న తెన్కాశి, 20న తూత్తుకుడి, 21న తిరునల్వేలి, 22న కన్యాకుమారిలో ఆమె పర్యటించనున్నారు. నటి ఖుష్బు ఏప్రిల్ ఐదో తేదీన తిరుచ్చి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఆరున కరూర్, 7న ఈరోడ్, 8న నీలగిరి,9న పొల్లాచ్చి, 10న కోయం బత్తూరు,11న తిరుప్పూర్, 12న సేలం, 13న ధర్మపురం, 14న కృష్ణగిరి, 15న వేలూరు, 17న ఆరణి, 18న తిరువణ్ణామలై,19న కాంచీపురం,20 అరక్కోణం, 21న శ్రీపెరంబదూరు , 22న తిరువళ్లూరుల్లో ఖుష్బు ప్రచారం సాగునున్నది. వాగై : ఏప్రిల్ ఒకటి నుంచి వాగై చంద్ర శేఖర్ ప్రచారం సాగనున్నది. తిరుచ్చిలో తన పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. రెండు దిండుగల్, మూడున శివగంగై, 4న రామనాథపురం, 5న మదురై, 6న తేని, 7న దిండుగల్, 8న కరూర్, 9న తంజావూరు, 10న మైలాడుతురై, 11న చిదంబరం, 12న పుదుచ్చేరి, 13న కడలూరు, 14న దక్షిణ చెన్నై, 15న సెంట్రల్ చెన్నై, 16న కాంచీపురం, 17న వేలూరు, 18న తిరువళ్లూరు, 19న తిరువణ్ణామలై , 20న ఆరణి, 21న విల్లుపురం, 22న శ్రీ పెరంబదూరుల్లో పర్యటించనున్నారు. -
క్షేమంగా బయటపడిన ఖుష్బు
నటి ఖుష్బు కారు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. సోమవారం చెన్నైలోని తన ఇంటి నుంచి ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు. రోడ్డుమీద ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారును నిలిపారు. దీంతో వెనుక వస్తున్న నగర రవాణ విభాగం బస్సు ఖుష్బు కారును బలంగా ఢీ కొంది. కారు వెనుకభాగం చాలా వరకు ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తు కారులో వున్న ఖుష్బు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనపై ఖుష్బు తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. కారు ప్రమాదంలో తన కెలాంటి ప్రమాదం జరగలేదు, అయితే ముందు వెళ్లే వాహనాలను చూడకుండా నిర్లక్ష్యంగా బస్సును నడిపిన డ్రైవర్‌పై చాలా ఆగ్రహం వచ్చింది. ఆ డ్రైవర్ బాధ్యతా రాహిత్యం వలన నా కారు ధ్వంసం అవడంతో పాటు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. అతనిపై ఫిర్యాదు చేస్తే వాళ్ల సంఘం కాపాడే ప్రయత్నం చేయవచ్చు. ఆ డ్రైవర్ కూడా తన కుటుంబం నడిరోడ్డున పడుతుందని నన్ను బతిమాలాడవచ్చు. ఇవన్నీ ఆలోచించి ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ ఖరీదైన కారును నా భర్త నాకు బహుమతిగా ఇచ్చారు. అలాంటి కారు ధ్వంసం కావడం బాధగా ఉంది అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు.