Kushboo Sundar Shockingly Revealed She Was Sexually Abused By Her Father From The Age Of 8years - Sakshi
Sakshi News home page

kushboo Sundar : '8ఏళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యాను'..ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

Published Mon, Mar 6 2023 9:50 AM | Last Updated on Mon, Mar 6 2023 10:04 AM

kushboo Sundar Shockingly Reveals She Was Sexually Abused By Her Father - Sakshi

నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై రియాక్ట్‌ అయిన ఆమె చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టింది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. 'చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైతే, అది వాళ్లఅది వాళ్లను జీవితాంతం భయానికి గురి చేస్తుంది.

నా కన్నతండ్రే నాపై వేధింపులకు పాల్పడ్డాడు. అప్పుడు నా వయసు కేవలం ఎనిమిదేళ్లు. నాపై జరుగుతున్న ఈ ఆకృత్యాలను బయటపెట్టేందుకు ధైర్యం ఉండేది కాదు. ఈ విషయాన్ని బయటపెడదామంటే మా అమ్మ నమ్మదేమో అని బాధపడేదాన్ని.

ఎందుకంటే ఆమె భర్తే ప్రత్యేక దైవం అన్నట్లు ఉండేది. కానీ నాకు పదిహేనేళ్లు వచ్చాక ఆ బాధను భరించలేక తండ్రిని ఎదిరించాను. దీంతో ఆయన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. అప్పుడు మేం తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ధైర్యం కూడగట్టుకొని జీవితంలో పోరాడటం నేర్చుకున్నాను' అంటూ ఖుష్భూ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement