childwood
-
వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి మహారాష్ట్ర రత్నగిరిలో ఉన్న చిన్ననాటి ఇల్లు, మరికొన్ని ప్రాపర్టీలను అధికారులు వేలం వేయనున్నారు. అతని కుటుంబ సభ్యులకు సంబంధిచిన నాలుగు ప్రాపర్టీలు, వ్యవసాయ భూమి ముంబాకే గ్రామంలో ఉన్నాయి. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ (ఆస్తి జప్తు) చట్టం, 1976 కింద దావూద్ ఇబ్రహీం ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వాటిలో కొన్నింటిని జనవరి 5వ తేదీన అధికారులు వేలం వేయనున్నారు. ఇక గడిచిన 9 ఏళ్ల దావూద్, అతని కుటుంబానికి సంబంధిచిన 11 ఆస్తులను అధికారులు వేలం వేసిన విషయం తెలిసిందే. వాటిల్లో ఒక రెస్టారెంట్( రూ.4.53 కోట్లు), ఆరు ఫ్లాట్లు(రూ. 3.53 కోట్లు), గెస్ట్ హౌజ్(రూ. 3.52 కోట్లు) అమ్ముడుపోయాయి. 1993 ముంబై బాంబు పేలుళ్లలో సూత్రధారి అయిన దావూద్.. 1983లో ముంబైకి రాకముందు ముంబాకే గ్రామంలో ఉండేవాడు. అయితే దావూద్ ముంబై పేలుళ్ల అనంతరం భారత్ విడిచివెళ్లిన విషయం తెలిసిందే. ముంబై పెలుళ్లలో 257 మంది మృతి చెందారు. ఇటీవల దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా మారిందని, అతనికి విషప్రయోగం జరిగి ఆస్పత్రిలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అసత్యాలని రెండు నిఘా వర్గాలు తేల్చాయి. చదవండి: రాహుల్ గాంధీ యాత్ర.. ఫోకస్ అంతా అక్కడే! -
తాచుపాముతో ఆటలాడుతున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
పై ఫోటోలో చేతిలో పాము పట్టుకొని ధైర్యంగా చూస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? సరే మీకోసం ఓ చిన్న క్లూ. ఆమె ఒక మల్టీ టాలెంటెడ్ నటి. యాంకర్, నిర్మాత, సింగర్, నటిగా.. అన్ని రంగాల్లోనూ రాణించింది. ఆమె తండ్రి ఓ సీనియర్ హీరో. ఆమెకు ఇద్దరు సోదరులు.. వాళ్లు కూడా హీరోలే. ఎస్.. మీరు ఊహించింది కరెక్టే. ఆమె మన మంచు లక్ష్మీనే. సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. బహుముఖ ప్రజ్ఞతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తొలుత కొన్ని ఇంగ్లీష్ సీరియల్స్, టీవీ షోలు చేసిన లక్ష్మీ.. అనగనగా ఓ ధీరుడు(2011) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నెగెటివ్ పాత్రలో నటించింది మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్గా దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట తదితర సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించింది. నేడు(అక్టోబర్ 8) మంచు లక్ష్మీ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఆమె చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
ప్రకృతికి మించిన గురువు లేరు.. పిల్లల్లో అలాంటి సమస్యకు కారణమదే!
ప్రకృతి,వన్యప్రాణుల జీవనంపై చిన్ననాటి గుర్తులు ఏమైనా గుర్తు ఉన్నాయా? నేను పట్టణవాసిని అయినా ఒక కొండముచ్చు మా ఇంట్లోకి జొరబడి హడావుడి చేయటం, ఇంటి బాల్కని నుంచి చూసిన లకుముకి,గిజిగాడు పిట్టలు, రాత్రిపూట మిణుగురు పురుగులు పట్టుకొని అవి మెరుస్తుంటే చూసి ఆనందించిన క్షణాలు నాకింకా గుర్తు ఉన్నాయి. పిల్లలకు ప్రకృతితో విడదీయరాని అనుబంధం,ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి మెండుగా ఉంటాయి. కానీ పట్టణవాసంవల్ల ప్రకృతితో అనుబంధం అనుకున్నంత ఉండటం లేదు. తగిన అవకాశం, ప్రోత్సాహం లభిస్తే, ప్రకృతితో పిల్లల అనుబంధం మరింత బలపడి వారి భౌతిక, మానసిక వికాసానికి దోహదకారి అవుతుంది. ప్రకృతితో ప్రత్యక్ష అనుబంధం పిల్లల సర్వతోభివృద్దికి ఎంతో అవసరమని ఎన్నో అధ్వయనాలు చెపుతున్నాయి. అవి వారి ఏకాగ్రత, పరిసీలనాశక్తిని, ప్రావీణ్యతసి, మానసికాభివృద్దికి తోడ్పడుతుంది అని అందరికి తెలిసిన విషయమే. కాని,పట్టణవాసం వల్ల ప్రకృతితో ప్రత్యక్ష అనుబంధం తగినంత లేకపోవటంతో మనలో చాలామంది Nature deficit Disorder తో బాధపడటం ఉండటం గమనార్హం. దీంతో చాలామంది పిల్లల్లో స్థూలకాయం, ఎకాగ్రతాలోపం, నిరాశ వంటి సమస్యలు తలెత్తడం గమనిస్తున్నాము. అయితే ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతితో మమేకమవటం ఎలా? ప్రకృతిలో ఒక భాగమయిన పక్షులు, జంతువులు, కీటకాలు, సరీసృపాలు కేవలం గ్రామాలు, అడవుల్లోనే ఉంటాయి అనుకోవటం పొరపాటు.ఇవి అన్నిచోట్లా మన పరిసరాలలో కనిపిస్తూనే ఉంటాయి.పిల్లలను తరచుగా మన దగ్గరలో ఉన్న పార్కులు, చెరువులు,స్కూల్ ఆటస్తలలో కనపడే పక్షులను, కీటకాలను మరియు ఇతర జంతువులను పరిసీలించటం నేర్పితే వారికి బయటకు వెళ్ళాలనే ఉత్స్యాహం కలిగించిన వారవుతారు. పక్షులు ప్రకృతిలోని ఒక ప్రధాన భాగస్వాములు. భూమిఫై మన మనుగడకు విడదీయరాని అనుబంధం కలిగి ఉంటాయి. అది పిల్లలలోని పరిశీలనాశక్తిని, ఊహాశక్తిని మేల్కొలిపి నూతన ఉత్శాహం కలిగిస్తాయి.పక్షులు తమ ఆహ్లదమయిన రంగులతో, ప్రత్యేకమయిన కూతలతో మన పరిశీలనాశక్తిని పెంపొందిస్తాయి. చాలా వలస పక్షులు వింత వింత విన్యాసాలతో అబ్బురపరచే క్రమశిక్షణతో గుంపులు గుంపులుగా వలస పోవటం గమనిస్తే రోజువారీ జీవితంలోని అలవాట్లు, అరుపులు గమనిస్తే మనకు ఎంతో ప్రేరణ, ఆనందం కలుగుతాయి.ప్రకృతిలో భాగమయిన పక్షులను వీక్షించి ఆనందించటం ప్రకృతితో మమేకం అవటానికి మీ జీవితాంతం దొరికే అపూర్వ అవకాశం. మీ పిల్లలు, విధ్యార్ధులకు ప్రకృతితో పరిచయయంకల్పించటానికి పక్షులను వీక్షించే కార్యక్రమంతోప్రారంభిచటం శ్రేయస్కరం. దీనికి మీకు ఎటువంటి పరిజ్ఞానం లేదని అనుకోవద్దు. పక్షి శాస్త్రం గురించి విశేష పరిజ్ఞానం లేకపోయినా సరైన సహనం, ఆసక్తితో మీరు చూసిన పక్షులు,వాటి భౌతిక లక్షణాలు, ప్రత్యేకమయిన కూతల గురించిన సమాచారం విధ్యార్ధులతో పంచుకోవటంలో ఉండే ఆనందం, అనుభవం ఎంతో వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తాయి. రేపు లేదనే ఆలోచనతో జీవించు, కలకాలం ఉంటాననే భావంతో విజ్ఞానాన్ని సంపాదించు అని మహాత్మా గాంధీ ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ఎన్నో కొత్త ప్రయోగాలకు నాంది పలికాడు. పక్షుల గురించి ఆయనకు ఉన్న ఆసక్తితో విద్యార్థుల కోసం ird Bingo అనే ఒక వినూత్న కార్యక్రమం రూపొందించటానికి దోహదం చేసింది. దీనికి నలుగురు విద్యార్దులను ఒక జట్టుగా ఏర్పరచి, వారికి ఒక బింగో షీట్, పెన్సిల్, పుస్తకం ఇచ్చి స్కూల్ ఆవరణలో వారు చూసిన విశేషాలను అన్నిటిని రాయమని చెప్పి తర్వాత వాళ్లను క్లాస్‌రూమ్‌లో సమావేశపరిచి వాళ్లు సేకరించిన సమాచారం ఇతర విద్యార్థులకు వివరించడం జరగుఉతుంది. తగిన తగిన బహుమతులు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలవల్ల ప్రకృతిని పక్షులను గుర్తించటమే కాకుండా విద్యార్దుల పరిశీలనాశక్తిని , సమాచారాన్ని రాతపూర్వకంగా పదిలపరిచే నిపుణత, తమ చుట్టూ ఉన్న పకృతి విశేషాలను నిశితంగా పరిశీలించే అవకాశం తప్పకుండా కలుగుతుందని భావిస్తాము. ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్దులలో ప్రకృతిపట్ల అనురక్తిని కలిగించే విలువైన సాధనాలుగా భావించి ఎన్నో వినూత్న కార్యక్రమాలు Indian wild life society ద్వారా విద్యార్దుల ప్రయోజనంకోసం రూపొందించటం జరిగింది. ఈ క్రమంలో నదేశంలో సాధారణంగా కనిపించే పక్షుల గురించి రూపొందించిన ఒక ఫ్లాష్ కార్డు ఆట అయితే “ Shell Shoker” తాబేళ్ల గురించి ఆడే కార్డు ఆట మరియు Snake-O-Doo పాములు,నిచ్చనలు ఉండే పరమపదసోపాన పటం/ వైకుంఠ పాళీ ఆట. ఇవన్నీ మనకు online లో దొరుకుతాయి. మరికొన్ని ఆటలు ఆన్లైన్ వెబ్‌సైట్స్ ద్వారా డైన్లోడ్ ఉచితంగా చేసుకోవచ్చు. వివిధ కళాత్మక,సృజనాత్మక కార్యకలాపాలద్వారా పిల్లలలో ఎంతో సంతులనాత్మక అభివృద్దిని సాధించగలం. వివిధ కళాత్మక కార్యకలాపాలద్వారా పిల్లల పరిశీలన దృష్టిని గమనించి వారిని సంబంధిత పాత్రికెయులుగా, వివిధ కళాత్మక ప్రయోగాలు చేయగలిగేవారిగా తయారు చేయగలం. మన దేశంలో సాధారణంగా కనిపించే పక్షుల బాహ్యలక్షణాలు, వాటి చరిత్ర గురించి వేరు వేరు సంసృతులలో ప్రస్తావించిన విశేషాలఫై అవగాహన కలిగి ఉండటం వల్ల పక్షల గురించి కోత్తవారికి ఆసక్తికరంగా మరింత ఉత్సుకత కలిగే విధంగా వివరించే అవకాశం కలిగి ఉండి వారిలో ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగించిన వారవుతారు. కాకి వంటి సాధారణ పక్షి తెలివితేటల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పిల్లలకు పంచతంత్ర కధలలోని ‘ నీటి కుండలోని నీరు గులకరాళ్ళువేసి పయికితెచ్చి దాహం తీర్చుకున్న తెలివయిన కాకి” కధ చెప్పి వారిని ఆనందింపచేయవచ్చు.మీ పరిసరాలలో కనపడే సాధారణ పక్షుల గురించిన సమాచారం ఎన్నో మాధ్యమాల ద్వారా పొందగలరు. ఇందులో ప్రముఖంగా మెర్లిన్అనే అప్ ద్వారా మీ పరిసరాలలో ఉన్న పక్షుల గురించిన సమాచారం పొందవచ్చు. Early bird అనే App నుంచి వివిధ రకాల పక్షుల ఫోటోలు తీసి వాటి లక్షణాలను, కూతలను కూడా వినే అవకాశం ఉంది. ఈ యాప్స్ అన్ని భారతీయ బాషలలో అందుబాటులో ఉంది. పిల్లలకు ప్రకృతితో అనుబంధం కల్పించడం చాలా అవసరం. పర్యావరణ అనిస్టితి కారణంగా పిల్లలలో ప్రకృతి పట్ల మరింత అవగాహన కల్పించటం వలన వారిలో మరింత ఆసక్తి, ప్రకృతి పట్ల స్నేహభావం,కలిగించి భూ వాతావరణంపట్ల మరింత జాగరూకతతో తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో శ్రీ డేవిడ్ సోరెల్ అన్నట్లు.. పిల్లలు ఉజ్వల భవిష్యత్తు, బముముఖ సాధికారత పొందడానికి మొదట ఈ భూమిని ప్రేమించేలా చేయడం, తర్వాత దాని సంరక్షణ కోసం చర్యలు తీసుకునేలా చేసి ప్రకృతిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. Author - గరిమా భాటియా ఫోటోలు: సౌమిత్రా దేశ్‌ముఖ్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
నా కన్నతండ్రే లైంగికంగా వేధించాడు.. ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై రియాక్ట్ అయిన ఆమె చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. 'చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైతే, అది వాళ్లఅది వాళ్లను జీవితాంతం భయానికి గురి చేస్తుంది. నా కన్నతండ్రే నాపై వేధింపులకు పాల్పడ్డాడు. అప్పుడు నా వయసు కేవలం ఎనిమిదేళ్లు. నాపై జరుగుతున్న ఈ ఆకృత్యాలను బయటపెట్టేందుకు ధైర్యం ఉండేది కాదు. ఈ విషయాన్ని బయటపెడదామంటే మా అమ్మ నమ్మదేమో అని బాధపడేదాన్ని. ఎందుకంటే ఆమె భర్తే ప్రత్యేక దైవం అన్నట్లు ఉండేది. కానీ నాకు పదిహేనేళ్లు వచ్చాక ఆ బాధను భరించలేక తండ్రిని ఎదిరించాను. దీంతో ఆయన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. అప్పుడు మేం తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ధైర్యం కూడగట్టుకొని జీవితంలో పోరాడటం నేర్చుకున్నాను' అంటూ ఖుష్భూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. -
ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో సూపర్ క్రేజ్
ఈ ఫోటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడీ చిన్నది తెలుగులో వరుస సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంటుంది. చేసింది మూడు సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ అంత క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. అందం, అభినయంతో కుర్రాల మనసులు దోచుకుంటున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎవరో కావరో కాదు.. ప్రస్తుతం సార్ సినిమాతో పలకరించిన సంయుక్తా మీనన్. తెలుగులో భీమ్లా నాయక్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే తెలుగులో చక్కటి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు ధనుష్ లాంటి స్టార్ హీరోతో జతకట్టి మరోసారి స్క్రీన్‌పై మెస్మరైజ్ చేసింది. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఇక హీరోయిన్గా నటించిన సంయుక్తాకు కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ లభించింది. దీనికి తోడు ప్రమోషన్స్‌కు ముందే సంయుక్త సోషల్ మీడియాలో తన ఇంటి పేరు తొలగించడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సంయుక్తా చిన్నప్పటి ఫోటోలు వైరల్‌గా మారాయి. -
చదువుల్లో రెగ్యులర్...ఫస్ట్ క్లాస్ స్టూడెంట్
-
సెకనున్నర మాత్రమే శిష్యరికం చేశా.. చల్తాహై!
నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగారు ఒక కుటుంబం. ఆ ఇంట్లోని అబ్బాయే రాము. నా వయసు వాడే. మాటా మాటా కలిశాకా తెలిసింది తనూ ఆర్టిస్ట్ అని, బొమ్మలు వేస్తాడని. చూపించాడు కూడా. బోలెడంత పద్దతైన ప్రాక్టీసు, పోస్టర్ కలర్స్ తో వేసిన చక్కని పెయింటింగ్స్. నేను థ్రిల్లై పోయా ఆ బొమ్మలు చూసి. నన్ను నేనూ ఆర్టిస్ట్ అని చెప్పుకునే వాణ్ణే కానీ, రామూలా నా దగ్గర వేసిన బొమ్మల ఆధారాలు ఏమీ ఉండేవి. ఊరికే హృదయం ఆర్టిస్ట్ అని ఉన్నదంటే ఉన్నది అంతే. అప్పుడే కాదూ. ఇప్పుడూ అంతే. మరప్పుడయితే రామూని అడిగా ఇంత బాగా బొమ్మలు ఎట్లా వేస్తావు రామూ అని. నంద్యాలలో గుడిపాటి గడ్డ వీధిలో గణేష్ బాబు అనే ఆర్ట్ టీచర్ ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకున్నా అన్నాడు. సరేని నేను మా ఇంకో ప్రెండ్ వీర శేఖర్ ఇద్దరం కలిసి గురువు గణేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళామో, లేదా రామూనే తీసుకెళ్ళాడో కూడా నాకిప్పుడు గుర్తు లేదు. ఆ ఇంట్లో బొమ్మలు నేర్చుకునే నిమిత్తం ఇంకా మావంటి వాళ్ళు బొలెడు మంది ఉన్నారు. ఆయన మా ఇద్దర్ని ఒక మూలలో కూర్చోపెట్టి మా నోట్ పుస్తకంలో ఒక ఏనుగు బొమ్మ గీసి ఇచ్చి దాన్ని దిద్దమన్నాడు. నేను దాన్ని దిద్దనవసరం లేకుండా ఆ పక్క పేజీలో మరో ఏనుగు బొమ్మని సెకనున్నరలో వేసి ఆయనకు చూపించా. ఆయన అరే! భలే! అని నన్ను మెచ్చుకోకుండా, అలా స్వంతంగా బొమ్మలు వేయకూడదు. ఒక వారం పాటు నేను గీసి ఇచ్చిన బొమ్మ మీదే దిద్దుతూ ఉండాలి అని చెప్పాడు. నేను ఊరికే సరేనని ఆయన వేపు తల ఊపి ఆ ఇంటి గుమ్మం వేపుగా బయటికి వచ్చేసా. అప్పుడు లోపల శేఖర్ ఏమయ్యాడో తెలియదు. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మేమిద్దరం ఆ క్రాష్ కోర్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆ సెకనున్నర శిష్యరికం తరువాత నేనెవరిని ఇక నా గురువుగా అపాయింట్ చేసుకోలేదు. అనగననగ -తినగ తినగ పథకం కింద నా బొమ్మలు నేనే వేసుకుంటూ, వాటిని దిద్దుకుంటూ చల్తాహై. ఆ విధంగా రుద్దుడూ దిద్దుడూ అనేది బొమ్మల్లోనే కాదు. కుట్టు పని అనే టైలరింగ్ లో కూడా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకనో, బడి మీద, చదువు మీద ఆసక్తి లేకనోఉండే పిల్లలు ఖాళీగా ఉండి నాశనం పట్టకూడదని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలని ఏ టైలర్ దగ్గరో పని నేర్చుకోవడానికో పెడతారు. కొంతమంది పిల్లలయితే రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసి జీవిత వృద్దిలోకి వద్దామనే పూనికతో కూడా వాళ్లకై వాళ్ళే ఏ టైలర్ మాస్టర్ దగ్గరో కుదురుకుంటారు. ముఫై రోజుల్లో మిషిన్ కుట్టుడు నేర్చెసుకుని, తమ కాలి క్రింద తిరిగే మిషిను చక్రం అలా తిరుగుతూ తిరుగుతూ అంబాసిడర్ కారు చక్రంలా మారి తమ గుడిసే ముందు బ్రేకు వేసి ఆగుతుందనే తెలుగు సినిమా భ్రమలో ఉంటారు. తెలుగు సినిమా కాదు కదా కనీస తెలుగు కథల్లో మాదిరిగానైనా దర్జి జోగారావు దగ్గర శిష్యరికం చేసిన బాబిగాడు తన గాళ్ ప్రెండు పోలికి చాలని జాకెట్టు మాదిరి తుంట రవిక కుట్టడం కూడా వారికి కుదరదు. ఎందుకంటే టైలరింగ్ నేర్చుకోడానికి నువ్వు అందరికంటే ముందుగా పొద్దున్నే షాపు దగ్గరికి చేరాలా, మూలనున్న చీపురు పట్టి అంగడి లోపలా ఆపై బయట చీలికలు పీలికలైన గుడ్డ ముక్కలన్నీ శుభ్రంగా ఊడ్చేసి ఆపై వంగిన నడుముని అమ్మాయ్యా అని పట్టు దొరికించుకునేలోగా కటింగ్ మాష్టరు వస్తాడు. ఓనామహా శివాయహా అనే ఒక పాత బట్ట ముక్కకి కత్తిరతో ఒక గాటు పెట్టి దానిని నీ చేతిలో పెట్టి కాజాలు ప్రాక్టీస్ చెయ్యమంటాడు. కాజాలు కుట్టి కుట్టి వేలికి కన్నాలు వేసుకోవడం ఎలాగూ ప్రాక్టీస్ అయ్యేలోగా మళ్ళీ గుడ్డ ముక్కల చీలికలు పీలికలు షాపు నిండా చేరుతాయి. వాటిని చీపురు పట్టి శుభ్రం చేసి మళ్ళీ నువ్వు కాజాలకు కూచోవాలా! అనగనగా ఆ కాలానికి గడియారంలో రెండే ముల్లులు. ఒకటి పీలికలు- రెండు కాజాలు. గడియారం అలా గడిచి గడిచి నీకు ఎప్పుడో ఒకప్పుడు, ఒక మంచి కాలం వచ్చే వరకు నువ్వు గురువుగారి దగ్గరే ఓపిగ్గా పడి ఉంటే అప్పుడు గడియారంలో సెకన్ల ముల్లు కూడా చేరి అంగీలకు, ప్యాంట్లకు, నిక్కర్లకు గుండీలు కుట్టే పని దగ్గరకు నెట్టబడతావు . అయితే నే చెప్పబోయేది ఇదంతా బొమ్మలు వేయడం, కాజాలు కుట్టడం గురించి కథలూ, గాథలు కబుర్లు కావు. ఇంటి గోడమీద వేలాడే క్యాలెండర్ కు గుచ్చబడి ఉండే ఒక సూది పుల్ల కథ. ఈ రోజుల సంగతి నాకు తెలీదు. నా చిన్ననాటి రోజులలో కుట్టు మిషన్ షాపు దాక నడక పడకుండానే చిరుగులు పడ్డ బట్టలపై చిన్నా చితక కుట్టు సంగతులు వేసేంత జ్ఞానం ఇంట్లో ఆడవాళ్లందరికీ వచ్చి ఉండేది. మగవాళ్ళకు కూడా తెలిసి ఉండేది. అయితే ఈ పనులన్నీ ఎక్కువగా ఇళ్ళల్లో ఉండే అమ్మమ్మలో, నాయనమ్మలో చక్కగా ముచ్చటలు చెప్పుకుంటూ సాగించేవారు. పని నడిపించడం సులువే! అయితే వారి కష్టమంతా సూదిలోకి దారం ఎక్కించడమే కష్టంగా ఉండేది. పెరిగిన వయసులో కంటి చూపుకు, సూది బెజ్జానికి, దారపుమొనకు ఎక్కడా సామరస్యం కుదిరేది కాదు. ఎప్పుడెప్పుడు సూదిలో దారం ఎక్కించమని జేజి అడిగేనా, దారం ఎక్కించేందుకు పిల్లలు పోటా పోటీగా సిద్దం. దారం ఎక్కిద్దామని సూది దారం తీసుకున్న అన్నకో చెల్లాయికో ఒక నిముషమన్నా సమయమివ్వాలా? వాడి గురి కాస్త తప్పితే చాలు ఇలా తేని మరొకడు ఆ సూద్దారం లాక్కుని ఎంగిలితో దారం తడి చేసుకుని, నోట్లో నాలుక మొన బయటపెట్టి, ఒక కన్ను మూసి మరో కన్నుతో చెట్టుమీద పిట్టకన్ను దీక్షతో చూసే అర్జునుడయ్యేవాడు. నాలుక మొన అంటే గుర్తుకు వస్తుంది పిల్లలని చక్కగా తమ ముందు కూర్చో పెట్టుకుని నోట్లో నాలుకని చాపి తమ సూది ముక్కుల అంచులకు తాకించి నీకు చాతనవునా ఇలా తగిలించడం అని గేలి చేసే మేనత్తల సంతతి ఇంకా ఎక్కడైనా మిగిలే ఉందా? మొబైల్ ఫోన్ ల కేలండర్ ఆప్ లకు గుచ్చ జాలని సూదులని ఏ గడ్డి వాములోనో వెతికి పట్టుకుని ఆ సూది తొర్ర గూండా చూపు పోనిస్తే బెజ్జానికి ఆవల సెలవంటూ వెళ్ళి పోయిన వేలాది అమ్మమ్మా నానమ్మల తమ మనవ సంతానంతో పకపకల వికవికల వివశమవుతు కనపడుతున్నారు. పిల్లల చేతుల్లో మొబైలు గేముల పలకలు కాదు. తెల్లని సూదులు చురుక్కుమని మెరుస్తున్నాయి. వేలాది దారపు ఉండలు రంగు రంగుల గాలి పటాల వలే గాలిలోకి ఎగురుతున్నాయి. జ్ఞాపకం ఎంత విలువైనది. జీవితం ఎంత అందమైనది. -
తనకు ఆ సమస్య ఉందని తెలిసి బాధపడ్డ సిరివెన్నెల
Sirivennela Seetharama Sastry: రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా... ఏకధాటిగా 30 ఏళ్లు పాటతోనే జీవించిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ‘అంతర్యామి అలసితి సొలసితి...’ అంటూ అక్షరాల నుంచి సెలవు తీసుకున్నారు. సిరివెన్నెలలు పంచడానికి వెన్నెల చెంత చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలో 1955 మే 20న డా. చేంబోలు వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు. వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు కాగా సీతారామశాస్త్రి తొలి సంతానం. పదో తరగతి వరకూ అనకాపల్లిలో చదువుకున్న సీతారామశాస్త్రి కాకినాడలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐటీఐ కాలేజీ లెక్చరర్‌గా వెంకట యోగికి కాకినాడకు బదిలీ కావడంతో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్ చదువు అక్కడే సాగింది. కాగా వెంకట యోగికి హోమియోపతి వైద్యంలో ప్రవేశం ఉండటంతో సీతారామశాస్త్రిని మెడిసిన్ చదివించాలనుకున్నారు. అలా విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో 1973లో ఎమ్బీబీఎస్లో చేరారు. అయితే ఎమ్బీబీఎస్లో చేరే ముందే కుటుంబ పోషణ విషయంలో ఇబ్బందిపడుతున్న తండ్రికి సాయం చేయాలని టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేశారు. కానీ ఎమ్బీబీఎస్లో చేరారు. అప్పటివరకు సీతారామశాస్త్రికి మొదటి బెంచ్‌లో కూర్చొనే అలవాటు ఉంది. కానీ ఎమ్బీబీఎస్లో చివరి బెంచ్ దొరికింది. పైగా లెక్చరర్స్ చెప్పే పాటలు అర్థం అయ్యేవి కావు. ఎందుకంటే అప్పుడు ఇంగ్లిష్‌లో సీతారామశాస్త్రికి అంతగా ప్రావీణ్యత లేదు. చివరి బెంచ్‌లో కూర్చున్న ఆయనకు బ్లాక్‌బోర్డ్ సరిగ్గా కనిపించకపోవడంతో, తనకు కంటి సమస్య ఉందని గ్రహించి, బాధపడ్డారు. ఇంగ్లిష్ సమస్య, ఐ సైట్... ఈ రెంటితో పాటు ఉమ్మడి కుటుంబ పోషణ విషయంలో తండ్రి ఇబ్బంది.... ఈ మూడు అంశాలు సీతారామశాస్త్రికి చదువుపై ఏకాగ్రత నిలవనివ్వకుండా చేశాయి. అదే సమయంలో టెలిఫోన్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరమని కబురు రావడంతో ఎమ్బీబీఎస్కి ఫుల్స్టాప్ పెట్టి, 300 రూపాయలకు టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్‌గా చేరారు. అయితే తండ్రికి మాత్రం తాను ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తానని మాటిచ్చారు. అన్నట్లుగానే ఆ తర్వాత బీఏ చేశారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో 40 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారమంతా సీతారామశాస్త్రిపై పడిపోయింది. తండ్రి హోమియోపతి వైద్యాన్ని సీతారామశాస్త్రి తమ్ముడు చూసుకున్నారు. ఆ తర్వాత సీతారామశాస్త్రి తమ్ముడికి ఉద్యోగం దొరికింది. సోదరీమణుల వివాహాలను ఈ ఇద్దరు అన్నదమ్ములు జరిపించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కాకినాడలో సాంస్కృతిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న సీతారామశాస్త్రికి ‘కళా సాహితి సమితి’తో పరిచయం కలిగింది. ఈ ప్రయాణంలో భాగంగానే సీవీ కృష్ణారావు, ఇస్మాయిల్, సోమసుందర్, ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ వంటి ప్రముఖ సాహితీవేత్తలతో సీతారామశాస్త్రికి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పుడే ‘భరణి’ అనే కలం పేరుతో సీతారామశాస్త్రి రాసిన రచనలు ఆంధ్రప్రభ, విజయ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఇదే టైమ్‌లో ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ సినిమాల్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. 1980లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమా విజయోత్సవాల్లో భాగంగా కాకినాడలో ఓ వేడుక ఏర్పాటు చేశారు. కె. విశ్వనాథ్‌కి ఓ స్వాగతగీతాన్ని రాయాల్సిందిగా సీతారామశాస్త్రిని కోరారు ఆకెళ్ల. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఓ సందర్భంలో కె. విశ్వనాథ్ పాల్గొన్న ఓ వేడుకలో సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను కె. విశ్వనాథ్ స్వాగత గీతంగా ఆలపిం చారు. విశ్వనాథ్‌కి ఈ పాట నచ్చింది. ఈ పాట ఎవరు రాశారో తెలుసుకోవాలని ప్రయత్నించగా ఆయనకు భరణి (సీతారామశాస్త్రి కలం పేరు) అని తెలిసింది. భరణి అనేది సీతారామశాస్త్రి కలం పేరు అని తెలుసుకున్న కె. విశ్వనాథ్ ఆయన్ను కలవాలనుకున్నారు. అంతేకాదు.. సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను తన సినిమా (బాలకృష్ణ హీరోగా నటించిన ‘జననీ జన్మభూమి)లో వినియోగించాలనుకుంటున్నట్లుగా కబురు పంపారు. ‘‘ఓ సందర్భంలో ‘గంగావతరణం’ పాటను మీ కోసమే రాశాను. ఇప్పుడు అది మీ చెంతకు చేరడం, మీ సినిమాలో వినియోగించుకోవాలనుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సీతారామశాస్త్రి. అయితే ఈ సినిమా పాటల రచయిత విభాగంలో క్రెడిట్ కావాలని విశ్వనాథ్‌ని కోరారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్ ఓకే అన్నారు. తాను గురువుగా భావించే వేటూరి సుందర రామమూర్తి పేరు కింద తన పేరు ‘చేంబోలు సీతారామశాస్త్రి (భరణి)’ అనే టైటిల్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసుకుని ఆనందపడిపోయారు. ఇంటి పేరుగా మారిన ‘సిరివెన్నెల’ ‘సిరివెన్నెల’ (1986)తో సీతారామశాస్త్రి సినిమా కెరీర్ పూర్తిగా మొదలైంది. చిత్రదర్శకుడు కె. విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ కథ చెప్పి ఓ పాట రాయాల్సిందిగా కోరారు. ‘విధాత తలపున..’ అని రాశారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్‌కి చాలా బాగా నచ్చింది. అంతే.. ఈ చిత్రంలోని మొత్తం పాటలూ నువ్వే రాస్తున్నావని సీతారామశాస్త్రితో అన్నారు. అది మాత్రమే కాదు.. ఈ సినిమా పేరుతోనే విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని టైటిల్ కార్డ్ వేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ పాటల వెన్నెలలు పంచారు ‘సిరివెన్నెల’. ఆ సినిమాలోని ‘విధాత తలపున’ పాటకు సిరివెన్నెల అల్మరాలో ‘నంది’ కూడా చేరింది. ఆ తర్వాత విశ్వనాథ్–సిరివెన్నెల కాంబినేషన్లో పలు సూపర్ హిట్ పాటలు వచ్చాయి. అందుకు శ్రుతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం లాంటి చిత్రాల్లోని పాటలు ఓ ఉదాహరణ. మూడు దశాబ్దాల్లో ... ఒక్క విశ్వనాథ్ అనే కాదు.. సిరివెన్నెల ప్రతి దర్శకుడికీ హిట్ పాటలు ఇచ్చారు. ‘శివ’ సినిమాలో రామ్‌గోపాల్ వర్మకు ‘బోటనీ పాఠముంది..’ అని రాశారు. అదే వర్మకు ‘క్షణక్షణం’లో ‘కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా’, ‘గాయం’లో ‘అలుపన్నది ఉందా, నిగ్గ దీసి అడుగు’, నంది అవార్డు సాధించిన ‘స్వరాజ్యమవలేని’ పాటలు రాశారు. మరోవైపు కృష్ణవంశీకి ‘గులాబి’ కోసం ‘ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావు..’, ‘ఏ రోజైతే∙చూశానో నిన్నూ..’ రాశారు. ‘సిరివెన్నెల’ రాసిన ‘జగమంత కుటుంబం నాది..’ పాట విని, ఆ పాట కోసమే సినిమా తీయాలని కృష్ణవంశీ తీసిన చిత్రం ‘చక్రం’. శివనాగేశ్వ రావు ‘మనీ’లో ‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..’ అని రాశారు. ఒకటా.. రెండా వేల పాటలు రాశారు. మూడు దశాబ్దాల కెరీర్లో త్రివిక్రమ్, గుణశేఖర్, క్రిష్, రాజమౌళి ఇలా ఎందరో దర్శకులకు పాటలు రాశారు. విడుదలకు సిద్ధమవుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో ‘దోస్తీ..’ పాట, ‘శ్యామ్ సింగరాయ్’లో రెండు పాటలు రాశారు. సిరివెన్నెల నుంచి ఇంకా ఎన్నో పాటలు వచ్చి ఉండేవి. ‘జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ ఒంటరిగా వెళ్లిపోయారు ‘సిరివెన్నెల’. -
స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరల్, ఎవరో గుర్తు పట్టారా?
సోఫాపై నవ్వుతూ ఫోటోకి ఫోజులు ఇస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? కష్టం అంటారా? సరే మీకోసం ఈ ఫోటోకి సంబంధించి క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. ఆమె ఓ స్టార్ హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’చేసింది. సౌందర్య తరువాత గ్లామర్ తో కాకుండా తన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటూ నేచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ఈ క్లూతో అయినా ఆమెను గుర్తించారా? ఓకే.. మీరనుకుంటున్నట్లు ఈ ఫోటో నేచురల్ బ్యూటీ సాయి పల్లవిదే. ఈ హైబ్రీడ్ పిల్ల చిన్నప్పుడు మస్తు అల్లరి చేసేదట .కాలేజీ రోజుల్లో అయితే తోటి స్నేహితులను ఆటపట్టిస్తూ.. రచ్చ రచ్చ చేసేదట. సాయి పల్లవి ఉంటే చాలు ఎంటర్టైన్మెంట్కి కొదవే ఉండేదికాదట. ప్రస్తుతం ఆమె చిన్నప్పటి ఫోటోతో పాటు కాలేజీ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి పల్లవి కాలేజీ ఫోటో ఇక సాయిపల్లవి సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా లో నటిస్తోంది. అలాగే రానా ‘విరాటపర్వం , నాని ‘శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ మూడు చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. -
ఉప్పెన భామ కృతి శెట్టి చిన్ననాటి ఫోటోస్
-
ఈ ప్రముఖ యాంకర్ ఎవరో గుర్తుపట్టారా?
పలు టీవీ షోలతో యాంకర్‌గా అలరిస్తున్న శ్రీముఖి..తెలుగునాట దాదాపు అందరికి సుపరిచితురాలే. బుల్లితెర రాములమ్మగా తనదైన యాంకరింగ్‌తో అలరిస్తూనే అప్పుడప్పుడు ఆడియో లాంచ్ ఫంక్షన్లకు హోస్ట్‌గానూ అలరిస్తుంది. హీరోయిన్ అవ్వాలన్న లక్ష్యంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడుకు వెండితెర అంతగా కలిసి రాకపోయినా, బుల్లితెరపై మాత్రం ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి..రీసెంట్గా ఫ్యాన్స్‌తో మచ్చటించింది. ఈ నేపథ్యంలో ఏవైనా సరదా ప్రశ్నలుంటే అడగాలంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, మీ చిన్నప్పటి ఫోటోను షేర్ చేయాండంటూ ఓ నెటిజన్ కోరడంతో శ్రీముఖి తన చిన్ననాటి ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఇక ‘జులాయి', ‘నేను శైలజ', ‘జెంటిల్మన్' వంటి చిత్రాలు శ్రీముఖికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఈ మధ్యే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ‘లువీ’ అనే పేరుతో బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తొలుత పర్ఫ్యూమ్స్ను ప్రవేశపెట్టి దశలవారీగా బ్యూటీ, గ్రూమింగ్, హెయిర్ కేర్ వంటి ఉత్పత్తులను లువీ స్టోర్లలో పరిచయం చేస్తామని చెప్పుకొచ్చింది. చదవండి : (ఓ మై గాడ్! ఇది మీకెక్కడ దొరికింది?: అనసూయ) (నాని వెనుక దాక్కున్న ఆ హీరోయిన్ ఎవరు!) -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టగలరా?
ముంబై : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'చిన్నతనంలో తోటి పిల్లలతో ఆడుకున్నట్లు పెద్దగా గుర్తులేదు, కానీ తన బొమ్మల కోసం మాత్రం రకరాకాల ఫ్యాన్సీ దుస్తులు కుట్టేదాన్ని. దీని కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించినా ఎంతో ఇష్టంగా చేసేదాన్ని. దీనివల్లేనేమో ఏదైనా విషయాల్లో లోతుగా ఆలోచించేంత పరిపక్వత అలవడింది. అయితే దురదృష్టవశాత్తూ మనలో కొందరు పుట్టుకతోనే వృద్ధులుగా (అలాంటి మనస్తత్వం)తో జన్మిస్తారు..వారిలో నేను కూడా ఉన్నాను' అని కంగనా పేర్కొంది. (సింగర్‌పై ఫైర్ బ్రాండ్ ఘాటు వ్యాఖ్యలు) కాగా చిన్నతనం నుంచే తనకు ఫ్యాషన్‌పై రకరకాల ప్రయోగాలు చేసేదానినని, తనకున్న నాలెడ్జ్ ప్రకారం వివిధ రకాలైన దుస్తులు, వాటికి ఎత్తు చెప్పులు వేసుకుంటే అవి చూసి చుట్టుపక్కల వాళ్లు ఎగతాళి చేస్తూ నవ్వేవారంటూ కంగనా గతంలో పేర్కొంది. అక్కడి పరిస్థితుల నుంచి నేడు లండన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న తీరు వరకు ఎంతో గర్వంగా అనిపిస్తుంటుందని తెలిపింది. ఇక కంగన ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న 'తలైవి' మూవీకి సంబంధించి కొన్నివర్కింగ్ స్టిల్స్‌ను కంగనా ఇటీవలె తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్, భాగ్య శ్రీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. (వివాదాస్పద ట్వీట్.. కంగనకు నోటీసులు) As a child I don’t remember playing with children, even then my favourite thing to do was to make fancy gowns, and clothes for my dolls and I loved to contemplate for hours on end, hence the deep thoughtful mature eyes, unfortunately some of us are born old and I am one of those. pic.twitter.com/JyRJHFae12 — Kangana Ranaut (@KanganaTeam) December 7, 2020 -
ఈ చిన్నారిని గుర్తు పట్టారా..?
ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా..? కాస్తా జాగ్రత్తగా పరిశీలించండి.. అయినా పోల్చుకోలేకపోతున్నారా... అయితే మేమే చెప్తాం.. తను బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్. చిన్ని పొని టెయిల్‌తో.. పింక్ డ్రెస్‌లో ఎంత క్యూట్‌గా ఉందో అనిపిస్తోంది కదా. అవును అంత క్యూట్‌గా ఉంది కాబట్టే పోస్ట్ చేసిన అర్థ గంటలోనే ఈ ఫోటోకు దాదాపు 53 వేల లైక్‌లు వచ్చాయి. ఫోటో చూసిన అభిమానులు ‘చిన్నప్పటి నుంచి మీరు ఇంతేనా’.. ‘ఎంత క్యూట్‌గా ఉన్నారో’.. ‘ఫ్యాషన్ ఐకాన్ అంటేనే సోనమ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram Throwback to when a fountain ponytail was super on trend.😉 #ThrowbackThursday A post shared by SonamKAhuja (@sonamkapoor) on Nov 1, 2018 at 5:01am PDT -
అభినందనీయమే కానీ...?
'సొంత బిడ్డలా చూసుకుంటా. ఎంత ఖర్చయినా నీ ఆరోగ్యం బాగయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంటుంది. భవిష్యత్తులో నీ చదువుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నీకు ఇల్లు కట్టించి ఇస్తా. మంచి అబ్బాయిని చూసి నా సొంత ఖర్చులతో నీ పెళ్లి జరిపిస్తా'... అంటూ ప్రత్యూషకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. కన్నతండ్రి, సవతి తల్లి పెట్టిన చిత్రహింసలతో ఆస్పత్రిపాలైన ప్రత్యూషను కేసీఆర్ శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యూషపై సీఎం చూపిన ఔదార్యం అభినందనీయం. అయితే ముఖ్యమంత్రిగా ప్రత్యూష లాంటి వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. బాల్యంలో చిత్రహంసలు పాలవుతున్నవారి సంఖ్య నానాటికి పెరుగుతోందని సర్కారీ గణంకాలే వెల్లడిస్తున్నాయి. అయినవారితో పాటు అసాంఘిక శక్తుల బారిన పడి ఎంతో మంది అభాగ్య బాలలు చిత్రహింసల పాలవుతున్నారు. ఇలాంటి కేసులో పోలీసులు సీరియస్ గా స్పందించిన దాఖలాలు బహుస్వల్పం. ప్రత్యూషపై అమానుష కాండను మీడియా హైలెట్ చేయడంతో పాటు హైకోర్టు సీరియస్ గా స్పందించడంతో ఆమెకు న్యాయం జరిగింది. వెలుగులోకి రాని దయనీయ బాలల పరిస్థితి ఏంటి? అదృష్టవశాత్తు నరకకూపం నుంచి బయపడినా అభాగ్యుల సంరక్షణకు సరైన వ్యవస్థ లేకపోవడంతో సమస్య మళ్లీ మొదటికే వస్తోంది. పునరావాస కేంద్రాలు జైళ్లను తలపిస్తుడడంతో ఇక్కడ ఉండలేక బాలలు పారిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని ఓ పునరావాస కేంద్రం నుంచి 13 మంది బాలలు పరాయ్యారు. ప్రత్యూష విషయంలో స్పందించినట్టుగానే అధికార యంత్రాంగం.. అభాగ్యులను ఆదుకునేందుకు తగిన వ్యవస్థ ఉంటే దీనబాలలకు స్వాంతన లభిస్తుంది. బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు చక్కదిద్దే వ్యవస్థ లేకపోవడం పెద్ద లోటు. బాలలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, వాటిని ఎలా కాపాడాలన్నదానిపై అటు అధికారులకు, ఇటు పాలకులకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. పాఠశాల స్థాయిలోనూ బాలల హక్కుల ఊసే లేదు. బాలల హక్కుల సంఘం ఉన్నా దాని పరిధి పరిమితం. చిన్నారుల సంరక్షణకు సర్కారు ఇకనైనా నడుంబిగించాలి. ఈ దిశగా చర్యలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టాలి. చిన్నారులు రాక్షసుల బారిన పడకుండా కట్టుదిట్టమైన వ్యూహం రూపొందించాలి. రాక్షసుల బారి నుంచి కాపాడిన బాలలను అన్నిరకాలుగా ఆదుకుని వారి భవితకు బంగారు బాటలు పరిచేలా వ్యవస్థ రూపుదాల్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రత్యూష లాంటి వారందరినీ సీఎం వ్యక్తిగతంగా పరామర్శించడం సాధ్యం కాదు కానీ ఆమెలా మరొకరు చిత్రహింసల పాలవకుండా చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంది.