Sir Movie Actress Samyuktha Menon Childhood Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

ఈ ఫోటోలోని హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో సూపర్‌ క్రేజ్‌

Published Fri, Feb 17 2023 5:23 PM | Last Updated on Fri, Feb 17 2023 6:49 PM

This Actress Childwood Pics Goes Viral In Social Media After Sir Release - Sakshi

ఈ ఫోటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడీ చిన్నది తెలుగులో వరుస సినిమాల్లో ఆఫర్స్‌ దక్కించుకుంటుంది. చేసింది మూడు సినిమాలే అయినా స్టార్‌ హీరోయిన్‌ అంత క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. అందం, అభినయంతో కుర్రాల మనసులు దోచుకుంటున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎవరో కావరో కాదు.. ప్రస్తుతం సార్‌ సినిమాతో పలకరించిన సంయుక్తా మీనన్‌.

తెలుగులో భీమ్లా నాయక్‌ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే తెలుగులో చక్కటి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు ధనుష్‌ లాంటి స్టార్‌ హీరోతో జతకట్టి మరోసారి స్క్రీన్‌పై మెస్మరైజ్‌ చేసింది. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్‌ లభిస్తోంది.

ఇక హీరోయిన్‌గా నటించిన సంయుక్తాకు కూడా మంచి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ లభించింది. దీనికి తోడు ప్రమోషన్స్‌కు ముందే సంయుక్త సోషల్‌ మీడియాలో తన ఇంటి పేరు తొలగించడంతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సంయుక్తా చిన్నప్పటి ఫోటోలు వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement