
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో వాతి పేరుతో విడుదలయ్యింది.ధనుష్‌కి జోడీగా సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది.రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు మాంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక సార్ విడుదలైన తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
విద్యావ్యవస్థపై ఓ లెక్చరర్ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ధనుష్‌కి టాలీవుడ్‌లో సాలిడ్ డెబ్యూ లభించిందని టాక్ వినిపిస్తుంది. కలెక్షన్స్ విషయంలోనూ సార్ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సార్ డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా రిలీజ్ అయిన ఐదు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Comments
Please login to add a commentAdd a comment